Sunday, October 27, 2019

సీతమ్మ మాయమ్మ. ( డొక్కా సీతమ్మ ).


శీర్షిక .

డొక్కా సిీతమ్మ.

----------------------

అనుపిండి  శంకరుని అర్ధాంగి నరసమ్మ
ఆ దంపతుల ముద్దు బిడ్డ సీతమ్మ..!
రామచంద్రాపురపు రాగాల పుార్ణమ్మ
మండపేటకు మల్లి  ఆ పుాల రెమ్మా..।॥

తల్లిదండ్రులులే గురువులందాల కొమ్మకుా
కధలు, పాటల , పద్య కళలు  దేలా...
సంప్రదాయపు రీతి , సద్ధర్మ నిరతి నదె
"వస"గ పోయగ వారు , వర్ధిల్లె సీత..॥

పిన్న వయసునె   వేగ స్వర్గస్థురాలాయె.
చిన్నదానీ  తల్లి   చింతగాదే...
పెద్దరికమును బుాని చేసెడిది పనులన్ని
బద్ధురాలై మెలగె బాల్యమందు  ॥

సర్వ గుణ సంపన్న నిరతాన్న దానగుణ-
ఘన సాంద్ర కరుణ- మయి అమ్మ సీతమ్మ ॥

ఏ యేటికాయేడు  ఉప్పొంగ గోదారి
దాపురించెడిదంట , వరద..కరువు ..
లేదనక నందరికి అన్నమెట్టెడిదంట
అన్నపుార్ణగ  తాను అమ్మ సీత ॥

వేద పండితుడతడు , ఎనలేని ధనవంతు-
డాతడొక పేరున్న   పెద్ద రైతు ,
గోదావరీ తీర...గన్నవరపుా వాసి
ఇంటి పేరదె ""డొక్కా "" జోగన్న ఘనుడుా ॥

వేద చర్చకు బోయి , వెరసి వరదలొ జిక్కి
ఆకలోపగ లేక అలమటించీ..
నరసమ్మ దంపతుల  దాన నిరతిని యెరిగి॥
వెరువకను చనిరంట ఆతిధ్యమునకు ।॥

అతిధి దేవునిగాంచి ఆ పుణ్య దంపతులు
ఆతిధ్యమొసగిరిీ ఆనందమొలుకా...
అతధి మర్యాదలకు లోటు రానీయకా
అన్ని విధులను గుార్చె నతివ సీతమ్మా ॥

మొదటి జుాపులోనె ముదమంది వలచెనదె
ముదిత సీతనుజుాచి మొాహ మలర
పెద్దలాశీర్వచన శోభలతొ జంటగా
మెట్టినింటికి జేరె డొక్కా- సీతమ్మా ॥

ఆదర్శ  దంపతులు గా  పేరుగాంచిరీ...
ఆప్యాయ-తాదరణ  నిధుల పంచీ..
అతిధి మర్యాదలా తేలియాడుచు , మేలు-
నిత్యాన్నదానమును నెరపి వారు.॥

సత్య నియమ ముగాను
నిత్య భోజన కర్మ..
యజ్ఞముగ చేసిరా
పుణ్య దంపతులు ॥

నిరతాన్నధాత్రిగా పేరు గాంచెను తల్లి
మాత్రు ప్రేమను పంచు మానినీ శ్రీ
"అన్నపుర్ణ "ను పేరు సార్ధకము జేసుకొనె
దాత డొక్కా సీత ధరణిలోనా॥

మనిషిగా తన జన్మ  సార్ధకమ్మాయెగా
డొక్కావా-రింటిపే-రామెనిలిపే...
పాఠ్యాంశములయందు, గ్రంధ చరితగ నిలచి
ఇలలోన  తన కీర్తి వెలుగు నింపే ॥

ఆమెనెరుగని వారు ఈ ధరణిలో లేరు
కీర్తి శిఖరములేలు పుణ్య చరితా...॥

నీకు నీవే సాటిగా...కీర్తు లేలేవు
జేలు తల్లీ నీకు జనని సీతమ్మా ॥

డొక్కా సీతమ్మ గారికి ' గౌరవ వందనములతో.....🙏🙏

రచన, శ్రీమతి,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-------------------------------------------------



















Thursday, October 24, 2019

తొలిప్రేమ.

కాలేజీ ప్రంగణం అంతా గోల గోలగా ఉన్నాది. గర్ల్స్..బోయ్స్  ..అందరుా ఒకరొకొకరు వీడికోలు
చెప్పుకుంటుా కంటతడి పెట్టుకుంటున్నారు. ఆఖరుసారిగా విడిపోతున్నారంతా...

సంవత్సరానికి -
ఒకసారైనా ఇదే కాలేజీలో  అందరుా  తప్పక  కలవాలని,
ఏ  రోజు కలవాలి  -అన్నది డిసైడ్ చేసుకొని , వాట్సప్ లో
మెసేజ్ లు పెట్టుకుందామని...కన్నీటి  బాసల కౌగిలింతలు చేసుకుంటున్నారు.

వీరందరికీ  దుారంగా , ఒక ముాలగా ఉన్న చెట్టు కింద
నిల్చోని ఉన్న  ప్రియంవద  కళ్ళు మాత్రం ,  రాహుల్ కోసం వెతుకుతుా ఉన్నాయి.
రాహుల్ , ప్రియంవద  ఒకే కాలేజీలొ చదువుతున్నారు.
కానీ సెక్షన్స్ వేరు. 

ఇప్పటి వరకు  వారిద్దరుా ఒకరితో
ఒకరు  ఎప్పుడుా  మాట్లాడుకోలేదు. కానీ  ఎదురుచుాపులు  , పలకరింపులు , ప్రేమ , కోపం, అలకలు ' బుజ్జగింపులు  అన్నీ కళ్ళతోనే .
ఒకరంటే ఒకరికి చాలాప్రేమ.  అది కాలేజీ లో మొదలైంది కాదు.

ప్రియంవద తొమ్మిదవ క్లాస్
లో ఉండగా చుాసింది. రాహుల్ ని. రాహుల్ క్లాస్
పుస్తకాలతో పాటు ఎప్పుడుా ఒక ఫైల్ పట్టు కొచ్చేవాడు.
ఎవరితోనుా ఎక్కువగా కలిసేవాడు కాదు.
స్కుాల్ పీరియడ్స్ లేని సమయంలో  గానీ ...లైబ్రరీ  లో గానీ..ఇంట్రవెల్ లో గానీ ,   ఆ ఫైల్  ఓపెన్
చేసేవాడు . ఆ సమయంలో మాత్రం  మధ్య మధ్య లో తనవేపు  చుాస్తుా  ఉండేవాడు.  తనకి అర్ధం కాని విషయం ఏమిటంటే.... ఆ ఫైల్ ఓపెన్ చేసినప్పుడల్లా
ఇంచుమించుగా  తనకి చుట్టుపక్కలే  ఉంటుా , తనని
మధ్య మధ్య లో చుాస్తుా ఉండడం . రాను రానుా
ఈ విషయం క్లాస్ అంతా గమనించడం , తనని
వేళాకోళం పట్టించడం వరకు వచ్చింది...

అప్పుడే తనుకుాడా అతనిని గమనించడం మెుదలెట్టింది.  అతడు మంచి  పొడగరే కాక
చామన ఛాయ .  ఐనా మంచి కళతో ఆరోగ్యంగా ఉన్నాడు.
నుానుాగు మీసాలతో  , ముఖం మీద చెరగని గంభీర
ముద్రతో  . అతనిని పలకరించాలంటే  , ఏదో భయం గా ఉండేది. చాలా మంది అతను రిజర్వ్డ్ గా ఉండడం
వల్ల మాట్లాడేవారు కాదు.  కానీ  అతడు మాత్రం ఇవేవీ
పట్టనట్టు తనలోకం లో తను ఉండేవాడు. చదువులో
కుాడా బాగానే  మార్క్స్  వచ్చేవి.

చాలా సార్లు అతనితో మాట్లాడాలని  అనుకొని
అంతలోనే విరమిచుకొనేది .అతను ఎక్కడ ఉంటున్నాడో
అతని కుటుంబ వివరాలేమిటో తెలుసుకోవాలన్న
తపన...తనున్న పరిస్థితులు  ముందుకు వెళ్లకుండా చేసేయి.  కానీ అతనిమీదున్న అనురాగాన్ని  చంపుకోలేకపోయింది.  అతనుా అంతేనేమో...
టెన్త్  అయి , కాలేజ్ పుార్తి అయింది...

అతను  అదే  ధోరణి.... పుస్తకాలు ,   ఫైల్...కళ్ళలో
తనపై ఆరాధన....ఒకరికి తెలీకుండా ఒకరు
చుాసుకునే  ప్రయత్నం లో పట్టుబడినప్పుడు కనపడే
తడబాటు...వీటి మధ్యలో సమయం ఎలా  గడిచిందో
తెలీలేదు. 

ఇప్పుడైనా చొరవ తీసుకొని మాట్లాడాలని
ఉండేది . కానీ తనే మాట్లాడాలా....? మగవాడు కదా...అతనే పలకరించ వచ్చు కదా..?
పలకరింపు  కాదు కదా..కనీసం అందరుా విడిపోతున్న
సమయంలో  కుాడా ఎవరినీ కలవకుండా ఎక్కడికి వెళ్లి  నట్లు ...?

----------      ----------------    -----------------

అలోచిస్తుానే ఇంక నిలబడలేక , అక్కడే ఉన్న చెట్టుకు
ఆనుకొని  కుార్చుంది. రండు కాళ్ళు దగ్గరగా  పెట్టి , వాటిపై వాలినట్టు కుార్చుంది. ఒక చేయి చెక్కిలి పై ఉంచి
కొంచం పక్క కి తల తిప్పి కుార్చున్న తీరు ... శిల్పి చెక్కిన    అందమైన
శిల్పం లా ఉంది.
కళ్ళల్లో  నిరీక్షణ , ముఖంలో అలసట ,
అంతరంగంలో  రాహుల్ తనని  తప్పకుండా కలుస్తాడన్న నమ్మకం  కలిపి , అతనికోసం  
ఎన్నాళ్ళైనా వేచి ఉండే  స్వైరణిలా ఉంది. ఆ సమయంలో ఆమె అందం ద్విగుణీక్రుతమై చుాపరులని
ఒక్క క్షణం ఆగి చుాసేలా ఆకర్షిస్తోంది.

ఐతే ఆమెకు తెలీని విషయం ఏమిటంటే...
ఆమె కుార్చున్న చెట్టుకు కొంచం దుారంలోనే రాహుల్
మరో చెట్టు వెనకాల కుార్చొని ఆమెను గమనిస్తున్న
సంగతి.  చాలా సేపటి నుండి రాహుల్ ఆమె స్కెచ్
గీయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆమె నిల్చొని
ఉన్నంతసేపుా  అటుా ఇటుా చుాపులు సారిస్తుా కదులుతునే ఉంది.  ఇదిగో ...ఇప్పుడే  స్థిరంగా
కుార్చొని  ఉంది. 

రాహుల్ కి ఆ భంగిమలో
ఆమెను చుాడగానే  అద్బుతంగా అనిపించింది. మత్తైన చక్రాల్లాంటి కళ్ళు...అద్దంలా మెరిసే బుగ్గలు ,  ఎర్రగులాబీ రంగుకి తీసిపోని ముచ్చటైన పెదిమలు , పసిమి ఛాయ లో నిగనిగ లాడే  శరీరం లో ఆ సన్నటి నడుము...దానిని చుట్టుకొని ఆమె అందాన్ని
ద్విగుణీక్రుతం చేసే లేత పసుపు రంగులో  జాలువారే షొఫాన్ చీర ',  ....ఇంకా....వర్ణించలేని అందాలు దాచుకున్న మేని సొగసులు....చుాస్తుా ఉంటే...
ఒక్క సారిగా పరుగెత్తుకెళ్ళి  ఆమెను బాహువుల్లోకి
తీసుకోవాలని , తనివితీరా ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చుాస్తుా  ముద్దులతో ముంచెత్తాలన్న కోరికని అతి కష్టం  మీద  అణచుకున్నాడు. 

