Sunday, March 31, 2024
చాటువులు
Tuesday, March 26, 2024
శివ శక్తి స్తోత్రం
నటీ--నటులు
మహతీ సాహితీ కవిసంగమం
ప్రతిరోజూ కవితా పండుగే
తేది:26-03-2024.
( మంగళవారం)
అంశం: నటీ-నటులు .(గేయం).
( కవితాసంఖ్య -02).
శీర్షిక: జీవితమే ఒక నాటక రంగం.
కవి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
కళ్యాణ్ : మహారాష్ట్ర.
(కవిసంఖ్య -43)
గేయం.
------
పల్లవి:
-------
జీవితం ఒక నాటకం ...
వేరు వేరు పాత్రలతో తెరపడని నాటకం!!
అను పల్లవి.
------------
వేషాలతో మోసాలను చేసే ఒక నాటకం
ఇంట బయట ఆడేది అగుపడనీ నాటకం.!!
1.చరణం.
--------
రాజకీయ రంగులతో ఆడే దొక నాటకం.
రాక్షసత్వమును దాచిన చిరునవ్వొక నాటకం.
దొమ్ము లేనన్నొ చేసినట్టి దొరతనమొక నాటకం.
కట్టినట్టి కాషాయపు రంగే ఒక నాటకం !!
2.చరణం.
--------
స్నేహమనే మాటతో ఆడేదొక నాటకం.
భార్యా-భర్తల మధ్యన జరిగేదొక నాటకం.
బంధువు రాబందువై ఆడేదొక నాటకం.
ప్రేమ అన్న పేరుతో, ఆడేదొక నాటకం !!
3.చరణం.
--------
ముఖం మీద ముసుగు వేసి
ఆడేదొక నాటకం.
నోటి తోడ పొగడి , నొసట
వెక్కిరింత నాటకం.!!
నాటకాల జగతిలో
నమ్మేదీ ఎవరినీ..
దిగజారే ప్రగతి నింక
సరిచేసే దెవరనీ....!!
సరిచేసే దెవరనీ....!!
సరిచేసే దెవరనీ....!!
హామీ పత్రం:
పై గేయం నా స్వీయరచన,దేనికీ అనువాదం కానీ,అనుకరణ కానీ కాదని హామీ ఇస్తున్నాను.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
జీవితమే ఒక నాటక రంగం
మహతీ సాహితీ కవిసంగమం
ప్రతిరోజూ కవితా పండుగే
తేది:26-03-2024.
( మంగళవారం)
అంశం: నటీ-నటులు .
( కవితాసంఖ్య -02).
శీర్షిక: జీవితమే ఒక నాటక రంగం.
కవి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
(కవిసంఖ్య -43)
కవిత:
---------
ఒక కళాకారుడిగా జీవితాన్ని
కొనసాగిస్తున్న వారికి
ఒక పాత్రలో ఇమిడిపోయి నటించడం అన్నది
నిజమైన పాత్రధారిగా ఒక సవాలే..
తమ "నిజ జీవితంలో" దుఃఖం ఉన్నప్పుడు
తెరపై "సంతోష పాత్ర " పోషించాలి.
తనకు ఎనలేని ఆనందంగా ఉన్నప్పుడు.
తెరపై "దుఃఖంగా ఉన్న పాత్ర "పోషించాలి.
తమ ఇంట్లో మరణానికి సంబంధించిన
సంఘటన జరిగినప్పుడు కూడా
వస్తున్న. ఏడుపు ఆపుకుంటూ
నవ్వు తెప్పించే "కామెడీ పాత్ర" పోషించాలి.
ఐతే , ఈ నాటక రంగానికి
కొన్ని గంటల్లో తెరపడుతుంది.
కానీ...
జీవితమే ఒక నాటక రంగం అన్నారు పెద్దలు.
అరువది నాలుగు కళలున్న మనదేశంలో
మనిషి ఆడుతున్న నాటకాలకు తిరుగులేదు.
మనిషి జీవితంలో, కొన్ని సంఘ మర్యాదల కోసం
మంచితనం అనే ముసుగు వేసుకొని
మసలడం ఒక పెద్ద నాటకం !!
సామాన్యుడితో సహా ,రాజకీయ
నాయకుల వరకు ఆడుతున్న ఈ నాటకంలో..
పట్టుబడని పాత్రలు ఎన్నో ,
పగిలిపోయిన గుండెలెన్నో....
కాల రాయబడుతున్న కథలెన్నో....
మానభంగాలకు గురైన ఆక్రోశాలెన్నో..
నలిగి నశించిపోయిన పసి ప్రణాలెన్నో..
అలసినా, ఆడుతున్నన్న తోలుబొమ్మలెన్నో...
తెరపడని ఈ నాటక రంగంలో,
అన్నీ తెలిసి కూడా అడ్డుపడలేని
అసమర్థతలెన్నో....
ఈ "జీవితం" అనే నాటకానికి
తెర పడేది ఎన్నడో...!!
హామీ పత్రం:
పై కవిత నా స్వీయరచన,దేనికీ అనువాదం కానీ,అనుకరణ కానీ కాదని హామీ ఇస్తున్నాను.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
కవి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
ఏడు రంగుల సమ్మేళనం
స్వచ్చమైన తెల్లదనం .
శాంతికి నిదర్శనం.!!
ఆరు రుచుల సమతుల్య ఆహారం.
ఆరోగ్యానికి ఔషధం
ఆరోగ్మమే మహాభాగ్యం.!!
ప్రకృతి వలయం.
పంచభూతాలకు నిలయం.
జన జీవిత గతికి ఆధారం.!!
పుడమి నిండిన తరు వనం.
రంగులు నిండిన పూలతో ఘనం.
పరిమళాలు నిండిన మలయ మారుతం.!!
సూర్య చంద్రుల గమనం.
పగలు రాత్రులు, మధ్య జనం.
ఉచ్ఛ్వాశ నిశ్వాసాల తోరణం!!
తరువులు విడచిన గాలి.
జనులందరి ఊపిరి.
వర్ణ బేధాలు చూపని సిరి!!
ప్రకృతితో నిండిన భూ ప్రపంచం.
ప్రపంచం నిండిన జన సందోహం.
వివిధ వర్ణాల, వర్గాల , రంగుల సంగమం. !!
బండరాయితో మలచబడిన భగవంతుడు
ప్రపంచ సృష్టి, స్థితి , లయల కారకుడు.
జాతి భేదాలు లేని జన్మల నియామకుడు!!
రసమయ ప్రపంచం లో రంగుల కలయికల దీపావళి
మైలపడిన మనసులను శుద్ధి చేసే రస కేళీ
సమత, మమత, సమైక్యతల రంగోలీ
జాతి భేధాలను రూపుమాపే ఆనంద హోళీ !!
హామీ పత్రం:
పై కవిత నా స్వీయరచన,దేనికీ అనువాదం కానీ,అనుకరణ కానీ కాదని హామీ ఇస్తున్నాను.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Monday, March 25, 2024
.మార్పు రావాలి.
Sunday, March 24, 2024
వెంకటేశ్వర సుప్రభాతం రచయిత
వేంకటేశసుప్రభాతం 1420 మరియు 1432 CE మధ్య కాలంలో ప్రతివాదిభయంకరం శ్రీ అన్నన్ (దీనిని హస్తిగిరినాథర్ అన్నా, మరియు PB అన్నన్ అని కూడా అంటారు) చే రచించబడింది . [4] [7] [8] [9] కవి స్వామి మనవాళ మాముని శిష్యుడు , ఇతను స్వయంగా రామానుజుల శిష్యుడు . [9]
వేంకటేశ సుప్రభాతం నాలుగు విభాగాలను కలిగి ఉంటుంది: సుప్రభాతం, శ్రీ వేంకటేశ స్తోత్రం, ప్రపత్తి మరియు మంగళశాసనం. [10] [11]
హోళీ గురించి
కాల దేవి ఆలయం.
Thursday, March 21, 2024
యుగాది కవితలు
02/03/2022.
వాల్మీకి పోతన వేమన (వా.సో.పో.వే)సాహిత్య వేదిక* ఆధ్వర్యంలో
అంశం : యుగములకు ఆది యుగాది.
శీర్షిక : చిగురుంచిన ఆశలు.
రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్: మహారాష్ట్ర .
ఎటుచుాసినా సహజమైన నుాతనత్వం.
వసంత ఋతువు ఆగమనంతో వచ్చే ఆది పర్వం .
చిరుగాలి వీచికలతో నవ యుగాది ప్రారంభం .
బంతీ చామంతుల మధుర వీచికల సుమ గంధం ॥
చిగురులు తొడిగిన ఆకుల గలగలలలు.
మామిడి పుాతల చిరు గంధపు ఘుమ ఘుమలు.
కోయిల రాగాల కొత్త వసంతాల మయుారి నాట్యాలు
నవ యుగాదికి పలుకుతున్న నవ్య స్వాగతాలు॥
గుమ్మాలకు పచ్చని తోరణాల శుభ సంకేతాలు
ఇంటింటా పసుపు కుంకుమలద్దిన గుమ్మాలు
యుగాది లక్ష్మికి పలికే ఉత్సాహపు స్వాగతాలు.
శుభ మంగళాలు పలుకు వేద పండితుల సామ గానాలు॥
కొత్త కోర్కెలతో చిగురించిన కొగ్రొత్త ఆశలు
నలిగిన మనసుల్లో నమ్మిక నిండిన ప్రశాంతతలు.
షడృచుల సమ్మేళనాలతో ఆరోగ్యామృత పక్వాలు.
కొత్త దనపు రాకతో పాతను మరచిన అత్మ విశ్వాసాలు॥
పంచాంగ శ్రవణంతో చీకటి బ్రతుకుల్లో చిగురించిన ఆశలు.
"శుభకృత్" ఆగమనానికి ప్రకృతి పాడే ఆనంద గీతాలు
మంగళ గీతాల మధుర భావనలతో "శుభారంభ-
యుగాది" కి జనులు పలికిన సుస్వాగతాలు ॥
----------------------
5/03/2023.
2023 -శోభకృత్ యుగాది సందర్భంగా..
ISBN కవి పత్రిక కొరకు (,క్రమ సంఖ్యవ..46)
( పంపడమైనది).
అంశం : ఉగాది.
