Saturday, January 29, 2022

జణ మరణ వలయం

28/01/2022.
మహతీ సాహితీ కవిసంగమం.
అంశం : ఐచ్ఛికం.

మ.సా.క.సం.19.
కవిత సంఖ్య : 2.


శీర్షిక  : జనన మరణ వలయం.
(గీత రచన ).

రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర.

పల్లవి:

జన్మించుటెప్పుడో మరణించు టెప్పుడో
తెలియని విధిరాతిదనీ  తెలిసేది ఎన్నడో..

అనుపల్లవి:

ఈ పుడమిలో జన్మ   ప్రేమ నిండు సారమా
సుఖ దుఖః నావలో నడిసంద్ర ప్రయాణమా ॥

1.చరణం.

జీవితం తిరుగాడు వలయం  
నీ.. నా.. కధల రుాపం
మనసే జ్ఞాన దీపం  
నింపావహంకార తిమిరం 
ఒడుదుడుకుల బాటలో సాగించీ గమనం 
ఆశయాలె బాటలో కోల్పోయిన తరుణం 
పోయినదంతా వెనుకకు మరలీ రాదుా
మిగిలినదాంతో నీకు  తృప్తిరాదుా ॥

2.చరణం.

ఎంతెత్తు కెదిగినా   నడిచేది నేలపై...
కన్నవారు లేనిదే కానరావు భువిపై
నా అన్నవారుండరు, నీతోడై పాడెపై
నడిమంత్రపు సిరిరాదు,నిను గుాడి చితిపై
చావు పుటకలకు మధ్యన, క్షణమైన జీవితం
నీ నా...తేడాల మధ్య చితికిపోవు నిత్యం
తెలుసుకొనీ మసలుకో అదె జీవిత సత్యం ॥

3.చరణం.

స్వార్ధమెంచి  దుారమవకు  అందరికీ మిత్రమా
బ్రతుకు దశల మార్పు తోడు, మనిషికి మనిషేసుమా.
 ప్రాణమెగిరిపోయినా  కదలదు నీకాయము
 ఓనలుగురి సాయమే   కాటిజేర్చు సాధనము.
 ఐదడుగుల మట్టి గొయ్యి నీ జీవిత కాల ధనము
 తుదకు మట్టిలోనె కలియుటదె బ్రతుకు రహస్యము ॥

*******************************

Friday, January 21, 2022

సహనం కధానిక

[12/27/2020, 21:04] p3: 27/12/2020
వారం వారం గోరసం వారి కధానిక శీర్షిక పోటీ కొరకు..
అంశం : సహనం.
శీర్షిక : ఇల్లాలు.

అమ్మ  రోజుా పొద్దున్నే లేచి  ఆదరా బాదరా పరుగెత్తుతున్నట్టే  పని చేసేది. నన్ను తమ్ముడిని  స్కుాల్ కు తయారు చేసేందుకు , నాన్నకు, చిన్నాన్నలకు భోజనానికై కేరేజీలు కట్టేందుకు...
నానమ్మ పుాజకు నైవేద్యం కోసం ప్రసాదం చేసిచ్చేది .
అత్తయ్యలకోసం కాఫీ ఫ్లాస్క్ లో పొిసి ఉంచేది. 
అటు తర్వాత మా స్కుాల్ బేగ్ లు తను మొాస్తుా 
మమ్మల్ని స్కుాలుకు తీసుకు వెళ్లేది. 
మధ్యలో మార్కెట్ కు వెళ్ళి రోజుా కావలసిన కుారలు సామానులు తీసుకు వచ్చేది .తిరిగి సాయంత్రం మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లకడానికని స్కుాల్ కు వచ్చేది. అటుపై మళ్ళీ పరుగులే ..మాకు టిఫిన్ పెట్టి, రాత్రి వంట చేసి , మా ఇద్దరి చేత హోమ్ వర్క్ చేయించి రాత్రి భోజనాలయ్యేక గిన్నెలన్నీ తోమి , తిరిగి పొద్దున్న మాకోసం చేయవలసిన టిఫెన్స్ కోసం అన్నీ రెడీ గా పెట్టుకొనేది. పనమ్మాయిని పెట్టుకొమ్మని అంటే ..మీ ఇద్దరుా బాగా చదువుకొని పెద్ద ఉద్యాగాలు చేస్తే అప్పుడు హాయిగా పనమ్మాయిని పెట్టుకుంటాననేది.
ఆపై మా స్కుాలు యుానిఫామ్స్ ఇస్త్రీ చేసి పెట్టేది.
పడుకోడానికే రాత్రి పదకొండు దాటేది. ఆది వారాలు అమ్మ పడే కష్టం అంతా ఇంతా కాదు. రోజుా తెల్లారి నాలుగుకే లేచే అమ్మ ఇల్లంతా సుభ్రం చేసి , వాకిలి తుడిచి ముగ్గు పెట్టడం తో మొదలైన దిన చర్య...
రాత్రి పదకొండు దాకా సాగేది. అంత పని చేస్తున్నా ముఖంలో అలసటని మరపించే చిరునవ్వు పులుముకొని , మా అల్లరిని భరిస్తుా...
నాన్న విసుగును సమర్ధుస్తుా , నానమ్మ సాధింపుకు తలవంచుతుా..ఎంతో సహనంతో ఇంటి పనులు చేసుకుపోతున్న అమ్మని చుాస్తుా ఉంటే నాకు ఆశ్ఛర్యం వేసేది 
కొవ్వొత్తిలా కరిగిపోతున్న అమ్మ విలువ నా పెళ్ళి అయ్యేదాక దాక నాకు తెలియనే లేదు. అన్నీ అమ్మని అడిగి చేయించుకొనే నేను ఒక్క రోజు కుాడా అమ్మకు చేతి సాయాన్ని అందించ లేదు. కనీసం బయట పనైనా చేసేవాడిని కాదు.  పైగా అమ్మ నేను అడిగింది చేయలేదని విసుక్కునే వాడిని.  అలిగే వాడిని  ..తమ్మడు మరో రకంగా అల్లరి...అన్నీ ఆనందంగా భరిస్తుా బండెడు చాకిరీని చేస్తున్న అమ్మ నాకు నా ఇల్లాలిలో కనిపించేది..  సహనానికి మారు  పేరైన ఇల్లాలు. తన ఊరు పేరుా మారినా , తన పనితనం, సహనంతో మరో ఇంటికి దీపమై వెలుగు నింపుతున్న నిస్వార్ధ  కర్మచారిణి కదుా ఇల్లాలు.
ఒక ఇంట్లో పుట్టి వేరొకరింటిని మెట్టి అక్కడివారందరినీ తనవారిగా భావించి , నేను నా ఇల్లు , నా పిల్లలు, నా పరివారం, అన్న  అంకిత భావంతో
ఎంతో ఆనందంగా తనని తాను అర్పించుకున్న ఒక ఇల్లాలిని మించిన సహన శీలి వేరెవరుంటారు...?



రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
[12/29/2020, 20:02] +91 99084 50790: *గోరసం వారి వారం వారం కథానిక శీర్షిక పోటీ ఫలిరాలు*
*(పోటీ జరిగిన తేదీ: 27-12-2020)*

1. శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి - ముంబయ్ (ప్రధమ స్థానం)
2. డా.. వేదాల గాయత్రీదేవి - విశాఖపట్నం (ద్వితీయ స్థానం)
3. శ్రీమతి పోతేపల్లి విజయలక్ష్మి - హైదరాబాద్ (ద్వితీయ స్థానం)
4. శ్రీమతి కె.శైలజ శ్రీనివాస్ - విజయవాడ (తృతీయ స్థానం)
5. శ్రీమతి వి. సంధ్యారాణి - నిర్మల్ (తృతీయ స్థానం)
6. శ్రీమతి మంజీతకుమార్ బందెల - బెంగళూరు (తృతీయ స్థానం)
7. శ్రీమతి కొమ్ము సాగరిక - మంచిర్యాల (ప్రోత్సాహక స్థానం)
8. శ్రీమతి ఎం.వి.ఉమాదేవి - నెల్లూరు (ప్రోత్సాహక స్థానం)
9. శ్రీమతి దేవలపల్లి సునందరెడ్డి - రంగారెడ్డి (ప్రోత్సాహక స్థానం)
10. శ్రీమతి ఎం.టి.స్వర్ణలత - మంచిర్యాల (ప్రోత్సాహక స్థానం)
11. శ్రీమతి మంజులా శ్రీనివాస్ - హైదరాబాద్ (ప్రోత్సాహక స్థానం)
12. శ్రీమతి రెడ్డి పద్మావతి - పార్వతీపురం (ప్రోత్సాహక స్థానం)
13. శ్రీమతి బోర భారతీదేవి - విశాఖపట్నం (ప్రోత్సాహక స్థానం)

*ఈవారం నిర్వహణ*
శ్రీ కంచుమారికి చిన్నారావు
కవి - ఉపాధ్యాయుడు
విశాఖపట్నం.

