Saturday, February 26, 2022

తెలుగు పదాలు

*"ర"కీ "ఱ"కి మధ్య తేడా ఏమిటి?*

ఈ మధ్యనే వాట్సాప్ లో మెసేజ్ చూసాను. ద్వానా శాస్త్రి గారు రాసారట. బావుంది. అది ఇక్కడ పెడతాను. forwarded as it is.

తెలుగు భాషాభిమానుల కోసం.👇

*అరసున్న [ ఁ ], బండి ' ఱ 'లు ఎందుకు?*

అరసున్న, బండి ' ఱ 'లు నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు. అలా చేసారు మన ఆధునిక భాషా వేత్తలు. తెలుగుకు పట్టిన దుర్గతి ఇది. అయితే, ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి. తెలుగు భాషా లక్షణాన్ని నిరూపించేవి. అంతేకాదు- కావ్యభాషలోను, లక్షణ శాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. కానీ వీటిగురించి తెలుగువాడు తెలుసు కోవాలిగదా! మన భాషా సంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా! అరసున్న( ఁ ) , ఱ- ల వల్ల అర్థభేదం ఏర్పడుతుంది. పదసంపదకి ఇవి తోడ్పడతాయి. ఎలాగో చూడండి:

అరుఁగు = వీధి అరుగు

అరుగు = వెళ్ళు, పోవు

అఱుగు = జీర్ణించు

ఏఁడు = సంవత్సరం

ఏడు = 7 సంఖ్య

కరి = ఏనుగు

కఱి = నల్లని

కాఁపు = కులము

కాపు = కావలి

కాఁచు = వెచ్చచేయు

కాచు = రక్షించు

కారు = ఋతువు, కాలము

కాఱు = కారుట (స్రవించు)

చీఁకు = చప్పరించు

చీకు = నిస్సారము, గ్రుడ్డి

తఱుఁగు = తగ్గుట, క్షయం

తఱుగు = తరగటం(ఖండించటం)

తరి = తరుచు

తఱి = తఱచు

తీరు = పద్ధతి

తీఱు = నశించు, పూర్తి(తీరింది)

దాఁక = వరకు

దాక = కుండ, పాత్ర

నాఁడు = కాలము

నాడు = దేశము, ప్రాంతము

నెరి = వక్రత

నెఱి = అందమైన

నీరు = పానీయం

నీఱు = బూడిద

పేఁట = నగరములో భాగము

పేట = హారంలో వరుస

పోఁగు - దారము పో( గు

పోగు = కుప్ప

బోటి = స్త్రీ

బోఁటి = వంటి [నీబోఁటి]

వాఁడి = వాఁడిగా గల

వాడి = ఉపయోగించి

వేరు = చెట్టు వేరు

వేఋ = మరొకవిధము

మడుఁగు = వంగు, అడఁగు

మడుగు = కొలను, హ్రదము

మొదలైనవీ ఉన్నాయి.

అయినా తెలుగు భాషను నాశనం చేస్తున్న కాలం దాపురించింది కదా!

[డాక్టర్ ద్వా. నా. శాస్త్రి )

దత్తపది పద్యాలు

26 -02- 2022

దత్తపది: *తప్పు-విప్పు-ముప్పు-కప్పు*
ప్రక్రియ: ఆటవెలది.

రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .

తప్పు చేయు వాడు తనతప్పు నెరగడు
విప్ప ముడుల నతడు విశ్వసించు
ముప్పు చేయు నట్టి ముార్ఖత్వ మున్నచో
తగిన విధము లేదు  తప్పు దెలుప ॥

అతిగ మాట లాడ నతివకు నదె(ముప్పు)
(తప్పు) దోవ బట్టు తరుణి జాణ
(కప్పు )కొనుము బట్ట కడుగౌర వముపొంద
విందు మాట లాడ( విప్పు) పెదవి॥

(తప్పు )జేసి నరుడు తనవోటు దెగనమ్మి
ముందు నుయ్యి( గప్పు) (ముప్పు) గనక
ఐదు ఏండ్ల పదవి  యమలోక మునుదల్పు
కనులు (విప్పు) నరుడ కాన నిజము ॥

ఓటు నమ్మ (తప్పు) నొరిగేది  యేదయొా..?
(ముప్పు) నీకు నదియె మురియ బోకు
కదలు కాల కధలు కను(విప్పు) గదనీకు.
(కప్పు) ముసుగు దీయ ఖలులె మెండు ॥

********************************

సైబర్ క్రైమ్

సైబర్ క్రైమ్,.ఆరక్షణ 

ప్రక్రియ : వచనం.


రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .

----------------------------

సైబర్ దాడులతో, సాంఘిక, ఆర్ధిక ఆదాయాల విచ్ఛిన్నం.
ప్రపంచ భద్రతను, ప్రమాదాల లోనికి నెట్టివేసేది సైబర్ క్రైమ్. 
ఈ" సైబర్ క్రైమ్స్"    స్త్రీలపై చుాపే భయంకర పరిణామాలు .
స్థ్రీల పై" ఈవ్ టీజింగ్ " చర్యలతో బాధంపులు.
  
మొబైల్ ట్రేకింగ్ , కంప్యుాటర్ హేకింగ్స్ ద్వారా స్త్రీల
వ్యక్తిగత సమాచారాల సేకరింపు . 
వారి బలహీనతల ఆసరాగా వారిని భయపెట్టే మాటల
బెదిరింపు.
  టెక్నలజీ మార్పిడితో , అసభ్యకరమైన  ఫొటోలు తీసి బ్లాక్ మెయిలింగు, సెక్స్యువల్ అబ్యుాజింగ్ , సెక్స్యు్వల్ హెరేస్ మెంట్ల వంటి హేయ చర్యలు.
  స్త్రీల పాలిటి యమగండాలు.
  ఎవరికీ చెప్పు కోలేని మౌన రోదనలు ,ఆత్మహత్యలు.
  అందికే.....
వాటి గురించిన అవగాహన, మహిళలకు
తక్షణ అవసరాలు .అని గ్రహించిన 
తెలంగాణా పోలీస్ డిపార్ట్మెంట్ , స్త్రీల పై జరిగే...
ఈ విధమైన చర్యలను అరికట్టేందుకు ,చేపట్టిన అభినందనా కార్యక్రమాలు.....
ఆడపిల్ల ల రక్షణార్ధం
" ద ఫియర్ లెస్ ఉమెన్ ప్రొటక్షన్ వింగ్స్ ",  
ఆన్ లైన్..లో  "సైబర్.ఇన్ " అనే   వెబ్ సైట్ వింగ్స్ " 
వంటి భద్రతా ఏర్పాట్లు  .
   దీనిద్వారా బాధితురాలు ఏ సమయంలో నైనా 
   ఆన్ లైన్ ద్వారా "కంప్లైంట్ ను రిజిష్టర్ "
   చేసుకోవడానికి  24 గంటలుా వెసులుబాటు .
   ఇవే కాక పలు చోట్ల
  స్త్రీలకు అవగాహనా సామర్ధ్యాన్ని పెంపొందించే  "ఉమెన్ ప్రొటక్షన్ వింగ్స్" 
    "ఆన్ లైన్ సైబర్ క్రైమ్" వంటి సురక్షా మార్గదర్శకాలు.
ఆడపిల్లల ఆత్మ రక్షణకై వెన్నంటి పోరాడే 
    " షీ-టీమ్స్"  కు అందించే పుార్తి సహాయ సహకారాలు.
    కాలేజీల లో "సైబర్ క్రైమ్ క్లబ్ " ల ఏర్పాటు యొాచనలు.
    స్త్రీ రక్షణ తెలంగాణా పోలీసుల ఆశయం.
స్త్రీలకు  అవైర్నెస్ కలిగించి, వారిని 
స్వ నిర్ణయాత్మక శక్తి పరులుగా తీర్చి దిద్దడం వారి లక్ష్యం.
"తెలంగాణా పోలీస్" స్త్రీల రక్షణకు భరోసా గణం.
వారి కృషికి తల వంచి చేద్దాం సలాం.
-----------------------------------------------

Friday, February 25, 2022

నేనుసైతం ఛానల్ కొరకు రాసినది

నమస్కారం..🙏
నా పేరు శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర లో ఉంటాను.

నాటినుండి నేటి వరకు గల చరిత్రలో ,
ఎందరో మహిళామణులు విద్య , వైద్య,  న్యాయ ,
సంగీత , సాహిత్యాది అనేక కళా రంగాలలోనే గాక ,
శాస్త్ర  సాంకేతిక వైజ్ఞానిక, రాజకీయ, స్వాతంత్ర్యాది
ఉద్యమాల లో పాల్గొని , తమ విశిష్ట ప్రతిభను 
చాటుకున్నారు.
వారందరుా మన భరతమాత కీర్తి కిరీటంలో 
కలికితురాయిలై , నేటికీ  చరిత్ర పుటల్లో
మహిళా శక్తికి స్ఫుార్తిదాయకులై నిలచేరు. 

జాతీయ మరియు అంతర్జాతీయ మహిళా-
దినోత్సవాల సందర్భంగా , సాహితీ బృందావన జాతీయ వేదికవారు నిర్వహిస్తున్న
 " మగువ మహారాణి " పోటీలకుగాను
 నేను తీసుకున్న అంశం నాటి మహిళా రత్నమైన
 శ్రీ " దుర్గాబాయి దేశ్ ముఖ్ " గారిది.

ఈమె మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబీకులైన
రామారావు క్రిష్ణవేణమ్మ  దంపతులకు రాజమండ్రిలో
జన్మించారు.
8 సంవత్సరముల వయస్సు లో ఆమెను ఆమె తల్లిదండ్రులు , ఆమె మేనమామకు ఇచ్చి వివాహం చేయ నిశ్ఛయించగా, ఆ వయసులోనే ఆమె ఆ వివాహాన్ని తిరస్కరించేరు.
12 సంవత్సరాల వయసుకే ఆమె హిందీ పాండిత్యాన్ని
సంపాదించి , రాజమండ్రిలో హిందీ పాఠశాలను
నెలకొల్పి , అన్ని వయసులవారికీ విద్యా బోధనను 
చేసేరు

మహాత్మాగాంధీగారు ఆంధ్రా పర్యటనకు వస్తున్నారని తెలిసిన  ఆమె ఎనలేని విరాళాలను సేకరించి ,
వాటితోపాటు ఆమె చేతికున్న బంగారు గాజులను కుాడా స్వాతంత్ర్య పోరాట విరాళంగా సమర్పించేరు.
ఆంధ్రా పర్యటనలో గాంధీగారు చేసిన హిందీ ఉపన్యాసాలను , తెలుగులోనికి అనువదించి 
ఆయన  ప్రశంసలను పొందేరు.
ఉప్పు సత్యాగ్రహంలో అరెస్టు కాబడి కుాడా , 
స్వాతంత్ర్యోద్యమాలలో  పాల్గొన్న ధీర వనిత
శ్రీ  దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారు.
ఇన్ని చేస్తుా కుాడా ఆమె తన చదువుకు ఆటంకం రానీయలేదు. విరామసమయాల్లో అమె చదువుకుంటుా  తన విద్యను సకాలంలో పుార్తిచేసి, 
న్యాయ కోవిదురాలిగా , ప్రఖ్యాత క్రిమినల్ లాయర్  గా
జగద్విఖ్యాతిగాంచేరు.

అనేక సాంఘీక సంక్షేమ  సంస్థలను ప్రారంభించి
స్త్రీ ల అభ్యున్నతికి కృషి చేసేరు.
చెన్నై లో ఆంధ్ర మహిళా సభను  
లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే బాల సంఘాన్ని
స్థాపించేరు.
ఆంధ్ర  విద్యాలయంలో మహిళా వసతి గృహాలను, హైదరాబాదులో  ఆంధ్ర మహిళా పత్రికను స్థాపించి
దానికి  సంపాదకత్వాన్ని వహించేరు.
రాష్ట్రమంతటా   ఎన్నో కళాశాలలు, వసతి గృహాలుా,
నర్సింగ్ హోమ్ లు, వృత్తి కేంద్రాలు నెలకొల్పారు.
చెన్నై లో 70 మంది కార్యకర్తలతో  ఉదయవనం అనే
సత్యాగ్రహ సిబిరాన్ని ఏర్పరచేరు.
స్వాతంత్ర్యానంతరం అమె భారత రాజ్యాంగ నిర్మాణ 
సభలోసభ్యురాలిగా పనిచేసేరు.
అటుపై C D దేశ్‌ముఖ్  గారితో వివాహానంతరం
అమె సాక్షారతాభవన్ ను స్థాపించగా..
ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఈమెకు గౌరవ
డాక్టరేట్ ను ప్రదానం చేసేరు.
పిదప భారత ప్రభుత్వంచే నెలకొల్పబడిన
కేంద్ర సాంఘీక సంక్షేమ బోర్డ్ కు , దిల్లీ లో ఉన్న
బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ లకు అద్యక్షురాలిగా
పని చేసారు.

కేంద్ర సాంఘీక సంక్షేమ బోర్డ్  వారు ఈమెకు 1998లో
ఈమె పేరున " డాక్టర్ దుర్గాబాయి దేశ్‌ముఖ్" వార్షిక అవార్డు ను నెలకొల్పి , దానిని మహిళా అభ్యున్నతికి
పాటుపడే స్వశ్ఛంద సంస్థలకై వినియొాగపరిచేరు.

దిల్లీ లో ఉన్న  బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు
2006లో ఈమె పేరున "దుర్గాబాయి దేశ్‌ముఖ్ -
కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్" ను నెలకొల్పారు.

ఇలా ఒక స్త్రీ గా, పిన్న వయసు నుండి కుాడా దేశానికి
ఎనలేని సేవలందించిన గౌరవనీయులు 
శ్రీ దుర్గాబాయి దేశ్‌ముఖ్  గారు 1981 మే వ తారీఖున
హైదరాబాదు లో దివంగతులై భరత మాత కీర్తి కిరీటంలో మణిరత్నమై చిరస్మరణీయులయ్యేరు.

"మగువ మహారాణి " పేరుతో మహిళలకు
అత్యున్నత వేదికను కల్పించి , మహోన్నతమైన మహిళా మణుల వీర చరితల సంస్మరణతో, మహిళా శక్తిని జాగృత  పరచే విధంగా , వచన, కవితా గానాలను చేసే అవకాశాలను కల్పిస్తుా ప్రోత్సహిస్తున్న 
సున్నితం ప్రక్రియ రుాపకర్త ,సాహిత్య పోషిణులుా ఐన గౌరవనీయులు శ్రీ నెల్లుట్ల సునీతగారికి , ఆమెకు సహకరిస్తుా కవులను ఉత్సాహపరుస్తున్న 
యుాట్యుాబ్ ఛానల్ నిర్వాహకులు
గౌరవనీయులైన శ్రీ దేవవరపు ఈశ్వర రావుగారికి
సాదర నమస్కారములతో
నా మనఃపుార్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

సుాక్తులు

[12/8/2021, 05:27] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*


🌹 *ఒక వ్యక్తి*
*ఉన్నతమైన స్థితిలో ఉన్నాడంటే..*
*అతడు ఎన్నో కఠిన పరీక్షల్ని*
*ఎదుర్కొని నిలిచాడని అర్థం.*
 
🌹 *పలకరింపు లేకపోతే*
*ఎంతటి గొప్ప బంధమైనా*
*క్రమంగా దూరం అవుతుంది.*

🌹 *ఒకరు మరొకరికి హాని చేస్తుంటే*
*చూసి నవ్వడం చాలా తేలిక..!*
*అదే హాని తనకి జరిగితే*
*భరించడం చాలా కష్టం..!!*

🌹 *సింహంలా ధైర్యంగా పరిగెత్తాలని*
*అందరికీ కుతూహలం ఉంటుంది.*
*కానీ..*
*సింహం నుండి సైతం*
*తప్పించుకునే*
*జింక చాకచక్యంను నేర్చుకోవడం*
*కొందరికే సాధ్యమవుతుంది.*
*కొన్ని సార్లు మొండి ధైర్యం కంటే..*
*చాకచక్యమే మనకు మేలు చేస్తుంది.*

🌹 *నారు పోయకుండా,*
*నీరు పెట్టకుండా,*
*పెరిగేవి రెండే రెండు...*
*ఒకటి పొలంలో కలుపు అయితే,*
*రెండవది మనిషిలో అహం.*
*ఒక దాని వల్ల*
*పొలం నాశనం అయితే...*
*రెండవ దాని వల్ల*
*మనిషి నాశనం అవుతాడు..!!*

🌹 *నిజం చెప్పాలంటే....*
*ద్రోహుల దగ్గర కోపం ఉండదు...*
*కోపం ఎక్కువగా ఉన్నవారు...*
*ఎవరికీ ద్రోహం చేయరు...*
*కోపం మాటల్లో మాత్రమే ఉంటుంది......!!*
[12/20/2021, 05:43] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *అవసరాలు కొత్త దారులను*
*వెతికితే....*
*అనుభవాలు కొత్త పాఠాలు*
*నేర్పుతాయి....!!*

🌹 *మన స్థాయిని బట్టి*
*మన మాటలు ఉండకూడదు.*
*మన మాటలకే....*
*ఒక స్థాయి ఉండాలి....!!*

🌹 *సహాయం అనేది...*
*అత్యవసర పరిస్థితిలో మాత్రమే*
*స్వీకరించాలి....లేదంటే*
*అది నీ వ్యక్తిత్వాన్ని...*
*కోల్పోయేలా చేస్తుంది....!!*

🌹*తృప్తి...*
*పేదవారిని కూడా ఆనందంగా*
*ఉంచుతుంది....*
*అసంతృప్తి...*
*ధనవంతుడిని కూడా*
*మనశ్శాంతి లేకుండా చేస్తుంది....!!*

🌹 *మనం చేసిన మంచిని*
*మరుక్షణమే మరచిపోవాలి.*
*మనకు మంచి చేసిన మనిషిని*
*మరణించే క్షణం వరకూ*
*గుర్తుంచుకోవాలి....!!*

🌹 *నువ్వు చేసిన మంచిపని*
*ఎంతమంది చూశారన్నది*
*ముఖ్యం కాదు...*
*ఆ పని వల్ల*
*ఎందరి జీవితాలు బాగుపడ్డాయి*
*అన్నదే ముఖ్యం... !*

🌹 *సంభాషించడం,*
*క్షమాపణ కోరడం,*
*నిజాయితీగా ఉండడం,*
*ఇంకెవరినో నిందించకుండా*
*బాధ్యత తీసుకోవడం*
*ఎలాగో తెలియనంత కాలం*
*నువ్వేమీ ఎదగనట్లే.*
[12/25/2021, 20:32] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*


🌹 *అందరిని సంతోష పెట్టటం చాలా కష్టమైన పని..*
*కానీ*
*అందరితో సంతోషంగా ఉండటం పెద్ద కష్టమైన పని కాదు.*
 *ప్రయత్నిస్తే పోలా ఏమాతుంది అందరితో సంతోషంగా ఉందాం.*

🌹 *ఒకచోట జీవించే ప్రజల మధ్య*
*కష్టనష్టాలలో ఒకరికొకరు*
*సాయపడకపోతే వారు*
*బతుకుతున్నది ఎందుకో*
          *అర్థం కాదు.*

🌹 *వంద పేజీలున్న పుస్తకంలోనే*
*బోలెడు అచ్చుతప్పులున్నప్పుడు*
*వంద సంవత్సరాల బతుకే దానికి.*
*బొచ్చెడు తిప్పలుండవా?*          
*ఉంటాయ్..!*
*సరిదిద్దుకుంటూ.. చదువుకోవడమే.*
*చదువుకుంటూ.. సరిదద్దుకోవడమే.*

*అది పుస్తకమైనా - బతుకైనా..*

🌹 *దైర్యంతో కూడిన ప్రయత్నం*
      *అర్ధ విజయంతో సమానం*
   *ధైర్యంతో అన్ని సమస్యలను*
      *పరిష్కరించుకోవచ్చు...!!*
            
 🌹 *ఙ్ఞాపకాలు కత్తి కంటే*
                *ప్రమాదకరం*
    *కత్తి ఒక్కసారే చంపుతుంది*
                 *కానీ!*
    *ఙ్ఞాపకాలు ప్రతిక్షణం గుచ్చి*
          *గుచ్చి చంపుతాయి.*

🌹 *విశ్వాసం సడలే సంఘటనలు జరిగే సమయంలో*
*ప్రతి మనిషి ఇది గుర్తుంచుకోవాలి.*
*కాలం మనిషి ఏర్పరిచిన మార్గాలలో నడవదు.* 
*కాలం నిర్ధేశించిన మార్గంలో మనిషి నడవాలి.*

🌹 *మనస్సును* 
 *చెదురింపజేసేది*
*మనలోని బలహీనత,*
*మనస్సును లగ్నం చేసేది*
*మనలోని శక్తి*
[1/6, 05:48] +91 94409 63004: *మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *లోపాల ఆధారంగా ఎవరిని*
 *అంచనా వేయకూడదు.*
*ఒక వ్యక్తికి గల సుగుణాలు*
*అతనికి మాత్రమే ప్రత్యేకం.*
*అతడికి ఉన్న దోషాలు*
*సర్వ సామాన్యమైన మానవ బలహీనతలు...*
*అతడి వ్యక్తిత్వ నిర్ధారణలో*
*వాటిని పరిగణించనే కూడదు..*

🌹 *ఎవరు ఎవరితో ఎంత కాలం*
*అనేది బంధం నిర్ణయించదు...*
*మనుషుల ఆలోచనలే నిర్ణయిస్తాయి....!!*

🌹 *చేతినిండా డబ్బున్నప్పుడు*
*నువ్వు*
*ప్రపంచాన్ని మర్చిపోతావు*
*రూపాయి కూడ చేతిలో*
*లేనప్పుడు*
   *ప్రపంచం*
*నిన్ను*
*మర్చిపోతుంది.*

🌹 *మంచివారు ఎప్పుడూ*
*మొండిగానే ఉంటారు*
*ఎందుకంటే*
 *వారికి నటించడం*
*ఇష్టం ఉండదు కనుక.*

🌹 *స్నేహం అనేది ఒక వరం*
*మనం ఎలాంటి సందర్భంలో ఉన్నా*
*మన మనసులోని భావాలను పంచుకోవడానికి*
*ఒక మిత్రుడు ఎపుడు మనతో ఉంటే*
*మనం ఎంతో అదృష్టవంతులం.*

Friday, February 18, 2022

చిత్ర గీతాలకు పేరడీ పాటలు

మహిళా దినోత్సవ సందర్భంగా రాసిన పాట

పగలే వెన్నెలా ....జగమే ఊయలా...
పాటకు  పేరడీ
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .


మహిళా మణులు ఈ, జగతికి రాణులుా 
మహిళ ఇలను సబలె గాని అబల కాదుా...॥

పుట్టినింట ఆనందము పంచు రాణిగా
మెట్టినింటను జ్యోతియై వెలుగు లక్ష్మి గా
కష్టసుఖములందు ఆమె తోడు నీడగా
నెరవేర్చును బాధ్యతలను అర్ధ భాగిగా
పెనిమిటి పిల్లల.. పాలిటి వరముగా
మగువే  గృహసీమను  ఏలు రాణిగా..॥

వేద వైద్య విజ్ఞానము లేలు బాటలో
విద్యలందు ఆరితేరె విజయ పథములో
నవరసమ్ము లేలు కళా రంగాలలో 
నడుముగట్టి నడచె స్త్రీ లు ప్రగతి బాటలో
పురుషుల నీడగా బాధ్యత తోడుగా
మహిళలె.. మహిని నిలచి జయము లేలెగా॥

తెల్లదొరల నొడ్డి పోరు నాటి జోరులో
స్వాతంత్ర్యము కోరి, శాంతి ,గాంధి బాటలో
బానిస సంకెళ్ళు తృుంచ ఉద్యమాలలో 
శక్తి రుాపులై నిలచిరి  స్త్రీ లు వేలలో
సాహస మేలినా మహిళలు ఎందరో
స్త్రీ శక్తికి రుాపాలై నిలిచె గెలుపులో  ॥

కత్తి పట్టెవీర నారి ఝాన్సి లక్ష్మి గా
దేశ మేలె ఇందిరమ్మ  ఎన్నో ఏళ్ళుగా
మహిళ సాధికారతకై ఉద్యమించెగా
 ఆకసాన సగ భాగిగ కీర్తు లేలెగా
భరత చరిత పుటలలోమకుటాయమానులై
  మగువలు మహరాణుగ ఖ్యాతి గాంచెగా॥






 


 
    
 

Thursday, February 10, 2022

మహిళ మణిదీపం

నమస్కారం . నాపేరు..
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్: మహారాష్ట్ర .


ఫిబ్రవరి 13 న జాతీయ" మహిళా దినోత్సవం"
మరియు  మార్చ్ 8 వ తారీకున 
"అంతర్జాతీయ మహిళా దినోత్సవం" సందర్భంగా...* 

' సాహితీ బృందావన జాతీయ వేదిక '
 " మగువ మహారాణి " అనే అంశంపై యూట్యూబ్ ఛానల్ లో  అంతర్జాతీయ స్థాయిలో..
మహిళలకు పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా -
నేను రాసిన కవిత.


ఆంక్షల సంకెళ్ళు తెంచుకొని 
అన్ని రంగాల లోనుా 
మగవాడితో సమానంగా 
ఎదుగుతున్న మహిళలు  
మహిళా శక్తికి నిదర్శనాలు.
హిమాలయాల శిఖరాగ్రాలు చేరి
అంబర యాత్రలతో అలరిస్తున్న స్త్రీ లు.
ఇంటా బయటా సమాన శక్తితో
పనిచేస్తున్న  వెలుగు దీపాలు.
బాధ్యతల బాటలో  
తొలగిస్తున్నారు ముళ్ళు.
బంధాల తోటలో వికసిస్తున్న
 అనుబంధపు పరిమళాల పుాలు.
 ఏలోటుా రానీయని ఆదర్శ గృహిణులు
 ఎందులోనుా తీసిపోని వీర నారీమణులు.
ఎన్నో రంగాల లో ఎందరో ప్రసిద్ధులైన
నారీమణులు మన భరత  మాత
మకుటంలో మెరిసే కలికితురాయిలు.
తరాలు కదిలిస్తే చాలు 
తరుణీ మణుల ఉద్యమ, వీర 
స్వాతంత్ర్య , విద్యా , వినయ సంపన్నులైన
వారి గాధలు చరిత్ర పుటల్లో చదువరులకు
చక్కని స్ఫుార్తినిస్తున్నాయి.
మచ్చుకకు
వేదద్రష్టలు మంత్ర దర్శినులు 
మేధ, సూర్య, మాంధాత్రి, సావిత్రి మొదలైన
24 మంది వనితలు  విద్యా వినయ సంపన్నులు.

పండితురాలైన గార్గి , బ్రహ్మజ్ఞాని. 
 పురుషులతో పాటు సమంగా గార్గి కూడా
 ఉపనయనం చేసుకుని  శాస్త్ర చర్చ చేసిన 
 మహా మనీషి.
మైత్రేయి యాజ్ఞవల్క్యుని భార్య. 
గార్గితో సమానమైన పండితురాలు
ఘోష ఎక్కువ మంత్రాలు చెప్పిన వనిత.

అలివేలమ్మ కమలా నెహ్రూతో కలిసి విదేశీ వస్త్రబహిష్కరణోద్యమంలో  పాల్గొనడమేగాక
మహిళలు అక్షరాస్యులయ్యేందుకు ఎంతగానో కృషి చేశారు

భారతకోకిల సరోజినీనాయుడు భారత జాతీయోద్యమంలో పాల్గొన్నారు.

లోక్ సభ సభ్యురాలైన లక్ష్మీబాయి స్త్రీలు, బాలికల సంక్షేమం కొరకు నిర్విరామంగా కృషిచేసినవారు..

దుర్గాబాయి దేశ్ ముఖ్  తన 12 యేండ్ల వయసులోనే ఆంగ్ల విద్యపై పోరాటం ప్రారంభించింది
స్వాతంత్ర్య సమరకాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి ఎంఎ, బిఎల్‌, బిఎ ఆనర్స్‌ చేసి న్యాయకోవిదురాలిగా, ప్రఖ్యాత క్రిమినల్‌ లాయర్‌గా పేరుగాంచి
పద్మ విభూషణ్. గౌరవ డాక్టరేట్,
నెహ్రూ లిటరసీ అవార్డ్ లేగాక
యునెస్కో నుండి పాల్ జి. హాఫ్‌మన్ అవార్డును గ్రహించిన గొప్ప వనిత..

"భారత కోకిల "సరోజినీ నాయుడు   స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి , అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా.[

ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా 
మొాదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో
 ప్రముఖ పాత్ర పోషించింది ఝాన్నీ రాణీబాయి.

రచయిత్రి మాలతీ చందూర్
భారతదేశంలోని అత్యున్నత సాహిత్య పురస్కారమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందిన 
 గొప్ప రచయిత్రి.

ఇల్లిందల సరస్వతీదేవి  ప్రముఖ తెలుగు కథారచయిత్రి. భారతీయ అత్యున్నత సాహిత్య పురస్కారంగా వాసికెక్కిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సాధించిన తొలి తెలుగు రచయిత్రిగా ఆమె చరిత్రకెక్కారు.

మంజుల ప్రదీప్, మరొకరు ముగ్దా కల్రా.లు. వీరు
అతి పిన్న వయసులోనే నోబెల్ శాంతి బహుమతి పొందిన భారతీయ మహిళలు.

సావిత్రిబాయి పూలే
 సమాజంలో దళితులకు, మహిళలకు, వితంతువులకు, బాలికలకు విద్య మరియు గౌరవాన్ని సాధించిన మహిళ ఆమె. సావిత్రిబాయిని భారతీయ మొదటితరం స్త్రీవాదిగా వర్ణిస్తారు.
అంతేకాదు

భారతదేశ మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభా దేవిసింగ్ పాటిల్
భారత దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా ప్రియదర్శిని గాంధీ
భారతదేశపు మొట్టమొదటి మహిళా వ్యోమోగామి కల్పనా చావ్లా
భారతదేశపు మొట్టమొదటి సైనికురాలు పునితా అరోరా/ప్రియా జింగాన్
భారత నేవీలో మొట్టమొదటి మహిళ సుభాంగి స్వరూప్
ఒలింపిక్స్‌లో భారతదేశపు మొట్టమొదటి మహిళా కిరణం కరుణం మళ్లీశ్వరి
ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన మొట్టమొదటి భారత మహిళ పి.వి.సింధు
మొట్టమొదటి మిస్ వరల్డ్/మిస్ ఇండియా రీటా ఫెరియా పావెల్
మొట్టమొదటి మిస్ యూనివర్స్ సుస్మితా సేన్
భారత మొట్టమొదటి మహిళా గాయకురాలు రాజ్ కుమారి దూబే
భారతదేశపు మొట్టమొదటి మహిళా వైద్యురాలు ఆనంది గోపాల్ జోషి
మొట్టమొదటి నోబెల్ అవార్డు పొందిన భారత మహిళ మదర్ థెరిసా
మొట్టమొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ
మొట్టమొదటి మహిళా రైడర్ రోషిణి శర్మ
మొట్టమొదటి మహిళా ఆటో డ్రైవర్ శీలా డావ్రే
టెస్టులో రెండు సెంచరీలు బాదిన మొట్టమొదటి మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్
ఎయిర్ ఫోర్స్ మొట్టమొదటి మహిళా ఫ్లైయింగ్ ఆఫీసర్ అంజలి గుప్తా
మొట్టమొదటి సుప్రీం కోర్టు మహిళా న్యాయమూర్తి ఎం.ఫాతిమా బీవి
ఇండియన్ ఎయిర్ లైన్స్, మొట్టమొదటి మహిళా పైలట్ దుర్గా బెనర్జీ
ఆస్కార్ పొందిన మొట్టమొదటి భారత నటి భాను అతయా
భారత్ నుంచి మొట్టమొదటి 'వరల్డ్ మిస్టర్&మిసెస్ అదితి గోవిత్రికర్
యుద్ద విమానంలో మొట్టమొదటి మహిళా పైలట్ అవని చతుర్వేది
మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపలాని
భారత మొదటి మహిళా ఐ.ఎ.ఎస్‌. అధికారి అన్నా జార్జి
ప్రపంచ బాక్సింగ్‌ పోటీలో గెలుపొందిన భారత మొదటి మహిళ మేరీ కోమ్‌
భారతదేశపు మొదటి మహిళా ఆర్మీ కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌
ఎవరెస్ట్‌ను అధిరోహించిను భారత మొదటి మహిళ బచేంద్రిపాల్‌
ఇలా చెప్పుకుంటే చరిత్ర పుటల్లో 
మణిపూసల్లాంటి ఎందరో గొప్ప మహిళలు.
 ఎన్నో రంగాల్లో మహోన్నతమైన  కీర్తి 
 ప్రతిష్టలకు ప్రతీకగా నిలచినా వారు.
 అటువంటి స్త్రీ ... 
 త్యాగానికి  ప్రతి రుాపం
 ఇంటింటా వెలిగే ప్రేమ దీపం. ॥
 
 



 

మహిళ మహారాణి

8/02/2022

"అంతర్జాతీయ మహిళా దినోత్సవం" సందర్భంగా...*

 అంశం: మహిళా మహారాణీ .
 
 రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్: మహారాష్ట్ర .

శీర్షిక : మహిళాలోకం నిద్రలేవాలి.


తరాలు కదిలిస్తే చాలు 
మగువల  కన్నీటి  కథనాలు.
దాశ్య శృంఖలాల వేటలో
ఛిద్రమైన మహిళల జీవితాలు.
తరాలు మారినా రాని స్వాతంత్ర్యం 
మహిళల ఉన్నతికి తీరని శాపం.
మారుతున్న కాలంలో మారణహోమాలు.
కామాంధులు పెరిగిన దేశంలో 
కన్నుా మిన్నుా గానని ఆక్రమణ గోడులు.
అమ్మ తనంలో ఆడ తనాన్ని చుాస్తున్న
అల్పుల కామోద్రేక  పుారిత క్రుారత్వాలు.
మహిళల బలహీనతకు సాక్ష్యమై
నిలచిన మరువలేని మానభంగాలు.
మహిళా సాధికారతపై  
పురుషులు చేసిన ఉద్యమాలు..
మహిళలుగా  మహిళల ఉన్నతికై
అడుగు ముందుకేసి విజయ పథానికి 
చేరిన  ఎందరో ఉద్యమ కారిణుల 
సచ్చరితలు, చరిత్ర పుటల్లో చేరి
చెదలు పడుతున్నాయి.
తరాలు మారినా  స్త్రీ ల 
తల రాతలు మారలేదు.
నేటికీ అత్యధికంగా స్త్రీ లు 
తమ మాన మర్యాదలను 
కోల్పోతుానే ఉన్నారు.
ఎన్నో చట్టాలు మరెన్నో
స్త్రీ  సంక్షేమ పథకాలు ..
అమలు కాని ఆర్భాటాలై 
వత్సరాని కొక్కసారి  "మహిళా దినోత్స"వాలకు
 సారధులైన నేతల బాషల్లో
 ఆదర్శ  బాసలుగా బాణీలు కట్టబడి ,
 అపస్వరాలాలాపనలై ఉపయొాగంలేని 
 ఉచ్ఛారణతో ముాలబడుతున్నాయి॥
 ఇప్పటికైనా మహిళలు 
 మందడుగు వేసే ప్రయత్నం చేయండి.
 మహిళా సాధికారతను సాధించే
 పయనంలో "మేము సైతం "అంటుా
 ఉద్యమయజ్ఞంలో హవిస్సుగా అర్ఘ్య 
 నినాదాన్ని పోసి స్త్రీ  శక్తిని 
 రగులజెయ్యండి.
  ఆగని పోరాటాగ్నిలో, అసందర్భ
  ఆర్భాటాల  భాషణ బాసలను కాల్చి వేసి
  అధికారిత సాధికారతను స్వంతం చేసుకోండి..
  జై స్త్రీ  శక్తి..
  
  
 హామీ: నా ఈ రచన ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన.
 
 

Tuesday, February 8, 2022

ఆహ్వానము

ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, గాయని, సంగీతవేత్త శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారికి... *కవన కిరణాలు* సమూహంలోకి హృదయ పూర్వక స్వాగతం...💐💐💐💐💐👏👏👏👏👏

Saturday, February 5, 2022

శీర్షిక : స్త్రీ పురుషుల సమానత్వం,అర్ధనారీశ్వరతత్వం

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక : స్త్రీ పురుషుల సమానత్వం,
అర్ధనారీశ్వరతత్వం

ప్రకృతి పురుషుల  కలయిక
సృష్టి కార్యానికి ఆరంభం.
శక్తి లేనిదే సృష్టి కి ఆలంబనుండదు
పురుషుడులేనిదే సృష్టి కి ఆరంభం ఉండదు.
ఇరువురి కలయికతో జరిగిన
సృష్టిలో స్త్రీ  పురుషులిరువురిలోనుా.
అంతర్గతంగా దాగి ఉన్న స్త్రీ పురుష
కణాల భాగస్వామ్యం తో వచ్చిన
జన్మలకు , పుట్టునప్పటినుండే
లింగ వివక్షతల విభజనలు దేనికి..?
ప్రతీ మనిషిలో అంతర్గతంగా
దాగి ఉండే శక్తులు శారీరిక రుాపేణా
విభజించిన కారణంగా ఒక శక్తి
అణగారిపోతుా వేరొకశక్తి అహంకరిస్తుా
ప్రకృతి ధర్మానికి  వ్యతిరేక దిశలో
జీవితావగాహనలను కోల్పోతున్నారు.
లింగ వివక్షతల కారనణంగా శారీరిక
బలహీనతల దోపిడీలు హింసలు
మానభంగాలుా జరుగుతున్నాయి.
అందరిలోనూ అంతర్గతంగా ఉన్నపురుష,
స్త్రీ ధర్మాల రెంటి మధ్య ఒక సమతౌల్యాన్ని
ఏర్పరచుకో గలిగితే మన జీవితాన్ని మనం
మరింత ఉన్నతంగా తీర్చి దిద్దుకోగలుగుతాం.
నేటి  భౌతిక ప్రపంచంలోే
స్త్రీపురుషులు సరిసమానంగా పాలు
పంచుకొనేందుకు అనువైన పరిస్థతులు
ఎన్నో కల్పించబడ్డాయి.
స్త్రీ లకొరకు సంక్షేమ పథకాలు
ఆరక్షణాకేంద్రాలుా అడుగడుగునా
నెలకొన్నాయి.
ఇలాగే స్త్రీ పురుషులు సమానంగా
పాలు పంచుకోగల ఆధ్యాత్మిక, మనో వైజ్ఞానిక ప్రపంచాలను గూడా ఏర్పరచుకొనేందుకు
అనువైన సమయం వచ్చింది.
స్త్రీత్వ, పురుషత్వ ధర్మాలు రెండూ
సమానంగా పని చేస్తేనే, మనుషులు
అంతర్గతమైన వికాసాన్ని
అనుభవించ గలుగుతారు. వారిరువురుా
మన భవితకు మంచి మార్గదర్శకులౌతారు.

ముందడుగు

సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు
నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న మహిళా సాధికారత కోసం చదువుతున్న కవిత.

శీర్షిక : ముందడుగు.

శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

మారుతున్న సమాజంతో పాటు
ముందడుగు వేస్తున్న మహిళలు.
పురుషులతో సమానంగా అన్ని
రంగాల లోనుా నిష్ణాతులైన ఘనం.
స్త్రీ  పురుష తారతమ్యాలకు అడుగు
ముందుకేయలేని స్త్రీ ల బలహీన స్థితి.
స్వాతంత్ర్యం వచ్చి 70 వత్సరాలు దాటినా
స్త్రీ ల విషయంలో సరిజేయలేని చట్టాలు
స్త్రీ  జీవితాలకు విడుపులేని శాపాలు.
ఒకప్పుడు నిర్భయ మరోనాడు ప్రియ
మరోనాడు పసి బిడ్డ మరోనాడు పండు ముసలి
ఇలా..వావి-వరసలు  మరచిన అకృత్యాలు.
అవనిలో పరిపాటైపోయాయి.
వికృత చేష్టల సాముాహిక బలాత్కారాలు
అబలల కు ఆత్మరక్షణ లేని ఆక్రోశాలయ్యేయి.
ఎన్నో పథకాలు మరెన్నో చట్టాలు
అసమర్ధత నిండిన ఆలోచనలకు నెలవయ్యేయి.
ఈ విషయంలో మహిళలే మహిళలకు
సంపుార్ణ మద్దతునివ్వాలి.
చేయి చేయి కలిపి పిడికెలు బిగించాలి.
మహిళా ఆరక్షణా కేంద్రాల సహాయంతో
అడుగు అడుగుకుా ఎదురౌతున్న
అవరోధాలను  అంతం చేయాలి
రాజ్యాంగ మార్పులతో పాటు  మహిళల
భద్రతకై చట్టాలు అమలు చేయబడాలి.
తప్పు చేసిన వాడికి తగిన శిక్షను
సకాలంలో పుార్తి చేయగలిగే సమర్ధత
మన రాజ్యాంగ సవరణల లో చోటు చేసుకోవాలి
పురుషుడిలో అర్ధభాగమైన స్త్రీ ..
పురుషాధిక్యతకు బలౌతున్న పరిస్థితిని
కుాకటి  వేళ్ళతో  పెళ్ళగించాలి.
శక్తి లేనిదే శివుడు లేడు అన్న మాటకు
అర్ధనారీశ్వరుడే సాక్ష్యమై ఆది పురుషుడయ్యేడు.
సృష్టి కి ప్రతి సృష్టి చేసే అమ్మ రుాపులో
ఆడ తనాన్ని తప్ప మరొక పవిత్ర
భావానికి చోటివ్వని క్రుారత్వాన్ని
కుాకటివేళ్ళతో పెకిలించాలి.
ఎనాడైతే స్త్రీ  అర్ధరాత్రి కుాడా
భయపడని సామాజిక పరిస్థితి వస్తుందో
ఆనాడే మనకు అసలైన స్వాతంత్ర్యం
వచ్చిందన్న భావంతో మనం మన
జాతీయ ఝండాను తలెత్తుకు ఎగరేయాలి.


Friday, February 4, 2022

జనన మరణ యానం జీవితం ..పాట

శీర్షిక : జనన మరణ యానం.(జీవితం).

గీత రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర.

👌👌👍💐🌻🌹

పల్లవి:
*******
జన్మించుటెప్పుడో మరణించు టెప్పుడో
తెలియని విధిరాతిదనీ  తెలిసేది ఎన్నడో..

అనుపల్లవి:
*********
ఈ పుడమిలో జన్మ   ప్రేమ నిండు సారమా
సుఖ దుఖః నావలో నడిసంద్ర ప్రయాణమా ॥

1.చరణం.
*********
జీవితం తిరుగాడు వలయం  
నీ.. నా.. కధల రుాపం
మనసే జ్ఞాన దీపం  
నింపావహంకార తిమిరం 
ఒడుదుడుకుల బాటలో సాగించీ గమనం 
ఆశయాలె బాటలో కోల్పోయిన తరుణం 
పోయినదంతా వెనుకకు రాదుా
మిగిలినదాంతో తృప్తిరాదుా ॥

2.చరణం.
*********
ఎంతెత్తు కెదిగినా   నడిచేది నేలపై...
కన్నవారు లేనిదే కానరావు భువిపై
నా అన్నవారుండరు, నీతోడై పాడెపై
నడిమంత్రపు సిరిరాదు,నిను గుాడి చితిపై
చావు పుటకలకు మధ్యన, క్షణమైన జీవితం
తెలుసుకొనీ మసలుకో అదె జీవిత సత్యం ॥

3.చరణం.
*********
స్వార్ధమెంచి  దుారమవకు  అందరికీ మిత్రమా
బ్రతుకు దశల మార్పు తోడు, మనిషికి మనిషేసుమా.
 ప్రాణమెగిరిపోయినా  కదలదు నీకాయము
 ఓనలుగురి సాయమే   కాటిజేర్చు సాధనము.
 ఐదడుగుల మట్టి గొయ్యి నీ జీవిత కాల ధనము
 తుదికి మట్టిలోనె  కలియుటే బ్రతుకు రహస్యము ॥
 
*******************************
రాగం : .కీరవాణి రాగం ఆధారం కై"ని" అన్యస్వర  ప్రయొాగం గా వాడారు. బాగుంది ఎవరు పాడారండీ?

Thursday, February 3, 2022

కవితలు

కవన కిరణాలు"
తెలుగు సాహితీ సమాఖ్య.
ముాడవ కవితా సంకలనం కొరకు...

శీర్షిక  : ఓ మనిషీ ! మేలుకో !

శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

ఒకప్పుడు..మనదేశం మన సంస్కృతి అంటుా
ఇంటినుండి మొదలైన సాంప్రదాయ
వ్యవహారాలు స్కుాల్ కాలేజీల పరిధిలో
కుాడా పరువు సంపదకు పట్టం గట్టేవి ॥
కాలం తో పాటు మారుతున్న  మనిషి
తాను  ఎందుకు బతుకుతున్నాడో తెలీని అయొామయంలో అమృతమనుకొని
హాలాహలాన్ని తాగుతుా ఆనందిస్తున్నాడు.
మరచిన మానవత్వానికి మొాడర్న్ లైఫ్
అనే పేరుపెట్టి , కుతంత్రాల ఊబిలో
కర్కశంగా కుారుకుపోతున్నాడు.
వావి వరుసలు మరచిన  వరుస దురాగతాలకు
వందేమాతరం దేశభక్తి గీతం తాళం తప్పిన
పాటై , అపశృతులుపలుకుతోంది.
అశ్రమాలలో అరలో బొమ్మల్లా అమ్మా నాన్నలు,
అవసరాల మీడియాలను  ఆదుకొనే
సమాచారమై నిరుద్యోగులకు పెట్టుబడికి
మాధ్యమాలౌరున్నారు.
మొబైల్ జీవితానికి అలవాటు పడిన  పిల్లలు
మిథ్యా ప్రపంచపు మత్తులో నిజ జీవిత
విలువలను కోల్పోతున్నారు.
మన జీవితాలు నడి సంద్రపు నావ చందమై
ఎటు పోవాలో  తెలీని అయొామయ స్థితిలో
కొట్టుకు పోతున్నాయి.
ఓ !మనిషీ ! నీ " లో " నున్న నిన్ను తట్టి లేపు.
నీకున్న హక్కులను సద్వినియొాగపరచుకొని 
స్వాతంత్ర్యపుారిత  సమ సమాజాన్ని స్థాపించు ॥

హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచన.

****************************


*********************************
(జీవితంలో అనుకోని మలుపులు.
గుర్తుకు వచ్చే సంఘటనలతో
గుండె భారం చేస్తున్న  జ్ఞాపకాలు.
టి.వి.మాధ్యమాల్లోవచ్చే  కఠిన కర్కశ
పదజాలాల పనికిరాని అశ్లీల కథనాల
అంతరంగాల లో పరకాయ ప్రవేశంచేస్తుా
నీ..నా.. బంధాలను తెంచుకుంటున్న
మన జీవితాలు నడి సంద్రపు నావ చందమై
ఎటు పోవాలో  తెలీని అయొామయ స్థితిలో
కొట్టుకు పోతున్నాయి.
ఓ !మనిషీ ! నీ " లో " నున్న నిన్ను
తట్టి లేపు.
మహోన్నుతుడవై "మనీషి" గా ఎదుగు.)

హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచన.

****************************

"కవన కిరణాలు"
తెలుగు సాహితీ సమాఖ్య.
ముాడవ కవితా సంకలనం కొరకు...(పంపినది)

శీర్షిక  : నా దేశం. ఓ మనిషీ! మేలుకో !

శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

అంతస్తుల కొలమానం
అడుగడుగునా రగిలే గోళం
రోజు రోజుకుా దిగజారుతున్న
నైతిక విలువల సంస్కారం .
ఆకలి వేసిన వాడికోసం అన్నదాతలు
పడే కష్టానికి లేదేదీ కొలమానం.
ఆత్మహత్యలే వారికి శరణ్యం.
అడుగు ముందుకేసిన అబల
అన్నిరంగాల లో సాధించిన విజయం.
అంగట్లో బొమ్మైవనిలిచిన  శాపం॥
ఓటు హక్కును" నోటు కోసం
అమ్ముకుంటున్న  జనం .
మాదక ద్రవ్యాల చీకటి వ్యాపారం
మత్తులో తేలుతున్న జీవితం .॥.
చిరిగిన ఝండా నిండా వెలిసిన రంగులు.
అట్టుడికిపోతున్న  బడుగు బతుకులు.
ధర్మ చక్రం చుట్టుా నిండిన చెదలు
బానిసత్వపు బరువు నిండిన కలలు.
రణ నీతుల్లో  ప్రైవేటీకరణల జోరులు .
దోచుకోబడుతున్న దేశ  సంపదల
దిన దిన గండపు హోరులు .
అరవై సంవత్సరాల స్వాతంత్ర్య బాట.
అమ్మకానికి పాడుతున్న వేలం పాట.
నాటి ఉద్యమ కారుల శిల్ప ఖండితాలు
దేశ శివారుల్లో గుట్టలైన వైనం
స్వాతంత్రోద్యమ కారుల చరితలు
పుస్తక పుటలకే అంకితం ॥

హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచన.




మనసులోని మాటలు

శీర్షిక : మనసులో మాటలు.


రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .

అన్నీ ఉన్నా  
అడుగు పడని అసహనం
గుాడులేని పక్షులనడుగు 
ఎంత భయానకమొా జీవితం ॥

ఒడిదుడుకుల గమనంలో
పుాలబాట లెదురవ్వవు.
ముళ్ళున్న దారిలో 
ఏకాగ్రత నువు తప్పవు॥

రంగునిండు ఆకాశంలో
ఇంద్రధనస్సు కనపడేది ఎప్పుడో .
కలలు కన్న  ఆశలు
నెరవేరే దెన్నడో ॥

అనంతమైన సాగరంలో 
 దాగి ఉన్నవెన్నెన్నో  నిధులు.
 లోతుకు దిగాలని భయపడితే 
 పొందలేవుగా కొన్నైనా సంపదలు ॥

కష్ట నష్టాల కావడిని 
మొాసేవాడికే తెలుసు భారం
సుఖ -దుఃఖాల సాగరాన్ని 
ఈదేందుకు  కావాలి ఆత్మస్థైర్యం ॥

కవిత రాయాలంటే 
కావాల్సినది కాదు కలం.
నిజాన్ని నిక్కచ్చిగా రాయడానికి
ముందుండాలి గుండె బలం ॥

-------




ఎక్కడకుా పంపని కవితలు

శీర్షిక  : ఓ మనిషీ ! కళ్ళు తెరువు !

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .


నీలాకాశపు అంచుల్లో  
పరుచుకున్న వెలుగురేకలు
ఎర్రచీర పొత్తిళ్ళలో  లేతగా మెరిసే
 బంగరు రంగు  బంతి బాలుడు ॥
ఉదయ రాగాల  ఉద్యానవనంలో
సప్త వర్ణాల ఇంద్ర ధనుసు పై ఊరేగుతున్న మేఘమాలికలు॥


కురిసిన మంచు బిందువులలో తానమాడి 
ఆకుపచ్చని అందాలతో అలరారుతున్న 
సిరి అందాల తరు చెలియలు॥
మెల మెల్లగా కనులిప్పుతున్న పుా బాలల
పరిమళాల పిలుపుతో పరుగునవచ్చిన 
మధుపములు ॥
పుాల కన్నెల ఆలింగనాలతో ,
ఆస్వాదించిన సుమ గంధాలతోపాటు
మొాసుకెళుతున్న  మధు, పరాగాలు.॥
అలుపెరుగని  నిరీక్షణలో అందాలు 
సంతరించికొని, ఆనంద విహారం చేస్తుా   
పుబాలలతో దోబుాచులాడుతున్న  
సీతాకోకచిలుకలు..॥

పుడమి వనరులకు వెచ్చదనాన్ని పంచేందుకై
గగన  వీధుల్లో విహరిస్తున్న  రవి రాజు.
గిరుల ఝరుల గల-గలలకు , 
రాగ తరంగాలనందిస్తుాన్న
జల కన్యల నాట్య సంగీత , శ్రుతి లయలు.॥
 పిల్ల వాయువులు పరవసించి
ఊదుతున్న వీచికల వేణు నాదానికి , 
వన మయుారులు చుాపుతున్న 
నాట్య భంగిమల నవరసాలు ॥

 ప్రకృతి నియమాలను పుార్తిగా పాటిస్తుా
 పరవశిస్తున్న ముాగజీవులు సైతం
 తమ కర్తవ్యాన్ని తాము మరువనపుడు,
 అన్నీ తెలిసిన మేధావివైనా కుడా
  కుహుా కుహుా రాగాల కోయిలల
  మేల్లొల్పు పాటలకు కనులు 
  తెరువని బద్ధకవేుమి.. నరుడా ..?
  లే ..లేచి అడుగు ముందుకేస్తే 
  చుాడవలసిన అందాలెన్నో నీకోసం..
 బద్ధకించీ మత్తులో మునిగితే , కోల్పోతావు
అందుకోవలసిన  ఆనందా లెన్నెన్నో...॥

హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచన.



********************************

శీర్షిక  : ఓ మనిషీ ! మేలుకో !

శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .

జీవితంలో అనుకోని మలుపులు.
గుర్తుకు వచ్చే సంఘటనలతో
గుండె భారం చేస్తున్న  జ్ఞాపకాలు.
ఒకప్పుడు..
మనదేశం మన సంస్కృతి అంటుా
ఇంటినుండి మొదలైన సాంప్రదాయ
వ్యవహారాలు స్కుాల్ కాలేజీల పరిధిలో
కుాడా పరువు సంపదకు పట్టం గట్టేవి ॥
రోజు రోజుకుా కాలం తో పాటు
మారుతున్న  మనిషి తాను  ఎందుకు
బతుకుతున్నాడో తెలీని అయొామయంలో
మెదడును మధించి అమృతమనుకొని
హాలాహలాన్ని తాగుతుా ఆనందిస్తున్నాడు.॥

రాజకీయ వైఫల్యాలకు 

రంగులు మారుతున్న నీతి న్యాయాలకు

నిలకడ లేని తీర్పులతో  దేశ చరిత

తిరగబడి అల్లకల్లోలమైపోయింది.

మనిషి మరచిన మానవత్వానికి 

మొాడర్న్ లైఫ్  అనే పేరుపెట్టి , 

కుతంత్రాల ఊబిలో
కర్కశంగా కుారుకుపోతున్నాడు.
వావి వరుసలు మరచిన  వరుస 

దురాగతాలకు వందేమాతరం 

దేశభక్తి గీతం తాళం తప్పిన
పాటై , అపశృతులుపలుకుతోంది.
అశ్రమాలలో అరలో బొమ్మల్లా 

అమ్మా నాన్నలు,అవసరాల 

మీడియాలను  ఆదుకొనే

సమాచారమై నిరుద్యోగులకు 

పెట్టుబడికి మాధ్యమాలౌరున్నారు ॥

మొబైల్ జీవితానికి అలవాటు పడిన  

పిల్లలు , మిథ్యా ప్రపంచపు మత్తులో 

నిజ జీవిత విలువలను కోల్పోతున్నారు.
టి.వి.మాధ్యమాల్లోవచ్చే  కఠిన కర్కశ
పదజాలాల పనికిరాని అశ్లీల కథనాల
అంతరంగాలలో పరకాయ ప్రవేశంచేస్తుా
నీ..నా.. బంధాలను తెంచుకుంటున్న
మన జీవితాలు నడి సంద్రపు నావ చందమై
ఎటు పోవాలో  తెలీని అయొామయ స్థితిలో
కొట్టుకు పోతున్నాయి.
ఓ !మనిషీ ! నీ " లో " నున్న నిన్ను
తట్టి లేపు. 
మహోన్నుతుడవై "మనీషి" గా ఎదుగు.

హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచన.

****************************


Tuesday, February 1, 2022

ఓ మనిషీ! మేలుకో!

"కవన కిరణాలు"
తెలుగు సాహితీ సమాఖ్య.
ముాడవ కవితా సంకలనం కొరకు...(పంపినది)

శీర్షిక  : నా దేశం.

శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

అంతస్తుల కొలమానం
అడుగడుగునా రగిలే గోళం
రోజు రోజుకుా దిగజారుతున్న
నైతిక విలువల సంస్కారం .
ఆకలి వేసిన వాడికోసం అన్నదాతలు
పడే కష్టానికి లేదేదీ కొలమానం.
ఆత్మహత్యలే వారికి శరణ్యం.
అడుగు ముందుకేసిన అబల
అన్నిరంగాల లో సాధించిన విజయం.
అంగట్లో బొమ్మైవనిలిచిన  శాపం॥
ఓటు హక్కును" నోటు కోసం
అమ్ముకుంటున్న  జనం .
మాదక ద్రవ్యాల చీకటి వ్యాపారం
మత్తులో తేలుతున్న మనిషి జీవితం .॥.
చిరిగిన ఝండా నిండా వెలిసిన రంగులు.
అట్టుడికిపోతున్న  బడుగు బతుకులు.
ధర్మ చక్రం చుట్టుా నిండిన చెదలు
బానిసత్వపు బరువు నిండిన కలలు.
రణ నీతుల్లో  ప్రైవేటీకరణల జోరులు .
దోచుకోబడుతున్న దేశ  సంపదల
దిన దిన గండపు హోరులు .
అరవై సంవత్సరాల స్వాతంత్ర్య బాట.
అమ్మకానికి పాడుతున్న వేలం పాట.
నాటి ఉద్యమ కారుల శిల్ప ఖండితాలు
దేశ శివారుల్లో గుట్టలైన వైనం
స్వాతంత్రోద్యమ కారుల చరితలు
పుస్తక పుటలకే అంకితం ॥

హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచన.