Sunday, September 27, 2020

రాయలసీమ పాటల పోటీకి పంపినది.

27/9/2020.
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
----------------------
శీర్షిక .
మా రాయలసీమ మాట-
సంగీత -సాహిత్య బాట.
-------------------------------
పల్లవి:
----------
అష్ట దిగ్గజాల వెలుగు కృష్ణ  దేవరాయ లేలు
మా రాయల సీమిదీ   ఘన సంస్కృతి  మాది॥

అను పల్లవి:
-----------------
అల్లసాని పెద్దన, కందుకుారి , నంది తిమ్మన
రుద్ర కవి, ధుర్జటి , సాహిత్య ఘనుల పురమిది॥
॥  అష్ట  దిగ్గజాల॥

1.చరణం:
---------------
ఒంటి మిట్ట లో జనిన  పోతనా మాత్యుడుా
భాగవతము రచియించిన భాగవోత్తముడుా
యొాగి వేమన్న రచన, బ్రహ్మం గారి రచనలుా
మా వరం,  పుర బలం , సీమ చరితయే ఘనం ॥
॥  అష్ట  దిగ్గజాల॥

2.చరణం.:
---------------
శ్రీశైలం , కాళహస్తి , యాగంటి మహానంది-
లేపాక్షి , మంత్రాలయ , నారసింహహోబలం-
భక్తి నిండు ఆలయాల వేద మంత్ర పెన్నిధి
నిండియున్న పురమిదీ మా రాయలసీమిదీ..
॥  అష్ట  దిగ్గజాల॥

3.చరణం:
---------------
కాకర శ్రీ త్యాగరాజు , తాళ్ళపాక అన్నమయ్య
తరిగొండ వెంగమాంబ , రాళ్ళపల్లనంత క్రిష్ణ -
ఆదిగ గల , సాహిత్య -సంగీతకారు లేలినదీ
సత్య -ధర్మాల నెలవు , మా రాయలసీమిదీ.॥
॥  అష్ట  దిగ్గజాల॥

4. చరణం.
-----------------
బళ్ళారి రాఘవులుా   రామకృష్ణాచార్యులు
ఆధ్యాత్మిక గురువులుా తత్త్వ  జ్ఞాన వేత్తలుా
రంగస్థల  ప్రముఖులా  రసము లేలు తళుకులా
విశ్వ జ్ఞాన భాండమై   విలసిల్లిన సీమిదీ
మా రాయల సీమిదీ.... ॥  అష్ట  దిగ్గజాల॥

----------------------------------------------------------

క్విజ్ లింక్ లు

All quiz links
గౌరవ ఉపాధ్యాయులకు మరియు విద్యార్థుల కు తెలిపరుచునది...తెలుగు భాష పై తెలుగు అంతర్జాల ప్రశ్నావళి ని తయారు చేయడం జరిగింది. ప్రశ్నావళి ని రాయడానికి క్రింది లింకు ను క్లిక్ చేయగలరు...
ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని క్విజ్ ల లింకులు పంపడం జరుగుతుంది..
క్విజ్- 1 (తెలుగు తెలుసుకుందాం)
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdqDNWAbiyBwmHYz_1LTgHZ5q25bKueAW87ZIvvyDydsaCVdg/viewform?usp=sf_link

క్విజ్ - 2 (ఛందస్సు)
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfOzhZab-SB9u7XAVpAtmglx4wAzDB_qc3iOcFUl4PIYTRotQ/viewform?usp=sf_link

క్విజ్ -3 ( రామాయణం- బాల కాండ)
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeaCPYOzHS8x4lc8N6ilefspsPJAzaMAbp-VTqWesxvqdL6Ng/viewform?usp=sf_link
క్విజ్ -4
https://docs.google.com/forms/d/e/1FAIpQLSex8ZgMaPbpuTI5ttU4xVy1Ma7TnjEhsqgD_siDuzSiv2MFiw/viewform?usp=sf_link

క్విజ్ -5
https://docs.google.com/forms/d/e/1FAIpQLSedGSx5WVquGrzjfopZ-9-WDfAZRKQgvhzDEj7k5XA4xJaaQA/viewform?usp=sf_link
క్విజ్ -6
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdVth8rVL6Ixs2vZaAlDIdDFyxoaJyk8KkmRH4DJMHokb2RRQ/viewform?usp=sf_link

క్విజ్ -7
https://docs.google.com/forms/d/e/1FAIpQLScQi9vXtv5_0Nq6uMghL0UjNjfwCYfr-S9IQ0eU6Rs0sY3XMg/viewform?usp=sf_link

క్విజ్ -8
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfEIRtEUoYKDywzpY3zKjqOOzGuTkDTnQ758ad1wCsGd2jrhA/viewform?usp=sf_link

క్విజ్ -9
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfmBHCgOXzu2eZd-c7auKNhXTmVZ2uHXrtslgywiHsAc3NZVg/viewform?usp=sf_link

క్విజ్ -10
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdLI8Ehr-WOQ4nZlFq1aWasSXUPqUeuVFGTVq13zXQ5tWlNWA/viewform?usp=sf_link


క్విజ్ - 11
https://docs.google.com/forms/d/e/1FAIpQLSf8joBn9DAAs90FQE-9bRKDDrJW6oiQYilFCPhbHe_yyMQ28A/viewform?usp=sf_link


క్విజ్ -12
https://docs.google.com/forms/d/e/1FAIpQLSe3P_3vUECx1qZ6LdrgyOCdbgNVyZ0zsAVA9tLfhzkouh_stA/viewform?usp=sf_link

క్విజ్ -13(పాఠశాల స్థాయి సీనియర్)
https://docs.google.com/forms/d/e/1FAIpQLSc3HJ_rIdHWgevHWK8cwr6rVQ0pJ1UKRvbxKkr_Gl2B11CUZA/viewform?usp=sf_link

క్విజ్ -14 పాఠశాల స్థాయి జూనియర్)
https://docs.google.com/forms/d/e/1FAIpQLSd5b7BWLm0knwa7yErqZtxH4LcMQRpYZuCYoS50u412Msy0fA/viewform?usp=sf_link


మరిన్ని క్విజ్ ల కోసం క్రింది YouTube channel ను subscribe చేసుకోగలరు
https://www.youtube.com/channel/UCAut1916ya3D_39vCeKCY6g

 
క్విజ్ నిర్వహకులు..
నరేష్ వేముల
పాఠశాల సహోపాధ్యాయులు (తెలుగు)
ప్రభుత్వ ఉన్నత పాఠశాల
మహబూబాబాద్..9949796264

Saturday, September 26, 2020

బాలసుబ్రహ్మణ్యం గారి పై కవిత

25/9/2020.
రచన శ్రీమతి ,
 పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్, మహారాష్ట్ర .
 8097622021.
 iswarimurthy@gmail.com
 
శీర్షిక
భుా సితార.
----------------

ఒక భుా సితార మింటి కెగసింది.
వసంతం తన  దారి మరిచింది.
రాగాల కోయిల , శృతి తప్పింది.
మేరు గిరి హృదయం గతి తప్పింది.॥

ప్రకృతి పడతి అడుగు తడబడింది.
సంద్రం కన్నీరై పొంగింది.
భువినొక మధుర గానం ముాగబోయింది.
దివి నుండి భువి కేతెంచిన గాన గంధర్వుడు.
తన వారి చెంతకు తిరిగి వెళ్ళేడు.॥

తన ప్రతిభా సంపదంతా మనకు వదలి.
మరచిపోలేని మధుర గాన సుధలు పంచి, 
కీర్తి శిఖరాగ్రాల నేలే కేతనాన్ని ఎగురవేసి..
మనందరినీ వదిలి మరో లోకానికి..॥

నవరసాలు పలికించే తన గళ మాధుర్యంతో
గాంధర్వ లోకాన్ని జయించడానికి...
 దేవ గణాదులను మైమరపించడానికి..
 గానామృతాన్ని పంచడానికి...॥
 
 పండితారాద్యుల గాన గాంధర్వుడు...
 ఆనంద లోకాలకు అక్షర 
 సుమ సుగంధ రధాన్నెక్కి
  పయనమయ్యేడు  పరలోకాలకు
 మనల్ని  వదలి పోతున్న ఆతని
 కిదే నా  అక్షరాశృ నివాళి.  ॥
 ---------------------------------------------------

Thursday, September 24, 2020

శ్రీకృష్ణ శరణం మమ

రచన,శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక .
శ్రీకృష్ణ  శరణం మమ.
-----------------------------
శ్రీకృష్ణా యని పిలచినంత। వరదహస్తము తోడను
కరమురళీ ధర రారా। కమలనయన మాధవ ॥
మణి భుాషణ ముర మర్ధన।ఫణిశయనా పద్మ నయన 
పరుగున రాపదుమనాభ।పంతమేల రా ఘనా ॥
కంసుని మదమణచి గుాల్చ।దేవకి- వసుదేవులకును
అష్టమగర్భుడవైయలరుచు అవనినవతరించితివి ॥
నందునింట నటనమాడ।మాయ చేసి మరలితివి
యశోద పుణ్య ఫలముగా।అమ్మా । అని పిలచితివి.॥
బాల్యమందె బాపురే।బలమసురుల గుాల్చితివి.
కాళీయుని మదమణచి।ఖలులను దునుమాడితివి॥
మురళిధరా ముద్దుమొాము।చుాపి వెన్న దోచితివి.
గోపి,గోప బాలురతో ।ఉట్లు గొట్టి మురిసితివి ॥
చీరలన్ని దోచి చెలుల । చింతనలో మెలగితివి.
బృందావన విహారివై । నాట్య కేళి సలిపితివి॥
మురళి గాన లోలుడవై । ముదితల మది దోచితివి॥
లీలామయ।నిన్ను గన । నా తరమా। యదు నందన।
మాలోగిలి యవతరించి। మమ్ము బ్రోవుమా ఘనా॥
-------------------------------------------------------------------

ఈ రచన నా స్వీయ రచన.

Saturday, September 19, 2020

గుర్రం జషువా గారి సాహితీ సమాలోచన పోటీకి పంపినది. ( మెయిల్ లో).

19/9/2020.
శీర్షిక .
అప్పటికీ , ఇప్పటికీ స్త్రీ ...
-------------------------------

ఋగ్వేదం లో కొన్ని శ్లోకాల లో స్త్రీ లకు భాగస్వామ్యాన్ని    ఎంచుకునే హక్కుందంటుా రాసేరు.

అటువంటపుడు స్త్రీ  ల పరిస్థితి ఎలా , ఎందుకు దిగజారింది..?
మధ్య యుగం నాటికి స్త్రీల పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది.
సాంప్రదాయాల పేరిట , కన్యాశుల్కాలు, బాల్య వివాహాలు , సతీ సహగమనాలు , దేవదాసి వంటి ఎన్నో దురాచారాలు స్త్రీ ల పాలిటి శాపాలయ్యేయి.

భర్తలు పోయిన భార్యలకు, బలవంతపు సహగమనాలు , యుద్ధంలో  రాజులు ఓడిపోయినా , ప్రాణాలు పోయినా , భార్యలు కుటుంబంతో సహా అగ్ని ప్రవేశం చేయాలి , ఇది "ఔజార్ " సాంప్రదాయ పద్ధతి, ఇది, ఎవరు పెట్టిన సాంప్రదాయం ?

ఐదు సంవత్స రాలకే బాల్య వివాహాలు చేసి, కర్మ చాలక భర్త అనే బాలుడు పోతే ఆ పసిపిల్లకు తలగొరిగి , బ్రతుకంతా వంటంటికే పరిమితం చేయడం ఎంత అమానుషం .ఎందుకంత వివక్షత...?

రజస్వల కాకుండానే  బాలిక కు వివాహం అవసరమా ?

భార్యా సహగమనాల పేరుతో భర్త పోగానే భార్యను
సహగమనం ఆచారమంటుా ,  సజీవంగా చితిలోకి నెట్టడం...ఎంత వరకు న్యాయం...? 

1815 , 1828 ల మధ్య , ఒక్క బెంగాల్ లోనే
8000 మంది అబలలు  , ఈ దురాచారానికి బలయ్యేరన్న వార్త...
ఎవరు పెట్టిన సాంప్రదాయం. ఇది...?.

దేవదాసి పేరుతో ఆడపిల్లకు  "దేవుడే నీభర్తంటుా" , దేవుని విగ్రహంతో పెళ్ళి జరిపించి , జీవితం  అంతా బ్రహ్మచారిణిగా ఉండాలని , "నృత్య -గీతాలతో , దేవుని సేవ చేసుకో" అని చెప్పడం ఎంతవరకు సమంజసం.?

  ఆ ఆచారాన్ని కుాడా రాను రాను పెడదారి పట్టించి, స్త్రీ లను వేశ్యలుగా మార్చే అధికారం ఎప్పుడు , ఎవరికి , ఎవరు , ఎవరికిచ్చేరు..?
 
" ముస్లిమ్" మతాచారాలంటుా "పరదా"  పద్ధతి పెట్టి ,
  స్త్రీ లకు ముసుగులు వేసి వారి స్వేశ్ఛకు అడ్డుతెర కట్టేరు. ఎందుకు స్త్రీ లు ముసుగులౌ...?
 
ఇలాంటి ఎన్నో అకృత్యాలు , అసమానతలను భరించలేని వారు కొందరు , స్త్రీ జనోద్ధరణకై శ్రీకారం చుట్టేరు.

వారిలో ముఖ్యులు రాజా రామ్ మొాహన్ రాయ్ ,
కందుకుారి వీరేశలింగం , సావిత్రీబాయ్ ఫుాళే...
అన్నవారు. వీరేశలింగం గారు వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించి,  సఫలు లయ్యేరు.
రాజా రామ్ మొాహన్రాయ్ గారు బహు భార్యాత్వమ్
నేరమని పోరాడి, వితంతు వివాహాలకు మద్దతు పలికేరు.

ఇక్కడ గమనిస్తే స్త్రీ ల  పై జరిగే దురాచారాలకు స్పందించి వారి ఉన్నతికై , పోరాటోద్యమాలు సాగించిన వారు పురుషులే. కొంతమంది నిరంకుశ పాలకుల నిర్దయాపుారిత  పురుషాధిక్యతా నిర్దేశ శాసనాలకు  సాంప్రదాయ  రుాపమిచ్చి స్త్రీ ల విషయంలో  ,ఈ  రకమైన  దురాచారాలు నెలకొన్నాయా...?

నిరక్షరాస్యురాలైన   సావిత్రీబాయి ఫుళే , భర్త దగ్గరే అక్షరాభ్యాసం చేసి , చదువుకొని , పీడిత మహిళల నిక్షరాశ్యతను దుారం చేసి, స్త్రీ ల విద్యాభివృద్ధికి
పోరాటం సాగించి, 1848 లో , "పుానా " లో బాలికల పాఠశాలను ప్రారంభించిన  ప్రధమొాద్యమ కారిణి.
వీరందరి కృషి ఫలితంగా స్త్రీలకు , వివాహ సంబంధిత  కార్యాల లో కొన్ని వెసులు బాట్లు కలగడమేకాకుండా,
విద్యాభ్యాసానికి కుాడా అవకాశం కలిగింది.

స్త్రీ లు విద్యావతులవడమే కాక , వివిధ కళారంగాల లో నిష్ణాతులై రాజ్యాలేలిన దశలోకుాడా , వరకట్నాల వేధింపులుా ,  గర్భంలో ఆడ శిశువు ఉందని తెలియగానే భ్రుాణ హత్యలుా, వరకట్న సాధింపులతో,
ఒక   ఆటబొమ్మగా , పురుషాహంకార వికారాల విలాసాలకు బలైపోతున్న- స్త్రీ  జీవితం మరింత దుర్భర  మయ్యింది.

ఎన్నో సంఘ సంస్కరణోద్యమాలు జరిగేయి.
మహిళా చైతన్యం గురించి ఎంతోమంది కవి దిగ్గజాలు తమ కలం గళంతో సాహిత్య కవన పోరు సల్పేయి.

అటు తరువాత కుాడా స్త్రీల అణచివేతలు , అత్యాచారాల విషయం లో పెద్దగా ఏమీ మార్పు రాలేదు.
అటువంటి సమయంలో నే,  వినుకొండ గ్రామం లో సెప్టెంబర్ 28 / 1895 లో జన్నించారు మరో సంఘ సంస్కర్త , శ్రీ గుర్రం జాషుావాగారు.

తండ్రి , గుర్రం వీరయ్య యాదవుడు,  తల్లి  లింగమ్మ మాదిగ ఐనందున ,
ముాడాచారాలు నిండిన సమాజంలో బాల్యం నుండీ కుాడా, తక్కువ కులంలో జన్మించిన ఆయన ఎన్నో అవమానాలను ఎదుర్కున్నారు.

స్కుాలుకు వెళ్ళిన సమయంలో ఉపాధ్యాయులు, సహవిద్యార్ధులు చేసిన అవమానాలకు తిరగబడేవాడు
అటువంటి సమస్యల తోనే విద్యాభ్యసం పుార్తి చేసి
చాలా చోట్ల ఉద్యోగ విధులను నిర్వహించారు .
అటుపై సాహిత్యాభిలాషతో పలు సభల లో పద్యాలు చదివి అవమానం పొందేడు.

అటు తరువాత ఆ కవిత్వాన్నే ఆయుధంగా చేసుకొని,
ముాడాచారాలపై తిరగబడి , ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలనందుకొని , నవయుగ కవి చక్రవర్తగా కీర్తి సాధించి , తిరుపతి వేంకటకవులలో  ఒకరైన చెళ్ళ పిళ్ళ వేంకట శాస్త్రి గారిచే , కాళ్ళకు "గండపెండేరం "తొడిగించుకున్నాడు .

ఎన్నో సాహిత్య రచనలకు ఎన్నెన్నో పురస్కారాలను , బిరుదులను పొందిన శ్రీ గుర్రం జాషుావా గారు ,
స్త్రీ జనాభ్యుదయానికి మార్గదర్శిగా నిలచిన శ్రీ
వీరేశలింగం గారి సాహిత్య స్ఫుార్తి తో , అతని కల గళాన్ని, సాహిత్య కవన జోరులతో హోరెత్తించేరు.

పడుచు భార్యలు ముసలి భర్తలతో అనుభవించే కష్టనష్టాలను జాషువా అంగీకారయోగ్యంగా అక్షరబద్ధం చేశాడు. ‘‘జిలుగు మాంధాళి జలతారు చీరలోన/ పొదివి సేవింపదగు మల్లెపూల గుత్తి/ పీనుగుల మీద కప్పు పాపిష్టి కలుష/ వస్త్రపు ముసుగులో జుట్టి వయిచి నారు’’ అంటూ బాల వితంతువైన కళ్యాణి స్వరూపాన్ని శిల్ప సుందరంగా వర్ణించాడు.

"మహిళా చైతన్య పరిమళం " తో నిండి ఉన్న ఈతని సాహిత్యంలో , ఎంతో మంది పురుషాధిక్య తీరు తెన్నులను , "నేటి నెలత " ,"వంచిత" వంటి కవితా ఖండికలలో ఆవిష్కరించేరు.