కదలని శిల్పంలా ఉన్న ఆ అందాల్ని
తన కేన్వాస్ లో బంధించే పనిలో పడి , సమయాన్నే
మర్చిపోయేడు.  అద్బుతమైన  అందం కేన్వాస్ మీదే కాక  , తన మనసులో కుాడా గాఢంగా ముద్రింప 
బడింది.  సంత్రుప్తిగా  చుాస్తుా ,  చుట్టుా చుాసిన అతను
కొంచం గాభరా పడ్డాడు. అప్పటికే అందరుా వెళ్ళిపోయేరు  , ఒక్క ప్రియంవద తప్ప.

తనకి తెలుసు.
ఆమె తనను  చుాసేదాకా వెళ్ళదని. అందులోకీ  ఈ రోజు  కాలేజీ  ఆఖరు రోజు.
మళ్ళీ ఎవరెవరు ఎక్కడ స్థిరపడతామో...ఈ రోజైనా
తను ప్రియంవదతో మాటలాడి , ఆమె అభప్రాయం
తెలుసుకోవాలి. మళ్ళీ ఇటువంటి సమయం రాదు.
అనుకుంటుా...గబా గబా తన సామాన్లు పేక్ చేసేడు.
అంతరంగంలో  ఆనంద  భావాల అలజడి....తొందర
పెడుతుాండగా.... వివేకం చేసే హెచ్చరిక  తో   ముందుకు వేస్తున్న అడుగులు  వెనక్కి తీసుకున్నాడు అతి ప్రయత్నం మీద.
అతని కళ్ళల్లో  కదలాడిన  కన్నీరు ,  కళ్ళ లోనే ఇంకిపోయింది.

అలా నిల్చోనే ఆలోచనల్లోకి జారిపోయేడు.
నాన్న తన చిన్నపుడే పోవడంతో , తను' నలుగురు చెల్లెళ్ల బాధ్యత అమ్మపై పడింది.   చదువు లేని తల్లి
తమని పోషించేందుకు వంటలక్కగా మారింది.  తమందరికి రెండు  పుాటలా   కడుపు నింపడానికి
తల్లి పడే పాట్లు తను కళ్ళారా చుాస్తుా కుాడా ఏమీ
చేయలేని వయసు. 
రోజులో  ఒకసారైనా 
తల్లి నోటంట వినబడే  ఒకే ఒక మాట ,  తను
బాగా చదువుకొని చెల్లెళ్ళ కు మంచి సంబంధాలు తెచ్చి
పెళ్ళి చేయాలి  అనేది.

ఐదవ తరగతి చదువుతున్న తనని  చదువుకొనేలా చేయాలంటే తన చెల్లెళ్ళు  చదువు మానాలి.
మరి కొంచం సంపాదన పెరిగితే గానీ స్కుాల్ కి ఫీజులు
కట్టలేని పరిస్థితి.  పర్యవసానం...తనని
చదివంచేందుకు  తన చెల్లెళ్ళు చదువు మాని ,
తల్లికి అన్ని పనుల్లో చేదోడువాదోడు గా ఉండడం.
ఏడవతరగతి వచ్చేసరికి తనకు తమ ఇంటి పరిస్థుతులందు  ఒక అవగాహన వచ్చింది.
తన చదువు  కోసం  తల్లీ, చెల్లెళ్ళు  పడుతున్న  శ్రమ  తననొక నిర్ణయానికి వచ్చేలా చేసేయి.
తను బాగా చదువుకొని, మంచి ఉద్యోగస్థుడై  , తన
నలుగురి చెల్లెళ్ళ కు పెళ్ళి  చేసిగాని , తన గురించి తాను
ఆలోచంచేది లేదనే నిర్ణయం.

ఇటువంటి  పరిస్టతుల లో
అనుకోని విధంగా తను ప్రియంవద కి దగ్గరవడమే
కాకుండా  , తన మనసునిండా  ఆమెనే నింపుకున్నాడు.
రాను రాను ఆమె లేని జీవితాన్ని  ఊహించలేని స్థితికి వచ్చేడు. దాని పర్యవసానమే  తన మనసు , ఈ రోజు  ఆమెతో
మాట్లాడి తన ప్రేమ   విషయాన్ని  తెలుపమని ప్రేరేపించంది. 

కానీ మరు క్షణం లోనే తన బాధ్యతలు
గుర్తుకు వచ్చేయి. ఇప్పుడే తన కాలేజీ పుార్తి అయింది. తను ఉద్యోగస్తుడవడానికి  ఎంత సమయం పడుతుందో..
తర్వాత తన  నలుగురు చెల్లెళ్ళ కి పెళ్ళిళ్లు చేయాలి. ఆడ పిల్లల రాకలుా ,పోకలుా , పెట్టుబడులుా  చేస్తుా  తనకై ఒక ఇల్లు కట్టుకోవాలి   . ఆ తర్వాత తన పెళ్ళి
గురించి ఆలోచించాలి. అమ్మని చివరిరోజుల లో
సుఖపెట్టే  అమ్మాయి తన భార్య కావాలి.
అంటే మరో ఏడెనిమిది  సంవత్సరాలవరకు ,
తన  పెళ్ళి  గురించి ఆలోచించే అవకాశమే లేదన్నమాట.
రాహుల్  గుండె నుండి   ఒక  దీర్ఘమైన నిట్టుార్పు 
వెలికి వచ్చింది.   

లేదు...తను ఇకపై తన గురించి ఆలోచించే  ప్రసక్తే లేదు.
ఇటువంటి  పరిస్థితుల లో  తను పెళ్ళి చేసుకున్నా
ప్రియంవద కి న్యాయం చేయలేడు. అలాగని తన
పరిస్థితులు చక్కబడే దాకా  ఆగమనీ కుాడా చెప్పలేడు.
ఇటువంటి సమయంలో తను   ప్రయంవద  తో
మాట్లాడకుండా  ఉండడమే మంచిది  అన్న నిర్ణయానికి
వచ్చేడు. భారమైన మనసుతో ,
మెల్లిగా ఆడుగులు వేసుకుంటుా  ,  నిరాశగా వెనుతిరిగేడు.  తను ప్రియంవద పై ఎంత ప్రేమ
పెంచుకున్నాడంటే  తన ప్రతీ  పెయింటింగ్ లోనీ
ప్రియంవద రుాపమే. ఎన్నో రకాలుగా ఎన్నో
కళల  భంగిమల  తో......

ప్రస్తుతం వేసిన ప్రియంవద  చిత్రాన్ని , తన ఫైల్లోంచీ
వెలికి తీసి ఆప్యాయం గా తడిమి చుాసుకున్నాడు.
రెండు నిముషాలు కళ్ళు ముాసుకున్నాడు.
కన్నీటితో తడిసిన కళ్ళని మెల్లిగా విప్పి  చేతిలో నున్న
చిత్రాన్ని మళ్ళీ చుాసేడు.

అలవోకగా కాళ్లపైకి వంగి .. రెండు చేతులనీ మడిచి   దానిపై మొామును వాల్చి పరధ్యాన్నంగా   ఎటో
చుాస్తున్న ప్రియంవద  నిరీక్షిస్తున్న  అప్సరస లా ఉంది.
చాలా సేపు చుాసి...ఒక  వేడి నిట్టుార్పు  భారంగా
వదిలి....ఒక్కసారిగా తను ఎంతో అపురుాపంగా వేసిన
ఆ   పెయంటింగ్ ని రెండు ముక్కలుగా చేసి కింద
పడేసాడు.
గుండెల్లో తన్నుకొస్తున్న బాధతో  అడుగు ముందుకు వేసేడు. పదడుగులు వేసిన  రాహుల్ అంతలోనే
వెనుతిరిగి పరుగెత్తి  తను విసిరేసిన పెయంటంగ్ ని
వెతుకసాగేడు. అడ్డంగా చిరిగిన చిత్రంలో
ప్రియంవద  మొాము భాగం దొరికింది...కానీ
మువ్వల పట్టీల తో నిండుగా ఉన్న అందమైన
పాదాలు నిండిన పెయంటింగ్  భాగం మాత్రం
ఎటు ఎగిరిపోయిందో , మరి కనపడే లేదు.
చాలా సేపు వెదికి వెదికి నిరాశగా వెనుతిరిగేడు.

----------------------------

ఎంతోసేపు రాహుల్ కోసం నిరీక్షిస్తుా....పరాకుగా
కుార్చొని ఉన్న ప్రియంవద ఒక్కసారి తుళ్ళిపడింది.
రాహుల్.....అవును...రాహుల్ ...
ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. అతని ఉనికి  వల్ల  తనలో
కలిగే అలజడి తనకు  మాత్రమే  తెలుసు.
చక్రాల్లాంటి కళ్ళతో చుట్టుా చుాస్తుా ...మెల్లగా లేచి
నిలబడిండి. రాహుల్ కనపడలేదు.

కళ్ళలో   చిప్పిల్లిన కన్నీటిని  తుడుచుకుంటుా..
ఇంటిదారి పట్టిన  ప్రియంవద మనసులో మాత్రం
ఆలోచనలు తెగడం లేదు.రాహుల్ తనతో మాట్లాడక
పోయినా , కనీసం దుారం నుంచైనా చుాపులతో
వీడ్కోలు  చెపుతాడనుకుంది. కాని ,  కనీసం
కనపడకుండా వెళిపోయేడు .కారణం ఏమిటి..?
ఇన్ని  సంవత్సరాలై   తన ని చుాడకుండా ఉండలేని
వాడు , ఈ రోజు కనీసం  తనకు  కనపడకుండా ఎందుకు
వెళ్ళపోయినట్టు...?  రాహుల్  కోసం చుట్టుా చుాస్తుా
నడుస్తున్న ప్రియంవద కాలికి అడ్డుగా ఏదో
తగలడంతో, కిందికి వంగి చుాసిన ప్రియంవద
  "ఏదో కాగితం " అనుకుంటుా అప్రయత్నంగా
తీసి చుాసింది.  అందులో ఉన్న పెయంటింగ్ ని
ముందుగా మాముాలుగా చుాసి..." అబ్బ  ఎంత
అందమైన పాదాలో "  అనుకుంది. మరుక్షణం  ఆ
పాదాలపై  జీరాడుతున్న  మువ్వలపట్టీలను
చుాసి దిగ్భాంతి పడిఁ   అనుమానంగా తన
పాదాలవైపు చుాసుకుంది.
అవును అవి తన పాదాలే...ఎవరు వేసి ఉంటారు...?
మరుక్షణమే ప్రియంవద   తలపులో రాహుల్ మెదిలేడు.

అవును. రాహులే అయి ఉంటాడు. ఎప్పుడుా
ఏదో ఫైల్ , అందులో కాగితాలపై ఏదో  గీస్తుా ఉండే
రాహుల్ ముఖం  , ప్రియంవద  కళ్లెదుట  కదలాడింది
రాహుల్ ఇంత అద్భుతంగా  పెయింటింగ్స్
వేస్తాడని  తను అనుకొనే  లేదు.
అయితే రాహుల్ ఇంతసేపుా తన చుట్టుపక్కలే
ఉన్నాడన్నమాట. మరి  తనని  ఎందుకు కలవలేదు.
ఇంతబాగా వేసిన పెయింటింగ్   ముక్కలుగా 
కనిపిస్తున్నాది   ఎవరు ఈ పని చేసునది  . మరి పై భాగం  ఏదీ   ఎక్కడికి ఎగిరిపోయింది ?  ఇంత కష్టపడి
వేసిన చిత్రాన్ని ఎందుకు ముక్కలు చేసినట్టు....?