నల-దమయంతుల కధ

మహా భారత కథలో ఉపకథగా ప్రత్యక్ష మవుతూ ఉండే కథలలో నల, దమయంతుల కథ ఒకటి. భారతీయ సం స్కృతీ సంప్రదాయాలకూ, విలువలూ, ధర్మాలకూ అద్ధం పట్టే కథ

**మహతీ సాహితీ కవిసంగమం- కరీంనగరం*
అంశము: *నలదమయంతి*
తేదీ: *20-01-2022-గురువారం*

శీర్షిక: *నల దమయంతుల కధ
ప్రక్రియ: *ఇష్టపది*

రచన: శ్రీమతి : జగదీశ్వరీముార్తి.:
కల్యాణ్: మహారాష్ట్ర

నిషాధా పుర రాజు  నిజ నామమదె నలుడు
గుర్రపుా స్వారీలొ గుణ నిపుణుడు ఆతడు ॥

విదర్భ పురి కుమారి విరిబోణి దమయంతి
పుత్రికగ భీమునికి  పుణ్యవతి గుణవతీ॥

స్వాగతమ్ములతోడ స్వయంవరము జరిగె
నలుని జుాచెను అతని నచ్చి  స్వీకరించెను.॥

పాక శాస్త్రములోన    బహు నిష్ణాతుడతడు.
పాక దర్పణమనెడు పాక పొత్తమురాసె.॥

పాచికల జుాదమదె   బలహీనమతనిదిగ.
మంచి గుణములె అతని మలచె ఘన కీర్తునిగ ॥

మంచి గుణములవాని మారు ముట్టగలేని
కలిపురుషుడదె వేచె కాటేయగను నలుని ॥

కలి పురుషుడాతనీ కలిసీయుండెడి వాడు.
ఖలుడు రాక్షసుడతడు కడు దుష్టుడాతడుా ॥

రుాపవతినామె గని రుస రుసనె రాక్షసుడు.
దంపతుల విడదీయ ధర్మ  మన్నది మరచె ॥

ఇరువురీ ప్రేమగని నిట్లు శపధముజేసె
విడదీయ వారినీ విశ్వ యత్నము జేసె .॥

పాతికేండ్లవె గడచె పట్టె శని దేవుడు.
సమయమిప్పుడు దొరకె సంతసమ్మదె పెరిగె ॥

చెడు స్నేహ ప్రభావము చెడిపె నలునది యపుడు
మంచి చెడులను మరచె  మారె మాయకు నలుడు॥

పురి గొల్పె పుష్కరుడు  పుార్తి జుాదమునాడ
ప్రేమతో సోదరుని పేర్మి కోర్కెను దీర్చె.॥

