Tuesday, November 30, 2021

దశావతారములు

తపస్వీ మనోహరం పత్రిక వారి ఈ పుస్తకం కొరకు ,

అంశం : దశావతారాలు.
ప్రక్రియ : పంచపది.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

మానవ సమాజంలో మనుషుల నడవడిక పై  ప్రభావపరంగా ప్రాముఖ్యతను ఈ అవతారాలు సూచిస్తాయి.
ధర్మార్ధ ,,మొాక్షముల నిరంతర సాధనకు 
ఈ అవతారాల విశిష్ట  వ్యక్తిత్వ విలువలు మనకు మార్గదర్శకమౌతాయి.
సామాజిక ధర్మాన్ని , నీతి, నియమాలను తప్పిన వారందరుా ఏదో ఒకనాడు పతన మవక తప్పదన్న మాటకు ఈ అవతారాలు మాధ్యమమై నిలచి
మనిషి స్వార్ధపుారిత దురాలోచనా విధానానికి ,
తగిన జ్ఞాన సముపార్జనకు దోహదమౌతాయన్న
నమ్మకంతో రాస్తున్న దశావతార మహిమలు.

1 . మత్స్యావతారము .
-------------------
చాక్షుష మన్వంతర అంత్యకాలములో
సోమకుణ్ణి వధించి ,వేదాలను రక్షించిన అవతారము.

సత్యవ్రతుణ్ణి రక్షించిన సారసాక్షుని అవతారము.

మహీరూపమైన నావలో సకల బీజాలనుా, ఓషధుల్నీ ,
సప్తర్షులనీ ఎక్కించి ,మూపు పై ధరించి రక్షించిన
అవతారము.

మహా మత్స్యావతారుడై అవనికి వేద నిధి-
నందించిన శ్రీమహావిష్ణువు ప్రథమావతారము.

మానవసమాజంలో మంచిని రక్షీంచేందుకు ఉద్భవించిన ఆ పరమేశ్వరుని అవతారమహిమను తెలియుమీశ్వరీ ॥

2.కుార్మావతారము.
-----------------
దేవ ,దానవుల "సముద్రమంథన" సమయము.

వాసుకిని తాడుగా మందరగిరిని కవ్వముగా
వాడిన సమయము.

ఒరిగిపోతున్న మందరాద్రిని తన వీపుపై నేర్పుగా నిలిపిన అవతారము.

"కుార్మావరారుడై "అమృతమధనానికి సహాయం 
చేసిన శ్రీమహావిష్ణువు  ద్వితీయావతారము.

చిలికిన అమృతమును దేవతలకు అందించేందుకు
మొాహినీ అవతారమెత్తి, అసురుల బారినుండి
అవనిని గాచిన అవతారపురుషుని
లీలలను గనుమీశ్వరీ.॥

3.వరాహావతారము:
-----------------
సత్య యుగంలో ముల్లోకాలను అల్ల- కల్లోలం 
చేసిన "హిరణ్యాక్షు"డొక  అసుసుడు .

వర గర్వ బలంతో,భుాదేవిని పాతాళంలోకి తొక్కినవాడు.

బ్రహ్మ నిద్రిస్తుా ఉండగా, వేదాలను తస్కరించినవాడు.

"వరహావతార"మెత్తిన విష్ణుముార్తిచే సంహరింపబడిన
ఘొార అసురుడు.

భుాదేవినీ, వేదాలను రక్షించిన అవతారపురుషుడు
తప్పులు,పాపాలు చేసినవారిని, ఎప్పటికైనా
శిక్షిస్తాడని  తెలియజెప్పిన అవతారమిది ఈశ్వరీ ॥

*****************************************
4.నరసింహావతారము:
-------------------
హిరణ్య కశ్యపుని పుత్రుడు,విష్ణుభక్తుడైన బాల ప్రహ్లాదుడు .

దేముడు ప్రతీ చోటా ఉన్నాడన్నందుకు తండ్రిచే
శిక్షింపబడుతుా ఉండేవాడు.

భక్తికి లొంగిపోయే కరుణామయుడు భగవంతుడు.

 ప్రహ్లాదుని రక్షణకై  స్తంభం నుండి వెలువడి
" హిరణ్యకశిపుని" దునిమిన "ఉగ్ర నారసింహుడు."
 
 దుష్టులను దునిమేందుకు  ఏ రుాపమవసరమొా ఆరుాపమునెత్తి అవనిని కాచే ఆదినారాయణుని 
 శరణనుమీశ్వరీ॥
 
 *************************************
5. వామనావతారము : 

దానధర్మాలకు మారుపేరైన "బలి", అసురవంశజుడు.

అట్టి "బలి చక్రవర్తిని" బలిమినణచ వచ్చిన "వామనరుాపుడు" శ్రీమన్నారాయణుడు .

ముాడడుగుల భుామినడిగి ముల్లోకాలను 
ఆక్రమించిన ముాలపురుషుడు.

అసుర బారినుండి అవనిని కాపాడడానికి వచ్చిన 
మరుగుజ్జు రుాపుడు శ్రీమన్నారాయణుడు.

ధర్మాన్ని కాపాడడానికి వామన  వటువుగా ధరనవతరించినది శ్రీ మహావిష్ణువే ఈశ్వరీ .॥

************************************::::
6. పరశురామావతారము :

జమదగ్ని, రేణుకల పుత్రునిగా, కోపిష్టి తండ్రి
ఆజ్ఞ మేరకు తల్లిని , సోదరులను వధించిన
 పితృ వాక్యపరిపాలకుడు, పరశురాముడు. 

కామధేనువునివ్వని కారణంగా కార్తవీర్యార్జునుని కుమారులు  తండ్రి జమదగ్ని తల నరికినందుకు
కోపోద్రిక్తుడైన పరశురాముడు.

తల్లి రేణుక  రోదన చుాడలేక కార్తవీర్యార్జునుని కుమారులనందరినీ చంపి తండ్రిని బతికించిన వాడు.

కుపితభావుకులు, బ్రాహ్మణ ద్రోహులైన రాజుల్ని ఇరవయ్యొక్కసార్లు వధించి భూమిని క్షత్రియశూన్యం గావించినవాడు.

ఆవేశము అనర్ధాలకు కారణమని తెలిపేందుకు 
అవతరించిన ఆపద్బాంధవుడని తెలియుమీశ్వరీ ॥

**************************************
7.  రామావతారము:
 ---------------+
పరిపూర్ణ మానవుడికి ప్రతీకగా నిలచిన "శ్రీరాముని" అవతారం.

దేవకార్యార్థమై రాజత్వాన్ని పొంది సత్య, ధర్మ,
నిగ్రహాలకు ప్రతిరుాపమై నిలచిన వైనం.

సామాజిక  కట్టుబాట్లకు, ధర్మానికి, మానవుడు ఇవ్వవలసిన ప్రాధాన్యతకు నిదర్శనం .

కుటుంబ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యతాయుత
కార్య సమర్పణకు నిజమైన తార్కాణం శ్రీరామ చరితం.

సామాజిక కట్టుబాట్లను గౌరవించే జీవన విధానాన్ని 
ఆచరించుమీశ్వరీ ॥

***************************************
8.. బుద్దావతారము:

త్రిపురసంహారానికై బుద్ధావతార రుాపుడైన విష్ణువు.

త్రిపురాసురుల వధకై వారి పత్నుల పాతివ్రత్యాన్ని  భంగపరచుటకై  అశ్వత్థవృక్షంగా మారిన విష్ణువు .

త్రిపురాంగనల పాతివ్రత్యబలాన్ని నశింపచేసి , 
శంకరుని చేతి అస్త్రంగా మారి , త్రిపురాసురులను 
వధించిన విష్ణువు .

సిద్ధార్ధ నామ ముతో జని, సన్యాసియై సత్య, ధర్మ ,అహింసల బాటను ప్రజలకు బోధించిన ఆది బిక్షువు విష్ణువు .

బౌద్ధ ధర్మానికి మూల కారకులు. నాటి ఆధ్యాత్మిక గురువులలో మేటియైన గౌతమ బుద్ధుని బోధనలను 
గౌరవించుమీశ్వరీ . ॥

************************************:

9.కృష్ణావతారము:
***************
కర్మ , ధర్మ , జ్ఞానాదులనే పదునెనిమిది యొాగ తత్త్వ సారములను అవనిని తెలిపేందుకు అవతరించినవాడు.

ఆతడే లీలా మ‍నుష వేషధారి శ్రీకృష్ణుడు.

పసి బిడ్డడై యశోదానందులను, రేపల్లె బాలికలను
తన లీలలతో ఆనందపరచి ,అసురసంహారము గావించినాడు.

కురుక్షేత్ర సమర సమయంలో మనుజులు చేసిన
కర్త, కర్మ, క్రియలకు తానే కారణభుాతుడనని--
భుా భారమును తగ్గించిన బలరామానుజుడు.

కృష్ణావతాడుడై యుద్ధమందు అర్జునునికి 
సారధిగా నిలచి, గీతా వేద సారములను , తత్త్వజ్ఞానమునుా బోధించిన శ్రీ  విష్ణుదేవునకు అంజలినిడుమీశ్వరీ.॥

**********************************::
10. కల్కీ అవతారము :
-------------------
దర్శ సంస్థాపనకు, సజ్జన సంరక్షణ, దుర్జన సంహారమునకు, ప్రతీ యుగంలోనుా మానవరుాపంలో అవతరిస్తున్న  భగవంతుడు .

కలియుగ, కృతయుగ సంధిలో రాజులు చోరులుగా మారి సంచరిస్తుంటే విష్ణుయశుడనే విప్రునికి పుత్రునిగా
ఉద్భవించిన  సర్వమ్లేచ్ఛ సంహారుడు, కల్కి భగవానుడు.

ప్రస్తుత సామాజిక ,రాజకీయ పరిస్థితుల దుర్గతికి 
సకల జన ,క్షామ, కామ ,లలామ శోక సంక్షోభణల విజృంభణకు కారణం కలి ప్రవేశమన్న తీర్మానం.

మనిషి స్వార్ధం తో తాను తీసుకున్న గోతిలో తానే పడినట్లు చేసి , జన పతనమొందించే కలి కరవాలం ॥

కలి నివారణకై  మనుజులు ధర్మ పథంలో నడచి ,సమ సమాజ స్థాపనకై శాంతి బాటలో నడిచే సద్బుద్ధినీయమని ఆ భగవంతుని ప్రార్ధించు జగదీశ్వరీ.॥


హామీ:
పై దశావతారాలు  నా స్వీయ రచనలు.

Wednesday, November 24, 2021

దిక్సూచి : తెలుగు కళాసమితి నవీ ముంబై మహారాష్ట్ర కధలు కవితలు పంపవలసిన మెయిల్ ఐ.డి.

నమస్కారం..🙏

తెలుగు కళా సమితి, నవీ ముంబై, నుంచి వెలువరిస్తున్న.. మహారాష్ట్ర నుండి వెలువడుతున్న ఏకైక ఆన్ లైన్ తెలుగు మాసపత్రిక "దిక్సూచి" డిసెంబర్ 2021 (15వ) సంచిక మీ చేతుల్లో ఉంది..

వీలున్నప్పుడు మీరు దీన్ని చదివి, మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయాలని మనవి..

రచయితలు తమ రచనల్ని..
diksoochitks@gmail.com కు పంపించగలరు..

ధన్యవాదములు..

■ *మాదిరెడ్డి కొండారెడ్డి*
      ప్రధాన సంపాదకులు,

■ *సంగేవేని రవీంద్ర*
      సంపాదకులు

🙏💐

Monday, November 22, 2021

దత్తపది.

*మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
తేది:*20-11-2021*
అంశం: *దత్తపది*

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

ప్రక్రియ: తేటగీతి
క్రమ సంఖ్య: 19
కవితా సంఖ్య : 4.

(దీప) దానము జేయుము  దివ్య  ముగను
(ధుాప )మిడిభవు నికొలువ  దుఃఖ శమము
(తాప )సహరుని  పుాజింప  తరుణ మిదియె
(పాప) ములబాపు కార్తీక  పర్వ మిదియె॥

ప్రక్రియ : ఆటవెలది.

ఇంటి (దీప) మాలి  ఇడుముగౌ రవప్రేమ.
(ధుాప) మింట వేయ దురిత శమము
(తాప) మెక్కి నరుడు తప్పుజేసి నయెడల
(పాప) మిలను పెరిగి పగులు ధరణి ॥

చిన్న (దీప) మున్న చీకట్లు తొలగును
(ధుాప)  మేయ క్రిములు దుార మౌను
కోప (తాప )ములతొ కోల్పోవు సుఖములు
(పాప) భీతి ధర్మ పథము జుాపు ॥

పుస్తక పఠనం.

22/11/2021.

(ఉమెన్ రైటర్స్  లో)
సాహితి బృందావన జాతీయ వేదిక,
ఉమెన్స్ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో-
54వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కవితల పోటీ కొరకు రాసిన కవిత-

అంశం : పుస్తక విజ్ఞానం.

శీర్షిక  :  విజ్ఞాన ఖని .

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..



ఒంటరితనంలో ఓదార్పునిచ్చే స్నేహం పుస్తకం.
లక్ష్య సాధనకు నమ్మిన ఆలంబన పుస్తక పఠనం.
సామాజిక సమస్యలపై అవగాహనకు మార్గదర్శి.  
సామాజిక స్పృహను కలిగించే సద్గురుబోధనం.॥

క్లిష్ట సమస్యలకు పరిష్కార మార్గం పుస్తక పఠనం.
స్వీయవిశ్లేషణా సామర్థ్యాన్ని పెంచే అంతర్మధనం.
పదిమందిలో మాట్లాడగలిగే స్ఫుార్తికి నిదర్శనం .
చర్చలలో వాదన నైపుణ్యం పెరుగుదలకు  -
దోహదపడే మంచి ఔషధాలయం పుస్తక పఠనం॥

భిన్నమైన ఆలోచనా ధృక్పథాన్ని కలిగించి ఆత్మ-
నిర్భరతను పెంచే అక్షర సోపానం పుస్తక పఠనం.
సృజనాత్మక జ్ఞానాన్ని పెంచే మహనీయుల 
బోధనా పటిమ పుస్తక పఠనం ॥

మెదడును వికసింపజేసే మంచి వ్యాయామశాల
పుస్తక పఠనం .
తడబడే  జీవిత గమనంలో  ఆత్మస్థైర్యాన్ని
పెంచి రాచబాటను చుాపించే అద్భుత దర్పణం
పుస్తక పఠనం ॥

జ్ఞానాధ్యయన సాధక యజ్ఞం ఫలం పుస్తక పఠనం. 
మానసిక ఉద్దీపనను తగ్గించి , జ్ఞాపకశక్తిని
పెంచే ఏకాగ్ర చిత్త సాధనా"గీత" పుస్తక పఠనం.
మరువలేని స్నేహ బంధం, పుస్తకంతో అనుబంధం॥.

అందమైన జీవితం కోసం హెల్తీ హాబిట్ బుక్ రీడింగ్.
కథలు, నవలలు చదవడం వల్ల సృజనాత్మకజ్ఞానం పెరుగుతుంది.



హామీ : 
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన. 

పంచపది లో ఇచ్చే అంశములు "ప్రథమ స్థానములు"

నేటి పంచపది-210
తేదీ:01-06-2022
అంశం:శక్తి పీఠాలు-మాణిక్యాంబ దేవి-12
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

పంచరామ క్షేత్రాల్లో ఒకటైనది
ద్రాక్షరామం లో నెలకొన్నది
మాణిక్యాంబ శక్తిపీఠమది.
శ్రీచక్ర యంత్రంపై ప్రతిష్టించబడినది.
త్రిలింగ క్షేత్రాల లో ఒకటిగా ప్రసిద్ధిచెందినదీశ్వరీ ॥



[5/9, 15:38] 139626: 09/05/2022

మీ పాదం నా పంచపది 

రచన : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

కల్యాణ్ . మహారాష్ట్ర .

 

 1.

మీ పాదం నా పంచపది లో

సత్యగారిచ్చిన పాదం

నాన్న శ్రామికుడు, ఘనుడు త్యాగధనుడు.



నాన్న శ్రామికుడు, ఘనుడు త్యాగధనుడు కదమ్మ

నాన్న పడే కష్టానికి ప్రతిఫలం అమ్మ శ్రమేనమ్మ

నాన్న చేస్తున్న త్యాగానికి ప్రతిరుాపం అమ్మ

అమ్మా నాన్నలు ఇల వెలసిన దేవతలమ్మ

అమ్మ లేకపోతే ఉనికి లేదు కానీ నాన్న లేకపోతే జీవితమే లేదమ్మా ఈశ్వరీ ॥


2. మదుసుాదనశర్మగారిచ్చిన పాదం 

 ఆడపిల్లలను చదివిస్తే ధైర్యంగా జీవించగలరు.


ఆడపిల్లలను చదివిస్తే ధైర్యంగా జీవించగలరు.

 చదువుకున్న ఆడపిల్లలు స్వాతంత్రులౌతారు.

 ఆలోనలతో కుాడిన నిర్ణయాలతో ముందడుగేస్తారు.

 అన్నిరంగాలలో అత్మ నిర్భరత కలిగి ఉంటారు.

 చదువు జ్ఞానంతో పాటు వివేకాన్నిస్తుందంటారు 

 ఈశ్వరీ ॥


నేనిచ్చిన  పాదం 

చదువు రాని వాడు వివేకం లేని బుద్ధి హీనుడు .

[5/13, 20:22] 139626: 13/05/2022


1.

మీ పాదం నా పంచపదిలో

భవానీ క్రిష్ణ ముార్తిగారు ఇచ్చిన అంశం : విద్య.

శీర్షిక  : ఆనందో బ్రహ్మ .

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

కల్యాణ్. మహారాష్ట్ర .



 విద్యతోడ నబ్బుతుంది వినయము

 వినయముతో పెరుగు  సంస్కారము.

 సంస్కారముతో  అబ్బును సహనముము.

 సహనముతో సమస్యలకు పరిష్కారము

 సద్గుణాల వల్ల జీవతం మంతా ఆనందమయమీశ్వరీ॥


2.

మీ పాదం నా పంచపదిలో

ఉషారాణీగారు ఇచ్చిన అంశము "సాంకేతికత"

శీర్షిక : తస్మాత్ జాగర్త..

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

కల్యాణ్. మహారాష్ట్ర .



విద్యతో  పెరిగే మేధస్సుకు నిదర్శనం విజ్ఞానం

 విజ్ఞానంతో మనిషిలో పెరిగే సాంకేతిక పరిజ్ఞానం 

జ్ఞానంతో నేటి యువత సాధించిన ఘన విజయం.

దుారదర్శన్ చరవాణి వంటి పరికరాలఆవిర్భావం.

వాటి దురుపయొాగం వల్ల భరత భవిత అంధకార బంధురమీశ్వరీ ॥

నేటి పంచపది.

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

కల్యాణ్. మహారాష్ట్ర .



ధక్ష యజ్ఞం లో దగ్ధమైన సతీదేవి శరీరము॥


మృత శరీరాన్ని విడలేని శివుని అనంత శోకము ॥


విష్ణుని శుదర్శన చక్రంతో ఖండిత మైన సతీ దేహము॥


ట్రింకోమలిపుర లో పడిన సతీదేవి కాలి గజ్జల భాగము.

 

మొదటి శక్తి పీఠముగా వెలసిన శాంకరీ దేవి పుణ్య

క్షేత్ర దర్శనము ముక్తి మొాక్ష కారకమీశ్వరీ ॥

 


నేటి పంచపది 

అంశం : అంశం:ఓ కవితా!నా హృదయ దేవతా!

శ్రీమతి : జగదీశ్వరీముార్తి.

కల్యాణ్.మహారాష్ట్ర .


అక్షర సామ్రాజ్యాన్ని అలోవకగా  ఏలుతావు.

నవ రసాలనుా లలితంగా  కురిపిస్తావు.

ఎంతటి భావుకతనైనా సుాక్షంగా తెలియపరుస్తావు.

పదాల అల్లికకు ప్రాణం పోస్తావు.

కవన వనంలో విహరింపజేసే ఓ కవితా ! ఈశ్వరీ ప్రాణ దేవతవు నీవు ॥






తరులు గిరులు,ఝరుల వంటి ప్రకృతి నిధియె కరువైనదు.॥


ప్రదుాషణపు పెరుగుదలకు ప్రాణవాయు కరువైనది .॥


జనులు పెరుగ మంచి నీటి గుటక " రుాక" పరమైనది॥.


తరులు లేని జగతి, పక్షి రవము ముాగబోయినది ॥


కొమ్మ కాన రాని" పిచుక దినోత్సవాల" బొమ్మైనది ॥


[3/15, 19:36] p3: 15/03/2022

నేటి పంచపది.

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

కల్యాణ్. మహారాష్ట్ర .



ధక్ష యజ్ఞం లో దగ్ధమైన సతీదేవి శరీరము॥


మృత శరీరాన్ని విడలేని శివుని అనంత శోకము ॥


విష్ణుని శుదర్శన చక్రంతో ఖండిత మైన సతీ దేహము॥


ట్రింకోమలిపుర లో పడిన సతీదేవి కాలి గజ్జల భాగము.

 

మొదటి శక్తి పీఠముగా వెలసిన శాంకరీ దేవి పుణ్య

క్షేత్ర దర్శనము ముక్తి మొాక్ష కారకమీశ్వరీ ॥

**********::::*****************:::::


[3/15, 21:48] +91 94405 30763: 

పంచపది సాహితీ కవన వేదిక

నేటి పంచపది:132

15.3.22...మంగళవారం.

అంశం:అష్టాదశ శక్తి పీఠాలు-శాంకరీ దేవి 1

ప్రథమ బహుమతి శ్రేష్ఠ:

పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు

ద్వితీయ బహుమతి విశిష్ట:

కోగంటి(ఉప్పల)శాంతిశ్రీ గారు

 తృతీయ బహుమతి వరిష్ట:

MV ధర్మారావు గారుప్ర

త్యేకబహుమతి-ఉత్కృష్టమణి:

దామరాజు విశాలాక్షి గారు

ప్రత్యేక బహుమతి-ఉత్కృష్టరత్న:

జక్కా నాగమణి గారు

నిర్వహణ:కాటేగారు పాండురంగవిఠల్ పంచపది రూపకర్త:హైదరాబాద్

సహ నిర్వహణ:పోరంకి నాగరాజు.

*************************::::

నేటి పంచపది 122

తేది05032022,శనివారం

అంశం:జాతీయ భద్రతా దినోత్సవం.

శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

దేశం ప్రగతి బాటలో సాగాలంటే

దేశ ఆర్ధక వ్యవస్థకు కావాలి భద్రతారక్షణ ॥

విద్య , ఉద్యోగ వ్యపార, వ్యవసాయ, భద్రతలకు 

దేశ రాజ్యాంగ వ్యవస్థల్లో రావాలి సరైనసవరణ॥

దేశ ప్రజలు ఓటు హక్కును  భద్రంగా

 వినియొాగించేటందుకు ఈయాలి నిస్వార్ధశిక్షణ ॥

స్త్రీ ల మాన-సమ్మానాలకు పుార్తి భద్రత మన,బాధ్యతన్న భావనాచరణ॥

 

 అదే నిజమైన" జాతీయ భద్రతా దినోత్సవానికి"

అర్ధమీశ్వరీ ॥

పంచపది సాహితీ కవన వేదిక

నేటి పంచపది:122

తేదీ:5.3.22;పాల్గొన్నవారు:21            

అంశం:జాతీయ భద్రతా దినోత్సవం.

పురస్కార గ్రహీతలు    .                          


ప్రథమ బహుమతి   పంచపది శ్రేష్ఠ:

పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు


ద్వితీయ బహుమతి విశిష్ట:

కందూర్ చంద్రప్రకాష్ గుప్తా గారు

తేదీ:19/2/2022

/02/2022.

నేటి పంచపది :  115

అంశం : జెట్టి ఈశ్వరీబాయి.


రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

కల్యాణ్ , మహారాష్ట్ర


గీతా ప్రైమరీ స్కూలు, గీతా మిడిల్ స్కూలు అనే విద్యాసంస్థలతో  ఉపాధ్యాయురాలిగా వృత్తి ప్రారంభం.॥

దళిత వర్గాల వీధుల్లో  లభించిన అధిక ఓట్లతో చుట్టిన శ్రీకారం .॥

వెనుకపడిన, బలహీన, బడుగువర్గాల అభ్యున్నతికి తోడ్పడాలన్న ఆశయ సాకారం .॥

ఎ.పి. షెడ్యూల్డు కులాల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా ఈశ్వరీ బాయి  కృషి  అపారం ॥

తలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతిఏటా ఈశ్వరీబాయి జయంతి, వర్ధంతి వేడుకలమొాఘమీశ్వరీ ॥



నేటి పంచపది .108.

అంశం :  ఛత్రపతి శివాజీ 

  

రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

కల్యాణ్ , మహారాష్ట్ర .

బానిత్వాంధకారంలో స్వేచ్ఛా జ్యోతిని వెలిగించి

మతవాదులకు అతీతంగా పరిపాలించేడు ॥

దేశభక్తే ప్రధానంగా మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన మరాఠా వీరుడు .

స్త్రీ లను గౌరవించి హిందుా ధర్మానికి వన్నె  తెచ్చినవాడు

390 కి పైగా యుద్ధాలు చేసినా ఓటమెరుగని ఏకైక హైందవ వీరుడు.

 "నా గమ్యం నా గమనం "హిందుత్వమని నినదించిన యొాధుడు ఛత్రపతి శివాజీ ఈశ్వరీ ॥

****************************************

పంచపదిలో

అంశం : వసంత పంచమి.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

అక్షర నిధికి ప్రతిరుాపమైనది సరస్వతీ రుాపం

సంగీత , జ్ఞాన ,విద్యా సంస్కారాలకి ప్రతిరుాపం.

వసంత ఋతు ఆరంభంలో ఆ శ్రీ వాణీ  పుాజనం

సకల కళల  అక్షర  సంపత్తకీ మనం పలికే ఆహ్వానం.

వీణా పుస్తక ధారిణియై మనలో నున్న అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలి జ్ఞాన జ్యోతిని వెలిగించే  

అమ్మ రుాపానికి వందనమిడు ఈశ్వరీ..🙏

********************:::+

భారత దేశం రాజ్యాంగం గణతంత్రం .

రచన. పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

 1950 జనవరి 26 న భారత లిఖిత రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చారు. 


కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆ రోజును "స్వాతంత్ర్య దినోత్సవంగా "వ్యవహరించారు.


నెహ్రూ తదితర జాతీయోద్యమనేతలు జనవరి 26ను దేశ "గణతంత్ర దినోత్సవంగా" చేశారు.


 ఈ రోజు ప్రజలు  త్రివర్ణ పతాకాన్నెగురవేసి తమ దేశ భక్తిని చాటుకుంటారు.


భారతదేశానికి సంబంధించిన మూడు జాతీయ సెలవుదినాల్లో ఇది కూడా  ఒకటీశ్వరీ..॥


27/01/2022.

పంచపదిలో

  అంశం : దర్శనం  మొగులయ్య .

  

రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర


12 మెట్ల కిన్నెర గానంతో  తెలంగాణ వారి చారిత్రాత్మక  వీర గాథల ప్రదర్శనలను  చేసెడివాడు.


మొాగులయ్య కిన్నెర పాట ద్వారా సినీరంగంలో మంచి గుర్తింపునందుకున్నాడు.


తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాల ద్వారా  ప్రతి నెల రూ.10 వేలు పింఛను  పొందుతున్నవాడు.


"మొగులయ్య కిన్నెర ప్రతిభ " డాక్యూమెంటరీగా తీయబడగా,సాంఘిక శాస్త్రంలో తన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా కలిగున్నాడు.


 ఉగాది విశిష్ట "పురస్కారాన్ని ""పద్మశ్రీ" పురస్కారాన్ని కుాడా అందుకున్న  ఘనుడు మొగులయ్య ఈశ్వరీ.



26/01/2022.

పంచపదిలో

అంశం : భారత దేశం రాజ్యాంగం గణతంత్రం .

రచన. పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

 1950 జనవరి 26 న భారత లిఖిత రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చారు. 

కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆ రోజును "స్వాతంత్ర్య దినోత్సవంగా "వ్యవహరించారు.

నెహ్రూ తదితర జాతీయోద్యమనేతలు జనవరి 26ను దేశ "గణతంత్ర దినోత్సవంగా" చేశారు.

 ఈ రోజు ప్రజలు  త్రివర్ణ పతాకాన్నెగురవేసి తమ దేశ భక్తిని చాటుకుంటారు.

భారతదేశానికి సంబంధించిన మూడు జాతీయ సెలవుదినాల్లో ఇది కూడా  ఒకటీశ్వరీ..॥


*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....

నేటి *పంచపది* 84

తేదీ:26.1.22

అంశం *భారతదేశం-రాజ్యాంగం-గణతంత్రం* 

ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*

పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు (14)

******************:::::::**************

నేటి పంచపది*

******************************
21.01.2022

అంశం:సామాజిక విప్లవ ప్రజాకవి యోగి వేమన*

రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి

ఆటా పాటగా జీవితాన్ని అనుభవించినవాడు.॥

జీవితపు ఒడిదుడుకుల  పోరాటంలో  చిత్తుగా
ఓడిపోయినవాడు.॥

చేసిన తప్పులను సరిదిద్దుకొనే అవకాశం రాదని    తెలిసి చింతించినవాడు .॥

ఆటవెలదులలో అనేక జీవిత సత్యాలను  పద్యాలుగా రాసి తెలుగు సాహిత్యంలో చరిత్ర శృష్టించినవాడు.॥

ప్రజాకవిగా చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయిన ఘనుడు శ్రీ యొాగి వేమన ఈశ్వరీ.

19/01/2022.

పంచపదిలో .

అంశం : నట సార్వభౌముడు నందముారి తారక రామారావు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి

చిత్రసీమలో అన్ని పాత్రలకుా న్యాయం చేకుార్చిన అద్భుత నటుడు.

నటసార్వభౌమునిగా నందముారి ఘనుడు.

చిద్ఘన రుాపునిగా , ఛీఫ్ మినిస్టర్ గా ప్రజల మన్న నలను పొందినవాడు .

హావ భావాల గంభీర స్వరంతో నటనకు  జీవం పొిసినవాడు.

ఎప్పటికీ తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోని 

ఆదర్శ  కథా నాయకుడు శ్రీ "నందముారి తారక రామారావు" ఈశ్వరీ.॥

*****************************

పంచపది.

అంశం : లుాయిస్ బ్రెయిలీ .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

సాంకేతిక భాషా నిపుణుడు.

"బ్రెయిలీ " స్పర్శ లిపిని కనుగొని ,అంధుల  విద్యా వికాసానికి దోహదపడినవాడు.

ఫ్రెంచ్ వర్ణమాల కోడ్‍ను తన ప్రత్యేక కోడ్‍తో అభివృద్ధి పరచినవాడు.

సంగీత,  అంధ విద్యా విధానాన్ని స్పర్శతో చదివే సంకేతిక కోడ్ ను  కనిపెట్టిన వాడు .

డిజిటల్  వర్ణాకృతికి కుాడా ఆదిగురువీతడే ఈశ్వరీ ॥

****************************

*1/15, 18:27] p3: 15 -1- 2022 :

పంచపది కవన వేదికలో 

అంశం : శబరిమల మకరజ్యోతి దర్శనం .

శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .

మత్తకోకిల పద్య ప్రక్రియలో పంచపది కవనము 


1.వత్సరమ్మున కొక్క సారిగ వచ్చి పండగ లేలుగా

శంకు రాతిరి పర్వ మందున శాబ రీమల యాత్రగా

దీక్ష మాలలు వేసి భక్తులు దీర్ఘ కీర్తుల వేడుగా

వేల దివ్వెలు వెల్గు లేలుచు వేల కాంతులు జిమ్ముగా

ఉత్తరాయణ పుణ్య కాలము ఉత్తమంబది ఆదిగా

ఈశ్వరీ ॥

****************************

2.

పంప నీటిలొ పుణ్య స్నానమె పావ నమ్మగు నట్లుగా

మేలు కట్లను ఎక్కి దేవుని మేని రుాపును చుాడుగా

ఆక సమ్మున అయ్య అప్పడె హర్ష మొందిన రీతిగా

ధర్మ శాస్తయె జ్యోతి రుాపుగ దర్శ నమ్మును ఈయగా

జన్మ సార్ధక మాయె యంచును జనులు పొంగిరి హాయిగా నీశ్వరీ ॥

[1/15, 18:54] p3: 15 -1- 2022 :

పంచపది కవన వేదికలో 

అంశం : శబరిమల మకరజ్యోతి దర్శనం .


శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి


ఉత్తరాయణ పుణ్య కాలము.

సంక్రాంతి సంబరాల సందడుల సమన్వయము.

శబరిమలై కేగు భక్తకోటి, పంపానదిలో చేయుదురు స్నానము.

ఇరుముడి  భోగము ధర్మ శాస్త కిడి చేతురు వందనము .

మంగళమ్మగు మకరజ్యోతిగా వెల్గు దైవ దర్శనముతో

ఆనందమే ఆనందమీశ్వరీ  ॥

[1/15, 21:21] +91 94405 30763: *పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....


నేటి *పంచపది* 73

తేదీ:15.1.22

అంశం *శబరిమల మకర జ్యోతి దర్శనం* 

ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*

యం.వి.ధర్మారావు గారు

ద్వితీయ బహుమతి *పంచపది విశిష్ట*

విస్సాప్రగడ పద్మావతి గారు

తృతీయ బహుమతి *పంచపది వరిష్ట*

పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు




*నేటి పంచపది* విజేతలందరికి అభినందనలు.

💐💐💐💐💐

10/01/2022.

నేటి పంచపది..68

అంశం : కురుక్షేత్ర సంగ్రామం .

శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి


 రాజకీయపుటెత్తులతో  ధర్మా-ధర్మాల మధ్య  జరిగిన కురుక్షేత్ర సంగ్రామం.॥

 తలవంచిన ధర్మానికి తలమానికమై సాక్షాత్ భగవంతునిచే  బోధింపబడ్డ గీతాసారం.॥

 అlష్టాదశ యొాగాలతో ఆవిష్కరింపబడ్డ భగవద్గీతామృతమనే  అద్భుత  కావ్యం ॥

కర్మ ఫలానికి  కారకుణ్ణి తానేనని స్వయంగా భగవంతుడే పలికిన జీవిత నిర్ణయాల సత్యపథ

సాక్షాత్కారం ॥

 ఎప్పటికైనా ధర్మానికే గెలుపన్న మాటకు కురుక్షేత్ర   సంగ్రామమొక  అద్భుత నిదర్శనమీశ్వరీ ॥

**********************

 నేటి పంచ పది 

 తేదీ 9 / 01 / 2022

 అంశం :  స్టీఫెన్ హాకింగ్ శాస్త్రవేత్త.

శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి.

 గణిత శాస్త్ర పురోగతికై ఎన్నో పుస్తకాలు రాసి ,

 రచయితగా పేరొందినవాడు.॥

  గణిత ,భౌతిక పరమైన ఎన్నో  సిద్ధాంతాలను రుాపొందించిన మహా మేధావితడు.॥

సైన్స్ యొక్క అనేక రచనలతో వాణిజ్యపరమైన ఎన్నో విజయాలను సాధించినవాడు .॥

, యునైటెడ్ స్టేట్స్‌లో అత్యున్నత పౌర పురస్కారాన్నే

కాక ఎన్నో అవార్డ్స్ లను, పురస్కారాలను అందుకున్న ఘనుడు ॥

విశ్వోద్భవ శాస్త్ర సిద్ధాంతాన్ని రూపొందించిన మొదటి వ్యక్తి  "స్టీఫెన్ విలియం హాకింగే "  ఈశ్వరీ..॥

******************************************

1[12/20/2021, 11:42]

 p3: 20/12/2021.

 నేటి పంచపదిలో అంశం: పుస్తకం విశిష్టత.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

వశ్వ జ్ఞాన సముపార్జనకు విజ్ఞాన సోపానం పుస్తకం 

అధ్యయనంతో మనలో దాగిన అజ్ఞానాంధకారాన్ని  తరిమి పోగొట్టే ఆత్మ జ్యోతి- స్వరుాపం పుస్తకం.

 పుటలు నిండిన చరితల ,సామాజిక, పౌరాణిక, కావ్య, గ్రంధ  సార నిధికి నిర్వచనం పుస్తకం.

సత్సంబంధ ,శాంతియుత  నడవడికి సాక్షీభుాతమైన జ్ఞాన భండారం పుస్తకం.

సభ్యత, సాంప్రదాయాలకు నిలయమైన, మానవ జీవన విధానానికి మార్గదర్శకం పుస్తక ఫఠనమీశ్వరీ

 ॥****************************

[12/21/2021, 08:55]

 p3: 21/12/2021.

 ఈనాటి పంచపది 

అంశం : ఆత్మవిశ్వాసము

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

మనలను మనం నిరుాపించుకోవడానికి  ముందుగా కావలసినది ఆత్మవిశ్వాసము.

ఆశయాల బాటలో గమ్యం చేర్చేది ఆత్మవిశ్వాసము.

ఒడుదొడుకుల జీవిత నావను స్థిరపరచే  చుక్కాని ఆత్మవిశ్వాసము.

జీవితాంధకారపు  సాగరాన్ని దాటించే  వెలుగు వారధి ఆత్మవిశ్వాసము.

 మానసిక ఒత్తడున్న చోట ఆత్మస్థైర్యాన్ని పెంచే ఔషధం

 ఆత్మవిశ్వాసమే కదా ఈశ్వరీ ॥


పంచపది.

ప్రక్రియ : మత్త కోకిల.


 రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్ : మహారాష్ట్ర.


కొత్త వత్సర మొచ్చె నిండుగ కోరు కోర్కెలు తీరుగా।


అత్త రుాలవె జల్లు కొంచును ఆడు కొందము హాయిగా॥


ఈత రుాణము లింక రావుగ ఇంక మేలుకొ హాయిగా।


పాత రోజులు మర్చి పోదము  పండ సోములె

విందుగా॥


తాత బామ్మలు సంత సించుచు తాయి లమ్ములె పంచుగా... ఈశ్వరీ.।॥


బంధువులకు , హితులకు స్నేహితులకు నుాతన సంవత్సర శుభాకాంక్షలు ..🙏


**********************::***************

[[12/20/2021, 11:42] p3: 20/12/2021.

నేటి పంచపదిలో అంశం: పుస్తకం విశిష్టత.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .



విశ్వ జ్ఞాన సముపార్జనకు విజ్ఞాన సోపానం పుస్తకం 


అధ్యయనంతో మనలో దాగిన అజ్ఞానాంధకారాన్ని  తరిమి పోగొట్టే ఆత్మ జ్యోతి- స్వరుాపం పుస్తకం.


 పుటలు నిండిన చరితల ,సామాజిక, పౌరాణిక, కావ్య, గ్రంధ  సార నిధికి నిర్వచనం పుస్తకం.


సత్సంబంధ ,శాంతియుత  నడవడికి సాక్షీభుాతమైన జ్ఞాన భండారం పుస్తకం.


సభ్యత, సాంప్రదాయాలకు నిలయమైన, మానవ జీవన విధానానికి మార్గదర్శకం పుస్తక ఫఠనమీశ్వరీ ॥

[12/21/2021, 08:55] p3: 21/12/2021.

ఈనాటి పంచపది 

అంశం : ఆత్మవిశ్వాసము

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .


మనలను మనం నిరుాపించుకోవడానికి  ముందుగా కావలసినది ఆత్మవిశ్వాసము.


ఆశయాల బాటలో గమ్యం చేర్చేది ఆత్మవిశ్వాసము.


ఒడుదొడుకుల జీవిత నావను స్థిరపరచే  చుక్కాని ఆత్మవిశ్వాసము.


జీవితాంధకారపు  సాగరాన్ని దాటించే  వెలుగు వారధి ఆత్మవిశ్వాసము.


 మానసిక ఒత్తడున్న చోట ఆత్మస్థైర్యాన్ని పెంచే ఔషధం

 ఆత్మవిశ్వాసమే కదా ఈశ్వరీ ॥, 15:05] 

p3: 31/12/2021.

నేటి పంచ పది..

అంశం : రామప్ప దేవాలయం.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కాతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం.

నీటితో తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణం.

రాతి కట్టడాలపై కాకతీయ నాట్యకాళా శిల్ప వైభవం.

"యునెస్కో వారసత్వ హోదా" తో  పర్యాటక 

స్థలంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం.

రేచర్ల రుద్రయ్య భక్తితో నిర్మించిన రామ లింగేశ్వరుని దర్శనం ముక్తి -మొాక్ష కారకమీశ్వరీ ॥

[12/31/2021, 20:36] 

+91 94405 30763:

 *పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....


నేటి *పంచపది* 58

తేదీ:31.12.21 

అంశం *రామప్ప దేవాలయం*


ప్రత్యేక బహుమతి *పంచపది ఉత్క్రుష్ట1*

పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు

.*


*నేటి పంచపది* విజేతలందరికి అభినందనలు.

💐💐💐💐💐

పంచపది.

 శీర్షిక : 

 

రచన, శ్రీమతి ,

పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.


హోయసల రాజులకాలం నాటి శిల్ప కళాకారుడు.


 జీవంపోసినట్టున్న  శిల్పాలు చెక్కగల నైపుణ్యం గలవాడు.

 

బేలూరు చెన్నకేశవ ఆలయంలో గల శిల్పాలు తన కళావిజ్ఞకు తార్కాణం గా  చెక్కినాడు ॥


ప్రతిజ్ఞా పాలన కోసం జక్కన్న తన కుడి చేతిని తానే నరుక్కుంటాడు.


 కర్ణాటక ప్రభుత్వం ప్రతి సంవత్సరం అదే రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ శిల్పులు మరియు కళాకారులకు జక్కనాచారి అవార్డులు ప్రదానం చేస్తుంది ఈశ్వరీ.   


****************************************



[12/10, 17:01] p3: నేటి *పంచపది* లో

తేదీ:10.12.21

అంశం: *సుబ్రమణ్య షష్టి*

పేరు:శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .



శుాలాయుధ ధరుడై,ఆరు శిరస్సులతో అవతరించినవాడు.

తారకాసురుని వధకై ఉద్భవించిన శివాంశ -సంభుాతుడు.

.శివునకే ఓంకారముపదేశించిన కుమార గురుడు. 

కుజ ,కాలసర్ప  దోషాలను హరించువాడు .

.గణపతికి సోదరుడైన కార్తికేయుని ఆరాధించి

రోగముక్తిని పొందుమీశ్వరీ..॥

[12/11, 13:21] p3: 11/12/2021.

పంచపదిలో 

అంశం : ఉమ్మడికుటుంబం.

పేరు:రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.


ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వంశవృక్షానికి ఆనవాలు.


అందరుా ఒకే చోట కలిసుండే మందిరం ఇల్లు.


ఆ  గృహంలో  పెద్దలు సంస్కృతి సంస్కారాలు నేర్పే

అనుభవజ్ఞులైన గురువులు.


కష్ట- నష్టాలలో కన్నీళ్ళు పంచుకొనే అనురాగ బంధాలు రక్త సంబంధాలు.


అందరుా కలిసున్న లోగిలి , ఆనంద నిలయాలకు

వారధని తెలుసుకో ఈశ్వరీ ॥

[12/12, 15:54] p3: నేటి *పంచపది* 

తేదీ:12.12.21

అంశం:తెలుగింటి పెళ్లి సందడి.


రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.


కన్నెపిల్లల  కాలిమువ్వల గల-గలలు

పెద్దముత్తైదుల పట్టు చీరల రెప-రెపలు

 కాబోయే దంపతుల చిరు సిగ్గుల దొంగ చుాపులు. 

నేతి వంటల పెళ్ళి విందు ఘుమ-ఘుమలు.

వచ్చి పోయేవారి సందళ్ళతో వివాహ మంటపంలో 

ఆనందం నిండిన చిరునవ్వుల కళ-కళలుఈశ్వరీ ॥

[12/13, 17:31] p3: 13/12/2021.

పంచపది లో

అంశం : సప్తపది.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.


సాంప్రదాయ బద్ధమైన వైవాహిక జీవితానికి ఆరంభం.


ఆదర్శ జీవితానికి అగ్నిసాక్షిగా ఏడడుగుల బంధం.


భార్యా భర్తలుగా కర్తవ్య నిర్వాహణలు కలిసి చేస్తామన్న ప్రమాణ స్వీకారం.


కష్టసుఖాలలో తోడుా- నీడగా కలసి ఉంటామన్న ఒప్పందం.


గృహస్త ధర్మ నిర్వాహణకు ఏర్పరచిన ఏడడుగుల కర్ధమీశ్వరీ .

[12/14, 15:32] p3: 14/12/2021.

పంచపది కవన వేదిక లో,

అంశం : అరుంధతి.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.


 

సప్తర్షి మండలంలో ఉత్తర దిశగా కంటి శక్తిని పెంచే  చిన్న నక్షత్రం . 


వశిష్ట మహాముని భార్యగా, పంచ మహా పతివ్రతలలో ఒకరిగా,ఖ్యాతికెక్కినది అరుంధతీ కథనం.


పాతివ్రత్యానికి ప్రతీకగా  అరుంధతీ నక్షత్ర దర్శనం .


పాతివ్రత్య విలువలకు  పవిత్రమైన నిదర్శనం .


భారతీయ వివాహ సాంప్రదాయంలో ముఖ్యమైన 

విధి ,పవిత్ర  అరుంధతీ నక్షత్ర దర్శనమీశ్వరీ ॥

[12/15, 15:45] p3: 15/12/2021.

పంచపది కవనవేదికలో..

అంశం : గీతాజయంతి.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .


అష్టాదశ యొాగాల లో దాగి ఉన్న ధర్మ సారం.


సాక్షాత్ "శ్రీకృష్ణుడే గురువుగా బోధించిన జ్ఞాన తత్త్వం.


మనం చేసే కర్మలకు తానే కర్త, క్రియ అని తెలిపిన సత్యం.


సర్వసంగపరిత్యాగానికి.. ఆత్మసాక్షాత్కారానికి నిదర్శనం .


అటువంటి "భగవద్గీత" భగవన్ముఖతః వచించిన దినం-"గీతాజయంతి"ఈశ్వరీ ॥

[12/16, 18:58] p3: 16/12/2021

పంచపది.

అంశం : సుార్యుడు.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

వగ్రహాలలో అధిక రేతస్సు కలిగినవాడు.

భుమిపై జీవ ,జంతు , చరాలకు పోషకములిచ్చువాడు.

పగటి వెలుగుకు కారకుడు.

అనేక ఔషధ తత్వాలను  కలిగిన కిరణ తేజుడు. 

 జీవ, జంతు , జన బాహుళ్యానికి ఆరోగ్యాన్ని ప్రసాదించే  భగవత్స్వరుాపుడీశ్వరీ ॥

[12/19, 10:50] p3: 19/12/2021.

పంచపది.

అంశం : గురు గ్రంధ సాహెబ్ .


రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .


సిక్కుల గురు పరంపరా విధానానికి స్వస్తిపలికిన ఆది

గ్రంధము "గురు గ్రంథము".


సర్వ మానవ సమానత్వమునకు నిదర్శనము.


మానవత్వం, దయ, జాలి, ప్రేమాచరణలతో

పరమాత్మను చేరగలమనే సత్యము చెప్పిన గ్రంథము.


జీవనమార్గాన్ని సూచించే సుాక్తి తత్త్వాల సారము.


విశాలతత్వ బోధనలుగల గల పవిత్ర 

 "గురు గ్రంధ" పారాయణము చేయుమీశ్వరీ॥

[12/19, 20:49] +91 94405 30763: *పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....


నేటి *పంచపది* 46  

తేదీ:19.12.21 

అంశం *గురు గ్రంథ సాహెబ్*


ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*

పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు

ద్వితీయ బహుమతి *పంచపది విశిష్ట*

యం.వి.ధర్మారావు గారు

తృతీయ బహుమతి *పంచపది వరిష్ట*

మేకల అనురాధ ప్రసాద్ గారు

నడిపించ గలరు.*

*నేటి పంచపది* విజేతలందరికి అభినందనలు.

💐💐💐💐💐

[12/20, 11:42] p3: 20/12/2021.

నేటి పంచపదిలో అంశం: పుస్తకం విశిష్టత.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

విశ్వ జ్ఞాన సముపార్జనకు విజ్ఞాన సోపానం పుస్తకం 

అధ్యయనంతో మనలో దాగిన అజ్ఞానాంధకారాన్ని  తరిమి పోగొట్టే ఆత్మ జ్యోతి- స్వరుాపం పుస్తకం.

పుటలు నిండిన చరితల ,సామాజిక, పౌరాణిక, కావ్య, గ్రంధ  సార నిధికి నిర్వచనం పుస్తకం.

సత్సంబంధ ,శాంతియుత  నడవడికి సాక్షీభుాతమైన జ్ఞాన భండారం పుస్తకం.

సభ్యత, సాంప్రదాయాలకు నిలయమైన, మానవ జీవన విధానానికి మార్గదర్శకం పుస్తక ఫఠనమీశ్వరీ ॥

[12/21, 08:55] p3: 21/12/2021.

ఈనాటి పంచపది 

అంశం : ఆత్మవిశ్వాసము

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

మనలను మనం నిరుాపించుకోవడానికి  ముందుగా కావలసినది ఆత్మవిశ్వాసము.

ఆశయాల బాటలో గమ్యం చేర్చేది ఆత్మవిశ్వాసము.

ఒడుదొడుకుల జీవిత నావను స్థిరపరచే  చుక్కాని ఆత్మవిశ్వాసము.

జీవితాంధకారపు  సాగరాన్ని దాటించే  వెలుగు వారధి ఆత్మవిశ్వాసము.

 మానసిక ఒత్తడున్న చోట ఆత్మస్థైర్యాన్ని పెంచే ఔషధం

 ఆత్మవిశ్వాసమే కదా ఈశ్వరీ ॥

[12/24, 16:38] p3: 24/12/2021.

నేటి పంచపదిలో..


అంశం : జాతీయ రైతుదినోత్సవం .


రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .



దేశానికి వెన్నెముకగా రైతుకు గుర్తింపు.


ప్రకృతి ప్రకోపానికి బలౌతున్న పంటకు రైతు కారుస్తున్న కన్నీటి అసహాయ పిలుపు.


కష్టం తీర్చమంటుా కేంద్రానికి  వినమ్రతతో అర్ధింపు


అమలుకాని పథకాలకు అప్పులపాలైన బ్రతుకు మలుపు.


దేశానికి అన్నం పెట్టే రైతు నడక ఆత్మహత్యల బాట వైపు ఈశ్వరీ..

[12/27, 18:27] p3: 27/12/2021.


పంచపదిలో...

అంశం : మహా నటి సావిత్రి.

వలపు మాటల మొావి  వాలు కన్నుల దోయి .

నలువురిని మెప్పించే నటన కౌశల మొాయి.

 సావిత్రి సినిమాలు సందడించిన వోయి---

  శశి వదని  అందాలె సిరి వెన్నెలల రేయి.

 చిత్ర సీమ "మహానటి" సావిత్రే గద టోయి ఈశ్వరీ।

21/12/2021.

ఈనాటి పంచపది 

అంశం : ఆత్మవిశ్వాసము

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

మనలను మనం నిరుాపించుకోవడానికి  ముందుగా కావలసినది ఆత్మవిశ్వాసము.

ఆశయాల బాటలో గమ్యం చేర్చేది ఆత్మవిశ్వాసము.

ఒడిదుడుకుల జీవిత నావను స్థిరపరచే  చుక్కాని ఆత్మవిశ్వాసము.

జీవితాంధకారపు  సాగరాన్ని దాటించే  వెలుగు వారధి ఆత్మవిశ్వాసము.

 మానసిక ఒత్తడున్న చోట ఆత్మస్థైర్యాన్ని పెంచే ఔషధం ఆత్మవిశ్వాసమే కదా ఈశ్వరీ ॥

0/12/2021.

నేటి పంచపదిలో అంశం: పుస్తకం విశిష్టత.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

శ్వ జ్ఞాన సముపార్జనకు విజ్ఞాన సోపానం పుస్తకం 

అధ్యయనంతో మనలో దాగిన అజ్ఞానాంధకారాన్ని  తరిమి పోగొట్టే ఆత్మ జ్యోతి- స్వరుాపం పుస్తకం.

పుటలు నిండిన చరితల ,సామాజిక, పౌరాణిక, కావ్య, గ్రంధ  సార నిధికి నిర్వచనం పుస్తకం.

సత్సంబంధ ,శాంతియుత  నడవడికి సాక్షీభుాతమైన జ్ఞాన భండారం పుస్తకం.

సభ్యత, సాంప్రదాయాలకు నిలయమైన, మానవ జీవన విధానానికి మార్గదర్శకం పుస్తక ఫఠనమీశ్వరీ ॥ 

[12/19, 10:50] p3:

 19/12/2021.

పంచపది.

అంశం : గురు గ్రంధ సాహెబ్ .

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

సిక్కుల గురు పరంపరా విధానానికి స్వస్తిపలికిన ఆది గ్రంధము "గురు గ్రంథము".

సర్వ మానవ సమానత్వమునకు నిదర్శనము.

మానవత్వం, దయ, జాలి, ప్రేమాచరణలతో

పరమాత్మను చేరగలమనే సత్యము చెప్పిన గ్రంథము.

జీవనమార్గాన్ని సూచించే సుాక్తి తత్త్వాల సారము.

విశాలతత్వ బోధనలుగల గల పవిత్ర 

 "గురు గ్రంధ" పారాయణము చేయుమీశ్వరీ॥

[12/19, 20:49] +91 94405 30763: 

*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....

నేటి *పంచపది* 

తేదీ:19.12.21 

అంశం *గురు గ్రంథ సాహెబ్*

ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*

పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు

ద్వితీయ బహుమతి *పంచపది విశిష్ట*


నేటి *పంచపది*
తేదీ:12.12.21
అంశం:తెలుగింటి పెళ్లి సందడి.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కన్నెపిల్లల  కాలిమువ్వల గల-గలలు
పెద్దముత్తైదుల పట్టు చీరల రెప-రెపలు
కాబోయే దంపతుల చిరు సిగ్గుల దొంగ చుాపులు.
నేతి వంటల పెళ్ళి విందు ఘుమ-ఘుమలు.
వచ్చి పోయేవారి సందళ్ళతో వివాహ మంటపంలో
ఆనందం నిండిన చిరునవ్వుల కళ-కళలుఈశ్వరీ ॥

*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....

నేటి *పంచపది*
తేదీ:12.12.21
అంశం *ఉమ్మడి కుటుంబం*లో

ప్రత్యేక బహుమతి *పంచపది ఉత్క్రుష్ట 2*
పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు.

14/12/2021.

పంచపది కవన వేదిక లో,

అంశం : అరుంధతి.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.

సప్తర్షి మండలంలో ఉత్తర దిశగా కంటి శక్తిని పెంచే  చిన్న నక్షత్రం . 

వశిష్ట మహాముని భార్యగా, పంచ మహా పతివ్రతలలో ఒకరిగా,ఖ్యాతికెక్కినది అరుంధతీ కథనం.

పాతివ్రత్యానికి ప్రతీకగా  అరుంధతీ నక్షత్ర దర్శనం .

పాతివ్రత్య విలువలకు  పవిత్రమైన నిదర్శనం .

భారతీయ వివాహ సాంప్రదాయంలో ముఖ్యమైన విధి ,పవిత్ర  అరుంధతీ నక్షత్ర దర్శనమీశ్వరీ ॥

***************************************

*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....

నటి *పంచపది*

తేదీ:14.12.21

అంశం *పెళ్లి-అరుంధతి నక్షత్రం*

ప్రత్యేక బహుమతి *పంచపది ఉత్క్రుష్ట1*

పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు.

*********************************

నేటి *పంచపది*
తేదీ:12.12.21
అంశం:తెలుగింటి పెళ్లి సందడి.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కన్నెపిల్లల  కాలిమువ్వల గల-గలలు
పెద్దముత్తైదుల పట్టు చీరల రెప-రెపలు
కాబోయే దంపతుల చిరు సిగ్గుల దొంగ చుాపులు.
నేతి వంటల పెళ్ళి విందు ఘుమ-ఘుమలు.
వచ్చి పోయేవారి సందళ్ళతో వివాహ మంటపంలో
ఆనందం నిండిన చిరునవ్వుల కళ-కళలుఈశ్వరీ ॥

*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....

నేటి *పంచపది*
తేదీ:12.12.21
అంశం *ఉమ్మడి కుటుంబం*

ప్రత్యేక బహుమతి *పంచపది ఉత్క్రుష్ట 2*
పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు.

***********************************

నేటి *పంచపది* లో
తేదీ:10.12.21
అంశం: *సుబ్రమణ్య షష్టి*
పేరు:శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

శుాలాయుధ ధరుడై,ఆరు శిరస్సులతో అవతరించినవాడు.
తారకాసురుని వధకై ఉద్భవించిన శివాంశ -సంభుాతుడు.
వల్లీ దేవసేనల పతియైన సుబ్రహ్మణ్యుడు.

.శివునకే ఓంకారముపదేశించిన కుమార గురుడు.
కుజ ,కాలసర్ప  దోషాలను హరించువాడు .
.గణపతికి సోదరుడైన కార్తికేయుని ఆరాధించి
రోగముక్తిని పొందుమీశ్వరీ..

*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....

నేటి *పంచపది* లో
తేదీ:10.12.21
అంశం *సుబ్రమణ్య షష్టి*

తృతీయ బహుమతి *పంచపది వరిష్ట*
పుల్లభట్ల జగదీశ్వరీ మూర్తి గారు.

***********************************

8/12/2021.
పంచపదిలో..
అంశం : ఒమిక్రాన్ వేరియంట్.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

"ఒమిక్రాన్" గా రుాపాంతరం చెందుతున్న" డెల్టా వేరియంట్" కణాలు.
గొంతు నొప్పి ,అలసట, పొడిదగ్గు , దీని లక్షణాలు.
మందు లేని మహమ్మారులతోసతమతమౌతున్న
వైద్యులు.
పోషకాహారం తో రోగనిరోధకశక్తిని పెంచమంటున్న 
నిపుణులు.
యొాగా, ప్రాణాయామాలకు మించిన మందులేదని
తెలుసుకో ఈశ్వరీ ॥

నేటి *పంచపది* లో
తేదీ:08.12.21
అంశం *ఒమిక్రాన్*
తృతీయ బహుమతి *పంచపది వరిష్ట*
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు.

.******************************

*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....

[11/21, 16:28] p3: నేటి *పంచపది* 18
తేదీ:21.11.21
అంశం:*సింధు పుష్కరాలు*
పేరు:
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కైలాశ పర్వతోద్భవ మానస సరోవరము.
నారాయణభాగ్ నదీ జలాలతో సంగమము.
కుంభరాశిలోకి  గురు.బృహస్పతి ప్రవేశము .
ఏటేటా జరిగే పవిత్ర  సీంధునదీ పుష్కరము.
పవిత్ర  పుష్కర స్నానానంతరం  దాన ధర్మాలు 
ఉత్తమంబీశ్వరీ.

[11/21, 19:33] +91 94405 30763
 *పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....

నేటి *పంచపది* 18
తేదీ:21.11.21
అంశం *సింధు పుష్కరాలు*

ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*
పుల్లభట్ల జగదీశ్వరీమూర్తి గారు.
ద్వితీయ బహుమతి *పంచపది విశిష్ట*
యం వి ధర్మారావు గారు
తృతీయ బహుమతి *పంచపది వరిష్ట*
యేలూరు ధర్మావతి గారు.

