Friday, May 31, 2019

సప్త తాళ కీర్తన..8.శ్రీ...రాజ రాజేశ్వరీ...

                     శ్రీ....రాజరాజేశ్వరీ...
                     శ్రీరాగం. మంగళం.
ఆరో॥  స ,  రిచ ,  మశు ,   ప ,  నికై,   స  ॥
అవ॥   స  , ని  , ప  , మ ,  రి,   గసా ,  రి ,  స   ॥
                 ఖండజాతి ఏక తాళం.
                   దెబ్బ..నాలుగు వేళ్ళు.
       ---------------------------------------------------------
పల్లవి:
-----------
శ్రీ.....రాజరాజేశ్వరీ....పాలయే..శంకరీ....శివే...

అనుపల్లవి:
----------------
శ్రీ.....చక్ర సంచారిణీ..శ్రీకరి , మణిద్వీప  వాసిని లలితే--------॥శ్రీ....॥

చరణం:
-------------
ఇందుకళాధరు సుందరీ..నారాయణి
నంద నందను సోదరీ ....ఘనీ...॥
బిందు మణ్డలా..వాసినీ...పావని..
కామకోటి పీఠ విలాసినీ..జననీ...॥ శ్రీ ॥
మధ్యమకాలం:
---------------------
కోటి బాలార్కవర్ణే  అపర్ణే...
కనక కుసుమ కీర్ణే ...శ్యామల వర్ణే
కరధ్రుతేక్షు పాశాంకుశ పుష్ప బాణే
కామేశ్వరీ శ్రీ లలితే భవానీ.. ॥ శ్రీ ॥

చరణం:
------------
నిఖిల నిగమాంత నుత పదే మానిని
క్షిత్యాదీ  తత్వ స్వరుాపిణీ   భవానీ..
అ క చ ట త   పా..దివర్ణే...సంపుార్ణే
అక్షర మాత్రుకే త్రిపుర సుందరీ భవానీ..॥శ్రీ॥

మధ్యమకాలం.
---------------------
చింతామణిమయ మందిర స్థితే
శివ కామేశ్వరి చిన్మాత్రే పరే
బ్రహ్మ , శివా , విష్ణుా నఖ ప్రకటిత
బ్రహ్మాండ నాయమకి ,
శివయువతే..శైలసుతే..॥-

---------------------------------------------
రచన , స్వర కల్పన,
శ్రీమతి పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి
కల్యాణ్.
--------------

సప్త తాళ కీర్తన 7. రజతాచలాగ్ర నిలయే...

           రజతాచలాగ్ర నిలయే..
            మధ్యమావతి రాగం.
ఆ ==   స,  రిచ,   మశు,  ప ,  ని కెై ,  స.॥
అ====స    ని    ప     మ     రి     స ॥
          చతురస్ర జాతి ఏకతాళం.
                   4. క్రియలు. 
           (4 .వేళ్ళు.)ఒక లఘువు.
----------------------------------------------------------------
పల్లవి:
----------
--రజతాచలాగ్ర నిలయే అంబా..
   శ్రీ రమా వాణీ సఖీ.. సతీ..

   అను పల్లవి:
---------------------
   అజయే దయార్ద్ర ,  హ్రుదయే జయే
   జగదీశ్వరీ.. పాహిమాం శివే...॥

  చరణం:
--------------

--పావని శశిముఖీ , -పాహీ-పార్వతీ----
---భావిత శ్రీపదాశ్రితజన   స్తుతిమతీ...
---సర్వోన్నత ఘన, గుణ విభుాతీ
---సర్వమయే శ్రీ, గౌరి మహేశ్వరి   ॥ రజతా ॥

చరణం:
------------

----మునిజన హితే , -మొాహన- రుాపే
----మణిమయ భుాషిత , మంజుల గాత్రే
----జ్ఞానానంద విలసితే......   ,.హితే...
----సర్వ సుపర్వ  ,  సంపుాజిత  కీర్తే...