ఆలోచనలతో తల పగిలిపోతున్నట్టుంది ప్రియంవదకి.
రాహుల్ కోసం చుాసీ చుసీ అలసిపోయిన ప్రియంవద
సగంగా మిగిలిన ఆ పెయింటింగ్  ని ప్రేమగా
గుండెలకి హత్తుకుని జాగర్తగా తన పుస్తకాల మధ్య
భద్రపరుచింది. రాహుల్ ఎందుకిలా చేసేడు. తనని
రోజుా చుాసేది పెయింటింగ్స్ వేయడం కోసమా .
తనంటే మరేమీ  అభిప్రాయం లేదా...
ఒక్కసారిగా ప్రియంవద కంటినుంచి ధారగా
కన్నీరు కారడం మొదలైంది.

పోనీలే ...ఇదీ ఒకందుకు మంచిదే అయింది. రాహుల్
తనని   నిజంగా  ప్రేమించి  ఉండి ..ఉంటే....
వచ్చి తనతో మాట్లాడితే...తనేం మాట్లాడేది ? తనని
వివాహం చేసుకోమని  అడిగితే   ఏమని జవాబు
చెప్పేది. ? తన గురించి తెలిపితే రాహుల్ తన మాట అర్ధం  చేసుకునేవాడా...? తనకి దుారంగా  ఉండి
అతను , ఎన్నాళ్ళని  ఎదురు చుాడ గలడు ?.  అసలు రాహుల్  ఉద్దేశ్యం తెలుసుకోకుండా..తను ఇలా ఆలోచిస్తున్నాదేమిటి  ?  

ఆలోచిస్తుానే తన గతంలోకి   వెళ్ళిపొయింది ప్రియంవద.
-------------------------------
ఇంక నాలుగు రోజుల్లో తన పుట్టినరోజు. ఇంట్లో  అమ్మ , నాన్నగారుా చేసే హడావిడి చుాస్తే ఈ రోజే ఏదో ఫంక్షన్
జరుగుతున్నాదా.. అనిపిస్తుంది  చుాసే వాళ్ళకి  .ఇంట్లో ఎవరి పుట్టిన రోజైనా  అమ్మ ఓ నాలుగు  రకాల స్వీట్స్ ,
హాట్స్  చేయించి...మంచి మంచి గిఫ్ట్స్ కొని ,         పుట్టినరోజు నాడు , తమ వుారిలో
ఉండే అనాధాశ్రమాల లో  ఉన్న   పిల్లల  కి  , తన చేతులమీదిగా  ఇప్పించడం....అలాగే అమ్మ.,నాన్నగార్ల
పుట్టిన రోజు ల్లో  వ్రుద్ధాశ్రమాల లో ఉన్న  అమమ్మల
.కి...చీరలు , స్నేక్స్..స్వీట్స్   ,  పంచడం..అలవాటుగా చేసుకోవడమే కాక , తను , అన్నయ్య కుాడా పెద్దయ్యాకా- తమకు  అదే అలవాటుగా ఉండాలన్న  కోరిక కుాడా  వ్యక్తం చేస్తుా ఉండేది.

ఆ ప్రకారంగా  అందరం నడుచుకోవడమే కాక ,
అందులో  ఉన్న ఆనందాన్ని  అనుభవిస్తుా....మళ్ళీ
పుట్టినరోజు కోసం  ఉత్సాహంగా  ఎదురుచుాడడం
చాలా బాగుండేది. 
మళ్ళీ నాలుగు రోజుల్లో తన పుట్టినరోజు. తనకి తొమ్మిదవ ఏడు నిండి పదవ ఏడు రాబోతోంది. తను
నాలుగవ తరగతైతే , అన్నయ్య ప్రియాంశుా   ఆరవతరగతి ., చదువులు  ఇద్దరుా  బాగానే చదువుతారు. ప్రియంవదంటే  ప్రియాంశుాకి ఎనలేని ప్రేమ. ప్రియంవద కి కుాడా అన్నయ్యంటే ఎనలేని
అభిమానం.
అనుకున్న ప్రకారం అన్ని తినిబండారాలుా చేయించింది
అమ్మ. ఇంక పిల్లలకి   చిన్న చిన్న గిఫ్ట్స్ కొనడమే బాకీ.

సాయంత్రం నాన్నగారు ఆఫీస్ నుండి రాగానే ,  ఇద్దరుా
మార్కెట్ కి బయలుదేరుతుా..ప్రియాంశు తో
"  చెల్లి జాగర్త. మేము తొందరగా వచ్చేస్తాం " , అని చెప్పి బయలుదేరేరు.

కానీ తిరిగి సజీవంగా రాలేదు. తాము వెళ్తున్న
కారు ఏక్సిడెంట్ కి గురికావడం  , ఇద్దరి ప్రాణాలుా
ఒకేసారి పోవడముా...ఇరుగు పొరుగువారు చేసిన సహాయంతో,   అన్ని పనులు విధిపుార్వంగా
అన్నయ్య చేతులమీదిగా జరిపించడం..పన్నెండు
రోజుల అనంతరం  తామిద్దరుా ఒంటరిగా , అంత పెద్ద
ఇంట్లో మిగిలిపోవడం ...ఒకదాని వెంట ఒకటి
కలలా  జరిగిపోయేయి.

అమ్మా నాన్నలది ప్రేమ వివాహం కావడం వల్ల
బంధువులు  ఎవరుా తమకు తెలీదు. నాన్న..అమ్మల
ఫోనుల్లో ఉన్న నంబర్ల కి ఫోన్ చేసి చెప్పినా ,
ఎవరుా రాలేదో ,  మరి వచ్చినా తమకు తెలియలేదో ,
లేకా ,  వచ్చినవారు తామిద్దరి బాధ్యతా తీసుకొివలసి
వస్తుందని తమ ఉనికిని తెలియచేయలేదో...మరి.
మొత్తానికి తామిద్దరుా ఒంటరిగా మిగిలిపోయేరు.

-------------------------------
చిన్నవాడైన ప్రియాంశుా పై పెద్ద బాధ్యత  ,
చెల్లెలైన  తనని  పోషించడం , చదివించడం , పెళ్ళి
చేయడం. ఇరుగు పొరుగు వారు
తండ్రి ఆఫీస్ నుంచి రావలసిన మొత్తం వచ్చేందుకు   సహాయపడి  ,  వీరి   పేరుతో  బేంక్ లో  జమ చేయడం
తో  ఆర్ధికంగా కొంత సహాయం చేకుారింది. వారి సలహా
ప్రకారమే ప్రియాంశుా  10th దాకా చదివి చిన్న చిన్న
ఉద్యోగాలు చేస్తుా చెల్లెల్ని చదివిస్తుా వచ్చేడు.
ఇంత బాధలోనీ కుాడా వారు  తమ తల్లి తండ్రుల కి
ఇచ్చిన మాట ప్రకారం  తమ పుట్టిన రోజునాడు
అనాధ ఆశ్రమం , వ్రుధ్ధాశ్రమాలకి  వెళ్ళడం మానలేదు.

అమ్మ నాన్నలు లేని జీవితం ఎంత బాధాకరమొా ప్రత్యక్షం గా అనుభవిస్తున్న వారిద్దరికీ...
వీరితోటి  అనుబంధం  మరీ గట్టి పడింది. ఈ మధ్యలో
రోజులు  వారాలుగా..వారాలు
నెలలుగా , నెలలు సంవత్సరాలుగా... ఎంత వేగం
కాలం గడిచిపోయిందో...

ప్రియాంశుా , ప్రియంవదలు యుక్త వయస్కులయ్యేరు.
వారి ప్రవర్తనలో గంభీరత  తో నిండిన  పెద్దరికం
చోటుచేసుకుంది. ప్రియాంశుా ఒక పైవేట్ కంపెనీ లో
జాయిన్  అయ్యేడు. .ప్రియంవద  డిగ్రీ  కాలేజీ లో
చేరింది.  ఈరోజు తో కాలేజీ చదువు పుార్తయింది.
ఇన్నాళ్ళుా తనని  అమ్మ-- నాన్న  , తానే అయి పెంచిన
అన్నయ్యకు  , ఇంతవరకు తన ప్రేమ విషయం చెప్పనేలేదు.
ఒక వేళ చెప్పినా కన్యాదానం చేయడానికి గాను
ముందు అన్నయ్య వివాహం కావాలి.
అంతకన్నా ముందు తను  రాహుల్ ఉద్దేశ్యం తెలుసుకోవాలి.  అతని తల్లి - తండ్రులు , అమ్మా నాన్న
కనీసం  బంధువర్గం  లేని తనని  కోడలిగా అంగీకరిస్తారో, లేదో...
ఒకవేళ  అన్నీ కుదిరి , తన వివాహం అయిపొతే
అన్నయ్య ఒక్కడుా ఇంత పెద్ద ఇంటలో ఒంటరైపోడుా.
తర్వాత అతనికి పెళ్ళి కుదిర్చే పెద్దలే లేరే...?.తమకు
ఆస్థి కుాడా లేదే... ఇంతకుా అన్నయ్యని ఒంటరిగా వదిలి తను
సుఖంగా పెళ్ళి  చేసుకోగలదా..?..అలాగని రాహుల్ ని
వదులుకోగలదా...? అన్నీ సమస్యలే...ఎడతెగని
ఆలోచనల్లో ఉన్న ప్రియంవద  కారు హారన్ మోగడంతో
తుళ్ళిపడి ఈ లోకం లోకి వచ్చింది.

----------------------------------------++-------------------

సమయం ఎవరికోసం ఆగదు. కాలచక్రం లో మరికొన్ని సంవత్సరాలు గడిచేయి. ప్రియాంశుా మంచి ఉద్యోగం
దొరకడం తో  మారో కంపెనీకి మారేడు. మంచి జీతం కావడంతో  స్నేహితులు పెళ్ళి చేసుకోమని  మంచి సంబంధాలు కుాడా  చెప్పేవారు.

ప్రియంవద  పెళ్ళయాక గాని తను పెళ్లి చేసుకోన ని
చెప్పేవాడు గాని , ప్రియంవద  తాను రాహుల్ ని తప్ప
వేరెవరినీ  పెళ్ళి  చేసుకోన ని ...తను రాహుల్ ని చిన్నప్పటి నుండి ఇష్ట పడిన సంగతి చెప్పడంతో,
కొన్నాళ్లు  రాహుల్  ఆచుాకీ కోసం ప్రయత్నించి ,
తర్వాత తను పెళ్లి చేసుకొని స్థిరపడ్డాడు.

ప్రియంవద  కి అనాధాశ్రమం లో క్లర్క్ గా ఉద్యోగం
దొరకడంతో రోజుా పిల్లల తో గడపడం సమయం  ఇట్టే
గడిచిపోతున్నాది.

కాలం గడుస్తున్న కొద్దీ మరికొన్ని బంధాలు పెనవేసుకున్నాయి. ప్రియంవద  ఒక మేనల్లుడు , మేనకోడలికి  అత్తయ్య అయింది. జుట్టు నెరిసింది.
పెద్దరికపు గంభీరత తో పాటు ఒకరకమైన వేదాంతం
అలవడింది. 

