Friday, November 17, 2023

మన పండగలు

పరిశీలించండి🤔మాతృనవమి ఉండగ×మదర్స్' డే ....... ....
కౌమూది మహోత్సవం ఉండగా×వాలెంటాయిన్ డే
అవసరమా**** ****
గురుపౌర్ణమి ఉండగా×టీచర్స్' డే ***** *****
ధన్వంతరిదినానికి×డాక్టర్స్ డే**** ****
విశ్వకర్మ జయంతి×టెక్నాలజీ డే**** ****
సంతాన సప్తమి×చిల్డ్రన్స్ డే**** ****
నవరాత్రికన్యాభోజనం×డాటర్స్ డే**** ****
రక్షాబంధనం×సిస్టర్స్ డే**** ****
భావుబీజ్ బగినీహస్త భోజనం×బ్రదర్స్ డే*** ***
ఉసిరినవమి,తులసి వివాహం, కార్తీక పౌర్ణమి దీపోత్సవం×ఎన్వాయిర్మెంట్ డే*** ***
మన పండుగను గురించి:- భావితరాలకు అర్థమయ్యేలా మన మాతృభాషలో.....
1,మకర సంక్రాంతి,పొంగల్,అయ్యప్పస్వామి వారి ఉత్సవాలు.
2,వసంతపంచమి.
3,మహాశివరాత్రి.
4,హోళీ,రంగపంచమి.
5,చైత్రనవమి,చైత్రనవరాత్రి,శ్రీరామ నవమి.
6,అక్షయ తృతీయ, (మూడున్నర ముహూర్తాల్లో ఇది ఒక్క పూర్తి ముహూర్తం)
7,నాగపంచమి.
8,శ్రీకృష్ణజన్మాష్టమి(ఉట్లపండుగ,ఉట్లుకొట్టడం)
9,వినాయక చవితి,(వినాయక నవరాత్రులు, గణేషోత్సవం,ఉండ్రాళ్ళచవితి).
10,దసరా,(బతుకమ్మ పండుగ, సద్దులబతుకమ్మ,విజయదశమి).ఇది కూడ మూడున్నర ముహూర్తాల్లో రెండవ శుభముహూర్తం.
11,దీపావళి.ఇదీ ఆ మూడున్నర ముహూర్తాల్లో అర(సగం)సంధ్యవేళ మొదలౌతుంది.
12,చంపాశష్ఠి.
13,దత్తజయంతి(సట్టి మల్లన్న దేవుడిబోనాలు,తీర్థం(జాతర)కొమురవెల్లిమల్లన్నబోనాలు,జాతర ఇలా ఇంకెన్నో పండుగలు,ఉత్సవాలు....
మద్య మద్యలో శ్రీసత్యనారాయణస్వామి మహాపూజ వ్రతం, మంగళా గౌరీనోములు, వ్రతాలు,వరలక్ష్మీ వ్రతపూజలు,సంకటహరచతుర్థి, (సంకష్టి),ఏకాదశీ,ప్రదోశవేళ సదాచారం,శరద్ పౌర్ణమి, (కోజాగిరి పౌర్ణమి), ఆశాడమాస బోనాలు,
ఇంకాఅతిముఖ్యంగ ఉగాది(యుగాది) మన సాంప్రదాయ పంచాంగం ప్రకారం నూతన సంవత్సరం ఆరంభం.
పంచాంగ శ్రవణం, ప్రభాత ఫేరీలు,పిండి వంటలలో ముఖ్యంగాపూర్ణంపోలీలు(బొబ్బట్లు, పోలెలు, పూర్ణం బూరెలు, బూరెలు) శడ్రృఛుల పచ్చడి అదే ఉగాది పఛ్ఛడి రుచితో తీపి,ఉప్పు,కారం,చేదు,వగరు,కశాయం ఇలా సంమ్మిశ్రిత జీవిత అనుభవాలు....
పండుగలు, ఉత్సవాలు జరుపుకునే తీరు ...
ఎంత గొప్ప సంస్కృతి  మనది. ఇంకా చెప్పాలంటే జీవం బీజాంకురం దాల్చగానే గర్భసంస్కారం, పురుడుపోసుకుని వెంటనే ...ఒక పన్నెండవ రోజు కనుక బారస,కొన్ని సందర్భాల్లో ప్రాంతీయ పద్దతిలో 21వ,రోజు అదే నామకరణ సంస్కారం,జన్మదినవేడుక,కేశఖండన సంస్కారం. వెంటేచెవులు,(ముక్కు ఆడపిల్లలవుతె)స్వర్ణకార సంస్కారం.
ధోవతి,పంచె (వొల్లె,చీరకట్టు ఆడపిల్లకి) సంస్కారం అదీ అమ్మా తాతల ద్వారా.....అక్షరభ్యాస శ్రీకారం విధీ, బాల సంస్కారం, మరికొందరిలోఉపనయనం,జనేవుసంస్కారం,గురుకుల పాండిత్యం, 
వివాహ సంస్కారం******* *******ఇలా నానా రకాల సంస్కారయుక్త సమమ్మేళనం గల మన పర్వదినాలు మనకంటె ముందే మన పరిచయాన్ని చాటిస్తాయి.

Monday, November 6, 2023

దర్శనీయ స్థలాలు : మైసూరు శ్రీరంగ పట్టణం...

17/03/2023.
మనోహరి మహిళా పత్రిక కొరకు.
అంశం : దర్శనీయ స్థలాలు.
(ఐచ్ఛికం ).

శీర్షిక : మైసుారు , శ్రీరంగపట్టణం .(కర్నాటక).

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

 

భారతదేశం అంటే మొదట గుర్తు వచ్చేది పుణ్య క్షేత్రాలే. కాశ్మీరు నుండి, కన్యాకుమారి వరకు అడుగుకొక పుణ్య క్షేత్రం ఉంటుంది, 
నాకు మావారికి తీర్థయాత్రలు చేయడమంటే చాలా ఇష్టం .
కారణం పుణ్య నదుల్లో స్నానాలు చేయడం, భగవద్దర్శనం చేసుకోవడం వంటివి మనసుకు చాలా 
ప్రసాంతతనిస్తాయన్న నమ్మకం ఎక్కువగా ఉండేది.  .

ఆ యిష్టం తోనే అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి వచ్చి అక్కడి విషయాలను పదే పదే తలుచుకొంటుా ఆనందపడేవాళ్ళం.  

మా తమ్ముడికి ఉద్యోగరీత్యా మైసుారుకు ట్రాన్స్‌ఫర్ 
అయ్యింది. తను భార్యా పిల్లలతో అక్కడ సెటిల్ అయ్యేకా
మమ్మల్ని అక్కడికి రమ్మని పదేపదే పిలవడంతో మేము మైసుారుకు వచ్చేము. 
ఇక మా తమ్ముడు మైసుారంతా  తప్పకుండా  తిరిగి చుాడాల్సిన ప్రదేశమనీ ఎన్నో  పురాతనమైన మైన మందిరాలు  చారిత్రాత్మక  కట్టడాలతో చాలా అందంగా ఉంటుందనడంతో
సహజంగా మాకుండే ఉత్సాహంతో మరి కొన్ని రోజులవరకు  మా  తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాం. 
ఇంకేముంది..
శని ఆది వారాలైతే ఇంట్లో ఉండేవాళ్ళమేకాదు.
అక్కడే చుట్టుపక్కలనున్న  బృందావన్ గార్డెన్స్ , ఛాముండీ కొండకు చాలా సార్లు వెళ్ళేము .

రక రకాల పుాల వనాలు చెట్ల తో నిండిఉన్న బృందావన్ గార్డెన్స్, సాయంత్ర సమయాల్లో వెలుగుతున్న దేదీప్యమానమైన రంగు  దీపాల మధ్య అద్భుతమైన అందాన్ని సంతరించుకుంటుంది . అంతేకాదు..
నీటితో చేసే విన్యాసాలు (వాటర్ షో) మనలను ఆశ్ఛర్యచకితులని చేస్తాయి. పిల్లలతో  అక్కడికి వెళితే వాళ్ళు "ఇళ్ళకు తిరిగి రాము"  అని చేసే మారాము, 
మనకు చుక్కల్ని చుాపిస్తుందంటే నమ్మండి. ఇక కొండపై వెలసిన అమ్మవారైన ఆ ఛాముండేశ్వరీ తల్లి మహిమలు కోకొల్లలు. అక్కడి ప్రజలంతా ఆమెను అనునిత్యం 
ఆరాధిస్తుా ఉంటారు అనడానికి అక్కడికి వచ్చే జన ప్రవాహమే సాక్ష్యం .

అలా తిరుగుతుానే ఒకరోజు అనుకోకుండా మైసుార్ సిటీలోనున్న" చెన్న కేశవ" ఆలయానికి వెళ్ళేము.
ఎందు చేతనో అక్కడ పుాజలు జరగడంలేదు. 
కానీ విదేశీయులెందరో ఆ ప్రదేశాన్ని దర్శిస్తుాండడంతో 
దానిని పర్యాటక స్థలంగా చాలా అందంగా తీర్చి దిద్దేరు.
ఆక్కడ  చెన్నకేశ్వరుని పుార్తి శిలా నిర్మత  ఆలయం,  శిఖరాగ్రం వరకు అందమైన రాతి చెక్కడాలతో అద్భుత శిల్పకళా వైభవంతో అలరారుతుా  మనసులను రంజింపజేస్తుా చుాపరులను పరవసింపజేస్తొింది.

ఒకొక్క ప్రదేశం ఒకొక్క అద్భుతమైన చరిత్రకు నిదర్శనంగా,  .
ఒకొక్క  పుణ్య తీర్ధం  పవిత్ర పుణ్య  క్షేత్రంగా మా మనసులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 
ఎంత చుాసినా తనివి తీరని కొన్ని ప్రదేశాలలో  .  
మా మనసుకు హత్తుకున్న శ్రీరంగపట్నం గురించి నేను తెలుసుకున్న  కొన్ని విషయాలను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. 

శ్రీరంగపట్నం భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలోని ఏడు తాలూకాలలో ఒకటైన పట్టణ  ప్రధాన కార్యాలయం . 

హైదర్ అలీ టిప్పు సుల్తాను-
మాండ్య నగరానికి సమీపంలో ఉన్న ఈ  శ్రీరంగపట్టణాన్ని 
 మైసూరు రాజ్యానికి' రాజధానిగా  చేసి  ఆ తర్వాత
దక్షిణ భారత్ లోని పలు భాగాలను  తన రాజ్యం లో కలుపుకున్నాడు   అని మనం చరిత్రలో చదువుకున్నాము.

చారిత్రక, ధార్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను గలిగివున్న
ఈ నగరంలోని "శ్రీరంగనాధ స్వామి "ఆలయంలో వెలసిన రంగనాధస్వామి పేరున ఈ నగరానికి "శ్రీరంగపట్టణం " అనే పేరు వచ్చిందని చెపుతారు..
 ఈ ఆలయాన్ని  తొమ్మిదవ శతాబ్దంలో గంగ వంశపు రాజులు నిర్మించారని చరిత్ర . 
మైసూర్ రాజధాని నగరానికి సమీపంలో గల కోట, శ్రీరంగపట్నం కోటను నియంత్రిస్తోందని చెపుతారు.

రంగరాయను ఓడించిన వడయార్ రాజు  శ్రీరంగపట్టణాన్ని వశబర్చుకుని , పిదప విజయనగర సామ్రాజ్యంపై దండెత్తేడని,  అందుకై విజయనగర సామ్రాజ్య ఆరాధ్య దేవతయైన అలిమేలమ్మ  కోపించి , వడయార్ రాజును శపించిందనీ, దాని కారణాన వడయార్ రాజుకు సంతానం కలుగలేదని ఓ కథనం ఉన్నది. 
ఆ కారణంగా అప్పటి అధికారంలో ఉన్న వడయార్ వంశస్థుడైన చామరాజ వడయార్ రాజులే ఇప్పటికీ అధికారికంగా మైసూర్ మహారాజులుగా పరిగణింపబడుతున్నారు.

అప్పటి శ్రీరంగపట్నం వైస్రాయ్ ,రంగరాయను ఓడించి,
మైసూర్ యొక్క రక్షక దేవత అయిన చాముండేశ్వరీ దేవి సమక్షంలో ,పది  రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంతోపాటు, సింహాసనంపై హక్కుదారులు ఎవరైనా మైసూర్ రాజ్యంపై నియంత్రణను ప్రదర్శించి, సార్వభౌమాధికారాన్ని సూచించగలరని తెలియజేయడంతో ,
కాలక్రమేణా అదే మాట అంగీకరించబడి నేటికీ కొనసాగుతోందంటారు., 

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మైసూర్ రాజ్యంలో భాగంగా ఉండేదని,  అప్పట్లో
శ్రీరంగపట్నం మైసూర్ రాజధాని నగరానికి దగ్గరగా ఉన్న    కోటగానేగాక ,దండయాత్ర జరిగే సమయంలో ఇది 
రాజ్యానికి రక్షణ కోటగా పరిగణించబడేదని అంటారు..
 
 అటుపై శ్రీరంగపట్నం దక్షిణ భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన వైష్ణవ తీర్థయాత్ర కేంద్రాలలో ఒకటిగా మారింది
 పట్టణం మొత్తం కావేరీ నదిచే చుట్టబడి, ఇదో ద్వీపంలా కనబడుతుాండడంతో అక్కడి కొన్ని ప్రదేశాలు  UNESCO ద్వారా  ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా నామినేట్ చేయబడ్డాయి.

కావేరీ నదిలో ఏర్పడిన అన్ని ద్వీపాలు శ్రీ రంగనాథస్వామికి  సంబంధించిన పవిత్రమైన ప్రదేశాలుగా మన సాంప్రదాయ చరిత్ర చెబుతుంది .

మూడు అతిపెద్ద ద్వీపాలలో  దేవుడికి అంకితం చేయబడిన పెద్ద దేవాలయాలు, చాలా పురాతన కాలంలోనే నిర్మించబడ్డాయి.   కావేరీ నదిలో ఏర్పడిన సహజ ద్వీపాలలో ఉన్న రంగనాథ దేవుడి మూడు ఆలయాలలో శ్రీరంగపట్నం ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది . ఇక్కడ కొలువైన రంగనాధుడు " ఆది రంగనిగా  " పుాజలందుకుంటున్నాడు.

ఇక  భారతదేశంలో కర్ణాటకలోని చామరాజనగర జిల్లా , కొల్లేగల తాలూకాలోని శివనసముద్రంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం "మధ్య రంగ !" ఆలయంగా...

భారతదేశ  తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా , శ్రీరంగం తాలూకాలోని " శ్రీ రంగనాథస్వామి ఆలయం "అంత్య రంగ" ఆలయంగా ప్రసిద్ధి చెందేయి.

 శ్రీరంగపట్నంలోని కావేరీలోని పశ్చిమ వాహిని విభాగం 
ప్రత్యేకించి పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది; పుణ్యాత్ములు దూర ప్రాంతాల నుండి వచ్చి, మరణించిన వారి బూడిదను నిమజ్జనం చేయడమేగాక, ఈ నీటిలో తమ పూర్వీకులకు  పిండతర్పణాది కార్యక్రమాలను నిర్వహిస్తారు..


విజయనగర సామ్రాజ్య కాలంనుండి పుణ్యక్షేత్రంగా, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతున్న ఈ.  
 శ్రీరంగపట్టణంలో పలు ప్రదేశాలు చూడదగినవిగా ప్రసిద్ధిచెందినవి చాలానే ఉన్నాయి..
 
  వాటిలో ముఖ్యమైనవి :
రంగనాధ ఆలయం : ఈ ఆలయం చాలా పురాతనమైనదే కాక హైందవ సంప్రదాయంలో, అందులోనూ వైష్ణవ సంప్రదాయంలో మరీ ప్రఖ్యాతి పొందినది. మైసూరును హైదరాలీ పరిపాలించిన కాలంలో ఈ ఆలయానికి సమీపంలోని మందుగుండు సామగ్రి కార్ఖానా పేలి రంగనాథస్వామి దేవాలయ గోపురం విరిగిపడిందని,
 హైదర్ అలీ వెన్వెంటనే తన సైనికులను పంపి వారిచేతనే దేవాలయ గోపురాన్ని  పునఽనిర్మింపజేశారని చెపుతారు.
 
జుమ్మా మసీదు, రంగన్నతిట్టు పక్షి అభయారణ్యం,
కరిఘట్ట,శివసముద్రం జలపాతం, వంటి పర్యాటక స్థలాలు
చుాసినకొలదీ చుాడాలనిపించేట్టు ఉంటాయి.

శివసముద్రం జలపాతం  భారత్ లో రెండవ అతిపెద్ద జలపాతంగానేగాక, ప్రపంచంలోనే  అతిపెద్ద జలపాతంగా
పదహారవస్థానంలో ఉంది.

ఇక పోతే రంగన్నతిట్టు పక్షి అభయారణ్యం అన్నది
ఒకప్పటి మైసూర్ రాజైన కంఠీరవ నరసింహరాజ వడియార్ కావేరీ నదికి అడ్డంగా ఒక కట్టను నిర్మించినప్పుడు రంగనాతిట్టు యొక్క ద్వీపాలు ఏర్పడి , పక్షులను ఆకర్షించడం ప్రారంభించడం ,.రాను రాను
 వేలు, లక్షల సంఖ్యలో ఈ పక్షులే కాక ఇతర వన్య ప్రాణులు కుాడా వచ్చి బస చేయడంతో ఈ అరణ్యం , అభయారణ్యంగా పిలువబడుతుా  రాష్ట్రంలోనే 
అతిపెద్ద పక్షి అభయారణ్యంగా ప్రసిద్ధి చెందింది. నలభై ఎకరాల విస్తీర్ణంతో , కావేరీ నది ఒడ్డున, ఆరు ద్వీపాలను కలిగి ఉండి , .దాదాపు నుాట డెబ్భై పక్షి జాతులు కలిగి ఉన్న అరణ్యంలో.. 
 శీతాకాలపు నెలలలో, డిసెంబర్ మధ్య నుండి మొదలై, దాదాపు నలభైవేల పక్షులు రంగనాతిట్టు వద్ద సమావేశమవుతాయట, 

ఈ కర్ణాటక లో ఒక్క శ్రీరంగ పట్నమే కాక చుాడవలసున ఎన్నో ప్రదేశాలున్నాయి
హంపి , ధర్మస్థల, మెల్కొటే, ఉడిపి,  కుక్కే సుబ్రహ్మణ్య, 
శృంగేరి మఠం, హొరనాడు, శ్రావణబెళగొళ వంటి పర్యాటక పుణ్య స్థలాలు చుాసి తీరవలసిందే .
ఇవేకాక ప్రతీ చిన్న పల్లెలోగల గ్రామ దేవతలు వారి మహిమల గురించి వచ్చి చుాసి తెలుకోవలసిందే..

కాలుష్య రహితమైన ప్రదేశాలు, పురాతన కట్టడాలు రాజుగారి కోట తో పాటు , మరెన్నో చారిత్రాత్మిక, ధార్మిక  కళాఖండాలతో ప్రసిద్ధికెక్కిన ఈ మైసుారు పట్టణాన్ని చుాడడం మాకెంతో ఆనందాన్ని మానసిక సంతృప్తిని కలిగించింది. 

ఇక్కడి వ్యవహారిక భాష కన్నడ భాష .
బెంగుళూరు , మైసూర్ నుండి రైలు ద్వారా ఈ శ్రీరంగ 
పట్టణానికి సులభంగా చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం ద్వారా  ఉన్న  హైవే నుండి కుాడా ఇక్కడకు చేరుకోవచ్చు  .
మీరుకుాడా ఒక్క సారి వచ్చి ఈ పర్యాటక ప్రదేశాలన్నీ 
చుాస్తారు కదుా..

హామీ :
ఈ వ్యాసం నా స్వీయ రచన .

చింటూ చేసిన సాయం.( బాల సాహిత్యం).

5/04/2023.
మహిళా మనోహరి మాస పత్రిక కోసం .
అంశం: చందమామ కధలు.
శీర్షిక  : చింటుా..చేసిన సాయం.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర .


ఆరోజంతా పరధ్యానంగానే గడిపాడు చింటుా.
వాళ్ళ నాన్నగారికి మళ్ళీ మరో ఊరికి ట్రాన్ఫర్ ఆర్డర్స్ వచ్చేయి. ఇంకో నాలుగు రోజుల్లో ప్రయాణం .

