రచన, శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
తీరొక్కపుాలతో ఉయ్యాలో
అలరేటి బతుకమ్మ ఉయ్యాలో
వేవేల జేలతో ఉయ్యాలో
ఊరేగీ నావమ్మ ఉయ్యాలో
శ్రీగౌరివై నీవు ఉయ్యాలో
సిరులు పంచాలమ్మ ఉయ్యాలో
అమ్మలక్కల గావు ఉయ్యాలో
అమ్మవై రావాలి ఉయ్యాలో
తంగేడు పుాలల్లి ఉయ్యాలో
తామరలు జడనల్లి ఉయ్యాలో
తలనిండ చుట్టేము ఉయ్యాలో
మెడనిండు భరణాలు ఉయ్యాలో
బతుకమ్మ పాటలతొ ఉయ్యాలో
నిను గొల్చినామమ్మ ఉయ్యాలో
బతుకు నీదీవెనతొ ఉయ్యాలో
బలమొంద మాయమ్మ ఉయ్యాలో ॥
గణపతీ రాయనికీ ఉయ్యాలో
అమ్మవ వీవేగా ఉయ్యాలో
కైలాస వాసునీ ఉయ్యాలో
అర్ధాంగి నీవమ్మ ఉయ్యాలో
తొమ్మది రుపులతో ఉయ్యాలో
తోడు నిలువగనీవు ఉయ్యాలో
అస్త్ర శస్త్రాలతో ఉయ్యాలో
అలరి వచ్చితివీవు ఉయ్యాలో
శ్రీచక్ర రాజమున ఉయ్యాలో
స్థిరముగా నిలిచేవు. ఉయ్యాలో
శ్రీ దుర్గ రుాపమున ఉయ్యాలో
దుష్టులను దునిమేవు.ఉయ్యాలో
కులుకు కోమలకలికి ఉయ్యాలో
కురుయంగ సిరులింట ఉయ్యాలో
నిలుపంగ రావెలికి ఉయ్యాలో
కులదైవమై ఇంట ఉయ్యాలో
నీరాజనాలు నీకు ఉయ్యాలో
నిత్య కల్యాణివీ ఉయ్యాలో
మారాజ్ఞి నీవమ్మ ఉయ్యాలో
బోనాల బతుకమ్మ ఉయ్యాలో
--------------------------
శీర్షిక : నవరాత్రుల బతుకమ్మ .
రచన, శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
తీరొక్క పుాలతో తిరునాళ్లనలరేవుా
బంగారు బతుకమ్మ జేలంది వెలసేవు
మాపల్లె గావంగ మముసల్లగ చుాడంగా
మముబ్రోవ వచ్చేవు మా మదిలో నిలచేవు॥
శ్రీగౌరివై నీవు సిరులెన్నో పంచేవు.
అ్మలక్కల గాచే అమ్మవై నిలిచేవు
ఆదిపరాశక్తి అడ్డంకులు తొలగించీ
ఆడబ్రతుకునాదిశక్తి రుాపుగా మార్చేవు ॥
తంగేడు పుాలల్లి తలనిండ చుట్టేము
తామరలు జడనల్లి సింగారించేముా ॥
బతుకమ్మ పాటలతొ నిను ప్రీతి కొలిచేముా
నీ దీవెనలందాలని నీముందుా నిలిచేము ॥
కైలాసవాసునీ అర్ధాంగివి నీవమ్మ ॥
గణపతీ రాయనికీ అమ్మవు మాయమ్మ
నవరాత్రుల సందడులా నవ్వేమాయమ్మా
నట్టింటా వెలయంగా నా ఇంటికి రావమ్మా॥
తొమ్మది రుపాలతో తొలి పుాజలందేవు
తోడునీడగ నిలచి మాకభయమిచ్చేవు
ఏటేటా వస్తావు ఏలికవై మసలుతావు
కష్టాలు కన్నీళ్ళుా కడతేర్చి పోతావు ॥
శ్రీ చక్ర రాజమున స్థిరముగా నిలిచేవు.