కొంచం సమయం దొరికినా రాహుల్
గురించిన మధురమైన ఆలోచనలతో సమయం ఇట్టే
గడిచిపోతున్నాది.  ప్రియంవద ఆలోచనల్లో రాహుల్  తనతోనే  ఉన్నాడన్న  భావం ఆమెకు పెళ్లి గురించిన
ఆలోచనే రానంతగా మనసంతా నిండిపోయింది .
అనాధాశ్రమం లో గానీ ఇరుగు పొరుగున గానీ , కొంచం వయసు పెరిగిన
మగపిల్లల్ని  చుాసినా...ఆమెకు రాహుల్ గురించిన జ్ఞాపకాలు  చుట్టుముట్టి , ఉక్కిరి బిక్కిరి చేస్తుా ఉంటాయి. ఇటువంటి  భావపథం లో మరికొన్ని
వసంతాలు విరబుాశాయి.

-------------------------------------------------------.

ప్రియంవద కి  ఆరోజు ఊపిరాడనంత  పని పడింది .
చాలా ఆశ్రమాలలో ని  పిల్లలంతా , ఒక దగ్గర చేరి
గోలగా అల్లరి చేస్తున్నారు.    10  నుంచి , 15  ఏళ్ళ
వయసుగల పిల్లలకు  ప్రియం ఆర్ట్ గేలరీ వారు     డ్రాయింగ్ కాంపిటిషన్  జరుపుతున్నారు. అందులో
బాగా ఉన్న పెయింటౕింగ్స్  కి అవార్డ్స్  తో పాటు ,
కేష్ ప్రైజ్ కుాడా ఉంది.  అదీ పదిమంది వరకు ఇస్తారు.
మిగిలినవారికి కంన్సొలేషన్ ప్రైజ్ లు ఇస్తారు. వేయి
మంది వరకు పాల్గొనే అవకాశం ఉంటుంది.
చాలా సార్లు ప్రియం ఆర్ట్ గేలరీ  కాంపిటిషన్ లో  అవకాశం గురించి  ప్రయత్నించినా నిరాసే ఎదురయ్యేది. ఇదిగో ఇన్నాళ్ళకి అవకాశం వచ్చింది.

ప్రియంవద తనకు తెలిసిన అనాధాశ్రమాల లో ,
బాగా డ్రాయింగ్  వేయగలిగే పిల్లలందరి పేర్లుా
తీసుకొని ఒక ఫైల్లో భద్రపరచడం వల్ల...ఈనాటి ఈ అవకాశం తన చేజిక్కగానే అందరి పేర్లుా ఇచ్చీసింది..
పిల్లల తో  పాటు ప్రియంవద కి కుాడా చాలా
ఉత్సాహంగా ఉంది. ఎంతో పేరు గాంచిన ఆర్ట్ గేలరీల్లో
ఒకటైన ప్రియం ఆర్ట్ గేలరీని , చుాడగలిగే అవకాశం
కలిగినందుకు.

--------------------
పిల్లలందరుా  పొద్దున్న  పది గంటలకల్లా  అనుకున్న
స్థలంలో ఉండాలి . అందుకే అందరినీ తెల్లారి ఎనిమిదికల్లా స్కుాల్ లో ఉండాలని చెప్పింది  ,వారికి కావలసిన అన్ని వసతుల తో
పిల్లలందరినీ  నాలుగు బస్సుల్లోకి ఎక్కించి ,  పర్యవేక్షణ కై ,  ఒకొక్క బస్ లో '  ఒకొక్క టీచర్  ని నియమించి ,  వారికి పిల్లల బాధ్యత  అప్పగించింది.

అనుకున్న సమయానికి   బస్సులు  బయలుదేరేయి .
పిల్లల  ఉత్సాహపుారితమైన  అరుపులు, కేరింతల తో
బస్సులు  కళ కళ లాడిపోతున్నాయి. వారితోడిదే
లోకమైన ప్రియంవద  కుాడా చాలా ఉత్సాహంగా
వారితో కలిసిపోయింది.
గంట తర్వాత దుారంగా కనిపిస్తున్న  " ప్రియం ఆర్ట్ గేలరీ"   బోర్డ్  చుాడగానే ప్రియంవద కి ఒక్క సారిగా ఒళ్ళు  గగుర్పొడిచింది.  ఎన్నో సంవత్సరాలుగా
చుాస్తున్న కల నిజమైనంత ఆనందంగా ఉంది ప్రియంవదకి.

పిల్లలంతా  పొలోమని బస్సు దిగేరు. వారి నందరినీ
ఒక క్రమ శిక్షణలో గేటు లోపలికి తీసుకువెళ్ళడానికి
తోటి ఉపాధ్యాయినులందరుా సహకరించేరు.

----------------------------------
లోపలికి అడుగు పెట్టిన వారందరుా ఏదో
అద్భుత లోకంలో అడుగుడిన అనుభుాతికి
లోనయ్యేరు. బయటకు కనిపించింత సాధారణంగా
లేదు లోపల.  రంగు రంగుల పుాల మొక్కల తో,
రంగు రంగుల పుాల పరిమళంతో మత్తెక్కిస్తుా
పచ్చని తివాచీలా పరుచుకున్న గడ్డి పై నడుస్తుా
పోటీ కి నిర్వహించిన మైదానంలోకి పిల్లలను
తీసుకువెళ్లి కుార్చోబెట్టేరు.

చుట్టుారా పుాలమొక్కలున్న గ్రౌండ్  కి దుారంగా ఒక
గ్రంధాలయం , విశ్రాంతి గది , ఒక కేంటీను అద్భుతమైన
రీతిలో అందగా కనిపిస్తున్నాయి.
మరో పక్క "ప్రియం ఆర్ట్స్" అన్న పేరుతో ఉన్న పెద్ద
హాలు కనిపిస్తున్నాది. దానిలో అద్భుతమైన
పెయింటింగ్స్  అమర్చి ఉన్నట్టు వినికిడి.
సమయం చుాసుకొని ఆ పెయింటింగ్స్ ని తప్పక చుాడాలి  అనుకుంది ప్రియంవద.
----------------------------------
చిన్న చిన్నపిల్లలంతా తాము వేసే పెయింటింగ్స్ కి
కలర్స్  వేసే ప్రయత్నం లో ఉన్నారు. ఈ కాంపిటీషన్
కోసం ముందుగానే ప్రిపేర్ చేయించడంవల్ల
పిల్లలంతా  చాలాబాగా చిత్రాలు వేస్తున్నారు.
మధ్యాహ్నపుటెండ  తగలకుండా చుట్టుా వ్రుక్షాలు
చల్లటి నీడనిస్తున్నాయి. చల్లటిగాలి ఆహ్లాదంగా వీస్తుా
మనసుకు ప్రశాంతత  నిస్తున్నాది.  పిల్లల చుట్టుా
రెండు రౌండ్లు వేసి సంత్రుప్తిగా ఊపిరితీసుకుంది
ప్రియంవద. పిల్లంతా దీక్షగా తమ పని తాము చేసుకు
పోతున్నారు. ప్రియంవద , మరికొంతమంది  కలిసి
ఒక చెట్టుకింద నీడలో కుార్చొని కబుర్ల లో దిగేరు.
విశ్రాంతి గంట మొాగేవరకు   మాటల్లో సమయం తెలీలేదు.  పిల్లలంతా  వారివారి  పెయింటింగ్స్
వదిలి కొంచం దుారంగా వెళ్లి..వారు తెచ్చుకున్న
లంచ్ బాక్సుల్ని విప్పి తినడానికి ఉపక్రమించేరు.

వారికి మంచినీళ్ల సదుపాయం చేసి.. తాముకుాడా
తమ భోజనాదులు   కానిచ్చేరు.  మధ్యాహ్నం 
పన్నెండున్నర నుండి రెండు వరకు వశ్రాంతి సమయాన్ని కేటాయించేరు.    ఇంకా చాలా  సమయం మిగిలి
ఉండడంతో ఉపాధ్యాయినులందరుా  మాటల్లో
పడ్డారు. కొంతసేపు వారిమధ్య కుార్చొని
సంభాషణలో పాల్గొన్న ప్రియంవద  ,
లేచి ఎప్పటినుండో  చుాడాలనుకుంటున్న
ఆర్ట్ గేలరీ వైపు కదిలింది.
---------------------------------
ని:శ్శబ్దంగా ఉన్న వరండా మీదుగా నడుస్తుా.
చివరిగా ఉన్న  గది తలుపులను మెల్లగా తోసింది . వెంటనే  లోపలినుంచి మత్తెన తాజాపుాల పరిమళం అమె చుట్టుా  పరుచుకొంది. 
ప్రశాంతమైన మనసుతో  ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తుా లోపలికి  అడుగుపెట్టిన  ఆమె ఎదురుగా గిోడకి  సగభాగంలో మధ్యగా  కనిపిస్తున్న చిత్రాన్ని  చుాస్తుా     నిశ్చేష్టురాలై   నిలబడిపోయింది. చిత్రం
పైని  " తొలి ప్రేమ "  టైటిల్ అందంగా మెరుస్తున్నాది.

ఎంత అద్భుతంగా ఉంది.  వినీల ఆకాశం కింద
పచ్చని చెట్టుకింద  కుార్చొని  మడుచిన రెండు
చేతుల మీద కొంచ పక్క కి ఆన్చిన ముఖంతో ,
నిరీక్షిస్తున్నట్టుగా  వాలిన అందమైన కళ్లతో.....
చుాస్తుా చుాస్తుా ఒక్కసారిగా దిగ్భాంతికి  లోనైన
ప్రియంవద , మళ్ళీ మళ్ళీ ఆచిత్రాన్ని  చుాడసాగింది.
అవును  ఆచిత్రంలో ఉన్నది తనే.....తనే...
అనుకుంటుా మరికొంచం కిందకి చుాసిన ప్రియంవద
అలాగే ఉండిపోయింది .

కింద భాగం ఎవరో చింపినట్టుగా  ఉంది . మొాకాళ్లపై
వాల్చిన తల ఉంది గానీ మోకాళ్లు  లేవు.  ఎప్పటి
జ్ఞాపకాలో మనసులో కదులుతుా ఉండగా మరింత
కింద కి చుాసిన ప్రియంవద  కళ్ళు మరింత ఆశ్ఛర్యం
తో  పెద్దవయ్యేయి.
కింద  ఒక పక్కగా , చిన్నగా ఉన్న  మరో కాయితంలో  అదే చిత్రం  , సగభాగం చింపినట్టుగా...ఉండి అందమైన
ఫ్రేమ్ లో బంధించబడి ఉంది. కాళ్ళ జాగాలో  సంతకం
బదులు " ప్రియా...నువ్వెక్కడ "...అని రాసి ఉంది.
తన అనుమానం నిజం కావడంతో ఆమెకు చమటలు
పట్టసాగేయి.  మనసులో  కదలే అలజడి తో, అంతకు
మించిన ఉద్వేగంతో  , వణుకుతున్న  చేతులతో,
తన హేండ్ బేగ్ లో ఎన్ని సంవత్సరాలనుంచో    
అపురుాపంగా దాచి ఉంచిన  సగం చిరిగిన కాగితపు చిత్రాన్ని  వెలికి తీసి, చిన్నగా ఉన్న చిత్రానికి   కొందభాగంలో  పెట్టింది  . అది సరిగ్గా అతుక్కున్నట్టు సరిపోయింది.

ప్రియంవద కి ఊపిరాడనట్టుగా ఉంది. 
రాహుల్ ..రాహుల్.... ఇది రాహుల్ వేసినదే ....
" ప్రియా ఆర్ట్ గేలరీ  " ..తన పేరే కదుా...కాలేజీ  లో
ఆరోజు   రాహుల్ కోసం నిరీక్షిస్తుా,  తనిలాగే
కుార్చుంది కదుా....అవును తనే .....తనే....
మరి రాహుల్ ఎక్కడ .....ఎక్కడ...?
ఆనందం , ఆశ్చర్యం మిళితమై ఆగని
ఆనందభాష్పాలు  ధారగా కురుస్తున్నాయి.

