Monday, May 31, 2021

ప్రత్యేక వృత్తాలు - ద్రుతవిలంబితము*

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
*ప్రత్యేక వృత్తాలు -  ద్రుతవిలంబితము*

లక్షణములు :  న భ భ ర
యతి  :  7వ అక్షరము
ప్రాస నియమము కలదు
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
రవికులోత్తమ! రామ! దయానిధీ!
భవభయాపహ! భాగ్యవిధాయకా!
భువనమోహన! మోహవినాశకా!
శివసఖా! హరి! చేసెద నీ నుతుల్
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

Sunday, May 30, 2021

అంశం : : మనసులో బలం -కరోనా తిరోగమనం.

అంశం :  : మనసులో బలం -కరోనా తిరోగమనం.
రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక  : మన ఆరోగ్యం మన చేతిలో..

రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .
8097622021.

సంచలనం రేపే కరోనా ఆగమనం.
రెండు వత్సరాలుగా రేపుతున్న కల కలం  .
మొదటి విడత చేసిన మారణ హోమం
మనుషుల్లో రేపింది మనో భయం.॥

తెలియని రోగానికై తర్జన భర్జనల తర్కం
సామాజిక దుారాలు,మాస్క్ ధారణలే వైద్యం.
పెరుగుతున్న దుారాలు మానసిక వ్యధలు
అవసరాల ఆటుపోట్లు అగని రాక పోకలు॥

అంటు రోగం రేపిన కార్చిచ్చు నిండిన అసహనం.
అందరిలో చెలరేగిన తెగువ నిండిన మనోబలం.
అన్ని వైద్య రంగాలుా కలిపి చేస్తున్న ప్రయొాగం.
విఫలమౌతున్న ప్రయత్నాల విధి వంచిత వలయం.॥

మనోధైర్యం సడలని మానవ మేధస్సు మధనం.
విజయ కేతనం ఎగరేసిన ముాలికల వైద్యం.
మన ఆరోగ్యం మన ,చేతల్లో  చేరిన వరం .
త్వరలోనే కరోనా రక్కసి తిరోగమనం. ॥
---------------------------------------------------

ప్రకృతి వరాల ముాలికా ధనం ఆయుర్వేదం .
జగతి తరుా సంపదల గుర్తింపుకు నిదర్శనం ॥
(చెట్లను కాపాడండి. ప్రాణాలు నిలుపుకోండి.).


శీర్షిక : మనిషి మారాలన్న.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక  :  మనిషి మారాలన్న.

మనసు మనసో యనుచు  మన నెేమి లాభమది
మనసు మాటను విన్న  మనిషెవడు ధరలోన॥

మనసు మంచిని చెప్ప  మనిషి బుద్దెరుగదుగ
మాయ మాటల జెప్పి మనసణచి వేతురుగ ॥

నా ఇల్లు నా వాళ్ళు  నాది నాదని కోరి
నమ్ము వారిని గుాల్చె  సొమ్ము  సోకుల కన్న

స్వార్ధ మదె పెరుగగా  వ్యర్ధ జీవిగ మారి
వేల తప్పుల జేసి  వెతలెన్నొ పడుదురుగ ॥

-------------------------------------------------------

ధనము కొరకై పోరు ధనము కొరకే హోరు
జనము నమ్మిన నోటు ధనముకమ్మిరి ఓటు॥

ధన మదముతో మనిషి తన -పరల నెరుగకను
అధికార బలము తో ఆధిపత్యము జేసె॥

మితిమీరె పరిధులు అతివ కవమానములు
కన్నీటి కార్చిచ్చు  కరిగె సిరి సంపదలు॥

నాడున్న సుఖ శాంతి  నేడు జగతిని లేదు
అన్ని తెలిసీ మనిషి   ఆశ వీడుట లేదు ॥

---------------------------------------------------

చదువున్న వారేమొ  చవిలేని బ్రతుకేల
చదువు లేనివారదె  చక్క పాలకులైరి ॥

అవగాహనాలోప మవని నిక్కటులేల
జనులెల్ల  జడులైరి జడిసి పాలకులకుా॥

మానవత్వము తరిగె  దానవత్వము పెరిగె
మమతానురాగాలె  మట్టికలిసీపోయె॥

మార్పు రావాలంటె మనిషి మారాలన్న
ఇలనీశ్వరీ మాట  ఇచ్ఛతో వినుమన్న ॥
-------------------------------------------------

తెలంగాణా ! కోటి రతనాల వీణ !.

శీర్షిక  : నవ తెలంగాణ ఆవిర్భావం .
వచన కవిత.

గత యాభైఆరు సంవత్సరాల లో
ఎన్నో మజిలీలు దాటిన తెలంగాణా॥
ప్రత్యేకమైన భాషా, సాంప్రదాయాలుండి
ఎన్నో చారిత్రాత్మక  విలువలు నిండిన 
కోటి రతనాల వీణ మన తెలంగాణ ॥

స్వాతంత్ర్యానంతరం కుాడా నిజాం
 పాలనలో నిరంతర నిస్సహాయత్వం
1950 లో తెలంగాణ ఆవిష్కరణ .
ఆంధ్ర ప్రదేష్ తో కలిసిన రాష్ట్ర  విభజనకై
మొదలైన "జై తెలంగాణ " రాష్ట్ర ఉద్యమం .

ప్రజల మధ్య నెలకొన్న చారిత్రాత్మక, ఆర్ధిక
సాంస్కృతిక రాజకీయ అసమానతల తో
వివిధ ప్రాంతాల మధ్య ఏర్పడిన భావోద్వేగ
విభేదాలు ఉద్యమానికి పొిసిన ఊపిరి.

ప్రత్యేక తెలంగాణ కై బి జె పి మద్దతు ఘనం.
కె సి ఆర్  ఆమరణ నిరాహార దీక్షా ఫలం.
2014 లో ఆంధ్ర ప్రదేష్ నుండి విడివడిన 
తెలంగాణ  ప్రత్యేక రాష్ట్ర  ఆవిర్భవం.

పునరజన్మెత్తిన తెలంగణా సాధించిన వైభవం
 సాంప్రదాయ పండగల ప్రాశస్త్య  ప్రాభవం
బతుక్మ వేడుకల బోనాల సంస్కృతి తో ప్రారంభం.॥

"మిషన్ కాకతీయ" పధకాలతో సాగునీటి -
చర్యల వర్షాధారిత వ్యవసాయ ప్రాంతాల 
అభివృధ్ధికి సంపుర్ణ సహకారం.
రైతులకు  ఉపాధి కలిగించిన కేంద్రం.॥

నేటి తెలంగాణా 
అమరవీరుల స్మారక స్థుాప స్థాపన ఘని.
సంగీత సాహిత్యాది నవరసాల సుమ వని.॥ 
చారిత్రాత్మక  ఉద్యమ పొిరాట వీరుల మనన 
పాత కొత్త కలయికల పరిపుార్ణ సంపదల సుజని । 


మరుగు పడిన నాటి తెలంగాణ జానపద 
గాన కళలు నాటి జీవన శైలిని ప్రతిబింబింపజేసే 
 వైభవోపేత జీవనానంద ప్రజా చైతన్య  ఖనులు.
ఖ్యాతి కెక్కిన నాటి చరితల బాట నేటి తెలంగాణ ॥

శీర్షిక : మన ఆరోగ్యం మన చేతిలో

అంశం :  : మనసులో బలం -కరోనా తిరోగమనం.
రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక  : మన ఆరోగ్యం మన చేతిలో..

సంచలనం రేపే కరోనా ఆగమనం.
రెండు వత్సరాలుగా రేపుతున్న కల కలం  .
మొదటి విడత చేసిన మారణ హోమం
మనుషుల్లో రేపింది మనో భయం.॥

తెలియని రోగానికై తర్జన భర్జనల తర్కం
సామాజిక దుారాలు,మాస్క్ ధారణలే వైద్యం.
పెరుగుతున్న దుారాలు మానసిక వ్యధలు
అవసరాల ఆటుపోట్లు అగని రాక పోకలు॥

అంటు రోగం రేపిన కార్చిచ్చు నిండిన అసహనం.
అందరిలో రేపిన తెగువ నిండిన మనోబలం.
అన్ని వైద్య రంగాలుా కలిపి చేస్తున్న ప్రయొాగం.
విఫలమౌతున్న ప్రయత్నాల విధి వంచిత వలయం.॥

మనోధైర్యం సడలని మానవ మేధస్సు మధనం.
విజయ కేతనం ఎగరేసిన ముాలికల ఘనం .
మన ఆరోగ్యం మన ,చేతల్లో  చేరిన వరం .
త్వరలోనే కరోనా రక్కసి తిరోగమనం. 

ప్రకృతి వరాల ముాలికా ధనం ఆయుర్వేదం .
జగతి తరుా సంపదల గుర్తింపుకు నిదర్శనం ॥



Saturday, May 29, 2021

శ్రీ శ్రీ కళా వేదిక

🌹సాహితీప్రియులకు అభినందనలు.🌹 
విభిన్న అంశాల వేదిక
మన శ్రీ శ్రీ కళావేదిక .....
నేటి విపత్కర పరిస్థితుల్లో కనిపించని సూక్ష్మజీవి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూంటే,కరోనా మృత్యుఘంటికలు మోగించి బంధాలను,అనుబంధాలని సమాధి చేసి ప్రళయం సృష్టిస్తుంటే, మానవతాదృక్పదంతో సమాజం ఉండాలని కవులు తన కలాలను ఝుళిపించారు...
సాహిత్యం సమాజానికి ఉపయోగపడేలా మన  రచనలు,కవితలు ఉండాలని సాహిత్యం లో విప్లవాత్మకమైన మార్పులు తేవాలని శ్రీ శ్రీ గారిని ఆదర్శంగా తీసుకొని అక్షర యజ్ఞం చేయిస్తున్న మన శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్, ప్రభుత్వ గుర్రం జాషువా అవార్డు గ్రహీత,అక్షర తపస్వి, శ్రీ డా.కత్తిమండ ప్రతాప్ గారు నిర్వహించిన అంశం"కరోనా డేంజర్ బెల్స్ "  కవితాపోటీ కి విశేషమైన స్పందన వచ్చింది. శ్రీ శ్రీ కళావేదిక ఫేస్ బుక్  రెండు గ్రూప్ లలో వాట్సాప్ వేదికగా,పోటీకి 223 మంది కవులు వారి కవితలను వ్రాసారు...
అందరికి మా శ్రీ శ్రీ కళావేదిక 
అభివాదములు...
వారిలో "టాప్ 20" విజేతలను ఎంపిక చేయడం జరిగింది...
🌹🌹విజేతలకు అభినందనలు🌹🌹
సహవిజేతలకు కృతజ్ఞతాభినందనలు...
పాల్గొన్న ప్రతి ఒకరికి హృదయపూర్వక ధన్యవాదములు  తెలియచేస్తున్నాం...
ప్రతి ఒకరికి ప్రశంసాపత్రాలు అందచేయబడతాయి....
    🌹శ్రీ శ్రీ కళావేదిక కార్యవర్గం🌹
💐టాప్ 20విజేతలు💐
1.తెలికిచర్ల రాజ కృష్ణ కామేశ్వరరావు గారు.
2.సిద్దగాని భాగ్యలక్ష్మి గారు. 
3.మంజుల సూర్య గారు.
4.వాణీ సరోజినీ లక్కరాజు గారు.
5.ప్రభావతి దొంతు గారు.
6.కావ్య నరేష్ గారు. 
7.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు.
8.అల్లాడి శ్రీనివాస్ గారు. 
9.మొంగం అమృతరావు గారు.
10.షేక్ అబ్దుల్ హకీమ్ గారు.
11.నాశబోయిన నరసింహ గారు.
12.నాగారపు సత్యనారాయణ గారు.
13.సంధ్య యెరుసు గారు. 
14.శ్రీతరం బింగి శ్రీ కాంత్ గారు.
15.వాసి జ్యోత్స్న గారు. 
16.విజయ రామగిరి గారు. 
17.గాజుల నివేదితా సందీప్ గారు.
18.సత్య చాగంటి గారు. 
19.V.కృష్ణవేణి గారు.
20.కొప్పుల ప్రసాద్ గారు.