శ్రీ దుర్గా రుాపిణివై దుష్టులను దునిమేవు.॥
కులుకు కోమల కలికి సిరిపంటల కురిసేవు
కులదైవమ ఇంటింటా నీరుాపు నిలిపేవు ॥
వేలపుాల వెలిసేవుా వేడుకలా బతుకమ్మా
మహాలమావాస్య నాడు ఎంగిలి బతుకమ్మా
బియ్యం నుాక,నువ్వుల వంట వేద్యమందేవమ్మా
బోనమిడగ బోగమంది మమ్ము బ్రోచినావమ్మా॥
ఆశ్వీయుజ పాడ్యమిని అటుకుల బతుకమ్మ
పప్పుా బెల్లాల ముాట సప్పిడందుకోవమ్మా.
ముాడవరోజు ముద్దపప్పు మా ముద్దులగుమ్మ
బెల్లంపాలు తాగి మమ్ము పాలించ రావమ్మా ॥
నాల్గవ రోజు నాతల్లి నానుబియ్యం బతుకమ్మ :
వేద్యంగా నానేసిన బియ్యమందుకోమ్మా
ఐదవరోజు అలంకరణలందుకోమ్మ బతుకమ్మ
అట్లు పోసి వేద్యమిడెద అట్ల వేడ్క బతుకమ్మ ॥..
పంచమి నాడు పాపల్లే అలిగితి వేమమ్మా
వేద్య మిడగ తినరావు కోపమేలనమ్మా
వెల వెలా బోయావు వేపకాయల కొమ్మా
వేయించిన పిండితోడ వేద్యమిడెద బతుకమ్మా॥
నెయ్యిపోసి బెల్లమేసి నువ్వుండల వేద్యమమ్మ
వేంచేయవమ్మా వెన్న ముద్దల గుమ్మా :
దుర్గాష్టమి దుర్గమ్మా సద్దుల మా బ్రతుకమ్మా
రకమొక్కటి వేద్యాలిడి సాగనంపుతామమ్మా ॥
నీరాజనాలమ్మ నిత్య కల్యాణికీ
నిమ్మపళ్ళు, బొనాలుా, నీరద ఘన తేజకీ
మా రాజ్ఞి నీవమ్మ కరుణింవె బ్రతుకమ్మాు
ఆటలాడి పాటపాడి అనందం పొందేమమ్మా ॥
--------------------------
రచన, శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021
శీర్షిక : మమ్మేలు బతుకమ్మ
ప్రక్రియ : సున్నితం.
మాపల్లె బతుకమ్మకు స్వాగతాలు
ఇంటింటా తోరణాలు, రంగవల్లులుా
బతుకమ్మ సంబరాలె జీవితాలు
చూడ చక్కని తెలుగు సున్నితంబు॥
కాయకష్టమే జీవము కనికరించు
అన్యాయపు ఆక్రమణల కాగ్రహించు
నిను నమ్మినారము నిగ్రహించు
చూడ చక్కని తెలుగు సున్నితంబు॥
ఎంగిలీ బతుకమ్మ పుాలైపుాసే
అటుకుల బతుకమ్మ ఆటలాడే
ముద్దపప్పు మాయమ్మ ముద్దుాగురిసే
చూడ చక్కని తెలుగు సున్నితంబు॥
నానుబియ్యం బతుకమ్మ నాట్యమాడే
అట్లనోము బతుకమ్మ అలిగీపోయే॥
వేపకాయ బతుకమ్మ వెతలుదీర్చే
చూడ చక్కని తెలుగు సున్నితంబు॥
సద్దులా బతుమ్మ సందడించే
వెన్నముద్ద బతుకమ్మ వేడుకజేసే
సరదాలుా సందడులు పండగజేసే ॥
చూడ చక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ
ఈ సున్నితాలు ఏమాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచనలు.
చుాడాచక్కని తెలుగు సున్నితమ్ము
తెలుగునాట పండగలే సంబరమ్ము
బతుకమ్మ తెలంగాణ గౌరవమ్ము.
