Friday, January 22, 2021

సాహితీ చక్రవర్తి బిరుదు..(పాశురాలకు)

🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊

*ఇప్పటి వరకు ముప్పై పాశుర ఆనువాద కవితలను నాకు వ్యక్తిగతముగా పంపి,"సాహితీ చక్రవర్తి" బిరుదునందుకున్న కవివర్యుల జాబితా*

*1.శ్రీ విటిఆర్ మోహన్ రావు*

*2.శ్రీ బీరప్పొల్ల అనంతయ్య*

*3.శ్రీ తూపురాణి వేంకటకృష్ణమాచార్యులు*

*4.శ్రీ టీ ఆర్ కె కామేశ్వరరావు*

*5.శ్రీ ఆదూరి ఫణీంద్రరావు*

*6.శ్రీ అన్నంరాజు వేణుగోపాల శ్రీనివాసమూర్తి*

*7.శ్రీ కొండూరు వెంకటేశ్వరరాజు*

*8.శ్రీమతి పొన్నూరి భారతలక్ష్మి*

*9.శ్రీ ముక్కా సత్యనారాయణ*

*10.శ్రీ కే పాండురంగ విఠల్*

*11.శ్రీ చెన్న శంకర్*

*12.శ్రీ జక్కని గంగాధర్*

*13.శ్రీ మండలోజు నర్సింహస్వామి*

*14.శ్రీ డా.రామక కృష్ణమూర్తి*

*15.శ్రీ గురుమంచి రమేష్ శర్మ*

*16.శ్రీ బడిమల వేణుగోపాల్*

*17.శ్రీమతి వేముల ప్రేమలత*

*18.శ్రీ మండలోజు వెంకటరమణాచారి*


*19.శ్రీ ఓగన్న దేవనపల్లి-సోలాపూర్*

*20.శ్రీమతి అద్దంకి లక్ష్మి -ముంబై*

*21.శ్రీ తిరుపతిరావు గండ్రేటి-విజయవాడ*

*22.శ్రీ కుందారపు గురుమూర్తి-కడప*

*23.శ్రీమతి ఆకుండి శైలజ-విజయనగరం*

*24.శ్రీ నాయని రాములు -సోమేశ్వర్* 

*25.శ్రీ దాసరి శ్రీరాములు -నల్గొండ*

*26.శ్రీ డిజిఎస్ శ్రీనివాస్ -గజపతినగరం*

*27.శ్రీమతి డా.వేదాల గాయత్రీదేవి-విశాఖపట్నం*

*28.శ్రీమతి ఎం వి ఉమాదేవి-నెల్లూరు*

*29.శ్రీమతి యం టి స్వర్ణలత-మంచిర్యాల*

 *30.శ్రీ కంచుబారికి చిన్నారావు-విశాఖపట్నం*

 *31.శ్రీ రామకృష్ణయ్య-అల్లీనగరం*

 *32.శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి-కల్యాణ్*

*33.శ్రీ కడలి ప్రకాశరావు-జరజాపుపేట*

*34.శ్రీమతి డా॥ సూర్యదేవర రాధారాణి -హైదరాబాదు*

*35.శ్రీ మహేంద్రాడ సింహాచలాచార్య-టెక్కలి*

*36.శ్రీమతి డా.చీదెళ్ళ సీతాలక్ష్మి-హైదరాబాదు*

*ఇంకా పంపనివారు పంపగలరు*


🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔

*ధనుర్మాస కవితామహోత్సవాలలో పాల్గొని 30 పాశుర అనువాద కవితలు నాకు వ్యక్తిగతంగా 18-01-2021 నాటికి పంపినవారికి సాహితీ చక్రవర్తి బిరుదు ప్రదానపత్రం సాయంత్రం 6-00 గం.లకు సమూహంలో పంపిణీ చేయబడును...*

*అడ్మిన్*

Thursday, January 21, 2021

పాశురాలు రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

[12/17, 14:44] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: 1 6 /12/2020.
ప్రతీ తోజుా కవితా పండగే కొరకు.
మహతీ  సాహితీ  కవిసంగమం - కరీంనగరం.. 
*ధనుర్మాస కవితోత్సవాలు..*
పర్యవేక్షణ: శ్రీ డా. అడిగొప్పుల సదయ్యగారు 
నిర్వహణ: శ్రీమతి యాంసాని లక్ష్మీరాజేందర్ గారు..

అంశం :   గోదాదేవి (ఆండాళ్ ).
శీర్షిక  : 1..వ పాశురము 
ప్రక్రియ : గేయ రచన.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
-------------

పల్లవి:
మేలుకొల్పులు చేయ  వేల నుతులను పాడ
శ్రీ రంగనాధునీ చిన్మయస్వరుాపుని
అను పల్లవి:
పొద్దు పొడవకమునుపె పుాలంగి సేవలా
నాధు కొలువగ రండి  వేద కీర్తుల వేడ॥మేలుకో
చరణం:
తొలి పొద్దు పొడచేను తరుణులారా లెండు
కలిదీర్చు కమలాక్షు కొలువ రారే వేగ
ఫలియించు మీ కోర్కె పడతులారా రండి
మార్గశిర స్నానమిడి మన వేల్పు కొలవండి..॥మేలుకో
చరణం:
స్వర్గ ద్వారము తెరచి యుండు ఘన మాసము
మార్గశిర వ్రత దీక్ష పుాన మహిమలు ఘనము
దుర్గమౌ దురితమ్ముల శమియింపు నీ నోము
దీర్ఘ యశముల బడయు దివ్యమైనది మనుము॥ 
చరణం:
నిదుర చాలింపుమని నీలమేఘ శ్యాముని
మధుర మంగళ వాద్య వేద ఘోషల తోడ
మేల్కొల్పగారారే మీన నేత్రపు ఘనుని
నందగోపాలనీ  రేపల్లె బాలునీ ॥
చరణం:
సుర్య చంద్ర సమ తేజము నిండిన
సుందర వినీల దేహ సుందరుని
నంద యశోదలా నమ్మక వర పుత్రునీ
నటన సుాత్ర ధారి నగధరునీ మాధవునీ ॥ 
------------------------------------------------------
[12/17, 14:47] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారి స్వరరాగ సుధాఝరి....☝️

నిన్నటి వారి కవితను వారి గాత్రమాధుర్యంలో వినాలని కోరాను....నా కోరిక మన్నించి పాడి పంపించారు ఈరోజు....వారికి బహుధా ధన్యవాదాలు...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺
[12/17, 14:47] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారి స్వరరాగ సుధాఝరి....☝️

నిన్నటి వారి కవితను వారి గాత్రమాధుర్యంలో వినాలని కోరాను....నా కోరిక మన్నించి పాడి పంపించారు ఈరోజు....వారికి బహుధా ధన్యవాదాలు...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺
[12/17, 21:59] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: మహతీసాహితీ కవి సంగమం , కరీమ్ నగర్
ధనుర్మాస కవితోత్సవాలు
పర్యవేక్షణ : డా . అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ : ముక్కా సత్యన్నారాయణ గారు
 తేది: 17.12.2020
 పాశురము (2)
ప్రక్రియ: గేయ రచన.

రచన , శ్రీమతి , 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ -మహారాష్ట్ర

పల్లవి:---------
నోముతీరును వినరే నొద్దికగా చెలలుా
పాలకడలి శయను  పరమాత్ము రంగనీ
 అనుపల్లవి:
 తొలి వెలుగుల ప్రభలా తోడు నీడాడరే..
రంగనాధుని కొలువ రయమునను  సాగరే..॥నోము  ॥
చరణం:-----------
పాలసంద్రమునందు ఫణిశేష తల్పమున
లీలావతారుడదే  నిదురపోయెను రారే
వేల నుతులను పాడి వేగ మేల్కొలుపిడరే
పుాలంగి సేవలిడి పదము శరణనరే ॥  నోము ॥
చరణం:----------
కురుల పుాలిడకండి   మాలలల్లీ తెండి
పరులు బాధను చెందే  పలుకు లిడకండీ
జ్ఞాన ధనులను కొలిచీ ధర్మ మార్గము నడచీ
మార్గశిర వ్రతదీక్ష పుాన  రారండీ  ॥నోము॥
చరణం----------- :
సత్య భాషణ నిత్యనియమ్ము సుండీ
దాన ధర్మముజేసి తరియింపు మండీ
ఐకమత్యము తోడ హరిని కొలువండీ
జగము కీర్తులనేలు జయము మనదేనండి ॥నోము॥
చరణం-------------
నిదుర చాలింపుమా నీల మేఘ శ్యామా
మధుర మంగళ వాద్య వేదఘోషలు వినుమా
నీదు వాకిట నోర్మి నిలిచి యుంటిమి గదా
పాదు కొన్న శ్రీశా పరమాత్మ చిద్ఘనా మేలుకో ॥

-----------------------------------------------------------
[12/19, 06:36] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: ప్రతీ తోజుా కవితా పండగే కొరకు.
మహతీ  సాహితీ  కవిసంగమం - కరీంనగరం.. 
ధనుర్మాస కవితోత్సవాలు..
పర్యవేక్షణ: శ్రీ డా. అడిగొప్పుల సదయ్యగారు .
నిర్వహణ: శ్రీ కుందారపు గురుమూర్తి గారు.

18/12/2020.
పాశురము 4.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .


పల్లవి:
శంఖ చక్ర గదా పద్మ ధరుడు శ్రీనాధుడుా..
బ్రహ్మ రుద్రాదులకును నియామకుడితడుా
అనుపల్లవి:
మార్గశీర్ష శుక్ల పక్ష ప్రీతి ఫాల తిలకుడు
ద్వాదశ ఊర్ధ్వ పుండ్ర శ్రేష్ట నామ కేశవుడుా.॥శంఖ చక్ర
చరణం:
కరుణ గల్గిన వరుణ దేవుడు కరుణించ
సంద్రాన సలిలముల తృప్తిగా తాగీ 
నింగి నిలచీ నల్ల మేఘాల దాచీ
తా నిండు వర్షపు నీట తేజమై వెలిగే ॥శంఖ చక్ర॥
చరణం:
లోకాలు పాలించు లోకోత్తరుడు చక్రి
సోకాలు దీర్పగ స్వయము నేతెంచే
మెరయు మేనిని పోలు మెరపులే మెరయంగ
మేఘాలు వర్షించి అభిషేకములు సల్పె ॥:శంఖ చక్ర॥
చరణం:
శంఖ నాదము వోలె ఘర్జించె నింగీ..
రామ శరము వోలే  వర్షించె నింగీ
అంగనలు తానాలు ఆడ వేగమె రండి
రంగనాధు అర్చించు వేళాయె సుండీ॥2॥శంఖ చక్ర॥
------------------------------------------------------
[12/19, 06:38] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తిగారి నాల్గవ పాశుర మధుర స్వరరాగఝరి-4👆
[12/19, 06:56] +91 77806 56292: పాటను చక్కగా రాశారు 
అంతకంటే బాగా పాడి మమ్ము పరవశింజేశారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻
[12/20, 07:26] మహతి. అడిగిప్పుల సదయ్య. ఇష్టపదులు: 2012/2020.
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం.
ధనుర్మాస కవితోత్సవాలు-2020 .
పర్యవేక్షణ: డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : వి.టి.ఆర్. మొాహన్ రావుగారు.
పాశురము 5.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .

పల్లవి:
క్షీర సాగర శయన హరి నారాయణుడుా...
పరమ పావనుడు పరమాన్న ప్రియుడు
అనుపల్లవి:
పద్మ గదా శంఖ చక్ర  ధరుడు పద్మ నాభుడు
పరమేశ్వరుడు పాహి నాధ నారాయణుడు
చెలియలారా రారే  చేరికొలువగా హరినీ
శ్రీ రంగ నాధుని శ్రిత జన పాలునీ... ॥క్షీర సాగర॥
చరణం :
మధురాధి పతి మేటి  మాధవుండీతడుా
మధురాను భుాతియదే మాత యశోదకు 
యదు వంశ కుల రేడు యమునా విహారుడు
పదునాల్గు భువనాల నెరలు నల్లనివాడు ॥క్షీర సాగర॥
చరణం :
ముదముతో నీరాడి పరిధానములగట్టి
పాదపుాజలు సేయ పుానుకొని రారే
పాదుకొన్న మేటి పాపములు గాల్చేటిఞగ
వేద వంద్యుని కొలువ వేగ పడరే మీరు ॥ ॥క్షీర సాగర॥

క్షీర సాగర శయన హరి నారాయణుడుా...
పరమ పావనుడు పరమాన్న ప్రియుడు
అనుపల్లవి:
పద్మ గదా శంఖ చక్ర  ధరుడు పద్మ నాభుడు
పరమేశ్వరుడు పాహి నాధ నారాయణుడు
చెలియలారా రారే  చేరికొలువగా హరినీ
శ్రీ రంగ నాధుని శ్రిత జన పాలునీ... ॥క్షీర సాగర॥

Tuesday, January 19, 2021

శీర్షిక : కాస్త ఆలోచించండి.

19/01/2021
శ్రీ శ్రీ కళావేదిక వారి వాట్సప్ కవితల పోటీ కి
అంశం : మధ్యపానమా : మానవత్వమా

శీర్షిక : కాస్త అలోచించండి.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .


 మద్యపానం అలవాటు మానలేని వ్యసనం.
 కారణాలు అనేకం ..డబ్బున్న వారు 
 
 నలుగురు మధ్య  డాంబికం కోసం తాగితే ,
  డబ్బు లేని వాడు తన కాయకష్టాన్నీ 
  అప్పుల మయ జీవితాన్న మర్చిపోయేందుకు 
తాగుతున్నా నంటాడు.
  మధ్య తరగతి వాడు భార్య భర్తల మధ్య 
  అవగాహనలేక , మనశ్శాంతి కోసం 
  తాగుతున్నా నంటాడు.  చిన్న చిన్న 
  పనులు చేసుకొనే ఆడవారు కుాడా ఈ
  వ్యసనానికి  దాసులవడం ఆశ్ఛర్య కరమైన విషయం.
  తాగిన మత్తులో  ఏదేదో వాగడం రోడ్డో , 
  ఇల్లో తెలీని స్థితిలో మట్టిలో పొర్లడం..
  తగువులు పడడం, అసహ్య కరమైన తిట్లతో
  ఇంటి ఆడవారిని చావ బాదడం వంటి ఏహ్యపు
  పనులతో మర్యాద హీనులై  ప్రవర్తించడం 
  ఈ మత్తు లక్షణం.  అన్నీ తెలిసి కుాడా 
  విడ లేని  విషం మద్యం. దీనికి కారణాలు ఏవైనా
  గవర్న మెంట్ వారి లైసెన్స్ తో కొన్ని , పోలీసులకు లంచాలిచ్చి కొన్ని , దొంగ వ్యారంగా కొన్ని మద్యపు
  వ్యాపారాలు సాగుతుానే ఉన్నాయి. ఈ మత్తులో
  మానవత్వాన్ని కుాడా మరచి హింస, హత్యలుా,
  మానభంగాలుా  కోకొల్లలుగా జరుగుతున్నాయి.
  మానలేని ఈ అలవాటుకు భార్య పుస్తెలు కుాడా అమ్మి సొమ్ములు చెల్లిస్తుా ,   పసిపిల్లల నుండి పండు ముసలి వరకు  సాముాహిక బలత్కారాలతో '
  పైశాచిక చర్యలకు పాల్పడుతున్నా ....ఈ విషయంలో
 మాత్రం  గవర్నమెంట్ తగినచర్యలు తీసుకోకపోవడం బాధాకరం. రాజు నుండీ పేదవరకు మానవత్వం
 నశించిపోయే రీతిలో సాగే ఈ పైసాచిక  మత్తును 
 దుారంచేసేందుకు గవర్నమెంట్  తో పాటు 
 మానవత్వ మున్న పతీ ఒక్కరుా 
 బాధ్యతగా  స్వీకరించి స్పందిస్తే ఈ మత్తు 
 పదార్ధాల పంపిణీని నిషేధించవచ్చునేమొా....
 ఆలోచించండి..
 
   
  

Sunday, January 17, 2021

తేటగీతి పద్యాలు.

