Friday, August 28, 2020

అన్నదానం

*ఆగస్టు నెల*
రెండోపక్షానికి కవితల పోటీ కు
*అన్నదానం*
అంశంపై ఈ ఆగస్టు నెలాఖరు 31 తేదీ లోగా
20 లైన్స్ మించని కవితలు పంపగలరు

         🙏ఈవేమన🙏


  శీర్షిక .
శ్రేష్ట దానం--
అన్నదానం.
----------------
అన్ని దానాల్లోకి అన్న దానం
 శ్రేష్ట  మన్న మామ్మ.
ఇంటికి ఎవరొచ్చినా కడుపు నిండా
 అన్నం పెట్టే అమ్మ.
రాత్రి కాగానే  అమమ్మ  కధల్లో  
అన్నపుార్ణ గా డొక్కా సీతమ్మ.
తీర్ధ యాత్రలకు వెళుతుా --
అకలితో అలమటిస్తున్న 
కొంత మందిని  చుాసి, వారి
ఆకలి తీర్చాలంటుా వెనుతిరిగిన
డిక్కా సీతమ్మగారి దాన గుణ కధనం
అన్నార్తులకు అన్నం పెట్టడం
భగవంతుని పుాజ కన్నా ఉత్తమం.
అనే మాటలు...
నా మనసులో నాటుకున్న  
మంచి భావాల విత్తులు.
నా జీవితంలో నేను పొందిన ఆనంద ధనం.
అన్నార్తులిచ్చే ఆశీర్వాదాల బలం.
"అన్న దానం" భగవంతుని పుాజ సమానం.
కడుపు నిండిన వారి ఆశీర్వాదం
వేల యజ్ఞ -యాగాల సార ఫలం.
----------------------------------------
రచన, శ్రీమతి, 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
-------------------------

Thursday, August 27, 2020

వలస బ్రతుకులు. (కధ).

సహరి కధలపోటీ కి పంపినది.




శీర్షిక
 "వలస బ్రతుకులు."
----------------------------------
విడత విడతలుగా పెంచబడుతున్న  "లాక్ డౌన్ " , వలస జీవుల బతుకు పోరాటానికి సవాలుగానిలిచింది. చిన్నచిన్న పనులు చేస్తుా తమ కుటుంబాలను పోషించుకుంటున్న, ఎన్నో కార్మిక కుటుంబాలు నడి  రోడ్డున పడ్డాయి. . రెక్కాడితేగానీ డొక్కాడని వారి జీవిత పరిస్థితి, నరక ప్రాయంగా మారింది.
పనిలేక , జీతాలు రాక ,  ఇళ్ళ అద్దెలు కట్ట లేక , పస్తులు ఉండలేక,   ఆకలికి ఏడుస్తున్న పసి పిల్లల్ని
ఊరడించలేక , పండు ముసలుల కడుపుకు , పిడికెడన్నం పెట్టలేక , కటకట లాడిపోయేరు .
పట్టణం  లో పనిచేసుకొంటే ,కాస్త హాయిగా బతకొచ్చనుకున్న వారి కలలు , కల్లలయ్యేయి.
ఆకలి చావులు చావలేమనుకుని , తమ తమ పల్లెలకు పోదామనుకున్నా  ,  ప్రయాణ సౌకర్యాల రాకపోకలు నిలిచిపోవడంతో ఏంచెయ్యాలో తోచక నీరసపడిపోయేరు . ముాసుకున్న దుకాణాలు , నిలిచిపోయిన బస్సులు , జనసంచారం లేని  రోడ్ల తో,   నగర వీధులు,  నిర్మానుష్య మై కళావిహీనమయ్యేయి.
రైళ్ళు , విమాన రాకపోకలు నిలిచిపోయేయి.
పగలు , రాత్రి అనక అలుపెరగని ఆశలతో పరుగులు తీసే జన సముాహాలు , స్వగృహ కారాగారాల లో బందీ ఐపోయేరు. రోజులు, వారాలు , నెలలు గడిచినా..పరిస్థితులు మారలేదు . "కరోనా "మహమ్మరి విజృంభణ కు ఆనకట్ట వేయలేని పాలకులు , రోజు రోజుకుా పెరుగుతున్న మానవ మరణాలను ఆపలేక,      
మందు లేని మహమ్మారిని అరికట్ట లేక , ఛిన్నాభిన్నమౌతున్న దేశపరిస్థితికి చింతిస్తుా..ముఖం చాటు చేసేకున్నారు.. బతికేందుకు కావలసిన దారులన్నీ ముాతబడడంతో బడుగు  జీవుల ప్రాణాలు,
కొట్టుమిట్టాడేయి. చేసేదేమీ లేక , ఆకలికి తాళ లేక
 వేరే దారి కనిపించని  బక్క ప్రాణులు , పట్టణం విడిచి , తమ తమ  పల్లె  ప్రాంతాలకు , కాలి నడకనే నడిచి పోదామన్న నిర్ణయానికి శ్రీకారం చుట్టేరు.
 ఆరోజు నుండి ప్రారంభమైంది కాలే కడుపుల కాలినడకల ,  అనంతమైన తిరుగు ప్రయాణపు కన్నీటి యాత్ర ..
 ----------------------
గుడిసె ముందున్న  రాతి మీద కుార్చొని చుాస్తున్నాడు
నాగన్న....చుట్టుా ఉన్న వారంతా ముాటా ముల్లే సద్దుకుంటున్నారు. 
ఈ సరికి పదిసార్లైనా అనుకొన్నాడు. తను కుాడా వెళ్ళిపోతేనో....కలో గంజో .తాగినా.....తమ ఊరిలోనే తమ వారి మధ్య ఉంటుా...ఏదో చిన్న పని చేసుకున్నా చాలు గడిచిపోతుంది. సొంతిల్లుంది కనక  ఇంటద్దె కట్టక్కర లేదు.
ఏ రోజైనా తినడానికి లేకున్నా ,  ఇరుగు పొరుగులు ఆప్యాయంగా  "అన్నా...మాతో పాటు ఓ ముద్ద తిందుాగాని రా..." అంటుా పెట్టేవారున్నారు.
మంచికి చెడ్డకి మేమున్నామంటుా నిలబడే ఆత్మీయులున్నారు. కానీ అక్కడ తమకు పనీ ఉండదు, 
సొంత పొలముా లేదు. అక్కడున్నవారంతా  చిన్న చిన్న పనులకోసం పొరుగుారు పోయేవారే..అక్కడ బతకలేకే కదా తామంతా పట్నాలకు చేరేరు. ఇక్కడ బతుకు తెరువకు కొదవు లేదు. ఎవరు ఏ పని చేయగలుస్తే ఆ పని దొరికేది.ఇంత వరకుా బాగానే గడిచింది. ఈ మాయదారి  "కరోనా రోగమొచ్చి"  తమ బతుకులు  మట్టి  కొట్టుకుపోయేయి. జీవితాలు నాశనమయ్యేయి .
లాక్ డౌన్ కారణంగా కంపెనీలు , కట్టడాలు , అమ్మకాలుా అన్నీ బంద్ అయ్యేయి. చేతిలో చిల్లి గవ్వ లేదు. ఇంటిది ప్రసవమయ్యి  20 రోజులే అయ్యింది.
ఆసుపత్రికి తీసుకెళ్ళ లేని పరిస్థితిలో , ఇంట్లోనే చుట్టుపక్కలాళ్ళ సయంతో పురుడోసుకుని ,  నానా నరకపు యాతనలుా పడింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుంది " అన్న సామెతలా , బతికి బట్టకట్టింది.  అలాంటిదీ  ఈ  సమయంలో చంటోడిని చంక కేసుకుని తన ఇంటిది నడవగలదా..? నడిచి నడిచి తమ ఊరికి పోవాలంటే ఎన్ని రోజులు పడుతుందో...?
దారి ఖర్చులకు కుాడా డబ్బులు లేవు తన దగ్గర.
తన పెద్ద పిల్ల , నాలుగేళ్ళ పోరి సిట్టి , అంత దుారం నడవగలదా...? ..?
ముాటా ముల్లే సదురుతే ఎంతలేదన్నా నాలుగైదు ముాటలౌతాయి. అవన్నీ ఎట్టా మొాయాలె..?
దారిలో పిల్లకు ఆకలైతే ఏం పెట్టాలె..?
ఆలోచనలు తెగడంలేదు నాగన్నకు.
--------------------------
లోపల చంటాడికి పాలిస్తున్న ఆదెమ్మకు అసహనంగా ఉంది. రెండురోజులబట్టీ తనకు సమంగా తిండి లేకపోవడం వల్ల నీర్సంగా ఉన్నాది.దానికి తోడు చంటోడు, రెండు, ముాడు గంటల కోసారి పాలకోసం , ఏడుస్తాడు.  నాలుగేళ్ళ పెద్ద పిల్ల ఆకలి తీరక , మధ్య మధ్యలో పాలకోసం ఏడుస్తుంది. దాంతో ఆ పిల్లకు కుాడా రోజులో రెండు ముాడు సార్లు పాలిస్తుంది. దాంతో ఆదెమ్మకు చాలా నీర్సం వస్తోంది. సరైన భోజనం లేనందువల్ల పాలు కుాడా సమంగా పడడం లేదు. ఆదెమ్మకు కుాడా ఇంక ఈ పరిస్థితుల లో ఇక్కడ ఉండాలని లేదు. తమ ఊరు చిన్న ఊరైనా అందరి మధ్యా ఉంటే , ఆకలి లోటు  తీరవచ్చనే నమ్మకం ఉంది .ఆరు బయట కాళీ స్థలం లో కుారగాయలన్నా పండించుకొని అమ్ముతే కాసిన్ని రుాకలొస్తాయి . కాసింత కుాడుకు కరువుండదు.
ఈ మాటే తను  మామతో చెప్పింది. చెప్పి నాలుగు రోజులైనా మామ నిర్ణయం ఏమి తీసుకున్నాడో తెలియడంలేదు. చుట్టుపక్కల అందరుా వెళ్ళిపోతున్నారు. తాముకుాడా వాళ్ళతో పాటు బయలుదేరితే , ఒకరికొకరు సాయం ఉంటారు.
ఆదెమ్మ ఆలోచనల్లో ఉండగానే  నాగన్న లోపలికి వచ్చేడు. 
ఆదెమ్మ వైపు ఒకసారిచుాసి చంటివాడి బుగ్గలు నిమురుతుా " ,ఈ రోజు  పొరుగునున్న నారాయణ కుాడా పోతున్నాడట పల్లెకు" అన్నాడు ఆదెమ్మ వైపు చుాస్తుా. 
ఆదెమ్మ గతుక్కుమంది .వాళ్ళు కుాడా వెళ్ళిపోతే , ఇంక ఈ చుట్టు పక్కల ఎవరుా ఉండరు. మంచికీ చెడ్డకీ తామొక్కరే ఐపోతారు..అనుకుంటుా, నాగన్నతో మెల్లగా అంది ." మామా ! మనం కుాడా పోదాం ".మామా..
-----------------------------
నాగన్న కి ఆయాసంగా ఉంది.  పెద్ద పిల్ల ఆడుకోడానికని తయారుచేసిన కర్ర బండిమీద సామాన్లు వేసి,  దాని మీద పిల్లని కుాచోబెట్టి , బండి లాగడం చాలా కష్టం గా ఉంది. ఒక చేత్తో బండి లాగుతుా మరోచేత్తో మంచినీళ్ళ డబ్బా పట్టుకున్నాడు.దారిలో దొరుకుతాయొా లేదో అని పెద్ద సీసాలు నాలుగైదు నింపి , ఒక పెద్ద సంచిలో వేసి పట్టుకోవడంతో , నీళ్ళ బరువుకు చెయ్యి లాగుతున్నాది.

