Thursday, December 31, 2020

వెనుకబడిన బ్రాహ్మణులు

శీర్షిక.
వెనుక బడిన బ్రాహ్మణులు.
(వచన కవిత).
-------------------------------------
చతుర్వర్ణ  వ్యవస్థలో, సద్ధర్మ -సాంప్రదాయాలు పాటిస్తుా నిరంతర వేద పఠనం , శాస్త్ర ప్రకార నియమాను బధ్దంగా, ప్రజలను తీర్చి దిద్దే విధంగా భక్తి ,జ్ఞాన, వైరాగ్యాల బోధనలతో పాటు, సత్య ధర్మ వర్తనలను ప్రజలకు బోధిస్తుా, సమాజాభ్యున్నతికి 
పాటుపడేవారు బ్రాహ్మణులు.
 బ్రిటిష్ వారి ద్వారా తేబడిన పురాతన సామాజిక నిర్మాణ పతనం కారణంగా ,సమాజం లో మార్పులతో పాటు , వ్యక్తుల మానసిక ఆలోచనా విధానాల లో చోటుచేసుకున్న , జాతి ,మత ,విభేదాల కారణంగా , వంశపారంపర్య కులవృత్తిగా' ,పుజారులుగా, విద్యా బోధనోపాధ్యాయులుగా ఉన్న  బ్రాహ్మణుల బ్రతుకులు చాలీ చాలని వేతనాలతో ,  ఆర్ధికంగా చితికిపోయి., కుటుంబవపోషణ దుర్భరమవడమే కాక , రాను రాను బ్రాహ్మణుల పరిస్థితి క్షీణిస్తుా,  ఏవిధమైన రిజర్వేషన్లుా లేక వెనకబడి పోతున్నది.
సద్ధర్మ  వేద పరాయణులైన వీరికి గవర్నమెంటువారు సరైన  జీవితావకాశాలు కల్పించి , ఆర్ధికంగా ఆదుకునే ప్రయత్నం చేయాలని నా విన్నపం.
-------------------------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).

Wednesday, December 30, 2020

మధురిమలు...నిబంధనలు

*🌹మధురిమలు 🌹*
*================*
*తేది: 29/12/2020* మంగళ వారం రోజున      *మధురిమలు* 
రాసిన కవులకు అభినందనలు
🙏🙏💐💐🌹🌹💐💐

*🌹నేటి విజేతలు🌹*
*=============*
*ప్రథమ విజేత:*
🏆🥇🏆🥈

👉 కె. వై. రత్నం గారు

*ద్వితీయ విజేత:*
🏆🥉🏆🥇

👉 నరేందర్ రెడ్డి దన్నవరం  గారు

*తృతీయ విజేత:*
🏆🥈🏆🥉 

👉 వసంత ఇంజపురి గారు

*ప్రోత్సాహక విజేతలు*
🏆🥈🏆🥉🏆

👉1. జె. రాజ నరేందర్రెడ్డి గారు

👉2. గుంటూరు లక్ష్మణరావు గారు 

👉3. మోటూరి అర్పిత గారు

👉4. టి. ఆనందాచారి గారు

👉5. సుబ్బా జ్యోత్స్నదేవి గారు

👉6. కుందారపు గురుమూర్తి గారు

నేటి విజేతలకు అభినందనలు 
💐💐💐💐🙏🙏🙏🙏
*మధురిమలు* నూతన కవితా ప్రక్రియ 
సృష్టి కర్త: *ఈర్ల సమ్మయ్య గారు*  

*నిర్వాహకులు*
*==========*
🌳🌳🌳🌳
1. ముసిపట్ల రఘునందన్ గారు
2. కల్వల రాజశేఖర్ రెడ్డి గారు

*పరిశీలకులు*
*=========*
🌲🌲🌲🌲

1. శంకరయ్య మాదగాని గారు

2. కె. వినయ్ కుమార్ గారు

🌹🌹🌹🌹🌹🌹🌹🌹
======================
రోజుకొకటి చొప్పున 
👉 *108 మధురిమలు*  రాసిన కవులకు *మధుర కవి భూషణ* 
👉 *500 మధురిమలు* రాసిన కవులకు *మధురకవి విభూషణ*
👉 *1000 మధురిమలు*  రాసిన కవులకు *మధురకవి విశిష్ట* పురస్కారం అందించబడును.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
*=====================*
*మధురకవి భూషణ పురస్కార గ్రహీతలు*
1. శ్రీమతి డా. సూర్యదేవర రాధారాణి గారు
2. శ్రీ తాటిపాముల రమేష్ గారు
3. శ్రీ నరేందర్రెడ్డి దన్నవరం గారు
4. శ్రీ కడలి ప్రకాశరావు గారు
5. శ్రీమతి గాజుల భారతి శ్రీనివాస్ గారు
6. శ్రీమతి చిలువేరు నాగమణి గారు
7. శ్రీ పాండురంగ విఠల్ గారు
8. శ్రీ రోణంకి విశ్వేశ్వరరావు గారు
9. శ్రీమతి సుబ్బా జ్యోత్స్నదేవి గారు

Tuesday, December 29, 2020

సహనం.

27/12/2020  ప్రధమ బహుమతి పొందిన కధ 
వారం వారం గోరసం వారి కధానిక శీర్షిక పోటీ కొరకు..
అంశం : సహనం.
శీర్షిక : ఇల్లాలు.

అమ్మ  రోజుా పొద్దున్నే లేచి  ఆదరా బాదరా పరుగెత్తుతున్నట్టే  పని చేసేది. నన్ను తమ్ముడిని  స్కుాల్ కు తయారు చేసేందుకు , నాన్నకు, చిన్నాన్నలకు భోజనానికై కేరేజీలు కట్టేందుకు...
నానమ్మ పుాజకు నైవేద్యం కోసం ప్రసాదం చేసిచ్చేది .
అత్తయ్యలకోసం కాఫీ ఫ్లాస్క్ లో పొిసి ఉంచేది. 
అటు తర్వాత మా స్కుాల్ బేగ్ లు తను మొాస్తుా 
మమ్మల్ని స్కుాలుకు తీసుకు వెళ్లేది. 
మధ్యలో మార్కెట్ కు వెళ్ళి రోజుా కావలసిన కుారలు సామానులు తీసుకు వచ్చేది .తిరిగి సాయంత్రం మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లకడానికని స్కుాల్ కు వచ్చేది. అటుపై మళ్ళీ పరుగులే ..మాకు టిఫిన్ పెట్టి, రాత్రి వంట చేసి , మా ఇద్దరి చేత హోమ్ వర్క్ చేయించి రాత్రి భోజనాలయ్యేక గిన్నెలన్నీ తోమి , తిరిగి పొద్దున్న మాకోసం చేయవలసిన టిఫెన్స్ కోసం అన్నీ రెడీ గా పెట్టుకొనేది. పనమ్మాయిని పెట్టుకొమ్మని అంటే ..మీ ఇద్దరుా బాగా చదువుకొని పెద్ద ఉద్యాగాలు చేస్తే అప్పుడు హాయిగా పనమ్మాయిని పెట్టుకుంటాననేది.
ఆపై మా స్కుాలు యుానిఫామ్స్ ఇస్త్రీ చేసి పెట్టేది.
పడుకోడానికే రాత్రి పదకొండు దాటేది. ఆది వారాలు అమ్మ పడే కష్టం అంతా ఇంతా కాదు. రోజుా తెల్లారి నాలుగుకే లేచే అమ్మ ఇల్లంతా సుభ్రం చేసి , వాకిలి తుడిచి ముగ్గు పెట్టడం తో మొదలైన దిన చర్య...
రాత్రి పదకొండు దాకా సాగేది. అంత పని చేస్తున్నా ముఖంలో అలసటని మరపించే చిరునవ్వు పులుముకొని , మా అల్లరిని భరిస్తుా...
నాన్న విసుగును సమర్ధుస్తుా , నానమ్మ సాధింపుకు తలవంచుతుా..ఎంతో సహనంతో ఇంటి పనులు చేసుకుపోతున్న అమ్మని చుాస్తుా ఉంటే నాకు ఆశ్ఛర్యం వేసేది 
కొవ్వొత్తిలా కరిగిపోతున్న అమ్మ విలువ నా పెళ్ళి అయ్యేదాక దాక నాకు తెలియనే లేదు. అన్నీ అమ్మని అడిగి చేయించుకొనే నేను ఒక్క రోజు కుాడా అమ్మకు చేతి సాయాన్ని అందించ లేదు. కనీసం బయట పనైనా చేసేవాడిని కాదు.  పైగా అమ్మ నేను అడిగింది చేయలేదని విసుక్కునే వాడిని.  అలిగే వాడిని  ..తమ్మడు మరో రకంగా అల్లరి...అన్నీ ఆనందంగా భరిస్తుా బండెడు చాకిరీని చేస్తున్న అమ్మ నాకు నా ఇల్లాలిలో కనిపించేది..  సహనానికి మారు  పేరైన ఇల్లాలు. తన ఊరు పేరుా మారినా , తన పనితనం, సహనంతో మరో ఇంటికి దీపమై వెలుగు నింపుతున్న నిస్వార్ధ  కర్మచారిణి కదుా ఇల్లాలు.
ఒక ఇంట్లో పుట్టి వేరొకరింటిని మెట్టి అక్కడివారందరినీ తనవారిగా భావించి , నేను నా ఇల్లు , నా పిల్లలు, నా పరివారం, అన్న  అంకిత భావంతో
ఎంతో ఆనందంగా తనని తాను అర్పించుకున్న ఒక ఇల్లాలిని మించిన సహన శీలి వేరెవరుంటారు...?



రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .

యుద్ధం.

9/12/2020.
అంశం: యుద్ధం.
శీర్షిక : ఆడతనం.

అమ్మ కడుపులో నుండే ఆడపిల్లనని  
తెలియగానే ఛీత్కార ఛీదరింపులను
విదిలించుకొనే యుద్ధం.
ఆడ పిల్లనంటుా  అణచి వేతలకు గురైన అత్మ క్షోభతో
 స్వతంత్రత కోసం ఆలోచనలతో యుద్ధం.
 ఎప్పుడు ఎవరుఏమంటారో అని భయంతో  ధైర్యాన్ని కుాడగొట్టుకునేందుకు మనసుతో  యుద్ధం.
పెద్దవుతున్న కొలదీ ఆడతనపు ఆత్మ రక్షణకై యుద్ధం.
వయసు తెచ్చిన ఆడతనపు శారీరపు మార్పులను
కాముకుల కుృార దృష్టి నుండి తప్పించుకుంటుా
అనుకున్న గమ్యానికి చేరుకోడానికి 
ఆత్మస్థైర్యం పెంచుకునేందుకు అంతరాత్మతో యుద్ధం.
 పెళ్ళయ్యాక అత్తింటి వాతావరణానికి
 అలవాటు  పడుతుా,లోక మర్యాద కోసం చిరునవ్వుతో చేసే జీవితాంత యుద్ధం..
 ఇలా ఆడపిల్లగా తనకిష్టం లేని ఎన్నో
 పద్ధతులను తనవిగా చేసుకుంటుా అన్నింటికీ
 సద్దుకు పోవడానికి నిరంతరం చేసే పోరాటపు
 యుద్ధంలో ప్రతీక్షణం ఓడపోతుా ఎదుటివారిని 
 గెలిపిస్తుా చిరునవ్వుతో చివరి శ్వాశ దాకా 
 తనను తాను బైట పెట్టుకోలేని అశక్తతతో ,
 చంపుకోలేని తీరని ఆశల తో అనుక్షణం చేసే యుద్ధం.
 అసలు ఆడతనమే నేటి సమాజంలో స్వతంత్రం గాని
సమాన హక్కులు గాని లేని ఆరని కన్నీటి యుద్ధం.॥

(ఈ యుద్ధంలో ఆడపిల్లది తప్ప అందరిదీ గెలుపే..
అనుకుంటున్న వారంతా...
తానోడిపోతుా అందర్నీ గెలిపిస్తున్న ఆడతనపు
విలువని  ఈ సమాజం  ఎన్నాళ్ళకు గుర్తిస్తుందో ॥)
 
 
 రచన : శ్రీమతి :  జగదిుశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.


హామీ; ఈ కవిత ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని నా స్వీయ రచన.

Monday, December 28, 2020

చిమ్నీలు...పురస్కార వివరణ .

చిమ్నీలు
............
1.ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి.
2.ఒక్కొక్క పాదములో ఏడు నుంచి పది మాత్రలు వాడవచ్చు.
3.ఒకటి.. మూడు పాదాల చివర ఒక అంత్యప్రాస వాడాలి
4.రెండు.. నాలుగు పాదాల చివర ఒక అంత్యప్రాస వాడాలి
ఉదాహరణకు
1) 
మనసు కలసిన
ప్రేమ చిగురించును
కలత పెరిగిన
ప్రేమ నశించును

బుద్ధుడు చెప్పెను
శాంతి మంత్రము
..జాధవ్ పుండలిక్ రావు పాటిల్
9441333315
చిమ్నీలు రూపకర్త
.........................
కవివర్యులకు దండాలు
ప్రతి రోజు ఒకరు ఒకటి మాత్రమే రాయాలి.
మంచిగా ఉన్న దానిని ఎన్నిక చేసి, ప్రథమ, ద్వితీయ, తృతీయ గా ప్రకటించబడును.
వాదనలకు తావుండదు.పెద్ద మనసు తో అంగీకరించాలని కోరుతున్నాను.
తమరు రాసే చిమ్నీలకు క్రమసంఖ్య వేసుకోవాలి.వంద చిమ్నీలు రాసిన వారికి *తెలుగు వెలగు దివ్వె పురస్కారం*200 చిమ్నీలు రాసిన వారికి దివ్యజ్యోతి పురస్కారం అందజేయబడును
*****************************
 ప్రకటించబడును.


[12/27, 15:19] 
+91 94923 39689: 
వెలుగు దివ్వె పురస్కారం అందుకోనున్న జగదీశ్వరి మేడం గారికి శుభాభినందనలు 💐💐💐💐💐 గుంటూరు లక్ష్మణరావు.

[12/27, 17:56] 
+91 94250 12468: 
100 చిమ్నీలు రచించిన మీకు శుభాభినందనలు 
జగదీశ్వరి గారు
💐💐💐😊👏👏👏.

[12/27, 19:38] +91 99590 32917: చిమ్నిలప్రక్రియలో శతాధిక కవితలు రాసి
" వెలుగు దివ్య" పురస్కారంకు ఎంపికైన
 శ్రీ మతి  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తిగారికి శుభాభివందనాలు 💐👏

[12/27, 19:44] 
+91 96032 05109: 
"వెలుగు దివ్వె" పురస్కారం అందుకోనున్న 
జగదీశ్వరి మేడమ్ గారికి శుభాభినందనలు.
 💐💐💐💐💐


Sunday, December 27, 2020

పాశురము 12." శ్రీదర" నామార్చన .

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

పాశురము 12.   ("శ్రీధర" నామార్చన.)
----------------------------------------------------
పల్లవి :
శ్రీ శబ్ద వాచ్య యైన శ్రీమహా లక్ష్మి ని
వక్ష స్థల  మందిడిన  గుణధాముని శ్రీధరుని॥

అనుపల్లవి :
చక్ర గదా శంఖ పద్మ ధరుని   కమల నాభుని
వేద మంత్రార్చిత పద  వైకుంఠ నాధునీ
వరగుణ శ్రీ ధామునీ .....॥

లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....॥

చరణం:
లేగ దుాడలు తల్లి గోవు పొదుగు  తడమగ
పొదుగు నిండిన ప్రేమ ధారలై కురిసే...
యేరులై పారేటి  పాడి నిండిన నల్ల-
గొల్ల వాని చెల్లెలా వాదమేల తరలిరా.... ॥

లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....॥

చరణం:
రావణాంతకుడైన రామ చంద్రుని కొలువ
నామ గానము కన్నా మించు జపము ఏదీ...
సీమాటి ! నిను పిలువ  నిదుర మత్తేలనే
నమ్మి - కొలువగ రావే నళినాక్షి నాధునీ...॥

లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....॥

శ్రీ శబ్ద వాచ్య యైన శ్రీమహా లక్ష్మి ని
వక్ష స్థల  మందిడిన  గుణధాముని శ్రీధరుని॥

చక్ర గదా శంఖ పద్మ ధరుని   కమల నాభుని
వేద మంత్రార్చిత పద  వైకుంఠ నాధునీ
వరగుణ శ్రీ ధామునీ .....॥

లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా
వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....॥

రైతు బొమ్మ

రైతు ఉద్యమ కవిత 6
     చలి చొక్కా
                    - చిత్తలూరి

చలిప్పుడో
కొత్త చొక్కా తొడుక్కుంది
చొక్కా మీద
రైతు పోరు బొమ్మలు
విత్తనాలు చల్లే పిడికిళ్లు
గాల్లో బుల్లెట్లను ఒడిసిపడుతున్నాయి
ఆకుపచ్చ చిత్రాల్ని గీసే పనిముట్లు
ఆయుధాలుగా  వ్యూహాలు రచిస్తూ
రోడ్డు మీద పరేడు చేస్తున్నాయి
చుట్టూ అలుముకున్న చలి నెగళ్లు
చలిని తరిమేసే పనిలో
నిమగ్నమయ్యాయి

చలి మంటలకు చేతులు
కాపడం పెట్టుకుంటున్న దేహాలు వేడెక్కి‌ 
పదునైన ఆయుధాలుగా రూపొందుతూ
సరికొత్త యుద్ధ వ్యూహాలు రచిస్తున్నాయి
చలి చొక్కా మీద
ఇపుడు తిరుగుబాటు బొమ్మలు
పిడికెళ్లెత్తిన చేతులు
చేతుల చివర నాగళ్లు
పలుగులూ పారలూ
ఇక నియంత పీఠం కింద
పెకలింపు మొదలైంది

                - చిత్తలూరి

Saturday, December 26, 2020

రైతే రాజు

[12/25, 13:55] +91 91338 32246: ఆకుపచ్చని యోధులు
                            - చిత్తలూరి

నువ్వూదగానే ఎగిరిపోవటానికి
తాలుగింజ కాదు
చిన్న సుడిగాలికే రాలిపోవటానికి
పండుటాకు కాదు
నీ హుంకరింపులకు, నీ అజమాయిషీలకు
నీ చట్టాల తాటాకు చప్పుళ్లకు
బెదిరిపోయే కుందేళ్లు కాదు 
నీ రాజ్యం ఎత్తుగడల ముంపుకు
కొట్టుకుపోయే పంటచేలు కాదు
నువ్వూదగానే చెదిరిపోతున్న 
నివురును చూసి మురిసిపోకు
తేటపడి కణకణ మండే
నిప్పురవ్వల మెరుపు చూడు

కుప్పనూర్చటమే కాదు 
నియంతృత్వాన్ని కడతేర్చటం
తెలిసిన ఆకుపచ్చని యోధుల
వీరత్వం చూడు 
పెనుమంటలు ఎగిసిపడే యుద్ధభూమి
నీకోసం‌ సిద్ధమిపుడు!