రచన:శ్రీమతి:పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ :మహరాష్ట్ర.

1.
కలుపు మొక్కది  వనమునొ  క్కటియె చాలు
చెలగ వనముకు చీడతో   చేటు యట్లు 
ఖలుల తోడ చెలిమి చేయు ఘనుల కెపుడు
విలువ తరుగు నిహమునను వినుము మనుజ ॥
2.
అమ్మ నాన్నల విడచితి వాశ్రమమున. 
గుడులు గోపురములు జుట్టు  గుణుని గాను
తరచి భజనలు జేయుచు  ధరణి మసలు    
జన్మ  మేటికి, మనిషిగ  జగతి  మనుజ  ॥
3.
సచ్చరితము సంస్కారము  సరళ వాక్కు
స్వశ్ఛమైనట్టి నడతయు  సాధు గుణము
నిశ్ఛ యమ్ముగ సద్గుణా  లివియె ఇలను
మెచ్చు రీతిని  మసలుటే మేలు మనుజ ॥
4.
చీర కట్టు  బొట్టునిడిన  జిలుగు బోడి
ముార పుాలు ముడుచు నట్టి ముద్దు గుమ్మ
వరలు సిగ్గుతో డమసలు వనిత లున్న
వరము మనకదే  ఇలనేలు పడతి లక్ష్మి ॥
5.
ఒరుల మనసుతె లిసినీవు ఓర్మి తోడ
చెరుపు మాటలా డకనుండు చేరి సఖుల
పరుల ప్రేమజుా డగమాట  పలుకు తీపి
నరుని జన్మకు సార్ధక  నడత లివియె॥ 












మొత్తం 30 పాశురములు తెలుగులో....నేను రాసినవి

[11/1/2020, 20:13] iswarimurthy: 1/10/2020.
ప్రతీ రోజు కవితా పండుగే కొరకు;
ప్రక్రియ : ఆటవెలది
రచన : శ్రీమతి జగదీశ్వరీముార్తి.

ఏడు కొండ లెక్కి ఏలికై పాలించు
వేంకటేశ  నీవె వేల్పు మాకు
చింత లెల్ల దీర్ప చిధ్ఘన రుాపివై
మహిని కొలువు దీరు మధుర ముార్తి॥

కస్తుా రితిల కముఖ ఘనయొా గివంద్యా
సప్త గిరిని వాస  సరసి జాక్ష
మధుర గంధ లేప  మణిహా రభుాషా
మంద్ర  మధుర హసిత మాన్య వంద్య.

శంఖ- చక్ర ములను శాంతినేలగబట్టి
దుష్ట దానవులను దునిమినావు 
అభయ హస్తమునదె ఆదుకొనగజుాపి
అలరి నిలచు దేవ అవని శ్రీశ ॥

అలకలకొలికిలను అలమేలు మంగమ్మ
మంగ పురము నేల మహిమ తోడ
పద్మ సతిని గుాడు పరమేశ్వ రుడవీవు
ఇద్ద రాండ్ర వేల్ప ఇదియె నమము ॥

నీదు స్మరణ చేయ నిత్యపుాజలతోడ
నిన్ను కొలిచితి నయ్య నిగమ సార
తెలియ నీదు లీల నేనెంత దాననుా 
నిన్నె నమ్మి నాను నిగమ సార ॥

భక్తి తోడ నిన్ను భావింతు నీశ్వరి
అహర హముని నుకొలిచె నాదు కొనుమ
నీదు సేవ జేయ నిగమాంతరంగా 
కోర్కె లేవి లేవు కోరె భక్తి ॥

శరణు శ్రీని వాస శరణుశ్రీ చరణా
సకల భువన పాల సన్ను తాంగ
సార సాక్ష శరణు  సర్వేశ శ్రీకరా
సకల గుణ నిధాన సాధు చిత్త ॥

జగము లేలు శ్రీశ జగదీశ్వరుడవీవు
కేశ ములను కోరు క్లేశ హరణ
ముదము వేంక టేశ ముక్తిధా ముడవీవు
చరణ స్పర్శ జేతు చేకొనయ్య ॥
[12/18/2020, 21:36] iswarimurthy: ప్రతీ తోజుా కవితా పండగే కొరకు.
మహతీ  సాహితీ  కవిసంగమం - కరీంనగరం.. 
ధనుర్మాస కవితోత్సవాలు..
పర్యవేక్షణ: శ్రీ డా. అడిగొప్పుల సదయ్యగారు .
నిర్వహణ: శ్రీ కుందారపు గురుమూర్తి గారు.

18/12/2020.
పాశురము 4.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .


పల్లవి:
శంఖ చక్ర గదా పద్మ ధరుడు శ్రీనాధుడుా..
బ్రహ్మ రుద్రాదులకును నియామకుడితడుా
అనుపల్లవి:
మార్గశీర్ష శుక్ల పక్ష ప్రీతి ఫాల తిలకుడు
ద్వాదశ ఊర్ధ్వ పుండ్ర శ్రేష్ట నామ కేశవుడుా.॥శంఖ చక్ర
చరణం:
కరుణ గల్గిన వరుణ దేవుడు కరుణించ
సంద్రాన సలిలముల తృప్తిగా తాగీ 
నింగి నిలచీ నల్ల మేఘాల దాచీ
తా నిండు వర్షపు నీట తేజమై వెలిగే ॥శంఖ చక్ర॥
చరణం:
లోకాలు పాలించు లోకోత్తరుడు చక్రి
సోకాలు దీర్పగ స్వయము నేతెంచే
మెరయు మేనిని పోలు మెరపులే మెరయంగ
మేఘాలు వర్షించి అభిషేకములు సల్పె ॥:శంఖ చక్ర॥
చరణం:
శంఖ నాదము వోలె ఘర్జించె నింగీ..
రామ శరము వోలే  వర్షించె నింగీ
అంగనలు తానాలు ఆడ వేగమె రండి
రంగనాధు అర్చించు వేళాయె సుండీ॥2॥శంఖ చక్ర॥
------------------------------------------------------
[12/19/2020, 23:34] iswarimurthy: 2012/2020.
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం.
ధనుర్మాస కవితోత్సవాలు-2020 .
పర్యవేక్షణ: డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : వి.టి.ఆర్. మొాహన్ రావుగారు.
పాశురము 5.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .

పల్లవి:
క్షీర సాగర శయన హరి నారాయణుడుా...
పరమ పావనుడు పరమాన్న ప్రియుడు
అనుపల్లవి:
పద్మ గదా శంఖ చక్ర  ధరుడు పద్మ నాభుడు
పరమేశ్వరుడు పాహి నాధ నారాయణుడు
చెలియలారా రారే  చేరికొలువగా హరినీ
శ్రీ రంగ నాధుని శ్రిత జన పాలునీ... ॥క్షీర సాగర॥
చరణం :
మధురాధి పతి మేటి  మాధవుండీతడుా
మధురాను భుాతియదే మాత యశోదకు 
యదు వంశ కుల రేడు యమునా విహారుడు
పదునాల్గు భువనాల నెరలు నల్లనివాడు ॥క్షీర సాగర॥
చరణం :
ముదముతో నీరాడి పరిధానములగట్టి
పాదపుాజలు సేయ పుానుకొని రారే
పాదుకొన్న మేటి పాపములు గాల్చేటి
వేద వంద్యుని కొలువ వేగ పడరే మీరు ॥ ॥క్షీర సాగర॥

క్షీర సాగర శయన హరి నారాయణుడుా...
పరమ పావనుడు పరమాన్న ప్రియుడు
అనుపల్లవి:
పద్మ గదా శంఖ చక్ర  ధరుడు పద్మ నాభుడు
పరమేశ్వరుడు పాహి నాధ నారాయణుడు
చెలియలారా రారే  చేరికొలువగా హరినీ
శ్రీ రంగ నాధుని శ్రిత జన పాలునీ... ॥క్షీర సాగర॥
[12/22/2020, 07:09] iswarimurthy: 22/12/2020.

మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం.
ధనుర్మాస కవితోత్సవాలు-2020 .
పర్యవేక్షణ: డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : బీరప్పొల్ల అనంతయ్యగారు.

పాశురము 7. గోవిందనామార్చన.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .

శీర్షిక .
ఎంత పిలుతును నేను....

పల్లవి:
ఎంత పిలుతును నేను ఏమని  పలికెద
వింతగాదే చెలులుా వివరించి తెలుపగా॥

అనుపల్లవి :
తొలొపొద్దు పొడిచేను తెమిలిరారే చెలులుా..
కులదైవమును తలచి కుార్మి రంగని కొలువ॥ఎంత ॥

చరణం:
ముాడు వేదములకు ముాలమైన స్వామి
ముాడులోకాలకుా  ముార్తి పరమాత్ముడు
సర్వము తానై వ్యాపించు నాధుని
త్రైలోక్య ముార్తిని  తిరుగోవిందుని ॥ఎంత॥

చరణం :
సుక-పికా  రవముల ఆనంద గీతాల-
మేలుకొల్పులు వినవె మీన నేత్రీ...
కేశిని దునిమినా కేశవ ముార్తితడు
వెన్న పాల దొంగ  వేంచేయు వేళాయె ॥ఎంత॥

చరణం:
విద్యలెరిగిన మీకు విజ్ఞతలు తెలియవా
వంద్యమానుని కొలువ వడిగ రారేలనే
తగదు తగదోయమ్మ ఈ నడత మీకు
తడయుటలు మాని తరలి రారండే చెలులుా ॥ఎంత॥
[12/24/2020, 00:02] iswarimurthy: 24/12/2020.
తిరుప్పావై పాశురము-9
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం.
ధనుర్మాస కవితామహోత్సవాలు-2020

పర్యవేక్షణ: డా॥అడిగొప్పుల సదయ్య.
నిర్వహణ: శ్రీ ముక్కా సత్యనారాయణ గారు.


రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : శంఖ పద్మ గదా....


పల్లవి:
శంఖ పద్మ గదా చక్రము ధరియించీ 
మధుసుాదన నామకా అసురుని దృుంచీ...

అనుపల్లవి:
సాత్విక లోకానందా  సార జన శుభేచ్ఛా
మధుర భక్ష్య  ఫలదాతా మాధవ మదుసుాదనా ॥
కొలువ రారే చెలులుా కోరి విభుని పదములుా 
పిలువ రారే సఖులుా పుాజింప హరినీ ॥

చరణం:
రతనాల మేడలో రమ్య మణి ద్యుతులుా
దీపకాంతులు దివ్య గంధ పరిమళములుా
మిళితమౌ సాంబ్రాణి సౌరభమ్ములుజిమ్మ 
మత్తు నిదురబోవు ముదిత లేవమ్మా..॥

చరణం: 
వేల నామాల విభుని కీర్తించు చుండగా
యేల పలుకవు నీవు మా ముద్దు గుమ్మా
పుాల పరిమళ మొప్పు హంస తుాలిక పైన
చేరి నిద్దుర పోవు తరుణి లేవమ్మా ! లేచి రావమ్మా  ॥

చరణం: 
అత్త కుాతురా! వేగ తెమిలి రావమ్మా !
చిత్త చోరుడు మేటి వేల్పు గదా మనకుా..
పుత్తడి బొమ్మా ! వేగ కదలి రావమ్మా !
కీర్తింప మముగుాడీ  పుాజింప హరినీ శ్రీ రంగ నాధునీ ॥

రండి రండే చెలులుా  చెలియ లేపి రండే 
రంగనాధుని కొలువ త్వరగ తెమిలి రండే...॥
[12/26/2020, 19:11] iswarimurthy: 26/12/2020.
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.

పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : శ్రీ కుందారపు గురుముార్తిగారు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

చక్ర గదా పద్మ శంఖ ధారీ మురారీ
దైత్య కుల నాశకారి వామనావతారీ
సుఖాభీష్ట సిద్ధి ప్రద ముక్తి మొాక్షకారీ..
జిహ్వ తత్త్వ  నియామకా జిత వైరి మురారినీ ॥

కొలువ రారే చెలులుా వటు వామన ముార్తినీ
అవతార పురుషునీ శ్రీ రంగనాధునీ...॥
:
చరణం
శ్రాత్రవ బలముల గొల్ల పట్టివి నీవుా 
పేరుగల పుణ్యవతి పెద్దింటి పడతి
వాలు కన్నులదోయి వంపు నడుము కల్గిన
నెలత, నెమలిని బోలు నడత వన్నెల బోడి॥

చెలయ రావే తెమిలి కొలువంగ హరినీ
శ్రీరంగ ధామునీ శ్రీ హరి విష్ణు నీ..॥

చరణం: 
తిరునామముల  పాడి తీరైన వన్నె కాని 
శ్రీకృష్ణుని  పరమాత్ముని సేవింప వస్తిమి
ద్యాన మగ్నవై ఇహమును మరచిన మాయమ్మా
ఉలుకు పలుకు మాని నిదుర నటియించకమ్మా॥

చరణం:
రావే నీ రాకకై వేచి యుంటిమి మేము
బంధు జనుల కుాడి భవుని కొలువ
రావే రమణి నామ కీర్తనల రంగని
సేవింప గానముల పుాజింప హరినీ ॥

కొలువ రారే చెలులుా వటు వామన ముార్తినీ
అవతార పురుషునీ శ్రీ రంగ నాధునీ....॥
[12/27/2020, 20:49] iswarimurthy: 27/12/2020.
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.

పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ:  శ్రీ వి.టి ఆర్. మొాహన రావు గారు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

పాశురము 12.   ("శ్రీధర" నామార్చన.)
----------------------------------------------------
పల్లవి :
శ్రీ శబ్ద వాచ్య యైన శ్రీమహా లక్ష్మి ని
వక్ష స్థల  మందిడిన  గుణధాముని శ్రీధరుని॥

అనుపల్లవి :
చక్ర గదా శంఖ పద్మ ధరుని   కమల నాభుని
వేద మంత్రార్చిత పద  వైకుంఠ నాధునీ
వరగుణ శ్రీ ధామునీ .....॥

లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....॥

చరణం:
లేగ దుాడలు తల్లి గోవు పొదుగు  తడమగ
పొదుగు నిండిన ప్రేమ ధారలై కురిసే...
యేరులై పారేటి  పాడి నిండిన నల్ల-
గొల్ల వాని చెల్లెలా వాదమేల తరలిరా.... ॥

కొలువగ!  నాధుని,  లెమ్మా!  నిదుర వీడు మమ్మా
వినవే ! శ్రీ విభు కీర్తన ! బంగారు బొమ్మా....॥

చరణం:
రావణాంతకుడైన రామ చంద్రుని కొలువ
నామ గానము కన్నా మించు జపము ఏదీ...
సీమాటి ! నిను పిలువ  నిదుర మత్తేలనే
నమ్మి - కొలువగ రావే నళినాక్షి నాధునీ...॥

లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....॥

శ్రీ శబ్ద వాచ్య యైన శ్రీమహా లక్ష్మి ని
వక్ష స్థల  మందిడిన  గుణధాముని శ్రీధరుని॥

చక్ర గదా శంఖ పద్మ ధరుని   కమల నాభుని
వేద మంత్రార్చిత పద  వైకుంఠ నాధునీ
వరగుణ శ్రీ ధామునీ .....॥

లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....॥
[12/28/2020, 15:42] iswarimurthy: 28/12/2020
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.
పాశురము:  13.

పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : శ్రీ  దాసరి చంద్రమౌళిగారు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

పల్లవి:
చక్ర పద్మ శంఖ గదా ధారీ మురారీ.
పాహి  పరంధామ హృషీ -కేశావతారీ॥

అనుపల్లవి:
రమ బ్రహ్మ రుద్రాదుల అనందకారీ
ఇంద్రియా నియామకునీ  ఇహ పర హితకారునీ ॥

చెలియలారా రారే చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ నాధునీ శ్రీధరునీ శ్యామునీ ..॥

చరణం:
పక్షి రుాపుని బకుని చీల్చి చెండాడీ
పోరులో రావణుని మదమణచి దునిమేటి
జగదేక వీరునీ జానకీ రాముని
కీర్తింప వచ్చి నీ వాకిటను నిలచితిమి ॥

పడతీ పుండరికాక్షు పావనమౌ ముార్తిని
కొలువంగ రావమ్మా కుసుమాల కోమలీ
చెలియ లందరి గుాడి చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ ధామునీ రామ నారాయణునీ ॥

చరణం:
మేతకై పక్షులదే పరుగులిడె కుాయుచుా
శుభములను సుాచింప శుక్రుడుదయించగా
అభయ హస్తుని కొలువ ఆలసింపకరమ్మా
మించె సమయము సుమ్మా! అందాల పుారెమ్మా॥

చెలియ లందరి గుాడి చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ ధామునీ రామ నారాయణునీ ॥
[12/29/2020, 19:54] iswarimurthy: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.
29/12/2020.
పాశురము:  14. "హృుషీకేశ" నామార్చన.

పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : శ్రీ  బీరప్పొల్ల అనంతయ్యగారు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.


చక్ర పద్మ శంఖ గదా  ధరుడు హృషీకేశుడుా..
వాక్ తత్త్వ సారుడుా  వైకుంఠ  ధాముడుా

ఇంద్రియ నియామకుడు ఇందిరా రమణుడుా
రమ ! బ్రహ్మ  ! రుద్రాదుల కానందమిడువాడు ॥

చెలియ ! రావే ! పాటల ! కొలువంగా నోయమ్మా
నటనలింక చాలించి !  నిదుర లేచి రావమ్మా 

పల్లవి :
ఎంత గడుసు దానవే  ముద్దుల గుమ్మా
నటనలింక చాలు చాలు మాటకారి వమ్మా

అనుపల్లవి :
పెరటి తోట కొలనులో కలువలు వికశించెనమ్మ
నిదుర లేచి తలుపు తెరచి మము చేరగ రావమ్మా ॥

చరణం :
"మిమ్ము ! లేపెద "ననుచుా  మాటిచ్చీ మరచితివి
నమ్మికిక  లేటికినే  మధుర వచనా...మాకు
సీమాటి సిరిమల్లీ  సిగ్గులేదటె నీకు
శమము దీరిన రావె సమకట్టి తడయకిక ।॥

చెలియ ! రావే ! పాటల ! కొలువంగా హరినీ
శ్రీ గిరి శ్రీ వాసునీ  శ్రీ రంగ నాధునీ .॥

చరణం :
దేవళముల జేరె మునులు   దేవుని పుాజింపగా
దేవ దేవుని హరిని  కీర్తించీ కొలువగా..
ధవళ దంతపు దివ్య తేజ మలరగ నిలచెే
కమలనేత్రుని కొలువ కదలిరా మీనాక్షీ... ॥


చెలియ ! రావే ! పాటల ! కొలువంగా నోయమ్మా
నటనలింక చాలించి !  నిదుర లేచి రావమ్మా
[12/30/2020, 19:34] iswarimurthy: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.
30/12/2020.
పాశురము:  15 . (పద్మనాభుని నామార్చన.)

పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : శ్రీమతీ యాంసాని లక్ష్మీ రాజేందర్ గారు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

భక్త హృదయ తేజ భాగవోత్తముడుా
భవబంధ మొాచనుడు శ్రీ పద్మనాభుడుా
భాను తేజుని కొలువ  భక్తి భావముతోడ
కొలువరావే సఖియ కోరి శ్రీ రంగనీ ॥

చెలియలారా రారే మేల్కొల్పరే  సఖిని
చేరి కొలువగ హరిని శ్రీరంగ నాధునీ..॥

చరణం:
మున్ను తెలియదు నీదు ముద్దు మాటల తీరు
నమ్మినారము నిన్ని ఓర్మి వేచితిమిచట
కదలి ఇక లేచిరా  కఠినాత్మురాలా....
గోష్టి కలియగ  రావె  గోవిందు కొలువగా..॥

చెలియలారా రారే మేల్కొల్పరే  సఖిని
చేరి కొలువగ హరిని శ్రీరంగ నాధునీ..॥

చరణం.
కంసాది దుష్టులా   దునిమి నట్టీ ధవుడు
నంద గోపాలుడుా ఆనంద ధాముడుా...
గొల్ల భామల  తోడ కొల్ల లాడెడు 
మేటి  మాయావి మేల్కొనవె  ముదము 
రంగని కొలువ॥

చెలియలారా రారే మేల్కొల్పరే  సఖిని
చేరి కొలువగ హరిని శ్రీరంగ నాధునీ..॥

చరణం: 
గోపబాలికలార ! కోపమేటకిలింత !
విదితమాయెను తప్పు వదరుటలు మానరో.....
అందరిట జేరితిర !  అతివలారా నాదు-
జాప్యమిక లేదింక ! జలజాక్షు లాగరో...॥

మీ మాట మీపాట పాల మీగడ ముాట
మిము గుాడి వత్తు  నే  జలజాక్షు లాగరో...॥

భక్త హృదయ తేజునీ భాగవోత్తమునీ
భవబంధ మొాచనునీ  శ్రీ పద్మనాభునీ
భాను తేజుని కొలువ  భక్తి భావముతోడ
కొలువవత్తునే సఖియ  శ్రీ రంగ నాధునీ ॥
శ్రీ రంగ నాధునీ     శ్రీ రంగ నాధునీ.....ఆ.....
[12/31/2020, 18:33] iswarimurthy: 31/12/2020. 
పాశురము 16.  (సంకర్షణ  నామార్చన).

మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.
31/12/2020.

పర్యవేక్షణ: డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : శ్రీ ముక్కా సత్యన్నారాయణగారు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.


పల్లవి:
భక్తుల చిత్తము నెరిగిన భవబంధమొాచనునీ
భక్తి వైరాగ్య మొసగు శ్రీహరి సంకర్షణునీ ॥

అనుపల్లవి :
ఎలమి నాధుని కొలువ మేల్కొల్ప వచ్చితిమి
మలయు శ్రీ రంగనీ వ్రత దీక్ష బుానీ.

వేడ రారే చెలులుా  వేగ తెరువ తలుపులను
వేడరే రంగనీ తెలియగ మన తలపులనుా...॥

చరణం:
అందమైన తోరణాల అద్దంపు మెరపులా...
మణి కాంతులు చిమ్మి మెరయు బంగారు పుాతలా...
ధగధగలా మెరయుచున్న ద్వారముల తెరువుమా
మహనీయుని రంగనీ మాళిగ కాపరులారా ॥

వేడ రారే చెలులుా  వేగ తెరువ తలుపులను
వేడరే రంగనీ తెలియగ మన తలపులనుా...॥

చరణం: 
అతులిత సౌందర్యమలరు నంద ధామము గాచు
వికసిత వదనారవింద రేపల్లె రేడా...
డెప్పరమ్ములైనట్టి  టెక్కపు కంబము లున్న
రంగారు వాకిలినీ తెరువయ్య రంగా...॥

వేడ రారే చెలులుా  వేగ తెరువ తలుపులను
వేడరే రంగనీ తెలియగ మన తలపులనుా...॥

చరణం:
విస్మయపు చేతలా విజ్ఞత లెరిగినవాడు
పరనిత్తు  నని   మమ్ము  నమ్మించినాడుా...
వన్నెకానిని లేపి ఎరిగించు మారాక
తెరిపించవే తలుపు తోయజాక్షీ సఖీ..॥
 

భక్తుల చిత్తము నెరిగిన భవబంధమొాచనునీ
భక్తి వైరాగ్య మొసగు శ్రీహరి సంకర్షణునీ
ఎలమి నాధుని కొలువ మేల్కొల్ప వచ్చితిమి
మలయు శ్రీ రంగనీ వ్రత దీక్ష బుానీ.


మహనీయుని రంగనీ మాళిగ కాపరులారా
తీయరే తలుపులనుా మా రంగని కొలువగా ॥
[1/1, 20:55] iswarimurthy: 1/1/2021.

మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.

పాశురము:  17. (వాసుదేవ నామార్చన)

పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : శ్రీమతి కె. గీతాశైలజగారు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.


పల్లవి
త్రైలోక ఆవాస ముక్తి మొాక్ష కారకునీ
యశములిచ్చు  వానినీ యశోదా తనయునీ ॥

:అనుపల్లవి:
చెలియలారా రారే మేల్కొల్పగ నాధునీ 
శ్రీ వాసుదేవునీ శ్రీహరి శ్రీ కృష్ణునీ... ॥

చరణం:
అక్కసమున ఆదరించి అన్నము  జలముల నిచ్చే
చక్కనైన మాసామీ నందా గోకుల బాలా
మలయు నీ నుతుల పాడ చయమున వేంచేసితిమీ
నిర్గమించు నీరజాక్ష వామన సుర వంద్యమాన  ॥

చెలియలారా రారే మేల్కొల్పగ నాధునీ 
శ్రీ వాసుదేవునీ శ్రీహరి శ్రీ కృష్ణునీ... ॥

చరణం:
అతులిత బలధామా భ్రాత శ్రీ బలరామా
తురగలించు పాటనలిడి పరమాత్ముని పిలువుమా
మహితుడౌ శ్రీ పాదుని అనుజుని తోడ్కొని రావే
ఈకొని మా మన్ననలను యెలమి హరిని మేల్కొల్పవె॥

చెలియలారా రారే మేల్కొల్పగ నాధునీ 
శ్రీ వాసుదేవునీ   శ్రీహరి శ్రీ కృష్ణునీ... ॥

చరణం:
ఆనందా అనిరుద్ధా ఆదినారాయణా
పసరె నీ ఖ్యాతులెల్ల పరమాత్మా చిద్ఘనా
సొంపైన బంగారు కడియంపు పాదమును
కొలువంగ  చయమున,  గుాడి వచ్చితిమయ్య ॥

చెలియలారా రారే మేల్కొల్పగ నాధునీ 
శ్రీ వాసుదేవునీ   శ్రీహరి శ్రీ కృష్ణునీ... ॥

చెలియలారా రారే చేరి కొలువగ హరినీ
శ్రీ రంగనాధునీ శ్రీహరి శ్రీ విష్ణు నీ ॥



----------------------------------------------
[1/2, 19:09] iswarimurthy: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.
2/1/2021

పర్యవేక్షణ: డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : శ్రీ  కుందారపు గురుముార్తిగారు.

పాశురము 18.  (పురుషోత్తమ నామార్చన).

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.


తెల్లవారెను కోడికుాసెను 
కోయిలమ్మలు పాట పాడెను
మల్లి జాజులు విరిసి పుాసెను 
కనులు తెరుమా కమలనయనీ ॥

హరిని కొలువగ వస్తిమమ్మా 
ఆలసింపక తలుపు తెరుమా  ॥


పల్లె లేచెను నిదురలేపుమ    
నీల వర్ణుని శ్యామునీ
వేడు చుంటిమి వేల నుతులా 
వేల నామములున్న వానీ
నంద నందను కోడలా  
నాధు లేపుమ ....నీరజాక్శీ ॥

హరిని కొలువగ వస్తిమమ్మా 
ఆలసింపక ..తలుపు తెరుమా  ॥

మదపుటేనుగు బలము కలిగి 
భుజబలమ్మున పోరు సలిపే
పద్మనాభుని రాణివమ్మా  
పలుకు మొకపరి.... నీలవేణీ॥

హరిని కొలువగ వస్తిమమ్మా 
ఆలసింపక ....తలుపు తెరుమా  ॥

విరతి నేలెడు వాని పొలతి 
విడుమ నలవట్టమును నీవు
విభుని వలపుల రాణి వీ... 
నప్పిన్న  నేర్పరి ... నీవు  సుమ్మ ॥

లలిత రాగపు కంఠి  కలికి
కలల రేడుని ...లేపవమ్మా ॥

హరిని కొలువగ వస్తిమమ్మా 
ఆలసింపక...... తలుపు తెరుమా  ॥

తరుణి రో ఇక తరలిరమ్మా 
తడయుటలు ఇక  వదలిరమ్మా.
కరపు కంకణ  గలగలల తో 
కురుల కమలిక కోమలాంగీ
చలిపి నవ్వుల కులుకు కొమ్మ 
హరిని కుాడి ...రావె కొమ్మఁ॥

హరిని కొలువగ వస్తిమమ్మా 
ఆలసింపక ...తలుపు తెరుమా  ॥

తెల్లవారెను కోడికుాసెను 
కోయిలమ్మలు పాట పాడెను
మల్లి జాజులు విరిసి పుాసెను 
కనులు తెరుమా కమలనయనీ ॥

హరిని కొలువగ వస్తిమమ్మా 
ఆలసింపక తలుపు తెరుమా  ॥
[1/3, 20:26] iswarimurthy: పాశురము:  19 .( అనిరుద్ధ నామార్చన)

పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : శ్రీ వి టి. ఆర్. మొాహన్ రావుగారు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.


పల్లవి;
గుణ పుార్ణ సంపుార్ణ  జ్ఞాన , ధ్యానానంద
వేద -విరుద్ధఆచార నిరతీ దుార
బోగాది భాగ్యప్రద  భుారి కరుణాపాంగ
యొాగనిద్రామయా యొాగిజన వంద్యా...

అను పల్లవి:
నీదు వాకిట నిలచి వేచియుంటిమి మేము
నిదుర మేల్కొనవయ్య  నీల మేఘశ్యామ ॥
నీళా హృధీశా

 
చరణం:
గజరాజు దంతంపు కోళ్ళ పానుపు పైన
పవళించు పరమసత్మ పాహి పరమానంద
నీలవేణి ని గుాడి నిదురించు మా సామి
నిత్య పుాజలనందు కొనగ రావేమయ్య ॥

నీదు వాకిట నిలచి వేచియుంటిమి మేము
నిదుర మేల్కొనుమయ్య  నీళాహృధీశా ॥

చరణం :
మత్తునిండిన మల్లె పుాలు సిగ ముడిచీ
చిత్తు చేసితి వమ్మ మా సామి చిత్తమును
హత్తుకొన్నది  చాలు అలరు నీ హొయలతో
తగదు తగదోయమ్మ ఈరీతి నీకుా...॥

నీదు వాకిట నిలచి వేచియుంటిమి మేము
నిదుర మేల్కొనవయ్య  నీళాహృధీశా ॥

చరణం:
తురగలించెడు దివ్య మణిరత్నములు పొదుగు
పంచ గుణముల మేటి పరుపు నలరించీ
నీళ వక్షముపైన నిదురించు మా సామి
తలిరు బోడిని వీడి తరలి రావయ్యా...।


నీదు వాకిట నిలచి వేచియుంటిమి మేము
నిదుర మేల్కొనవయ్య  నీళాహృధీశా ॥

చరణం:
విరతి చాలించి ఇక విమలయశు వీడవే
నాధు విడువగ నీకు నిదురనటనేలనే ...
తఱచి వెన్నుని నీవు వలచినది చాలులే
మఱుగు సదనము వీడి మాటాడనీయవే ॥


నీదు వాకిట నిలచి వేచియుంటిమి మేము
నిదుర మేల్కొనవయ్య  నీళాహృధీశా ॥
[1/4, 17:31] iswarimurthy: 4/ 01 /2021.
పాశురము 20.

మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.

పాశురము: 20. (   పురుషోత్తమ నామార్చన.  )

పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ :  శ్రీ దాసరి చంద్రమౌళి గారు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.


పల్లవి
కోరినంతనె మాదు కోర్కె తీర్చెడు వాని
మాఇచ్ఛ తీర్తునని  మాట యిచ్చెడువాని ।

అనుపల్లవి:
సాధు సంరక్షకుని సరసీరుహేక్షుని
హరి పురుషోత్తముని ఆది నారాయణుని
సత్య పరాక్రమ మెరిగిన మాయమ్మ 
మక్కువ మీరగ విభుగొని రమ్మా... ॥

నీదు వాకిట మేము నిలచితి మొాయమ్మ 
పుానిక హరిగుాడి నీరాడ నోయమ్మ ॥

చరణం:
ముక్కోటి దేవతల భయము బాపెడు దేవ
డెప్పరము లౌ లీలనసురుల దునిమేవ
అక్కసముతో  మమ్ము ఆదరింపగ రావ 
కొల్లలాడుట చాలు నప్పిన్న విడిరావ ॥
నప్పిన్న విడిరా......