ఆడి పాచికలాట అతనోడె రాజ్యమును .
ఆదుకొను వారెవరు  అతని బాధను గనుము॥

దమయంతి జేకొనీ దారి నడవికి బోయె.
కలిప్రభావముతోడ  కరుణ యన్నది పొియె ॥

దమయంతినే మరచి దారి మళ్ళెను ఘనుడు.
కర్కోట నాగునీ కాపాడెగా నలుడు.॥

తగు సాయమును జేయ పాము కాటును వేసె
నాగు కాటుకు మారె  నలుడు మరుగుజ్జుాయె॥

నాగు చేసిన  పనికి నలుడతిగ వగచెగా
ఏమి చేయుదునంచు ఎలుగెత్తి  అడుగగా  ॥

మేలు జేయగనెంచి మేను మార్చితినంచు
మాయ వస్త్రము నిచ్చె మంచి రుాపమునొంద॥

రాజు రితుపర్ణుదరి  రక్షించు సేవకుగ
జేరె వంటవానిగ జేరె రధసారధిగ.॥

లేచె నట దమయంతి లేని నలు గమనించి
పిలిచె నదె ఆ ఇంతి నలుదెసల యెంచెంచి॥

విసిగి పోయెను రాణి వివరమెరుగని బోణి
నలుడు కానగ రాక  నలుదెసల వెదకె ఘని .॥

తరలిపోయెను తుదకు  తండ్రి భీముని  కడకు
ఉత్తమంబగునదియు నుపాయముగనె తుదకు ॥

పెండ్లి పిలుపు పత్రిక పంపెనదే దినముా
నలుని జాడనెరిగీ  పంపె వర్తమానము.॥

మారు వివాహమదియె మనసిజకునని యెరిగి.
నలుడు నలిగెను మదిని నా రమణి సత నెరిగి ।

వేగ రధమును తోలె  వే వేగ పోనెంచి.
మదిని చింతలేలగ మరియు వేగము పెంచి॥

తన లోన నున్న కలి  తన తప్పు తెలుసుకొని
మన్నింప కోరె  కలి  మన్నించె దయనుగొని ॥

అసలు రుాపము దాల్చె  నా సమయమే న
లుడు॥
అందగానిగ మారె  నంతలోనే ఘనుడు ॥

జేరి భీముని కడకు జేపట్టె  తన సతిని
పుష్కరుని  ఓడించె పుార్తి  బానిస గతిని॥

జయము లేలెను నలుడు జగతి రాజుగను మని
జేలు వేలను పలుక జనులతని వేడ్క గని ॥

సాంప్రదాయములేలు సద్ధర్మ ముల గాధ
వినువారు తరియింప వివరించు ఘన చరిత ॥

స్వశ్ఛ తేలగ మనుము స్వయముగా సిరు లేల.
విడుము చెడు బాటలను విందు గద జీవితము ॥

నలదమయంతి కధను నలువురికి తెలుప మది
ఈశ్వరియె కోరినది ఇష్టపది రాసినది.॥

*******************************::::








Thursday, January 20, 2022

శివోహం కవిత

*ప్రదన్య సాహితీవేదిక* 
*శివోహం* కవనపోటీ కోసం ,

శీర్షిక : శివోహం.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర


ఆదిబిక్షువు వయ్య   అణువణువు నీవయ్య 
ఆది మధ్యాంత రహిత  అంతయుా నీవయ్య
భవబంధ భయహరా ,  భస్మ లేపిత  రాయ
విశ్వంభర  విష కంధర హర గంగ జటాధరా  ॥
 
కార్చిచ్చు రేపేటి కాల కాలుడవీవు
ప్రణయ తాండవమాడు ప్రళయ రుద్రుడవీవు  పంచాక్షరీ మంత్ర పుాజ్య పరమాత్మవుా 
 ఫాల నేతృుడవీవు పంచ భుాతాత్మవు ॥
 
హరహరా శంకరా కర పాశ ధర ఈశ 
దినేశాది గాత్రా  శిరః చంద్ర ధాత్రా 
శృతి సార, గిరి సంత, హర శాస్త ,సుర వంద్య
పరే పాహి పరమేశ  ప్రభో పార్వతీశా  ॥

సభా దక్ష యజ్ఞావి నాశా  పరేశా  
సతీ అర్ధ గాత్రా ప్రభో తాండవేశ
శృతీ సార వంద్యా హరా భక్త బృంగా
కరుాణాంతరంగా  మహా జ్యోతి లింగా ॥
 
శవభస్మ లేపా భవా చింత్య రుాపా
శివా నాశ పాపా ధవా శక్తి తాప
హరా అర్ధనారీశ్వరా ఆర్కతేజేశ్వరా 
ధరాద్దురిత నాశా ప్రశాంత ప్రకాశా॥ 

శంకరాభయంకరా హరా సాధు మిత్రా 
ఘనోంకార గాత్రా సురేంద్రాది స్తోత్రా       
శుభా గిరిజానందా  సు గీష్పాదివంద్యా
భవాగమద్యుతీ  అక్షరాకృతీ  అమృత వాక్తేజా‍॥

శృతి గీత లయ సార నమొా నాట్య పాదా.
గతీ భువన పాలా  నమొా దివ్య తేజా
కటాక్షా వరాక్షా  కృపాక్షాభయేశా
జగన్నాటకాసుాత్ర కాలాంతకావేశ ॥


శబ్దబ్రహ్మ మయా సర్వాత్మా  
సకల భువన పాలా 
ఈశ్వరి వాగామృత సర్వేశా  
ఈప్సిత ఫల దాతా ॥

 ప్రభో రక్ష రక్షా విభో సుాత్ర దక్షా ॥
 శివోహం... శివోహం.... శివం శంకరం  ॥
 
 హామీ :  నేను రాసిన  ఈ " శివోహం" కవిత
ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన .

Wednesday, January 19, 2022

సంక్రమణం

అంశం :*జీవన సంక్రమణం*
*****************************
శీర్షిక : లక్ష్యపు కాంతులు
~~~~~~~~~~~~~~~~~~~

నిశిరాత్రిని చీల్చుకుంటూ
మెరుస్తున్న స్వార్ధపుముగ్గుల
రంగులన్నీ ఎలిసిపోయి
నవజీవన సంక్రమణానికి
స్వాగతిస్తున్నాయి
చుక్కల్ని కలిపే మాయారేఖల్లా.....

కాయకష్టం ఎక్కడైనా 
జన్మభూమివైపే చూసే
వెన్నెలచూపులు కాస్త మసకబారి
ఆస్పష్టపు అభిమానక్షేత్రాల
నటనలవైపు ఎదురిల్లుతున్నాయి
ఎండమావిలోదాగే నీళ్ళలా...

ప్రాచ్యపుకోరల్లో బంధింపడి
విష సంస్కృతిని అంటించుకున్న
నవతరపు సనాతనం కార్చిన
కన్నీటిఅలలు పొంగిపొర్లుతున్నాయి
ఆగని సుడిగుండపు వరదల్లా...

మొహంపై నవ్వులు పండించే రైతన్నకు
ఆశలతీరానికి చేరుతున్న వలసన్నకు
ఆప్యాయతల నీడకుచేరే అక్కచెల్లెలకు 
లక్ష్యపు కాంతులువిరిసే సప్తవర్ణాలకు
ఆహ్వానిస్తున్నాయి సంక్రాంతులు
శోభాయమానపు నవదీప్తుల్లా....
~~~~~~~~~~~~~~~~~~~~~~
మీసాల చినగౌరినాయుడు
గణితోపాధ్యాయులు
బొబ్బిలి,9492848564.
#######################

మనుమసిద్ధి కవన వేదిక పోటీల్లో టాప్ 10 లో నిలిచి,ద్వితీయ స్థానం లో నిలబడిన కవిత.....