చిరునవ్వు

ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశం : చిరునవ్వు. 

రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర


శీర్షిక : నవ్వే సింగారం.


లేవగానే చిరునవ్వుతో  పలకరించు.
మనసులో మాలిన్యం తొలగి
రోజంతా ప్రసన్నంగా గడుస్తుంది.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥

నలుగురితో నవ్వుతుా మాట్లాడు
అందరుా  నీస్నేహాన్ని కోరుతారు.
ఆపదలో ఆదుకునేది స్నేహితులే.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥

నవ్వు ఆరోగ్యానికి  సోపానం.
హాయిగా  నవ్వేవాళ్ళ ఆయువెక్కువట
నవ్వు నవ్వించడమే జీవితానందం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥

కష్టల్లో ఆయుధం చిరునవ్వు
ఆత్మవిశ్వాసానికి  ఆలంబన చిరునవ్వు.
ఉమ్మడి కుటుంబాలకు ఊపిరి.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥

అతివకు అందం చిరునవ్వు.
బంధాల నిలుపు చిరునవ్వు.
పలకరింపుల పరవశం చిరునవ్వు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥


ప్రక్రియ: హయప్రచార రగడ

రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర

ప్రక్రియ: హయప్రచార రగడ
అంశము: శ్రీనివాస.

-----------------------------------

శంఖ చక్ర గదా ధరా
వేంక టేశ అభయ కరా॥

భక్త పొిష బహుస్వ రుాప 
ముక్తి మొాక్ష  ముాల రుాప ॥

విమల చరిత విశ్వ నేత్ర 
కమల నయన ఘనసు గాత్ర ॥

 కలభ గమన కరుణ లోల
 సులభ ప్రాప్త  సుగుణ జాల॥.

వర ప్రదాత వంద్య మాన.
సుర వినుత సుజన ధ్యాన॥

అభయ కరా అఘవి నాశ 
శుభక  రాసు జ్ఞాన పోష ॥

మంగ పతీ మధుర శ్రీశ.
భంగ గర్వ భయవి నాశ ॥

ఆప్త, ఘనా అసుర  దుార   ॥                       
సప్త  గిరిశ  సగుణ  పార

వేద విదిత వేంక టేశ
నాధ లోల నట నటేశ ॥.

శరణు శరణు శ్రీనివాస
శరణు శరణు శ్రితపరేశ ॥

సవరించి పంపినదండి.

Friday, May 28, 2021

పద్యాలు

[5/25, 13:23] p3860749: వాగ్దేవీ కళాపీఠంలోి
దత్తపది
*ఇంత - ఎంత - అంత - వింత*
-రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .: మహారాష్ట్ర .
8097622021.

ప్రక్రియ : ఆటవెలది., తేటగీతి.

(ఇంత) హీనదినము  లిలనెరుగ నేను
(ఎంత) (వింత )కణము ? ఎటుల వచ్చె..?
(అంత)మైనవి గద  ఆత్మీయతలు నేడు    
కరకు కష్టములిల  కలిని  మించె ॥

ప్రక్రియ : తేటగీతి.

ఎంత -మధుర నాదము దాని  నెంచ తరమ  
వింత- వేణు నాదములవి వినగ విందు. 
ఇంత- అందగాడు యశోద కిలను వరము
అంత- మదెజేసె నసురుల నాట గాను ॥
[5/26, 21:25] p3860749: బుధవారం - దత్తపది.
వాగ్దేవీ కళాపీఠం లో---------------
  
అంశం  సీత - రామ - లక్ష్మణ - హనుమ* 

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .: మహారాష్ట్ర.

శీర్షిక  : మా ఇంటి సిరి కొమ్మ.
మినీ కవిత.