నీదు వాకిట నిలచి వేచి యుంటిమి సామి
నిదుర చాలించి యిక  నీరాడ వేమీ ॥
నీరాడ రావేమి...?

చరణం:
ఎఱ్ఱన్ని పెదవులా   ఏపు  గుబ్బలదాన
సన్నన్ని కటిగల సతి నీళ  సిరి వదన
అలవట్ట మిడి, కుాడ అద్దమిచ్చీ పొమ్మ 
నాధు విడువగ పోము నీరాడ నళినాక్షి  

నీదు వాకిట మేము నిలచితి మమ్మా 
పుానిక హరిగుాడి నీరాడ నమ్మా॥

చరణం:
 కుక్కుటములదె కుాసె  కెందమ్మి వికసించె 
 విరతి నిక చాలించి విభు గొని రామ్మా ॥
సారసాక్షుని గుాడి సరిగంగ తానాల
కనుమతించ చోయమ్మ కమలాక్షి మాయమ్మ ॥

చరణం:
కోరినంతనె మాదు కోర్కె తీర్చెడు వాని
మాఇచ్ఛ తీర్తునని  మాట యిచ్చెడువాని 
సాధు సంరక్షకుని సరసీరుహేక్షుని
హరి పురుషోత్తముని ఆది నారాయణుని॥

నీదు వాకిట మేము నిలచితి మమ్మా 
పుానిక హరిగుాడి నీరాడ నోయమ్మ॥
[1/5, 18:51] iswarimurthy: 5 / 01 /2021.
పాశురము 21.

మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.

పాశురము: 21. (   పురుషోత్తమ నామార్చన.  )

పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ :  శ్రీ దాసరి చంద్రమౌళి గారు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.



శీర్షిక : 
నందా ఆనందా...
----------------------

నందా...గోపాలబాలానందా  ఆనంద లీలా...
విందులే నీ వేణునాదము వినగ మధురము ఈ జగాన॥ నందా...

చరణం: 
పల్లెలో రేపల్లెలో మా చల్ల ముంతల కొల్లగొట్టి
ముందుగా మావెన్న  పాలను ఆరగించిన చిన్ని కృష్ణా 
ఆదుకొన భువినవతరించిన ఆది దేవుడ వీవయ్యా
నిన్ను కలువగ వస్తిమయ్యా నిదురలేవర కన్నయ్యా॥నందా...

చరణం:
పాలకయండలు నిండిన పాలిచ్చు పాడిగల వాడవుా
పాలకుడు ఆ నందునీ పరమ ముద్దుల బాలవుా...
శీల సద్గుణ రాయ గ్వాలా కృష్ణ మేల్కొని రావయ్య
జాలమేలర మాదు మొరవిన జగములేలిన వాడవయ్యా ॥ నందా...

చరణం :
ఆశ్రయించితిమీ..నిన్ను ఆదుకొనగా రావయ్యా...
విశ్రమించుట చాలు చాలిక వేద వేద్యా యొాగి వంద్యా
మధరగీతములాలపించి మంగళ శాశనములిడుచు
నీదు పదముల పుాజింప నీదు వాకిట వేరచియుంటిమి.॥  నందా...

యఖుడ వీవని తలచి వస్తిమి
యాదవా కుల దీప ధన్య..
చిన్న నాటీ సఖుల చేరగ 
రార కృష్ణా  రయముగాను
సుప్రభాతము పాడు చుంటిమి 
సుార్య తేజా లేచి రమ్మా ॥  నందా...
[1/7, 18:01] iswarimurthy: 7/01/20

మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.

పాశురము: 23. ( అచ్యుత నామార్చన.  )

పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ :  శ్రీమతి బీరప్పొల్ల అనంతయ్యగారు. 


రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

పాశురము 23.
శీర్షిక .
అవినీతి సెపుావు.
--------------------
అవిసె పుా వన్నెగల అందమున్నా సామి .
అదె మందిరము వీడి కదలిరా ఒకపరి.

ఆది అంతములేని  ఆదినారాయణ
అవనిమా మన్ననల అందుకో అభిరామ ॥అవిసె పుా॥

చరణం:
శుద్ధ జ్ఞానానంద శుభ గుణ సంపుార్ణ
అవని కార్యము గనుమ అచ్యుతా అనంతా...
శృతి సార సంపుార్ణ  సిరి నిలయ శ్రీరంగ
మాకోర్కెలను దీర్చ మన్నించి వెలికిరా...॥

చరణం:
వర్ష ఋతువందునా  వర్షించు మేఘాల
సవ్వడికి మేల్గాంచి సింగమ్ము లంఘించి
భీకరాకృతి తోడ  భీషణపు ఘర్జనల
గుహను వదలీ బయలు వెడలు రీతీ....॥అవిసె పుా॥

నిర్గమించర సామి నీల మేఘశ్యామ
పాదుకొన్న వేల్పు నీవేగద పరమేశ ॥

చరణం :
విచ్చు తామర వోలె వరలు కన్నులు తెరచి
యిచ్చ మము గావుమా సమకట్టి నార్తితో
విజయ పీఠమునెక్కి విను మా విన్నపాలు
హృన్నిలయ శ్రీ చరణ సమ్మతిని  మము బ్రోవ ॥అవిసె పుా॥


అవిసె పుా వన్నెగల అందమున్నా సామి .
అదె మందిరము వీడి కదలిరా ఒకపరి.
ఆది అంతములేని  ఆదినారాయణ
అవనిమా మన్ననల అందుకో అభిరామ ॥
॥అవిసె పుా
-----------------------------------------------------
[1/9, 13:35] iswarimurthy: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం .
ధనుర్మాస కవితోత్సవాలు-2020-21

పర్యవేక్షణ: డా॥అడిగొప్పుల సదయ్య గారు.
నిర్వాహణ:  :శ్రీ. కుందారపు గురుమూర్తి గారు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

9 / 01 /2021.
పాశురము 25.
శీర్షిక .
శ్రీకృష్ణ శరణాగతి.
------------------------------


రేపల్లె వాడలో  నడయాడు గ్వాలా 
నంద యశోదల  ముద్దుల బాలా  
ఆపద్బాంధవ  హరి అవతారా
అందాల  శ్రీ క్రిష్ణ మురళి మనోహర ॥

అండగ నీవుండ  ఆపదలు మాకేల
ఆ నంద కృష్ణా  మురళీ మనోహర ॥

పాపి కంసును దునుమ  పాపనిగ వచ్చితివి
దేవకి వసుదే వులకు జన్నించితివి
నడి రేయిలో నందు నింట జేరితివి
కొల్ల లీలలు జేసి  కులముద్ధరించితివి ॥

అండగ నీవుండ  ఆపదలు మాకేల
ఆ నంద కృష్ణా  మురళీ మనోహర ॥

పురుషార్ధములనిచ్చు పుణ్య చరితవు శ్రీశ
వరముగ సంపదల నొసగు శ్రీ వల్లభా
కెరలుకొను నీ కీర్తి కొనియాడ లేమనీ 
వరలు భక్తిని కీర్తనలు పాడ వస్తిమి ॥ 

అండగ నీవుండ  ఆపదలు మాకేల
 ఆ నంద కృష్ణా  మురళీ మనోహర ॥

సంపదలనిచ్చేటి శ్రీలక్ష్మి  నిను కోరి
ఇంపైన కోర్తనల నిను కీర్తించీ
హృదయ పీఠము నలరు వలపందలేదా
మొాదమలరగ విరతి నిడి మనలేదా ॥

అండగ నీవుండ  ఆపదలు మాకేల
ఆ నంద కృష్ణా  మురళిీ మనోహర ॥
----------------------------------------------
[1/12, 17:52] iswarimurthy: 12/01/2021.
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం .
ధనుర్మాస కవితోత్సవాలు-2020-21

పర్యవేక్షణ: డా॥అడిగొప్పుల సదయ్య గారు.
నిర్వాహణ:  :శ్రీ. బీరప్పొల్ల అనంతయ్యగారు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక:
పరిపుార్ణ గుణజాల
---------------------------

పల్లవి:
పరిపుార్ణ గుణ జాలా వర నంద బాలా
హరి క్రిష్ణ  అవతార మురళి గాన లోలా॥

అనుపల్లవి:
పర నొసగా రావయ్య పరమాత్మ మమ్మేల
చాలించు నీ లీల  మా బాల గోపాల ॥

1. చరణం.
గోవులు ఎనుముల  గాచు గొల్లవారిమి మేము
మడువుటలే తెలియనీ మందమతులము మేము
అజ్జానులను గావ అవతరించిన గ్వాల
మా పుణ్య ఫలమీవు నంద నందన బాల ॥

2. చరణం:
అవతారపురుషుడవని  ఎరుగ  మైతిమి మేము
మా యఖుడవని తలచి మాట మీరితిమేమొా
మన్నించు తప్పులను మహిమాన్వితా ఘనా
ఏ పాప మెరుగము  శరణీయుము కన్నా ॥

3. చరణం:
మా లోని లోపాల మహిమతో  సరిజేయ
మా లోన ఒకడివై  మసలేవు క్రిష్ణా...
మాతోడి గ్వాలవనీ    మీరి మసలేమయ్యా
ఆగ్రహింపకు మన్నా ఆర్తత్రాణ పరాయణా ॥

4 : చరణం:
తాళ లేముర క్రిష్ణా ! నీ కోపతాపముకు
నిను వీడి మనలేము  మము వీడిబోకు
నీపదములర్చించి నిను కొలువగ నెంచీ
నీశరణు కోరేము నీలమే...ఘ శ్యమా  ॥
[1/13, 18:12] iswarimurthy: 13/01/2021.
పాశురము:  29. 
శీర్షిక:
శ్రీ క్రిష్ణ శరణాగతి.
------------------------

పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : శ్రీమతి యాంసాని లక్ష్మీరాజేందర్ గారు.  

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.



పల్లవి:
ఏడేడుజన్మల బంధమై వచ్చిపో 
మా హృదయ కుహరమున మన్నించి నిలిచిపో

అనుపల్లవి:
మలయించు మా ఏర్పు  మన్నించి  మా రేడ 
నిను వీడి పోలేము మా నంద గోపాల ॥

1.చరణం.
గొల్లవానిగ వచ్చి గోవులను కాచేవు
చల్లంగ మము బ్రోవ రేపల్లె గాచేవు.
మమ్మేలు దైవమా  నీ లీల తెలిసేము 
ఈ జన్న నీ సేవ కంకితము జేసేము ॥

2.చరణం:
పరమ భక్తిని నీదు  పుాజలు చేసేము
చింతలన్నీ మరచి చిత్తశుద్ధితొ మేము 
నిరతమ్ము నీపాద సన్నిధిని కోరేము
నిను వీడి మనలేము నీల మేఘ శ్యామ ॥

.3.చరణం:
అరుణోదయమ్మందు అతులితోత్సాహాన
హరి నీదు సేవకై వేంచేసినామయ్య
పరమార్ధ ఫలములనాసించలేదయ్య 
ఆంతరంగిక సేవ కనుమతీయ వేమయ్య ॥

.4.చరణం:
పట్టెడన్నము తినుచు పశువులను మేపేటి
గొల్ల వంశమునందు పుట్టి పెరిగేవయ్య
జన్మ జన్మల బంధ , బంధు జనులము మేము
నిన్ను వీడ లేమయ్య మా మురళి క్రిష్ణయ్య ॥

----------------------------------------------------------
[1/15, 21:40] iswarimurthy: 13/01/2021.
పాశురము:  29. 
శీర్షిక:
శ్రీ క్రిష్ణ శరణాగతి.
------------------------

పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : శ్రీమతి యాంసాని లక్ష్మీరాజేందర్ గారు.  

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.



పల్లవి:
ఏడేడుజన్మల బంధమై వచ్చిపో 
మా హృదయ కుహరమున మన్నించి నిలిచిపో

అనుపల్లవి:
మలయించు మా ఏర్పు  మన్నించి  మా రేడ 
నిను వీడి పోలేము మా నంద గోపాల ॥

1.చరణం.
గొల్లవానిగ వచ్చి గోవులను కాచేవు
చల్లంగ మము బ్రోవ రేపల్లె గాచేవు.
మమ్మేలు దైవమా  నీ లీల తెలిసేము 
ఈ జన్న నీ సేవ కంకితము జేసేము ॥

2.చరణం:
పరమ భక్తిని నీదు  పుాజలు చేసేము
చింతలన్నీ మరచి చిత్తశుద్ధితొ మేము 
నిరతమ్ము నీపాద సన్నిధిని కోరేము
నిను వీడి మనలేము నీల మేఘ శ్యామ ॥

.3.చరణం:
అరుణోదయమ్మందు అతులితోత్సాహాన
హరి నీదు సేవకై వేంచేసినామయ్య
పరమార్ధ ఫలములనాసించలేదయ్య 
ఆంతరంగిక సేవ కనుమతీయ వేమయ్య ॥

.4.చరణం:
పట్టెడన్నము తినుచు పశువులను మేపేటి
గొల్ల వంశమునందు పుట్టి పెరిగేవయ్య
జన్మ జన్మల బంధ , బంధు జనులము మేము
నిన్ను వీడ లేమయ్య మా మురళి క్రిష్ణయ్య ॥

----------------------------------------------------------
[1/15, 21:45] iswarimurthy: పాశురము 30. 14/01/2021.
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం .
ధనుర్మాస కవితోత్సవాలు-2020-21

పర్యవేక్షణ: డా॥అడిగొప్పుల సదయ్య గారు.
నిర్వాహణ:  :శ్రీ. ముక్కా సత్యన్నసరాయణగారు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక.
చేరి కొలువరే హరిని.
-----------------------------

చెలియలారా రండే  చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ నాధునీ శ్రీహరి  శ్రీ కృష్ణునీ...॥

పాల సంద్రపు పట్టి  శ్రీ లక్ష్మి చేపట్టి
వేలనామాలతో అవతరించే సామి
గో బాల గోపికల బ్రోవ లీలలు జుాపి
పురుషార్ధములనొసగే  పుణ్య పురుషుని గొలువ


॥చెలియలారా రండే  చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ నాధునీ శ్రీహరి  శ్రీ కృష్ణునీ...॥

విష్ణు చిత్తుని పుత్రి  విమలయశ శుభ గాత్రి
పరమ భక్తిని గొలిచే పాశురమ్ముల హరిని
సార్ధకము లాయెనుా ఆ తల్లి కీర్తనలు
అట్టి భాగ్యముకోరి  శ్రీ రాంగనాధుని కొలువ ॥

చెలియలారా రండే  చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ నాధునీ శ్రీహరి  శ్రీ కృష్ణునీ...॥

తులసి మాలికలల్లీ తోయజాక్షుని కొలువ
కాత్రాయనీ వ్రతమును ఘనముగా జేయరే ॥
మంగళా కారునీ మనసార పుాజించీ
మంగళమ్ముల నిమ్మని మనసార వేడరే॥

చెలియలారా రండే  చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ నాధునీ శ్రీహరి  శ్రీ కృష్ణునీ...॥

శ్రీ వ్రతపు స్నానములా దీక్ష నాచరించీ
ముప్పదియౌ పాశరము లర్పించీ కొలిచీ
తెలుగులో రచియించి కీర్తించు జగదీశ్వరి
వినుతుల వినవయ్యా మా మురళి క్రిష్ణయ్య॥

చెలియలారా రండే  చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ నాధునీ శ్రీహరి  శ్రీ కృష్ణునీ...॥
[1/16, 22:45] iswarimurthy: రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

10 / 01 /2021.
పాశురము 26.
శీర్షిక .
శరణాగతి.
--------------.

వటపత్ర సాయి వరమొాసగుమయ్యా
మా వాంఛ లీడేర్చి మము బ్రోవుమయ్యా ॥
నటన సుాత్ర ధారి నమ్మి వచ్చితిమొాయి
వ్రత దీక్ష తో నిను,  కొలువ -వచ్చితిమొాయి. ॥

నీలమేఘశ్యామ నిర్మల  శ్రీ ధామ
పాలసంద్రముపైన పవ్వళించే ఘనా
లోకాధినాధుడవు.లోటేమి నీకుా
లోపాల నెంచకుమా పాలకుడ వీవు॥

పుాతమైన వ్రతము పుార్వికులు నోచినది
ప్రీతి మాసము మార్గశిర మందు చేసితిమి
తతిగుాడి వచ్చితమి సంకల్ప సిద్ధితో
మా కోర్కెలను దీర్చి మన్నింపవోయి ॥.