పద్యం దత్తపది

మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితాపండుగే..
మ.సా.క.సం..19.
కవిత సంఖ్య : 5.

తేది: *15 -1- 2022 : శనివారము*
దత్తపది: *ముంగిలి-పొంగలి-రంగడు-అంగన*

రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర .

ప్రక్రియ : మత్తకోకిల .

ముంగి లంతయు రంగ వల్లులు
ముద్దు గుమ్మలు  వేయగా ..
పొంగలీ ఘన పాయ సాన్నము
పోలి బుారెలు వంటగా
అంగ రంగని వైభ వమ్మది
అల్లి మాలలు దండిగా
అంగ నాంగన లందరుా కలి-
సాది లక్ష్మి ని కొల్చెగా ॥

నిండె ముంగిలి ముగ్గు లేయగ
నిత్య సందడు లేలగా
వండె పొంగలి  పండ నోములు 
వారి జాక్షులు మేలుగా
వేడె రంగని పాడె గీతులు 
వేల వేల్పుల సాక్షిగా
ఆడె నంగన లంత వేడ్కగ 
హాయి భోగము నిండగా ॥

ప్రక్రియ: పద్యము *చంపకమాల.

*మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితా పండుగే*

తేది: *19-01-2022: బుధవారం*
అంశము: *ఐచ్ఛికము*
మ.సా.క.సం.: 19.
కవిత సంఖ్య : 1

ప్రక్రియ: పద్యము *చంపకమాల.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర.
.
1.
వనజభవాది వందితవు 
వాజ్మయి శ్రీకరి హంస వాహినీ.
ఘన వర  వీణ వాదిని,సు
గాన విలోలిని  నాద మొాదినీ ॥
కనక సుభుాష ణీశుభ-సు
కామిని  సుందరి  సుప్రకాశినీ ॥
మనసున చీకటేలినది
మాకిల దారిని జుాపు
శారదే ॥

2.
మనసున మెల్గు భావముల
మానినులెల్లరు మెల్గ జుాడగన్॥
గనుమయ గావ రాగదటె
కాలము మారెను కంటకమ్ముగా .॥
ధనమగు మాన ప్రాణములె
దగ్ధములాయెను  దైన్య  రీతిలో ॥
దినములె హీనమాయెనుగ
దీన జనావన  చక్రి బ్రోవగన్ ॥

Wednesday, January 12, 2022

చంపకమాల

12/01/2022.
మహతీ సాహితీ కవి సంగమం 
మ.సా.క.స.19.
కవిత సంఖ్య : 3
ప్రక్రియ : చంపకమాల.

రచన : 
శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర .

పద్య ప్రక్రియ : చంపకమాల.

పలికెద నీదు  కీర్తులను  ప్రాంజలి జేయుచు
నీకు మ్రొక్కుచున్ ॥

పలుకుల తల్లి  వాణి విధి పత్నివి నన్నిల బ్రోవ
రాగదే॥

కలిమల  హారిణీ  ఘన వికాశము లీయవె
నిన్ను    వేడగన్ ॥

చలమది  ఏలనే  సరసిజాక్షి  కళామయి            
 శ్రీ సరస్వతీ ॥

శీర్షిక:అందని ద్రాక్ష------రచన :--కిలపర్తి దాలినాయుడుగారు. --------------------------------

శీర్షిక:అందని ద్రాక్ష
---------------------------------------------
కడుపులో కాలుతున్న సూరీడు
మకరంలా పేగులు కొరుకుతున్నాడు
ఆశల వాకిట్లో కోరికలు రథం ముగ్గు
పొడవెంతో గణించడం కష్టమే!

కేదారాలు మోయాల్సిన రైతు రాజు
ఇసుక మూటలు మోస్తున్నారు!
హరికథలుగా  సేద్యాగానికి కథలను
గానం చేస్తున్న దినపత్రికలు!

మంటల్లోకి కట్టై భోగీలో బూడిదౌతున్న
నాగళ్ల శరీరాలు!
పాడి పేడ దొరకని గహన ప్రదేశం
పల్లైనప్పుడు
గొబెమ్మలకు ఆన్ లైన్లో గిరాకీ!


వలస పోయిన
సంక్రాంతి ఉత్తరాయణం లోనికి నెట్టినా
కర్షకుని బతుకు "ఉత్తకాగితమే!
కనుమరుగైన పశుగణం
మాయమైన కనుమ పండుగ!