నిన్నాకాశము దాకగ పొగుడుచున్‌ నీ అందచందాలతో/ వన్నెల్‌ దీర్చి కవిత్వమల్లు కొనుచున్‌, పైపై పరామర్శలన్‌/ నిన్నున్‌, నీదు శరీరమున్‌, హృదయమున్‌ ఛేదించి వేధించి యిం/ తన్నంబున్‌ బడవేయు సంఘమును/ బిడ్డా! యెట్లు హర్షింతువో’’ అంటూ వాత్సల్యంతో స్త్రీని ప్రశ్నిస్తాడు జాషువా.

ఊడిగపు యంత్రంగా స్త్రీ ని ఉపయొాగించుకొనే పురుషాహంకార ప్రవృత్తి ని ఖండిస్తుానే , స్త్రీ లను కామవాంఛలు తీర్చే బొమ్మలుగా , కొట్టి తిట్టిమరీ లొంగదీసుకొనే పురుష దౌర్జన్యాలని  , స్త్రీ ల అణచివేతలను, వారి  ఆవేదననుా జషుావాగారు ఆయన కవితల్లో హృద్యంగా చిత్రించేవారు.

పెండ్లి ఆడిన భార్యల పిప్పిజేసి/ తరుము చున్నవి పురుష భూతములు కొన్ని/ స్త్రీత్వమిడి అట్టి వానిని శిక్షించా’’లని ఆయన ప్రబోధించాడు.

జిలుగు మాంధాళి జలతారు చీరలోన/ పొదివి సేవింపదగు మల్లెపూల గుత్తి/ పీనుగుల మీద కప్పు పాపిష్టి కలుష/ వస్త్రపు ముసుగులో జుట్టి వయిచి నారు’’ అంటూ బాల వితంతువైన కళ్యాణి స్వరూపాన్ని శిల్ప సుందరంగా వర్ణించాడు.

పట్టుచీర జిలుగులతో పరిమళించా ల్సిన మల్లెపూల గుత్తిని పీనుగులమీద గప్పే కలుష వస్త్రంలో చుట్టివేశారని చెప్పడం ద్వారా వితంతువు పూర్వోత్తరస్థితిగతులను అద్భుతంగా కవిత్వీకరించాడు.

ఆధునిక సాహిత్య కవిగా ఆయన, కులాధిపత్యం వల్ల కలిగే సామాజిక పతనాలను , విధ్వంసాలని , మతోన్మాదాలు రగిల్చే ముాడదత్వాలను ,  వేల గొంతుకల కవితా ఖడ్గ శక్తి తో, ఎదిరించి పోరాడేరు.

మానవత్వమంటే ఏమిటి అన్నదానిని సమగ్రంగా చవి చుాపించే ఆతని కవితలు ,  ముఖ్యంగా స్త్రీ జనాభ్యుదయ  మార్గదర్శి గా స్త్రీ వాదానికి  , ఎన్నో కవితల రుాపాన్నిచ్చి సమాజంముందుంచేరు.

భావాభ్యుదయ విప్లవ కవుల్లో కనిపించని ' , మహిళాభ్యుదయ చింతన , జషువా గారి కవిత్వం లో గొోచరిస్తుంది.

పురుషాధిపత్యం తీరుతెన్నులను జాషువా ‘నేటి నెలత’, ‘వంచిత’ కవితా ఖండికల్లో ఎంతో సముచి తంగా ఆవిష్కరించాడు.

భావదాసురాలు’, ‘వెర్రి బాగులమ్మ’, ‘పరమ మూఢ’ ‘చపల హృదయ’ వంటి పదబంధాల ద్వారా స్త్రీలలోని పోరాటలేమిని ఎత్తి చూపాడు.

స్త్రీ ల ఉన్నత చైతన్యాన్ని , జ్ఞానాన్ని  హత్య చేసిన విధంగా రుాపొందించిన  సాంప్రదాయాలను ఆయన వ్యతిరేకరించేరు.

నాదు కంటినీరు నా తల్లి దేహాన/ నరనరాన దుఃఖనదులు చిమ్ము’’ అంటూ
తల్లిగా బిడ్డలతో గల అనుబంధం, భార్యగా భర్త తో గల బంధాల ఔన్నత్యాన్ని గురించి జాషుావాగారు తమ రచనల లో విశదీకరించిన రీతి కంట నీరు తెప్పించే   విధంగా అంతరాళను కలచివేస్తుంది.

స్త్రీ  అందాన్ని వర్ణిస్తూ , ఆమె శరీరాన్నీ మనసునుా హింశిస్తుా, పిడికెడు అన్నం తప్ప మరే రకమైన గౌరవాన్నీ ఇవ్వని కరకు సమాజాన్ని , పురుశాదిక్యతనుా  ధిక్కరించే కవి జషుావా.

తన భార్య తన ను వీడి పోయినపుడు ,
"నా తనుయష్టి ప్రత్యణువున్‌ గల పుష్టికి కార ణంబు నీ/ చేతి సుధాశనంబె కద! చిక్కునె నా కనరాదుగాని, నా/ మాతకు మారుగా, యనుగు మానిని రూపము దాల్చినట్టి నా/ జాతక పుణ్యరేఖవో ప్రశస్త శుభైక వరప్రదాత్రివో’’ అంటూ భార్యను తల్లిగా అభివర్ణించడం జాషువా ఔన్నత్యానికి తిరుగులేని నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

హిందుా సంఘ సనాతన ఆచారాలను ధిక్కరిస్తుా,
సంఘమంటే మనుష్యులను పీక్కుతినే కృార పిశాచాలతో  పోల్చడంతో , ఆతని కవిత్వం పరాకాష్ట కు చేరుకొంది.

సతుల నైసర్గిక జ్ఞాన సస్యరమను చిత్రచిత్రంబుగా హత్య చేసినారు’’ అంటూ కిరాతకమైన మనుస్మృతిని, హిందూ పితృస్వామ్య సమాజాన్ని తీవ్రంగా నిరసించాడు.

ఆచారాలన్నీ ఆత్మ శాశనాలకు , పర నాశనానికి కారణభుాతాలంటుా  వర్ణించేరు. ధర్మం పేరుతో చేసే   ఆచారాలు , సాంయ్రదాయ అకృత్యాలకు ,
నాలుగు పాదాల ధర్మదేవత ను, నాలుగు పాదాల  పశువుతో పోల్చేరు.

సాహసోపేతమైన ఆతని స్త్రీ వాదాన్ని , చీకటి కోణాల్లో
నిలబడి ఉన్న నిరంకుశత్వాన్నీ ,దృశ్యమసనం చేసిన ఆతని వ్యక్తిత్వాన్ని ఎవరుా ఖండించలేకపోయేరు.

వివేకం లేని విద్య విద్యే కాదని , విద్య యొక్క ఆవశ్యకతను శాస్త్రీయంగా విశదీకరించేరు.

"అబల విద్యా పూర్ణయైు తోడురాకున్నన్‌ దేశము నిద్ర మేలుకొనునే’’ (ప్రబోధం), ‘‘స్త్రీల విజ్ఞానంబు చిదిమి బందీ జేయు దేశాన సిరులు వర్ధిల్లగలవే’’ (బాపూజి) అంటూ ఒక సామాజిక శాస్త్ర వేత్తలా
చదువెరుగని స్త్రీ లు తమ బిడ్డల పురోగతికి అవరోధము కారా అంటుా ప్రశ్నించేరు.

కుల-మత భేధాల కర్కశత్వాన్ని తెరచాటు నాటకంలో చుాపిన జషుావా అంతటితో ఆగలేదు.

బాల్యం నుండే కులమత భేదాలకు అర్ఘ్యం పోస్తున్న తల్లిదండ్రులను నిలదీసి ఆలోచింపజేసేడు.

"ఖండ కావ్యం" లో, నాటి రాజకీయ నాయకుల సంకుచిత్వాన్ని వ్యంగ్యంగా ఎత్తి చుాపేరు.

స్త్రీ  సర్వతోముఖ పురోగమనాన్ని వాగ్దానం చేసిన హిందుా కోవిడ్ బిల్లును వ్యతిరేకించిన మన నాయకులు , వల్లభ్ భాయ్ పటేల్ , డా॥ రాజేంద్రప్రసాద్ , ప్రధాన మంత్రి నెహ్రూ లను నిరసిస్తూ ,
రాజీనామా చేసిన , డా॥ అంబేడ్కర్ , పార్లమెంట్ సాక్షిగా "హిందుా కోవిడ్ బిల్ " హత్య చేయబడిందని ,
దానికోసం రెండు కన్నీటి బొట్లు  కుాడా కార్చిన వారు
లేకపోయేరని , వాపోయిన చారిత్రాత్మక ద్రోహాన్ని
జషువా తన పద్యాల లో సమర్ధవంతంగా అక్షరబద్ధం
చేసేరు.

పురుషులతో పాటు స్త్రీ లకు కుాడా సమాన మర్యాదలివ్వాలని, దళిత స్త్రీ ల దుర్ధర దారిద్ర్య బాధలు తొలగాలని, వాస్తవికత దృష్టి  కోణాల్లో వర్ణించేరు.

వితంతు, గబ్బిలం ,స్మశానం ,చీకటి ,లాంటి సంఘ -
విముఖ అంశాలను తన చాతుర్య కవితా పటిమతో
సౌందర్య శోభితం చేసి , పాఠకలోకాన్ని పరవసింపజేసేరు.