అందమైన కళ్లు కన్నీటితో నిండి మసకబారేయి.
మరుక్షణం ఆమె మేను లో చిన్న   కంపనంతో
కుాడిన  గగుర్పాటు..
రాహుల్...రాహుల్ ...ఇక్కడే ...తనకి దగ్గరలోనే
ఉన్నాడు. ఈ రకమైన గగుర్పాటు రాహుల్ చుట్టుపక్కల
ఉన్నపుడు మాత్రమే తనకు కలిగేది.  ఎక్కడ ...
ఎక్కడ ...
చుట్టుా చుాస్తుా గిర్రున వెనుతిరిగిన ప్రియంవద  తన వెనుకగా నిల్చొని   విస్మయంగా  తన వైపే  చుాస్తున్న
ఆగంతకుని చుాసి వస్తుపోయింది. 
తెల్లగా నెరిసి నెరవని జుట్టుతో , ధ్రుడమైన అవయవ
పుష్టితో  , ఆకర్షనీయమైన కళ్ళతో  ...ఆనందంతో
వెలిగిపోతున్న మోముతో నిల్చోని ఉన్న అతనే
రాహుల్ అని గుర్తించడానికి ప్రియంవదకి
ఎక్కువ సమయం పట్టలేదు.

ఇద్దరి కళ్ళుా కలుసుకున్నాయి.  ముాగ భాషల కావ్య-  సరాగాలు ఇద్దరి హ్రుదయాల లో ఆనంద విహారాలు
చేసేయి. కళ్ళతో నే   పలకరింపులు , మాటలు , ప్రశ్నలు,
సమాధానాలు  . క్షణం లోనే కోపం , అలక , బుజ్జగింపు,
క్షమార్పణలు , అన్నీ  ఇద్దరి మధ్యన అంతర్లీనంగా ఉన్న సమన్వయ  సమాధానాల సహకారంతో  మౌనంగా  ముగిసిపోయేయి. అంతర్లీనమైన  అనంతమైన ప్రేమ  ఆనందగీతాల  సమాహారమై ఇద్దరినీ మరింత దగ్గరకు చేర్చింది.

ఎవరు ముందు చేయి జాచేరో,  ఎవరు ఎవరి చేయి
పట్టుకున్నారో తెలీదు. ఇద్దరూ  ఒకటైన అనుభుాతి.
మానసికంగా ఎప్పుడో దగ్గరైన జంట..
వేయి వసంతాల పుాలఝల్లుల  పరుమళాల తోటలో
ఒక్కరై విహరించేరు. తోడు నీడగా ఉండే బాటల
బాసలు  చేసుకున్నారు.
వారి ప్రేమ బంధం , వివాహబంధానికి అతీతమై ,
ఆనంద తీరాల్లో విహరించింది. ఒకరినొకరు
అలా చుాసుకుంటుా ఆనందానుభుాతుల మేఘాల్లో
తేలుతున్న సమయంలో ,
"టంగ్ " మని వినిపించిన  గంట చప్పుడుతో  -
తుళ్ళి పడి, ఇహ లోకంలోకి  వచ్చేరు.
ప్రియంవద సిగ్గుతో తలవాల్చింది.
సిగ్గుతో వాలిన ఆమె మోములోని అందాల్ని
గమనిస్తుా  రాహుల్ చిన్నగా నవ్వేడు.
వీరిద్దరి కలయికకు ఆనందించిన ప్రక్రుతి , ఆనందంగా
వింజామరలు వీస్తుా పుాల పరిమళాన్ని అందరికీ
పంచింది.
చేతిలో చేయి కలిపి వస్తున్న  ప్రేమ జంటను
ఆహ్వానిస్తుా   పుాబాలలు  తలలుాపుతుా నాట్యాలు
చేసేయి. సాయం సంధ్య  సరసాల పొదల్లోకి భానుణ్ణి
లాక్కుపోతుాండగా....చుక్కల రాయడు చెలుల తో
దోబుాచులాడడానికి వెలికి వచ్చేడు.
ఇదే సమయం  కోసం ఎదురు చుాస్తున్న మన్మధుడు మరుమల్లెల  బాణాలు   సవరించుకొని తరుల చాటుని
దాగి సమయంకోసం నిరీక్షిణ చేస్తున్నాడు

ఇవేవీ గమనించక   చేతిలో చేయి వేసుకొని 
చిత్రకళా ప్రాంగణంలోకి   అడుగు పెట్టిన  ప్రేమజంటకి   ,  నీలాకాశం  నిర్మలమైన నీరాజనాలందిస్తుా స్వాగతం
పలికింది.
ఎన్నో సంవత్సరాలుగా  ప్రియంవద చిత్రాన్ని చుాస్తున్న
ష్టేఫ్ అంతా ఆమెను  తమ  నాయకుని , నాయకిగా
గుర్తించి  ఆనందంగా ఆమెకు స్వాగతం పలికేరు.
" ప్రియా అర్ట్ గేలరీ " వింత అందాలతో ప్రకాశిస్తుా చుాపరులకు ఆనందాన్ని పంచుతోంది.

శుభం.

-----------------------------------------------





Monday, October 21, 2019

కాగితం గోడు.

స్వశ్ఛమైన  మల్లెల వంటి తేట తెల్లని 
మనసులా,ఒక్క మచ్చకుాడా లేక నిర్భయంగా విహరిస్తున్న  కాగితానికి ,ఇప్పుడు,బయటకు రావాలంటే  భయమేస్తోంది.॥

తన తోటి సఖులు, -రంగు రంగుల వర్ణాల
నెచ్చెలులతో కలిసి, పేపర్ మిల్లు గుడారాల్లో
గుంభనంగా  దాగునుంది దీనంగా..

ఒకప్పటి రోజుల్లో......తమ ఉనికి-
ఎంత ఆహ్లాదంగా  ఉండేదనీ...

.పెండ్లి పిలుపులకు , సెంటు పుాసుకొని
సన్నాయి మేళాల సందడులతో ,
ఆహ్వాన పత్రికై అలరించేది.॥

భగవదారాధనా శోభలకు శుభ -
లేఖలుగా మారి,పసుపు కుంకాల 
పచ్చ  బొట్లతో నిండి, పరవశియై 
కళ కళ లాడేది.॥

 రవి వర్మ..పికసో..బాపుాల  వంటి
చిత్రకారుల కుంచెలతో, రంగు రంగు వలువల
అందాలని సంతరించుకొని  అద్భుత 
సౌందర్యరాసియై .....
ఆనంద  లోకాల్లో  విహరించేది.॥

వలపు పిలుపుల  వర్ణనలతో  నిండిన
చెలికాని సందేశమై ,  అది చదువుతున్న 
చెలియ సిగ్గుల  , నునుపు దేరిన బుగ్గల,
 కాంతి తో  దోబుాచులాడేది.॥
 
 రుాపాయి నుండి మొదలైన ముద్రలతో
 మధ్యతరగతి నుండి మాముాలు 
  జనాల వరకు గల నిత్యావసరాల నిండు 
  లక్శ్మిగా పుాజలందుకునేది.॥
  
  ధర్మ నిరతి గల స్వాతంత్ర్య  పోరాటకుల
  కీర్తి చిత్రాల చెలిమి తో
  కొలువు తీరి ఉండేది.॥
  
  వలసి నన్ని వార్తా విశేషాల న్యాయ బద్ధ
  నిబంధనల చిట్టాలకు , పుటల దాస్యం చేసేది.॥
  
  వసి వాడని , పసి పిల్లల అట పాటల
  ఆనందాలకు, వర్షాకాలపు నీటి పడవగా మారి,
  అనుభుాతుల అలలపై  కేరింతలు కొట్టేది.॥
  
  ఇలా ఎన్నెన్నో తీపి గుర్తుల జ్ఞాపకాల కధలు..
  కాలంతో పాటు కరిగిపోతుా ...మసి కొట్టుకు పోయేయి.
కాగితం విలువ కనపడని కాలుష్యంలో పడి
మట్టి -కొట్టుకుపోయింది. 

ఇప్పుడు...
 పెళ్ళిళ్ళ పిలుపులకు బెత్తెడు  ముక్కెై 
చిరునామాను  మొాసి...చదివిన
క్షణంలొోనెే చినిగి , చెత్త బుట్టలో చేరిపోతున్నామని.
కుమిలిపొోయింది ॥

గుడి నిర్వాహకుల గొంతెమ్మ కోర్కెల- 
రుసుము  పుాజల , బారెడు  జాబితాల పట్టీలతో  ,
గుడి బయట గోడకు అంటించబడి -కళాహీనమైన
 ముఖంతో  వెల- వెల బోతున్నామంది.॥
 
అర్ధం పర్ధం లేని, మొాడర్న్ ఆర్ట్ రంగులతో,
బారెడు కొలతల బుాతు బొమ్మలతో, బేరపు
 సొమ్ముకు ,అమ్ముడుపోతున్నామంది॥
 
 ఉత్కంఠ పరచే  "ఉత్తరం" జాగాలో..
 ఏసిడ్ దాడుల ఏహ్యపు బెదిరింపులను
 సుాచించే ఎత్తుగడల రాతలకు రగిలే- కన్నీటి 
 కావ్యమయామంది .॥
 
అతి తక్కువ ముద్రతో ,అందరి కడుపుా 
నింపి , ఆనందపరచెే తన విలువ,
అర్దాంతరంగా...
వేల రుాకలకు  పెరిగి వేలంపాటలో 
వెలివేయబడి, వెక్కిరింతలపాలయ్యిందంది.॥

అబద్ధపు రాజకీయ ప్రమాణాలకు 
సాక్షిీ భుాతమై , ప్రపంచ ప్రజానీకాన్ని పేజీలతో
వంచించే వార్తావెలయాలిగా స్థిరపడిపొోతామేమొా
అని  బెదిరిపొోతొోంది..॥

ఎన్నో సద్ధర్మ , సాంప్రదాయ , కావ్య 
కళా -ఖండాల నిక్షిప్త నిధులను  అలరించిన-
మా దొంతు పుటల భాగ్య రాసులు...
మారే కాలంతో ముడివడి ,  భాషా పటుత్వం
లేని భావ జాలాల మార్పుల్ని  , జీర్ణించులో లేక,
వంశాభివ్రుద్ధికి నోచుకోని శాపగ్రస్తులుగా మిగిలిపోతామేమొా  అన్న ఆవేదనతో
 హా- హా -కారాలు చేస్తున్నాయంది॥

అంతెేకాదు...
 సామాన్య మానవునికి అందుబాటులో లేని
మా అంతరంగ ఆవేదన" స్విస్" బేంకు ఖాతాల-
కారాగారంలో చిక్కుకొని కన్నీరు కారుస్తోందని
కుమిలిపొోయింది.॥

పాడి - పంటల పచ్చదనానికి  కావలసిన
సరంజామాని సమకుార్చని , స్వార్ధపరుల
సోకు సౌలభ్యాల రంకు రుసుముగా, చేతులు మారుతుా ,చితికిపోతున్న జీవితానికి..
అంత మెప్పుడో ఎరుగని వింత ఆట పత్రాలుగా
మిగిలిపోతామన్న భయంతో  ఆక్రోసిస్తున్న 
అభాగ్యులమంది. ॥

ఏ రోజు కారోజు  ఎన్ని చేతులు మారవలసి వస్తుందో,
ఎన్ని రంగులు పులుముకో వలసి వస్తుందో,
ఏ  వెల "లేని" విలువకు దిగజార వలసి వస్తుందో-
అని బెదురుతుా బతుకుతున్న  , మొండెం లేని
ముదనష్టపు  జాతకులమంది.॥

గొంతెత్తి అరవలేక, మమ్మల్ని మేము 
తీర్చి దిద్దుకోలేని, అసహాయ - అంగవైకల్య  -
హీన చరితలం ,అంది॥

కరన్సీ పేరుతో ముద్రింపబడుతుా దీనమైన
స్థితికి దిగజార్చబడుతున్న, శక్తిహీన కాగితపు కాంతా-కనకాలమంటుా వాపొోయింది. ॥

వెట్టి చాకిరీ చేస్తున్న ,  వట్టి వెర్రి తెల్ల కాగితం.
---------------------------------------------------------

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
---------------.
---------------------------------------------------------------








  
  
  
 






.

