Tuesday, May 30, 2023

రుబాయిలు.

[30/05, 5:33 pm] JAGADISWARI SREERAMAMURTH: 30/05/2023.
మహతీ సాహితీ కవి సంగమం .
అంశం : రుబాయిలు.
శీర్షిక  : అన్నియు నీవే :  అంతయు నీవే

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


1.
అణువణువున  ఉన్ననిన్ను  తెలియలేను గోపాలా!
ఈవిరహపు బాధ నేను  తాళలేను గోపాలా !
నీనామమె నాజీవన  స్మరణాయెను ఊపిరిగా._
నీరుాపము కానకనే  నుండలేను గోపాలా..! ॥
2.
ఈ భువిలో, ఆదివిలో, అంతటనుా నీవేగా
బ్రహ్మాడపు చైతన్యపు సారధివీ నీవేగా 
నా మదినే కోవెలగా మలచితినో గోపాలా
అలసిసొలసి యున్నాడవు విడిదిచేయు గోపాలా॥
(విడిది అంటే తత్కాలిక నివాసము , బస.)
3.
 సాధుజనులు ,సారగుణులు ,మెచ్చుగురుడ  వీవేగా
  సజ్జననము, సుజ్ఞానము నిచ్చుఘనుడ వీవేగా
గీతామృత ,తత్త్వబోధ యొాగసార ములనుదెల్పి
నీభక్తుల బ్రోచేందుకు  వచ్చుధవుడ వీవేగా॥
[30/05, 6:00 pm] +91 78423 68534: పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు -23✅️

ఆణువణువూ ఉన్న నిన్ను తెలియలేను గోపాలా.. నీ భక్తుల బ్రోవగా వచ్చు ధవుడా అని కృష్ణ రుబాయీలు. 🙏💐👌

Thursday, May 25, 2023

గణాలు ఛందస్సు

*గణాలు-రకాలు*  :-  .

అక్షరాల గుంపును గణము అని అంటారు. ఇవి నాలుగు రకాలు

*ఏకాక్షర గణాలు*


ఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది. అది గురువు లేదా లఘువు కావచ్చు.

U, U, U

ఉదా: శ్రీ, శై, లం

*రెండక్షరాల గణాలు*

రెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు .1.  *లలము*  2. *లగము* ( వ గణం ) ౩. *గలము ( హ గణం )*  4.*గగము.*

లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
లగ లేదా వ IU ఉదా: రమా
గల లేదా హ UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
గగ UU ఉదా: రంరం, సంతాన్


*మూడక్షరాల గణాలు*  :- 

ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ ౦, ౧, తీసుకున్న ౦౦౦, ౦౦౧, ౦౧౦, ౦౧౧, ౧౦౦, ౧౦౧, ౧౧౦, ౧౧౧) కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. య మా తా రా జ భా న స ల గం యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు,, గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు

అన్ని గణాలు:

*ఆది గురువు భ గణము UII*
*మధ్య గురువు జ గణము IUI*
*అంత్య గురువు స గణము IIU*
*సర్వ లఘువులు న గణము III*
*ఆది లఘువు య గణము IUU*
*మధ్య లఘువు ర గణము UIU*
*అంత్య లఘువు త గణము UUI*
*సర్వ గురువులు మ గణము UUU* 

ఇవి మూడక్షరముల గణములు

*ఉపగణాలు* :  

ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములు

*సూర్య గణములు* . *ఇవి రెండు.*

న = న = III
హ = గల = UI

*ఇంద్ర గణములు* . *ఇవి ఆరు.*

నగ = IIIU
సల = IIUI
నల = IIII
భ = UII
ర = UIU
త = UUI

*చంద్ర గణములు* . *ఇవి పద్నాలుగు.*

భల = UIII
భగరు = UIIU
తల = UUII
తగ = UUIU
మలఘ = UUUI
నలల = IIIII
నగగ = IIIUU
నవ = IIIIU
సహ = IIUUI
సవ = IIUIU
సగగ = IIUUU
నహ = IIIUI
రగురు = UIUU
నల = IIII

Tuesday, May 23, 2023

కొత్త ప్రక్రియ : చతుర్ముఖి

అందరికీ అభివందనం 🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿



             ఇన్ని రోజులూ పలు ప్రక్రియల్లో మన రచనలు అలాగే నేడు మరో సరికొత్త తెలుగు సాహిత్య ప్రక్రియలో సరికొత్త రచనలు చేద్దాము...


      ఇక నేడు మనం చూడబోతున్న సరికొత్త ప్రక్రియ *చతుర్ముఖి*. ఇక ఇప్పుడు దాని లక్షణాలను దాని ఉదాహరణలు చూద్దాం...


చతుర్ముఖి :- 

1) ఇది నాలుగు వాక్యాల ప్రక్రియ .
2) ఇందులో ప్రతీ వాక్యంలో నాలుగక్షరాల పదాలు నాలుగుండాలి.
3) రెండవ పాదం మూడవ పాదం  అంత్యప్రాసలో ముగియాలి.
4) మొదటి వాక్యంలో మొదటి మూడక్షరాలు " *ర* " గణం  అవ్వాలి అలాగే నాల్గవ వాక్యం చివర *త* గణంతో ముగియాలి.

ఉదాహరణలు:- 

1)
అందమైన మల్లెపూలు విరబూసే సమయాన
మరుడంటి చెలికాడు సరసన చేరుకొని
వన్నెలున్న చిన్నదాన్ని సున్నితంగా హత్తుకొని
ముచ్చటించె ప్రియముగ చందమామ వెళ్ళేదాక

2)
ముజ్జగాలు చేతులెత్తి నమస్కారం చేసెదరు
అగుపిస్తే కన్నులకు అతగాడి స్వరూపము
అసురుల గణానికి ప్రసాదించి వరాలను
వారందరి ఆయువుల్ని హరించెడి శాంతాకారి

3)
రాజుకుంటే అహములు మనసుల నడుమన
మసిబారు బంధములు ఉదయించు పంతములు
మొదలౌను వాక్యుద్ధము ఉప్పొంగును నయనాలు
వదులుకో కోపమును పంచుకుంటూ ఆనందాన్ని

4)
వేడుకేగా జీవనము పుట్టిస్తుంటే నవ్వులను
సంబరాలే అనునిత్యం వదిలేస్తే పేరాశను
పండుగేగా ప్రతిరోజూ ఆదుకుంటే ఆర్తులను
రమ్యమేగా పయనము ఏకాగ్రత  ఉండేదాక

మనోహరి మహిళా మాస పత్రిక

[22/05, 10:39 pm] Pari మనోహరి మహిళా పత్రిక మనోహరిగారు: #selected లేఖలు 

*15-05-2023 నుండి 17-05-2023 వరకు  తపస్వి మనోహరం వారి మనోహరి మాసపత్రిక కొరకు లేఖ/ ప్రేమలేఖలు అనే అంశం పై వచ్చిన రచనలలో పత్రికకు ఎంపికైన రచనల లిస్ట్*

1. నన్ను క్షమించు! - శారద కెంచం
2. మధుర జ్ఞాపకాలు - మామిడాల శైలజ.
3. మనోవేదన - నాగ మయూరి
4. లేని అమ్మకు అభ్యర్థన - కె.కె.తాయారు
5. సందేహంగా ఉంది - ఉత్కర్ష
6. ఓ తల్లి లేఖ - వింజరపు.శిరీష
7. నెచ్చెలి - కృష్ణ మోహిని ధార్వాడ
8. అయ్యా! ప్రఛంఢ భానయ్యా - దొడ్డపనేని శ్రీ విద్య
9. పంపలేని నా ప్రేమలేఖ - రమిజ్యోతి
10. క్షమించు వదిన - తోట కుసుమ భారతి
11. ఐ లవ్ యుా హబ్బీ -పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
12. ఆవకాయ ప్రహసనం - అద్దంకి లక్ష్మీ
13. అమ్మా, క్షమించు - సావిత్రి కోవూరు 
14. నాతో నేను - పి.వి.వి.యన్.రాజ కుమారి
15. తప్పయింది - మోటూరి శాంతకుమారి
16. మనోహరి - కొంటికర్ల లలిత
17. మాటే మంత్రము - సుశీల రమేష్
18. నాన్న రాసిన లేఖ - సుజాతకోకిల
19. ఓ నా కావ్య నాయకా- సావిత్రి ప్రసాద్ గునుపూడి
20. ప్రేమకి ప్రేమ కానుక - సాయి ప్రియ
[22/05, 11:00 pm] Pari మనోహరి మహిళా పత్రిక మనోహరిగారు: *08-05-2023 నుండి 09-05-2023 వరకు తపస్వి మనోహరం మరియు మనోహరి పత్రికల కొరకు వేసవిలో అమ్మమ్మ గారింటి జ్ఞాపకాలు అనే అంశం పై వచ్చిన రచనల లిస్ట్.*

1. వేసవిలో అమ్మమ్మ గారి ఇంటి జ్ఞాపకాలు
-సలాది భాగ్యలక్ష్మి
2. జానకమ్మ గారు- కె.కె.తాయారు
3. వేసవిలో ఆముమ్మగారింట జ్ఞాపకాలు - ఎస్.కె.నజియా బేగం
4. మనసు డైరీ - లావణ్య గణేశ్
5. అమ్మమ్మతో నా జ్ఞాపకాలు - సౌజన్య రామకృష్ణ
6. జ్ఞాపకాల్లో అమ్మమ్మ! - జయశ్రీ బారు
7. మరపురాని మమతలు - శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
8. అమ్మమ్మ గారింట జ్ఞాపకాలు - అద్దంకి లక్ష్మి
9. మరపు రాని జ్ఞాపకాలు - మోటూరి శాంతకుమారి
[22/05, 11:04 pm] Pari మనోహరి మహిళా పత్రిక మనోహరిగారు: *తపస్వి మనోహరం వారి మనోహరి మహిళా మాసపత్రిక కొరకు గురువారం (18-05-2023) నుంచీ శనివారం (20-05-2023) వరకూ కథ/కవిత సమీక్షలు అంశంపై వచ్చిన రచనలు:*