మధ్యమకాలం:
---------------------

      షట్చక్రోపరి స్థితకరి శ్రీకరి
                     చక్ర రాజ వలయే...
      షడ్గుణైశ్వర్య సంపత్కారిణి
                     సుందరి శ్రీ గిరి నిలయే..
     శుంభ-నిశుంభాది కైటభ భంజని
                    మహిషాద్యాసురగణ దమనే..
      అరిషడ్వర్గ విదారిణి గుణమణి
                  జగదంబా పరమశివే.....॥ రజతా ॥

---------------------------------------------------------------

రచన, స్వరకల్పన,
శ్రీమతి పుల్లాభట్ల ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-------------------

సప్త తాళ కీర్తన 6.బాల త్రిపుర సుందరీ

            బాల త్రిపుర సుందరీ.
                   తోడి  రాగం.
ఆరో ॥   స  , రిశు, గసా , మశు  , ప ,  ధశు ,  నికై  , స   ॥
అవ॥     స ,  నికై ,  ధశు,   ప,   మశు,  గసా,   రిశు ,  స   ॥
      చతురస్రజాతి  త్రిపుట తాళం.
                    7. క్రియలు.
      ఒక లఘువు...రెండు ధ్రుతాలు.
           ( అసావేరిలో  పాడేను).
----------------------------------------------------------
పల్లవి:
బాల త్రపుర సుందరీ.. ,పాహిమాం పరమేశ్వరీ...

అనుపల్లవి:
శైల రాజ ప్రియ నందినీ , ఫాలనేత్రు ప్రియ భామినీ॥

చరణాలు :
------------

1.  కోటి సుార్య ప్రకాశినీ  --   ఖేటకాస్త్ర కర ధారిణీ..
     దుష్ట  దైత్య సంహారిణీ -- శిష్టత్రాణ పరాయణీ ॥

2.  మంత్ర తంత్ర సంవాస గుహే -- శ్రీకరీ ప్రణవాక్రుతే
     పంచాక్షర మంత్రార్చితే --బీజాక్షరి శ్రీ   మాత్ర్రుకే

3.  ఆగమాది నుత శ్రీప్రదే.----శ్రితజనాత్కల్ప లతికే
     శైల తీర్ధ వర వైభవే ---- శాంకరీ కరుణార్ణవే....॥

4.  ధ్యానయొాగ సంపుార్ణమయే- జ్ఞాన కమల -                                           మకరందమయే....
    వేద విదిత సంపుాజ్యమయే- నాద భరిత-
                                       స్వర శబ్దమయే....॥

5.  చక్ర రాజ స్థిత శ్రీకరీ..  త్రిపురాది చక్రేశ్వరీ...
     శక్తి అష్ట - శిద్ధేశ్వరీ  -  సుందరీ  జగదీశ్వరీ.....॥

-------------------------------------------------------------

రచన, స్వరకల్పన ,
శ్రీమతి , పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
--------------------

సప్త తాళ కీర్తన 5. పద్మ లోచనీ...

             6. పద్మలోచనీ..భవానీ...
                శంకరాభరణం రాగం.
ఆరో=   స, రిచ, గఅం, మశు ,ప , ధచ , నికా , స.॥
అవ== స  , ని , ధ , ప , మ , గ , రి , స ॥
            ఖండజాతి అట తాళం.
                   14. క్రియలు.
          2- లఘవులు,2- ధ్రుతాలు
            ( 4.వేళ్ళు ఒక లఘవు. )
-------------------------------------------------------------------
పల్లవి:
--------
పద్మలోచనీ..భవానీ...పాలయమాం గౌరీ..పరి
పాలయమాం..గౌరీ....

శివంకరి శంకరి శివసతి ఈశ్వరీ.....॥

చరణం:
-----------
-పాశాంకుశ ధ్వజ  సుదర్శన రాజిత సింహాసనే..
-పద్మ మాలా ధరీ  పద్మ సులోచనీ పావని శశి వదనే
-పద్మనాభ ప్రియ సొిదరీ సుందరి గుణ సదనే
- పద్మాశనాది సుర ముని వందిత కోమల శుభ చరణే......॥ ॥

చరణం:-
-----------
నాదబిందుమయి యొాగజ్ఞానానందే నిగమ వినుతే
మ్రుదు మందస్మిత మ్రుగమదోజ్వల ఫాల తిలకే
సాధు జనాశ్రిత త్రిజగద్వందిత శ్రీచక్ర రాజ నిలయే
బోధానందామ్రుత రస పుారిత భావనే సంపుార్ణే...॥

---------------------------------------------------------------
రచన, స్వరకల్పన-
శ్రీమతి, పుల్లాభట్ల,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-------------------------

సప్త తాళ కీర్తన.4.శరణాగత వత్సలే...