శీర్షిక : నవ యుగాదికి స్వాగతం .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
ప్రకృతి పడతిని వరుస శోభలతో నలంకరించిన
వసంత కన్యక,రాబోయే "శోభకృత్" యుగాది
నెచ్చెలిని ఆహ్వానించడానికై ఆత్రుత నిండిన
ఆనందంతో "స్వాగత" యత్నాలు చేస్తోంది.॥
చిగురుటాకుల లేత పచ్చని తోరణాలకు -
రంగు పుాల సుగంధాలనద్దింది-
కిచ- కిచ లాడే చిలుక చెలులను పిలచి
కిలకిలారవాలతో ఆనంద స్వాగతం పలకమంది.॥
పుడమి నుదుట, పచ్చ బొట్టై నిలిచిన
తరు వనంలో, చిరు గడ్డి తివాచీ పరిచింది.
కళ -కళల విరిసిన కలువ కన్నెలను
కాలి బాటలో నిలిపి,అలసి వచ్చిన నెచ్చెలికి
చల్లని తేట నీటితో దాహం తీర్చమంది ॥
కమ్మని మావి చిగురుతో తమ కంఠాలకు
మెరుగుపెట్టుకుంటున్న వసంత కోయిలలను,
స్వాగత గీతాలాలపించమంది.॥
వసంత శోభలకు పరవసించి పురివిప్పిన
నెమలి కన్నెలను ఆనంద నాట్యాలాడమంది .
విశాల తరు శాఖల చల్లటి నీడలో ,
మట్టి సుగంధాల మేలు పల్లకి నిలిపింది॥
ప్రకృతి సిద్ధమైన ఘుమ ఘుమలతో నిండిన
ఆరు ఋచుల అరుదైన వంటకాల
విందు- వినోదాలనమర్చింది .
అంతలోనే ఆనందంగా ఆడుగిడిన
అందాల "శోభకృత్ కన్య", పుడమి చెలుల
ఆప్యాయత నిండిన హ్వానాలకు ఆశ్ఛర్యపడి
ఆప్యాయతతో ,తన వంతుగా ఈ వత్సరమంతా
అందరికీ అనేక సుఖ భోగాలను పంచి ఇస్తానని
పలుకుతుా, ఆమని నెచ్చెలిని ఆనందంగా
ఆలింగనం చేసుకుంది .
హామీ :
ఈ కవిత నా స్వీయ రచన.
*****************************
***************************
అంశం : యుగాది
శీర్షిక : ఉదయరాగ శోభలతో ఉరికివచ్చె నుగాది. ॥
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర
లేత పచ్చ శోభలతో చిగురించిన తరు శాఖలు
మలయనమారుత వీచికలతో ఆడే సరాగాలు.
పుాబాలలు రంగులీను పావడాల సవరింపుతో
సీతాకోక చిలుకలతో దోబుాచులాడు కళలు ॥
నవ వసంత శోభలతో ప్రకృతి పడతి అందముగా
యినుమడించె కోయిలలిడు రాగములవె విందుగా .
ఆకు పచ్చ తివాచీలు ఆడుగడుగున అందముగా
పరచుకొన్న భావననిడె పచ్చగడ్డి నిండుగా ॥
కోత కొచ్చె వరి ధాన్యము అన్నదాత సిరులుగా
ఆనందపు భావనలే తడి కన్నుల మెరుపుగా
భాగ్యరాసి సిరుల పంట నిండె నింటి కొలువుగా
పంట నమ్మ పడతి లక్ష్మి కదలి వచ్చె కానుకగా ॥
"శోభకృత్ "నామముతో వచ్చె చెలియ వేడుకగా
ఆనందపు ఆతిథిగా అడుగిడె కళ నిండగా
వత్సరాల వేదనలే తొలగించెడు భాగ్యముగా
ఆరు ఋచుల ఓషధులను అందించెను వరముగా॥
పడతులింటి ఆవరణ నలంకరణలు జేయగా
ఇంటింటా పండగ మురిపాలె ముచ్చటేలెగా
నవశోభలు సంతరించె నవ కోర్కెలు దీర్చగా..
ఉదయరాగ శోభలవే ఉరికివచ్చె వేడుకగా ।॥
-----------------
19/03/2023.
ఉస్మానియా తెలుగు రచయితల సంఘం వారి జాతీయస్థాయి "ఉగాది" కవితా పోటీల కొరకు ,
అంశం : "శోభాకృత్" నామ సంవత్సరాది.
శీర్షిక : నవ వసంత హేల ఈ యుగాది .
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
కవిత .
-----తొలిపొద్దు పొడుపులో
మెరిసే ఆనందాల వెలుగులు.
నవ వసంతాగమనానికి ,శుభ-
స్వాగతాలు పలికే కోయిల గీతాలు ॥
పచ్చదనం నిండిన తోటల్లో
పరువాల సందళ్ళతో విరిసిన
పుాబాలల కళ -కళలు నిండిన
మలయమారుత సుగంధ వీచికలు ॥
మురిసే తరులు సందడితో వినిపించే
పచ్చని ఆకుల నవ్వుల గలగలలు.
చిగురులు తొడిగిన కొమ్మల నడుమ
కిచ- కిచ రవాల ఆనంద గీతికలు ॥
రంగవల్లులు నిండిన ముంగిళ్ళలో
పడతులు ధరించే పట్టు పావడాలలో-
దాగిన పసుపు పాదాల పద-మంజీరాలు
చేసే , చిరు మువ్వల సవ్వడులు ॥
ఇంటింటా పండగొచ్చిన సంబరాలు
అన్నదాతలింట హాయి నిండిన-
పంట కోతల బరువు దిగబడుల-
బ్రతుకు ఆనందాల సిరుల వైభవాలు ॥
పిల్లగాలి వీచిలో నేతి సువాసనలు-
పిండివంటల ,నోరుారించే తీపి ఋచులు.
భగవదార్చనల మేలు వేద పుాజలు .
విందు వేద్యార్పణల,భక్తి నిండు ఘంటారవాలు॥
ఆరు ఋచుల అద్భుత కలయికల-
ఓషధీ తత్వాలు నిండిన మధుర భక్ష్యాలు ,
ఆమ్లం, లవణం, కటు , తీక్తం, వగరు
కలగలసిన రసామృత పానీయ సేవనాలు॥
వెరసి " శోభకృత్" వత్సరాగమన -
సందళ్ళతో పిల్లా పెద్దలు, బంధు- మిత్రాది
కలయికల స్నేహ పుారిత ఆలింగనాలతో
"నవ యుగాది" కిడు ఆనంద స్వాగతాలు ॥
హామీ:
ఈ కవిత నా స్వీయ రచన.
-----------------------
05/03/2023.
2023 -శోభకృత్ యుగాది సందర్భంగా..
ISBN కవి పత్రిక కొరకు ,
అంశం : ఉగాది.
శీర్షిక : నవ యుగాదికి స్వాగతం .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
రాబోయే "శోభకృత్" యుగాది నెచ్చెలిని
ఆహ్వానించడానికి, ప్రకృతి పడతి
సంతోషంగా స్వాగత యత్నాలు చేస్తోంది.॥
పచ్చని ఆకుల తోరణాలకు పుాల గంధాలనద్ది-
చిలుక చెలులను -కిలకిలారవాలతో
ఆనంద స్వాగతం పలకమంది.॥
పుడమి నుదుట, పచ్చ బొట్టై నిలిచిన
తరు వనంలో, చిరు గడ్డి తివాచీ పరిచింది.
కళ కళల విరిసిన కలువ కన్నెలను
కాలి బాటలో నిలిపి,అలసి వచ్చిన నెచ్చెలికి
చల్లని మలయమారుత వింజామరం వీచమంది ॥
కమ్మని మావి చిగురుతో తమ కంఠాలకు
మెరుగుపెట్టుకుంటున్న వసంత కోయిలలను,
స్వాగత గీతాలాలపించమంది.॥
పక్షుల కిల కిలా రవాలు నిండిన
విశాల తరు శాఖల చల్లటి నీడలో ,
మట్టి సుగంధాల మేలు పల్లకి నిలిపింది॥
అంతలోనే ఆనందంగా ఆడుగిడిన
అందాల "శోభకృత్ కన్య", పుడమి చెలుల
ఆప్యాయత నిండిన హ్వానాలకు ఆశ్ఛర్యపడి
ఆప్యాయతరతో ,తన వంతుగా ఈ వత్సరమంతా
అందరికీ అనేక సుఖ భోగాలను పంచి ఇస్తానని
పలికుతుా ఆమని నెచ్చెలిని ఆనందంగా
ఆలింగనం చేసుకుంది .
హామీ :
ఈ కవిత నా స్వీయ రచన.
*****************************
13/04/2021.
"ఉస్మానియా కవుల వేదిక "మరియు
"భేరి సాహితీ వేదిక" సంయుక్త ఆధ్వర్యంలో
*ఉగాది కవి సమ్మేళనం* కోసం కవిత.
అంశం. ఉగాది పండుగ గొప్పతనం .
శీర్షిక ; ఓషధీ రస గుళిక.(వచన కవిత).
"ఉగ" అంటే నక్షత్ర గమనం లేదా జన్మ -
వీటికి ఆది ఉగాది. యుగం అంటే
రెండు కలిసినది-ఉత్తరాయణ, దక్షిణాయనాలు.
షడ్రుచులు అంటే తీపి, పులుపు, ఉప్పు,
కారం, చేదు, వగరు,. ఇవన్నీ కలిపి చేసిన
" ఉగాది పచ్చడి "ఎన్నో రోగాలను అరికట్టే
"దివ్యౌషధ తత్త్వాలను" కలిగి ఉంటుంది.
పంచభక్ష్యములు అంటే భక్ష్యం,
భోజ్యం, లేహ్యం, చోష్యం, పానీయాలు.
ఇవి మన ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని,
వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి
ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక
ఆచారాలకు, సముచిత ఆహారానికి
గల సంబంధాన్ని చాటిచెప్పే రస గుళికలు.
మానవ జీవితాలు,అన్ని భావాల మిశ్రమంగా
ఉండాలని ఆకాంక్షిస్తుా జరుపుకొనే
పండగ ఈ "యుగాది" .
నిరోగ మయ జీవితానందాలను పంచే
"యుగాది పండగ" , మన సాంప్రదాయ
సార జీవామృతమై, మనలను నడిపిస్తోంది
అనడంలో సందేహం లేదు.