ఏటికొక్కసారి వచ్చు రంగుపుాపరిమళం ॥
కోటి కలువలా రాసి చల్లన్ని మాతల్లి
ఆటపాటలు మెచ్చు అందాలమల్లి
బతుకమ్మా రాకతొ మురిసింది మాపల్లె
ఇంటింటా బోనాలా సంబరాలె తుళ్ళే ॥ చుాడా..॥
తంగేడు వనమూలో తారసిల్లేను
గునుగుపుా హారాలు మెడనునిండేను
గుమ్మడీపుావల్లే మేనుా మెరిసేనుా
చుాడచక్కని తల్లీ సింగారించేనుా ॥ చుాడా ॥
పసుపుముద్దగ వెలసె బొడ్డెమ్మా
బోనాల భోగాలకు మురిసేనమ్మా
మనకిచ్చే భాగ్యాలు బంగారుబతుకమ్మా
చూడ చక్కని తెలుగు సున్నితంబు॥
బొడ్డెమ్మకు బోనాలిడ భక్తితోమేముా
గుమ్మడీ పుాలతో గుడికెళ్ళినాముా
తంగేడుా పుాలతో నదె కొలచినాముా
చుాడచక్కని తెలుగు సున్నిమ్మా ॥ ॥
నమస్కారం . నా పేరు పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ మహారాష్ట్ర లో ఉంటాను.
సాహితీ బృందావన జాతీయ వేదిక ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడియో పాటల పోటీలు జరుగుతున్న సందర్భంగా నేను స్వయంగా రచించి స్వర కల్పన చేసిన బతుకమ్మ పాటను పాడి మీకు వినిపిస్తాను.
ఆదరించి ఆశీర్వదించ ప్రార్ధన.
కొత్త ప్రక్రియ "సున్నితం "
రుాపకర్త గౌరవనీయులు శ్రీ నెక్లుట్ల సునీతగారు.
వారి ప్రక్రియలో మకుటంగా వాడబడుతున్న
చుాడచక్కని తెలుగు సున్నితంబు అనే పాదాన్ని
ప్లవిగా తీసుకొని పాడన ఈ పాటకు మీ అందరి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నసను.
పాట శీర్షిక సున్నితమ్ము బతుకమ్మ
హామీ
ఈ సున్నితాలు ఏమాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచనలు.
చుాడాచక్కని తెలుగు సున్నితమ్ము
తెలుగునాట సంస్కృతీ సాంప్రదాయము
బతుకమ్మ తెలంగాణ గౌరవమ్ము.
ఏటికొక్కసారి వచ్చు బోనాల సంబరమ్ము ॥
తంగేడు వనమూలో తారసిల్లేను
గునుగుపుా హారాలు మెడనునిండేను
గుమ్మడీపుావల్లే మేనుా మెరిసేనుా
చుాడచక్కని తల్లీ సింగారమొలికేను ॥ చుాడా ॥
కోటి కలువలా రాసి చల్లన్ని మాతల్లి
ఆటపాటలు మెచ్చు అందాలమల్లి
బతుకమ్మా రాకతొ మురిసింది మాపల్లె
ఇంటింటా బోనాలా సందళ్ళే మళ్ళీ మళ్ళీ ॥ చుాడా..॥
పసుపుముద్దగ వెలసె పడతీబొడ్డెమ్మా
బోనాల భోగాలకు మురిసేమాయమ్మా
మనకిచ్చే భాగ్యాలు బంగారుబతుకమ్మా
చూడ చక్కని తెలుగు సున్నితమొా బతుకమ్మ ॥చు
బొడ్డెమ్మకు బోనాలిడ భక్తితోమేముా
గుమ్మడీ పుాలతో గుడికెళ్ళినాముా
తంగేడుా పుాలతో తలచీ కొలచినాముా
మేలైన హారతులిడి మెప్పించీ వచ్చేము ॥చుాడా
ఆడింది పాడింది మాతోడి బతుకమ్మ
ఆదరించి అభయాలిడి నవ్వే వలపుల కొమ్మ
సందడులకు సంతసించె సద్దుల గౌరమ్మా
వచ్చేటికి వత్తునని మరలే మాయమ్మ ॥
సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రక్రియ: సున్నితం
రూపకర్త:: నెల్లుట్ల సునీతగారు
తేదీ:: 10-10-2021
వారం: ఆదివారం
ఈవారం ఇచ్చిన అంశం: బతుకమ్మ.
రచన, శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
శీర్షిక : మాయింటి ఇలవేప్పువమ్మా బతుకమ్మా..
146.
