Thursday, December 30, 2021
తిరుప్పావై ...ఆటవెలదిలో...( పాశురాలు)1to 30.
Wednesday, December 29, 2021
త త్వ బోధ కీర్తన.
తత్త్వ బోధ కీర్తన .
శివ శివా శివ శివా శివ శివ శివ యనరా
హర హారా హర హారా హర హారహర యనరా
శివ శివ యని అనగా శమియించును పాపములు
హరి నామము తలచినంత అందునులే అభయములు ॥
ముాడు లోకాలవే ముక్కంటిలో లయము
లోకుల కర్మల ఫలముకు కర్త ఆ శ్రీహరీ
ఆ సుాత్ర ధారులా తోలు బొమ్మ లాటలో
బొమ్మలముా మనముా ఆడేము మనుముా ॥
సృష్టి కర్త బ్రహ్మకుాడ మార్చలేని రాతలు- వి
ధాత రాయు రాతలే విశ్వమందు చరితలు..
బుద్ధి జ్ఞాన కర్మలుా ఘనమౌ యొాగంబులు- ఆ
తత్త్వ మెరిగి మసలుటలే జన్మ మొాక్ష ఫలములు ॥
తత్త్వ మెరుగు బుద్ధి జీవి తనకు తానె మిత్రుడు
జ్ఞాని గాని నరుడు తనకు తానె శతృవు.
పాప కర్మునాత్మ తిరిగి జన్మనొందు తథ్యము
పుణ్యాత్ముల ఆత్మ జేరు తుదికి వైకుంఠము ॥
తెలిసీ తెలిక జేసిన పాపము శిక్షార్హము.
ధర్మ బాట నడవు మదే ముక్తికి సోపానము .
జీవులంత ఒక్కటన్న భావమదే సత్యము
జీవాత్మయె పరమాత్మగ తలచ నదే తత్త్వము ॥
శివ శివ శివ శివ శివ శివ శివ శివ యనరాదా
ఆ శివ తత్త్వ ము నెరిగీ ఇలలో మనరాదా..
హర హర హర హర హర హర హర హరాయనీ అనరా
ఆది నారాయణుని ఆత్మ నందె తలవరా ॥
Tuesday, December 28, 2021
తెలుగు పాశురములు .ప్రక్రియ : ఆటవెలదిలో..
Monday, December 27, 2021
ఆటవెలది
మహతీ సాహితీ కవిసంగమం
తేదీ:--22--12--2021
అంశము:--గణితము, శ్రీనివాస్ రామానుజం
ప్రక్రియ:-- పద్యం
మ.సా.క.సం.19.
కవిత సంఖ్య : 3.
Wednesday, December 22, 2021
తిరుప్పావెై తెలుగు పద్యాలు ఆటవెలదిలో..
Tuesday, December 21, 2021
గణాడ్యుడు...బ్రహత్కథలు
Monday, December 20, 2021
మురళీ గానము వినపడినంతనే....పాట
Sunday, December 19, 2021
దత్తపది.
Sunday, December 12, 2021
మత్తకోకిల
పంచపదిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు .
పంచపది.
అంశం : ద్వాదశ జ్యోతిర్లింగాలు .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
శివభక్తులైన శైవులు పుాజించే మహాదేవుడు శివుడు -
లింగాకారంలో ఉద్భవించిన జ్యోతిస్వరుాపుడు.
దేవ, ఋషి, గ్రహ, గణాలు కొలిచే బోళా శంకరుడు.
ప్రసిద్ధమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో జ్యోతిగా నిలిచేడు.
పన్నెండు పవిత్ర పుణ్య క్షేత్రాలలో నెలకొన్న ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించి ధన్యతనొందుమీశ్వరీ ॥
**************************************
అంశం : శ్రీ సోమనాధ జ్యోతిర్లింగం. 1.
ప్రభాస క్షేత్రాన వెలసిన శివుని ప్రథమ జ్యోతిర్లింగ స్వరుాపము.
సౌరాష్ట్ర సోమనాధుని పేరుతో ప్రాచుర్యము.
మృత్యుంజయ మంత్ర జపముతో సర్వరోగ నివారణము.
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిచే
లింగప్రతిష్ఠ , పునర్నిర్మాణ కార్యక్రమము.
శ్రీ సత్యసాయిబాబా గారిచే ప్రారంభోత్సవమైన సోమనాధుని చుాచి తరించుమీశ్వరీ ॥
********:************************
అంశం : శ్రీశైల మల్లీశ్వర జ్యోతిర్లింగం: 2.
పాతాళ గంగయైన క్రిష్ణానదీ తీరము.