వస్తువు అధమమైనా, ఉత్తమమైనా, వికృతమైనా...
జాషుావా కలం నుంచి జాలువారిన పిదప సుశోభిత కవిత్వమై , లోకోత్తర రుాపమై , సమాజ మేల్కొలుపుకు
శ్రీకారం చుడుతుంది.

కవిత్వాన్ని ఆయుధంగా మలచుకొని ,ముాడాచారాలపై
తిరుగుబాటు చేసిన జషువా , దళిత కులస్తునిగా ఎన్నో
అవమానాలను కుాడా ఎదుర్కొన్నాడు.
ఆపై ఎంతో ఎదిగి , గౌరవ పురస్కారాలను అందుకున్న జషువా స్త్రీ ల స్వతంత్ర్యత పై అక్షరోద్యమాన్ని సల్పిన అమర చరిత్రకారుడు.

జీవిత పోరాటపు సంఘర్షణల ఎగుడు దిగుడు బాటల్లో
ప్రయాణిస్తుానే , ఆంధ్రప్రదేష్ శాశనమండలి సభ్యత్వాన్ని పొందిన  జషువా

నీ మానసము దయారామాభివృద్ధికి అమృతంబు చిల్కు వర్షా గమంబు/ నీ చరిత్రము గాఢనిద్రా దరిద్రాణ కుతల చక్రమునకు కోడికూత’’ (ఖండకావ్యం.4) అని కవి వ్యక్తిత్వ గరిమను కొనియాడిన జాషువా ఈ రకమైన కవితా హృదయంతో, తెలుగు సాహిత్యంలో మేలుకొలుపుల గానం ఆలపించిన జాషుావా

24 జులై  1971  గుంటూరు లో స్వర్గస్తులయ్యి , ఈ నాటికీ కుాడా , స్త్రీ  జనాభ్యుదయ మార్గ దర్శకునిగా, ప్రజల గుండెల్లో అక్షర రుాపమై నినదిస్తున్న  కవనోద్యమకారుడు.
ఎంత మంది ఎన్ని ఉద్యమాలు సల్పినా ,  ఎన్ని   శాశనాల మార్పులు జరిగినా , ఎన్ని ఆరక్షణా కేంద్రాలు స్థాపించినా , స్త్రీ లు ఎంతో  ఎత్తుకు ఎదిగినా,  నేటికిీ స్త్రీ ల విషయంలో జరుగుతున్న అమానుష అకృత్యాలు  ఆగని ఆక్రోశాలై, విలపిస్తునే ఉన్నాయి.

  పురుషాధిక్యతల  అకృత్య సాముాహిక బలాత్కారాల దాడుల ఆత్మహత్యల తో  , ఏసిడ్ దాడుల వంటి వికృత చర్యలకు భయంతో   అల్లలాడుతుానే ఉన్నాయి.
రోజు రోజుకుా పెరుగుతున్న ,  నికృష్ట  దుష్ట చర్యలతో కకావికలమౌతున్న  స్త్రీ సమాజోద్ధరకై ,   స్త్రీ ల కన్నీటిని తుడిచే మరో జషుావా వంటి  స్పందన గల ఉద్యమకారులు  ఉద్భవించాలని కోరుకుంటుా..

"ఎందరో మహాను భావులు అందరికీ వందనాలు."

--------------------------------------------------------------





మానవత్వఁం

15/10/2020.
అంశం
మానవత్వం.
-----------------

శీర్షిక.
"మరుగుజ్జు"
-----------------
రచన, శ్రీమతి , 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ . మహారాష్ట్ర .
8097622021
---------------------
అసహనంతో అటుా ఇటుా తిరుగుతున్నాను.
ఇంకా పనిలోకిరాని ఆదెమ్మను ఆడిపోసుకుంటుా..॥
అరగంట  లేటుగా ,  ఆదెమ్మ అలసటతో
జ్వరంలో ఉన్న చంటిదాని మీద నున్న బెంగతో॥
 చంటిదాన్ని గుడ్డ పరచి వేసింది నేలపై 
అడిగింది  పది రుాకలు చంటిదాని  మందుకై॥
నాగాల లక్కల్లో  నయాపైస రాదంటుా  
కసుర్ల విసుర్ల తొనాదెమ్మను, తరిమేసా పొమ్మంటుా॥
కవి  సమ్మేళన సన్మానం, లేటయ్యిందనుకుంటుా
మనవత్త్వం పై భాషణ చెప్పాలిగ  అనుకుంటుా॥
అద్ధ ముందు నిల్చున్నా అలంకరణ కోసమై
అద్ధం లో నా రుాపమె అగుపించె వికారమై॥
అదిరి పడ్డ నా ముందు ,ఆదెమ్మే అందమై
ఎదిగిపోయె కనుల ముందె మానవత్త్వ శిఖరమై॥ 
అనాధ పిల్ల పై పుట్టెడు మమకారం నింపుకొని
ఖర్చు కై వెనుకాడని ,మమతలనే పంచుకొని ॥
కుాడు- గుడ్డ లేకున్న ,నిండు మనసు  అదెమ్మది
పాచి పనుల జీతంలో , కొట్టి వేత లెక్క నాది॥
పెంచుకున్న చంటి బిడ్డ నెత్తుకున్న ఘనతామెది
పది రుాకలు ఇవ్వలేని హీన మైన మనసు నాది॥
చెప్పకనే చుాపించెను మానవత్వం విలువేమిటొ  
కరగె నాలో కఠినత్త్వము కంటి  నీటి ధారలతో .॥.
మరుగుజ్జై నిలచి నాను అమె ముందు తలవాల్చి
భాషణలకె పరిమితమౌ మాట లేటి కని తలచి॥. 
"మీడియాల మొాజు లేలు,మాటలనే వీడమని
మనసుంటే ఇంటి నున్న పనివారికి సాయపడని --"॥
మనసు చెప్పి నట్టి మాట నాటుకుంది నా మదిలో  
మేలుకుంది  మరోమనిషి మానవత్వ రుాపముతో॥
చేతికందు రుాక లన్ని  సంచిలోన  వేసి నేను
ఆదెమ్మ ఇంటి వేపు కడుగు లేసి కదలినాను॥ .
చెప్ప లేని ఆనందం చేరువైన సంతోషం
శాంతి నిండు మనసిపుడొక  ఆశయాల విహంగం.॥
-------------------------------------------------------------


హామీ...
శీర్షిక.
"మరుగుజ్జు"
 .అనే  ఈ కవిత,
 ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని-
నా స్వీయ రచన.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .

Wednesday, September 9, 2020

శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు. కవిత

శీర్షిక .
"విశ్వ " సాహిత్య నాధుడు.
------------------------------------

సంప్రదాయ సాహిత్యాలకు పెట్టినది పేరుగా
ఆతని సాహిత్య రచనా శైలి అద్భుతమైన 
విశిష్టతను సంతరించుకుంటాయి.॥

"విశ్వేశ్వర శతకం" తో మొదలైన ఈతని 
సాహిత్య  ప్రస్థానం , పుంఖల పుంఖలాలుగా 
కొనసాగి వివిధ ప్రక్రియల లో రుాపు దిద్దుకుని ,
విన్నుాత్న ఆవిష్కరణలతో  అలరించేయి.॥

వేల కొలదీ ప్రక్రియల లో ఈయన రచించిన
శతకాలు, పురాణాలు , గ్రంధాలు , నవలలు,
నాటకాలు లాంటి ఎన్నో సాహిత్య సంపదలు,
మనకందిన  అజరామర కీర్తి కిరీటాలు.॥

విన్నుాత విశిష్ట పాత్రల చిత్రీకరణకు 
విశ్వనాధులకు  పెట్టినది పేరు.
వీరు రచించిన ఎన్నో నవలలు సినీ చిత్రాలుగా రుాపొందేయి.॥
విశిష్ట మైన పాత్రలతో రచించిన ఎన్నో నవలలు
గణుతికెక్కాయి.॥

"రామాయణ కల్పవృక్షము" నకు గాను,
"జ్ఞాన పీఠ అవార్డు " ను గ్రహించేరు.

శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి  వీరి గురువులు.
శారీరిక వ్యాయామం , యొాగాభ్యాసము నిత్య-
కృత్యాలుగా  గల "శ్రీ విశ్వనాథ  సత్యనారాయణ "
గారికి గౌరవ గజారోహణ తోపాటు తొాలా బిళ్ళపై
ఆయన చిత్రాన్ని విడుదలజేయడం మన తెలుగు వారికి గర్వకారణం. ॥

వేల కొలది రచనలతో ,
ఎన్నో పురస్కారాలు, సన్మానాలు , డాక్టరేట్ లు
అందుకున్న ఈయన  మేటి సాహిత్య సార్వభౌములు, 
 కీర్తి కిరీటోత్తములు.॥
 -------------------------------------------
రచన, శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
----------------------


భార్యా భర్తల బంధం గురించి ( వాట్సప్ ఫార్వర్డ్ మెసేజ్ ).

*💑 భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం...! 💑*

💖 నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.
💖 తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ... తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.
💖 అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.
అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే.
💖 ప్రతి భర్త తన భార్యను... మరో తల్లి రూపంగా భావిస్తే..
ప్రతిభార్య తనభర్తను,మొదటి బిడ్డగా పరిగణిస్తుంది...
ఇదే మధురమైన బంధం... ఇప్పటికీ... ఎప్పటికీ...
💖 భార్యకు సేవ చేయడం అంటేబానిసగాబ్రతుకుతున్నామని కాదు అర్థంబంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.
💖 సంసారం అంటే కలసి ఉండడమే కాదు.కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.
💖 ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కానీ
అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని...
మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.
💖 భార్యాభర్తల సంబంధం శాశ్వతం.కొంతమంది మధ్యలో వస్తారు.మధ్యలోనే పోతారు.
భార్యకి భర్త శాశ్వతం.భర్తకు భార్య శాశ్వతం.
💖 ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ,గొప్పవిద్యావంతురాలి కిందే లెక్క...!
💖 అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు.భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.
💖 మోజుతీరగానేమూలనేసేది కాదు మూడుముళ్ల బంధం
ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది 'మాంగల్య బంధం'.
💖 బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే
ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి.మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.
💖 మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకుయజమానిగాఉంటుంది.కానీ, తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.
💖 కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా... సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.
💖 నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే.నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.
💖 ప్రేమ అనేది చాలా విలువైనది.దాన్ని 'వివాహం' అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.
💖 సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం - కుటుంబం.
💖 గొడవ పడకుండా ఉండే బంధం కన్నా...ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.
💖 పెళ్లి అనేది అందమైన పూలవనం లాంటిది.ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి.
💖 వివాహ వార్షికోత్సవం అంటేప్రేమ,విశ్వాసం,భాగస్వామ్యం, సహనం, ఓర్పు ల సంగమాన్ని పండుగ చేసుకోవడమే.
💖 నేలకు జారిన తారకలై
ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు!!
💖 సప్తపది ఏడు అడుగులు
మొదటి అడుగు - అన్న వృద్ధికి
రెండవ అడుగు - బలవృద్ధికి
మూడవ అడుగు - ధన వృద్ధికి
నాల్గవ అడుగు - సుఖవృద్ధికి
ఐదవ అడుగు - ప్రజాపాలనకి
ఆరవ అడుగు - దాంపత్య జీవితానికి
ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి
💖 కోరుకున్న ఇంతి... నేడు నీ సతి...నేడు పట్టుకున్న ఆమె చేయి...విడవకు ఎన్నటికీ.
💖 వివాహాన్ని సుఖమయం చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు.
పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం.
💖 కలిమి లేములతో...
కలసిన మనసులతో...
కలివిడిగా మసలుకో..
కలకాలం సుఖసంతోషాలు పంచుకో...
💖 బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది.పొరపాటు అనేదిఅందులోఒకపేజీమాత్రమే. ఆఒక్కపొరపాటు జరిగితే సవరించాలి కానీ..మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు.
💖 మగవాడు గాలి పటం
(అందని ఎత్తులకు ఎదగడం తెలుసు, కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలీదు)
ఆడది దారం, అతడికి ఆధారం
(ఆమెకువెన్నంటిప్రోత్సహించడం తెలుసు, కానీ ప్రతిభను పదిమందికి ప్రదర్శించడం తెలీదు)
విడివిడిగా దేనికీ విలువ లేదు
ఒకటైతే ఇద్దరికీ తిరుగులేదు.
💖 భర్తకి భార్య బలం కావాలి
బలహీనత కాకూడదు
భార్యకి భర్త భరోసా కావాలి
భారం కాకూడదుభార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి
అయోమయం కాకూడదు.
💖 మనసులోని ప్రేమని, బాధనికళ్లలోచూసిచెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.
💖 అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటేఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.
💖 పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి కాదు.ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.
💖 ప్రతీ అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం.కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం అనుకుంటుంది భార్య
💐💐💐💐💐💐💐💐💐💐🙏🏻🙏🏻

కాళోజీ కొటేషన్లు.

కాళోజీ కొటేషన్స్లో కొన్ని...               1.అన్నపురాసులు ఒకచోట- ఆకలిచావులు ఒకచోట.             2.అన్యాయాన్ని ఎదిరించేవాడే నాకు ఆరాధ్యుడు.                                   3.అన్యభాషలునేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా!చావవెందులకు?                         4.దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొని దొరలై వెలిగేదెన్నాళ్ళు?                      (కాళోజీ జయంతి సందర్భంగా.)

Tuesday, September 8, 2020

అక్షరం కవిత .

అక్షరం కవిత .
గోదావరి రచయితల సంఘం కోసం రాసినది. (వాట్సప్).

8/9/2020
శీర్షిక .
అక్షరాలు ఆత్మబంధువులు.
---------------------------------------
అక్షరాలు ఆత్మ బంధువులు.
పురానేతిహాసాల చరిత్రలకు సాక్షి  పత్రాలు
మన సాహిత్య సంపదల పుాల సరాలు.
మన  భాషా సంస్కృతులకు పుట్టినిల్లు.
మనం మాట్లాడే మాటలకు మంత్రాలు అక్షరాలు.
అక్షరాల అభ్యాసనతో ఆకాసాన్నందుకోగలవు.
ఆక్షరాల తీపి పొందికతో, మాటలల్లి
హృదయాలు చుారగొనగలవు.
అవే అక్షరాలతో  హాలాహలం సృష్టించగలవు.
అక్షరాస్యతతో జ్ఞానభండారానికి చేరువౌతావు.
ఉజ్జ్వల  భవిష్యత్తుకు పునాదులు అక్షరాలు.
నిరక్షరాస్యత  జీవితానికి ఒక శాపం.
అక్షరాలు అవనిలో జ్ఞానులిచ్చిన అమృత భాండాలు.
ఇల అవి అన్నిటికీ మించిన నిధి -నిక్షేపాలు .
---------------------------------------------------------------

రచన, శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
హైదరాబాదు .తెలంగాణ .
8097622021.
---------------------
.
హామీ...
ఈ  ,"  అక్షరాలు ఆత్మబంధువులు"  అనే   కవిత,
ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని-
నా స్వీయ రచన.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.


హామీ...
ఈ కవిత,
ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని-
నా స్వీయ రచన.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

రామాయణ లింకులు (శతాక్షర భేరీలో).

*రామాయణం సంబంధ 112 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Download చేసుకోగలరు*
------------------------------------------------
112 పుస్తకాలు ఒకేచోట   https://www.freegurukul.org/blog/ramayanam-pdf

               (OR)
 
సంపూర్ణ వాల్మీకి రామాయణం(వచన) https://www.freegurukul.org/z/Ramayanam-1

వాల్మీకి సంపూర్ణ రామాయణం(పద్య+తాత్పర్యం) https://www.freegurukul.org/z/Ramayanam-2

వాల్మీకి రామాయణం-బాల,అయోధ్య,సుందర,ఉత్తర కాండ-అంతరార్ధం https://www.freegurukul.org/z/Ramayanam-3

చిత్ర రూపంలో సంపూర్ణ వాల్మీకి రామాయణం https://www.freegurukul.org/z/Ramayanam-4

రామ కథాసుధ-1,2 భాగాలు https://www.freegurukul.org/z/Ramayanam-5

రామచరిత మానసము  https://www.freegurukul.org/z/Ramayanam-6

సుందర కాండ-పారాయణము https://www.freegurukul.org/z/Ramayanam-7

సంపూర్ణ ఆంధ్ర శ్రీ మద్రామాయణము https://www.freegurukul.org/z/Ramayanam-8

రామచరిత మానస్-తులసీ రామాయణం https://www.freegurukul.org/z/Ramayanam-9

రామాయణం https://www.freegurukul.org/z/Ramayanam-10

తులసీ రామాయణము https://www.freegurukul.org/z/Ramayanam-11

యోగ వాసిష్ఠ సారము https://www.freegurukul.org/z/Ramayanam-12

యోగ వాశిష్ఠ సంగ్రహము https://www.freegurukul.org/z/Ramayanam-13

రామాయణ రహస్య రత్నావళి https://www.freegurukul.org/z/Ramayanam-14

రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలు https://www.freegurukul.org/z/Ramayanam-15

బాలల బొమ్మల సంపూర్ణ రామాయణం https://www.freegurukul.org/z/Ramayanam-16

రామాయణం పాత్రల ఆదర్శం https://www.freegurukul.org/z/Ramayanam-17

రామాయణంలో విశిష్ట పాత్రలు https://www.freegurukul.org/z/Ramayanam-18

బాలానంద బొమ్మల రామాయణం https://www.freegurukul.org/z/Ramayanam-19

వాల్మీకి రామాయణం-సంబంధాలు https://www.freegurukul.org/z/Ramayanam-20

రామాయణ పరమార్ధం https://www.freegurukul.org/z/Ramayanam-21

శ్రీ రామాయణ రహస్యం https://www.freegurukul.org/z/Ramayanam-22

రామాయణ తరంగిణి-1 https://www.freegurukul.org/z/Ramayanam-23

రామాయణ తరంగిణి-2 https://www.freegurukul.org/z/Ramayanam-24

శ్రీరామాయణ కథా సుధ https://www.freegurukul.org/z/Ramayanam-25

వాల్మీకి రామాయణము-బాల కాండము https://www.freegurukul.org/z/Ramayanam-26

వాల్మీకి రామాయణము-అయోధ్య కాండము https://www.freegurukul.org/z/Ramayanam-27

చిత్రరూపంలో రామాయణం https://www.freegurukul.org/z/Ramayanam-28

వాల్మీకి రామాయణము-ఉత్తర కాండ https://www.freegurukul.org/z/Ramayanam-29

వాల్మీకి రామాయణము-అయోధ్య కాండ https://www.freegurukul.org/z/Ramayanam-30

వాల్మీకి రామాయణము-అరణ్య కాండము https://www.freegurukul.org/z/Ramayanam-31

వాల్మీకి రామాయణము-కిష్కింద కాండ https://www.freegurukul.org/z/Ramayanam-32

వాల్మీకి రామాయణము-యుద్ధ కాండ-2 వ భాగము https://www.freegurukul.org/z/Ramayanam-33