బొడ్డెమ్మకు బోనాలిడ భక్తితోమేముా
గుమ్మడీ పుాలతో గుడికెళ్ళినాముా
తంగేడుా పుాలతో కొలచినాముా
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
147.
తంగేడు వనమూలో తారసిల్లేను
గునుగుపుా హారాలు మెడనునిండేను
గుమ్మడీపుావల్లే మేనుా మెరిసేనుా
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
148.
కోటి కలువలరాసి చల్లన్నితల్లి
ఆటపాటలు మెచ్చు అందాలమల్లి
బతుకమ్మ నీరాకతొ మురిసిందిపల్లె॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
149.
పసుపుముద్దగ వెలసె బొడ్డెమ్మా
బోనాల భోగాలకు మురిసేనమ్మా
మనకిచ్చే భాగ్యాలు బంగారుబతుకమ్మా
చూడ చక్కని తెలుగు సున్నితంబు॥
150.
ప్రతిఇంటా వెలసేను తల్లిరుాపు
పుాబాలై ఆడేమా కంటివెలుగు
నవదుర్గల అవతారిణి పల్లెకాపుా
చూడ చక్కని తెలుగు సున్నితంబు॥
హామీ
ఈ సున్నితాలు ఏమాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచనలు.
చుాడాచక్కని తెలుగు సున్నితమ్ము
తెలుగునాట పండగలే సంబరమ్ము
బతుకమ్మ తెలంగాణ గౌరవమ్ము.
ఏటికొక్కసారి వచ్చు రంగుపుాపరిమళం ॥
కోటి కలువలా రాసి చల్లన్ని మాతల్లి
ఆటపాటలు మెచ్చు అందాలమల్లి
బతుకమ్మా రాకతొ మురిసింది మాపల్లె
ఇంటింటా బోనాలా సంబరాలె తుళ్ళే ॥ చుాడా..॥
తంగేడు వనమూలో తారసిల్లేను
గునుగుపుా హారాలు మెడనునిండేను
గుమ్మడీపుావల్లే మేనుా మెరిసేనుా
చుాడచక్కని తల్లీ సింగారించేనుా ॥ చుాడా ॥
పసుపుముద్దగ వెలసె బొడ్డెమ్మా
బోనాల భోగాలకు మురిసేనమ్మా
మనకిచ్చే భాగ్యాలు బంగారుబతుకమ్మా
చూడ చక్కని తెలుగు సున్నితంబు॥
బొడ్డెమ్మకు బోనాలిడ భక్తితోమేముా
గుమ్మడీ పుాలతో గుడికెళ్ళినాముా
తంగేడుా పుాలతో నదె కొలచినాముా
చుాడచక్కని తెలుగు సున్నిమ్మా ॥ ॥
బాలవికాస ఇంటర్నేషనల్ సంస్థ వారి ఆధ్వర్యంలో
అంశం :వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యలు--- సమాజంలో రావాల్సిన మార్పు.
శీర్షిక : ఆలోచనల్లో మార్పు రావాలి.
రచన శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్..మహరాష్ట్ర .
8097622021.
నాగరికత సమాజంలో గొడ్డలిపెట్లు.
వివక్షతలు నిండిన మనస్తత్వాలు.
స్త్రీల స్వాతంత్ర్యానికి అవరోధాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
ఆనందంకోసం అమానుష చర్యలు
సభ్యసమాజంలో అసభ్య కలాపాలు
మహిళలు ఎదుర్కొనే అవమానాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
కట్టుబాట్ల పేరుతో కట్టడి
దౌర్భాగ్యకరమైన వితంతు పరిస్థితి
గౌరవమర్యాదలు కరువైన స్థితి
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
వితంతు ఎదురుపడితే అపశకునం.
వివాహాది శుభకార్యాలకు నిషేదం
మనోభావాలను గాయపరచే సమాజం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
శారీరిక బలహీనతలు శాపం.
లైంగిక వేధింపులతో పురుషాధిపత్యం
ఆత్మస్థైర్యం కోల్పోయిన మహిళలనేకం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ:
నేను రాసిన ఈ సున్నితాలు ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచనలు.
అంశం :మన సంస్కృతి సాంప్రదాయాలు
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : గౌరవనీయులు, నెల్లుట్ల సునీతగారు
.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్: మహారాష్ట్ర .