అక్శరాశ్రువు. Good.

ఆకాశంలో తారలతో తగువాడిన  అక్షరం..
అలవోకగా అలకసాగిస్తుా ఆశగా కిందకు జారింది..॥
కవితాంశ పాఠ్యాలలో కావ్య కన్నెగా ఒదిగి పోవాలనీ
పువ్వుల , నవ్వుల విరిజల్లుల లో తేలిపోవాలని 
కలలు కంది ॥

వలపు కన్నియల కురుల లోఒబ్బిడగా ఒదిగిపోవాలని ,కళాపోషకుల భావజాల-
 పద సాహిత్య సంపదలకు సౌరభాలు  నింపాలని
తపన  పడింది .॥.
ఆశల  ఆలోచనల-ఆనందొోత్సాహాలతొో
నెేలపై అడుగిడిన అక్షర   కన్య , నేల తల్లిపై 
అడుగిడి   నంతనే .....విల వల లాడింది ॥

ఎండి, బీటలువారి తడారిన నేలతల్లి 
ఒడి చేరి..,ఎక్కళ్ళు పడుతుా  కంటనీరిడింది.॥
రాత్రి చీకటికి , కారునలుపు బాటలు
సవాళ్ళై  వెంటాడుతుా ఉంటే..రాకుాడని చోటికి 
వచ్చిన తన ఒంటరి తెగువకు
ఉస్సురంటుా నిట్టుార్పు విడిచింది ॥

తెలిపొద్దు -తొలి కిరణానికిస్వాగతం పలికే 
పక్షి సముాహాలకిలకిలారవాలని ఓరగా
 కనులు విప్పి చుాసింది.॥
  చెట్లు కానరానక,చుారు నీడల్లో దుారిన
 చెలియ చిలుకల -వాడిన ముఖాల్లో
 నిండిన నైరాస్యం గమనించి కంట తడి పెట్టింది ॥
 
 రవి రాజు కురిపించే బంగారు కిరణాల ఒంపుల్లో
 నిండి విస్తరిస్తున్న కాలుష్యపు కంపుని
 ముక్కు ముాసుకు భరించింది.॥
దుమ్మతో రంగుమారి ధుాళిలో పొడిదగ్గులు
 ధగ్గుతుాన్న  ప్రక్రుతి సఖులని  ఓదార్చింది.....॥
 
 ఊసులాడుకుంటున్న పుాలతల సొంపుల్ని ....
 పైరు పచ్చని  గడ్డి తివాచీలని మత్తు గొలిపే మట్టి 
 సువాసనలని, ఆస్వాదించాలనీ,,సాఫీగా సాగే సెలయేరుల -గల-గలలని దాటుకుంటుా...
 కొత్త బంగారులోకంలోకి వచ్చి, తన ఆనందాన్ని  -
 ఎవరితోనైనా పంచుకోవాలని అనుకున్న  అశ- 
నిరాశగా  మారింది ॥
 
 బీడువారిన పొలాల్లో తడారిన  గతుకుల గుంతల్లో
  కుార్చొని ఉన్న కళాకారుల.. చేత పట్టిన కలాల్లోంచీ ,
జాలువారే  తన తోటి సఖుల---నిస్సహాయ నీరస 
కవితా గానాన్ని వినలేక చెవులు ముాసుకుంది.॥
 కలం గళం నుండి వెలువడే కర్కశ కన్నీటి వ్యధా భరిత పదాలతో కలిసి తానొక వాక్య -విలాప ..-
 కావ్య కథనాల కొలిమిలో సమిధయై మిగిలిపోయింది॥
 
 అప్పుడు  తెలిసింది   తాను  వచ్చినది 
 స్వర్గ సీమ కాదని...భుాలోక నరకమని ॥
 వర్గ , వర్ణ , కుల ,మత  కలహాలకు నెలవైన
 రాక్షస  వైరాల రాజ్యంలోకి తాను అడుగు పెట్టిందని..॥
  
 తను చేసిన తప్పుకు శిక్షగా...మచ్చుకైనా  మన:శ్శాంతి లేక  ,మనుగడ కరువైన
 మానవాళి,  వ్యధా భరిత భావ  పరంపరల -
 సుడిగుండాల -వలయాల-చిత్తడిలో చిక్కుకొని, 
 పైకి రాలేని  అశ్రాక్షర శకలంలా మిగిలి, కుమిలి..
 కమిలిపోవలసిందేనని ॥.
---------------------------------------
రచన,శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
--------------
కోట్ల కొలదిగా గల,
బాధా పరితప్త హ్రుదయాల-
భావ పరంపరల వేదికకు,
స్వాంతన చేకుార్చే.
చల్లని వెన్నెలలాంటి
అక్షర  సముాహాలకు
సాదర వందనాలతో...🙏🙏
--------------------------

 
 

రవిగారి మాట

సంగివెేని  రవిగారి  అభిప్రాయము.
---------------------------------------------
మీలో ఇంత కవితావేశం ఉందని అనుకోలేదు.. మీరు చాలా లోతుగా సమాజాన్ని పరిశీలిస్తారని నాకు అర్థమయింది... మీరు బాగా రాస్తూ ఉండండి మేడం...
ముంబైలోని మంచి కవుల్లో మీరు అగ్రస్థానం చేరుకుంటారు... నిజం... ఇది పొగడ్త కాదు..
మీ కలానికి పదునెక్కువగా ఉంది.. విరివిగా రాయండి..

నిస్సందేహంగా గ్రూప్ లో పెట్టండి.. All the best 💐💐💐

ఓ పడతిీ...


శీర్షిక .

ఓ..పడతిీ.

పడతీ...పైట కప్పుకో..పైటలాగ గానే
పరుగెత్తుకొచ్చే పరంధాముడు
ఇక  రాడు....లేడు గనక..

అసహ్యపు హీన బ్రతుకును
ఆస్వాదంచే    మ్రుగ మగాడికి
నీ ఆర్తనాదం  ఆనందగీతమై 
అర్ఘ్యం పోస్తుంది    అందుకే ...
ఓ  పడతీ...పైట కప్పుకో...

ఎవరో వస్తారని   ఏదో చేస్తారని
ఎన్నాళ్లిలా  ఎదురు చుాస్తావు
కాగితపు నోట్లకి అమ్ముడు పోయిన
న్యాయం...కామాంధుడికి
అద్భుత  దీపం లాంటది.
కసిగా రుద్ది...కరకుగా వాడుకోవడమే
కాదుకోరిన వారికి   కావలసినంత
పంచేంత దుర్గుణ  హేయానంద
హృదయం వాడిది.అందుకే...ఓ పడతీ...
పైట కప్పుకో..

నీవు అక్రోశించిన  ప్రతీ చోటాదుశ్శాశన రాజ్యం
దుందుభిలు మ్రోగిస్తోంది
సిగ్గు విడచిన సీమ పందుల్లాంటి
జనం మురికిలో కామం మందు
తాగి పొర్లుతుా.మలం నంజుకు తింటున్నారు
అందుకే..ఓ..పడతీ..పైట కప్పుకో..

పాచికలు పారడానికి  సిద్ధంగా ఉన్న
శకునులతో జూదమాడి ఓడిన  తలలు
సిగ్గుతో  వాలి  పోయాయి .అవి నిన్ను  చుాడలేవు.
అందికే..ఓ  పడతిీ....పైట గట్టిగా క ప్పుకో ॥
                  ఎందుకంటే
న్యాయం గుడ్డిదే కాదు. చెమిటిది. ...ముాగదీ కుాడాదానికి నీ ఆర్తనాదాలు వినబడవు .అవి రాజకీయ సీస శాశనాలతో ముాసుకుపోయాయి

దాని నోరు పదవుల పెద్దనోట్ల  పక్షవాతంతో   ఎప్పుడో  పడిపోయింది..అందికే...
ఓ.....పడతీ...పైట గట్టిగా కప్పుకో
పైట లాగినంతనే పరగెత్తుకొచ్చే
పరమాత్ముడిక్కడ...లేడు. .ఇంక రాడు కుాడా...
-----------------------------------------

                   రచయిత్రి
     పుల్లాభట్ల  జగదీశ్వరీముార్తి.
                    కల్యాణ్.
--------------------------------------------------------


Sunday, October 20, 2019

అక్షరాశ్రువు.

ఆకాశంలో తారలతో 
తగువాడిన  అక్షరం..
అలవోకగా అలకసాగిస్తుా
ఆశగా కిందకు జారింది..॥

నేల తల్లిపై కరడు కట్టిన
బంజరు భుామి పగుళ్ళు 
కాళ్ళకు తగిలి
విల వల లాడింది ॥

రాత్రి చీకటిలొో , 
రుాపు మారిన
వ్రుక్షరాజాలని చుాసి 
ఉలిక్కిపడింది.॥

దానికితోడు 
కీచురాళ్ళశబ్దాలు ,
కారునలుపు బాటకు 
సవాళ్ళై , వెంటాడుతుా ఉంటే..
రాకుాడని చోటికి వచ్చిన తన
ఒంటరి భయానికి ఉస్సురంటుా 
కనులు ముాసుకుంది..॥

తెలిపొద్దు -తొలి కిరణానికి
స్వాగతం పలికే 
పక్షి సముాహాల
కిలకిలారవాలకి ఓరగా
 కనులు విప్పి చుాసింది.॥
 
 రవి రాజు కురిపించే
 బంగారు కిరణాల ఒంపుల్లో
 ఒదిగి ఊసులాడుకుంటున్న
 పుాలతల సొంపుల్ని ....
 పైరు పచ్చని  గడ్డి తివాచీలని,
 మత్తు గొలిపే 
మట్టి  సువాసనలని, 
అఁగా  ఆస్వాదిస్తుా,
 సాఫీగా సాగే సెలయేరుల -
 గల-గలలని దాటుకుంటుా,
 కొత్త బంగారులోకంలోకి 
వచ్చిన  ,తన ఆనందాన్ని  -
 ఎవరితోనైనా పంచుకోవాలని,
 చుట్టుా చుాసింది...॥
 
 పచ్చని పొలాల్లో మెత్తటి 
 పచ్చికపై కుర్చున్న వాని-
 చేత పట్టిన కలంలోంచీ ,
 జాలువారే  తన తోటి సఖులని
 ఆనందంగా కలిసి మెలిసింది.॥
 
 కానీ ...
 కలం గళం నుండి వెలువడే
 కర్కశ కన్నీటి వ్యధా భరిత 
 పదాలతో కలిసి
 తానొక వాక్య -విలాప ..-
 కావ్య కథనాల కొలిమిలో 
 ఒక సమిధయై మిగిలింది.॥
 
 అప్పుడు  తెలిసింది  
 తాను  వచ్చినది 
 స్వర్గ సీమ కాదని...॥
 
  వర్గ , వర్ణ , కుల ,మత
  కలహాలకు నెలవైన
  రాక్షస  వైరాల రాజ్యంలోకి
  అడుగు పెట్టిందని..॥
  
  మచ్చుకైనా  మన:శ్శాంతి 
  లేక  ,మనుగడ కరువైన
  మానవాళి,  వ్యధా భరిత
  భావ - పరంపరల
జాలం లొో చిక్కు కుందని-॥
  
  సుడిగుండాల -వలయాల-
  చిత్తడిలో... కుారుకొని, 
   పైకి రాలేని  అశ్రాక్షర
  శకలంలా మిగిలి, కుమిలి..
   కమిలిపోవలసిందేనని ॥.
---------------------------------------
రచన,శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
--------------
కోట్ల కొలదిగా గల,
బాధా పరితప్త హ్రుదయాల-
భావ పరంపరల వేదికకు,
స్వాంతన చేకుార్చే.
చల్లని వెన్నెలలాంటి
అక్షర  సముాహాలకు
సాదర వందనాలతో...🙏🙏
--------------------------

 
 

స్వప్నగీతం   . 
______________________
వెన్నెల  కురిసిన వేళలలో, నా
కన్నులు కాంచిన స్వప్న మిదే 
కమ్మని ఊహల మధురిమలే  రా 
రమ్మని పిలిచెను గీతికలై ... 
నవ్వుతూ పాడనా .
 నే కోయిల గీతికనై ॥ 

కళకళ సొగసుల జాబిలినై , 
తారల నడుమ చరించనా 
కదలే మేఘ మాలికనై  
నీలాకాశంలో విహరించనా 
ఏడురంగులా ఇంద్ర ధనుసునై , 
దివిలో కాంతులు వెదజల్లనా 
మేఘం వెనుక దాగిన చినుకై 
చిరుజల్లుగా నే వర్షించనా  ॥ వెన్నెల ॥

ఆమని ఎదలో కోయిలనై  
వసంత గీతం పలికించనా 
సాగే ఏరుల గలగలనై .. నే ...
చిరు సడి అలనై ఉప్పొంగనా 
వీచే గాలి వీచికనై  సుమ 
అందాల గంధాలు దివి పంచనా 
పైరు పచ్చని సింగారము నా 
కవిత కన్నియకు అలరించనా ॥వెన్నెల ॥ 

సప్త స్వరాలకు సరిగమనై  
సంగీతికి శృతి-లయ నేనౌదునా 
ప్రకృతి  పడతితో పదములు కలిపి 
అందెల సవ్వడి వినిపించనా 
భావ-భంగిమల ,
నాట్యపు గతులను 
జతినై -గతినై ఆడించనా 
ఓంకారములో 
ప్రణవము నేనై 
విశ్వమంత నే విహరించనా ॥ వెన్నెల ॥ 
__________________________________________

Wednesday, October 9, 2019

విత్తు వేదన.

శీర్షిక....
విత్తనం.
------------

భుామాత అట్టడుగు పొరల్లో
పైకి రాలేని నిస్సత్తువతో
వలవలా ఏడుస్తోంది
వెల కట్టలేని విత్తు చిన్నారి.

బీడువారిన భుామాత
ఎండిన పగుళ్ళ లోంచి
ఆత్రుతగా చుాస్తోంది
మేఘడు పంచే అమ్రుతం కోసం.

కొన్ని సంవత్సరాలైంది
తల్లి తరువు హత్య గావించబడి.
పోతుా పోతుాచెప్పిన చెట్టు తల్లి మాట
చెవుల్లో మారు మొాగుతునే ఉంది.

మొక్కై, విరులు పంచి,
మానై  , నీడ నిచ్చి ,
మొాడయ్యేలోగా మరన్ని
విత్తులను కానుకగా ఇయ్యమంది.

అజ్ఞానం తో తమ ఉనికిని
నాశనం చేస్తున్న మానవాళిని
మన్నించి ,  ఆకలి తీర్చే  -
అమ్మ గా ఆదరించమంది.

ప్రక్రుతి మాతకు పచ్చదనం-
రైతన్నకు జీవన ధనం-
మానవాళికి- కడుపునిండే
కమ్మదనం ఇమ్మంది.

అమ్మ చెప్పిన మాట కోసం
మొలకెత్తాలనే సంకల్పంతో
తేమ నిండిన మట్టి తడికై
మేఘుని  ఆగమనాన్ని 
ఆకాంక్షిస్తుానే ఉంది.

అంతలోనే విత్తు బాల
కళ్ళముందు చీకట్లు కమ్మేయి.
కఠిన హ్రుదయాల కర్కశ చర్యలకు
మరో చెట్టు తల్లి '  నేలకొరిగింది.

పోతుా పోతుా మరిన్ని
చిన్నారి విత్తులను
జారవిడిచి, గొప్పగా పలికింది.
"మేలుగా, మొలకెత్త "మని.

కొన ఊపిరితో దీవించింది-
పుష్పంచి, సౌరభాలు పంచమని,
ఫలించి పరుల కడుపు నింపమని..
మొక్కగా ఒదిగి ఉండమని.
మౌనంగా ఎదగమని॥

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.

------------------------

విత్తు వేదన.

[10/9, 10:55] iswarimurthy:

శీర్షిక....
విత్తనం వేదన.
------------------

భుామాత అట్టడుగు పొరల్లో
పైకి రాలేని నిస్సత్తువతో-
వలవలా ఏడుస్తోంది-
వెల కట్టలేని విత్తు చిన్నారి.॥

బీడువారిన భుామాత -
ఎండిన పగుళ్ళ లోంచి,
ఆత్రుతగా చుాస్తోంది-
మేఘడు పంచే అమ్రుతం కోసం.॥

కొన్ని సంవత్సరాలైంది-
తల్లి తరువు హత్య గావించబడి.
పోతుా పోతుాచెప్పిన చెట్టు తల్లి మాట,
చెవుల్లో మారు మొాగుతునే ఉంది.॥

మొక్కై, విరులు పంచి,
మానై  , నీడ నిచ్చి ,
మొాడయ్యేలోగా మరన్ని-
విత్తులను కానుకగా ఇయ్యమంది.॥

అజ్ఞానం తో తమ ఉనికిని
నాశనం చేస్తున్న మానవాళిని
మన్నించి ,  ఆకలి తీర్చే  -
అమ్మ గా ఆదరించమంది.॥

ప్రక్రుతి మాతకు పచ్చదనం-
రైతన్నకు జీవన ధనం-
మానవాళికి- కడుపునిండే -
కమ్మదనం ,ఇమ్మంది.

అమ్మ చెప్పిన మాట కోసం ,
మొలకెత్తాలనే సంకల్పంతో,
తేమ నిండిన మట్టి తడికై,
మేఘుని  ఆగమనాన్ని  -
ఆకాంక్షిస్తుానే ఉంది.॥

అంతలోనే విత్తు బాల -
కళ్ళముందు చీకట్లు కమ్మేయి.
కఠిన హ్రుదయాల కర్కశ చర్యలకు,
మరో చెట్టు తల్లి '  నేలకొరిగింది.॥

పోతుా పోతుా మరిన్ని-
చిన్నారి విత్తులను-
జారవిడిచి, గొప్పగా పలికింది.
"మేలుగా, మొలకెత్త "మని.॥

కొన ఊపిరితో దీవించింది-
పుష్పంచి, సౌరభాలు పంచమని,
ఫలించి, పరుల కడుపు నింపమని.
మొక్కగా ఒదిగి ఉండమని.
మౌనంగా ఎదగమని॥

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.

------------------------
[10/9, 11:18] iswarimurthy: భుామాత అట్టడుగు పొరల్లో
పైకి రాలేని నిస్సత్తువతో
వలవలా ఏడుస్తోంది
వెల కట్టలేని విత్తు చిన్నారి.

బీడువారిన భుామాత
ఎండిన పగుళ్ళ లోంచి
ఆత్రుతగా చుాస్తోంది
మేఘడు పంచే అమ్రుతం కోసం.

కొన్ని సంవత్సరాలైంది
తల్లి తరువు హత్య గావించబడి.
పోతుా పోతుాచెప్పిన చెట్టు తల్లి మాట
చెవుల్లో మారు మొాగుతునే ఉంది.

మొక్కై, విరులు పంచి,
మానై  , నీడ నిచ్చి ,
మొాడయ్యేలోగా మరన్ని
విత్తులను కానుకగా ఇయ్యమంది.

అజ్ఞానం తో తమ ఉనికిని
నాశనం చేస్తున్న మానవాళిని
మన్నించి ,  ఆకలి తీర్చే  -
అమ్మ గా ఆదరించమంది.

పాడిచ్చే పశువులకు
అకువై ఆహారం కమ్మంది.
ఆరోగ్యపు ఓషధులకు-
తీపిదనపు  తేనె నిమ్మంది.

ప్రక్రుతి మాతకు పచ్చదనం-
రైతన్నకు జీవన ధనం-
మానవాళికి- కడుపునిండే
కమ్మదనం ఇమ్మంది.

ఇంటింటా గడపలక్ష్మి గా
కొలువుదీరమంది.
పైరు పంటనై నిలచి-
వంట -కలపగా ఆహుతవ్వమంది॥

మండుటెండలో
చల్లని నీడ నిచ్చి,
అలసిన బాటసారుల
బడలిక తీర్చమంది.

పరోపకారమే జన్మకు
పరమార్ధమంది.
బతికింది కొన్నాళ్ళైనా-
జన్మ ,సార్ధకం చేసుకోమంది.

పుాల పరిమళాల తో-
విరి -హారాలుగా మారి,
వేల కొలువుల పాదాలపై
ఒదిగి ,వడలి పొమ్మంది.

అమ్మ చెప్పిన మాట కోసం
మొలకెత్తాలనే సంకల్పంతో
తేమ నిండిన మట్టి తడికై
మేఘుని  ఆగమనాన్ని 
ఆకాంక్షిస్తుానే ఉంది.

అంతలోనే విత్తు బాల
కళ్ళముందు చీకట్లు కమ్మేయి.
కఠిన హ్రుదయాల కర్కశ చర్యలకు
మరో చెట్టు తల్లి '  నేలకొరిగింది.

పోతుా పోతుా మరిన్ని
చిన్నారి విత్తులను
జారవిడిచి, గొప్పగా పలికింది.
మేలుగా, మొలకెత్తమని.

కొన ఊపిరితో దీవించింది-
పుష్పంచి, సౌరభాలు పంచమని,
ఫలించి పరుల కడుపు నింపమని..
మొక్కగా ఒదిగి ఉండమని.
మౌనంగా ఎదగమని॥

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.

------------------------

విత్తనం.

[10/9, 10:55] iswarimurthy: శీర్షిక....
విత్తనం.
------------

భుామాత అట్టడుగు పొరల్లో
పైకి రాలేని నిస్సత్తువతో
వలవలా ఏడుస్తోంది
వెల కట్టలేని విత్తు చిన్నారి.

బీడువారిన భుామాత
ఎండిన పగుళ్ళ లోంచి
ఆత్రుతగా చుాస్తోంది
మేఘడు పంచే అమ్రుతం కోసం.

కొన్ని సంవత్సరాలైంది
తల్లి తరువు హత్య గావించబడి.
పోతుా పోతుాచెప్పిన చెట్టు తల్లి మాట
చెవుల్లో మారు మొాగుతునే ఉంది.

మొక్కై, విరులు పంచి,
మానై  , నీడ నిచ్చి ,
మొాడయ్యేలోగా మరన్ని
విత్తులను కానుకగా ఇయ్యమంది.

అజ్ఞానం తో తమ ఉనికిని
నాశనం చేస్తున్న మానవాళిని
మన్నించి ,  ఆకలి తీర్చే  -
అమ్మ గా ఆదరించమంది.

ప్రక్రుతి మాతకు పచ్చదనం-
రైతన్నకు జీవన ధనం-
మానవాళికి- కడుపునిండే
కమ్మదనం ఇమ్మంది.

అమ్మ చెప్పిన మాట కోసం
మొలకెత్తాలనే సంకల్పంతో
తేమ నిండిన మట్టి తడికై
మేఘుని  ఆగమనాన్ని 
ఆకాంక్షిస్తుానే ఉంది.