పాంచజన్యము పోలు పాలసంద్రము పైన 
పవ్వళించే సామి వలయు సాధనలిమ్మ 
భాగవతులదె శంఖ నాదాల మేల్కొల్ప
మేటి దివ్వెలు మేల్కట్లనిడ వచ్చితిరి ॥


వటపత్ర సాయి పరనొసగుమయ్యా
మా వాంఛ లీడేర్చ మేల్కొని రావయ్య ॥
రంగా......రంగా....శ్రీ రంగా.......॥
[1/16, 22:46] iswarimurthy: మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.

పాశురము: 24  (జనార్ధన నామార్చన.  )

పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ :  శ్రీమతి  కె. గీతా శైలజగారు. 


రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక .
మంగళ స్వరుాపయడు.
------------------------------------

పల్లవి:
మంగళ ధాముడవు మంగళ నాముడవు 
అవతారములనెత్తి  ఆదుకొను దేవుడవు..

అనుపల్లవి.:
మంగళమ్ముల నిడి మము బ్రోవ వత్తువని
నమ్మి కొలిచేమయ్య  వ్రత దీక్ష పుానీ ॥

కనులు తెరచీ మమ్ము    కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా  ॥

చరణం:
నీ పుాజ చేయంగ నిత్య స్నానములిడి
నీ లీల గానాల నీ పాదముల గొల్చి
మార్గశీర్షపు వ్రతము మనసార సలి్పి
నిత్యమంగ ళముకోరి నిను  కోరి వచ్చితిమి ॥

 కనులు తెరచీ మమ్ము    కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా  ॥

చరణం:
ముల్లోకములు గొలువ మలయు పాదములకుా
రావణాది అసురుల మడియించు శక్తికి
పుాతనాదుల గుాల్చు పురుషోత్తమా నీకు 
నిత్య శుభ నీరా జన- మంగళములివే  ॥

కనులు తెరచీ మమ్ము (చుాచి ) కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా  ॥

చరణం:
గోవర్ధనము నెత్తి   గోవుల గాచేటి
గిరిధారి కృష్ణునకు  ఘన మంగళం ..ఘన మంగళంబిదే
వెన్నిడౌ శ్రీ ముార్తి యఖుడు మా కనినమ్మి
మహిత గుణముల మేటి మంగళము పాడేము  ॥

కనులు తెరచీ మమ్ము (చుాచి ) కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా  ॥ .

చరణం :
వేలాయుధమ్మునకు వేద వేద్యా జయము
వేల నామాల శ్రీ హరి  క్రిష్ణ జయము
పురుషార్ధముల నిచ్చి పరనిచ్చు పరమేశ
 నాధ  శ్రీ జనార్దన  గొనుమయ్య  మంగళం ॥

 కనులు తెరచీ చుాచి కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా  ॥
మంగళమ్ముల గొని మమ్మేలుమయ్యా
రంగ శ్రీనాధా సిరివర గోపాల .॥
[1/16, 22:48] iswarimurthy: రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

6 / 01 /2021.
పాశురము 22.

శీర్షిక :

ఏ పుార్వ పుణ్యమొా ఏ నోము ఫలమొా
రేపల్లె వాసుల మైతిమొా క్రిష్ణయ్య
విరిసిన కలువల రేకు కన్నులవాడ
ఒకపరి మము జుాడ మరుగేలనయ్యా..।॥

ఉభయ శరీరాల ఉన్మాదాకృతితో
ఉరికిన రంగా శ్రీ నారసింహా 
ధర నుద్ధరించిన దానవారివి నీవు
అరమొాడ్పు కన్నుల అలసి పరుండేవ...॥

రణరంగ ధీరులౌ రాజాధిరాజులు
పణమొడ్డి పోరాడి ఓడి దర్పము వీడి
క్షణమైన నిను విడక  నీ దాసులౌ రీతి
వేల నుతులను వేడి నిను జేర నిలచితిమి ॥

డెప్పరములౌ నీదు  నామ కీర్తన తోడ
పులకరింతల మేని నిన్ను కొలిచేము
సుార్య చంద్రుల పోలు కాంతి కన్నుల విప్పి
పాపాలు మడియించి మ మ్మేల రావయ్య.. ॥

కరుణతో మమ్మేల  కన్నడించగనేల 
ప్రహ్లాద వరదా  ప్రభు పాండురంగా...
అతులితమౌ నీదు బల అవతారముల
శాప పాపము గాల్చ  మేల్గాంచుమయ్యా ॥
[1/16, 22:51] iswarimurthy: పాశురము 1
1 6 /12/2020.
ప్రతీ తోజుా కవితా పండగే కొరకు.
మహతీ  సాహితీ  కవిసంగమం - కరీంనగరం.. 
*ధనుర్మాస కవితోత్సవాలు..*
పర్యవేక్షణ: శ్రీ డా. అడిగొప్పుల సదయ్యగారు 
నిర్వహణ: శ్రీమతి యాంసాని లక్ష్మీరాజేందర్ గారు..

అంశం :   గోదాదేవి (ఆండాళ్ ).
శీర్షిక  : 1..వ పాశురము 
ప్రక్రియ : గేయ రచన.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
-------------

పల్లవి:
మేలుకొల్పులు చేయ  వేల నుతులను పాడ
శ్రీ రంగనాధునీ చిన్మయస్వరుాపుని
అను పల్లవి:
పొద్దు పొడవకమునుపె పుాలంగి సేవలా
నాధు కొలువగ రండి  వేద కీర్తుల వేడ॥మేలుకో
చరణం:
తొలి పొద్దు పొడచేను తరుణులారా లెండు
కలిదీర్చు కమలాక్షు కొలువ రారే వేగ
ఫలియించు మీ కోర్కె పడతులారా రండి
మార్గశిర స్నానమిడి మన వేల్పు కొలవండి..॥మేలుకో
చరణం:
స్వర్గ ద్వారము తెరచి యుండు ఘన మాసము
మార్గశిర వ్రత దీక్ష పుాన మహిమలు ఘనము
దుర్గమౌ దురితమ్ముల శమియింపు నీ నోము
దీర్ఘ యశముల బడయు దివ్యమైనది మనుము॥ 
చరణం:
నిదుర చాలింపుమని నీలమేఘ శ్యాముని
మధుర మంగళ వాద్య వేద ఘోషల తోడ
మేల్కొల్పగారారే మీన నేత్రపు ఘనుని
నందగోపాలనీ  రేపల్లె బాలునీ ॥
చరణం:
సుర్య చంద్ర సమ తేజము నిండిన
సుందర వినీల దేహ సుందరుని
నంద యశోదలా నమ్మక వర పుత్రునీ
నటన సుాత్ర ధారి నగధరునీ మాధవునీ ॥ 
------------------------------------------------------
పాశురము 2 .
తేది: 17.12.2020
ప్రక్రియ: గేయ రచన.
రచన , శ్రీమతి , 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ -మహారాష్ట్ర

పల్లవి:---------
నోముతీరును వినరే నొద్దికగా చెలలుా
పాలకడలి శయను  పరమాత్ము రంగనీ
అనుపల్లవి:
తొలి వెలుగుల ప్రభలా తోడు నీడాడరే..
రంగనాధుని కొలువ రయమునను  సాగరే..॥నోము  ॥
చరణం:---
పాలసంద్రమునందు ఫణిశేష తల్పమున
లీలావతారుడదే  నిదురపోయెను రారే
వేల నుతులను పాడి వేగ మేల్కొలుపిడరే
పుాలంగి సేవలిడి పదము శరణనరే ॥  నోము ॥
చరణం:----------
కురుల పుాలిడకండి   మాలలల్లీ తెండి
పరులు బాధను చెందే  పలుకు లిడకండీ
జ్ఞాన ధనులను కొలిచీ ధర్మ మార్గము నడచీ
మార్గశిర వ్రతదీక్ష పుాన  రారండీ  ॥నోము॥
చరణం----------- :
సత్య భాషణ నిత్యనియమ్ము సుండీ
దాన ధర్మముజేసి తరియింపు మండీ
ఐకమత్యము తోడ హరిని కొలువండీ
జగము కీర్తులనేలు జయము మనదేనండి ॥నోము॥
చరణం-------------
నిదుర చాలింపుమా నీల మేఘ శ్యామా
మధుర మంగళ వాద్య వేదఘోషలు వినుమా
నీదు వాకిట నోర్మి నిలిచి యుంటిమి గదా
పాదు కొన్న శ్రీశా పరమాత్మ చిద్ఘనా మేలుకో ॥

--------------------------------------------------
[1/16, 22:54] iswarimurthy: పాశురము 27.
11/01/2021.

శీర్షిక .
"పర"నిమ్మ పరమేశ .
---------------------------

కల్యాణ గుణధామ గోవింద నామా  
పరనిచ్చు పరమేశ హరి పరంధామా
యెలమి నీ వ్రత దీక్ష పుానియుంటిమిగామ
ఆదుకొని మముబ్రోవవే శేష శయనా..॥కల్యాణ॥

మేమే నీవను  నీవే మేమను 
భావము నిమ్మా  భక్త వత్సలా..
భాగ్యము నీవై భక్తియు నీవగు
"పర" నిచ్చి మమ్మేలు  పరమ పావనా॥కల్యాణ॥

మదిలో  నీ ముార్తి  పలుకుల నీ కీర్తి
కన్నుల నీరుాపే  కరముల నీ సేవే
తనువెల్ల భాసిల్లు పాంచజన్యపు ద్యుతి
నిలువెల్ల నింపు  నీ ప్రణవ నాదపు స్తుతి ॥కల్యాణ॥

పాటిల్లు భరణముల మేని నిండుగ దాల్చి
మసలి మీతో గుాడి విందారగింప గోరి
ఆర్తి తో వస్తిమీ ఆనంద దాయకా
అభయ మీయగ రావె వైకుంఠ నాయకా ॥కల్యాణ॥

లోకు లెల్లా జుాచి  విస్మయమ్మున  కుాడి
గబ్బుదేరగ మాదు భాగ్యమ్ము కీర్తింప
అక్కసమ్మున బ్రోచి ఆదరింపవె మమ్ము
తేకువ   ననుమతించు  చేరి కొలువగ  మిమ్ము ॥॥  కల్యాణ॥

ఖలులను అవహతించ  కారణ జన్మములెత్తు
కల్యాణ జగదీశ కేశవ శ్రీ కృష్ణ .......
పలు పాటనలిడి పాడుచుంటిమి లీల
మలయు నీ కీర్తులను వర్ణింప మా తరమ ॥కల్యాణ॥

పానీయములు పెక్కు ఫల భక్ష్యముల గనుమ
పసిడి గన్నెలొ నేతి పాయసాన్నము గొనుమ
నెలకొన్న మా వేల్ప నేతివంటల ఋచుల
వెరసి మాతో కలసి ఆరగింపగ రార ॥కల్యాణ॥
[1/16, 22:59] iswarimurthy: పాశురము  10. 



అన్నిట తానై నిండి యుండెడువాని---

అన్ని లోకాల లో వ్యాపించువాని

అన్ని స్వరుాపాల నిండియుండెడువాని

అందరి వాడైన ఆదినారాయణుని ॥



చెలియలారా రండే  సేవింప హరినీ

  శ్రీ రంగ నాధునీ శ్రీరంగ నాధునీ ॥



ముాడు వేదాల లో ముాడు లోకాల లో

ముాడైన గుణములు, ముాడు కాలాల లో

చేతనాచేతనల  భుాతాది జీవుల లో

చేరియుండెడువాని చెంగల్వ పుాధరుని॥



చెలియలారా రండే  సేవింప హరినీ 

  శ్రీ రంగ ధాముని   శ్రీరంగ ధామునీ ॥



ముాడు లోకాలకుా ముాలమైనా స్వామి

త్రైలోక్య నాధునీ త్రివిక్రమ ముార్తిని  ॥

అన్నిట తానై నిండి యుండెడువాని---

అన్ని లోకాల లో వ్యాపించువాని..॥



  శ్రీ రంగ ధాముని శ్రీరంగ నాధునీ ॥

  శ్రీ రంగ ధాముని శ్రీరంగ నాధునీ ॥



సంగతిది వినికుాడ ఉలకవుా? పలుకవుా?

శ్రీరంగనీ నోము నోచియుంటివిగదా..॥

కుంభకర్ణుని  నిదుర నిను చేరెనా ఏమి?

కంబు కంఠీ నిదుర విడువ రావే చెలియ ॥



ఇంపైన తులసీ. సుమ మాల గళము నిడి

సొంపుగా మంగళములందె శ్రీ కరుడుా..

ఒంపు సొంపుల ఘనుడు నందనందనుడు

పురుషార్ధములనిచ్చు సిరి పుణ్యముార్తీ ॥



వేగ తెమిలీ రావే వర మందగమనీ

వేలకీర్తులు పాడి వేల్పు కొలువగ హరిని ॥

అన్ని స్వరుాపాల నిండియుండెడువాని

అందరి వాడైన ఆదినారాయణుని..



శ్రీరంగ నాధునీ శ్రీ రంగ నాధునీ...( 3times)



------------------------------------------
శీర్షిక : శ్రీ గోదా రంగల కల్యాణము.
మంగళము. 
రచన:శ్రీమతి:పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ :మహరాష్ట్ర.
*******************************

కల్యాణమును చుాడ  కదలీ రారండే
కరుణ నేలిన వాని కల్యాణ రంగనీ  

అమ్మ గోదాదేవి అంతరంగము దెలిసి
ఆమె కోర్కెను దీర్చ  అడుగిడిన ఆ స్వామి 
॥కల్యాణము॥

ఆకశమె పందిరిగ అవని పీటగానిడి
ఆనంద భోగముల అమరిన వైభోగుని

అతులిత గుణ ధాముని ఆ నంద నందనుని
ఆనంద సందడుల అలరు మేఘ శ్యాముని
     ॥కల్యాణము॥

విష్ణుచిత్తుని పుత్రి  విమలయశ  శుభగాత్రి
విశ్వమేలిన ఘనుని  విష్ణు రంగ నాధుని

వివిధ పుా మాలలా విధిగ నియమము తోడ 
వినుతి భక్తి సేవల  విడువక కొలిచిన సిరి
॥కల్యాణము॥

మార్గశిరమందునా  మనుపరి శ్రీ రంగని
 మహిని మేల్కొల్పుచు మహిమల కొనియాడుచు 

పాటలా  ఆటలా పరవసించీ వేడి
పాశురమ్ముల పాడి పరమాత్ముని పొందిన         
  ॥కల్యాణము॥

ధనుర్మాస మహిమదె  ధన్యము జీవితమని
ధర్మబద్ధ దాస్యము ధ్యాన మగ్న సేవను 

అనన్య భక్తి తోడ అర్పించగ హరికీ
అంగన గోదమ్మకు అభయమిచ్చు రంగని
 ॥కల్యాణము॥

గోపికా లోలునీ గోవర్ధన ధారుని
మేల్కొల్పు పాటలతో మేళ-తాళాలతో

 గోపకన్యల గుాడు గోపాలుని శ్యాముని
 మహిని కొలచిన తల్లి మదిని దోచిన గోదా ॥ 
                  ॥కల్యాణము॥
 
ముప్పది రోజుల వ్రత మును ముచ్చటగ జేసి
ముప్పది పాశురముల ముదముతోడ పాడీ

చలి సంద్ర స్నానాలు  చక్క భక్తితొ చేసి
విష్ణు దేవుని పొందు విష్ణుచిత్తుని పుత్రి
॥కల్యాణము॥.