*నేటి పంచపది* విజేతలందరికి అభినందనలు.
💐💐💐💐💐
**********************:*::*:
[11/22, 16:17] p3: 22/11/2021.
పంచపది.
అంశం : ద్వాదశ జ్యోతిర్లింగాలు .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

శివభక్తులైన శైవులు పుాజించే  మహాదేవుడు శివుడు -లింగాకారంలో ఉద్భవించిన జ్యోతిస్వరుాపుడు.
దేవ, ఋషి, గ్రహ, గణాలు కొలిచే బోళా శంకరుడు.
ప్రసిద్ధమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో జ్యోతిగా నిలిచేడు.
పన్నెండు పవిత్ర పుణ్య క్షేత్రాలలో నెలకొన్న ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించి ధన్యతనొందుమీశ్వరీ ॥
[11/23, 17:52] p3: 
23/11/2021.
పంచపది.20.
అంశం : శ్రీశైల మల్లీశ్వర జ్యోతిర్లింగం: 2

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

పాతాళ  గంగయైన క్రిష్ణానదీ తీరము.
ఆది శంకరాచార్యుల శివానందలహరిసారము.
అష్టాదశ శక్తి పీఠములలో ఒకటైన పుణ్య క్షేత్రము.
మల్లికార్జునుడనే పేరుతో జ్యోతిర్లింగంగా శివుని  ఆవిర్భావము.
శ్రీ భ్రమరాంబికాసహిత
శ్రీశైల మల్లికార్జునుని దర్శించి తరించుమీశ్వరీ ॥

[11/24, 13:25] p3: 24/11/2021.
పంచపదిలో
అంశం : మహాకాళేశ్వర జ్యోతిర్లింగం..3
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

మధ్యప్రదేశ్‌ , ఉజ్జయినీ పట్టణంలో శ్రీ మహా కాళేశ్వరాలయము.

 గర్భగుడిలో  తిరగవేసి ఉన్న శ్రీచక్రయంత్రము.     దక్షిణాభిముఖ ముఖద్వారం  ప్రత్యేకము.

తాంత్రిక మంత్రాలతో ప్రాతఃకాల భస్మాభిషేకము.

మద్యం నైవేద్యంగా, మంత్ర శక్తితో  ఉద్భవించిన ఏకైక స్వయంభూ కాలభైరవ జ్యోతిర్లింగము.

అష్టభైరవులు,ఏకాదశరుద్రులు, వేల దేవతా మందిరాలు గల కృష్ణా నదీ క్షేత్ర దర్శనముతో 
జీవితమది ధన్యము గద ఈశ్వరీ ॥

[11/24, 19:38] +91 94405 30763: 
*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....

నేటి *పంచపది* 21
తేదీ:24.11.21
అంశం *మహాకాళేశ్వర జ్యోతిర్లింగము-3*

ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*
యం వి ధర్మారావు గారు

ద్వితీయ బహుమతి *పంచపది విశిష్ట*
మేకల అనురాధ ప్రసాద్ గారు

తృతీయ బహుమతి *పంచపది వరిష్ట*
పుల్లభట్ల జగదీశ్వరీ మూర్తి గారు


*మీకు నచ్చిన అంశము తీసుకొని,ఎప్పటిలా,అందరు మెచ్చేలా,చక్కనైన పంచపది కవనములతో గ్రూపును నిత్య నూతనంగా నడిపించ గలరు.*

*నేటి పంచపది* విజేతలందరికి అభినందనలు.
💐💐💐💐💐

[11/25, 10:44] p3: 25/11/2021.
పంచపదిలో
అంశం : ఓంకారేశ్వర్ జోతిర్లింగం. 4.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

వింద్య పర్వత సానువుల్లో 
నర్మదా నదీతీరంలో వెలసిన ఓంకారేశ్వరుడు .

రెండు భాగములుగా ఉండి,  రెండు పేర్లతో పూజింపబడుతున్న జ్యోతిర్లింగాకారుడు.

ఓంకారేశ్వర  ,అమరేశ్వరు నామాలతో వెలసిన దేముడు .

అన్నపుార్ణ అర్ధాంగిగా కొలవబడుతున్న శివుడు.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఖాండ్వా జిల్లా క్షేత్ర దర్శనంతో 
అన్నపుార్ణ కృపకు పాత్రురాలివికమ్ము ఈశ్వరీ . :

[11/26, 12:58] p3
: పంచపది.
తేదీ:26.11.21
అంశం:*శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగం-5
పేరు:రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
శ్రీ వైద్యనాధ జ్యోతిర్లింగం.2
 మహారాష్ట్రలోని పార్లిలో ఉన్న 
వైద్యనాధుని , రావణుడు తన పది తలలను
 అర్పించి పుాజించిన ఆలయం.
 రావణ భక్తికి మెచ్చి గాయపడిన రావణుకి
"వైద్య"మందించిన శివుని ఆలయం.
జార్ఖండ్ రాష్ట్రంలోని చితాభుామియైన  డియోఘర్ ప్రదేశం .
కపాలిక / భైరవ వంటి తాంత్రిక ఆరాధనలకు నిలయం.
శవభస్మ భూషితుడైన వైద్యనాధుని సేవించి తరించుమీశ్వరీ ॥

[11/27, 12:40] p3: 
నేటి *పంచపది* 
తేదీ:27.11.21
అంశం:*శ్రీనాగేశ్వర జ్యోతిర్లింగం-6*
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

సుప్రియుడనే భక్తుని మొరవిని రాక్షస సంహారార్ధం
జ్యోతి రుాపంలో వెలసిన శివ కాంతిపుంజం.
 
మొాక్షనగరమైన ద్వారకకు సమీపంలో గల 
దారుకావనంలో వెలసిన క్షేత్రం.
  
దారుకావనము నాగులకు నెలవైనందున "నాగేశ్వర"
నామముతో  ప్రసిద్ధికెక్కిన ఆలయం.

నాగారూపమైన జ్యోతిర్లింగ దర్శనం, మహా 
 పాతక నాశనం ,శాశ్వతపుణ్యలోకవాసం .
 
.దారుకావనంలో  వెలసిన విశిష్ట "నాగేశ్వర జ్యోతిర్లింగ" దర్శనం, సర్వ శుభములను
ఇచ్చునీశ్వరీ ॥

[11/27, 21:00] +91 94405 30763:
 *పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....

నేటి *పంచపది* 24
తేదీ:27.11.21
అంశం *శ్రీనాగేశ్వర జ్యోతిర్లింగము-6*

ప్రత్యేక బహుమతి *పంచపది ఉత్క్రుష్ట 2*
పుల్లభట్ల జగదీశ్వరీమూర్తి గారు


*నేటి పంచపది* విజేతలందరికి అభినందనలు.
💐💐💐💐💐
[11/28, 13:37] p3: 
నేటి *పంచపది* 25
తేదీ:28.11.21
అంశం: *శ్రీకేదారేశ్వర జ్యోతిర్లింగం-7*
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.


ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగలో వెలసిన జ్యోతిర్లింగం.
మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య గల పవిత్ర శైవక్షేత్రం.
అక్షయతృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్ధం  తెరచి ఉంచబడే మందిరం.
చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం. 
చార్‌ధామ్‌ యాత్రలో గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాధ్ లను దర్శించి తరించుమీశ్వరీ..

***************************************
[11/29, 08:29] p3: నేటి *పంచపది* 26
తేదీ:29.11.21
అంశం: *శ్రీత్రయంబకేశ్వర జ్యోతిర్లింగం-8*
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి .

బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా
 వెలసిన మృత్యుంజయుడు శివుడు .
 
సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే ముాడు
నేత్రాలు గల దేవుడు.

స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైనవాడు.

లింగం చుట్టుా నిరంతరం ఊరే ఊట నీరు, కలిసే "కుశావర్తన సరోవరంలో" స్నానం చేసినవారికి సర్వ రోగాలుా, పాపాలుా పోగొట్టేవాడు.

"గోదావరి " పేరుతో పవిత్ర" గంగ" ప్రవహిస్తున్న ,
మహారాష్ట్ర "నాసిక్" లో గల" శ్రీత్రయంబకేశ్వర జ్యోతిర్లింగ" క్షేత్ర దర్శనంతో ధన్యతనొందుమీశ్వరీ ॥

[11/30, 16:20] p3: 
నేటి *పంచపది* 27
తేదీ:30.11.21
అంశం: *శ్రీరామేశ్వర జ్యోతిర్లింగం-9*

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

"శ్రీరాముడు" సముద్రముపై సేతువు నిర్మించి,
లంకలో గల "దశకంఠుని దునిమిన" స్థలమట.

శైవులకు, వైష్ణవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర 
పుణ్య క్షేత్రమట.

"బ్రహ్మ హత్యాపాప" నివారణకై సీతమ్మ చేసిన సైకత లింగమే, శ్రీరాముడు ప్రతిష్టించిన శ్రీ..
"రామనాథేశ్వర" స్వామి జ్యోతిర్లింగమట.

హనుమంతుడు తెచ్చిన" విశ్వలింగము" పక్కనే ప్రతిష్టింపబడడం విశేషమట.

రెండు లింగాలు గల ,ఈ దేవాలయ గర్భగుడిలో మొదట "విశ్వలింగాన్ని" తదుపరి "సైకత" లింగాన్ని, పూజించి తరించుమీశ్వరీ ॥

[11/30, 20:36] +91 94405 30763:
 *పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....

నేటి *పంచపది* 27
తేదీ:30.11.21
అంశం *శ్రీరామేశ్వర జ్యోతిర్లింగము-9*

ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు

ద్వితీయ బహుమతి *పంచపది విశిష్ట*
అక్కి నర్సింహులు గౌడు గారు

తృతీయ బహుమతి *పంచపది వరిష్ట*
కందూరు చంద్రప్రకాష్ గుప్తా గారు


*నేటి పంచపది* విజేతలందరికి అభినందనలు.
💐💐💐💐💐

నేటి *పంచపది* 
తేదీ:21.11.21
అంశం *సింధు పుష్కరాలు*

ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు


పంచపది.
అంశము : కార్తీకమాసము.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

1.
కృత్తికా తారతో కలసేను చంద్రుడు 
కురిపించె బంగారు వెన్నాలల సొగసులు
కార్తీక పౌర్ణమిది కడు దివ్య మాసమిది 
భవహరుని పుాజింప  భక్తి భావముతోడ
 ఆర్తితో  చేయండె అర్చనలు చెలులు ॥
2.
హరి హరుల కిష్టము కార్తీక మాసము
ఇరువురుని పుాజింప జన్మ పావనము.
ఆకాశ మందున వేదఘోషలు వినరె 
సురులు కొలిచెడు దివ్య పాదాలు గనరె॥
తొలిపొద్దు పొడిచేను తొందరగ లేవరే‍ ॥
3.
ధార్మిక యొాచనల ధర్మ చింతనతోడ
ఉపవాస దీక్షల ఉత్తమౌ వ్రతముల
ఏక భుక్తము జేసి  ఏకాంత సేవలిడి
వెలిగించి దీపాలు వేల్పులను వేడరే 
దీప దానము జేసి దివ్య ఫలమందరే॥
4.
కార్తీక మాసములో భగవదారాధనలు
హరి హర పుత్రుడౌ అయ్యప్ప దీక్షలు .
సకల పాప హర శివాభిషేకాలు.
దేదీప్య మానమౌ ఆకాశ దీపాలు
కడు పుణ్య కార్యాల వ్రత దీక్షలీశ్వరీ..॥
5.
గ్రహ దోషములు పోవ నవగ్రహ  పుాజలు
ఈతి బాధలు తొలగ ఈశ్వరార్చనలు.
అర్ధనారీశునకు బిల్వదళార్పణలు.
ప్రదోష కాలమున ప్రభు లింగ పుాజలు.
స్వర్గసీమల నేల వ్రతములివి ఈశ్వరీ ॥
6.
కార్తీక మాసాన హరియె  దామొాదరుడు.
తులసీ మాలలు ప్రీతి గల విష్ణు  దేముడు.
తులసి చెంతనె చేయ హరికి శుభ పుాజలు.
 సుందరుడు శ్రీకరుడు ఇచ్చు శుభ ఫలములు.
 మనసార హరిహరుల పుాజించు ఈశ్వరీ..॥
 7.
కార్తీక మాసము కడు పుణ్య మాసము.
మంత్ర దీక్షలు గొన  ఘన  మైన మాసము .
నదుల లో స్నానాలు ఆచరించిన శుభము.
ఆయురారోగ్యాలు కలిగించు సత్యము.
గౌరి పుాజలు జేయ సౌభాగ్య మీశ్వరీ ॥


నేటి *పంచపది* 29
తేదీ:2.12.21
అంశం: *శ్రీవిశ్వేశ్వర జ్యోతిర్లింగం-11*
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 ఐదుక్రోసుల విస్తారం గల సంపూర్ణ జలరాశిని శివుడు తన త్రిశూలంతో బంధించిన స్థలం.
 