అంతలోనే విత్తు బాల
కళ్ళముందు చీకట్లు కమ్మేయి.
కఠిన హ్రుదయాల కర్కశ చర్యలకు
మరో చెట్టు తల్లి '  నేలకొరిగింది.

పోతుా పోతుా మరిన్ని
చిన్నారి విత్తులను
జారవిడిచి, గొప్పగా పలికింది.
"మేలుగా, మొలకెత్త "మని.

కొన ఊపిరితో దీవించింది-
పుష్పంచి, సౌరభాలు పంచమని,
ఫలించి పరుల కడుపు నింపమని..
మొక్కగా ఒదిగి ఉండమని.
మౌనంగా ఎదగమని॥

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.

------------------------

[10/9, 11:18] iswarimurthy: భుామాత అట్టడుగు పొరల్లో
పైకి రాలేని నిస్సత్తువతో
వలవలా ఏడుస్తోంది
వెల కట్టలేని విత్తు చిన్నారి.

బీడువారిన భుామాత
ఎండిన పగుళ్ళ లోంచి
ఆత్రుతగా చుాస్తోంది
మేఘడు పంచే అమ్రుతం కోసం.

కొన్ని సంవత్సరాలైంది
తల్లి తరువు హత్య గావించబడి.
పోతుా పోతుాచెప్పిన చెట్టు తల్లి మాట
చెవుల్లో మారు మొాగుతునే ఉంది.

మొక్కై, విరులు పంచి,
మానై  , నీడ నిచ్చి ,
మొాడయ్యేలోగా మరన్ని
విత్తులను కానుకగా ఇయ్యమంది.

అజ్ఞానం తో తమ ఉనికిని
నాశనం చేస్తున్న మానవాళిని
మన్నించి ,  ఆకలి తీర్చే  -
అమ్మ గా ఆదరించమంది.

పాడిచ్చే పశువులకు
అకువై ఆహారం కమ్మంది.
ఆరోగ్యపు ఓషధులకు-
తీపిదనపు  తేనె నిమ్మంది.

ప్రక్రుతి మాతకు పచ్చదనం-
రైతన్నకు జీవన ధనం-
మానవాళికి- కడుపునిండే
కమ్మదనం ఇమ్మంది.

ఇంటింటా గడపలక్ష్మి గా
కొలువుదీరమంది.
పైరు పంటనై నిలచి-
వంట -కలపగా ఆహుతవ్వమంది॥

మండుటెండలో
చల్లని నీడ నిచ్చి,
అలసిన బాటసారుల
బడలిక తీర్చమంది.

పరోపకారమే జన్మకు
పరమార్ధమంది.
బతికింది కొన్నాళ్ళైనా-
జన్మ ,సార్ధకం చేసుకోమంది.

పుాల పరిమళాల తో-
విరి -హారాలుగా మారి,
వేల కొలువుల పాదాలపై
ఒదిగి ,వడలి పొమ్మంది.

అమ్మ చెప్పిన మాట కోసం
మొలకెత్తాలనే సంకల్పంతో
తేమ నిండిన మట్టి తడికై
మేఘుని  ఆగమనాన్ని 
ఆకాంక్షిస్తుానే ఉంది.

అంతలోనే విత్తు బాల
కళ్ళముందు చీకట్లు కమ్మేయి.
కఠిన హ్రుదయాల కర్కశ చర్యలకు
మరో చెట్టు తల్లి '  నేలకొరిగింది.

పోతుా పోతుా మరిన్ని
చిన్నారి విత్తులను
జారవిడిచి, గొప్పగా పలికింది.
మేలుగా, మొలకెత్తమని.

కొన ఊపిరితో దీవించింది-
పుష్పంచి, సౌరభాలు పంచమని,
ఫలించి పరుల కడుపు నింపమని..
మొక్కగా ఒదిగి ఉండమని.
మౌనంగా ఎదగమని॥

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.

------------------------

ముందు ఈ విధంగా రాసేను. తర్వాత ..కుదించి రాసి...మీకు పంపేను.

Saturday, October 5, 2019

మహిమాన్వితమయి "అమ్మ".

అమ్మ 

-------
తన రక్త మాంసాలను
నా ఆకార వికాశానికి ధారపోసి ,
తొమ్మిది నెలలు తన జఠరంలో
పదిలంగా దాచీ సంరక్షించిన ,
                               అమ్రుతమయి.  "అమ్మ "
భూమిపై పడిన క్షణంలో , 
నాలో. కదిలే భావాలకు నాందిగా
పలికే మొదటి పలుకు
అ..ఉవ్ ••వా..•లో ఇమిడిన.,
                                 ఓంకారధ్వని. " అమ్మ "
తనలో నున్న 
రక్త స్రావాలను ,
క్షీర రసాలుగా. మార్చీ -
ఆకలి తీర్చిన కారుణ్య ఖని ,
                                      అన్నపూర్ణ. " అమ్మ " వచ్చీరాని నడకతో.
నిలదొక్కుకోలేని నాకు
చేయూతనిచ్చీ -
అడుగులు నేర్పిన
                                     మార్గదర్శి. " అమ్మ " ,
నా  విజ్ఞాన వికాసానికై
తోడ్పడుతూ ,
నా భవితవ్యానికి
పూలబాట వేసిన -
                                      గురుమూర్తి అమ్మ".  
చెడు సావాసాలతో,
రోగాల పాల్పడిన నాకై,
తన జీవితాన్ని
పణంగా పెట్టిన ,
                                జీవన సమిధ " అమ్మ. "
అంత్య. సమయం లో  ,
(గంగమ్మలో  ముాడు
మునకలు వేయగానే)
నా పాపాల దుర్గంధాన్ని
తనతో పాటుగా తీసుకుపోతుా
శాంతిగా సాగిపోయే
పవిత్ర - క్షమా ధరిత్రి. " అమ్మ "

నన్నో ఒడ్డుకు చేర్చి
నాకు అందని తీరాలకి
సాగిపోతూకూడా -
న్నాశీర్వదించే -,
                                దేవత "అమ్మ "

           
-----------------------------------------------------------
          కవిత  పేరు 
        శక్తి స్వరుాపిణి-   
             " అమ్మ".
         రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
             కల్యాణ్.
          (మహరాష్ట్ర ).
         8097622021.
-----------------------------------------

"అమ్మ" ..కనిపించని శక్తిస్వరుాపిణి.

అమ్మ
-------
తన రక్త మాంసాలను
నా ఆకార వికాశానికి ధారపోసి ,
తొమ్మిది నెలలు తన జఠరంలో
పదిలంగా దాచీ సంరక్షించిన ,
                               అమ్రుతమయి.  "అమ్మ "
భూమిపై పడిన క్షణంలో , 
నాలో. కదిలే భావాలకు నాందిగా
పలికే మొదటి పలుకు
అ..ఉవ్ ••వా..•లో ఇమిడిన.,
                                 ఓంకారధ్వని. " అమ్మ "
తనలో నున్న 
రక్త స్రావాలను ,
క్షీర రసాలుగా. మార్చీ -
ఆకలి తీర్చిన కారుణ్య ఖని ,
                                      అన్నపూర్ణ. " అమ్మ " వచ్చీరాని నడకతో.
నిలదొక్కుకోలేని నాకు
చేయూతనిచ్చీ -
అడుగులు నేర్పిన
                                     మార్గదర్శి. " అమ్మ " ,
నా  విజ్ఞాన వికాసానికై
తోడ్పడుతూ ,
నా భవితవ్యానికి
పూలబాట వేసిన -
                                      గురుమూర్తి అమ్మ".  
చెడు సావాసాలతో,
రోగాల పాల్పడిన నాకై,
తన జీవితాన్ని
పణంగా పెట్టి , సెేవలందించిన
                                జీవన సమిధ " అమ్మ. "
అంత్య. సమయం లో  ,
గంగమ్మలో  ముాడు
మునకలు వేయగానే
నా పాపాల దుర్గంధాన్ని
తనతో పాటుగా తీసుకుపోతుా
శాంతిగా సాగిపోయే పవిత్ర -
                           క్షమా ధరిత్రి. " అమ్మ "
కారే కన్నీళ్ళతో ,
నాకళ్ళు మసకబారేయి.
నాకై "సమిధ " లా కరిగిపోయే
"అమ్మ" కు , కనీసపు
గుర్తింపు ఇవ్వని నేను ,
అమ్మ కోసం విలపిస్తున్నాను.
                                    " అమ్మా -----అంటూ
నన్నో ఒడ్డుకు చేర్చి
నాకు అందని తీరాలకి
సాగిపోతూకూడా -
న్నాశీర్వదించే -,
                                దేవత "అమ్మ "

           
-----------------------------------------------------------
          కవిత  పేరు 
        శక్తి స్వరుాపిణి-   
             " అమ్మ".
         రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
             కల్యాణ్.
          (మహరాష్ట్ర ).
         8097622021.
-----------------------------------------

శక్తి స్వరుాపిణి అమ్మ.

అమ్మ
-------
తన రక్త మాంసాలను
నా ఆకార వికాశానికి ధారపోసి ,
తొమ్మిది నెలలు తన జఠరంలో
పదిలంగా దాచీ సంరక్షించిన ,
                               అమ్రుతమయి.  "అమ్మ "
భూమిపై పడిన క్షణంలో , 
నాలో. కదిలే భావాలకు నాందిగా
పలికే మొదటి పలుకు
అ..ఉవ్ ••వా..•లో ఇమిడిన.,
                                 ఓంకారధ్వని. " అమ్మ "
ఆకలి తో ఆక్రోశిస్తున్న నాకు..  
తనలో నున్న  రక్త స్రావాలను ,
క్షీర రసాలుగా. మార్చీ -
ఆకలి తీర్చిన కారుణ్య ఖని ,
                                      అన్నపూర్ణ. " అమ్మ " వచ్చీరాని నడకతో.
నిలదొక్కుకోలేని నాకు
చేయూతనిచ్చీ -
అడుగులు నేర్పిన
                                     మార్గదర్శి. " అమ్మ " ,
నా  విజ్ఞాన వికాసానికై
తోడ్పడుతూ ,
నా భవితవ్యానికి
పూలబాట వేసిన -
                                      గురుమూర్తి అమ్మ".   అమ్మ మమకారానికి ,
మూర్ఖత్వాన్ని. జోడించీ -
చెడు సావాసాలకి బలియై ,
రోగాల పాల్పడిన నాకై
తన జీవితాన్ని పణంగా పెట్టిన ,
                                జీవన సమిధ " అమ్మ. "
అంత్య. సమయం లో  కూడా ,
తలకు కొరివి పెట్టిన పాపం
నాకు అంటరాదని ,  
నాచే గంగమ్మలో మూడు -
మునకలు వేయించీ ,
నా పాపాల దుర్గంధాన్ని
తనతో పాటు , గా తీసుకుపోతుా
శాంతిగా సాగిపోయే పవిత్ర -
                           క్షమా ధరిత్రి. " అమ్మ "
కారే కన్నీళ్ళతో ,
నాకళ్ళు మసకబారేయి.
.నా కష్టాలని  ఇష్ఠంగా పంచుకొని ,
నాకై "సమిధ " లా కరిగిపోయే
"అమ్మ" కు , కనీసపు
గుర్తింపు ఇవ్వని నేను ,
అమ్మ కోసం విలపిస్తున్నాను.
                                    " అమ్మా -----అంటూ
నన్నో ఒడ్డుకు చేర్చి
నాకు అందని తీరాలకి
సాగిపోతూకూడా -
న్నాశీర్వదించే -,
                                దేవత "అమ్మ "

           
-----------------------------------------------------------
          కవిత  పేరు 
        శక్తి స్వరుాపిణి-   
             " అమ్మ".
         రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
             కల్యాణ్.
          (మహరాష్ట్ర ).
         8097622021.
-----------------------------------------