ఆదెమ్మ మెడలో కొంగుని ఉయ్యాలలా చేసి,  ముడివేసి ,చంటాడిని అందులో వేసింది. ఇంట్లో ఉన్న పిండితో జొన్న రొట్టెలు , కాస్తంత అన్నం వండి  పచ్చి ఉల్లిపాయలుా, మిరపకాయలుా వేసి , ముాట కట్టి
ఆ ముాట నెత్తికెత్తుకుంది. బుజానికి బట్టల ముాట ఒకటి తగిలించుకుంది. ఎండకి కాళ్ళు కాలుతున్నాయ.
పలచబడిన హవాయ్ చెప్పుల లోంచి వేడి తన్నుకొస్తొింది. నోరెండిపోతున్నాది. చంటిది నడవలేనప్పుడల్లా , బండి మీది బట్టల ముాట 
తీసి తలకెక్కించుకోవలసి వస్తోంది. ఆ జాగాలో సిట్టి కుార్చుంటే...
ఆదెమ్మకు బట్టల ముాట మొాయవలసి వస్తోంది.
నడక...నడక...నడక...
ఎన్నిరోజులు  పడుతుందో...తమ ఊరు చేరడానికి..
ఎండకు దాహం విపరీతంగా వేస్తోంది.  ఈ సరికే రెండు సీసాల నీరు ఐపోయింది. జాగర్తగా వాడుకోక పోతే కష్టమే...రోడ్డు మీద ఏ దుకాణముా లేదు. 
తినడానికి కుాడా ఏమీ దొరకడం లేదు. ఎట్టాగో....
ఆదెమ్మకు దుగులుగా ఉంది. 
--------------------
పిల్ల " అమ్మా ! ఆకలే.." అనడంతో...నాగన్న ఒక్క నిముషం ఆగేడు. తనకి కుాడా ఆకలౌతుాండడంతో నాగన్న చుట్టుా చుాసేడు. ఎండకుాడా చాలా తీవ్రంగా ఉంది  . తనకు కుాడా ఎందుకో చాలా నిస్సత్తువగా ఉంది . రోజంతా  కుార్చోకుండా పనిచేసిన రోజులున్నాయి .ఇంత నీర్సంగా ఎప్పుడుా లేదు. ఈ సమయంలో నడవడం కుాడా ఇబ్బందిగా ఉంది . కొంచం చల్లబడేదాకా కాసేపు  ఎక్కడైనా  కొంచం కుార్చోవాలనిపించింది. చుట్టుా చుాసేడు. 
 దుారంలో కొత్తగా కడుతున్న బిల్డింగ్ కనిపించింది.  పనింకా చాలా ఉంది కానీ మొదటి అంతస్తు పుార్తి అవడం వల్ల కాస్తా అక్కడ కుార్చొని విశ్రాంతి తీసుకోవచ్చు అనిపించి అటువైపుగా నడిచేడు. ఆదెమ్మ కుాడా అతడిని అనుసరించింది. బిల్డింగ్ దగ్గర  పడింది.  "అమ్మయ్య" అనిపించింది ఆదెమ్మకు . ఇప్పటికే కాళ్ళు చాలా లాగుతున్నాయి.
 పచ్చి బాలింతరాలు కావడంతో నడక ఇబ్బందిగానే ఉంది.  " కడుపుబ్బరంగా ఉంది. కాస్తా కాలు మడుచుకుంటేగానీ  ప్రాణం కుదుటపడేలా లేదు '"అనుకుంది . బిల్డింగ్ దగ్గరికి రాగానే బాత్రుామ్ ల కోసం చుట్టుా కళ్ళతోనే గాలించింది. దుారంగా  పనివారికోసం కట్టిన తడక రుాములు కనిపించేయి.
 చంటోడిని నాగన్నకు అందించి , పిల్లదాన్ని తీసుకొని అటుగాపోయింది.  నాగన్న అక్కడే నీడలో ఉన్న  చప్టా మీద చతికిలపడి చంటాడిని ఒళ్ళో పెట్టుకొని అలసటగా కళ్ళు ముాసుకున్నాడు. 
 రెండు నిముషాలు కాకుండానే పెద్దగా వినిపిస్తున్న అరుపులకు కళ్ళు తెరిచి చుాసేడు.
 ఆదెమ్మ పిల్లని పట్టుకొని పరుగు పరుగున వస్తున్నాది.
 వెనకాతలే గుార్ఖా కాబోలు కర్రతో అదిలిస్తుా , అసభ్యంగా తిడుతుా ఆదెమ్మను వెనకాల నుండి తరుముతున్నాడు.
 ఆదెమ్మ కళ్ళ లో నీళ్ళతో వచ్చి చంటోడిని అందుకుంది. ఆ వచ్చిన గుార్ఖా నాగన్న ని కుాడా అదిలిస్తుా , అక్కడ కుార్చోవడానికి వీలు లేదని , నానా మాటలుా అంటుా అరవడంతో ,  చేసేదిలేక ఇద్దరుా మళ్ళీ రోడ్డున పడ్డారు. 
 తిండి తిననే లేదు. పిల్ల "అమ్మా అకలైతాందే" ..అంటుా ఏడ్పులంకించుకుంది.
 అసహనంగా ఉన్న ఆదెమ్మ ఆపిల్ల వీపుమీద రెండు చరిచింది. 
 ఆదెమ్మ కళ్ళంట చిమ్ముతున్న  నీటిని మాటి మాటికీ చీర చెంగుతో తుడుచుకుంటుా గబగబా అడుగులేస్తోంది.
 ఇలాంటి ఎన్ని బిల్డింగులకు తనుా,  మామ , తమ లాంటి ఇంకెందరో , ఎంత మట్టీ ,   ఎన్ని ఇటికెలుా మొాయలేదు.ఒకొక్క ఫ్లోర్ స్లేబ్ కోసం , ఎన్ని రోజులు అవిరామంగా , కర్రల నిచ్చెనలు ఎక్కి సిమెంటు పోయలేదు..ఈ బిల్డింగ్ లు అన్నీ తమ కష్టంతోనే నిలబడ్డాయి. అలాంటిదీ...ఈ రోజు ఒక గంట విశ్రాంతికి తాము నోచుకోలేక పోయేరు.ఆ గుార్ఖా..తమని మనుషుల్లా కుాడా చుాడలేదు.  ఎన్ని మాటలన్నాడు.
" ఒక గంట ఉంటామని చెప్పి , అక్కడ ఉన్న స్టీలు, సిమెంటు దొంగలిస్తామంట.  దొంగలమే ఐతే ఈ కాయ కష్టం చేస్తామా.. చాలీ చాలని కుాలీ డబ్బులతో గడవకా ,.పస్తులుంటామా...?..
 కోపానికి నడక జోరు హెచ్చింది ఆదెమ్మకు . పొద్దున్న నుండీ , చంటాడు పాలకోసమే కాక ,  నిద్దర్లో కుాడా  చను మొనలు చీకుతుానే ఉన్నాడు.  చాలీ చాలని తిండి వల్ల ఆదెమ్మకు కళ్ళు తురుగుతున్నట్లుంది.
 అమె అవస్త చుాస్తుా కుాడా, నాగన్న ఏమీ చేయలేని పరిస్థితి లో ఉన్నాడు. ధైర్యం చేసి బయలుదేరేరు గానీ, లాక్ డౌన్ కారణంగా అన్ని దుకాణాలుా ముాసి ఉన్నాయి .మంచి నీరు కుాడా దొరకడంలేదు. గవర్న్ మెంటువారు , వలస కుాలీలకు భోజనం ఏర్పాట్లను  చేసేరన్న మాటతో , దారిలో ఇబ్బంది ఉండదనుకున్నారు. కానీ ఇక్కడ  రోడ్లన్నీ 
 నిర్మానుష్యంగా ఉన్నాయి. తాము తెచ్చుకున్న బువ్వంతా ఈ రోజే తినేస్తే , రేపెలా...? అనవసరంగా బయలుదేరేమేమొా....ఈ రకంగా నడిచి నడిచి , 
 ఎన్నాళ్ళకు తమ ఊరు చేరుకుంటామొా...?
 ఆదెమ్మ కుాడా అదే ఆలోచిస్తున్నాది.పోనీ ఈ రోజు ఎంత వరకు తినకుండా ఉండ గలమొా అంత వరకు నడుద్దాం...రాత్రి వరకు ఆగగలిస్తే , రేపటికి కుాడుంటుంది....అనుకొంది.
 కానీ చివరకు ఆకలి జయించింది. రోడ్డుపక్కన ఓ చెట్టుకింద కుార్చొని ఇంటినుండి తెచ్చుకున్నది కొంచం తిన్నారు. నాలుగేలళ్ళ సిట్టి , రిట్టె ముక్కలు ఉల్లిపాయతో తిన లేక బువ్వ తింటానన్నాది.  సిట్టికి ఆకులో అన్నంపెట్టి , అలసిపోయిన ఆదెమ్మ , చంటాడిని పక్కలో వేసుకొని చెట్టుకింద నడుం వాల్చింది .తండ్రి చుట్ట తాగుతుా చెట్టుకి ఆనుకొని కళ్ళు ముాసుకున్నాడు .  ఉత్తి అన్నం తింటున్న సిట్టికి  ఎక్కిళ్ళు రావడంతో  తాగడానికి నీళ్ళు  అడగబోయి , అమ్మ ,అయ్య , ఇద్దరుా కళ్ళు ముాసుకోవడంతో , లేపుతే కొడతారన్న భయంతో , స్వయంగా నీళ్ళు తాగబోయి,   పెద్ద సీసా కావడంతో
 పట్టుకో లేక , జారవిడిచింది. దాంతో నీళ్ళన్నీ నేలపాలవ్వడమే కాకుండా , పక్కనే ఉన్న అన్నంలోనుా , రొట్టెల పైనా కుాడా పడ్డాయి. చప్పుడుకు
 లేచిన ఆదెమ్మ , కుాడంతా నేలపాలయిందని కోపంతో సిట్టిని  సితక బాదింది.  రెండు మెతుకులు కుాడా తినలేదు సిట్టి . అప్పటికే రొట్టెలు నానిపోయి,  అన్నం నీటిమయం అయింది. ఇంక చేసేదేమీ లేక అన్నం పిండగా , వచ్చినంత ముాట కట్టి,
 మిగిలింది కుక్కలకి వేసింది.  తను చేసిన పనికి , అమ్మ   కోపంగా ఉండడంతో , సిట్టి  మళ్ళీ బువ్వ కావాలని అడగలేకపోయింది.  ఆదెమ్మకు , నాగన్నకు ప్రాణం ఉసుారుమంది. రేపటి కోసమనీ తామిద్దరుా అర్ధాకలితో లేచేరు. పిల్ల చేసిన పనితో కుాడంతా నేలపాలయ్యింది . తమ కడుపుా  నిండలేదు. దాహముా తీరలేదు. రేపంతా ఎలా..? సంటోడికి బువ్వ బెంగ లేదు. తన దగ్గర పాలు తాగుతాడు. కానీ ,  సిట్టికి ఆకలైతే ఏం పెట్టాలె...?    రోడ్డుమీద ఒక్క దుకాణమన్నా కనపడుత లేదు. నల్లా కుాడా ఎక్కడా లేదు...దాహమైతే నీళ్ళెలా...?" ఆదెమ్మకు , సిట్టెమమ్మ మీద చాలా కోపం వచ్చింది గానీ ,  చావుదెబ్బలు తిన్న చిట్టి , బెక్కుతుా,  మట్టిలోనే నిద్రపోతున్న సిట్టిని చుాసిన  ఆదెమ్మకు  గుండె చెరువయ్యింది . పసిపిల్లని  చుాడకుండా కోపంలో ఎంతలా కొట్టింది "  అనుకుంటుా  ముక్కు చీదింది . ఏమీ చేసేది లేక , ఉస్సురంటుా మళ్ళీ నడక సారించేరు.
 నడక....నడక....నడక....
 ---------------------
అమ్మా కాళ్ళు కాల్తన్నాయే...అనడంతో చిట్టి వేపు చుాసిన నాగన్న గచ్చురుమన్నాడు. "సిట్టిీ నీ జోళ్ళేయే"
అంటుా అడిగేడు. మరే ఆ సెట్టుకాడే ఉన్నై. నే సెపుతుాంటే , అమ్మ ఇనుకోలేదయ్యా...కోపంగా బాదింది. అంటుా బుగ్గలు చుాపించింది. ఎర్రగా కందిన బుగ్గ మీద ఐదు వేళ్ళు అచ్చు దిగేయి. నాగన్న  పానం గిల గిల లాడింది. 
సిట్టి మాట విన్న ఆదెమ్మ " ఓలమ్మొా ! మామొా ! సానా దుారం నడిచొస్తిమి..ఇప్పుడెట్టాగే..అంటుా గుడ్ల నీరు నింపుకుంది. " పాపిష్టిది.తను...పిల్ల అరుస్తానే ఉండాది.అన్నం నేలపాలు సేసిందన్న కోపంలో తనే ఇనిపిచ్చుకోనేదు .పైగా బుగ్గ కందినట్టు కొట్టింది కుాడానుా"....ఆదెమ్మ పిల్ల దగ్గరగా వెళ్ళి , ఆపిల్లని గుండెలకు హత్తుకుంది .ఇదే అదనుగా పిల్ల తల్లి రొమ్మందుకుంది. అదెమ్మ చంటాడిని నాగన్నకు అందించి , చిట్టిని కొంగులోకి తోసి నడక సాగించింది.
నాగన్నకు ఇప్పుడు ఇంకా కష్టం గా ఉంది. రోజులపిల్లాడిని ఎత్తుకొని బండి లాగాలంటే కుదుర్త లేదు. సిట్టి నైతే తల మీద కెత్తుకునేటోడు.
ఇక తప్పదన్నట్టు భారంగా నడక సాగించేరు. ఆకలి తీరని దేహం శక్తిహీనమౌతున్నాది. ఎండకు నోరెండిపోతున్నాది. తమ దగ్గర మరి నీరు లేదు.
 
