Sunday, March 28, 2021

మేఘన గారి సుాక్తులు

🌱🌱🌱🌱
                 
*విత్తనం తినాలని*                 
*చీమలు చూస్తాయ్*..
               
*మొలకలు తినాలని*                
*పక్షులు చూస్తాయ్*..
                            
*మొక్కని తినాలని*                
*పశువులు చూస్తాయ్*..
                 
*అన్ని తప్పించుకుని*             
*ఆ విత్తనం వృక్షమైనపుడు*..
            
*చీమలు, పక్షులు, పశువులు*..         
*ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్*....
            
*జీవితం కూడా అంతే TIME*          
*వచ్చే వరకు వేచివుండాల్సిందే*          
*దానికి కావాల్సింది ఓపిక మాత్రమే*.....
              
 🌱🌱🌱🌱
                
*లైఫ్ లో వదిలి వెళ్ళిన*           
*వాళ్ళ గురించి ఆలోచించకు*..
              
*జీవితంలో ఉన్న వాళ్ళు*              
*శాశ్వతం అని భావించకు*..
           
*ఎవరో వచ్చి నీ బాధను అర్థం*           
*చేసుకుంటారని ఊహించకు*...
              
*నీకు నీవే ధైర్యం కావాలి*.....          
*నీకు నువ్వే తోడుగా నిలబడాలి*....
             
🌱🌱🌱🌱
                  
*లోకులు కాకులు,*                 
*మనిషిని చూడరు*,              
*మనస్సును చూడరు,*              
*వ్యక్తిత్వాన్ని చూడరు.*                    
*కనిపించింది,*
            
*వినిపించింది నమ్మేస్తారు*,                 
*మాట అనేస్తారు,*
                 
*ఒక్కోసారి మన కళ్ళే*              
*మనల్ని మోసం చేస్తాయి.*
           
*మరొకసారి చెప్పుడు మాటలు*                        
*జీవితాలను*                  
*తలకిందులు చేస్తాయి*

               🌱🌱🌱🌱
              
*అబద్దాలతో, మోసాలతో*                  
*కీర్తి, ప్రతిష్టలను*         
*ఎంత గొప్పగా నిర్మించుకొన్నా*..          
*అవి కుప్పకూలి పోవడానికి*               
*ఒక్క "నిజం"చాలు*.
             
*అందుకే కష్టమైనా సరే*          
*నీతిగా బ్రతకడమే మనిషికి*                  
*ఉత్తమ మార్గం.*

             🌱🌱🌱🌱
                  
*ఒక చిన్న మొక్కనాటి*
      
*ప్రతిరోజూ వచ్చి కాయకాసిందా అని*                         
*చూడకూడదు.*
             
*ఎందుకంటే అది పెరగాలి*                
*మొక్క వృక్షం కావాలి*
          
*పుష్పించాలి, పిందెలు రావాలి*         
*అవి కాయలై , పండితే తినగలం.*
              
*అలాగే నేను ఇది కావాలి*             
*అనే కోరిక కూడా మొలకై*
       
*వృక్షమై ఫలవంతం ఔతుందని తెలిసి*           
*మసలుకోండి సన్నిహితులారా*🌹
         
🌱🌱🌱🌱
                
*జీవితంలో కష్టము,*             
*కన్నీళ్ళు, సంతోషము,*        
*భాధ ఏవి శాశ్వతంగా ఉండవు*
     
*కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు.*       
*ఆనందం, ఆవేదన కూడా అంతే.*
         
*నవ్వులూ, కన్నీళ్ళూ*              
*కలగలసినదే జీవితం*.
             
*కష్టమూ శాశ్వతం కాదు,*      
*సంతోషమూ శాశ్వతమూ కాదు.*

              🌹🌹🌹🌹
    
*ఓడిపోతే*
*గెలవడం నేర్చుకోవాలి*,

*మోసపోతే*
*జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి*,

 *చెడిపోతే ఎలా*
*బాగుపడలో నేర్చుకోవాలి,*

*గెలుపును ఎలా పట్టుకోవాలో*
*తెలిసిన వాడికంటే*
*ఓటమిని ఎలా*
*తట్టుకోవాలో తెలిసిన వారే*
*గొప్ప వారు నేస్తమా* !
    
 🌱🌱🌱🌱
 
*దెబ్బలు తిన్న రాయి*
*విగ్రహంగా మారుతుంది*

*కానీ దెబ్బలు కొట్టిన*
*సుత్తి మాత్రం ఎప్పటికీ*
*సుత్తిగానే మిగిలిపోతుంది*....

*ఎదురు దెబ్బలు తిన్నవాడు*,
*నొప్పి విలువ తెలిసిన వాడు*
*మహనీయుడు అవుతాడు*...

*ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు*
*ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు*...
    
             🌱🌱🌱🌱

*ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే*
*అందరి కన్నా ముందు మేకలే జ్ఞానులు*
*కావాలి,*

*స్నానాలతోనే పాపాలు పోతే ముందు*
*చేపలే పాప విముక్తులు కావాలి,*

*తలక్రిందులుగా తపస్సు చేస్తేనే*
*పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు*
*గబ్బిలాలకే ఆ వరం దక్కాలి,*

*ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది*
*నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ*
*పరుగులు పెడితే ప్రయోజనమే లేదు*

*నీలో లేనిది బయటేమీ లేదు* 
*బయటఉన్నదంతా నీలోనూ ఉంది*

🌱🌱🌱🌱

*డబ్బుతో ఏమైనా*
           
*కొనగలమనుకుంటున్నారా*
*అయితే కొనలేనివి ఇవిగో*

*మంచం పరుపు కొనవచ్చు*
*కానీ నిద్ర కాదు*

*గడియారం కొనవచ్చు*
*కానీ కాలం కాదు*

*మందులు కొనవచ్చు*
*కానీ ఆరోగ్యం కాదు*

*భవంతులు కొనవచ్చు* 
*కానీ ఆత్మేయిత కాదు*

*పుస్తకాలు కొనవచ్చు* 
*కానీ జ్ఞానం కాదు*
*పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు* 
*కానీ జీర్ణశక్తిని కాదు*
🌹సరోజ...రాయదుర్గం...🌹
🌹🌹🌹🌹🌹

Saturday, March 27, 2021

ఆనంద స్వాగతం (ప్లవ నామ యుగాది కవిత).