శీర్షిక : అమృత కలశాలు
మన సంస్కృతి సాంప్రదాయాలు
విజ్ఞాన పరమైన విధానాలు
జీవితానికి వెలుగు బాటలు
చుాడచక్కని తెలుగు సున్నతంబు.॥
సమయపాలనతో అరోగ్యపు అలవాట్లు
శాస్త్ర సమ్మతమైన సాధనాలు
ఆరోగ్య, జీవనానికి సోపానాలు.
చుాడచక్కని తెలుగు సున్నతంబు.॥
నిత్యం సుార్య నమస్కారాలు
శారీరిక వ్యాయామానికి సుాత్రాలు
మానసిక యొాగార్ధం పుాజా-పునస్కారాలు
చుాడచక్కని తెలుగు సున్నతంబు.॥
తగుమొాతాదులో అహారపు అలవాట్లు
సాత్విక ఆహారపు రుచులు
సమతుల్య శక్తిరసాల సారాలు
చుాడచక్కని తెలుగు సున్నతంబు.॥
నియమ నిబద్ధతల నిత్యకర్మలు
శారీరిక ధృడత్వానికి పెట్టుబడులు.
సదాచారాలు జీవామృత కలశాలు
చుాడచక్కని తెలుగు సున్నతంబు.॥
హామీ:
ఈ సున్నితాలు ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని
నా స్వీయ రచనలు.
బాలవికాస ఇంటర్నేషనల్ సంస్థ వారి ఆధ్వర్యంలో
అంశం :వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యలు--- సమాజంలో రావాల్సిన మార్పు.
శీర్షిక : ఆలోచనల్లో మార్పు రావాలి.
రచన శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్..మహరాష్ట్ర .
8097622021.
నాగరికత సమాజంలో గొడ్డలిపెట్లు.
వివక్షతలు నిండిన మనస్తత్వాలు.
స్త్రీల స్వాతంత్ర్యానికి అవరోధాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
ఆనందంకోసం అమానుష చర్యలు
సభ్యసమాజంలో అసభ్య కలాపాలు
మహిళలు ఎదుర్కొనే అవమానాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
కట్టుబాట్ల పేరుతో కట్టడి
దౌర్భాగ్యకరమైన వితంతు పరిస్థితి
గౌరవమర్యాదలు కరువైన స్థితి
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
వితంతు ఎదురుపడితే అపశకునం.
వివాహాది శుభకార్యాలకు నిషేదం
మనోభావాలను గాయపరచే సమాజం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
శారీరిక బలహీనతలు శాపం.
లైంగిక వేధింపులతో పురుషాధిపత్యం
ఆత్మస్థైర్యం కోల్పోయిన మహిళలనేకం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ:
నేను రాసిన ఈ సున్నితాలు ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచనలు.
అంశం : రాకాసి రాజ్యంలో రాలిపోతున్న అబలలు.
రచన శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్..మహరాష్ట్ర . 8097622021.
శీర్షిక : మారుతున్న సమాజం .
నేటిసమాజంలో మసిబారిన సాంప్రదాయాలు
మనుషుల్లో పెరుగుతున్న అసమానతలు
భాషలో అపసవ్య పదజాలాలు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
పురుషాధిక్యత నిండిన రాక్షసకృత్యాలు
వావి-వరుసలు మరచిన పశుప్రవర్తనలు
ఆత్మరక్షణలేని అబలల ఆక్రోశాలు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
కామం నిండిన కర్కశమనస్తత్వాలు
ఆడపిల్లల పాలిటి క్రుారశాపాలు
పైశాచికంగా నలిగిపోతున్న పసిప్రాణాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
రాక్షసత్వానికి మద్దతునిస్తున్న రాజ్యాంగాలు
కళ్ళు ముాసుకుంటున్న న్యాయవ్యవస్థలు.
రక్షణలేక బలౌతున్న ఆడబిడ్డలు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
మట్టికొట్టుకుపోతున్న మహిళారక్షణ కేంద్రాలు
అసమానతల వ్యవస్థలో లోపభుాయిష్టాలు.
స్త్రీలబ్రతుకుల్లో నిండిన శోకసంతాపాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
హామీ:
నేను రాసిన ఈ సున్నితాలు ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచనలు.