Tuesday, March 31, 2020

"కరోనా" పై రవీనా గారి కవిత.

*** చిత్రమైన యుధ్ధమిది ***

చిత్రమైన యుధ్ధమిది
రక్తపుటేరులు పొంగని
నిర్మానుష రణరంగమిది
వికటించిన మానవ మేధకి
ప్రకృతి విసిరిన విషాయుధమిది
నగరం నిశబ్దమవుతూ 
రోడ్లు తాచుపాముల్లా భయపెడుతూ 
రేపన్నది ప్రశ్నగా మిగల్చాలని
కాలం మ్రోగిస్తున్న మరణమృదంగమిది
అయితేనేమీ 
మనం ఎన్ని యుధ్ధాలు చేయలేదు 
ఎన్ని తంత్రాలు కుతంత్రాలు ఛేదించలేదు 
ఎన్ని ఆపత్తులు విపత్తులు ఎదుర్కోలేదు
ఎన్ని సార్లు నువ్వు నేను ఛిద్రమవ్వలేదు
కరోనా అయినా మరేదైనా
సూక్ష్మమైనా స్థూలమైనా 
దాని పుట్టుక తెలుసుకున్నాక
అంతం చేసే మంత్రదండం ఉన్నది మన  దగ్గరే
రాకెట్ కంటే వేగంగా 
దూసుకుపోయే మేధ మన సొత్తే
సహస్రనామాలు వేదఘోషలు 
సుబహ్ కీ అజాలు
ఓంకార నాదాలు
ఆమీన్ అంటూ ప్రార్ధనలు 
గురుగ్రంథ్ సాహీబా గుర్బానీలు
ఇవే కదా ప్రతి గృహంలో ప్రతిద్వనించే ఆంటీ వైరల్ డిస్ ఇంఫెక్టంట్ లు 
యుగయుగాలుగా యాగాలు చేసి 
ఆ నింగిని ఈ నేలనీ 
మధ్యలో వాయువుని ఆంటీ బైయోటిక్ గా మార్చింది మన పుణ్యభూమే 
వేల సంవత్సరాల నాటి ఆయుర్వేదం
చరఖ సంహిత శుశృత వైద్య ప్రిస్క్రిప్షన్లు  మనవే 
ధన్వంతరి వారసులం విరుగుడు త్వరలోనే కనుక్కుంటాం
అందాకా ...
మనల్ని మనం గృహ సీమలో నిర్బంధించుకుందాం 
అంత మాత్రాన 
కాలం ఏమీ ఆగి పోదు 
మనం శూన్యమైపోము
తడి మడి మనకు కొత్త కానే కాదు
నఖాబ్ లు మనకు చిరాకు తెప్పించవు
వాకింగ్ లేదని టాకింగ్ మాని
వంద సూర్య నమస్కారాలు రోజు చేద్దాం 
ఎందుకో ఏవిటో ఎలానో ఎపుడో అన్న నెగటివ్ ప్రశ్నలు మాని
గడిచే క్షణాలని చిరునవ్వుతో స్వాగతించి పాసిటివ్ ఔరాని ఆహ్వానిద్దాం
పొద్దేపోదు అని నిరాశల్లోకీ జారకుండా
ధ్యానం జ్ఞానం మనలో నింపుకుందాం
భవసాగరంలో మునిగి 
మనల్ని మనం ఏనాడో మరిచిపోయాం
ఒక్కసారి మనతో మనం మాట్లాడుకుందాం
జీవిత పుటాలని తిరగేస్తూ 
చేసిన తప్పిదాలను ఒప్పుకుంటూ
మనల్ని మనం కొత్తగా లిఖించుకుందాం 
హృదయపు తెర వెనుక ఏ అహమో మొహమాటమో అడ్డొచ్చి 
ఏ స్నేహాన్నో దూరం చేసుకొని ఉంటాం 
ఇప్పుడు ఆ ఇజాలన్నీ మాఫీ చేసి
ఆత్మీయులని ఆక్టివేట్ చేసుకుందాం
ఏ మూలో నక్కి ఉన్న ఫోటో ఆల్బం తెరిచి
మసిబట్టిన బంధాలని తాజాగా శుభ్రం చేసుకుందాం 
ఎన్నాళ్లయ్యిందో ఇంట్లో అందరితో మనసువిప్పి కబుర్లు చెప్పి
రండి....
కలిసి రెండు ముద్దలు తింటూ ఆప్యాయతలని పంచుకుందాం 
జ్నాపకాల్లో మాత్రమే మిగిలిన
అష్టాచెమ్మా మళ్లీ ఆడుకుందాం
తాతముత్తాతల ఆరోగ్య సూత్రాలు
నియమ నిబంధనలు పాటిస్తూ
కుటుంబాన్ని రక్షించే డిగ్రీ లేని వైద్యుడవుదాం
గొళ్లెంవేసి ఇంటిని కాపాడే సాయుధ పోలీస్ మనమవుదాం 
కరోనా ప్రబలకుండా జాగ్రత్త పడదాం
అదిగో....
ఏ దుష్ట శక్తో మన ఇంటికి ఆవల దాగి ఉన్నది
మానసిక స్వస్థతపై దాడీ చేయాలని పొంచి ఉన్నది
బస్తీలో గస్తీలు మాని
ఉమ్మడిగా ఒకరికొకరు ధైర్యం చెబుతూ
సంయమనం పాటిద్దాం  
అమావాస్య చీకట్లు తప్పక తొలుగుతాయి
పున్నమి వెన్నెల ఇంకో ఆమడ దూరంలోనే ఉంది
కలిసికట్టుగా ఈ యుధ్ధాన్ని యోధులమై ఎదుర్కుందాం 
మశూచినే మట్టుబెటిన ఘనులం
వికారిలో వికటించిన కరోనాని
శార్వరిలో శ్వాస ఆడకుండా చేద్దాం
చేయి చేయి కలపకుండా 
ఒక్కమాటపై నిలబడి
ఈ ఆపత్తుని దాటేద్దాం
 
...@రవీణ చవాన్

Monday, March 30, 2020

ఐనంపుాడి శ్రీలక్ష్మి గారి కవిత. (KCR గారు మెచ్చినది).

కరోనా కి ఓ రిటర్న్ గిఫ్ట్ !
     - అయినంపూడి శ్రీలక్ష్మి
       99899 28562
-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

ఏమైందిప్పుడు
క్షణాలు మాత్రమే కల్లోలితం
ఆత్మస్థైర్యాలు కాదు కదా
సమూహాలు మాత్రమే సంక్షోభితం
సాయం చేసే గుండెలు కాదు కదా !

ఎన్ని చూడలేదు మనం
కలరా వచ్చి ఎన్ని గ్రామాలు కలత చెందలేదు
కలలో కూడా కలరా కన్పిస్తుందా ఇప్పుడు
ప్లేగుని జయించిన దరహాసంతోనే కదా
చార్మినార్ ని నిర్మించుకున్నాం !

గతమెప్పుడూ విజయాల్నే గుర్తు చేస్తుంది
వర్తమానమెప్పుడూ సవాళ్ళనే చూపిస్తుంది
భవిష్యత్తెప్పుడూ ఆశలనే ప్రోది చేస్తుంది
కుంగుబాటు తాత్కాలికమే
యుద్ధభూమిలోకి దిగాక
వెనక్కు తిరగటం, వెన్ను చూపటం మనకు తెలియదు
యుద్ధం ఏ రూపంలో వస్తేనేం
మిస్సైల్ అయినా - వైరస్ అయినా
పెద్ద తేడా ఏం వుంటుంది కనుక !

నీకు బాగా తెలుసు-
జీవనవాంఛాజనితం మన దేహం
ఎన్ని మార్లు యుద్ధ ప్రసవాలు చూడలేదు
ప్రతి ఆంక్షను మన కాంక్షగా మార్చుకోలేదు !
కరోనా పాజిటివ్ అయితే ఏంటట
పాజిటివ్ దృక్పథం మన మందనుకున్నాక
సామాజిక దూరం మన అస్త్రమయ్యాక
జనతా కర్ఫ్యూ మన కవచమయ్యాక
ఇప్పుడిక క్వారెంటైనే మన వాలెంటైన్ !

 
ఇక, కరోనా మాత్రం కరిగి కనుమరుగు కాదా ?
క్యా కరోనా అని దీనంగా అర్థించొద్దు
దొంగతనంగా ప్రవేశించిన కరోనాకి కరుణ తెలియదు
క్యా కరోగే అంటూ ఎదురు తిరిగి ప్రశ్నించు
లెక్కపెట్టాల్సింది పోయిన ప్రాణాల్ని కాదు
నిత్య రణస్థలిలో కరోనా ఎన్ని లక్షల చేతుల్లో
పరాజిత అయ్యిందో ఆ లెక్కలు చూద్దాం
మన కలాల్ని కరవాలాలుగా మార్చి కవి సిపాయిలుగా మారదాం
నిరస్త్రగా-క్షతగాత్రులుగా మిగలకుండా
రథ, గజ, తురగ పరివారాలతో పనిలేకుండా
ధైర్యం, సంకల్పం, జీవనేచ్ఛలే సైన్యంగా ప్రతియుద్ధం ప్రకటిద్దాం
దేహ దేశంలో జరిగే అంతర్యుద్ధం ఇది - ఆత్మస్థైర్యంతో ఎదిరిద్దాం
కవిత్వపు చికిత్సతో మానసిక సన్నద్ధతను అందిద్దాం
ఎన్నో యుద్ధాలను చూసాం - కానీ ఇది ఎంతో ప్రత్యేకం
గుంపుగా గుంపుతో గుమిగూడి చేసేది కాదు
విడివిడిగా ఒక్కొక్కరిగా సామూహిక పోరాటం చేయాలి
ఈ యుద్ధంలో ఒక్కొక్కరు ఒక్కో ఒంటరి సైనికుడు కదా
ఏకాకి మానవుడి చుట్టూ అక్షరాల రక్షణ వలయం అల్లుదాం రండి
కబళించాలని చూసే కరోనాని మట్టుబెట్టే చైతన్యాన్ని నింపుదాం
విమానాలలో దిగుమతవుతున్న మహమ్మారికి ఐసోలేషన్ వ్యూహంతో
నమస్తే మంత్రంతో రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం రండి !

-- 
With Best Regards

శ్రీలక్ష్మి ఐనంపూడి
Cell: 99899 28562
Website:www.inampudishreelaxmi.com
E-mail: shreelaxmi.inampudi@gmail.com

Sunday, March 29, 2020

కరోనా పై జి.కళావతిగారి కవిత

పాలకులకైనా.....పాలితులకైనా.....
*******************************

గొడ్డు మాంసం కొన్నాడని అఖ్లావ్ ను
గొడ్డును చంపినట్టు చంపినపుడు
ఇంత బాధ లేదు.....!
సంచారజాతి ప్రజల్ని ఊరినుండి వెళ్ళగొట్టడానికి
ఆ జాతి పసిమొగ్గ ఆశల కన్నులైనా ఇంకా విచ్చుకోని
కాశ్మీరీ కుంకుమపూరెమ్మ ఎనిమిదేళ్ల అసిఫాను
గుడిలో బంధించి వారం రోజులు అత్యాచారం చేసి చంపినపుడూ
ఇంత భయం లేదు.....!!

నక్సలైట్లనే నెపం మీద
మనుషుల్ని బూటకపు ఎన్ కౌంటర్ లలో కాల్చి పడేసినపుడు
ఇంత స్పందన లేదు.....!
దేశద్రోహులంటూ సాయిబాబా వరవరరావు మొదలు మేధావుల్ని
గృహనిర్బంధంలో జైలు నిర్బంధంలో శిలువేసినపుడూ
ఇంత సమాలోచన లేదు.....!!

ఢిల్లీలో పంజాబ్ లో విప్లవబావుటాలై గొంతెత్తిన విద్యార్థులను
రాజ్యహంకారం రంకెవేసి కాళ్లు చేతులు తలలు విరగ్గొట్టి పారేసినపుడు
ఇంత ఆందోళన లేదు.....!
షాహిన్ బాగ్ ఉద్యమంలో నక్షత్రాలై నిలిచిన మహిళలను
మగపోలీసులు పొట్టుపొట్టుగా కొట్టినపుడూ ఇంత ఆలోచన లేదు.....!!

ఒకనాడు కారంచేడులో దళితుల్ని సామూహికంగా హత్య చేసినప్పుడు
మరోనాడు గుజరాత్ లో దళిత మహిళపై
బహిరంగంగా అత్యాచారం చేసినప్పుడు
ఇంత వణుకు లేదు.....!
ఈశాన్య రాష్ట్రాలలో మోహరించబడిన కేంద్ర పోలీస్ ఫోర్స్ దాష్టీకాలను
ఇరోం షర్మిల లాంటివాళ్లు దశాబ్దాల పాటు ప్రశ్నించినపుడూ 
ఇంత అలర్ట్ లేదు.....!!

దక్షిణాఫ్రికాలో సిరియాలో లక్షలాదిమంది పసికందులు
ఆకలి చావులు చస్తున్నప్పుడు
ఇంత ఆర్ద్రత లేదు.....!
పేదవాళ్లు ఉట్టికి స్వర్గానికి అందలేక వగచుతున్నప్పుడు
తరాలకు తరాలు పీడనలో మ్రగ్గుతున్నప్పుడు
ఆధిపత్యాలు అణచివేతలు వికృత రూపాలు దాల్చుతున్న ప్పుడూ
ఇంత ఆవేదన లేదు.....!!

కార్పొరేట్ కుట్రలు కోట్లాది రూపాయల్ని దోచి దోచి
కోట్లాదిమంది ప్రజల్ని పేదవాళ్లను చేస్తున్నప్పుడు
ఇంత అలజడి లేదు.....!
అవినీతి రాజకీయం ఓటుకు పదివేలు పంచి
అధికారం మరిగి అరాచకం చేస్తున్నప్పుడూ
ఇంత ఆదుర్దా లేదు.....!!

ఎన్ ఆర్ సి మరియు సిఎఎ లతో రాజ్యాంగ మౌలిక సూత్రాల్ని విస్మరించి
నేతలు మతప్రాతిపదికన దేశ ప్రజల్ని విభజించపూనినపుడు
ఇంత కలవరం లేదు.....!
శ్రమ పొలంలో తమ రెక్కలు ముక్కలు చేసుకుని
దేశానికి అన్నం పెట్టిన రైతులు
తమ బిడ్డలకు అన్నం పెట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నప్పుడూ
ఇంత కనికరం లేదు.....!!

మత మౌఢ్యానికి వ్యతిరేకంగా నిలబడ్డారని
నరేంద్ర ధబోల్కర్, గోవింద్ పన్సారే, కల్బుర్గి, గౌరీలంకేశ్ ల
ఊపిరి తీసినపుడు
ఇంత ఉలుకు లేదు.....!
ఆర్టికల్ 370 రద్దుతో గత 237 రోజులుగా
కాశ్మీర్ ఊపిరిని జైలులో నిర్బంధించి ఉంచినా
ఇంత ఉద్వేగం లేదు.....!!

ఇప్పుడు కరోనా వచ్చింది.....!
మనిషి నుండి మనిషికి శరవేగంగా ప్రాకుతుంది.....
రోజుల్లో ప్రాణాల్ని  హరిస్తుంది.....
సామూహికంగా మనుషుల్ని బలిగొంటుంది.....
అంటేనే అందరి ప్రాణం ఝల్లుమంటుంది.....
చావు మనదాకా వస్తోందంటే హృదయం గుర్తొస్తోందొక్కొక్కరికీ.....!!

ఇప్పుడు మానవతా రాగాలు.....
దూర సుదూర మమతా గానాలు.....
అందరూ బాగుండాలనే ఆకాంక్షలు.....
ప్రేమ ఆప్యాయత అన్నీ ఉపరితలం మీదికొచ్చాయి.....!
కాలుష్యం స్ఫురణకొస్తోంది.....
దేవుడికి కాదు సైన్సుకు దండం పెట్టాలని స్మరణకొస్తోంది.....!!

ఇప్పుడు ప్రతి మనిషి తనచుట్టూ తాను కంచె నాటుకున్నా సరే.....
తల్లీబిడ్డలు తాకుకోకున్నా సరే.....
ఎవరి చావుకెవరూ హాజరు కాకున్నా సరే.....
కన్నీటిని కర్తవ్యంగా మ్రింగుకున్నా సరే.....
ప్రాణం మిగిలితే చాలు అనిపిస్తోంది.....!
బ్రతుకంటే ఎంత తీపి... ఉంటే ఉండనీ... తప్పు లేదు.....
కానీ...అమానవీయత అసమానతలే అసలు వ్యాధులని
కనీసం కరోనా భయం పోయాకైనా గుర్తుకొచ్చేనా మరి.....??!!

ఫ్రెంచి విప్లవం చెప్పినా.....
రాబోయే నూతన విప్లవాలు చెప్పినా.....
ప్రకృతి చెప్పినా.....సైన్స్ చెప్పినా.....
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే ప్రపంచ విలువలని.....
ప్రైవేటు ఆస్తికి కళ్ళెమే అత్యాశల విరుగుడని.....
గుడిసె పెరిగి మల్టీప్లెక్స్ తరగడమే మార్గమని.....
మనిషిని మనిషి ప్రేమించడమే అంతిమమని.....
తెలిసి వచ్చేనా... ఈ కరోనాతోనైనా...ఇకనైనా.....?????!!!!!
                        - జి.కళావతి,
                        28-03-2020.

Saturday, March 28, 2020

తెలుగు సామెతలతో కవిత.

ఊరికే పుట్టలేదు మన తెలుగు సామెతలు :---

1. వినాశకాలే విపరీతబుద్ది అన్నట్లు
    చైనా చేసిన పాడుపనికి కరోనా పుట్టింది !
2. తను తీసుకున్న గోతిలో తానే పడింది !
3. అందుకే అంటారు. చెడపకురా చెడేవు అని !
4.  ఆవలింతకు అన్న ఉన్నాడు గానీ,
     తుమ్ముకు తమ్ముడు లేడనుకుంది ఇటలీ !
     చైనా వాళ్ళతో హగ్గులు, పెగ్గులూ పంచుకుంది !
5. మన దీపమని ముద్దాడితే మూతి కాలినట్టు
    ఇటలీ కంటుకుంది కరోనా !
 6.ఇంతింతై, వటుడింతై అన్నట్లు విజృంభించింది కరోనా!
 7. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి లాభం?
 8.తూర్పు తిరిగి దణ్ణం పెట్టమని వదిలేసింది ప్రస్తుతం!
 9. ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చినట్లు అన్ని దేశాలకు పాకింది కరోనా!
10.తగువెలా వస్తుందిరా జంగమ దేవరా అంటే 
      బిచ్చం పెట్టవే బొచ్చు మొహం దానా అన్నట్టు
      అమెరికా చైనాను నిందించడం మొదలు పెట్టింది !
11. పైగా కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఎలా అని
      ఆలోచనలో పడింది!
12. అ, ఆ లు రావుగానీ, అగ్ర తాంబూలం నాకే అన్నట్లు 
       వ్యాక్సిన్ కూడా కనిపెట్టానంటోంది అమెరికా !
13. ఈలోగా కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు
       విదేశాలనుండి కొందరొచ్చి కరోనా అంటించారు !
14. అగ్నికి, వాయువు తోడైనట్లు A నుండి B కి,
       B నుండి C కి అది పాకింది !
15.  చాపకింద నీరులా పాకడం మొదలైంది !  
        దాంతో అదిరి పడ్డాయి ప్రభుత్వాలు !
16. కీడెంచి మేలంచాలనుకుని  LOCK DOWN ప్రకటించాయి !
17.వాన రాకడ! ప్రాణం పోకడ ఎవరి కెఱుక మరి !
18. ప్రజలందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లయి పోయారు !
19. బతికుంటే బలుసాకు తినొచ్చని కొందరూ
20. ఊపిరుంటే ఉప్పమ్ము కోవచ్చని కొందరూ
       ఇంట్లోనే ఉన్నారు !
21. అన్నీ తెలిసినమ్మ అమాస నాడు ఛస్తే
       ఏమీ తెలీనమ్మ ఏకాశి నాడు చచ్చినట్లు
       ప్రమాదం అని తెల్సి కూడా కొందరూ
22.దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఇంకొందరూ
      బైట తిరుగుతున్నారు!
23.కొరివితో తల గోక్కోకండిరా అని పోలీసోళ్లు
     మొదటి రోజు సుద్దులూ, బుద్ధులూ చెప్పారు! 
      ఐనా వినలేదు !
24.అడ్డాలనాడు బిడ్డలు గానీ, గడ్డాల నాడు కాదు కదా!
25.దండం దశ గుణం భవేత్ అనుకున్నారు పోలీసులు !
26.వడ్డించే వాడు మనోడైతే అన్నట్టు వడ్డించడం మొదలెట్టారు !
27.పట్టి పంగానామాలు పెడితే 
     గోడ చాటుకెళ్లి చెరిపేసుకున్నట్లు
     తిరుగుతునే ఉన్నారు కొందరు !
28.పొర్లించి, పొర్లించి కొట్టినా
      మీసాలకు మన్నంట లేదన్నట్టు
     తిరుగుతూనే ఉన్నారు ఇంకొందరు !
29. అందుకే అన్నారు కుక్కతోక వంకర అని !
30.ఇకపోతే కూరగాయల ధరలు 
      అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్లు
      ఆకాశాన్ని అంటుతున్నాయి !
31. మోసేవాడికి తెల్సు కావడి బరువు అన్నట్లుంది
       డాక్టర్లు, పోలీసులు,పారిశుధ్య కార్మికుల పని !
32. అడిగే వాడికి చెప్పేవాడు లోకువన్నట్లు
      కరోనా ఎప్పుడు తగ్గుతుంది?
       వ్యాక్సిన్  కనిపెట్ట డానికి ఎన్ని రోజులు
       పడుతుందని అడుగుతారు జర్నలిస్టులు!
33.అనుభవజ్ఞులందరూ మాకు మాత్రం ఏం తెలుసు
      ఐతే ఆదివారం, కాకుంటే సోమవారం అంటున్నారు !
34.కొండల్లే వచ్చిన ఆపద మంచల్లే కరుగు తుందన్నట్లు
     దేనికైనా TIME రావాలి కదా !
35 ఎందుకంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు మరి !
36. అందుకే ప్రజలందరూ ప్రభుత్వం చెప్పినట్లుగా
      LOCK DOWN పాటించి ఇంట్లోనే సంతోషంగా ఉండండి !
36. సంతోషమే సగం బలం మరి !
37. ఇప్పటికైనా ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తించి
      శుచి, శుభ్రత పాటిస్తూ, ఆహారపు అలవాట్లు
       ఆచార, వ్యవహారాలు మార్చుకోండి !
38.ఉందిలే మంచి కాలం ముందు ముందునా
       అని అందరూ ఎదురు చూడండి !
39. సర్వే జనా! సుఖినోభవంతు !