ఆదెమ్మ కుాడా నడవలేక పోతున్నాది.ఇంటి దగ్గర బయలు దేరిన దగ్గరినుండి చంటోడు  పాలు రాకపోయినా రొమ్ము చీకుతుానే ఉన్నాడు. మధ్యలో
సిట్టెమ్మ కుాడా వదల లేదు. ఆదెమ్మకు గుండెలో నొప్పి పుడుతున్నాది. పాలు రాకపోవడంతో మరీ బాధగా ఉంది.  రోడ్డు పక్కనే ఆగి , పాలు తాగి నిద్రపోతున్న  సిట్టిని , మెల్లిగా కిందకు దించి , అలాగే మట్టిలో పండబెట్టి , పక్కనే తనుా కుాల బడింది. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఆదెమ్మ నాగన్నతో , "మామా !
నిదరోతున్న పిల్లగాళ్ళనెత్తుకొని నడవలేము .మనముా కొంచం ఆరాము సేద్దామే" అంది. నాగన్న ఏమీ అనలేకపోయేడు. కానీ తాము రాత్రి సమయానికి, ఏదైనా మనుషులున్న చోటికి చేరుకోవాలె. లేకపోతే ఈ రోడ్డుమీద ఎక్కడ ఉండాలె."...కానీ దాహం  , ఆకలి అలసట...తో నడిచేందుకు కుదుర్తలేదు.
ఆలోచిస్తుానే  నాగన్న రోడ్డు మీద కుాలబడ్డాడు .బండి లాగి లాగి చేతులు బొబ్బర్లెక్కేయి.రెండు రోజులుగా నడుస్తునే ఉన్నారు. ఇంకా ఇరువై కొలోమీటర్లు నడాలేమొా తమ ఊరికి పోవాలంటే..
ఆలోచిస్తుానే కళ్ళు ముాసుకున్నాడు నాగన్న .
అలసిన శరీరాలు నిద్రకొరిగేయి. చంటాడి ఏడుపుకి తెలివొచ్చిన ఆదెమ్మ , చుట్టుారా చుాసి ఉలిక్కి పడింది.
అప్పటికి చీకట్లు కమ్ముకున్నాయి. గబ గబా లేచి నాగన్న ను లెేపుదామని  ఒంటిమీద చేయి వేసిన ఆదెమ్మ  " ఓలమ్మొా! పెయ్యి సవ సవ లాడుతుంది .జరం బాగా వచ్చినట్టుంది. " అనుకుంది.
ఏంచెయ్యడానికీ తోచలేదు. కళ్ళెంబడి నీళ్ళు కారుతున్నాయి  ఆదెమ్మకు. నాగన్న ముాలుగుతున్నాఁడు గానీ , 
లేవడంలేదు.  సిట్టి వేపు చుాసింది. పుార్తి నిద్దరలో ఉంది సిట్టి.   చిన్ని పాదాలు ఎర్రగా కంది, బొబ్బలెక్కేయి. బుగ్గమీద  ఎరుపు ఇంకా తగ్గలేదు. 
ఆదెమ్మ ప్రేమగా సిట్టి బుగ్గలు తడిమింది. చంటాడు కుాడా చల్లగాలి తగలడంతో హాయిగా నిద్రపోతున్నాడు.
ఆదెమ్మకు భయమేస్తోంది. పుార్తి చీకట్లు అలముకున్నాయి. ఎక్కడా వెలుగు లేదు .దుారంగా రోడ్డు మీద ఒక లైటు స్థంభం మీద ఉన్న బల్బు కాంతి
తనకు కనిపిస్తుా ఉండడంతో కాస్తంత ధైర్యమనిపించింది ఆదెమ్మకు. నాగన్న ముాసిన కళ్ళు తెరవడం లేదు. 
రాత్రంతా పిల్లల్ని  దగ్గరగా పొదుపుకొనీ , భయం భయంగానే ,  ఆ రాత్రంతా గడిపింది ఆదెమ్మ . కంటిమీద కునుకు లేదు. మామ అసలు లేవనే లేదు.
రాత్రంతా పిల్లలు  కుాడా ఎక్కువగా లేవలేదు.
దాంతో ఆదెమ్మకు కాస్తా విశ్రాంతిగా ఉన్నా , నిద్ర లేమీ భయాందోళనల వల్ల , తిండి లేనందు వల్ల కడుపులో వికారంగా ఉంది. కళ్ళు తిరుగుతున్నట్టుగా  ఉంది.
తెల తెల్లవారుతుా ఉండడంతో , ఆదెమ్మ రోడ్డు చివరివరకు , ఆశగా చుాసింది. ఎవరైనా దాతలు కాసింత నీరు పోసి, బువ్వెడతారేమొానని.  కనీసం ఎవరైనా మనిషన్నవాడు కనిపిస్తే ముందుగా నాగన్న పరిస్థితి  చెప్పి, ఆసుపత్రి  మందు కోసం , సహాయం చేయమందాం అనుకుంది . కానీ ఆదెమ్మ  ఆశ నిరాసే అయ్యింది. మిట్ట మధ్యాహ్నం  కావస్తున్నా , నాగన్న లేవలేదు. పిల్లలు ఇద్దరుా లేచి , తన పాలు తాగేరు .చెట్టు కింద చీర పరిచి పండబెట్టిన -
సంటాడితో , సిట్టి ఆటలాడుతోంది. ఆదెమ్మ దిగాలుగా నాగన్న పక్కన  గుడ్ల నీరొత్తుకుంటుా కుార్చుంది.
ఈ మధ్యలో సిట్టి..అమ్మా ! ఆకలౌతుందే  అంటుా  అడగడంతో , ముందురోజు నీళ్ళతో  తడిసిన  అన్నం ఆమె ముందుకు తోసింది. సిట్టి ఆబగా అందుకొని , ఓ ముద్ద నోట్లో పెట్టుకొని.., అమ్మా ! వాసనొస్తోందే...అంటుా వికారంగా ముఖం పెట్టింది.
పిల్లకి నిన్నటి నుండి తిండి పెట్టలేకపోయామన్న బాధ, 
అసహాయత తో , ఏమీచేయలేని ఆదెమ్మ...
" నోరు ముాసుకు తిను " అంటుా , చిట్టిని కసురుకొంది.
-----------------------------------
సిట్టి అమ్మ కోపం చుాసి , మళ్ళీ బువ్వ  ఒద్దంటే  , దెబ్బలు తినాల్సి వస్తుందని , మాట్లాడకుండా ముద్ద నోట్లో కుక్కింది.  ఆదెమ్మ అది చుాడలేక , ముఖం తిప్పుకుంది .  సిట్టి , తల్లి అటు తిరగ్గానే ఆకు ముాసి, కొంచం దుారం లో కడుపులో కాళ్లు దుార్చి , ముడుచుకు పడుక్కుంది.    
ఆదెమ్మ కు నాగన్న ను చుాస్తే భయం భయంగా ఉంది. జ్వరం తగ్గలేదు  ముాలుగుా అపలేదు.
ఎండ తీవ్రంగా ఉండి ఉక్కపోతగా అనిపించింది.
చెట్టు కొమ్మల మధ్యలోంచీ సుారీడు తొంగి చుాస్తుా మరీ
తన ప్రతాపాన్ని చుాపిస్తున్నాడు. ఆదెమ్మ మెల్లగా లేచి
పిల్ల ల దగ్గరకు వెళ్ళింది. చంటాడు పడుకున్నాడు.
వాడికి ఎండ తగలకుండా కింద వేసిన చీర  జరిపి, 
తాము తెచ్చుకున్న ముాటల్ని , నాలుగు వైపులా అడ్డుంచింది. తర్వాత చిట్టి దగ్గరకు వెళ్ళి , ప్రేమగా జుట్టు నిమిరి ,ఒళ్ళోకి తీసుకుని , రొమ్ము అందించింది.
ఎంత ఆకలిగా ఉందో , చిట్టి ఆబగా పాలు తాగుతోంది.
ఒక వైపు పాలు రాక పొివడంతో,  మరో  వైపుకు తిరిగింది చిట్టి. తమ్ముడు లేస్తాడు..అని చెప్పబోయిన ఆదెమ్మ చిట్టి ఆకలి చుాసి మాట్లాడ లేకపోయింది.
అటువైపు కుాడా పాలు ఎక్కువగా లేవు. సిట్టి గట్టి గట్టిగా చీకడంతో రొమ్మలు సలుపుతున్నాయి. 
ఒడిలోనే నిద్రపోయిన చిట్టిని , చంటాడి పక్కగా పండబెట్టి ..నాగన్న దగ్గరకు వెళ్ళింది ఆదెమ్మ..
-------------------------------------------------------++++

నాగన్న పక్కనే కుార్చుంది గానీ , ఏం చెయ్యాలో తెలీలేదు నాగమ్మకు.కడుపులో ఆకలి కర-కర లాఫుతున్నాది. పైన ఎండ కణ- కణ లాడుతున్నాది.
నాగన్న పెయ్యి సవ -సవ లాడుతున్నాది. అదెమ్మకు రొమ్ముల్లో సివ -సివ సలుపు తున్నాది. జాకట్టు ఎత్తి //చుాసుకుంది. పిల్లల  నోట్లో నాని నాని , పాలిపోయిన రొమ్ముల చుట్టుా ఎర్రగా కనపడింది. ఆదెమ్మ గాభరాగా సిట్టి వైపు చుాసింది .సిట్టి ముాతి ఎర్రగా ఉంది. 
పాలు లే కపోయినా చీకినందు వల్ల,  రకతం బయటకొచ్చిందని గ్రహిచీ  ఆదెమ్మ  చిన్నగా నవ్వుకుంది.
అంతలోనే చంటాడు లేస్తే ఎలాగ..? అనుకుంటుా భయం భయంగా అటు వైపు చుాసింది. పిల్లలిద్దరుా
మంచిగా నిద్దరోతుండడంతో , కాస్తంత ఊపిరి పీల్చుకొంది. ఒక గంట ఆగితే చాలు పిల్లాడికి సరిపడ్డ
పాలు ఊరుతాయి అనుకుంటుా..నాగన్న పక్కనే చెట్టు గుంజకు ఆనుకుని , చారపడింది.
------------------
సమయం ఎంతగడిచిందో తెలీదు .మగతనిద్రలో 
దాహం దాహఁం...అన్న మాటలు వినిపించడంతో
ఆదెమ్మ అదిరిపడి లేచింది. ఎదురుగా నాగన్న దాహం దాహం అంటుా...పొర్లుతున్నాడు. ఆదెమ్మ గాభరాగా అటుా ఇటుా చుాదింది. నీళ్ళ సంచిలో ఉన్న సీసాలు పరికించి చుాసింది ఒక్క గుక్కెడు నీళ్ళైనా ఉంటే బాగున్నని.. 
కాళీ సీసా తీసుకొని పిచ్చి దానిలా పరుగులు తీసింది.
కను చుాపు మేరలో ఎక్కడా నీరు గాని , ఇల్లు గానీ , మనుషులు గానీ కనిపించలేదు ఆదెమ్మకు. మధ్యాన్నపుటెండకు పాదాలు కాలుతున్నాయి.
రోడ్డు పక్కల ఉన్న తోపుల్లోకి దుారింది. చిన్న నీటి గుంటలన్నా  కనపడుతాయేమొానని. పిచ్చి దానిలా అక్కడక్కడా తవ్వుతుా పోయింది.
కానీ ఎక్కడా నీరు కనబడ లేదు.
ఆదెమ్మ పరుగు పరుగున మళ్ళీ , నాగన్న దగ్గరికి వచ్చింది. నాగన్న ఎండిన పెదాలతో, నీరు కోసం.....దాహం..దాహం...అంటుానే ఉన్నాడు. ఆదెమ్మకు పరుగెత్తడం వల్ల ఆయాసంగా ఉంది. 
కాళ్ళు నొప్పిగా , పాదాలు మంటగా ఉన్నాయి.
తను ఇపుడు నీరెక్కడ నుండీ తేవగలదు..
తన మామ నీటి కోసం అల్లలాడుతున్నాడే...
ఎలా..మామ గొంతు తడపడం...ఎలా..?
ఆదెమ్మ కళ్ళు వర్షిస్తున్నాయి. నిస్త్రాణగా , కింద కుాలబడింది. ఏడ్చి ఏడ్చి  నీరసపడింది. చివరకు 
ఆదెమ్మ ఒక నిశ్ఛయానికి వచ్చింది.
మామని మెల్లగా తన ఒడిలోకి తోసుకుంది.
అపస్మారక  స్థితిలో ఉన్న అతని నోటికి తన రొమ్ము అందించింది.  దాహంగా  ఉన్న నాగన్న ఆత్రంగా తాగుతున్నాడు. ఆదెమ్మ కంటి నుండి ధారాపాతంగా కన్నీరు  కారుతున్నాది. 
మామ దాహం తీరుతోందన్న తృప్తి  ఒక వైపు , పిల్లాడు లేస్తే ఎలా..అన్న బాధ ఒకవైపు  ఆదెమ్మను కమ్ముకున్నాది. ఆకలి , దాహం , రెండిటితో పడి ఉన్న నాగన్న ఆత్రంగా తాగుతునే ఉన్నాడు. ఆదెమ్మ ప్రేమగా రెండవ  వైపు  రొమ్ము  కుాడా , మామకు అందించింది.  ఆకాశం వైపు చుాస్తుా,  కనపడని దేవునికి మొక్కింది. దేముడా మళ్ళీ పాలు పడేదాకా , పిల్లలను  పండబెట్టే ఉంచు అంటుా..వేడుకుంది.  కళ్ళు తుడుచుకుని మామను పొదివి పట్టుకొని ,  అలా పిల్లల్ని చుాస్తుా కుాచుంది ఆదెమ్మ . పిల్లలకి ఆకలౌతే లేస్తారేమొా..అనుకుంటుా , పిల్లలని అలా చుాస్తుానే ఉంది . పిల్లల్ని  చుాస్తుాన్న  ఆ           కళ్ళు మరి ముాసుకోలేదు.
             పిల్లలని  అలా చుాస్తునే ఉన్నాయి. 
             --------------------------------------------

             కార్యేషు "దాసి" , కరణే సు "మంత్రి , 
             "భోజ్యేషు  "మాత "  అన్న మాటకు 
                     ప్రతీకగా... "ఆదెమ్మ ".....
                             ఆది+ అమ్మ.


-----------------------------------------------------....
లాక్ డౌన్ కారణంగా , అన్నం , నీరు లేక
 ప్రాణాలను  కోల్పోయిన  , వేలాది మంది వలస కుాలీల  కథనాలకు , 
                  నా ఈ కధ అంకితం.
రచన , శ్రీమతి , 
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్.  (మహరాష్ట్ర ).
------------------------------
        శీర్షిక "వలస బ్రతుకులు."

Wednesday, August 26, 2020

సింగరాజు రామకృష్ణ య్య .ఉపాధ్యాయులు పున్నమి పేపర్ కు పంపిన కవిత.శీర్షిక.


 24/82020. 

సింగరాజు రామకృష్ణ య్య .ఉపాధ్యాయులు
పున్నమి పేపర్ కు పంపిన కవిత.

శీర్షిక.
ఆశయ సాధకోద్యముడు.
------------------------------------
ఉపాధ్యాయుడు ఉన్నతంగా
ఉండాలనేది ఆయన ఆశయం.
ఉపాధ్యాయుల  సమస్యల పరిష్కారానికై
"ఎ.పి.టి.ఎఫ్ " సంస్థను స్థాపించి, ఉపాధ్యాయుల
ప్రయొాజనాలకై "పోష్టో "నిర్మాణాలు చేపట్టి      
చారిత్రాత్మక ఫలితాలను సాధించేరు.
విద్యారంగంలో చట్టబద్ధమైన "ప్రైవెటీకరణను"
వ్యతిరేకిస్తుా , ఉపాధ్యాయ భద్రతా విధానాలకై
ఉద్యమించిన  చారిత్ర కారులు సింగరాజుగారు.
వృత్తి సంఘాల ఆణచివేతల విధానాలకు లోనైన
"ఎ.పి.టి.ఎఫ్."  సంస్థను కంటికి రెప్పలా కాపాడి,
విద్యాశాఖాధికారుల  నిరంకుశత్వానికి
నిరసనోద్యమం సాగించి చరిత్ర లో
"ఉద్యమ సింగ రాజు"  గా ప్రజల మనస్సులో
స్థిరముద్ర వేసుకున్న  సింగరాయులు .
ఉపాధ్యాయుల గౌరవకారకుడు,  ఈ ఉత్తమ
ఉపాధ్యాయుడైన ఈ ఉద్యమ కారకుడు.
నాలుగు దశాబ్దాలు "ఎ.పి.టి.ఎఫ్" సంస్థకు -
ప్రధాన కార్యదర్శిగా ,  రెండు దశాబ్దాలు
" శాశనమండలి" సభ్యునిగా , ఐక్య వేదికల లో
నిబద్ధత తో కుాడిన ఆదర్శ నాయకునిగా
పనులు చేసి, ఉన్నత ప్రమాణాలను నెలకొల్పిన
"ఉపాధ్యాయొాద్యమ సారధి" మన
         "సింగరసజు రామక్రిష్ణయ్యగారు."
ఈనాటి మన విద్యా విధాన---
  "మౌలిక పరివర్తన-సాఫల్యత"  కారులు ,
  ఉపాధ్యాయొాద్యమ   "చరిత్ర కారులు"   
                         మహౌాధ్యాయ  -                                                  
            " సింగరాజు రామకృష్ణయ్య"గారు
            ---------------------------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
----------------------

             
   

దాశరధి రంగాచార్యులు.

శీర్షిక.
సాహిత్య స్ఫుార్తి.
చైతన్య ముార్తి.
--------------------
(వచన కవిత).