ఆది శంకరాచార్యుల శివానందలహరిసారము.
అష్టాదశ శక్తి పీఠములలో ఒకటైన పుణ్య క్షేత్రము.
మల్లికార్జునుడనే పేరుతో జ్యోతిర్లింగంగా శివుని ఆవిర్భావము.
శ్రీ భ్రమరాంబికాసహిత
శ్రీశైల మల్లికార్జునుని దర్శించి తరించుమీశ్వరీ ॥
**************************************
అంశం : మహాకాళేశ్వర జ్యోతిర్లింగం..3
మధ్యప్రదేశ్ , ఉజ్జయినీ పట్టణంలో శ్రీ మహా కాళేశ్వరాలయము.
గర్భగుడిలో తిరగవేసి ఉన్న శ్రీచక్రయంత్రము. దక్షిణాభిముఖ ముఖద్వారం ప్రత్యేకము.
తాంత్రిక మంత్రాలతో ప్రాతఃకాల భస్మాభిషేకము.
మద్యం నైవేద్యంగా, మంత్ర శక్తితో ఉద్భవించిన ఏకైక స్వయంభూ కాలభైరవ జ్యోతిర్లింగము.
అష్టభైరవులు,ఏకాదశరుద్రులు, వేల దేవతా మందిరాలు గల కృష్ణా నదీ క్షేత్ర దర్శనముతో
జీవితమది ధన్యము గద ఈశ్వరీ ॥
*****************:::::*************
అంశం : ఓంకారేశ్వర్ జోతిర్లింగం. 4.
వింద్య పర్వత సానువుల్లో
నర్మదా నదీతీరంలో వెలసిన ఓంకారేశ్వరుడు .
రెండు భాగములుగా ఉండి, రెండు పేర్లతో పూజింపబడుతున్న జ్యోతిర్లింగాకారుడు.
ఓంకారేశ్వర ,అమరేశ్వరు నామాలతో వెలసిన దేముడు .
అన్నపుార్ణ అర్ధాంగిగా కొలవబడుతున్న శివుడు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లా క్షేత్ర దర్శనంతో
అన్నపుార్ణ కృపకు పాత్రురాలివికమ్ము ఈశ్వరీ .
*****************************:*****
అంశం:*శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగం-5
మహారాష్ట్రలోని పార్లిలో ఉన్న
వైద్యనాధుని , రావణుడు తన పది తలలను
అర్పించి పుాజించిన ఆలయం.
రావణ భక్తికి మెచ్చి గాయపడిన రావణుకి
"వైద్య"మందించిన శివుని ఆలయం.
జార్ఖండ్ రాష్ట్రంలోని చితాభుామియైన డియోఘర్ ప్రదేశం .
కపాలిక / భైరవ వంటి తాంత్రిక ఆరాధనలకు నిలయం.
శవభస్మ భూషితుడైన వైద్యనాధుని సేవించి తరించుమీశ్వరీ ॥
*********************************::::
అంశం:*శ్రీనాగేశ్వర జ్యోతిర్లింగం-6*
సుప్రియుడనే భక్తుని మొరవిని రాక్షస సంహారార్ధం
జ్యోతి రుాపంలో వెలసిన శివ కాంతిపుంజం.
మొాక్షనగరమైన ద్వారకకు సమీపంలో గల
దారుకావనంలో వెలసిన క్షేత్రం.
దారుకావనము నాగులకు నెలవైనందున "నాగేశ్వర"
నామముతో ప్రసిద్ధికెక్కిన ఆలయం.
నాగారూపమైన జ్యోతిర్లింగ దర్శనం, మహా
పాతక నాశనం ,శాశ్వతపుణ్యలోకవాసం .
.దారుకావనంలో వెలసిన విశిష్ట "నాగేశ్వర జ్యోతిర్లింగ" దర్శనం, సర్వ శుభములను
ఇచ్చునీశ్వరీ ॥
*********************************::
అంశం: *శ్రీకేదారేశ్వర జ్యోతిర్లింగం-7*
ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగలో వెలసిన జ్యోతిర్లింగం
మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య గల పవిత్ర శైవక్షేత్రం.
అక్షయతృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్ధం తెరచి ఉంచబడే మందిరం.
చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం.
చార్‌ధామ్ యాత్రలో గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాధ్ లను దర్శించి తరించుమీశ్వరీ..
***************************************
అంశం: *శ్రీత్రయంబకేశ్వర జ్యోతిర్లింగం-8*
బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా
వెలసిన మృత్యుంజయుడు శివుడు .
సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే ముాడు
నేత్రాలు గల దేవుడు.
స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైనవాడు.
లింగం చుట్టుా నిరంతరం ఊరే ఊట నీరు, కలిసే "కుశావర్తన సరోవరంలో" స్నానం చేసినవారికి సర్వ రోగాలుా, పాపాలుా పోగొట్టేవాడు.
"గోదావరి " పేరుతో పవిత్ర" గంగ" ప్రవహిస్తున్న ,
మహారాష్ట్ర "నాసిక్" లో గల" శ్రీత్రయంబకేశ్వర జ్యోతిర్లింగ" క్షేత్ర దర్శనంతో ధన్యతనొందుమీశ్వరీ ॥
***************************************
అంశం: *శ్రీరామేశ్వర జ్యోతిర్లింగం-9*
"శ్రీరాముడు" సముద్రముపై సేతువు నిర్మించి,
లంకలో గల "దశకంఠుని దునిమిన" స్థలమట.
శైవులకు, వైష్ణవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర
పుణ్య క్షేత్రమట.
"బ్రహ్మ హత్యాపాప" నివారణకై సీతమ్మ చేసిన సైకత లింగమే, శ్రీరాముడు ప్రతిష్టించిన శ్రీ..
"రామనాథేశ్వర" స్వామి జ్యోతిర్లింగమట.
హనుమంతుడు తెచ్చిన" విశ్వలింగము" పక్కనే ప్రతిష్టింపబడడం విశేషమట.
రెండు లింగాలు గల ,ఈ దేవాలయ గర్భగుడిలో మొదట "విశ్వలింగాన్ని" తదుపరి "సైకత" లింగాన్ని, పూజించి తరించుమీశ్వరీ ॥
*************************************
అంశం: *శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం-10*
సహ్యాద్రి కొండల్లో కృష్ణానది ఉపనదిగా భీమా నదీ ప్రవాహం .
భీమానది ప్రాంతం మైన భావగిరి గ్రామంలో వెలసిన భీమశంకర జ్యోతిర్లింగం .
కుంభకర్ణుని పుత్రుడైన భీమాసురుని భస్మం
చేసిన ఈశ్వరుడి స్వరూపం.
మహారాష్ట్రలోని పుాణేకు సమీపంలో వెలసిన పవిత్ర జ్యోతిర్లింగం .
శాకిని, డాకిని మొదలైన రాక్షస సమూహాలతో నిత్యముా సేవించబడుతుా ఉన్న శ్రీ
భీమశంకరుని దర్శించి తరించుమీశ్వరీ ॥
*****************************:*::*****
అంశం: *శ్రీవిశ్వేశ్వర జ్యోతిర్లింగం-11*
ప్రసిద్ధ కాశీ క్షేత్రంలో నెలకొన్న శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం .
అక్షత్రయంలో ఒకటైన విశాలాక్షి వెలసిన
అష్టాదశ శక్తి పీఠం, అచటనే నెలకొన్న అన్నపుార్ణాలయం.
వరుణ’, ‘అసి’ నదుల సంగమ గంగలో
పవిత్ర స్నానం సకల పాప ప్రణాశనం ॥
మొాక్ష క్షేత్రంమైన కాశీపురిలో, మరణం, అంతిమ
సంస్కారాలు, ముక్తికి సోపానం.॥
విశ్వేశ్వరాన్నపుార్ణలుగా కాశీలో వెలసిన ఆ
శివపార్వతులను దర్శించి తరించుమీశ్వరీ ॥
***********************************
అంశం : శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం(.12)
ఔరంగబాద్ జిల్లా, వేరూల్ కు సమీపంలో వెలిసిన అతి చిన్న జ్యోతిర్లింగ దేవాలయం.
ఎర్రని రాళ్లపై, పురాణేతిహాస శిల్పకళలు చెక్కిన 24 స్తంభాలపై ప్రధాన ఆలయ సభా మండప నిర్మాణం.
పైన ఐదంచెల శిఖర నిర్మాణం , క్రింద నందీశ్వరుని ఏకశిలా విగ్రహ దర్శనం .
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన
అద్భుత శివక్షేత్రం .