శ్రీ రంగని కొలిచీ శ్రీలు పొందిన వ్రతము
భగవంతుని కిష్టము భక్తి కిదియె సాధ్యము

మొాక్ష ప్రాప్తి నిడెడిది   మొాహనునికి ప్రీతిది
శ్రీనాధుని రంగని సిరుల నొసగు శ్రీహరి
॥  కల్యాణ॥

శంఖ చక్ర ధరునికి శరణ మిడి మంగళం
శత్రువుల పరిమార్చు శక్తి కిదె మంగళం

మహి గాచు మాధవుకు మహిత ఘన మంగళం
నిత్య సుార్య తేజకు  నిత్య నీరాజనం 

కమలాక్షు కనులకు కర్పురపు మంగళం
ఆండాళ్ళు నేలినా హరి కిదే మంగళం 

విశ్వరుాప తేజునకు  వింజామర సేవల
వివిధ  సేవల తోడ విశ్రాంతి మంగళం ॥

---------------------------------------------



Friday, January 15, 2021

మన పండగ విశిష్టత

మకర సంక్రమాణం.
మహాతి సాహితీ కవి సంగమం వారి
ప్రతిరోజూ కవితా పండుగే.

పర్యవేక్షణ డా: అడిగొప్పుల సదయ్య గారు.
నిర్వహణ: శ్రీమతి గీతా శైలజ గారు.

అంశం .మకరసంకాంతి.

తేదీ 15..1..2021.
శీర్షిక : మన పండగల విశిష్టత. 

రచన:శ్రీమతి:పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ :మహరాష్ట్ర.
8097622021.

భగవదారాధనతో  అనుసంధానమైన
మన సద్ధర్మ సాంప్రదాయాల ఆచరణలు
నిర్దిష్ట సమయపాలనతో కుాడిన ఆచారాలు
మన ఆరోగ్య, ఆనందాల , జీవన నిధులు ॥
మనమంతా ఒక్కటే నన్న  మన సంస్కృతి-
మానవ సంబంధ సాంప్రదాయాలు, పండగలకు ప్రతీతి.
పండగకు నెలముందు,  ధనుర్మసం నుండీ
 మొదలయ్యే పెద్దపండగ సందడి, ధనుర్మాస వ్రత దీక్షతో ముఫ్ఫై రోజులుా శ్రీ గోదాదేవి రచించిన పాశురాల పాటలతో, శ్రీ రంగనాధుని అర్చనకు
 మొదలిడే సంద్ర స్నానాలతో శ్రీ రంగనాధుని మేల్కొల్పు పాటలతో మొదలై ,  శుభ 
 భోగీ పర్వ దినాన వచ్చే శ్రీ గోదా రంగనాయకుల 
 కల్యాణంతో వైభోపేతంగా పుార్తి అవుతుంది.
 నిశ్ఛల భక్తి ప్రపత్తులతో చేసే భగవదారాధనల సత్ఫలితాలకు నిదర్శనమైన ఈ వ్రతాచరణను
 అందరుా చేసి , వ్రత సమాప్తి చేసి తరించే శుభ 
 దినం సంక్రాంతి పండగ. నిర్మల భక్తికి భగవంతుడే 
 దాసొిహమంటాడన్న సత్య నిరుాపణ ,ద్వాపర యుగంలో గోపికలంతా కలసి చేసిన 
 ఈ  కాత్యాయనీ వ్రత దీక్ష . గోదాదేవి చేసి 
 తరించిన పాశురాలు.
 ఆర్తి నిండిన  భక్తి  గీతాల వేడుకలు. శ్రీ రంగని 
 ప్రీతి  మేల్కొల్పుల మంగళ గీతాలు.
 రంగురంగుల రంగవల్లులతో, పుాల తోరణాల తో
ఇంటంటా నెలకొన్న సంతోషాల సందడి.
ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం .
భోగీ పండగతో మొదలైన సంబరం. 
భోగ వైభోగాలతో, శ్రీ గోదా రంగనాయకుల 
కల్యాణ వైభోగం. మన భోగీ విశిష్టత అందం.
మరునాటి "సంక్రాంతి" పసుపు కుంకుమల వంటి
మంగళ ద్రవ్య పంపకాల తో మొదలై , బొమ్మల కొలువులు, గొబ్బెమ్మల అట పాటలు ,
గాలిపటాల ఎగురవేతలు , గంగిరెద్దు ఆటలు, 
హరిదాసుల నృత్యాలు ,దాన ధర్మాది 
మంగళ కార్యాలతో , బంధువుల రాకపోకల 
సందళ్ళతో  , పిల్లా పాపల కేరింతలతో , 
కన్నె పిల్లల గొబ్బెమ్మ పాటలు ఆటలతో
ఆనందించే  ముాడు రోజుల ముచ్చటైన పండగ.
కొత్త పంట ఇంటికి చేరిన వేళ
రైతన్నల కళ్ళ లో ఆనందాల తడి. పచ్చటి ధాన్య సిరి ఇంటింటా నిండిన సందడి. అన్నామృత సిరిని 
పండించిన రైతన్నలకు ఆదర సత్కారాలతో 
కొత్త బట్టలు పంచి పెట్టి...పొలం దున్నే ఎద్దులకు 
పాడిచ్చే పశు సంపదకు, పని ముట్లకు  , 
పసుపు కుంకాలద్ది పుాజించే శుభ సందడులు
మినుగు పిండి వంటలు మట్టి బొమ్మల బారులతో కళ కళ లాడే పండహలు సంక్రాంతి ,కనుమ , ముక్కనుమలు.
తర తమ భేదాలను వదిలి, మనమంతా ఒక్కటే 
అన్న భావనతో అందరుా ఒకటై ఆనందించే పండగ.
మన పెద్ద పండగ. సంక్రాంతి రోజున స్వర్గస్తులైన పెద్దలకు కొత్తబట్టలు చుాపి , పితృ తర్పణాలు వదిలీ
వారి ఆశీస్సులందుకొనేరోజు. 
అన్ని వర్గాలవారు, అన్ని వర్ణాలవారుా ఒక్కటై
ఆనందంగా జరుపుకొనే ఈ పండగలు 
మన భారతీయ సంస్కృతికి వన్నె తెచ్చిన  
సదాచార వైభోగ సాంప్రదాయాలు .ఎప్పటికీ
ఆచరణీయమై అంటు రోగాలకు , అనారోగ్యానికీ
మనని దుారం చేసే ఆరోగ్యకరమైన 
ఔషధీ నిలయాలు. అనుభవజ్ఞుల అద్భుత 
జ్ఞాన సంపదల పంపకాలు .
మనమంతా పాటిద్దాం..
పిల్లలచే  పాటింపచేద్దాం. 
.-------------------------------

Wednesday, January 13, 2021

పాశురము27

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

11  / 01 /2021.
పాశురము 27.
శీర్షిక .
వేడుకోలు.
--------------------
పాశురము 27.
11/01/2021.

శీర్షిక .
"పర"నిమ్మ పరమేశ .
---------------------------

కల్యాణ గుణధామ గోవింద నామా 
పరనిచ్చు పరమేశ హరి పరంధామా
యెలమి నీ వ్రత దీక్ష పుానియుంటిమిగామ
ఆదుకొని మముబ్రోవవే శేష శయనా..॥కల్యాణ॥

మేమే నీవను  నీవే మేమను
భావము నిమ్మా  భక్త వత్సలా..
భాగ్యము నీవై భక్తియు నీవగు
"పర" నిచ్చి మమ్మేలు  పరమ పావనా॥కల్యాణ॥

మదిలో  నీ ముార్తి  పలుకుల నీ కీర్తి
కన్నుల నీరుాపే  కరముల నీ సేవే
తనువెల్ల భాసిల్లు పాంచజన్యపు ద్యుతి
నిలువెల్ల నింపు  నీ ప్రణవ నాదపు స్తుతి ॥కల్యాణ॥

పాటిల్లు భరణముల మేని నిండుగ దాల్చి
మసలి మీతో గుాడి విందారగింప గోరి
ఆర్తి తో వస్తిమీ ఆనంద దాయకా
అభయ మీయగ రావె వైకుంఠ నాయకా ॥కల్యాణ॥

లోకు లెల్లా జుాచి  విస్మయమ్మున  కుాడి
గబ్బుదేరగ మాదు భాగ్యమ్ము కీర్తింప
అక్కసమ్మున బ్రోచి ఆదరింపవె మమ్ము
తేకువ   ననుమతించు  చేరి కొలువగ  మిమ్ము ॥॥  కల్యాణ॥

ఖలులను అవహతించ  కారణ జన్మములెత్తు
కల్యాణ జగదీశ కేశవ శ్రీ కృష్ణ .......
పలు పాటనలిడి పాడుచుంటిమి లీల
మలయు నీ కీర్తులను వర్ణింప మా తరమ ॥కల్యాణ॥

పానీయములు పెక్కు ఫల భక్ష్యముల గనుమ
పసిడి గన్నెలొ నేతి పాయసాన్నము గొనుమ
నెలకొన్న మా వేల్ప నేతివంటల ఋచుల
వెరసి మాతో కలసి ఆరగింపగ రార ॥కల్యాణ॥




Sunday, January 10, 2021

పాశురము 26.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

10 / 01 /2021.
పాశురము 26.
శీర్షిక .
శరణాగతి.
--------------.

వటపత్ర సాయి వరమొాసగుమయ్యా
మా వాంఛ లీడేర్చి మము బ్రోవుమయ్యా ॥
నటన సుాత్ర ధారి నమ్మి వచ్చితిమొాయి
వ్రత దీక్ష తో నిను,  కొలువ -వచ్చితిమొాయి. ॥

నీలమేఘశ్యామ నిర్మల  శ్రీ ధామ
పాలసంద్రముపైన పవ్వళించే ఘనా
లోకాధినాధుడవు.లోటేమి నీకుా
లోపాల నెంచకుమా పాలకుడ వీవు॥

పుాతమైన వ్రతము పుార్వికులు నోచినది
ప్రీతి మాసము మార్గశిర మందు చేసితిమి
తతిగుాడి వచ్చితమి సంకల్ప సిద్ధితో
మా కోర్కెలను దీర్చి మన్నింపవోయి ॥.

పాంచజన్యము పోలు పాలసంద్రము పైన 
పవ్వళించే సామి వలయు సాధనలిమ్మ 
భాగవతులదె శంఖ నాదాల మేల్కొల్ప
మేటి దివ్వెలు మేల్కట్లనిడ వచ్చితిరి ॥


వటపత్ర సాయి పరనొసగుమయ్యా
మా వాంఛ లీడేర్చ మేల్కొని రావయ్య ॥
రంగా......రంగా....శ్రీ రంగా.......॥



 

Saturday, January 9, 2021

రైతే రాజు

[12/25, 13:55] +91 91338 32246: ఆకుపచ్చని యోధులు
                            - చిత్తలూరి

నువ్వూదగానే ఎగిరిపోవటానికి
తాలుగింజ కాదు
చిన్న సుడిగాలికే రాలిపోవటానికి
పండుటాకు కాదు
నీ హుంకరింపులకు, నీ అజమాయిషీలకు
నీ చట్టాల తాటాకు చప్పుళ్లకు
బెదిరిపోయే కుందేళ్లు కాదు 
నీ రాజ్యం ఎత్తుగడల ముంపుకు
కొట్టుకుపోయే పంటచేలు కాదు
నువ్వూదగానే చెదిరిపోతున్న 
నివురును చూసి మురిసిపోకు
తేటపడి కణకణ మండే
నిప్పురవ్వల మెరుపు చూడు

కుప్పనూర్చటమే కాదు 
నియంతృత్వాన్ని కడతేర్చటం
తెలిసిన ఆకుపచ్చని యోధుల
వీరత్వం చూడు 
పెనుమంటలు ఎగిసిపడే యుద్ధభూమి
నీకోసం‌ సిద్ధమిపుడు!

                      - చిత్తలూరి
[12/25, 13:56] +91 91338 32246: ఆకుపచ్చని యోధులు
                            - చిత్తలూరి

నువ్వూదగానే ఎగిరిపోవటానికి
తాలుగింజ కాదు
చిన్న సుడిగాలికే రాలిపోవటానికి
పండుటాకు కాదు
నీ హుంకరింపులకు, నీ అజమాయిషీలకు
నీ చట్టాల తాటాకు చప్పుళ్లకు
బెదిరిపోయే కుందేళ్లు కాదు 
నీ రాజ్యం ఎత్తుగడల ముంపుకు
కొట్టుకుపోయే పంటచేలు కాదు
నువ్వూదగానే చెదిరిపోతున్న 
నివురును చూసి మురిసిపోకు
తేటపడి కణకణ మండే
నిప్పురవ్వల మెరుపు చూడు

కుప్పనూర్చటమే కాదు 
నియంతృత్వాన్ని కడతేర్చటం
తెలిసిన ఆకుపచ్చని యోధుల
వీరత్వం చూడు 
పెనుమంటలు ఎగిసిపడే యుద్ధభూమి
నీకోసం‌ సిద్ధమిపుడు!

                      - చిత్తలూరి
[12/25, 14:53] +91 91338 32246: రైతు ఉద్యమ కవిత 5        
         ఉక్కుపాదాల కింద
                               - చిత్తలూరి

దేశం నిండా బువ్వ పూలు పూయించి
ఆకలి కంపును చెదరగొట్టటమే తెలుసు
చారెడు నేలను దున్ని
దేశానికి ఆకుపచ్చని గొడుగుపట్టటమే
అతని చేతికి తెలిసిన విద్య

అన్నం పెట్టే చేతులను
నరకాలని చూసే క్రూరత్వమా
తన కన్నీళ్లతో ఈ లోకం
కన్నీటిని శుద్ధి చేసేవాడు
తన చెమటచుక్కలతో ఈ సంఘాన్ని
ఆకుపచ్చగా స్నానం చేయించేవాడతను
అతని పైన వాటర్ క్యానన్లా
గట్టి గింజల్ని ప్రోదిచేసి
జాతికి జవజీవాలను
బహుకరించేవాడు
అతని పైకి బుక్లెట్ల వర్షమా

చలికి వెచ్చదనం,వేసవికి చల్లదనం
ఆకలి కడుపుకింత‌ అన్నం
మట్టిని పిసికి పంటను వెలికితీసే
మహాద్భుత శ్రమతత్వం అతనిది
చట్టాల జులుములేంది
పంట భూమిని కళేబరం చేసే
రాబందుల కొలువులేంది

ఈ దేశం బిడ్డకు అమ్మ ప్రేమ
అమ్మపై జులుమేంది
ఈ దేశం అస్తిత్వానికి నాన్న భరోసా
నాన్నపై దౌర్జన్యమేంది
బువ్వ పెట్టే‌ నేలపై ఆ తొక్కుడేంది
మొలకెత్తించటమే కాదు
నీ ఉక్కు పాదాల కింద రెండుగా చీలి
అగాధం సృష్టించటం కూడా
అతనికి తెలిసిన విద్యే

              - చిత్తలూరి
[12/25, 22:17] +91 94943 33511: 
రైతు గర్జన
-----------
పల్లవి.....*
---------
అన్నో... అన్నో... అన్న మాయన్నా
అన్నోరి మాయన్న... అన్నమాయన్నా..3

అన్నొరి మాయాన్న... అన్న రైతన్నా...3
అడుగులో అడుగేసి ... దండుకదిలింది........3

చరణం...1
-------
పిడికిలి బిగించి రైతు కదిలండు
పోరు జెండా లెత్తి... రైతు కదిలండు...3
అన్నోరి మాయాన్నా... అన్న రైతన్నా...3

భూములు కాజేసే రాబందులును
తరిమి కొట్టంగా రైతు కదిలెండు

చరణం..2
----------
అంబానీ ఆదాని సెంకన జేరిన
పెట్టు బడి దార్లు పెద్దన్న లాగున్న
మోడీనీ నిలదీయ రైతు కదిలెండు
నల్ల చట్టాలను తగుల బెట్టంగా
                                   (అన్నోరీ...2)
చరణం...3
---------
మెట్టు.. పల్లం భూమి 
పట్టుకు పోయేటి
గిట్టు బాటు ధర లేకుండా చేసేటి
నిత్యావసరాసరుకు  ....
ధరలనుపెంచేటి...
చట్టాలు వెంటనే రద్దు చేయాలని....

జట్టూ కట్టి రైతు దండు కదిలింది
డిల్లీనీ... నేడు..ముట్టడి చేసింది
అన్నోరి... నాయాన్న... అన్న రైతన్నా
అన్నోరీ మాయన్న... అన్న మాయన్న...