వాల్మీకి రామాయణము-ఉత్తర కాండ-2 వ భాగము https://www.freegurukul.org/z/Ramayanam-34

శత శ్లోకి వాల్మీకి రామాయణం https://www.freegurukul.org/z/Ramayanam-35

జాతి జీవనంపై  రామాయణ ప్రభావం https://www.freegurukul.org/z/Ramayanam-36

రామాయణమంటే https://www.freegurukul.org/z/Ramayanam-37

రామాయణ సారస్వత దర్శనము https://www.freegurukul.org/z/Ramayanam-38

అంతరార్ధ రామాయణము https://www.freegurukul.org/z/Ramayanam-39

రామాయణ విశేషాలు https://www.freegurukul.org/z/Ramayanam-40

శ్రీమద్వాల్మీకి రామాయణోపన్యాసములు https://www.freegurukul.org/z/Ramayanam-41

శ్రీరామ కథామృతము - సమగ్ర సమీక్ష https://www.freegurukul.org/z/Ramayanam-42

శ్రీరామ కథామృతము https://www.freegurukul.org/z/Ramayanam-43

జీవన చిత్రాలు-రామయణ పాత్రలు https://www.freegurukul.org/z/Ramayanam-44

రామాయణ పాత్రలు https://www.freegurukul.org/z/Ramayanam-45

లక్ష్మణుడు https://www.freegurukul.org/z/Ramayanam-46

లక్ష్మణుడు https://www.freegurukul.org/z/Ramayanam-47

భరతుడు https://www.freegurukul.org/z/Ramayanam-48

కళ్యాణ రాముడు https://www.freegurukul.org/z/Ramayanam-49

కాళిదాసు రామకథ https://www.freegurukul.org/z/Ramayanam-50

బాలానంద కుశలవుల కథ https://www.freegurukul.org/z/Ramayanam-51

రావణ రాజ్యము-రామ రాజ్యము https://www.freegurukul.org/z/Ramayanam-52

రామాయణోపన్యాస మంజరి https://www.freegurukul.org/z/Ramayanam-53

వాల్మీకి వచన రామాయణము-బాల కాండము https://www.freegurukul.org/z/Ramayanam-54

వాల్మీకి రామాయణోపన్యాసములు-బాల కాండము https://www.freegurukul.org/z/Ramayanam-55

వాల్మీకి రామాయణము-బాల కాండము https://www.freegurukul.org/z/Ramayanam-56

వాల్మీకి రామాయణము-అయోధ్య కాండము https://www.freegurukul.org/z/Ramayanam-57

వాల్మీకి రామాయణము-అయోధ్య కాండము https://www.freegurukul.org/z/Ramayanam-58

అయోధ్యకాండ లోని ఆణిముత్యాలు https://www.freegurukul.org/z/Ramayanam-59

శ్రీమద్రామాయణము-అరణ్య కాండ https://www.freegurukul.org/z/Ramayanam-60

వాల్మీకి రామాయణం-అరణ్య కాండ https://www.freegurukul.org/z/Ramayanam-61

వాల్మీకి వచన రామాయణము-కిష్కింద కాండము https://www.freegurukul.org/z/Ramayanam-62

సుగ్రీవ పట్టాభిషేకము https://www.freegurukul.org/z/Ramayanam-63

ఉపన్యాస రామాయణము-చిత్రకూట సమావేశము https://www.freegurukul.org/z/Ramayanam-64

సుందరకాండము https://www.freegurukul.org/z/Ramayanam-65

సుందరకాండ https://www.freegurukul.org/z/Ramayanam-66

వాల్మీకి వచన రామాయణము-సుందర కాండము https://www.freegurukul.org/z/Ramayanam-67

వాల్మీకి వచన రామాయణము-సుందర కాండము https://www.freegurukul.org/z/Ramayanam-68

సుందర కాండకథ https://www.freegurukul.org/z/Ramayanam-69

రామాయణాంతర్గత సుందరకాండము https://www.freegurukul.org/z/Ramayanam-70

సుందరకాండ https://www.freegurukul.org/z/Ramayanam-71

సుందరకాండము https://www.freegurukul.org/z/Ramayanam-72

సుందరకాండము https://www.freegurukul.org/z/Ramayanam-73

సుందర సందేశము https://www.freegurukul.org/z/Ramayanam-74

సుందరకాండ https://www.freegurukul.org/z/Ramayanam-75

రామాయణము-యుద్ధ కాండ-2 https://www.freegurukul.org/z/Ramayanam-76

రామాయణము-యుద్ధ కాండ-3 https://www.freegurukul.org/z/Ramayanam-77

వాల్మీకి రామాయణము-యుద్ధ కాండ-1 https://www.freegurukul.org/z/Ramayanam-78

రామాయణ సుధ-ఉత్తర కాండము https://www.freegurukul.org/z/Ramayanam-79

వాల్మీకి వచన రామాయణము-ఉత్తర కాండము https://www.freegurukul.org/z/Ramayanam-80

ఉత్తర రామాయణము https://www.freegurukul.org/z/Ramayanam-81

ఉత్తర రామాయణము https://www.freegurukul.org/z/Ramayanam-82

ఉత్తర రామాయణ కథలు https://www.freegurukul.org/z/Ramayanam-83

రామాయణ తరంగిణి-6  https://www.freegurukul.org/z/Ramayanam-84

రామాయణ తరంగిణి-7 https://www.freegurukul.org/z/Ramayanam-85

రామాయణ రత్నాకరము-1,2,3 https://www.freegurukul.org/z/Ramayanam-86

పాదుకా పట్టాభిషేకం https://www.freegurukul.org/z/Ramayanam-87

రామాయణ కల్పవృక్షం తెలుగుదనం https://www.freegurukul.org/z/Ramayanam-88

రామో విగ్రహవాన్ ధర్మః https://www.freegurukul.org/z/Ramayanam-89

రామ కథా రస వాహిని https://www.freegurukul.org/z/Ramayanam-90

సీతాదేవి వనవాసం https://www.freegurukul.org/z/Ramayanam-91

వాల్మీకీ రామాయణం శాపములు-వరములు https://www.freegurukul.org/z/Ramayanam-92

శ్రీరామ పధము https://www.freegurukul.org/z/Ramayanam-93

శ్రీరామనవమి https://www.freegurukul.org/z/Ramayanam-94

రామచరిత మానసము https://www.freegurukul.org/z/Ramayanam-95

రామచరిత మానసము -సుందరకాండ https://www.freegurukul.org/z/Ramayanam-96

తులసీ రామాయణము-యుద్ధ కాండము https://www.freegurukul.org/z/Ramayanam-97

శ్రీరామ పట్టాభిషేకము -శ్రీరామచరిత మానసము-ఉత్తరకాండ https://www.freegurukul.org/z/Ramayanam-98

వాల్మీకీయ జ్ఞాన వాసిష్ఠము https://www.freegurukul.org/z/Ramayanam-99

ఆంధ్ర వాసిష్ఠ రామాయణము-1 https://www.freegurukul.org/z/Ramayanam-100

ఆంధ్ర వాసిష్ఠ రామాయణము-3 https://www.freegurukul.org/z/Ramayanam-101

యోగ వాసిష్ఠము-ఉత్తరార్ధము https://www.freegurukul.org/z/Ramayanam-102

జటాయువు ధర్మబోధ https://www.freegurukul.org/z/Ramayanam-103

108 నామాల్లో సంపూర్ణ రామాయణం https://www.freegurukul.org/z/Ramayanam-104

వాల్మీకి సంపూర్ణ రామయణ కథామృతము https://www.freegurukul.org/z/Ramayanam-105

వాల్మీకి రామాయణము-బాల కాండ https://www.freegurukul.org/z/Ramayanam-106

వాల్మీకి రామాయణము-అరణ్య కాండము https://www.freegurukul.org/z/Ramayanam-107

వాల్మీకి రామాయణము-కిష్కింద కాండ https://www.freegurukul.org/z/Ramayanam-108

కిష్కింద కాండము https://www.freegurukul.org/z/Ramayanam-109

ఆధ్యాత్మ రామాయణము https://www.freegurukul.org/z/Ramayanam-110

శ్రీరాముని చరిత్రము https://www.freegurukul.org/z/Ramayanam-111

సీతారామాంజనేయ సంవాదము https://www.freegurukul.org/z/Ramayanam-112

రామాయణం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

మరింత సమాచారం కోసం:
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్
Website: www.freegurukul.org
Android App: FreeGurukul  and  iOS App: Gurukul Education
Whatsapp: 9042020123(To get this type of messages, SAVE this number and send START message, will add in Group)

Monday, September 7, 2020

గురుభ్యోనమః లో నేను రాసిన ముందు మాట.

ముందు మాట.
---------------------

గౌరవనీయులైన   శ్రీ అడిగొప్పుల సదయ్యగారు
సహజ పాండిత్య సాహితీ సంపన్నులు. నిరంతర సాహిత్య కృషి గ్రంధానుశీలన వీరి ఉఛ్ఛ్వాస నిశ్వాసాలు.
 