                  శరణాగత వత్సలే...
                      ఆభోగి రాగం.
ఆరో॥    స -  రిచ  -గసా  -మశు  - ధచ -  స  ॥
అవ ॥   స    ధ     మ     గ     రి     స    ॥
            చతురస్ర జాతి ఝంపె తాళం.
10. క్రియలు. 1.లఘవు..1అనుధ్రుతం ..1 ధ్రుతం
        ఆరు వేళ్ళు , అర ఉసి , పుార్తి ఉసి .
---------------------------------------------------------
పల్లవి:
-----------
శరణాగత వత్సలే  శంకరీ శివే...॥

అనుపల్లవి:
-----------------
పరమేశ్వరీ పరే...లలితే...పాహిమాం..॥

చరణం:
-------------

హిమవత్పర్వత రాజకుమారీశ్వరీ...
హైమవతీ హరి సోదరీ..గౌరీ.....
కామకోటి  శ్రీపీఠాది విలసితే.....
కామ రాగాదిరస  షడ్రిపు విదళితే..   ॥

చరణం:
------------

కమలాశన స్థిత ప్రణవాకార దీప్తే
మిధ్యా మాయా..మొాహవికారే పరే...
తామస గుణ ఘన త్రిగుణ రహితే..హితే
సామ గాన ప్రియ సంపుాజిత గుణ నుతే..॥

----------------------------------------------------------

రచన , స్వర కల్పన ,
శ్రీమతి పుల్లాభట్ల ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-------------

Sunday, May 19, 2019

సప్త తాళ కీర్తన . 3. శివానందమయలహరీ....

        53 వ మేళకర్త  ఐన గమనశ్రమ జన్యం          
                     హంసానందిరాగం.
ఆరోహణ =స- రిషట్- గఅం-మప్ర- ధచ- నికా-  స  
అవరోహణ=      స  ని  ధ  మ  గ  రి  స
చతురస్ర జాతి , రుాపక తాళం. (ఆరు క్రియలు.)
               1. ధ్రుతం. 1.లఘువు. ( 0 . 1).
                            0             1
--------------------------------------------------------------------
పల్లవి :
---------
శివానందమయ లహరీ -- శాంకరి హిమగిరీశ్వరీ
శక్తి స్వరుాపిణి దేవీ-- శ్రీ (చక్రేశ్వరి )లలితే...

అను పల్లవి:
-----------------
కామకోటి శ్రీ పీఠనివాశిని (శివ)  కల్యాణీ...
కామ దహను ప్రియ సతీ శివే శర్వాణీ...

చరణం:
------------
చింతామణిమయ ద్వీప వాశినీ శ్రీమాత్రే..
చిద్ఘనే శుద్ధ మంత్రమయే... మంగళ గాత్రే..
సోమ సుార్యాగ్ని నయనే....సౌరి భయంకరి
సామవేద సంస్తుత శ్రుతి  కీర్తే  ...శుభంకరి..॥

చరణం :
------------
శబ్ద బ్రహ్మమయి సకల భువన వ్యాప్తే హితే
ఓంకార ప్రణవాది స్వరుాప మంత్ర ద్యుతే..
నాదబిందుమయి నాదానందానురక్తే  -గతే..
నారాయణీ శివ నాట్య రసాద్భుత లయస్ఫుార్తే..॥

మధ్యమకాలం :
----------------------
తధ్ధిమిత ధిం ధిం సు ఢక్కా నినాదానందే రతే
తధ్ధిమ్మి తకధిమ్మి   సంగీత సాహిత్య సింధే పరే
సిధ్ధే సుసిధ్ధే ప్రపంచైకానంతే అనంతానంతే..
అజేయే అమేయే అభేద్యే శుభే జోత్యఖండే శివాంగే..
            ॥  శివానందమయలహరీ...॥
----------------------------------------------------------------

రచన, స్వర కల్పన ,
శ్రీమతి , పుల్లాభట్ల ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-----------------------

సప్త తాళ కీర్తన .2. శ్రీ రాజరాజేశ్వరీ..