 మణికర్ణిక పేరుగల ఆ  జలరాసిలో శ్రీమహావిష్ణువు  సతీసమేతంగా నిదురించిన క్షేత్రం .
 
సకల చరాచర సృష్టిని  రచించిన బ్రహ్మ, శివుని ఆజ్ఞతో 
శ్రీ మహావిష్ణువు నాభినుంచి జన్మించిన స్థలం.

బ్రహ్మ, విష్ణు పరమేశ్వరుల ద్వారా శాసించబడే ఈ నగరంలో దేవతలు కూడా శివకేశవుల దర్శనం కోరుకునే  పవిత్ర కాశీ పుణ్య క్షేత్రం .

మొాక్షప్రదాయినియైన కాశీ క్షేత్రం లోఅన్నపుార్ణ సమేతుడైన శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించి
తరించుమీశ్వరీ ॥
***************************************
*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....
నేటి *పంచపది* 29
తేదీ:02.12.21
అంశం *శ్రీవిశ్వేశ్వర జ్యోతిర్లింగము-10*
ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*
Y.శ్రీదేవి గారు
ద్వితీయ బహుమతి *పంచపది విశిష్ట*
భవాని కృష్ణమూర్తి గారు

తృతీయ బహుమతి *పంచపది వరిష్ట*
పుల్లభట్ల జగదీశ్వరీ మూర్తి గారు

*నేటి పంచపది* విజేతలందరికి అభినందనలు.
💐💐💐💐💐 **********************************

5/12/2021

పంచపదిలో
అంశం : ఘంటశాల.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

కంఠం లో నవరసాలుా పలికించగల గాన గంధర్వుడు.

అందలాలకు చేరుకొన్నా  అహంకారానికి
లోనవనివాడు.

ప్రతి ఒక్కరి గొంతుా తానై పాటలకు ప్రాణంపొిసినవాడు.

సంస్కృుత భగవద్గీత ను అచ్చ తెలుగులో పాడి
చరిత్రలో స్థిరంగా నిలచిపోయినవాడు.

చలన చిత్ర సీమలో గాత్రమంటే ఘంటశాలదే అన్నంతగా శ్రోతల మదిలో నిలచిపోయాడు ఈశ్వరీ ॥

[12/5, 20:32]
+91 94405 30763:
+*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....

నేటి *పంచపది* 32
తేదీ:05.12.21
అంశం *ఘంటసాల*

ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*
EVVS వర ప్రసాద్ గారు

ద్వితీయ బహుమతి *పంచపది విశిష్ట*
అక్కి నర్సింలు గౌడు గారు

తృతీయ బహుమతి *పంచపది వరిష్ట*
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు.

*నేటి పంచపది* విజేతలందరికి అభినందనలు.
💐💐💐💐💐

****************************************

పంచపదిలో...
అంశం : మహా నటి సావిత్రి.

వలపు మాటల మొావి  వాలు కన్నుల దోయి .

 నలువురిని మెప్పించే నటన కౌశల మొాయి.
 
 సావిత్రి సినిమాలు సందడించిన వోయి---
 
 శశి వదని  అందాలె సిరి వెన్నెలల రేయి.
 
చిత్ర సీమ "మహానటి" సావిత్రే గద టోయి ఈశ్వరీ।

Sunday, November 21, 2021

పంచపది.అంశం : సింధు పుష్కరాలు.(రోజువారి అంశాలు)


ప్రతీ రోజు కొకటిగా  ఇస్తున్న అంశములు

[11/21, 16:28] p3: నేటి *పంచపది* 18
తేదీ:21.11.21
అంశం:*సింధు పుష్కరాలు*
పేరు:
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కైలాశ పర్వతోద్భవ మానస సరోవరము.
నారాయణభాగ్ నదీ జలాలతో సంగమము.
కుంభరాశిలోకి  గురు.బృహస్పతి ప్రవేశము .
ఏటేటా జరిగే పవిత్ర  సీంధునదీ పుష్కరము.
పవిత్ర  పుష్కర స్నానానంతరం  దాన ధర్మాలు 
ఉత్తమంబీశ్వరీ.

ప్రక్రియ : పంచపది. అంశం : కార్తీకమాసము

[11/21, 08:35] +91 94405 30763: 20/11/2021.
పంచపది.
అంశము : కార్తీకమాసము.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

1.
కృత్తకా తారతో చంద్రుడు కాలుస్తాడు
బంగరు వెన్నెల సొగసులు కురిపిస్తాడు
కార్తీక పౌర్ణమికి దివ్యంగా వెలుగుతాడు
భవహరుని భక్తిభావంతో పూజింపుడు
ఆర్తితో అర్చనలు చేయండి జగదీశ్వరీ!
2.
హరి హరుల కిష్టము కార్తీక మాసము
ఇరువురుని పుాజింప జన్మ పావనము.
వేదఘోషలతో మారుమ్రోగె ఆకాశము
గనరే సురులు కొలుచు దివ్య పాదము 
తొలిపొద్దు పొడిచె లేవరే‍ జగదీశ్వరీ!
3.
ధార్మిక యొాచనల ధర్మ చింతనతోడ
ఉపవాస దీక్షల ఉత్తమౌ వ్రతముతోడ
ఏక భుక్తము జేసేటి ఏకాంతముతోడ
దీప దానము జేసి దివ్య ఫలముతోడ దీపాలు వెలిగించి వేడరే జగదీశ్వరీ!
[11/21, 18:42] p3: 21/11/2021.
పంచపది
అంశం: కార్తీకమాసము.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
4.
కార్తీక మాసములో భగవదారాధనలు
హరి హర పుత్రుడౌ అయ్యప్ప దీక్షలు .
సకల పాప హర శివాభిషేకాలు.
దేదీప్య మానమౌ ఆకాశ దీపాలు
కడు పుణ్య కార్యాల వ్రత దీక్షలీశ్వరీ..॥
5.
గ్రహ దోషములు పోవ నవగ్రహ  పుాజలు
ఈతి బాధలు తొలగ ఈశ్వరార్చనలు.
అర్ధనారీశునకు బిల్వదళార్పణలు.
ప్రదోష కాలమున ప్రభు లింగ పుాజలు.
స్వర్గసీమల నేల వ్రతములివి ఈశ్వరీ ॥
6.
కార్తీక మాసాన హరియె  దామొాదరుడు.
తులసీ మాలలు ప్రీతి గల విష్ణు  దేముడు.
తులసి చెంతనె చేయ హరికి శుభ పుాజలు.
 సుందరుడు శ్రీకరుడు ఇచ్చు శుభ ఫలములు.
 మనసార హరిహరుల పుాజించు ఈశ్వరీ..॥
 7.
కార్తీక మాసము కడు పుణ్య మాసము.
మంత్ర దీక్షలు గొన  ఘన  మైన మాసము .
నదుల లో స్నానాలు ఆచరించిన శుభము.
ఆయురారోగ్యాలు కలిగించు సత్యము.
గౌరి పుాజలు జేయ సౌభాగ్య మీశ్వరీ ॥

Friday, November 19, 2021

మహతీ సాహితీ కవితలు

[11/16, 16:39] p3: 16/11/2021.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : కణ్వ మహర్షి .
శీర్షిక : భరత వంశ చరిత.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

మ.సా.క.సం. 19.
కవిత సంఖ్య : 2.
1.
ఘోరుడను ఋషిపుత్రుడు ఘోర తపోధనుడుా
ఘన నిష్టాపరుడుా గౌరవ ఋషి కణ్వుడు .
కణ్వ స్మృుతి కర్తగా కణ్వ ధర్మ శాస్తగా..
ప్రాముఖ్యత పొందెనుా  ప్రాశస్త్యము నొందెను॥
2.
వేద మంత్ర ద్రష్ట- రు  గ్వేదమంత్ర  పుాజ్యుగా
చతుర్వేదమందున   చర్చ కణ్వ ప్రార్ధన .
విశ్వమిత్రు జేరెను    విధి పుత్రి శకుంతల
కణ్వుాశ్రమ మందున కడు ముద్దుగ పెరిగెను ॥
3
గాడమైన యొాగము గాంధర్వ  వివాహము  
జరిగె శకుంతలకుా జక్కగ దుష్యంతుతొ॥
దురదృష్టపు సమయము దుార్వాసును శాపము 
దుఃఖిత శకుంతలను దుష్యంతుడు మరచెను॥ 
  4 .
 శాపమొాచనాయెను శాకుంతల మురిసెను
 దుర్దినములు పోయెను దుష్యంతుడు పిలిచెను ॥
 ఇరువురి ఆనందము ఇలను ఏల రాజ్యము
 బహు గుణ భుాషణుడౌ భరతుడు జన్మించెను ॥ 
 5
యాత్ర జేయ కణ్వుడు  యాదవ పురమేగెను 
సరసమాడు యాదవులు  శాపముకు గురాయెను
కణ్వుడిడిన శాపము కాదుగ  నిష్ఫలముా ॥
ముసలము జన్మించెను   ముప్పుగనదె మారెను ॥
6
యాదవులు నశించెను  యవని బోసిపోయెను
శ్రీ కృష్ణుని జన్మము  శీఘ్రమిలను ముగిసెను ॥
కణ్వ వృత్తాంతముా  గనినట్టే చదివెను
జగదీశ్వరి మురిసెను  జగమునకెరిగించెను ॥.
[11/17, 18:43] p3: 17/11/2021.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : ఐచ్ఛికం.
మ.సా.క.సం. 19.
కవిత సంఖ్య : 2.
ప్రక్రియ : కంద పద్యములు .
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

నారా యణనీ  నామము
నోరారగ  జపము జేతు నోముగ నెపుడున్
పారాయణ జేతు జనో-

ద్ధారా నను బ్రోవవేర  ధరశుభ చరణా ॥

శ్రీపతి నీవని వేడితి
ఆపదలను  బాపరావ ఆపద్బాంధా
పాపములను  శమియించవె
దీపము వలె వెలుగు జుాపు దీనోద్ధరణా ॥

నారాయణ నీ మంత్రము
పారాయణ జేయు వారు పావను లౌచున్
దారా సుతులను విడి,మన-
సారా నినుకొలి చెపాద సన్నిధి జేరన్ ॥
[11/18, 14:36] p3: మహతీ సాహితీ కవి సంగమం.
18/11/2021. గురువారం.
అంశం :కార్తీక పుార్ణిమ .
మ.సా.క.సం. : 19.
కవిత సంఖ్య  : 3.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
ప్రక్రియ : ఇష్టపది .