శ్రీ కౌశల్య, రామయ్య గారుల పుత్రులులైన వీరు , వృత్తి పరంగా కరీంనగర్ కళాశాల లో ప్రభుత్వ గణితోపాధ్యాయులైనను , ప్రవృత్తి పరంగా సాహిత్య , సమాజ సేవకులు.
"క్షపాకర " అనేది వీరి కలం పేరు.
చిన్ని పదాల లో పెద్ద భావమును ఇమడ్చ గలిగే,
ఛందోబద్ధ నియమ సారమైన " ఇష్టపది"  నుాతన  పద్య ప్రక్తియ  సృష్టికర్తలు.
ఈ ప్రక్రియ లో రాసిన ఏ గ్రంధమైనా  యతి ,ప్రాస ,భావ ,వ్యక్తీకరణల తో అద్భుతమైన శైలి లో రుాపొందింపబడి ప్రజాదరణ పొందగలదన్న మాటలో సందేహము లేదు.
దుర్లభమైన మానవజన్మ ఎత్తినందులకు గాను
శ్రీ అడిగొప్పుల సదయ్యగారు , తన జన్మ సార్ధకత చేసుకునే రీతిలో ఎన్నో గ్రంధ , గేయ రచనలు చేసేరు.
అందమైన కందాలుగా శ్రీనివాస శతకం , ఇష్టపదుల లో
పురుషోత్తమ మాల ,  ముత్యాల సర లో సర్పదష్ట గేయ కావ్యం , కుానలమ్మ పదాల్లో చంద్ర కిరణాలు , బాల సాహిత్య గేయ కధలు, గజల్స్ , కవితలు లాంటివి ఈయన  ప్రతిభకు కొన్ని మచ్చుతునకలు.

జాతీయ దళిత సాహిత్య అకాడమీ అవార్డు ,
సహస్ర కవిమిత్ర ,  సహస్ర లేఖా సాహిత్య మిత్ర,  విద్యా జ్యోతి రత్నబిరుదులే కాక..
, ఇంటర్నేషనల్ పీన్ యుానివర్సిటీ నుండి  "గౌరవ డాక్టరేట్," వంటి ఉత్తమ పురస్కారాలనందుకున్న
గురువరేణ్యులు.

నేటి కార్పొరేట్‌ విద్యా విధానాల వల్ల, విద్యార్ధులు ఆర్ధికంగానే  కాక, జ్ఞాన పరంగా కుాడా నష్టపోతున్నారు.  విద్యావ్యవస్థ లో గల లోటు- పాట్లను
సవరించి, విద్యార్ధులకు సక్రమ మైన మార్గ నిర్దేశం కలిగించాలన్న  దిశలో,
కర్తవ్య నిష్ట గల ఎందరో ఉపాధ్యాయులు ,
నిరంతర కృషి చేస్తుా...విద్యార్ధులను ఒక వివేకానందునిగా , ఒక సర్వైపల్లి రాధాకృష్ణ గారు మొదలైన ఉత్కృష్ట  సమాజ  నిర్మాతలుగా  తీర్చి దిద్దాలనే సంకల్పంతో  తమ జీవితాలను ధారపోస్తున్నారు.
అటువంటి గురువుల కు పాదాభిషేక వందనాలనర్పిస్తుా, వారి గౌరవార్ధం ,
తమ తమ  గురువులను
స్మరించుకుంటుా,  ,ఎంతో మంది శిష్యులు , తమ కృతజ్ఞతలను కవితల రుాపంలో అందించేరు .ఆ కవితలకు  "సంకలన" రుాపం ఇచ్చే సదుద్దేశ్యంతో , ఎన్నో కష్ట నష్టాలకోర్చి..ఈ   "కవితా సంకలనానికి" వారధిగా నిలిచి , వందన సమర్పణ గావిస్తున్న శ్రీ "అడిగొప్పుల సదయ్యగారు" కృతార్ధ చరితులు.
ఈ నాటి  "ఉపాధ్యాయ దినోత్సవ " సందర్భంగా , సద్గురువుల
గౌరవార్ధం , కవితా సంకలనానికి శ్రీకారం చుట్టి,  ఆశక్తులైన
ఎంతోమంది సాహిత్యప్రియులను ప్రోత్సహించి , వారు రాసిన కవితలను " గురుభ్యోనమః"  అనే  శీర్షిక తో,
"సంకలనంగా" తీసుకు వస్తున్న , సాహిత్య స్ఫుార్తి దాయకులు, శ్రీ అడిగొప్పుల సదయ్యగారు.
సత్ చిత్తులు, సౌమ్యులు ఐన,
వీరికి , వీరి కుటుంబానికి, ఆయురారోగ్య ఐశ్వర్యాలను
కలుగజేయాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.

     ఇట్లు ,
      గేయ , కవితా , కధా-
             రచయిత్రి,
   " పద ముత్యం" ,బిరుదు,
  " ఇష్టపది శ్రేష్ట"  బిరుదుల గ్రహీత-
  
      శ్రీమతి , పుల్లాభట్ల -
      జగదీశ్వరీముార్తి.
    కల్యాణ్.  మహారాష్ట్ర .
        8097622021.
                               



కాళోజీ కవిత.

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
-----------------------
శీర్షిక .
చైతన్యపు వారధి.
-------------------------
ఉద్యమాలె ఊపిరిగా, ప్రజల తోడె జీవముగా
చైతన్యపు వారధిగా  ,  పోరాటపు సారధిగా..॥

ప్రత్యేక తెలంగాణ ,  సాధించిన సాధకుడు.
పద్మవిభుాషణాలంకృత ఘన వైతాళికిడు ॥

తెలంగాణ తెలుగు బిడ్డ , తెలంగాణ ప్రీతి గడ్డ.
నిజాం నిరంకుశత్త్వానికి ,  నిరసనల వేటలో ధీట.॥

ఉద్యమాలె ఊపిరిగా    నిత్య పోరాట బాట.
స్వేశ్ఛ కై తపించి పోరి ,జీవిత మర్పించు  నేత॥

బహు భాషా కోవిదుడు , సత్యహింసా వాదకుడు.॥
ప్రతిధ్వనించు ప్రేరణల , ఉద్యమ పోరాటకుడు.॥

కలం కత్తి ఝళిపించి కవితలల్లు యొాధుడు॥
ప్రజా కవిగ పేరొందిన   పరమ దేశ భక్తుడు ॥

అసమానతలా- వేదన , అక్షర అస్త్రాలుగ  జేసి ,
ఉద్యమాల సంధించిన అక్షరసంధాపకుడు.॥

తెలంగాణ చైతన్యపు పోరు జోరు వారధి
ఉద్యమాలు సాగించిన ప్రజా రధపు సారధి ॥

నా గొడవ"  రచన జేసి,  పలుకు భాష సమర్ధించి
తెలంగాణ అభివృద్ధి ని,  సాధించిన  సాధనకుడు.॥

ఎన్నో పదవుల ప్రభువు , మరెన్నో రచనల కొలువు.

నేటికీ ' అతని  "జన్మదిన" వేడుక -
"తెలంగాణా ,-భాషాదినోత్సవం"గా , జరుపుకోబడడం ,    ప్రజల మదిలో, చిరస్థాయిగా నిలిచిపోయిన
అతని కీర్తికి   నిదర్శనం . అంతటి ఘన చరితుడు,
                "కాళోజీ" వందనీయుడు.
  -------------------------------------------------------------

చిలకమ్మ కధ.

తెలంగాణ ఆటవీ శాఖ, ములుగు రేంజ్ వారి,
తెలంగాణ సాహితీ లీడ్ ఫౌండేషన్ . కు
"ప్రపంచ ఓజోన్ డే " సందర్భంగా రాసినది.

శీర్షిక .
చిలకమ్మ కధ
------------
అందాల ఓ చిలుక,  ఆకాశమందునా
గూడు కట్టగ తలచి,  నింగి నెగిరీ పోయె ||

చెట్లు చేమలు నిండు, ఓ చిన్ని అడవిలో
గుబురు నిండిన  ఆకు, చివురు కొమ్మల నడుమ ,

ఏరి చేర్చెను ఎండు, పుల్లలెన్నో వెదికి
గూడు వెలసెను తుదికి,  సేద తీరగ మదికి ||

ముద్దు ముచ్చటవలసి , కోరి తానే వలచి
గోరింక తోడుగా. ,చిరు కూనలను సాకె ॥

కిచ  కిచలు అవి పలుక , చిన్ని రవముల తోడ
చిందులేసెను చిలుక,  గోరింక జత కలుప ||

ఏఏటి కా ఏడు,   తీరనీ భయమంట -
తరుల గూల్చెడి నరుల, ,మ్రొక్కి వేడెడిదంట ॥

గాలి, నీడ, ఫలము లిచ్చు, చెట్టు కొట్టవచ్చి నట్టి.
నరుని చుాచి వణికెడిది , నరుని తీరెరుగనిది ॥

ఎగరలేని కూనల ,  ప్రాణాలె పణమంట
చిలకమ్మ కంటిలో , కన్నీటి వరదంట ||॥

నమ్మలేనీ వింత , మరుగాయె వనమంత
నీడ నిచ్చెడి జాడ,  కానరాలేదంట ॥

తరుల జాడలు తరిగె. కొండ చరియలు విరిగె
చిలకమ్మ గూటికై  , చిరునీడ కరువాయె ||

( దయచేసి పర్యావరణ రక్షణ చేయండి )
-------------------------------------------------------

రచన. శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
కల్యాణ్  ( మహరాష్ట్ర  ).
  8097622021.

హామీ =
" చిలకమ్మ కధ " శీర్షిక గల ఈ కవిత,
ఏ మాధ్యమునందును ప్రచురితము కాని-
నా స్వీయ రచన.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర .

పచ్చ పచ్చ టి చెట్లు , ఫలములిచ్చెడి చెట్లు
పరుల కై ఉపయొాగకరమైన వౌ చెట్లు॥
ప్రాణ వాయువు నిచ్చు, ప్రాణ దాతయె తరువు
కడ తేర కలపిచ్చి , కరుణ చుాపెడు తనువు.॥
అట్టి మేటి తరు సంపద-నహరహము కాపాడి
ఆనంద, ఆరీగ్య- సీమలను ఏలండి...॥

( దయచేసి పర్యావరణ రక్షణ చేయండి )

--------------------------------------

"కాళోజీ" తెలంగాణ ఉద్యమ పోరాటకుడు పై కవిత.

నవయుగంబున నాజీ నగ్ననృత్యమింకెన్నాళ్ళు ......హింసపాపమని యెంచు దేశమున హిట్లరిత్వమింకెన్నాళ్ళు   అంటుా నినదించిన కాళోజీ...

తెలంగాణ తొలిపొద్దు*
*e కవితా సంకలనం*

శీర్షిక .
ఉద్యమ పోరాటకుడు.
--------------------------------
కాళోజీ..
తెలంగాణా ఉద్యమ ప్రతిధ్వని.
రాజకీయ చైతన్య సమాహార ప్రజాకవి.
, అనుభవం ఒక చోట, అధికారం ఇంకొకచోట..
అంటుా నిజాం నిరంకుశత్వ పాలనకు
వ్యతిరేకంగా పోరు సల్పిన
స్వాతంత్ర్య  సమర యొాధుడు.
"ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్ళ కలయిక"-
అంటుా అక్షర జ్యోతిని ప్రజ్వలించిన---
"ఆంధ్ర సారస్వత పరిషద్ వ్యవస్థాపక " సభ్యుడు.
చావు పుట్టుకల మధ్య బ్రతుకంతా , దేశంకోసమే..
అంటుా ఉద్యమించిన "పద్మవిభూాషణుడు".
అతని దేశభక్తి కై తెకంగాణా ప్రభుత్వం ,ప్రజలు,
అతని జన్మదినాన్ని "భాషోత్సవదినోత్సవంగా "
జరుపుకుంటుా అతని దేశభక్తికి పట్టంగట్టేరు.
"నా గొడవ", కావ్యంతో ' అక్షర తుాణీరాలను
సంధించిన  తెలంగాణ" ప్రజా ఉద్యమ పోరాటకుడు---
                               రచయిత  కాళోజీ .
                ----------------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
-------------------------



మెట్టినిల్లు కవిత.

వారం వారం  e కవిత, కోసం పంపినది.
అంశం   =   నమ్మకం.

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక .
మెట్టినిల్లు.
---------------
పుట్టిన దగ్గరనుండి పెరిగీ పెద్దయ్యే వరకు
అమ్మా నాన్నల  ప్రేమ, అనురాగాల మధ్య
ఎంతో  ముద్దుగా పెరుగుతుంది ఆడపిల్ల..
ఆడిందే ఆట , పాడిందే పాటగా పెరిగిన-
తనను , ఎవరో తెలియని మరొక కొత్త కుటుంబంతో  సంబంధాన్ని కలుపుకొని , ఒక కొత్త వ్యక్తితో
వివాహ బంధం పేరుతో ముాడు ముళ్ళుా వేయించి, ఇతనే నీభర్త, ఇకనుంచీ వీరే నీ కుటుంబం -
అని చెప్పి,  వారి వెంట వెళ్ళమన్నపుడు ,
ఆ అపరిచిత వ్యక్తుల తో ,  ఆనందంగా వారివెంట వారింటికి వెళుతున్న ,  ఒక ఆడపిల్లకు , అత్యంత "నమ్మకం" , వారంతా ఇక నుంచి తనవారని.
తనను తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమిస్తారని,
భర్తగా అతని అనురాగంలో ఆనంద డోలిక -
లుాగుతానని.
ఆ "నమ్మకం"తోనే,  పేగు బంధాన్ని  తెంచుకొని ,
రక్త సంబంధాలకు దుారమై ,
ఎప్పుడుా ఎరగని వారిమధ్యకు-
తన జీవిత చివరి దశ వరకు, తనను తాను
అర్పించుకునేందుకు ఆనందంగా ఏడడుగులు వేసి
అత్తింటికి చేరుతుంది ఒక ఆడపిల్ల .
ఆ "నమ్మకం"తోనే , పుట్టెడు బాధ్యతలను తనపై వేసుకుంటుంది.  ఆ ఇంటి వారసత్వానికి
ఆది ముాలమౌతుంది.
ఆ ఇల్లే తన ఇల్లనే "నమ్మకం" తో
ఆ ఇంటిని స్వర్గంలా తీర్చి దిద్దే ప్రయత్నంలో,
కష్ట- నష్టాలను ఓర్చుకుంటుా , ఆ కష్టం లోనే -
తన ఆనందాన్ని వెతుక్కుంటుా కొవ్వొత్తిలా--- కరిగిపోతుంది .
--------------------------------------------------

హామీ...
ఈ వచన కవిత ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని
నా స్వీయ రచన.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

Sunday, September 6, 2020

గురువుగారు రాసినది

9/5, 21:12] +91 94411 20047: జగదీశ్వరి గారు మీ రాసిన మున్నుడి చదివాక మీరంటే గౌరవం రెట్టింపు అయినది.. . ఈ వయసులోనే ఇంత సాధిస్తే , ఏభై మూడవ ఏట ఉన్న నాకు ఖచ్చితంగా మీరు స్ఫూర్తిని కలిగించారు..
సాహితీ కుసుమాంజలి.. 
గీతాశైలజ గారు , జనార్దన్ గారు చక్కగా సందేశాలు ఇచ్చారు
 🙏🙏🙏 విద్వత్ సంపద ఉన్నవారు వినయముగ ఉందురన మీరు చక్కటి ఉదాహరణ అండీ

Friday, September 4, 2020

చిలకమారి కవితల పోటీకి పంపినది. వాట్సప్ లో

[9/3, 19:07] iswarimurthy: శీర్షిక.
మానవ జీవితం- మానవతా విలువలు.
(వచన కవిత.)

రచన, శ్రీమతి , 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
iswarimurthy@gmail.com.
-------------------------------------------
-------------------------------------------------------
రోజు రోజుకుా మారుతున్న సమాజ పరిస్థితులు.
మనుషుల మధ్య దుారమౌతున్న మమతానురాగాలు.
కలసి ఉంటే కలదు సుఖం అన్న నాటి మాటలు.
నీ దారి నీది , నాదారి నాది , అంటున్న  నేటి రక్త సంబంధాలు.॥

అన్నీ ఉన్నా , ఏదో పోగొట్టుకున్న వెలితి  హృదయాలు.
అందరుా ఉన్నా ,  ఒంటరి జీవిత పోరాటాలు.
మనిషి జీవితం డబ్బుకు దాసొిహం అంటోంది.
రోజు రోజుకుా పెరుగుతున్న లైంగిక దాడులు.॥

మరోవైపు కరోనా పీడితుల హా హా కారాలు.
మందులేని మహమ్మారికి చికిత్స పేరుతో 
వేల రుాకల బిల్లుల వేధింపులు.
లాక్ డౌన్ బాధితుల నిరుద్యోగ సమస్యలు , 
బతుకు భారాల ఆత్మహత్యలు .॥

అమమ్మ, తాత నానమ్మల తో నిండుతున్న 
వృద్ధాశ్రమాలు.
అక్రమాలకు నెలవైన అనాధ  బాలల అశ్రమ అడ్డాలు.॥
నేను, నాది , అన్న భావాల వలలో చిక్కుకొన్న
 ఒంటరి పోరాటపు, ఏహ్య భావాలతో నేటి మానవుడు...॥
 
 ఎక్కడుంది నైతికత , ఎక్కడుంది ఆప్యాయత...
 ఎలా ఉంటుంది మానవత్వం, ఎటువంటిది బంధం-॥
 ఇవన్నీ ఎరుగని మార్గంలో నేటి భావి తరం.
వందే మాతరం...ఇవన్నీ భరిస్తున్న నీకు వందనం.॥
-----------------------------------------------------------------
[9/3, 19:10] iswarimurthy: "మానవ జీవితం మానవతా విలువలు"  అనే ఈ కవిత , ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
జగదీశ్వరీముార్తి.

మారుతున్న విద్యా విధానం. ఇష్టపది ప్రక్రియ లో

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
--------------------
శీర్షిక.
మారుతున్న విద్యా విధానం.
 
----------------------------------------

తలిదండృల బాధ్యత        తనిగ పెంచుట వరకె.
మహిని మను బాటలో       మార్గదర్శి  గురువే  ॥
తరమంతరించినా             తరం కదలినా,అది---
గురువుల కే సాధ్యం           గురువే ఇల దైవం...॥

అంతర్జాతీయపు                అనేక పరిణామపు--
ప్రభావాల ఫలితం              ఫల యొాచన లోపం.
విద్యారంగాల్లో                   వివిధ ఒత్తిడులు-
నాణ్యత గల విద్యలు        నలిగేటి శాపాలు॥

విద్యావ్యవస్థలవి               వీధి బడిన వేళలు
గురు శిష్య బంధాలు          గుడ్డి దారి నేను లలు॥
 గుణు లైన గురువులకు      గౌర-విలువల లోపం.
గురు బాధ్యత క్షీణం            గుణ శిష్యుల లోపం ॥

భవిష్యత్ ప్రణాళికల            బాధ్యతల బరువుకును -
మొరటు తేరె గురువులు      మొాడువారె బతుకులు.
కార్పరేట్ విద్యల                  కాలుష్య  విధానం.
ధర , విలువ విజ్ఞానం   -         ధనానికి అమ్మకం   ॥
.
కొనుగోలు పత్రాల              కొందారులనేకం .
విద్యార్ధుల ప్రగతి               వీధిపాలైన వైనం॥
నేడు విద్యల విలువ         నిలువు దోపిడీ వల           
సర్వేపల్లి సాటి                  సరి రాని గురువు లిల ॥
--------------------------------------------------------------------