మెతుకు అందనిద్రాక్షేమరి!
-------------------------------------------
*కిలపర్తి దాలినాయుడు- సాలూరు*
మనుమసిద్ధి సాహిత్యవేదిక
సంక్రాంతి వచన కవితల పోటీ ఉత్తమ కవితగా నిలిచిన కవిత
అంశం:జీవన సంక్రమణం:

Tuesday, January 11, 2022

మార్కండేయుడు

అంశం : మార్కండేయ మహర్షి .
రచన : 
శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర .


మృకండుడు, మరుద్వతి అనే ఋషి దంపతులు -సంతానం కోసం  వారణాసిలో చేసిన తపస్సు ఫలితం.
మహా శివుని వర ప్రసాదంగా మార్కండేయుని జననం .
 అల్పాయుష్కుడైన పుతృని బడసిన విచారం.
 ఋషి దంపతులకు సంతోషం కరువైన జీవిత శాపం.
 మార్కండేయుడు సప్త ఋషులకు చేసిన పాదాభివందన ఫలితం 
" చిరంజీవి"అని దీవించిన సప్త ఋషుల దీవెన వైనం.
16 వత్సరాల ఆయువు మాత్రమే  తమ పుతృునికి
ఉన్నదని కన్నీటితో కుమారుని జన్మ రహస్యం మునులకు  తెలియజేసిన మృకండుడు.
దివ్య దృష్టి తో అంతా తెలిసిన సప్తర్షుల కారణంగా ..
బ్రహ్మ దేవునిచే చిరంజీవిగా దీవింపబడ్డ మార్కండేయుడు .
సప్తర్షుల ద్వారా మార్కండేయుని గురించి తెలిసిన
బ్రహ్మ , మార్కండేయుని శివారాధన చేయమని చెప్పి ,
తానుకుాడా శివుని కొరకు తపస్సు చేసి  ప్రత్యక్షమైన
శివునితో మార్కండేయుని చిరంజీవిగా చేయమన్న 
అర్ధింపు.

విషయం విపులంగా తెలిసిన నారదుడు యమునికి
విషయం వివరించి 16 వత్సరముల తరువాత మార్కండేయుని
చంపకపోతే  యముని శ్రేయస్సుకు యశము చేకుారదని చెప్పి ప్రేరేపించి  , తక్షణం, మార్కండేయుని
దగ్గరకు వెడలి శివారాధన వీడక చేయుమని 
చెప్పగా , మార్కండేయుడు  నిరంతర శివారాధలనలో
లీనమౌతాడు.
అకుంఠిత భక్తితో శివారాధన చేస్తున్న మార్కండేయుని
చంపుటకై యముడు  వేసిన పాశం , శివ లింగాన్ని కౌగలించుకొని ఉన్న మార్కండేయుని దరికి కుాడా చేరదు.
శరణార్ధియైమ మార్కండేయుని యమ పాశ విముక్తుణ్ణి
చేయుటకై స్వయం పరమేశ్వరుడే లింగము నుండి 
కాలరుాపుడై ఉద్భవించి యమునిపైకే పాశాన్ని 
వేయబోతాడు.
అది గ్రహించిన యముడు,  తనను క్షమించమని మహా శివుని వేడుకుంటాడు.
యముణ్ణి క్షమించిన శివుడు మార్కండేయుని చిరంజీవిగా దీవించడం తో ఈ నాటికినీ శివారాధనలో
లీనమై జీవించే  ఉన్నాడు  మార్కండేయ మహర్షి ..

 గరుడ ,మార్కండేయ పురాణాల లో  మార్కండేయుడు  రచించిన పితృ దేవతా స్తోత్రాలు.మహా మృత్యుంజయ స్తోత్రం , చంద్రశేఖరాష్టకం ..
 మొదలైనవి  మార్కండేయ విరచితములు.

అఖండ భక్తితో శివారాధన  చేసినవారికి అపమృత్యుభయం తొలగిపోతుందన్న సత్యాన్ని 
తెలియజేసిన , మార్కండేయుని కథ ,
నిరంతర నిశ్ఛల భగవత్భక్తిలో
నున్న మహిమకు నిశ్ఛయమైన  తార్కాణము.

*******************************






Monday, January 10, 2022

జీవన సంక్రమణం

మనుమసిద్ధి కవన వేదికలో
అంశం : జీవన సంక్రమణం.

మనిషి జీవితం  ఎన్నో  ఆటు పోట్ల వలయం.
మారుతున్న మనస్తత్త్వాల మారణ హోమాల సంక్రమణం ॥
మారుతున్న కాలం తో  మారుతున్న  వ్యవస్థ.
మనిషి  లో మనిషి చేసే స్వార్ధ చింతనల అవస్థ.