                      - చిత్తలూరి
[12/25, 13:56] +91 91338 32246: ఆకుపచ్చని యోధులు
                            - చిత్తలూరి

నువ్వూదగానే ఎగిరిపోవటానికి
తాలుగింజ కాదు
చిన్న సుడిగాలికే రాలిపోవటానికి
పండుటాకు కాదు
నీ హుంకరింపులకు, నీ అజమాయిషీలకు
నీ చట్టాల తాటాకు చప్పుళ్లకు
బెదిరిపోయే కుందేళ్లు కాదు 
నీ రాజ్యం ఎత్తుగడల ముంపుకు
కొట్టుకుపోయే పంటచేలు కాదు
నువ్వూదగానే చెదిరిపోతున్న 
నివురును చూసి మురిసిపోకు
తేటపడి కణకణ మండే
నిప్పురవ్వల మెరుపు చూడు

కుప్పనూర్చటమే కాదు 
నియంతృత్వాన్ని కడతేర్చటం
తెలిసిన ఆకుపచ్చని యోధుల
వీరత్వం చూడు 
పెనుమంటలు ఎగిసిపడే యుద్ధభూమి
నీకోసం‌ సిద్ధమిపుడు!

                      - చిత్తలూరి
[12/25, 14:53] +91 91338 32246: రైతు ఉద్యమ కవిత 5        
         ఉక్కుపాదాల కింద
                               - చిత్తలూరి

దేశం నిండా బువ్వ పూలు పూయించి
ఆకలి కంపును చెదరగొట్టటమే తెలుసు
చారెడు నేలను దున్ని
దేశానికి ఆకుపచ్చని గొడుగుపట్టటమే
అతని చేతికి తెలిసిన విద్య

అన్నం పెట్టే చేతులను
నరకాలని చూసే క్రూరత్వమా
తన కన్నీళ్లతో ఈ లోకం
కన్నీటిని శుద్ధి చేసేవాడు
తన చెమటచుక్కలతో ఈ సంఘాన్ని
ఆకుపచ్చగా స్నానం చేయించేవాడతను
అతని పైన వాటర్ క్యానన్లా
గట్టి గింజల్ని ప్రోదిచేసి
జాతికి జవజీవాలను
బహుకరించేవాడు
అతని పైకి బుక్లెట్ల వర్షమా

చలికి వెచ్చదనం,వేసవికి చల్లదనం
ఆకలి కడుపుకింత‌ అన్నం
మట్టిని పిసికి పంటను వెలికితీసే
మహాద్భుత శ్రమతత్వం అతనిది
చట్టాల జులుములేంది
పంట భూమిని కళేబరం చేసే
రాబందుల కొలువులేంది

ఈ దేశం బిడ్డకు అమ్మ ప్రేమ
అమ్మపై జులుమేంది
ఈ దేశం అస్తిత్వానికి నాన్న భరోసా
నాన్నపై దౌర్జన్యమేంది
బువ్వ పెట్టే‌ నేలపై ఆ తొక్కుడేంది
మొలకెత్తించటమే కాదు
నీ ఉక్కు పాదాల కింద రెండుగా చీలి
అగాధం సృష్టించటం కూడా
అతనికి తెలిసిన విద్యే

              - చిత్తలూరి
[12/25, 22:17] +91 94943 33511: రైతు గర్జన
-----------
పల్లవి.....*
---------
అన్నో... అన్నో... అన్న మాయన్నా
అన్నోరి మాయన్న... అన్నమాయన్నా..3

అన్నొరి మాయాన్న... అన్న రైతన్నా...3
అడుగులో అడుగేసి ... దండుకదిలింది........3

చరణం...1
-------
పిడికిలి బిగించి రైతు కదిలండు
పోరు జెండా లెత్తి... రైతు కదిలండు...3
అన్నోరి మాయాన్నా... అన్న రైతన్నా...3

భూములు కాజేసే రాబందులును
తరిమి కొట్టంగా రైతు కదిలెండు

చరణం..2
----------
అంబానీ ఆదాని సెంకన జేరిన
పెట్టు బడి దార్లు పెద్దన్న లాగున్న
మోడీనీ నిలదీయ రైతు కదిలెండు
నల్ల చట్టాలను తగుల బెట్టంగా
                                   (అన్నోరీ...2)
చరణం...3
---------
మెట్టు.. పల్లం భూమి 
పట్టుకు పోయేటి
గిట్టు బాటు ధర లేకుండా చేసేటి
నిత్యావసరాసరుకు  ....
ధరలనుపెంచేటి...
చట్టాలు వెంటనే రద్దు చేయాలని....

జట్టూ కట్టి రైతు దండు కదిలింది
డిల్లీనీ... నేడు..ముట్టడి చేసింది
అన్నోరి... నాయాన్న... అన్న రైతన్నా
అన్నోరీ మాయన్న... అన్న మాయన్న...

చరణం..4
--------
ఎముకలు కొరికేటి చలిని తట్టుకునీ
నల్ల చట్టాలను తగుల బెట్టంగా..
పాలకుల కుట్రలు మంట బెట్టంగా
భుజం భుజం కలిపి రైతు కదిలిండు
వుప్పెనై డిల్లీ నీ ముట్టడించేండు...

అన్నోరీ నాయన్న... అన్న రైతన్నా...3

దేశమంతా ఒక్కటైంది చూడు
రైతుకి అండగా నిలిచింది నేడు
నీ అటలింక మరి సాగవు మోడీ
పోరుబాట ఇంక ఆగదు చూడు

చరణం...5
-----------

కస్ట జీవులంతా ఒక్కటైనారు
పాలకులకు ....
పిండం పెట్టబోతున్నారు

అది గదిగో... అదిగదిగో
మోగింది చూడు.... 
రైతు సంఘాల గర్జన నేడు..
జట్టు కట్టి రైతు దండు కదిలింది
అది.. పోరు జెండాఅయి
ఎగురు తున్నాధి....3


                     రెడ్డి శంకరరావు

Friday, December 25, 2020

పాశురము 9.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : శంఖ పద్మ గదా....
పాశురము 9.


పల్లవి:
శంఖ పద్మ గదా చక్రము ధరియించీ 
మధు నామక అసురుని  రయమున దృుంచీ...

అనుపల్లవి:
సాత్విక లోకానందా  సార జన శుభేచ్ఛా
మధుర భక్ష్య  ఫలదాతా మాధవ మదుసుాదనా ॥
కొలువ రారే చెలులుా కోరి విభుని పదములుా 
పిలువ రారే సఖులుా పుాజింప హరినీ ॥

చరణం:
రతనాల మేడలో రమ్య మణి ద్యుతులుా
దీపకాంతులు దివ్య గంధ పరిమళములుా
మిళితమౌ సాంబ్రాణి సౌరభమ్ములుజిమ్మ 
మత్తు నిదురబోవు ముదిత లేవమ్మా..॥

చరణం: 
వేల నామాల విభుని కీర్తించు చుండగా
యేల పలుకవు నీవు మా ముద్దు గుమ్మా
పుాల పరిమళ మొప్పు హంస తుాలిక పైన
చేరి నిద్దుర పోవు తరుణి లేవమ్మా ! లేచి రావమ్మా  ॥

చరణం: 
అత్త కుాతురా! వేగ తెమిలి రావమ్మా !
చిత్త చోరుడు మేటి వేల్పు గదా మనకుా..
పుత్తడి బొమ్మా ! వేగ కదలి రావమ్మా !
కీర్తింప మముగుాడీ  పుాజింప హరినీ శ్రీ రంగ నాధునీ ॥

రండి రండే చెలులుా  చెలియ లేపి రండే 
రంగనాధుని కొలువ త్వరగ తెమిలి రండే...॥

Wednesday, December 23, 2020

చిన్ని కృష్ణుడు

మహతీ సాహితీ కవి సంగమం
పర్యవేక్షణ: డా: అడిగొప్పుల సదయ్యగారు
తేది: 23.12.2020  బుధవారం
అంశం: ధనుర్మాస కవితోత్సవం
ప్రక్రియ: వచన కవిత
నిర్వహణ: శ్రీమతి యాంసాని లక్ష్మీ రాజేందరు గారు
రచన: చయనం శివ రామ కృష్ణ మూర్తి
ఊరు : సికింద్రాబాద్ - 500 061
చరవాణి : 9866102590

శీర్షిక: శిఖిపించమౌళి
******************
తెల్లవార వచ్చె తరుణులార
పాలు పితుకు వేళాయె పడతులార
గోధూళి వేళాయె గోపకులార
గోపూజవేళాయె బ్రాహ్మణులార

నల్లని కురులు చక్కగా చుట్టి
నల్లని కనుబొమ్మల నల్ల కాటుకపట్టి
నగు మోము మీద కస్తూరి బొట్టుపెట్టి
నును బుగ్గమీద నల్ల చాదు చుక్కపెట్టి

మోహను గాంచి మైమరిచె ఆ యశోద
మృత్తిక నారగించె ఆ మధుకరుడు
మన్ను తినెనంచు మొరపెట్టె రాముడు
మూడులోకములు చూపె ఆ మురారి

ముగ్ద రూపముననేగు దెంచె మాయవి
మురిపించి వడిచేరె వాత్సల్యుడు
ముద్దు చేసి చనుబాలిచ్చె పూతన
మహిషవాహను చెంత చేర్చె హరి

ఎంత పుణ్యము చేసె ఆ శిఖిపించము
ఎమి పుణ్యము చేసె ఆ పిల్లనగ్రోవి
ఎక్కదెక్కడ తిరిగె ఆ గోవు నీ చెంతచేరె
ఏమి చేయ నీ దయాద్ర చూపు దొరకు నాకు

చయనం శివ రామ కృష్ణ మూర్తి

ఇంద్రప్రస్త శ్రీనివాస్ గారి కవిత. రౌద్రగీతాలాపన

#రౌద్రగీతాలాపన 

నాదేశం లో 
చెట్లకు ఉరితాళ్లు  కాస్తాయి 
టీవీ లకు 
సెలెబ్రిటీలు పుడతారు 
పంటలకు రాజకీయతెగుళ్లు పడతాయి 
దేశమంతటా పాపం విరివిగా పండుతుంది 
ధనవంతులకు కొత్త రెక్కలు వస్తాయి 
దరిద్రుల ఉన్న రెక్కలు విరుగుతాయి 

వార్తలు చేయి తడుపుకొని 
జనం మీద అబద్దాల వాంతులు చేసుకుంటాయి
పత్రికలు నిలువెత్తుగా పరమపదిస్తాయి 

రోడ్ల కన్నా అందం గా 
ప్రయివేట్ పార్ట్లు బహిరంగ ప్రదేశాలై టాటూలు తలెత్తుకొని తళ తళ మెరుస్తుంటాయి 

చెత్త కుండీ లో దొరికే 
టెడ్డి బేర్ ను 
ఉతుక్కొని కడుక్కొని ఆడుకునే పిల్లల్లో మాతృదేశం 
వంశాభివృద్ధి శరవేగగం గా పురుడుపోసుకుంటుంది 

రోడ్డు మీద 
ఎవడో బీరు తాగి పడేస్తే 
ఆ ఖాళీ సీసాలు సేకరిస్తూ ఖాళీ కడుపుల్ని నింపుకునే 
మనుషులు లెక్కల్లోకి రారు 
వాళ్ళను ఎవ్వరూ లెక్క పెట్టరు 

తరగతి గదుల్లో 
మొద్దు బారిన తలకాయల్లో 
ప్యాకేజిల దౌర్భాగ్యం పురి విప్పుకొని 
చేతుల్లో డిగ్రీలు 
బానిసలుగా  ప్రశంసాపత్రాలై మెరుస్తుంటే 
మేథావులు సామాన్యల మెడలు వొంచి పేరుగడించే ఆరాటం లో 
విలువలు, విశ్లేషణలు రమించు కొని 
పుట్టే రసకందాయ చూపుల్లో 
భావ దారిద్య్రం బట్టలు లేకుండా 
క్లబ్ నో కన్ను గా 
పబ్ నో కన్ను గా 
వెన్ను విరుచుకుంటూ అర్ధరాత్రి ఆవలిస్తూ 
ఉదయానికి ఉపాధ్ఘాతాలకు ఉపక్రమిస్తుంది 

అమ్మిన వాడు అధోగతిపాలై  అదే ఊళ్ళో 
అడుక్కుతింటుంటే 
కొన్న వాడు కోరికల్ని సొంత పాదాల కింద ఆనందం గా నలుపుకుంటూ 
మనుషుల్లో ఉన్నత శ్రేణి అని పేర్కొంటున్న ఉన్నోళ్లకు పుట్టిన కళ్ళకు 
పురుగుల్లా కనిపిస్తూ 
కార్లకు, షికార్లకు 
దూరం గా తప్పుకుంటుంటారు

మీకు పెద్ద పెద్ద 
భవనాల మీద 
అద్భుతమైన రంగులు, చిత్రమాలికలు కనిపిస్తాయి కదా 
అవి నాకు నెత్తురు మరకల్లా గోచరిస్తాయి 
వాళ్ళ పద్ధతులు, ఆచార వ్యవహారాలు 
నా ముందు తరాలకు ఆదర్శం అవుతుంటే 
నాకు అమితానందమే 
కానీ చచ్చే దాక వాడి పాదాలోత్తుకుంటూనే మురిసి పోతాం అంటే 
నేను మీ మొహాల మీద ఉమ్మేయడానికి కుడా 
వెనకాడను 

నీకిప్పుడు 
వినోదం కాదు 
నీ దయనీయ స్థితిని చీము నెత్తురు తో చిత్రించే ఒక చలన చిత్రం కావాలి నీ అడుగు 

కమ్మని కోయిలల గొంతులు కాదు 
నీలో చచ్చిన ఆత్మగౌరవం పునర్జీవించే 
రౌద్ర గీతాలాపన ప్రభవించాలి 

బుర్ర నింపే బూజు పట్టిన 
రంకు చరిత్రల సిలబస్లు కాదు
మెదడులో భూకంపం పుట్టే 
ఆలోచనలకు ఆయువు పొసే 
నికార్సైన అక్షర జ్ఞానం కావాలి 

మనుషులల్ని అసహ్యించుకునే 
మనుషులు నా కంటి కి 
పందుల మలమూత్రాల్లా కనిపిస్తుంటారు

పుట్టడం వెనక చావడం వెనక 
దేవుడి చిత్తశుద్ధి
ద్రోహులకు పంచభక్ష్య పరమాన్నాలను ప్రసాదిస్తుంది
నీలో నెత్తురు అడుగంటుతుంటే 
చరిత్ర నీ మలమూత్రాలతో 
చేతులు కడుక్కునే ప్రయత్నం లో నీ కన్నా ఓ అడుగు ముందే ఉంటుంది 

నీ సంతోషం పక్కవాడి సంతోషం అయ్యింది కానీ 
నీ బాధ పంచుకునే మహాత్ముడు నీ జీవితంలో ఎదురు పడ్డాడా!

నిన్ను నీవు గుర్తించుకో ముందు 
నువ్వో ఏకాకి వి 
నీ పిండం ముట్టడానికి కాకులు కుడా వెనకాడే వేదకాలం నాటి 
వెనుకబాటు, దరిద్రాలే నేటికీ  నీ  ఆస్తి పాస్తులు

Indrapala Srinivas

Tuesday, December 22, 2020

పాశురములు 1 నుండి 13 వరకు.

పాశురములు 1 నుండి 13 వరకు.
---------------------------------------------
పాశురము 1
1 6 /12/2020.
ప్రతీ తోజుా కవితా పండగే కొరకు.
మహతీ  సాహితీ  కవిసంగమం - కరీంనగరం..
*ధనుర్మాస కవితోత్సవాలు..*
పర్యవేక్షణ: శ్రీ డా. అడిగొప్పుల సదయ్యగారు
నిర్వహణ: శ్రీమతి యాంసాని లక్ష్మీరాజేందర్ గారు..

అంశం :   గోదాదేవి (ఆండాళ్ ).
శీర్షిక  : 1..వ పాశురము
ప్రక్రియ : గేయ రచన.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
-------------

పల్లవి:
మేలుకొల్పులు చేయ  వేల నుతులను పాడ
శ్రీ రంగనాధునీ చిన్మయస్వరుాపుని
అను పల్లవి:
పొద్దు పొడవకమునుపె పుాలంగి సేవలా
నాధు కొలువగ రండి  వేద కీర్తుల వేడ॥మేలుకో
చరణం:
తొలి పొద్దు పొడచేను తరుణులారా లెండు
కలిదీర్చు కమలాక్షు కొలువ రారే వేగ
ఫలియించు మీ కోర్కె పడతులారా రండి
మార్గశిర స్నానమిడి మన వేల్పు కొలవండి..॥మేలుకో
చరణం:
స్వర్గ ద్వారము తెరచి యుండు ఘన మాసము
మార్గశిర వ్రత దీక్ష పుాన మహిమలు ఘనము
దుర్గమౌ దురితమ్ముల శమియింపు నీ నోము
దీర్ఘ యశముల బడయు దివ్యమైనది మనుము॥
చరణం:
నిదుర చాలింపుమని నీలమేఘ శ్యాముని
మధుర మంగళ వాద్య వేద ఘోషల తోడ
మేల్కొల్పగారారే మీన నేత్రపు ఘనుని
నందగోపాలనీ  రేపల్లె బాలునీ ॥
చరణం:
సుర్య చంద్ర సమ తేజము నిండిన
సుందర వినీల దేహ సుందరుని
నంద యశోదలా నమ్మక వర పుత్రునీ
నటన సుాత్ర ధారి నగధరునీ మాధవునీ ॥
------------------------------------------------------
పాశురము 2 .
తేది: 17.12.2020
ప్రక్రియ: గేయ రచన.
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ -మహారాష్ట్ర

పల్లవి:---------
నోముతీరును వినరే నొద్దికగా చెలలుా
పాలకడలి శయను  పరమాత్ము రంగనీ
అనుపల్లవి:
తొలి వెలుగుల ప్రభలా తోడు నీడాడరే..
రంగనాధుని కొలువ రయమునను  సాగరే..॥నోము  ॥
చరణం:---
పాలసంద్రమునందు ఫణిశేష తల్పమున
లీలావతారుడదే  నిదురపోయెను రారే
వేల నుతులను పాడి వేగ మేల్కొలుపిడరే
పుాలంగి సేవలిడి పదము శరణనరే ॥  నోము ॥
చరణం:----------
కురుల పుాలిడకండి   మాలలల్లీ తెండి
పరులు బాధను చెందే  పలుకు లిడకండీ
జ్ఞాన ధనులను కొలిచీ ధర్మ మార్గము నడచీ
మార్గశిర వ్రతదీక్ష పుాన  రారండీ  ॥నోము॥
చరణం----------- :
సత్య భాషణ నిత్యనియమ్ము సుండీ
దాన ధర్మముజేసి తరియింపు మండీ
ఐకమత్యము తోడ హరిని కొలువండీ
జగము కీర్తులనేలు జయము మనదేనండి ॥నోము॥
చరణం-------------
నిదుర చాలింపుమా నీల మేఘ శ్యామా
మధుర మంగళ వాద్య వేదఘోషలు వినుమా
నీదు వాకిట నోర్మి నిలిచి యుంటిమి గదా
పాదు కొన్న శ్రీశా పరమాత్మ చిద్ఘనా మేలుకో ॥

-----------------------------------------------------------
పాశురము 3.
18/12/2020.
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.
రచన: శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

పల్లవి :
ముాడు లోకాలనుా  ముప్పాదముల గొలిచీ
బలిమి బలి శిరమును  భుామిలోపలికణచు
అనుపల్లవి :
వలమురి  తాలువు  వటు వామనుండతడె
తడయుటలు మాని యిక తరలి రారండే  ॥ముాడు॥
చరణం:
మేలుకొల్పగ హరిని మేలు గీతములతో
కేలు మొాడ్చీ నిలువరె కలువ కన్నుల చెలులుా
రంగనాధుని కొలిచి రాగాల సేవలా
రమణీయమైనట్టి రతనాల వాకిటా .... ॥ముాడు॥
చరణం:
పడతులారా బంతి జలకమ్ము లాడగా
ఈతి బాధలు తొలగి లోకాలు వెలుగుా
నెల ముాడు తడవులా  వర్షాలు కురియుా..
పసిడి పంటలు విరియు పాడి వర్ధిల్లు ॥ముాడు॥
చరణం:
పాడియావులు పాల ధారల్లు విడువంగ
కుాడి వానల నదులు పింగి పొరలేను
ఆడె మీనములెన్నో కాసారములు నిండ
విరియు కలువల చేర తుమ్మెదలు జతగుాడె ॥ముాడు॥
చరణం:
పసిడి పంటల సిరులెే రేపల్లె నిండగా
సశ్య శ్యామలమై రేపల్లె పండగా
పడతులారా రండు పదుమనాభుని కొలువ
పసిడి వాకిట నిలచీ పలు రీతుల వేడగా..॥ముాడు॥

-------------------------------------------------------------------

పాశురము 4.
18/12/2020.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .

పల్లవి:
శంఖ చక్ర గదా పద్మ ధరుడు శ్రీనాధుడుా..
బ్రహ్మ రుద్రాదులకును నియామకుడితడుా
అనుపల్లవి:
మార్గశీర్ష శుక్ల పక్ష ప్రీతి ఫాల తిలకుడు
ద్వాదశ ఊర్ధ్వ పుండ్ర శ్రేష్ట నామ కేశవుడుా.॥శంఖ చక్ర
చరణం:
కరుణ గల్గిన వరుణ దేవుడు కరుణించ
సంద్రాన సలిలముల తృప్తిగా తాగీ
నింగి నిలచీ నల్ల మేఘాల దాచీ
తా నిండు వర్షపు నీట తేజమై వెలిగే ॥శంఖ చక్ర॥
చరణం:
లోకాలు పాలించు లోకోత్తరుడు చక్రి
సోకాలు దీర్పగ స్వయము నేతెంచే
మెరయు మేనిని పోలు మెరపులే మెరయంగ
మేఘాలు వర్షించి అభిషేకములు సల్పె ॥:శంఖ చక్ర॥
చరణం:
శంఖ నాదము వోలె ఘర్జించె నింగీ..
రామ శరము వోలే  వర్షించె నింగీ
అంగనలు తానాలు ఆడ వేగమె రండి
రంగనాధు అర్చించు వేళాయె సుండీ॥2॥శంఖ చక్ర॥
------------------------------------------------------

పాశురము 5.
2012/2020.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .

పల్లవి:
క్షీర సాగర శయన హరి నారాయణుడుా...
పరమ పావనుడు పరమాన్న ప్రియుడు
అనుపల్లవి:
పద్మ గదా శంఖ చక్ర  ధరుడు పద్మ నాభుడు
పరమేశ్వరుడు పాహి నాధ నారాయణుడు
చెలియలారా రారే  చేరికొలువగా హరినీ
శ్రీ రంగ నాధుని శ్రిత జన పాలునీ... ॥క్షీర సాగర॥
చరణం :
మధురాధి పతి మేటి  మాధవుండీతడుా
మధురాను భుాతియదే మాత యశోదకు
యదు వంశ కుల రేడు యమునా విహారుడు
పదునాల్గు భువనాల నెరలు నల్లనివాడు ॥క్షీర సాగర॥
చరణం :
ముదముతో నీరాడి పరిధానములగట్టి
పాదపుాజలు సేయ పుానుకొని రారే
పాదుకొన్న మేటి పాపములు గాల్చేటి
వేద వంద్యుని కొలువ వేగ పడరే మీరు ॥ ॥క్షీర సాగర॥

క్షీర సాగర శయన హరి నారాయణుడుా...
పరమ పావనుడు పరమాన్న ప్రియుడు
అనుపల్లవి:
పద్మ గదా శంఖ చక్ర  ధరుడు పద్మ నాభుడు
పరమేశ్వరుడు పాహి నాధ నారాయణుడు
చెలియలారా రారే  చేరికొలువగా హరినీ
శ్రీ రంగ నాధుని శ్రిత జన పాలునీ... ॥క్షీర సాగర॥

-------------------------------------------------------------------

పాశురము  6.
20/12/2020.  
"మాధవ" నామార్చన. సారంగ రాగం.
మాధవ" నామార్చన.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .

పల్లవి :
యదువంశ కులతిలక యాదవ సర్వోత్తమ
రమాపతి రక్ష రక్ష  మాధవ మనోహరా..
అను పల్లవి :
అక్షరాహంకార ఆది  నియామక
హృదయనామాలంకృత  హృన్నిలయ మాధవా..॥
                                           ॥యదువంశ॥

చెలియ లారే రండి  చేరి కొలువగ హరిని
శ్రీ రంగ నాధుని  శ్రితజన పాలునీ   ॥యదువంశ॥

చరణం:
గరుడవాహనుడైన హరి ఆలయమునదెే
సుర శంఖ నాదములు  విను పంకజాక్షీ
పురుషోత్తముడు పుాతనా స్తన్యము గ్రోలుా
ఘనుడు  మొాక్షమునిచ్చు కేశవ ముార్తి ॥
చరణం:
శేష శయనము సేయు యొాగ నిద్రా వరుడు
దాస పోషణుడితడు దానవారీ
ఋషులు యొాగులు మునులు
మొాదమున మేల్కొల్ప.....
యశములిడ మత్తు విడు మధుర మంగళు డితడుా॥
                                                ॥యదువంశ॥

చెలియలారా రారే చేరి కొలువంగ హరిని
శ్రీ రంగ నాధుని శ్రిత జన పాలునీ  ॥॥యదువంశ॥

-------------------------------------------------------------------
పాశురము 7. గోవిందనామార్చన.
22/12/2020.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .

శీర్షిక .
ఎంత పిలుతును నేను...
---------------------------------

పల్లవి:
ఎంత పిలుతును నేను ఏమని  పలికెద
వింతగాదే చెలులుా వివరించి తెలుపగా॥

అనుపల్లవి :
తొలొపొద్దు పొడిచేను తెమిలిరారే చెలులుా..
కులదైవమును తలచి కుార్మి రంగని కొలువ॥ఎంత ॥

చరణం:
ముాడు వేదములకు ముాలమైన స్వామి
ముాడులోకాలకుా  ముార్తి పరమాత్ముడు
సర్వము తానై వ్యాపించు నాధుని
త్రైలోక్య ముార్తిని  తిరుగోవిందుని ॥ఎంత॥

చరణం :
సుక-పికా  రవముల ఆనంద గీతాల-
మేలుకొల్పులు వినవె మీన నేత్రీ...
కేశిని దునిమినా కేశవ ముార్తితడు
వెన్న పాల దొంగ  వేంచేయు వేళాయె ॥ఎంత॥

చరణం:
విద్యలెరిగిన మీకు విజ్ఞతలు తెలియవా
వంద్యమానుని కొలువ వడిగ రారేలనే
తగదు తగదోయమ్మ ఈ నడత మీకు
తడయుటలు మాని తరలి రారండే చెలులుా ॥ఎంత॥

-------------------------------------------------------------------

8. వ పాశురము. విష్ణు నామార్చన.)


మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం.

ధనుర్మాస కవితోత్సవాలు-2020 .

పర్యవేక్షణ: డా॥అడిగొప్పుల సదయ్యగారు.

నిర్వాహణ: శ్రీమతి యాంసాని లక్ష్మీ రాజేందర్ గారు.


రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్: మహారాష్ట్ర .


శీర్షిక :

జ్ఞానానందుడు...

-----------------------


పల్లవి:

జ్ఞానానందుడు  ధ్యాన ప్రాప్తుడుా

సర్వోత్తముడుా   శ్రీ హరి " విష్ణువు".

అనుపల్లవి:

దేశతః  కాలతః  వ్యాప్తి చెందెడువాడు

నిత్య సత్యుడుా  నిర్మలానందుడుా॥ జ్ఞానా॥


చరణం:

చైత్రమాస ప్రియ చక్ర గదా ధరుని

క్షీర సాగర శయను శ్రీ పద్మనాభుని..

క్షీర రాశికిని  సింహ రాశికినీ

నియామకుని ఆ నీల వర్ణమువాని..

చేరి కొలువగా రారే చెలులుా

శ్రీ వల్లభునీ  శ్రీ రంగ ధామునీ.. ॥॥ జ్ఞానా॥


చరణం: 1

పొన్న పుారంగుతో  భానుడుదయించేను

సన్న సన్నగ నింగి తురగలించేనుా

ఎనుములదె మేతకై మేల్గాంచి పరుగులిడె

వినవె చిరు గంటల సవ్వడులు మీనాక్షి..॥॥ జ్ఞానా॥


చరణణ :2

నీరాడ బోవుమా  నీదు వాకిట నిలచి

నిను పిలువ వచ్చేము ఓ నీరజాక్షీ

కీర్తింప పర నిచ్చు కేశవ ముార్తి ...మా

కుశల మడిగీ సేద దీర్చె శ్రీ విష్ణువు ॥॥ జ్ఞానా॥


పల్లవి:

జ్ఞానానందుడు  ధ్యాన ప్రాప్తుడుా

సర్వోత్తముడుా   శ్రీ హరి " విష్ణువు".

అనుపల్లవి:

దేశతః  కాలతః  వ్యాప్తి చెందెడువాడు

నిత్య సత్యుడుా  నిర్మలానందుడుా॥॥ జ్ఞానా॥

-----------------------------------------------------------


రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్: మహారాష్ట్ర .

8097622021.

శీర్షిక : శంఖ పద్మ గదా....

పాశురము 9.



పల్లవి:

శంఖ పద్మ గదా చక్రము ధరియించీ 

మధు నామకాసురునీ రయమున దృుంచీ...


అనుపల్లవి:

సాత్విక లోకానందా  సార జన శుభేచ్ఛా

మధుర భక్ష్య  ఫలదాతా మాధవ మదుసుాదనా ॥

కొలువ రారే చెలులుా కోరి విభుని పదములుా 

పిలువ రారే సఖులుా పుాజింప హరినీ ॥


చరణం:

రతనాల మేడలో రమ్య మణి ద్యుతులుా

దీపకాంతులు దివ్య గంధ పరిమళములుా

మిళితమౌ సాంబ్రాణి సౌరభమ్ములుజిమ్మ 

మత్తు నిదురబోవు ముదిత లేవమ్మా..॥


చరణం: 

వేల నామాల విభుని కీర్తించు చుండగా

యేల పలుకవు నీవు మా ముద్దు గుమ్మా

పుాల పరిమళ మొప్పు హంస తుాలిక పైన

చేరి నిద్దుర పోవు తరుణి లేవమ్మా ! లేచి రావమ్మా  ॥


చరణం: 

అత్త కుాతురా! వేగ తెమిలి రావమ్మా !

చిత్త చోరుడు మేటి వేల్పు గదా మనకుా..

పుత్తడి బొమ్మా ! వేగ కదలి రావమ్మా !

కీర్తింప మముగుాడీ  పుాజింప హరినీ శ్రీ రంగ నాధునీ ॥


రండి రండే చెలులుా  చెలియ లేపి రండే 

రంగనాధుని కొలువ త్వరగ తెమిలి రండే...॥

-----------------------------------------------------------


రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్: మహారాష్ట్ర .

8097622021.


పాశురము  10. 


అన్నిట తానై నిండి యుండెడువాని---

అన్ని లోకాల లో వ్యాపించువాని

అన్ని స్వరుాపాల నిండియుండెడువాని

అందరి వాడైన ఆదినారాయణుని ॥


చెలియలారా రండే  సేవింప హరినీ

  శ్రీ రంగ నాధునీ శ్రీరంగ నాధునీ ॥


ముాడు వేదాల లో ముాడు లోకాల లో

ముాడైన గుణములు, ముాడు కాలాల లో

చేతనాచేతనల  భుాతాది జీవుల లో

చేరియుండెడువాని చెంగల్వ పుాధరుని॥


చెలియలారా రండే  సేవింప హరినీ 

  శ్రీ రంగ ధాముని   శ్రీరంగ ధామునీ ॥


ముాడు లోకాలకుా ముాలమైనా స్వామి

త్రైలోక్య నాధునీ త్రివిక్రమ ముార్తిని  ॥

అన్నిట తానై నిండి యుండెడువాని---

అన్ని లోకాల లో వ్యాపించువాని..॥


  శ్రీ రంగ ధాముని శ్రీరంగ నాధునీ ॥

  శ్రీ రంగ ధాముని శ్రీరంగ నాధునీ ॥


సంగతిది వినికుాడ ఉలకవుా? పలుకవుా?

శ్రీరంగనీ నోము నోచియుంటివిగదా..॥

కుంభకర్ణుని  నిదుర నిను చేరెనా ఏమి?

కంబు కంఠీ నిదుర విడువ రావే చెలియ ॥


ఇంపైన తులసీ. సుమ మాల గళము నిడి

సొంపుగా మంగళములందె శ్రీ కరుడుా..

ఒంపు సొంపుల ఘనుడు నందనందనుడు

పురుషార్ధములనిచ్చు సిరి పుణ్యముార్తీ ॥


వేగ తెమిలీ రావే వర మందగమనీ

వేలకీర్తులు పాడి వేల్పు కొలువగ హరిని ॥

అన్ని స్వరుాపాల నిండియుండెడువాని

అందరి వాడైన ఆదినారాయణుని..


శ్రీరంగ నాధునీ శ్రీ రంగ నాధునీ...( 3times)


-----------------------------------------------------------


రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్: మహారాష్ట్ర .

8097622021.

శీర్షిక : శంఖ పద్మ గదా....

పాశురము. 11.


చక్ర గదా పద్మ శంఖ ధారీ మురారీ

దైత్య కుల నాశకారి వామనావతారీ

సుఖాభీష్ట సిద్ధి ప్రద ముక్తి మొాక్షకారీ..

జిహ్వ తత్త్వ  నియామకా జిత వైరి మురారినీ ॥


కొలువ రారే చెలులుా వటు వామన ముార్తినీ

అవతార పురుషునీ శ్రీ రంగనాధునీ...॥

:

చరణం

శ్రాత్రవ బలముల గొల్ల పట్టివి నీవుా 

పేరుగల పుణ్యవతి పెద్దింటి పడతి

వాలు కన్నులదోయి వంపు నడుము కల్గిన

నెలత, నెమలిని బోలు నడత వన్నెల బోడి॥


చెలయ రావే తెమిలి కొలువంగ హరినీ

శ్రీరంగ ధామునీ శ్రీ హరి విష్ణు నీ..॥


చరణం: 

తిరునామముల  పాడి తీరైన వన్నె కాని 

శ్రీకృష్ణుని  పరమాత్ముని సేవింప వస్తిమి

ద్యాన మగ్నవై ఇహమును మరచిన మాయమ్మా

ఉలుకు పలుకు మాని నిదుర నటియించకమ్మా॥


చరణం:

రావే నీ రాకకై వేచి యుంటిమి మేము

బంధు జనుల కుాడి భవుని కొలువ

రావే రమణి నామ కీర్తనల రంగని

సేవింప గానముల పుాజింప హరినీ ॥


కొలువ రారే చెలులుా వటు వామన ముార్తినీ

అవతార పురుషునీ శ్రీ రంగ నాధునీ....॥


-----------------------------------------------------------


రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్: మహారాష్ట్ర .

8097622021.


పాశురము 12.   ("శ్రీధర" నామార్చన.)

----------------------------------------------------

పల్లవి :

శ్రీ శబ్ద వాచ్య యైన శ్రీమహా లక్ష్మి ని

వక్ష స్థల  మందిడిన  గుణధాముని శ్రీధరుని॥


అనుపల్లవి :

చక్ర గదా శంఖ పద్మ ధరుని   కమల నాభుని

వేద మంత్రార్చిత పద  వైకుంఠ నాధునీ

వరగుణ శ్రీ ధామునీ .....॥


లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా

వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....॥


చరణం:

లేగ దుాడలు తల్లి గోవు పొదుగు  తడమగ

పొదుగు నిండిన ప్రేమ ధారలై కురిసే...

యేరులై పారేటి  పాడి నిండిన నల్ల-

గొల్ల వాని చెల్లెలా వాదమేల తరలిరా.... ॥


లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా

వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....॥


చరణం:

రావణాంతకుడైన రామ చంద్రుని కొలువ

నామ గానము కన్నా మించు జపము ఏదీ...

సీమాటి ! నిను పిలువ  నిదుర మత్తేలనే

నమ్మి - కొలువగ రావే నళినాక్షి నాధునీ...॥


లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా

వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....॥


శ్రీ శబ్ద వాచ్య యైన శ్రీమహా లక్ష్మి ని

వక్ష స్థల  మందిడిన  గుణధాముని శ్రీధరుని॥


చక్ర గదా శంఖ పద్మ ధరుని   కమల నాభుని

వేద మంత్రార్చిత పద  వైకుంఠ నాధునీ

వరగుణ శ్రీ ధామునీ .....॥


లెమ్మా నాధుని కొలువగ నిదుర వీడు మమ్మా

వినవే శ్రీ విభు కీర్తన బంగారు బొమ్మా....॥

---------------------------------------------------

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్: మహారాష్ట్ర .

8097622021

పాశురము .13.


పల్లవి:

చక్ర పద్మ శంఖ గదా ధారీ మురారీ.

పాహి  పరంధామ హృషీ -కేశావతారీ॥


అనుపల్లవి:

రమ బ్రహ్మ రుద్రాదుల అనందకారీ

ఇంద్రియా నియామకునీ  ఇహ పర హితకారునీ ॥


చెలియలారా రారే చేరి కొలువగ హరినీ

శ్రీ రంగ నాధునీ శ్రీధరునీ శ్యామునీ ..॥


చరణం:

పక్షి రుాపుని బకుని చీల్చి చెండాడీ

పోరులో రావణుని మదమణచి దునిమేటి

జగదేక వీరునీ జానకీ రాముని

కీర్తింప వచ్చి నీ వాకిటను నిలచితిమి ॥


పడతీ పుండరికాక్షు పావనమౌ ముార్తిని

కొలువంగ రావమ్మా కుసుమాల కోమలీ

చెలియ లందరి గుాడి చేరి కొలువగ హరినీ

శ్రీ రంగ ధామునీ రామ నారాయణునీ ॥


చరణం:

మేతకై పక్షులదే పరుగులిడె కుాయుచుా

శుభములను సుాచింప శుక్రుడుదయించగా

అభయ హస్తుని కొలువ ఆలసింపకరమ్మా

మించె సమయము సుమ్మా! అందాల పుారెమ్మా॥


చెలియ లందరి గుాడి చేరి కొలువగ హరినీ

శ్రీ రంగ ధామునీ రామ నారాయణునీ ॥


చరణం:

పుాల తేనియ గ్రోలి మత్తెక్కు తుమ్మెదల----

వంటి కన్నుల కలికి కనులు తెరుమమ్మా

చాలించి విరతినిక రావే కుందన బొమ్మ

చన్నీటి స్నానాల మునుగ ముద్దుల గుమ్మ ॥


చెలియ లందరి గుాడి చేరి కొలువగ హరినీ

శ్రీ రంగ ధామునీ రామ నారాయణునీ ॥


రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .

పాశురము 13.
8097622021.

పల్లవి:
చక్ర పద్మ శంఖ గదా ధారీ మురారీ.
పాహి  పరంధామ హృషీ -కేశావతారీ॥

అనుపల్లవి:
రమ బ్రహ్మ రుద్రాదుల అనందకారీ
ఇంద్రియా నియామకునీ  ఇహ పర హితకారునీ ॥

చెలియలారా రారే చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ నాధునీ శ్రీధరునీ శ్యామునీ ..॥

చరణం:
పక్షి రుాపుని బకుని చీల్చి చెండాడీ
పోరులో రావణుని మదమణచి దునిమేటి
జగదేక వీరునీ జానకీ రాముని
కీర్తింప వచ్చి నీ వాకిటను నిలచితిమి ॥

పడతీ పుండరికాక్షు పావనమౌ ముార్తిని
కొలువంగ రావమ్మా కుసుమాల కోమలీ
చెలియ లందరి గుాడి చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ ధామునీ రామ నారాయణునీ ॥

చరణం:
మేతకై పక్షులదే పరుగులిడె కుాయుచుా
శుభములను సుాచింప శుక్రుడుదయించగా
అభయ హస్తుని కొలువ ఆలసింపకరమ్మా
మించె సమయము సుమ్మా! అందాల పుారెమ్మా॥

చెలియ లందరి గుాడి చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ ధామునీ రామ నారాయణునీ ॥

చరణం:
పుాల తేనియ గ్రోలి మత్తెక్కు తుమ్మెదల----
వంటి కన్నుల కలికి కనులు తెరుమమ్మా
చాలించి విరతినిక రావే కుందన బొమ్మ
చన్నీటి స్నానాల మునుగ ముద్దుల గుమ్మ ॥

చెలియ లందరి గుాడి చేరి కొలువగ హరినీ
శ్రీ రంగ ధామునీ రామ నారాయణునీ ॥

-----------------------------------------------------------

మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం.

ధనుర్మాస కవితోత్సవాలు-2020.
29/12/2020.
పాశురము:  14. "హృుషీకేశ" నామార్చన.

పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : శ్రీ  బీరప్పొల్ల అనంతయ్యగారు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

చక్ర పద్మ శంఖ గదా  ధరుడు హృషీకేశుడుా..
వాక్ తత్త్వ సారుడుా  వైకుంఠ  ధాముడుా

ఇంద్రియ నియామకుడు ఇందిరా రమణుడుా
రమ ! బ్రహ్మ  ! రుద్రాదుల కానందమిడువాడు ॥

చెలియ ! రావే ! పాటల ! కొలువంగా హరినీ
శ్రీ రంగ ధామునీ శ్రీహరి శ్రీ విష్ణునీ  ॥

పల్లవి :
ఎంత గడుసు దానవే  ముద్దుల గుమ్మా
నటనలింక చాలు చాలు మాటకారి వమ్మా

అనుపల్లవి :
పెరటి తోట కొలనులో కలువలు వికశించెనమ్మ
నిదుర లేచి తలుపు తెరచి మము చేరగ రావమ్మా ॥

చరణం :
"మిమ్ము ! లేపెద "ననుచుా  మాటిచ్చీ మరచితివి
నమ్మికిక  లేటికినే  మధుర వచనా...మాకు
సీమాటి సిరిమల్లీ  సిగ్గులేదటె నీకు
శమము దీరిన రావె సమకట్టి తడయకిక ।॥

చెలియ ! రావే ! పాటల ! కొలువంగా హరినీ
శ్రీరంగ ధామునీ శ్రీ హరి శ్రీ విష్ణునీ...॥

చరణం :
దేవళముల జేరె మునులు   దేవుని పుాజింపగా
దేవ దేవుని హరిని  కీర్తించీ కొలువగా..
ధవళ దంతపు దివ్య తేజ మలరగ నిలచెే
కమలనేత్రుని కొలువ కదలిరా మీనాక్షీ... ॥

చెలియ ! రావే ! పాటల ! కొలువంగా హరినీ
శ్రీరంగ ధామునీ శ్రీ హరి శ్రీ విష్ణునీ...॥

-------------------------------------------------------

మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.
30/12/2020.
పాశురము:  15 . (పద్మనాభుని నామార్చన.)

పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : శ్రీమతీ యాంసాని లక్ష్మీ రాజేందర్ గారు.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

భక్త హృదయ తేజ భాగవోత్తముడుా
భవబంధ మొాచనుడు శ్రీ పద్మనాభుడుా
భాను తేజుని కొలువ  భక్తి భావముతోడ
కొలువరావే సఖియ కోరి శ్రీ రంగనీ ॥

చెలియలారా రారే మేల్కొల్పరే  సఖిని
చేరి కొలువగ హరిని శ్రీరంగ నాధునీ..॥

చరణం:
మున్ను తెలియదు నీదు ముద్దు మాటల తీరు
నమ్మినారము నిన్ని ఓర్మి వేచితిమిచట
కదలి ఇక లేచిరా  కఠినాత్మురాలా....
గోష్టి కలియగ  రావె  గోవిందు కొలువగా..॥

చెలియలారా రారే మేల్కొల్పరే  సఖిని
చేరి కొలువగ హరిని శ్రీరంగ నాధునీ..॥

చరణం.
కంసాది దుష్టులా   దునిమి నట్టీ ధవుడు
నంద గోపాలుడుా ఆనంద ధాముడుా...
గొల్ల భామల  తోడ కొల్ల లాడెడు
మేటి  మాయావి మేల్కొనవె  ముదము
రంగని కొలువ॥

చెలియలారా రారే మేల్కొల్పరే  సఖిని
చేరి కొలువగ హరిని శ్రీరంగ నాధునీ..॥

చరణం:
గోపబాలికలార ! కోపమేటకిలింత !
విదితమాయెను తప్పు వదరుటలు మానరో.....
అందరిట జేరితిర !  అతివలారా నాదు-
జాప్యమిక లేదింక ! జలజాక్షు లాగరో...॥

మీ మాట మీపాట పాల మీగడ ముాట
మిము గుాడి వత్తు  నే  జలజాక్షు లాగరో...॥

భక్త హృదయ తేజునీ భాగవోత్తమునీ
భవబంధ మొాచనునీ  శ్రీ పద్మనాభునీ
భాను తేజుని కొలువ  భక్తి భావముతోడ
కొలువవత్తునే సఖియ  శ్రీ రంగ నాధునీ ॥
శ్రీ రంగ నాధునీ     శ్రీ రంగ నాధునీ.....ఆ.....

-------------------------------------------------------

మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ధనుర్మాస కవితోత్సవాలు-2020.
2/1/2021

పర్యవేక్షణ: డా॥అడిగొప్పుల సదయ్యగారు.
నిర్వాహణ : శ్రీ  కుందారపు గురుముార్తిగారు.

పాశురము 18.  (పురుషోత్తమ నామార్చన).

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

తెల్లవారెను కోడికుాసెను
కోయిలమ్మలు పాట పాడెను
మల్లి జాజులు విరిసి పుాసెను
కనులు తెరుమా కమలనయనీ ॥

హరిని కొలువగ వస్తిమమ్మా
ఆలసింపక తలుపు తెరుమా  ॥

పల్లె లేచెను నిదురలేపుమ   
నీల వర్ణుని శ్యామునీ
వేడు చుంటిమి వేల నుతులా
వేల నామములున్న వానీ
నంద నందను కోడలా 
నాధు లేపుమ నీరజాక్శీ ॥

హరిని కొలువగ వస్తిమమ్మా
ఆలసింపక తలుపు తెరుమా  ॥

మదపుటేనుగు బలము కలిగి
భుజబలమ్మున పోరు సలిపే
పద్మనాభుని రాణివమ్మా 
పలుకు మొకపరి నీలవేణీ॥

హరిని కొలువగ వస్తిమమ్మా
ఆలసింపక తలుపు తెరుమా  ॥

విరతి నేలెడు వాని పొలతి
విడుమ నలవట్టమును నీవు
నంద నందను కోడలా 
నప్పిన్న  నేర్పరి వమ్మ నీవు ॥

లలిత రాగపు కంఠి  కలికి
కలల రేడుని లేపవమ్మా ॥

హరిని కొలువగ వస్తిమమ్మా
ఆలసింపక తలుపు తెరుమా  ॥

తరుణి రో ఇక తరలిరమ్మా
తడయుటలు ఇక  వదలిరమ్మా.
కరపు కంకణ  గలగలల తో
కురుల కమలిక కోమలాంగీ
చలిపి నవ్వుల కులుకు కొమ్మ
హరిని కుాడి రావె కొమ్మఁ॥

హరిని కొలువగ వస్తిమమ్మా
ఆలసింపక తలుపు తెరుమా  ॥







Sunday, December 20, 2020

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారి స్వరరాగ సుధాఝరి....☝️నిన్నటి వారి కవితను వారి గాత్రమాధుర్యంలో వినాలని కోరాను....నా కోరిక మన్నించి పాడి పంపించారు ఈరోజు....వారికి బహుధా ధన్యవాదాలు...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారి స్వరరాగ సుధాఝరి....☝️

నిన్నటి వారి కవితను వారి గాత్రమాధుర్యంలో వినాలని కోరాను....నా కోరిక మన్నించి పాడి పంపించారు ఈరోజు....వారికి బహుధా ధన్యవాదాలు...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺

అద్భుత మైన గానం ,గాత్రం, రచననారాయణామృతంలా భక్తిరసంలో ఓలలాడించే సూపర్🌺👍👌🙏👏👏🙏🙏👌👍🌺👍👌🙏👏

అద్భుత మైన గానం ,గాత్రం, రచన
నారాయణామృతంలా భక్తిరసంలో ఓలలాడించే సూపర్🌺👍👌🙏👏👏🙏🙏👌👍🌺👍👌🙏👏

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వ రీ మూర్తి గారి పాశురాలు పాటల రూపంలోఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది అమ్మా న్ మీకు శుభా నందనాలు 🙏🙏🙏🙏🙏🙏 గురు మంచి రమేశ్ శర్మ 9959000062

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వ రీ మూర్తి గారి పాశురాలు పాటల రూపంలో
ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృత
మైంది అమ్మా  మీకు శుభా నందనాలు 🙏🙏🙏🙏🙏🙏
          గురు మంచి రమేశ్ శర్మ
           9959000062

Saturday, December 19, 2020

పాటవెలది పద్య ప్రక్రియలో -----"సుందరాకాండ" (19/12/2020. )

 19/12/2020.    
సుందరాకాండ..పాటవెలదుల లో...
సృష్టి కర్త: శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు.
రచన :శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

ప్రథమ వందనములు:
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
---------------------------------------------
.1.
తల్లి తండ్రి గురుల దలచి మదిని
కోరి ఆశి సులను లను కొలువ ప్రీతి
పావనులగు వారి పాద ములకు
వందనముల జేతు వరలు భక్తి ॥
2.
రమణి సీత గుాడు రాము గొల్చి
జక్క రేయి పవలు జపము జేసి
గుండె లోన జుాపు గుణుడు ఘనుడు
రామ దాసు డతడె రక్ష నాకు ॥
3.
వాయు పుత్రుడతడు వాక్చతురుడు
వేద సారమెరుగు వేద విదుడు.
వానరముల మేటి జ్ఞాన ధనుడు.
అంజనీ సుతునకు  అంజలిడుదు ॥
4.
రామ చరిత భువిని రమ్యమదియె
శుభము లేలు చరిత సుందరమ్ము
సుప్రసిద్ధి గాంచె సుంద్ర కాండ
మాన్య మగుట నెంచి మానసమున ॥
5.
సాయి పదములంటి సాదరమున
సమ్మతీయ మంటి సాధు గురుని 
విఘ్న నాశకుండు విజయ మొసగ
వేడుచుంటి నతని వేల్పు గాదె ॥
6.
పాట వెలదు లందు పద్య ములుగ
రామ భక్తు ఘనత రాయ నెంచి
ఆది కావ్య మౌచు నలర జగతి
ఆదరణను పొంద అనువదింతు ॥
7.
పాట వెలదు లనెడు ప్రక్రియిదియె
సృష్టి కర్త అతడు తృప్తి పరుడు  
వడ్డెపల్లి కృష్ణ  వంద్యు డతడు
అతని కిడుదు నమములాది గాను॥
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏




తిరుప్పావై 4వ పాశురము* వివరణ.

*తిరుప్పావై 4వ పాశురము*
🕉🌞🌏🌙🌟
🔥🕉🌞🌏🌙🌟

*భగవంతుని నాలుగో స్థానం - అంతర్యామి*
*ఆండాళ్ తిరువడిగలే శరణం*

*4.పాశురము*
*ॐॐॐॐॐॐॐ*

*ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్*
*ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి*
*ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు*
*పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్*
*ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు*
*తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్*
*వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్*
*మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్*

గోపికలు తమ వ్రతముచే లోకమంతయు పాడిపంటలతో సమృద్దిగా వుండాలని కోరుకున్నారు. తన వ్రతముకు స్నానము ప్రదానము కావున స్నానము చేయుటకు అనుగుణముగా జలమును సమృద్దిగా ఉండవలెను అని భావించినారు. ఈ వ్రతమునకు ఫలముగా అనుకుని వేరే వాటిని ఆశ్రయించక భక్తి తో భగవంతుని వినయ విదేయత కలిగివున్నారు. వానదేవుని ఈ పాసురములో ప్రార్ధిస్తున్నారు. మరి ఈ పాశురము లో ఎలా అడుగుతున్నారో తెలుసుకుందాము. 


*తాత్పర్యము:-*

ఓ పర్జన్య దైవమా! వర్షమును కురిపించుటలో లోభత్వమును జూపకుము. నీవు సముద్రములోని నీటి నంతను కడుపు నిండుగ త్రాగుము, అటుపిదప నీవు పైకెగసి, సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపురంగు నద్దుకొనుము. స్వామి కుడి చేతియందున్న సుదర్శన చక్రము వలె మెరయుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖమువలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమను ధనుస్సు నుండి వెడలే అవిరళ శరాలుగ వర్షధారలను కురిపించుము. మేమందరము యీ వర్ష ధారలలో స్నానమాడెదము. లోకము సుఖించునట్లు వర్షించుము మా వ్రతమును నిరాటంకముగ జేసికొనుటకై యిక ఏ మాత్రమూ ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామీ!


గంభీరమైన స్వభావము కలవాడైన వర్షము కురుయునట్టి ఓ మేఘదైవతమా! నీవు వర్షజలముననుగ్రహించు దాత్రుత్వములో ఏ మాత్రము సంకోచము చూపించకు. గంభీరమైన సముద్రము మద్యలోనున్న నీటినంతను బాగుగా త్రాగి గర్జించి ఆకాసమునంతను వ్యాపింపచేయును. 


సమస్త జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణుని శరీరమువలె దివ్యమైన నల్లని స్వరూపమును ధరించి ఆభగవంతుని సుందర విశాల దీర్గబాహువుల జంటలో కుడిచేతి యందలి చక్రాయుధమువలె మెరయుచు ఎడమచేతి యందలి శంఖము వలె మధురగంభీరముగా ఉరిమి ఆ భగవంతుని శారంగమను ధనుస్సు నుండి వెడలివచ్చు బాణములవలె వర్షదారాలు లోకమునంతను సుఖింప జేయు నట్లును. మేము సంతోషముతో మార్ఘశీర్ష స్నానము చేయునట్లు వర్షించు. అని అండాళ్ళమ్మ ఈ పాశురములో ప్రార్దించుచున్న

*వర్షం_కోసం_మేఘనికి_విన్నపం:*

ఓ వానదేవుడా! మేము చేయబోవు ఈ వ్రతానికి నీరు చాలా అవసరం. ఆ నీటిని నీవు సమృద్ధిగా కురిపించవలసింది. మరి నీళ్ళు నీక్కెక్కడివంటావా! సముద్రానికి వెళ్ళు. వెళ్ళి సముద్రంలోని నీళ్ళను గొంతువరకూ తృప్తిగా తాగి గర్జిస్తూ నింగికెగురు. విష్ణువు యొక్క నల్లని శరీరంవలె నీవునూ నల్లని ఛాయను పొందు. 

జలధిశాయి ధరించిన చక్రకాంతివలె మెరుపులతోను, శంఖధ్వనివలె ఉరుములతోను, శార్ జ్ఞ్గము నుండి వెలువడిన తీవ్రమైన శరపరంపరవలె సంతత వర్షధారలతో లోకాలన్నీ ఆనందించేటట్లు వర్షించు. గోవిందుని పొందుగోరు మేమంతా ఈ మార్గశిరమాసంలో నీట జల్లులాడి వ్రతం ఆచరిస్తాం.

*భావం:-*

గంభీర స్వభావుడా ! వర్ష నిర్వహకుడా ! ఓ పర్జన్య దేవా ! నీవు దాతృత్వములో చూపు ఔదార్యమును ఏమాత్రమును సంకోచింప చేయకుము.


 గంభీరమగు సముద్రములో మధ్యకుపోయి, ఆ సముద్ర జలమునంతను నీవు పూర్తిగా త్రాగి, గర్జించి ఆకాశమున వ్యాపించి సర్వజగత్కారణ భూతుడగు శ్రీమన్నారాయణుని దివ్యవిగ్రహమువలె శ్యామల మూర్తివై ఆ పద్మనాభుని విశాలసుందర బాహుయుగళిలో దక్షిణ బాహువు నందలి చక్రమువలె మెరసి ఎడమచేతిలోని శంఖమువలె ఉరిమి శార్జ్గ్నమును ధనుస్సు నుండి విడిచిన బాణముల వర్షమా అనునట్లు లోకమంతయు సుఖించునట్లు మేము సంతోషంతో మార్గశీర్ష స్నానము చేయునట్లు వర్షింపుము.    


*అవతారిక:-*

సర్వవ్యాపాకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని యెరిగి ఆ పురుషోత్తముని కొలిచిన కలిగే ఫలితాలను గురించి 3వ పాశురంలో గోదాదేవి వెల్లడించింది. అట్టి పరమాత్ముని యేమరక భక్తితో పూజించే శక్తియుక్తులు కావలెనన్న ముందు శారీరక శుద్ధి, ఆపై అంతర్ శుద్ధి అవసరం కద! అందుకే బాహ్య శుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన వర్జన్యుణ్ణి ప్రార్థంచి వ్రతాంగమైన స్నానానికై వర్షించమని కోరుతున్నదీ పాశురంలో.


గోపికలు తను వ్రతముచే లోకమంతటను పాడిపంట సమృద్ధిగా ఉండవలెనని కోరిరి. తన వ్రతమునకు స్నానము ప్రధానము కనుక ఆ స్నానము చేయుటకు అనుగుణమగు జలము సమృద్ధిగా ఉండవలెనని భావించిరి. 


వీరు కృష్ణభగవానుడే 'ఉపాయము - ఫలము' అని నిశ్చయించుకొని ఇతరమయిన 
వానిని వేనిని ఆశ్రయింపనివారు, ఇట్లు అనన్య భక్తితో పరమాత్మనాశ్రయించిన వారివద్ద భగవానునివద్ద వినయవిధేయతలతో మెలిగినట్లు దేవతలందరూ ఆజ్ఞావశవర్తులై యుందురు.   


మనిషిని మనిషిగా తీర్చిదిద్దే వ్రతం ఇది. మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించేది ధనుర్మాస వ్రతం. మనలో కోరిక అంటూ కల్గితే చాలు ప్రకృతిలోని శక్తులంతా సహకరిస్తాయి. దేవతలంతా సహకరిస్తారు. మొదటగా మనకు భగవంతుని తత్వాన్ని వివరించింది ఆండాళ్ తల్లి. ఈ దివ్య తత్వాన్ని నారాయణ ఆని అంటారు. ఈ తత్వాన్ని మనం ఏ రూపంలో అయినా గుర్తించవచ్చు. వేదవ్యాస భగవానుడి కుమారుడు శ్రీసుఖుడు ఇట్లా అంతటా దైవన్ని దర్షించుకొనేవాడట.


 దేనిపై పెద్దగా వ్యామొహం లేనివాడవటంచే అలా  వెల్లి పోతుంటే, పుత్రవ్యామోహంచే వేదవ్యాసుడు అతని వెంట పరుగెత్తేవాడట. పుత్రా అని తన పిలుపులకు ఆయన స్పందించకపోయే సరికి చెట్లు,పక్షులు ఓయ్ అని పలికేవట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే శ్రీసుఖునిలో ఉన్న తత్వమే అన్నిటిలోనూ ఉందికనకనే అలా స్పందించాయి. ప్రతి వస్తువులోను అది ఉండి నిలబెడుతుంది.దాన్ని మనం చూడగలగాలి, కాని కంటికి కనబడదు. కాబట్టి మనం ఈ తత్వాన్ని అంతర్యామిగా గుర్తించాలి.  


ఆండాళ్ తల్లి మనిషిలోని మంచి తనాన్ని మేల్కొల్పటానికి ధనుర్మాస వ్రతం చేసింది, మనల్ని అట్లానే ఆచరించమంది. 


 అందరితో కలిసి ఆచరించాలి అని చెప్పింది. అందరితో కలిసి చేస్తేనే అనుభవ యోగ్యం అవుతుంది. అందరికి సాముహికంగా క్షేమం కల్గాలని అని మనం చేస్తున్నాం, అలాంటి వాన్ని ముముక్షువు అంటారు. మనం ఒక ముముక్షువుగా  బ్రతక గలగాలి. తత్వన్ని అంతటా చూడగలగాలి. తీపికి రుపం ఎమిటి, వివిద పదార్థాలలో  నే చూడగలం. అలాగే పరమాత్మ తత్వాన్ని మనం కంటితో చూడలేము కనక, మనవంటి వారికి ఇష్టమయ్యే మనవంటి రూపాన్నే ధరించి మన ఆరాధనలు అందుకోవటానికి చేరుతుంది ఆ బ్రహ్మ తత్వం. కాని అది మాత్రమే ఆయన రూపం కాదు. 


సామాన్యంగా భగవంతుడు తన పరివారం అందరితో కల్సి ఉంటాడు,  లోకంలో ఒక్కొక్క ఒక్కొక్క ప్రయోజనం కోసం వివిద దేవతలను ఆశ్రయిస్తారు. కాని ఒక్కరిని ఆరాధించి సకల ఫలితాలు పొందాలంటే ఏదైన సాధన ఉందా అంటే- అది నారాయణుని ఆశ్రయం తప్ప ఏది లేదు ఎందుకంటే సకలఫలప్రదోహి విష్ణు:  అనేది మనకు ఋషివాక్కు. మిగతావరంతా "ఏకైక లభాయ:" కాని  "సర్వ లాభాయ కేశవ" అంటారు.  ఒక్క పరమాత్మను మనం ప్రసన్నం చేసుకొంటే ఇతర దేవతలంతా సహకరిస్తారు. 


అందరూ భయపడే యముడు చెప్పినమాటలు ఏమిటంటే, విష్ణువు భక్తుల జోలికి తన దూతలను వెల్లవద్దని.


 భగవత్ ప్రేమ కల్గి విష్ణువుకే అంకితమయ్యే వాల్లంటే యముడు కూడా భయపడుతుంటాడు. నారాయణ స్మరన చేయటంచే యమదూతలు అజామయున్ని వదిలివెళ్ళుతారు. విష్ణుదూతలు అతన్ని తీసుకుపోతారు. భారతంలో అజామయుడి సన్నివేషంలో  ఇది చెప్పబడి ఉంది. అలాగే ఏదేవతను కొలిచినా,ఆయా దేవతల ద్వారా ఫలాన్ని ఇచ్చెది నేనే నయా అని  భగవద్గీత ఏడవ అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మనం ఒక్క శ్రీకృష్ణ పరమాత్మను ప్రసన్నం చేసుకొంటే మిగతాదేవతలు తామంతట తామే సహకరిస్తారు.


అలా వచ్చిన దేవతల్లో ముఖ్యుడైన వర్ష దేవునికి ఆండాళ్ చేసిన విన్నపం ఇలా ఉంది. 


*ఆళి మళైక్కణ్ణా! -* సముద్రమ్లో నుండి నీల్లను గ్రహించి నిర్వహించేవాడా - వానదేవా-పర్జన్యా. *ఒన్ఱు నీ కై కరవేల్ -* ఏ మాత్రం నీవు చేయి దాచుకోవద్దు-ఉదారంగా ఇవ్వు, *ఆళి ఉళ్ పుక్కు -* సముద్రం అట్టడుగు లోపలి దాకా వెల్లి , *ముగందు కొడార్ త్తేఱి -*  పిల్చుకో, ముందు నీవు తృప్తిగా కడుపు *నిమ్పుకోని -* చాలా ఎత్తుకు వెల్లాలి. 


*ఊళి ముదల్వన్-* సృష్టి కార్యం చేయడానికి ముందు స్వామి ఎలాంటి నీలి కాంతి తరంగాలు కల్గి ఉంటాడో, *ఊరువం పోళ్  మెయ్ కఱుత్తు -* అట్లాగే  నీ  ఆకారాన్ని సరిదిద్దుకో, *పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్  ఆళిపొల్ మిన్ని -* బీటలువారి ఉన్న ఈ భూమికి ఒక్క సారిగా కురవకూడదు,  మొదటగా మెరవవలె,తర్వాత ఉరమవలె, తరువాత కురవవలె. 


ఆమెరవడం ఎట్లా అంటే సుదర్షణచక్రం మెరుస్తున్నట్లుగా ఉండాలి.


 *వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు -* ఎట్లా ఉరమాలి అంటే శ్రీపాంచజన్యంలా-శంఖం ద్వనిలా  ఉరుమవలె. ఆద్వని ద్వారా భగవంతున్ని ద్వేషించేవాల్లు కూడా భక్తులుగా మారేట్లు గా ఉండాలి.


 తాళాదే శారుంగం ఉదెత *శరమళైపోల్ వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ -* ఇక కురవడం స్వామి వేసే భాణాలవలె కురవాలి, అందరు సుఖించెందుకు వర్షించు.


 ఆంగళుం *మార్గళి నీరాడ మగిళుంద్* - మార్గశీర్ష స్నానం కోసం మాకు సరిపడేంత నీరు ఉండేలా వర్షించు.

🕉️🌞🌏🌙🌟

*(ఉదయరవిచంద్రిక రాగము -ఆదితాళము)*

ప.    వెనుదీయబోకుమా! వర్జన్యమా!
    కనికరముంచుమ! వర్షాధిదైవతమ!!


అ. ప.    పానము చేయుమ! సాగర జలముల
    ఘనమౌ గర్జన చేయగరమ్మా!!


1 చ.    ఆకాశమున కెగసి లోకకారణుని
    పోకడి తిరుమేని నలుపు నలదుకొనుమ!!


2 చ.    విశాల సుందర భుజ పద్మనాభుని    
    అసదృశమగు చక్రమువలె మెరసి
    ఆశనిపాత శంఖముగ గర్జించి
    ఆ శార్జపు శరములుగ వర్షింపుమా!!


3 చ.    ఆశల, లోకము సుఖముల నొందగ
    మాస మార్గళిని మాకై వర్షింపుమా
    వెనుదీయబోకుమా! పర్జన్యమా!!

🕉️🌞🌏🌙🌟

*తిరుప్పావై 4వ పాశురము తెలుగు అనువాద పద్యము*
*ॐॐॐॐॐॐॐॐॐॐ*

.సీసమాలిక
హర్షము నింపెడు వర్షము కురిపింపు
     మార్గళి మాసాన మరులు నింపు
వర్ష నిర్వాహకా!  వరముల నందుచు 
          స్నానమాచరణకై చనిరి జనులు 
జలనిధి చొరబడి సలిలము త్రాగెడు 
        కాలోప లక్షిత కారణుండు
నీలవర్ణము వాడు నీరజనాభుడు
        సుందర దేహుండు శుభము లొసగు 
తళుకుతో మెరియు సుదర్శన జ్వాలగా 
       మెరుపుల కాంతులు మేఘమందు
శంఖ రవంబులు బింఖాన చేయుము
        శర వర్షము బోలు నురుము లుండె
శ్రీ సుదర్శన ధారి శ్రీదేవితో కూడి
        పాంచజన్యము దాల్చె పావనుండు
తే.గీ. హృదయ గంభీర భావాలు మొదలు గాగ
దక్షిణావర్త శంఖము లక్షణముగ
సుందరమగు బాహుడు యరవింద నయన
శార్ఙ్గ నందక ధారియౌ స్వామి యితడు 
నార్తితో సేవ జేసిన యాదరించు
శ్రద్ధ భక్తిని కల్గించి బుద్ధి నిమ్ము
శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!

🕉🌞🌎🌙🌟

Friday, December 18, 2020

108 దివ్య క్షేత్రాలు.

☘🌼🙏🌼☘108 వైష్ణవ దివ్య క్షేత్రాలు🙏

🙏🌹వైష్ణవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు 108 ఉన్నాయి. పన్నిద్దరు (12) ఆళ్వారులు తమ రచనలయిన పాశురములలో ఈ 108 విష్ణు రూపాలను కొలిచారు. ఇందులో 105 భారతదేశంలో, 1 నేపాల్ లో, మరియు మిగితా 2 దివ్య తిరుపతులు భూమిలి వెలుపల ఉన్నవి.

1. శ్రీరంగం 2. ఉరైయూర్ 3. తంజమా మణిక్కోయిల్ 4. తిరువన్బిల్ 5. కరంబనూర్ 6. తిరువెళ్లరై 7. పుళ్ళం పూదంగుడి 8. తిరుప్పేర్ నగర్ 9. ఆదనూర్ 10. తిరువళందూర్ 11. శిరుపులియూర్ 12. తిరుచ్చేరై 13. తలైచ్చంగణాన్మదియం 14. తిరుక్కుడందై 15. తిరుక్కండియూర్ 16. తిరువిణ్ణగర్ 17 తిరువాలి తిరునగరి 18. తిరుకన్నాపురం 19. తిరునాగై 20. తిరునరైయూర్

21. తిరునందిపురం 22. తిరువిందళూరు 23. తిరుచిత్రకూటం 24. శ్రీరామవిణ్ణగర్ 25. కూడలూర్ 26. తిరుక్కణ్ణంగుడి 27 తిరుక్కణ్ణ మంగై 28. కపిస్థలం 29. తిరువెళ్లియం గుడి 30. తిరుమణి మాడక్కోయిల్ 31. వైకుంఠ విణ్ణగరం 32. తిరుఅరిమేయ విణ్ణంగరం 33. తిరుత్తేవనార్ తొగై 34. తిరువణ్ పురుషోత్తమం 35. తిరుశెంపొన్ శెయ్ కోయిల్ 36. తితుతైత్తియంబలం 37. తిరుమణిక్కూడం 38. తిరుక్కావళంపాడి 39. తిరువెళ్లక్కుళం 40. తిరుపార్తాన్ పళ్ళి

41. తిరుమాలిరుం శోలైమలై 42. తిరుక్కోటియూర్ 43. తిరుమెయ్యం 44. తిరుప్పల్లాణి 45. తిరుత్తంగాల్ 46. తిరుమోగూర్ 47. తెన్ మధురై 48. శ్రీ విల్లిపుత్తూరు 49. తిరుక్కురు గూర్ 50. తిరుతులై విల్లి మంగళం 51. శిరీవర మంగై 52. తిరుప్పళింగుడి 53. తెన్ తిరుప్పేర్ 54. శ్రీ వైకుంఠం 55. తిరువరగుణ మంగై 56. తిరుక్కళందై 57. తిరుక్కురుం గుడి 58. తిరుక్కోళూరు 59. తిరువనంతపురం 60. తిరువణ్ పరిశరాం

61. తిరుకాట్కరై 62. తిరుమూరీక్కళం 63. తిరుప్పలియూర్ 64. తిరుచిత్తార్ 65. తిరునావాయ్ 66. తిరువల్లవాళ్ 67. తిరువణ్ వండూరు 68. తిరువాట్టర్ 69. తిరువిత్తు వక్కోడు 70. తిరుక్కడిత్తానం 71. తిరువారన్ విళై 72. తిరువహింద్ర పురం 73. తిరుక్కోవలూర్ 74. పెరుమాళ్ కోయిల్ 75. శ్రీ అష్టభుజం 76. తిరుత్తణ్ కా 77. తిరువేళుక్కై 78. తిరుప్పాడగం 79. తిరునీరగం 80. తిరునిలాత్తింగళ్ తుండం

81. తిరువూరగం 82. తిరువెక్కా 83. తిరుక్కారగం 84. తిరుకార్వానం 85. తిరుక్కల్వనూర్ 86. తిరుపవళ వణ్ణం 87. పరమేశ్వరవిణ్ణగరం 88. తిరుప్పళ్ కుళి 89. తిరునిర్రవూర్ 90. తిరువెవ్వుళూరు 91. తిరునీర్మలై 92. తిరువిడ వెండై 93. తిరుక్కడల్ మల్లై 94. తిరువల్లిక్కేణి 95. తిరుఘటిగై 96. తిరుమల 97. అహోబిలం 98. అయోధ్య 99. నైమిశారణ్యం 100. సాలగ్రామం 101. బదరికాశ్రమం 102. కండమెన్రుం కడినగర్ 103. తిరుప్పిరిది 104. ద్వారక 105. బృందావనం 106. గోకులం 107 క్షీరాబ్ది 108. పరమపదం.

దివ్యదేశాలు

    శ్రీరంగం
    ఉరైయూర్
    తంజమా మణిక్కోయిల్ (తంజావూర్-తిరువయ్యార్ 3 కి.మీ.)
    అన్బిల్ (బాణాపురం) (లాల్గుడి నుండి 8 కి.మీ.)
    కరంబనూర్ (ఉత్తమర్ కోయిల్)
    తిరువెళ్ళరై (శ్వేతగిరి)
    తిరుప్పుళ్ళం పూతంగుడి (కుంభఘోణము 10 కి.మీ.)
    తిరుప్పేర్ నగర్ (అప్పక్కుడుత్తాన్) (లాల్గుడి 10 కి.మీ.) (కోవిలడి)
    తిరువాదనూర్ (స్వామిమలై 3 కి.మీ.)
    తిరువళందూర్ (మాయవరం 12 కి.మీ.) (తేరళందూర్)
    శిరుపులియూర్
    తిరుచ్చేరై (కుంభకోణం 12 కి.మీ.) (సార క్షేత్రము)
    తలైచ్చంగనాణ్మదియమ్ (తలైచ్చగాండ్రు)
    తిరుక్కుడందై (కుంభకోణము)
    తిరుక్కండియూర్
    తిరువిణ్ణగర్ (కుంభకోణం 5 కి.మీ.) (ఉప్పిలి యప్పన్ కోయిల్)
    తిరువాలి తిరునగరి (శీర్గాళి 18 కి.మీ.)
    తిరుక్కణ్ణపురం (నన్నిలమ్ నుండి 7 కి.మీ.)
    తిరునాగై (నాగపట్నం)
    తిరునరైయూర్ (కుంభకోణం 10 కి.మీ.)
    నందిపుర విణ్ణగరమ్ (కుంభకోణం 10 కి.మీ.) (నాథన్ కోయిల్)
    తిరువిందళూరు (మాయావరం) (తిరువళందూర్)
    తిరుచ్చిత్తరకూడమ్ (చిదంబరం)
    కాంచీరామ విణ్ణగరమ్ (శీయాళి) (శీర్గాళి)
    కూడలూర్ (తిరువయ్యారు 10 కి.మీ.) (ఆడుదురై పెరుమాళ్ కోయిల్)
    తిరుక్కణ్ణంగుడి (కృష్ణారణ్యక్షేత్రం)
    తిరుక్కణ్ణమంగై (తిరువారూరు 8 కి.మీ.) (కృష్ణమంగళ క్షేత్రం)
    కపి స్థలమ్
    తిరువెళ్ళియంగుడి
    మణిమాడక్కోయిల్ (తిరునాంగూర్) (శీర్గాళి-వైదీశ్వరన్ కోయిల్ 10 కి.మీ.)
    వైకుంద విణ్ణగరమ్
    అరిమేయ విణ్ణగరమ్
    తిరుత్తేవనార్ తొగై (కీళచాలై)
    వణ్ పురుడోత్తమ్
    శెంపొన్ శెయ్ కోయిల్
    తిరుత్తెట్రియమ్బలమ్
    తిరుమణిక్కూడమ్ (తిరునాంగూర్ తిరుపతి)
    తిరుక్కావళంబాడి (తిరునాంగూర్ తిరుపతి)
    తిరువెళ్ళక్కుళమ్ (అణ్ణన్ కోయిల్)
    తిరుపార్తన్ పళ్ళి
    తిరుమాలిరుం శోలై మలై (మధుర 20 కి.మీ.) (అంగర్ కోయిల్)
    తిరుక్కోట్టియూర్ (గోష్ఠీపురము)
    తిరుమెయ్యమ్ (పుదుక్కోట్టై 20 కి.మీ.)
    తిరుప్పుల్లాణి (రామనాథపురం 10 కి.మీ.) (దర్భ శయనం)
    తిరుత్తణ్ కాల్ (తిరుత్తంగాలూర్) (శివకాశి 3 కి.మీ.)
    తిరుమోగూర్ (మర 10 కి.మీ.) (మోహనపురము)
    తెన్ మధురై (మధుర) (తిరుక్కూడల్)
    శ్రీవిల్లి పుత్తూరు
    తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి)
    తిరుత్తొల విల్లి మంగలమ్ (ఇరిట్టై తిరుప్పతి)
    శిరీవరమంగై (నాంగునేరి) (వానమామలై)
    తిరుప్పుళింగుడి
    తెన్ తిరుప్పేర్ (తిరుప్పేరై)
    శ్రీ వైకుంఠము
    తిరువరగుణమంగై (నత్తం)
    తిరుక్కుళందై (తెన్ కుళన్దై) (పెరుంకొళమ్)
    తిరుక్కురుంగుడి
    తిరుక్కోళూరు
    తిరువనంతపురమ్
    తిరువణ్ పరిశారమ్
    తిరుక్కాట్కరై
    తిరుమూళక్కళమ్
    తిరుప్పులియూర్ (కుట్టనాడు)
    తిరుచ్చెంకున్నూర్ (శంగణూర్)
    తిరునావాయ్
    తిరువల్లవాళ్ (తిరువల్లాయ్) (శ్రీవల్లభక్షేత్రం)
    తిరువణ్ వండూరు
    తిరువాట్టార్
    తిరువిత్తువక్కోడు (తిరువిచ్చిక్కోడు)
    తిరుక్కడిత్తానమ్
    తిరువాఱన్ విళై (ఆరుముళై)
    తిరువయిందిర పురమ్
    తిరుక్కోవలూరు (గోపాలనగరమ్)
    పెరుమాళ్ కోయిల్ (కాంచీపురము)
    అష్ట భుజమ్ (కాంచీ)
    తిరుత్తణ్ గా (కాంచీ)
    తిరువేళుక్కై (కాంచీ)
    తిరుప్పాడగమ్ (కాంచీ)
    తిరునీరగమ్ (కాంచీ)
    నిలాత్తింగళ్ తుండత్తాన్ (కాంచీ)
    ఊఱగమ్ (కాంచీ)
    తిరువెంకా (కాంచీ)
    తిరుక్కారగమ్ (కాంచీ)
    కార్వానమ్ (కాంచీ)
    తిరుక్కళ్వనూర్ (కాంచీ)
    పవళవణ్ణమ్ (కాంచీ)
    పరమేశ్వర విణ్ణగరమ్ (కాంచీ)
    తిరుప్పుళ్ కుం (కాంచీ)
    తిరునిన్ఱవూర్
    తిరువెవ్వుళ్ళూరు (తిరువళ్ళూరు)
    తిరునీర్మలై (ఘండారణ్యక్షేత్రము)
    తిరువిడవెన్దై
    తిరుక్కడల్‌మలై (మహాబలిపురం)
    తిరువల్లిక్కేణి (చెన్నై)
    తిరుక్కడిగై (చోళసింహపురము)
    తిరువేంగడమ్ (తిరుమలై - తిరుపతి)
    శింగవేళ్ కున్ణమ్ (అహోబిలం)
    తిరువయోధ్యై
    నైమిశారణ్యం
    శాళక్కిణామం (సాలగ్రామమ్)
    బదరికాశ్రమం (బదరీనాథ్)
    కండమెన్ణుం కడినగర్ (దేవప్రయాగ)
    తిరుప్పిరిది (నందప్రయాగ) (జోషిమఠ్)
    వడమధురై (ఉత్తరమధుర)
    శ్రీ ద్వారక
    తిరువాయిప్పాడి (గోకులము)
    తిరుప్పార్ కడల్ (క్షీర సముద్రము)
    పరమపదమ్ (తిరునాడు)🌼

తిరుప్పావై ప్రశ్న జవాబులు

*తిరుపావై ప్రశ్నావళి-జవాబులతో*

*శుభ ధనుర్మాసం.* తిరుప్పావై గురించి ప్రాధమిక అవగాహన ఆధారంగా తయారు చేసిన 108 ప్రశ్నలు-జవాబుల గోష్టియే ఈ తిరుప్పావై ప్రశ్నావళి. *ఇది ఎవరి జ్ఞానాన్ని పరీక్షించడానికో లేదా ఏ కొందరినో విజేతలుగా ప్రకటించడానికో సంకలనం చేసిన ప్రశ్నావళి కాదు.*

 *శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు, లౌకిక సుఖాలు ఎవరికి వారు అనుభవించేవి, కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి, దాన్నే "గోష్టి " అంటారు... *•••••••••••••••••••
🕉️📚📚📚📚🕉️

*1.* ఆండాళ్ అని ఎవరికి పేరు?
=గోదాదేవి.

*2.* తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?
= సుప్రభాతం బదులుగా.

*3.* ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?
=భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే మంచిరోజు.

*4.* గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?
=శ్రీ విష్ణు చిత్తులు.

*5.* ఆళ్వారులు ఎంతమంది?
=12మంది.

*6.* గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?
=భూదేవి.

*7.* గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?
=తమిళ భాష.

*8.* తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?
=నాలాయిర్ దివ్యప్రబంధము.

*9.* శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?
=108.

*10.* గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?
=శ్రీవిల్లిపుత్తూరు.

*11.* దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?
=దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.

*12.* శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?
=196 అడుగులు.

*13.* ‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?
=మూడవ పాశురం.

*14.* శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?
=తిరుసాదము.

*15.* శ్రీవిష్ణుచిత్తులు వారు తానకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?
=కోదై (గోదా)

*16.* పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?
=గరుడాంశము.

*17.* తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?
=శ్రీవ్రతము.

*18.* మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?
=పరమాత్మ చేతిలోని శంఖమువలే.

*19.* శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?
=మన్మధుని

*20.* తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?
=సింహం పిల్లవలె.

*21.* తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?
=ధృడమైన కోరిక, పట్టుదల.

*22.* కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?
=మొదటి పాశురం.

*23.* శ్రీకృష్ణుడు యశోదగర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?
=దేవకీపుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)

*24.* ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?
=రెండవ పాశురం.

*25.* తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?
=వామన అవతారం.

*26.* ఆళ్వార్లకు మరో పేరేమిటి?
=వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.

*27.* నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?
=మూడు.

*28.* మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?
=పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.

*29.* శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమటి?
=ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).

*30.* ‘పెరునీర్’ అంటే ‘పెద్ద మనస్సున్న నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?
=యమునా నది.

*31.* మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?
=దానగుణం.

*32.* లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?
=వర్షానికి.

*33.* పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?
=పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.

*34.* విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?
=ఐదవ పాశురం.

*35.* విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?
=నమ్మళ్వారు.

*36.* తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?
=బుద్ధివ్రతం.

*37.* గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?
=పిళ్ళాయ్ (పిల్లా).

*38.* తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?
=ఆళ్వార్లతో.

*39.* గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?
=పూదత్తాళ్వారు.

*40.* తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?
=శ్రీపెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.

*41.* కీచుకీచుమని అరిచే *ఏ* పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?
=భరద్వాజ (చాతక) పక్షులు.

*42.* తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?
=కులశేఖరాళ్వార్.

*43.


='బహుధా విజాయతే' (అనేక విధములుగా పుట్టుచున్నాడు)

*94.* సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?
=విష్ణుపోతము

(విష్ణువనే ఓడ)

*95.* పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?
=ఆయన దాసులే గొప్ప.

*96.* ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?
=ఎన్ని జన్మలకైనా అని అర్థము.

*97.* ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?
=అయోధ్య.

*98.* వజ్గం అంటే ఏమిటి?
=ఓడ.

*99.* ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?
=అమృత కలశం.

*100.* ముప్ఫయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?
=తిజ్గళ్ తిరుముగత్తు- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.

*101.* గోపికల దివ్యాభరణములేవి?
=కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.

*102.* శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?
=అణి పుదువై- ఈ జగత్తుకే మణివంటిది.

*103.* శ్రీవిష్ణుచిత్తుల వారు తమ మెడలో ఏ మాల ధరించెను?
=పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.

*104.* గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?
= పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).
 
*105.* తిరుప్పావై ఎటువంటి మాల?
=ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.

*106.* శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎవరి పేరు?
= గోదాదేవి.

*107.* శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?
=గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.

*108.* భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?
=తొండరపడిప్పొడి
యాళ్వార్.
జై శ్రీమన్నారాయణ ఆణ్డాళ్ తిరువడిగళే  శరణమ్

పాశురము 3 (భావార్ధం.)

🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯
*మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ధనుర్మాస కవితోత్సవాలు-2020*
🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚

పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్య*
నిర్వహణ: *శ్రీమతి కె గీతాశైలజగారు*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*పాశురం(ఓంగి ఉళగళంద)-3*


_*రేపటి తిరుప్పావై మూడవ రోజు పాశురం*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి*
*నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్*
*తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు*
*ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ*
*పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప*
*తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి*
*వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్*
*నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్*


*🌳భావము:🌳* 


ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీ కృష్ణ సంశ్లేషమే ! ఐనా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంతానందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు. ఆ పరమానంద మూర్తి దివ్యచరణాలను , అతని దివ్య నామాలను పాడి , యీ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళిస్నానాన్నాచరిస్తే - దుర్భిక్షమసలు కలుగనే కల్గదు. నెలకు మూడు వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంటచేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్లిపడుతూ ఆనంద సమృద్దిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్దికి సంకేతాలే ! ఇక పాలు పిదుక గోవుల పోదుగలను తాకగానే - కలశాలు నిండునట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సఖులందరినీ పిలుస్తోంది గోద !
   

 *☘️అవతారిక :☘️*
    

ఈ ధనుర్మాస వ్రతమెంతో శుభప్రదమైనది. దీని నాచరించుటవలన వ్రతాన్నాచరించినవారికే కాక లోకమునకంతకును లాబించును. ఇది ఇహపరసాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు కృష్ణపరమాత్మకదా ! మరి విశేషంగా ఆరాధించిన వారికేకాక లోకానికంతకూ కల్యాణాన్ని కల్గించి శుభాలను చేకూర్చేవాడని వ్రతఫలాలను వివరిస్తోంది గోదాదేవి.


  *🌹3 వ మాలిక🌹*



*(మోహనరాగము - ఆదితాళము)*


ప.    హరి తిరువడులను కొలిచెదము
    తిరు నామములనె పాడెదము

అ.ప..    పెరిగి లోకముల గొలిచిన పాదము
    పరసాధనమని తెలిసి పాడుదము

1 చ.    వ్రతమును చేయగ స్నానమాడెదము
    ప్రతి నెల ముమ్మరు కురియు వర్షములు
    వితత సస్యముల నెగయు మీనములు
    మత్తిలి కలువల సోలు భ్రమరముల

2 ఛ.    బలసిన గోవుల పొదుగుల తాకగ
    కలశముల క్షీరధారలు కురియగ
    శ్రీలెయెడతెగని ప్రసారములో యన
    ఇల సిరులదూగు చేతుము వ్రతమును.

Thursday, December 17, 2020

పాశురము 3.

18/12/2020.
పాశురము 3.
రచన: శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

పల్లవి :
ముాడు లోకాలనుా  ముప్పాదముల గొలిచీ
బలిమి బలి శిరమును  భుామిలోపలికణచు
అనుపల్లవి :
వలమురి  తాలువు  వటు వామనుండతడె
తడయుటలు మాని యిక తరలి రారండే  ॥ముాడు॥
చరణం:
మేలుకొల్పగ హరిని మేలు గీతములతో
కేలు మొాడ్చీ నిలువరె కలువ కన్నుల చెలులుా
రంగనాధుని కొలిచి రాగాల సేవలా
రమణీయమైనట్టి రతనాల వాకిటా .... ॥ముాడు॥
చరణం:
పడతులారా బంతి జలకమ్ము లాడగా
ఈతి బాధలు తొలగి లోకాలు వెలుగుా
నెల ముాడు తడవులా  వర్షాలు కురియుా..
పసిడి పంటలు విరియు పాడి వర్ధిల్లు ॥ముాడు॥
చరణం:
పాడియావులు పాల ధారల్లు విడువంగ
కుాడి వానల నదులు పింగి పొరలేను
ఆడె మీనములెన్నో కాసారములు నిండ
విరియు కలువల చేర తుమ్మెదలు జతగుాడె ॥ముాడు॥
చరణం:
పసిడి పంటల సిరులెే రేపల్లె నిండగా
సశ్య శ్యామలమై రేపల్లె పండగా
పడతులారా రండు పదుమనాభుని కొలువ
పసిడి వాకిట నిలచీ పలు రీతుల వేడగా..॥ముాడు॥


పాట

🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯
*మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ధనుర్మాస కవితోత్సవాలు-2020*
🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚

పర్యవేక్షణ: *డా॥అడిగొప్పుల సదయ్య*
నిర్వహణ: *శ్రీ ముక్కా సత్యనారాయణగారు*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రచన: బెజ్జారపు కళ్యాణాచార్యులు
గ్రామం: కోరుట్ల
అంశం: పద్మనాభుడు
ప్రక్రియ: వచనకవనం (భక్తి గీతం)

*మోహన రాగం- ఆదితాళం*

ప: చిరుమందహాస శ్రీ వేంకటేశా
శ్రీ పద్మనాభ ధరణీ ధరేషా
జగమంత నీదే బ్రతుకంత నీవే..

చ:1
మధురాంతరంగం గోవిందనామమ్
నిలిచుండె చూడు ఆనందగీతం
ఎదలోనీ పాటయి పలికింది నాలో
పలికించె వాడు నీ పలుకు పాటయి
ఓ...దేవ దేవ మమ్మేల రారా
శ్రీ శ్రీనివాస శ్రితపారిజాత..!!శ్రీ పద్మనాభ!!

చ2
అణువణువు నీవే అలరారే దేవా
అలరించి రావా శ్రీకాంతునల్లే
కరుణాంతరంగ కలశాబ్దివాసా
కడజేర్చునావ కైమోడ్పు దేవ
కళ్యాణాచార్యుల కరుణించి బ్రోవ
శ్రీ శ్రీనివాస శ్రితపారిజాత..!!శ్రీ పద్మనాభ!!

పాశురము 1.(తెలుగు కీర్తన ).

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
-------------

పల్లవి:
మేలుకొల్పులు చేయ  వేల నుతులను పాడ
శ్రీ రంగనాధునీ చిన్మయస్వరుాపుని
అను పల్లవి:
పొద్దు పొడవకమునుపె పుాలంగి సేవలా
నాధు కొలువగ రండి  వేద కీర్తుల వేడ॥మేలుకో
చరణం:
తొలి పొద్దు పొడచేను తరుణులారా లెండు
కలిదీర్చు కమలాక్షు కొలువ రారే వేగ
ఫలియించు మీ కోర్కె పడతులారా రండి
మార్గశిర స్నానమిడి మన వేల్పు కొలవండి..॥మేలుకో
చరణం:
స్వర్గ ద్వారము తెరచి యుండు ఘన మాసము
మార్గశిర వ్రత దీక్ష పుాన మహిమలు ఘనము
దుర్గమౌ దురితమ్ముల శమియింపు నీ నోము
దీర్ఘ యశముల బడయు దివ్యమైనది మనుము॥ 
చరణం:
నిదుర చాలింపుమని నీలమేఘ శ్యాముని
మధుర మంగళ వాద్య వేద ఘోషల తోడ
మేల్కొల్పగారారే మీన నేత్రపు ఘనుని
నందగోపాలనీ  రేపల్లె బాలునీ ॥
చరణం:
సుర్య చంద్ర సమ తేజము నిండిన
సుందర వినీల దేహ సుందరుని
నంద యశోదలా నమ్మక వర పుత్రునీ
నటన సుాత్ర ధారి నగధరునీ మాధవునీ ॥ 
------------------------------------------------------

పాశురము 2.



మహతీసాహితీ కవి సంగమం , కరీమ్ నగర్
ధనుర్మాస కవితోత్సవాలు
పర్యవేక్షణ : డా . అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ : ముక్కా సత్యన్నారాయణ గారు
తేది: 17.12.2020
పాశురము (2)
ప్రక్రియ: గేయ రచన.

రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ -మహారాష్ట్ర

పల్లవి:---------
నోముతీరును వినరే నొద్దికగా చెలలుా
పాలకడలి శయను  పరమాత్ము రంగనీ
అనుపల్లవి:
తొలి వెలుగుల ప్రభలా తోడు నీడాడరే..
రంగనాధుని కొలువ రయమునను  సాగరే..॥నోము  ॥
చరణం:-----------
పాలసంద్రమునందు ఫణిశేష తల్పమున
లీలావతారుడదే  నిదురపోయెను రారే
వేల నుతులను పాడి వేగ మేల్కొలుపిడరే
పుాలంగి సేవలిడి పదము శరణనరే ॥  నోము ॥
చరణం:----------
కురుల పుాలిడకండి   మాలలల్లీ తెండి
పరులు బాధను చెందే  పలుకు లిడకండీ
జ్ఞాన ధనులను కొలిచీ ధర్మ మార్గము నడచీ
మార్గశిర వ్రతదీక్ష పుాన  రారండీ  ॥నోము॥
చరణం----------- :
సత్య భాషణ నిత్యనియమ్ము సుండీ
దాన ధర్మముజేసి తరియింపు మండీ
ఐకమత్యము తోడ హరిని కొలువండీ
జగము కీర్తులనేలు జయము మనదేనండి ॥నోము॥
చరణం-------------
నిదుర చాలింపుమా నీల మేఘ శ్యామా
మధుర మంగళ వాద్య వేదఘోషలు వినుమా
నీదు వాకిట నోర్మి నిలిచి యుంటిమి గదా
పాదు కొన్న శ్రీశా పరమాత్మ చిద్ఘనా మేలుకో ॥

-----------------------------------------------------------





02 వ రోజు - భగవంతుని రెండో స్థానం వ్యూహం(పాల్కడలి)
 ఆండాళ్ తిరువడిగలే శరణం  

వ్రతనియమాలు
పాశురము

వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్

మనిషి బాగుపడటానికి ఎన్నో మార్గాలు,  శాస్త్రాలలో  ఆవి కర్మయోగమని, జ్ఞానయోగమని, భక్తి యోగమని ఇలా ఎన్నో చెప్పబడి ఉన్నాయి. భగవంతుడే ఒక మార్గమని తీసుకుంటే వారు మర్గశీర్షంలో పయనిస్తున్నారు అని అంటారు. అలాంటి మార్గంలో లక్ష్యం చేరటంలో ఇబ్బందులు ఉండవు. తల్లి అండలో ఉన్న శిశువు మాదిరిగా మనల్ని తరింపచేస్తాడు పరమాత్మ, కాని అలా జరగటానికి మన అంగీకారం కావాలి. మనలోని జ్ఞానం ద్వారా మనం నీవాడను నేను అని ఆయనకు చెప్పాలి.  మరి అలాంటి మార్గంలో  పయనించటానికి మనం ఎలా ఉండాలో మన ఆండాళ్ తల్లి తెలియజేసింది ఈ ధనుర్మాస వ్రతంలో.  ఏమి చేయాలో ఏమి అవసరం లేదో చెబుతోంది ఈ పాటలో.

భగవంతుణ్ణి భగవన్మయుడని, పరమాత్మ అని, గోవింద అని ఇలా ఎన్నో పేర్లతో చెబుతారు. మనకు కనిపించే వివిద రూపాల్లో ఉంటాడు కాబట్టి భగవన్మయుడని అంటారు. "అణు:" అతి చిన్నరూపం నుండి "బృహత్:" అతి పెద్ద స్వరూపంగా ఉంటాడు కాబట్టి పరమాత్మనే అని అంటారు. "శబ్ద సహ" అతి సామన్యుడు పిలిస్తే అందుతాడు, "శబ్దాతిగ" చతుర్ముఖ బ్రహ్మకూడా కీర్తించ చేతకానివాడు, అందుకే ఆయనను గోవింద అని అంటారు.  మరి జగత్తు మొత్తం పరమాత్మ శరీరం కదా! మరి ఇక్కడ తగినవి- తగనివి అంటూ ఉంటాయా!!

ప్రకృతి స్వభావాన్ని బట్టి, ఆయా గుణాలను బట్టి సత్వం,రజస్సు మరియూ తమస్సు అనే గుణాలు ఉంటాయని గమనించాలి. సత్వం  జ్ఞానాన్ని, రజస్సు కోపాన్ని, తమస్సు అజ్ఞానాన్ని,బద్దకాన్ని ఇస్తాయి. మరి శరీరం ఈ పంచబూతాలతో తయారైనదే కదా, కాబట్టి ప్రకృతిలో ఉండే ఈ గుణాలు మనలో కూడా ఉంటాయి. కాని ఏదో ఒక గుణం పైన ఉండి నడిపిస్తుంది. సత్వం పెరిగితే మంచిది. ఇలా చెప్పటానికి మన చేతిలోని చూపుడు వేలును మనతో  పోలుస్తారు, బ్రోటన వేలును పరమాత్మతో పోలుస్తారు. ఇక తమస్సు,రజస్సు, సత్వ గుణాలను మిగతామూడు వెల్లతోపోల్చుతారు. ఈ మూడు గుణాలతో కలిసి ఉన్న చూపుడు వేలుని బ్రోటనవేలి తో కలిపే దాన్ని జ్ఞాన ముద్ర అంటారు. చిటికెన వేలు సత్వం కొద్దిగానే ఉంటుంది, రజస్సు-తమస్సు ఎక్కువగా ఉంటాయి. మరి బాగు పడటానికి సత్వం కావాలి, కొన్ని నియమాల్ని పాటించాలి.  నియమాలు మరి ప్రకృతిలోని గుణాలకోసమే కాక, మనల్ని ఆదర్షంగా తీసుకొనేవారు బాగు పడటానికి కూడా మనం పాటించాల్సి వస్తుంది. ఈ కృత్యా- అకృత్య వియోచనాలను మన ఆండాళ్ తల్లి ఈ పాటలో తెలియజేస్తుంది.

"వైయత్తు వాళ్ వీర్గాళ్!"  ఈ భుమి మీద ఉండి సుఖించాలని కోరిక ఉంటే చాలు రండి అని చెబుతుంది. ఈ భూమి తామస గుణమిచ్చేది, ఇక్కడ ఉండగా సాత్వికగుణం కలగటం కుంపెటలో తామరపువ్వు పూసినట్లు అంటారు. చివరికి పరమాత్మకు కూడా తామస గుణ ప్రభావం తప్పలేదు అని సీతాదేవి హనుమంతునితో చెప్పుతుంది ఈ విషయం రామాయణంలో. రావణ వధ అనంతరం సీతను తీసుకుపోవటానికి వచ్చిన హనుమ సీతాదేవితో, నివ్వు ఆజ్ఞ యివ్వు నిన్ను పీడించే ఈ రాక్షసమూకను ఒక్కసారి పని పడతాని అంటాడు, దానికి సీత ఇది వారి తప్పు కాదయా, వారు రావణుని అండలో ఉన్నారు, ఈ భూమిమీద ఉండగా తప్పు చేయడం సహజమేకదా, చివరికి చూసిరమ్మని చెబితే కాల్చివెల్లలేదా నీవు. దానికి హనుమ మరి నేనంటే ఏమో, కాని శ్రీరామ చందృడు కూడా తప్పు చేసినాడా అమ్మ అని అడిగాడు. సూర్పణక వచ్చినప్పుడు ఆమెతో రాముడి ప్రవర్తన మరి తప్పేగా, నేను ఏక పత్నివ్రతుడను అనిమాత్రం చెప్పక, తన తమ్ముడికేసి ఎందుకు చూపించాడు. ఇవ్వన్నీ కదా ఇన్ని అపచారాలకు దారి తీసింది అని హనుమంతుడితో చెప్పుతుంది.

"నాముం నం పావైక్కు" ఒకరిని కష్టపెట్టే వ్రతం కాదు, లోకుల వ్రతాలు వారి వారి సుఖాలకోసం చేస్తే ఈ వ్రతం లోకం అందరికోసం చేసేది. "శెయ్యుం కిరిశైగళ్ కేళీరో" మరి ఏం చేద్దాం ఈ వ్రతంలో వినండి, " పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి"  పాల కడలిలోని సుకుమారం గా పవళించి ఉన్న వైకుఠనాథుని పాదాలను పాడదాం. ఆయనను మించినవారు ఇంకెవరూలేరు కాబట్టి "పరమన్" అని అంటారు.   ఎందుకంటే  మనల్ని కాపాడటానికి తాను మొదటగా పాదం వేసినది పాల్కడలిలోనేకదా! ఆయన పాదాలలో శంఖ, రథాంగ, కల్పక, ద్వజా, అరవింద, వజ్రా, అంకుష ఇత్యాదులు గుర్తులుగా  చేసుకొని ఉన్న ఆపాదాన్ని పాడుదాం. ఎలాగైతే శిశువు తల్లి స్తన్యాన్ని గుర్తిస్తాడో, భక్తుడు భగవంతుని పాదాలను గుర్తించగలిగి ఉండాలి. సుకుమారమైన నిద్ర అంటే లోక రక్షణకోసం తానుచేసే సాత్విక-యోగనిద్ర.  మనకోసం ఇంకా ఎమి చేస్తె బాగుపడతాం అని ఏర్పాటు చేసుకొన్న స్థానం పాల్కడలి. 

వ్యుహం-పాల్కడలి

నిన్నటి నాడు నారాయణ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇన్ని గుణాలు కల్గి ఉన్న నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవటం కష్టమే. మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవటం అవసరం. మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం, ఒక భూమి మీద నివసిస్తునాం. ఈ భూమి సౌరమండలంలో ఉంది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేసారో మనం ఆలోచించటం లేదు. ఒక చిన్నవిత్తనం నుండి ఒకపెద్ద వటవృక్షం వచ్చినట్లుగా ఇది ఒకనాడు ఎర్పడింది ఒకడిలోంచే అని మనకు వేదం చెబుతుంది.


ఇవన్ని ఏవి లేనప్పుడు పరమాత్మ ఈ జీవులందరూ ఉన్నారే అతి చిన్నరూపం కలవారు, అతి విలక్షణమైన జ్ఞానం కలవారు, కర్మభారాలు మోసేవారు, తామంతట తాము దేహాలు ధరించలేనివారు మరినేను వీళ్ళకు ఉపకారం చేయకుంటే ఎలా! కర్మతోలగాలంటే దేహం కావాలి, దేహం ఉండే నేల కావాలి, దాన్ని భోగ స్థానం అంటారు. అందుకు అనుభవించే వస్తువులు కావాలి, వాటిని భోగ్యములు అని అంటారు. వీటిని అనుభవించే ఇంద్రియాలు కావలి వాటినే భోగ్య ఉపకరణములు అంటారు.  ఇన్నింటిని తయారు చేనినవాడిని మనం నారాయణ అంటాం. మరి ఇవన్నీ తయారు చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకొన్న స్థానాన్నే వ్యూహం అంటారు.

అక్కడ ఆయన వాసుదేవ, అనిరుద్ద,ప్రత్ర్యుమ్న, సంకర్షన అనే నాలుగు పేర్లతో ఉంటాడు. సృష్టి, స్థితి, లయము ఈ మూడు కార్యాలు చేస్తాడు, ఆ స్థానాన్నే పాల్కడలి అని కూడా అంటారు.

ఆయన కళ్యాణ గుణాలకు అది మూలస్థానం. అక్కడ వాసుదేవ అనేరూపంతో సర్వం తన ఆదీనంలో పెట్టుకుంటాడు. అందులోంచి ఒక రూపం తీస్తాడు దానికి సంకర్షణ అని పేరు, ఇది ప్రళయం చేయటానికి శివునిలో తానుండి చేస్తాడు. మరొక రూపం తీస్తాడు, దానికి అనిరుద్ద అని పేరు సృష్టి కోసం తాను బ్రహ్మలో ఉండి చేస్తాడు,   మరొక రూపం తీస్తాడు, దానికి ప్రత్యుమ్న అని పేరు సృష్టించిన వాటిని రక్షించేందుకు ఇది ఇందృనిలో ఉండి చేస్తాడు.  అక్కడికి ఆయన మొట్టమొదటిగా అడుగు పెడతాడు, ఆదిశేశువు పైన ఆయన ఉంటాడు. ఆర్తితో పిలిచేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.  ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో అక్కడినుండి లోకరక్షణకై అవతారాలను పంపిస్తుంటాడు. అన్ని అవతారాలకు మూల స్థానం పాల్కడలియే. ఆయా అవతారల్లో ఆయన గుణ సంపదలను లోకానికి చాటుతాడు. అందుకే అవతారాలను విభవములు అంటారు.  


ఆయన పాదలను పాడుదాం. కడుపు నిండి పోతుంది-  ఇక "నెయ్యుణ్ణోం పాలుణ్ణోమ్" నెయ్యి వద్దు పాలు వద్దు. "నాట్కాలే నీరాడి" తెల తెల వారు జామున లేచి స్నానం చేద్దాం.  "మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్" కాటుక,పూలు ధరించం, ఏవి విలాసాలో అవి వదిలేస్తాం. "శెయ్యాదన శెయ్యోమ్" మాపూర్వులు చెయ్యనివి ఏమి చెయ్యం - ప్రాచీణ ఆచారాలు మానెయ్యం " తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్" పుళ్ళవిరుపు మాటలు మాట్లాడం. "ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి" చాతనైనంత వరకు ధాన ధర్మం చేస్తాం. "ఉయ్యుమాఱెణ్ణి ఉగంద్" ఇవన్ని ఆనందంతో చేస్తాం.


 శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం

30 పాశురాలు తెలుగులో youtube linkx.

https://youtu.be/9ZGHDeEy_9I
🕉️🕉️🕉️🕉️

30 పాశురములు ( ఆండాళ్ రచించినవి తమిళ్ లో)

*ధనుర్మాసంలో 30 రోజులు పారాయణం చేయవలసిన   30 పాశురాలు మీకోసం*
🌻🌺🍀🌻🌺🍀🌻🌺🍀🌻🌺
*🏵🙏జై శ్రీమన్నారాయణ🙏🏵*
*🕉ఓం అస్మత్ గురుభ్యోనమః🕉*


*☘ 1. వ రోజు  పాశురము : ☘*

    మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్
    నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
    శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్
    కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
    ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్
    కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్
    నారాయణనే నమక్కే పఱై దరువాన్
    పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !

  *☘2. వ రోజు పాశురము :☘*

    వైయత్తు వాళ్ వీర్ గళ్! నాముమ్ నమ్బావైక్కు
    శేయ్యుం కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్
    పైయ త్తుయిన్ఱ పరమనడిపాడి
    నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
    మైయిట్టెళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్
    శెయ్యాదన శెయ్యోమ్ తీక్కుఱళైచ్చెన్ఱోదోమ్
    ఐయముమ్ పిచ్చైయుంఆన్దనై యుంకైకాట్టి
    ఉయ్యుమాఱెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.

*☘3. వ రోజు పాశురము :☘*

    ఓఙ్గి యులగళన్ద ఉత్తమన్ పేర్ పాడి
    నాఙ్గిళ్ నంబావైక్కు చ్చాత్తినీరాడినాల్
    తీఙ్గిన్ఱి  నాడెల్లామ్ తిజ్గిళ్ ముమ్మారిపెయ్ దు
    ఓఙ్గువళై ప్పోదిల్ పొఱివండు కణ్ పడుప్ప
    తేఙ్గాదే పుక్కిరున్దు శీర్ త్తములై పత్తి
    వాఙ్గ-  క్కుడమ్ నిఱైక్కుమ్ వళ్ళల్ పెరుమ్ పశుక్కళ్
    నీఙ్గాద శెల్వమ్ నిఱైన్దేలో రెమ్బావాయ్.

*☘4. వ రోజు పాశురము :☘*

    ఆళి మళైక్కణ్ణాః ఒన్ఱు నీ కైకర వేల్
    ఆళి యుళ్ పుక్కు మగన్ధు కొడార్ త్తేఱి
    ఊళి ముదల్వనరువమ్ పోల్ - మెయ్ కఱుత్తు
    పాళి య న్దోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
    ఆళి పోల్ మిన్ని వలమ్బురి పోల్ నిన్ఱ దిర్ న్దు
    తాళాదే శార్ ఙ్గం ముదైత్త శరమళై పోల్
    వాళ వులగినిల్ పెయ్ దిడాయ్ - నాజ్గళుమ్
    మార్ గళి నీరాడ్ మాగిళ్ న్దేలో రెమ్బావాయ్.

*☘5. వ రోజు పాశురము :☘*

    మాయనై మన్ను వడమదురై మైన్దనై
    త్తూయ పెరునీర్ యమునై త్తుఱైవనై
    ఆయర్ కులత్తినిల్ తోన్ఱుమ్ మణివిళక్కై
    త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ త తామోదరనై
    తూయోమాయ్ వన్దు నామ్ తూమలర్ తూవిత్తొళుతు
    వాయినాల్ పాడిమనత్తినాల్ శిన్ధిక్క
    ప్పోయపిళైయుమ్ పుగుదరువా నిన్ఱనవుమ్
    తీయినిల్ తూశాగుమ్ శెప్పేలో రెమ్బాబాయ్.

*☘6. వ రోజు పాశురము :☘*

పుళ్ళుమ్ శిలుమ్బినకాణ్ పుళ్ళరైయన్ కోయిలిల్
    వైళ్లైవిళిశజ్గన్ పేరరవమ్ కేట్టిలైయో
    పిళ్ళాయ్! ఎళున్దిరాయ్ పేయ్ ములైనఞ్జణ్డు
    కళ్లచ్చగడమ్ కలక్కళియక్కాలోచ్చి
    వెళ్లత్తరవిల్ తుయి లమర్ న్దవిత్తినై
    ఉళ్ళత్తు క్కొణ్డు మునివర్ గళుమ్ యోగిగళుమ్
    మెళ్ళ వెళున్దు అరియెన్ఱ పేరరవమ్
    ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్

*☘7. వ రోజు పాశురము :☘*

కీశు కీశెన్ఱెజ్గు మానైచ్చాత్త జ్గలన్దు
    పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయా పేయ్ ప్పెణ్ణే!
    కాశుమ్ పిఱప్పుమ్ కలగలప్పక్కై పేర్తు
    వాశ నరుజ్గళ లాయ్ చ్చియర్; మత్తినాల్
    ఓశైప్పడుత్త త్తయిరరవమ్ కేట్టిలైయో
    నాయకప్పెణ్పిళ్లాయ్! నారాయణన్ మూర్తి
    కేశవనైప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో
    తేశముడై యాయ్! తిఱ వేలోరెమ్బవాయ్.

*☘8. వ రోజు పాశురము :☘*

కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱు వీడు
    మేయ్ వాన్ పరన్దనకాణ్! మిక్కుళ్ళపిళ్ళైగళుమ్
    పోవాన్ పొగిన్ఱారై ప్పోగామల్ కాత్తున్నై
    కూవువాన్ వన్దు నిన్ఱోమ్; కోదుకల ముడైయ
    పావాయ్! ఎళున్దిరాయ్, పాడిప్పఱై కొణ్డు
    మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ
    దేవాది దేవనైచ్చెన్ఱు నామ్ శేవిత్తాల్
    ఆవా వెన్ఱారాయ్ న్దు అరుళేలో రెమ్బావాయ్.

*☘9. వ రోజు పాశురము :☘*

తూమణి మాడత్తు చ్చుత్తుమ్ విళక్కెరియ
    తూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్
    మామాన్ మగళే! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్
    మామీర్! అవళై యెళుప్పీరో! ఉన్ మగళ్ దాన్
    ఊమైయో? అన్ఱిచ్చెవిడో? ఆనన్దలో
    ఏమప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో?
    "మామాయన్, మాదవన్; వైగున్దన్" ఎన్ఱెన్ఱు
    నామమ్ పలవుమ్ నవి న్ఱేలో రెమ్బావాయ్

*☘10. వ రోజు పాశురము :☘*

    నోత్తు చ్చువర్ క్కమ్ పుగుగిన్ఱ అమ్మనాయ్!
    మాత్తముమ్ తారారో వాశల్ తిఱవాదార్
    నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్; - నమ్మాల్
    పోత్తప్పఱై తరుమ్ పుణ్ణియనాల్! పణ్డోరునాళ్
    కూత్తత్తిన్ వాయ్ వీళ్ న్ద కుమ్బకరణనుమ్
    తోత్తు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో?
    ఆత్త అనన్దలుడైయాయ్! అరుజ్గలమే!
    తేత్తమాయ్ వన్దు తిఱ వేలో రెమ్బావాయ్.

*☘11. వ రోజు పాశురము :☘*

కత్తుక్కఱవై క్కణంగళ్ పల కఱన్ధు
    శెత్తార్ తిఱ లళియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుమ్
    కుత్త మొన్ఱిల్లాద కోపలర్ దమ్ పొఱ్కొడియే
    పుత్తర వల్ గుల్ పునమయిలే పోదరాయ్
    శుత్తత్తు తోళిమారెల్లారుమ్ వనుమ్ నిన్
    ముత్తమ్ పుగున్థు ముగిల్ వణ్ణన్ పేర్పాడ
    శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి, నీ
    ఎత్తుక్కు ఱజ్ఞమ్ పొరుళే లోరెమ్బావాయ్.

*☘12. వ రోజు పాశురము :☘*

కనైత్తిళజ్గత్తెరుమై కన్ఱుక్కిరజ్గి,
    నినైత్తుములై వళియే నిన్ఱుపాల్ శోర,
    ననైత్తిల్లమ్ శేఱాక్కుమ్ నఱ్చెల్వన్తజ్గాయ్!
    పనిత్తలైవీళ నిన్ వాశల్ కడైపత్తి
    చ్చినత్తినాల్ తెన్నిలజ్గైక్కోమానైచ్చెత్త
    మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్
    ఇనిత్తా నెళున్దిరాయ్ ఈదెన్న పేరు ఱక్కమ్
    అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్.

*☘13. వ రోజు పాశురము :☘*

పుళ్ళిన్ వాయ్ కీణ్డానైప్పొల్లా వరక్కనై,
    క్కిళ్ళిక్కళైన్దానై క్కీర్తిమై పాడిప్పోయ్,
    ప్పిళ్ళైగ ళెల్లారుమ్ పావైక్క ళమ్బుక్కార్,
    వెళ్ళియెళు న్దువియాళముఱజ్గిత్తు,
    పుళ్ళుమ్ శిలుమ్బివ గాణ్ పోదరి క్కణ్ణినాయ్,
    కుళ్ళక్కుళిరక్కుడైన్దు నీరాడాదే,
    పళ్ళిక్కిడత్తియో పావాయ్ నీనన్నాళాల్,
    కళ్ళమ్ తవిర్ న్ధు కలన్దేలో రేమ్బావాయ్.

*☘14. వ రోజు పాశురము :☘*

ఉజ్గళ్ పుళైక్కడై త్తోట్టత్తు వావియుళ్
    శెజ్గళు నీర్ వాయ్ నెగిళ్ న్దు అమ్బల్ వాయ్ కూమ్బినకాణ్
    శెజ్గల్ పొడిక్కూఱై వెణ్బల్ తవత్తవర్
    తజ్గళ్ తిరుక్కోయిల్ శజ్గిడువాన్ పోగిన్ఱార్
    ఎజ్గళై మున్నమ్ ఎళుప్పువాన్ వాయ్ పేశుమ్
    నజ్గాయ్! ఎళున్దిరాయ్ నాణాదాయ్ నావుడైయాయ్!
    శజ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్
    పజ్గయక్కణ్తానై

*☘15. వ రోజు పాశురము :☘*

‘‘ఎల్లే! ఇళంగిళియే ఇన్నమ్‌ ఉరంగుదియో?’’
‘‘శిల్లెన్రు అళైయేన్‌మిన్‌ నంగైమీర్‌! పోదరుగిన్రేన్‌’’
‘‘వల్లై, ఉన్‌ కట్టురైగళ్‌! పణ్డే ఉన్‌ వాయ్‌ అరిదుమ్‌!’’
‘‘వల్లర్‌గళ్‌ నీంగళే నానే తాన్‌ అయిడుగ!’’
‘‘ఒల్లై నీ పోదాయ్‌ ఉనక్కు ఎన్న వేరు ఉడైయైు!’’
‘‘ఎలారుమ్‌ పోన్‌దారో?‘‘ పోన్‌దార్‌ పోనుదు ఎణ్ణిక్కొళ్‌;
వల్లానై కొన్రానై, మాత్తారై మాత్తు అళిక్క
వల్లానై, మాయనై ప్పాడు ఏల్‌ ఓర్‌ ఎంబావాయ్‌’’

*☘16. వ రోజు పాశురము :☘*

నాయగనాయ్ నిన్ఱనన్దగోపనుడైయ
    కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుమ్ తోరణ
    వాశల్ కాప్పానే! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్,
    ఆయర్ శిఱుమియరో ముక్కు; అఱైపఱై
    మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేర్ న్దాన్;
    తూయోమాయ్ వన్దోమ్, తుయలెళ పాడువాన్,
    వాయాల్ మున్న మున్నమ్ మాత్తాదే, అమ్మా! నీ,
    నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.

*☘ 17. వ రోజు పాశురము :☘*
 
 అమ్బరమే తణ్ణీరే! శోఱే! అఱమ్ శెయ్యుమ్
 ఎమ్బెరుమాన్! నన్దగోపాలా! ఎళిందిరాయ్
 కొంబనార్కెల్లామ్ కొళున్దే! కులవిళక్కే
 ఎమ్బెరు మాట్టి యశోదాయ్! అఱివుఱాయ్
 అమ్బర మూడఱుత్తు ఓంగి యులగళన్ద
 ఉమ్బర్ కోమానే ఉఱంజ్గాదు ఎళిందరాయ్
 శెమ్ పొఱ్కళలడిచ్చెల్వా; బలదేవా
 ఉమ్బియమ్ నీయుమ్ ఉఱంగేలో రెమ్బావాయ్

*☘18. వ రోజు పాశురము :☘*

   ఉన్దు మదకళిత్త నోడాద తోళ్ వలియన్
    నన్దగోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
    కన్దమ్ కమళుమ్ కుళలీ! కడై తిఱవాయ్;
    వన్దెజ్గమ్ కోళియళైత్తగాణ్; మాదవి
    ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలినజ్గళ్ కూవినగాణ్;
    పన్దార్ విరలి! ఉన్ మైత్తునన్ పేర్ పాడ,
    చ్చెన్దామరైక్కైయాల్ శీరార్ వళైయొలిప్ప
    వన్దు తిఱవాయ్ మగిళ్ న్దు ఏలో రెమ్బావాయ్,

*☘ 19. వ రోజు పాశురము :☘*

    కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్
    మెత్తెన్ఱ పఞ్చశ యనత్తిన్ మేలేఱి,
    కొత్తలర్ పూఙ్కుళల్ నప్పిన్నై కొఙ్గైమేల్
    వైత్తుక్కి డన్దమలర్ మార్ పా! వాయ్ తిఱవాయ్
    మైత్తడ జ్కణ్నినాయ్ నీ యున్మణాళనై
    ఎత్తనై పోదుమ్ తుయిలెళ వొట్టాయికాణ్
    ఎత్తనై యేలుమ్ పిరివాత్తగిల్లాయాల్
    తత్తువ మన్ఱుతగవేలో రెమ్బావాయ్

*☘20. వ రోజు పాశురము :☘️*

ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్ఱు
కప్పమ్ తవిర్కుమ్ కలియే! తుయిలెళాయ్;
శెప్పముడైయాయ్! తిఱలుడైయాయ్! శెత్తార్కు
వెప్పఙ్గొడుక్కుమ్ విమలా! తుయిలెళాయ్;
శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిఱు మరుఙ్గుల్
నప్పిన్నై నఙ్గాయ్! తిరువే! తుయిలెళాయ్;
ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై
ఇప్పోతే యెమ్మై నీరా ట్టేలో రెమ్బావాయ్

*☘21. వ రోజు పాశురము :☘*
 
ఏత్తకలఙ్గళ్ ఎదిర్ పొఙ్గి మీదళిప్ప     
మాత్తాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కళ్
ఆత్తప్పడ్తెత్తాన్ మగనే! యఱివుఱాయ్;
ఊత్తముడైయాయ్ పెరియాయ్! ఉలగినిల్
తోత్తయాయ్ నిన్ఱశుడరే. తుయిలెళాయ్;
మాత్తారునక్కు వలితులైన్దు ఉన్ వాశఱ్కణ్
ఆత్తాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే
పోత్తియామ్ వన్దోమ్ పుగళన్దు ఏలోరెమ్బావాయ్

*☘ 22. వ రోజు పాశురము :☘*

అఙ్గణ్ మాఞాలత్తరశర్, అబిమాన
బఙ్గమాయ్ వన్దు నిన్ పళ్లిక్కటిల్ కీళే
శఙ్గమిరుప్పార్ పోల్ వన్దు తలైప్పెయ్ దోమ్
కిఙ్గిణివాయ్ చ్చెయ్ ద తామరై ప్పూప్పోలే
శెఙ్గణ్ శిఱిచ్చిణిదే యెమ్మేల్ విళియావో;
తిఙ్గళు మాదిత్తియను మెళున్దాఱ్పోల్
అఙ్గణిరణ్డు ఙ్గొణ్డు ఎఙ్గళ్ మేల్ నోక్కుదియేల్
ఎఙ్గళ్ మేల్ శాబ మిళిన్దులో రెమ్బావాయ్.

*☘ 23. వ రోజు పాశురము :☘*

మారి మలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గుమ్
శీరియు శిఙ్గ మఱివిత్తు త్తీ విళిత్తు
వేరి మయిర్ పొఙ్గ వెప్పాడుమ్ పేర్ న్దు దఱి
మూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పుఱప్పట్టు
పోదరు మాపోలే; నీ పూవైప్పూవణ్ణా! ఉన్
కోయిల్ నిన్ఱిఙ్గనే పోన్దరుళి, కోప్పుడైయ
శీరియ శిఙ్గాసనత్తిరున్దు, యామ్ వన్ద
కారియమారాయ్ న్దరుళే లో రెమ్బావాయ్.

*☘24. వ రోజు పాశురము :☘* 

అన్ణి వ్వులగ మళన్దాయ్! ఆడిపొత్తి;
చ్చేన్ణజ్ఞ తైన్నిలజ్ఞేశేత్తాయ్! తిఱల్ పొత్తి;
పోన్ణ చ్చగడ ముద్దైత్తాయ్! పుగళ్ పొత్తి;
కన్ఱుకుడై యావేడుత్తాయ్! గుణమ్ పొత్తి;
వెన్ణుపగై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పొత్తి;
ఎన్ణెన్ణున్ శేవగమే యెత్తిప్పఱై కోళ్వాన్
ఇన్ఱి యామ్  వన్దొన్  ఇరజ్గేలో రెమ్బావామ్

*☘ 25. వ రోజు పాశురము :☘*
 
ఒరుత్తి మగనాయ్ పిఱన్దు, ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ ఒలిత్తు వళర,
తరిక్కిలానాగిత్తాన్ తీజ్ఞనినైన్ద
కరుతై ప్పిళ్ళైత్తు కఞ్ఙన్ వయిత్తిల్
నెరుప్పెన్న నిన్ఱ నెడు మాలే! యున్నై
ఆరుత్తిత్తు వన్దోమ్; పఱై తరుతియాకిల్ యామ్పాడి
వరుత్తముమ్ తీర్ న్దు మగిళ్ న్దేలో రెమ్బావాయ్.

*☘ 26. వ రోజు  పాశురము :☘*

మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడువాన్;
మేలైయార్ శేయ్యనగళ్ ; వేణ్ణువన కేట్టియేల్;
ఞ్ లతై యెల్లామ్ నడుజ్ఞ మురల్వన
పాలన్న శజ్ఞజ్ఞళ్, పోయ్ ప్పాడు డైయనవే,
శాలప్పేరుమ్ పఱైయే, పల్లాణ్ణిశైప్పారే,
కోలవిళక్కై, కోడియే, వితానమే,
ఆలినిలై యామ్! ఆరుళేలో రేమ్బావాయ్

*☘ 27. వ రోజు పాశురము :☘*
 
కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్డా వుందన్నై
ప్పాడిప్పఱై కొణ్ణు యామ్ పెరు శమ్మానమ్       
నాడుపుకళుమ్ పరిశినాల్ నన్డాక
శూడగమే తోళ్ వళై యేతోడేశేవిప్పూ
యామిణిహొమ్ పాడగమే యేన్ఱనైయ పల్ కలనుమ్
అడైయుడుప్పోమ్ అతన్ పిన్నే పాల్ శోఱు
మూడ, నెయ్ పెయ్ తు మళుంగైవళివారకూడి యిరుస్టు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.

*☘ 28. వ రోజు పాశురము :☘*

కఱవై పిన్ శేస్టు కానమ్ శేర్ న్దుణ్బోమ్
అఱివోన్ఱు మిల్లాత వాయ్ క్కులత్తు, ఉన్ఱన్నై
ప్పిఱవి పెఱున్దనై పుణ్ణియమ్ యాముడై యోమ్
కుఱైవోన్ఱు మిల్లాదగోవిన్డా! ఉన్ఱన్నోడు
ఉఱవేల్ సమక్కు ఇంగోళిక్క వోళియాదు
అణియాద పిళ్ళైగాళోం అన్బినాల్, ఉన్ఱన్నై?
శిరు ఇఱైవా నీ తారయి పరమేలో రెంబావాయ్

*☘ 29. వ రోజు పాశురము :☘*
 
శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు ఉన్   
పొత్తామరై యడియే పోత్తుమ్ పోరుళ్ కేళాయ్;
పెత్తమ్మేయ్ త్తుణ్ణు జ్కులత్తిన్ పిఱన్ద నీ,
కుత్తేవల్గెళై క్కోళ్వామల్ పోకాదు;
ఇతైప్పఱై కోళ్వానన్దుకాణ్ గొవిన్దా:
ఎత్తైక్కు  మేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శేయ్ వోమ్,
మత్తైనజ్కా మఞ్గళ్ మాత్తేలో రెమ్బావాయ్

*☘ 30. వ రోజు పాశురము :☘*

   వఞ్గక్కడల్ కడైన్ద మాడవనై క్కేశవనై
        త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళ్ళై యార్ శేన్ణిఱైఞ్ఙ
        అఞ్గప్పఱైకోణ్ణవాత్తై, యణిపుదువై
        పైఙ్గమలత్తణ్దెరియల్ పట్టర్ పిరాన్ కొదైశొన్న
        శజ్ఞత్తమిళ్ మాలై ముప్పుదుమ్ తప్పామే
        ఇఙ్గిప్పరిశురైప్పా రీరిరణ్దు మాల్వరైత్తోళ్
        శేఙ్గిణ్ తిరుముగుత్తు చ్చెల్వ త్తిరుమాలాల్
        ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తుఇంబరువరెమ్బావాయ్
        అణ్దాల్ తిరువడిగళే శరణమ్


*🌹🙏ఓం నమో వేంకటేశాయ🙏🌹*
*🙏లోకాసమస్తా సుఖినోభవంతు🙏*
🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉
*🍀🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🍀*