,
ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరిదైన ఈ శ్రీ ఘృష్ణేశ్వరుని దర్శనం చేసుకోనిదే జ్యోతిర్లింగయాత్ర పరిపుార్ణముగాదటీశ్వరీ ॥
****************************************
తపస్వీ మనోహరం ఈ పుస్తకం కొరకు *పంచపది* కవనములు పంపించిన కవివర్యులు
01.యం.వి.ధర్మారావు గారు
02.కందూరు చంద్రప్రకాష్ గుప్తా గారు
03.మల్లాప్రగడ రామకృష్ణ శర్మ గారు
04.జక్క నాగమణి గారు
05.యేలూరు ధర్మావతి గారు
06.పుల్లభట్ల జగదీశ్వరీమూర్తి గారు
07.పి.లక్ష్మి భవాని గారు
08.భవాని కృష్ణమూర్తి గారు
09.అక్కిరాజు శ్రీహరి గారు
10.అనుపటి రాంచంద్రయ్య గారు
11.పోరంకి నాగరాజు గారు
12.గాంగేయుల రవికుమార్ గారు
13.నాగమోహన యేలిశాల గారు
14.అక్కి నర్సింలు గౌడు గారు
15.EVVS వర ప్రసాద్ గారు
16.బాణోత్ చెన్నారావు గారు
17.గంగాజమున దడివె
18.అద్దంకి లక్ష్మి
*తపస్వీ మనోహరం ఈ పుస్తకం కొరకు పంపిన వారి పేర్లు
*
**********************::::
పంచపది విజేతగా....
*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....
నేటి *పంచపది* 18
తేదీ:21.11.21
అంశం *సింధు పుష్కరాలు*
ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*
పుల్లభట్ల జగదీశ్వరీమూర్తి గారు
********************:*********
*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....
నేటి *పంచపది* 27
తేదీ:30.11.21
అంశం *శ్రీరామేశ్వర జ్యోతిర్లింగము-9*
ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు.
**********::*****************
*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....
నేటి *పంచపది* 29
తేదీ:02.12.21
అంశం *శ్రీవిశ్వేశ్వర జ్యోతిర్లింగము-10*
తృతీయ బహుమతి *పంచపది వరిష్ట*
పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు.
************************:::::****
********************:*********
*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....
నేటి *పంచపది*
తేదీ:27.11.21
అంశం *శ్రీనాగేశ్వర జ్యోతిర్లింగము-6*
ప్రత్యేక బహుమతి *పంచపది ఉత్క్రుష్ట 2*
పుల్లభట్ల జగదీశ్వరీమూర్తి గారు.
***************************::::
పంచపది.
తేదీ:26.11.21
అంశం:*శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగం-5
పేరు:రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
శ్రీ వైద్యనాధ జ్యోతిర్లింగం.
మహారాష్ట్రలోని పార్లిలో ఉన్న
వైద్యనాధుని , రావణుడు తన పది తలలను
అర్పించి పుాజించిన ఆలయం.
రావణ భక్తికి మెచ్చి గాయపడిన రావణుకి
"వైద్య"మందించిన శివుని ఆలయం.
జార్ఖండ్ రాష్ట్రంలోని చితాభుామియైన డియోఘర్ ప్రదేశం .
కపాలిక / భైరవ వంటి తాంత్రిక ఆరాధనలకు నిలయం.
శవభస్మ భూషితుడైన వైద్యనాధుని సేవించి తరించుమీశ్వరీ ॥
******************************:*::******
పంచపది.
శ్రీ భీమేశ్వర జ్యోతిర్లింగం.6.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
సహ్యాద్రి కొండల్లో కృష్ణానది ఉపనదిగా ప్రవాహం .
భీమానది ఉద్భవ ప్రాంతంలో వెలసిన భీమశంకర జ్యోతిర్లింగం .
కుంభకర్ణుని పుత్రుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపం.
మహారాష్ట్రలోని పుణె సమీపంలో వెలసిన జ్యోతిర్లింగం .
భీమశంకరుని దర్శించి తరించుమీశ్వరీ ॥
**********************************
నేటి *పంచపది*
తేదీ:27.11.21
అంశం:*శ్రీనాగేశ్వర జ్యోతిర్లింగం-6*
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
సుప్రియుడనే భక్తుని మొరవిని రాక్షస సంహారార్ధం
జ్యోతి రుాపంలో వెలసిన శివ కాంతిపుంజం.
మొాక్షనగరమైన ద్వారకకు సమీపంలో గల
దారుకావనంలో వెలసిన క్షేత్రం.
దారుకావనము నాగులకు నెలవైనందున "నాగేశ్వర"
నామముతో ప్రసిద్ధికెక్కిన ఆలయం.
నాగారూపమైన జ్యోతిర్లింగ దర్శనం, మహా
పాతక నాశనం ,శాశ్వతపుణ్యలోకవాసం .
.దారుకావనంలో వెలసిన విశిష్ట "నాగేశ్వర జ్యోతిర్లింగ" దర్శనం, సర్వ శుభములను
ఇచ్చునీశ్వరీ ॥
**********:************************:*:
నేటి *పంచపది* 25
తేదీ:28.11.21
అంశం: *శ్రీకేదారేశ్వర జ్యోతిర్లింగం-7*
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
ఉత్తరా ఖండ్ లోని రుద్రప్రయాగలో వెలసిన జ్యోతిర్లింగం
మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య గల పవిత్ర శైవక్షేత్రం.