    అందుకే అంటారు చెడపకురా చెడేవు అని!

కరోనా" అంటే ఏమిటి ?

కరోనా అంటే ఏమిటి? ఎలా వృధ్ధి చెందుతుంది?  ఎలా నివారించ వచ్చు? 
    కరోనా అనునది  ప్రాణము లేని వొక ప్రోటీన్ పదార్థపు కణము, దీని పైన క్రొవ్వు పదార్థము వొక పొరలా యేర్పడి వొక పౌడరు లా  వుంటుంది. ఇతర వాటిలా కాక యీ  కణము కొంత బరువు కలిగి వుండటం తో గాలిలో యెగురలేదు. భూమిపై పడిపోతుంది.
    పట్టు పురుగుకు వచ్చే 'ఫిబ్రిన్' వ్యాధికి దీనికీ  కొన్ని పోలికలున్నాయి. ఫిబ్రిన్ వ్యాధి కూడా పట్టు పురుగు నోటి ద్వారానే పురుగు శరీరము లోనికి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే పట్టుపురుగు మల్బరీ ఆకును తిని దాని రసమును తన శరీరం లోని ద్రవము తో  సమ్మిళిత మవుతుందో, మరుక్షణం, ఆ మిశ్రమ ద్రవం తో యీ 'ఫిబ్రిన్,  కణము వొక గంటలో కొన్ని లక్షల కణములుగా విభజింప బడి, వొక రోజులో పట్టుపురుగు యే దశ లో వున్నా, శరీరం పూర్తిగా ఆక్రమించి పురుగును చంపేస్తుంది. ఒక పురుగులో చేరిన మరు గంటలో ఆ పురుగు విసర్జించే మల మూత్రముల ద్వారా బయటకు వచ్చి, ఆకుల పై పడి వేరొక పురుగు నోటి ద్వారా ఆ పురువుకు సంక్ర మిస్తుంది. ఇలా వొక రోజు లోనే కొన్ని వేల పురుగులను సంహరిస్తుంది. 
    నేడు కరోనా యెలా చైనా, ఇటలీ దేశాలకు మరణ మృదంగ మైనదో, అలాగే 150 సంవత్సరాల క్రితం ఇటలీ ఫ్రాన్స్ దేశాల పట్టు పరిశ్రమను కుప్ప కూల్చింది. ఇప్పటికీ దీనికి మందు కనుగొనబడ లేదు. 1890 సంవత్సర ప్రాంతంలో 'లూయీ పాశ్చర్' కనుగొన్న పట్టు పురుగు ను చంపి పరిశోధనా కేంద్రాలలో దాని శరీర ద్రవ పరీక్ష విధానమే నేటికీ ప్రపంచ వ్యాప్తంగా  వాడుకలో వుంది 
    ఇప్పటికీ కూడా ఏవొక్క పురుగులో యీ వ్యాధి కనపడినా, ఆ ప్రాంతం సుమారు 2-3 చ కిలో మీటర్లు యుద్ధ ప్రాతిపదికన మొత్తం పురుగులను కాల్చివేసి,  ఫార్మోలిన్ ద్రావణం తో వూరూరు శుద్ధి చేస్తారు. అంతేకాదు, ఆ ప్రాంతములో సుమారు 4 నెలల కాలం పట్టు పురుగుల పెంపకం నిషేధిస్తారు. కారణం యీ వ్యాధి కణం సుమారు 13 వారాల పాటు ఎటువంటి ఆహరం లేకుండా సజీవంగా వుండ గలదు.
    నేడు కరోనా కూడా అంతే. ఇది నిర్జీవ కణం. ఒక స్త్రీ అండాశయం లో నిర్జీవ అండం యెలా  14 రోజులు వుండి, వీర్య కణం తో జీవకణం గా మారి, కణ విభజన మొదలవుతుందో,  యీ కరోనా నిర్జీవ కణం  కూడా 14 రోజులు నిర్జీవ కణం గానే వుండి, యీ మధ్యలో  ఎప్పుడైతే మానవుని శరీరం లోని "చీమిడి" తో సంపర్కమవుతుందో  మవుతుందో, దానిలో కణ విభజన ఆరంభమవుతుంది. మన ముక్కు లోని చీమిడి లో కల ప్రోటీన్ ధాతువులు దీనికి మూలాధారం. మన కంటి 'కలక' లేక 'పుసిలి' కానీ,  ముక్కులోని 'చీమిడి' కానీ,  నోటిలోని 'గళ్ళ' కానీ దానికి దొరికితే వెంటనే నిముషాలలో కొన్ని వేల, లక్షల లో కణ విభజన జరిగి శ్వాస కోశాలలో చేరి, వూపిరి తిత్తులలోని రక్తనాళాలను ఆక్రమించి మన శరీరానికి ప్రాణవాయువును నిరోధిస్తుంది. దీని కారణంగా, రోగి ప్రాణవాయువు అందక మరణిస్తాడు. దీని విస్తరణ కు పడిశాన్ని వుధృతం చేసికుంటుంది.
   రోగిష్టి తుమ్మినపుడూ,  దగ్గినపుడూ, వారి చీమిడి ద్వారా,  కఫము ద్వారా, యీ రోగ కణాలు ఎచ్చటంటే  అచ్చట పడతాయి. మనం దగ్గరగా వుంటే మనపై పడవచ్చు. లేక అవి తుంపరలుగా వేటిపైనన్నా పడివుంటే,  ఆయా పదార్థ లక్షణములను బట్టి వాతావరణం లోని వేడిని స్వీకరించు సామర్థ్యాన్ని బట్టి  అవి 4 గంటల నుండీ 24 గంటల వరకూ శక్తివంతమై ఉండగలవు. అంటే వేడికి దీనిపై వున్న క్రొవ్వు పొర కరగి పోయి  నిర్వీర్యమై పోతుంది.
   ఇప్పటి వరకూ యీ వ్యాధి విజృంభించిన దేశాలన్నీ దరిదాపు శీతల ప్రదేశాలే. వేడి తక్కువ ప్రాంతాలు కావటం తో, దీనిపై గల క్రొవ్వు పొర కరగడానికి హెచ్చు ఆస్కారం లేక పోవడం వొక కారణం.
    ఈ మధ్య సమయం లో వాటిని మనం స్పర్శించిన చో అవి మనకు అంటుకొన గలవు. సర్వ సాధారణంగా మనం మన చేతుల తోనే స్పర్శించుతాము కావున మన అరచేతులకు,  వ్రేళ్ళకు అంటుకొన గలవు. సర్వ సాధారణంగా మన చేతులతో మన కళ్ళను,  ముక్కును,  నోటిని స్పర్శించడం సహజం. ఇలా యీ రోగ కణాలు ఎక్కడికైతే చేరకూడదో అచ్చటికి సులభంగా చేరిపోతాయి. 
    ఒక్కసారి అవి మన కంటి కలకను కానీ, చిమిడిని లేక ముక్కులోని పొక్కులను కానీ, మన నోటిలోని గళ్ళను కానీ చేరాయో, యిక వాటిని నిరోధించటం అసాధ్యం. ఇవి సర్వ సాధారణంగా అందరిలో ఎల్లవేళలా ముఖ్యంగా ముసలి వారిలో  వుంటాయి  కళ్ళ కలక ను చేరితే వెంటనే అది కంటి నీరుగా వృధ్ధి చెంది, ముక్కు ప్రక్కగా జారి, ముక్కు ద్వారా విజృంభిస్తుంది. 
   దీనికి ఇంతవరకూ మందు కనుగొన లేకున్నా,  దీనికి గల కొన్ని బలహీనతలను ఆసరాగా చేసికొని మనలను మనం రక్షించు కొనవచ్చు. 
     అదియేలా? 

    దీనికి రక్షక కవచం దీనిపైనున్న క్రొవ్వు పదార్ధం. ఈ క్రొవ్వు పదార్థాన్ని మనం తొలగించి నట్లయితే దీనిని నిర్వీర్యం చేయవచ్చు.  
    సాధారణంగా క్రొవ్వు పదార్థం వేడికి కరగి పోతుంది. లేక 'సబ్బు' నురుగుకు కరగి పోతుంది. సర్వ సాధారణంగా మన ఇళ్లలో చేతికి కాని, పాత్రలకు కానీ పట్టిన జిడ్డు (క్రొవ్వు పదార్థం)ను తొలగించడానికి మనం సబ్బు పదార్థాలు వాడుతాం. దీనికి కూడా అంతే. 
    మన శరీరాన్ని,  తల వెంట్రుకలతో సహా సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో,  రోజుకు 2-3 పర్యాయాలు బాగా తల స్నానం చేయడం తో  మన శరీర భాగాలను అంటుకున్న యీ కరోనా కణము పైగల క్రొవ్వు కరగి పోయి నిర్వీర్యమై పోతుంది. అటు తరువాత బాగా కొబ్బరి నూనెను శరీర భాగాలకు రుద్దుకుంటే, ఒకవేళ మన శరీర భాగాలపై యీ రోగ కణాలు మరలా పడ్డా,   అందులో చిక్కుకుని బయటకు రాలేని స్థితి ఏర్పడుతుంది. మరు స్నాన శుభ్రత లో వీటిని నిర్వీర్యం చేయవచ్చు.
    వీటి మధ్య లో అనేక పర్యాయాలు మన చేతులను 38 డిగ్రీలు  అంతకన్నా హెచ్చు వేడి నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో వొక నిముషం పాటు శుభ్ర పరచుకుంటే, మనం ధరించే వస్త్రాలను,  కర్చీఫులను, మాస్కులను పై లాగే శుభ్ర పరచుకుంటే,  యీ వ్యాధి కణాలపై వున్న క్రొవ్వును కరిగించి దానిని నిర్వీర్యం చేయవచ్చు.
కానీ యెట్టి పరిస్థితులలో కానీ యీ కణం మన ముఖానికి చేర కూడదు. కంటి కలక తో కానీ, ముక్కు చీమిడి లేక పొక్కులతో కానీ, నోటి గళ్ళ తో కానీ  సంపర్క మైతే దానిని అడ్డుకొనటం అసాధ్యం. 
    ఇదే వైదులు నెత్తి నోరు కొట్టుకొని మనకు చెప్పే సలహాలు, వాటి వెనుక వున్న వుద్దేశాలు.
   దీనిని మీవారికందరికి తెలిపి యీ వ్యాధినుండీ జాగ్రత్త పరచండి. వ్యాధిని మీవంతు గా నిర్ములించండి.
  డా| పత్తికొండ సురేంద్ర రావు

Thursday, March 26, 2020

పద్యాలు.

సుభాషితాలు.
ఆటవెలది.
------------
ఇన( సుార్య) గణ త్రయంబు, ఇంద్ర ద్వయంబు,
హంస (సుర్య) పంచ కంబు ఆటవెలది.
--------------------------
కామ క్రోధ లోభ  గుణముల విడనాడి
నీతి నిష్ట  నిత్య నియమ ముగను
నాతి, జాతి ,సుాక్తి నాదరిం చుటె వేత్తి
నదియె మేలు మాట తేనె ముాట॥*****

కట్టు బాట్లు లేని కోర్కెల నేలగా॥
అప్పు చేసి పప్పు  కుాడ దేలా*****
వట్టి మాట లేల,  విడువరా గములెల్ల
తప్పు ఒప్పు లెరిగి  తగ్గు మింక॥ 

రొట్టె 'పాలు తిన్న రోగమ్ము రాదురా 
భోగి వౌతె నీవు రోగి వౌదు
మితము,సాత్వి కమగు బోనమ్ము బలమురా
మొాహ మింక వీడి మనుమ మహిని॥

ఆలి ,తల్లి ,చెల్లె, లటులవా రలెస్త్రీలు
ఆట బొమ్మ కాదు హద్దు మీర
మగువ కంటి వెంట కన్నీరు చిలికినా****
కరగు నంట సిరులు ఘనము సుాక్తి ॥

రేపు రేప నుంచు వెనుకాడ తగదురా
చేయు పనికి జంకి జాల మేల
రేపు జేయు పనిని రోజులో పుారించు***
కార్య సిద్ధి గల్గి కలుగు జయము.॥

పనికి రాని మాట పతనమ్ము జేసేది 
నలుగు రెదుట నతిగ నుడువ వలదు
ఓర్పు గల్గి నీవు నేర్పరై  మసలుకో
అనువు కాని చోట అధిక మనక ॥*****

ఋచులు గల్గి నట్టి భక్ష్యమ్మె భాగ్యమా
నమ్మి మేటి ఋచుల మెచ్చ బోకు
చవుల నేలు జిహ్వ జఠరమ్ము జెరుపురా
నిజము నెరిగి మసలు నీవు సుమ్మా॥

అమ్మ నాన్న లిద్ద  రౌదురి లనువేల్పు
కమ్మ నైన ప్రేమ కనగ నీవు
నమ్మి నట్టి వారి నగుబాటు చేయకుా
అన్న మెట్టు బసకు కన్న మట్లు ॥.****

కామ జీవి వౌచు కరకురో  గములేల
బతుకు దుర్భ రముగ బ్రతుక నేల
అడుసు ద్రొక్కి కాళ్ళు కడగే వదేలరా***
ఫలిత మేమి లేని పరుగింక  చాలు ॥

పాపి వౌచు కర్మ ఫలముగా, పదుగురున్
పోరి, కోప గించ పరుష మేల
నీవు చేయు తప్పు నినుకాల్చు నిత్యమ్ము
పాము పడగ నీడ పడక  యట్లు ॥****

బాగ జుట్టు కోసి  పొట్టి వలువ కట్టి
సిగ్గు శరము లేని జాణ వౌచు
పురుషు లందు పుణ్య పురుషులే లేరంచు***
శోక మిప్పు డేల చరిత హీన ॥

అల్పు గుాడి నీవు ఆర్జించినది లేదు
దరికి జేర్చ బోకు దుష్ట  యఖుల
నివురు గప్పు నీరు నిలిచిముం చెడెదిరా***
తరిమి వారి వీడి తరలి రమ్ము॥

అల్ప బుధ్ధి కలిగి  ఆడంబరము లేలు
బ్రతుకు బ్రతక నేల కతక నేలా
స్వల్ప నియమ మెంచు సౌఖ్యమ్మె  సుఖమురా
పరువు లేని బతుకు బరువు సుమ్మీ॥*****


 
తామస గుణముల వీడియు
కామము క్రోధము లవీడి కరుణను గల్గిన్
నీమము లనుపా టించిన.......
రాక్షస రక్కసి "కరోన " రాదిక దరికిన్ ॥ 

ఆటవెలది.
---------------
ఆక లేయ స్థన్య పానమ్ము తాగించి
చిట్టి నడక  నేర్పె చిందు లేయ
అట్టి మేటి దైవ మిలలోన లేదయా
"అమ్మ" ఆమె పేరు, ఆది గురువు.॥

సాక రుాక దెచ్చి , సంసార  మునునెట్టి
చదువు లెన్నొ నేర్ప, జతన మెంచి (జతనమొార్చి)
సర్వ మొార్చి సకల  సౌఖ్యమి చ్చిన దాత
"నాన్న" గాదె ఇలను, నగధ రుండు ॥

కర్త యౌచు కార్య భారమ్ము  మోయుచుా
యుక్తి  బాధ్య తలను కావి డెత్తి
విత్తు కొరకు వయసు పణముగా పెట్టేటి
భర్త గాదె , కర్మ బద్ధు డిలను ॥

మగువ కంటి వెంట కన్నీరు చిలుకంగ
కరగు నంట సిరులు , గిరులు మహిని 
తరుగు నంట సుఖము తగవింట పెరుగును
కలత మార్ల కొంప జగడ పుారు॥

నలుగు రందు మీరు నగుబాటు కావద్దు
నలుని రాణి నాల్క నాట్య మాడ
కంద అంద ములను గణములన్ నేర్వంగ
తరగ బోదు మీదు ధనము గుణము ॥
తేటగీతి..****
పుట్టి నింట ముద్దు బిడ్డగా పెరిగేటి
పాప పెళ్ళి తోడ పరుల ధనము
అత్త యింటి వంశ -గౌరవము నిలబెట్టి
పుట్టి నింటి పేరు  పరువు నిలుపు ॥
---------------------------------------------

రచన.శ్రీమతి 
పుల్లాభట్ల జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్.
------------

[3/29, 22:44] iswarimurthy: 
ఆటవెలది.
కవిత లల్ల నెవరి కడుపునిం డెడిదంచు
అన్న మెట్ట నతడు ఆర్తు లకును
తలపు నెంచు తోడ తరుణంబి దేయంచు 
కలము వీడె ధర్మ  కర్మ జేయ॥

[3/30, 22:55] iswarimurthy:
కందం.
 శ్రీనా ధునిక్రుప గోరుచు
ఆనా ధునిచర ణములను అహరహ ములునే
ధ్యానా నందము నొందుచు
అర్చిం తునుభ  క్తితోడ  అఘహరు నతనిన్॥



 








రిటర్న్ గిఫ్ట్

కరోనా కి ఓ రిటర్న్ గిఫ్ట్ !
     - అయినంపూడి శ్రీలక్ష్మి
       99899 28562
-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-*-

ఏమైందిప్పుడు
క్షణాలు మాత్రమే కల్లోలితం
ఆత్మస్థైర్యాలు కాదు కదా
సమూహాలు మాత్రమే సంక్షోభితం
సాయం చేసే గుండెలు కాదు కదా !

ఎన్ని చూడలేదు మనం
కలరా వచ్చి ఎన్ని గ్రామాలు కలత చెందలేదు
కలలో కూడా కలరా కన్పిస్తుందా ఇప్పుడు
ప్లేగుని జయించిన దరహాసంతోనే కదా
చార్మినార్ ని నిర్మించుకున్నాం !

గతమెప్పుడూ విజయాల్నే గుర్తు చేస్తుంది
వర్తమానమెప్పుడూ సవాళ్ళనే చూపిస్తుంది
భవిష్యత్తెప్పుడూ ఆశలనే ప్రోది చేస్తుంది
కుంగుబాటు తాత్కాలికమే
యుద్ధభూమిలోకి దిగాక
వెనక్కు తిరగటం, వెన్ను చూపటం మనకు తెలియదు
యుద్ధం ఏ రూపంలో వస్తేనేం
మిస్సైల్ అయినా - వైరస్ అయినా
పెద్ద తేడా ఏం వుంటుంది కనుక !

నీకు బాగా తెలుసు-
జీవనవాంఛాజనితం మన దేహం
ఎన్ని మార్లు యుద్ధ ప్రసవాలు చూడలేదు
ప్రతి ఆంక్షను మన కాంక్షగా మార్చుకోలేదు !
కరోనా పాజిటివ్ అయితే ఏంటట
పాజిటివ్ దృక్పథం మన మందనుకున్నాక
సామాజిక దూరం మన అస్త్రమయ్యాక
జనతా కర్ఫ్యూ మన కవచమయ్యాక
ఇప్పుడిక క్వారెంటైనే మన వాలెంటైన్ !

 
ఇక, కరోనా మాత్రం కరిగి కనుమరుగు కాదా ?
క్యా కరోనా అని దీనంగా అర్థించొద్దు
దొంగతనంగా ప్రవేశించిన కరోనాకి కరుణ తెలియదు
క్యా కరోగే అంటూ ఎదురు తిరిగి ప్రశ్నించు
లెక్కపెట్టాల్సింది పోయిన ప్రాణాల్ని కాదు
నిత్య రణస్థలిలో కరోనా ఎన్ని లక్షల చేతుల్లో
పరాజిత అయ్యిందో ఆ లెక్కలు చూద్దాం
మన కలాల్ని కరవాలాలుగా మార్చి కవి సిపాయిలుగా మారదాం
నిరస్త్రగా-క్షతగాత్రులుగా మిగలకుండా
రథ, గజ, తురగ పరివారాలతో పనిలేకుండా
ధైర్యం, సంకల్పం, జీవనేచ్ఛలే సైన్యంగా ప్రతియుద్ధం ప్రకటిద్దాం
దేహ దేశంలో జరిగే అంతర్యుద్ధం ఇది - ఆత్మస్థైర్యంతో ఎదిరిద్దాం
కవిత్వపు చికిత్సతో మానసిక సన్నద్ధతను అందిద్దాం
ఎన్నో యుద్ధాలను చూసాం - కానీ ఇది ఎంతో ప్రత్యేకం
గుంపుగా గుంపుతో గుమిగూడి చేసేది కాదు
విడివిడిగా ఒక్కొక్కరిగా సామూహిక పోరాటం చేయాలి
ఈ యుద్ధంలో ఒక్కొక్కరు ఒక్కో ఒంటరి సైనికుడు కదా
ఏకాకి మానవుడి చుట్టూ అక్షరాల రక్షణ వలయం అల్లుదాం రండి
కబళించాలని చూసే కరోనాని మట్టుబెట్టే చైతన్యాన్ని నింపుదాం
విమానాలలో దిగుమతవుతున్న మహమ్మారికి ఐసోలేషన్ వ్యూహంతో
నమస్తే మంత్రంతో రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం రండి !

-- 
With Best Regards

శ్రీలక్ష్మి ఐనంపూడి
Cell: 99899 28562
Website:www.inampudishreelaxmi.com
E-mail: shreelaxmi.inampudi@gmail.com

Tuesday, March 24, 2020

కరోనా ...రోనా

👹 *సైలెంట్ బ్లాస్ట్*🔥

అకస్మాత్తుగా జీవితంలో
దిగ్భ్రాంత ప్రశాంతతలు...

నెత్తికెక్కిన మత్తు కళ్ళలో
బెదురు చూపుల మృత్యు ఘోషలు...

త్రీ ఫేజ్ బతుకులన్నీ 
ఫేటీల్మమంటున్నాయి..
వాడేసిన కండోమ్ లా 
నీరసపడుతున్నాయి..

మంత్రమా.. యంత్రమా...
ఎవరు చేసిన కుతంత్రమిది?
మతితప్పిన మనిషి తీరు 
గతితప్పిన ఫలితమా??

ప్రకృతిని చెరబట్టి వాడేసిన క్రూరత్వం...
పంచతత్వ పటిష్టతను వంచించిన తత్వం...
విత్తనాన్ని మరిచి, విషాన్ని నాటి,
పరిమళాలు ఆశిస్తే ప్రయోజనముంటుందా?
ప్రకోపమే దక్కుతుంది...
ఏవీ..?
ఆ మతాల దుర్మతుల అహంభావ ఆర్భాటాలు?
మందిర మసీదులు దందాల దుర్మదాంధాలు...
ఎక్కడ?
బాబాలు ముల్లాలు 
భక్త శిరోమణుల శుష్కవేదాంతాలు??

ప్రకృతి బలీయం..
ప్రకృతే బలీయం..

ఓ మనిషీ!
కరోనా నీకొక వరంగా వచ్చింది..
చేతుల్నే కాదిప్పుడు..
ఆత్మల్ని కడగాలి ..!!

            - సంగెవేని రవీంద్ర
🙏💐

Monday, March 23, 2020

అంజయ్య గౌడ్ గారి కరోనా పద్యాలు.

[3/22, 19:24] +91 90961 63962: నానా తిప్పలు బడుచును
ప్రాణములరచేత బట్టి పరుగిడు చుండన్
దీనావనులై వైద్యులు
మానుగ కాపాడుచుండ్రి మహిని కరోనా

నిద్రించక మావైద్యులు
భద్రముగా వైద్యశాల ప్రాంత ములోనన్
భద్రతకై మమ్ముంచగ
క్షుద్రపు కీటకమ నీకు క్షోభ కరోనా


నీవెంతగ బాధించిన
దేవతలై వెద్యులెల్ల దివ్యంబుగ మా
సేవలుజేయుచు నుండిరి
చావును దప్పింపగాను సతము కరోనా

ప్రజలందరు భీతిల్లగ
గజగజవణికించితీవు కాపట్యముతో
విజయము మాదే చివరకు
నిజదేశము పారిపొమ్ము నీచ కరోనా
పాపపు జననము నీదిక
దాపున నిలువంగబోకు దారిద్ర్యమ నీ
చూపే పడగూడదికా
తాపంబదికంబునయ్యె తరలు కరోనా 95
[3/22, 19:24] +91 90961 63962: భారత భూమిని నిలిచియు
పోరాటము సేయబోకు పోకిరిదానా
వారక మా వైద్యులు నిను
వారింతురు తప్పకుండ పాపి కరోనా

భీరము లాడరు నే భీ
మారైనను బెదరబోరు మావైద్యులు వి
స్తారముగ శ్రమించియు భీ
మారిని హరియింతురు విను మాయ కరోనా

మానవులను బాధించుచు
ప్రాణములనుదీయు నిన్ను బరిమార్చగ సు
శ్రేణులు సైంటిస్టులుని
ర్మాణాత్మక పాత్రలోన మనిరి కరోనా 100

మాముఖ్యమంత్రి సతతము
ప్రాముఖ్యత నిడుచు ప్రజల రక్షించుటకై
వేమరు శ్రమియించుచు తా
నీమరణము కోరుచుండె నిజము కరోనా

మేమందరమొక వారము
గ్రామమున చరించకను నిరం తరమింటన్
క్షేమముగా నుందుము మ
మ్మేమియు జేసెదవునీవు మిడత కరోనా

రుద్రం.

🙏రుద్ర నమక చకములలో గణిత రహస్యం🙏

🕉️ రుద్ర నమక చకములలో ప్రత్యేకించి చమకములోని పనసలను చదువుతూ ఉంటే సంఖ్యా పరమైన సూచకములు కనబడతాయి. 

🕉️ఈ 11 వ అనువాకం లో ఒక రహస్యం దాగి ఉంది ఇందులో వరుసగ సంస్కృతంలో అన్నీ బేసి సంఖ్యలే వస్తాయి

 ఈ అంకెలు ఒక క్రమ పద్ధతిలో వచ్చునవి కావు ఇవి దేవ సంఖ్యలు. 

కాని వాటి ముందు ఉండు సంక్య తో కూడి వర్గ మూలము లను అపాదించిన ఒక క్రమ పద్ధతిలో గల మనుష్య సంఖ్యలు( వరుసక్రమం లో వచ్చు సంఖ్యలు) కలుగుతాయి. 

🍀ఉదాహరణ కు అందులో ఏకాచమే అనగా 1, 
త్రిసస్చమే అనగా 3, 
పంచచమే = 5 
సప్తచమే 7, 
నవచమే 9, 
ఏకాదశచమే 11
 (ఇలా 1,3,5,7,9,11....బేసి సంఖ్యలే వస్తాయి ). 

కాని వాటి ముందు ఉండు సంక్య తో కూడి వర్గ మూలము లను అపాదించిన చో ఇగో ఇలా వస్తాయి....

ఏకాచమే అనగా ఒకటి =1

త్రిసస్చమే అనగా 3+1 = 4 కి వర్గమూలం =2

పంచచమే = 5+4=9 కి వర్గమూలం = 3

సప్తచమే = 7+9=16 కి వర్గమూలం = 4

నవచమే = 9+16=25 కి వర్గ మూలం = 5

ఏకాదశచమే = 11+25 =36 కి వర్గ మూలం = 6

త్రయోదశచమే = 13 + 36 = 49 కి వర్గ మూలం = 7

పంచ దశచమె = 15 + 49 = 64 కి వర్గ మూలం = 8

సప్త దశచమే = 17 + 64 = 81 కి వర్గ మూలం = 9

నవ దశచమే = 19 + 91 = 100 కి వర్గ మూలం = 10

ఏకవిగుం శతిస్చమే = 21 +100 = 121 కి వర్గ మూలం = 11

త్రయోవిగుం శతిస్చమే = 23 + 121 = 144 కి వర్గ మూలం = 12

పంచవిగుం శతిస్చమే = 25 + 144 = 169 కి వర్గ మూలం = 13

సప్తవిగుం శతిస్చమే = 27+ 169 = 196 కి వర్గ మూలం = 14

నవవిగుం సతిస్చమే = 29 + 196 = 225 కి వర్గ మూలం = 15

ఏకత్రిగుం శతిస్చమే = 31 + 225 = 256 కి వర్గ మూలం = 16

త్రయోవిగుం శతిస్చమే = 33 +256 = 289 కి వర్గ మూలం = 17

పంచ విగుం శతిస్చమే = 35 + 289 = 324 కి వర్గ మూలం = 18

శప్తవిగుం శతిస్చమే = 37 + 324 = 361 కి వర్గ మూలం = 19

నవవిగుం శతిస్చమే = 39 + 361 = 400 కి వర్గ మూలం = 20

రుద్ర చమకము లో ఈ 11 వ అనువాకము సృష్టి పరమాణు రహస్యము

కణాద మహర్షి సిద్ధాంతము 

ఈ సమస్త సృష్టి అణు, పరమాణు సూక్ష్మ కణ స్వరూపమని వాటి లో గల సంఖ్యా భేదము అనుసరించి వివిధ ధాతువులు యేర్పడినవి అని

శివ తత్వము ఈ సృష్టి లోని, పరమాణు స్వరూపం ( ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ) ల స్థితి కంటెను అతీతమగు స్థితి

🙏ఓం నమః శివాయ🙏

Saturday, March 21, 2020

పాట.

🌹☘🌷🌿🍁🍃🌸🌴🌺🎋🌻🌾🌳🦋🎋🌹🍀🍁

చిత్రం: చిట్టెమ్మ మొగుడు
గానం: ఏసుదాస్
రచన: జాలాది

నిండుకుండలా నీళ్ళోసుకుంటాదీ
నీలాలకొండా...
పండులాంటి ముద్దుపాపడ్ని కంటాదీ
తెల్లారకుండా...
పుట్టినోడల్లా సూరీడంటా
పుడమితల్లికాడు కొడుకేనంటా
అమ్మకడుపులో ఆడేదేమో తొమ్మిది నెలలంటా
దుమ్ములోన కలిసిపోయేటందుకు
నూరేళ్ళ గడువంటా...
ఇది బతుకమ్మ నడకంటా!

అమ్మ చేతులా మొలతాడు కడితే 
మొనగాడైనోడు
ఆ మొలతాడు కొలతే మెడతాళి కట్టి
ఆలి మొగుడౌతాడు
పేగు మడతలో ఊగులాడుతూ
ఉలికులికి పడతాడు
చిలిపిగెంతులా బంతిలా
చిరుడొక్కన తంతాడు
నిప్పులోన కలిసి పోయేనాడు
తలకొరివి పెట్టగ వచ్చానంటాడు

పుట్టమీద చెట్టు పురుడోసుకుంటే
పువ్వు పూసెనంటా
ఆ పువ్వులోనే ఒక బెమ్మదేవుడు
పుట్టుకొచ్చేనంటా
అందమైన జనమ కోసమే
ఆదిశక్తి పుట్టెనంటా
అండ పిండముల తల్లిగా
అది ఆడదయ్యనంటా
కట్టుకున్నదే కనలేనంటే
కాలమేడ్చెనంటా
బిడ్డ పాపలేని గొడ్రాలైతే
ఈ భూచక్ర మెట్టా తిరిగేదంటా....

🌹🌿🌷🍀🌻🍃🍂☘🌾🌴🍁🌳🦋🎋🌺🌿🌸🍃

Thursday, March 19, 2020

గుడ్ బై..కరోనా...

కరోనా........
విధ్వంసానికి  నిలయమైన విశ్వంలో
మరో  వింత  మురికి బాంబు.
కాలదు, పేలదు , వాలదు..
గాలిలో ఘొారంగా కలిసిపోయే " గ్రహ ఘరానా" అందరినీ  అల్లుకుపోయే  విషపు "కరోనా".
అడ్డుా, ఆపుా లేని ఆగడంతో ,
అమానుష  అరిష్టాన్ని శ్రుష్టిస్తోంది.
"కరోనా" , పేరుతో కార్చిచ్చు రగిలిస్తుా..
కను రెప్ప పాటులో,జనాలను కబళిస్తోంది.
విగతజీవుల ,వీర విహారి.
మందు లేని ఈ, మహమ్మారి.
దగ్గు, తుమ్ము , జ్వరం దీని పరం.
చేయిా చేయిా కలుపుతే చాలు ."భయం భయం."
భయంకర చర్యల ,బహు దుారపు బాటసారి"కరోనా"
"చైనా" లో పుట్టిన  దుర్గంధపు మహమ్మారి " కరోనా"
ప్రపంచ యాత్రలో , నరులపై  దాడితో..
మానవ ప్రపంచంలో చిచ్చు రేపే అలజడి."కరోనా ".
కుళ్ళిన శవాల గుట్టలతో, పై నివాసం....
దుర్గంధపు మ్రుత కణాల తో ఆవాసం.."కరోనా ".
చంపడం దీని లక్ష్యం ,  అన్న మాటకు
ఇప్పటి వినాస విన్యాసాలే  సాక్ష్యం.
మానవాళి మనసుల్లో , మట్టికొట్టుకు పోయిన
ఆచార వ్యవహారాల నిరసనల కిది నిదర్శనం.
పాశ్ఛాత్యపు పోకడలతో దిగజారిన,నైతిక 
విలువల నియమొాల్లంఘనల  "యమపాశం".
శ్రుష్టి కార్యాల కంపరపు చర్యల కాలుష్యం "కరోనా".
అసౌచం, అసుచులకు, అర్ధం చెప్పిన" అద్దం , కరోనా".
జాతి, మత, కుల విభేదాల -స్వదేశ-విదేశాల
మారణహోమపు మ్రుత కణం " కరోనా."
చాప క్రింది నీరులా చేరువౌతున్న-
పరదేశపు పాప పంకిలం " కరోనా".
గుట్టలుగా పోగవుతున్న, విగతజీవుల 
మ్రుతకణాల ముద్దు బిడ్డ.."కరోనా.."
ఇప్పటికైనా కళ్ళు తెరవండి.
మన ఆచార -వ్యవహారాలుా, 
సుచి- సుభ్రతలు పాటించండి.
మత భేదాల మారణ హోమాలు, ఆపండి
తల్లి-తండ్రులు , ఆడ బిడ్డల కన్నీటి 
శాపాలకు గురి కాకండి.
వింత కోరికల సంయమనాన్ని పాటించండి.
వీధి వంటకాల విలయ తాండవానికి 
"స్వస్థి", పలకండి.
"అందరుా బాగుండాలి. అందరిలో మనముండాలి",
అనే ఆలోచనతో మందడుగు వేయండి.
చెప్పండి కరోనాకు..."టా- టా..
ఇక ,సమతా- మమతలే..ఇంటా- బయటా..
--------------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల..జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.

-------------





















Monday, March 16, 2020

బాడుగమ్మ.

రంగి నులక మంచం మీద అటుా - ఇటుా దొర్లుతున్నాది.
జామురాత్రి దాటుతున్నా కంటిమీద కునుకు రావడం లేదు.నెల్లాళ్ళ బట్టీ ఇదే వరస. పగలంతా  అసహనం ,
అసంత్రుప్తి..రాత్రి నిద్రలేమి..
వీటన్నిటికీ తోడు భారమైన వక్షస్థలం లో, నిండుగా పొంగి , వేసుకున్న జాకట్టు లోంచీ,  ధారలై  బయటకు తన్నుకొస్తున్న చనుపాల తో, తడిసి 
పోతున్న  తన చీర పుట్టిస్తున్న చలి, చిన్నగా
వణుకు పుట్టిస్తున్నా  , తనలోని మాత్రుత్వాన్ని
తట్టి లేపుతున్నట్టుగా  మనసు
మెలిపెడుతుాన్న బాధ ఎక్కువగా ఉంది. నిండుకున్న చనుపాలు  తన చిన్ని నోటితో తాగుతుా ,
రెండవ వైపు స్థనసన్ని తన చిన్ని చేతులతో
తడుముతుా , చిన్ని చిన్ని కాళ్ళ తో తన పొట్టను
తన్నుతుా ఉంటే కలిగే  మురిపాల ఆనందం
పొందే అద్రుష్టం  తనకి లేదు.
పాలతో నిండుకున్న స్థనాలు భారమై నొప్పి
కలిగిస్తున్నాయి. పొందిన మాత్రుత్వ రుాపాన్ని
చుాసుకొని మనసారా అనందపడే అనుభవాల
హాయి తనకు లేదు.మొదటి బిడ్డని కన్నతరువాత
కలిగే ఆనందానుభుాతి ,, కనులారా చుాసుకొన్న తరువాత కలిగే పులకరింతలకు తను నోచుకోలేదు.
రంగి కళ్ళలో నీళ్ళు  నిండుకున్నాయి.మంచం
మీదనించి లేచి , తడిక తలుపు తెరుచుకొని
బయటకు వచ్చింది.
నీలాకాశంలో ఉన్న చందమామ , అక్కడక్కడ ఉన్న నల్లని మేఘాల చాటుకు చేరి , మెరిసే తారలతో దోబుాచులాడుతున్నాడు.
రంగికి ఒక్కసారిగా ముాడు నెలల క్రితమే చనిపోయిన
భర్త జ్ఞాపకం వచ్చేడు. లోపల అదే నులక మంచం మీద
ఏడాదిపాటు నరకం అనుభవించి మరీ పోయేడు,
తనని  ఒంటరి దానిని చేసి.
ఎవరి కోసం తను ఇన్ని కష్టాలు  పడిందో , ఏ మాంగళ్యం
కోసం, తన గర్భాన్ని పణంగా పెట్టిందో, ఏ ప్రేమని
బతికించుకోవడం కోసం ..ఏ ఆడదీ చేయ్యలేని పని
చేసిందో, అదంతా బుాడిదలో పోసిన పన్నీరే అయింది.
తను ప్రణంగా ప్రేమించిన మామ లేకుండా తను
ఇంకా ఎలా బ్రతికి ఉందో ...?
అలనాటి జ్ఞాపకాలు తలచుకుంటున్న రంగి పుార్తిగా
తన గతంలోకి జారిపోయింది.ముాసుకున్న కన్నుల
ముందు గడచిన రోజులు గిర్రున తిరుగసాగేయి.
నీర్సంగా నుాతి చెప్టాకు చారబడినట్లు కుాలబడింది.
చల్లని వెన్నెల లో కుాడా గతపు జ్ఞాపకాల వేడి ,<<)))) 
చమట  రుాపంలో  తన శరీరాన్ని తడిపేస్తున్నాది.
---------------------------------------
రంగి రాజన్నే కాక ఇంకా ఎంతోమంది , ఊరికామందు
పొలంలో కౌలుకు కుదురుకున్నారు.ఆడుతుా పాడుతుా
అందరుా కలిసి చేసే పొలం పనుల మధ్య,  ఎప్పుడు
కలిసిందో , రంగి రాజన్నల మనసు . ముాగ ప్రేమ
గీతాలు , మెరిసే కన్నుల్లో విరిసే బాసలు , భాష్యాలు ,
కలల్లో ఆనంద విహారాలు , విందులు , వినోదాల
మత్తుల్లో తేలి , ఆడీ- పాడీ చివరకు పెళ్ళి అనే
పవిత్ర బంధంతో ముడి పడిపోయింది.
                           హాయిగా గడిచిపోతున్న దినాలు ,
ఆనందంలో తేలిపోతున్న తాత్రి వసంతాలను
అనుభవించకుండానే రంగి జీవితంలో అపస్వరం
చోటు చేసుకుంది.

---------------------------------------------------
ఆరోజు పొలం పని పుార్తయిన తర్వాత
రాజన్న , రంగి ఇంటికి బయలుదేరేరు . తోవలో
ఏ కామందు పొలంలో పని చేస్తున్నారో , అదే కామందు
కొడుకు తాగిన మత్తులొ నడుపుతున్న  కారు , వెనుకవేపునుంచి వచ్చి  రాజన్న ను గుద్దడంతో ,
రాజన్న అక్కడికక్కడే  కుప్పకుాలిపోయేడు.
చిన్న చిన్న దెబ్బలతో బయట పడ్డ రంగి , ఏడుస్తుా
అటువైపుగా వస్తున్న తమ తోటివారిని పిలవడంతో
అందరుా కుాడి రాజన్న ను వెంటనే  ఆసుపత్రికి
తరలించేరు.
అక్కడ  రాజన్న ని పరీక్ష  చేసిన డాక్టరుగారు ,
నడుంలోని నరం దెబ్బతిన్న కారణం చేత రాజన్న
లేచి నడవడం కష్టం  అవుతుందని, ఆపరేషన్ చేస్తే
ఫలితం ఉండవచ్చని చెప్పడంతో కాస్తా ఊరట
కలిగింది రంగికి. నిస్రాణగా పడి ఉన్న రాజన్న
ముఖాన్ని  ఆప్యాయంగా తన చీర చెంగుతో తుడుస్తుా
ఆపరేషన్ ఎప్పుడు చేస్తారని అడిగింది.
ఆపరేషన్ చేయడానికి లక్ష పైనే అవ్వచ్చని ,  కౌంటర్ లో డబ్బు  కట్టగానే ఆపరేషన్ కి ఏర్పాట్లు జరుగుతాయన్న
డాక్టర్ మాట వినగానే రంగికి గుండె గుభిల్లుమంది.
లక్ష రుాపాయలా...? అంత డబ్బు తనెక్కడ తేగలదు.?
డబ్బు  కట్టడం కుదరకపోతే  , తన మామ జీవితాంతం
ఇలా పడి ఉండవలసిందేనా..?
తను రోజు కుాలి చేసి సంపాదించి ఎంతని
కుాడపెట్టగలదు..? ఇద్దరు కలిసి పని చేస్తేనే  ప్రస్తుతం తన దగ్గర రెండు  వేలకు మించి , సొమ్ము  లేదు.
మరి లక్ష రుాపాయలు ఎలా తెచ్చేది...?
ఆలోచిస్తున్న రంగికి రోజులు గడుస్తున్నా పరిష్కార
మార్గం కనిపించ లేదు.
పది రోజులు గడిచేయి. రాజన్న ని ఆసుపత్రిలోనే
ఉంచడం  వల్ల , సమయానికి మందులు వేస్తుా
ఉండడం వల్ల  గాయాలు మాని , మంచంపైనే అటు-
ఇటు తిరగగలిసే వరకు కోలుకున్నాడు.
ఇక ఆసుపత్రిలో ఉంచే అవసరం లేదని , ఎప్పుడు
ఆపరేషన్ చేయించాలనుకుంటే అప్పుడు  తీసుకు
రమ్మని చెపడంతో, రంగి , రాజన్న ని ఇంటికి
తీసుకొని వచ్చిందన్న మాటే గానీ , ఎంతో
ఉత్సాహంగా ఉంటుా , కమ్మని మాటలుా -పాటలతో ,ఎప్పుడుా అలుపెరగకుండా పనిచేసే రాజన్న ,  అలా నిస్సహాయంగా పడుకొని , పుార్తిగా తనమీదే ఆధారపడి ఉండడం భరించలేకపోతున్నాది.
రంగి.
రెండు ముాడు సార్లు తాము పనిచేసే యజమాని
దగ్గరకు వెళ్ళి, విషయం చెప్పి సహాయం చేయమని
కోరింది కుాడా..కానీ ఫలితం లేకపోయేసరికి ,
కన్నీటితో వెనుతిరిగేది.  ఇప్పుడు ఇల్లు గడవడమే
కష్టం ...పోనీ తను  డబ్బు కోసం , కొంచం ఎక్కువ సమయం పని చేద్దామనుకుంటే , ఇంట్లో
కదలలేని  స్థితిలో ఉన్న రాజన్నకి  ఎప్పుడు ఏ
అవసరం పడుతుందో...అన్న ఆలోచనతో
ఎక్కడికీ వెళ్ళ లేక పోతున్నాది రంగి. రోజులు
భారంగా గడుస్తున్నాయి.
రంగికి ఎలాగైనా రాజన్న కి ఆపరేషన్ చేయించాలన్న
కోరిక బలపడుతోంది కానీ దారే తెలియడంలేదు.

---------------------------------------------------------
మరో నెల అలాగే గడిచిపోయింది.ఆ రోజుతో ఇంట్లో ఉన్న మందులు అయిపోవడంతో ,  రంగి ఆసుపత్రికి వెళ్ళింది. మందులు తీసుకొని వస్తుా..రాజన్న కి
వైద్యం చేసిన డాక్టరు గారిని కలిసి, వారికి తమ పరిస్థితులు వివరించి , ఆపరేషన్ కి కావలసిన
డబ్బులను తను ఒక్కర్తిీ సమకుార్చే శక్తి తమకు
లేదనీ, అందికే  తమకు తగిన దారేదైనా చుాపమని ,డాక్టరు గారిని వేడుకొంది రంగి. ఆమె పరిస్థితికి జాలిపడ్డ డాక్టరుగారు
ఆలోచనలో పడిపోయేరు. చివరికి  ఆపరేషన్  కి
కావలసిన ధనం సమకుారడానికి కావలసిన ఒక
పద్ధతి తనకు తెలుసనీ, దానికి రంగి ఒప్పుకుంటే
రాజన్నకు ఆపరేషన్ అవడమే కాక,,  మంచి
వైద్య సదుపాయంతో పాటు , చాలా డబ్బు కుాడా
ఇవ్వబడుతుందని చెప్పడంతో ,రంగి ఆశ్చర్యపోయింది.
ఇది ఏరకమైన పనో ...లేకపోతే అంతడబ్బు ఆపరేషన్
కి ఇవ్వడమే కాక,  తిరిగి మరికొంత సొమ్మ
ఇస్తారా...అయితే అది ఎటువంటి పని..?
తను ఏఁమి చేయాలి..? అర్థం కాని ఆలోచనల్లో
ఉన్న రంగికి , డాక్టరుగారు చెప్పిన మాట తో
భుామి బద్దలెైనట్టే అయింది. కళ్ళు పెద్దవి చేసి , 
ఆశ్చర్యంగా నమ్మలేనట్టు చుాసింది.
రంగి జీవితంలో ఎప్పుడా కనీ- వినీ ఎరుగని మాటది.
అదిీ ,తన గర్భాన్ని వేరొకరికి అద్దెకీయడం .
డాక్టరుగారు చెపుతున్నదేమిటి..?
ఇది సంభవమైన పనా..?  ఇది ఒక ఇల్లా...?
పొలమా...? అద్దెకు ఈయడానికి. ?
ఇది మనసిచ్చిన వాడిని, పవిత్రమైన వివాహబంధం
తో పెనవేసుకొని , ఇద్దరి ప్రేమానురాగాలకు   
సాక్షిగా , తన కడుపులో  పెరుగుతున్న  బీజాన్ని
నవ  మాసాలుా మొాసి ,  తన రక్త మాంసాలు
ధారపోసి  పెంచి , కనే  ఒక ప్రేమామ్రుత చర్యకి  ప్రతిరుాపమై  , మాత్రుత్వానికి , మమతకీ  నిలయమైన పవిత్ర గర్భాన్ని , బాడుగకి ఇవ్వడమా..? ఈ
లోకంలో ఇటువంటి బేరాలు కుాడా ఉంటాయా...?
రంగి ఆలోచనల్లో ఉండగానే డాక్టరుగారు అసలు
పధ్ధతిని విశదీకరించేరు. అదేమిటంటే..
తను తన మామవల్ల గర్భం ధరించదు.  వేరొకరితో
కలిసి తన శీలాన్ని కోల్పోవలసిన అవసరంలేదు.
వేరొకరి వీర్యాన్ని , తన గర్భంలోకి ప్రవేశపెట్టడం ద్వారా
తను గర్భమైతే ధరిస్తుంది కానీ , బిడ్ద పుట్టిన  తర్వాత కుాడా , తనకు బిడ్డ తాలుాకా తలిదండ్రులు కనపడరు.
అంతదాకా ఎందుకు.. పుట్టిన బిడ్డని కుాడా
తనకు చుాపించరు. తనకు సమస్త సౌకర్యాలుా
కలుగజేస్తారు.మంచి వసతి , మంచి భోజనం ,
మందులు..వగెైరాలు . తొమ్మిది నెలల అనంతరం
అన్న మాట ప్రకారం తనకు కావలసిన ధనాన్ని
చెక్కు రుాపంలో అందించి , బిడ్డ తలిదండ్రులు
బిడ్డని తీసుకొని వెళ్ళిపోతారు. తరువాత వారికి గానీ తనకుగానీ ఎటువంటి సంబంధముా ఉండదు.
ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం కాగితాలమీద
సంతకాల  ఒప్పందంతో జరుగుతాయి.
ఇదంతా విన్న రంగి ముందు చాలా భయపడింది.
తర్వాత  భయంనుండి , విస్మయంలోకి , విస్మయం నుండి  ఆలోచనల్లోకి  , ఆలోచనలనుండి... ఆమొాదంలోకి  వచ్చిన రంగి ,  తన బలహీన స్థితికి తానుతీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించుకోలేక ,
అలాగని అంగీకరించలేక  ,తనలో తానే మధన పడుతుా పదిహేను  రోజులు  కొట్టుమిట్టాడి, చివరకు రాజీకి వచ్చింది.
రంగి మనసులో అదే మాట పదే పదే తలపుకు వస్తున్నాది.
తను తన మామవల్ల గర్భం ధరించదు.  వేరొకరితో
కలిసి తన శీలాన్ని కోల్పోవలసిన అవసరంలేదు.
వేరొకరి వీర్యాన్ని తన గర్భంలోకి ప్రవేశపెట్టడం ద్వారా
తను గర్భమైతే ధరిస్తుంది కానీ బిడ్ద పుట్టిన  తర్వాత కుాడా , తనకు బిడ్డ తాలుాకా తలిదండ్రులు కనపడరు.
అంతదాకా ఎందుకు..తనకు పుట్టిన బిడ్డని కుాడా
తను చుాడకుాడదు. బిడ్డ పుట్టిన  తర్వాత తనకు
ఎవరితోనుా ఎటువంటి సంబంధముా ఉండదు.కానీ
తనకు తన మామకు ఆపరేషన్  చేయడానికి తగిన
ధనం దొరుకుతుంది.
ఈ చివరిమాట రంగిపై చాలా ప్రభావాన్ని చుాపించింది.
తన మామ బాగుపడితే తన జీవితంలో మళ్ళీ
వసంతం చిగురించినట్టే. తొమ్మిది నెలలు ఇట్టే
గడిచిపోతాయి. తర్వాత తను మామతో కలిసి
జీవితాంతం హాయిగా బతకవచ్చు.
కానీ ఒక్కటే భయం .దీనికి తన మామ అంగీకరిస్తాడా ?
మామ అంగీకారం గానీ లేకపోతే ఈ పని జరగదే..?
ఎలా...?
మనసులో ఎన్నో తర్జనభర్జనలు చేసుకున్న రంగి , చివరిగా ఒక నిర్ణయానికి వచ్చింది.
కాగితాల పై మామకు తెలీకుండా,  అతని వేలి ముద్రలు  వేయించడం  తనకు పెద్ద కష్టమైన  పనికాదు.
ఏ రకంగానైనా సరే తను ఈ పని చేయడానికే
నిశ్ఛయించుకున్న రంగి , తన ఆలోచనలకు,  కార్య
రుాపం ఇవ్వడంతో...పనులు చక చకా జరిగేయి.
పర్యవసానం  ఎవరిదో తెలీని వీర్యం , ప్రాణం
పోసుకుందుకై తన గర్భంలోకి చొప్పించబడింది.
ఏమైందో ఎలాగైందో తెలీకుండానే రంగి గర్భం దాల్చింది.
                
                         మొదట్లో తనది కానిదీ, తన మామ
ప్రమేయంలేనిది అయిన ఆ చిన్ని ప్రాణాన్ని,   తన అవసరంకోసం  చేసిన ఒక చర్యగా భావించిన రంగికి,
నెలలు గడిచేకొద్దీ, పెరుగుతున్న కడుపుతో పాటు, ,
లోపలి కదలికల గిలిగింతల తో, మమతానురాగాల
మాయ కమ్మడం మొదలయ్యింది.
రోజులు భారంగా గడుస్తున్నాయి. తన ప్రమేయం లేకుండా  పెరుగుతున్న  కడుపుని , కనపడకుండా
దాచడం రంగికి కష్టం అవుతున్నాది. తన మామ
లేవలేని స్థితిని,  తన అవసరాలని,  ముందే గ్రహించిన
డాక్టరుగారు,  రంగికి తన మామ సేవ చేసుకునే
వెసులుపాటు కల్పించేరు.

మొదట్లో తనది కానిదీ, తన మామ
ప్రమేయం లేనిది,  అయిన ఆ చిన్ని ప్రాణాన్ని,   తన అవసరంకోసం  చేసిన ఒక చర్యగా భావించిన రంగికి,
నెలలు గడిచేకొద్దీ, పెరుగుతున్న కడుపుతో పాటు, ,
లోపలి కదలికల గిలిగింతల తో, మమతానురాగాల
మాయ కమ్మడం మొదలయ్యింది.
మంచం మీద ఉన్న రాజన్నతో, పని పేరు చెప్పి , ఏదో
సాకుతో  రోజంతా బయటే గడుపుతున్న రంగిని
చుాస్తుా ఉంటే' రాజన్నకు ఏదో తెలీని అనుమానం
వేధించ సాగింది.రంగి మునుపటిలా లేదు. కొంచం బొద్దుగా  తయారైంది. పొట్టకుాడా పెరిగింది.
అందమైన రంగి ఇపుడు, ఇంకాస్తా  అందంగా
కనిపిస్తున్నాది రాజన్న కళ్ళకి. కానీ ఎందుకో
రాజన్న  మనసులో ఉన్న , చిన్న అనుమానం...
పెరిగి పెరిగి పెనుభుాతంలా వెంటాడుతున్నాది.
రంగి గర్భం దాల్చిందా...ఎలా..?
పదే పదే అదే విషయం ఆలోచిస్తున్న రాజన్నకు,
నిజం తెలుసుకోడానికి ఎక్కువ సమయంపట్టలేదు.
రంగి తన ప్రమేయం లేకుండా గర్భవతి  అయిందన్న
నిజాన్ని జీర్ణించుకోలేక, తన అసహాయత్వానికి
కోపాన్ని జోడించి అసహనంతో రంగిని, నిందలు
వేయడంతోపాటు , మందులు వేసుకోవడం కుాడా మానివేసాడు.
రంగి కన్నీటితో అన్నీ వివరించి చెప్పినా సరే..
అంగీకరించని అతని మనసు, రంగిపై కోపాన్ని ,
ద్వేషాన్ని పెంచుకుంది.
అనుమాన బీజం చిగురించి మొక్కై మానయ్యింది.

దానితో రంగికి మన:శాంతి కరువైంది. మామ తనను
నమ్మాలి, అంటే డాక్టర్  గారి చేతే విషయాన్ని చెప్పించాలి.
మామ నడవలేని స్థితిలో ఉండడంతో అతనిని,
డాక్టర్ గారి దగ్గరకు తీసుకెళ్ళ లేదు. కానీ డాక్టర్
గారితో పరిస్థితి వివరించి , అతని ని ఇంటికి తేవడానికి
ప్రయత్నించగలదు .
ఈ నిర్ణయం , రంగికి కొంత ఊరట కలిగించింది.
ప్రతీ నెలా చెకప్ కోసం వెళుతున్న రంగి..ఆ రోజు
డాక్టర్ గారిని ఎలాగైనా తీసుకు రావడానికి
నిర్ణయించుకొని బయలుదేరింది.అంతా విన్న
డాక్టర్ గారు రంగితో రావడానికి తన అంగీకారం
తెలిపేరు. కారణం ఈ ప్రక్రియలో రంగికి ఇయ్యవలసిన
ధనానికన్నా, రెండు రెట్లు రెట్టింపు ధనం తన
జేబులోకి రావడమే కారణం.
ఈ విషయాలేవీ తెలీని రంగి -
డాక్టర్ గారి ఉదార స్వభావానికి నమస్కరిస్తుా ..
తేలికగా ఊపిరి పీల్చుకుంది.
సాయంత్రం వరకు వేచి ఉన్న రంగి` డాక్టర్ గారిని
తీసుకొని తన ఇంటికి వెళ్ళింది. ఈ రోజుతో
భర్తకు తన మీదున్న అనుమానాలన్నీ తీరిపోతాయి అనుకుంటుా,
తలుపు తీసిన రంగి కి రాజన్న మంచం కి కొంచం
దురంలో కిందపడి కనిపించేడు. అతనికి కొంచం
దుారంగా పురుగులమందు సీసా పడి ఉండడం
చుాసి, రంగి గొల్లుమంది. వచ్చిన డాక్టర్ గారు, రంగన్న ని
పరీక్షించి  అప్పటికే ప్రాణం పోయి చాలా సేపయిందని
చెప్పడంతో రంగి కళ్ళకి  చీకట్లు కమ్మేయి.
ఎవరి ఆరోగ్యం కోసం  తనింత పెద్ద నిర్ణయం
తీసుకుందో , తనే ఈ లోకం విడిచి వెళ్ళడన్న
నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది రంగి. ఎవరినైతే
తను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిందో, ఎవరి బాగుకోసం తను లోకానికి కుాడా వెరవకుండా ,
అద్దెగర్భాన్ని దాల్చిందో' అతనే తన పై అనుమానంతో
కోపాగ్ని కొలిమిలో కాలి కాలి బుాడెదైపోయేడు.
ఈ నిజాన్ని తట్టుకోలేని రంగికి తన్నుకొస్తున్న దు:ఖం
నొప్పుల రుాపం దాల్చి కడుపులో వికారం పెట్ట సాగింది.
రంగికి ఏదైనా అయితే తనకు రావలసిన మొత్తం
రాదనే భయంతో, రంగి పక్కనే ఉండి జరుగవలసిన
కార్యక్రమాలను  సవ్యంగా జరిపించి మహోన్నత
వ్యక్తిగా అందరి మన్ననలుా పొంది ,.
హ్రుదయ విదారకంగా ఏడుస్తున్న రంగిని  తీసుకొని
ఆసుపత్రి వైపుకు దారితీసేడు డాక్టరు .
కాలం ఎవ్వరి కోసం ఆగకుండా ,పాత గాయాలని మాన్పుతుా, కొత్త ఆలోచనల జోరుతో ముందుకు నడుస్తున్నాది.
రంగి మెల్లి మెల్లిగా ,తనకు కలిగిన దుర్భాగ్యపు
సంఘటనలను మరచి , కోలుకుంటున్నాది

రంగికి  ఎనిమిదవ నెల నడుస్తున్నాది. తన కడుపులో
ఉన్న చిన్ని ప్రాణం,  లోపలినుంచి తనను చిన్ని చిన్ని కాళ్ళతో తంతుా ఉంటే రంగి పులకరించిపోతున్నాది.
ఒంటరైన తనకు తోడుగా ,తనని  ఎప్పుడుా తన చిన్ని
కదలికలతో పలకరిస్తున్న , ఆ చిన్ని పాప ఉన్న పొట్టను  అపురుాపంగా  తడుముకుంటుా ,ఆనందానుభుాతితో,    పసి బిడ్డని కనులారా చుాసుకొనే క్షణాల కోసం ఎదురుచుాడసాగింది.
మానసికంగా బాధకు గురైన రంగికి,  సరైన నిద్ర, ఆహారం లేని కారణంగా నిస్సత్తువగా  ఉంటుా ఉండేది.
నెలలు నిండుతున్న రంగికి ఒకరాత్రి నొప్పులు  విపరీతంగా రావడంతో, ప్రమాద  స్థితిని గమనించిన డాక్టరు గారు రంగిని  మెటర్నటీ వార్డ్ లోకి
తీసుకెళ్ళేరు. డాక్టరుగారు ఇచ్చిన ఇంజక్షన్ తో
రంగికి తెలివి తప్పింది. అటు తర్వాత జరగవలసిన
కార్యక్రమాలన్నీ  రాతకోతలతో సహా  నిర్విఘ్నంగా జరిగిపోయాయి.
డబ్బు చేతులు మారింది.
కళ్ళు తెరిచిన రంగికి పక్కన తన రక్త మాంసాలు పంచుకొని పుట్టిన పసి గుడ్డు కనిపించలేదు. రంగి
ఆత్రుతగా  చుట్టుా చుాసింది .ఎవరినైనస అడుగుదామని. అందరుా ఎవరి పనుల్లో వారు తిరుగుతున్నారు. తన బాధని గమనించే నాధుడే
లేడక్కడ. తనను ఇన్నాళ్ళుా అంటిపెట్టుకొని ఉన్న
డాక్టర్‌  , ఆరోజంతా రాలేదు. ఆ రాత్రి కాళరాత్రే
అయింది రంగికి.
ఆ మరునాడు పది గంటలకు తనకు పురుడు పోసిన
డాక్టరుగారు రావడం చుాసి రంగి ఆత్రంగా లేచి కుార్చుంది. చిరునవ్వుతో పలకరిస్తున్న అతనికి
నమస్కరిస్తుా , తనకి పుట్టిన బిడ్డడు ఏడనీ,
బిడ్డని ఒక సారి చుాపమని, కన్నీళ్ళతో వేడుకుంది.
అతను నవ్వుతుానే తన చేతిలో రెండు లక్షల
రుాపాయల చెక్ ను ఉంచేడు.
సిజేరియన్  చేయడం వల్ల రంగికి పొట్టంతా చాలా 
నొప్పి గా ఉంది. పాపకి బదులుగా డబ్బు కి
సంబంధించిన కాగితాన్ని చుాసిన రంగి పిచ్చిదానిలా
అరుస్తుా , డాక్టరు గారి కాళ్ల మీద పడి ఏడవసాగింది.
తనకి ధనం వద్దని ,  నవమాసాలు మొాసి కన్న
తన బిడ్డే తనకు కావాలని , చెపుతుా భోరున
విలపించింది. రంగి పరిస్థితి
చుాసిన  అక్కడి వారందరి కళ్ళల్లో నీళ్ళు తిరిగేయి.
డాక్టరుగారు మెల్లిగా రంగిని లేవనెత్తి , చెప్పిన మాటలు విన్న రంగి ,దిగ్భాంతితో  అలా చుాస్తుా ఉండి పోయింది.