మా ఇంట పుట్టింది 
బంగారి సిరి కొమ్మ ॥
(సీత)మ్మ  కన్నమ్మ 
బంగారు ఒడినమ్మ॥
మనసా(రా మ)ధురముగా
 నవ్వేడు (లక్ష్మన్న)  .
  రక్త బంధమె మిన్న
  సీతమ్మ కతడన్న.
(హనుమం)త రాయలదె
సీతమ్మ  పతి వాడు
మైమరచి పోయేడు
మనసున్న చెలికాడు॥
-------------------------

బుధవారం - దత్తపది.
వాగ్దేవీ కళాపీఠం లో---------------
అంశం :*సీత - రామ - లక్ష్మణ - హనుమ* 

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .: మహారాష్ట్ర.

మినీ కవిత.
శీర్షిక : సీతా రాముల సంగమం .
------------------------------------------

(సీతా )రాముల వనవాసము లో
రాముని చుసెను సుార్ఫణఖ॥
అందమతనిదే అలరించంగా
ఆమె కోరిన దతని వరునిగా॥
రామానుజుడు (లక్ష్మణ) సుారుడు
ముక్కుా చెవులే కోసెను ఘనుడు॥
(లక్ష్మణ) చర్యకు లంక  బెదరెను॥
సుార్ఫణ ఏడ్పుకు రావణు డుాగెను॥
తమ్ముని మాయా మారీచునదె
బంగరు లేడిగ వనికి పంపెను.॥
సీత లేడి  గని ముచ్చట పడెను.
రాముడు లేడిని వెంట తరిమెను॥
రావణు డదిగని భిక్షమునడిగే
నెపమిడి సీతను అపహరిఃచెను.॥
రాముడు కృంగెను రమణిని బాసి
స్వాంతన నిడె సుగ్రీవుని కలిసి.॥
రామకధను విని రామ భక్తుడు
సంద్రము దాటెను (హనుామం)తుడు॥
సీతను జుాచెను లంకను కాల్చెను
(రామ-) సీతలా వ్యధలను బాపెను ॥
(సీత) జాడగని లంకను జేరి
రావణు జంపెను రణమున రాముడు॥
సీతారాముల సంగమమునకు
హనుమ కారకుడు రామ భక్తుడు ॥
భువిలో నెపయడుా ధర్మమె గెలుచును
మర్మము వీడి మసలు వారెపుడు
రాముని వలె శుభ కీర్తు లేలును ॥
-----------------------------------------
[5/27, 16:44] p3860749: వాగ్దేవీ కళాపీఠం లో 
చిత్ర కవిత
ప్రక్రియ : ఆటవెలది పద్యము.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
 
మందు లేని మహా మారికి  విటమిన్ల
మాత్ర లనుచు  కోర్సు మందు లిడుచు
వెరసి జబ్బు పెరగ వెేల  రుాకలు గుంజు
వింత వైద్యుల కిల విలువ గలదె ॥

 ప్రక్రియ : తేటగీతి  పద్యము.

మాత్ర మాత్రము చేతను  మాయ మగున
మందు లేనట్టి  దికరోన మరచి పోకు.
సుచగు  ఆచార వ్యవహార  సులభ గతులె
మనను రక్షీంచు మందులు మహిని మనుజ ॥

Thursday, May 27, 2021

ఆంజనేయుడు!!!

ఆంజనేయుడు!!!
 ============
 వాయుపుత్రుడువానరదేవుడు
 వజ్ర తేజుడుఅంజనీ తనయుడు ఆపదమొక్కుల మా ఆంజనేయుడు 

 రామబంటుడురాముని భక్తుడు  శ్రీరామచంద్రమూర్తీ
 రామదూత  అతి బలవంత

 రామరామఅంటూ నిన్ను  ఎదలోతలచి  మదిలోన కొలిచి
 భక్తితో ప్రేమగా పిలిచి 
 మీ పాదాల దగ్గర ఎప్పటికీ  నిలిచి  

దైవంగానామస్మరణ చేస్తూ  
 ధ్యానంలో నిన్ను పూజిస్తూ

 హృదయాన్ని చీల్చి
రావణా లంకలోకాల్చి 
తల్లి సీతమ్మ జాడను తెచ్చి                        
 రామయ్య కు ఇచ్చి ఇష్టపూర్వకంగా నీవు నచ్చి

 తన గుండెలకుహత్తుకున్నాడు
 శ్రీరాముడినీ  ఊపిరిగా
శ్వాసలో భావిస్తాడు

 నింగిలోకి  రివ్వురివ్వున ఎగురుతూ 
నిన్ను ఎంతో వేడుకుంటాడు
  భక్తి భజన పాటలు పాడుతూ  తండ్రికే పరిమితమవుతాడు 

 సంజీవిని  తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడినావు    కపీకిషోరుడా శివశక్తివంతుడా 

 నీవు ఎంతో అపురూపం
 నీ  ఒళ్లంతా రామ నామం
 మనస్సులో స్మరిస్తూ ఉంటూ
 రామా రామా అంటూ
 రాముడానీవులేకుంటేనాకు రంది 
 చేసిన మేము నీ గుండెలో బంది 


 కన్న తల్లి సీతమ్మ కొరకు కష్టాలు పడ్డావు  ప్రాణాలకు తెగించి పట్టాభిరాముడి భక్తుడి అయ్యావు  


పాదాల చెంత చేరినావు  భక్తితో కోరినావు రామబంటు గా మారినావు 

కోటి భక్తులకు కొండంత అండ 
వేస్తాము నీ మెడలోపూలదండ



రచన !!&&
========
 గజ్వేల్ నాగరాజు&
 గ్రామం దుద్దెడ&
 మండలం కొండపాక&
 జిల్లా సిద్దిపేట&

Tuesday, May 25, 2021

నేల తల్లి.కవిత

గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక నేలతల్లి కవితల పోటీ కొరకు 

అంశం : నేల తల్లి 

శీర్షిక :  తల్లిగ క్షమిస్తున్నా

పృథ్వికి పుట్టెడు దుఃఖం పుత్రుల వలన 
రత్నగర్భకు రోదన సుతుల వలన
చెడ్డ కొడుకు గలడు ఇలలోన
చెడ్డ తల్లి ఉండబోదు కలనైన

నా తనువంత తూట్లు పొడిచినా 
పచ్చని పంటనే తిరిగి మీకిస్తున్నా 
నా బొజ్జన బొరియలు వేసినా 
మంచి నీటినే మీకందిస్తున్నా

నా కాయాన్ని ఖండాలు చేసినా  
బంగారాన్నే బదులుగా ఇస్తున్నా
నా తరువుల రెక్కలు విరిచినా
ప్రాణవాయువిచ్చి ప్రాణం పోస్తున్నా

బహుళంతస్తుల భావనాలెన్ని కట్టినా 
భారాన్నంతా పంటిబిగువన భరిస్తున్నా
భారమెక్కువై  నా భుజాలు వణికితే
కలిగిన అనర్ధానికి మన్నించమంటున్నా  

వ్యర్ధాలతో నా వదనాన్ని నింపినా 
ఎరువుగా మీకే మార్చిస్తున్నా 
కన్న కడుపునే కాలితో తంతున్నా
ఓర్పుతో సహిస్తున్నా, తల్లిగ క్షమిస్తున్నా

==== **** ==== **** ====

జె వి కుమార్ చేపూరి
హైదరాబాద్ – 500 019
చరవాణి : 96407 12062

Monday, May 24, 2021

తీరని ఋణం

అంశం : గురువు.

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .: మహారాష్ట్ర .

శీర్షిక   : తీరని ఋణం.

మనిషి గా పుట్టిన ప్రతీ జీవికి
భగవంతుడిచ్చిన వరం బుద్ధి -
జ్ఞానమనే అదృష్ట సోపానాల వరం.
తొలి దశ ఐన , బాల్యావస్టలో
అమ్మ ఒడిలో పెరుగుతుా
 ముద్దుగా తినిపించే గోరు
 ముద్దలతో చెప్పేవ చందమామ
 కధలతో మొదలయ్యే ఆశక్తి
 తొలి  గురువుగా  అమ్మ నీ
 మదిలో వేసిన విద్యా బీజం.
 మలి నడకల సందళ్ళ లో కలిగే
 మానసిక వికాశపు పరిచయం.
  ప్రపంచ  రీతుల మార్గదర్శకం..
  నాన్న చుాపే జ్ఞాన  బాటకు వేసిన
  తొలి అడుగుల ప్రయాణం.
 జీవిన గతికి నీతి నియమాల
 కట్టుబాట్ల కాల చరితలను
 విశదీకరించి , సంపుార్ణ జ్ఞాన 
 వికాశానికి చేయుాతనిచ్చి మనకు
 మార్గ దర్శకం చేసేది సద్గురువులు.
 అక్షర జ్ఞాన శ్రీకారంతో ఆదర్శాల
 విలువలతో, ఆత్మ జ్ఞాన వలువలను
 తొడిగేది గురువు మాత్రమే.
 అటు సం,స్కృతి ,సాంప్రదాయాల 
 సారాన్ని , ఇటు సార విద్యావి ధానాన్ని
 బోధిస్తుా , జీవిత గమనానికి కావలసిన 
 అర్హతల విజయ సోపానాన్ని 
 చేయిబట్టి  ఒకొక్కటిగా ఎక్కిస్తుా 
 సుఖ తీర గమ్యానికి చేర్చేది గురువొక్కడే.
 అటు తల్లిదండ్రులు , ఇటు గురువులు
 పడిన కష్టానికి , మన జీవితమంతా 
 ధారపొిసినా తీరని ఋణ గ్రస్తులం.
 విద్యతో వినయాన్ని , జ్ఞానం తో
 జీవితాన్ని ధర్మ బాటలో అనుసరిస్తుా
 మన జన్మ సార్ధకత చేసుకొనే 
 అవకాశానికి ఆది నుండి అంతం వరకు
 ఆదర్శ  నాయకులుగా నిలచిన
 తల్లిదండ్రులకు , సద్గురువులకు 
 గౌరవంతో సాదర ప్రణామములు ,
 చేస్తున్నాను. 
 -------------------------------------------

జీవామృత ఖని ధరణి.

22/05/2021
గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లుారు జిల్లా వారి-
కవితా పోటీల  కొరకు-
అంశం : ధరిత్రీ దినోత్సవం.

రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .8097622021.

శీర్షిక  ; జీవామృత ఖని ధరిత్రి.


సశ్యశ్యామలమైన  ప్రకృతి అందం.
రంగు రంగు పుాల పరిమళాల గంధం
ప్రాణవాయువుకు కొరత లేని  దైవీ సంపద
శోభాయమానమైన వృక్షరాజాలు నిండిన వసుధ
పశు పక్ష్యాదులకాధారమైన జీవనామృత సుధ.
ఎనలేని పచ్చదనపు తరులు గిరుల అందాలు.
అమృతతుల్యమౌ ఓషధీ వన నిలయాలు.
 గిరి ఝరీ ప్రవాహాల పవిత్ర గంగానదీ, నీరాలు
దాహార్తిని తీర్చేటి  స్వశ్ఛ ఆరోగ్య జల పానాలు.
తలలుాచే  పచ్చని పైరులు నిండిన భుాములు
సాగు చేసే రైతన్నల జీవిత ధనాగారాలు.
వెల లేని  సంపదల  భుాగర్భ  గనులు 
రత్న గర్భయైన భుామాత  ఒడి నిండిన ఖనులు.
జీవరాసులు నిండు అంతులేని సాగరాలు.
రంగులీను జాతి ముత్యాలకవి ముాలాలు
 జనవ జీవన గతి కనువైన ఆరు ఋతు చక్రాలు
పంచ భుాతాలు, సార పటిష్ట జనజీవనోపాధులు.
సార, రస, ఫల వృక్షాలు, వన సంపదల అందాలు.
 జిివ, జన ,జంతు , క్రిమి కీటకాదుల కాధారాలు.
సార భుా జలాలు, అపార జీవన నిత్య  పోషకాలు 
ఇటువంటివెన్నోసార భుా మాత మనకిచ్చిన 
అద్భుత వరాలు.ధరిత్రీ దినోత్సవ సందర్భంగా 
ఆమెకు నా కృతజ్ఞతాభి వందనాలు.




హామీ : ఈ నా కవిత ఏమాధ్యమునందునుా 
ప్రచురితం కాని నా స్వీయ రచన.

Friday, May 21, 2021

పుష్ప విలాపం

పుష్ప విలాపం
అందాల పుాబాల వికసించె  పరువాల ,
కలువ కన్నులతోడ చుాచె నాడా ఈడ ।
వింత లోకపు తీరు నెరుగనట్టిది బాల ,
ఎంతగానో మురిసె మనుగడెరుగని బేల ॥

అతోటలో పుాలు రంగు వలువల చెలులు,
వలపు వింజామరల పంచె సౌరభములు ।
మొగ్గ తొడిగిన సాటి పుాల బాలల తోడి ,
కవ్వింత తుళ్ళింత  లాడి పాడెను కలసి ॥

అంత నరుదెంచెనా  తోట  వనమాలీ,
పుాల బాలల  తెంపె వాడు దయమాలి।
విరిసి విరియని పుాల చేర్చె నంగడిలోన,
వెలగట్టి తెగనమ్మె కఱకు సందడితోన॥

చిదిమె కొందరు వాని  నలిపె భోగులు మేని,
కొన్ని చేరెను గుడికి..ఎన్నొ నలిగెను చితకి।
కన్నీట మున్నీట వాడి రాలెను నేల,
ఏల పుాచితి  ననుచు  వగచె  నలిగిన బేల ॥
-----------------------------------------------------------

                                           రచయిత్రి
                             పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
                                              కల్యాణ్.

అంశం : పుష్ప విలాపం., ప్రక్రియ  ఇష్టపది 

రచన :   శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర 

ప్రక్రియ : ఇష్టపది.

రంగు రంగుల పుాలు రమణీయమౌ పుాలు
పరిమళించునుండె  పరువాల వని లోన ॥

ఆరోజె వికసించె నందాల పుా బాల
కలువ రేకుల వంటి కనులిప్పినది బేల॥

వింత లోకపుతీరు  వినలేదు కనలేదు
చెంత విరిసిన చెలుల చేరి మురిసెను బాల ॥

రంగు వలువల చెలుల రమణీయ గంధముల
ఆటలా పాటలా  ఆడి మురిసెను చాల ॥

అంతలోనరుదెంచె నా తోట వనమాలి
పుాబాల లను తెంపె పుాని కోసెను అన్ని

తల్లి చెట్టును వీడి  తరలొపోగను దలచి
కన్నీరు మున్నీరుగా నేడ్చె పుాలన్ని॥

విరిసి విరియని పుాల విక్రయించగ నెంచి
వెలగట్టి తెగనమ్మె  వెరవకను దయమాలి ॥

అందాల పుా బాల అరచి ఏడ్చెను గాని
ఆమె మాటను వినరు  ఆబాధ కనరెవరు ॥

చిదిమెకొందరు వాని  చిల్లు చేసిరి మేని
కొన్ని చేరెను గుడికి కొన్ని భోగుల దరికి ॥

నలిగె నడుగుల కొన్ని  వెలిగె జడలో కొన్ని
పలు చోట్లకంపబడ  పగిలె రెేకలు కొన్ని॥

అన్ని చుాచిన బాల అదిరి పెట్టెను గోల
ఏల పుాచితిననుచు  ఏడ్చి అలసెను బేల ॥

పాడు లోకము తల్లి బతుకు భారము చెల్లి
ఈ తీరు మారదని ఈశ్వరిల రోదించె ॥





 








Sunday, May 9, 2021

నిరక్షరాస్యత ...ప్రక్రియ :తేనియలు

అంశం : నిరక్షరాస్యత.
ప్రక్రియ : తేనియలు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

అక్షరాలవి ఆత్మ జ్ఞానం
మనిషి మనుగడకు మంచి పునాది  
వికసించిన దౌ మనో వికాశం.
విషయావగాహనకు స్ఫుార్తి అది ॥

నిరక్షరాస్యత విస్తృతంగా
భరతావనిని నిండిన లోపం 
ఎదుగు బొదుగు లేని జీవితాల
బడుగు బ్రతుకుల తీరని శాపం.

అవకాశాలు కల్పించలేని
నాయకుల నిర్లక్ష్య వైకల్యం      
విద్యావ్యవస్థల నీతి లేని
చర్యలకు బలౌతున్న బాల్యం॥

ఓటును నోటుకమ్మిన  వైనం
విలువ తెలియని  అమాయకత్వం
వత్సరాలుగ ఎదగని దైన్యం 
పాలకుల మాటకు పరవశత్వం॥

పుణ్య కార్యం విద్యా దానం
మనసారగ మన్నికతో చేయి
వేల  జీవితాల బ్రతుకు ధనం
చరితలో నిలచిపోతావోయి ॥


Saturday, May 8, 2021

నెేను మావారు

సుాక్ష్మ కావ్యం.
బుర్రా వేంకటేశంగారి కొత్త సాహిత్యం.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక  : నేను మావారు .

నాచిరునామా మావారింటి పేరుతో
మావారి ఆనందం నా చిరు నవ్వులో॥ 

నా అలంకరణల ప్రేరణ వావారు
వారికి ఇష్టమైనట్లు ఉండడం నాకిష్టం.

నా ప్రేమ వారికి ఇష్టమైనవి వండడం
వారి ప్రేమ ,వంకలు పెట్టకుండా తినడం.

మా ఇద్దరి టైమ్ పాస్ గేమ్
అప్పుడప్పుడు గిల్లికజ్జాలు.

అలకలు బుజ్జగింపులు
అవే మా ముద్దుా మురిపాలు

మా ఇద్దరి ఆనందం.
చిన్న ఇంటికై బోలెడు కలలు .

మచ్చటైన పరివారం.
మేమిద్దరం  మాకిద్దరు.

మా ఇద్దరి బంధానికి సంకెళ్ళు.
మా ఇద్దరు పిల్లలు

మా ఇద్దరి బాధ్యత...
మా పిల్ల ల ఉజ్జ్వల భవిష్యత్తు.

మా ఇద్దరి ఆనందం.
బంధు జనులతో సఖ్య సంబంధం. 

స్నేహితులే మాకు బలగం.
మా ఇల్లే మాకు స్వర్గం.
----------------------------

Wednesday, May 5, 2021

రవీంద్రనాథ్ ఠాగూర్

తెలుగు భారత ఎస్.వి ఫౌండేషన్  జనదీపిక  ఆద్వర్యం లో..
అంశం : రవీంద్రనాధ్ ఠాగూర్ .
శీర్షిక : జాతీయ గీత కర్త.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

 ప్రక్రియ : ఆటవెలది పద్యాలు.

రచన లెన్నొ చేసి  రంజింప జేసేటి
సార సద్గు ణాల సత్య వాది
ఘనపు కీర్తి నిడెను కావ్య గీతాంజలి
నోబులు బహుమతిని  ఒసగి రంత॥

మాన వత్వ మున్న మంచి మనిషితడు.
కావ్య రచన జేయు  కళల ప్రియుడు
పద్య, వ్యాస రచన బహుప్రీతిగాజేయు
కవివ రేణ్యు డితడు ఘను డతండు ॥

విశ్వ భారతనెడు విశ్వవిద్యాలయం
స్థాప నతడు జేసె స్థాన కళకు
సర్వ మతము లన్ని ససమాన మనిచాటు
 శ్రీని  కేత నమ్ము  సర్వులకును ॥

ఉత్త మంబు లైన  ఉచ్ఛ సందేశముల
 "గోర" నామ రచన కోరి జేసె.॥
 నాటకంబు లెన్నొ నవలలింకెన్నియొా
 రాసినట్టి ఘనుడు రవిగ వెలిగె ॥
 
 జనగణమన గీతి  జాతీయమాయెను.
 జనులు మెచ్చ నొందె  జగతి కీర్తి.
 అతని కీర్తు లెల్ల అవనిలో ఘనములు 
 ఘన రవీంద్రు డితడు గవుర వుండు ॥


హామీ :
ఈ ఆటవెలది పద్యములు ఏ మాధ్యమునందునుా 
ప్రచురుతములు కాని నా స్వీయ రచనలు.

రవీంద్రనాథ్ టాగుార్.

5/05/2021
సాహితీ బృందావన జాతీయ వేదిక అధ్వర్యంలో.
కవితా పోటీల కొరకు-

అంశం : రవీందృని సాహిత్యం.

శీర్షిక : విశ్వ కర్త.

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
08097622021.


"రవీంద్రనాథ్ టాగుార్" రాసిన
" గీతాంజలి " కావ్య,సాహిత్యానికి
నోబెల్ బహుమతి లభించింది.
అతను స్థాపించిన  శాంతినికేతన్ గా
 పేరుగాంచి ప్రసిద్ధిచెందిన -
"విశ్వ భారతి విశ్వ విద్యాలయం"
ప్రాచీన గురుకులలను తలపింపజేస్తుంది.
గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని
భావించిన  "రవీంద్రనాథ్ టాగుార్ "
కళోద్ధరణకై "కళాభవన్" తో పాటు
"శ్రీ నికేతాన్ని "నెలకొల్పి , గ్రామ 
పునరుద్ధరణకు ఎంతో పాటుపడ్డారు.
స్వతహాగా కవియైన టాగుార్ ఎన్నో
ప్రసిద్ధి చెందన నాటకాలను రాసేరు.
కులమతాలకతీతంగా ఉండాలంటుా
పరస్పర స్నేహభావాన్ని చాటుతుా 
" గోదా "పేరుతో రాసిన సాంఘీక
  నవల ఎంతో పేరుగాంచింది.
  దేశభక్తి మెండుగా గల రవీందృలు 
  రాసిన" జన గణ మన " గీతాన్ని
  రాజ్యాంగ సభ అద్యక్షులు ,
  బాబుా రాజేంద్ర ప్రసాదుగారు
  జాతీయ గీతంగా ప్రకటిస్తుా..
  బంకిమ్ చంద్ చటర్జీ రాసిన
  "వందేమాతరం" గీతాన్ని జాతీయ
  గేయంగా ప్రకటించి గౌరవించేరు.
  రచయితగా, సంగీతవేత్తగా,
   చిత్రకారునిగా, విద్యావేత్తగా 
   మానవతావేత్తగా చరిత్రలో
   నిలిచిపోయిన విశ్వకవి 
   " రవీంద్రనాథ్ టాగూర్", తన 
  ఆత్మకథను  "మై రెమినిసెన్సెస్"
  పేరుతో రాసుకొన్ని ,అనారోగ్య కారణంగా
  1941 ఆగష్టు 7న తుది స్వాశ విడిచేరు.

దత్తపది

[5/5, 06:22] p3860749: వాగ్దేవీ కళాపీఠం.. వారి
దత్తపది  పుారణ
ధనము   ధాన్యము   పాడి...పంట


శీర్షిక : హిట్లర్  జ్ఞాపకాలు .

ప్రక్రియ : మినీ కవిత.

ఇంధనము కోసం చెట్లు నరికేరు.
అన్యాయపు భుా ఆక్రమణలతో
ధాన్యము పండించే రైతన్నల
వెన్నాముకను విరిచేరు.
పాడినిచ్చే ఆవులను పైశాచికంగా
అమ్మి సొమ్ము చేసుకున్నారు.
పంట భుాములను, ప్లాంట్లను
 ప్రేవేటీ కరణ చేయాలన్న తలంపుతో
పాలకులు పై దేశాలతో
పొత్తు కుదుర్చుకొని దేశ ప్రగతిని 
 దైన్య స్థితికి తీసుకెళ్తున్నారు.
 అన్నివిషయాల లోనుా స్వాతంత్ర్యం
 కోల్పోయిన ప్రజలు  బ్రతుకు 
 భారమై హిట్లర్ పాలనను 
 జ్ఞప్తి చేసుకుంటున్నారు.
 ------------------------------

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
08097622021.
[5/5, 06:36] p3860749: వాగ్దేవీ కళా పీఠం లో

బుధవారము - దత్తపది._

*అభము - శుభము - నభము - విభవము*

శీర్షిక  :  వికటించిన వైభవం.

ప్రక్రియ : మినీ కవిత.

అభం -శుభం ఎరుగని
పసి బాలల మాన భంగాలు.
వయసు అంతరాలు మరచిన
స్త్రీ -పురుషుల కామ క్రీడలు.
నభానికి ఎగసి వ్యాపిస్తున్న
పర్యావరణ కాలుష్యం తో
విస్తరిస్తున్న  విష కణాలు-
వికటిస్తున్న విభవాలు, 
క్షణం క్షణం భయం భయంగా
మారుతున్న  ప్రజా జీవితాలు.॥

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )

దోపిడీ.మ

వారం వారం కవిత లో...
అంశం  :  దోపిడీ.
శీర్షిక  : నిలువు దోపిడీ.

 కాల గమనంలో మారుతున్న
 మనుషుల అంతరంగాల
 మానసిక బలహీనతల దోపిడీ ॥
    
 వివేకం కోల్పోతున్న యువతను
 పెడబారి పట్టించి భావి భారత
 భవితను దోచుకుంటున్న 
 డ్రగ్ మాఫియాకోరుల దోపిడీ ॥
    
 కల్తీ బాసల తో నోట్లకు ఓట్ల కొనుగోలునీ
 కల్తీ విక్రయాలతో జనాల నమ్మకాన్ని
 సొమ్ము చేసుకుంటున్న సత్తా , --
 తొత్తుల సాధింపుల దోపిడీ॥
    
 వావి వరుసలు మరచిన
 కామాంధుల వికృతి చేష్టలకు
 పసి నుండి ముసలి వరకు గల 
అబలల మాన-ధన దోపిడీ..॥
    
 లేని రోగాన్ని ఆపాదించి
 వైద్యం పేరుతో అంగాంగాలను
 అమ్ముకుంటున్న వక్ర ఆలోచనగల
 వైద్య  దేవుళ్ళ  దోపిడీ ॥
  
 కరోనా కాటుకు ఊపిరందక...
 ఆక్సిజన్ కరువై అంతమౌతున్న
 జనాల చితిమంటలకు వెలకట్టి
విస్తృతంగా  దోచుకుంటున్న 
కార్చిచ్చు రేపిన కన్నీటి దోపిడీ ॥
 
అధికార బలంతో న్యాయానికి 
రెక్కలు విరిచి సామాన్యుల  
బ్రతుకు భారాన్ని పెంచిన 
చచ్చు రాజకీయాల చిచ్చు 
వేటల  నిలువు దోపిడీ ॥
-----------------------------
   రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
08097622021.

---------------.
హామీ : నా ఈకవిత ఏ మాధ్యమునుండీ 
ప్రచురితం కాని నా స్వీయ రచన.