చింటుాకి ఇక్కడ  చాలా బాగుంది .
చాలా మంది  మంచి మంచి స్నేహితులున్నారు.
ఒక మంచిపని చేయడమన్నా , ఒకరికి సహాయం చేయడమన్నా  , చెట్లు నాటడమన్నా అందరికీ చాలా యిష్టం.ఆ రకమైన భావనలు ఉన్నా వారంతా ఒకటై 
ఎంతోమంది చేత మంచి పిల్లలు అని అనిపించుకున్నారు.
తామంతా కలిస్తే , ఆట పాటలతొ సమయం తెలియనే తెలియదు.
అలాంటిది ఇప్పుడు అందరినీ వదిలి వెళిపోవాలంటే 
చింటుాకి ఏదోలా ఉండి ఏడుపొస్తోంది.
నాన్నాగారికి ప్రతీ ముాడు సంవత్సరాలకి మరో ఊరికి 
బదిలీ అవుతుా ఉంటుంది.
అప్పుడుకుాడా తను ఇంతలా బాధ పడలేదు.
కారణం , ఇంత మంచి స్నేహితులు ఎక్కడా కలవలేదు.
ఇంకా తాము అనుకున్న పనులు పుార్తి కానేలేదు.
అంతలోనే ఈ బదిలీ....
ముాడు సంవత్సరాలు  ఎంతో వేగంగా  గడచిపోయాయి
అనిపించింది చింటుాకి.

భారంగా స్నేహితులకు వీడికోలు చెప్పి తల్లిదండ్రులతో బయలుదేరాడు.

----------------------+------
తాము వచ్చిన ఊరు చాలా చిన్న పల్లెటుారు. 
అక్కడకు వచ్చిన పది రోజుల తర్వాత చింటుా వాళ్ళ నాన్న చింటుాని ఒక స్కుాల్ లో నాలుగవ తరగతిలో  జాయిన్ చేసేరు.
వాళ్ళకి కారుండడం వల్ల చింటుా కారులో చాలా దుారం ప్రయాణించి స్కుాల్ కి వెళ్ళి వస్తున్నాడు. వాళ్ళ డ్రైవరు ఆదివారాలు వస్తే పట్టణం నుండి ఇంటికి కావలసిన ముడి సరుకంతా తెచ్చేవాడు. 
ఏ ఒక్కటి మర్చి పోయినా చాలా ఇబ్బంది అయ్యేది.

చిన్న చిన్న కొండలు గుట్టలతో అక్కడక్కడ ఉన్న స్లేబ్ 
ఇళ్ళతో చాలా బాగుంది కానీ ,తమలాంటి కొంతమంది తప్ప
అక్కడ అస్సలు జనాలే లేరు. 
చుట్టుా చెట్లతో నిండి ఉన్నందువల్ల  కృుార  జంతువుల భయంతో సాయంత్రం ఆరు గంటలకే అందరుా ఇళ్ళ లోపలికి వెళిపోయి తలుపులు వేసీసుకుంటారు.
దాంతో చింటుాకి చాలా చికాకుగా భయంగా ఉండేది.

ఒక రోజు పగలు పది గంటలకు అలా తిరగడానికి వెళ్ళిన చింటుాకి ..కొంత దుారంలో చిన్న కాలి బాట కనిపించింది.
అదేమిటో చుాద్దామనుకొని ఆ తోవ గుండా బయలుదేరేడు చింటుా.
ఆ దారి చాలాదుారం తర్వాత ఒక చిన్న గుట్ట దగ్గరకు వచ్చి ఆగింది.
అక్కడ చాలామంది పిల్లలు  మట్టిలో దొర్లుతుా నవ్వుకుంటుా ఆనందంగా ఆడుకుంటున్నారు.  ఆడవాళ్ళు ముాడు రాళ్ళు పెట్టి పొయ్యిలా చేసి దాని మీద ఏదో వండుతున్నారు.
మగవాళ్ళంతా హాయిగా కుార్చొని కబుర్లాడుతున్నారు .
వాళ్ళున్న జాగా చుట్టుా ముళ్ళ కంచెలతో గోడలా చుట్టి ఉంది.

చింటుాకి చెప్పలేని ఆనందం కలిగింది. ఇంత మంది పిల్లలు 
ఇక్కడ ఉన్నా  ఇంత వరకు వాళ్ళంతా ఊరిలోకి ఎందుకు రాలేదో.. అనుకుంటుా వాళ్ళ దగ్గరకు  వెళ్ళే ప్రయత్నం చేసేడు. 
వాళ్ళు  తనను చుాసి ఆటలు ఆపీసేరు .పిల్లా పెద్దలు అందరుా తనను చుాసి కుాడా  మాట్లాడలేదు. 
చింటుా చాలా సేపు అక్కడ ఉండీ నిరాశగా వెను తిరిగాడు.
ఆరోజు నుండీ చింటుా రోజుా అక్కడికి వెళ్ళేవాడు.
వాళ్ళ ఆటలు చుాసేవాడు ..వాళ్ళు చింటుాని చుాసేవారు.
కానీ మాట్లాడేవారు కాదు.
అలా  కొన్ని రోజులు గడిచింది.

ఒకరోజు చింటుా తెల్లారి వాకింగ్ సమయంలో వాళ్ళ నాన్నగారిని అక్కడికి తీసుకొచ్చి చుాపించేడు .
అతను కుాడా ఆశ్ఛర్యపోయాడు . ఈ అడవిలాంటి ప్రాంతంలో వాళ్ళంతా ఒక జట్టుగా తమను తాము ఎందుకు
నిర్బంధించుకొని  ఎందుకలా ఉన్నారో అర్ధం కాలేదు.సరికదా వాళ్ళు తనను చుాడగానే తమ పిల్లలను గట్టిగా పట్టుకొని
తనవైపు చుాడడం ఆశ్ఛర్యం కలిగించింది. అందులో కొంతమంది పెద్దలు తమవైపు చుాస్తుా ఏవేవో అరుస్తుా , కొడతామన్నట్లు రాళ్ళు చేతితో ఎత్తి పట్టుకున్నారు.
చింటుా వాళ్ళ నాన్నగారు గబ గబా చింటుాని తీసుకొని 
ఇంటి త్రోవ పట్టేరు.
 చింటుాకి వాళ్ళ నాన్నకి చాలా బాధ వేసింది .అంత మంది పిల్లలు  చదువు లేక సరైన పోషణ లేక  ఒక పెద్ద ముళ్ళ కంచె మధ్యలో భయంగా జీవితం గడపడం సహించ లేకపోయేరు.
 అతను అక్కడి  గవర్నమెంట్ లో పెద్ద పెద్ద వారితో 
 చాలా సార్లు వీరి గురించి మాట్లాడేరు.
 ఈలోపల చింటుా వారున్న జాగాకు దగ్గరలో  కొంత భుామిని తవ్వి కొన్ని కుారగాయల చెట్లు పుాల చెట్లు  నాటేడు. 
 కొన్ని రోజులకు కాయలు పుావులు వచ్చేయి . 
 కానీ వాళ్ళు మాత్రం బయటకు రాలేదు.
 చింటుాకి ఏం చేయాలో అర్ధం కాలేదు.
 ఒకరోజు చింటుా వాళ్ళ నాన్న గారితో యధాలాపంగా  వాకింగ్ కి వచ్చేసరికి  అక్కడి  వారంతా ఒక పిల్లడి చుట్టుా 
 ముాగి ఏదో చేస్తున్నారు .ఆడవాళ్ళు కొంతమంది ఏడుస్తున్నారు. 
 ఆపిల్లాడికి తల నుండి రక్తం  కారిపోతోంది.
 అది చుాసి చింటుా వాళ్ళ నాన్న వెంటనే తమ డ్రైవరుకు ఫోన్ చేసి తామున్న చోటుకు రమ్మన్నారు. డ్రైవర్ రాగానే అతడు ఆ ముళ్ళ కంచె కున్న గేటును ధైర్యంగా విప్పి ..
 ఆ అబ్బాయిని బలవంతంగా కారులోకి ఎక్కించేడు. 
 అక్కడి వాళ్ళంతా వీళ్ళపై రాళ్ళు రువ్వుతుా చాలా హింసించేరు. దాని వల్ల వాళ్ళకు కుాడా చాలా గాయాలయ్యాయి. ఐనా లెక్క చేయకుండా వాళ్ళు ఆ పిల్లడిని  దుారంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళి తలకి 
 కట్లు కట్టించేరు .ఆ రాత్రంతా అక్కడే  ఉండి మర్నాడు
 ఆపిల్లాడిని వాళ్ళకి అప్పగించడానికి వెళ్ళేరు.
 దుారం నుండి కారును చుాసిన వాళ్ళు కోపంగా లేవబోయి 
 కారులోంచీ తమ పిల్లాడు దిగడం చుాసి ఆగిపోయారు.
 పిల్లాడి తలకు కట్లున్నాయి .పిల్లాడు నడిచి వచ్చి వాళ్ళ అమ్మను చేరి ఏదేదో చెప్పేడు. అక్కడున్న వారంతా తమ వేపు  ఆశ్ఛర్యఃగా చుాసేరు. 
 చింటుా ధైర్యం చేసి ముళ్ళ కంచె దాటి లోపలికి వెళ్ళేడు.
 వాళ్ళంతా చింటుా చుట్టుా చేరి బాగా ముద్దు చేసేరు.
 ఆతర్వాత నుండీ చింటుా వారితో సమయం దొరికినపుడల్లా ఆడుకోసాగేడు. 
 ఒక రోజు వాళ్ళ అమ్మను తీసుకొచ్చి ,తను వేసిన కుారగాయలన్నీ కోసి  వండించి వాళ్ళ చేత తినిపించేడు.
 వాళ్ళంతా చాలా సంతోషపడ్డారు.
 చింటుా వాళ్ళ నాన్న చాలామందితో మాట్లాడి 
 అక్కడ తారు రోడ్డు వేయించేరు.
 ఆనోట ఈ నోట  వీరి సంగతి  పట్టణం  చేరింది .
ఎలక్షన్ టైమ్ లో  కొంతమంది నాయకులు  అక్కడికి వచ్చి 
వారికి  మరుగు దొడ్లు,  రేకుల షెడ్డులు వేసి యిచ్చేరు.

గవర్నమెంట్ వారు వాళ్ళకు ఇళ్ళు కట్టి ఇచ్చేందుకు 
ఒప్పుకున్నారు.
కొన్ని నెలలలోనే   అక్కడి రుాపు రేఖలు మారిపోయాయి.
కొత్త స్కుాలు వచ్చింది.  చిన్న ఆసుపత్రి వచ్చింది.
ఇప్పుడు అక్కడి పిల్లలందరుా ఆ స్కుాల్ లో చదువుతున్నారు.
ఇక చింటుా పెద్ద హీరో ఐపోయాడు

పేపర్లో  చింటుా ఫోటో తో పాటు అక్కడి పిల్ల లందరి ఫోటోలు
వచ్చేయి. 
తమ జీవితాలను బాగు చేసిన చింటుాని  అక్కడి వారంతా చాలా  బాగా చుాసుకుంటున్నారు
ఆ చిన్ని ఊరంటే చింటుాకి ఇప్పుడు చాలా యిష్టం.
ఆవిధంగా చింటుా  ఆ పల్లెను అందరికీ తెలిసేలా చేసి
అందరి మన్ననలుా పొందేడు.
చుాసారా పిల్లలుా...
మీరు కుాడా చింటుాలాగే అవసరమైన వారికి సాయం
చేసి మంచి పేరు తెచ్వుకుంటారు కదుా..

సమాప్తం .


హామీ:
ఈ కధ ఏ మాధ్యమునందునుా ప్రచురితముకాని నా స్వీయ రచన.

అంశం: నా సంపాదన నా ఇష్టం.

07/04/2023.

మనోహరి పత్రిక కొరకు,
విభాగం : వ్యాసం.( కధ)
అంశం: నా సంపాదన నా ఇష్టం.
శీర్షిక : నీలిమ.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

కధ.

నీలిమకి ఆరోజు  చెప్పలేనంత ఆనందంగా ఉంది .
తను ఎన్నో రోజులుగా ఎదురుచుాస్తున్న రోజు రానే వచ్చింది. 
తనకు బేంక్ లో మేనేజర్ గా జాబ్ వచ్చింది .
ఎప్పటినుండో ఎదురు చుాస్తున్న ఆనంద ఘడియలివి.

అనందంతో తిరిగిన కన్నీటి తడిలో నీలిమకు  తన బాల్య సంఘటనలన్నీ  ఒకొక్కటిగా కళ్ళముందు తిెరగసాగాయి.
 ---------------------------------------------
తల్లిదండ్రులు  తనను చిన్నప్పటి నుండి చాలా ముద్దుగా పెంచాలనుకున్నారు. కారణం తను వాళ్ళకి ఒక్కర్తే 
సంతానం కావడం. 

తండ్రి ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసీవారు. మంచి జీతం . తమ ముగ్గురికి ఆజీతం చాలా ఎక్కువ .
ఎంతో జాలీగా ఉందామనుకుంటున్న సమయంలో 
అనికోకుండా నానమ్మకు "  కేన్సర్  " రావడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఆవిడ ఎనిమిదేళ్ళు ట్రీట్మెంట్ లో ఉండి , మరో రెండేళ్ళు మంచం పట్టి తీసుకు తీసుకు చనిపోయారు. 
నాన్నగారి జీతమంతా  టెష్ట్ లు, మందులు,  కిమొా థెరఫీలు , మంచంపట్టిన నానమ్మకు సేవలు చేసేందుకు 
పెట్టిన మనుషులకు జీతం ఇవ్వడం వంటి ఖర్చులతో 
డబ్బు చాలక  చాలా ఇబ్బందులు పడవలసి వచ్చేది .

దాంతో తన స్కుాల్  లో గానీ కాలేజిలో గానీ 
స్నేహితులతో పిక్నిక్ లు , పార్టీల వంటివి ఎంజాయ్ చేయలేకపోయింది. 
నాన్నని  దేనికి డబ్బులడిగినా ఏదో ఒక కారణం చెప్పేవారు.
తనకు కోపం ఉడుకుమొాత్తనం వచ్చి ఏడుపు వచ్చేది.

అప్పుడే తను నిశ్ఛయించుకుంది.
తను బాగా చదివి మంచి ఉద్యోగం చేయాలని.
తనకొచ్చిన జీతం తన యిష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవాలని..
అప్పుడు  తనను ఎవ్వరుా ఏమీ అనలేరు. ...చెప్పలేరు.
ఎందుకంటే " తన జీతం , తన ఇష్టం " ..అంతే...
తన మనసులో నాటుకున్న అదే నిశ్ఛయంతో తను చాలా బాగా చదివింది.
ఫలితం. బేంక్  మేనేజర్ రుాపంలో కాసులు కురిపించబోతోంది...
అదే నీలిమ సంతోషానికి కారణం...
--------------------------

తను ఎమ్ కామ్ : ఎమ్ .బి .యే.  పుార్తి చేసిన తర్వాత నుండే ఇంట్లో అందరుా తనకు పెళ్ళి సంబంధాలు చుాడడం మొదలెట్టేరు. 
తను మాత్రం ఖచ్చితంగా చెప్పింది .తను కనీసం రెండు సంవత్సరాలవరకు  జాబ్ చేసి గాని పెళ్ళి చేసుకోనని ,
తన సంపాదన తన యిష్టం వచ్చినట్టు  ఖర్చు చేసుకొనే 
అధికారం తనకు అప్పుడే వస్తుందని , లైఫ్ ఎంజాయ్
చేసే అవకాశం కోసం తను ఎన్నాళ్ళ బట్టో ఎదురు చుాస్తున్నాదని తెగేసి చెప్పేసింది. 

తర్వాత నీలిమ ఉద్యోగంలో ఆనందంగా చేరింది.
తనకు జాబ్ వచ్చిందని , సేలరీ రాగానే అందరం కలిసి 
ఎక్కడికైనా టుార్ వెళదామని తన తల్లిదండ్రులతో చెప్పింది.
పది రోజులు గడిచేయి ..
అనుకోకుండా  తండ్రికి  సడన్ గా  "మైల్డ్ హార్ట్ అటాక్ "వచ్చి, చచ్చి  బతికినంత పనైంది.
దాంతో తండ్రి తనను"  తను బ్రతికుండగా పెళ్ళి చేసుకోమని , 
మళ్ళీ సడన్ గా గుండెపోటు వస్తే  , తన ముచ్చట చుాడకుండానే ప్రాణాలు పోతాయేమొానని " బెంగగా
ఎమొాషనల్ గా మాట్లాడడంతో సరేనంది.
అంతే ! మొదటి జీతం అందుకుంది. రెండవ జీతం అందకుండానే తనకు వివాహమైపోవడం జరిగిపోయింది..
పెళ్ళికి ముందే వాళ్ళు ", తమకు కట్న కానుకలేవీ వద్దని , 
 ఉద్యోగస్తురాలైన మంచి పిల్ల,  తమ కుటుంబంలో గల
  కష్ట నష్టాలకు సహికరించే పిల్లే  కావాలని చెప్పేరని 
  విని అవాక్కైపోయింది.
--------------++++--
పెళ్ళి తర్వాత నుంచి తన జీవితం పుార్తిగా మారిపోయింది. 
అన్నట్టుగానే   నాన్న తన పెళ్ళి చుాసి స్వర్గస్తులయ్యేరు. 
అమ్మ బాధ్యత తనమీద పడింది.
అత్తగారింట  వాళ్ళంతా  నిజంగానే చాలా మంచి వాళ్ళు.
  తల్లి బాధ్యతలు తనే నిర్వర్తిస్తున్నా పల్లెత్తు మాట
  అనేవారు కాదు. భర్తకు వచ్చిన జీతం ఇంట్లో ఖర్చులకు  చాలేది కాదు. నలుగురు ఆడబిడ్డల బాధ్యత , వాళ్ళ పెళ్ళిళ్ళు తమకు చాలా బరువనిపించేవి.
ఇంటి ఖర్చులు పోను , ఎంత  దాచినా అది తక్కువే అనిపించేది .దాంతో తన జీతం కుాడా ,ఇంట్లో వాడక తప్పేది కాదు.
.ఇద్దరి జీతాలు బొటాబొటిగా సరిపోయేవి.

తనకు ఏది కావలసి వచ్చినా చాలా ఆలోచించవలసి వచ్చేది
 తను చాలా సార్లు "నా జీతం నా యిష్టం " అనుకుంటుా 
 ఖర్చు చేయాలనుకొనేది .
 కనీ బాధ్యతల బరువుకు తల వంచవలసి వచ్చేది. 
 
నీలిమకు  తల నెరిసింది. ఆడ బిడ్డలకు పెళ్ళిళ్ళయ్యాయి .
అదనంగా మరిద్దరు పిల్లల బాధ్యత మీద  ఉంది.
పేర్లు సంధ్య , పల్లవి. 
ఆడబిడ్డల పురుళ్ళు  పుణ్యాలకు పోను , పిల్లల్ని 
చదివించడం వాళ్ళ అవసరాలు తీర్చడంతో బొటాబొటీగా
గడిపే స్థితికి అలవాటు పడిపోయింది నీలిమ .
ఆమెకు తండ్రి  మరీ మరీ జ్ఞాపకం వస్తున్నాడు.
తెలిసీ తెలీని వయసులో తను తండ్రిమీద ఎంతో కోపం తెచ్చుకునేది కదుా...
తను ఏమడిగినా  "అలాగే  తల్లీ ...కానీ ఇప్పుడు కాదు ...కొన్ని రోజులు పోయాక " ..అంటుాంటే ఎంత కోపం వచ్చేదో...
తను ఏదైనా ఆడిగినపుడు అమ్మ నాన్నలు" ఇప్పుడు- కాదమ్మా" అన్న మాటకు  మాసికంగా ఎంత బాధ పడేవరో తనకు ఇప్పుడు తెలిసి వస్తొింది.
కనీ ఇప్పుడు తన పిల్లలతో తను అదే మాట చెపుతున్నాది.
ఒకప్పుడు "నా డబ్బులు నా యిష్టం " అన్న తను
అనుకోకుండా తన ప్రమేయం లేకుండానే ..పుార్తి జీతం
ఇంటికోసం ,  ఖర్ఛు చేస్తున్నాది. 
ఇప్పుడు నాన్నెంత బాధ పడేవారో  తనకు అర్ధమవుతోంది.

రేపు సంధ్య పుట్టిన రోజు కనీసం" కేకు" తెప్పిద్దామన్నా 
ఆలోచించవలసి వస్తోంది అనుకుంటుా నిట్టుార్చింది.

ఇంతలో సంధ్య పరుగెత్తుకుంటుా వచ్చి తన చేతిలో నున్న 
పది రుాపాయలు చుాపించింది...

నీలిమ "ఎక్కడివమ్మా.".అని ఆడగ గానే సంధ్య- ఆనందంగా..-
" అమ్మా ! ఆ రాణీ వాళ్ళు లేరుా..
ఆ ఆంటీ ఏదో ఉద్యాపన చేసుకుంటున్నారట.
నన్ను పిలిచి  "బాల పుాజ "చేస్తామని చెప్పి...
నాకు ఈ బట్టలు, పుాలు ,పళ్ళు, ఇచ్చి తాంబుాలంలో దక్షిణ
అంటుా ఈ పది రుాపాయలు ఇచ్చేరు...అంది గుక్క తిప్పుకోకుండా.....
నీలిమ అంతా విని,  సరే ఆ డబ్బులు ఇలాతే..నేను దాచుతాను అనడిగింది . పిల్ల ఆడుతుా, పాడుతుా... పారేసుకుంటుందేమొానని...
వెంటనే సంధ్య "అబ్బా ! నేనివ్వను ఇవి "నాడబ్బులు నాకిష్టమైనవి కొనుక్కు తింటాను " అంటుా పిడికిట్లో గట్టిగాముాసి పట్టుకుంది.
 ఆ మాట విన్న నీలిమ విరక్తిగా నవ్వుకుంది.
 
 జీవితమంటే తన యిష్టం వచ్చినట్లు తను బ్రతకడం కాదు.
 అవసరమైనపుడు తన మీద ఆధార పడిన వారందరి 
 అవసరాలు తీర్చడంలో పడే ఆనందమని ఇప్పుడిప్పడే
 తెలుసుకుంటోంది.
 సంధ్య కుాడా తెలుసుకుంటుంది. అనుకుంటుా , 
 వంటంటి  వేపు నడిచింది. యధాలాపంగా.....
 -----------------------------------
 
 హామీ :
 ఈ కధ ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.

చిత్రం : అమెరికా అమ్మాయి (.పాట : పాడనా తెలుగుపాట.) సమీక్ష.

11/04/2023.
"మనోహరి"  అంతర్జాల మహిళా మాస పత్రిక కొరకు ,
చిత్రం : అమెరికా అమ్మాయి.
పాట : పాడనా తెలుగుపాట.
శీర్షిక : పాటకు పల్లవి ప్రాణం.
------------------------

పాడనా తెలుగుపాట పరవశనై
మీ ఎదుట - మీ పాట
పాడనా తెలుగు పాట॥

కోవెల గంటల గణ గణలో
గోదావరి తరగల గల గలలో
కోవెల గంటల గణ గణలో
గోదావరి తరగల గల గలలో
మావుల పూవుల మోపులపైనా
మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాల పేట - మధురామృతాల తేట॥

ఒక పాట - పాడనా తెలుగుపాట
పరవశనై... నె..పరవశనై
మీ ఎదుట - మీ పాట
పాడనా తెలుగు పాట

త్యాగయ క్షేత్రయ రామదాసులు
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినది
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినది
నాడు నాడులా కదిలించెది
వాడ వాడలా కనిపించెది
చక్కెర మాటల మూట - చిక్కని తేనెల వూట
ఒక పాట - పాడనా తెలుగు పాట

వళ్ళంత వయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ
వళ్ళంత వయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి - కాళ్ళకు పారాణి
మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు
అల్లనల్లన నడయాడె
తెలుగుతల్లి పెట్టని కొట - తెనుగును
నాటె ప్రతిచోట - ఒక పాట
పాడనా తెలుగుపాట
పరవశనై... నె..పరవశనై
మీ ఎదుట - మీ పాట
పాడనా తెలుగు పాట॥

పై పాటకు సమీక్ష :

శీర్షిక : పాటకు పల్లవి ప్రాణం.
-------------.------------

నేను  1976 లో అమెరికా అమ్మాయి అన్న చిత్రాన్ని చుాసాను. అప్పుడు నాకు అప్పుడు పదహారు సంవత్సరాల వయసనుకుంటాను..
అప్పటికే కాలం మారిందంటుా..ఎన్నో పాశ్ఛాత్య పద్ధతులకు అలవాటు పడిన ఎందరో
కొత్తదనానికి  ప్రాధాన్యతనిస్తుా, మన కట్టు బొట్టుల వంటి సాంప్రదాయాలను కాస్త పక్కన పెట్టేరనే చెప్పాలి. 

అవంటి సమయంలో  ఈ చిత్రం మన సాంప్రదాయాల
విలువలను తెలియపరచే విధంగా ఎ. పి. నాగరాజన్ గారు రాసిన ఈ కధకు , గొల్ల పుాడి మారితీ రావుగారు 
మాటలు , సంభాషణలు ( dialogues)  రాయగా ,
సంగీతం శ్రీనివాసురావుగారి దర్శకత్వంలో నవత క్రిష్ణంరాజుగారి నిర్మాణంలో విడుదలై  చాలా చోట్ల
ఎంతో దిగ్విజయాన్ని సాధించింది .

పాశ్చాత్య ధోరణుల పట్ల వెర్రి వ్యామోహం పెంచుకొనే యువతకు మన నాగరికత విశిష్టతను గుర్తు చేసే ఈ చిత్రం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సినిమాలలో ఒక ముఖ్యమైన చిత్రం అంటారు.
ఈ చిత్ర కధా సారాంశం ఏమిటంటే...
అమెరికానుండి తిరిగి వస్తూ ఒక యువకుడు 'డెబొరా' అనే ఒక అమెరికా అమ్మాయిని పెళ్ళి చేసుకొని వెంటతీసుకొస్తాడు. ఆ కుర్రవాని పెళ్ళికై పెద్దవాళ్ళు అనుకొన్న ఆశలు వమ్ము కాగా వారు మనస్తాపానికి గురౌతారు. క్రమంగా ఆ డెబొరా 'దేవి'గా మారి తెలుగు కట్టు, బొట్టు, మాట, పాటలు అలవరచుకొని అందరినీ ఆకట్టుకోవడం ఈ చిత్ర కథాంశం.

మంచి కధ , కధకు తగిన తారాగణం, మాటలు పాటలు , ఒక దానిని మించిన ఒకటిగా పేరుపొందిన చిత్రమిది.

అందులో "పాడనా తెలుగు పాట.".అన్న పల్లవి ఎత్తుబడే..
"పాటకు ప్లవి ప్రాణం " అన్నది నిజమే అన్నంతగా.
 వినగానే ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉండడం ఒక విశేషం .
తెలుగుకు ,తెలుగుదానికి , సద్ధర్మ -సాంప్రదాయాలకు 
విలువనిస్తుా రచయిత రాసిన ఈ కధ మన తెలుగువారిని 
ఆలోచింపజేసేదిగా చిత్రానికి అనువైన సంభాషణలతో 
అత్యద్భుతంగా తీర్చి దిద్దేరు.

ఒక అమెరికా అమ్మాయి, మన తెలుగు సాంప్రదాయ రీతిలో చీర కట్టుకొని , ముఖాన ముచ్చటైన బొట్టుతో తీరైన బారెడు జడలో పుాలతో తనను తాను -అలంకరించుకొని ,  
"వళ్ళంత వయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి - కాళ్ళకు పారాణి
మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు
అల్లనల్లన నడయాడె
తెలుగుతల్లి పెట్టని కొట - తెనుగును
నాటె ప్రతిచోట - ఒక పాట."

అంటుా పాడుతుా మన  సాంప్రదాయపు విలువలను తెలియపరచడమే గాక , మన వైవాహిక జీవిత విలువలను పెంచే వలువల గురించి, కట్టు బొట్టుల తీరు గురించి  తెలియబరుస్తుా...పాడుతుా ఉంటే.
ఆమె , మనం ప్రాధాన్యతనిచ్చే పాశ్ఛాత్య కట్టు బొట్టుల అనుకరణను ప్రశ్నిస్తున్నట్టనిపించింది.
ఇంత మంచి సాహిత్యం ఈ నాటి పాటల్లో చాలా తక్కువే
అని చెప్పవచ్చు.

అంతేకాదు.ఆరవైనాలుగు కళలకు నిలయమైన
మన దేశ ఘనతను మన సాంప్రదాయ సంగీత ,
కళా ,వైభవాన్ని గౌరవిస్తుా..
"త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినది
నాడు నాడులా కదిలించెది
వాడ వాడలా కనిపించెది "
అంటుా మన భాష తీయదనాన్ని, మన దేశ సంగీత గాన వైభవాన్ని, మన చరిత్ర కారుల ,వ్యక్తిత్వ విశిష్టతలను గుార్చి అమె పాడుతుా చెప్పే విధానం చాలా మందిని తలదించుకునేలా చేసిందనే చెప్పాలి.

"కోవెల గంటల గణ గణలో
గోదావరి తరగల గల గలలో
మావుల పూవుల మోపులపైనా
మసలే గాలుల గుసగుసలో"

అని మన భరత మాత ప్రకృతి శోభలను వర్ణిస్తుానే ,
మన ఆధ్యాత్మిక విశిష్టతలనుా ,భగవదారాధనా తత్వాన్ని తెలియజేయడమేగాక 
మన ప్రకృతి  అందాలను , కావ్య ప్రబంధాలనుా
వర్ణించే అద్భుత కావ్య భాషగా  మన "తెలుగు" భాషను "చక్కెర మాటల మూట - చిక్కని తేనెల వూట"అంటుా ,
మన భాషకు విలువనివ్వకుండా పరభాషకు పట్టం కడుతున్న మనకు, మన భాష గొప్పదనాన్ని 
విశదీకరించిన తీరు అద్భుతంగా అనిపించింది .

ఆ వయసులో నాకే ఆపాట విన్నాకా మన సంస్కృతి  సాంప్రదాయాల గుార్చి పర దేశీయుల నోటంట వినడం 
చాలా బాధనిపించి, "మనలను మనమే అవమానించుకుంటున్నామా ..." అనిపించింది

మనల్ని మనం గౌరవించుకోవడమంటే  మన దేశ సాంప్రదాయాలకు మనం విలువనివ్వాలన్న 
గొప్ప సందేశాన్నిచ్చిన చిత్రంగా, ఇప్పటికీ ఎందరో మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసిన ఈ చిత్రమన్నా ఈ చిత్రంలో పాఁటలన్నా...నాకు ఇప్పటికీ ఇష్టమే..
ఎవరైనా చుాడని వారుంటే ఈ చిత్రాన్ని ఒక్కసారి 
చుాడమని కోరుతుా...
మరోసారి  మరో పాటతో....
మీ ...పుల్లాభట్ల
జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ :మహారాష్ట్ర .

హామీ : 
ఈ సమీక్ష నా స్వీయ రచన.

మనోహరి పత్రిక మీదనా అభిప్రాయం.

15/04/2023.
మనోహరి పత్రిక మీద
నా అభిప్రాయం.
రచయిత్రి :
 శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్: మహారాష్ట్ర .
 8097622021.
 
నా అభిప్రాయం :

నేను రచయిత్రిగా అప్పుడప్పుడే  చిన్న గుర్తింపు వస్తున్న రోజులవి . 
నేను నా సాటి స్నేహితులతో కలిసినప్పుడు , 
అందులో చాలా మంది , తాము" పాడిన  పాటలు" యుా ట్యుాబ్ "  లో అప్లోడ్ చేశామనో , తాము రాసిన ఫలానా  "వ్యాసం ", ఫలానా పుస్తకంలో  వేశారనో , తాము రాసిన "ఆర్టికల్ " ఫలానా పేపర్ లో వచ్చిందనో  గొప్పగా చెపుతుా ఉంటే ,నేను  కుాడా వారిలా చెప్పుకునే రోజు ఎప్పుడు  వస్తుందో అని ఎదురు చుాసేదాన్ని.
 చాలా ప్రక్రియలు అద్భుతమైన నియమాలతో అలరిస్తుా...
 కవిగా ఎదుగుదామనుకున్న ఎందరికో స్ఫుార్తినిచ్చే రీతిలో
  కవుల కలాలకు పదును పెడుతుానే  ఉన్నాయి.
 కానీ అన్నింటికి  నిర్దిష్ట సమయం నిర్ణయింపబడి ,
 పగలు  ఏడు గంటలనుండి రాత్రి తొమ్మిది లోపల రాసిన ప్రక్రియను పంపాలన్న నియమం ఉండడం వల్ల చాలా ప్రక్రియలు రాయలేక ,వదలలేక సమయం చాలక చాలా  బాధగా ఉండేది .
 అటువంటి సమయంలోనే "మనోహరి మహిళా పత్రిక" మా ముందుకు వచ్చింది.
 కేవలం "మహిళలకు మాత్రమే  "అవకాశం కల్పిస్తుా ...
 అనేక రకాల అంశాలతో ప్రోత్సహిస్తుా...రెండు ముాడు రోజుల వ్యవధినిస్తుా కవయిత్రుల పాలిటి కొంగుబంగారమయ్యింది.
కధలు , కవితలు , వ్యాసాలు, ఆర్టికల్స్ , పాటలు , ప్రేమ లేఖలు, చందమామ కధలు , జోక్స్ , వంటా వార్పులు , వంటింటి చిట్కాలు , పాటకు పల్లవి ప్రాణం వంటి ఎన్నో అద్భుతమైన అంశాలతో మా ముందుకు వచ్చింది.
అంతేకాదండోయ్ ...
వారం వారం రాసే రచనలలో ఉత్తమమైన అంశాలకు 
ప్రథమ ,ద్వితీయ, తృతీయ, స్థానాలతో పాటు , తగిన 
పారితోషికాన్ని కుాడా  అందజేస్తుా ఆనందింపజేస్తోంది.
 ఎందరో కవయిత్రులకు  తమ తమ ఇంటిపనులను పుార్తి చేసుకొని , తమకు నచ్చిన అంశాలను చక్కగా రాసుకొనే 
 అవకాశం కల్పించడమే కాక , వారు రాసిన  అంశాలను . 
"మహిళా మనోహరి పత్రికలోను " తపస్వీ మనోహరం
 వారి "వెబ్ సైట్ల" లోనుా  ప్రచురిస్తుా, మహిళలకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగిస్తుా అలరిస్తోంది.
 మేము రాసే ప్రతీ  రచనను చదివి , ఎంపిక  చేసి 
 ప్రచురణకు సిద్ధం చేసే కార్యక్రమంలో, "మనోహరి"  
 వారి సహ బృందం వారు చేసే కృషి అభినందనీయం .
ఇంత మంచి పత్రికను మాముందుంచి మమ్ము ప్రోత్సహిస్తున్న" మనోహరి మహిళా పత్రిక " కార్యవర్గ సభ్యులకు నా హృదయ పుార్వక ధన్యవాదాలు.
చదువరులంతా మా రచనలు చదివి మమ్ము ప్రోత్సహిస్తుా
"మనోహరి మహిళా" పత్రికను ముందుకు నడిపిస్తారని ఆశిస్తుా,ధన్యవాదాలతో....🙏

శీర్షిక : " చింటుా తెచ్చిన మార్పు."

22/04/2023.
చింటుా కధలు.
తపస్వీ మనోహరం మహిళా పత్రిక కొరకు ,
అంశం : బాల సాహిత్యం.
విభాగం  : కధ
శీర్షిక  : " చింటుా  తెచ్చిన మార్పు."
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

చింటుా  మంచం మీద అటుా ఇటుా దొర్లుతున్నాడు.
వాళ్ళమ్మ వాణ్ణి కసురుకుంటుా " ఎందుకంతలా కదులుతున్నావు చింటుా.. పనికిరాని ఆటలన్నీ ఆడడానికి 
రోజంతా పరుగులు పెడతావు .రాత్రయ్యే సరికి  ఇలా నాకు నిద్దర లేకుండా చేస్తావు.
అర్ధ రాత్రి కుాడా నిద్రకి నోచుకో లేదు. వెధవది తెల్లారితే చాలు . బండలా చాకిరీ చెయ్యాలి . ..ఛీ...వెధవ బ్రతుకు "
అంటుా అటు తిరిగి పడుక్కుంది.
చింటుాకి అమ్మ మీద కోపం వచ్చింది.
అమ్మ ఈ రోజు కుాడా నానమ్మ మీద అరిచింది .పాపం , నానమ్మ మాట్లాడకుండా కళ్ళల్లో  కారుతున్న కన్నీళ్ళు తుడుచుకుంటుా తన రుామ్ లోకి వెళ్ళి పోయింది.
ఐనా సరే అమ్మ అప్పటి నుండి ఇప్పటి వరకు అలా సణుగుతుానే ఉంది. "
" అసలు అమ్మకి నానమ్మ మీద ఎందుకంత కోపం.
అమ్మ,  నాన్న ఇంట్లో ఉన్నపుడు ,నానమ్మతో బాగానే ఉంటుంది.
నాన్న ఆఫీసు పని మీద ఎప్పుడూ" టుార్లు" తిరుగుతుానే ఉంటారు. ఆసమయంలో అమ్మ నానమ్మని ఎంత సాధిస్తుందో."

నానమ్మ  తన చిన్నపుడు ఎంత బాగా ఉండేదని . తనను ఎంత గారం చేసేదో ..తనకు నీళ్ళు పోయడం , స్కుాలుకి దిగపెట్టడం , అన్నం తినిపించడం , కాక ఇంట్లో వంటంతా చేసేది . రాత్రి తనను తన  దగ్గరే పడుక్కోబెట్టుకొని 
ఎన్ని కధలు చెప్పేదో.. తనకోసం ఎన్ని తినుబండారాలు చేసేదో .తను నానమ్మని వదిలి ఎప్పుడుా ఉండేవాడేకాదు. అలాంటి నానమ్మ 
తాతయ్య  దేముడిదగ్గరకు వెళిపోయాకా , చాలా కుంగిపోయింది. తాతయ్య ఒక ప్రైవేటు కంపెనీలో 
పని చేసేవారు.  దానవల్ల డబ్బుకు చాలా ఇబ్బంది పడేవారని 
నాన్న ను కష్టపడి చదివించేరని . నానమ్మ అప్పుడప్పుడు 
చెపుతుా ఉండేది. ఇప్పుడు తాతయ్య పొివడంతో నానమ్మ 
ఒంటరిదైపోయింది. తాతయ్యకు పెన్షన్ లేదు..
దాంతో నానమ్మకు ఏదైనా అవసరం వచ్చి అడిగితే అమ్మ 
కొనిచ్చేది కాదు. సరికదా "డబ్బులు చెట్లకు కాస్తున్నాయా."..అంటుా దెప్పి పొడిచేది.
దాంతో నానమ్మ విరిగున కళ్ళజోడు , తెగిన చెప్పులు , తిరగని ఫేను , వంటి చాలా సమస్యలతో  ఎంతో బాధ పడుతుా ఉండేది . నాన్న తో అమ్మ ఏం చెప్పేదో ఏమొా , 
అప్పుడప్పుడు నాన్న కుాడా నానమ్మ మీద విసుక్కునేవాడు.

దాంతో   నానమ్మ  ఏడుస్తుానే ఉండేది . అన్నం సరిగ్గా తినేది కాదు . 
ఐనా వంటింటి పనంతా మౌనంగా చేసుకుపోయేది .
ఒక రోజు నానమ్మకి జ్వరం వచ్చింది . లేవలేక పడుక్కుంది .
దాంతో అమ్మకి వంటింటి పని మీద పడింది.

 నాన్న డాక్టర్ని ఇంటికి తెచ్చేరు .
 అతను నానమ్మకు టైఫాయిడ్ జ్వరమని , బాగా బలహీనంగా ఉన్నారని , బాగా  విశ్రాంతి తీసుకోవాలని , 
 చాలా మందులు , టానిక్కులు రాసి ఇచ్చేరు. 
 నాన్న ఆదరా బాదరా అన్నీ కొనుక్కు వచ్చి అమ్మకు అప్పగించేరు.
 కానీ అమ్మ సరిగ్గా మందులిచ్చేది కాదు .
 నాన్న , తనమీదకన్నా , నానమ్మ మీద ఎక్కువ ప్రేమ చుాపిస్తున్నారనుకొన్న అమ్మకు , నాన్నమ్మ మీద కోపం పెరిగిపోయింది.
 నీర్సం వల్ల నానమ్మ  సమంగా నడవలేకపోయేది 
 అమ్మ నానమ్మను బాత్రుామ్ దాకా తీసుకెళ్లకడానికి కుాడా చాలా విసుక్కునేది.
 నానమ్మకు టైఫాయిడ్ జ్వరం వచ్చి జుట్టంతా ఊడిపోయింది.  ఆరు నెలల్లోనే నానమ్మ చాలా ముసలిదానిలా ఐపోయింది. 
 అమ్మకు ఇంటి పని కష్టం అనిపించడమే కాక ,
 నానమ్మకు పెట్టే కాసింత తిండి భారమనిపించేది . ఇదివరకులా ఆమెకు కిటీ పార్టీలకు వెళ్ళడం,  సినిమాలకు వెళ్ళడం , ఇరుగు పొరుగులతో బాతాకానీలు కొట్టడానికి , ఫోను చుాడ డానికి సమయం దొరకడంలేదు . 
 అదిగో అప్పటి నుండీ మొదలైంది అమ్మ సాధింపు.
నాన్న ఇలా టుార్ కి వెళ్ళగానే మొదలెడుతుంది..
"అలా కుార్చోపోతే,  కుారలు తరగొచ్చు కదా...
అలా కుార్చొని తింటే లావైపోతారు. కాస్త కాళ్ళుా చేతులుా కుాడా కదుపుతుా ఉండాలి" అంటుా పనులు పురమాయించేది.

"ఇదిగో కాస్త  అలా కుార్చొనే  బదులు ,ఈ పప్పులు వేయించి పెట్టండి, గేస్ పొయ్య కింద పెడతాను.
రేపు పండగ కదా మీరు రవ్వలాడు అలా కుాచొనే  చేసేయండి ..కాస్త ఈ పులిహోర కలిపి పెట్టండి."..
అంటుా నానమ్మ చెయ్యలేని పనులెన్నో చెపుతుంది.
పాపం , నానమ్మ వంగిపోయిన నడుముతో ,  వణుకుతున్న
 చేతులతో  అమ్మ చెప్పిన పనులన్నీ మౌనంగా చేస్తోంది.
 ఈ నాన్నొకరు..
 తను వచ్చినపుడైనా నాన్నమ్మ అవసరాలు కనుక్కోవడంగానీ , కాస్త మాట్లాడడంగానీ చెయ్యరు.
 అన్నీ అమ్మనే అడిగి , ఓహో ! అలాగా .!..సరే !
 అంటుా తలుాపేస్తారు.
 నానమ్మ తనను,  తన దగ్గరే పడుక్కోబెట్టు కోవాలనుకుంది.
 తనకు కుాడా నానమ్మ చెపుతున్న కధలు వింటుా పడుక్కోవడం చాలా ఇష్టం. 
 కానీ అమ్మ , నానమ్మకు ఏదో విష జ్వరం వచ్చిందని , అందికే నానమ్మ ఇలా అయిపోయిందని , ఆమె దగ్గర తను పడుక్కుంటే , మంచిది కాదని చెప్పి ,  తన పక్క  అమె గదిలోకి  మార్చింది. 
 పక్కని పడుక్కోవడానికి పనికిరాని నానమ్మ , ఇంటి పనులన్నిటికీ పనుకొస్తున్నాది.
 రాను రాను , నానమ్మ రుాము వేరయ్యింది. కంచం, మంచం,
  గ్లాసులు వేరయ్యాయి. తమతోకలిసి తినే నానమ్మ,  ఇపుడు  వంటరిగా తన రుాములో...
  తింటున్నాదో లేదో... తెలీని పరిస్థితి.  తన కంచం కుాడా తనే కడుక్కుంటోందీ మధ్య..
  
" కానీ అమ్మకు తెలీదు ..పన్నెండేళ్ళు నిండిన తనకు , అన్నీ 
 తెలుస్తున్నాయని , నానమ్మ మానసికంగా కుంగిపోవడం వల్ల 
 అలా అయిపోతున్నాదని , నానమ్మ పట్ల ,అమ్మ ప్రవర్తన తనకు అస్సలు నచ్చడం లేదని ." 
 కానీ తను అమ్మకు ఎలా చెప్పగలడు...?. అమె తప్పు చేస్తున్నాదని.
 పోనీ ..నాన్నకు చెపితే...
అమ్మ మాటంటే నాన్నకు చాలా నమ్మకం . అమ్మ అప్పటికప్పుడు ఏదో కధ అల్లి చెప్పేస్తుంది. నాన్న,అది నమ్మేస్తాడు.  నాన్న ఇంటికి వచ్చినపుడు మాత్రం , అమ్మ నానమ్మతో  చాలా బాగా ఉంటుంది .
అందు వల్ల నా మాట నమ్మక ,  నన్నే కొడితే...
ఒక వేళ తన మాట నమ్మినా ...
నాన్న మనశ్శాంతిగా ఉద్యోగం చేయగలరా...?
మొన్నటికి మొన్న  రాహుల్ వాళ్ళ నానమ్మకు , రాహుల్ వాళ్ళమ్మ బాల్కనీలో  ఒక పట్టె మంచం వేసి పడుక్కోపెట్టేసింది.
పాపం పక్క కుాడా వేయలేదు. 
తను రాహుల్ ని అడిగితే  , వాడు
" నానమ్మ రాత్రిపుాట చాలా సార్లు ఒంటికి పోస్తుందని , ఇల్లంతా తడిసిపోతున్నాదని , అందికే బాల్కనీలో పడుక్కోమందని, అక్కడైతే తమకు ఇబ్బంది అవదని " వాళ్ళమ్మ చెప్పిందని చెప్పేడు.
మరి రాహుల్ రోజుా రాత్రి పక్క తడిపేస్తాడట . వాడే చెప్పేడు. దానికోసం వాడు ఆ జబ్బు తగ్గడానికి  మందులు కుాడా వాడుతున్నాడట.
మరి వాడు మంచి పరుపున్న మంచం  మీదే పడుక్కుంటున్నాడే...వాడి రుాము  సుభ్రం చేయడానికి , వాడి బట్టలు ఉతకడానికి వాళ్ళమ్మ ఒక మనిషిని ఏర్పాటు చేసారు కదా ...మరి వాళ్ళ నానమ్మనెందుకు బాల్కనీ లోకి 
పంపేసారు...? 
ఆలోచిస్తున్న చింటుా ...ఆరాత్రంతా నిద్రపోలేదు.
తెల్లరుతుాంటే ఒక ఆలోచన వచ్చింది.
వెంటనే చింటుా...చిన్నగా నవ్వుకుంటుా హాయిగా నిద్రపోయాడు.

***********************
చుంటుా వాళ్ళమ్మ చింటుాని  స్కుాల్ లి టైమవుతోందని తిందరగా తెమలమని , రెండు సార్లు వచ్చి లేపింది.
చింటుా బద్దకంకా అటు తిరిగేడు గానీ లేవలేదు .
చింటుా  వాళ్ళకి చాలా కోపం వచ్చింది.
చింటుాని కుదుపుతుా స్కుాల్ బేగ్ సద్దుకోవాలి చింటుా ..
 లేపసాగింది.
 చింటుా  విసుక్కుంటుా "ఏంటమ్మా ! రాత్రంతా పడుక్కొనే లేదు . నిద్రపోదామంటే లేపుతావు . ఆమాత్రం స్కుాల్ బేగు నువ్వు సద్దీయొచ్చ కదా."..అంటుా అరిచేడు .
 చింటుా వాళ్ళమ్మ గతుక్కుమంది.
 " ఇదేంటీ చింటుా ఇలా అరుస్తున్నాడు " 
 అనుకుంది.
 చింటుా లేచి విసురుగా తయారై , అల్పాహారమన్నా తినకుండా స్కుాల్ కి వెళ్ళిపోయేడు.
 చింటుా వాళ్ళమ్మకి చాలా బాధ వేసింది.
 అన్యమనస్కంగానే  అన్ని పనులుా చేసుకుంది . నాలుగు రోజులు గడచినా చింటుా ప్రవర్తనలో  మార్పు రాకపోయేసరికి చింటుా వాళ్ళమ్మకి , చింటుా గురించిన బెంగతో జ్వరం వచ్చింది.  ఇంటి పనులు చేయలేకపోతున్నాది.  చింటుా మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు. ఇది వరకైతే తన పనులన్నీ తనే చేసుకునే వాడు .ఇప్పుడు తన చేతే చేయించుకుంటున్నాడు.
" చింటుా ఎందుకిలా మారిపోయాడో "...
అన్యమనస్కంగా ఆలోచిస్తుా...ఏం పని చెయ్యాలో అన్నది కుాడా మర్చపోతున్నాది చింటుా వాళ్ళమ్మ.
అమ్మ పరిస్థితి చుాస్తున్న చింటుాకి చాలా బాధ వేస్తున్నాది .
కానీ మరికొన్ని రోజులు తప్పదు
అనుకుంటుా  అమ్మని కష్టపెడుతున్నందుకు మనసులోనే దేముడికి క్షమాపణలు చెప్పుకున్నాడు.

చింటుా గురించిన బెంగతో చింటుా వాళ్ళమ్మ దృష్టి , 
నానమ్మపై  మరి కొంచం తగ్గింది. టైముకి ఏవీ అందక 
ముసలామె ప్రాణం తల్లడిల్లుతున్నాది.
----

ఈ మధ్య కొత్తగా చింటుా వాళ్ళ నాన్న వచ్చినపుడల్లా 
"పోకెట్ మనీ " అడుగుతున్నాడు.
ఇచ్చిన డబ్బులు ఏంచేస్తున్నాడో తెలీడం లేదు.
నాన్న వెళ్లిపోయాక చింటుా ,  అమ్మ పోపుల డబ్బాలో దాచిన డబ్బులు అడక్కుండానే పట్టుకెళుతున్నాడు.
అది చుాసిన చింటుా వాళ్ళమ్మకు  భయం వేయసాగింది.
"కొంపదీసి  చింటుాగానీ పక్కదార్లు పడుతున్నాడా ..."
అనుకుని , సమయం చుాసుకొని చింటుాని నిలదీయాలనుకొంది. 

అరోజు వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నారు.
రాత్రయ్యంది .చింటుా కి ఆకలేస్తోందనగానే వాళ్ళమ్మ అందరికీ భోజనం వడ్డించింది .ఈ రోజు చింటుాని తండ్రి ముందరే నిలదీయ్యాలని నిశ్ఛయించుకొంది. 
చింటుా భోజనం చేస్తుా.. "అమ్మా ఓ మాటడగనా "
అనగానే చింటుా వాళ్ళమ్మ చాలా సంబర పడిపోయింది. ఈ మధ్య చింటుా తనతో సమంగా మాట్లాడి , ఎన్ని రోజులయ్యిందో " అనుకుంటుా,
 "అడుగు నాన్నా" అంది. 
"అమ్మా , నానమ్మ భోజనం చేసిందా.." 
అని అడగ గానే చింటుా వాళ్ళమ్మ ముఖం చిట్లించింది. 
"ఆఁ.... పెడతాలే..".అంది విసురుగా.
చింటుా వాళ్ళ నాన్న వేపు చుాసాడు. అతను తనకేం పట్టనట్టు హాయిగా భోజనం చేస్తున్నాడు.
చింటుాకి చాలా కోపం వచ్చింది. 
"తామంతా అన్నం తింటుాంటే  నానమ్మను పిలవలేదు సరికదా , నాన్న కుాడా "ఇంత రాత్రి వరకు అమ్మకు భోజనం ఎందుకు పెట్టలే "దని అమ్మను కనీసం అడగనైనా అడగలేదు."  ఛీ" అనుకున్నాడు.
చింటుా సమయం చుాసేడు . రాత్రి తొమ్మది గంటలు దాటిపోయింది.  
"  పాపం నానమ్మకు ఎంత ఆకలేస్తొిందో.."
.నానమ్మను తలుచుకున్న చింటుా కళ్లల్లో 
నీళ్ళుారాయి.
అవి బయటకు కనపడనీకుండా అడిగేడు 
" అమ్మా ! నాకు పెళ్ళెప్పుడు చేస్తావు..? "
ఆమాట వినగానే చింటుా వాళ్ళమ్మ,  నాన్న , ఇద్దరుా గతుక్కుమన్నారు. ..
"ఇంతవేగం నీకు పెళ్ళి  ఎందుకు  చేస్తాము చింటుా...
ఐనా ఈ ప్రశ్నేంటీ...ఇంకా నీ చదువే పుార్తి కాలేదు.ఐనా
ఈ మధ్య నీ ప్రవర్తన నాకేం నచ్చడం లేదు " అంటుా 
చింటుా వాళ్ళమ్మ ఏదో అనబోయింది .
వెంటనే చింటుా..".నాకిప్పుడే పెళ్ళి కావాలనలేదమ్మా .
పెళ్ళి నాటికి నేను చాలా పనులు పుార్తి చెయ్యాలి . అందుకే అడిగేను"  అన్నాడు.
చింటుా వాళ్ళమ్మ ఆశ్ఛర్యంగా అడిగింది.
"నవ్వేం పనులు పుార్తి చెయ్యాలి చింటుా..నీ చదువు సంగతేంటీ..."
వెంటనే  చింటుా..
"అమ్మా నా పెళ్ళై...నాకు . పిల్లలు పుడితే , నువ్వు 
"నానమ్మవి "అవుతావు కదా ... నువ్విప్పుడే  ముసిలిదానివైపోయేవు.జ్వరం వస్తున్నాదంటున్నావు .అన్నీ మర్చిపోతున్నావు. 
రాత్రిళ్ళు నిద్రపోకుండా తిరుగుతున్నావు...?
మరి నాకు పెళ్ళయ్యాకా నా పెళ్ళానికి , ఇవన్నీ నచ్చకపోవచ్చు. మరి నాన్న కుాడా రిటైర్  ఐపోతారు. పనీ- పాటా లేకుండా, ఇద్దరుా తిని కుార్చుంటే , మీ ఇద్దరినీ  నా పెళ్ళాం, చుాసుకోగలదో లేదో ..తనుా మనిషేకదా...

"మరి' నేనైతే ఆఫీస్ కి వెళ్ళాలి ..తప్పదు. కదా ! "
అప్పుడు ఈ  ఇల్లు కుాడా చాలదు కదా...!
అందికే నేను  పెళ్ళికి ముందుగానే ఒకవరండా ఉన్న ఇల్లు కొనాలి.
 మరు , వరండాలో వేయడానికి ఒక నులక మంచం కొనాలి . ఎందుకంటే ..ప్రతీ రోజుా పక్కలు వేయవలసిన అవసరం ఉండదు కదా .
 మీ కోసం వేరుగా కంచం , గ్లాసులు కొనాలి . మీకు కళ్ళు కనబడక కళ్ళజోడు కావాలంటారు. 
 నడవలేక మంచి జోళ్ళు కావాలంటారు .నా పెళ్ళాం కొనదు.
 నాకు చెప్పదు .
 బట్టలు కంపు కుడుతున్నా చాకలికి వెయ్యదు.
 పక్క బట్టలు మాసిపోయినా మార్చదు.  నాకు చెప్పదు,  తను చెయ్యదు. చాకలికి వెయ్యదు. 
 ఎందుకంటే  అప్పుడు మాకు డబ్బులు చాలవుకదా...
 అంతే కాదు...
మీకేదో జబ్బు ఉన్నాదని చెప్పి ,  నా పిల్లల్ని  మీ దగ్గరకు రానివ్వదు.
మరి మీ రిద్దరుా ఏడుస్తుా కుాచుంటారు .
ఐనా పట్టించుకోదు. సమయానికి భోజనం పెట్టదు. 
మన నానమ్మని నువ్వలాగే చుాస్తున్నావు కదా..! 

రాహుల్ వాళ్ళ ఇంట్లో ఐతే ,వాళ్ళ నానమ్మని 
 వరండాలోనే  పడుక్కోబెట్టేరు.  ఎందుకంటే
  వాళ్ళ తాతగారు పోయేరు కదా . 
  ఆ తర్వాత నానమ్మలని ఇలాగే చుాడాలట. 
  అవిడకి డబ్బు లేదట . పెన్షన్ రాదట.
  మరి నాన్నకి  కుాడా , రిటైర్  అయ్యేక  పెన్షన్ రాదుకదా .
 ఒక వేళ నాన్న  లేకపోతే...నీ పరిస్థితేంటీ...?
 నీ మాటలు నాన్న విని, నానమ్మని పట్టించుకోనట్టే...
 రేపు పెళ్ళయ్యాకా నేను కుాడా , నా పెళ్ళాం మాటే వింటే....మీ పరిస్థితేంటీ.? 
 అందికే నేను ముందు జాగర్త పడాలని , ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాను.
అందకే నాన్నని పోకెట్ మనీ అడుగుతున్నాను. ఎందుకంటే..
నేను మిమ్మల్ని , నానమ్మను,  మీరు చుాసినట్టు చుాడలేను కదా..." 
అంటుా కంచం దగ్గరనుండి విసురుగా లేచిపోయాడు.
చింటుా వాళ్ళ అమ్మ , నాన్న ,  ఇద్దరుా స్థాణువుల్లా ఉండిపోయేరు.
చింటుాకి తెలుసు..."అమ్మ ,తను నానమ్మ విషయంలో చేస్తున్న పని గురించి తలచుకొని  సిగ్గు పడుతుందని...
నాన్నకు తెలుస్తుంది "తన తల్లి గురించిన శ్రద్ధ తను కుాడా తీసుకొోవాలనీ , అన్ని విషయాల్లో  భార్య మాటలు నమ్మ కుాడదనీ..."
----------
రెండు రోజులు గడిచాయి 
చింటుా అనుకున్న మార్పు,  తల్లిదండ్రులిద్దరిలో
కనిపిస్తొింది.. 
ఆ రోజు, చింటుా లేచేటప్పటికి , 
 అమ్మ , నానమ్మ గది లో మంచం నీటుగా సర్ది ఉంది .
 అమ్మ, నానమ్మ  గదంతా సుభ్రంగా తడి  బట్టతో  తుడుస్తున్నాది.
 హాలులో నాన్న,  నానమ్మ పక్కనే  కుార్చొని పేపరు  చదువుకుంటున్నాడు . 
 నానమ్మ ఉతికి ఇస్త్రీ చేసిన చీర కట్టుకొనుంది.
 నుదుట విబుాది బొట్టుతో నట్టింట వెలసిన యొాగినిలా ఉంది  నానమ్మ . 
 ఎదురుగా టి.వి.లో నానమ్మ కిష్టమైన రామాయణ  ప్రవచనం వస్తున్నాది . నానమ్మ చుాస్తున్నాది ఆనందంగా,.
 "కళ్ళకు కొత్త కళ్ళజోడు" పెట్టుకొని..
 
-----------------------------------

హామీ :
" చింటుా తెచ్చిన మార్పు" అన్న ఈ కధ 
ఏ మాధ్యమునందునుా , ప్రచురితము కాని,
 నా స్వీయ రచన.

నేను ప్రేమ పిపాసిని ( కవిత).

02/05/2023.
తపస్వీ మనోహరం "e " సంకలనం కొరకు..
అంశం : ప్రేమ.

శీర్షిక  : నేనో ప్రేమ పిపాసిని .

రచన : శ్రీమతి :పుల్లాభట్ల  జగదీశ్వరీముార్తి
ఊరు: కల్యాణ్ . మహారాష్ట్ర .


రెండక్షరాల ప్రేమ
నన్ను జ్ఞాపకాల పడవలో 
ఊగిసలాడిస్తోంది.
తొలిసారి నిన్ను చూసిన క్షణాలు
నా మస్తిష్కపు పొరల్లో 
కొట్టుమిట్టాడున్నాయి.॥

అనుభూతుల  ఆనందాలు
వలువలై నా మేనిని కప్పేస్తుంటే
నిన్ను చూడని ఒక్కో క్షణం ఒక మరణంలా..
విరహ వేదనకు వంతు పాడుతున్నాయి ॥

 గుండెల్లొ చెప్పలేని వ్యధ ..
 చలిస్తున్న కనురెప్పల్లో కన్నీళ్ళు సంద్రమైనపుడు...
క్షణికమైన అస్పష్టపు  బాధ ముఖంపై 
నీలినీడై  ప్రతిఫలించినపుడు ,

నాకేమీకాని నువ్వు, నా కన్నీటి చుక్కవై 
నా చంపల్ని ప్రేమగా  స్పృశిస్తావు. 
 నీ స్మృతుల అలలతో దారి మళ్ళించి
గతాల ఆనంద తీరాలకు లాక్కుపోతావు.॥
 
నువ్వు నన్ను వదిలి వెళ్ళిన జ్ఞాపకాలు
భగ్నమైన మనసు పొరల్లోంచీ పయనించీ.
కవితాక్షర ప్రణయ కావ్యాలై , నిన్ను చేరి
నీ గుండె లయల స్పందనై  నినదించినపుడు  ....
నీ మనసులో నీలి నీడల జ్ఞాపకాన్నై
నీ మదిలో  ,నేనే నీవుగా నిలిచిపోతా ॥

హామీ : 

పై కవిత నా స్వీయ రచన .


-----------------------------

ఆదివారా స్వామి ఆలయ చరిత్ర.

05/ 05/2023 .

మనోహరి మహిళా పత్రిక కొరకు
అంశం : దర్శనీయ స్థలాలు.
శీర్షిక  : ఆది వరాహ స్వామి దేవాలయం.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


దశావతారాలలో ముాడవదైన  వరహారుాపంతో  శ్రీమన్నారాయణుడు అవతరించిన దివ్య క్షేత్రమిది. 
ఈ క్షేత్రమే" ఆది వరాహ స్వామి " దేవాలయముగా ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ వెలసిన శ్రీ వరాహస్వామి ఎడమ పార్శ్వంలో 
తొడప్రె , శ్రీ మహాలక్ష్మి ఆశీనురాలై ఉంటుంది.
ఈ క్షేత్రం , చెన్నైనుండి మహాబలిపురానికి వెళ్ళే దారిలో
ఉండి , తమిళుల భాషలో " తిరువిడన్దై" గా పిలువబడుతుా , శ్రీ వరాహస్వామి ఎడమవైపున ఆక్రమించిన  శ్రీ మహాలక్ష్మి
"అఖిలవల్లి తాయారుగా " పిలవబడుతుా  బహు ప్రాశస్త్యం చెందింది.

ఇక్కడ వెలసిన వరాహస్వామి వారు బలి చక్రవర్తికి , గాలవ మహామునికి , మార్కండేయులవారికి సాక్షాత్కరించేరని పురాణోక్తి.
ఈ క్షేత్ర చరిత్ర, ఏడవ శతాబ్ద కాలము నుండే ప్రారంభమైనట్లు చరిత్ర ఉంది . 
అచ్చట దొరికిన  శిలా శాసనాలు, 
పురాణ గాధల ప్రకారం , తిరుమంగై ఆళ్వారుల దివ్య పాశురాలు అచటి పురాతన చరిత్రకు
 ఆధారాలుగా చెప్పబడుతున్నాయి..
అంతేకాదు ఈ క్షేత్రం, 108 , గాగల వైష్ణవ  క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడుతోంది.
  ఈ ఆలయం, ఒకప్పుడు వరాహపురి  , శ్రీ పురి అనే పేర్లతో పిలువబడుతుా ఉండేదని కుాడా అంటారు..

ఇక పురాణ కథనానుసారం..
గాలవ మహామునికి 360 మంది పుత్రికలు జన్మించారని , వారి వివాహ విషయ పరిష్కారార్ధం ఆయన శ్రీ మహా విష్ణు వునాశ్రయించగా , 
తానే ఒకొక్క దినమున ఒకొక్క  కన్యను , వివాహమాడుతానని  మాట యిచ్చి , ఆవిధంగానే అందరినీ వివాహమాడి , వారందరినీ కలిపి ఒకే ఒక స్త్రీముార్తిగా మార్చి, తన ఎడమ తొడపై ఆసీనురాలుగా  నిలుపుకున్నాడని  , ఆమే "అఖిలవల్లి తాయారు" గా 
పేరుగాంచిందనీ , స్థల పురాణంలో చెప్పబడింది.
అప్పటినుండే స్వామివారు కుాడా  "నిత్యకల్యాణముార్తిగా" పిలువబడుతున్నారని అంటారు.
పురాణాలలో స్వామివారిని "భుావరాహ పెరుమాళ్ళని
"తిరు విడన్ద దేవన్ " , "మనవాళ పెరుమాళ్"       అన్న పేర్లతో    ప్రస్తావించేరు.

ఇక్కడున్న స్వామివారు ఉత్సవ విగ్రహ ముార్తిగా "నిత్య కల్యాణ ముార్తి " అనే పేరుతోనుా ,  దేవేరి " కోమలవల్లి తాయారు " అనే పేరుతోనుా , పిలువబడుతుా నిత్య పుాజలందుకుంటున్నారు.
ఈ కల్యాణ విగ్రహ ముార్తుల బుగ్గలపై నల్లటి --బుగ్గచుక్క స్థిరంగా ఉండి , నేటికీ  భక్తులకు కనులవిందు చేస్తుా ఉంది.

పల్లవ చోళరాజులు కట్టిన  ఈ దేవాలయ గోపుర విమానాన్ని కల్యాణ విమానమని , యజ్ఞ  విమానమని అంటారు.
ఇచ్చటనున్న పవిత్ర పుష్కరిణులు :
ఒకటి వరాహ తీర్థము , రెండవది కల్యాణ పుష్కరిణి.
గర్బాలయానికి వెనుక నున్న 
 స్థల వృక్షం" పొన్ని చెట్టు" గా ప్రసిద్ధి చెందింది.
 
 ఇకపోతే గర్భ గుడిలో  ఆఖిలవల్లీ సమేత ఆది వరాహస్వామి ఆరున్నర అడుగుల ఎత్తులో ఉండి , 
 కుడి పాదం భుామిపై , ఎడమ పాదమును సతీసమేతముగానున్న ఆది శేషుని శిరస్సుపై నుంచి ,
 ఒక చేతితో శంఖము, మరొక చేతితో చక్రము ధరించి , 
 ముందున్న రెండు చేతులతో తన తొడపై ఆసీనులైయున్న 
 " అఖిలవల్లి తాయార్లను " అదిమి పట్టుకొని యున్న రీతిలో దర్శనమిస్తారు. 
 మంగళ మకుటధారియైన స్వామి ,
 పట్టు పీతాంబరాలు ధరించినవారై  , వైష్ణవ తిరునామాలతో, 
 దేవేరులను తదేకంగా వీక్షిస్తుా కనిపిస్తే....
 తాయార్లు కుడి చేతితో తామరపుష్పాలను ధరించి,
 కరుణ నిండిన కన్నులతో భక్తులను వీక్షిస్తున్నట్లుగా కనిపిస్తారు.
గర్భగుడిలో అర్చముార్తులకు అభిషేక సేవలు ఉండవని , పునుగు తైలము మాత్రము పుాస్తారని అక్కడి పుాజారులు చెపుతారు.

తుార్పు ముఖంగా నిర్మించబడిన ఈ దేవాలయ గర్భ గుడికి ముందు, అర్ధ మండపము, ముఖ మండపము , అటుపై  మహా మంటపము ,నిర్మింపబడి ఉన్నాయి.
ఈ మంటపములలో  నిర్మించబడి యున్న రాతి స్థంభాలపై , 
చెక్కబడిన చోళుల శిల్ప కళా నైపుణ్యం,  చుాపరుల దృష్టిని - ఆకర్షించే విధంగా ,  అద్భుతంగా ఉంటుంది.

 ఈ ఆలయం లోనే కోమలవల్లి తాయారు , శ్రీ ఆండాళమ్మ , శ్రీరంగనాయకీ సమేత శ్రీ రంగనాధులకు ప్రత్యేక సన్నిధానాలు నిర్మించబడి ఉన్నాయి.
 ఇవిగాక వాహన మంటపములు , ఉయ్యాల మంటపములు వంటివి కనువిందు చేస్తుానే ఉంటాయి
 .
 చాలా పురాతనమైనందున  ఈ ఆలయములో కొన్ని భాగాలు  శిధిలావస్తకు చేరుకున్నాయి.  ముఖ ద్వారంపై "దళం నిర్మాణం  మాత్రమే వేసి  , రాజ గోపురము కుాడా లేని, ఈ ఆలయ పునరుద్ధరణను చేపట్టిన దేవాదాయ శాఖవారు, కొన్ని మరమ్మత్తులను చేసి , ఆలయ "మహా సంప్రోక్షణ " కార్యక్రమాన్ని నిర్వహించేరు.
ఈ ఆలయంలో ఎల్లపుడుా జరిగే నిత్య పుాజను " వైఖానస ఆగమ శాస్త్ర " పద్ధతిలో జరుపుతారు.
మాసానికొకటి చొప్పున బ్రహ్మోత్సవాలు , వసంతోత్సవాలు , 
ఆండాళ్  తిరు కల్యాణం ,
క్రిష్ణ  , హనుమజ్జయంతులు , 
నవరాత్రి ఉత్సవాలు , వైకుంఠ ఏకాదశి , చక్రత్తాళ్వారుకు సముద్ర తీరంలో తిరుమంజన సేవ , గరుడసేవల వంటివి జరుపుతారు.
స్వామి వారికి ఫాల్గుణ మాస, ఉత్తరా నక్షత్రంలో "కల్యాణం"  జరిపిస్తారు.
పెళ్ళిళ్ళు ఆలస్యంగా జరిగినా , 
సంతానం కలుగక పోయినా, 
అనారోగ్యం బాధ పెడుతున్నా , 
గ్రహదోషాల బాధ ఉన్నా ,
ఈ స్వామి దర్శనం మాత్రం చేతనే దోష పరిహారం జరిగి ,  కోరికలు సిద్ధిస్థాయని భక్తుల సంపుార్ణ నమ్మకం .

తుార్పు సముద్ర తీరంలో,  ప్రశాంతమైన వాతావరణంలో నెలకొన్న ఈ స్వామి వారి 
 భక్తులైన తిరు మంగై ఆళ్వారు , అళగియ మనవాళ దాసర్ , శ్రీ కురవై రామానుజదాసు
వంటి  ఘనులు  "తిరువిడన్దై   వేల్పుల 
ఘన కీర్తులను దివ్య పాశురాలుగా రచించి ,
స్వామి వారి వైభవములను చాటి చెప్పేరు. 
ఇచ్చటికి చేరువలోనే పర్యావరణ కేంద్రారాలైన మహాబలిపురం , కోవళము , ముత్తుక్కాడు , వంటి పర్యాటక స్థలాలు , ఇక్కడికి దగ్గరలోనే ఉన్నందున, రవాణా సదుపాయాలు చాలా ఉన్నాయి.  వీటిని సందర్శించేదుకు వచ్చిన యాత్రికులు , 
ఈ అద్భుత పురాతన ఆలయాన్ని కుాడా దర్శించి , స్వామివారి ఆశీస్సులను పొంది , తరిస్తారని 
తలుస్తాను.

***********************


ఇంత మంచి అంశాలనిచ్చి ,   పురాతన చరితలను మాచే చదివించి , రచయిత్రులను ప్రొిత్సహిస్తున్న మనోహరి మహిళా బృంద సభ్యులకు మనఃపుార్వక ధన్యవాదాలతో..🙏

మరపురాని మమతలు.

09/05/2023.
తపస్వీ మనోహరం , మనోహరి  మహిళా పత్రక కోసం 
అంశం : వేసవిలో అమమ్మగారింటి జ్ఞాపకాలు .
శీర్షిక  : మరపురాని మమతలు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .


ట్రైన్  లో కుార్చొని కిటికీ లోంచి బయటకు చుాస్తున్న నాకు ,
నా కళ్ళముందు, వెనుకకు వెళిపోతున్న ప్రకృతి నిండిన ప్రపంచం ,   ఆకాశంలో నాతో పాటుగా నడుస్తుాన్న  చందమామ కురిపిస్తున్న చల్లని వెన్నెల గిలి పెడుతుా
ఉంటే , మిణుకు మిణుకు మంటున్న తారల మధ్య బోసి నవ్వులతో నా కోసం నిరీక్షిస్తున్న మా అమమ్మ  ముఖం 
నా కన్నీటి పొరల మధ్య అస్పష్టంగా కనిపిస్తుా ఉంటే 
అసహనంగా కదులుతుా కళ్ళు ముాసుకున్నాను .

అమమ్మ .....
ఎప్పటికీ మరువలేని హాయి ఆమె ఒడిలో
ఎన్ని రకాలు వండినా తరగని ఋచి ఆమె వంటల్లో..
ఇప్పటికీ చెప్పలేని అనురాగానుభవం  , ఆమె తరగని  అప్యాయతలో ..మ
ఇప్పటికీ మరువ లేని జ్ఞాపకాలు ఆమె సన్నిధిలో గడపిన క్షణాలు ,ఆ రోజుల్లో.
ఆలోచిస్తున్న నాకనులముందు నా చిన్నప్పటి సంఘటనలు.
ఒక మరపురాని చిత్రంలా...ఒక  అలుపులేని ప్రయాణంలా.....
----------------
అమ్మా ! రిక్షా వచ్చేసింది తొందరగా  రా అమ్మా .
లేటుగా వెళ్తే రైలు తప్ఫిపోతుంది పదమ్మా..
అమమ్మ మన కోసం  ఎదురు చుాస్తుా ఉంటుంది..
అంటుా హడావిడి పెట్తేస్తున్నాది తను .
"అబ్బబ్బ  వస్తున్నానుండమ్మా...తాళాలన్నీ సమంగా వేసేనో లేదో ,చుాసుకోవాలికదా ..నువ్వు తమ్ముడిని తిుసుకొని ముందు రిక్షా ఎక్కు .." అంటుా విసుక్కుంది అమ్మ .
తనైతే  తమ్ముడితో పాటు ఎప్పుడో రిక్షా ఎక్కేసింది.
ప్రతీ వేసంగి సెలవులకీ అమమ్మ దగ్గరకు వెళ్ళడమంటే 
చాలా ఇష్టం తనకు. 
ఆ వుారికి ,తమ ఊరికి ముాడు గంటల ప్రయాణం మాత్రమే.
తాము ఒరిస్సా "కుర్దా రోడ్డు" లో ఉండేవారు.
అమమ్మ  ఆంధ్రా "సోంపేట"లో ఉండేది .
ఆవుారుకి వెళ్ళడమంటే  తనకు చాలా ఇష్టం .
బండి "కంచిలి" స్టేషన్లో అగేది. దిగిన తర్వాత  బయటకు
రాగానే "సోంపేట "ఊరికి బస్సులు ,గుర్రపు బగ్గీలుండేవి.
తను గుర్రపు బండిలోనే ఎక్కుదామని పట్టు పట్టేది.
ఆ గుర్రాల బండీలో కుార్చొని  మట్టి రోడ్డుకి
 రెండు వైపులా ఉన్న పెద్ద-పెద్ద చెట్ల మధ్య నుండి ఊళ్ళోకి వెళుతుా ఉంటే అదొక అద్భుతమైన ప్రయాణంలా అనిపించేది.
అక్కడ  తమ దొడ్డమ్మ  స్కుాల్ లో సంగీతం టీచర్ గా పనిచేస్తుా ,పిల్లలకు సాయంత్రం పుాట వీణ నేర్పిస్తుా ఉండేది .
 మా అమ్మ , పెద్దమ్మ ,పిన్నమ్మలు ముగ్గురుా సంగీతంలో డిప్లమొా చేసిన వారే కావడం తో మా పెద్దమ్మ ఇల్లు నిత్యం సంగీత  కీర్తనలతో ,పిల్లలతో నిండి ఉండేది.  అక్కడే అమమ్మ కుాడా ఉండేది. మా దొడ్డమ్మంటే  నాకు,  అమ్మ కన్నా ఎక్కువ ఇష్టంగా ఉండేది. మా దొడ్డమ్మకి కుాడా 
 నేనంటే చాలా ఇష్టం . కారణం, నా గాత్రం చాలా బాగుంటుంది .నేను వెళ్ళినపుడల్లా  మా దొడ్డమ్మ కొన్ని కీర్తనలు నేర్పి, నాచే అక్కడి కోవెలలో  కచేరీ చేయించేది.
 ఆ కాలంలో సంగీత -సాహిత్యాలకి చాలా విలువ ఉండేది .
 అందికే చిన్న కార్యక్రమమైనా చాలా మంది వినడానికి వచ్చేవారు.ప్రోగ్రామ్ పుార్తయ్యాకా నన్నందరుా మెచ్చుకుంటుా ఉంటే నాకు చాలా గర్వంగా ఉండేది.
 మా దొడ్డ కుాడా " మా చెల్లి కుాతురండీ" ,అని చెపుతుా చాలా మురిసిపోయేది.
దొడ్డమ్మకి నలుగురు  పిల్లలు. ఇద్దరు కొడుకులు .ఇద్దరు కుాతుర్లు.
వాళ్ళకి గాత్రం రాలేదు గానీ అందరుా "వీణ "చాలా బాగా వాయిస్తారు.వాళ్ళుా ,తాముా కలుస్తే చాలు హడావిడి 
ఇంతా అంతా కాదు . 
అమమ్మైతే మమ్మల్ని చుాడగానే సంతోషంగా నవ్వుతుా ఎదురొచ్చి హత్తుకునేది.
ఆ పరిష్వంగంలో ఎంత ప్రేమొా...
ఇంటి లోపలికి వెళ్ళగానే  అమమ్మ  తమ కోసం అల్లిన
అందమైన ఊలు బొమ్మలను చుాపించేది.
అందమైన గుడ్డ బొమ్మలను కుట్టి చిన్న చిన్న కధలతో 
తోలుబొమ్మలాటలాడించేది.
బొమ్మల పెళ్ళిళ్ళు చేయించేది.
ఇంటి  పెరటి తోటలోనే  వనభోజనాలంటుా అందర్నీ పిలిచి 
బోలెడు వంటలు చేసి వడ్డించేది.

రోజుా మంచి మీగడ పెరుగుతో అన్నం తినిపించేది.
"అడ్డగాడిదల్లా పెరిగేరు. వాళ్ళ చేతులతో వాళ్ళు తింటారులే అమ్మా "అంటుా అమ్మ ఎంత మొత్తుకున్నా వినేదికాదు.
అప్యాయంగా తినిపిస్తున్న ఆచేతుల్లో ఏమి మహిమ ఉండేదో గానీ , ఈ కుారొద్దు , ఆ పప్పొద్దు , అని అనకుండా హాయిగా పెట్టిన అంతన్నమంతా  తినేసే వాళ్ళం.
రాత్రైతే చాలు , అరుబయటే పక్కలు.
పెద్ద నడిమింటి వాకలిలో అందరుా బొంతలు పరుచుకొని 
అల్లరల్లరిగా కబుర్లు చెప్పుకుంటుా  పడుక్కునేవాళ్ళం.
అమమ్మ మాత్రం  మా పిల్లల మధ్యలోనే పడుక్కునేది.
అమమ్మ పక్కన నేనంటే ,నేనంటుా ,దెబ్బలాడుకుంటుా ఉంటే, అమమ్మ" మీరంతా అల్లరి పెట్టకుండా ఉంటే , 
నేనో మంచి కధ చెపుతాను " అనేది అంతే ...
అందరం ఠక్కున నోరు ముాసేసే వాళ్ళం.
అమమ్మ  చెప్పిన కధల్లో ఎన్నో నీతి కధలు,  చందమామ కధలు , పొడుపు కధలు , భక్తి పద్యాలు '  రామాయణం భారౕతంలో  కధలు ఇలా చెప్పుకుంటుా పోతే ఎన్నో...
వాటిల్లో తనకు గుర్తున్న చాలా కధలు ఎన్నో ,తనిప్పుడు తన పిల్లలకు  చెపుతోంది.
అమమ్మకు   ముగ్గురుా ఆడపిల్లలే  కావడం వల్ల 
దొడ్డ ఉద్యోగం చేస్తుాండడంతో , నలుగురి పిల్లలతో 
ఇబ్బంది పడుతుందని అమమ్మ అక్కడే ఉంటుా ఉండేది.
మా పెదనాన్నగారు వేరే ఊర్లో పనిచేస్తుా అప్పుడప్పుడు 
వస్తుా ఉండేవారు.కారణం  ఇద్దరికీ ట్రాన్స్‌ఫర్ లు అయ్యేవికావు. 
ఇద్దరుా ఉద్యోగాలు చేయనిదే ఇల్లు నడిచేది కాదు.

ఆ యింటి ముందు మర్రి చెట్టికటి ఉండేది. అందువల్ల 
అమమ్మనందరుా "మర్రిచెట్టు మామ్మగారు" అని పిలిచేవారు.
అమమ్మ  ప్రతీ రోజుా పొద్దున్నే గుడికి వెళ్ళి , ఒక అరగంట సేపు  ప్రభాత సేవగా కీర్తనలు పాడి వచ్చేది.
సాయంత్రాలు ఇంటి ఆవరణలో  భగవత్ప్రసంగాలు చెపుతుా 
అందరి చేతా భజనలు చేయించేది.
అమమ్మన్నా , దొడ్డమ్మన్నా ఆవుార్లో అందరికీ ఎంత గౌరవమొా !
నా వివాహం జరిగేంత వరకు నేను ప్రతీ సెలవులకు 
సొింపేట వెళ్ళడం నియమంగా మారితే," అమ్మలు" వస్తుందని అమమ్మ  దొడ్డమ్మ తో పాటు పెద్దక్క వస్తుందని  ,
మా చెల్లెళ్ళు , తమ్ముళ్ళు   ఎదురు చుాడడం , నన్ను  ఎంతో 
ఆప్యాయతతో పలకరించి పులకరింపజేయడం 
అలవాటుగా మారిపోయింది.
నాకు పెళ్ళయేంత వరకు ఊరంటే సోంపేటే.
ఇల్లంటే   దొడ్డ ఇల్లే .  ప్రేమంటే అమమ్మదే.
ప్రపంచం అంటే మా కుటుంబమే...తప్ప మరొకటి
తెలీదు.
 నా వివాహం తర్వాత అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి .
 అందరుా ఒకొక్క ఊరిలో స్థిరబడ్డారు.
 ఎవరి సంసారాలు వాళ్ళవయ్యాయి .
 అమమ్మ  వంటరిదయ్యింది.
 అందరికీ వంటలు చేసి పెట్టి , పురుళ్ళు పోసి , ముని మనుమల ఆలనా ,పాలనా కుాడా చుాసిన అమమ్మ 
 చివరికి వంటరిగా...ఆ ఇంట్లో.....
 
 *************
 కంటి నిండుగా ధారాపాతంగా  కారుతున్న కన్నీళ్ళను ఆపుకునేంతలోనే కంచిలి వచ్చేసింది.
 ఊరు మారింది . మట్టి రోడ్డు తారు రోడ్డుగా మారింది
 ఇప్పుడు బగ్గీలు లేవు . ఏ.సి బస్సు లో సోంపేట చేరాను.
ఇన్నేళ్ళకు  అమమ్మ దగ్గరికి  వెళుతున్న ఆనందం 
ఒక పక్క , అమమ్మ  ఎలా ఉందో అన్న ఆత్రం ఒక పక్క
ఉక్కిరి బిక్కిరి చేస్తుాంటే  , గబ గబా ఇల్లు చేరేను.
తలుపు కొడుతుా ఉంటే చేతులు వణికేయి.
కొంచం ఆలస్యంగా తెరుచుకున్న తలుపుల వెనకాల 
అమమ్మ వడలిన ముఖంతో , బోసి నోటితో నిండిన నవ్వుతో
అదే ఆప్యాయత నిండిన ప్రేమతో " అమ్మలుా " అంటుా
 నన్ను దగ్గరకు తీసుకుంది. అదే  ఆప్యాయత అమమ్మలో.
 ఈ సారి అమమ్మకు నేనే  బోలెడు గిఫ్ట్ లు తెచ్చాను .
 అవన్నీ చుాస్తుా అమమ్మ  ఎంతో మురిసిపోయింది .చివరిగా మంచి మొబైల్ చేతిలో పెట్టి , దానిని ఎలా వాడాలో ఆ రాత్రంతా చెప్పా...అంతే ఠక్కున  ఒకొక్కటిగా అన్నీ నేర్చేసుకుంది అమమ్మ .  ఫోనులో మొబైల్ డాటా వేయించి , ఇంటికి నెట్ పెట్టించేసేను ..వారం రోజులు ఇట్టే గడచి పొియాయి. అమమ్మ మొబైల్ లో కీర్తనలు, ప్రవచనాలు, పాత సినిమాలు, చుాస్తుా మురిసిపోతోంది .
  తను తిరుగు ప్రయాణమయ్యింది.
 మళ్ళీ తప్పక వస్తానని మాట ఇచ్చింది అమమ్మకు .
 సోంపేట ష్టేషన్ లో అడుగు పెట్టిందో లేదో..
 ఫొిన్ మొాగింది. వీడియొా కాల్ .వస్తోంది.
 ఎవరిదబ్బా అనుకుంటుా ఆన్ చేసింది
 ఎదురుగా...అమమ్మ...   బోసి నవ్వుతో......
 --------------------------------
 హామీ : 
 ఈ కధ నా స్వీయ రచన .

నెరవేరిన ఆశయం

31/05/2023.
మనోహరి మహిళా పత్రిక కొరకు 
అంశం : ఐచ్ఛికం.
బాల సాహిత్యం .

శీర్షిక  : నెరవేరిన ఆశయం .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


వీరన్న నిరాశగా ఇంటి కొచ్చి అరుగు మీద కుాలబడ్డాడు.
భార్య అంజమ్మ  గబ గబా మంచినీళ్ళు తెచ్చి..ఇస్తుా...
"ఏమయ్యా..! ఎవరైనా సాయం చేసారా " అంటుా
ఆత్రంగా అడిగింది. 
వీరన్న  నీరసంగా లేదంటుా  తలుాపాడు.

వీరన్న సాదాసీదా మనిషి. కుారలు అమ్ముకుంటుా
తనకున్న  ఇద్దరు పిల్లల్ని గారాబంగా పెంచుకుంటుా 
మంచి స్కుాల్ లో చదివిస్తున్నాడు.

కొడుకు "చింటుా" ఆరవక్లాసు పరీక్షలు రాసాడు .
కుాతురు" చిమ్నీ" నాలుగవ తరగతి పరీక్షలు రాసింది
ఇద్దరుా చాలా బాగా చదువుతారని  స్కుాల్ లో మంచి పేరుంది.
వీరన్న  తన కొడుకు  పెద్ద చదువులు చదివాలని , తనలా కుారలమ్మే బ్రతుకు లాంటి పనులు చేసి బ్రతక కుాడదని , 
అతడు మంచి ఉద్యోగంలో చేరితే తమ కష్టాలు తీరిపోతాయని , పిల్ల పెళ్ళి  ఘనంగా చేయవచ్చని 
బోలెడు కలలు కంటుా ,  పిల్లలతో అదేమాట పదే పదే చెపుతుా  ఉండేవాడు. 
అతని మాటలు విన్న అంజమ్మ 
తన వంతుగా , తమ ఇంటి ముందున్న జాగాలో కుారలు పండిస్తుా..పాదులకు కాసిన బీర ,దొండ, ఆనప వంటి లేత 
కుారలను గంపలో పెట్టి అమ్ముతుా చేయుాత నందించేది .

చింటుా, చిమ్నీలు కుాడా నాన్న మాటకు విలువనిచ్చి 
ఎక్కువ సమయం చదువుకుంటుా , పరీక్షల్లో
మంచి మార్కులు తెచ్చుకుంటుా, అందరితో "శెభాష్" అనిపించుకుంటున్నారు.
ఐతే ....
.కుారల బండి  వ్యాపారస్తుడైన వీరన్నకు
   వేసుకున్న కుారల మొక్కలన్నీ  అకాల  వర్షాలకు వంగిపోతుా, వర్షపు నీళ్ళ లోకి వాలిపోతుాండడంతో
 వాటుకి కాసిన కాయలన్నీ నీళ్ళ తడికి కుళ్ళిపోతుా ఉండడంతో, కుారల ధర బాగా పెరిగి ,వ్యాపారం  పెద్ద సమస్యగా మారడమే కాక  , పిల్లలకు స్కుాల్ ఫీజులు 
 కట్టడం మరింత పెద్ద సమస్యగా మారింది.
రోజురోజుకుా  పెరిగిపోతున్న రోజువారీ అవసరాల వస్తు
 ధరల కారణంగా , ఫీజులు , పుస్తకాలు చదువుల ఖర్ఛులు,  
 వీరన్న ఆశలను నిరాశపరుస్తున్నాయి.
మరొక  బ్రతుకు తెరువు తెలీని వీరన్న, ఆటో రిక్షా- నడుపుకుందామనుకున్నాడు. కానీ డబ్బు చాలక అదీ కొనలేకపోతున్నాడు.
ఇంటాడదాని సహకారంతో  ఈ కుారల వ్యాపారం 
సజావుగా సాగుతుా,  ఒక పుాటైనా తమ పొట్ట నిండుతోంది.
ఈ పిల్లల భవిష్యత్తు  ఎలాగుంటుందోనన్న బెంగ వీరన్నకు నిద్ర పట్టకుండా చేస్తొింది.

తల్లిదండ్రుల బాధను రోజుా గమనిస్తున్న పిల్లలు , 
ఒకరి ముఖం ఒకరు చుాసుకున్నారు బాధగా...
********

పరీక్షల రిజల్ట్స్  వచ్చేయి .
చింటుా , చిమ్నీలు  వంద శాతం మార్కులతో పాసై, 
స్కుాల్ కు మంచి పేరు తెచ్చేరు.
ఆంతేకాదు . ఎన్నో పేర్లలొ వారి ఫోటోలతో బాటు.
ప్రధానమంత్రిగారి చేతుల మీదుగా వారందుకుంటున్న పారితోషిక చిత్రాలు జనుల చేతులు మారి చివరకు 
 ఒక పెద్ద సంచలన వార్త అయిపోయిఃది..
చింటుా వాళ్ళ తల్లిదండ్రుల ఆనందానికైతే అంతేలేదు.
పిల్లల కారణంగా వారి ఫొటోలు కుాడా పేపర్లలోనుా, టి.వి.ల లో ఇంటర్వ్యూల తోనుా నిండిపోయింది.

పిల్లల చదువులకు స్కాలర్‌షిప్ లు దొరికాయి.
వీరన్నకు స్కుాల్ ఫీజు బాధ తప్పడమేగాక..స్కుాలు టీచర్లంతా కలిపి అతనికి కొత్త ఆటొ కుాడా కొవివ్వడం జరిగింది.
పిల్లలు తమకొచ్చిన  నగదు బహుమతిని తండ్రికిచ్చి 
కారుతున్న తమ ఇంటి చుారును బాగుచేయించమని చెప్పేరు.

ఇప్పుడు బాగుచేయించిన  వీరన్న ఇల్లు, 
ఇంటికి వేసిన రంగులతో కళ కళ లాడుతోంది.
కొత్త అటో ద్వారా  వీరన్నకు మంచి ఆదాయం వస్తోంది. 
అంజమ్మ తమ పెరటి తోటలో కుారల పంటకు 
మంచి ఎరువులు వేసి బాగా పండించడంతో
వారి జీవితం ముాడు పుావులు , ఆరు కాయలుగా గడుస్తొింది.
ఈ భోగమంతా పిల్లలు బాగా చదుకుకున్న కారణంగా వచ్చిందని వీరన్న గొప్పగా తన పిల్లల గురించి 
అందరితో చెపపుతుా ఉంటాడు.
స్కుాలుకు మంచిపేరు తెచ్చిన చింటుా చిమ్నీలను 
అందరుా ముద్దుగా చుాస్తున్నారు.
*******
పిల్లలుా , మంచిగా చదువుకోడానికి మనం బీదవారిమి కానక్కరలేదు. చదవాలన్న తపన ఉంటే చాలు. 
మీరు కుాడా స్కాలర్‌షిప్  సంపాదించుకో 
వచ్చు. 
పేపర్ లో మీ పేరుకుాడా వస్తుంది.
అందరిలో ఉన్నతంగా గౌరవింపబడతారు.
అమ్మా నాన్నకు మంచి పేరు తెస్తారు.



*******************************
 హామీ : 
 ఈ కధ నా స్వీయరచన.

బాబోయ్ ఉపవాసం...story

02/06/2023.
మహిళా మనోహరి పత్రిక కోసం.
శీర్షిక  : బాబోయ్ ఉపవాసం .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .

ఏమండోయ్ ! ఇంత పొద్దెక్కినా ఈ మొద్దు నిద్దరేవిటీ...
తెల్లారి అరు దాటుతున్నాది .లేచి ముఖం కడుక్కొని 
కాసిన్ని పుాలు కోసుకు రండి . 
కొనమంటే కోసెడు దుారం నడవాలంటారు.
కోసుకు రమ్మంటే కునుకు చాలదంటారు..
పోనీ నేనే వెళదామంటే  బండెడు చాకిరీ తరగదాయె..
ఆకాటికీ ఐదు గంటలకే లేస్తానా....
గుక్కెడు కాఫీకి కుాడా గతుండదు.
ఆ పాల వెధవ ఎక్కడెక్కడో తిరిగి మనింటికి
ఎడున్నర దాటాకా గానీ రాడు.
పోనీ నిన్నటి పాలు కొంచం మిగిల్చుకుందామా!
 అంటే  .రాత్రి హార్లిక్స్ తాగేదాకా ఆవలింతే రాదంటుా 
 ఉన్న పాలన్నీ  మీరే గుటుక్కు మంటారు.
 పెళ్ళామన్నది  ఒకర్తుంది. అది పొద్దున్నే లేస్తుంది .
 దానికిన్ని చుక్కల పాలు ఉంచుదామన్న ఇంగిత జ్ఞానమే  లేదు.
 పోనీ పొద్దన్న లేచి కాసిన్ని పుాలతో పాటు, కాస్త ఓ కాయ పాలు పట్టుకొస్తే మీ సొమ్మేంపోయిందటా...
 ఆకాటికీ చెపుతుానే ఉన్నా ! 
 "ఊబకాయం  వస్తొింది. కాస్తా పొద్దున్నే వాకింగ్ కి  వెళుతుా ఉండండీ."..అని
 అబ్బే ! అసలు లేవడం అంటుా ఉంటేకదా ...
 ఆ మహానుభావుడు వచ్చి పాలు పోస్తే గాని ఈ మహానుభావుడు లేవడట. 
 పాపం ...బ్రష్ చేయగానే కాఫీ లేకపోతే నోట్లో
 ఉమ్ములుారుతాయట .
అన్నీ మీ మొగుళ్ళకే ఉంటాయి బాధలు... 
పెళ్ళాల కేమీ  ఉండవు...మరే.......
మీనాక్షమ్మ అలా సణుగుతుానే ఉంది..

********************************
కామేశ్వర్రావు ఈ సుప్రభాతానికి విసుగ్గా లేచి కుాచున్నాడు.
"తను రిటైర్ ఐన దగ్గరినుండీ, పొద్దన్న లేపింది మొదలు రోజుా  ఇదే గోల...
విని విని వచ్చిన తలకాయ నొప్పికి, నిజంగానే కాఫీ ఉండాలి
ఈ పాల వెధవెక్కడ తిరుగుతున్నాడో...
లీటరు పాలకు ఓ రుాపాయి తగ్గించి ఇమ్మని 
బేరమాడిన పాపానికి , ఏనాడుా సమయానికి పాలు పొియడు. పొిసిన పాల లో నీళ్ళు కలపడం తగ్గించడు..
వెధవ బతుకు..కాస్త మంచి కాఫీకి కుాడా సమయానికి నోచుకోలేకపోతున్నాడు."
అనుకుంటుా  నిద్ర జోగుతోనే  బాత్రుామ్ లోకి దుారేడు.
కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేశాకా కాస్తా హాయనిపించింది. సరే బయటకు వెళ్ళి గప్ చిప్ గా
అయ్యర్ హోటల్లో ఇడ్లీ సాంబార్ తిని , చిక్కటి కాఫీ తాగేస్తే 
సరి...అనుకుంటుా..
ఏమేవ్ ...అలా వెళ్ళొస్తా ..అంటుా చెప్పుల్లో కాళ్ళు దుార్చేడు.
అకా బయటకు కాలు పెట్టేడో లేదో ...
ఏమండోయ్ ఈ రోజు నేను ఉపవాసం . 
కాసిన్ని అరటి పళ్ళు కుాడా తెండి.
రిటైర్ అయ్యేరు కదా. మీరు కుాడా ... కాస్తా పుాజ ఉపవాసాలు వంటివి చేస్తే ఒంటికి ఇంటికీ కుాడా మంచిది.
నాతో పాటు ఉపవాసం చేస్తానంటే ఓ రెండు పళ్ళు ఎక్కువ తెండి. అంటుా , బారెడు సంచీ చేతికిచ్చింది.
కామేశ్వర్రావు ఓక్షణం ఆలోచించి "సరేలేవే ..ఈ రోజు 
 నీతో పాటే ఉపవాసం చేస్తాను ." అని సందడిగా వెళిపోయాడు.
 కాముడు వాళ్ళమ్మ గారు  ఉపవాసమండేటపుడు 
 రెండరటి పళ్ళు చిన్న గ్లాసుతో పాలు తాగి పడుకునేది.
 ఆ  భయంతో  భార్య  తనతో  ఉపవాసముండమంటే భయపడి.తను  వాళ్ళమ్మకు ఎప్పుడూ  
 ఉపవాసాలుండనని మాటిచ్చేనని చెప్పి తప్పించు కున్నాడు.
 
ఇప్పుడు అతనికి ఒకనాటి సంఘటన జ్ఞాపకం వచ్చింది.

*************************************

తను ఉద్యోగం చేస్తున్నపుడు. భార్య ఎప్పుడు  ఉపవాసమున్నా  పక్కవీధిలోనే ఉన్న  తన పుట్టింటికి వెళిపోయేది.
అక్కడే విధంగా  ఉపవాసం చేసేదో తెలీదు గానీ,
 ఒకొక్క సారి  అక్కడునుండి తిరిగి వచ్చాకా 
 నీరసంగా పడుక్కునేది.  
 తనకు, ఆమె పగలు వండి, ఆర్చుకుపోయిన బిరుసు అన్నం  ,
 వేడికి ఉడికి చిన్న పాచి కంపుకుడుతున్న కుార ,
 చింతపండో, ఉప్పో ఎక్కువైన చారు నీళ్ళతో కడుపు నింపుకోవలసి వచ్చేది.
 
 
ఇదేదో చుాద్దామని  ఒక  రోజు రాత్రి తొందరగా భోంచేసి 
తను  వాళ్ళ పుట్టింటి వైపుకు వెళ్లేడు.
నాలుగిళ్ళ ముందునుండే నేతి ఘుమ ఘుమలు
వస్తున్నాయి. ఇంట్లోకి వెళ్ళి చుాసేసరికి 
దేముని మందిరం  చుట్టుా రకరకాల పిండి వంటలతో 
రుచికరమైన భోజనం .. నోట్లో  నీరుారుంచింది."

ఇంట్లో తిన్న కంపు కుార , చల్లటి ఉప్పు చారు, తలచుకొనేసరికి, కడుపులో తిప్పినట్టైంది.
 
ఐతే ! ఉపవాస మంటే ఇదన్న మాట సంగతి .ఇన్ని రకాలు వండుకు సుష్టుగా తిని , ఇంటికి వచ్చి భుక్తాయాసంతో పడుక్కుంటే తనేమొా పాపం ఉపవాసం కదా.
.నీర్సానికి పడుక్కుందేమొా అనుకొని సద్దుకు పొియేవాడు.

ఎంత మొాసం ...!  ఎంత దగా..! మొగుడికి కనీసం రెండు బుారెలన్నా పెట్టకుండా ...నంగనాచి  ఎంత నాటకమాడేదో..
కిందటేడాదే వాళ్ళమ్మ  పరలోకానికి ప్రయాణమయ్యింది.

వాళ్ళమ్మ పొియాకా తనింట్లో ఇది అమె మొదటి ఉపవాసం.
ఆ విషయం జ్ఞాపకానికి రాగానే కాముడు భార్యతొి 
అపుడైతే  ఉద్యోగంలో కుదరక అలా చెప్పేను గానీ ..
నీకన్నా నాకెవరు ఎక్కువని...అసలు నువ్వు ఉపవాసాలు చేస్తున్నపుడు నేను  హాయిగా భోజనం చేయడం నాకెంత బాధగా ఉందేదో...
అమ్మ పొియిందిగా ! ఇచ్చిన  మాటకుాడా పోయినట్టే !
అంటుా , ప్రేమ కురిపిస్తుా  ఆమెతో
ఉపవాసముండ డానికి ఒప్పుకోవడమే కాక, జీవితాంతం ఆమెతో కలిసి ఉపవాసం చేస్తానని మాటిచ్చేశాడు.
పిండివంటల భోజనాన్ని తలచుకుంటుా....
 మీనాక్ష భర్త అభిమానానికి పొంగిపోయింది.
 మనసులొ వంట బాధ తప్పినందుకు మురిసిపొితుా...
 
మంచిదైంది తనుకుాడా ఆమెతో ఉపవాసం చేస్తాన న్నాడు.
లేకపోతే ..అదే బిరుసన్నం ఉప్పు చారుతో తినవలసి వచ్చేది...అనుకుంటుా బయటకెళ్ళి..
అలోచిస్తుానే  పుాలు పళ్ళు పాలతో ఇల్లు చేరేడు.

+************::::+

రోజంతా కడుపులో ఏమీ లేకపోవడంతో ఆకలి కరకర మంటోంది.  కాఫీలు  తాగి తాగి నోరంతా పాచి బారిపోయింది.
నీర్సానికి కలక్ళు తిరుగుతున్నాయి.
రాత్రి వంటల రుచులు తలుచుకుంటుా 
ప్రాణాన్ని ఉగ్గపట్టుకు కుార్చున్నాడు కావుడు.
సాయంత్రమయ్యందిగానీ ఇంట్లో ఎక్కడా వంట 
సందడి కానరా లేదు.
అలా రాత్రయ్యింది....మీనాక్షి జపమాల తిప్పుతుానే ఉంది.
ఇక ఉండబట్ట లేక అడిగాడు.
"బోజనం  ఎప్పుడు " అని.
ఇదిగో చంద్రుడు రాగానే పుాజ చేసి తినేయడమే 
అంటుాంటే  చంద్ర దర్శనం కోసం నిరీక్షిస్తుా..
రాత్రి పది దాకా ఆకలికి  కొట్టుకు పోయాడు.
చంద్రుడు వచ్చాడు .
మీనాక్షి సంబరంగా నైవేద్యాలు తెచ్చింది.
అవి చుాసి నోరెళ్ళబెట్టేడు కావుడు. ఒక గ్లాసులో పానకం , మరో గిన్నెలో పచ్చి పిండి చనిమిడి ,వడ పప్పు
చుాసి  కళ్ళు తిరిగాయి కావుడికి..
వెంటనే వాళ్ళ అమ్మగారింటి పిండి వంటల
 ఉపవాసం  గుర్తు చేసాడు. 
 ఇవాలక అవన్నీ చేయవా అంటుా అడిగేడు.
 
 దానికి మీనాక్షి నవ్వుతుా ..అది కార్తీక సోమవారాల ఉపవాసమండీ. పగకంతా ఏమీ తినకుండా  రాత్రి మాత్రం  పిండి వంటల భోజనం శివయ్యకు నైవేద్యంగా పెట్టి, ప్రసాదంగా   తింటారు
 దాన్ని మీరు విడిచిపెట్టేరుగా...
 ఇది కార్తీకపున్నమి ఉపవాసమండీ..
నాతో పాటుగా జీవితాంతం చేస్తాన ని  మాటిచ్చేరు. నాకెంత ఆనందంగా ఉందో అంటుా ..పుాజకు ఉపక్ర మించింది మీనాక్షి  . 
"పొద్దున్నే మా నాన్నగారు చెరకు గడలు, అరటి దొన్నెలు పంపించేరు.  దొన్నెల్లో దీపాలు పెట్టండి మీరు అంటుా వత్తులు అందించింది.
ఇదిగో చంద్రుడు రాగానే కడుపు చలవకోసం చేసిన చలిమిడి
పళ్ళు  చంద్రుడికి నైవేద్యం పెట్టి .ఆతర్వాత మనం తినేయడమే " అంటుా చావు కబురు చల్లగా చెపుతున్నట్టు చెప్పగానే పంచ బక్ష్య పరమాన్నాలు తినొచ్చని ఆశబడ్డ కామేశ్వర రావు అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు.
-----------
ఈకధ నా స్వీయ రచన.

ప్లాస్టిక్ లోకం

15 /06/ 2023

మనోహరీ మహిళా పత్రిక కొరకు రచన .

శీర్షిక :  ప్లాస్టిక్ లోకం.
వచన కవిత.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి 
కళ్యాణ్  : మహారాష్ట్ర.

ఊపిరాడని గదిలో ఉక్కపోతల జీవితం
ప్లాష్టిక్ నిండిన రంగులతో ఇల్లు నిండిన సంబరం

ఇటుక  గోడల చల్లదనం ముాత వేసిన నేరానికి
వేడెక్కన రంగు గోడలు వేస్తున్న శిక్షకు, కమిలిన
 దేహం కారుస్తున్న చమట చుక్కల ప్రవాహం ॥

గదికున్న షొికేస్ లో వాసన లేని ప్లాష్టక్ పుాలకు 
 రోజుా జల్లుతున్న సెంటు ,గంధం కలబోసిన
 ప్లాష్టిక్ దుర్గంధం  రోత పుట్టిస్తోంది!
 
బాత్ రుామ్  కొళాయిల కింద 
బావురు మంటున్న ప్లాష్టిక్  బాల్ఛీల్లో
రెండు రోజులకో సారి వచ్చే కొళాయినీళ్ళ
పాకుడుతో  నాచు బట్టిన బాల్చీల్లో 
బంక నిండిన జిగురు , డోకు పుట్టి స్తోంది.! 

పక్కనున్న పాకావిలాస్ లో ప్లాష్టిక్  ప్రేట్ల లో 
వేసున్న వేడి వేడి ఇడ్లీలను ఆవురావురుమని 
తింటున్న జనం ,కరుగున్న ప్లాష్టిక్ రుచిని 
ఆనందంగా ఆస్వాదిస్తుా పొట్టలోకి కుక్కుతున్నారు.!

ఆకలికి ఆగలేని ఆవొకటి  పక్కనున్న పెంటకుప్పలోకి
విసిరేసిన ప్లాస్టిక్ కవర్  మూటలో,  
మురికి కంపు కుడుతున్న  ఆహారాన్ని  ఆబగా ,
 ప్లాస్టిక్ కవరుతో పాటే తినేసీ,
మింగలేక మిడి గుడడ్లేసింది.!

ఓ మూల కూర్చుని ఉన్న గజ్జి  కుక్క,
 ఆకలికి , మింగిన ప్లాస్టిక్ కవరును లోపలికి మింగ లేక ,
పైకి కక్కలేక నానా అవస్తవలు పడుతోంది.!

రోడ్డు చివర కంపు కొడుతున్న  కాలువలో 
పారుతున్న నీటిని,మూడేళ్లు నిండని ముష్టి బాలుడొకడు, దాహం తీర్చుకోడానికి  , మురికి నిండిన ప్లాస్టిక్ కవర్లో కి 
నింపడానికి ప్రయత్నిస్తున్నాడు.!

 ఇంట్లో నిండిన చెత్తా-చెదారాన్ని 
  బయట పారవేయడానికి , ప్లాస్టిక్ కవర్లు
 కొన్న నేను. ఉసూరు మంటూ ఇంటిదారి పట్టేను.
 
తలుపు తీసిన మా శ్రీమతి చేతిలో ప్లాస్టిక్ చీపురు , 
ముఖం, మండుతున్న ప్లాస్టిక్ లా ఉంది...

వాళ్ళు చేస్తున్న అల్లరికి ,అదే చీపురుతో 
కొట్టినట్లుంది,
ఇంటి మధ్యలో గోలగోలగా అరుస్తూ ప్లాస్టిక్ బొమ్మలు
చిందర వందర చేస్తూ , బే,.అని ఏడుస్తూ పిల్లలు .

ఎదురుగా , గోడకున్న గూటిలో మా ఆవిడ ప్రేమతో చేయించుకున్న , పరలోకమేగిన వాళ్ళ నాన్నగారి ప్లాస్టిక్ విగ్రహం...వింత నవ్వుతో...
 రేపొద్దున్న నీ గతి కూడా ఇంతే ! అన్నట్టుగా...
 
అనుకోకుండా చేతిలో ఉన్న ప్లాస్టిక్ కవర్ల వైపు చూశాను.
 అవి నన్నే చూస్తూ , ఎన్ని అనర్ధాలు జరిగినా మమ్మల్ని మాత్రం నువ్వు వదల లేవులే అంటూ, నవ్వుతున్నట్లుగా...
 వెక్కిరిస్తున్నట్లుగా...
 
నన్ను ప్రశ్నిస్తున్న నా మనసుకు, సమాధానం ఇయ్యలేక ,
గుడ్లు తేలేశాను .


 
ఈ కవిత నా స్వీయ రచన.



,

జగన్నాథపురి ఆలయ చరిత్ర

తపస్వీ మనోహరి పత్రిక కొరకు ,
విభాగం : దర్శనీయ స్థలాలు , ఆధ్యాత్మిక విశేషాలు.
రచన :  శ్రీమతి :  పుల్లభట్ల జగదీశ్వరీ మూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర.
శీర్షిక :    జగన్నాథ పురీ ఆలయ చరిత్ర.

మన భారతదేశంలో పురాణకాలం నుండీ ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరీ ఒకటి.

ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని,, శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారట. ఈ పట్టణంలో శ్రీ మహా  విష్ణువు జగన్నాధుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు

ఈ  ఆలయం వైష్ణవ దివ్యదేశాల్లో ప్రముఖమైనదే కాక హిందువులు అతి పవిత్రంగా భావించే " చార్ ధాం " పుణ్యక్షేత్రాలలో ఒకటిగా చెపుతారు.

ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్ కి అరవై  కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ ఆలయాన్ని ప్రధమంగా ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని చెబుతారు.
తదుపరి  శిథిలావస్థకు చేరుకున్న ఈ  ఆలయాన్ని కళింగ పాలుకుడైన అనంత వర్మ చోడగంగాదేవ ప్రారంభించగా , తదుపరి ఆయన మనవడైన రాజా అనంత భీమ్రావు ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడని చెబుతారు.

ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడనీ, నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడనీ స్థలపురాణం.

.అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. 

విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, 
ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపగా అతడు. విశ్వావసుడి కూతురైన లలితను  ప్రేమించి పెళ్ళాడీ , ఈ జగన్నాధ విగ్రహాన్ని చూపించమని పదేపదే ప్రాధేయపడుతూడంతో అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు, అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళ్లేడట. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగునా ఆవాలు జారవిడచగా, . కొన్నాళ్లకు అవి మొలకెత్తడంతో, దారి స్పష్టంగా తెలిసిందట., వెంటనే  ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడట్టగా , ఇంద్రద్యుమ్నుడు
ఇప్పటికప్పుడు అడవికి బయలుదేరాడట.
కానీ అక్కడ చేరే సరికి అక్కడ విగ్రహాలు మాయమవడంతో    ఇంద్రద్యుమ్నుడు నిరాశకు గురై  ,  అప్పటికప్పుడు అక్కడే అశ్వమేధ యాగం చేయడమే గాక, , 
నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి, అక్కడే నిద్రించేవాడట.
.

ఒక  రోజు   నిద్రిస్తున్న ఇంద్రద్యుమ్నుని   కలలో  జగన్నాథుడు  కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశించాడట.. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాఠపపోవడంతో,.ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వచ్ఛి, తానొక్కడే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ,  21 రోజుల వరకు  అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధించాడట. 
 రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాకపోవడంతో ,.  రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపించాడట..
షరతు తప్పిన రాజుకు అక్కడ శిల్పి కనిపించలేదు కానీ ,
చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిచ్ఛేయట. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థించగా , చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిచ్ఛి. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడట. 
అందుకే పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలనూ వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి.దేశంలో ఎక్కడ లేనివిధంగా పూజలందుకుంటున్న ఈ దారు దేవత మూర్తులను 8-12 లేదా 19 సంవత్సరాలకి ఒకసారి మార్చి ,నూతన దేవతా మూర్తులను ప్రతిష్టించుతూ ఉంటారు .దీనిని నవ కళేబరోత్సవంగా నిర్వహిస్తారు . ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది ఈ జగన్నాథ రథయాత్ర.
" జగన్నాధ రధ యాత్ర " గా పిలవబడే ఈ రధయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు..

పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో  అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి ఒక రహస్యమే. అందుకే పూరీ జగన్నాథ స్వామిని భక్తులు అంతలా ఆరాధిస్తారు. ఇంతకీ పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉన్న అంతు పట్టని రహస్యాలేంటో ఓసారి తెలుసుకొందామా !

ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తయిన పిరమిడ్ నిర్మాణం. అక్కడ ఉండే స్తంభాలు, గోడలు.. అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవే.


పూరీ జగన్నాధ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి

ఈ ఆలయ గోపురం పైన ఉండే  ఈ జెండాలకు ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే.. గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఎగురుతుంది. కానీ.. ఇక్కడి జెండా మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా.. వ్యతిరేక దిశలో  ఎగురుతుంది.
45 అంతస్తుల ఎత్తు గల ఈ ఆలయంపైకి ప్రతి రోజూ ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఒక్క రోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకూ ఆలయం మూతపడుతుందని నమ్ముతారు.

చాలా ఎత్తుగా ఉండే పూరీ జగన్నాథ్ ఆలయం  గోపురం పైన   20 టన్నుల బరువు గల సుదర్శన చక్రం ఉంటుంది.  . ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం.

సాధారణంగా అన్ని చోట్ల  గాలి సముద్రం నుంచి భూమి వైపునకు  వీస్తుంది. సాయంత్రం పూట భూమి వైపు నుంచి సముద్రం వైపుకు వీస్తుంది. కానీ.. పూరీలో మాత్రం  అందుకు విరుద్ధంగా విభిన్నంగా గాలి వీస్తుంది.

జగన్నాథ ఆలయం పైన పక్షులు కూడా ఎగరవు.  " ఎందుకు ఎగరవు.." అనే విషయం మాత్రం, ఎవ్వరికీ అంతు పట్టడం లేదు.  దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది.

జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు. సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు. పగలు అయినా.. సాయంత్రం అయినా ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు. అంత అద్భుతమైన నిర్మాణమా , లేక దేవుడి మహిమా...?   అన్నది మాత్రం అంతు చిక్కడం లేదంటారు..
సింహద్వారం నుంచి ఆలయంలోకి  ఒక్క అడుగు  లోపలికి పెట్టగానే.. సముద్రంలో నుంచి వచ్చే  అలల శబ్దం వినిపించదు. కానీ.. అడుగు బయటపెట్టగానే అలల శబ్దం   హోరు మని  వినిపిస్తుందట.

ఇకపోతే పూరీ జగన్నాథ్ ఆలయంలో అతి ముఖ్యమైంది  రథయాత్ర. ఈ రథ యాత్రలో రెండు రథాలనుపయోగిస్తారు. 
 మొదటి రథం నది ఇవతలి ఒడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడ మూడు చెక్క పడవల్లో దేవతలు నది దాటుతారు. అక్కడి నుంచి మరో రథంలో దేవుళ్లను గుండిజా ఆలయానికి తీసుకెళతారు.

పూరీ వీధుల్లో శ్రీకృష్ణుడు, బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. ఆ రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి.
రథ యాత్రకు ముందు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చుతారు. ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు.
ఈ గుడిలోని శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేస్తారు.

ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో విశిష్టత ఏంటంటే.. గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే.. రథం తనంతట తానే ఆగిపోతుందట.. దాన్ని ఎవ్వరూ ఆపరు. ఇది కూడా ఇప్పటికీ ఒక మిస్టరీలాగానే ఉండిపోయింది.
 
పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆ ప్రసాదాలకు కూడా విశిష్ట చరిత్ర ఉంది. ఆలయ సంప్రదాయం ప్రకారం.. వాటిని మట్టి కుండల్లో వండుతారు. దేవుడికి సమర్పించడానికి ముందు ఆ ప్రసాదాల్లో ఎటువంటి వాసన కానీ, రుచి కానీ ఉండదు . కానీ.. దేవుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలన్నీ ఘుమఘుమలాడుతూ, ఎంతో మధురంగా ఉంటాయి .
విచిత్రం ఏమిటంటే
ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో  ఆలయంలో.   ప్రసాదాన్ని తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడూ కూడా ప్రసాదం వృధా కావడం,  ఎంతమంది భక్తులు వచ్ఛినా సరిపోయే విధంగా సమకూరడం  ఆశ్చర్యకరమైన విషయం. ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం.

పూరీ జగన్నాథ్ ఆలయంలో తయారు చేసిన ప్రసాదాన్ని కొంచెం కూడా వృథా చేయరట .

, ఇన్ని అద్భుతాలు నిండిన ఈ పవిత్ర పూరీ క్షేత్రాన్ని దర్శించేందుకు
దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి.

భువనేశ్వర్‌, కోల్‌కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది.

కోల్‌కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్‌ రైల్వేస్టేషన్‌ ఇక్కడ నుంచి 44 కి.మీ. దూరంలో ఉంది.


గూగుల్ సేకరణ.

పూర్తి ప్రదాతలు.

21 /06 /2023.
తపస్వీ  మనోహరం పత్రిక కొరకు ,
 అంశం : స్ఫూర్తి ప్రదాత. 

రచన :  శ్రీమతి :  పులాభట్ల జగదీశ్వరీమూర్తి.
 కళ్యాణ్  : మహారాష్ట్ర .

మనం పుట్టిన దగ్గరనుంచి ఎవరో ఒకరి స్ఫూర్తితోనే మన
ఎదుగుదల ప్రారంభం అవుతుంది .
మాట్లాడడానికి స్ఫూర్తి అమ్మ  అయితే ,  ప్రపంచంలో ముందడుగు వేయడానికి స్ఫూర్తి నాన్న ,
అక్షర  జ్ఞానానికి స్ఫూర్తి గురువైతే , మన ఆదర్శాలకు స్ఫూర్తి నాటి సభ్యత , సంస్కారాలు.

ఐతే పెరుగుతున్న మనలో అంతర్లీనంగా దాగి ఉన్న కొన్ని కళలకు అంటే సంగీతం, సాహిత్యం, నృత్యం ,గీతం, ఆటలు ఇలాంటి కళలకు మాత్రం , కొంతమంది  మాత్రమే మనకు స్ఫూర్తిదాయకులౌతారు.

ఇక ,నా విషయానికొస్తే,నాకు పాటలు  అంటే మహా పిచ్చి .
40 ఏళ్ల క్రితం రేడియో తప్ప ,పాటలు వినడానికి మరో   సాధన సదుపాయం ఉండేది కాదు.
నేను 24 గంటలు రేడియోలో పాటలు వింటూ అవే పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఆనందపడుతూ ఉండేదాన్ని.

అయితే మా ఇంట్లో ఎప్పుడూ  పొద్దున్న సాయంత్రం కూడా సంగీత సాధన జరుగుతుండేది కారణం , మా అమ్మమ్మ గారు, మా అమ్మ
గారు, మా పిన్నమ్మ గారు ,మా పెద్దమ్మ గారు, వీళ్ళందరూ కూడా సంగీతంలో డిప్లమోలు చేసి,  టీచర్లుగా ఉద్యోగాలు చేస్తూ ఇంట్లో పిల్లలకి  , తెల్లారి నాలుగు  గంటల నుంచి ఆరు గంటల వరకు, సాయంత్రం కూడా అదే సమయంలోనే ట్యూషన్లు చెప్తూ ,ఉండేవారు  .  చాలా మంది పిల్లలు వచ్చి సంగీతం నేర్చుకుంటుటూ , సంగీత సాధన చేస్తూ ఉండేవారు .
ఆ సమయంలో నాకు, పడుకోవడానికి గానీ, రేడియో వేసుకోవడానికి గానీ వీలుండేది కాదు.
 
మా అమ్మగారు చాలాసార్లు చెప్తూ ఉండేవారు వాళ్లతో పాటు కూర్చొని సంగీతం నేర్చుకో అమ్మా . ఇది చక్కగా అందరూ ఆదరించే విద్య అని .
 వినేదాన్ని కాదు. సరి కదా సినిమా పాటలు మీదే నా ధ్యాస ఉంటుండేది


రాను రాను మరో దారి లేక,  ఆ పిల్లలతో పాటు కూర్చుని సంగీతం ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని  . మా అమ్మగారు, పిల్లలకి సంగీతంలో మెళకువలు అన్నీ నేర్పుతూ ,   వాటితో పాటు, శృతి, లయ, రాగలాపన ,స్వర కల్పన, లాంటి వెన్నో మెళకువలు చెప్తూ ఉండేవారు  
కొన్నాళ్లు పోయేసరికి,  చిత్రంగా నాకు సంగీత మీద ఆశక్తి పెరిగి సినిమా పాటలు మీద ఆశక్తి తగ్గింది.
సంగీతంలో నేర్పుతూన్న మెళకువలన్నీ ప్రశ్నల రూపంలో మా అమ్మగారు అడిగేసరికి , "ఆ పిల్లలకన్నా ముందుగా నేనే జవాబు చెప్పాలి" అన్న పట్టుదల ఎక్కువ అయ్యేది.
ఆ విధంగా సంగీతం నేర్చుకున్నాను  . దానికి స్ఫూర్తినిచ్చిన వారు మా అమ్మగారు, ఆ పిల్లలే కదా..!

ఇక సాహిత్య విషయానికొస్తే, ఆ కాలంలో టెన్త్ పాస్ అయ్యేసరికి పెళ్లిళ్లు చేసేసేవారు. నాకూ అదే జరిగింది అయితే మెట్టినింఇంటికి వచ్చిన తర్వాత ,మా అత్తయ్య గారికి నాకన్నా ఎక్కువ పాటలు  , భజనలు ,సంగీతమే కాక సాహిత్య పరంగా కూడా చాలా అభిరుచి ,ఆశక్తి ,ఉండేది.
అంతేకాక ఆవిడ 500 వరకు హరికథలు చెప్పి, "హరికథా శిరోమణిగా " పేరు తెచ్చుకున్నారు. పురాణ ప్రవచనాలు చెప్పడం ,భజనలు చేయడం , స్వయంగా రాసిన భజన పాటలను ,ఆవిడకు వచ్చిన రాగాల్లో పెట్టి పాడుతూ, అందరి చేత పాడించడం చేస్తూ ఉండేవారు,.
దాంతో నేను కూడా ,నాకు వచ్చిన  రాగాల్లో, చిన్న చిన్న  భజన పాటలు రాస్తూ, రాగాల్లో పెడుతూ పాడడం మొదలెట్టేను.
దాంతో నాకు సాహిత్యంలో కాస్త పట్టు దొరికింది . పాటలు రాయడం రాగాల్లో పెట్టడం ,    స్వర కల్పన చేయడం కూడా నేర్చుకున్నాను.
ఈ విధంగా మా అత్తయ్య గారే నాకు సాహిత్య స్ఫూర్తి.
అయితే నేను రాస్తున్న పాటలను, స్వరకల్పనను మొట్టమొదటిగా గమనించింది ,   స్వర్గస్తులైన గౌరవనీయులు "శ్రీ కొడవటిగంటి రోహిణి ప్రసాద్" గారు.
వారు నాచే ,నేను రచించిన లలిత సంగీతం పాటలను నలుగురులో ప్రదర్శింప జేసి , నన్ను పాటల రచయితగా స్వరకర్తగా ప్రోత్సహించారు .
.
 తదుపరి గురువుగారు గౌరవనీయులు ఐన " శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు "
వీరి ప్రోత్సాహంతో నేను ఎన్నో  పాటలు రాసి , 
స్వరపరచేను  . గురువుగారైన "షణ్ముఖ శర్మ "గారు రాసిన శివ పదం లో 16 కీర్తనలను , నాచే కంపోజ్ చేయించి  వాటిని  రెండు సి.డి.లుగా విభజించి , ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరించడం కూడా జరిగింది.   ఈ విధంగా
 వీరిరువురురూ ,నా స్వర రచనకు స్ఫూర్తి. కారకులయ్యారు .

ఇక నేను రాస్తున్న కథలకు, కవనాలకు, నన్ను ప్రోత్సహపరిచి ,  నన్ను ముందుకు నడిపించినది 
గౌరవనీయులు "శ్రీ సంగివేని రవి "గారు.

కొత్త కొత్త ప్రక్రియలకు , గౌరవనీయులు" శ్రీ అడిగొప్పుల సదయ్య "గారి ద్వారా ప్రేరణను పొందాను.

ఈ విధంగా మనల్ని  ప్రోత్సహించేందుకు, వారు మనకి ఇచ్చే ప్రశంసా పత్రాలకై ,వారు పడుతున్న శ్రమ అత్యధికం.

ఇలా చెప్పుకుంటూ పోతే ,చాలా మంది మన వెనుక నిలబడి, మనకు సహాయ ,సహకార, ప్రోత్సాహాలు అందించడం వలన- మనం ఎంతో ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఈరోజు మనం కవులుగా , రచయితలుగా  , గాయకులుగా  గుర్తించబడుతున్నాము అంటే ,వీరందరూ  మనకిచ్చిన చేయూత, ప్రోత్సాహమే  కారణమని నమ్ముతున్నాను.

ఇలా గౌరవనీయులైన వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునే అవకాశాన్ని కల్పించిన""తపస్వీ మనోహరం" సంస్థ_- సభ్యులకు ,  నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

రచయిత్రి : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి.

🙏🙏🙏🙏🙏
,--------------------------------
,

శీర్షిక ఆరోగ్యం ఆహారం.

23/06/2023.

తపస్వీ మనోహరం  పత్రికల కొరకు ,
అంశం: ఆరోగ్యం :ఆహారం.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .

"ఆరోగ్యమే మహాభాగ్యం" అనేది పెద్దలు చెప్పిన మాట.
ప్రస్తుత కాలంలో మనమందరం, కాలం మారింది ,కాలం మారింది ,అంటూ మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం.

ఒకప్పుడు పిల్లా, పెద్ధా ,అందరూ కూడా పొద్దున్నే సూర్యోదయానికి ముందే లేచేవారు. 

పెద్దలు కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నానం చేసేవారు తర్వాతముంగిట్లో ఆవుపేడతో కల్లాపు జల్లి ముగ్గులు వేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టి , మడి బట్ట కట్టుకొని, దేవుని దగ్గర నిత్య పూజలు చేసేవారు. సూర్యోదయంతో పాటుగా ఇంట్లో , దేవుని మండపం దగ్గర కళకళ మంటూ దీపాలు వెలుగుతూ ఉండేవి .ధూప దీప నైవేద్యాలతో మధురమైన సువాసనతో ఇల్లంతా నిండిపోయి ఉండేది. 

పిల్లలు కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేసి, తదుపరి చద్దన్నం తినడం, తర్వాత స్కూలుకు వెళ్లి రావడం, హోంవర్కులు చేసుకోవడం ,సాయంత్రం పూట ఆడుకోవడం, 7-7:30 కల్లా పడుకోవడం దినచర్యంగా ఉండేది.

అల్పాహారానికి గాని, భోజనానికి కానీ, ఒక నిర్దిష్టమైన సమయపాలన జరుగుతూ ఉండేది .
సాయంత్రం 6 గంటలకి  పిల్లలు సూచిగా బట్టలు మార్చుకొని
దైవ ప్రార్థన చేసుకుంటుంటే పెద్దలు
 తిరిగి దేవుని దగ్గర దీపారాధన చేసేవారు .
 తదుపరి రాత్రి భోజన కార్యక్రమాలు అయిపోగానే 7:30 కి నిద్రకు ఉపక్రమించేవారు.
 పగటిపూట ఎవరూ కూడా నిద్రపోయేవారుకాదు .
 కట్టుబొట్టు, మాట తీరుతో, ఆడవారు చాలా సంస్కారంగా ఉండేవారు.
 ఆ కాలంలో ఇంటి భోజనం తప్ప బయట ఎక్కడా
  ఇలాగ బయట కొనుక్కుని తినడాలు కూడా ఎవరికి తెలియదు. ఏది కావాలన్నా ఇంట్లోనే చేసి పెట్టేవారు ఆడవాళ్లు.

కానీ రాను రాను ప్రస్తుతం రోజుల్లో ప్రతి ఒక్కరి దిన చర్యే పూర్తిగా మారిపోయింది .  గ్యాస్ పొయ్యిలు, మిక్సీలు, వ్యాక్యూమ్ క్లీనర్లు, వంటి సదుపాయాలు రావడంతో ఆడవారికి పని తగ్గి ,బద్ధకం ఎక్కువైంది .టీవీలు , మొబైల్స్ . 
వాడకం ఎక్కువయ్యి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ రావడంతో ఇంట్లో వంట చేయడం  కూడా తగ్గిపోయింది.
పానీ పూరీలు, పిజ్జా ,బర్గర్లు, ఐస్ క్రీములు, వంటి వాటికి పిల్లలు పెద్దలు కూడా అలవాటు పడ్డారు
వీటి కారణంగా ఇంట్లో వంటలు వండడం తగ్గిపోయింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువ అవ్వడంతో బయట ఫుడ్స్ తెప్పించుకోవడం , ఆన్లైన్ ఆర్డర్స్ చేసి ఫుడ్ తెప్పించుకోవడం  ఆన్లైన్ నుండి  కూడా ఆర్డర్ చేసుకుని తినడం మొదలవ్వడంతో ,ప్రతి ఒక్కరికి పని తగ్గిపోవడం , ఒంట్లో కొవ్వు ,అజీర్తి, పెరిగి చికాకులు ఎక్కువయ్యాయి . టీవీ పెట్టుకుని 24 గంటలు సినిమాలు చూడడం, సీరియల్స్ చూడడం చేస్తూ, రాత్రి  12, ఒంటిగంట వరకు మేలుకోవటంతో ,పొద్దున్నే లేచే అలవాటు తప్పిపోయింది.
ఇప్పటి కాలంలో ఎవరూ సూర్యోదయం చూసిన దాఖలాలే లేవు.
ఈ రకమైన జీవితానికి అలవాటు పడి, మన శరీరం మన ఆధీనంలో లేనందు వల్ల,  ఎన్నో రోగాలకు  మన శరీరం ఆశ్రయమయ్యింది.

పిల్లలు రెండు మూడేళ్ళు రాకుండానే  రోగగ్రస్తులవుతున్నారు. 15 ఏళ్ల దగ్గరుండి ఊబకాయం, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కంటి జబ్బులతో అందరూ రోగగ్రస్తులై ,ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

ఈ రకమైన  అనారోగ్య ఇబ్బందుల్ని పోగొట్టుకోవడానికి, ప్రస్తుతం యూట్యూబ్లో వస్తున్న ప్రతీ  చిట్కాల్ని నమ్ముతూ , అన్నిటినీ ఆచరిస్తూ,   అటుకి, ఇటుకి కాకుండా   నానా ఇబ్బందులు పడుతున్నారు.
మన అలవాట్లు మార్చుకోనంతవరకు, మనం ఎన్ని మందులు వాడినా ,ఏ చిట్కాలు వాడినా వాటి ప్రయోజనం ఉండదు. మనం అన్ని వాడతాం, కానీ ఒక పద్ధతిలో మన దిన చర్య ఉండదు .భోజనానికి, టిఫిన్లకి ,నిద్రకి ,సమయపాలన ఉండదు.
మనని చూసి మన పిల్లలు కూడా అదే  విధంగా ప్రవర్తించడంతో ఇంటిల్లపాది రోగగ్రస్తులై, మానసింగా  శారీరకంగా కూడా  ఇబ్బందులు పడుతూనే ఉన్నారు .
ఇప్పుడు యూట్యూబ్ లో చెప్పిన చిట్కాలు అన్నీ మన పూర్వీకుల ఆచరించినవే . అవన్నీ మధ్యలో  "  పాత చింతకాయ పచ్చడి "అంటూ మనం వదిలేసి ,తిరిగి అవే చిట్కాలను యూట్యూబ్లో చూసుకుని అమలు చేస్తున్నాం .

ఆరోగ్యంగా ఉండాలంటే అలవాట్లు మార్చుకోవాలి .మన అలవాట్లు మార్చుకుంటే ,మన ఆనందం ,మన ఆరోగ్యం- మనతోనే ఉంటాయి అన్నది నా ఉద్దేశం .

మన పూర్వీకులు అనుభవంతో చెప్పిన మాటలు-
సమయపాలన పాటించండి .ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.

ఈ చిన్ని వ్యాసం నా స్వీయ రచన.

                               -    శుభం -
                               -    ******

శీర్షిక : కళ్యాణి. ( చిత్రకథ)

*30/06/2023.
*తపస్వి మనోహరం కొరకు.
*అంశం : చిత్రకధ.

శీర్షిక :  కళ్యాణి.

*రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


కళ్యాణి స్కూల్ గేట్ దాటి బయటకు వచ్చింది. 
రోజులాగే రోడ్డు చివరి వరకు చూసింది .అమ్మ వస్తున్న జాడలేదు. 
అమ్మ రోజు ఇంతే. ఎప్పుడూ ఆలస్యంగానే వస్తుంది.
 తన తోటి పిల్లలంతా ఇళ్లకు చేరుకుని , హాయిగా ఆడుకోడానికి వెళ్ళిపోయి ఉంటారు. తను ఒక్కతే ఇక్కడ, ఈ స్కూల్ గేటు పక్కన బెంచి మీద కూర్చుని అమ్మకోసం చూస్తూ ఉంటుంది. 
ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరూ ఇంచుమించు ఇళ్లకు వెళ్లిపోయారు. స్కూల్ వాచింగ్ అని కూడా ఒక అరగంట సేపు వెయిట్ చేసి స్కూల్ గేటుకు తాళం పెట్టి ,ఇంటికి వెళ్ళిపోతాడు.
అప్పుడైతే తనకు చాలా భయం వేస్తుంది .ఎందుకంటే తను ఆ స్కూల్ అంతటికీ  తను ఒక్కతే ఉంటుంది.
ఈ మధ్యన అయితే పది రోజులు బట్టి, ఒక అంకుల్ తనవైపు అదోలా చూస్తూ ,ఆ రోడ్డు చివరన నిల్చుని కనిపిస్తున్నాడు.
మొదట్లో అతను , వాళ్ళ పాపనో బాబునో తీసుకెళ్లడానికి అలా వెయిట్ చేస్తున్నాడేమో అనుకుంది.
కానీ అతను పిల్లలంతా వెళ్లిపోయిన తర్వాత కూడా అలా 
నిల్చుని చూస్తూనే ఉంటున్నాడు.
ఈరోజు కూడా అతను అక్కడే ఉన్నాడు

 కళ్యాణి వాళ్ళ అమ్మ ఒక చిన్న ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాది.
 కళ్యాణి వాళ్ల నాన్నగారు, కళ్యాణికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయారు.
 అప్పటినుంచి కళ్యాణి వాళ్ళ అమ్మ ,కళ్యాణిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ , తామిద్దరి భారం ఎవరి మీద పడకుండా ఉండడం కోసం  , 
 ఒక చిన్న ఆఫీసులో ఉద్యోగంలో జాయిన్ అయింది.
 ఆఫీస్ ఒకవైపు, స్కూలు ఒకవైపు ,కావడంతో ఆమె వచ్చేసరికి ప్రతిరోజు లేట్ అవుతూనే ఉంటుంది.
 కళ్యాణి వాళ్ళమ్మ కళ్యాణిని ఎవరితోనో కలిసి ఇంటికి వెళ్ళొద్దని, తాను వచ్చేదాకా స్కూలు దగ్గరే వెయిట్ చేయమని రోజు చెప్తూ ఉంటుంది.
 తనకైతే చాలా ఆకలి వేస్తూ ఉంటుంది.
 అక్కడ ఒంటరిగా కూర్చోవడానికి కూడా భయంగా  ఉంటుంది. అప్పుడు తనకు అమ్మ మీద చాలా కోపం వస్తుంది.
 ఇప్పుడైతే శీతాకాలమేమో!  సాయంత్రం అయ్యేసరికి చలి కూడా వేస్తూ ఉంటుంది. 
 కానీ అమ్మ రాగానే తన కోపం అంతా కరిగిపోతుంది
 ఎందుకంటే అమ్మ రాగానే తనను దగ్గరికి తీసుకుని,"  అయ్యో అందరూ వెళ్లిపోయారా ? ఎంతసేపటి నుండి కూర్చున్నావమమ్మా   , భయమేసిందా ? ఆకలేస్తుందా .".. అంటూ తనను  దగ్గరికి తీసుకుని తనకు బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తుంది. 
తర్వాత అమ్మ వచ్చిన ఆటోలోనే తను, అమ్మ ,ఇంటికి బయలుదేరుతారు.
ఇలా  ఆరేళ్ల బట్టి జరుగుతూనే ఉంది.
ఇప్పుడు తను ఏడవ క్లాస్ కి వచ్చింది.
అంతకు ముందు తనకు భయం అన్నది తెలియదు.
కానీ తను పెద్ద అవుతున్న కొద్ది మనసులో భయం చోటు చేసుకుంటున్నాది.
చాలా పుస్తకాల్లో చదివింది .చాలా చోట్ల విన్నాది కూడా.
 ఇలా ఒంటరిగా ఉన్న ఆడపిల్లల్ని కొందరు మగ వాళ్ళు ఏదో ఒకలా వలవేసి పట్టుకుని తీసుకుపోతారని, విదేశాలకు అమ్మేస్తారని ,వాళ్ళని పనివాళ్ళుగా ,బిచ్చగాళ్లుగా, మార్చేస్తారని ఇలా ఏదేదో  విన్నాది.
 అమ్మ కూడా చెప్పింది ఎవరు నీ దగ్గరికి వచ్చినా వాళ్ళతో మాట్లాడొద్దని ,వాళ్ళు ఏమిచ్చినా తీసుకోవద్దని, వాళ్ళతో ఎక్కడికి వెళ్ళొద్దని.
 అమ్మ కూడా అలా చెప్పేసరికి తనలో భయం ఇంకాస్త ఎక్కువైంది.
 
 కానీ ఎన్నాళ్ళు ఇలా ? తనొక్కర్తి ఇంటికి వెళ్ళిపోవచ్చుగా... తనకు ఇల్లు తెలుసు .నడుచుకుని కూడా వెళ్లిపోగలదు ఇంటికి తాళం ఉంటుంది. కానీ ఇక్కడే కూర్చునే బదులు, తను ఇంటి దగ్గరే కూర్చుంటుందిగా ...కనీసం ఇరుగుపొరుగులతో ఆడుకోవడం కుదురుతుంది కదా. 
 ఈమధ్య ఎన్ని రోజులైందో.. తను తన స్నేహితులతో కలిసి ఆడుకుని .
 కళ్యాణి ఇలా ఆలోచిస్తుండగానే , ఎన్నో రోజుల నుంచి ఇటే చూస్తున్న ఆ అంకుల్ ,కళ్యాణవైపు రాసాగాడు.
 కళ్యాణి లో భయం ఎక్కువయింది.
 అతను వచ్చి అటూ ఇటూ చూసి మెల్లగా కళ్యాణి పక్కన కూర్చున్నాడు.
 ఏం పాపా! "ఈరోజు ఇంకా మీ అమ్మ రాలేదా" అంటూ మాటలు కలిపాడు.
 కళ్యాణికి చాలా భయం వేసింది కానీ అతను మెల్లగా నవ్వుతూ భయపడకు నేను మీ ఇంటి దగ్గరే ఉంటాను.
 ఇక్కడే పక్క షాపులో పనిచేస్తూ ఉంటాను . రోజు మీ అమ్మ వచ్చేవరకు నువ్వు ఒక్కతే కూర్చుంటావని గమనించాను. అందుకే మీ అమ్మ వచ్చేదాకా నీకోసమే నేను అక్కడ అలా నిల్చుని ఉంటాను .ఎందుకంటే ఒక్కతే ఉంటావు కదా, ఎవరైనా వచ్చి నిన్ను అల్లరి పెడతారేమోనని, అసలే రోజులు బాగా లేవు.
ఎంతైనా మీ ఇంటికి దగ్గరలోనే ఉంటాను కదా. నువ్వా చిన్న పిల్లవి .అందుకే  , మీ అమ్మ రాగానే నేను వెళ్ళిపోతాను.
ఈరోజు మీ అమ్మ రావడం రోజు కన్నా, 
ఆలస్యమవుతున్నట్టుంది....
పరవాలేదు నేను అంత దాకా నీ దగ్గరే ఉంటాను లే...
ఇదిగో నీకు ఆకలేస్తుందేమో! ఈ చాక్లెట్లు తిను అంటూ అంటూ కొన్ని చాక్లెట్లు ఇచ్చాడు.
కల్యానికి అతను చెప్పింది అంతా వింటూ ఉంటే నిజమేమో , అనిపించింది. కానీ కొంతసేపటికి , "ఇతన్ని మా ఇంటి చుట్టుపక్కల ఎక్కడా , ఎప్పుడూ నేను చూడలేదే...
ఇతను అబద్ధాలు చెప్తున్నాడు "
ఇతని మాటలు నేను నమ్మకూడదు అనుకుంది.
అతను కొంతసేపు తర్వాత,  పాపా చలి వేస్తుందా.. అంటూ అతను తొడుక్కున్న కోటు తీసి,  తన మీద కప్పబోయాడు .
కళ్యాణి ఒక్కసారి విసురుగా లేచింది.
వద్ద అంకుల్ నాకేం చలివేయడం లేదు . ఆకలి కూడా వేయడం లేదు. మా అమ్మ నాకు బాక్స్ లో టిఫిన్ కట్టి ఇస్తుంది. నాకు మా అమ్మ మొబైల్ కొనిచ్చింది తను రావడం ఆలస్యం అయితే ఫోన్ చేయమంది ఇప్పుడే ఫోన్ చేశాను కాసేపట్లో మా మామయ్య నన్ను తీసుకెళ్లడానికి వస్తున్నాడు.
పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో మా మామయ్య పోలీసుగా పనిచేస్తున్నాడు . రేపటినుండి నేను ఒక్కర్తినీ కూర్చున్నా నాకు భయం ఉండదు. ఎందుకంటే మా మామయ్య పక్క రోడ్డు పోలీస్ స్టేషన్లో  పనిచేస్తున్నాడు కనుక , నేను ఫోన్ చేయగానే వచ్చేస్తాడు కనుక. మావయ్య రాగానే నేను మా ఇంటికి వెళ్లి పోతాను.
అని కళ్యాణి ధైర్యంగా చెప్పింది. నిజానికి కళ్యాణికి వాళ్ళమ్మ మొబైల్ కొనిచ్చింది లేదు వాళ్ళ మామయ్య పక్క రోడ్డులో పోలీస్ స్టేషన్లో పని చేసేది లేదు .
కానీ కళ్యాణ్ ఎలా చెప్పగానే అతను సరేనమ్మా . నేను వెళ్లి వస్తాను అంటూ  గబగబా ఎటు వెళ్లిపోయాడో కూడా తెలియకుండా వెళ్లిపోయాడు.
కళ్యాణి హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది.
ఇంతలో వాళ్ళ అమ్మ వస్తూ కనిపించింది.
కళ్యాణి ఆనందంగా పరిగెత్తుకుంటూ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళింది.
అమ్మడు కళ్యాణి ఈ ఉదంతం అంతా స్కూల్లో మాస్టర్లకు చెప్పింది.
దాంతో స్కూలు యాజమాన్యం అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు.
కొన్ని నెలల తర్వాత .....
ఆ స్కూల్లో ఇప్పుడు, తల్లిదండ్రులు ఆలస్యంగా వస్తున్న పిల్లలకోసం, ఒక లైబ్రరీ స్టార్ట్ అయింది. అక్కడ బోలెడు పుస్తకాలు ఉన్నాయి చదువుకోడానికి .

అంతేకాదు చిన్న రూంలో. ఇంటర్నల్ గేమ్స్ , కూడా ఏర్పాటు చేశారు .అందులో కావాల్సినప్పుడు పిల్లలు అష్టాచమ్మా , 
చదరంగం, టేబుల్ టెన్నిస్, వంటి ఆటలు కూడా ఆడుకోవచ్చు. 
ఈ రకమైన మార్పుకి  కారణమైన కళ్యాణిని , పిల్లల తల్లితండ్రులందరూ అభినందిస్తుంటే ,కళ్యాణి వాళ్ళ అమ్మకి చాలా గర్వంగా ఉంది.

అప్పుడు హెడ్మాస్టర్ గారు పిల్లలతో..
చూశారా పిల్లలూ! కళ్యాణి  ధైర్యంగా  చేసిన చిన్న పని వల్ల ఈరోజు  పిల్లలందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో..
"మీరు కూడా కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు, కళ్యాణి లాగే ధైర్యంగా, యుక్తితో మిమ్మల్ని మీరు రక్షించుకోండి.
 ఈ కాలంలో ఇది చాలా అవసరం" అంటూంటే,
  టీచర్లంతా చప్పట్లు కొట్టారు.

**************"""*"