చిన్న తనంలోనే తండ్రికి దుారమై, అన్నగారైన
దాశరధి కృష్ణ మాచార్యుల సాంగత్యంలో పెరిగిన
దాశరధి రంగాచార్యులు  , అభ్యుదయ, విప్లవ-
భావాలు సంతరించుకొని , ఉపాధ్యాయునుగా
పని చేస్తుానే , అలనాటి సమాజ అసమానతల
గుార్చి ప్రజలను చేతన్యపరచే రీతిలో ఉద్యమించేరు.
తెలంగాణ స్వాతంత్ర్య పోరాట యొాధులైన, వీరు
తెలుగు కవులు. రచయితలు.
వీరి రచనల్లో ఆనాటి తెలంగాణ  పోరాట-
  స్థితిగతులు దారుణ బానిస పద్ధతులు
  ప్రతిబింబిస్తుా ఉంటాయి.
  శ్రీ రంగాచారిగారు  "విశిష్ట సాహిత్య " రచనా కారులు.
  ఈయన రాసిన నవల ల్లో "చిల్లరదేవుళ్ళు" నవల
  సినీ చిత్రంగా రుాపొందబడి ఘన విజయాన్ని
  సాధీంచడమే కాక అనెేక భాషల్లోకి అనువదింపబడి
  నాటక రుాపంగా ప్రదర్శింపబడి, బహుళ ప్రాచుర్యం పొందింది.
  వేదాలను తెలుగులోకి అనువదించి ,చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న "సాహిత్య చరిత్ర కారుడు"..
  తెలంగాణ చారిత్రిక, సామాజిక , రాజకీయ ధృక్పధాలను "జీవనయానం " పేరుతో ఆత్మ కధగా
  వెలువడి, సాహిత్యం పై చెరగని ముద్ర వేశాయి .
"  మహాభారతం" గ్రంధాన్ని సులభ వచనం లో తెలుగులో రచించి అభినవ వ్యాసునుగా బిరుదు పొందేరు. ఇటువంటి ఎన్నో గ్రంధానువాదాలకు, వ్యాసాలకు, సంకలనాల  సరళ రచనకు  గాను ,
విశేష సత్కారాలను సన్మానాలను పొందిన
అభినవ సాహిత్య చైతన్య ముార్తి.
తెలంగాణ సాయుధ పోరాటం లో కీలక పాత్ర
పోషీంచిన ఉన్నత ఉపాధ్యాయులు.
              "శ్రీదాశరధి రంగాచార్యులుగారు."
              -------------------------------------
రచన,శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021
----------------------
 
   

Tuesday, August 25, 2020

మదర్ థెరీసా కవిత

శీర్షిక .
శాంతి దుాత.
-----------------
అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారు.
అలాంటిదీ అడగకుండానే అన్నార్తుల
ఆకలి తీర్చిన అన్నపుార్ణ "మదర్ థెరీసా".
అవసరార్ధులకు, అనాధులకు, నిరాశ్రయుల
సేవలకేై ,తన జీవితాన్ని ధారపోసిన" ప్రేమమయి."
అల్లలాడుతున్న అంటురోగుల "అభయ హస్తం".
అభాగ్య జీవిత "ఆశాకిరణాల ఆనంద దీప్తి "
 తన సేవా ధృక్పథాలకు "నోబెల్ శాంతి పురస్కారం"
  తో పాటు  భారత దేశ అత్యున్నత 
  పౌర  పురస్కారమైన -"భారత రత్న"ను 
  అందుకున్న ఘన కీర్తి కిరీటి .
  మంచి పనులకు , సేవానిరతికి , మార్గదర్శి.
  జాతి మత భేధాలకు అతీతంగా , ప్రతి ఒక్కరికి
  తన జీవిత చివరి దశ వరకు సేవలందించిన-
  నిశ్వార్ధ నిరంతర సేవా స్ఫుార్తికి నిదర్శనం .
   రోమన్ కేథలిక్ ఐన, "  మన మదర్ థరీసా "
                ------------------------------------
రచన, శ్రీమతి, 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
--------------------

Monday, August 24, 2020

గురుదేవోభవ.

గురుదేవోభవ.
శీర్షిక .
గురు దక్షిణ.
--------------------
చిన్ననాటి జ్ఞాపకాల చిరు అలజడి.
స్కుాలుకు వెళ్ళమని కోపగించే నాన్న.
హోమ్ వర్క్ చేయలేదని
మాష్టగారు వేయించే గోడకుర్చీ..
నాన్నగారు,,మాష్టగార్ల  మధ్య నున్న
స్నేహబంధపు   బాధ్యతాయుత అలోచన-
నన్ను ఉన్నతుడిగా తీర్చాలన్న మాష్టారి తపన.
ట్యుాషన్ పేరుతో నా ఆటల కట్టడి.
నేనాయన మీద పెంచుకున్న కోపానికి పెట్టుబడి
మాష్టారు నా మీద చుాపే ప్రేమకు ప్రతి పాశం.
నాలో చల్లబడిన కోపోద్రేకాల ఆవేశం.
పరీక్షా ఫలితాల్లో క్లాస్ ఫష్ట్ వచ్చిన ఆనందం.
మాష్టారి కళ్ళల్లో నిండిన ఆప్యాయతల ఆశీర్వాదం .
తప్పక చదివిన చదువుకు సార్ధకత.
ఉత్తమ ఉద్యోగ సాధకత.
లక్షల జీతానికి వలస ప్రయాణం.
ఐనవారందరికీ   చేసిన దుారం.
ఆధునిక సదుపాయాల ఆనంద జీవితం.
మాష్టగారు పెట్టిన విద్యా బిక్ష ఈ నాటి నా జీవితం.
జ్ఞాప్తికి వచ్చిన ఆనాటి నా నోటి గురు దుాషణ.
ఈ నాటి నా పశ్ఛాత్తాపు కన్నీటి  పాప ప్రక్షాళన.
ఈ నాడు కనిపించని నా గురువుకు
నేను చేస్తున్న మనఃపుార్వక  పాదాభి వందనార్చన..
నా పిల్లలను గురు భక్తి పరాయణులుగా
తీర్చిదిద్దడం, నా గురువుకు నేనిచ్చే "గురు దక్షిణ" .
----------------------------------------------------------------
చిన్నప్పటి నా గురువు లందరికీ సాదర వందనాలతో...
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
--------------------

గురు దక్షిణ కవిత. మెయిల్ చేసినది

శీర్షిక .
గురు దక్షిణ.
--------------------
చిన్ననాటి జ్ఞాపకాల చిరు అలజడి.
స్కుాలుకు వెళ్ళమని కోపగించే నాన్న.
హోమ్ వర్క్ చేయలేదని
మాష్టగారు వేయించే గోడకుర్చీ..
నాన్నగారు,,మాష్టగార్ల  మధ్య నున్న
స్నేహబంధపు   బాధ్యతాయుత అలోచన-
నన్ను ఉన్నతుడిగా తీర్చాలన్న మాష్టారి తపన.
ట్యుాషన్ పేరుతో నా ఆటల కట్టడి.
నేనాయన మీద పెంచుకున్న కోపానికి పెట్టుబడి
మాష్టారు నా మీద చుాపే ప్రేమకు ప్రతి పాశం.
నాలో చల్లబడిన కోపోద్రేకాల ఆవేశం.
పరీక్షా ఫలితాల్లో క్లాస్ ఫష్ట్ వచ్చిన ఆనందం.
మాష్టారి కళ్ళల్లో నిండిన ఆప్యాయతల ఆశీర్వాదం .
తప్పక చదివిన చదువుకు సార్ధకత.
ఉత్తమ ఉద్యోగ సాధకత.
లక్షల జీతానికి వలస ప్రయాణం.
ఐనవారందరికీ   చేసిన దుారం.
ఆధునిక సదుపాయాల ఆనంద జీవితం.
మాష్టగారు పెట్టిన విద్యా బిక్ష ఈ నాటి నా జీవితం.
జ్ఞాప్తికి వచ్చిన ఆనాటి నా నోటి గురు దుాషణ.
ఈ నాటి నా పశ్ఛాత్తాపు కన్నీటి  పాప ప్రక్షాళన.
ఈ నాడు కనిపించని నా గురువుకు
నేను చేస్తున్న మనఃపుార్వక  పాదాభి వందనార్చన..
నా పిల్లలను గురు భక్తి పరాయణులుగా
తీర్చిదిద్దడం, నా గురువుకు నేనిచ్చే "గురు దక్షిణ" .
----------------------------------------------------------------
చిన్నప్పటి నా గురువు లందరికీ సాదర వందనాలతో...
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
--------------------

శీర్షిక .
గురు దక్షిణ.
--------------------
చిన్ననాటి జ్ఞాపకాల చిరు అలజడి.
స్కుాలుకు వెళ్ళమని కోపగించే నాన్న.
హోమ్ వర్క్ చేయలేదని
మాష్టగారు వేయించే గోడకుర్చీ..
నాన్నగారు,,మాష్టగార్ల  మధ్య నున్న
స్నేహబంధపు   బాధ్యతాయుత అలోచన-
నన్ను ఉన్నతుడిగా తీర్చాలన్న మాష్టారి తపన.
ట్యుాషన్ పేరుతో నా ఆటల కట్టడి.
నేనాయన మీద పెంచుకున్న కోపానికి పెట్టుబడి
మాష్టారు నా మీద చుాపే ప్రేమకు ప్రతి పాశం.
నాలో చల్లబడిన కోపోద్రేకాల ఆవేశం.
పరీక్షా ఫలితాల్లో క్లాస్ ఫష్ట్ వచ్చిన ఆనందం.
మాష్టారి కళ్ళల్లో నిండిన ఆప్యాయతల ఆశీర్వాదం .
తప్పక చదివిన చదువుకు సార్ధకత.
ఉత్తమ ఉద్యోగ సాధకత.
లక్షల జీతానికి వలస ప్రయాణం.
ఐనవారందరికీ   చేసిన దుారం.
ఆధునిక సదుపాయాల ఆనంద జీవితం.
మాష్టగారు పెట్టిన విద్యా బిక్ష ఈ నాటి నా జీవితం.
జ్ఞాప్తికి వచ్చిన ఆనాటి నా నోటి గురు దుాషణ.
ఈ నాటి నా పశ్ఛాత్తాపు కన్నీటి  పాప ప్రక్షాళన.
ఈ నాడు కనిపించని నా గురువుకు
నేను చేస్తున్న మనఃపుార్వక  పాదాభి వందనార్చన..
నా పిల్లలను గురు భక్తి పరాయణులుగా
తీర్చిదిద్దడం, నా గురువుకు నేనిచ్చే "గురు దక్షిణ" .
----------------------------------------------------------------
చిన్నప్పటి నా గురువు లందరికీ సాదర వందనాలతో...
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
--------------------

Friday, August 21, 2020

చిరంజీవి...పున్నమి దిన పత్రిక కై పంపినది.

పున్నమి దిన పత్రిక  కై పంపినది.
శీర్షిక
ఆయుష్మాన్ భవ.
------------------------
అందరినీ ఆకట్టుకొనే అందమైన విగ్రహం.
మాటల్లో నిండిన మమతానురాగం ,
అల్లరిలో పసితనం, కళ్ళలో చిలిపితనం,
మనిషి లో హుందాతనం అతని ప్రత్యేకతలు.
"యాక్షన్ డాన్స్ మాష్టర్" గా" మాస్ హీరోగా
తనదంటుా ఒక ప్రత్యేక స్థానాన్ని
సంపాదించుకుని, మెగాష్టార్ గా
పేరు తెచ్చుకున్నారు "చిరంజీవి"గారు.
తెలుగు లోనే కాక, హిందీ, కన్నడ , తమిళ
సినిమా రంగాల్లో వేవిధ్యమైన పాత్రలు
పోషించి  మంచిపేరు తెచ్చుకున్న
బహుముఖ ప్రజ్ఞాశాలి చిరంజీవిగారు.
చిరంజీవిగారు స్థాపించిన "రక్తదాన"
" నేద్రదాన " సంస్థలు, పలు సేవా సంస్థలు
అత్యుత్తమ "దాన సంస్థలుగా" పేరొందడమేగాక,
రాష్ట్ర ప్రభుత్వ "పురస్కారాలను" అందుకున్నాయి.
దేశ ప్రజలకు పనుకొచ్చే మంచి సంస్థ లను
స్థాపించి ఎందరికో రక్త, నేత్ర, దానాలకు
కారకులై, వారికి  జీవితాన్నిచ్చిన శ్రీ చిరంజీవిగారు.
చిరంజీవిగారు ,  " చిరంజీవిగా " మరెన్నో
మంచి పనులు చేసి "ఘన కీర్తి" గణించాలని
మనసారా కోరుకుంటున్న అయన అభిమానిని.
--------------------------------------------------------
రచన , శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
హైదరాబాదు .తెలంగాణ .
8097622021.
---------------------

నగ్నకవి నిఖిలేశవర రావు గారు

శీర్షిక.
దిగంబర కిరణాలు.
-------------------------
సమాజాన్ని కలవరపరచే ఎన్నో సమస్యలు
మారని సామాజిక పరిస్థితుల నగ్న దృశ్యాలు.
వీరి రచనల్లో చోటు చేసుకున్న కఠిన సత్యాలు.
నిప్పులాంటి నిజాల్ని నిర్భయ రచనలుగా
వెలువరించే   విప్లవ బాణ తుాణీరాలు.
సామాన్యుడి అడుగడుగులో ఎడారేనన్న ఆవేదన-
రాజకీయ అబద్ధపు ప్రణాళికల ప్రమాణాలు
సామాన్యడి శిరస్సు పై హిమాలయ సదృస -
భార    సమానం  అన్న  ఆక్రోశం.
ఆశయ సిధ్ధి కై అందలాల సుార్యుడు
ఆశయాల పిడికిట్లోనే ఉన్నాడన్న సత్యం.
సామాన్య మానవుల కలలను ప్రేరేపించే నిజం.
ఇటువంటి ఎన్నో ఉత్తేజ భరిత విప్లవ కవిత్వాలు
ఉప్పెనలై పొంగే  సాహిత్య ఉద్యమాలు.
వారి భావాల  వివరణలో నగ్నత్వం..
వారిని  వారే నగ్న కవులుగా వ
ప్రదర్శించుకున్న  నిర్భయ మనో  ధేర్యం.
వారు రాసిన ఎన్నో సమకాలీన సాహిత్య రచనలు
ప్రజల దృక్పథాలకు వెలుగు చుాపే సుర్య కిరణాలు॥
------------------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
హైదరాబాదు . తెలంగాణ .
8097622021.
-----------------------
హామీ  =
ఈ రచన ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని
నా స్వీయ రచన.
-----------------------

Tuesday, August 18, 2020

పింగళి వెంకయ్య...ఝండా శృష్టికర్త.

రచన ,శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ ..మహారాష్ట్ర .
8097622021
---------------------
శీర్షిక.
ఝండా సృష్టికర్తకు-
వేల జే జేలు.
--------------------
పలు భాషలను నేర్వ పరదేశములకేగి
మేటి విద్యల నేర్చె కీర్తి ఘనుడు.
భుాగర్భ శాస్త్రము ల పరిశోధనలు జేసి
కీర్తి కెక్కిన మేటి చారిత్ర కారుడు.
జాతీయ ఝండాకు రుపకల్పన జేసి
జాతి గౌరవము నిలుపు ఖ్యాతి గౌరవుడు.
"జాతీయ పతాక" మను గ్రంధ రచనను
ఆంగ్లమున రచియించె, సమరయొాధుండు.
జాతిపిత జాడల లొ వెన్నంటి నడచేడు.
ఆంధ్రోద్యమము చేయ ముందు నిలచేడు.
జాతీయ ఝండాకు రుాపకర్తలు వీరు
స్వాతంత్ర్య ఉద్యమా సమర యొాధులు వీరు.
దేశమును ప్రేమించు త్యాజధనులలొ ఒకరు
"పింగళ  శ్రీ వేంకయ్య" నామధేయులు వీరు.
ముాడు రంగుల ఝండ మచ్చటగ నిలిపేటి
సమర యొాధుల కివియె "వే జేల అంజలులు" ॥
-------------------------------------------------------------




శీర్షిక.
నమః సుమాంజలి.
-------------------------------
శాంతియుత పోరాట పట్టుదల తో, 
సాధించిన ,దేశ స్వాతంత్ర్యం.
 "జాతి  పిత గాంధీజీ " కలల పంట.
పింగళి వెంకయ్యగారి, దేశ భకి  నిరతి-
 గాంధీజీ  గారి బాటలో నడిపించిన శక్తి.
ఇద్దరి దేశ సమైక్యతాభావనా  దృష్టితో..
రుాపొందిన జాతీయ పతాక సృష్టి. , 
ముాడు రంగుల మచ్చటైన -
భావనా  రుాప సంపత్తి-
ఆకుపచ్చ ,కాషాయ రంగుల సమ్మేళనం
సర్వ మత,  సమైక్యతా భావానికి నిదర్శనం.
తెల్లని తెలుపు ,మధ్యలో  చక్ర సుదర్శనం.
సత్య -అహింసా ఆచరణల నిత్య సందేశం.
ఎన్నటికీ స్ఫుార్తినిచ్చే మహోత్కృష్ట 
"పతాక రుాప కర్త " ఆలోచనా సరళి.----
ఆవిష్కరించిన "పింగళి వెంకయ్య" గారికి,
                    నమఃసుమాంజలి.
                    -----------------------
రచన,శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్్. మహారాష్ట్ర.
8097622021
----------------------
  హామీ..
  ఈ కవిత ,  ఏ మాధ్యమునందు ప్రచురితం కాని , నా స్వీయ రచన.
  ----------------------------------------

Thursday, August 13, 2020

గు్డ్ బై కరోనా

శీర్షిక .
గుడ్  బై  కరోనా........
----------------------
విధ్వంసానికి  నిలయమైన విశ్వంలో
మరో  వింత  మురికి బాంబు.

కాలదు, పేలదు , వాలదు..
గాలిలో ఘొారంగా కలిసిపోయే
" గ్రహ ఘరానా"
అందరినీ  అల్లుకుపోయే
విషపు వికారి  "కరోనా".

అడ్డు ఆపుా లేని ఆగడాలతో ,
అమానుష  అరిష్టాన్ని శ్రుష్టిస్తోంది.
"కరోనా" , పేరుతో కార్చిచ్చు రగిలిస్తుా..
కను రెప్ప పాటులో,జనాలను కబళిస్తోంది.
విగతజీవుల ,వీర విహారి.
మందు లేని ఈ, మహమ్మారి.
దగ్గు, తుమ్ము , జ్వరం దీని పరం.
చేయిా చేయిా కలుపుతే చాలు ."భయం భయం."॥

భయంకర చర్యల ,బహు దుారపు బాటసారి"కరోనా"
"చైనా" లో పుట్టిన  దుర్గంధపు దుష్ట కణం , " కరోనా"
ప్రపంచ యాత్రలో , నరులపై  దాడితో..
మానవ ప్రపంచంలో చిచ్చు రేపే అలజడి."కరోనా ".
కుళ్ళిన శవాల గుట్టలతో, పై నివాసం....
దుర్గంధపు మ్రుత కణాల తో ఆవాసం.."కరోనా ".॥

చంపడం దీని లక్ష్యం ,  అన్న మాటకు
ఇప్పటి వినాస విన్యాసాలే  సాక్ష్యం.
మానవాళి మనసుల్లో , మట్టికొట్టుకు పోయిన-
ఆచార వ్యవహారాల నిర్లక్ష్యాలకి  నిదర్శనం."కరోనా".
పాశ్ఛాత్యపు పోకడలతో, దిగజారిన నైతిక
విలువల నియమొాల్లంఘనల  "యమపాశం".కరోనా ".
శ్రుష్టి కార్యాల కంపరపు చర్యల కాలుష్యం "కరోనా".
అసౌచం, అసుచులకు, అర్ధం చెప్పిన" అద్దం , కరోనా".
జాతి, మత, కుల విభేదాల -స్వదేశ-విదేశాల
మారణహోమపు మ్రుత కణం " కరోనా."
చాప క్రింది నీరులా చేరువౌతున్న-
పరదేశపు పాప పంకిలం " కరోనా".
గుట్టలుగా పోగవుతున్న, విగతజీవుల
మ్రుతకణాల ముద్దు బిడ్డ.."కరోనా.."॥

ఇప్పటికైనా కళ్ళు తెరవండి.
మన ఆచార -వ్యవహారాలుా,
సుచి- సుభ్రతలు పాటించండి.
మడి , తడి, శుచి సుభ్రతల వెనుకనున్న
అంతర్గత ఆరోగ్య రక్షణా సుాత్రాలను గమనించండి.
మత భేదాల మారణ హోమాలు, ఆపండి
తల్లి-తండ్రులు , ఆడ బిడ్డల కన్నీటి
శాపాలకు గురి కాకండి.
వింత కోరికల సంయమనాన్ని పాటించండి.
వీధి వంటకాల విలయ తాండవానికి
"స్వస్థి", పలకండి.
"అందరుా బాగుండాలి. అందరిలో మనముండాలి",
అనే ఆలోచనతో మందడుగు వేయండి.
చెప్పండి కరోనాకు..."టా- టా..
ఇక ,సమతా- మమతలే..ఇంటా- బయటా..
--------------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల..జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
8097622021.

-------------





Wednesday, August 12, 2020

తెలుగు వెలుగుకు సాహిత్య సృజన.

ప్రక్రియ : సాహిత్య సృజన 
పేరు :బండి భానుచందర్ 
కవిసంఖ్య :41
వరుస సంఖ్య : 16-20


[8/20, 08:29] +91 70136 58114: మన సాహిత్య మిత్రుడు వంటాకు సూర్యనారాయణ గారు తెలియపరిచిన పూర్ణ,  పాక్షిక ప్రాసలు కూడా ప్రాసలుగా కవులందరు ఉపయోగించుకో వలసిందిగా విన్నపం చేస్తున్నాను. మిత్రుడు వంటాకు సూర్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదములు.

[8/20, 08:30] +91 70136 58114: కవి మిత్రులు అందరూ గమనించవలసినది ప్రాసాక్షర లతోపాటు కవితలలో మంచి భావం వచ్చే విధంగా ప్రయత్నం చేయండి

16.
 రాముడే దశరథుని సుతుడు సౌమ్యుడు 
అతనిని పొగడగా నేను చాలను 
రాముని భక్తుడే హనుమంతుడు వాయుపుత్రుడు 
అతని గొప్పతనం అక్షరములలో వర్ణించలేను 
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన 

17.
అందమైనది అమ్మ అనే మాట 
కమ్మనైనది ఆమె చేతి చలువ 
అవనికే వరం అమ్మ అనుమాట 
కరుణలో కట్టగలమా ఆమెకు విలువ 
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన 

18.

చినుకు చినుకు కలిస్తే వాన 
గుండె గుండె కలిస్తే ప్రేమ 
చెయ్యి చెయ్యి కలిస్తే స్నేహమున 
గెలుపుకు ఎదురులేదు నీకు మిత్రమా 
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన 

19

కోకిలమ్మ గానం ఎంతో మధురమైనది 
జాబిలమ్మ వెలుగు నిశికి అందమైనది 
కనుల ఎదుట నీరూపం స్వప్నమైనది 
జీవితమునకు ముడుపడు సమయం ఆసన్నమైనది 
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన 

20
కోకిల తనువుకు లేదు అందము 
అయినా తన స్వరము మధురము 
కార్యసాధకుడికి ఉండాలి ఓకటే గమ్యము 
అలుపెరుగని పోరాటానికి ఉంటుంది విజయము 
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన

ముత్యాల పుాసలు కొత్త ప్రక్రియ.

ముత్యాల పూసలు ప్రక్రియ నియమాలు:-
(1)7వరుసలు(7ఫంక్తులు)
(2) వరుసకు 3 పదములు ఉండునట్లు" ముత్యాల పూసలు"
(3)మాత్ర నియమాలు లేవు.
(4)రాయవలసిన అంశాలు
1రైతు కష్టం
2చెట్లు నాటుట
3గృహ హింస
*4బాల కార్మికులు-*
5పల్లెల వైద్యం
6పేదల చదువు
7కరువు భత్యం
8సాంకేతిక పరిజ్ఞానం
9రక్త దానం
10తెలుగు భాష -ముత్యపు పూస మొదలైన అంశాలు....116 వరకు.
●116 ముత్యాల పూసలు రాసిన కవి,మిత్రలకు #మోతి_శ్రీ_పురస్కారo బహుకరించడం జరుగుతుంది.

*-ప్రత్యేకం:-*
వారం వారం ముత్యాల పూసల హారం లో పాల్గొన్న కవులకు "వారం వారం పురస్కారాలు ప్రధానం చేయడం జరుగుతుంది.

●రూపకర్త: ఆత్రం మోతిరామ్ (కొలాము)
●నిర్వహణ:
భేరి మధుసూదన్
7674993500
భేరి💐సాహితి వేదిక(కర్నూలు)
ముత్యాల పూసలు(నూతన సాహితీ ప్రక్రియ) వాట్సాప్ గ్రూప్ లో ప్రవేశం పొంది ముత్యాల పూసలు రాయవలెను.

వెన్నెల వెలుగు కొత్త ప్రక్రియ

💐కార్మికులు -  కర్షకులు విశ్వ సేవకులు e సంకలనం💐

వెన్నెల వెలుగు (25) నూతన సాహిత్య ప్రక్రియలో  *కార్మికులు కర్షకులు విశ్వ సేవకులు* అనే అంశంపై వెన్నెల వెలుగు లు 25 పంపించాలి. 

ఫార్మేట్
1.శీర్షిక
2. వెన్నెల వెలుగు లు (25)
3. కవి వివరాలు
4. కవిచిత్రం
5. హామీ పత్రము

💐💐💐💐
నిబంధనలు నూతన కవితా ప్రక్రియ🍇🎇
వెన్నెల వెలుగు
1. దీనిలో 6 వరుసలు ఉండాలి
2. మొదటి 3 వరుసల్లో ప్రాస రావాలి
3. తదుపరి 3 వరుసల్లో అంత్య ప్రాస రావాలి
4. ప్రతి వరుసలో 2-4 పదాలు లేదా 10-20 మాత్రలు
5. మొదటి 3 వరుసలు తర్వాత నున్న 3 వరుసలకు బలాన్ని ఇవ్వాలి
💐💐💐💐
చివరి తేదీ
15.8.2020
💐💐💐
సంపాదకులు
డాక్టర్ ఎల్మల రంజీత్ కుమార్
💐💐💐💐 
సమదర్శిని తెలుగు సాహిత్య పరిశోధన సంస్థ మరియు
భేరి సాహిత్య వేదిక కర్నూల్ 
నిర్వహణలో e సంకలనం

https://chat.whatsapp.com/Lrn0AFnScxpKmH3PeYGXT4

💐💐💐💐
వెన్నెల వెలుగు కాకుండా వేరే పంపిన వారిని తొలగిస్తాము

Tuesday, August 11, 2020

పుాజ్యులు శ్రీ షణ్ముఖ శర్మగారి పాటలు.

[7/10, 15:59] Mohanrao America: పూజ్యగురుదేవులు వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి శ్రీమాతా లలితా ఆల్బమ్ నుంచి
పల్లవి:౼ ముజ్జగముల నేలు ముగ్గురమ్మల శక్తి రాసిపోసిన మహారాణి వే నీవు.(2)
సర్వచైతన్య సాకారమూర్తి
శరణు శరణోఆమ్మ కరుణాకటాక్షి (ముజ్జగమ్ముల)
చరణం 1
ఓంకారనాదమున సాకారమే నీవు
వేదాదివిద్యలకు ఆధారమై నావు.
ఓంకారనాదమున సాకారమే నీవు
వేదాదివిద్యలకు ఆధారమై నావు.
శృతిలయల గుతులలో శుద్ధసంగీతమై 
వాగార్ధమున మూలమై వెలసినావు (2)
                    (ముజ్జగమ్ముల)
చరణం 2
జగములను పోషించు సంపదల దేవతవు అష్ఠసిద్ధుల తోడ అందగించే కళవు(2)
కడగంటి చూపులు కనకధారలు కురిసి 
లేమి అనుమాట ని లేకుండ చేసెదవు.(2)
             (ముజ్జగముల)
చరణం 3

లోకైకదీపాంకురాని వే నీవు దుర్గతులడునుమాడు దుర్గవైనావు(2)
చిన్మయానలమందు చిగురించు మూర్తివై (2)
శివుని పట్టపురాణి  గా వెలగినావు(2)  
                (ముజ్జగమ్ముల)
[7/31, 09:09] Mohanrao America: పూజ్యగురుదేవులు వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు అష్టలక్ష్ములపై శ్లోకములు, పాటలు వ్రాసారు. ఇవి ఆయా లక్ష్ములకు సంబంధించిన శాస్త్రవైభవములతో శ్రీ సూక్తము మొదలైనవాటితో మంత్రగర్భితంగా కూర్చబడినవి. ఈ శ్రావణ మాసంలో నిత్య పారాయణం చేసుకోదగినవి.

శ్లోకములు పాడినవారు: శ్రీమతి ఎస్. జానకిగారు. పాటలు పాడినవారు: ప్రియాసిస్టర్స్. 

[౩] ధాన్యలక్ష్మి:
శ్లోకము: శ్రీ కారుణ్యసుధామయీం జగదధిష్ఠాత్రీం సదా పోషకీమ్
          సస్యారణ్య నదీ నదాది వసురూపాం అన్నదాం ధారుణీమ్
          క్షుద్బాధాపరిహారిణీం సకల భూతాధార భూతాం పరామ్
          ధన్యాం ధాన్య సమృద్ధిదాం సుతరసీం లక్ష్మీం హృదా భావయే

పల్లవి: ధాన్యలక్ష్మీం అన్నదాయినీం ప్రార్థయే పుణ్యసంపాదినీం పూర్ణాం ప్రసన్నామ్

చరణం: శాకంభరీం జీవ శక్తి సంధాయినీమ్ 
         ఆకారదాయినీం ఆరోగ్యభాగ్యదామ్
         శ్రీకర సుదీర్ఘాయురైశ్వర్య కారిణీమ్
         ప్రాకృత వర ప్రదామ్ రక్షిత జగత్త్రయీమ్  ... పల్లవి....

చరణం: పుష్టిప్రదాం లోక పోషిణీం చిత్కళామ్
         ఇష్టఫల సిద్ధిదాం ఇంద్రియాధీశ్వరీమ్
         తుష్టిదామ్ స్వాహా స్వధాకార ధారిణీమ్
         సృష్టికర్త్రీం సదా దృష్ట సంవర్ధినీమ్            ... పల్లవి....
[8/4, 08:27] Mohanrao America: పూజ్యగురుదేవులు వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు అష్టలక్ష్ములపై శ్లోకములు, పాటలు వ్రాసారు. ఇవి ఆయా లక్ష్ములకు సంబంధించిన శాస్త్రవైభవములతో శ్రీ సూక్తము మొదలైనవాటితో మంత్రగర్భితంగా కూర్చబడినవి. ఈ శ్రావణ మాసంలో నిత్య పారాయణం చేసుకోదగినవి.🙏

శ్లోకములు పాడినవారు: శ్రీమతి ఎస్. జానకిగారు. పాటలు పాడినవారు: ప్రియాసిస్టర్స్.

[౬] గజలక్ష్మి:
శ్లోకము: శ్రీ మద్దిగ్గజ సంస్థిత కనత్కుంభాంబు సుస్నాపితామ్
ఆర్ద్రాం పుష్కరిణీం హిరణ్మయసుధాకారాం యశోదాయినీమ్
అష్టైశ్వర్య మహాసిద్ధిగణ సంసేవ్యాం కృపావల్లరీమ్
వందే త్వాం గజమధ్యగాం సురుచిరాం లక్ష్మీం ముకుందప్రియామ్

పల్లవి: శ్రీ గజలక్ష్మీం చింతయామ్యహమ్; వాగీశార్చిత భవ్య పాదుకామ్

చరణం: పద్మకరాం పద్మాసన సంస్థామ్
పద్మనాభహృత్పద్మమందిరామ్
పద్మముఖీం పద్మాం సురేశ్వరీమ్
పద్మినీం మహాపద్మవనగతామ్ ... పల్లవి....

చరణం: గృహగత సంపత్కీర్తి వర్ధినీమ్
గృహలక్ష్మీం సద్గృహ సంవాసామ్
ఇహపర సుఖదాం నిరుపమ ఫలదామ్
గ్రహదోషహరాం అనుగ్రహకరామ్ ... పల్లవి....
[8/7, 07:17] Mohanrao America: పూజ్యగురుదేవులు సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు అష్టలక్ష్ములపై శ్లోకములు, పాటలు వ్రాసారు. ఇవి ఆయా లక్ష్ములకు సంబంధించిన శాస్త్రవైభవములతో శ్రీ సూక్తము మొదలైనవాటితో మంత్రగర్భితంగా కూర్చబడినవి. ఈ శ్రావణ మాసంలో నిత్య పారాయణం చేసుకోదగినవి.

శ్లోకములు పాడినవారు: శ్రీమతి ఎస్. జానకిగారు. పాటలు పాడినవారు: ప్రియాసిస్టర్స్. 

[౭] సంతానలక్ష్మి:
శ్లోకము: శ్రీ వాత్సల్య గుణామృతాబ్ధిలహరీం శ్రీ విష్ణువక్షస్థితామ్
          వంశవృద్ధికరీం సమస్త జననీం వంశీధర ప్రేయసీమ్
          సౌజన్యాదిక సత్త్వభావ భరితాం ప్రాణప్రదాత్రీం సుధామ్
          వందే విశ్వకుటుంబినీం గుణమయీం సంతాన లక్ష్మీం సదా

పల్లవి: సంతాన లక్ష్మీం సంతతం చింతయే చింతితార్థప్రదాం జీవన విధాయినీమ్

చరణం: క్షీరాబ్ధి సంభవాం శ్రీ భార్గవీం శ్రియమ్
         కారుణ్య విగ్రహాం కారుణ్య వర్షిణీమ్
         తారక కటాక్షాం తరణికోటిప్రభామ్
         ఆరాధకాఽభీష్ట ఫలకారిణీం భజే            ... పల్లవి....

చరణం: శ్రీ మాతరం భక్తచింతామణీం త్వామ్
         క్షేమంకరీం విష్ణుచిత్తాముదారామ్
         సన్మంత్ర మాతృకాం సంజీవరూపిణీమ్
         జన్మసాఫల్యదాం అమరవనితార్చితామ్    ... పల్లవి....
[8/11, 08:01] Mohanrao America: పూజ్యగురుదేవులు సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు అష్టలక్ష్ములపై శ్లోకములు, పాటలు వ్రాసారు. ఇవి ఆయా లక్ష్ములకు సంబంధించిన శాస్త్రవైభవములతో మంత్రగర్భితంగా కూర్చబడినవి.

శ్లోకములు పాడినవారు: శ్రీమతి ఎస్. జానకిగారు. పాటలు పాడినవారు: ప్రియాసిస్టర్స్.

[౨] విద్యాలక్ష్మి:
శ్లోకము: శ్రీవిద్యాం శృతిగోచరాం శుభకరీం చిద్వ్యోమసంచారిణీమ్
శబ్దబ్రహ్మమయీం స్వరాదిమయ సంగీతాకృతీం వాఙ్మయీమ్
శాస్త్రఙ్ఞాన వివేకసంయుత మహాబుద్ధిప్రదాం చిన్మయీమ్
విద్యారూపధరాం సుకర్మఫలదాం లక్ష్మీం సదా భావయే

పల్లవి: విద్యాలక్ష్మీం వేదమయీం ఆద్యాం వందే నాదరూపిణీమ్,

చరణం: బ్రాహ్మీ శాస్త్రోద్యానవిహారామ్
బ్రహ్మాద్యర్చితపరతత్త్వమయీమ్
బ్రహ్మాండవ్యాప్తాం భువనేశీమ్
బ్రహ్మఙ్ఞాన ప్రదయినీం త్వామ్ ... పల్లవి....

చరణం: వచోరూపిణీం వాగధీశ్వరీమ్
విచారసారాం విశ్వనాయికామ్,
శుచిరూపాం చిత్సుధావిగ్రహామ్
ప్రచురశుభఫలద దాయినీం త్వామ్. ... పల్లవి....

Monday, August 10, 2020

గోదావరీ రచయితల సంఘం లో నా కవిత. శీర్షిక .. చేనేత- మన వరదాత.

రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.  మహారాష్ట్ర.
8097622021.
------------------
శీర్షిక
చేనేత, మన వరదాత.
------------------------------
మన భారత దేశం సంస్కృతి, సద్ధర్మ
సాంప్రదాయాలకు నిలయం.
కట్టు ,బొట్టు ,ఆచార ,వ్యవహారాలకు ఆలయం.
స్త్రీలు కట్టే చీర కట్టు,  నుదుటి బొట్టు...
మన దేశ గౌరవాన్ని ఇనుమడుంప జేసే చిహ్నాలు.
ప్రశస్థ మైన  చేనేతి నుాలు బట్ట, అన్ని కాలాలకుా
 అనువైన రీతిలో ఆదరింపబడే వస్త్ర రాజం.
 అటువంటి అందమైన మగ్గపు చీరల
 చేనేత పరిశ్రమలు నేడు ముాలపడుతున్నాయి.
 పాశ్ఛత్య పోకడల పరుగుల్లో ఆడతనం 
 హద్దులు దాటింది.
 అందమైన చీర కట్టుకు బదులు , అరకొర బట్టల
 ఆనందం అలవాటయ్యింది.
 నుాలు చీరల విలువ కార్ఖానాల్లో ఖైదీ అయిపోయింది.
 పట్టు బట్టల  వాడకం పనికిరాని దయ్యింది.
 చేయి తిరిగిన చేనేత కార్మికుల
  కష్టానికి దక్కని ఫలితం..వారి జీవితాలు
  దుఃఖ భరితం .
  నుాలు వడికే రాట్నాలకు ముాత పడింది.
  పవిత్ర భారత దేశం, స్వాతంత్ర్యం వచ్చిన
  తరువాత కుాడా ,పాశ్ఛత్య వస్తు 
  వ్యామొాహానికి  బందీయై....
  మనదైన సంసృతిని  విస్మరించింది. 
 మహాత్మా గాంధీ కలల సౌధం నేలకుాలింది.
 ఆనాడు పవిత్ర పతాకం మధ్యలో ఉండే 
 రాట్నం గుర్తు.
 ఏనాడో పెకిలించబడి , ధర్మ చక్రాన్ని ప్రతిష్టంచుకుంది.
 ఐతేనేం...ధర్న చక్రం , తిరుగుతునే ఉంటుంది.
 తిరిగి నుాలు రాట్నాల సందడితో , 
 భరతమాత చిరునవ్వులు చిందిస్తుంది.
 చేనేత శ్రామికుల కన్నీరు తుడుస్తుంది.
 ---------------------------------------------------
-చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా...నా
-ఈ కవిత వారికే అంకితం.
--------------------------------------

సినిమా పొడుపు కధలు..

[4/10, 16:25] +91 94411 18102: 1. ఓరోరి రాజా! విరాధి వీరా! నీతోనె నేను ఉండి పోనా! ఎందాక నువ్వు వెళ్లాలి అంటే అందాక నేను కూడా రానా! హాయైన హంస నావ లోనా!!!!!! 
2. పచ్చని చెట్టు ఒకటీ, వెచ్చని చిలకలు రెండూ, పాటలు పాడి జోకొట్టాలి జోజోజో! 
3. గువ్వ, గోరింకతో ఆడిందిలే బొమ్మ లాట.
4. గున్నమామిడి కొమ్మమీద గూళ్ళురెండున్నాయి. 
6.గోదారి గట్టుంది, గట్టుమీద చెట్టుంది,... 
7.కుక్క కావాలి, కుక్క కావాలి
8. అలిగిన వేళనె చూడాలి, గోకుల కృష్ణుని అందాలు. 
10. చిలకమ్మ పెండ్లికి
[4/10, 16:25] +91 99639 17464: 25 చెంగు చెంగునా గగంతులువే24 . ఉరకలు వేయాలి గిత్తలు23 కోడి ఒక కోనలో పుంజు ఒక కోనల_లో  21. కాకులు దూరని కారటవి (అంతులేని కథ) ,
[4/10, 17:05] +91 94411 18102: నమస్తే మేడం! మొదటి పాట బాహుబలి 2 సినిమా లోనిది. 7వ పాట చిత్రం సినిమా లోది.
[4/10, 18:23] +91 76800 10007: 1)హంస 2)పచ్చని చిలుకలు3)గువ్వ గోరింకతో 4)చిలుకాకోయిల5)మైనా6)జమున7)- 8) పిల్లి 9)-10)కోయిలమ్మపెళ్ళికి11)-12)ఓ రామచిలుకా13)పావురము14)చిగురాకులలో చిలుకమ్మా15) నెమలికి16)హంసనడక17)హైవేల హైలెస్సా హంసకదా నా పడవ18) గోరవంక కెందుకోకొండంత 19)-20-

చెప్పండి చుాద్దాం.

[4/14, 13:38] +91 99632 95997: *కింది పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు చెప్పగలరు.*
1.పిపీలికము
2. మశికము
3. మార్జాలము
4. శునకము
5. వృషభము
6. మహిషము
7. శార్దూలము
8.మత్తేభము
9.మకరము
10.మర్కటము
11. వాయసము
12. మూషికము
13.జంబుకము
14. వృకము
15.తురగము
16. గార్ధభము
17. వరాహము
18.పన్నగము
19. కుక్కుటము
20. బకము
21. ఉష్ట్రము
22. శుకము
23. పికము
24.శలభము
25. కీటకము
26. మత్స్యము
27. హరిణము
28. మత్కుణము
29. మయూరము
30.కూర్మము
31. మకుటము
32. మకరందము
33. వానరము
34. వావురము
35. ఉరగము
[4/14, 14:11] +91 90520 66188: 1.చీమ
2.దోమ3.పిల్లి4.కుక్క5.ఎద్దు6.దున్నపోతు7.సింహం8.ఏనుగు9.ముసలి10.కోతి11.కాకి12.ఎలుక13.నక్క14.తోడేలు15.గుర్రము16.గాడిద17.పంది18.పాము19.కోడి20.కొంగ21.ఒంటె22.చిలుక23.కోయిల24.దీప పురుగు 25.పురుగు26.చేప27.జింక  28.నల్లి29.నెమలి30.తాబేలు 
31.కిరీటము32.తేనె33.కోతి34.పావురాయి35.పాము.

Saturday, August 8, 2020

బమ్మెర పోతన గురించి కవిత

బమ్మెర పోతన కవితా సంకలనం కొరకు
శీర్షిక : పోతన ప్రశస్తి

తేటతేటతెనుగుపదాలతో అచ్చతెలుగు
నుడికారంతోతేనెలూరు పద్యాలతోతెలుగు
భాషనుసుసంపన్నం చేశావుకదయ్యాపోతనా
రాముడునీచెంతనుండగ కొరతయేమినీకు

సాధారణజీవనమసాధారణ కవనంరెండూ
నీకేసాధ్యం రామయ్యపలికించాడని
కృష్ణయ్య కథలుచెప్పావు నీపద్యాలు
నోటరాని తెలుగువాడుండడుకదా పోతనా

అలవైకుంఠపురములో అన్నా నల్లనివాడు
పద్మనయనంబులవాడన్నా ఇంతింతై
వటుడింతైఅన్నా ఎందెందు వెదకిచూచినా
అన్నానీకేసాధ్యం వాణినడయాడెనీకలమున

వేదకల్పవృక్షానికి కాసిన ఫలము
భాగవతము వ్యాసుడమరభాషనవ్రాయగ
అద్భుతభక్తిరస ప్రవాహమునతెలుగు
ప్రజలతరింపజేశావు పోతనా

సృష్టినిఆచంద్రతారార్కము నిలిచిపోవునీకీర్తి
నీవిక్కడజనించడం ఈనేలచేసుకున్నభాగ్యం
నభూతో నభవిష్యతినీలాంటి కవి పోతనా
తీరిపోదునీరుణం నీకివే వందనములు

కవయిత్రి పేరు :మాచర్ల కళావతి
చరవాణి :7989792324
ఊరు : 8 ఇంక్లైన్ కాలనీ గోదావరిఖని
జిల్లా : పెద్దపల్లి

హమీపత్రము :: ఇది నా స్వంతరచన. ఇదివరకెక్కడా ప్రచురింప బడలేదు.

కృిష్ణాష్టమి కి రాసిన కవిత.

శీర్షిక.
శ్రీ కృిష్ణ శరణం మమ .
-----------------------------

అసురులను దునుమాడ  అమ్మ , దేవకి బ్రోవ
అష్టమీ గర్భాన  అవతరించితి వీవు
నందు నింటను పెరిగి , వెన్న మీగడ మరగి
ఆట పాటల దేలు , ఆనంద వరదుడవు  ||

శీల, యశోదమ్మ  మురిపాలు దీర్చేవు
వేల బ్రహ్మాండముల నోట జుాపేవు.
లీల , ఆడుట కేగి , అసుర ముాకల గుాల్చి 
పాలు , వెన్నలు దోచి ,పలు వెతల దీర్చేవు   ||

పుాతనాదుల గుాల్చి , పురము బ్రోచిన గ్వాల
గోప బాలుర గాచు ,  గోవర్దనోద్ధరా
కాళింది మడుగులో కేళి నాట్యములాడి
కాళీయు మద మణచు వేణు గానవిలోల ||

కంసారి ఖలు దమన ,  పాప సంతరణా
కుబ్జ  శాప విమొాచ  కరుణ హృదయా భరణ
కుార్మి, కుచేల వర ,   స్నేహ భావాచరణ..
 దుష్ట దమనా , కృష్ణ, శిష్ట పరిపాల ఘన ||

 బాల రుపీ గ్వాల, నంద గోకుల బాల
 మాదు మురిపెము దీర్చు ,ముద్దు గోపాలా
జన్మాష్టమీ వేడ్క, జేయ బుానితిమయ్య 
చిన్ని పదముల తోడ, చిందులేయుచు రార ||
--------------------------------------------------------
రచన, శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహరాష్ట్ర.
8097622021
iswarimurthy@gmail.com
-----------------------------------------
హామీ....
ఈ కవిత ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
-------------------

Friday, August 7, 2020

సామెతలు.

1. 
1. కలిమిలేములు *కావటి కుండలు/కష్టసుఖాలు*
2. నిజమాడితే *నిష్టూరం*
3. అంత్య నిష్టూరం కంటే *ఆది నిష్టూరమే మేలు*
4. కుడితే తేలు కుట్టకపోతే *కుమ్మరి పురుగు*
5. హనుమంతుని ఎదుట*కుప్పి గెంతులా*
6. చల్ది కంటే *ఊరగాయి ఘనం*
7. అందని పూలు*దేవునికర్పణం*
8. ఉపన్యాసం కంటే *ఉపోద్ఘాతమెక్కువ*  
9. కాదు కాదు అంటే *నాది నాది అన్నాడుట*
10. ఇనుము విరిగితే అతకవచ్చునుగాని *మనస్సు విరిగితే అతకలేము*

......... షేక్... అబ్దుల్ హకీమ్... గుంటూరు....
......9949524991......

బి పోజిటివ్ కవిత.

ఈ వేమన కవితా నిలయం వారి నిర్వాహణలో
అంశం= మహమ్మారి కరోనా ,
" నిర్ముాలన - నివారణ "

రచన,శ్రీమతి , 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
8097622021.
----------------------
శీర్షిక.
బి పోజిటివ్.
------------------
కనిపించని కణమొకటి ,
మనిషుల  జీవితాలని  మట్టి కరిపిస్తోంది.
ఎన్నో  ఆటుపోట్లని  ఎదుర్కుంటుా ,
జీవిత. పోరాటాన్ని సాగిస్తున్నాడు మనిషి .
అటువంటి మనిషి జీవితానికి మరో ప్రశ్న" కరోనా".
జవాబుగా, తక్షణ రక్షణ కై చేసిన ప్రయత్నం .
పరిశుద్ధతకు, మొదటి ప్రాముఖ్యతా పట్టం.  
మాస్క్ , శానిటైజర్ల వాడకాలు అహర్నిశం ,
సాంప్రదాయ పద్ధతులకు సాన పెట్టిన వైనం,
సమయపాలనా సుాత్రంతో సామాజిక దుారం.
కరోనాకు చిక్కని మరో సాధనం,గృహ నిర్బంధనం.
కరోనా వ్యాధి నుండి విముక్తి పొందే వైద్య యత్నం.
"వేక్సినేషన్" తయారీకై  మనిషి చేసే ,విజ్ఞాన పోరాటం.
వికృత "కరోనా" ను అంతమొాందించడానికి ,
మనిషి  తన మేధస్సును ధారపోసి తలపెట్టిన యజ్ఞం.
యజ్ఞ హవిస్సు , చిత్త సుద్ధితో చేసే మనందరి సహకారం.......ఫలితం..
తొందరలోనే  "శతృవినాశనాస్త్ర " ఆవిర్భవం.
"వేక్సిన్" శర ఘాతానికి "కరోనా కణ " విచ్ఛిన్నం.
ఇరు పక్షాల పోరు లో "కరోనా  కణం " -----
               అంతమవ్వడం ఖాయం.        
      
      ---------------------------------------------------
హామీ=
ఈ కవిత ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని ,
నా స్వీయ రచన.
-----------------------

Tuesday, August 4, 2020

ఇష్టపదులు. రచన , జగదీశ్వరీముార్తి.

ఇస్టపదులు.
------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.  మహారాష్ట్ర.
8097622021.
----------------------
ఇష్టపది.
శీర్షిక.
శీర్షిక సైనికుడు.
----------------------
దేశమును రక్షింప      అహరహము కష్టించి-
ప్రాణముల నర్పించు  త్యాగముార్తులు వీరు.||

ఎండ-వానల నిలచి. నిదుత ఆకలి మరచి-
భార్య-పిల్లల. విడచి   బహు దుారమేగెదరు  ||

శాంతి భద్రత నిలుప   సరిహద్దులో నిలచి,
తల్లి భారతి ఋణము తీర్చకొను యోధులు ||

శత్రు-సేనాక్రమణ ,  తిరుగుబాటుల రణము
ఇరు పక్ష పోరులో    ప్రాణాలె అర్పణము  ||.
------------------------------------------------------------
శీర్షిక.
స్నేహం.
------------
 పిల్లైన పెద్దైన          -రాజైన పేదైన.    
అందరును కోరేది     స్నేహమొకటేకదా ||

కష్టాలె కలచినను    కన్నీళ్ళు నిండినను, 
తోడుగా నిలిచేది     స్నేహమొక్కటె గదా ||

జాతి మతములు లేవు   ధనము సాటికి రాదు,
స్నేహమును మించినది   లేదు ఇలలో నెపుడు  ||

నీడ నిచ్చెడి  చెట్టు  ,   అమ్మ  ప్రేమకు రెట్టు,
స్వశ్ఛమైన సు హితుడు  ఇలను స్నేహితుడొకడు ||
____________________________________________
------------------------------------------------------------------

Monday, August 3, 2020

ఇష్టపదులు ప్రక్రియ రుాల్స్.

[8/3, 12:26] మహతి కవిసంగమం. (సినారె కవితలకై: 🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
*ఇష్టపది అష్టోత్తరశత కవిసంగమం*
*ఇష్టపదులకు ఆహ్వానం*
♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️♾️

⚜️ *అంశం* :

 *భావ కవిత్వము* 
—>దేశభక్తి
—>దైవభక్తి
—>ప్రణయం,విరహం,అమలిన    శృంగారం
—>ప్రేమ,వాత్సల్యం
—>స్నేహం
—>స్మృతి 
—>ప్రకృతి వర్ణన

⚜️ *గమనిక* :
------------
ఒక్కరు రెండు మాత్రమే ఇష్టపదులు పంపవలెను

⚜️ *కాల పరిమితి*
01-08-2020 నుండి 10-08-2020 వరకు:
ప్రతి రోజు ఉదయం 10-00గం॥నుండి సాయంత్రం 5-00 గం॥ వరకు
మహతీ సాహితీ కవిసంగమం1 2,3 మరియు ఇష్టపదులు సమూహాలకు పంపించగలరు

⚜️ *నిర్వహించేవారు* :

 "మహతీ సాహితీ కవి సంగమం-కరీంనగరం "

    
⚜️ *ఇష్టపది పంపవలసిన ఫార్మాటు* :
        〰️〰️〰️〰️〰️〰️

  
   👉పేరు
   👉ఊరు
   👉సెల్ నెంబర్
   👉శీర్షిక
   👉ఇష్టపది

#  *పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు హామీపత్రము విడివిడిగా పంపాలి*

## *pdfలు,odfలు,పేపరుపై రాసి ఫోటో తీసినవి పంపరాదు.స్టార్లు,గుర్తులు,ఎమోజీలు,గీతలు లాంటి అలంకరణలు పెట్టరాదు*

### *ఇష్టపది నియమాల ప్రకారం రాసినవి,ఫార్మాటులో ఉన్నవి  మరియు చక్కని పదసంపద కలిగినవి మాత్రమే స్వీకరించబడును*

#### *ఇష్టపది నియమాలు మొదట ఆకళింపు చేసుకున్న తరువాత మాత్రమే రాయగలరు*


⚜️ *ప్రత్యేకo* 
〰️〰️〰️〰️〰️

1️⃣.ఎంపిక చేయబడిన 108 మంది కవులకు మాత్రమే ఈ-ప్రశంసాపత్రాలు అందించబడును.

2️⃣.ఎంపిక విషయంలో సంపాదకులదే తుదినిర్ణయం.ఎలాంటి వాదోపవాదాలకు తావులేదు.

3️⃣.15-08-2020 న సాయంత్రం 6-00 గంటలకు ఇష్టపది కవితాసంకలనం (E-పత్రిక)విడుదలచేయబడుతుంది. 

*ఇతరములు పోస్ట్ చేసినవారిని గ్రూపునుండి తొలగించబడును*


🌷
*శుభాభినందనలతో* ...🌷

 *డాక్టర్ అడిగొప్పుల సదయ్య* 
*ఇష్టపది కవితా ప్రక్రియ రూపకర్త*
వ్యవస్థాపక అధ్యక్షులు,
మహతీ సాహితీ కవి సంగమం-కరీంనగరం
9963991125
🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
[8/3, 12:40] మహతి కవిసంగమం. (సినారె కవితలకై: డాక్టర్ అడిగొప్పుల సదయ్య
S.A.(గణితం)
జి.ప.ఉ.పా.వావిలాల,జమ్మికుంట,కరీంనగర్ 
9963991125

శీర్షిక: మన జెండా 

ఒక దేశ గౌరవము ఒకదేశ శౌర్యమును
ఒకదేశ రాజసము ఒకదేశ పౌరుషము

ఒకదేశ కర్షకము ఒకదేశ వర్తకము
ఒకదేశ గాంభీర్య మొకదేశ ఔదార్య

మొకదేశ సౌందర్య మొకదేశ సౌశీల్య
మొకదేశ ఔన్నత్య మొకదేశ ఐశ్వర్య

మొకదేశ సఖ్యతయు ఒకదేశ ఐక్యతయు
ఆదేశ జెండాన అగుపించు రూపమై

భరతదేశపు జెండ భాగ్యరాశుల కుండ
మూడు రంగులు జల్తు మురిపించు హృదినిండ

పింగళీ వెంకన్న ప్రియమైన సృష్టియై
భరతాంబ చేతిలో భవ్యంగ యెగిరేను

భరత దేశపు కీర్తి భరతదేశపు మూర్తి
అవనిలో నినదిస్తు ఆకాశమున ఎగురు

హిమనగోన్నతమునను ఇనుమడించిన శక్తి
శిరమెత్తి యెగిరెను శివమెత్తి మన జెండ...

రాఖీ పై కవిత

బంధమెప్పుడూ బంధనం కాదు
బరువు బాధ్యతల ఆక్రందనం కాదు
అది ఆత్మీయుల నందనం,అనురాగాల చందనం
కరోనా రానీ, కాల యముడే రానీ
మాస్కు మనిషికే గానీ, మనసుకా..?
దూరం సందర్భానికే గానీ, సంబంధానికా..?
పక్షంలో మోక్షమిడే దానికి
లక్ష కక్షల శిక్ష ఎందుకు?
ప్రాణంగా చూసే నీ వారికి
అంటరానితనపు భిక్ష ఎందుకు?
మనం మనం కలిస్తేనే బాంధవ్యం, 
సమత మమత నిలిస్తేనే బంధుత్వం
పండుగ ఏడాదికొక్కసారే..
దాని పరవశం,గుండె నిండిన ప్రతీసారి..
ప్రేముంటే మార్గమే తోచదా?
నీ బంధాన్ని సాంకేతికంగా కలపదా..!
మాట ఒక్కటి చాలదా,మనసుని తడిమేందుకు
రక్షొక్కటి చాలదా,తన తోడని నువ్వు చెప్పేందుకు

బొడ్డు మహేందర్
చెన్నూరు, మంచిర్యాల జిల్లా
ఫోన్ 9963427242

Sunday, August 2, 2020

పురస్కారాలపై విమర్శ.

కవి మిత్రులందరికీ శుభ సాయంత్రం 
నా పేరు గోగులపాటి కృష్ణమోహన్

ఎలాంటి స్వార్థం లేకుండా సమాజంలో కళ్ల ముందు జరుగుతున్న సంఘటనలకు స్పందించి కలాన్ని కదిలించే వారే కవి...

ఏమి ఆశించకుండా రచనలు చేసే కవులకు అప్పుడప్పుడు వచ్చే ప్రశంసలు అభినందనలు కొంత ఉత్తేజాన్ని కలిగిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కాకపోతే ఇటీవలికాలంలో పలు సమూహాలుగా ఏర్పడి వాటిలో వాసి కన్నా రాసికే ప్రాధాన్యతనిస్తూ నిర్వహిస్తున్న పోటీలలో కవులు పాల్గొంటూ ప్రశంసలు పొందటంతో పాటు బిరుదులు కూడా పొందటం మనం చూస్తున్నాం.

కాకపోతే వచ్చిన సమస్య ఆ బిరుదులు గతంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన కవులు పొందిన బిరుదులు కావడం బాధాకరం...

ఇక ఇచ్చి పుచ్చుకునే వారి అర్హతల గురించి నేను మాట్లాడ దలుచుకోలేదు...

*ఎందుకంటే అర్హతకు కొలమానాలు అంటూ ఏమీ లేవు...*

కాకపోతే పుచ్చుకునే వారు కొద్దిగా ఆలోచించండి... 

బిరుదులతో మనకు మనకు పెద్దగా ఒనగూరేది ఏమీ లేదు 

ఒక రోజు పత్రికల్లో మన వార్త వస్తుందేమో కానీ మన కన్నా ముందు ఎంతోమంది ప్రతిభావంతులు సాహితీ మూర్తులు ఎలాంటి బిరుదులు లేకుండా కొనసాగుతుండగా... వారి ముందు సాహిత్యంలో ఓనమాలు దిద్దుకున్న మనకు పెద్దపెద్ద బిరుదులు వాడుకోవడం అనేది అలాంటి మహనీయులను అవమానపరిచినట్టే అవుతుంది అని నా భావన

అందుకే సహృదయులైన కవి మిత్రులందరూ ప్రశంసలు అభినందనలు వరకు ఆమోదించి ఇలాంటి బిరుదులను పెద్ద మనసుతో తిరస్కరిస్తూ కొంచెం దూరం పెడితే..‌  ఇచ్చే వారు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించే అవకాశం ఉంటుంది.

కవి మిత్రులు అన్యదా భావించకుండా బిరుదుల కోసం పాకులాడకుండా సమాజానికి ఉపయోగపడే చక్కటి కవనాలను అందిస్తూ... బిరుదుల స్వీకరణ పై  ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని మంచి విలువలతో కూడిన సాహిత్యాన్ని భావితరాలకు అందిస్తారని ఆశిస్తూ 
మీ శ్రేయోభిలాషి, 
సాహితీ మిత్రుడు 
*గోగులపాటి కృష్ణమోహన్*
9700007653

ఈ వేమన కవితా నిలయం కు పంపిన కవితలు

[7/27, 15:35] iswarimurthy: శీర్శిక.
"కరోనా" 
నిర్ముాలన, నివారణ.
--------------------------
చైనా దగ్గరి వ్యుాహాన్ నుంచీ వ్యాపించి
యావత్ ప్రపంచాన్నీ వణికిస్తున్న కణపు దాడి.
దగ్గు, తుమ్ము, జ్వరం, లాంటి లక్షణాలతో
అందరినీ భయపెడుతున్న మందులేని మహమ్మారి॥

వస్తువుల ఉపరితలాల్లో వారాల పాటు దీని వాసం.
దగ్గరి తనం, మాటలవల్ల ,వ్యాపించే గుణం.-.
నోరు, ముక్కు, కళ్ళు,  ద్వారా కరోనా కణ ప్రవేశం.
ఏడు రోజుల వ్యవధిలోవ్యాధిని పెంచడం దీని లక్షణం॥

వ్యాధి నుండి మనను మనం కాపాడుకోవడం అవసరం.
సామాజిక దుార పాలన అత్యంత  ఆవశ్యకం.
శానిటైజర్స్, మాస్క్ ల ఉపయొాగం ప్రతీ క్షణం
గ్రుహ నిర్బంధనం  లో ఉండడం ఎంతో ఉత్తమం.॥

జంతు పెంపకాలు వద్దు.మన ఆరోగ్యం మనకు ముద్దు.
ప్రాచీన ఆచార వ్యవహార పద్ధతులను విశ్వసించు..
మడి తడి నియమాలను ఆచరించు.
ఆహార విషయంలో సమయ పాలన పాటించు.॥

పి.సి.ఆర్ పరీక్షలతో ఇన్ఫెక్షన్  గుర్తించు.
క్రిమి సంహారక వాడకాలు పరిసరాలలో ప్రయొాగించు.
ఆక్సీమీటర్ తో ఆక్సజన్ ప్రమాణాన్ని గుర్తించు.
వంటంటి చిత్కాలతో జాగ్రతలు వహించు.॥

రోగనిరోధకశక్తిని పెంపొందించునేందుకు ప్రయత్నించు
నిష్ట,నియమ పాలన తో కరోనాను తరిమి కొట్టవచ్చు॥
------------------------------------------------------------------
రచన, శ్రీమతి , 
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
8097622021.
iswarimurthy@gmail.com.
-------------------------------------------
హామీపత్రం.
నా ,ఈ, కవిత,ఇంత వరకు , ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని స్వీయ రచన.
------------------------------------------

[7/28, 17:05] iswarimurthy: శీర్షిక.
వెనుక బడిన బ్రాహ్మణులు.
(వచన కవిత).
-------------------------------------
చతుర్వర్ణ  వ్యవస్థలో, సద్ధర్మ -సాంప్రదాయాలు పాటిస్తుా నిరంతర వేద పఠనం , శాస్త్ర ప్రకార నియమాను బధ్దంగా, ప్రజలను తీర్చి దిద్దే విధంగా భక్తి ,జ్ఞాన, వైరాగ్యాల బోధనలతో పాటు, సత్య ధర్మ వర్తనలను ప్రజలకు బోధిస్తుా, సమాజాభ్యున్నతికి 
పాటుపడేవారు బ్రాహ్మణులు.
 బ్రిటిష్ వారి ద్వారా తేబడిన పురాతన సామాజిక నిర్మాణ పతనం కారణంగా ,సమాజం లో మార్పులతో పాటు , వ్యక్తుల మానసిక ఆలోచనా విధానాల లో చోటుచేసుకున్న , జాతి ,మత ,విభేదాల కారణంగా , వంశపారంపర్య కులవృత్తిగా' ,పుజారులుగా, విద్యా బోధనోపాధ్యాయులుగా ఉన్న  బ్రాహ్మణుల బ్రతుకులు చాలీ చాలని వేతనాలతో ,  ఆర్ధికంగా చితికిపోయి., కుటుంబవపోషణ దుర్భరమవడమే కాక , రాను రాను బ్రాహ్మణుల పరిస్థితి క్షీణిస్తుా,  ఏవిధమైన రిజర్వేషన్లుా లేక వెనకబడి పోతున్నది.
సద్ధర్మ  వేద పరాయణులైన వీరికి గవర్నమెంటువారు సరైన  జీవితావకాశాలు కల్పించి , ఆర్ధికంగా ఆదుకునే ప్రయత్నం చేయాలని నా విన్నపం.
-------------------------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
8097622021.
iswarimurthy@gmail.com
-------------------------------------------
హామీ పత్రం..
ఈ కవిత ఇంతవరకు ఏ మాధ్యమునందు ప్రచురితం కాని  నా స్వీయ రచన.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
-------------------------------------------------

స్నేహ బంధం కవిత

పెన్నా రచయితల సంఘం వారి ఆధ్వర్యంలో.
అంశం
స్నేహబంధం

శీర్షిక.
అపుార్వ బంధం.
------------------------
అన్ని బంధాలకుా అతీతమైనది స్నేహం.
కుల మత బేధాలెరుగని ఆత్మానుబంధం.
చిన్న తనపు చిలిపి జ్ఞాపకాలైనా, పెద్దరికపు
బరువు-బాధ్యతలనైనా ,మనసువిప్పి 
చెప్పుకోగలిగిన ఏకైక బంధం , స్నేహ బంధం.
కష్టం వస్తే నేనున్నాననే  "ధైర్యం" స్నేహం.
సుఖాల బాటలో పుాల "పరిమళం" స్నేహం.
కలిమి - లేములకు "అతీతం " స్నేహం.
నీ-నా తేడాలెరుగని "నిర్మలత్వం "స్నేహం.
కల్లా-కపటం ఎరుగని అనురాగపు".సిరి" స్నేహం.
రెండు అంతరాత్మల "ఆదర్శ బంధం" స్నేహం.
ఎప్పటికీ మారని "మమతల "మల్లెతీగ స్నేహం.
ఒకరి కష్టం,మరొకరికి కంట-నీరు తెప్పించేది స్నేహం .
నీ గౌరవం, "నా గౌరవంగా" తలచేది స్నేహం.
తప్పటడుగుల బాటలో "తట్టి "లేపేది స్నేహం.
అబద్ధాలు-అరోపణల బాట లో "నమ్మకం"  స్నేహం.
ఒంటరివైన క్షణం లో "ఒదార్చే హస్తం" స్నేహం.
ఎంత దుారంలో ఉన్నా,దగ్గరి తనపు ఆశ్వాసన స్నేహం.
ఊపిరున్నంతవరకు నీకై నేనంటుా నిలిచే  "బాస"- స్నేహం.
-------------------
రచన, శ్రీమతి ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర )
8097622021.
-------------------------------
హామీ..
నా ఈ కవిత ఎచటనుా ప్రచురితం కాని-
నా స్వీయ రచన.
-----------------------

Saturday, August 1, 2020

దుప్పటి రమేష్ రచన.

మారుతున్న మూడు రంగులు (కవిత)
********************************
పింగళి వెంకయ్య 
మస్తిష్క గర్భం నుంచి
పుట్టుకొచ్చిన జాతీయపతాకం
జాతి నేతలకు
నరనరాన స్ఫూర్తిని నింపి
తెల్లదొరలను తుదముట్టించింది.
ఆ మహనీయుని త్రివర్ణపతాకంలో
కాలుదువ్వే కలహాలతో
నేడు కాషాయం కరుగుతూవుంది
తీరని స్వార్ధాలతో
తెల్లరంగు ఎరుపెక్కుతూవుంది
చల్లారని ప్రతీకారాలతో
పచ్చరంగు పలుచనవుతూ
మూడు రంగుల కథే మారిపోతూవుంది.
- దుప్పటి రమేష్ బాబు (మధురకవి)
   8985999985 - నెల్లూరు.
హామీపత్రం : ఈ కవితను నేను సొంతంగా రాసాను. దేనినుంచి కాపీచేయబడలేదు. ఈ విషయంలో ఏమి జరిగిననూ పూర్తి బాధ్యత నాదే.

ఇష్టపది నియమాలు.

⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️

*ఇష్టపది నియమాలు* ::

1.ఎనిమిది పాదాలు ఉండాలి.

2.ప్రతి పాదం 10+10 మాత్రలుగా రెండు భాగాలుగా విభజించబడిఉంటుంది.

3.మొదటి భాగంలోని మొదటి అక్షరానికి,రెండవ భాగంలోని మొదటి అక్షరానికి యతిమైత్రిగాని,ప్రాసయతి గానీ కుదరాలి.

4.చివరి పాదంలోగానీ,చివరి రెండు పాదాలలోని గాని "మీ ఇష్టదైవత  నామం" మకుటంగాను లేదా "కవి నామ ముద్ర" లేదా "రెండూ" ఉండాలి.

5.లఘువుకు ఒక మాత్ర-గురువుకు రెండు మాత్రలుగా లెక్కించాలి.

 *ఉదా* :
కవి: డాక్టర్ అడిగొప్పుల సదయ్య
శీర్షిక : పుడమి తల్లికి వందనమ్

ఆకు పచ్చని చీర నందముగ కట్టుకొని
చంద్రుణ్ణి,సూర్యున్ని చంచలాక్షుల నిలిపి

ఝరీపాతములన్ని ఝషములై దుముకగా
నదీ వాహములన్ని నగల నిగలై మెరువ

నగములును,ఖగములును,మృగములును,భుజగములు
జీవజాలముకెల్ల ఆవాసస్థానమై

బతుకునిచ్చే తల్లి! బంగారు సుమవల్లి!
పుడమి తల్లీ! నీకు పూమాల వందనమ్!

*వివరణ:*

 *మొదటి పాదము* : (10+10 మాత్రలు)యతి-ఆ-న (అ)

ఆకు పచ్చని చీర —నందముగ
 U I   U I  I   U I —U   I  I    I
కట్టుకొని
U  I  I  I

 *రెండవ పాదము* : (10+10 మాత్రలు)యతి-చ-చ

చంద్రుణ్ణి,సూర్యున్ని—
U  U  I     U   U I —
చంచలాక్షుల నిలిపి
U  I   U   I  I  I  I  I

 *మూడవ పాదము* :(10+10 మాత్రలు)యతి-ఝ-ఝ

ఝరీపాతములన్ని —ఝషములై
 I  U U  I  I   U   I  —I   I   I   U
దుముకగా
I   I   I   U

 *నాల్గవ పాదము* : (10+10 మాత్రలు)యతి-న-న

నదీ వాహములన్ని —నగల నిగలై
I  U  U  I   I   U  I   —I I I   I  I U
 మెరువ
  I   I  I

 *ఐదవ పాదము* : (10+10 మాత్రలు)ప్రాసయతి-
నగ-మృగ
నగములును,ఖగములును—
I   I  I  I   I     I  I  I    I   I—
,మృగములును,భుజగములు
 I    I   I     I  I    I   I   I   I  I

 *ఆరవ పాదము* :(10+10 మాత్రలు)ప్రాసయతి-జీవ-ఆవా

జీవజాలముకెల్ల—
 U I U I  I    U  I—
ఆవాసస్థానమై
U  U I  U I U

 *ఏడవ పాదము* : (10+10 మాత్రలు)యతి-బ-బ

బతుకునిచ్చే తల్లి! —బంగారు
I   I   I U  U   U I   —U  U  I
సుమవల్లి!
I  I   U   I

 *ఎనిమిదవ పాదము:* (10+10 మాత్రలు)యతి-పు-పూ

పుడమి తల్లీ! నీకు —పూమాల
I   I   I   U U  U I  —U   U  I
వందనమ్
U  I   U