చరణం..4
--------
ఎముకలు కొరికేటి చలిని తట్టుకునీ
నల్ల చట్టాలను తగుల బెట్టంగా..
పాలకుల కుట్రలు మంట బెట్టంగా
భుజం భుజం కలిపి రైతు కదిలిండు
వుప్పెనై డిల్లీ నీ ముట్టడించేండు...

అన్నోరీ నాయన్న... అన్న రైతన్నా...3

దేశమంతా ఒక్కటైంది చూడు
రైతుకి అండగా నిలిచింది నేడు
నీ అటలింక మరి సాగవు మోడీ
పోరుబాట ఇంక ఆగదు చూడు

చరణం...5
-----------

కస్ట జీవులంతా ఒక్కటైనారు
పాలకులకు ....
పిండం పెట్టబోతున్నారు

అది గదిగో... అదిగదిగో
మోగింది చూడు.... 
రైతు సంఘాల గర్జన నేడు..
జట్టు కట్టి రైతు దండు కదిలింది
అది.. పోరు జెండాఅయి
ఎగురు తున్నాధి....3


                     రెడ్డి శంకరరావు

జ్ఞాపకం.

శీర్షిక .
జ్ఞాపకం.
వచన కవిత.
-----------
గుండెల్లొ చెప్పలేని వ్యధ, చలిస్తున్న కనురెప్పల్లో

కన్నీళ్ళు సంద్రమైనపుడు,నువ్వు జ్ఞాపకాల పడవలో 

నా ఊహల్లో ప్రయాణిస్తావు. క్షణికమైన అస్పష్టపు 

బాధ ముఖంపై నీలి నీడై ప్రతిఫలించినపుడు 

కన్నీటి చుక్కానివై నా చంపల్ని స్పృశిస్తావు.జీవితపు

ఆటుపోట్లు ముఖంలో అసహనపు ముడతలైనపుడు

తెరచాపతో దారిమళ్ళించి గతాల తీరాలకు

లాక్కుపోతావు.నువ్వు నన్ను వదిలి వెళ్ళిన జ్ఞాపకాల

భగ్నమైన మనసు ముక్కలు, భావాశృవు లై జాలువారి

కవితాక్షరాల ప్రణయ కావ్యాలై నపుడు ,నా కళ్ళలోని

నీ జ్ఞాపకాల పడవలో, నేనుకూడా ఒక తెడ్డు నై నీకు

తోడునవుతా..అంతవరకూ నా కలల అలలపై, ఒక

జ్ఞాపకానివై నిలచిపో ప్రియతమా...

------------------------------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర
8097622021
డిశంబరు 10/12/2020 .

పాశురములు :23: 24.









7/01/20

మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.

పాశురము: 23. ( అచ్యుత నామార్చన.  )

పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ :  శ్రీమతి బీరప్పొల్ల అనంతయ్యగారు. 


రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

పాశురము 23.
శీర్షిక .
అవినీతి సెపుావు.
--------------------
అవిసె పుా వన్నెగల అందమున్నా సామి .
అదె మందిరము వీడి కదలిరా ఒకపరి.

ఆది అంతములేని  ఆదినారాయణ
అవనిమా మన్ననల అందుకో అభిరామ ॥అవిసె పుా॥

చరణం:
శుద్ధ జ్ఞానానంద శుభ గుణ సంపుార్ణ
అవని కార్యము గనుమ అచ్యుతా అనంతా...
శృతి సార సంపుార్ణ  సిరి నిలయ శ్రీరంగ
మాకోర్కెలను దీర్చ మన్నించి వెలికిరా...॥

చరణం:
వర్ష ఋతువందునా  వర్షించు మేఘాల
సవ్వడికి మేల్గాంచి సింగమ్ము లంఘించి
భీకరాకృతి తోడ  భీషణపు ఘర్జనల
గుహను వదలీ బయలు వెడలు రీతీ....॥అవిసె పుా॥

నిర్గమించర సామి నీల మేఘశ్యామ
పాదుకొన్న వేల్పు నీవేగద పరమేశ ॥

చరణం :
విచ్చు తామర వోలె వరలు కన్నులు తెరచి
యిచ్చ మము గావుమా సమకట్టి నార్తితో
విజయ పీఠమునెక్కి విను మా విన్నపాలు
హృన్నిలయ శ్రీ చరణ సమ్మతిని  మము బ్రోవ ॥అవిసె పుా॥


అవిసె పుా వన్నెగల అందమున్నా సామి .
అదె మందిరము వీడి కదలిరా ఒకపరి.
ఆది అంతములేని  ఆదినారాయణ
అవనిమా మన్ననల అందుకో అభిరామ ॥
॥అవిసె పుా
-----------------------------------------------------


8 /01/2021

మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.

పాశురము: 24  (జనార్ధన నామార్చన.  )

పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ :  శ్రీమతి  కె. గీతా శైలజగారు. 


రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక .
మంగళ స్వరుాపయడు.
------------------------------------

పల్లవి:
మంగళ ధాముడవు మంగళ నాముడవు 
అవతారములనెత్తి  ఆదుకొను దేవుడవు..

అనుపల్లవి.:
మంగళమ్ముల నిడి మము బ్రోవ వత్తువని
నమ్మి కొలిచేమయ్య  వ్రత దీక్ష పుానీ ॥

కనులు తెరచీ మమ్ము    కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా  ॥

చరణం:
నీ పుాజ చేయంగ నిత్య స్నానములిడి
నీ లీల గానాల నీ పాదముల గొల్చి
మార్గశీర్షపు వ్రతము మనసార సలి్పి
నిత్యమంగ ళముకోరి నిను  కోరి వచ్చితిమి ॥

 కనులు తెరచీ మమ్ము    కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా  ॥

చరణం:
ముల్లోకములు గొలువ మలయు పాదములకుా
రావణాది అసురుల మడియించు శక్తికి
పుాతనాదుల గుాల్చు పురుషోత్తమా నీకు 
నిత్య శుభ నీరా జన- మంగళములివే  ॥

కనులు తెరచీ మమ్ము (చుాచి ) కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా  ॥

చరణం:
గోవర్ధనము నెత్తి   గోవుల గాచేటి
గిరిధారి కృష్ణునకు  ఘన మంగళం ..ఘన మంగళంబిదే
వెన్నిడౌ శ్రీ ముార్తి యఖుడు మా కనినమ్మి
మహిత గుణముల మేటి మంగళము పాడేము  ॥

కనులు తెరచీ మమ్ము (చుాచి ) కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా  ॥ .

చరణం :
వేలాయుధమ్మునకు వేద వేద్యా జయము
వేల నామాల శ్రీ హరి  క్రిష్ణ జయము
పురుషార్ధముల నిచ్చి పరనిచ్చు పరమేశ
 నాధ  శ్రీ జనార్దన  గొనుమయ్య  మంగళం ॥

 కనులు తెరచీ చుాచి కరుణించవయ్యా
వ్రత దీక్ష నెరవేరు వరమొసగవయ్యా  ॥
మంగళమ్ముల గొని మమ్మేలుమయ్యా
రంగ శ్రీనాధా సిరివర గోపాల .॥

నవ విధ భక్తి మార్గాలు

నవవిధ భక్తి మార్గాలు.

రచన:శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
శీర్షిక .
నిష్ట- నియమం
--------------------
భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.

శ్లోకం :
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం ॥

నవవిధ భక్తిమార్గాలు  : 1.శ్రవణము 2.కీర్తనము 3.స్మరణము 4.పాదసేవనము 5.అర్చనము 6.వందనము 7.దాస్యము 8.సఖ్యము 9.ఆత్మ నివేదనము  అన్నవి .

ఐతే వాస్తవానికి అవి తొమ్మిది మార్గాలు కాదు, ఒకే మార్గంలో వివిధ దశలు.

భ్రమరాన్నే చింతించిన కీటకం భ్రమరం అవుతుంది.
అలాగే నిత్యం భగవధ్యానం లో ఉన్న భక్తుడు
భగవత్  సాక్షాత్కారాన్ని పొందగలడనడం లో సందేహం లేదు.

భగవంతుని గూర్చిన గాథలు, భజనలు, కీర్తనలు వినడం 
భగవంతుని గుణగణములను కీర్తించడం అంటే 
పాడుకోవడం .
 భగవంతుని స్మరించడం - నిత్యం ధ్యానం చేయడం..
 దేవుని పాదములను పూజ చేయడం..
 గుడిలోగాని, ఇంటిలోగాని, హృదయములో గాని విధివిధానములతో అర్చనలు చేయడం..
 ప్రణామం చేయుట అంటే భక్తిగా నమస్కరించడం.
 భగవంతునకు దాసుడవడం..దాస్యం చేయడం...  
భగవంతుని తో సఖ్యత చేయడం 
 తనను పూర్తిగా దేవునకు సమర్పించుకోవడం అంటే
 ఆత్మ నివేదన చేయడం...
 ఇవన్నీ భక్తి మార్గాలే.

నియమబద్ధమైన జీవితానికి అలవాటుపడుతూ..క్రమశిక్షణ కలిగివుండటం అలవాటుగా చేసుకోవాలి... నామం జపం చేయడం  , రాయడం ద్వారా ఏకాగ్ర దృష్టి పెంచుకోవాలి....నామానికి, రూపానికి, గుణానికి అతీతమైన భగవంతుడు ధ్యానంలో మాత్రమే కనిపిస్తాడు, వినిపిస్తాడు. ధ్యానం చేస్తూ భగవంతుడికి దగ్గరవ్వాలి.
 మహాత్ముల, భక్తుల, సద్గురువుల, వారి శిష్యుల జీవిత చరిత్రలు చదువుతూ వారు ఏ విధంగా చేసారో గమనిస్తూ...వాటిని ఆచరిస్తూ,.మనం అన్నిటినీ ఒదులుకోవటానికి సిద్ధపడగానే 
 భగవంతునికి
 ఆత్మ నివేదన చేసినవారమౌతాము.
 అపుడు భగవంతుని కి భక్తులకు మధ్య
 తేడా లేని దివ్యానుభుాతిని పొందినవారమౌతాము

పాశురము 22.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

6 / 01 /2021.
పాశురము 22.

శీర్షిక :

ఏ పుార్వ పుణ్యమొా ఏ నోము ఫలమొా
రేపల్లె వాసుల మైతిమొా క్రిష్ణయ్య
విరిసిన కలువల రేకు కన్నులవాడ
ఒకపరి మము జుాడ మరుగేలనయ్యా..।॥

ఉభయ శరీరాల ఉన్మాదాకృతితో
ఉరికిన రంగా శ్రీ నారసింహా
ధర నుద్ధరించిన దానవారివి నీవు
అరమొాడ్పు కన్నుల అలసి పరుండేవ...॥

రణరంగ ధీరులౌ రాజాధిరాజులు
పణమొడ్డి పోరాడి ఓడి దర్పము వీడి
క్షణమైన నిను విడక  నీ దాసులౌ రీతి
వేల నుతులను వేడి నిను జేర నిలచితిమి ॥

డెప్పరములౌ నీదు  నామ కీర్తన తోడ
పులకరింతల మేని నిన్ను కొలిచేము
సుార్య చంద్రుల పోలు కాంతి కన్నుల విప్పి
పాపాలు మడియించి మ మ్మేల రావయ్య.. ॥

కరుణతో మమ్మేల  కన్నడించగనేల
ప్రహ్లాద వరదా  ప్రభు పాండురంగా...
అతులితమౌ నీదు బల అవతారముల
శాప పాపము గాల్చ  మేల్గాంచుమయ్యా ॥


Friday, January 8, 2021

అంతర్జాతీయ మహిళల గుార్చి వ్యాసం

మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినోత్సవం.
మహిళలందరికి , మహిళలను విజయపధంలో నడిపిస్తున్న వారందరికీ శుభాకాంక్షలు. 
స్త్రీ'.. ....  అంటే ఓ చైతన్యం.
అతివ.. ..అంటే ఓ అపూర్వం. 
పడతి.... అంటే ఓ ప్రగతి. 
అరచేతిని అడ్డుపెట్టి అరుణోదయాన్ని ఎలాగయితే ఆపలేమో. కట్టుబాట్ల అడ్డుగోడలు, కష్టాల కన్నీళ్ళు, స్త్రీమూర్తిని ఆపలేవు. సాధించాలన్న తపన ...లక్ష్యం చేరాలన్న ఆశయం ..ఆమెను ఆకాశమంత చేస్తాయి. ఆమె వేసే ఒక్కో అడుగు.. వేల మార్పులకు శ్రీకారం.  మహిళామణులు అందరికీ 'మహిళా దినోత్సవ' శుభాకాంక్షలు.
కె కె వి నాయుడు.

     1908 సంవత్సరం మార్చి 8వ తేదీన అమెరికా దేశంలో మహిళలు తమకు ఉద్యోగాలలో సమాన అవకాశాలు, వేతనలు కావాలనీ డిమాండ్ చేస్తూ చేపట్టిన భారీ నిరసన ఉద్యమం చేపట్టారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని పురస్కరించు కొని ప్రతి సంవత్సరం యావత్ ప్రపంచం మార్చి 8 తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

సమాన అవకాశాలు, స్వేఛ్చ అందించగలిగితే మహిళలు పురుషులకు మిన్నగా అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. అకాశంలో సగమైన మహిళ ఆత్మగౌరవం కోసం, అభ్యున్నతి కోసం ప్రతీ ఒక్కరు పని చేయడమే నిజమైన నాగరికతగా భావించాలి 

గృహిణిగా, శ్రమజీవిగా, ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా, అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నా ఆమెకు తగిన గుర్తింపు రావడం లేదు. ఇప్పటికీ సమాన పనికి సమాన వేతనం దక్కడం లేదు. ప్రజాప్రతినిధులుగా స్థానం సంపాదించినా భర్తల చేతిలో కీలుబొమ్మలుగానే ఉన్నారు. మహిళల సమానత్వం ప్రచార ఆర్భాటాలకే తప్ప ఆచరణలో కానరావడం లేదు. నేటికీ మహిళగానూ, శ్రామిక మహిళగానూ, పౌరురాలిగానూ దోపిడీకి గురౌతూనే ఉంది. ఇన్ని సమస్యలున్నా కొందరు విజయం వైపు దూసుకెళ్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. 

సృష్టికి మూలం ఆడది. అసలు ఆడదే లేకపోతే సృష్టే లేదు. అంతటి మహోన్నత ప్రశస్తి కలిగిన మహిళ నేటి ప్రస్తుత నవ సమాజంలో అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. సాటి సభ్య సమాజాన్ని చూసి ఆమె కన్నీరు పెడుతుంది..! ఆడపిల్ల పుట్టిందంటేనే భారంగా భావించే రోజులు దాపురించాయి. అసలు బయటి ప్రపంచాన్ని చూడకుండానే అసువులు బాసిన ఆడపిల్లలు కోకొల్లలు. ఏ దేశంలో లేని దుస్థితి మన దేశంలో ఎందుకు..? ఆడపిల్లని కనడం, చదివించడం, పెళ్లి చేయడం లాంటి తదితరాలన్నింటినీ భారంగా భావించే తల్లిదండ్రులు మన దేశంలో ఎందరో..! అసలు ఆడపిల్ల పుట్టిందంటేనే అదో పెద్ద శిక్షగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆడపిల్లల సంఖ్య రోజురోజుకూ క్షీణిస్తుంది. 

భారత  రాజ్యాంగం భారతీయ మహిళలందరికీ సమానత్వం (ఆర్టికల్ 14), రాష్ట్రాలనిబట్టి ఎటువంటి వివక్షా చూపించకుండా ఉండడం (ఆర్టికల్ 15 (1) ), అవకాశంలో సమానత్వం (ఆర్టికల్ 16), సమాన పనికి సమాన జీతం (ఆర్టికల్ 39 (డి) ) మొదలైన హామీల నిస్తున్నది. రాష్ట్రాలు స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక సదుపాయాలను అందించే వీలు కలుగజేస్తుంది (ఆర్టికల్ 15 (3)). మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలను త్యజించాలని (ఆర్టికల్ 51 (ఎ) ) సూచిస్తోంది. అలాగే స్త్రీలకు ప్రసూతి సెలవలు ఇవ్వడానికి, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడాన్ని అనుమతిస్తుంది. (ఆర్టికల్ 42).