    చతురస్రజాతి మఠ్యతాళం.  10 క్రియలు
1.లఘువు. 1. ధ్రుతం . 1. లఘువు. (1.0.1 )
           మాయామాళవగౌళ రాగం.
  ఆరోహణ =  స ,రిశు,గఅం,మశు ,ప ,ధశు,       నికా ,స  ॥స.॥
అవరోహణ = స , నికా , ధశు , ప,  మశు,  గఅం , రిశు  , స  ॥
--------------------------------------------------------------------
పల్లవి.
----------
శ్రీ రాజరాజేశ్వరీ..శివే...శంకరి.......
అ॥ ప॥
-----------
శ్రీచక్ర సంచారిణీ...చిత్స్వరుాపిణీ శ్యామల గౌరీ..
                ॥   శ్రీ రాజరాజేశ్వరీ.. ॥

చరణం.
------------
పరమ దయాకరి పంకజ లోచనీ
పురభంజను సతి పాహీ భవానీ...॥
సర్వసిద్ధిప్రద త్రిజగత్కల్యాణీ...॥ 2 ॥
సరస సంగీత సాహిత్య మొాదిని  పావని.॥శ్రీ॥

చరణం.
---------
నాదబ్రహ్మమయానందే    నాట్యరతే...
నారాయణేనార్చితశ్రిత నుాపుర పాదే...॥2॥
బిందు మధ్యస్థితానందానందవిభుాతే....
వేదనుతే సద్గుణమణి శైలసుతే...॥2॥

మధ్యమకాలం:
--------------------

చింతామణిమయ ద్వీప నగరే
చిద్ఘనానంద చిన్మయి మంత్రస్వరుాపే...॥2 ॥
సుందర దరహాసోజ్వలదీప్తే లలితే....
కలిత భవార్ణవ తారణ నౌకే...॥2॥
         ॥  శ్రీరాజరాజేశ్వరీ ॥

--------------------------------------------------

రచన , స్వరకల్పన ,
శ్రీమతి , పుల్లాభట్ల ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
---------------

సప్త తాళ కీర్తన. 1.అఖిలాండేశ్వరీ...

            చతురస్రజాతి..ధ్రువ తాళం.
                        నాట రాగం. 
ఆరోహణ =స, రిష, గఅం, మశు ,ప, ధష  ,నికా ,స.   అవరోహణ =    స  ని  ధ  ప  మ  గ  రి   స  ॥
                  14 క్రియలు.  ( l0ll ).
        లఘవు , ధ్రుతం , లఘువు , లఘువు.
   == =l             0            l              l   .
--------------------------------------------------
పల్లవి .
-----------
అఖిలాండేశ్వరీ శివే ,ఆగమ వినుతే,అంబ భవానీ..
అనుపల్లవి.
----------------
సుఖ సాగర లహరీ, సురేశ్వరీ, సుందరి ,శివసహితే..
                                                  అఖిలాండేశ్వరీ॥
చరణం.
----------
లక్ష్మీ ,వాణీ, సన్నుత చరణే, హరి-సోదరి మాన్యే
యక్షరాజ సఖ, అర్ధ శరీరిణి , దేవీ ముని ధ్యానే..
మధ్యమకాలం.
---------------------
రాకా శశిముఖి, రాజీవ-లోచని,
రత్న-సింహాసన-రాజిత రాజ్నీ రమణి మణీ ...
మ్రుగ వాహిని గుణమణి సుగుణ ధనీ...॥

ప్రాకారీ ప్రముఖార్చిత సేవిత ..మంజుల తర శుభ కామిని, కోమల పదయుగనే
పాహీ పావని గజగమనే....॥అఖిలాండేశ్వరీ ॥
చరణం 2.
--------------
స్మిత సిత సుందరి, చంద్ర కళాధరి , దేవీ వేదనుతే
నతజన సేవిత త్రిజగద్వందిత దేవీ యొాగ శిఖే..
మధ్యమకాలం.
-------------------
చక్రాయుధ ధరి, శ్రీ చక్రోపరి-స్థిత కమలాశని,
దుర్దశ నాసిని దురిత శమే....భవ-సాగర-
తారణి  కలి హరణెే.....॥
ఛిద్రుాపీ శివ తాండవ లయకరి , నాదా నందిత
నాట్యరతే , శివ- శంకరు కామిని శైలసుతే....శివ వినుతే॥ అఖిలాండేశ్వరీ..॥

షట్ శ్రుతి రిషభం.
అంతర గాంధారం.
శుధ్ధ మధ్యమం.
కాకలి నిషాదం.
---------------------------------------------------------
రచన, స్వర కల్పన..
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి..
కల్యాణ్.
-------------

.

Saturday, May 18, 2019

సప్త తాళ కీర్తన. సరస్వతీ ప్రార్ధన.

కల్యాణి రాగం. ఆది తాళం.
అరో॥  స, రిచ, గఅం, మప్ర , ప,  ధచ, నికా, స  ॥
అవ ॥  స  ని  ధ  ప  మ  గ  రి  స  ॥
-----------------------------------
పల్లవి.
-----------
నిరుపమగుణ సదనీ వాణీ
నీరజాక్షి జయ నిత్య కల్యాణి..॥ నిరుపమ ॥
అనుపల్లవి.
--------------
వరదాయకి వాణీ....కర రాజిత
వర మ్రదు వీణా పాణీ....॥ వర॥ నిరుపమ ॥
చరణం.
-----------
శరదిందు శోభిత సుందర వదనీ..
రాగాది స్వర, లయ, సంగీత సదనీ..॥
ఓంకార నాదాది ప్రణవ ప్రసుానే..
వాగ్విలాసిని వరదే కల్యాణీ...॥ నిరుపమ ॥
చరణం.
-----------
బ్రహ్మ  మానస జాయే మాత్రే..
శ్రుతి  సామ గాన సుధా రస పుార్తే..
అక్షయతేజో రుాప సుగాత్రే..
కచ్ఛతి వీణా వాదిని వంద్యే...॥ నిరుపమ ॥
-----------------------------------------------------------
రచన, :స్వరకల్పన...
శ్రీమతి , పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
--------------

సప్త తాళ కీర్తన.ధ్యాన కీర్తన.++ మంగళ హారతి.

  ధ్యాన కీర్తన.
--------------------
పుార్వికల్యాణి రాగం.  ఆదితాళం.
---------------------------------------------
పల్లవి .
---------
హిమశైల సుతే ..పాహీ లలితే
పాలయమాం , శరణాగత వత్సలే...॥హిమ ॥
అనుపల్లవి.
--------------
కామకోటి పీఠ వాసినీ.....ఈ.....॥ కామ...
శంకరాభరణ వేణీ....॥2 ॥  హిమ ॥
1.చరణం.
---------------
సుమశరేక్షు కోదండ పాణీ -
రమణి మణీ రస రాగ రంజనీ..॥ 2 ॥
కోమలతర శుభ సుందర వదనీ
శ్యామల వర్ణ అపర్ణ భవానీ ॥ హిమ॥
2.చరణం.
-------------
రాకా శశిముఖి , రాజీవ లోచని ,
శాకంబరి శ్రీ సింహ వాహినీ...॥ 2 ॥
ముాకదైత్య దమనీ.....మాహేశ్వరీ..
ఏకానేకాక్షర మంత్ర స్వరుాపిణీ..॥2॥.హిమ॥
3. చరణం.
---------------
షట్చక్రోపరిస్థిత కమలాసని..
షడ్గుణ నిపుణ సంపుార్ణాభరణీ..
మాయా కల్పిత విషయ ధురీణే....
త్రిజగద్వందిత త్రిగుణ స్వరుాపిణీ...॥ హిమ॥
------------------------------------------------------------
రచన + స్వర కల్పన ,
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
------------

సప్త తాళ కీర్తనల మంగళ హారతి.

--------------------------------------------

శహన రాగం 

ఆదితాళం.

మంగళ హారతి.

---------------------

పల్లవి:

మణి మయ మకుట ధరీ, సింహాసన

స్థితకరి శ్రీకరి శివ గౌరీ....

అను పల్లవి:

అణిమాద్యష్ట శిద్ధేశ్వరి ఈశ్వరి , 

జయ జగదీశ్వరీ..మంగళం....

మంగళం......మంగళం.....॥

మంగళం..

చరణం:

ఆర్కద్యుతి,  శిర పాదాంగుళ్యే

నయనంచ తధా , పావక తేజే

తేజో రాసి సముద్భవ భేద్యే

మాం పాహీ శివే... మంగళం..

మంగళం....మంగళం...॥

చరణం:

రుప దశ దివ్య , మంత్ర మాన్యే

క్షితి మండల క్షేమంకరి సౌమ్యే

చింతిత మానస హరిత క్లేసే

పాలయ మాం జయ మంగళే..

మంగళం..మంగళం...మంగళం...॥

...............