------------------------------------------------
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
----------------
యుగానికి ఆది నుండీ ,
యుగాది కన్య ఆగమనాన్ని-
ఆహ్వానిస్తున్న ఆమని చెలుల,
అంతరంగంలో
అలజడి మొదలైంది ॥
ప్రతీ సంవత్సరం ప్రక్రుతి మాత
ఒడిలో సేదదీరడానికి , తమతో
కలిసి -మెలిసి అడడానికి ,
అందమైన ఆశల పల్లకి నెక్కి
ఆత్రంగా వచ్చే తమ
యుగాది నెచ్చెలిని ,
పచ్చని ఆకుల తోరణాలతో,-
నిండిన ,పుడమి వనంలోకి,
పైరు పచ్చని తివాచీపై-
పరచిన సుమధుర
సౌరభాల నిడు
రంగుపుాల,ఆసన మిడి ,
రాచ మర్యాదల తో,
రంజింపజేసి....
గిరుల -ఝరుల నుండి
జాలువారే- నిశ్ఛల- నిర్మల
నదీ - నదముల నుండి
పారే చన్నీటి చిలకరింపుల,
తేనీటి, దాహమిడి ,
తేట తెలుగు పాటలతో..
చిరు నవ్వుల పుాతలతో..
సిరి మువ్వల, సందడు లిడు
వింజామర వీచికలతో
సేద దీర్చి, ....
సుక పిక రవాల సుందర -
కోలాహల, సందడులతో,
కోయిల పాడిన వసంత -
గీతికల, వందన సత్కారాలతో.
మురిసే మయుారి-
మురిపాల నాట్యాలతో,
వేప ,మామిడి పుాతల
మత్తు పరిమళాల
అత్తరు సౌరభాలతో,
వన- కన్యల వలపు
పలకరింపుల-
మంగళ గీతాల
మేళ తాళాల తో,
షడ్రుచి పాకాల -
సార విందులతో,
సంత్రుప్తి పరచి,
సాదర ఆహ్వానం -
పలికే ..రోజులు,
ఏ ఏటి కాఏడు -
తరిగి పోతున్నాయి.॥
మనిషి మనుగడకై
పాటుపడే తమ జీవితం,
మనిషి స్వార్ధానికి-
బలై పోతున్నాది.॥
జన జీవనం పెరిగింది.
కొండలు చరియలు విరిగేయి.
వనాలు తరిగేయి.॥
కాలుష్యంతో నీలాకాశం
నల్లబడింది. పచ్చని
తరువులు కుాలేయి.
గుాడులేక ,పక్షులు
విల విల లాడుతున్నాయి.॥
నీరు లేని మట్టి
నిస్సారమై ..బీడుబారి
బావురుమంటున్నాది.॥
రైతుల ఆత్మహత్యలతో
పచ్చని పంట పొలాలు-
దిక్కులేని దిబ్బలుగా
మారిపోయాయి.॥
పరిమళించే పుాల అందాలు
పైశాచిక కబంధ హస్తసల లో
నలిగి నలిగి..అమ్మకాల
బేరాలకు , అహుతైపోతున్నాయి.॥
కాలుష్య వాతావరణం
పెరిగి...,
వనాల వైభవం తరిగి...,
వసంత చెలులు,
విల విల లాడుతున్నాయి.॥
పచ్చని తరువులు లేని,
అందవిహీనమైన -
బీడు భుామిపై-తమ
యుగాది నెచ్చెలి
నాహ్వానించి ,
మొాడు బారిన కొమ్మలతో
మొండి ఆసనమేసి ,
ఎండిన నదులలో -
పారని జలాల పాకుడు
నీటిని..దాహమిడి,
కెమికల్ పుాసిన-
విషపు ఫలాల విందును,
ఎలా అందించాలి.. ?॥
తరిగిన మానవత్వపు
మమకారాల్లో..
విరిగిన మనసుల
ఆక్రోశాల ఆశ్రమాల లో
ఎలా సేదదీర్చాలి..?॥
వావి -వరసలు లేని-
పాప క్రుత్యాల, పైశాచిక
విలయ తాండవ నాట్యాన్ని
అమె ఎదురుగా...
ఎలా ప్రదర్శించాలి..?॥
పసిపాపల పై జరిగే-
అత్యాచారపు ఆగడాల
ద్రుశ్యాలని ....
అమె కంట పడడకుండా
ఎక్కడ దాచి పెట్టాలి..?॥
అడుగంటిన మంచితనం,
ఆత్మీయత లేని మమకారం
అమ్మతనం , ఆడతనం
మరచిన , సంస్కారహీనపు
సమాజంలోకి..తమ ప్రియ
నెచ్చెలిని ఎలా ....
ఆహ్వానించాలి..?॥
ఎలా..?.ఎలా.?.ఎలా..?
ఇలా ఎవరి ఆలోచనల్లో
వారుండగానే..ఆడుతుా-
పాడుతుా అడుగిడింది
యుగాది నెచ్చెలి,
ఉరుకులతో పరుగులతో...॥
మన భారతీయ సంస్క్రుతి-
సాంప్రదాయాల్ని..మళ్ళీ
మనకు తెలియచేసేందుకు.
మన పండగల ప్రసస్త్యాన్ని-
వివరించి , మన సంప్రదాయ
సంపదను పెంపొందించేదుకు.॥
ఆరు ఋతువుల
అద్భుత ఉపయొాగాల్ని,
ఆరు ఋచుల ఓషధి లో
దాగి ఉన్న ఆరోగ్య
సుాత్రాలను వివరించేందుకు,
అద్బుత సందేశాల
మేలు పలుకులతో,
ప్రక్రుతిమాత ఆడ పడుచు
వత్సరానికోసారి..వయ్యారంగా
మనకోసం వస్తోంది.॥
ఏదేశమేగినా , ఎందుకాలిడినా
మరువకుమీ ..పుడమితల్లి
మట్టి సార మహిమలనీ..
మరువకుమీ సద్ధర్మపు
సంప్రదాయ నిరతినీ..
చెరపకుమీ ప్రక్రుతి వన
సంపదలిడు సుధలనీ..
చేయకుమీ పతనము లిడు,
కాలుష్యపు కర్మలనీ...
అని పాడుకుంటుా....
అదిగో... "వికారి "
నామ విశ్వ కాంత...
వచ్చింది --వచ్చింది,
నవరసాల సొగసులతో...
పరవశాల పొంగులతో..
-------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
వెన్నెల సాహిత్య అకాడమికి, ఉగాది శుభాకాంక్షలు ".
వెన్నెలలు కురిపించు ,చల్లని మాటల
కీర్తి నిండిన కవన,కన్నెలు, వసంత గీతికల
,సిరి సిరి మువ్వల సడులతో,
కల- కలారవాలు నిండిన,
ఆమని సొగసుల అందమై,
సార,సుమ సౌరభాల,సుందర వనకన్యల
చెలిమితో,హితవైన సాహిత్య శోభలు రాజిల్లు సందడులతో-నిత్య నుాతన ,సాహిత్య , కథన, కళారతులైన,.....
అగ్రేశ్వరులౌ, కవి సార్వభౌముల, భావ పరంపరల-
కాసార ,కవితా ప్రవాహములో,జలకమాడి
వాడ-వాడలా, ప్రసరించే ప్రశంశాపుారిత
పద జాల సమాగమ.మిత్ర బృంద , పరివార,
పరీజన హితులతో కలిసి,.
కిట -కిటలాడే ,శ్రోతలతో నిండిన, వినోద రస భరితమైన ,ఉల్లాసోజ్వల పుార్ణచంద్ర
శీతల కిరణ కవన కీర్తి , గాన,జ్ఞాన
రస,గద్య ,పద్య ,సార, సుగంధ వీచికయై-,
దిన-దిన ప్రవర్ధమానమౌ రీతుల నలుదెసలా
వ్యాపించి , గౌరవ శిఖరాగ్రాలుచేరాలని, --
శుభ్ర వస్త్ర,వఝ్ర, కిరీటాది ,దివ్యాభరణ ద్యుతుల-
భాసిల్లు ,కవన కాంతల' మేలిమి బంగరు పసిమి-
కాంతుల, కీర్తి కిరణాల తో కలసి ,వాణీ విలసిత,సా-
క్షర,సుమగంధమిళితమై,నలుదిక్కులాగుభాళించు,పలు ,ఆనంద శోభలతో,మంగళ ప్రద రవములతో,నిండు
"ఉద్ధండ చంద్ర శేఖర వెన్నెల కవన కాంతి వేదిక "
నిత్య నుాతన గతుల, దిన దిన ప్రవర్ధమానమై - -- వర్ధిల్లాలని ఆశీర్వదిస్తుా.....
"శార్వరీ వత్సర " " . " శుభాకాంక్షలు".
తెలుప, వేంచేయుచున్న కీర్తి-
కాంతలకు "స్వాగతం ",
" సు స్వాగతం."
----------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ ( మహరాష్ట్ర .).
-------------------------------
కవిత లోని మొదటి అక్షరాలు చదివితే వచ్చే వాక్యం.
"వెన్నెల సాహిత్య అకాడమికి, ఉగాది శుభాకాంక్షలు ".
--------------------
02/03/2021
శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ శ్రీ కత్తిమండ ప్రతాప్ గారి సారధ్యం లో శుభకృత నామ సంవత్సర ఉగాది సందర్భంగా
"ఉగాది కవితల పోటీ..
రచన: శ్రీమతి:పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
అంశం : యుగాది ఆనందమా! నీ వెక్కడ?
శీర్షిక : మారని కాలం లో మారుతున్న మనిషి.
-------------
కాల చక్రం తన మానాన తాను తిరుగుతునే ఉంది.
ప్రభవ, విభవాది అరువది సంవత్సరాల కాలం
ప్రతీ వత్సరానికి ఒక ప్రత్యేకతతో వస్తుానే ఉంది.॥
మహిలో మనుషులు మాత్రం నాటి నుంచి నేటి వరకు
కాలాన్ని సవాలు చేస్తుా ప్రకృతితో పరాచికలాడుతుా
క్షణానికో మనస్తత్వంతో మారణహోమం చేస్తుానే ఉన్నారు. ॥
కాలం ...అలాగే ఉంది . రాత్రుల చీకట్లను దాటి
వెలుగు వెన్నెలలు పంచుతుానే ఉంది.
ఆరు ఋతువులకు ఆహ్వానం పలుకుతుా
ప్రకృతి నియమాలను నిలుపుతునే ఉంది ॥
కాలం మారిందంటుా తానే మారుతుాన్న మనషి
సభ్యత, సంస్కారాలతో పాటు మానవత్వాన్ని
కుాడా కోల్పోతుా స్వార్ధ పరుడై మసలసాగేడు.
"తన" పర" లతో పాటు వావి వరుసలు మరచేడు.॥
రాక్షసత్వంతో పెట్రేగిన కామొాద్రేకాలతో
కన్ను మిన్ను కానని కఠినాత్ముడయ్యేడు.
వక్రీకరించిన మనిషి బుద్ధి వరుస దురాగతాలతో
భ్రష్టు పట్టి రాక్షసత్వం తో రంకెలు వేస్తోంది॥
ఆడతనంలో ఆమ్మను చుాడవలసిన వాడు
అమ్మతనంలో ఆడతనానికి అంగలారుస్తున్నాడు.
వింత పోకడలు పెరుగుతున్న సమాజంలో.
న్యాయంకుాడా నోట్ల మత్తుకు లొంగిపోయింది ॥
విధి రాతను తప్పించలేని కాలం, కకలావికలమై
కరువు కాటకాలకు నెలవై క్రమశిక్షణ కోల్పోయింది
ఐనా ఇప్పటకీ మనిషి కాలాన్ని దుాషిస్తుా
తనను తాను సమర్ధించుకుంటుానే ఉన్నాడు..॥
-------------------.11/04/2021
గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదికవారి
ఉగాది కవితల పోటీ కొరకు...
అంశం : భవిష్యత్ ఇలా....
శీర్షిక : భయంలేని భవిష్యత్తు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
--------------------
2020 లో కరోనా రేపిన కలకలం.
లాక్ డౌన్ గృహ నిర్బంధాలు
భయాందోళనలతో హోరెత్తించింది
2021 లో రుపు మార్చుకు వచ్చిన
కరీనా ముందున్నంత ఉధృతంగానే
ఉన్నా , రోగ లక్షణ , నివారణ పథకాలు
తెలుసుకున్న జనం , అప్రమత్తమై
సామాజిక దుారం పాటిస్తుా , మాస్క్ లు
వాడుతుా జాగర్తలు పాటిస్తున్నారు.
పరిసరాల పరిసుభ్రత తోపచ్చని మొక్కలు
నాటి "పర్యావరణ రక్షణ" చేస్తున్నారు.
"కరీోనా" ను తరిమికొట్టే "వాక్సీన్స్" తీసుకుంటుా
ఆహార నియమ నిబంధనలు పాటిస్తున్నారు.
ఇదంతా చుాస్తున్న "ప్లవ "నామ ఉగాది కన్య
మనుషుల్లో వచ్చిన మార్పుకు మురిసిపోతుా
"భయం లేని భవిష్యత్ ప్రణాళికల "
బాధ్యత తో "స్వశ్ఛ భారతిని" తీర్చిదిద్దే
నవ వసంతపు" నీటి సమృద్ధి వనరులతో "
"నవ యుగాది "ఆరంభపు ప్రభలతో
నవ్వులు పండించడానికి ఆనందంతో వస్తోంది.
మనం కుాడా "షడృచుల "అమృత
కలశంతో ,ఆమె ఆగమనానికి
"ఆనంద స్వాగతం " చెపుదాం పదండి.
----------------------------------------
హామీ : నా ఈ రచన ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
-------------------
content@teluguone.com
(అక్షరయాన్ లో)కు పంపినది.
రచన:శ్రీమతి: పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
శీర్షిక : మరో కోణం లో,
మన ఉగాది.
ఉరుకుల పరుగుల జీవితంలో
వత్సరానికొకసారి వచ్చే యుగాది కన్య
తరతరాల మన సాంప్రదాయ సారాన్ని,
పండగల పేరుతో మనం చేసే పారిశుభ్రతల ప్రాశస్త్యాన్ని ,గమనించేందుకు
ఆనందామృతాన్ని పంచే వసంత బాలగా
వచ్చి, మనందరి మన్ననలను
ఆదరంగా అందుకొని ఆనందపడేది.॥
మారుతున్న మనస్తత్వాలకు
మైల పడిన కాలం, మారణహోమాల్లో
దగ్ధమై , మరో చరిత్రను సృష్టించింది.
అంతరాలను మరచిన మనుషుల స్వార్ధపు-
వికటాట్టహాసాలకు ,నిర్వీర్యమైన మానవత్వానికి
అబలలు కార్చే కన్నీటి శాపం కరోనాగై కాటేస్తుంటే,
విప్లవ భావాల వింతప్రపంచపు వరుస కాష్టాల్లో
రోజుకో రుాపు ధరించి విహరిస్తుా రోగాలపాలు చేస్తున్న-వింత కణానికి విరుగుడుగా
ఈ సారి మరో కోణంలో మన ముందుకు
మళ్ళీ వస్తోంది ,యుగాది కన్య.॥
మరో చరిత రాసేందుకు.
మాస్క్ ధరించిన -మొాముతో ,
సానిటైజర్ల బహుమతులతో...
మానవత్వపు "వాక్సిన్" ని మందుగా
మనకు ఎక్కించ్చేందుకు. పరిశుభ్రత నిండిన
పాఠ్య పుస్తకాలతో , ప్లవ నామ ధారిణిగా....॥
--------------------------------------------------
ఇష్టపది సదయ్యగారి ఉగాదిసంకలనం కోసం.
శీర్షిక.
చిరు నవ్వుల ఉగాది కన్య .
రచన:శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
వెన్నెలలు కురిపించు ,చల్లని
మాటల కవన,కన్నెలు, వసంత
గీతికల స్వర రాగ లయల
సిరి సిరి మువ్వల సడులతో,
కలకలా రవాలు నిండిన,
ఆమని సొగసుల అందమై,
సార,సుమ సౌరభాల,సుందర
వనకన్యల చెలిమితో,హితవైన
పద శోభలు రాజిల్లు సందడులతో
నిత్య నుాతన ,సాహిత్య , కవన,
కళా విలాస కాంతిరతులైన,.....
అగ్రేశ్వరులౌ, కవి సార్వభౌముల,
భావపరంపరల-కాసార ,
కవితా ప్రవాహములో,జలకమాడి ,
వాడ-వాడలా, ప్రసరించే ప్రశంశా
పుారిత వచన , సమాగమ.
మిత్ర బృంద, పరివార, పరీజన
హితులతో కలిసి,.కిటకిటలాడే ,
శ్రోతలతో నిండిన, వినోద రస భరితమైన ,
ఇష్టపద సంపదల సాహిత్య వనాశక్తులై
గాన,జ్ఞాన ,రస,గద్య ,ఛందోబద్ధ
పద్య రస సార సుగంధవీచికలు-
దశ దిశల వ్యాపించి పరిమళిస్తుా
,దినదిన ప్రవర్ధమానమౌ రీతుల గౌరవ శిఖరాగ్రాలుచేరాలని, శుభ్రవస్త్ర,వఝ్ర, కిరీటాది ,దివ్యాభరణ ద్యుతుల-
భాసిల్లు , విజయ కాంతల'
మేలిమి బంగరు పసిమి- కాంతుల,
కీర్తి కిరణాల తో కలసి ,వాణీ విలసిత,
సాక్షర, కావ్య రసామృత మిళితమై,
గుభాళించు,సుమ సౌరభాల శోభలతో,
మంగళ ప్రద రవముల వసంత
కోయిలల,నిండు రాగాల నిత్య నుాతన
గతుల,దిన దిన ప్రవర్ధమానమై -
నిత్య నుాతన శోభాలంకృతయైన
"ప్లవ నామ యుగాది" కాంత
సామాజిక దుార నియమాలను పాటిస్తుా..
మాస్క్ ధరించిన మేలి ముసుగుతో
మొాహినీ రుాపధారిణియై
నిరోగ ఓషధీ తత్వపు
మహిమ నిండిన" వాక్సిన్" అనే
మధురామృత భాండముతో
చిరునవ్వులు నింపడానికి మన
ముందుకు వస్తోంది .ఆనందంతో
స్వాగతం పలుకుదాం రండి.
-------------------------+
మనుమసిద్ధి కవన వేదిక
15 /03/2021
రచన:శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
శీర్షిక : నవ యుగాది.
ప్రక్రియ : వచన కవిత.
కరోనాతో భారమైన బ్రతుకు చిత్రం.
కాలకుాట విషనాగులైన ,కర్తవ్య పాలకులు ,
మారుతున్న మనస్తత్వాల మారణ హోమం.
స్వార్ధ పుారితమైన ఆలోచనలతో మనిషి-
తప్పు దారి పడుతున్న సమయంలో
సాంప్రదాయాల విలువలు నిండిన కలశంతో
ఆరు రుచుల ఆరోగ్యానికి , ఏడవ
రుచిగా మానవత్వమనే అమృతాన్ని కలిపి
చిరునవ్వులు వెదజల్లెేందుకు వస్తోంది
నవోదయ కాంతికిరణమై నవ యుగాది .॥
----------------------------------------------------
హామీ :
"నవ యుగాది" శీర్షిక గల ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన
-------------------
షీ టీమ్స్. కోసం ఉగాది కవిత.
--------------------------
(మొదటి అక్షరాలు నిలువుగా చదవితే
వచ్చే భావాక్షర సంపద.).
అక్షరయాన్ మహిళా సాహిత్య -,
సేవానిరతికి ఉగాది శుభాకాంక్షలు .
అబలల ఆత్మబలానికి ఆలంబన నిచ్చేఆప్త తేజమై,
క్షణం కుాడా, విశ్రాంతి నెరుగని అవిరామ క్రుషీ తో-
రక్షణ,శిక్షణల నీడనిచ్చే,మమతల మహా వ్రుక్షమై-
యావత్ మహిళాసమస్యల సమాధాన-సమాహారమై,
నమ్మకమైన నియమాల, నిశ్ఛయ సంకల్ప సారమై,
మమతా,మానవతాధ్రుక్పథ ,సేవాభావ, సహయొాగ-
హిత, కార్య -కలాపాది, సమ్మిళిత.కవన క-
ళా,సాహిత్య,సమావేశాది కార్యకలాపోత్సుకతాతుర-
సార ,సమన్వయ,సాహస,శ్రామికమహిళాబ్రుంద-
హిత ,సన్నిహిత,-పరిజనాది స్వాతంత్ర్య ,ని
త్య,జీవన పోరాటాది, కార్య-కలాపాది ,సహిత-
సేవా సంకల్ప, ప్రయత్నాపుారిత,కార్యాక్షర యాన-
వాక్ సుధారసాధ్భుత,ప్రేరణాపుారిత కవనకాంతలకు-.
నిత్య కల్యాణ,సామాలోచనా పుారిత సాహిత్య -
రసమయ వాజ్మధుర గీత, సంగీత,రస పానామ్రుతులై.
తిరోధాన, సంఘటిత, తీక్ష్ణ ,పోరాట పటిమొాద్యమాది
కిరణ కవన వేదికానంద, మహిళా,స్రవంతి చెలిమికై .
ఉద్యమోత్సాహిత,సాహస మహిళా తతీ యుత ,
గాన, కవితా సమారంభ రసోల్లాస సమాగమ-
దిగ్విజయ ప్రాప్త,అభయ హస్త, కీర్తి కిరీట ద్యుతులతో-
విచ్చేసిన
శుభ "శార్వరీ" తేజ , శక్తిమయ పుారిత ,నవ వర్ష-సు
భాసిత పరంపరాది, భారతీ సాంప్రదాయ, శోభిత
కాంతామణి మండల, కవన కోమల, సుందర సారా--
క్షర కవితా ఝరీ ప్రవాహిత కీర్తి కమల కాంతలకు, ప
లు ప్రశంసల ,తెలుగు నవ వర్ష , "శార్వరీ" నామానంద-
శుభాకాంక్షలతో ,స్వాగతం, సు స్వాగతం.
-------------------------------------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
----------------------------------+
నవ తెలుగు తేజం " మాస పత్రికా
సభ్యులకు నుాతన-
" శార్వరీ"
నామ సంవత్సర శుభాకాంక్షలు..
శీర్షిక: శార్వరీ తేజం.
నవ వర్ష శుభాకాంక్షలేలే శుభ సమయంలో..
వర్ధమాన కవి సముాహపు విందు , వినోదాలతో..,
తెలుగు వేదిక, శోభాయమానమైన...ప-
లు సాహిత్య సంపదల , సమావేశపు సందడులతో,
గుభాళించే పరిమళాల సుమ సమాహారమై,
తెేట- తెలుగు,వెలుగులతో,అజరామర.కీర్తి రా-
జంబై, వేల సత్కారాల, సమాగమ సమగ్ర తేజమై.
సార కవితా రసాల, మ్రుదు మధుర సుధలతో,
హితవైన పద సముాహపు, చమత్కారకేరింతలతో,ని-
త్య నుాతన సమతా-పుారిత సమన్వయ కళావేదికగా ,
వేవేల ప్రశంసాపుారిత, వచన, కవనాల సారమై,
దిన -దిన ప్రవర్ధమానమై, మేటి, రచనా దురంధరాది కవి సముాహ, సాహిత్య సుమ సుగంధ వీచికయై ,
కుల, మత , తారతమ్యాధిగమనార్జిత, కీర్తి కిరీటమై ,
ఉన్నతోన్నత పద- కుార్పుల , మణిమాలాభుాషితయై
గారపట్టిన సమాజపు కుళ్ళుని, కుాకటి వేళ్ళతో సహా
దిగ్విజయంగా దిగలాగగల , దిట్టమైన కలం హలంతో.
శుద్ధ తర, కవితాస్త్ర సమ్మేళనాది విజయాలతో -
భాసిల్లుతుా, కళలు నిండిన రమణీయ కావ్య కళా...
కాంతయై, గద్య -పద్య సంగీతాది సకల కళా., సా
క్షరానంద, హిత కార్య- కలాపాల మిళిత తేజమై- ప
లు వేల జే -జేల కవితా రస శోభలతో ,భాసిల్లు -
"
-------------------------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. ( మహరాష్ట్ర ).
-----------------------------------
పద్మగారుా..!
మొదటి అక్షరాలను , నిలువుగా చదివితే వచ్చే వాక్యం...👇
"నవ తెలుగు తేజం " సాహిత్య వేదికకు-
"ఉగాది" శుభాకంక్షలు.
( అనేది గమనించగలరు.).
--------------------
30/03/2022.
*సాహితీ బృందావన విహార వేదిక అనుబంధ సంస్థ ఉమెన్స్ రైటర్స్ నేషనల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించు శ్రీ శుభకృత్ నామ తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకల కవితా తోరణం SBVV ఉగాది జాతీయ పురస్కారాలు 2022 కోసం రాసిన కవిత.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
క్యాణ్:మహారాష్ట్ర .
శీర్షిక : కవితాక్షర సత్కారం .
గుండెల పల్లకిలో దాగిన భావాక్షర కన్యలు
గుస గుసలాడుతుా గుప్పెట్లో కొచ్చి తొంగి చుాసేయి.
బాధలు నిండిన జనసందోహాల
కన్నీటి కథనాలకు కరగి కుంగిపోయాయి ॥
ఏటేటా వచ్చే యుగాది కన్యల వరుస
ఆగమనాలతో ఆగని అరాచకాలకు ,
అక్షర తుాణీరాలతో కవనోద్యమాలు చేసి
కవితా వ్యుాహాల కట్టడితో కాపు కాసాయి॥
ఐనా ఆగని అరాచకాలపై "సున్నిత" మైన
పదజాల పంక్తులతో భావ ప్రహారం చేసాయి.
అక్షర తుాణీర ప్రభావానికి అణగారిన శార్వరీ,
ప్లవ,నామ కన్యలు పరువు పలాయనం చేసాయి॥
అన్నీ గమనిస్తున్న అక్షర కన్యలు ఆనందంతో
కవన వనంలో కావ్య సమారోహాన్ని జరిపి
"శుభకృత్ -వత్సర కన్యకు శుభ సందేశాన్నంపి
ఆనంద స్వాగతాలతో అవనికి ఆహ్వానించాయి.॥
ఆనంద పల్లకిలో శుభ శోభాలంకృతయై వచ్చిన
"శుభకృత్" నామ నెచ్చెలికి ఆరు ఋచుల అమృతాలు నిండినఆరోగ్య పక్వాలతో స్వాగతాలు పలికిన జనులకు అభయహస్తాన్నిడిన శుభకృత్
చెలిని చుాసిన కవన కన్నియలు ఆనంద కవితా
సుమాక్షర మాలలతో ఆమెను సత్కరించేయి. ॥
హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన.
***************************************
ప్రతీ వత్సరం మారుతున్న గ్రహ నక్షత్రాల
గమనాలకు అనుగుణంగా మారుతున్న కాలంలో
మంచి-చెడులతో నిండిన సుఖ- దుఃఖాలు
మనిషి జీవితంలో తెస్తున్న మరపురాని మార్పులు॥
ఏ ఏటి కాయేడు అడుగిడదామన్న ఆశల సోపానం
అడుగు దుారంలోనే అందీ అందనంత ఎత్తుకు
ఎదిగిపోతుాండడంతో నీరస పడుతున్న జనంలో
నిండిన నిరాశ -నిస్పృహల నిట్టుార్పుల గాడ్పులు॥
కణ బాధల కన్నీటి కథనాలు ,
నోటు బందీలతో అస్తవ్యస్తమైన జన జీవితాలు .
కామ వికారాలకు కాలిన కడుపు కోతల కన్నీళ్ళు
కటిక దరిద్రంతో బతుకు భారమైన బడుగు జీవితాలు॥
గడచిన నాలుగు వత్సరాలలో కాలం తెచ్చిన
ఖర్మానికి తెరవేస్తుా ఆశలు తీర్చే ఆనంద పల్లకిలో,
నవ యుగాది శుభారంభానికి శుభ సుాచకంగా
కోర్కెల వసంతాలు కొంగులో నింపుకొని,
ఆనంద వసంతాల అమృతాన్ని పంచేందుకు-
మరో ఆశాకిరణమై మనమధ్యకు వస్తున్న
"శుభకృత్ యుగాది" కన్యకు మనమంతా కలసి మంగళ గీతాలతో పలుకుదాం ఆనంద స్వాగతం ॥
భకృత్ యుగాది శభాలకు సంకేతం
---------------------------
11/04/2021
గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదికవారి
ఉగాది కవితల పోటీ కొరకు...
అంశం : భవిష్యత్ ఇలా....
శీర్షిక : భయంలేని భవిష్యత్తు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
2020 లో కరోనా రేపిన కలకలం.
లాక్ డౌన్ గృహ నిర్బంధాలు
భయాందోళనలతో హోరెత్తించింది
2021 లో రుపు మార్చుకు వచ్చిన
కరీనా ముందున్నంత ఉధృతంగానే
ఉన్నా , రోగ లక్షణ , నివారణ పథకాలు
తెలుసుకున్న జనం , అప్రమత్తమై
సామాజిక దుారం పాటిస్తుా , మాస్క్ లు
వాడుతుా జాగర్తలు పాటిస్తున్నారు.
పరిసరాల పరిసుభ్రత తోపచ్చని మొక్కలు
నాటి "పర్యావరణ రక్షణ" చేస్తున్నారు.
"కరీోనా" ను తరిమికొట్టే "వాక్సీన్స్" తీసుకుంటుా
ఆహార నియమ నిబంధనలు పాటిస్తున్నారు.
ఇదంతా చుాస్తున్న "ప్లవ "నామ ఉగాది కన్య
మనుషుల్లో వచ్చిన మార్పుకు మురిసిపోతుా
"భయం లేని భవిష్యత్ ప్రణాళికల "
బాధ్యత తో "స్వశ్ఛ భారతిని" తీర్చిదిద్దే
నవ వసంతపు" నీటి సమృద్ధి వనరులతో "
"నవ యుగాది "ఆరంభపు ప్రభలతో
నవ్వులు పండించడానికి ఆనందంతో వస్తోంది.
మనం కుాడా "షడృచుల "అమృత
కలశంతో ,ఆమె ఆగమనానికి
"ఆనంద స్వాగతం " చెపుదాం పదండి.
----------------------------------------
హామీ : నా ఈ రచన ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
------------------------
11.మార్పు రావాలి.
మనకు జ్ఞానం వచ్చింది దగ్గర నుండి,
మనం కొత్త సంవత్సరంలోనన్నా బాగుంటామేమో అన్న ఆశతో,
ముందున్న సంవత్సరానికి స్వస్తి చెప్పి,
కొత్తసంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాం
కానీ మనం ఎప్పుడు ఆలోచించలేదు
సంవత్సరం మారినంత మాత్రాన
" జీవితాలు మారుతాయా "అని
ముందు మనలో మార్పు రావాలి
జాతిమతాలకు తావివ్వకుండా ,
అందరూ ఒక్కటై స్నేహభావంతో మసలాలి
తల్లిదండ్రులను,స్త్రీలను గౌరవించాలి.
అవసరార్థులకు చేయూత నంది ఇవ్వాలి
మాటల్లో మంచితనం,చేతల్లో నిస్వార్థత ఉండాలి.
పిల్లలకు జీవితంపై సరైన అవగాహన పెంచాలి
ఇలా కొన్ని మార్పులు మనలో వస్తే
ప్రతి సంవత్సరం శుభ సంవత్సరమే...
రాబోయే సంవత్సరంలో ఎన్నికలు జరుగనున్నాయి
తెలివైన ఆలోచనతో సరైన నిర్ణయం తీసుకుందాం..
" క్రోధి" నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ..
"మనమూ బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి" అన్న ఆలోచనతో అడుగు ముందుకేద్దాం.
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
కల్యాణ్
ద్విరద గతి రగడ
Tuesday, March 19, 2024
2024...సున్నితాలు.
Sunday, March 17, 2024
మా ఊరి కథలు ..
మా ఊరి కథలు .
బుర్రప్పడు, గుర్రం కధ .
రచన : శ్రీమతి : జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర.
ఆ ఊర్లో బుర్రప్పడిని. ఎరుగని వాళ్ళు అంటూ లేరు.
వాడి తాతల సమయం నుంచి, వాళ్ళందరూ అక్కడే పుట్టి పెరిగి, పోయేరు కూడా.
వాళ్ళందరూ కూడా గుర్రబ్బండి తోలుకునే బతికారని వినికిడి.
అప్పట్లో కారులు గానీ ,బస్సులు గానీ ఉండేవి కావు.
కాస్త డబ్బున్న వాళ్ళు ,షావుకారులు అందరూ కూడా గుర్రపు బండిలోనే ప్రయాణం చేసేవారు.
మిగిలిన వారంతా పట్నం వెళ్లాలంటే, ఎడ్లబండిలో వెళుతూ ఉండేవాళ్ళు.
బుర్రప్పడు వాళ్ళ నాన్న కూడా గుర్రపు బండి తోలుకొనే బతికాడు.
వాడి కొడుకే వీడు . వాడి పేరు అప్పడు .వాడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు తండ్రి పక్కన గుర్రబ్బండి లో కూర్చుని , తానే గుర్రం తోలుతాననేవాడు . వాడి తండ్రి వాడి చేతితో చిన్న కర్ర ఇచ్చి , ముందు నువ్వు కూర్చోబెట్టి ,వెనకాతల నుండి తను బండిని తోలుతూ ఉండేవాడు.
. అప్పడు మాత్రం, తండ్రి తనకిచ్చిన కర్రతో గుర్రాన్ని కొడుతూ. బౄ. బౄ......ట ట ట అంటూ ,బండి తోలుతుతూ ఉన్నట్లు ,సంబరపడిపోతూ ఉండేవాడు.
అప్పుడు చిన్నపిల్లాడు కదా" ఏదో నోరు పలకక అలా అంటున్నాడేమో" ,అని అనుకునే వారు ఊరు వాళ్ళు.
కానీ రాను రాను , వాడికి మాటలు వస్తున్న కొద్ధీ వాడికి, " గ ; ల" అన్న. రెండు అక్షరాలు పలకవు అని తెలిసింది అందరికీ.
గుర్రం కి , బుర్రం అనేవాడు. "ల "పలకవలసి వచ్చినప్పుడు "ర" అంటూ ఉండేవాడు.
దాంతో వాళ్ళందరూ అప్పటినుంచి వాడిని "బుర్రప్ప"డని పిలవడం మొదలెట్టారు.
వీడు పెద్దయేసరికి వీడి తండ్రి చచ్చిపోయాడు.
తండ్రి దగ్గర ఉన్న గుర్రం బాగా ముసలిది అయిపోవడంతో ,
నలుగురిని కాస్త సహాయం చేయమని అడిగి ,ఒక మగ గుర్రాన్ని కొని తెచ్చింది వాళ్ళ అమ్మ. ఈ గుర్రాన్ని నడపడం నేర్చుకుంటే కొడుకు నాలుగు రాళ్లు సంపాదించుకుని వాడి బతుకు వాడు బతుకుతాడని అనుకునేది.
బుర్రప్పడు గుర్రం ఎక్కడం అయితే నేర్చుకున్నాడు, గాని బగ్గీ కట్టి తోలడం మాత్రం రాలేదు. దాన్ని ఎక్కి కూర్చున్నప్పుడల్లా
హబౄ...భౄ.... అని దాని తోలుకుంటూ .ఊరంతా తిరిగి వస్తాడు. ఇంక, ఆ ముసలి తల్లి ఏమి చేయలేక
ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ , వీడిని పోషిస్తూ తన జీవితం వెళ్ళబోసుకుంటున్నాది . ఊర్లో అందరి దగ్గర మంచిగా ఉంటూ నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నాది.
బుర్రప్పడు చాలా అమాయకుడు. ఊర్లో , ఎవరు ఏ పని చెప్పినా చేస్తూ ఉంటాడు.
దాంతో అందరికీ బుర్రప్ప మీద ఒక రకమైన అభిమానం ఏర్పడింది.
బుర్రప్పడు , పొద్దున్న ,సాయంత్రం కూడా గుర్రాన్ని మేతకు తీసుకెళ్తూ ఉంటాడు.
అప్పుడు గుర్రం ఎక్కి కూర్చున్న అప్పడు, తనేదో , పెద్ద రాజులా "ఫీల్" అయిపోతుంటాడు.
అప్పుడప్పుడు వాడు , గ.. ల అన్నా అక్షరాలకు బదులుగా" ర" ఉపయోగించి మాట్లాడుతున్నప్పుడు, వాడి మాటలకి ఊళ్లో వాళ్లంతా తెగ నవ్వుకుంటూ ఉంటారు కూడా...
గుర్రప్పడితో పాటే గుర్రం కూడా పెద్దదయింది.
మారుతున్న రోజులతో పాటు, ఆ ఊర్లో కూడా వారానికి ఒకసారి. బస్సు వస్తోంది .
పట్నంలో వారానికి ఒకసారి జరిగే సంతకు, అందరూ ఆ బస్సులోనే వెళ్లడంతో, గుర్రపు బగ్గీలు తిరగడం పూర్తిగా తగ్గిపోయాయి.
అప్పుడప్పుడు ఆటోరిక్షాలు కూడా వస్తూ ఉండడంతో,
గుర్రప్పడి గుర్రం తప్ప ,గుర్రాలు కూడా కనపడటం మానేశాయి.
-------
కొన్ని రోజులుగా గుర్రప్పడి మొహం లో , ఏదో విచారం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది . అది చూసి అందరూ ఏమైందిరా అని అడుగుతే ఏమి చెప్పలేకపోతున్నాడు.
గత కొన్ని రోజులుగా గుర్రప్పడు గుర్రం ఇదివరకులా సిటీలోకి తిన్నగా పరుగెట్టి వెళ్లడం లేదు.
ఒక పర్లాంగు దూరం వెళ్ళిన తర్వాత, కుడివైపు సందులోకి తిరిగిపోతున్నది. అప్పడు ,దాన్ని వెనక్కి మళ్ళించడానికి ఎంత ప్రయత్నించినా, అది అక్కడే రెండు కాళ్ళ మీద నిలబడి లేచి సకలిస్తున్నాది తప్పితే ,వెనక్కి రావడానికి కూడా ఒప్పుకోవడం లేదు. తన గుర్రం తన మాట వినటం లేదని గుర్రప్పడి బాధ.
అందుకు కారణం ఏంటో అప్పడు ఎంత ప్రయత్నించినా , తెలుసుకోలేకపోయాడు.
అడగ్గా ,అడగ్గా విషయం తెలుసుకున్న పెద్దలు కొందరు, అసలు ఆ కుడివైపు సందులో ఏముందో అని చూడ్డానికి బయలుదేరారు ఒకరోజు.
ఆ సందులోకి ,కొంత దూరం నడిచిన తర్వాత, ఒక ఇంట్లో నుంచి గుర్రపు సకిలింపు వినబడింది. అది ఆ ఇంటి వెనకవైపు మూలగా ఉన్న ఒక గుర్రపు శాలలోంచి వస్తోంది. ఆ విషయం గురించి అక్కడ చుట్టుపక్కల వారిని అడిగితే ,అక్కడున్న షావుకారు పట్టణంలో ఇల్లు కట్టుకు వెళ్లిపోయాడని ,ఎవరికో ఈ ఇల్లు అమ్మేసాడని , వాళ్ళు ఒక ఆడ గుర్రాన్ని తమతో పాటు తెచ్చుకున్నారని అది ఆ శాలలో ఉందని చెప్పారు.
దాంతో ఊర్లో వాళ్ళకి విషయం బోధపడి ,గుర్రప్పడితో
"రేయ్ నీ గుర్రం కి పెళ్లి మీదకి దృష్టి మళ్ళింది .దాంతోపాటే నువ్వు కూడా పెళ్లి చేసేసుకో. లేకపోతే అదీ ముసల్ది అయిపోతుంది, దానితో పాటు నువ్వూ ముసలాడివి అయిపోతావ్ అంటూ హాస్యాలాడడం మొదలెట్టారు.
దాంతో బుర్రప్పడు సిగ్గుతో తల అటు ఇటు ఊపుతూ.
"నా బుర్రంకి. పెర్రి సేయను. నేను పెర్రి సేసుకోను...
ఏం ? నాకు మీరంతా నేరేటి..."
అంటూ మాట దాటించేసేవాడు.
నిజం చెప్పాలంటే గుర్రప్పడికి పెళ్లి చేసుకోవాలనే ఉంది . కానీ తనకు పిల్లని ఎవరు ఇస్తారు. ? ఇచ్చినా తను ఆ పిల్లని ఎలా పోషిస్తాడు ..? తర్వాత తనకు పిల్లలు పుడితే ఎలా?
ఇటువంటి ఆలోచనలతో పెళ్లి మాట పక్కన పెట్టాడు.
గుర్రప్పడికి , ఇప్పుడు తన గుర్రంతో చాలా ఇబ్బందిగా ఉంది.
అది తన మాట వినకుండా ,అడ్డంగా తోవ మార్చి తిరగడంతో ,గుర్రప్పడికి సిటీ వెళ్లడం అవడం లేదు.
తను సిటీ వెళ్ళినప్పుడల్లా, పార్కుల దగ్గర ఆగితే , ఆ గుర్రం ఎక్కడానికి పిల్లలు సరదా పడేవారు . ఆ పిల్లల తల్లిదండ్రులు గుర్రప్పడి దగ్గరికి వచ్చి పిల్లల్ని , గుర్రం ఎక్కించ మని అడిగే వారు. గుర్రప్పడు ఆనందంగా పిల్లల్ని దానిమీదకి ఎక్కించుకొని అటు ఇటు తిప్పేవాడు .
పిల్లల ఆనందాన్ని చూసిన తల్లిదండ్రులు ,గొర్రప్పడికి ,
త్రుణమో ప్రణమో చెల్లించేవారు. ఆ సంపాదనతో
గుర్రప్పడికి ఆ పూట గడిచిపోయేది . గుర్రం కూడా ఖాళీ సమయంలో చుట్టుపక్కల ఉన్న ఎండు గడ్డి తిని వచ్చేది.
పిల్లలు పెద్దలు కూడా సరదాకి అరటి పండ్లని, ఆపిల్ పండ్లని ,
చిలకడదుంపలను, ఇలా ఏవో పెడుతూ ఉండేవారు .అది గుర్రం తినేది కాదు కానీ తనకు పనికొచ్చేవి.
దాంతో తనకు, గుర్రానికి ,కావలసిన తిండి గురించి, గుర్రప్పడు ఎప్పుడూ బాధపడలేదు
కానీ, ప్రస్తుతం తన తిండికే కాదు, గుర్రం దాణాకి కూడా తన దగ్గర డబ్బులు లేవు.
దాంతో గుర్రప్పడు విచారంలో పడిపోయాడు.
గుర్రప్పడి పరిస్థితి చూసిన ఆ ఊరి వాళ్లు ,
వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ ముందే పెరగడంతో ,వాడు
పస్తులు ఉంటే చూడలేక, తినడానికి ఏవేవో తెచ్చి ఇస్తూ ఉండేవారు . గుర్రప్పడి గుర్రం, ఆ ఊర్లోనే చుట్టుపక్కల ఎండు గడ్డి మేసి వస్తూ ఉండేది.
రోజులు గడుస్తున్నాయి.
గుర్రప్పడికి రోజు రాత్రి , పడుకునే ముందు తనున్న ఇల్లు ,గుర్రం పడుకునే చోటు శుభ్రంగా తుడవడం అలవాటు.
అలవాటు ప్రకారం గొర్రప్పడు గుర్రాన్ని కొయ్య నుంచి విప్పి, కొంచెం దూరంగా నిలబెట్టి ,చావడంతా శుభ్రంగా తుడిచి, కల్లాపి చల్లాడు. తర్వాత ఇరుగుపొరుగులు ఇచ్చిన దాన్ని కాస్త ఎంగిలిపడి , గుర్రానికి ఎండు గడ్డి వేసి , అలసటగా కుక్కి మంచంలో వాలాడు.
ఆ రోజు రాత్రి గుర్రప్పడు గుర్రాన్ని తాడుతో కట్టేయడం మర్చిపోయాడు.
అలసటతో బాగా నిద్రపోయిన గుర్రప్పడికి , తెల్లారి లేచేసరికి గుర్రం కనబడలేదు.
అంతే ! గాబరాగా ఇటు అటు వెతకడం మొదలెట్టాడు .
ఆ మాట ఊర్లో అందరికీ తెలిసింది.
దాంతో కొంతమంది వచ్చి , వాళ్లు కూడా గుర్రం కోసం వెతకడం మొదలుపెట్టారు.
విషయం నిన్న కొంతమంది పెద్దలు , గుర్రప్ప గుడి గుర్రం
పర్లాంగు దూరం వెళ్ళాక అక్కడ ఉన్న కుడి సందులోకి వెళ్లి ఉంటుంది చూడండి ,అంటూ నవ్వుతూ వెటకారంగా చెప్పారు.
ఆ మాట విన్నా గుర్రపుడు అటువైపుకి బాణంలా దూసుకుపోయాడు . ఆ ఊరి వాళ్ళు కూడా కొంతమంది అటువైపు కి పరిగెత్తారు.
ఇంకేముంది .అక్కడ కూడా కొంతమంది , ఆ పెంకుటింట్లో ఉన్న గుర్రం కనబడటం లేదని , గుర్రం కట్లు తెంచుకు పారిపోయిందని ఆ ఇంటి వాళ్ళు, పొద్దున్న నుంచి లబోదిబో మంటున్నారని మాట్లాడుకుంటున్నారు.
ఆ మాటలు విన్న ఊరు వాళ్ళు సంగతి తెలిసి ,
పక్కున నవ్వేరు.
గుర్రప్పడు నిలువు గుడ్లు వేసాడు.
-----------------------------------------
Saturday, March 16, 2024
చిత్ర కవిత
11/03/2024.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : చిత్ర కవిత.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర.
ప్రక్రియ : ఆటవెలది.
ఆలుమగలు కలిసి అలుపు సొలుపు లేక
కలసి పనులు చేయ కలదు సుఖము
ఆడ మగల బేధ మది చూపబోకయా
వలచు వారి కన్న వరమదేది !!
నాటి మాట గాదె నలభీమ పాకంబు
నేటి మహిళ లెరుగ నేర్పు ఏది ?
చీర గట్టి మగడు చిన్న సాయము జేసి
వంట రుచుల నేర్పె వనిత లకును!!
ఆడ మగల మాట ఆరోజు లెటొపోయె
కలసి మెలసి సాగు కథలు నేడు.
కలసి పనులు చేసి కలసి పనికి పోవ
కలిమి పెరుగు కడకు కలుగు సుఖము !!
స్వీయ. చాటువులు.
09/03/2024.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : చాటువులు.
శీర్షిక : నేటి మహిళలు.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
ప్రక్రియ : ఆటవెలది.
పద్యం.
-----
ఫ్యాషనన్న పేర ఫేస్కు రంగులు పూసి
కట్టు బొట్టు మార్చి జుట్టు కోయ ,
బామ్మ లెవరొ మరియు భామ లెవ్వరొయంచు
మారు స్థితికి వగచె మహి పురుషులు !!
భావం .
-----
ఒకప్పుడు ఆడవాళ్లంటే సాంప్రదాయ పద్ధతిలో,
కట్టు బొట్టులతో, నిండుగా చీర కట్టులో
మహాలక్ష్మిలా. ఉండేవారు.
కానీ ఈనాడు, మగువలు అమ్మ తనాన్ని,
ఆడతనాన్ని మరచి, పడుచు వారితో సమంగా,
ముసలి వారు కూడా పోటీ పడుతూ
కనబడుతున్నారు.
ముఖానికి రంగులు వేయడం, జుత్తు కత్తిరించి రంగులు వేయడం, ఫేషన్ పేరుతో, చిట్టి పొట్టి బట్టలు వేయడం
వంటివి చేయడంతో, ముసలి వారెవరో పడుచు వారెవరో తెలియక, మగవారు పడుతున్న బాధ వర్ణనాతీతం.
ఇది నా స్వీయ రచన.
-------------------
పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి సోదరీ గారు,
నేటి ఆధునిక పాషన్ లను
చూసి మనసు రోసి ఎటు చెప్పలేక ఒక విస్మయం వ్యక్తం చేశారేమో మీరు
అట్లే ఆధునిక ప్రక్రియలో ఎన్ని రచనలు వచ్చిన మీరు చాటు పద్యాన్ని ఎంచుకొని సమయాస పోరకంగా చక్కటి చాకచక్యమైన చమత్కారం పూరకమైన ధ్వన్యాత్మకమైన
అధిక్షేపకాత్మకమైన పద్యాన్ని మీ సృజనాత్మకత పల్లవించే నవ్యమనోహరంగా
రచించారు అమ్మా..
------------------------------
16/03/2024.
మహతి సాహితీ కవి సంగమం.
అంశం : చాటువులు.
శీర్షిక : అర్థమేమున్నది.
పద్యం ప్రక్రియ: ఆటవెలది.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
స్వీయ రచన.
అత్తవారి ఇంట అణగి మసలకున్న
అమ్మ తనము లేక అలరుచున్న
భార్య గాను నీవు భారమైన పతికి
ఆడ బ్రతుకు కింక అర్ధమేది...!!
పూర్వం ఆడదాన్ని పుట్టింటి మహాలక్ష్మి గా ,
అత్తింటి గృహలక్ష్మిగా. తలచేవారు.
అంతే కాదు భూదేవి అంత సహనం ఉంటుందని ,
అమృతమయి అని , సభ్యతకు, సంస్కారానికి స్త్రీత్వాన్ని ఉదాహరణగా చెప్పేవారు.
అత్తవారింటికి చేరిన ఆడపిల్ల, అటు పుట్టింటి
మర్యాదను కాపాడుతూ, ఇటు అత్తింటి గౌరవాన్ని
నిలుపుతూ, ఆదర్శ గృహిణిగా అందరి మన్ననలులూ.
అందుకుంటూ ఉండేది .
నేటి ఆడపిల్లలు , "పురుషులతో సమానంగా మాకూ హక్కులు కావాలి " అంటూ, అన్ని రంగాల్లో ముందంజ వేయడం వరకు బాగానే ఉంది.
చదువుకుంటున్నారు గానీ సంస్కారం మరచిపోయారు .అణకువన్న మాటకి అర్థం లేకుండా ప్రవర్తిస్తున్నారు.
పెద్దల మీద గౌరవం లేదు.