కథ సమీక్షలు:
1. అద్దంలో నేను (పుల్లభట్ల జగదీశ్వరీ మూర్తి) - వింజరపు శిరీష
2. లౌక్యం (సావిత్రి కోవూరు) - శైలజ కరణం
3. తులసి వనం (ఉపద్రష్ట సుబ్బలక్ష్మి) -
మోటూరి శాంతకుమారి 
4. చిరకాల స్వప్నం (వింజరపు శిరీష) -
శారద కెంచం 
5. కష్టం కాదు (పోలా సాయిజ్యోతి) - K. K. తాయారు 
6. ఋణానుబంధం - సావిత్రి కోవూరు (స్వీయ సమీక్ష)
7. తళుకులు - బెళుకులు (ఎం. వి. ఉమాదేవి) - పి. వి. ఎన్. కృష్ణవేణి
8. వేలాడే నక్షత్రం (మణి వడ్లమాని) - చంద్రకళ దీకొండ 

కవితా సమీక్షలు:

1. అమ్మకు అమ్మే సాటి (గజల్ - గీతారాణి) - వరలక్ష్మి యనమండ్ర
2. మహిళా మణిపూస (సంధ్య శ్రీనివాస్) - కొంటికర్ల లలిత
[22/05, 11:04 pm] Pari మనోహరి మహిళా పత్రిక మనోహరిగారు: #selected సమీక్షలు 

*గురువారం (18-05-2023) నుంచీ శనివారం (20-05-2023) వరకూ కథ/కవిత సమీక్షలు అంశంపై పత్రికలకు సెలెక్ట్ చేసిన రచనలు:*

*కథా సమీక్షలు:*
అద్దంలో నేను (పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి) - వింజరపు శిరీష 
వేలాడే నక్షత్రం (మణి వడ్లమాని) - చంద్రకళ దీకొండ
తులసి వనం (ఉపద్రష్ట సుబ్బలక్ష్మి) - మోటూరి శాంతకుమారి
చిరకాల స్వప్నం (వింజరపు శిరీష) - శారద కెంచం 
కష్టం కాదు (పోలా సాయిజ్యోతి) - K. K. తాయారు 
ఋణానుబంధం - సావిత్రి కోవూరు (స్వీయ సమీక్ష)
తళుకులు - బెళుకులు (ఎం. వి. ఉమాదేవి) - పి. వి. ఎన్. కృష్ణవేణి
లౌక్యం (సావిత్రి కోవూరు) - శైలజ కరణం

*కవితా సమీక్షలు:*
1. అమ్మకు అమ్మే సాటి (గజల్ - గీతారాణి) - వరలక్ష్మి యనమండ్ర
2. మహిళా మణిపూస (సంధ్య శ్రీనివాస్) - కొంటికర్ల లలిత

Saturday, May 20, 2023

మత్తకోకిల పద్యాలు

05/05/2023
తపస్వీ మనోహరం మరియు ఈ వేమన కవితానిలయం 
 సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర పద్య, వచన కవితల పోటీ కొరకు ,
అంశం : పద్యాలు (ఐచ్ఛికం ).
ప్రక్రియ : మత్త కోకిల .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


శ్రీల నిచ్చెడు కల్ప వల్లివి సింహ వాహిని శాంకరీ.
వేల రుాపము లేలు తల్లివి వేల్పు కొలువౌ శ్రీకరీ
ముాల మంత్రిణి,మొాక్ష రుాపిణి,మొాహ మాయ వినాశినీ
బాల , శ్రీ లలితాంబ చిద్ఘని భక్త సంకట మొాచనీ ॥

అమ్మ నీవని నమ్మి యుంటిని ఆది శక్తి పరాత్పరీ.
నిమ్మళమ్మగు భక్తి తోనిను నిష్ట గొల్చెద నీశ్వరీ  ॥
రమ్మ నంటిని జాగు సేయక రావె శ్రీ జగదీశ్వరీ
ఇమ్మ నీవభయమ్ము మాకిల ఈప్సితావర దాయినీ ॥

జోత లెట్టెద చిద్ఘనీ శుభ జ్యోతి చక్రని వాశినీ.
ప్రాతః కాలపు పుాజలందవె పార్వతీ గుణ భాసినీ
యాతనింకను తాళజాలను యామినీ జన మొాదినీ
మాత శ్రీ లలితాంబ బ్రోవవె మాత మంగళ రుాపిణీ ॥

ముండ మాలిని దుర్గ నాశిని ముక్తి మొాక్షస్వ రుాపిణీ
ఛండ ఛండిక రుాపిణీ సుప్రచండ తాండవ మొాదినీ
అండ నీవుగ మమ్ము బ్రోవవె  ఆర్త త్రాణ  పరాయణీ.
భండ దైత్య విదారిణీ భవ బంధ దుఃఖ విమొాచనీ ॥

భక్తి గొల్చెడు వారి బ్రోచిన  భాగ్య మంగళ రుాపిణీ
యుక్తి రుాపము లెన్నొ దాల్చిన శక్తి శంకరు కామినీ ॥
భక్తి గొల్చిన వార నెల్లను  భ
సుాక్తి సుందరి శాంత రుాపిణి సుార్య తేజ ప్రకాశినీ
ముక్తి నిచ్చెడు మార్గ దర్శిని ముాక దైత్య వినాశినీ ॥


హామీ :
మత్తకోకిల పద్యాలు నా స్వీయ రచనలు.

Thursday, May 18, 2023

మార్పు

శీర్షిక  : మార్పు సహజమేకదా 

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్: మహారాష్ట్ర.

అర్ధరాత్రి చీకటిలో..
 మబ్బుల వెనుక దాగున్న మేఘమాల 
ఆనందంగా అవని తల్లిని పలకరిస్తుా
చిరు జల్లులు వెదజల్లుతోంది. ॥

అవని  పొరల్లో దాగి ఉన్న  మొలకబారిన
విత్తతు చిన్నారి తడి ఒడిలో ఒదిగేందుకు
 ఆనందంగా మొాము పైకెత్తింది.॥

లేతాకుపచ్చ రెక్కల్ని  మొదటిగా విప్పుకున్న  
మొలక చిన్నారి, ఉదయపు వెలుగు రేఖల్ని 
వింతగా చుాస్తుా వెర్రి ఆనందం పొందింది ॥

 కాలుష్యంతో పొగ నిండిన చిరుగాలి.
మొలక, వృక్షమై ఇచ్చే స్వశ్ఛమైన
"ప్రాణవాయువు " రాకకై నిరీక్షిస్తుా  .
మీనమేషాలు లెక్కపెడుతోంది.॥

గాయపడ్డ కాలం, గ్రహాల గమనాన్ని 
గంభీరంగా చుాస్తుా ,మారుతున్న
 మరో చరిత్రకు శ్రీకారం చుడుతోంది॥

ఊపిరిలో దీపం వెలిగించే వాయువు..
మొలక పెరుగుదలకు సారమిచ్చే
మట్టి చెలియతో కలిసి మనసారా-
మేలు మంతనాలు జరుపుతోంది.॥

సాదా సీదాగా అలా నడుచుకుంటూ
వెళుతున్న చిన్ని కీటకమొకటి
చిగురుటాకుల  పచ్చదనాన్ని చుాసి 
ముచ్చటపడి , దానితో దోబుాచులాడసాగింది ॥

మనిషిగా పుట్టి  మానవతను 
మరచిన  మనిషి , ప్రకృతి వరాలను ,
ప్రాణవాయువు విలువను తెలుసుకొని,
 విత్తనాల నాటుకై , మడులను
సాగుచేసే యత్నాన్ని జోరుగా సాగిస్తున్నాడు.॥

పరిణితి చెందుతున్న మనిషి 
మనో-వికాశానికి తోడుగా 
నేనున్నానంటుా,ఆకాశంలో 
మేఘమాల ఆనందంగా కురిసింది.॥

ప్రకృతి ప్రకోపానికి బీటలువారిన 
పుడమి తల్లి హృదయం , 
ఆనందంతో పులకరించిపోయింది..॥

"మార్పు సహజమేకదా" 
గ్రీష్మం దాటగానే వచ్చే రుతువులన్నీ
ఇచ్చేది చల్లదనమే కదా....
అంటుా...కోయిలమ్మ కులుకుతుా 
 కొత్త రాగాలు తీసింది.॥

హామీ : ఈ కవిత నా స్వీయ రచన.


 ----

ఛందస్సు ..గణములు.

17/05/2023.
మహతీ సాహితీ కవి సంగమంలో....
నేటి ప్రక్రియ: పద్యం
అంశం: కల 
శీర్షిక  : 
ప్రక్రియ :సీస పద్యము.
-------------------
1.
నీవెంట పడినాను నీప్రేమ కోరేను
వలదంచు జెప్పకే  వదరుబోడి
కలలోన కనిపించి కవ్వించి పోయావు.
తెలివైన దానవే  తెలుగు బాలా ॥

నీఅంద చందాలు నీముద్దు  మురిపాలు
నినుబాయు విరహాల నిదుర రాదే
నినువీడి  నేనింక నిలువజా లనుశీల
గనుమొక్క పరినన్ను  కనుల తోడ ॥

ప్రక్రియ : ఆట వెలది.
------------------
వట్టి మాటలు గావు వలదు శంకిక నీకు.
వావి వరుస గలుపు  వలపు తోడ
మాఘ మాస మొచ్చె మంచిరో జులువచ్చె
పెండ్లి యాడ రావె పెంకి బాలా  ॥

2.
కలలోకి వచ్చేటి కథలుకా వ్యాలెన్నొ
కలవీడి పోగానె కావు నిజము
కలలోన కనులందు కనిపించు చిత్రాలు.
భారమౌను మదిని భయము గొల్పు॥

మదిలోని భావాలు మనసులో తాపాలు
కలబోయు తలపులే కలల రుాపు
కలత నిద్దుర లోన కనిపించు శాపాలు.
మంచి భావము లున్న మరలి రావు॥


ప్రక్రియ : ఆట వెలది.
------------------
కష్ట బెట్ట వద్దు  కన్న వారి నెపుడు
రక్త బంధ మందు వలదు పోరు
 ఆలి కంటి నీరు అవని ముంచే ఏరు
 ఆడ దాని ఉసురు కవును చేటు॥
-----------------------

కాలుష్యపు కోరలు : కవిత.

16/05/2023.
శ్రీ శ్రీ కళావేదిక కవితా పోటీల కొరకు ,
అంశం : కాలుష్యపు కోరలు.
శీర్షిక  :   ఓ మనిషీ !ఇకనైనా మేలుకో !
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

తడి మట్టి ఒడిలోంచీ తన్నుకొస్తున్న
చిరు మొలకలను చుాసి ఓ చెట్టు తల్లి
భోరున విపిస్తోంది.
ఏదో ఓ నాడు, మనిషనే రాక్షసుడి
చేతిలో, మానులైన ఈ చిరు మొలకల 
కుత్తుకలు కోయబడతాయి కదా! అని॥.

పొగ నిండిన కాలుష్యాన్ని పొగరుగా
 మొాసుకొస్తుా తమ వెంటబడుతున్న
 వాహనాల వరుస పొగలకు ,నిర్మలమైన
 మేఘమాలికలు దుారంగా పారిపోతున్నాయి 
 తమలోనున్న కుసింత తేమనుా 
 కురియనీయక  దోచుకుంటాయన్న భయంతో...॥
  
 అశుభ్రత నిండిన అవస్థకు లోనైన
పిల్లగాలి, ఊపిరాడని స్థితిలో ఉరేసుకుంది ॥
 కసవు దొరకని పశు- పక్ష్యాదులు కలుష్యాలు 
 నిండిన ఆహారాన్ని, ఆబగా తింటుా,
 అంతుబట్టని -రోగాలతో అశువులు బాస్తున్నాయి ॥

పుడమి నిండిన మాలిన్యాలలో పుట్టుకొస్తున్న
పేరుతెలియని "కణాల" కాటుకు జన జీవితం
మందులేని రోగాలతో అస్థవ్యస్థమౌతోంది.॥

కాలుష్యం కాటుకు తన ఉనికినే కోల్పోతున్న
భుామాత భోరుమంటుా, తనలో  తానే 
ఐక్యమయ్యేమయ్యేందుకు ,మౌనంగా,ప్రళయ-
ఆవాహనానికి ప్రచండ శ్రీకారం చుడుతోంది.॥

  తస్మాత్ జాగర్త..!
  
హమిపత్రం : 
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.
 
 ***********

Wednesday, May 17, 2023

I love you Habby..(..ప్రేమ లేఖ).

16/05/2023
 మనోహరి మహిళా పత్రిక కోసం.
విభాగం:  లేఖ
(శ్రీవారికి ప్రేమలేఖ.)
శీర్షిక  : ఐ లవ్ యుా ..హబ్బీ..

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


"ఓయ్ ! హలో ! ఎప్పుడుా ఏదో
పని చేస్తుా , మౌనంగానే ఉంటారా..?
కాస్తా మాట్లాడొచ్చుకదా ! "అంటే..
 మీరు చిన్నగా నవ్వుతుా..
నీకు సాయం చేస్తే నాకు ఆనందం..
నవ్వు ఇంటి పనంతా చేస్తుాంటే 
నేనెలా కుార్చోగలను " అంటుాంటే.. 
నాకు మీ మీద చాలా కోపం వచ్చేది.

మార్కెట్ కు వెళదామంటే.."అలసిపోతావీశ్వరీ..
చాలా రష్ గా ఉంటుంది నువ్వు నడవడమే 
కష్టం అనేవారు". చిరాకు వేసేది.

"ఈ రోజు బయట కెళ్ళి హోటల్ లో
భోజనం చేద్దామంటే ," అక్కడ
ఆర్డరిస్తే గంటదాకా తేవరు. 
నువ్వా ఆకలికి  అగలేవు.
ఏంకావాలొ చెప్పు. నేనే ముందుగా 
వెళ్ళి పేక్ చేయించి తెస్తా.."
అంటుాంటే పట్టలేని కోపం వచ్చేది.॥

ఇదంతా నన్ను"  ఇంటికే పరిమితం చేయడానికి
మీరు ఆడుతున్న నాటకం " అనుకునేదానిని.
ప్లీజ్ ! నన్ను క్షమించరుా..🙏
..
మీరు మీ తండ్రిగారి  అనారోగ్య కారణంగా 
నన్ను వదిలి దేశం వెళ్ళిన ఈ పదిహేను రోజుల్లో,
మీ బాధ లేకుండా హాయిగా నాకు కావలసినట్లు
నా స్నేహితులతో తిరగొచ్చు అనుకున్నాను.
కానీ మీరు వెళ్ళిన మర్నాడే మా తమ్మడు వచ్చేడు.
ఉద్యోగ రీత్యా వారం ఉండాలంటుా..
వాడికి డబ్బా కట్టడంతో మొదలైన 
 ఇంటి పని రాత్రి వాడొచ్చేవరకు పుార్తయేది కాదు
 కష్టమై ,ఒక్కర్తినీ చేసుకోలేకపొియేదాన్ని .అప్పుడు
  మీరే గుర్తుకు వచ్చేరు.
మీరు వద్దంటున్నా అంత సాయం  ఎందుకు చేసేవారో
 నాకు  అర్ధమయింది. నా మిుద మీకెంత ప్రేమొా.
 మీ ప్రేమను గుర్తించనందుకు నన్ను క్షమించరుా..🙏
 
 తమ్ముడు పొద్దున్న వెళితే రాత్రే వచ్చేవాడు.
 కుారలు నేనే తేవలసి వచ్చేది .సంబరంగా
  మార్కెట్టుకు  వెళ్ళిన నేను నరకంలోకే 
  వచ్చాననుకున్నాను .
  ఆ జనంలో...కుళ్ళిన కుారల కంపులో, 
  ఆ తోపులాటల్లోంచీ బయట పడడం , 
  ఆటో దొరక్క  గంటలు గంటలు అలా నిల్చొని
  కాలక్ళు పీకుతుాంటే , చివరకు క్రిక్కిరిసిన బస్సులో పడి
  ఇంటికి వచ్చేసరికి కళ్లల్లో నీళ్ళు తిరిగేవి.
  మీరే జ్ఞాపకం వచ్చేవారు.
  నేను లిష్ట్ రాసి ఇచ్చే ప్రతీ వస్తువుా , మీరు 
  ఎన్ని అవస్థలు పడి కొనేవారో..కదా...
ఐనా ఇది బాగులేదు అది బాగులేదు అంటుా
మిమ్మల్ని సాధించేదాన్ని. 
     నన్ను మన్నించండి 🙏  మరెప్పుడుా అనను.
     
    మొన్న  అదివారం వాడుంట్లోనే ఉన్నాడు 
    సినిమాకి వెళదాం అన్నాను . 
సరే అన్నాడు. అక్కడికీ గంట ముందే బయలుదేరాము 
వెళ్ళేకా తెలిసింది . అక్కడెన్ని అవస్థలు పడాలో...
టికెట్  కోసం బారెడు లైనులో వాడు మగవారి లైనులో,
 నేను  ఆడవారి లైనులో నిలుచున్నాము .
 టికెట్ కౌంటరు   సినిమా మొదలవడానికి  పది నిముషాల ముందు తెరిచాడు. 
 అంతే ! అందరుా ఒకళ్ళమీద ఒకళ్ళు పడి,  కొట్టుకుంటుా ,
 తిట్టుకుంటుా,...ఎగబడ్డారు. ఆడవాళ్ళైతే మరీను.
 నా చీరంతా ఊడిపోయింది
  నా జుట్టు చెరిగిపోయింది, టిక్కెట్టు సంగతి దేముడెరుగు.
 బయట పడితే  చాలనుకున్నాను .  పిచ్చిదానిలాగే బయట పడ్డాను..
 అప్పుడు కుాడా మీరే  గుర్తుకు వచ్చేరు.
 ఇంట్లో   మీరు సాయం చేస్తుాంటే  చేసుకున్న పకోడీలు తింటుా వేడి వేడి టీ తాగుతుామీ పక్కనే కుార్చుని
  టి.వి లో  వచ్చిన సినిమా చుాస్తుా ఉంటే ఎంతబాగుండేదో...
  మిమ్మల్ని ఆడిపోసుకునేదాన్ని .నన్ను  క్షమించరుా..🙏

ఆ మర్నాడు నాకు జ్వరం వచ్చినట్టుగా , ఒళ్ళంతా నొప్పులుగా ఉడడం తో .తమ్ముడు ఆఫీస్ పనిమీద 
బయటకు వెలక్ళ లేదు సరికదా వంట కుాడా చేయొద్దు అన్నాడు.
ఐతే "మంచి హొటల్ కు తీసుకెళ్ళు" అన్నాను.
ఇద్దరముా తయారే  సిటీలో ఉన్న ష్టార్ హోటల్ కి
వెళ్ళేము.
 సర్వరు వచ్చి అందమైన గ్లాసులతో
మంచినీళ్ళు పెట్టేడు. పొంగిపోయేను.
తర్వాత మల్లెపుావుల్లాంటి గాజు ప్లేట్లు పెట్టేడు.
రిలాక్స్ గా కుార్చున్నాను.
ఆర్డర్ తీసుకుంటున్నపుడు , మెనుా కార్డ్ చుాసి 
నాకు కావలసినవి చెపుతుా ఉంటేనే నోట్లో
నీరుారింది.
సర్వరు  ఆర్డర్ తిుసుకొని వెళ్ళిపోయేడు.
అంతే...ఎంతకీ రాడు..
మాకు ఇటు అటు కుార్చున్న వాళ్ళంతా తింటుా ఉంటే
చుాస్తుా గుటకలు వేయడం తప్ప మరేం చేయలేకపోయాము.
 గంట తర్వాత ష్టాటర్స్ అంటుా...సలాడ్.అంటుా కొన్న ఉల్లిపాయ ముక్కలు . పకోడీలు, 
 ఇంకేవో తెచ్చేడు. ఆకలిమీదున్నామేమొా..
 ఆ పచ్చి ఉల్లిపాయలనే పరాపరా తినేసి పకోడీలు 
 ఖాళీ చేసి గ్లాసయడు నీళ్ళు తాగేసాము.
 ఆ తర్వాత అరగంటకి ఆర్డర్స్ వచ్చేయి.
 అన్నీ తినాలనుకొని ఇష్టంగా తెప్పించు కున్నవే..
 పకోడీల కారణంగా  ఏమీ తినలేక అన్నీ వదిలేసి ,ఏడ్చుకుంటుా 
 బోలెడుబిల్లు చెల్లించీ  ఇంటికి వచ్చేము.
 అప్పుడుా మీరే గుర్తుకు వచ్చేరు.
" నిజంగానే నేను ఆకలికి ఉండలేను.
మీరు చెప్పేవన్నీ  సాకులు అనుకున్నాను.
 నాకైన అనుభవంతో   మీ మాటలకు అర్ధం
తెలుసుకున్నాను.ఏమిటో తెలుసా...
మీకు నేనంటే పిచ్చి ప్రేమ..నేను కష్టపడితే చుాడలేరు."

ప్రేమంటే సినిమాలు షికార్లుా కాదనీ.మ
ఒకరి కష్టం ఇంకొకరు పంచుకోవాలనీ,
చెప్పకనే చెప్పేరు.
నామనసులో మాటకుాడా , ఈరోజు మీకు చెప్పేయనా."

నాకు కుాడా మీరంటే చాలా ఇష్టం .మీతో తిరగడం ఇష్టం.
మావారు నన్ను ఫలానా చోటుకి పట్టుకెళ్ళేరని నా 
స్తేహితులతో చెప్పుకోవడం  ఇష్టం.
అందుకే  అలా అడిగేదానిని.
కానీ ఇకముందు అలా అడగను .

మరో చిన్న మాట..
మీరు దగ్గరుంటే చెప్పలేను బాబుా..
అందుకే ఇప్పయడు చెప్తాను.
తెలుగులో చెప్పడానికి సిగ్గేస్తొింది.
మరి ఇంగ్లీష్ లో చెప్తానేం..
అదీ...అదీ...
"ఐ లవ్ యుా  హబ్బీ..."❤

***************************:

 హామీ: ఈ లేఖ నా స్వీయ రచన.

Monday, May 15, 2023

https://thapasvimanoharam.com/mathru-dinothsava-e-sankalanam/*14-05-2023 మాతృ దినోత్సవం సందర్భంగా తపస్వి మనోహరం రచయితలు మరియు రచయిత్రులు వ్రాసిన కవితా సంకలనం వెబ్సైట్ లింక్..✍️*

https://thapasvimanoharam.com/mathru-dinothsava-e-sankalanam/
*14-05-2023 మాతృ దినోత్సవం సందర్భంగా తపస్వి మనోహరం రచయితలు మరియు రచయిత్రులు వ్రాసిన కవితా సంకలనం వెబ్సైట్ లింక్..✍️*
62pg లో నా కవిత.

Sunday, May 14, 2023

జీవన వేదం (పాట.)

శీర్షిక  :జీవన వేదం.
రచన :శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్:మహారాష్ట్ర .

ప్రక్రియ :  పాట..
---------------------+


పల్లవి:
జన్మించుటెప్పుడో మరణించు టెప్పుడో
తెలియని విధిరాతిదనీ  తెలిసేది ఎన్నడో..
అనుపల్లవి:
ఈ పుడమిలో జన్మ   ప్రేమ నిండు సారమా
సుఖ దుఖః నావలో నడిసంద్ర ప్రయాణమా ॥
1.చరణం.
జీవితం తిరుగాడు వలయం  
నీ.. నా.. కధల రుాపం
మనసే జ్ఞాన దీపం  
నింపావహంకార తిమిరం 
ఒడుదుడుకుల బాటలో సాగించీ గమనం 
ఆశయాలె బాటలో కోల్పోయిన తరుణం 
పోయినదంతా వెనుకకు రాదుా
మిగిలినదాంతో తృప్తిరాదుా ॥
2.చరణం.
ఎంతెత్తు కెదిగినా   నడిచేది నేలపై...
కన్నవారు లేనిదే కానరావు భువిపై
నా అన్నవారుండరు, నీతోడై పాడెపై
నడిమంత్రపు సిరిరాదు,నిను గుాడి చితిపై
చావు పుటకలకు మధ్యన, క్షణమైన జీవితం
తెలుసుకొనీ మసలుకో అదె జీవిత సత్యం ॥
3.చరణం.
స్వార్ధమెంచి  దుారమవకు  అందరికీ మిత్రమా
బ్రతుకు దశల మార్పు తోడు, మనిషికి మనిషేసుమా.
ప్రాణమెగిరిపోయినా  కదలదు నీకాయము
ఓనలుగురి సాయమే   కాటిజేర్చు సాధనము.
ఐదడుగుల మట్టి గొయ్యి నీ జీవిత కాల ధనము
తుదికి మట్టిలోనె  కలియుటే బ్రతుకు రహస్యము ॥
*******************************

అమ్మను చంపుకుతిన్నాను...* సాయిచరణ్ కవిత

https://thapasvimanoharam.com/mathru-dinothsava-e-sankalanam/
*14-05-2023 మాతృ దినోత్సవం సందర్భంగా తపస్వి మనోహరం రచయితలు మరియు రచయిత్రులు వ్రాసిన కవితా సంకలనం వెబ్సైట్ లింక్..✍️*
***********::::::*************
*అమ్మను చంపుకుతిన్నాను...* 

అమ్మ... ఈ రోజు నీ దినం అని చెప్పే అర్హత నాకు లేదు
ఎందుకంటే
నేను పుట్టేటప్పుడే పురిటినొప్పులతో అమ్మను చంపుకుతిన్నాను...


అమ్మ... ఈ రోజు నీ దినం అని చెప్పే అర్హత నాకు లేదు
ఎందుకంటే
నేను పాలు తాగేతప్పుడే రొమ్ము కొరుకుతూ అమ్మను చంపుకుతిన్నాను... 

అమ్మ... ఈ రోజు నీ దినం అని చెప్పే అర్హత నాకు లేదు
ఎందుకంటే
నేను పాకేతప్పుడే ముఖం మీద తంతూ అమ్మను చంపుకుతిన్నాను...


అమ్మ... ఈ రోజు నీ దినం అని చెప్పే అర్హత నాకు లేదు
ఎందుకంటే
నేను చదువుకునేటప్పుడే పస్తులు ఉంచి అమ్మను చంపుకుతిన్నాను... 

అమ్మ... ఈ రోజు నీ దినం అని చెప్పే అర్హత నాకు లేదు
ఎందుకంటే
నేను ఎదిగిన కొద్ది నిన్ను ఎగతాళి చేస్తూ అమ్మను చంపుకుతిన్నాను... 

అమ్మ... ఈ రోజు నీ దినం అని చెప్పే అర్హత నాకు లేదు
ఎందుకంటే
నేను భార్యచాటున సరసమై నీ ప్రేమను విరసం చేసి 
నస బొమ్మగా అమ్మను చంపుకుతిన్నాను 

అమ్మ... ఈ రోజు నీ దినం అని చెప్పే అర్హత నాకు లేదు
ఎందుకంటే
నేను ఎన్నోసార్లు నాన్నకు నీకు తగువెట్టి తగుదునమ్మాని తప్పుకుతిరిగి అమ్మను చంపుకుతిన్నాను... 

అమ్మ... ఈ రోజు నీ దినం అని చెప్పే అర్హత నాకు లేదు
ఎందుకంటే
నేను మంచానపడిన నిన్ను చూసి, పాడెపై పడక, పడితింటుందని లోలోపల అనుకుంటూ బ్రతికున్న అమ్మను చంపుకుతింటూనే ఉన్నాను.... 

అమ్మ నేను నిన్ను చంపుకుతిననిది ఎప్పుడు...
నువ్వు నన్ను క్షమించనిదిని ఎప్పుడు...
అమ్మా నేనే కాదు...
ప్రతీ కొడుకు కూతురు 
దేనికో ఆశపడుతూ...
దేనికో ఆరాటపడుతూ...
బ్రతికున్న అమ్మకు ఎప్పుడో దినం పెట్టేశారు...
ప్రత్యేకంగా దినోత్సవం ఏమిటి అమ్మ... 

అమ్మ నేను ఇంకా స్వార్థపరుడినే
కాటికి కాళ్ళు చాసినా కూడా నిన్ను  ఏదో రకంగా పీక్కుతింటున్నా రాక్షసుడిని... 

అమ్మా...నీయంత సహనం,ఓపిక,ప్రేమ,మమత 
నాకు ఇవ్వవా అమ్మ...
కాదు కాదు అమ్మ అడగడం కూడా రాదు నాకు
నీ అమ్మతనం నాకు ఇవ్వరాదా అమ్మ... 

అమ్మా... నీ కౌగిలిలో తలపెట్టి పడుకోవడం
నీ కాళ్ళకు చేతులతో ముద్దాడడం 
నాకున్నా గొప్ప ఆస్తులు అమ్మ... 

అమ్మ ఎందుకో తెలియదు 
నిన్ను తలుచుకుని కళ్ళ చెంపలకు స్నానం చేస్తున్నాయి...
మనసు వూరికే ఊగిపోతున్నది 
మౌనంగా నీ ముందు నిలబడిపోతాను అమ్మ
నన్ను ఏమైనా చేయ్ నీ ఇష్టం... 

*అభిరామ్ 9704153642*

తపస్వీమనోహరం వారి వెబ్ సైట్ లింక్స్.

https://thapasvimanoharam.com/mathru-dinothsava-e-sankalanam/
*14-05-2023 మాతృ దినోత్సవం సందర్భంగా తపస్వి మనోహరం రచయితలు మరియు రచయిత్రులు వ్రాసిన కవితా సంకలనం వెబ్సైట్ లింక్..✍️*
నేను రాసిన కవిత , అమ్మ ఫొటో...60 వ పేజీలో.

********:::::

https://thapasvimanoharam.com/manohari-may-2023/

*తపస్వి మనోహరం వారి "మనోహరి" అంతర్జాల తెలుగు మహిళల ప్రత్యేక మాస పత్రిక - మే - 2023.. వెబ్సైట్ లింక్✍️

లింక్ లో నా ఆర్టికల్ ..మ
శ్రీ లలితా వైశిష్ట్యం....

మన దేశం మరియు నగరాల అసలు మరియు అందమైన పేర్లు ఏమిటో మీకు తెలుసా..?

మన దేశం మరియు నగరాల అసలు మరియు అందమైన పేర్లు ఏమిటో మీకు తెలుసా..?
 1. హిందుస్థాన్, ఇండియా లేదా భారత్ 
అసలు పేరు - ఆర్యవర్త!
 2. కాన్పూర్ 
అసలు పేరు కన్హాపూర్.
 3. ఢిల్లీ 
అసలు పేరు ఇంద్రప్రస్థ.
 4. హైదరాబాద్ 
అసలు పేరు భాగ్యనగర్.
 5. అలహాబాద్ 
అసలు పేరు ప్రయాగ్.
 6. ఔరంగాబాద్ 
అసలు పేరు శంభాజీ నగర్.
 7. భోపాల్ 
అసలు పేరు - భోజ్‌పాల్!
 8. లక్నో 
అసలు పేరు లక్ష్మణపురి.
 9. అహ్మదాబాద్ 
అసలు పేరు కర్ణావతి.
10. ఫైజాబాద్ 
అసలు పేరు అవధ్.
11. అలీఘర్ 
అసలు పేరు హరిగఢ్.
12. మీరాజ్ 
అసలు పేరు - శివప్రదేశ్!
13. ముజఫర్‌నగర్ 
అసలు పేరు లక్ష్మీ నగర్.
14. షామ్లీ 
అసలు పేరు శ్యామాలి.
15. రోహ్తక్ 
అసలు పేరు రోహితాస్పూర్.
16. పోర్బందర్ 
అసలు పేరు సుదామపురి.
17. పాట్నా 
అసలు పేరు పాట్లీపుత్ర.
18. నాందేడ్ 
అసలు పేరు నందిగ్రామ్.
19. అజంగఢ్ 
అసలు పేరు ఆర్యగఢ్.
20. అజ్మీర్ 
అసలు పేరు అజయమేరు.
21. ఉజ్జయిని 
అసలు పేరు అవంతిక.
22. జంషెడ్‌పూర్ 
అసలు పేరు కాళీ మతి!
23. విశాఖపట్నం 
అసలు పేరు విజత్రపశ్మ.
24. గౌహతి 
అసలు పేరు ప్రాగ్జ్యోతిష్‌పురా. 
25. సుల్తాన్‌గంజ్ 
అసలు పేరు చంపానగరి.
26. బుర్హాన్‌పూర్ 
అసలు పేరు బ్రహ్మపూర్.
27. ఇండోర్ 
అసలు పేరు ఇందూర్.
28. నశ్రులగంజ్ 
అసలు పేరు - భిరుండా!
29. సోనిపట్ 
అసలు పేరు స్వర్ణప్రస్థ.
30. పానిపట్ 
అసలు పేరు పర్ణప్రస్థ.
31. బాగ్‌పత్ 
అసలు పేరు - బాగ్‌ప్రస్థ!
32. ఉస్మానాబాద్ 
అసలు పేరు ధరాశివ్ (మహారాష్ట్రలో).
33. డియోరియా 
అసలు పేరు దేవ్‌పురి.  (ఉత్తరప్రదేశ్‌లో)
34. సుల్తాన్‌పూర్ 
అసలు పేరు - కుష్భవన్‌పూర్
35. లఖింపూర్ 
అసలు పేరు లక్ష్మీపూర్.  (ఉత్తరప్రదేశ్‌లో)
36. మొరెనా 
అసలు పేరు మయూర్వన్.
37. జబల్పూర్ 
అసలు పేరు జబలిపురం
38. గుల్మార్గ్ 
అసలు పేరు గౌరీమార్గ్
39. బారాముల్లా 
అసలు పేరు వర్హముల
40. సోపోర్ 
అసలు పేరు సుయ్యపూర్
41. ముల్తాన్ 
అసలు పేరు ములాస్థాన్
42. ఇస్లామాబాద్ 
అసలు పేరు తక్షశిల
43. పెషావర్ 
అసలు పేరు పుర్షపుర
44. స్కర్డు 
అసలు పేరు స్కంద
45. శ్రీనగర్
అసలు పేరు సూర్య నగరం

మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్చబడిన మరికొన్ని పేర్లు
1. హైదరాబాద్
అసలు పేరు భాగ్యనగరం
2. వరంగల్ 
అసలు పేరు ఓరుగల్లు
3.నిజామాబాద్
అసలు పేరు ఇందూరు
4.నల్లగొండ
అసలు పేరు నీలగిరి
5. ఖమ్మం
అసలు పేరు స్తమ్భం మెట్టు
6.విశాఖపట్టణం
అసలు పేరు వాల్తేరు
7 ఏలూరు 
అసలు పేరు హేలాపురి
8. రాజమండ్రి
అసలు పేరు రాజమహేంద్రవరం
9. విజయవాడ
అసలు పేరు ఇంద్రకీలాద్రి

ఈ పేర్లన్నీ మొఘలులు మరియు బ్రిటిష్ వారిచే మార్చబడ్డాయి....

Friday, May 12, 2023

అమ్మ కవితలు


08/05/2023
కలం స్నేహంలో 
మాతృ దినోత్సవ కవితల పోటీ కొరకు ,

అంశం :  మాతృదేవోభవ .
శీర్షిక :  అమ్మకు, అమ్మే సాటి.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

కనిపించే దైవం దేముడైతే
కని పెంచే దేవత అమ్మ ॥
సృష్టించే వాడు దేముడైతే ..
ఆ సృష్టి కి ముాలం అమ్మ ॥

తొమ్మది నెలల భారం తనలో మొాస్తుా 
 ప్రసవ వేదనలో కుాడాప్రతి క్షణం ఎదురుచుాస్తుా
 తన రక్తమాంసాల ఆకృతిని  ఆత్రంగా ముద్దాడే
 అది చైతన్య ముార్తి , ఆర్తి నిండిన అమ్మ ॥

ఆఁ వుాఁ ల వుాసులకు అర్ధం అమ్మ పలుకే
ఆడుగులేయడం నేర్చేది, అమ్మ ఆసరాతోనే 
ప్రపంచ వార్తా విశేషాలెన్నో,అమ్మ ఒడి బడిలోనే
ప్రపంచాన్ని గెలిచే ధైర్యం  అమ్మ చెప్పే కధల్లోనే..॥

ఆకలేస్తే  అడిగేంతలోనే సాక్షాత్కరిస్తుంది అమ్మ
నిద్దరొస్తే , జోల పాడి లాలిస్తుంది....అమ్మే
తన కంట్లో నలుసు పడితే అమ్మ కంట కన్నీరు
తన కాలులో ముల్లు దిగితే అమ్మ గుండెలో గునపాలు.॥

తన అనంద రుాపం  ,  అమ్మకు స్వర్గలోకం .
తన ఆరోగ్యం , అమ్మకు నిత్య వసంతం .
తన భోగ భాగ్యాల సుఖం, అమ్మకు ఆనందం.
తన చిరునవ్వే అమ్మ కంటికి వెలుగు కిరణం. ॥

అమ్మ జీవితాంత కష్టానికి ఎదిగిన నా అస్థిత్వం
అమ్మ ఋణాన్ని తీర్చుకోలేని స్వార్ధపుారిత వ్యక్తిత్వం ॥
  ఐనా ఓడిపోని  అమ్మ ,  ప్రతి సృష్టికి మరో బ్రహ్మ .
 ఊపిరాడని ఊడిగానికి నిలువెత్తు "కీలుబొమ్మ".॥
         " అమ్మ ".

************************************
హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.
****************::::*******
13/05/2023
మనుమసిద్ధి కవన వేదిక 
అంశం : మదర్స్ డే..
శీర్షిక : అమ్మ మనసు.
(వచన కవిత).
.రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

అకాశంలో వెలిగే తారల మిణుకులు
అమ్మ, నాపై పెంచుకున్న ఆశల శకలాల్లా.
 వెన్నెల కురిపిస్తున్న పుార్ణ చంద్రుడు .
అమ్మ  చల్లటి  చిరునవ్వులా ...॥

 బావిలో చంద్రుని ప్రతిరుాపం ,
 నా వెన్నంటి ఉండే- అమ్మ భావనలా...
మా తోటలో పుాచే గులాబీలు, 
అమ్మ  ఒడి నిండిన మమతలా....
 గాలిలో పరుచుకున్న  మత్తైన పరిమళం,
 అమ్మ ,నిస్వార్ధంగా పంచే ప్రేమలా..॥

 నాలో జరిగే అంతర్యుద్ధంలో
 నాకు నేనుగా ఓడిపోతుాన్న ,భావన..
 అమ్మనయ్యాకా గానీ తెలుసుకోలేని
 "అమ్మ"  మనసులా...॥
 
 ధారగా కారుతున్న నా కన్నీళ్ళు
 అమ్మని బాధపెట్టిన నా పాపానికి
 ప్రాయశ్ఛిత్తంలా.....॥
 
నా ఒళ్ళో కేర్..కేర్..మంటుా ఏం కావాలో
చెప్పలేకా ,ఏడుస్తున్న నా బాబు రోదన..
అనాధాశ్రమంలో ఆకలైనా చెప్పలేని
అమ్మ నిస్సహాయతకు నిదర్శనంలా....॥

ఈ కవిత నా స్వీయ రచన.
************************
***********************::

*తపస్వి మనోహరం వారు,. 
మాతృ దినోత్సవ సందర్భంగా విడుదల చేస్తున్న ప్రత్యేక e-book కొరకు రచన..*

11/05/2023.
ప్రక్రియ :  వచన కవిత.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .
శీర్షిక  : ఇల వెలసిన దైవం .

"ఆమ్మ  అనే రెండక్షరాల్లో ఒదిగి ,
రేయి పగలు తానై నిండినదమ్మ.
సృష్టికి ప్రతి సృష్టై , ప్రపంచాన్ని -
 ఏలుతున్న  మరో బ్రహ్మ అమ్మ.॥

పిండం నుండి, పిపీలకం వరకు 
జన్మించేది అమ్మ కుక్షిలోనే.
 అమ్మ ఒడి బడిలో , ఆఁ వుాఁ లకు
  అర్ధాలు నేర్చుకొని ,అమ్మ  ఆసరాతోనే 
  అడుగులు నేర్చి, ఎదిగిన వైనం
"అమ్మ " అనే పదానికి నిండైన నిదర్శనం ॥

ప్రతీ కష్టానికీ ఓర్చి, లాలించి -
పాలించే అద్భుత శక్తికి ప్రతీకయై
ఓంకార శబ్దానికి , ప్రతిద్వనిగా నిలచిన 
నామాక్షర రుాపమే ,అమ్మ అనే పదం ॥

ఏమిచ్చినా తీర్చుకోలేమామె  ఋణం.
" అమ్మ"  ,ఇలలో తరగని ధనం.
అమ్మను అభిమానించి, స్త్రీలను 
గౌరవిద్దాం మనం. ఎందుకంటే ...
"అమ్మ" ఇలవెలసిన" దైవం ॥

************************************
హామీ:
ఈ కవిత ఏ మాధ్యమునందునుా  ప్రచురితము కాని 
నా స్వీయ రచన .

*********************************
కవన కిరణాలకు పంపినది.

13/05/2023.
:శీర్షిక  :మా అమ్మ రాక్షసి.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

మా అమ్మ రాక్షసి,ఎందుకంటే..
ఎప్పుడుా నా వెంటే ఉండి 
నన్ను సాధిస్తుా ఉంటుంది.॥

ఐదు సంవత్సరాల చిన్న పిల్లనే కదా!
పక్కనున్న తాతయ్యలు బాబయ్యలు
నన్ను ముద్దు చేస్తుాంటే కసిరి -
ఇంట్లోకి రమ్మంటుంది ॥

ఎవరైనా చాక్లెట్లిస్తే తిననివ్వదు.
మత్తుమందుంటుందట...
బైట ఏమీ కొనుక్కోనివ్వదు.
కెమికల్స్ కలుపుతారట...॥

ఇంటోనే తను విశ్రాంతి తీసుకోకుండా
బోలెడు చిరు తిళ్ళు చేసేస్తుంది.
ఎప్పుడుా అవే పెడుతుంది.॥

పార్కులో ఆడుకుంటుాంటే
సాయంత్రం ఆరుగంటలకే 
ఇంటికి వచ్చేమంటుంది.॥

ఒక గంట, అంతకుమించి 
టి. వి చుాడనివ్వదు. ఎందుకంటే
కళ్ళు పాడైపోతాయట.॥

నాకు జ్వరం వస్తే రాత్రంతా
మేలుకొని ,దెయ్యంలా--
నా పక్కనే కుార్చుంటుంది.
మాటి మాటికీ తడి గుడ్డ నెత్తిని వేస్తుా॥

చదువుకోకపోయినా, 
హోమ్ వర్క్ ,చేయకపోయినా...
అబ్బా...ఒకటే సాధింపు.
చదువుకోకపోతే సుఖపడలేవంటుా...॥

అన్ని పనులకు సమయం నిర్దేసిస్తుంది.
అందరికీ అన్నీ సమయానికి అందిస్తుంది.
తను మాత్రం , సమయానికి పడుక్కోదు-
సమయానికి అన్నం తినదు.॥

నాకు కోపం వచ్చి చాలా అల్లరి చేస్తానా
న న్ను బుజ్జగించి...నన్ను నవ్విస్తుంది.
పైగా, మా పిల్లలు బుద్ధుమంతులంటుా
అందరితో అబద్ధాలు చెపుతుంది.॥

ఎప్పుడుా ఏదో పని చేస్తుా
మమ్మల్లి  అంటిపెట్టుకునే ఉంటుంది.
అన్ని నియమాలుా మాకే..
అమ్మేమీ పాటించదు.॥

పనులాపదు , సమంగా తినదు .
రాత్రిళ్ళు సమంగా నిద్రపొిదు. 
ఒళ్ళు బాగులేకపోయినా ,
ఇంటి పనులాపదు పైగా ఎంచక్కా
మార్కెట్టుకు పోయి, బోలెడు
సంచులు మొాసి తెస్తుంది ॥

అమ్మ ఎన్ని పనులు చేసినా 
ఎవరుా అమ్మని ఆపరెందుకో...
.అందికే  నేను పెద్దైతే, అమ్మ
 నన్నెలా చుాసిందో అలాగే చుాస్తా...॥
 
హామీ : 
పై కవిత నా స్వీయ రచన..

************************
13/05/2023.
అంశం : మాతృదినోత్సవం.

శీర్షిక :"అమ్మా...! నన్ను క్షమించవుా."..?

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .
 
క్రమసంఖ్య :  2023.

నేను అమ్మనయ్యాకా  తెలుసుకున్నాను  
అమ్మంటే ఏమిటో.."
నా బిడ్డ అకలికి ఏడుస్తుాంటే 
తెలుసుకున్నా.,"తల్లి ప్రేమంటే " ఏమిటో..॥

నా పాప పగలంతా నిదరోతుా 
రాత్రి ఆటలాడుతున్న పుడు తెలుసుకున్నా..
"అమ్మని , సహనానికి ప్రతీకని"  ఎందుకంటారో...॥

సమయానికి అందరికీ అన్నీ
 అమరుస్తున్నపుడనుకున్నా....
"అమ్మంటే, అవిశ్రాంత రాట్నమని...".,॥

నా పాప  నన్నెదిరించినపుడు తెలిసింది,
అమ్మ  నావల్ల "మానసికంగా ఎంత కుంగిపోయిందో .."
.
అమ్మ అనంతలోకాలకు చేరుకున్నాకా 
తెలిసుకున్నా ,పరిపుార్ణమైన త్యాగానికి 
"అమ్మకు అమ్మే సాటని ,".॥

ఈ నాడు అమ్మనైన నాకు "అమ్మంటే ఏమిటో"
తెలిసింది., 
కానీ నా తప్పులు క్షమించమని అడగడానికి 
"అమ్మ" లేదు., ఐనా అడుగుతున్నా....
"అమ్మా...! నన్ను క్షమించవుా."..?॥

హమీ : 
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.

*******::::*******************





Tuesday, May 9, 2023

వృత్త పద్యములు .వాటి .లక్షణములు. ఉదాహరణలు





[12/05, 4:18 am] +91 99634 18686: సుముఖి వృత్తము
న జ జ ల గ...యతి 7

అదిగొ దుబాయి కరింగిరహో
సుదతిని వీడి సుతాదుల బ్ర
త్కు దెరువుకై చదువన్నది,లే
క,దిగులుతోడ కనంగ సుధీ!!99
[12/05, 4:18 am] +91 99634 18686: భ్రమర విలసిత వృత్తము
మ భ న వ..యతి...6
నాపొత్తంబందున బలు విధముల్
ప్రాపౌ దోషంబుల వెదకకుమో
దీపంబంచున్ విధితముగను నీ
వేపొద్దైనన్ చవి గొనుము సుధీ!!100
[12/05, 4:18 am] +91 99634 18686: మణివితాన కాంతి వృత్తము
1,3 పాదాలలో..మ స జ గ..యతి 6
2,4 పాదాలలో..ర న ర వ 7

సాధ్యంబౌనిక సర్వమున్ ధరన్
విద్యయున్ననిక విన్ము మానవా
విద్యన్ మించినవిత్తమేది?యా
విద్య నేర్వవలె విజ్ఞతన్ సుధీ!!101
[12/05, 4:18 am] +91 99634 18686: నదీప్రఘోష వృత్తము

1 వ పాదంలో భ భ ర ర 7
మిగతా మూడుపాదాలలో
జ త జ ర...8   యతి
వ్రాసితి వేడ్కగ పద్యముల్ వాసియౌ
పసందుగానున్న సెబా సనండయా!
విశేషమైనట్టివిభిన్న వృత్తముల్
సుసాధ్యమున్ జేసితి, జూడుమో సుధీ!! 102
[14/05, 5:08 am] +91 99634 18686: ధ్రువకోకిల(తరళము)
న భ ర స జ జ గ 12 యతి

శుభము గల్గి ప్రపంచమంత యు శోభతోడనురాజిలన్
విభవమొప్పగ మానవాళి వివేక వంతులుగా మహిన్
ప్రభల కీర్తి వహింతురంచును భావమందు దలంచి నే
నభినుతించెద పెద్దలందరి కంజలించి, సుధీమణీ!! 1

ధ్రువకోకిల

కలిమి గల్గిన నాడు బొంగియు కావరంబున బల్కకోయ్
కలిమి శాశ్వతమౌన దెల్పుమి
క్ష్మాతలంబున నెప్పుడున్
కలిమిలేములు నూగుచుండెడి కావడింగల కుండలోయ్
కలిమిలేములు వచ్చిపోవును గాంచవోయి సుధీమణీ!! 2


[12/05, 4:18 am] +91 99634 18686: సుముఖి వృత్తము
న జ జ ల గ...యతి 7

అదిగొ దుబాయి కరింగిరహో
సుదతిని వీడి సుతాదుల బ్ర
త్కు దెరువుకై చదువన్నది,లే
క,దిగులుతోడ కనంగ సుధీ!!99
[12/05, 4:18 am] +91 99634 18686: భ్రమర విలసిత వృత్తము
మ భ న వ..యతి...6
నాపొత్తంబందున బలు విధముల్
ప్రాపౌ దోషంబుల వెదకకుమో
దీపంబంచున్ విధితముగను నీ
వేపొద్దైనన్ చవి గొనుము సుధీ!!100
[12/05, 4:18 am] +91 99634 18686: మణివితాన కాంతి వృత్తము
1,3 పాదాలలో..మ స జ గ..యతి 6
2,4 పాదాలలో..ర న ర వ 7

సాధ్యంబౌనిక సర్వమున్ ధరన్
విద్యయున్ననిక విన్ము మానవా
విద్యన్ మించినవిత్తమేది?యా
విద్య నేర్వవలె విజ్ఞతన్ సుధీ!!101
[12/05, 4:18 am] +91 99634 18686: నదీప్రఘోష వృత్తము

1 వ పాదంలో భ భ ర ర 7
మిగతా మూడుపాదాలలో
జ త జ ర...8   యతి
వ్రాసితి వేడ్కగ పద్యముల్ వాసియౌ
పసందుగానున్న సెబా సనండయా!
విశేషమైనట్టివిభిన్న వృత్తముల్
సుసాధ్యమున్ జేసితి, జూడుమో సుధీ!! 102
[12/05, 4:18 am] +91 99634 18686: నేటితో సుధీ!!శతకము పూర్తయింది... నూటరెండు పద్యములకు...నూటరెండు
ఛందస్సులు స్వీకరించి పూర్తిగా సామాజిక అంశములతో ముగించినాను......అభినందించి... ఆశీస్సులందించి కవిమిత్రులందరికీ...నమస్కారం....
[12/05, 7:02 am] +91 93218 86873: అవధాని అంజయ్య సోదరునికి అభినందనలు 
💐💐👏👏👌👌

[11/05, 5:09 am] +91 99634 18686: ప్రశాంతి వృత్తము
ర జ ర జ ర 9 యతి

వృద్ధులన్న జ్ఞానయుక్త వేదికల్ గనండయా
బుద్ధి తోడవారి మాట ముద్దుగా 
వినండయా!
పెద్దలెప్డు మంచిమాట పేర్మిగా
వచింతురే
యిద్ధరిత్రి లోన వారినెప్డు దిట్టకో సుధీ!!96
[11/05, 5:09 am] +91 99634 18686: వంశపత్ర పతిత వృత్తము
భ ర న భ న వ  11యతి

కార్మికులే,ప్రపంచమునకున్
ఖనిజములుకదా!
కార్మిక వర్గమే సతము ధీగతిని
పనులహో
యోర్మిగ జేయగా వరలెనో నురుగతిని సదా
యర్మిలి దేశదేశములహో యరయగను సుధీ!!
-------------

[11/05, 5:09 am] +91 99634 18686
: శాలిని వృత్తము
ర జ ర జ ర..యతి 9
పారిశుద్ధ్య కార్మికుల్ దివాకరుం దయించు ముం
దే!రమారమిన్ సుమీ!ప్రతిష్ట గాను,నిత్యమో
ఊరువాడ శుద్ధి జేతురోయి నీటుగానహో
వారికిన్ నమస్కరింతు భక్తి గానికన్ సుధీ!! 98
----------------------
[08/05, 5:56 am] 
+91 99634 18686: 
కనకలత వృత్తము

6 నగణములు1గ..యతి13

మగువగ జననము వడసియు
మరుని శరమువై
తగు పురుషుని జతగను సతతము మధురగతిన్
జగతిని వరలుచు సరియగు
సవము వడసియున్
జగడములెరుగక సతము సు
చరితగను సుధీ!!82॥
**********************
[08/05, 5:56 am]
 +91 99634 18686:
 విచికిలిత వృత్తము
7..నగణములు1గ..13 యతి

నినుగని మురిసిరిలను జనని జనకులు తనయుడనుచున్
నినుగొని మురిసెవనితయు పెనిమిటి వనుచును మదిలో
మనవలె నిరువురికెపుడును
మనసులు వరలు విధి నీ
కును జయమగును మనెదవిక
కొడుకుగ పతిగ సుధీ!!
**************************--*

[08/05, 5:56 am] 
+91 99634 18686: 
నర్తకీ వృత్తము...
భ భ భ భ న న న న గ 13 

సర్వ ప్రపంచము పుస్తక మందున సలలితముగ గలదు  కనగ నో
పర్వపు కాంతులు భవ్య వినో దము పరపతిసహితము దొరుకునుగా
నుర్వి నిగర్విగనుంచును వేడ్క గ నురుగతి దనరగ ప్రగతిగనో
శార్వరి బాపెడి శస్త్రమె పొత్తము సవినయముగవిను
మికను సుధీ 85

******************************

[08/05, 5:56 am]
 +91 99634 18686:
 కరిబృంహిత వృత్తము
భ న భ న భ న ర  యతి 13

అక్షయమయిన కార్యములకు
పునాదిగ నిల్వవలెన్ జుమీ
లక్షణముగ విరాజిలెదవిక రమ్యసుగతిని,ధాత్రి లో
సాక్షిగ వరలు మంచితనమను
సద్గుణమునకు మాను దు
ర్లక్షణములను వేగమె విను దురాత్ముల గలువకో సుధీ!!

***************************
[08/05, 5:56 am] +91 99634 18686:
 హర నర్తన వృత్తము
ర స జ య భ ర.. 9 14 యతి

పుస్తకంబన భవ్యమౌ బుధ వర్గంబౌ పుడమిన్ సదా
మస్తకంబున నుండుసుమ్మ 
సవిస్తారాంశపు శోభతో
నేస్తమై వరలంగ మానితమౌ తీరున్ నిను గాచునో
వాస్తవంబిది మానవా!ప్రభలన్
బొందన్ వడిగా సుధీ!!  84

*****************************
[12/05, 4:18 am] +91 99634 18686: సుముఖి వృత్తము
న జ జ ల గ...యతి 7

అదిగొ దుబాయి కరింగిరహో
సుదతిని వీడి సుతాదుల బ్ర
త్కు దెరువుకై చదువన్నది,లే
క,దిగులుతోడ కనంగ సుధీ!!99
[12/05, 4:18 am] +91 99634 18686: భ్రమర విలసిత వృత్తము
మ భ న వ..యతి...6
నాపొత్తంబందున బలు విధముల్
ప్రాపౌ దోషంబుల వెదకకుమో
దీపంబంచున్ విధితముగను నీ
వేపొద్దైనన్ చవి గొనుము సుధీ!!100
[12/05, 4:18 am] +91 99634 18686: మణివితాన కాంతి వృత్తము
1,3 పాదాలలో..మ స జ గ..యతి 6
2,4 పాదాలలో..ర న ర వ 7

సాధ్యంబౌనిక సర్వమున్ ధరన్
విద్యయున్ననిక విన్ము మానవా
విద్యన్ మించినవిత్తమేది?యా
విద్య నేర్వవలె విజ్ఞతన్ సుధీ!!101
[12/05, 4:18 am] +91 99634 18686: నదీప్రఘోష వృత్తము

1 వ పాదంలో భ భ ర ర 7
మిగతా మూడుపాదాలలో
జ త జ ర...8   యతి
వ్రాసితి వేడ్కగ పద్యముల్ వాసియౌ
పసందుగానున్న సెబా సనండయా!
విశేషమైనట్టివిభిన్న వృత్తముల్
సుసాధ్యమున్ జేసితి, జూడుమో సుధీ!! 102
[12/05, 4:18 am] +91 99634 18686: నేటితో సుధీ!!శతకము పూర్తయింది... నూటరెండు పద్యములకు...నూటరెండు
ఛందస్సులు స్వీకరించి పూర్తిగా సామాజిక అంశములతో ముగించినాను......అభినందించి... ఆశీస్సులందించి కవిమిత్రులందరికీ...నమస్కారం....
[12/05, 7:02 am] +91 93218 86873: అవధాని అంజయ్య సోదరునికి అభినందనలు 
💐💐👏👏👌👌

[12/05, 4:18 am] +91 99634 18686: సుముఖి వృత్తము
న జ జ ల గ...యతి 7

అదిగొ దుబాయి కరింగిరహో
సుదతిని వీడి సుతాదుల బ్ర
త్కు దెరువుకై చదువన్నది,లే
క,దిగులుతోడ కనంగ సుధీ!!99
[12/05, 4:18 am] +91 99634 18686: భ్రమర విలసిత వృత్తము
మ భ న వ..యతి...6
నాపొత్తంబందున బలు విధముల్
ప్రాపౌ దోషంబుల వెదకకుమో
దీపంబంచున్ విధితముగను నీ
వేపొద్దైనన్ చవి గొనుము సుధీ!!100
[12/05, 4:18 am] +91 99634 18686: మణివితాన కాంతి వృత్తము
1,3 పాదాలలో..మ స జ గ..యతి 6
2,4 పాదాలలో..ర న ర వ 7

సాధ్యంబౌనిక సర్వమున్ ధరన్
విద్యయున్ననిక విన్ము మానవా
విద్యన్ మించినవిత్తమేది?యా
విద్య నేర్వవలె విజ్ఞతన్ సుధీ!!101
[12/05, 4:18 am] +91 99634 18686: నదీప్రఘోష వృత్తము

1 వ పాదంలో భ భ ర ర 7
మిగతా మూడుపాదాలలో
జ త జ ర...8   యతి
వ్రాసితి వేడ్కగ పద్యముల్ వాసియౌ
పసందుగానున్న సెబా సనండయా!
విశేషమైనట్టివిభిన్న వృత్తముల్
సుసాధ్యమున్ జేసితి, జూడుమో సుధీ!! 102
[12/05, 4:18 am] +91 99634 18686: నేటితో సుధీ!!శతకము పూర్తయింది... నూటరెండు పద్యములకు...నూటరెండు
ఛందస్సులు స్వీకరించి పూర్తిగా సామాజిక అంశములతో ముగించినాను......అభినందించి... ఆశీస్సులందించి కవిమిత్రులందరికీ...నమస్కారం....
[12/05, 7:02 am] +91 93218 86873: అవధాని అంజయ్య సోదరునికి అభినందనలు 
💐💐👏👏👌👌




Friday, May 5, 2023

చింటుా చేసిన సాయం . కధ

మనోహరి మహిళా పత్రక కొరకు పంపిన రచనలు.
చింటుా...కధ.
చందమామ కధలు లో హీరో చింటుా  ( కధ ).
చింటుా చేసిన సాయం. ( .థ్రిల్లర్ కధ).
 చింటుా తెచ్చిన మార్పు(    కధ).
 పాటకు పల్లవి ప్రాణం లో 
" పాడనా తెలుగు పాట"కు సమీక్ష.
 సిసింద్రీలు  రాసినవన్నీ సెలెక్ట్ చేశారండీ.
 మనోహరి పత్రికపై  నా అభిప్రాయం.
 నా సంపాదన నా ఇష్టం అంశం కొరకు 
" నీలిమ. కధ.
నాటి సాహిత్యం ".తాళ్ళపాక అన్నమయ్య ".
పుస్తక సమీక్ష ..లో....
సహజీవనం మంచిదే కదా..అన్న నా .కధకు
 మొాటుకుారి శాంతకుమారిగారి సమీక్ష
యడవల్లి శైలజగారి. "హృదయరాగం ."
పై  నేను రాసిన సమీక్ష .
దర్శనీయ స్థలాలులో "మైసురు శ్రీరంగ పట్టణం గురుంచి..

బాల సాహిత్యంలో..."మంచి మాట వినరారే ముద్దుల సిరి
ముాటలు."
మహిళా దినోత్సవం కొరకు  "ఆర్టికల్ "
శ్రీ శక్తియైన " ల లితా వైశిష్ట్యం."
ఉమెన్స్ డే సందర్భంగా ,"మహిళా సాధికారత.".వ్యాసం .
గృహ శోభ లో..."అందమైన అనుభవం ."
జోక్స్లో " నాకు పెళ్ళి కావాలి ".
అన్ని రంగాల లో మహిళ లు మాత్ర మే బాస్ లు ఐతే  అన్న...
"ఆర్టికల్."

జ్ఞాన ప్రసుానాంబ  దండకం.

జన్మకు సార్ధకత. కవిత.
ప్రేమికుల రోజు! "మనసు విప్పి చెప్పనీ "..కవిత.

శివరాత్రి సందర్భంగా,  పద్యాలు.
బాల సాహిత్యం..."మంచి మాటలు".
కాలుష్య నివారణ తీరని సమస్య.
కవయిత్రుల పరిచయంలో ."..నా పరిచయం."

ఇవన్నీ సెలక్ట్ చేశామన్నవండీ...
కానీ  ఒకటో రెండో తప్ప,  మరేవీ మన పత్రికలో 
నేను చుాడలేకపోయాను .కొన్ని లింక్ లు ఓపెన్ కాలేదు.
మా బాబుకి హార్ట్ సర్జరీ అయింది . ఆ సమయంలో మెసేజ్లు నిండిపోవడం వల్ల మా వారు ..అన్నీ డిలీట్ చేసేసారు.
పరిమళగారికీ విషయం తెలియ జేసేను.
సెట్టింగ్స్ మళ్ళీ సరి చేయ మన్నారు.  చేసిన తరువాత ఏ పత్రికలోనుా నా రచనలు కనబడలేదండీ.
లింక్ లన్నీ డిలీట్ అయ్యేయి.
రాసిన వన్నీ  కష్టపడి రాసినవే...
సొంత వెబ్ లోంచీ గానీ  , కపీ  గానీ చేయలేదు .
ఇంకా రాసినవి ఉన్నాయనుకుంటాను .గుర్తు లేవు.
దయుంచి తెలియజేయగలరు.
ధన్యవాదాలతో 🙏🙏

ప్రకృతి తో పయనం



30/04/2023.
జయ శంకర సారస్వత సమితి కవితా పోటీల కొరకు,
శీర్షిక  : ప్రకృతితో పయనం.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

చల్లనిగాలి వీచే వేళలో పయనించే 
మల్లెపూల మత్తు పరిమళం మురిపిస్తోంది.
కోయిలమ్మ పాడే పాటలో నిండైన  రవం , 
హాయినిండు  నిత్య వసంతమై మరపిస్తొింది॥

పరుగులు తీసే మనసు విహంగం
ఆ పరుగుతో పయనించే వయసు యానమై
ఇంద్రధనుసు ప్రభల, పరుగుల స్వప్నమయ్యింది.. ॥
                        
కన్నె మనసు కవితైెతే ,ఆ కవితలింద్రధనుసైతే , అవి
ఆకాసమంతా నిండిన చిలిపి కలల మిణుకు తారలే కదా! .. 
ఆ తారలన్నీ మెరిసే చిరు వెన్నెలలై  కురిస్తే
ఆ చందమామ కళలలో దాగిన అందాలు, 
వలపురేపు  కధలే .కదా!॥

మబ్బుచాటున దాగిన మేఘం,  చినుకై కురిస్తే
 నా మనసు వేచియున్న ఒక చకోరమై నిలుస్తే..
తొలి చినుకు తడికి పడే ఆరాటం, ఓ ప్రేమే కదా !॥

ఇలలోని అందమంతా నే పాడే పాటకు పల్లవైతే 
జలజలల సాగే రాగ ఝరుల సందడి సడి
నా మదిలో రేగిన కలకలాలు, అలల సడులే కదా !॥
 ... 
చిన్ని చిన్ని  చిలుక జంటలు ,
పచ్చనైన  చేల పంటల్లో  చేసే కువ -కువల
  కిల- కిలారవాలు, నా మధుర గీతిలొ నిండు
  లయలకు పదములే కదా... ॥

చిరుగాలి వెంట నా పయనం ,
కెరటాల నడుమ నా గమనం , నాలో
భావాలే అలలై తేలుతుా , చేరుకున్న తీరం ,
నే కోరుకున్న మధురమైన గమ్యమే  కదా ॥    

మనసంత మధుర భావం నిండియుంటే,
 మదినిండా రసపు పానం కదులుతుా ఉంటే,
అది పండు వెన్నెలంత హాయైనదే కదా ! ...

పుాచే పూల సౌరభం, మలయారుత వలయ మైతే
చిరు చినుకు తడులు నిండిన మట్టి సోరభం -
మొలకెత్తే  చిన్నారి విత్తుకు, నిలిపే  ప్రాణమే కదా !॥

తలపించు  వేయి వినోదాల హాయి తలపుల్లో .... 
చేసే సంగీత- సాహిత్య -స్వర  ,విహారానికి
స-రి-గ-మ సఖుల సాయమే శృతి లయలైతే ,
సరదాలు చిందు, రాగ మధువుల మకరందలో
మునిగే జీవితం ,ఆనంద మధు పరాగమేకదా. ॥


హామీ : 
పై కవిత నా స్వీయ రచన.

____________________________________________

మత్త కోకిల

05/05/2023
తపస్వీ మనోహరం మరియు ఈ వేమన కవితానిలయం 
 సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర పద్య, వచన కవితల పోటీ కొరకు ,
అంశం : పద్యాలు (ఐచ్ఛికం ).
ప్రక్రియ : మత్త కోకిల .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


శ్రీల నిచ్చెడు కల్ప వల్లివి సింహ వాహిని శాంకరీ.
వేల రుాపము లేలు తల్లివి వేల్పు కొలువౌ శ్రీకరీ
ముాల మంత్రిణి,మొాక్ష రుాపిణి,మొాహ మాయ వినాశినీ
బాల , శ్రీ లలితాంబ చిద్ఘని భక్త సంకట నాశినీ ॥

అమ్మ నీవని నమ్మి యుంటిని ఆది శక్తి పరాత్పరీ.
నిమ్మళమ్మగు భక్తి తోనిను నిష్ట గొల్చెద నీశ్వరీ  ॥
రమ్మ నంటిని జాగు సేయక రావె శ్రీ జగదీశ్వరీ
ఇమ్మ నీవభయమ్ము మాకిల ఈప్సిత శంకరు కామినీ ॥

జోత లెట్టెద జోగుళాంబవు జ్యోతి శ్రీపుర.వాశినీ.
ప్రాతః కాలపు పుాజలందవె పార్వతీ గుణ భాసినీ
యాతనింకను తాళజాలను యామినీ జన మొాదినీ
మాత శ్రీ లలితాంబ చిద్ఘని మాత మంగళ రుాపిణీ ॥

భావ అగ్నిలొ సంభ వించిన భాను తేజ ప్రకాశినీ
దేవ కార్యము జేయ వచ్చిన దేవి దైత్య సంహారిణీ 
 పావనీ పరమేశు భామిని పంకజాక్షి సువాసినీ
గావ రాగదె కాల రుాపిణి కామినీ శుభ కామినీ ॥
 
ముండ మాలిని దుర్గ నాశిని ముక్తి మొాక్షస్వ రుాపిణీ
ఛండ ఛండిక రుాపిణీ సుప్రచండ తాండవ మొాదినీ
అండ నీవుగ మమ్ము బ్రోవవె  ఆర్త త్రాణ  పరాయణీ
కుండ లీని విశాల విశ్వ వినోద కుంజ విహారిణీ ॥


భక్తి గొల్చెడు వారి బ్రోచిన  భాగ్య మంగళ రుాపిణీ
శక్తి భైరవి శాంత రుాపిణి శాంకరీ శుభ కామినీ.
ముక్తి నిచ్చెడు మార్గ దర్శిని ముాక దైత్య వినాశినీ ॥
యుక్తి రుాపము లెన్నొ దాల్చిన యుద్ధ దైత్యవిదారిణీ ॥