  ఆదర్శాలకీ వాస్తవాలకూ మధ్య చాలా సందర్భాల్లో పొంత్యన కుదరదన్న విషయాన్నే దేశంలో ఎల్లెడలా పరుచుకుపోయిన అసమానతలు చాటుతున్నాయి. వివిధ రంగాల్లో స్త్రీ పురుషుల మధ్య సామానత్వ సాధనలో ఏఏ దేశాలు ఎంతెంత వెనకబడి ఉన్నాయో ఆ నివేదిక కళ్లకు కడుతుంది. 2017 చివర్లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం మొత్తం 145దేశాల పరిస్థితులను విశ్లేషిస్తే భారత్  108వ స్థానంలో ఉంది. ఆర్ధిక భాగస్వామ్యంలో 139, విద్యలో 125, వైద్యం, ఆరోగ్యంలో 143 వ స్థానాన్ని ఆక్రమించింది. సమానత్వ సూచీలో పేర్కొన్న గణాంకాల ప్రకారం 145 దేశాల్లో ఏ ఒక్కటీ స్త్రీ పురుష అంతరాలను తగ్గించడంలో వంద శాతం విజయం అందించలేదు. 

ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ వంటి దేశాలు 80 శాతం వరకు అధిగమించి సమానత సాధన దిశలో ముందు వరసల్లో ఉన్నాయి. బలమైన ఆర్ధిక వ్యవస్థలున్న సమాజాలు సమానత్వ సాధనలో వెనకబడిపోవడానికి మహిళా శక్తిని గుర్తించలేకపోవడంతో పాటు పాతుకుపోయిన పురుషాధిక్య భావజాలమూ ప్రధాన కారణమే.

భారత్‌లో మహిళలు పురుషులతో పోలిస్తే రోజూ అయిదు గంటల పాటు ఎలాంటి ప్రతిఫలం లభించని పని చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. పని విభజనలో తారతమ్యం ఏ దేశంలోనూ ఈ స్థాయిలో ఉండదు. ఆర్ధిక సాధికారతలో వెనకబాటుకు ప్రధాన కారణమదే. మహిళా యాజమాన్యంలోని సంస్థలు అతి తక్కువ శాతం ఉన్నదీ భారత్ లోనే. 

ప్రపంచవ్యాప్తంగా గడిచిన పదేళ్లలో మహిళా కార్మిక శక్తి 150 కోట్ల నుంచి 175 కోట్లకు పెరిగింది. కానీ మహిళల వార్షిక వేతనం చూస్తే ప్రస్తుతం స్త్రీలు సంపాదిస్తున్న జీతం పదేళ్ల క్రితం పురుషుడు సంపాదించిన దానితో సమానం. ప్రగతి బాటలో స్త్రీ పురుషుల మధ్య అంతరం తగ్గుతూ పోయిన కొద్దీ జీడీపీ పెరుగుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ రంగంలో అంతరాలను అధిగమించిన దేశం సుసంపన్నం అవుతోంది. 

భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో "అనసూయా సారాభాయ్ -టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌" అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్‌, విమలారణదివే, కెప్టెన్‌ లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖులు..

కొన్ని సహస్రాబ్దులు గా  భారత దేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ  మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది.

 ఆధునిక భారతదేశంలోమహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించి దేశ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడింపచేసారు.

పతంజలి, కాత్యాయనుడు వంటి ప్రాచీన భారత వ్యాకరణకర్తల రచనల ప్రకారం, వేదకాలపు ఆరంభంలో మహిళలు చదువుకోనేవారని తెలుస్తోంది. ఆ సమయంలో మహిళలు యుక్తవయస్సులో పెళ్ళి చేసుకోనేవారని, వారు భర్తను ఎన్నుకొనే హక్కుని కలిగి ఉండేవారని ఋగ్వేద శ్లోకాలు తెలుపు తున్నాయి. తరువాత (సుమారుగా 500 బి.సి.) నుండి మహిళల హోదా తగ్గడం మొదలయ్యింది 

మధ్యయుగ సమాజంలో మహిళల స్థాయి ఇంకా దిగజారింది. 

 కొంత  మంది మహిళలు రాజకీయ, సాహిత్యం, విద్య, మత రంగాలలో రాణించారు. రజియా సుల్తానాఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి. 
గోండు రాణి దుర్గావతి పదిహేనేళ్ళు పరిపాలన సాగించింది. ఆమె మొఘల్ చక్రవర్తి అక్బర్ ను ఎదుర్కొంది.
అక్బర్ ను  1590లో చాంద్ బీబీ ఎదుర్కొని అహ్మద్ నగర్‌ను రక్షించింది. 
జహంగీర్ భార్య నూర్జహాన్  సార్వభౌమ అధికారాన్ని ప్రతిభావంతంగా చెలాయించి మొఘల్ మకుటం వెనుక ఉన్న నిజమైన శక్తిగా గుర్తింపు పొందింది.

 మొఘల్ యువరాణులు జహనారా, జేబున్నీసాలు మంచి పేరున్న రచయిత్రులు.

 శివాజీ తల్లి జిజియాబాయి యోధురాలిగాను, పాలకురాలి గానూ చాటుకున్న సమర్థత వలన సమర్ధురాలైన రాణిగా గణుతి కెక్కింది.

 దక్షిణ భారతంలో చాలామంది మహిళలు గ్రామాలు, పట్టణాలు, మండలాలను పాలించారు. అనేక సామాజిక, మత సంస్థలకు ఆద్యులయ్యారు.
భక్తి ఉద్యమం మహిళల హోదాని తిరిగి నిలపడానికి ప్రయత్నించి కొన్ని రకాల అణిచివేతలను అడ్డుకుంది. మీరాబాయి అనే ఒక మహిళా సాధు కవయిత్రి భక్తి ఉద్యమపు ముఖ్య వ్యక్తులలో ఒకరు. ఈ కాలపు ఇతర మహిళా సాధు-కవయిత్రులు అక్క మహాదేవి, రామి జనాభాయి, లాల్ దేడ్.  

యూరోపియన్ పరిశోధకులు 19వ శతాబ్దపు భారత స్త్రీలు మిగతా స్త్రీలకంటే "సహజంగా శీలవంతులు", "ఎక్కువ ధర్మపరులు" అని గమనించారు.  బ్రిటిషు పాలన సమయంలో రామ్ మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, జ్యోతిరావు ఫులే మొదలైన సంఘసంస్కర్తలు మహిళా అభ్యున్నతికి పోరాడారు.

పండిత రమాబాయి వంటి చాలామంది మహిళా సంస్కర్తలు కూడా మహిళా అభ్యున్నతికి కృషి చేసారు.
కర్ణాటకలోని కిట్టుర్ రాజ్య రాణి కిట్టుర్ చెన్నమ్మ బ్రిటిషువారి కాలదోషం పట్టిన సిద్ధాంతాలకి ప్రతిస్పందనగా వారికీ వ్యతిరేకంగా సైన్యాన్ని నడిపించింది. తీరప్రాంత కర్ణాటక రాణి అబ్బక్క రాణి యురోపియన్ సైన్యాల ఆక్రమణలకి ముఖ్యంగా 16వ శతాబ్దంలో పోర్చుగీసు ఆక్రమణలకి ఎదురునిలిచింది. రాణి లక్ష్మీ బాయి ఝాన్సీ రాణి బ్రిటిషువారికి వ్యతిరేకంగా 1857 భారతీయ తిరుగుబాటుని నడిపించింది. ఆమె నేడు జాతీయ హీరోగా భావించబడుతున్నది. 
అవద్ సహా-పాలకురాలు బేగం హజ్రత్ మహల్ 1857 తిరుగుబాటును నడిపించిన ఇంకో పాలకురాలు. ఈమె బ్రిటిషువారితో ఒప్పందాలని నిరాకరించి తరువాత నేపాల్ కి వెళ్ళిపోయింది.

మహిళలు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యపాత్ర పోషించారు. కొంతమంది ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాళ్ళు భికాజి కామా, డా. అనీ బిసెంట్, ప్రీతిలత వడ్డేదార్, విజయలక్ష్మి పండిట్, రాజకుమారి అమ్రిత్ కౌర్, అరుణ అసఫ్ ఆలీ, సుచేత కృపలానీ, కస్తుర్బా గాంధీ.
మరికొందరు ముఖ్యులు ముత్తులక్ష్మీ రెడ్డి, దుర్గాబాయి దేశ్ముఖ్మొదలైనవారు. సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ, లక్ష్మీ సెహగల్ని కెప్టన్‌గా, మొత్తం మహిళలతో కూడిన 
ది రాణి అఫ్ ఝాన్సీ రెజిమెంట్ ను ఏర్పాటు చేసింది. కవయిత్రి, స్వాతంత్ర్య సమర యోధురాలూ అయిన సరోజినీ నాయుడు, భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ. భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నరయిన మొదటి మహిళ కూడా.

నేటి భారతీయ మహిళ విద్య, రాజకీయాలు, మీడియా, కళలు, సంస్కృతీ, సేవా విభాగాలు, విజ్ఞాన, సాంకేతిక రంగాలు వంటి అన్ని రంగాలలో పాల్గొంటోంది. పదిహేనేళ్ళపాటు భారతదేశపు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ ప్రపంచంలో ప్రధానమంత్రిగా ఎక్కువకాలం పని చేసిన మహిళ.[

ఈదేశంలో  మనం కొందరు   మహిళలు గురించి తెలుసుకోవాలి..

జాన్ ఇలియట్ డ్రింక్ వాటర్ బెతూనే 1849లో బెతూనే స్కూల్ ప్రారంభించింది, ఇది 1879లో బెతూనే కళాశాలగా వృద్ధి చెంది భారతదేశంలో మొదటి మహిళా కళాశాల అయింది.

1883 లో చంద్రముఖి బసు,  కాదంబినీ గంగూలీ బ్రిటిషు సామ్రాజ్యపు మొదటి మహిళా పట్టభధ్రులయ్యారు.

కాదంబినీ గంగూలీ, ఆనందీ గోపాల్ జోషి భారతదేశమునుండి పాశ్చాత్యవైద్యంలో శిక్షణ పొందిన మొదటి మహిళలు.

1905 లో సుజన్నే ఆర్ డి టాటా కారు నడిపిన మొదటి భారతీయ మహిళ.

1916 జూన్ 2న సంఘసంస్కర్త  దొండో కేశవ్ కార్వేగారిచేత కేవలం ఐదుమంది విద్యార్థులతో మొదటి మహిళా విశ్వవిద్యాలయం SNDT మహిళా విశ్వవిద్యాలయం స్థాపించబడింది.

1917 లో అన్నే బిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలయింది.

1919 లో ఆమె విలక్షణమైన సామజిక సేవకు గుర్తింపుగా పండిత రమాబాయి బ్రిటీష్ రాజ్ నుంచి కైజర్-ఇ-హింద్ పురస్కారం పొందిన మొదటి మహిళ.

1925 లో సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్కి భారతదేశంలో పుట్టిన మొదటి మహిళా అధ్యక్షురాలు.

1944 లో భారతీయ విశ్వవిద్యాలయంనుంచి సైన్స్ డాక్టరేట్ అందుకున్న మొదటి మహిళ అసిమా చటర్జీ.

1947 ఆగస్టు 15 స్వతంత్రం తరువాత సరోజినీనాయుడు యునైటెడ్ ప్రావిన్సులకి గవర్నర్ అయింది, ఈవిడ భారతదేశపు మొదటి మహిళ గవర్నరు.

1951లోడెక్కన్ ఎయిర్వేస్ కు చెందినా ప్రేమ మాథుర్ భార్తదేశపు మొదటి మహిళా వాణిజ్య పైలట్.

1953లో  విజయలక్ష్మి పండిట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా అధ్యక్షురాలు 
(మొదటి భారతీయ) 

1959లో  అన్నా చండీ హైకోర్టుకి మొదటి మహిళా జడ్జ్ (కేరళ హై కోర్టు) 

1963లో  సుచేత కృపలానీ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయి, భారతదేశంలోని ఏ రాష్ట్రములోనైనా ఆస్థాయిని పొందిన మొదటి మహిళ అయ్యారు.

1966 లో  కేప్టన్ దుర్గ బెనర్జీ ఒక రాష్ట్ర ఎయిర్లైన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్ కి పైలట్ అయిన మొదటి భారతీయ మహిళ.

1966లో  కమలాదేవి చటోపాధ్యాయ 
వర్గ నాయకత్వానికిగానూ రామన్ మెగాసస్సే పురస్కారం గెలుచుకున్నారు.

1966లో ఇందిరాగాంధీ భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి.

1970లో కమల్జిత్ సందు ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ.

1972లో  కిరణ్ బేడి ఇండియన్ పోలీస్ సర్వీస్ కి ఎన్నికయిన మొదటి మహిళా అభ్యర్థి.

1979లో  మదర్ థెరిస్సా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా పౌరురాలు.

1984 మే 23న బచేంద్ర పాల్ మౌంట్ ఎవరెస్ట్ను  అధిరోహించిన మొదటి మహిళ అయ్యారు.

1989 లో జస్టిస్ ఎం.ఫాతిమా బీవీ సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాకి మొదటి మహిళా జడ్జ్ గా ఎన్నికయ్యారు.

1997లో కల్పనా చావ్లా గగనంలోకి వెళ్ళిన మొదటి భారత జన్మిత మహిళ.
వీరందరి స్ఫూర్తితో మన సోదరీమణులు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...కెకెవి నాయుడు.

Wednesday, January 6, 2021

అంతరమధనం

30/12/2020.
ఈ వేమన కవితా నిలయం లో
డిశంబరు నెల రెడవ పక్షం కవిత కు
అంశం : ధనమేరా అన్నిటికీ ముాలం.
శీర్షిక : 
అతర్మధనం.
---------------
ఆసుపత్రిలో అనాధగా నేను. అన్నీ ఉన్నా...
లేని వాడిలా...నాచుట్టుా చెక్కు బుక్కులే...
పక్షవాత దుర్గతి  తో సంతకం చేయలేని స్థితి...
ఎవరుా నన్ను పట్టించుకోవడం లేదు. 
నావేపు వెటకారంగా చుాపుల తుాపులు.
నా గుండెని చీల్చే నగుబాటు బాకులు.
కొన్నేళ్ళ క్రితం  డబ్బు సంపాదనే నాధ్యేయం
ధనమే అన్నిటికీ ముాలమన్న  వితండ వాదం
అడ్డ తోవల్లో  సంపాదించిన ధనం , 
కోల్పోయిన మంచితనం , మర్యాదల సారం.
డబ్బు మదంతో  మానవత్వం మరచిన నాకు 
దుారమైన జనం . స్నేహితులే లేని ఒంటరితనం.
.లంచాలు ,భుాకబ్జాల లిష్ట్ లో ప్రధమ స్థానం.
జైలు శిక్షలో కుాడా డబ్బు కొరకై  కొట్టుకున్న ప్రాణం.
తిరిగొచ్చిన నాకు ఇంట్లో ఎవరుా లెేని ఒంటరి తనం.
డబ్బు మనిషిగా నను విడచిన నా పరివారం..
డబ్బిచ్చి కొనుక్కున్న సుఖాలకు అంటిన రోగం.
నీళ్ళ లా ఖర్చు చేసినా పని చేయని వైద్యం.
బేంకుల్లో ముాలుగుతున్న డబ్బు.
మంచంలో ముాలుగుతున్న నేను.
మనిషికి డబ్బు కావాలి బతకడానికి మాత్రమే
కాని బతుకు నిచ్చే ఆనందం ఆప్తులుంటేనే
తీరుతుందని తెలుసుకున్న నిజం..
అంతర్మధనంలో అశృధారలు. 
నా అన్న వారికై తపించే మనసు ఘోషలు.
అసహాయ స్థితిలో అంతరాత్మ చేసే తిరుగుబాటు
సరిదిద్దుకోలేని జీవితపు పొరపాటు.

రచన: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.


హామీ: ఈ కవిత ఏ మాధ్యమునందునుా 
ప్రచురితంకాని నా స్వీయ రచన.