తన గర్భంలో అపురుాపంగా దాచుకొని ,నవమాసాలు మొాసి కన్న బిడ్డ , తన భర్తవల్ల  పొందినది  కానందున , తనకు బిడ్డతో సంబంధం ఉండదు. అదీకాక ఒప్పందం
ప్రకారం , ప్రసవించిన తమ బిడ్డను తమతో తీసుకు
వెళ్ళేందుకు కావలసిన సర్వాధికారాలు, బిడ్డ స్వంత
తలిదండ్రులకు  ఉంటుంది. తమ కోసం బిడ్డను
కన్నందుకు గాను , వారు తనకు, తాను అడిగినంత
ధనం ఇస్తుా తొమ్మిది  నెలల పాటు, తనకు వైద్య
పరంగా కావలసిన సదుపాయాలు చేసిన  కారణంగా, తనకు బిడ్డను కుాడా చుాసే అధికారం లేదు.
ఈ చర్య గోప్యంగా ఉంచబడి ,
బిడ్డ తలిదండ్రులకు తన ఉనికి , తనకు వారి
ఉనికి , తెలియపచకుండా ఉంచే బాధ్యత అసుపత్రి యాజమాన్యానికి ఎంతగానో ఉంది. పిల్లల ను
కనే అవకాశం లేనివారికి తనలాంటివారు , ఒక
మాధ్యమం  మాత్రమే.  అందికే తనకు పురుడు వచ్చేముందు, బిడ్డ తలిదండ్రులకు తెలుపబడింది.
ప్రసవం కాగానే పసి కందు వారికి విధిపుార్వకంగా
అప్ప చెప్ప బడింది. వారు అన్న మాట ప్రరకారం
తనకు డబ్బు నిచ్చి వెళ్ళేరు.వారికి కావలసినది
వారి స్పెర్మ్ తో వారిదైన బిడ్డడు  పెరగడానికి తొమ్మిది
నెలల పాటు తమదైన అద్దె గర్భం. దానికి వారు
ఈ తొమ్మిది నెలలుా  ఖరీదైన అద్దె చెల్లించేరు.
మిగిలిన విషయాలు  వారికి అనవసరం అన్న
మాటలు విన్న రంగి కంపించిపోయింది.
తను నవమాసాలుా మొాసీ కన్న పిల్లని తను
చుాడనైనా చుాడకోడదా...?  ప్రేమ ఆప్యాయతలతో
నిండిన చనుపాలను  తాగే అద్రుష్టం తన పాపడికి లేదా?
అసలు పుట్టినది పాపో , బాబో , కుాడా తెలియనివ్వరా?
అన్యాయం ..అసలైన చాలా విషయాలు దాచి, తన
బలహీనత ని అందరుా ఉపయొాగించుకున్నారన్న విషయం  తను ఎవరితో చెప్పగలదు..?
తను పడుతున్న బాధని తనని  చిత్రవధకు గురి
చేస్తున్నసది. చేతిలో ఉన్న లక్ష రుాయల చెక్కులు
గాలికి రెప రెప లాడుతుా ఉంటే రంగి గుడ్లప్పగించి
వాటివైపు చుాసింది. ఒకప్పుడు ఈ డబ్బు కోసమే తను
తన గర్భాన్ని బాడుగకు ఇచ్చింది. ఎవరికోసమై
ఈ పనికి పుానుకుందో వారు మధ్యాంతరంలోనే
తనను విడిచి వెళ్ళేరు. ఇంక దీనితొి తన కేమి పని.?

తన మాత్రుత్వపు మమకారాన్ని  పంచేందుకు తనదైన
సంతానం లేదు. తనని వదిలిపోయిన మామ తిరిగి
తన దగ్గరకు రాడు . ఇంక తన కోసం ఇంత డబ్బు
దేనికి .తన జీవితం గడవడానికి తన రెక్కల కష్టం
చాలదుా....అసలు తనెవరికోసం బతకాలి. ?
ఎందుకు బతకాలి..? రంగి పెదాలపై విరక్తి తో
కుాడిన వెర్రి నవ్వొకటి నిలిచింది. తన చేతిలో ఉన్న
రెండు కాగితాలనీ పిచ్చిగా చుాస్తుా రెండు ముక్కలుగా
చింపి  గాలిలోకి విసిరి ఇంటిదారి పట్టింది.
------------------------
ఆలోచనల్లో ఉన్న రంగి , చిరు ఎండ వేడి తగిలి తుళ్ళి
పడి కళ్ళు విప్పింది.నీళ్ళు నిండిన కళ్ళకి, పరిసరాలన్నీ
మసకబారినట్టు కనిపించేయి.
రంగికి లేచే ఓపిక లేదు.లేచి ఇంట్లోకి వెళ్ళి ఏమి
చేయాలి కనుక.  తనకు
ఎవరున్నారని...?
రంగి కంటి చుట్టుా నల్లటి  చీకటి వలయాలు
కమ్ముకున్నాయి.పాప జ్ఞాపకాలతో పొంగిన స్థనరసాలు
పైన   సుార్యుని వేడిని చల్లపరుస్తున్నట్టుగా, కన్నీటితో కలిసి రంగిని చల్లబరుస్తున్నాయి.
అటువంటి పరిస్థితిలో కుాడా రంగిలో మెదిలే ఆలోచన
ఒకటే...
"తన బిడ్డని ఒక్కసారైనా చుాడాలి." అన్నదే.
ఆలోచనల భారంతో రంగికి భుామిలోకి
కుంగిపోతున్నట్టుగా ఉంది. లేవాలనుకుంది
కానీ లేవలేకపోయింది. స్తనాల లో ఉబికే
పాలు ధారాపాతంగా రంగిని తడుపుతున్నాయి
ఆ చల్లని బాధ తాళలేని రంగి నిస్తాణగా నేల పైకి
ఒదిగిపోయింది..
ఆశ , నిరాశల అధ్యాయం ముగిసింది
బాడుగమ్మ బతుకు భారమై ముగిసింది.

వీటన్నిటకీ  అతీతంగా ......
రంగి కడుపుని బాడుగకు
తీసుకొని ,కన్న బాబుతో, ఆనందంగా ఉన్న జంటకు
గానీ , రంగిని ఈ పనికి వొప్పించి , తొమ్మిది నెలల
అనంతరం రంగికి ముట్టవలసిన మరో ముాడు
లక్షలను తన జేబులో వేసుకున్న డాక్టర్ కి గానీ
రంగితో గానీ , ఆమె బాధతోగానీ ఇంక పనిలేదు.
-----------------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
----------






































,


నానమ్మ.

శ్రావ్య కి చాలా ఉత్సాహంగా ఉంది. కారణం..
తమ బ్యాచ్ అంతా కలిసి , ఈ వెకేషన్ కి వ్రుద్ధాశ్రమాలకి
వెళదామని నిశ్ఛయించుకున్నారు. అంతే కాదు.
అక్కడ ఉన్న వ్రుద్ధులకి దుప్పట్లు , బట్టలు లాంటివి  కుాడా  కొని పంచుదామనుకున్నారు. వారి తో
సరదాగా గడపడానికి చిన్న చిన్న గేమ్స్ ఆడాలని..
వారితో పాటలు పాడించి.. డ్యాన్స్ లు చేయిద్దామని
ప్లాన్ చేసేరు.
  ఈ రోజు సాయంత్రం అందరుా కలిసి మార్కెట్ కి
వెళుతున్నారు.ఈ లోపల తను వెళదామనుకున్న
వ్రుద్ధాశ్రమాల ఆఫీసుకు ఫోన్  చేసి తాము వస్తున్నట్టు
చెప్పి అక్కడ ఎంతమంది వ్రుధ్ధులున్నారో కనుక్కొని
ఒక లిస్ట్  తయారు చేయాలి.    ఆ తర్వాత  కావలసినవి
అన్నీ కొని ప్యాక్ చేయాలి . ఇవన్నీ తనకు అలవాటే.

తను 9th క్లాస్  లో ఉండగానే  ఒకే రకమైన అభిప్రాయాలు కలిసిన , ఓ పది మంది కలిసి...
ఒక గ్రుాప్  గా కుాడేరు. అందరిదీ ఒకటే అభిరుచి..
చదువుతో పాటు వేరే ఏవైనా మంచి కార్యక్రమాలు చేపట్టాలని.  కొంచమైనా సంఘసేవ చేయాలని.
అందరుా కలిసి ఆలోచించి తీసుకున్న నిర్ణయమేంటంటే..
వెకేషన్స్ రాగానే అనాధాశ్రమాలాకి , వికాలాంగుల సెంటర్స్ కి ,  వెళ్ళి వాళ్ళతో గడిపి రావడం .
రోడ్డు  పై నడిచే వారికోసం  తాగునీటి చలివేంద్రాలు పెట్టడం ,. పశు- పక్ష్యాదులకోసం  చిరుధాన్యాలతో పాటు చిన్న చిన్న
కుండల్లో తాగు నీటిని ఉంచడం ...ఇలా ఎన్నో
పనులు కలిసి చేసేరు. ఇకపై  చేస్తారు కుాడా .ఇదిగో
ఈ వెకేషన్ లో వ్రుద్ధాశ్రమాలకి  వెళ్ళే కార్యక్రమంలో
ఉన్నారు.  వీరిని స్ఫుార్తిగా తీసుకున్న మరి కొంతమంది కుాడా వీరి గ్రుాప్ లో చేరి ఉత్సాహంగా పని
చేయసాగేరు . 
-------------------------------------------------------
సాయంత్రం అందరుా ఒకదగ్గర చేరేరు.  ఎవరికి చెప్పిన పని వారు సమర్ధవంతంగా నిర్వర్తించడం తో అనుకున్న
వన్నీ అమర్చగలిగేరు .  ఒక మినీ బస్ లో సామానంతా వేసుకొని  ఆనందంగా  బయలుదేరేరు. కేరింతలతో,
తుళ్ళింతల తో బస్సు నెమ్మదిగా బయలుదేరంది.
ముందుగా ఊరికి చివరిగా ఉన్న "ఆనందాశ్రమానికి ",
బయలుదేరేరు. అటునుంచి తిరిగి వస్తున్నపుడు
"శారదా సదన్" ఆశ్రమం చుాసుకొని ఇంటికి వెళ్లవచ్చు.

అయితే ఈ "ఆనందాశ్రమం "ఊరికి చిట్ట చివర ఉందని-
రాను పోను దారి కుాడా సమంగా ఉండదని..-
అక్కడ నిత్యావసర వస్తువులు కుాడా సిటీ నుంచే
తెచ్చుకోవాలని..-దగ్గరలో వైద్య సదుపాయం కుాడా
లేదని ,  వినికిడి. అటువంటి ఆశ్రమాల లో తమ తల్లిదండ్రులని వదిలి వెళ్ళే వారిని తలుచుకుంటే-
శ్రావ్యకి , చాలా కోపం వస్తుంది. తమని కని, పెంచి ,పోషంచి,
చదివించి, తమ భవిష్యత్ ని తీర్చి దిద్ధిన తలిదండ్రులని, వ్రుద్ధావస్తలో ఇలా అనాధలుగా వదిలేసిన వారిపై, చట్టం  కఠిన చర్యలు తీసుకొనుంటే  -ప్రతీ చోటా  ,ఇన్ని వ్రుద్ధాశ్రమాలు నెలకొనేవా. .? వీటిని అడ్దుగా పెట్టుకొని
తగిన సౌకర్యాలు  కల్పించక.. వీరందరినీ ఎన్ని అవస్థలకి గురి చేస్తున్నారో...
స్పాన్సర్స్ ఇచ్చిన డబ్బుని
తారుమారు చేసి ఎంతమంది  ధనవంతులవుతున్నారో..
అడిగేది ఎవరు ? ఈ అన్యాయాలని అరికట్టేదెవరు  ? తమని ఆదుకున్నవారుగానీ ,
ఆప్యాయంగా పలకరించేవారు గానీ , లేక ముసలి
ప్రాణాలు , పసి ప్రాణాలు , ఎంత తల్లడిల్లిపోతున్నాయొా.... ?

శ్రావ్య ఆలోచనలు తెగకముందే , బస్సు ఆశ్రమానికి
దగ్గరలో ఆగింది.
అందరుా ఉత్సాహంగా బస్సు దిగి సామాన్లు దింపి,
వెను తిరిగి ఆశ్రమం  వైపు  నడవసాగేరు.  ఆశ్రమం చుాస్తున్న అందరి చుాపుల్లోనీ   విస్మయం , ఆత్రుత , ఆశ్చర్యం .కనబడుతున్నాది.

పాతబడి ,
రంగు వెలిసిన  గోడలతో నున్న బౌండరీ  గేటు మీద ,
"ఆనందాశ్రమం"  బోర్ద్ ,   కొంచం జారి  సొట్టలుపడి కనిపిస్తోంది.  లోపల  అక్కడక్కడ -
సగం ఎండి  రాలిన ఆకుల తోనున్న చెట్లు, అక్కడి
పరిస్థితి చుాచి  ఏమీ చేయలేకా ,  దీనంగా  చుాస్తున్నట్టు
నిల్చొని ఉన్నాయి. లోపల  బోలెడు ఖాళీ జాగా ఉంది .
అక్కడక్కడ కుార్చోడానికి సిమెంట్  బెంచీలు కట్టి ఉన్నాయి. వాటినిండా  పక్షులు వేసిన మాలిన్యం
తో పాటు గాలికి ఎగిరిన ఆకులు , దుమ్ము నిండి ఉన్నాయి.
ఒక పక్కగా ఎండిపోయిన నుయ్యి  పై ,
విరిగిన కర్ర గేటు కప్పి ఉంది. తొంగి చుాస్తే నీటి ఛాయలు
కనబడడం లేదు గానీ , మొాటారు ఒకటి లోపలి
నుంచి పెట్టి ఉంది. పక్కనే పింపిరి పట్టిన కొళాయి
నుండి,  చిన్న చిన్న బొట్లుగా నీరు కారుతున్నాది.
ఆనీరంతా చేరిన చోట చిన్న మడుగులా తయారై,
దోమలు ముసిరి ,మురిగి కంపు కొడుతున్నాది.
మరి కొంచం దుారంలో  శిధిలావస్థ  లో ఉన్న
చిన్న గుడి లాంటి దానిలో-....
అర్చన లేని శివలింగం పై,  కొన్ని వాడిన పుాలున్నాయి.ఎప్పుడు పెట్టిన నైవేద్యమొా....ఏమొా...
కుళ్లిన అరఁటిపండు మీద వాలిన ఈగల తో   ఆపై , చుట్టుా  అభిషేకించిన పదార్ధాలతో కలిసి,  మురుగు
నీరు చేరడంవల్ల , మందిరం లోపల దోమలు ముసిరి  రొచ్చు కంపు కొడుతోంది.
చుాస్తున్న  అందరికీ ,   అక్కడి వాతావరణం , రోత పుట్టిస్తున్నాది.

అక్కడికి కొంచం దుారంలో నే , పెంకుల తో కట్టిన రుాఫ్
తో , చిన్న చిన్న గదులు బోలెడు  లైన్ గా , ఎల్
ఆకారంలో కట్టబడి ఉన్నాయి.  వాటి చివరలో ఒక ముాలగా  నాలుగు బాత్రుామ్ లు,  లెట్రిన్ లు
కట్టి  ఉన్నాయి. ఆక్కడ  ఉన్న యాభై గదులవారుా-
అవే వాడుకో వలసి ఉంటుంది. రుాముల్లో  ప్రవేసించగానే ..  మందుల మిశ్రమాలతో కుాడిన
గబ్బు వాసన గుప్పు మంటోంది.  ప్రతీ గదికి చిన్న కిటికీ ఉండడం  వల్ల  ,ఎండ, గాలి , కొంచం రావడం వల్ల , పరిశుభ్రత లేని గదుల్లోంచీ ,  దుర్వాసనతో నిండిన గాలి గదినిండా తిరుగుతుా రొచ్చు వాసన
నింపుతోంది . కుక్కిన
మంచాల మీద అరిగిన బొంతలు ,  దుప్పటి లేని కారణంగా , మురికి పట్టి  ముతక  వాసన కొడుతుా నల్లగా పెళుసుబారి  ఉన్నాయి.
వాటిమీద పడుక్కొని 
ఎముకల గుాళ్లలా ఉన్న కొంతమంది,  వీరిని చుాచి
తమవారెవరైనా వచ్చేరేమొా,  అని ఆత్రుతగా లేచి ,
తడారిన కళ్ళ తో ఆశగా  వెతుక్కుంటున్నారు. మరికొంతమంది వరండాలోనే కుార్చొని  ,తమ తమ కష్టాల్ని  తమ సాటి వారితో పంచుకుంటున్నారు.  వారికి తమ తోటివారే  ఆత్మీయులు , బంధువులు.
ఆ ఆశ్రమమే  వారికి ఆశ్రయం. కొన్ని సంవత్సరాల నుండీ  తమ వారు  ఎవరుా రాని కారణం తో ,
నిస్ప్రుహ నిండిన వారి  చుాపుల్లో , ఇన్నాళ్లకి
వచ్చిన ఈ పిల్లల్ని చుాడగానే  , వారిలో  చైతన్యం వచ్చింది. ఆనందంగా లేచి ఆప్యాయంగా
తమ చేతులని పట్టుకొని హత్తుకుంటున్న
వారి ప్రేమకు  అందరి హ్రుదయాలుా  ద్రవించిపోయాయి.
కళ్ల ల్లో తిరుగుతున్న కన్నీరు కనపడకుండా తుడుచుకుంటుా...,  అందరినీ ప్రేమగా పలకరిస్తుా..,
తాము వచ్చిన పని చెపుతుా.., తాము తెచ్చిన
వస్తువులను పంచసాగేరు.
అందరినీ అమ్మమ్మ , తాతయ్య , నాన్నమ్మ -
అని పిలుస్తుా ,  వారి క్షేమ సమాచారాల్ని అడుగుతుా ,
ప్రేమగా వారితో కలిసిపోయేరు పిల్లలంతా..
---------------------------------------------------------
ఇంత సందడి  జరుగుతున్నా శ్రావ్య చుాపులు మాత్రం
దుారంగా  ఒక చప్టా మీద ,  వెనుకనున్న  చెట్టు
మొదలుకు ఆనుకొని  కుార్చున్న  , ఆ ముసలామె
మీదే ఉన్నాయి. తాము లోపలికి వస్తుాండగానే
తను ఆమెను చుాసింది. కానీ తాము వచ్చీ రెండు ,ముాడు గంటలైయ్యేయి. అందరుా తమని కలిసేరు .
ఆపై అందరుా తాము తెచ్చిన  గిఫ్ట్ లు తీసుకున్నారు.
అంతా గోలగా  ఉన్నా ఆమె తనకు ఇవేమీ
పట్టనట్టు అక్కడి నుంచీ కదిలి రాలేదు.
భోజనాల సమయం అయింది. అందరుా మధ్యలో
ఉన్న డైనింగ్ హాల్ కి చేరుకున్నారు.
తాము కుాడా వారితో  పాటే  భోజనాలకు కుార్చున్నారు.
శ్రావ్య  తను  చుాసిన  మామ్మ  వస్తుందేమొా అని
చాలా సేపు చుాసింది  ,కానీ ఆమె రాలేదు
శ్రావ్య కి అసహనంగా ఉంది. ఆ మామ్మ ఎందుకు రాలేదు.  ? పాపం కనిపించదేమొా..?.లేదా  చెముడేమొా?
లేకపోతే  ఇంత సందడిగా గోల గోలగా ఉంటే కనీసం
వెనుతిరిగి కుాడా చుాడలేదే....ఎందుకు..? ఏమై ఉంటుంది...? ఆలోచిస్తుా  అన్నం కెలుకుతున్న శ్రావ్య
మరి అక్కడ కుార్చొని  అన్నం తినలేకపొయింది.
లేచి చేయి కడుక్కొని అటువైపుగా నడిచి వెళ్ళింది.
తను వచ్చిన సంగతికుాడా తెలియ నట్టు , అటువైపు
తిరిగి కుార్చున్న  మామ్మకి ఎదురుగా వెళ్ళింది శ్రావ్య.
చేతిలో ఉన్న జపమాలని  తిప్పుతుా..
కళ్ళు ముాసుకొని ధ్యాన్నంలో ఉన్న ఆమెను చుాడగానే
నమస్కరించాలనిపించింది. ఆమె ధ్యానానికి భంగం
కలగకుండా వంగి పాదాలకు నమస్కరించి ఆమె
ముఖంలోకి చుాసిన శ్రావ్య  కళ్ళు ఆశ్చర్యంతో
విచ్చుకున్నాయి.  ఆమె శరీరమంతా ఒక్కసారిగా
చమటలు పట్టసాగేయి. కళ్ళు తిరుగుతున్నట్టుగా
అనిపించింది శ్రావ్యకు. ఎదురుగా జవసత్వాలుడిగి
వంగిపోయినట్టు కుార్చొని , ధ్యానం లో నిమగ్నమై
ఉన్న   ఈమె అచ్చంగా తన నానమ్మ లాగే ఉన్నారే .
లేక నానమ్మేనేమొా...కాదు కాదు...
నానమ్మ కాదు. ఆవిడ యుా. ఎస్ లో అత్తయ్య
దగ్గర ఉన్నారు.   ఇటువంటి  ఆశ్రమాల లో
ఉండడానికి ఆవిడ కేం ఖర్మ. ఆమెకు  నాన్న ఒక్కడే
కొడుకు. అత్తయ్య ఒకర్తే కుాతురు. ఇద్దరుా కోటీశ్వరులే.
నానమ్మ అత్తయ్య  దగ్గర  సంతోషంగా  ఉండి ఉంటారు.
తనదే పొరపాటు. నానమ్మ లాగే కనపడే సరికి ఒక్కసారిగా పొరపాటు పడింది
మనుషుల ని పోలిన మనుషులు  ఉంటారన్నదానికి
ఇది నిదర్శనం అనుకుంటాను ..
అనుకుంటుా  నెమ్మదిగా వెనుతిరిగింది. 
అప్పటికి అందరుా భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. మళ్ళీ  సాయంత్రం నాలుగు గంటలనుంచి కార్యక్రమాలు మొదలవుతాయి.
శ్రావ్య స్నేహితులందరుా ఆయా కార్యక్రమాలకు
కావలసిన  సరంజామా అంతా సమకుారుస్తున్నారు.
శ్రావ్య కి ఏ పనీ చేయాలనీలేదు .
పదే పదే నానమ్మ జ్ఞాపకానికి వస్తున్నాది.
కళ్ళ లో చిప్పిల్లిన  కన్నీటిని తుడుచుకుంటుా
ఒక బెంచీ మీద కుాలబడిన శ్రావ్య కళ్ళ ముందు చిన్నప్పటి ద్రుశ్యాలు  సినిమా రీలులా కదలాడసాగేయి.
----------------------------------------------------

ఆ రోజు తను స్కుాల్ నుంచి వచ్చేసరికి అమ్మ
నానమ్మ మీద జోరుగా అరుస్తున్నాది. నానమ్మ
హాలులో ఒక ముాల కుార్చొని కన్నీరు
తుడుచుకుంటుా కనిపించింది. తనకి అమ్మ మీద
చాలా కోపం వచ్చింది . కానీ ఏమీ అనలేని వయసు.
జాలిగా నానమ్మ దగ్గరికి వెళ్ళింది .నానమ్మ తనకి
కన్నీరు కనబడకుండా తుడుచుకొని ..తన దగ్గర
కుార్చోపెట్టుకొని ఎన్ని మంచి కధలు చెప్పిందో.
మాట్లాడుతునే తన   స్కుాల్  డ్రస్  మార్చింది.
స్నానం చేయించి,  జడలు అల్లి , అన్నం
తినిపించింది. నానమ్మ చెపుతున్న కధలు వింటుానే
తను నిద్రపోయేది. సాయంత్రం తనకు దేముడి
పాటలు నేర్పేది. ఎన్ని శ్లోకాలు నేర్పించిందో.
రోజుా నానమ్మ దగ్గరే పడుకునేది తను.
అప్పుడు కుాడా అమ్మ నానమ్మని ఏదో అని..
నన్ను తన దగ్గరికి రమ్మనేది .కానీ తను నానమ్మని
వదిలి వెళ్ళేదికాదు.

అసలు నాన్నమ్మ ఎంతమంచిదని .
తను స్కుాల్ కి వెళ్ళడానికి ముందే లేస్తుంది. తనకు
ఇష్టమైన  తినుబండారాలు చేసి తన టిఫన్ పేక్
చేస్తుంది. మంచి మంచి కధలు చెపుతుా స్నానం చేయించి  గట్టిగా రండు జడలు వేసి దేవునికి ప్రార్ధన చేయస్తుంది . తర్వాత తనకు కడిపునిండా టిఫిన్
పెట్టి   గ్లాసుడు పాలు తాగిపిస్తుంది. స్కుాల్ బేగ్
సద్ది చేతికి ఇస్తుంది. బస్ ఎక్కేకా టా, టా చెపుతుంది.
రోజంతా జపమాల తీసుకొని అలా జపం
చేసుకుంటునే ఉంటుంది. నానమ్మ రోజంతా ఏదో పని చేస్తునే ఉంటుంది. మరి అమ్మకి ,నానమ్మ
కి  మధ్య , గొడవలెందుకో కావ్య చిన్న మనసుకు
అర్ధం అయేది కాదు.

అలాగే రోజులు నెలలెై , నెలలు సంవత్సరాలయ్యేయి.
రోజు రోజుకుా నానమ్మ మీద , అమ్మకున్న  విసుగు ఎక్కువయ్యింది గానీ తగ్గలేదు. దాంతో అమ్మ, నాన్నల
మధ్య గొడవలు కుాడా ఎక్కువయ్యేయి.
తను ఆరవ తరగతికి వచ్చింది.
చాలా మట్టుకు విషయాలు  అన్నీ  అర్ధమయ్యేవి.
అప్పుడు కుాడా తనకి నానమ్మ తప్పు ఏమీ
కనిపించేది కాదు. చాలా చిన్న విషయాలకే  అమ్మ
నానమ్మ మీద విసుక్కొనేది.
ఆరోజు నానమ్మ  రోజుాలాగే దేముడికి దీపం పెట్టడానికి
పుాజ గదిలోకి వెళ్ళింది. ఎప్పటిలాగే తనుా పక్కనే
నిల్చొని ఉంది. నానమ్మ  ప్రమిదలో నుానె వేసి
ఒత్తి తడిపి , అగ్గిపుల్లతో వెలిగించాలని ఎన్నిసార్లు
ప్రయత్నించినా దీపంవెలగలేదు గానీ అగ్గిపుల్ల
లు అన్నీ అయిపోయేయి. తను అమ్మని వేరే
అగ్గిపెట్టె అడిగింది. అదేంటీ    కొత్త పెట్టి తీసి  నాలుగు  రోజులేగా  అయింది అంటుా లోపలికి వచ్చి
కింద పడి ఉన్న  పుల్లల్ని ,  ఖాళీ అగ్గిపెట్టెని చుాసి
నానమ్మ మీద విరుచుకు పడింది.
నానమ్మ  దుాబరా తనం వల్ల తమకి సంసారం
ఈదడం ఎంత కష్టం గా ఉందో అంటుా .నిష్టుారాలాడింది.    అంతే కాదు ,అడిగిన దానికి
సమాధానం చెప్పకుండా  తనని  ఎంతో నిర్లక్ష్యం
చేస్తున్నారంటుా వాపోయింది.  కొడుకు దగ్గర
ఒకలాగా , తనతో ఒకలాగా ఉంటున్నారంటుా ,
గంట సేపు సణిగింది అమ్మ .  నానమ్మ పాపం
ముఖం చిన్నబుచ్చుకొని   కుార్చుంది .
అప్పటికి విషయం  అర్ధమై ,  తను దేవుని మందిరం
దగ్గరగా వెళ్ళి చుాస్తే. ఏముంది..?
నానమ్మ ఒత్తి పెట్టిన చోట కాక , మరో వైపు కి
అగ్గిపుల్ల  తో వెలిగించడం వల్ల జరిగిన రాద్ధాంతం
అది. 
ఇంట్లో జరిగిన ప్రతీ గొడవ కుాడా ఇటు వంటీ
చిన్న విషయాలకే..జరిగేది. దానిని అమ్మ రెండింతలు
చేసి నాన్నకి చెప్పేది.  పాపం నానమ్మ అప్పుడు కుాడా
నోరు విప్పేది కాదు.
మరోసారి డైనింగ్ టేబుల్  మీద అందరుా భోజనం
చేస్తుా ఉండగా నానమ్మ చేయి తగిలి గాజు గ్లాసు
పగిలింది.
అప్పుడు నాన్న చిరాకుగా ముఖం పెట్టి
కాస్తా చుాసుకొని తినమ్మా అన్నారు. అపుడు
నానమ్మ మెల్లగా నా కళ్ళజోడు బాగుచేయించరా
నాన్నా...సమంగా కనపఫడంలేదు అంది.అంతే
మళ్ళీ గొడవ.   నెలకయ్యే ఖర్చు లో సగం
డబ్బులు మీ కోసమే ఖర్చయిపోతున్నాయంటుా
.అమ్మ సణుగుడు ,నానమ్మ కన్నీళ్లు....  రోజు వారీ
కార్యక్రమం గా మారేయి.

తను నానమ్మ పక్షం మాట్లాడుతుా ఉండడంతో
అమ్మ , నన్ను నానమ్మ దగ్గరకు వెళ్ళకుండా
కట్టడి చేయడం మొదలెట్టింది. అంతే కాదు .

నాన్న కుాడా నానమ్మ మీద విసుక్కోవడంతో...
అమ్మకు  ,నానమ్మ పై విసుక్కోవడం , కసురుకోవడం  మరికొంచం  ఎక్కువైంది. దాంతో..
నానమ్మ ఇంట్లోచాలా మట్టుకు మాటలు తగ్గించీసింది.
ఇస్తే కాఫీ తాగుతుంది. పిలిస్తే అన్నం తింటుంది.  ఒక రకమైన నిర్లిప్తత  ఆమెలో చోటు చేసుకుంది.
వయసు తో పాటు తనకు అన్ని విషయాలుా
అర్ధం అవుతున్నాయి. కానీ  నానమ్మ విషయంలో
తనేమీ చేయలేకపోతున్నాది.
తను ఒకటే నిశ్చయించుకుంది.తన చదువు
పుార్తవగానే తను నానమ్మకు ఏ కష్టం  రాకుండా చుాసుకుంటుంది.  కావలసినవన్నీ కొని
పెడుతుంది అనుకున్న కావ్య ఆ తోజు హాయిగా
నిద్రపోయింది.  
-------------------------------
మరొకరోజు తను స్కుాల్ నుండి వచ్చేసరికి ఇంట్లో
అమ్మ నాన్నల ముఖాలు చిరాకుగా ఉన్నాయి.
నానమ్మ ఒక ముాల కుార్చోని విపరీతంగా
ఏడుస్తున్నాది. అసలు నానమ్మ అంతలా ఏడవడం తను ఎప్పుడుా చుాడలేదు.
తనను  చుాడగానే అమ్మ నానమ్మతో "  ఇంక ఆ ఏడుపు తగ్గించండి. పిల్ల దగ్గర  మీరేమైనా  మాట జారేరో
జాగర్త " అంటుా గదమాయించింది. వెంటనే నానమ్మ
అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. తర్వాత తను
నానమ్మ దగ్గరికి వెళదామని ఎంత ప్రయత్నించినా
అమ్మ వెళ్లనివ్వ లేదు. అలా ఒక వారం గడిచింది.
మధ్య లో తను వెళ్ళనా నానమ్మే తనతో సమంగా
మాట్లాడేది కాదు , సరికదా..అమ్మ దగ్గరికి వెళ్లమ్మా
అంటుా పంపించీసేది.
అ తర్వాత రాను రాను నానమ్మ అందరితో
మాట్లాడడం తగ్గించీసింది.
తను మాత్రం  కధ చెప్పమన్నపుడు  దగ్గరకు తీసుకొని,
కళ్లల్లో చిప్పిల్లిన కన్నీరు తుడుచుకుంటుా..చాలా కధలు చెప్పేది.
వాటిల్లో అనాధ పిల్లల గురించి..వ్రుధ్ధుల గిరించి...
వారి అసహాయతల గురించిన కధలు ఎక్కువగా
ఉండేవి. ఆ కధల పర్యవసానమే ఏమొా...
తనకు అనాధ బాలలు , వ్రుధ్ధులకు ఏదైనా చేయాలనే తపన  ఆ వయసునుండే మొదలయ్యింది.
రోజులు గడుస్తున్నాయి గానీ నానమ్మలో
నిర్లిప్తత  తగ్గలేదు. చాలా మౌనంగా ఉండేది.
కారణం అడిగితే చెప్పేదికాదు.తను  కుాడా
మరి అడగడం మానీసింది.
రోజులు భారంగా గడుస్తున్నట్లుగా చికాకుగా
ఉండేది తనకు. అమ్మ నాన్నల మీద కోపం
కుాడా వచ్చేది. కానీ ఏమీ చేయలేకపోయేది.
ఎప్పుడుా ఒకటే ఆలోచన. "తను పెద్దయితే
నానమ్మకి అన్నీ కొని ఇస్తుంది. నానమ్మని
అస్సలు ఏడవనివ్వదు..."
----------------------------
ఈ మధ్య నానమ్మ ఇంట్లో ఉండడం కుాడా
తగ్గించీసింది. అన్నం కుాడా తినడం మానీసింది.
రాత్రి పుాట మాత్రం కొంచం ఫలహారం తినేది.
నానమ్మ రోజుా గుడికి వెళ్ళి చాలాసేపు అక్కడే
ఉండి ఇంటికి వచ్చేది .తను అడిగితే  భగవద్గీత
ప్రవచనాలు జరుగుతున్నాయని , అవి
పుార్తయే వరకు ఉండడం వల్ల  అలశ్యంగా
వస్తున్నానని  , మధ్యాహ్నం  ప్రసాదం అక్కడే తింటున్నాన ని   చెప్పింది. నానమ్మ బయటకు
వెళ్ళుతుాండంతో  ఇంట్లో  కొంచం  ప్రశాంతంగా ఉంది.

------------------------------------
చాలా రోజుల తర్వాత ఒక రోజు నానమ్మ తనతో
భగవద్గీత లో కొన్ని  శ్లోకాలకి  అర్ధం చెపుతుా " ప్రతీ
ఇంటిలో కుాడా , భగవద్గీత పుస్తకం ఉండాలి- శ్రావ్య-
తల్లీ...ఇది పిల్లలుా , పెద్దలుా అందరుా చదవ వలసిన పుస్తకం . ఇది ఉన్న ఇంట్లో మరే పురాణముా
ఉండక్కర లేదు " అంటుా కొంచం పెద్దగానే చెప్పింది.
ఈ మాట అమ్మ కుాడా వినాలనో  ఏమొా మరి.
మరి నాలుగు రోజులు గడిచేయి. కానీ నానమ్మ
పుస్తకం  విషయం మాత్రం  ఎవరుా పట్టంచుకోలేదు.
శ్రావ్య  స్కుాల్లో అందరుా ,  పదవతరగతి -
పాసయ్యిన సందర్భంగా  వెకేషన్ లో ఒక వారం
రోజులు కోసం
హాలీడే ట్రిప్  గా ,   కేంప్  కి వెళుతున్న సందర్భంగా  తను ,తన బేగ్ ప్యాక్ చేసుకోవడంలో  బిజీగా ఉంది. 
అ రోజు మళ్ళీ నానమ్మ మరోసారి  -
 నాన్న  ఉండడం చుాసి  , భగవద్గీత పుస్తకం గురించి  
నాతో చెపుతున్నట్టు చెపుతుా...
గుడిలో అందరుా పుస్తకాలు కొనీసుకున్నారనీ,
ఒక్క తనదగ్గరే లేదనీ చెప్పింది.
అక్కడే ఉన్న నాన్న అసలు వినిపించుకోనట్టు
పేపర్ లోంచీ తల ఎత్తే లేదు. ఇక అమ్మ ...
సరే సరి ...ముాతి ముాడు వంకర్లు తిప్పి  ఆక్కడి
నుంచి  లేచి వెళ్ళిపోయింది.
దాంతో తనకొక విషయం  అర్ధమయ్యింది.
నానమ్మ కి ఆ పుస్తకం కావాలి. కానీ అమ్మా, -
నాన్నలని అడగలేదు. నాన్న సంగతేమొా గానీ ,
అమ్మ కి అర్ధమైనా...కొనదు సరి కదాడబ్బులు
కుాడా ఇయ్యదు.  ఎలా మరి..?
తను ఇంట్లో ఉంటే ఏమైనా చేసేదేమొా..
పొద్దున్నే వెళ్ళి పోవాలి మరి...ఎలా...?
ఆలోచస్తున్న శ్రావ్య మనసుకి  ఒక మంచి
ఆలోచన వచ్చింది. రేపెలాగుా , తను కేంప్ కి
వెళుతుందని ,  ఖర్చుల కోసం నాన్న డబ్బులు
ఇస్తారు . అందులో మిగిలిన డబ్బుతో,  తను
నానమ్మ కోసం భగవద్గీత పుస్తకం కొని తెస్తుంది.
నానమ్మ దానిని చుాసి ఆశ్చర్యపోవాలి...
అంతే.కాదు,.
అది నానమ్మ కి తను ఇచ్చిన మరపురాని మంచి
కానుక అవ్వాలి....అనుకుంటుా...తనకు వచ్చిన
ఆలోచనకి తానే మురిసిపోయింది.
పొద్డున్నయింది.
ఎప్పటి లాగే నానమ్మ హడావిడి...మొదలు.
అది  అప్పుడు తిను , ఇది ఈ రోజు తిను...
అంటుా బోలెడు తినుబండారాలు కట్టి ఇచ్చింది.
అమ్మ ఇలాంటప్పుడు నానమ్మ ని ఏమీ అనదు.
తనకి పని తప్పుతున్నాదనేమొా...
తను వెళ్లే సమయం దగ్గర పడడంతో నానమ్మకి ,
అమ్మా -నాన్నలకి , దండం పెట్టి తమకై ఏర్పాటు
చేయబడ్డ బస్ లోకి ఎక్కి,  టా టా చెప్పింది.
----------------------------------------------

వారం  రోజులు  స్నేహితుల మధ్య, ఎంతో
సంతోషంగా గడిపి , భగవద్గీత పుస్తకం తో
ఇంటికి చేరిన శ్రావ్య  నానమ్మ  ...
కనిపించకపోవడంతో  అమ్మని అడిగింది .
అంతే...అమ్మ చెప్పిన మాట విని శ్రావ్య మ్రాన్పడిపోయింది . ఎందుకో అమ్మ మాట
నమ్మబుధ్ధి కాలేదు.
ఇంతకీ విషయం  ఏంటంటే...
"తను కేంప్ కి వెళ్ళిన రెండవ రోజే అమెరికా అత్తయ్య
వచ్చిందని ,  నానమ్మ అవసరం తనకి
చాలా ఉందని , అందికే తనతో పాటు అమెరికా
తీసుకెళతానని చెప్పిందనీ , మరో మాటకి
అవకాశం ఇవ్వకుండా అరోజు రాత్రే నానమ్మని
తీసుకొని వెళ్ళిపోయిందని."..
అమ్మ మఖంలో ఆనందం చుాస్తుా  ఉంటే , 
అమ్మ మాట  ,అస్సలు నమ్మ బుద్ధి కావడం
లేదు.  అందికే సాయంత్రం నాన్న రాగానే ,
నానమ్మ ఎక్కడుందో చెప్పమని..
కన్నీటితో ప్రాధేయపడింది. కానీ నాన్న కుాడా
అమ్మ చెప్పినట్టే చెప్పడంతో దిగాలుపడిపోయింది.
ఆరోజు శ్రావ్య కు సమంగా నిద్ర పట్టలేదు.
ప్రతీ క్షణం నానమ్మ గుర్తుకు వస్తున్నాది.
పక్కనే ఉన్న భగవద్గీత పుస్తకం చుాసినపుడల్లా
శ్రావ్య కి దు:ఖం ఆగేది కాదు.
పాపం ..నానమ్మ ..ఈ పుస్తకం కోసం ఎంత ఆశపడిందని... అసలు తనతో చెప్ప కుండా
ఎలా వెళ్ళింది. .?  అందులోకీ అత్తయ్య దగ్గరికి.
ఎందుకంటే అమ్మ మాటల  బట్టి...
అసలు అత్తయ్య తను పుట్టక ముందే ..
ఎవరినో పెళ్ళిచేసుకొని వెళ్ళిపోయిందని..
తర్వాత ఆమె ఎప్పుడుా తమ దగ్గరకు రాలేదని..
రాను రానుా...తమకు ఆమె గురించిన వివరాలు
కుాడా తెలియలేదనీ...తర్వాత ఆమెను
ఇంచుమించుగా మర్చిపోయినట్టే " అని 
అప్పుడప్పుడు కొంత మందితో  చెపుతుాండగా
వినేది. ఎప్పుడైనా నానమ్మ  అత్తయ్య గురించిన
సమాచారం కనుక్కోమని  నాన్నతో మాట్లాడినా ...
నాన్న కుాడా నానమ్మ ని కసురుకునేవాడు.
నానమ్మ ని ఈ విషయం గురించి తను
అడిగితే , నువ్వింకా చిన్నపిల్లవి తల్లీ...
ఇటువంటి విషయాలు నీకు చెప్పినా అర్ధం
కావు. నువ్వు కొంచం పెద్దైతే అప్పుడు చెప్తానులే..
అంటుా ,  కన్నీళ్ళు పెట్టుకునేదే గానీ ,  ఏమీ
చెప్పేదికాదు.  అప్పుడప్పుడు తనకు  రాజుల కధలు చెప్పేటప్పుడు మాత్రం ,  మధ్యలో  
ఏదో ఆలోచిస్తుా , స్వగతంగా అనుకున్నట్టుగా   
నాతో అనేది .మీ అత్తయ్య చాలా మంచిదమ్మా...
ఆమెను ఎవరుా అర్ధం చేసుకోక ఇంటినుండి
పంపేశారు దాని జీవితం  అందరుా ఉండి కుాడా
అనాధగా ముగిసింది  .అని చెపుతుా ,.ఆ తర్వాత
గాభరాగా..అమ్మతో చెప్పకేం...అంటుా ఒట్టు
వేయించుకునేది.

తర్వాత తర్వాత ఆమె విషయం మాట్లాడకునేవారే
కాదు. ఇంచుమించు మర్చిపోయేరనే చెప్పాలి. కొంత కాలానికి తనుకుాడా ఈ విషయం మర్చిపోయింది.
కానీ ఇన్నాళ్ళకు మళ్ళీ ...అనుకోనివిధంగా
అత్తయ్య ఈ ఇంటికి రావడమేమిటి...?
అసలు నాన్న , నానమ్మ ని ఒక్క రోజులోనే
ఎలా పంపేరు...?  అత్తయ్యకు తమ ఇల్లు
ఎలా తెలిసింది..? మరి అత్తయ్య తనను చుాడాలని
అనుకోలేదా....?  అన్నీ..జవాబు దొరకని ప్రశ్నలు .-
ఎన్నో   అలోచనలు, మనసులో కదలాడుతుండగానే
రోజులుా , సంవత్సరాలుా, గడిచిపోయేయి.
-------------------------
శ్రావ్య స్కుాల్ నుండి కాలేజీ చదువుకు ఎదగింది.
అంతరంగంలో నానమ్మ  చెప్పే కధల మీద ఉన్న
ఆశక్తే తనను  ఈ రకమైన బాటలో నడిచే ఆశక్తిని ,
ప్రేరణ ని  కలిగించిందేమొా..
కన్నీటి బతుకుల్లో కాసింత
ఆప్యాయతను పంచి తను సేద తీరేది. రాను రాను
తన లాంటి అభిప్రాయాలున్న వారే తన స్నేహితులు
కావడం, తను చేసే పనిని ప్రోత్సహించడం తో
తమకది  ఇష్టమైన  అలవాటుగా మారింది.

అన్నీ మరచిపోయి ఆనందంగా ఉంటున్న సమయంలో
తిరిగి పాత జ్ఞాపకాల పుటలు  తిరగేసినట్టుగా ,
తను ఈ ముాలనున్న వ్రద్ధాశ్రమానికి రావడం ఏమిటి ?
నానమ్మలాగే  ఉన్న  మామ్మని కలవడమేమిటి..?
ఆమెను చుాడగానే తన మనసు ఇలా స్పందించడమేమిటి..? అలోచనలతో తల దిమ్ముగా
ఉంది శ్రావ్యకి.   కానీ ఎందుకో  మరొక్కసారి
ఆమెను చుాడాలనిపించింది . 
మెల్లగా లేచి మామ్మ కుార్చున్న వేపు నడవసాగింది. అప్పటికి మామ్మ  తన జపం పుార్తి చేసుకొని, 
మెల్లిగా లేచి నిలబడి  తన గదికి కాబోలు వెళ్ళిపోతున్నాది.
తను ఆత్రంగా పరుగెడుతున్నట్టుగా మామ్మను
చేరింది. ఇద్దరుా ఒకరొనొకరు చుాసుకున్నారు.
శ్రావ్య కళ్ళలో  ఆనందంతో కుాడిన విస్మయంతో
మామ్మ దగ్గరకు వెళ్ళి ఏదో చెప్పబోయింది.
ఇంతలోనే "ఎవరమ్మా  నువ్వు " అన్న  ఆప్యాయమైన
పలకరింపుకు  పొంగిపోయింది.
అచ్చు నానమ్మలా కనిపిస్తున్న ఆమెతో కొంచంసేపు
మట్లాడాలనిపించింది శ్రావ్యకి.
అందికే  వెంటనే  ఆమె  దగ్గరగా వెళ్ళి ,
అనుకోకుండానే  అసంకల్పితంగా "నానమ్మా" అని
పిలిచింది.
ఆ పిలుపు మహిమొా ఏమొా గానీ , చిరు  నవ్వు తో
చుాస్తున్న నానమ్మ  కళ్లల్లో  ఒక్కసారిగా కన్నీళ్ళు
ఉబికేయి   ఆప్యాయంగా చుాస్తుా  శ్రావ్యతో 
చాలా సేపు మాట్లాడింది.
ఆ ఆనందంలో శ్రావ్య  తన చిన్నప్పటి విషయాలన్నీ చెప్పేసింది.
తనకి నానమ్మ అంటే ఎంత ఇష్టమొా...నానమ్మ
తనను ఎంత ముద్దుగా  చుాసుకొనేదో...తన.కోసం
ఎన్నెన్ని చిరుతిళ్లు చేసి పెట్టేదో....చెప్పింది
కానీ తర్వాత నానమ్మ తనకి చెప్పకుండా యు.ఎస్ లో
ఉన్న అత్తయ్య దగ్గరికి ఎందుకు వెళిపోయిందో తనకి
ఇప్పటికీ తెలియదంది... అలా చెపుతున్నపుడు
శ్రావ్య కి  దు:ఖం ఆగలేదు. అంతవరకు అన్నీ
విస్మయంగా వింటుా  శ్రావ్యని ఉద్వేగంగా చుాస్తున్న
మామ్మ , శ్రావ్య  ఏడుపుని  చుాసి తట్టుకోలేకపోయింది.
ఒక్కసారిగా శ్రావ్యని దగ్గరగా తీసుకొని  శ్రావ్యా ..నా
బంగారు  తల్లీ...అంటుా తనుకుాడా ఏడుస్తుా
శ్రావ్యని ముద్దులతో ముంచెత్తసాగింది.
ఏడుపు ఉధ్రుతం తగ్గిన శ్రావ్య,  మామ్మ వేపు
ఆశ్చర్యంగా చుాడసాగింది. మామ్మకి తన పేరు
ఎలా తెలిసింది..? తను చెప్పలేదే...?
ఆయితే తన అనుమానం నిజమా...? కొంపదీసి
ఈ మామ్మే తన నానమ్మ కాదుకదా....?  లేదు
లేదు..ఇంక పిసరంత కుాడా అనుమానం లేదు.
ఈమె తన నానమ్మే... ఆ పిలుపులో ఆప్యాయత,
అభిమానం.,.. అదే రుాపు ,...అదే చుాపు..,
అవును...ఈమె తన నానమ్మే...

మరి ఇక్కడికెలా వచ్చింది. .? ఆత్తయ్య ధగ్గరి
నుంచి ఎప్పుడు వచ్చీసింది..?  నాన్న ,  అమ్మల కి
తెలుసా...? లేక తనతో అబధ్ధమాడేరా...?
శ్రావ్యకి  తేలని ప్రశ్నల  తో  కుాడిన ఆనందం..
ఆశ్చర్యం...తో పాటు , అగని కన్నీళ్ళు వెక్కళ్ళ
రుాపంతో వేధిస్తున్నాయి. శ్రావ్య వెక్కిళ్ళు చుాసిన
నానమ్మ , గబ గబా తన  దగ్గర ఉన్న సీసాలోని
మంచి  నీటిని శ్రావ్యకి అందించింది.
నీళ్ళు తాగాకా శ్రావ్య కొంచం కుదిటపడింది .
నానమ్మ ,  శ్రావ్యని ఒళ్ళోకి తీసుకొని ఆప్యాయంగా
నిమురుతుా జోకొట్టసాగింది.
చాలా సంవత్సరాల తర్వాత శ్రావ్యకి కావలసినంత
ప్రసాంతత  దొరికి , మనసు తేలిక పడ్డట్టయింది.
మామ్మని చుట్టు  కొని అలా పడుక్కొనే...
తరచి తరచి అడగడంతో విషయాలన్నీ
బయలుపడ్డాయి . మామ్మే  ,  తన నానమ్మ అని తెలుసుకున్న శ్రావ్య కి  , నానమ్మ  ఏ పరిస్థితుల లో
ఇక్కడికి తేబడ్డాదో తెలిసే సరికి దు:ఖం ఆగలేదు.
అమ్మ , నాన్నల మీద అసహ్యం కుాడా వేసింది.

నానమ్మ  ఏడుస్తున్న శ్రావ్య ని ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకోని  నిమరసాగింది . తన చిన్నారి పెద్ధదై  తన ఎదుటే  ఉండడం,  తనతో మాట్లాడడం.
తన ఒడిలోనే  సేద తీరడం , ఇవన్నీ నానమ్మ కి కలలో లా అనిపించసాగింది . ఇద్దరుా చాలాసేపు
మాట్లాడుకున్నారు. ఆమాటల్లో శ్రావ్యకి ఇప్పటి వరకు తెలీని ఎన్నో విషయాలు  బయటపడ్డాయి.
అన్నీ చెప్పిన నానమ్మ
..తనను ఇక్కడ చుాసినట్టు  ఎవరికీ చెప్పవద్దని..
అమ్మ, నాన్నలతో ఈ విషయమై అస్సలు చర్చించవద్దని
ఒట్టు పెట్టించుకుంది.నానమ్మ కనిపించిన ఆనందంలో
తను నానమ్మ చెప్పిన ఒట్లన్నీ  వేసింది.
ఇంతలోనే సాయంత్రం అయి చీకటి పడుతుాండడంతో
అందరుా తిరుగు ప్రయాణం అయ్యేరు.
శ్రావ్య కుాడా వారితో పాటు బయలుదేరుతుా రెండు
రోజుల్లో , తాను మళ్ళీ వస్తాననీ  , ఆంత వరకు
ఎదురు చుాడమని  నఁనమ్మ తో చెబుతుా ,వెనుతరిగింది.
----------------------------------------------------------
భోజనాల  సమయంలో వెళ్ళిపోయిన శ్రావ్య మళ్ళీ
సాయంత్రం తిరుగు ప్రయాణం సమయం వరకు
కనపడని  కారణం చేత , కోపంగా శ్రావ్య తో జగడం వేసుకుందా మనుకున్న స్నేహితులు ఆమె వాడిన ముఖం చుాసి ,తాపీగా విషయం తెలుసుకోవచ్చని వెనక్కి తగ్గేరు.
శ్రావ్య మాత్రం  ఎవ్వరితోనుా మాట్లాడలేకపోయింది.
కారణం...ఈ గ్రుాప్ ని తయారు చేసింది...ఇటువంటి
కార్యక్రమాలని చేపట్టాలని ప్రోత్సహించంది తనే.
కానీ ఇప్పుడు తన నానమ్మే ఇక్కడ ఉందని ,
అందరితో ఎలా చెపుతుంది..? ఏమని చెపుతుంది..?
అందరి ముందు ఎంత సిగ్గు అవమానం...? విషయం  తెలిసిన  తర్వాత తన స్నేహితులు వేసిన ప్రశ్నలకి
తను  ఏమని  జవాబు చెపుతుంది  ..?.. అసలు వారి ఎదుట తలెత్తుకొని  నిలపడగలదా...? 
వారు చుాసే చుాపులు , చేసే వెటకారం తను తట్టుకోగలదా....?....అన్నీ ప్రశ్నలే....
-------------------------------
ఇంటికి చేరిన శ్రావ్యకి  ,అమ్మ నాన్న ల ముఖం -
చుాసేసరికి  అసహ్యం వేసింది. వారు తనతో
మాట్లాడుతున్నా వినిపించుకోనట్టుగా , తన
గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. మంచం మీద
వాలి,  కళ్లు ముాసుకున్న  శ్రావ్యకి నానమ్మ
చెప్పిన మాటలు పదే పదే గుర్తుకు వచ్చి ...
మనసంతా కలచివేస్తున్నట్లయింది . ఎంత వద్దనుకున్నా
కళ్లముందు నానమ్మ చెప్పిన ప్రతీ మాటా , ద్రుశ్య రుాపంలో కనపడసాగేయి.
---------------------------------------------
నానమ్మకి నాన్న ,  అత్తయ్యల మీద  చాలా ప్రేమ.
తాతయ్య చనిపోయాకా నానమ్మకి వారిద్దరి తోడిదే
జీవితం  అయ్యింది. తాతయ్య  బాగా ఆస్థి సంపాదించడంతో...తాతయ్య పోయిన తర్వాత
నానమ్మకు పిల్లల్ని పెంచడం పెద్ద సమస్య కాలేదు.
ఇద్దరూ ఒకే  తల్లి కడుపు  న పుట్టినా...
ఇద్దరి  మనస్తత్వాలుా  వేరుగా ఉండేవి. అత్తయ్య
నాన్న కంటే   పెద్దది. ఎప్పుడుా గలగలా మాట్లాడుతుా,
నవ్వుతుా...ఏదో పనిచేస్తుా బిజీగా ఉండేది.
చుట్టుపక్కల అందరికీ ఏ సహాయం కావాలన్నా..
అత్తయ్య  ఆనందంగా చేసి పెట్టేది .దానితో
అత్తయ్యను చాలా మంది ఇష్టపడేవారు. అత్తయ్య
కాలేజీ చదువుకున్న  రోజుల లో  సెలవులొస్తే చాలు ,
చామంది అనాధలకి , వ్రుధ్ధులకి సేవచేయడానికై
వెళిపోతుా ఉండేది. అందులో చాలా ఆనందాన్ని
పొందేది. రాను రాను ఈ పనులు చేసేందుకు వచ్చే వారితో స్నేహం పెరిగిన అత్తయ్యకు...మొాహన్
అనే అతనితో చనువు  ఏర్పడి..అది పెళ్లి చేసుకుందాం
అనే నిర్ణయం వరకు దారితీదింది.అయితే మొాహన్
"ఆస్థి- పాస్థులు లేనివాడు , అనాధ ", అని
తెలియడంతో  అత్తయ్య మ్రాన్పడిపోయింది.కానీ
మొాహన్ మీద ఉన్న ప్రేమ తో తన నిర్ణయం
మార్చుకోలేకపోయింది.

ఇంట్లో  ఈ మాట చెప్పగానే నానమ్మ కు
ఏంచేయాలో తోచలేదు. పిల్లడికి కులం తక్కువైనా  ,
ఆస్థి లేకపోయినా ఫర్వాలేదు కానీ అనాధ
అవడంతో ఆలోచనలో పడిపోయింది.  దగ్గరి బంధువులని అడిగితే  " మగ పిల్లాడికి ఎవరుా పిల్లని ఇవ్వరనీ.,.ఆ తర్వాత విచారించి లాభం లేదనీ ,
అందికే  ఆడపిల్ల ద్వారా ,  అనర్ధం జరగకముందే-
మగ పిల్లడి  పెళ్ళి చేసీమనీ చెప్పడంతో..నానమ్మ  ఆలోచనలో  పడింది. అత్తయ్యకు నచ్ఛెప్పలేక , బందువుల మాటలకు ఎదురు చెప్పలేక  ఆఖరుకి , నానమ్మ  నాన్నకే  ముందు పెళ్ళిచేసీసింది .

కానీ వచ్చిన   కోడలు కొన్ని రోజుల తర్వాత
తమ  ఇంటి పరస్థితులను అర్థం  చేసుకోకుండా...
వీరితిో, వారితో అత్తయ్య గురించి చెడుగా
మాట్లాడుతుా  ఉండడంతో,  ఇంటి గుట్టు
రచ్చకెక్కింది. దానితో ఇంట్లో,  వాదోపవాదాలు జరిగేవి.
కొత్తలో నాన్న , నానమ్మ ,  అత్త , లవైపు మాట్లాడినా
రానురాను..భార్య వైపు మొగ్గడంతో..నానమ్మకి
ఏం చేయాలో అర్ధం అయేది కాదు.
తన చదువు పుార్తయి,   ఉద్యోగం దొరకగానే
మొాహన్ ని వివాహం
చేసుకుందామనుకున్న అత్తయ్య  నిర్ణయం , ఇంటి
పరిస్థితులు సహకరించకపోవడంతో , అవమానం భరించలేక , ఒకానొక
సాయంత్రం మొహన్ తో కలిసి వెళ్ళపోయింది.
నానమ్మ చాలా ఏడ్చింది  నాన్న దగ్గర. చెల్లెలు పెళ్ళి
చేసుకున్నతనికి ఇంకా , ఉద్యోగం లేదనీ, అనాధ-
కావడంతో ఆశ్రయం ఇచ్చేవారు కుాడా ఎవరుా లేరనీ,
వారిద్దరిలో ఏ ఒక్కరికైనా   ఉద్యోగం దొరికేదాక , తమ దగ్గరే ఉండనివ్వమనీ...చాలా బతిమాలింది నానమ్మ.
కానీ అమ్మ నోటి ధాటి ముందు నాన్న  , అమమ్మ కుాడా
తల వంచవలసివచ్చింది.
నానమ్మ గుండె రాయి చేసుకొని..కన్నీళ్ళతో కాలం గడిపేది. సంవత్సరం గడిచింది.
ఒక రోజు  సాయంత్రం..
రోజుా వెళ్ళే కోవెల లో , అత్తయ్యని
కలిసిన నానమ్మ ఆనందానికి అంతులేకుండాపోయింది.
దానికి తోడు ,
అత్తయ్య తను , నెల తప్పినట్టు చెప్పడంతో నానమ్మ ఆనందం రెట్టింపయ్యింది.
అప్పటినుండి ప్రతీ రెండు  , ముాడు రోజులకు
అత్తయ్యని కలిసి  ఎన్నో వివరాలు తెలుసుకుంది.
అందులో ముఖ్యమైనది...మామయ్యకు సరైన
ఉద్యోగం లేకపోవడం , రెండవది   నెల తప్పడం వల్ల
అత్తయ్య ఉద్యోగం మానడంతో..ఇల్లు గడవడానికి
కొంచం ఇబ్బందులని ఎదుర్కోవలసి రావడం.
ఇటువంటివి కొన్ని విషయాలు విన్న నానమ్మ..
కుాతురి పరిస్టితికి చాలా బాధ పడింది. కడుపుతో
ఉన్న పిల్లకి ఏవేవో తినాలుంటుంది. మరి తన
కుాతురు తింటున్నాదో , లేదో అనుకున్న నానమ్మ
అప్పుడప్పుడు అత్తయ్యకు ఇష్టమైన  పదార్డదాలు  చేసి  పట్టుకెళ్ళి ఇచ్చి వస్తుండేది. మనసులో ఈ విషయమై
నాన్నతో మాట్లాడి ఏదైనా సహాయం కుాడా
చేయాలని అనుకుంది. ఐతే నానమ్మకు
ఈ ఆనందం కుాడా ఎక్కువ రోజులు
నిలవలేదు. నానమ్మ ముఖంలో సంతోషం కనిపెట్టిన
అమ్మ , నానమ్మను గమనించడం మొదలెట్టింది.  .
ఒక రోజు నానమ్మకు తెలీకుండా , నానమ్మ వెనకాలే
గుడికి వచ్చి , అక్కడ నానమ్మ , అత్తయ్యను కలవడం..
డబ్బాలో పెట్టి ఏదో ఇవ్వడం గమనించిన అమ్మ ,
ఆ గుడిలోనే అత్తయ్యను  నానా మాటలుా ఆడి ,అవమానించింది.
అసలే పరిస్థితులు బాగులేక
ఇబ్బంది పడుతున్న అత్తయ్య , కళ్ళనీళ్ళతో  ,
అవమానాన్ని దిగమింగుకొని,  అక్కడి నుండి
వెళ్ళిపోయింది. ఆ తర్వాత నానమ్మ ఎంత
ప్రయత్నించినా , అత్తయ్యని కలవలేకపోయింది.
రోజులు భారంగా గడుస్తున్నాయి నానమ్మకి.
ఇటువంటి సమయంలోనే తను పుట్టబోతుందన్న
సమాచారంతో  , ఇంటిలో అందరి మనసుల్లో
ఆనందం  చుట్టుముట్టింది. తొమ్మిది నెలల
తర్వాత తన రాకతో నానమ్మ లోకమే తనైపోయింది.
తనకు ఐదవ సంవత్సరం పుట్టిన రోజు ఘనంగా జరిపేరు.  ఆ తర్వాత ఒకరోజు  తెల్లారి  ఎవరో
ఒకతను  తమ ఇంటికి వచ్చి ..నానమ్మ  కోసం
అడిగేరు. తనకోసం వచ్చింది ఎవరై ఉంటారా....
అని నానమ్మ   ఆశ్చర్యపోతుా బయటకు వచ్చింది.
నానమ్మ ను చుాడగానే అతను లేచి నిలబడి
నానమ్మ కు నమస్కరించి ,  అత్తయ్యను పెళ్ళి
చేసుకున్న మోహన్  తనేనని ,  ప్రస్తుతం అత్తయ్య
పరిస్థితి  బాగులేదని...రెండవసారి  నెలలు నిండిన అత్తయ్యకు ,
కడుపులో బిడ్డ అడ్డం  తిరిగిందని , డాక్టర్స్ 
" ఆపరేషన్ చేయాలి  , లేకపోతే తల్లికి పిల్లకి
కుాడా ప్రమాద "మని చెప్పేరని  , మొదటి బిడ్డ కుాడా ఇటువంటి   సమస్యల కారణంగా తమకు
దక్కలేదని , ఇటువంటి పరిస్థితుల లో
తనకు ఎవరుా లేనందు వల్ల , తమ సహాయం కోసం వచ్చేననీ  , అత్తయ్య  నాన్న కోసం , నానమ్మ కోసం ఎదురు  చుాస్తున్నాదనీ,  చెప్పడంతో..నానమ్మ
కంగారుపడి బయలుదేరడానికి సిద్ధమైంది.

మొాహన్ మొహమాట పడుతుా ఆపరేషన్ కోసం
ఆర్ధికంగా తనకు కొంచం సహాయం చేయాలనీ...
కొంచం సమయంలోనే తిరిగి రుణం తీర్చేస్తానని,
తనకు సింగపుార్ కంపెనీలో ఉద్యోగం దొరకవచ్చని..
చెప్పడంతో' , నానమ్మ  ఆ సమయంలో నాన్న  ఇంట్లో
లేకపోవడంతో , అమ్మ వేపు అర్ధిస్తున్నట్టుగా  చుాసింది.
ఆ వచ్చినది అత్తయ్య  భర్త  మొాహన్ అని ,
తెలుసుకున్నపుడే,  అమ్మ ముఖంలో రంగులు
మారేయి. ఇప్పుడు డబ్బు కావాలనడంతో..అమ్మ
మొాహన్  ఎదురుగానే  , నానమ్మ  మీద విరుచుకు పడింది.
కులం తక్కువ వారిని  పెళ్ళి చేసుకున్న రోజే, తమకు,
అత్తయ్యకు మధ్య బంధుత్వం  తెగిపోయిందని,
ఇప్పుడు అర్ధాంతరంగా వచ్చి , సంబంధాలు
కలపవద్దనీ...ఇటువంటి వారికి ధారపోయడానికి
తమ దగ్గర అప్పనంగా వచ్చిన  సొమ్ము లేదనీ, ఖచ్చితంగా
చెప్పి..  మామయ్య ని అవమానించి పంపేసింది.
అమ్మతో సాలలేకా , అత్తయ్యని  ఇటువంటి
పరిస్థితుల లోఅలా అనాధలా  వదిలీలేకా ,
నానమ్మ  నరకం అనుభవించింది...
కన్న మమకారం చంపుకోలేని నానమ్మ ,  ఆ రోజు
సాయంత్రం తన మెడలో ఉన్న ఒంటిపేట
గొలుసు ' అమ్మి ,  అత్తయ్యను చేర్చిన హాస్పిటల్ కి
ఆదరా బాదరగా చేరింది.
కానీ అప్పటికే సమయం మించిపోయింది. కాన్పు కష్టమైన  కారణంగా
అత్తయ్య పసి గుడ్దును ప్రసవించి ,  ఈ లోకాన్ని
విడిచి వెళ్ళిపోయింది.  నానమ్మ కి'  ఈ సంఘటనతో
మతిపోయినట్టయింది .మొహన్ పరిస్థితి
ఇంకా దారుణంగా ఉంది .  ముందుగా , నానమ్మే
కోలుకుంది.  ప్రాణం పోయిన అత్తయ్య శవాన్ని
తిరిగి అప్పచెప్పేందుకు హాస్పిటల్ వారు చాలా హంగామా చేసి..
ఆలశ్యం చేసేరు. దానితో నానమ్మకు ఇంటికి వచ్చి,
చెప్పివెళ్ళే అవకాశం లేకపోయింది .చివరికి
నానమ్మ  అత్తయ్య ని
భ్రతికించుకొనేందుకు అమ్మిన గొలుసు డబ్బులు..
అత్తయ్య అంత్యక్రియలకు   ఉపయొాగపడ్డాయి.
నానమ్మ పుట్టెడు కడుపు శోకంతో  ఇల్లు చేరిం౦ది.
అత్తయ్య మరణం గురించి చెప్పి , పసి గుడ్డును
ఇంటికి తెచ్చుకుందాం అనుకున్న నానమ్మ-
ఆశలు నిరాశలే అయ్యేయి.
సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన నాన్నకు, అమ్మ
ఏం చెప్పిందో ఏమొా...
నానమ్మ రాగానే విషయం  ఏమిటి .?..అన్నది అడగకుండానే,  నాన్న , నానమ్మ  మీద విరిచుకు
పడ్డాడు. అమ్మ సరేసరి. వీరిద్దరి ధాటికీ తట్టుకోలేక
నానమ్మ తన గదిలోకి వెళ్ళి , తలుపేసుకొని
చాలా సేపు ఏడ్చింది.
భార్య చాడీలతో , నానమ్మ మీద విరుచుకుపడిన
నాన్న , నానమ్మ భోజనానికి రాకపోవడంతో ,
అసహనంగా,  నానమ్మని పిలవడానికి వెళ్ళేడు.
ఎదురుగా నాన్న  ఒక్కడినీ  చుాసిన నానమ్మ కి
ద:ఖం ఆగింది కాదు. ఏడుస్తునే జరిగిన
సంఘటనలు చెప్పింది. రక్త సంబంధం కావడంతో
నాన్నకు కుాడా..అత్తయ్య  ఇంక ఈ లోకంలో లేదన్న
వార్త శరఘాతమే అయ్యింది. అయితే నాన్న, ఆమె గుర్తుగా మిగిలిన పసి బిడ్డ,  మంచి- చెడులు చుాసే బాధ్యత , మేనమామగా తను చేపట్టే నిర్ణయానికి  వచ్చేడు.
తర్వాత ఈ విషయమై జరిగిన వాదోపవాదాల లో
అత్తయ్య  మాటకు నాన్న  , మొదటి సారి
ఎదురు  తిరిగేడు . నానమ్మ కళ్ళలో , పసి కందును
ఇంటికి తేవచ్చన్న ఆనందం కొట్టొచ్చినట్టు కనపడింది.
ఆదివారం శలవు కనక ఆ రోజు పసికందును
తేవడానికి నిర్ణయించుకున్నారు.
నాలుగు రోజులు గడిచేయి . అనుకున్న రోజు రానే
వచ్చింది.
కానీ ఎంతో ఆత్రుత.. తో బయలుదేరిన
వారికి , నిరాసే ఎదురయ్యింది. అప్పటికే మొాహన్ బాబును తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయేడు.
ఎంతమందిని అడిగినా , అతని సమాచారం కుాడా తెలియలేదు.
నాన్న, నానమ్మ , నిరాశగా వెనుతిరిగేరు.
ఉత్త చేతులతో తిరిగి వచ్చిన వీరిద్దరినీ చుాసి
అమ్మ ఆనందపడింది.  కానీ నానమ్మకి
ఆశ చావలేదు.  బాబు కోసం మొాహన్ కోసం
వెతుకుతునే ఉంది.
ఈ విషయం తెలిసిన అమ్మ., మొాహన్  ,బాబు లు
కనబడితే , తనకో గుది బండలా తయారౌతారని,
తనకు బరువు -బాధ్యతలు పెరుగుతాయని ,
తలచి...ఏదోరకంగా నాన్న తో నుా, నానమ్మ తోనుా ,జగడం వేసుకుంటుా ఉండేది.
అప్పుడప్పుడవి, చిలికి- చిలికి గాలి-వానగా
మారుతుాండడంతో ,  నానమ్మ  ఈ విషయమై
ఇంట్లో చర్చించడం మానీసింది. తను కుాడా
పెద్ధవుతుా వచ్చింది. దానితో తన ఎదురుగా
అత్తయ్య ప్రస్తావన ఎవరుా తెచ్చేవారు -
కాదు. కానీ  కొన్నాళ్ళకు ,తనకు ఒక అత్తయ్య కుాడా ఉందన్న  విషయం  తెలిసి , అమ్మని అడిగితే
ఆమె పెళ్ళి చేసుకొని యుా.ఎస్.లో , సెటిల్
అయిందని , ఆ తరువాత ఎప్పుడుా ఇండియా
రాలేదని , అసలు అభిమానంగా  ఫోన్ కుాడా
చేసేది కాదని..అందుకే  ఆమె గురించి తనకు
చెప్పలేదని చెప్పింది.
అమ్మ తనతో చెప్పిన విషయాలు
విన్న నానమ్మ కుాడా తనతో అలాగే చెప్పడంతో
తను ఆ విషయం అసలు మర్చేపోయింది.
సంవత్సరాలు గడుస్తున్నా నానమ్మ  , మామయ్య
గురించి , బాబు గురించి వెతకడం  మాత్రం మానలేదు.
ఈ విషయం తెలిసిన అమ్మ , నానమ్మ ని సుాటి -పోటి
మాటలతో  వేధించడముా  మానలేదు.
--------------------------------------
ఆ రోజు తనకి బాగా గుర్తు. తను కేంప్ నుండి
ఎంతో సంతోషంగా ఇంటకి వచ్చింది.  నానమ్మ కి
సర్ప్రైజ్  గిఫ్ట్ గా భగవద్గీత పుస్తకం , ఇవ్వాలని,
ఇల్లంతా నానమ్మ  కోసం ఎంత వెతికిందని.
నానమ్మ   ఇంట్లో కనపడకపోయేసరికి '
చిన్నబోయిన ముఖంతో' నానమ్మ  గుడిలో
ఉంటుందేమో అనుకొని వెళ్ళబోతున్న తనను
ఆపి , మరీ అమ్మ చెప్పిన విషయం విన్న తను,
ఎంత ఆశ్చర్య పోయిందని.  ""నానమ్మ కోసం
అత్తయ్య వచ్చిందని , నానమ్మ అత్తయ్య తో
అమెరికా వెళ్ళిపోయిందని "  చెప్పగానే , తనకు
నమ్మబుద్ధే కాలేదు. నానమ్మ తనకు చెప్పకుండా
వెళ్ళిపోయిందని వెక్కి -వెక్కి , ఎంత ఏడ్చిందని...
నానమ్మ కోసం కొన్న భగవద్గీత పుస్తకం ఇప్పటికీ
తన బీరువాలోనే ఉంది.
-------------------------------------

ఇంతకీ జరిగినదేంటంటే..
తను కేంప్ కి వెళ్ళిన మరునాడు , ఆదివారం
కావడంతో ..నాన్న ఇంట్లోనే ఉన్నారు. నానమ్మ
అత్తయ్యకి పుట్టిన పిల్లడి గురించిన సమాచారాన్ని,
కనుక్కోమని , ఎలాగైనా   పిల్లాడిని  ఇంటికి
తెచ్చుకోవాలని , వాడికి ఏలోటుా లేకుండా
పెంచాలని , ఇదే తన చివరికోరిక అనుకోమని
నాన్నకి చెప్పింది..,  అది విన్న తర్వాత అమ్మకి,  నానమ్మలకి మధ్య
మాటా- మాటా పెరిగాయి.
అమ్మ , తనకు ఎదిగిన కుాతురుందని..
పరువు తక్కువ పనులు చేసిన అత్తయ్యకు,
పుట్టిన  పిల్లాడిని తెచ్చుకుంటే , ఇక తన  కుాతురికి
పెళ్ళే కాదని..సమాజంలో అందరుా చుాసే చిన్న
చుాపుకు. తాము తట్టుకోలేమని...గుచ్చి గుచ్చి
అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే అవసరం
తమకు లేదనీ.. ఖారాఖండీగా తేల్చి చెప్పింది.
అంతా విన్న నాన్న , భార్య అన్న మాటలో
తనకేం తప్పు కనిపించలేదని ,ఇంక ఆ వుాసు మాట్లాడుకోవడం వల్ల ప్రయొాజనం లేదు గనక
ఇంక ఆ విషయమైవ అనవసరంగా మాట్లాడుకో
వద్దని , చెప్పడంతో , నానమ్మ మనసు కకావికలమై
అమ్మకు చెప్పలేక , నాన్నకు వివరించలేక ఏడుస్తుా
తన గదిలోకి వెళ్ళిపోయింది.

ఆ రాత్రి అమ్మ నాన్నతో ఏమని చెప్పిందో...
నాన్న ..ఆఫీసుకు సెలవు పెట్టి మరీ.. నానమ్మను
ఊరికి దుారంగా . ఏ సదుపాయాలుా లేని
ఈ ఆశ్రమంలో తెచ్చి పడీసేడు . ఒకటి రెండు సార్లు
ఒచ్చి వెళ్ళేడు. రాను రానుా..అసలు రావడమే
మానీసేడు. సమయానికి ఆశ్రమానికి కట్టవలసిన
సొమ్ము  మాత్రం కడుతున్నాడు. నానమ్మ కుాడా
తనకు,  తన  మాటకు ,  ఆదరం లేని చోటు కన్నా
ఇక్కడెే బాగుందని ఉండిపోయింది. 
అదీ గాక తన  కన్న కొడుకే ,తనను ఊరికి చివరలో
విసిరేనినట్టుండే ఈ వ్రుద్ధాశ్రమంలో , కనీసం
తనని  అడగైనైనా  అడక్కుండా   చేర్చడంతో,
పుార్తిగా మనసు విరిగిపోయింది నానమ్మకి.
కానీ తనని  తలవని క్షణం లేదుట. అత్తయ్య కన్న
పసికందు  ఎక్కడున్నాడో తెలీకా , మొాహన్
మామయ్య  ఆచుాకీ తెలీక , రోజుా తను పడే బాధ
నరకంలో ఉండడం  కన్నా బాధగా ఉందని
చెపుతుా..ఎంత ఏడ్చిందని.
అసలు తన అత్తయ్య
చేసిన తప్పేమిటి ? మనసుకు నచ్చిన మంచి
మనిషి తో జీవితాన్ని పంచుకోవాలనికోవడం
తప్పేమీ  కాదే...। కన్న కుాతురు ఇబ్బందుల్లో ఉంటే
తల్లిగా తల్లడిల్లడం  , కొంచం సాయం చేయాలనుకోవడం నానమ్మ చేసిన నేరం  కాదే..।అత్తయ్య  కన్న కొడుకు అనాధలా పెరగకుాడదనీ..హాయిగా పెరగాలని ,
బాగా చదివించాలని ,
అందికే ,  పసికందుని ఇంటకి తెచ్చుకుందామన్న
నానమ్మ  కోరిక అసమంజసమైనది కాదే...
మరేఁకారణంతో నాన్న ,  నానమ్మను , తను
ఉండి కుాడా , దిక్కులేని  దానిలా ఇక్కడకు తెచ్చి
పడేసినట్టు..? ఇటు వంటి పని చేయడానికి వారికి
మనసెలా ఒప్పింది..? ఇది క్షమించరాని తప్పు కాదా।
ఆలోచిస్తున్న శ్రావ్యకు తెల,తెలవారుతుండగా
మగతగా నిద్ర పట్టింది. నిద్రలో తను నానమ్మతో
కలిసి ఎక్కడికో వెళ్ళిపోతోంది. నానమ్మ చేతిలో
అత్తయ్య కన్న చిన్నారి పాపడు . నానమ్మ కళ్ళల్లో
కోటి వెలుగుల దీపాలు. తనతో నడుస్తున్న నానమ్మ
కళ్ళల్లో నిశ్చింత...
నానమ్మతో నడుస్తున్న తన అంతరంగంలో ఎన్నడుా
ఎరుగని ఆనందం...
కలలో  ఆనందం పట్టలేని  శ్రావ్య,  అటు ఇటు
దొర్లుతుా...తుళ్ళిపడి లేచింది. తను తన
రుామ్ లోనే ఉన్నట్టు గ్రహించి  ఇంతసేపుా తను
చుాస్తున్నది కలా..అనికొని ఆశ్చర్య పడింది.
చాలా సేపు ఆలోచనల్లో ములిగిపోయిన శ్రావ్య
చివరిగా ఒక నిర్ణయానికి వచ్చింది. తన మనసులో
ఉన్న ఆలోచనే తన కలలోకి వచ్చి , తనకో దారి
చుాపించినట్టయింది. నిజమే । తను నానమ్మ
బాధ్యత ఎందుకు తీసుకోకుాడదుా। డిగ్రీ
చదివిన తనకు   ఏదైనా మంచి ఉద్యోగం దొరకక
పోదు. ఉద్యోగం  చేస్తుానే , తను చదువుకుంటుంది.  తను నానమ్మతో వేరేగా ఉండి నానమ్మ మంచి
చెడ్డలు చుాస్తుా , నానమ్మ   కోరికలన్నీ తీరుస్తుంది. తన మేనల్లుడి ఆచుాకీ  తెలుసుకొని , నానమ్మ దగ్గగరకు తీసుకు  వస్తుంది. నానమ్మ చివరి దశ వరకు తను -
నానమ్మ దగ్గరే ఉంటుంది. అంత వరకు అమ్మా నాన్నలకు , తను వారిని వదిలి వెళ్ళడం -,
చాలా బాధకు గురి చేస్తునది..కానీ వాళ్ళకి
కుాడా,  తాము చేసిన తప్పు తెలియాలంటే
తను కొంచం కఠినంగా ఉండక తప్పదు మరి.
కుాతురి  గురించి నానమ్మ పడ్డ బాధ  వారి
అనుభవంలోకి   రావాలంటే తనలా చేయక
తప్పదు మరి. ఎందరో అనాధలకి , వ్రుద్ధులకి' ,
ప్రేమను పంచిన తను , అమ్మా , నాన్నలను '
ఒంటరిగా వదలదు. నానమ్మ తదనంతరం తను
వారి దగ్గరకు  తిరిగి  వచ్చేస్తుంది.  అంతే....

ఈ విధంగా ఆలోచించినమీదట, తన నిర్ణయం తప్పు కాదన్న  భావం తో, నిశ్చింతగా ఉన్న మనసుతో, మంచం మీద నుండి లేచి కిందకు దిగింది  శ్రావ్య.

-----------------------------------
కాలక్రుత్యాలు తీర్చుకొని , చల్లటి నీళ్ళతో స్నానం చేసాకా, శ్రావ్యకి ఎంతో హాయిగా ప్రశాంతంగా
అనిపించింది.   తర్వాత  తాపీగా తన బట్టలన్నీ
సుాట్ కేస్  లో సద్దుకుంది. తన పేరున ఉన్న బేంక్
చెక్ బుక్స్ తో  పాటు ...తన దగ్గర ఉన్న కేష్ కుాడా
హేండ్ బేగ్ లో సద్దుకుంది. ఇంకా కావకలసిన
ముఖ్యమైన వస్తువులన్నీ తీసుకొని..తన గది నుంఛి
బయటకు వచ్చింది.
అప్పటికే డైనింగ్ టేబల్ దగ్గర కుార్చొని..అల్పాహారం తినడానికి , తన కోసం నిరీక్షిస్తున్న ,అమ్మా..నాన్నలు.  తను పెద్ద
సుాట్ కేస్ తో బయటకు రావడం చుాసి..నిర్ఘాంతపోయేరు.
" నిన్న నే కేంప్ నుంచి వచ్చేవు కదా...మళ్ళీ ఎక్కడికి
ప్రయాణం" ..అంటుా అడిగిన అమ్మ మాటలకు ..
చిన్నగా నవ్వింది శ్రావ్య. తాపీగా టిీఫిన్ చేసి ,
టీ తాగి ..మెల్లగా వంగి అమ్మ ' నాన్నల పాదాలకు
నమస్కరించిన  శ్రావ్య..మెల్లిగా ముఖద్వారం వైపు
నడక సాగించింది. అమ్మ మాట కు జవాబు ఇయ్యకుండా , పెట్టెతో బయలుదేరుతున్న
తనను  ,ఈ సారి నాన్న అడిగేరు..శ్రావ్యా...ఎక్కడికి..అంటే మాట్లాడవేమిటి..?
అంటుా..
శ్రావ్య వెను తిరిగి తాపీగా చెప్పింది."
" నేను అత్తయ్య దగ్గరికి వెళుతున్నాను నాన్నా..
అక్కడే నానమ్మ కుాడా ఉందికదా...నేను నానమ్మ
దగ్గరే ఉండి అక్కడే చదువుకుంటాను",..వస్తాను"
అంటుా  బయటకు నడిచింది.
శ్రావ్యకి తెలుసు వాళ్ళద్దరుా ఎంత నివ్వెరపోయి
ఉంటారో...చిన్నప్పటినుండీ తనతో అత్తయ్య అమెరికాలో  ఉందనీ, ఇప్పుడు నానమ్మ కుాడా  అత్తయ్య  దగ్గరే ఉందని తనకు చెపుతుా వస్తున్న వారిద్దరుా....
తనను  వెళ్ళకుండా  ఆపలేరు ,  అలాగని  నానమ్మ
వ్రుద్ధాశ్రమం లో ఉందన్న  నిజాన్నీ.. చెప్పలేరు.

ఇప్పుడు గానీ  తను,  వారద్దరుా ,  ఎటువంటి స్థితిలో ఉండి ఉంటారో
చుాసిందంటెే , మరి ఎప్పుడుా  వారిని వదిలి వెళ్ళలేదు.
అందికే శ్రావ్య వెనుతిరగకుండా బయలుదేరింది
నానమ్మ దగ్గరకి. అదే  " ఆనందాశ్రమానికి ".
------------------------------------------------------
సమాప్తం.
----------
రచన..శ్రీమతి,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
------------
































-----------------------------------------------