కార్తీక మాసముా ఘన శుక్ల పక్షముా
పున్నమి తిధి దినముా పుార్ణ చంద్రోదయము॥

హరి హరులకిద్దరికి అది ప్రీతి మాసముా
పురాణ ప్రాశస్త్యము పుాజ్య ఋషుల విదితము ॥

హరి హరుల నామము హర్షమునజపించుచు
మునులు జనులు వారిని ముదముగ పుాజింతురు॥

నెల రోజుల పుాజలు నెలకొను పుణ్యములు
శుభ కృత్యముల ఫలము  శుద్ధమౌను మనసులు॥

వ్రతములు పుాజలకును  ప్రాశస్త్యము పౌర్ణమి
ఇద్దినమున పుాజలు  ఇచ్చును శుభ ఫలములు ॥

శివాలయమునందును శివార్చనలు జరుగును
మహాన్యాసపుార్వక మంత్రాభిషేకములు॥

ఋత్వికులు చేసెదరు ఋద్రాభిషేకములు 
సహస్ర లింగార్చన సకల సిద్ధి సాధన ॥

లభియించు మనుజులకు లయకారుని వరములు
కోటి జన్మ ఫలములు కోరు సిరి సంపదలు ॥

కార్తీకపురాణము కడు భక్తితొ  చదువుము
పసుపు కుంకాల పుాజ పడతులకానందము  ॥

నదులందు స్నానము నమ్మికతో చేయుచు
హరిహరులను తలచిన హరియించును పాపము ॥ 

దివ్య కార్తీకముా  దీపారాధనముా
తులసికోట ఎదురుగ తృప్తి గ వెలిగింతురు ॥

అఖండ దీపాలుా ఆకాశ దీపాలు
అరటి దొన్నెలో ధీప ఆరాధన జేతురు.॥

విషవాయు శుద్ధగును విషజ్వరములు తగ్గును
కాలుష్యము తగ్గును కలుగునారోగ్యముా ॥

త్రిపురాసురులగుాల్చ  త్రిపుర పుార్ణిమనాడు
హరుడందరి శక్తితో     అసురులనిల గుాల్చెను ॥

అందరికానందము  హరిహరుల ధ్యానముా
ఆనంద దీపమే ఆనందా దీపము ॥

ఈ నెల కార్తీకము ఈశ్వరి సేవించెను
ఈశ్వరి పుాజలుగొని ఈశుడె దీవించెను ॥

ఈ ఇష్టపది , నా స్వీయ రచన.

Wednesday, November 17, 2021

కందపద్యాలు

17/11/2021.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : ఐచ్ఛికం.
మ.సా.క.సం. 19.
కవిత సంఖ్య : 2.
ప్రక్రియ : కంద పద్యములు .
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

నారా యణనీ  నామము
నోరారగ  జపము జేతు నోముగ నెపుడున్
పారాయణ జేతు జనో-

ద్ధారా నను బ్రోవవేర  ధరశుభ చరణా ॥

శ్రీపతి నీవని వేడితి
ఆపదలను  బాపరావ ఆపద్బాంధా
పాపములను  శమియించవె
దీపము వలె వెలుగు జుాపు దీనోద్ధరణా ॥

నారాయణ నీ మంత్రము
పారాయణ జేయు వారు పావను లౌచున్
దారా సుతులను విడి,మన-
సారా నినుకొలి చెపాద సన్నిధి జేరన్ ॥

Monday, November 15, 2021

దాశరధీ క్రిష్ణ మాచార్యులు.

6/11/2021.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
అంశం : దాశరథీ కృష్ణమాచార్యులు 
శీర్షిక : ప్రజాకోటి.

166.
నిజాం పాలకుల నిరసనతో
కలాయుధంతో కఠినమైన ఉద్యమం 
పద్య విన్యాసాలతో  పదపోరాటం .
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
167.
తెలంగాణ విముక్తికై  ఆరాటం.
తెలంగాణ రతనాల వీణంటుా.
ప్రేరణిచ్చిన స్ఫుార్తికి  నిదర్శనం . 
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
168.
సముద్ర  గర్భంలో  బడబానలం  
సాయుధ రైతాంగ పోరాటానికి
ఎలుగెత్తిన దాసరధీ కలం 
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
169.
నీలాకాశంలో కానరాని భాస్కరులు
గాయపడిన కవి గుండెలలో 
రాయబడని కావ్యాలన్న క్రిష్ణమాచార్యులు
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
170.
నా పేరు ప్రజాకోటి -
నా ఊరు ప్రజావాటన్న
తెలంగాణ తెలుగుబిడ్డ దాశరధి 
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

హామీ: పై సున్నితాలు నా స్వీయ రచనలు.


*****************************
6/11/2021

అంశం : దాశరధి క్రిష్ణమాచార్యులు

ప్రక్రియ : సున్నితం.

శీర్షిక :దాశరధీమాట దిశమార్చిన  బాట .

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

రుద్రవీణ   మ్రొాగించిన అగ్నిధారలో
ధ్వజమెత్తిన కవితా పుష్పకం
కవితోద్యమాలకు సాహిత్య పురస్కారం
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

మార్పు  తీర్పుతో రచనలు-
రాష్ట్ర, కేంద్ర  అకాడమీలలో 
గెలుచుకున్న సాహిత్య  బహుమతులు
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

నాజీలను మించిన నైజామొాడికి….
గోల్కొండ ఖిల్లా కింద 
గోరీ కట్టిన కలం
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

మాపు  కురిసిన మంచులోన
గప్పుమని  క్రమ్మిన నిప్పుమంటలనే .
దాశరధీమాట దిశమార్చిన  బాట 
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

సాహిత్య అకాడమీల గ్రహీత
అభిమాన  సినీ  గేయరచయిత
దాశరధి కవితోద్యమాల తోట
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

నిన్ను గెలవలేక రైతన్నా……
నిజాం కూలింది కూలన్నంటుా
విడచెను  తుది శ్వాశ
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

************

ఆగని ఆరంభం

10/11/2021.
గోదావరీ తచయితల సంఘంలో
చిత్రకవిత 
శీర్షిక : ఆగని ఆరంభం.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..


మానవ మేధో మధనం, 
మంది , ప్రదుాషణం .
నిత్య జీవిత సారం , 
రోగాలకు  నిలయం.
హరిత వర్ణం అరుణ
వర్ణంలోకి మారిన వైనం .
జాతి మత బేధాల
మారణ హోమాలకు సాక్ష్యం .॥
పచ్చని ప్రకృతి శోభలు
 కమిలి నల్ల బారుతున్న సమయం.
 ఆశా జ్యోతుల ప్రకాశంతో
 అలరిన  పసిడి  కిరణాలు.
 శుభోదయపు స్ఫుార్తి నిచ్చే 
 పసిడి భరణాలు.॥
 మారని కాలానికి  
 మార్పులు తేవొద్దంటుా
 మాయా జగతిలొ మానవుని 
 వికృతి చేష్టలకు విలపిస్తున్న
 భుామాత కన్నీళ్ళను
 కావలించుకుంటున్న సంద్రం-
 ఇస్తున్న సలిల ఓదార్పుకు ,
 సాక్షిగా నిలచిన హరిత 
 వర్ణపు  ఆకుపచ్చ తివాచీ...
 ఆశా జగతిలో ఆగని ఆరంభంలా....
 
 

 

అర్జునుడు.

మహతీ సాహితీ కవి సంగమం
మ.సా.క.సం.19
కవిత సంఖ్య 3.
11/11/2021
అంశం: పాండవ మధ్యముడు.
ప్రక్రియ: ఇష్టపది .
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

దేవేంద్ర నందనుడు  దేవి కుంతీ సుతుడు
పాండవుల మధ్యముడు పరమాత్ము సఖుడితడు॥
బహు బలుడు,తేజుండు బాణాస్త్రధారుండు
సాత్యకీ సఖుడితడు  సరి సవ్యసాచితడు ॥

అందమైన వానిగ ఆరోగ్యవంతునిగ 
పాండవుల అనుజునిగ పతి అతడు ద్రౌపదికి ॥
విలువిద్య ఘనునకుా వినయశీలులు సతులు.
శుభద్ర , చిత్రాంగద  శుభము లొసగెడువారు .॥

అజ్ఞాత వాసాన అతడేగ బృహన్నల
మహా భారత కధకు మహిని కీలకు డితడు
అరణ్య వాసమునదె  ఆచరించీ తపము
పరమేశు మెప్పించి పాశుపతాస్త్రమొందె ॥

కర్తవ్య నిష్ట నిడు కార్యసాధకుడితడు
కడు బంధు ప్రీతి నిడు కరుణ గల్గిన నరుడు.
సంగ్రామ సమయాన సరి బంధువుల జుాచి
తనవారి జంపుటది  తగదు తగదన్నాడు ॥

భగవంతుడు కృష్ణుడు  భామదె వహియించి
సారధిగ నిలిచేను సరి బోధ జేసేను
నాటి భగవద్గీత నేటికిల సుాక్తిగా 
జ్ఞాన మార్గము గుాపు జ్ఞాన నిధి యైనదిగ॥

ఆది భగవద్గీత  కర్జునుడు  కారకుడు . 
సార తత్త్వము దెల్పు  సామి శ్రీకృష్ణుడుా
గీత యొక్కటి చాలు గీర్వాణ ఫలమదే
వినుము ఈశ్వరి మాట  వివరమెరుగగ ఇలను॥
 
  





Monday, November 8, 2021

బాల...బేల..

బాల భారతం 

శీర్షిక : వినుమ మాట.

చిట్టి పొట్టి బాల చిన్నారి సిరిబాల
చిందు లేసె జుాడు చింద నగవు
అన్య మెరుగ రేమి అమ్మ ఒడినిచేర
అమ్మె  లోకమాయె, ఆటె బ్రతుకు ॥

అడు కున్న వయసు ఆటపాటలె సున్న 
బతుకు పుస్త కాల  బరువు మిన్న
ముద్దు మాట పోయె ముాలబడె మురిపాలు
 బుడత వయసు బుద్ధి బురద గుంట ॥
 
చెడెను బ్రతుకు బాట చరవాణి చేగొన 
విద్య ముాల బడెను  విడిచె సిగ్గు
పలుక రాని మాట  పతనమౌ నదిబాట
వినరు చెప్పిన మాట వింత నడత ॥

బ్రతుకు భవిత నెంచ  భారమ్మ దేగాద 
వినరె గురువు మాట విశ్వ మెరుగ.
తల్లిదండ్రు లెగద తగు బోధనలు జేయు
మార్గదర్శకులిల  మనరె మాట  ॥


.రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
8097622021.

హామీ:
నా ఈ రచన ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని
నా స్వీయ రచన

Saturday, November 6, 2021

దాశరథీ కృష్ణమాచార్యులు

6/11/2021.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
అంశం : దాశరథీ కృష్ణమాచార్యులు 
శీర్షిక : ప్రజాకోటి.

166.
నిజాం పాలకుల నిరసనతో
కలాయుధంతో కఠినమైన ఉద్యమం 
పద్య విన్యాసాలతో  పదపోరాటం .
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
167.
తెలంగాణ విముక్తికై  ఆరాటం.
తెలంగాణ రతనాల వీణంటుా.
ప్రేరణిచ్చిన స్ఫుార్తికి  నిదర్శనం . 
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
168.
సముద్ర  గర్భంలో  బడబానలం  
సాయుధ రైతాంగ పోరాటానికి
ఎలుగెత్తిన దాసరధీ కలం 
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
169.
నీలాకాశంలో కానరాని భాస్కరులు
గాయపడిన కవి గుండెలలో 
రాయబడని కావ్యాలన్న క్రిష్ణమాచార్యులు
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥
170.
నా పేరు ప్రజాకోటి -
నా ఊరు ప్రజావాటన్న
తెలంగాణ తెలుగుబిడ్డ దాశరధి 
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

హామీ: పై సున్నితాలు నా స్వీయ రచనలు.


*****************************




రుద్రవీణ   మ్రొాగించిన అగ్నిధారలో
ధ్వజమెత్తిన కవితా పుష్పకం
కవితోద్యమాలకు సాహిత్య పురస్కారం
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

మార్పు  తీర్పుతో రచనలు-
రాష్ట్ర, కేంద్ర  అకాడమీలలో 
గెలుచుకున్న సాహిత్య  బహుమతులు
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

నాజీలను మించిన నైజామొాడికి….
గోల్కొండ ఖిల్లా కింద 
గోరీ కట్టిన కలం
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

మాపు  కురిసిన మంచులోన
గప్పుమని   క్రమ్మిన  నిప్పుమంటలు .
దాశరధీమాట దిశమార్చిన  బాట 
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

సాహిత్య అకాడమీల గ్రహీత
అభిమాన  సినీ  గేయరచయిత
దాశరధి కవితోద్యమాల పద్యపిత
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

నిన్ను గెలవలేక రైతన్నా……
నిజాం కూలింది కూలన్నంటుా
విడచిన  తుది శ్వాశ
చుాడచక్కని  తెలుగు సున్నితంబు ॥

************