27/03/2021. (ఉగాది కవిరతలు వాట్సప్ లో)
"జనదీపిక " ఉగాది కవితల పోటీకి పంపినది.
శీర్షిక  : అనంద స్వాగతం.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

అడుగడుగునా అడ్డు తగులుతున్న 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రాణాళికల
ఉల్లంఘనలతో ,పాటు వికటించిన
ప్రకృతి ప్రకోపాల అతివృష్టి ,
అనావృష్టిల వర్ష ప్రభావానికి
పచ్చని పంటల విధ్వంశంతో పాటు,
సాగు నీటి కొరత వల్ల బీడు 
భుాముల సారహీన ఫలితాలతో
అన్నదాతలకు సన్నగిల్లుతున్న
ఆత్మస్థైర్యం, అడుగడునా 
ఆత్మహత్యలను ప్రేరేపిస్తోంది.
వికటిద్తున్న పర్యావరణ మార్పులకు
జన బాహుళ్యం, రోగగ్రస్థయై
మానవ సంబంధాల మాట మరచి 
మారణ హోమం చేస్తోంది.
ప్రతీ సంవత్సరం సశ్యశ్యామలమై,
పచ్చదనపు కళలతో , సుమ సౌరభ
సోయగాలతో నిండిన వసంత 
కన్నెల చెలిమి కోరుతుా, వన 
విహారానికి వచ్చే ఉగాది కన్య..
దేశ అన్నదాతల విషమ పరిస్థితి కి
విస్తుపోతుా ,  నీటి వనరులను 
సమృద్ధి పరచే ప్లవ నామ చెలియతో
పరుగు పరుగున వస్తోంది.
ప్రకృతి పచ్చదనాన్ని తిరిగి పెంచేందుకు. 
పర్యావరణ రక్షణ చేసి మనకు
ఆరోగ్యామృతం పంచేందుకు.
 రండి...అమె ఆగమనానికి 
 ఆనంద స్వాగతం చెపుదాం .


మన విధి

తెలుగు భారతి సాహిత్య సేవా సమితి  ఆధ్వర్యంలో.
అంశం: జాతీయ ఝండాకు వంద సంవత్సరాలు.
పేరుగల వాట్సప్ కు పంపిన కవిత.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక : దేశ పౌరుల ప్రాధమిక విధి.

స్వాతంత్రోద్యమ పోరాటం చేసి సాధించిన 
స్వాతంత్ర్యం , ఎంతోమంది చేసిన 
త్యాగ నిరతికి నిదర్శనం.
ఆగష్టు పదిహేనున మువ్వన్నెల జెండాను 
ఎగురవేస్తూ, యావత్ భారతావని, త్రివర్ణపతాక సృష్టికర్త అయిన పింగళి వెంకయ్యకు నిరాజనం పలుకుతోంది.
. ముాడు రంగుల మన జాతీయజెండాను, జాతీయగీతాన్ని, జాతీయ గౌరవ చిహ్మాలను,  స్వాతంత్ర్యయోధులను గౌరవించడం మన భారత పౌరుల ప్రాధమిక విధి. 
1947 జూలై 27వ తేదీన నిర్వ‌హించిన రాజ్యాంగ స‌భ‌లో మొద‌ట‌గా ఆమోదింపబడిన మన భారత -జాతీయ పతాకం ,వంద వత్సరాలు పుార్తి చేసుకొని
"భరత జాతి కీర్తి చిహ్నంగా "ఎప్పటికీ నిలిచిపోవాలి
అన్న సత్ సంకల్పంతో. మన జాతీయ ఝండాకు 
ఐకమత్యంతో ,గౌరవపుార్వకంగా "జై " కొడదాం .

Friday, March 26, 2021

శత తేనియలు లో నా సంఖ్య 53.

ఇప్పటివరకు మన తేనియ సమూహంలో 
*శత తేనియలకవిపురస్కార్* అవార్డు పొందిన సోదర సోదరీ సాహీతీ ప్రియులు

1 శ్రీ కిషోర్ రాథోడ్ గారు
2 శ్రీ డా!! జలందర్ వాఘ్మారే గారు
3 శ్రీమతి శైలజా శ్రీనివాస్ గారు
4 శ్రీమతి వి.సంద్యారాణి గారు
5 శ్రీమతి ధనాశి ఉషా రాణి గారు
6 శ్రీ చొక్కారపు రాజయ్యగారు
7 శ్రీ మేకల లింగమూర్తి గారు
8 శ్రీ  గద్వాల సోమన్న గారు
9 శ్రీమతి లావణ్య తిరుపతి గారు
10 ఆర్.వి.యస్.యస్. శ్రీనివాస్ గారు
11 శ్రీ పుల్లూరి నాగేశ్వర్ గారు
12 శ్రీ షేక్ మహబూబ్ బాష గారు
13 శ్రీమతి సునితా రాణి గారు
14 శ్రీమతి స్వర్ణలత గారు 
15 శ్రీ మారంరెడ్డి గోపాల్ రెడ్డి గారు
16 శ్రీ బండారి మల్లేష్ గారు
17 శ్రీమతి సుబ్బా జ్యోత్స్న దేవి గారు
18 శ్రీమతి మోటూరి అర్పితగారు
19 శ్రీమతి రజిత సురేష్ గారు
20 శ్రీ క్రిష్ణారెడ్డి గారు 
21 శ్రీమతి కె శ్రీలత గారు
22 శ్రీ పోలిశెట్టి వెంకట కిషోర్ గారు
23 శ్రీమతి యడవల్లి శైలజ గారు 
24 శ్రీ కుందారపు గురుమూర్తి గారు
25 శ్రీమతి ఒల్లాల వరలక్ష్మి గారు
26 శ్రీ చిట్టి మధుగారు
27 శ్రీమతి ఇంజపురి వసంత గారు
28 శ్రీ యం శ్రీనివాసులు గారు
29 శ్రీ అక్కి నర్సింలు గౌడ్ గారు
30 శ్రీ పసుల శంకర్ గారు
31 శ్రీమతి అన్యం పద్మజా రెడ్డిగారు
32 శ్రీ జాగిరి యాదగిరి గారు
33 శ్రీ దన్నవరం నరేందర్ రెడ్డిగారు
34 శ్రీ దేవవరపు ఈశ్వరరావు గారు
35 శ్రీ దాసరి శ్రీరాములు గారు
36 శ్రీ మండలోజు నరసంహ స్వామి గారు
37 శ్రీ పిట్ల రాజయ్యగారు
38 చిరంజీవి ఎలిగేటి శ్రీచరిత గారు
39 శ్రీమతి లలితా రెడ్డి గారు
40 శ్రీ వడ్డేపల్లి మల్లేశము గారు
41 శ్రీ  డాక్టర్ పెంకి విజయ కుమార్ గారు
42 చిరంజీవి చెన్నా సాయిరమణి గారు
43 శ్రీ బడిమల వేణుగోపాల్ గారు
44 శ్రీ ముసిపట్ల రఘునందన్ గారు
45 శ్రీ అస్కని రాజు గారు
46 చిరంజీవి బాపల రాజకుమారి గారు
47 శ్రీ పోలపల్లి శ్రీకాంత్ గారు
48 శ్రీమతి కల్లేపెల్లి సరళ గారు
49 చిరంజీవి బోడపోతుల కిరణ్ గౌడ్ గారు
50 శ్రీ కల్వల రాజశేఖరరెడ్డి గారు
51 శ్రీమతి పత్తెం విజయ రాఖీ గారు
52 శ్రీమతీ మోదెపల్లి శీనమ్మ గారు
53 శ్రీమతీ పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారూ
54 శ్రీ పిల్లి హజరత్తయ్య గారూ
55 శ్రీమతీ భువనపల్లి సావిత్రి గారు
56 శ్రీమతీ వజ్జల ప్రణీత గారు
57 శ్రీమతీ కటుకం కవిత గారు
58 శ్రీమతీ డా. సూర్యదేవర రాధారాణి గారు
59 చిరంజీవి వి.అశోక్ గారు
60 శ్రీమతి బత్తిన గీతాకుమారి గారు
61 శ్రీ పాండురంగ విఠల్ గారు
62 శ్రీ తంగెళ్ళపల్లి ఆనందాచారి గారు
63 శ్రీ కందుకూరి భాస్కర్ గారు
64 శ్రిమతి వసంత ప్రసాద్ గారు
65 శ్రీమతీ భవానీ క్రిష్ణమూర్తిగారు
66 శ్రీ దేవరకొండ యస్.వి. రమణారావు గారు
67 శ్రీ కన్నెకంటి నాగేశ్వరరావు గారు
68 శ్రీ యం.సి.ఆర్.శేషు గారు
69 శ్రీ నూనె మహేష్ శర్మ గారు
70 శ్రీమతి మద్దెల సరోజన గారు
71 శ్రీమతి బొల్లాప్రగడ ఉదయభాను గారు
73 శ్రీమతీ కొత్త ప్రియాంక గారు


*

Thursday, March 25, 2021

రాజ్యాంగ రక్ష.

    28/03/2021.
                       మనుమసిద్ధి కవన వేదిక. కు పంపినది
                       అంశం :  రాజ్యాంగ రక్ష.
                        శీర్షిక :రాజ్యాంగ రక్షణ.మన బాధ్యత.    
                        ప్రక్రియ : వచన కవిత.   
                         
              రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
                         కల్యాణ్ : మహారాష్ట్ర .
                         -----------------------------
1950 జనవరి 26 న  అమలులోకి వచ్చిన.భారత రాజ్యాంగం , న్యాయ సంబంధమైన చట్టాలన్నింటికి
ముాలాధారమై ,ఒక దేశం లేదా ఒక రాష్ట్రం యొక్క పరిపాలనా నిర్వహణకు పాటించాల్సిన న్యాయ సంబంధిత పత్ర సంపుటి తోప్రభుత్వాధికారాల నియమనిబంధనలతో బాటు,పౌర హక్కులు, 
దేశం సాధించాల్సిన లక్ష్యాలతో కలసిన పటిష్టమైన  పట్టికగా రుాపొందింపబడింది.
ఆనాటి నుంచీ ఈ నాటి వరకు పౌర ,చట్ట సంబంధిత మార్పులతో పాటు భారత ప్రభుత్వ వ్యవహరాల నిర్వహణాధికరణలవంటి ఎన్నో మార్పులతో చట్టాలను తీసుకు వచ్చేరు.
ఈ ప్రభుత్వ చట్టాలను పరిరక్షించే బాధ్యత ప్రజలమైన
మనపై చాలా ఉంది. న్యాయ పరమైన ప్రతీ పనికి మద్దతు ఇస్తుా , మత కలహాలను సృష్టించ కుండా, 
 స్త్రీ స్వాతంత్ర్యతకు సమానహక్కును ఇచ్చి గౌరవిస్తుా, 
 పర్యావరణ రక్షణ కై ప్రతీ ఒక్కరుా తమ వంతు కృషిని
 బాధ్యతాయుతంగా చేస్తుా , ఓటు హక్కును సద్వినియొాగ పరచుకొని, వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల మన విద్యుక్త ధర్మాన్ని  మనమే నిర్వర్తించాలి.అప్పుడే మన రాజ్యాంగం రక్షింపబడి , దేశం సుభిక్షమౌతుంది. 


హామీ: నా ఈ వచన కవత  ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన.
 


మన బాధ్యత.


                     అంశం :రాజ్యాంగ రక్షణ.

                     శీర్షిక : మన బాధ్యత.       
                         
                         రచన: శ్రీమతి :
                         పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
                         కల్యాణ్ : మహారాష్ట్ర .
                         ----------------------
1950 జనవరి 26 న  అమలులోకి వచ్చిన.భారత రాజ్యాంగం , న్యాయ సంబంధమైన చట్టాలన్నింటికి
ముాలాధారమై ,
ఒక దేశం లేదా ఒక రాష్ట్రం యొక్క పరిపాలనా నిర్వహణకు పాటించాల్సిన న్యాయ సంబంధిత పత్ర సంపుటి తో
ప్రభుత్వాధికారాల నియమనిబంధనలతో బాటు,
పౌర హక్కులు, దేశం సాధించాల్సిన లక్ష్యాలతో
కలసిన పటిష్టమైన  పట్టికగా రుాపొందింపబడింది.
ఆనాటి నుంచీ ఈ నాటి వరకు పౌర సంబంధిత వ్యవహారాల లో న్యాయపరమైన
 చట్ట సంబంధిత మార్పులు  ఎన్నో, జరిగేయి.
 
జన్మత భారతీయుల్తెన వారి పౌరసత్వ హక్కు మత, జాతి, కుల, లింగ,  వివక్షతల నిషేధన , ప్రభుత్వోద్యోగ వసతులలో సమానవకాశాలు 
వాక్స్వాతంత్ర్యము మెదల్తెన హక్కుల పరిరక్షణలు,  లాంటి ఎన్నో  హక్కులతో పాటు , స్త్రీ సంబంధిత, 
అధికార చట్టాలు, హక్కుల సమానతలు ,విద్య , ఉద్యోగార్హతల తో పాటు , ఆరక్షణా కేంద్రాల స్థాపనలతో పాటు పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకం వన్యప్రాణుల సంరక్షణే ,  కాక, అంతర్జాతీయ శాంతి,
 భారత ప్రభుత్వ వ్యవహరాల నిర్వహణాధికరణల
 వంటి ఎన్నో మార్పులతో చట్టాలను తీసుకు వచ్చేరు.
 ఈ ప్రభుత్వ చట్టాలను పరిరక్షించే బాధ్యత ప్రజలమైన
 మనపై చాలా ఉంది. న్యాయ పరమైన ప్రతీ పనికి మద్దతు ఇస్తుా , మత కలహాలను సృష్టించ కుండా, 
 స్త్రీ స్వాతంత్ర్యతకు సమానహక్కును ఇచ్చి గౌరవిస్తుా, 
 పర్యావరణ రక్షణ కై ప్రతీ ఒక్కరుా తమ వంతు కృషిని
 బాధ్యతాయుతంగా చేస్తుా , ఓటు హక్కును సద్వినియొాగ పరచుకొని, సరైన నాయకుని
 ఎన్నుకొని , ఎన్నుకున్న నాయకుని న్యాయ అదేశాలను
 అమలుపరచే బాధ్యతను తమదిగా ఆచరిస్తుా
 మన రాజ్యాంగ రక్షణకు మనమే ప్రతినిధులం కావాలి.
అన్యాయం,అక్రమం ,లంచగొండితనం ,రుాపుమాపాలి , స్త్రీ ల మాన సంరక్షణ మన బాధ్యతగా చేపట్టాలి. చట్టాలను తెచ్చేవరకు మాత్రమే మన 
 కేంద్రం మనకు సహరిస్తుంది. వాటిని అమలుపరచే బాధ్యత మనపైనే ఉందన్న నిజాన్ని మనం గ్రహించి 
 వ్యక్తగత, పరిసరాల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల మన విద్యుక్త ధర్మాన్ని  మనమే నిర్వర్తించాలి.
 అప్పుడే మన రాజ్యాంగం రక్షింపబడి , దేశం 
 సుభిక్షమౌతుంది. 
 


Tuesday, March 23, 2021

ప్రధమబహుమతి పొందిన కవిత..

🙏ప్రపంచ కవితా దినోత్సవం సందర్భగా 💐
పేరు -భరద్వాజరావినూతల 
ఊరు- కొత్తపట్నం 
అంశం  - సాహిత్యం కొత్తపుంతలు 
శీర్షిక- చల్లటిఓదార్పుకావాలి 
********************************************
🙏అక్షరాలను పదాలుచేసి -
భావాల సుధతో రంగరించి -
చక్కని చిక్కని వాక్యాలుగారాయాలని నాతలపు -
మనసునిదినాభావాలను మధించి -
ఆలోచనలసిరాను కలంలోపోసి -
తెల్లటి నామన్సుకాగితంఫై కవితారాస్తాను -
నాబాలు తొలిసంధ్యరాగాలు -
నాఆలోచనలు పుష్పరాగతరంగాలు -
నాకవితాశిల్పం కిన్నెరసాని నడక -
చెరగని నామనసులో ముద్రించి అక్షరాలూ
 భావాలకు అద్దుతాయి పరిమళాలు --
నేను కట్టుతాను కవితాకన్యకు సోయగాలు -
నీవిసురుతాను భావప్రకటనకు వింజామరలు -
బీటలుపడ్డ భూమికి తొలకరి నాకవిత -
వేడెక్కినగ్రీష్మమానికి ఆషాడం నాకవిత  
కూలివానిసేదతీర్చునాకవిత 
పట్టపగలు సిరివెన్నెల నాకవిత -
ముసలివానికి చేయూతనాకవిత 
విప్లవానికి విధాత నాకవిత 
పద్యంతో ప్రారంభమై -
ద్విపదగారూపుదిద్ది -
వచన,భావకవిత్వమంగామారి -
నగ్నకవిత్వమై -నానీలు,సున్నితాలు చిమ్నీలు -
రుబాయిలంటూ ర్పూపుదాల్చుకుని పరిగెత్తింది నాకవిత 
**************************
 ఇదినాస్వీయరచన 
 ✍️ భ రద్వాజ రావినూతల (RB)✏️
*************************

Friday, March 19, 2021

నవ యుగాది.

మనుమసిద్ధి కవన వేదికకు పంపినది.
15/03/2021.
శీర్షిక : నవ యుగాది.
ప్రక్రియ : వచన కవిత.

రచన:శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .


ఆకలి తీర్చలేని ఆధిపత్యపు అరాచకంలో
అన్నంపెట్టెే రైతు జీవితం అల్లకల్లోలమై
మానవత్వం మారణ హోమమైన క్షణం.
అసమానతల కొలిమిలో కాలుతున్న స్త్రీత్వం.
పాప పరిణామం కరోనాగై కాటేస్తుాంటే
తరిగిపోతున్న విలువలకు తన వంతుగా
ఆరు రుచుల ఔషధానికి , ప్రేమామృతాన్ని 
జోడించి రోగ విముక్తుల్ని చేయడానికి
వస్తోంది నవోదయ యుగాది కన్యక॥
--------------------------------------------------


Thursday, March 18, 2021

పుస్తకంలో నాకో పేజీ

18/3/2021.
శ్రీ శ్రీ కళా వేదిక వారి,
ప్రపంచ కవితా దినోత్సవ పోటీ కొరకు..

రచన:శ్రీమతి: పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర.
8097622021.

అంశం : పుస్తకంలో నాకో పేజీ...

మనసుకు, మనిషికి మధ్య కదలాడే 
భావ వ్యక్తీకరణకు మాధ్యమమై
జరిగే సంఘటనలకు సాక్షీ భుాతమై ,
జరిగిపోయిన గతపు జ్ఞాపకాల పడవకు
దారి చుాపే అక్షర చుక్కాని పుస్తకం .॥

చిన్న తనపు , వలపు తలపుల
చిలిపి భావాల ప్రేమ సందేశాలకు
పలకరింపు పరిమళం పుస్తకం.
అంతులేని ఆప్యాయతను పంచే
అమ్మ ఒడి జ్ఞాపకాలను అక్షరాల్లో
భద్రపరచిన , అనంద జ్ఞాపకం పుస్తకం.॥

తెలియని లోకాన్ని , వేద సారాన్ని ,
భరత చరితల త్యాగ నిరతిని
భద్రంగా నిక్షిప్తపరచి, భావి తరాల
భవ్య చరితలకు గట్టి పునాది వేస్తున్న
జ్ఞాన సంపదల గౌరవ పురస్కారం పుస్తకం.॥

నా లోని భావాలకు అక్షర సమర్పణ చేసి
నన్ను నాకు , పరిచయం చేస్తున్న ..
నవోదయ కాంతి కిరణం పుస్తకం .॥

అటువంటి పుస్తక పఠనంతో ,వికశించిన
నా మనో జ్ఞాన వికాశ సార భుామిలో,
సామాజిక హితానికై , కలం హలం తో,
సాహిత్యాక్ష సేద్యం చేయడానికి
నాకు కుాడా కావాలి , పుస్తకంలో ఒక పేజీ..



Wednesday, March 17, 2021

మరో కోణంలో మన యుగాది.

రచన:శ్రీమతి: పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
శీర్షిక : మరో కోణం లో,
మన ఉగాది.

ఉరుకుల పరుగుల జీవితంలో
వత్సరానికొకసారి వచ్చే యుగాది
తరతరాల సాంప్రదాయ సారాన్ని,
అరు ఱుచుల అమృతంతో కలిపి,
ఆరోగ్యానందాల ఓషధీ ఉపయొాగాల
వినియొాగాన్ని, ప్రకృతి సంపదల
విశిష్టతను తెలియజేస్తుా, పండగల పేరుతో చేసే పారిశుభ్రతల ప్రాశస్త్యాన్ని తెలుపుతుా,ఆనందామృతాన్ని పంచేది.
మారుతున్న మనస్తత్వాలకు 
మైల పడిన కాలం, మారణహోమాల్లో
దగ్ధమై , మరో చరిత్రను సృష్టించింది.
అంతరాలను మరచిన మనుషుల
స్వార్ధపు-వికటాట్టహాసాలకు ,
నిర్వీర్యమైన మానవత్వం , స్త్రీత్వం వలువల్ని వలిచి ,విలువలను కాలరాస్తుంటే , 
అబలలు  కార్చే కన్నీటి శాపం 
కరోనాగై కాటేస్తుంటే, 
విప్లవ భావాల వింతప్రపంచపు 
వరుస  కాష్టాల్లో  రోజుకో రుాపు ధరించి 
విహరిస్తుా  రోగాలపాలు చేస్తున్న-
 వింత కణానికి విరుగుడుగా 
ఈ సారి మరో కోణంలో మన ముందుకు 
మళ్ళీ వస్తోంది ,మరో చరిత రాసేందుకు  
ఉగాది కన్య.
మాస్క్ ధరించిన -మొాముతో , 
సానిటైజర్ల  బహుమతులతో...
అల్లం, మిరియాలు , ఏలకలు,లవంగాలు
పసుపు, తులసిల మిశ్రమామృత కలశంతో , ప్రేమామృతాన్ని పంచడానికి. 
మానవత్వపు "వాక్సిన్" ని మందుగా
మనకు ఎక్కించ్చేందుకు. పరిశుభ్రతనెరిగించే
పాఠ్య పుస్తకాలతో , ప్లవ నామ ధారిణిగా....

Tuesday, March 16, 2021

పెద్దబాలశిక్ష

ఈ మెసేజ్ మళ్ళా దొరకదు.. అరుదైన సమాచారం. దీనిని   తయారు  చేయడానికి  ఒక  రోజు  పట్టింది 
ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం.

 దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం

మూలలు :(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం

 వేదాలు :(1) ఋగ్వే దం, 
(2) యజుర్వేదం,(3) సామవేదం,
(4) అదర్వణ వేదం

 పురుషార్ధాలు :(1) ధర్మ, (2) అర్థ,
(3) కామ,(4) మోక్షా

 పంచభూతాలు :(1) గాలి, (2) నీరు,
(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని.

  పంచేంద్రియాలు : (1) కన్ను, 
(2) ముక్కు, (3) చెవి, (4) నాలుక,
(5) చర్మం.

 లలిత కళలు : (1) కవిత్వం,
(2) చిత్రలేఖనం, (3) నాట్యం,
(4) సంగీతం, (5) శిల్పం.

 పంచగంగలు : (1) గంగ, (2)  కృష్ణ,
(3) గోదావరి, (4) కావేరి, 
(5) తుంగభద్ర.

 దేవతావృక్షాలు : (1) మందారం, 
(2) పారిజాతం, (3) కల్పవృక్షం, 
(4) సంతానం, (5) హరిచందనం.

 పంచోపచారాలు : (1) స్నానం,
(2) పూజ,  (3) నైవేద్యం,
(4) ప్రదక్షిణం, )5) నమస్కారం.

  
పంచామృతాలు : (1) ఆవుపాలు,
(2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర, 
(5) తేనె.

 పంచలోహాలు : (1) బంగారం, 
(2) వెండి,  (3) రాగి,
(4) సీసం, (5) తగరం.

 పంచారామాలు : )1) అమరావతి,
(2) భీమవరం, (3) పాలకొల్లు,
(4) సామర్లకోట, (5) ద్రాక్షారామం

 షడ్రుచులు : (1) తీపి, (2) పులుపు, 
(3) చేదు, (4) వగరు, 
(5) కారం, (6) ఉప్పు.

అరిషడ్వర్గాలు  షడ్గుణాలు:(1) కామం, 
(2) క్రోధం, (3) లోభం, (4) మోహం,
(5) మదం, (6) మత్సరం.

ఋతువులు : (1) వసంత,(2) గ్రీష్మ,
(3) వర్ష, (4) శరద్ఋతువు, 
(5) హేమంత, (6) శిశిర

 సప్త ఋషులు : (1) కాశ్యపుడు,
(2) గౌతముడు,  (3) అత్రి,
(4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ,
(6) జమదగ్ని, (7) వశిష్ఠుడు.

తిరుపతి సప్తగిరులు : (1) శేషాద్రి,
(2) నీలాద్రి, (3) గరుడాద్రి, 
(4) అంజనాద్రి, (5) వృషభాద్రి, 
(6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి.

సప్త వ్యసనాలు : (1) జూదం,
(2) మద్యం, (3) దొంగతనం, 
(4) వేట, (5) వ్యభిచారం, 
(6) దుబారఖర్చు,
(7) కఠినంగా మాట్లాడటం.

 సప్త నదులు : (1) గంగ, 
(2) యమునా,  (3) సరస్వతి, 
(4) గోదావరి,  (5) సింధు,
(6) నర్మద,  (7) కావేరి.
            
నవధాన్యాలు : (1) గోధుమ,
(2) వడ్లు,  (3) పెసలు,
(4) శనగలు, (5) కందులు,
(6) నువ్వులు, (7) మినుములు, 
(8) ఉలవలు, (9) అలసందలు.

నవరత్నాలు : (1) ముత్యం, 
(2) పగడం, (3) గోమేధికం,
(4) వజ్రం, (5) కెంపు, (6) నీలం, 
(7) కనకపుష్యరాగం, 
(8) పచ్చ (మరకతం), 
(9) ఎరుపు (వైడూర్యం).

నవధాతువులు : (1) బంగారం,
(2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి, 
(5) ఇనుము, (6) కంచు,
(7) సీసం, (8) తగరం, 
(9) కాంతలోహం.

నవరసాలు : (1) హాస్యం,(2) శృంగార, 
(3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర, 
(6) భయానక, (7) బీభత్స, 
(8) అద్భుత, (9) వీర

నవదుర్గలు : (1) శైలపుత్రి, 
(2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట,
(4) కూష్మాండ, (5) స్కందమాత, 
(6) కాత్యాయని, (7) కాళరాత్రి, 
(8) మహాగౌరి, (9) సిద్ధిధాత్రి.

 దశ సంస్కారాలు : (1 ) వివాహం, 
( 2 ) గర్భాదానం, (3 ) పుంసవనం , 
(4 ) సీమంతం, (5) జాతకకర్మ, 
(6 ) నామకరణం, (7) అన్నప్రాశనం, 
(8 ) చూడకర్మ, (9 ) ఉపనయనం, 
(10) సమవర్తనం

దశావతారాలు : (1) మత్స్య,
(2) కూర్మ, (3 ) వరాహ,
(4) నరసింహ, (5) వామన, 
(6) పరశురామ, (7) శ్రీరామ,
(8) శ్రీకృష్ణ, (9) బుద్ధ, (10) కల్కి.

జ్యోతిర్లింగాలు :

హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .

కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .

మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)

గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)

మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)

ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం) 

తమిళనాడు ~ రామలింగేశ్వరం
 
తెలుగు వారాలు : (1) ఆది, (2) సోమ, 
(3) మంగళ, (4) బుధ, (5) గురు, 
(6) శుక్ర, (7) శని.

తెలుగు నెలలు : (1) చైత్రం,
(2) వైశాఖం,(3) జ్యేష్ఠం,(4) ఆషాఢం, 
(5) శ్రావణం, (6) భాద్రపదం, 
(7) ఆశ్వీయుజం, (8) కార్తీకం, 
(9) మార్గశిరం, (10) పుష్యం, 
(11) మాఘం, (12) ఫాల్గుణం.

 రాశులు : (1) మేషం,(2) వృషభం, 
(3) మిథునం, (4) కర్కాటకం,
(5) సింహం, (6) కన్య, (7) తుల, 
(8) వృశ్చికం, (9) ధనస్సు, 
(10) మకరం, (11) కుంభం, 
(12) మీనం.

తిథులు : (1) పాఢ్యమి, (2) విధియ, 
(3) తదియ, (4) చవితి,(5) పంచమి, 
(6) షష్ఠి, (7) సప్తమి, (8) అష్టమి, 
(9) నవమి, (10) దశమి,(11) ఏకాదశి, 
(12) ద్వాదశి, (13) త్రయోదశి, 
(14) చతుర్దశి, 
(15) అమావాస్య /పౌర్ణమి.

నక్షత్రాలు : (1) అశ్విని, (2) భరణి, 
(3) కృత్తిక, (4) రోహిణి, (5) మృగశిర, 
(6) ఆరుద్ర, (7) పునర్వసు, 
(8) పుష్యమి, (9) ఆశ్లేష, (10) మఖ, 
(11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త, 
(14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ, 
(17) అనురాధ, (18) జ్యేష్ఠ, 
(19) మూల, (20) పూర్వాషాఢ, 
(21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం, 
(23) ధనిష్ఠ, (24) శతభిషం, 
(25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర, 
(27) రేవతి.

తెలుగు సంవత్సరాల పేర్లు :
(1) ప్రభవ :-
1927, 1987, 2047, 2107

(2) విభవ :- 
1928, 1988, 2048, 2108

(3) శుక్ల :-
1929, 1989, 2049, 2109

( 4 ) ప్రమోదూత :-
1930, 1990, 2050, 2110

( 5 ) ప్రజోత్పత్తి :-
1931, 1991, 2051, 2111

( 6 ) అంగీరస :- 
1932, 1992, 2052, 2112

( 7 ) శ్రీముఖ :-
1933, 1993, 2053, 2113

( 8 )భావ. - 
1934, 1994, 2054, 2114

9యువ.  - 
1935, 1995, 2055, 2115

10.ధాత.  - 
1936, 1996, 2056, 2116

11.ఈశ్వర. - 
1937, 1997, 2057, 2117

12.బహుధాన్య.-
1938, 1998, 2058, 2118

13.ప్రమాది. - 
1939, 1999, 2059, 2119

14.విక్రమ. - 
1940, 2000, 2060, 2120

15.వృష.-
1941, 2001, 2061, 2121

16.చిత్రభాను. - 
1942, 2002, 2062, 2122

17.స్వభాను. - 
1943, 2003, 2063, 2123

18.తారణ. - 
1944, 2004, 2064, 2124

19.పార్థివ. - 
1945, 2005, 2065, 2125

20.వ్యయ.-
1946, 2006, 2066, 2126

21.సర్వజిత్తు. - 
1947, 2007, 2067, 2127

22.సర్వదారి. - 
1948, 2008, 2068, 2128

23.విరోధి. - 
1949, 2009, 2069, 2129

24.వికృతి. - 
1950, 2010, 2070, 2130

25.ఖర. 
1951, 2011, 2071, 2131

26.నందన.
1952, 2012, 2072, 2132

27 విజయ.
1953, 2013, 2073, 2133,

28.జయ. 
1954, 2014, 2074, 2134

29.మన్మద.
1955, 2015, 2075 , 2135

30.దుర్మిఖి. 
1956, 2016, 2076, 2136

31.హేవళంబి. 
1957, 2017, 2077, 2137

32.విళంబి. 
1958, 2018, 2078, 2138

33.వికారి.
1959, 2019, 2079, 2139

34.శార్వారి. 
1960, 2020, 2080, 2140

35.ప్లవ
1961, 2021, 2081, 2141

36.శుభకృత్. 
1962, 2022, 2082, 2142

37.శోభకృత్. 
1963, 2023, 2083, 2143

38. క్రోది.
1964, 2024, 2084, 2144, 

39.విశ్వావసు.
1965, 2025, 2085, 2145

40.పరాభవ.
1966, 2026, 2086, 2146

41.ప్లవంగ. 
1967, 2027, 2087, 2147

42.కీలక. 
1968, 2028, 2088, 2148

43.సౌమ్య. 
1969, 2029, 2089, 2149

44.సాధారణ . 
1970, 2030, 2090, 2150

45.విరోధికృత్. 
1971, 2031, 2091, 2151

46.పరీదావి. 
1972, 2032, 2092, 2152

47.ప్రమాది. 
1973, 2033, 2093, 2153

48.ఆనంద. 
1974, 2034, 2094, 2154

49.రాక్షస. 
1975, 2035, 2095, 2155

50.నల :-
1976, 2036, 2096, 2156, 

51.పింగళ                 
1977, 2037, 2097, 2157

52.కాళయుక్తి         
1978, 2038, 2098, 2158

53.సిద్ధార్ధి              
1979, 2039, 2099, 2159

54.రౌద్రి                 
1980, 2040, 2100, 2160

55.దుర్మతి              
1981, 2041, 2101, 2161

56.దుందుభి             
1982, 2042, 2102, 2162

57.రుదిరోద్గారి         
1983, 2043, 2103, 2163

58.రక్తాక్షి                 
1984, 2044, 2104, 2164

59.క్రోదన                  
1985, 2045, 2105, 216

60.అక్షయ              
1986, 2046, 2106, 2166.

ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం.... 
నమస్కారం

Monday, March 15, 2021

నవ యుగాది ( ప్లవనామం)

మనుమసిద్ధి కవన వేదిక
15 /03/2021

రచన:శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
శీర్షిక : నవ యుగాది.
ప్రక్రియ : వచన కవిత.

కరోనాతో  భారమైన బ్రతుకు చిత్రం.
కాలకుాట విషనాగులైన ,కర్తవ్య పాలకులు ,
మారుతున్న మనస్తత్వాల మారణ హోమం.
స్వార్ధ పుారితమైన ఆలోచనలతో మనిషి-
తప్పు దారి పడుతున్న సమయంలో
సాంప్రదాయాల విలువలు నిండిన కలశంతో
ఆరు రుచుల ఆరోగ్యానికి , ఏడవ
రుచిగా మానవత్వమనే అమృతాన్ని కలిపి
చిరునవ్వులు వెదజల్లెేందుకు వస్తోంది
నవోదయ కాంతికిరణమై నవ యుగాది .॥
----------------------------------------------------
హామీ :
"నవ యుగాది" శీర్షిక గల ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.

Saturday, March 13, 2021

ముత్యాల సరాలు కొత్త ప్రక్రియ

🌺 🌺 మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం 🌺🌺
🌹ప్రతి రోజూ కవితా పండుగే🌹

పర్యవేక్షణ: డా౹౹అడిగొప్పుల సదయ్యగారు
నిర్వహన:శ్రీ కుందారపు గురుమూర్తి
తేదీ:13/03/2021(శనివారం)
కవి పేరు:
ఊరు:
కవితా సంఖ్య:
నేటిఅంశం: ఐచ్ఛికము

నేటిప్రక్రియ: ముత్యాల సరాలు

కవి మిత్రులు వారికి ఇష్టమైన ఏ అంశంలో నైనను ముత్యాల సరాలు గేయము అల్లవలెను

సమయం:ఉదయం 9-00గం౹౹ల నుండి రాత్రి 10-00 గం౹౹ల వరకు
ఫలితాల వెల్లడి:మరుసటిరోజు ఉదయం 11-00గంటలకు

నియమములు::
1. కవిత ముత్యాల సరాలు గేయ ప్రక్రియలోనె ఉండాలి.
2. అర్థవంతంగా ఉండాలి. ఏకాంశమును స్వీకరించాలి
3.కనీసం మూడు గేయ భాగాలను ఏకాంశముగా రాయాలి.
4.సవరణ కోరిన గేయ భాగములను తప్పక సవరించి మరలా పంపవలెను
5.లక్షణాలను చదువుకొని గేయమును రాయవలెను
6.పునరుక్తి దోషముండరాదు అనగా ఒకే పదమును అదే అర్థములో పదే పదే వాడరాదు.
7.సూచనలు సహృదయముతో స్వీకరించగలరు.

  ముత్యాల సరాలు గేయం లక్షణాలు:

1. నాలుగు పాదాలు ఉంటాయి

2. మొదటి మూడు పాదాలలో ప్రతి పాదం నందు వరుసగా 3+4,3+4 చొప్పున మొత్తం 14 మాత్రలు ఉండాలి
3. 4వ పాదంలో 7 నుండి 14 మాత్రలు ఉండవచ్చు


ఉదా:1
3   +    4    +      3  +  4 =14
UI     U I   I    U   I   I   I U
పాడి పంటలు పొంగి పొరలే
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితె కండ కలదోయ్

3 +      4  +   3  +    4 =14
U  I   I I  U U I    I   I   U
కండ కలవాడేను మనిషోయ్

ఉదా:2
గుత్తునా ముత్యాల సరములు
కూర్చుకొని తేటైన మాటల
క్రొత్త పాతల మేలు కలయిక

 3+.       4  +.      5    =12
U  I    U   I   I    U I   U
క్రొమ్మెఱుంగులు చిమ్మగా

U= గురువు 2 మాత్రలు
I=లఘువు 1 మాత్ర   గా లెక్కించవలెను

మరిన్ని ఉదాహరణలకోసం శ్రీ గురజాడ అప్పారావు గారి ముత్యాల సరాలు పుస్తకమును పరిశీలించగలరు.



!!గమనిక!!
పర్యవేక్షకులు డా౹౹అడిగొప్పుల సదయ్యగారు, శ్రీమతి శైలజా మేడం గారి అధ్వర్యంలో అందమైన ప్రశంసా పత్రము ప్రదానం చేయబడును.