అక్షయతృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్ధం తెరచి ఉంచబడే మందిరం.
చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఆదిశంకరులచే స్థాపించబడిన శివాలయం.
చార్‌ధామ్ యాత్రలో గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాధ్ లను దర్శించి తరించుమీశ్వరీ..
***************************************
నేటి *పంచపది*
తేదీ:29.11.21
అంశం: *శ్రీత్రయంబకేశ్వర జ్యోతిర్లింగం-8*
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి .
బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా
వెలసిన మృత్యుంజయుడు శివుడు .
సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే ముాడు
నేత్రాలు గల దేవుడు.
స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైనవాడు.
లింగం చుట్టుా నిరంతరం ఊరే ఊట నీరు, కలిసే "కుశావర్తన సరోవరంలో" స్నానం చేసినవారికి సర్వ రోగాలుా, పాపాలుా పోగొట్టేవాడు.
"గోదావరి " పేరుతో పవిత్ర" గంగ" ప్రవహిస్తున్న ,
మహారాష్ట్ర "నాసిక్" లో గల" శ్రీత్రయంబకేశ్వర జ్యోతిర్లింగ" క్షేత్ర దర్శనంతో ధన్యతనొందుమీశ్వరీ ॥
****************************************
.నేటి *పంచపది* 27
తేదీ:30.11.21
అంశం: *శ్రీరామేశ్వర జ్యోతిర్లింగం-9*
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
"శ్రీరాముడు" సముద్రముపై సేతువు నిర్మించి,
లంకలో గల "దశకంఠుని దునిమిన" స్థలమట.
శైవులకు, వైష్ణవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర
పుణ్య క్షేత్రమట.
"బ్రహ్మ హత్యాపాప" నివారణకై సీతమ్మ చేసిన సైకత లింగమే, శ్రీరాముడు ప్రతిష్టించిన శ్రీ..
"రామనాథేశ్వర" స్వామి జ్యోతిర్లింగమట.
హనుమంతుడు తెచ్చిన" విశ్వలింగము" పక్కనే ప్రతిష్టింపబడడం విశేషమట.
రెండు లింగాలు గల ,ఈ దేవాలయ గర్భగుడిలో మొదట "విశ్వలింగాన్ని" తదుపరి "సైకత" లింగాన్ని, పూజించి తరించుమీశ్వరీ ॥
****************************::******
నేటి *పంచపది*
తేదీ:1.12.21
అంశం: *శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం-10*
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
సహ్యాద్రి కొండల్లో కృష్ణానది ఉపనదిగా భీమా నదీ ప్రవాహం .
భీమానది ప్రాంతం మైన భావగిరి గ్రామంలో వెలసిన భీమశంకర జ్యోతిర్లింగం .
కుంభకర్ణుని పుత్రుడైన భీమాసురుని భస్మం
చేసిన ఈశ్వరుడి స్వరూపం.
మహారాష్ట్రలోని పుాణేకు సమీపంలో వెలసిన పవిత్ర జ్యోతిర్లింగం .
శాకిని, డాకిని మొదలైన రాక్షస సమూహాలతో నిత్యముా సేవించబడుతుా ఉన్న శ్రీ
భీమశంకరుని దర్శించి తరించుమీశ్వరీ ॥
*******:**************************
నేటి *పంచపది*
తేదీ:2.12.21.
అంశం: *శ్రీవిశ్వేశ్వర జ్యోతిర్లింగం (-11*}
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
పసిద్ధ కాశీ క్షేత్రంలో నెలకొన్న శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం .
అక్షత్రయంలో ఒకటైన విశాలాక్షి వెలసిన
అష్టాదశ శక్తి పీఠం, అచటనే నెలకొన్న అన్నపుార్ణాలయం.
వరుణ’, ‘అసి’ నదుల సంగమ గంగలో
పవిత్ర స్నానం సకల పాప ప్రణాశనం ॥
మొాక్ష క్షేత్రంమైన కాశీపురిలో, మరణం, అంతిమ
సంస్కారాలు, ముక్తికి సోపానం.॥
విశ్వేశ్వరాన్నపుార్ణలుగా కాశీలో వెలసిన ఆ
శివపార్వతులను దర్శించి తరించుమీశ్వరీ ॥
***********************************
*పంచపది కవన వేదిక* ఆధ్వర్యంలో....