రాజకీయపు టెత్తులకు మారుతున్న మనిషి గమనం.
మంచి చెడుల తేడాల్లేని వ్యవహార సంక్రమణం. 
పచ్చదనం కరువైన ఫలితంగా పెరిగే ప్రదుాషణం .
అవలీలగా వ్యాపిస్తున్న కణవ్యాధుల సంక్రమణం.॥

సంస్కృతి సాంప్రదాయాలకు దుారమౌతున్న జనం.
వ్యామొాహ మార్పుతో వచ్చిన పాశ్చాత్య సంక్రమణం.
అంతరాలు మరచిన ఆవేశాలతో అడ్డ దారుల్లో జనం. 
మాదక ద్రవ్యాల మత్తు నిండిన రోగాల సంక్రమణం ॥

సామాజిక దుారాలు పాటించాలిక నిరంతరం.
మర్చిపోయి వ్యవహరిస్తే  కాటేసే కణం భయం 
ఒంటరి పోరాటంతో మిగిలే ఓదార్పులేని గాయం.
ఒకరినుంచి మరొకరికి పాకే భయంకర  సంక్రమణం.॥


మనవైన పండగలను ఆచరించలేని  అస్తవ్యస్త జీవితం.
కొత్త మాస్క్ లు సేనిటైజర్ల  కొనుగోళ్లతో  ప్రారంభం ॥
ఇకనైనా మేలుకొని మారాలి మనమందరం .
మన ఆచార వ్యవహారాలే మనకున్న మంచి బలం ॥

మారుతున్న మనస్తత్వాలతో  మసలే జనం.
మర్చిపోతున్న సాంప్రదాయాలను వెలికి తీసే దినం.
ప్రతీ ఏటా వచ్చే భోగీ,  సంక్రాంతుల ఆనంద సంబరం.
పండగ పేరుతో మన ముందుకు వచ్చే మనదైన మేలైన సంక్రమణం ॥   



చిత్రకవిత...( చిత్రం : అంతరిక్షంలో మానవులు).

[1/10, 18:45] p3: *మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితాపండుగే*

తేది: *10-01-2022: సోమవారం*
అంశము: *చిత్రకవిత*
ప్రక్రియ: *ఐచ్ఛికం*
వచన కవిత.
మ.సా.క.సం.19.
కవిత సంఖ్య : 1.

రచన : 
శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర .

ఆకాశానికి నిచ్చనలేసే మనిషి మేధస్సు.
నక్షతాలను తాకుతుా పలికే నవోదయ భావ కవనాలు.
ఇంద్ర ధనుసు ఊయలలో  వాలి ఊహలలో  తేలుతుా,
వాస్తవాన్ని మరచిన మానవుడు మహనీయుడు.॥

పచ్చదనాన్ని కాలరాసి  కట్టే భవనాల లో
పట్టు  పరుపులపై నిద్రపోతుా నిజాన్ని మరచిన మానవుడు  మహిలో మంచి బాటకు  సమాధి కట్టేడు.

పర్యావరణ రక్షణ చేయక పెంచుతున్న 
ప్రదుాషణంతో పేరుకు పోతున్న కుప్పల్లో 
 పెరుగుతున్న  విషకణాలను అంతం చేయలేక
 మాస్క్ సేనిటైజర్ల  వాడుకకే పరిమితమై ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నాడు.॥
.
మందులేని మహమ్మారులను పెంచి పోషిస్తుా కుాడా
రాజకీయ వైఫల్యమే కారణమని, తమకు తాముగా 
చేసుకుంటున్న  బుద్ధిలేని బుాజుపట్టిన సద్దుబాటుతో
నోట్లకు ఓట్లనమ్ముకుంటున్న తెలివైన మహనీయుడు .
 
పంట పొలాలు బీడు భుాములుగా మారుతుాంటే
బ్రతుకు దారి లేని రైతన్నల ఆత్మహత్యలను
అసమర్ధతగా పరిగణిస్తుా..ఆకాశంలో జీవితాన్ని
పండించుకొనేందుకు ఆశల నిచ్చెనలు వేస్తున్నాడు.॥

 ప్రకృతి పరంగా ఎన్నో వసతులను సమకుారుస్తున్న భుామాత ఋణం-తీర్చలేని విశ్వాస ఘాతకులు
మరో ప్రపంచ సృష్టికై  ఆకాశ పునాదులు తవ్వుతున్నారు.
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్టు...॥

మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి , 
మట్టిలో పండిన కుాడు తిని, మట్టిలో
 కలిసిపోతామన్న నిజమెరిగిన మనిషి , 
 మట్టి విలువను మరచి , తమ మేధస్సును 
విశ్వ విధ్వంశ రీతిలో విలువలేని పనులకు వినియొాగిస్తున్నాడు ॥

అమ్మ భారతిని  ఆదరించలేని అవ్యర్ధులు
 అడుగే నిలవని. అంతరిక్షంలోకి అడుగు పెడుతుా ,
 విచిత్రమైన రీతిలో  విన్యాసాలు చేస్తుా ....
 తమ తెలివికి తామే మురిసిపోతున్నారు .॥
************************************::
[1/10, 19:57] +91 94418 71767: 
మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి , 
మట్టిలో పండిన కుాడు తిని, మట్టిలో
 కలిసిపోతామన్న నిజమెరిగిన మనిషి , 
 మట్టి విలువను మరచి , తమ మేధస్సును 
విశ్వ విధ్వంశ రీతిలో విలువలేని పనులకు వినియొాగిస్తున్నాడు ॥