నేటి *పంచపది* 29
తేదీ:02.12.21
అంశం *శ్రీవిశ్వేశ్వర జ్యోతిర్లింగము-(10*)
ప్రథమ బహుమతి *పంచపది శ్రేష్ఠ*
Y.శ్రీదేవి గారు
ద్వితీయ బహుమతి *పంచపది విశిష్ట*
భవాని కృష్ణమూర్తి గారు
తృతీయ బహుమతి *పంచపది వరిష్ట*
పుల్లభట్ల జగదీశ్వరీ మూర్తి గారు
*నేటి పంచపది* విజేతలందరికి అభినందనలు.
💐💐💐💐💐
**********************************
3/12/2021.
పంచపది కవన వేదిక .
అంశం : శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం(.12)
రచన:శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
ఔరంగబాద్ జిల్లా, వేరూల్ కు సమీపంలో వెలిసిన అతి చిన్న జ్యోతిర్లింగ దేవాలయం.
ఎర్రని రాళ్లపై, పురాణేతిహాస శిల్పకళలు చెక్కిన 24 స్తంభాలపై ప్రధాన ఆలయ సభా మండప నిర్మాణం.
పైన ఐదంచెల శిఖర నిర్మాణం , క్రింద నందీశ్వరుని ఏకశిలా విగ్రహ దర్శనం .
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన
అద్భుత శివక్షేత్రం .
,
ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరిదైన ఈ శ్రీ ఘృష్ణేశ్వరుని దర్శనం చేసుకోనిదే జ్యోతిర్లింగయాత్ర పరిపుార్ణముగాదటీశ్వరీ ॥
*******:::::************
నేటి *పంచపది*
తేదీ:29.11.21
అంశం: *శ్రీత్రయంబకేశ్వర జ్యోతిర్లింగం-8*
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి .
బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా
వెలసిన మృత్యుంజయుడు శివుడు .
సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే ముాడు
నేత్రాలు గల దేవుడు.
స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైనవాడు.
లింగం చుట్టుా నిరంతరం ఊరే ఊట నీరు, కలిసే "కుశావర్తన సరోవరంలో" స్నానం చేసినవారికి సర్వ రోగాలుా, పాపాలుా పోగొట్టేవాడు.
"గోదావరి " పేరుతో పవిత్ర" గంగ" ప్రవహిస్తున్న ,
మహారాష్ట్ర "నాసిక్" లో గల" శ్రీత్రయంబకేశ్వర జ్యోతిర్లింగ" క్షేత్ర దర్శనంతో ధన్యతనొందుమీశ్వరీ ॥
Friday, December 10, 2021
సుబ్రమణ్య షష్ఠి
ఉగాది సంబరాలు
9/04/2021
"సాహితీ బృందావన వేదిక " వారి
"ఉమెన్స్ రైటర్స్" సంస్థల ఆధ్వర్యంలో
"ప్లవనామ సంవత్సర ఉగాది "---
కవిసమ్మేళనం కొరకు:
అంశం: ఉగాది సంబరాలు
శీర్షిక : ఆనందామృత వర్షిణి.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
నీరు లేక నీరస పడిన ప్రకృతిలో..
నీరసించిపోయిన బీడుభుాముల్లో
ఇంకిపోతున్న రైతు కన్నీటి కష్టం..
కాష్టాల్లో బుాడిదై కరువు భాట వేస్తోంది
కరోనా కలకలంతో వెలవెల బోయిన
వాతావరణంలో కాలుష్యం కమ్మడంతో
జన జీవనంలో ఉత్సాహం లోపించింది.
కరోనా దాడికి కంపించిన కాలం
కట్టుబాట్ల, కట్టడి సంకెళ్ళతో
గృహ నిర్బంధమయ్యింది.
విషయం గ్రహించిన ఉగాది కన్య ఆలస్యం
చేయకుండా నీటి వనరులు సమృద్ధినొసగే
ప్లవ నామ " నెచ్చెలిని ప్రేమతో తోడ్కొని
పరిస్థితులను చక్కబెట్టేందుకు ...
పరుగులతో వస్తోంది. మంచి నీటితో
నిండే పచ్చదనం, పంచే ప్రాణవాయువుతో
సమృద్ధి నిండిన ఫల పుష్పాల పంట
సారంతో అరోగ్యానందాల నవ్వుల్ని
పంచడానికి. రండి !కొత్త వత్సర చెలికి
అనందం తో మంగళ "స్వాగతం" పలుకుదాం.
---------------------------------------------------------
హామీ: నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితంకాని నా స్వీయ రచన.
9/04/2021
"సాహితీ బృందావన వేదిక " వారి
"ఉమెన్స్ రైటర్స్" సంస్థల ఆధ్వర్యంలో
"ప్లవనామ సంవత్సర ఉగాది "---
కవిసమ్మేళనం కొరకు:
అంశం: ఉగాది సంబరాలు
శీర్షిక : ఆనందామృత వర్షిణి.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
గత వత్సరపు గాయాలకు వైద్యం
జరగకముందే,మాటేసిన మహమ్మారి
రుాపుమార్చిమరో కోణంలో విజృంభించింది.
హాహాకారాల అక్రందనలతో
ఆనందాలకు దుారమైన జనం
సంబరాల సందళ్ళకు స్వస్థి చెప్పేరు.
ఉత్సవ శోభలతో ఉరుకు- పరుగుల
ఉత్సాహంతో వచ్చిన ఉగాదికన్య
ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
వసంత కోయిల వలపు రాగాలతో
వేప పుా గంధాల మంద్ర పవనాలతో
మామిడి తోరణాల మంగళ గీతాలతో
ప్రతి వత్సరం ఆనంద స్వాగతం పలికే
నిండు కళల కాంతులు ఆరోజు కనపడడలేదు.
మానవ మేధస్సుకందని మహమ్మారి
చేసే మారణ హోమాన్ని ఆపాలనుకున్న
ఉగాది కన్య, షడృచుల అరోగ్యామృత
భాండంతో సామాజిక దుారాన్ని పాటిస్తుా
సేనిటైజర్లు ,మాస్క్ లు నిండిన అరోగ్యకర
బహుమతులతో , విలువైన "వేక్సీన్"
ఆయుధాన్ని చేతబట్టి ప్లవ నామ
రుాప ధారణియై మంగళాశనముల
మంత్రోచ్ఛారణతో మనమధ్యకు వస్తోంది
ఆనంద స్వాగతం పలుకుదాం రండి మరి.
హామీ: నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితంకాని నా స్వీయ రచన.
అందరుా బాగుండాలి
చిగురించిన వసంతం యుగాది
మధురిమల యుగాది
అంశం: ఉగాది విశిష్టత.
కవితా ప్రక్రియ: మధురిమలు
శీర్షిక: ఆనంద యుగాది.
1.
సృష్ట్యారంభపు గణితం.
చైత్ర శుద్ధ పాడ్యమి తిధి
భాస్కరాచార్య లిఖితం.
కాల -గణనారంభ విధి.॥
2.
నక్షత్ర గమన కాలం .
చాంద్ర మాన గణనీకం.
ద్వాదశ రాశీ చలనం.
ఆంధ్ర జన ప్రామాణికం.॥
3.
ధశ విధ కృత్యాచరణం..
బ్రహ్మ పుాజనం శ్రేష్టం.
నింబ పుష్పసు భక్షణం
పంచాంగ శ్రవణం శుభం ॥
4.
వసంత కాలం మధురం .
హరిత వనం సు శోభితం.
ప్రకృతి శోభాయమానం.
జీవనానంద,సుఖదం॥
*********************
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
షడృచుల యుగాది.
అంశము: *షడ్రుచులు-పంచభక్ష్యాలు
.
శీర్షిక : ఆరోగ్యమే మహా భాగ్యం.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
ప్లవ నామ ఉగాదికి స్వాగతం.
మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు .
ఉగాది రోజున నివేదించే ఆరు రుచుల
ఉగాది పచ్చడి గురించి కొన్ని విషయాలు :
1.
మధురం (తీపి) .బెల్లం తేనె.
-----------------------------------
తేనెలుారు తీయనైన పలుకు.
స్నేహ బాంధవ్యాల పిలుపు
అతి మధురం రోగ కారకం.
మితం ఆనంద దాయకం. ॥
2.ఆమ్లం. ( పులుపు) .చింతపండు.
---------------------------------------
ఆమ్లం : అసౌకర్యం లేని అరుగుదల.
కొవ్వు శాతం తగ్గింపు.
వాపులను తగ్గించి శరీర
వ్యవస్థను మెరుగుపరుస్తుంది.॥
3.లవణం (.ఉప్పు).
------------------------------
ఉప్పు : డి..హైడ్రేషన్ పోగొట్టేది.
అహారపు ఱుచిని పెంచేది.
తగినంత తింటే ఉత్సాహం
అతిగా తింటే రొిగం.॥.
4.కటువు.( కారం.)మిరపకాయలు, మిరియాలు.
-----------------------------------
కారం : ఆహారంలో ఱుచిని పెంచేది.
అధిక కోపాన్ని కలిగించేది.
రోగనిరోధక శక్తిని పెంచేది
కటు మితం, చర్మ రోగ నివారణం.
5. తిక్తం .( చేదు.) వేప పుావు.
----------------------------------
చేదు : కడుపును సుభ్ర పరచి,
నులిపురుగులను నాశనం చేసేది.
ఔషధీ తత్త్వాన్ని కలిగినది.
ఎన్నో రోగాలను నయంచేస్తుంది.
6.కషాయం .( వగరు.) మామిడికాయ.
----------------------------------------------------
వగరు మేలైన రక్త ప్రసరణకు ,
ఆమ్ల వాయు నిరోధనకు,
ఉదరంలో క్రిముల నాశనముకు,
శరీరంలో నీటిని సమతుల్య పరచేందుకు.
కఫ, పిత్త వాతాలకు ఔషధంగా పని చేసే ఈ
ఉగాది పచ్చడిని సేవించి , ఆరోగ్య జీవితానికి
స్వాగతం పలకండి.
నవయుగాది
ఓషధీ రస గుళిక
అంశం. ఉగాది పండుగ గొప్పతనం .
శీర్షిక ; ఓషధీ రస గుళిక.(వచన కవిత).
"ఉగ" అంటే నక్షత్ర గమనం లేదా జన్మ -
వీటికి ఆది ఉగాది. యుగం అంటే
రెండు కలిసినది-ఉత్తరాయణ, దక్షిణాయనాలు.
షడ్రుచులు అంటే తీపి, పులుపు, ఉప్పు,
కారం, చేదు, వగరు,. ఇవన్నీ కలిపి చేసిన
" ఉగాది పచ్చడి "ఎన్నో రోగాలను అరికట్టే
"దివ్యౌషధ తత్త్వాలను" కలిగి ఉంటుంది.
పంచభక్ష్యములు అంటే భక్ష్యం,
భోజ్యం, లేహ్యం, చోష్యం, పానీయాలు.
ఇవి మన ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని,
వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి
ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక
ఆచారాలకు, సముచిత ఆహారానికి
గల సంబంధాన్ని చాటిచెప్పే రస గుళికలు.
మానవ జీవితాలు,అన్ని భావాల మిశ్రమంగా
ఉండాలని ఆకాంక్షిస్తుా జరుపుకొనే
పండగ ఈ "యుగాది" .
నిరోగ మయ జీవితానందాలను పంచే
"యుగాది పండగ" , మన సాంప్రదాయ
సార జీవామృతమై, మనలను నడిపిస్తోంది
అనడంలో సందేహం లేదు.
------------------------------------------------
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
Thursday, December 2, 2021
తొణుకులు నియమాలు
ఉస్మానియా తెలుగు రచయితల సంఘం*
ఆధ్వర్యంలో *తొణుకులు* నూతన ప్రక్రియ తేది:15-08-2021 నాడు. పునర్: ప్రారంభం కానుంది. (ఆగస్టు మాసంలో)
రూపకర్త:-
*శ్రీ ప్రశాంత్ కుమార్ ఎల్మల**
🫐🫐🫐🫐🫐
*నియమాలు*
*1. నాలుగు పాదాలు*
*2. ప్రతీపాదములో 9నుండి 11 అక్షరాలు మాత్రమే ఉండాలి.*
*3. 1,3 పాదాలలో మాత్రమే మొదటి అక్షరం ఒకేలా ఉండాలి.*
*4. 2,4 పాదాలలో మాత్రమే చివర అంత్య ప్రాస ఉండాలి.*
*వారానికి 4 మాత్రమే తొణుకులు రాయాలి .*
100 పూర్తి చేసిన వారికి *తెలుగు శ్రీ*
300 పూర్తిచేసినవారికి *తెలుగు భూషణ్*
500 పూర్తిచేసినవారికి *తెలుగు విభూషణ్*
బిరుదులు ప్రదానం చేస్తాము
ఇంతకు పూర్వం 100 తొణుకులు పూర్తి చేసిన వారు తిరిగి 101 నుంచి ప్రారంభించవచ్చు.
దిక్కరించిన కలము
1🌊
సిరా చుక్కలు వదలాలన్నా
చెప్పలేని భయం గొల్పుతుంది
సిగ్గుతో ఒక్కఅక్షరం ముక్కైన
రాయాలన్న బాధగా ఉంది.
2🌊
మనిషి చేతిలోకి చేరాలంటే
నాకు చెమట పడుతుంది
మగువాంతక మృగాల ఎదపై
జేబులో నిలువ సిగ్గేస్తుంది.
https://chat.whatsapp.com/BGxRalUKoFaFHj8FgxeTyK..
అధ్యక్షులు
ప్రశాంత్ కుమార్ ఎల్మల.
9494300188.