అమ్మ భారతిని  ఆదరించలేని అవ్యర్ధులు
 అడుగే నిలవని. అంతరిక్షంలోకి అడుగు పెడుతుా ,
 విచిత్రమైన రీతిలో  విన్యాసాలు చేస్తుా ....
 తమ తెలివికి తామే మురిసిపోతున్నారు .॥

చాలా అద్భుతంగా వుంది మేడం తమరి కవిత🙏🙏🙏

Sunday, January 9, 2022

8/01/2022
*మహతీ సాహితీ కవి సంగమం .
*మ.సా. క సంఖ్య - 19
*కవిత సంఖ్య - 4.


దత్తపది*

*రాబడి - ఏలుబడి - పలుకు బడి - అలజడి

శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర .

ప్రక్రియ :తేటగీతి 

*పలుకు  బడితోడ   గర్వించి  పరుల రోసి
*అలజ  డులసృష్టి  చేసేటి  అధము నతని
*ఏలుబడి చేయు  ఘనునిగా ఎన్నుకొనుచు 
 జనులు  బ్రతికెరా బడిలేక  జగతి నందు ॥

ఏలు బడిచేయు ఘనుడెంచి  ఏల సుఖము
పలుకు బడితోడ పొందెను పరుల ధనము.
పెక్కు రాబడి నదెపొంది  పెంచ ధనము
 జాతి మతముల నలజడి  జగతి పెంచె ॥
   




Saturday, January 8, 2022

దత్తపది

దత్తపది*

*రాబడి - ఏలుబడి - పలుకు బడి - అలజడి

శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర .

ప్రక్రియ :తేటగీతి 

*పలుకుబడి తోడ   గర్వించి  పరుల రోసి
*అలజడుల సృష్టి  చేసేటి  అధము నతని
*ఏలుబడిచేయు  ఘనునిగా ఎన్నుకొనుచు 
 జనులు  బ్రతికె రాబడి లేక  జగతి నందు ॥

ఏలుబడి చేయు ఘనుడెంచి  ఏల సుఖము
పలుకుబడి తోడ పొందెను పరుల ధనము.
పెక్కు రాబడినదె  పొంది  పెంచ ధనము
 జాతి మతముల నలజడి  జగతి పెంచె ॥

   

Friday, January 7, 2022

కరములు మొాడ్చి...గణపతి కీర్తన

రచన : స్వర కల్పన : 
శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర .
శీర్షిక : గణపతి కీర్తన .

పల్లవి :
******
కరములు మొాడ్చి  కన్నుల తెరముాసి కరివదనుని గంటి నే..

అనుపల్లవి :
************
కరుణాంతరంగుని కామిత వరదుని
గౌరీ శంకర ప్రియ తనయుని నే....॥ కరములు ॥

1. చరణం .
***********
ఆటంకముల బాపు ఆది పుాజ్యుని గంటి..
ధీటగ భువి వెలయు దివ్య రుాపము గంటి ॥
గుజ్జు రుాపుని బొజ్జ గణపతినే గంటి.
దిగ్గజముల నేలు 
దివ్య రుాపము గంటి॥ కరములు ॥

2.చరణం.
*********

ఎనలేని విద్యల ఒజ్జ దేవర గంటి.
కార్య సిద్ధి కల్గజేయు 
బుద్ధి బాలుని గంటి..
బలు చిలువలు ధరియించు
ఎలుక  వాహను గంటి.
పలు రుాపుల నను గాచు 
బాల గణపతి గంటి..॥కరములు ॥

.

రచన : స్వర కల్పన : 
శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర .

శీర్షిక  : త్యాగరాజు పై కీర్తన 

పల్లవి:
సంగీత సార్వ భౌమం భజేహం.
సరస గాన లోలం త్యాగరాజం.

చరణం ;
తిరువాయుర పు నివాసం ...
రామ బ్రహ్మ  సుతం శాంత కుమారం.
పంచాపకేశ రామనాధానుజం ,
సంతత శ్రీ రామ భక్తం , సద్బ్రాహ్మణ కులజం ఈశ్వరీ
చరణం.
వరనారద యతిరాజ నుతం.
స్వరార్ణవ గ్రంధానుగ్రహితం.
స్వర రాగ సుధారస గాత్రం 
పంచరత్నాది క్రతీ కృత కర్తం.
గీత జ్ఞాన రత్నం ,  రామచంద్ర కృప పాత్రం 
గీత రసిక మిత్రం , సద్గురు శ్రీ త్యాగరాజం...ఈశ్వరీ॥