అటు , అత్తమామలను ఆదరించక, అవమానిస్తూ
వారిని వృద్ధాశ్రమాల్లో చేర్చి, వారి బ్రతుకు దుర్భరం చేస్తున్నారు
ఒక తల్లిగా పిల్లలకు మంచి చెడులను చెప్పేబాధ్యతను వహించక ,వారితో పాటుగా ఫ్యాషన్ పేరుతో ,కట్టు-బొట్టులను
మార్చి,బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు చాలామంది.
ఏదైనా, మోతాదుకు మించితే ఎబ్బేట్టుగానే ఉంటుంది.
భర్తతో,భార్యగా గల తన అనుబంధానికి విలువివ్వక
గృహిణిగా తన కర్తవ్యాన్ని , బాధ్యతను నిర్వర్తించక ,
దురుసుతనంతో , కుటుంబానికే భారమై మసలుతున్నారు
కొంతమంది ఆడవాళ్లు.
ఏ కోణంలోనూ రాణించక , .
సమాజంలో విలువ పోగొట్టుకున్న స్త్రీ బ్రతుకుకు అర్దమేమున్నది.
-----------------------------
అంశం: చాటువులు.
శీర్షిక: కుక్క తోక వంకర.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
---------------------
పద్యం.
కుక్క ముద్ధటంచు కూర్చి మకుటమెట్టి.
కూడు మంచి దెట్టి గుడ్డ గట్ట.
ఎంగిలాకు జూచి ఎగబడి యది నాకు.
పుట్టు బుధ్ధి పోదు గిట్టువరకు !!
---------------------------
భావం.
------
చాలామందికి కుక్కలు అంటే ఇష్టం.
"కుక్క అంటే నాకు ముద్దు" అని, దానికి బంగారు కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టినా సరే , అది ఎంగిలాకు కనపడగానే , పరుగెత్తి పోయి దాన్ని నాకుతుంది, తప్ప నువ్వు బంగారు పళ్ళెంలో పెట్టిన విలువైన భోజనాన్ని తినదు. ఎందుకంటే కుక్కకి దాని విలువ తెలియదు.
అందుకే పూర్వం అన్నారు" కుక్క తోక వంకర" అని.
అలాగే
మనుషుల్లో కూడా కొంత మంది ఉంటారు.
మానవత్వంతో , చదువు చెప్పించి, ఒక ఉన్నతమైన స్థానంలో వారిని కూర్చోపెట్టినా, వారు దొరల్లా మసల లేరు.
దొమ్ములు చేయడం, దమ్ములు లాగడం, కొట్లాటలు పెంచి మనుషుల్ని బాధపెట్టి ఆనందించడం మాత్రమే వాళ్ళు చేయగలరు.
అందుకే , "ఎవరిని ఎక్కడ ఉంచాలో, అక్కడే ఉంచాలి."
అన్నారు పెద్దలు.
బాగుపడతారేమో , అనుకొని , అనర్హులను, అందలం ఎక్కించకూడదు.
---------------
[30/03, 9:36 pm]
JAGADISWARI SREERAMAMURTH:
అంశం : చాటువులు .
శీర్షిక: ఉన్నమాటంటే ఉలుకెక్కువ.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
---------------------
కంద పద్యం .
-----------
దిటవగు పన్నులు నావని
పట పట, మని పండ్లు కొరక, పన్నే విరిగెన్
ముటముట లాడే పతిగని
నట పడి నవ్విన సతి గని నాధుడె నలిగెన్ !!
--------------------------
భావం.
------
వయసు పైబడ్డ పతితో , అతని భార్య,
"పండ్లని అలా కొరికి తినకండి. నేను చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇస్తాను " అన్నది .
ఆమె ఆ భర్త రోషంగా" ఏం అక్క లేదు. నా పళ్ళు ఇంకా గట్టిగానే ఉన్నాయి. నేను కొరికి తినగలను" అంటూ,
భార్య వ్యంగ్యంగా అన్నదేమో అనుకుని ముటముట లాడుతూ, భార్య మీద కోపంతో, పళ్ళు పటపటా కొరికాడు.
అంతలోనే అనుకోకుండా అతని ముందు పన్ను ఒకటి ఊడి పడింది.
అది చూసిన భార్య, నవ్వు ఆపుకోలేక పకపకా నవ్వింది.
ఆమె నవ్వు చూసిన భర్త ఉడుకు మోతు తనంతో మూతి ముడిచాడు.
-----------
Friday, March 15, 2024
మన్మధుడు
14/03/2024.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం: మన్మధుడు.
శీర్షిక..అందాల చెలికాడు.
ప్రక్రియ: ఇష్టపడి.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
మత్స్య పురాణమందు మన్మధుని పలు కథలు
శివపురాణమందున శివునితో బంధమది
తెలుపబడినవి గనుము తేట తెల్లము గాను
ప్రేమ నాయకు డతడు నామ మన్మధు డితడు !!
చిలుక వాహనమెక్కి చిరునవ్వులొలుకంగ
చేత విల్లును బట్టి చెలగు సుమ బాణాల
మదన తాపము లేల మదిని కోర్కెలు రేపి
అందరిని ఆడించు నతడు ప్రేమకు స్ఫూర్తి !!
రతి దేవి సతిగాను రసలీలలకు తోడు.
పూల విల్లుని బట్టు పులకరింతల రేడు.
తారకాసుర వధకు తానె కారణమవగ
హరుని ప్రేరేపించ మరుడు బాణము లేసె !!
తపము భంగము కాగ తాప మెంతయొ రేగ
హరుడు కోపముచెందె అతని శాపము పండె.
మాట తెలియని శివుని కంట మంటలు కురిసె
మహిమ మంటలు ఎగసె మరుడు భస్మంబాయె.!!
మదను చంపగ వద్దు మంచి కోరెను అనుచు
పలుకు పార్వతి వినతి ప్రభువు సాంతము వినగ
అంగ హీనుని గాను అతడు జీవితుడాయె.
సర్వమంగళములకు సఖుడు కారణమాయె !!
Thursday, March 14, 2024
మధురగతి రగడ
అంశం : మధురగతి రగడ .
శీర్షిక : వర్ణింప తరమా.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ మహరాష్ట్ర.
పచ్చని వనమున విచ్చిని పూవులు
అచ్ఛెరు వొందెను ఆమని బాలలు.
మచ్చిక తోడను మరుడిడె శరములు.
గాలపు శరములు ఘనరస లీలలు !!
మురళీ లోలుని ముచ్చట గనుమా
సరళీ స్వరముల సరిగమ వినుమా.
వరమదె జనులకు వరదుని మహిమా.
పరమాద్భుతములు వర్ణింప తరమా!!
తాపము చెందిన తరుణుల ఘనమా.
ఓపని తనముల ఓపిక ఫలమా.
గోపిక లందరు గొల్చిన వరమా.
పావన రూపుడె పాలించు క్షణమా !!
----------------------------
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర పద్య నీరాజనం కొరకు
13/03/2024.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర పద్య నీరాజనం ,
రెండవ సంకలనం కొరకు,
ప్రక్రియ: ఆటవెలది పద్యాలు.
శీర్షిక: క్షేత్ర దర్శనం.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
కళ్యాణ్ : మహరాష్ట్ర.
8097622021.
లింగ రూప హరుడు అంగ భస్మ ధరుడు.
కనులు మూడు యున్న కాల హరుడు.
గంగ శిరము దాల్చి ఘన జూట మునజుట్టి
గౌరి నేలు నట్టి ఘనుడు శివుడు.!!
వెలసినాడు శివుడు వేములవాడ, దే
మహా క్షేత్ర ముగను మహిని మనెను.
రక్ష కుండు మనకు రాజేశ్వరస్వామి..
అతని వేడు కొనుము అలరు భక్తి !!
ధర్మ గుండమనెడు ధరణి కోనేరదే
ఉత్త రమున గలదు ఉత్త మంబు.
చాకచక్యముగను చాణుక్యులేలిన-.
చరిత కెక్కి నట్టి క్షేత్ర మిదియె !!
రాజసమున నిలచె రాజరాజేశుడు
పార్వతమ్మ రాజ రాజ సతిగ
ధన్య భూమి ఇదియె దక్షిణ కాశియై
పుణ్యక్షేత్రముగను పుడమి నిలచె !!
----
మధురగతి రగడ. మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : మధురగతి రగడ .
శీర్షిక : వర్ణింప తరమా.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ మహరాష్ట్ర.
పచ్చని వనమున విచ్చిని పూవులు
అచ్ఛెరు వొందెను ఆమని బాలలు.
మచ్చిక తోడను మరుడిడె శరములు.
గాలపు శరములు ఘనరస లీలలు !!
మురళీ లోలుని ముచ్చట గనుమా
సరళీ స్వరముల సరిగమ వినుమా.
వరమదె జనులకు వరదుని మహిమా.
పరమాద్భుతములు వర్ణింప తరమా!!
తాపము చెందిన తరుణుల ఘనమా.
ఓపని తనముల ఓపిక ఫలమా.
గోపిక లందరు గొల్చిన వరమా.
పావన రూపుడె పాలించు క్షణమా !!
----------------------------
Sunday, March 10, 2024
తపస్వి మనోహరం అంతర్జాల కవితా సంకలనం కొరకు కవిత."ఉగాది పండుగ " సందర్బంగా...కవిత.
Friday, March 8, 2024
వెంకటేశ్వర కీర్తన.
రాగం : మోహన.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
కల్యాణ్: మహారాష్ట్ర.
తిరుమల శిఖరాల వెలసిన దేవా
అరుదైన నీ రూపు కనిపించనీవా
వరముగ ఈ భువికి వేంచేసినావు
కరముల నభయము నిడి బ్రోచినావు !!
ధరలో జీవులు ధన్యత నొందగ
నీ పద సన్నిధి చూపినావు
ఆపదమొక్కులవాడవై దేవా....ఆ.,.ఆ..
అడిగిన వరముల నిడి గాచినావు !!
జగముల బ్రోచిన జగదీశుడవు
మమ్మేల వచ్ఛిన మహనీయ మూర్తి.
ఆర్తితో పిలచిన ఆలసింపక వచ్చి
అభయము నొసగేటి ఓ దేవ దేవా !!
ఏడుకొండల నెక్కి ఏలికవౌ నీకు
ఇడుముల వినిపించి శరణము కోరి
తలనీలాలను అర్పించెదము
భక్తితో నీ రూపు దర్శించెదము !!
Thursday, March 7, 2024
యతిమైత్రి కలిగిన అక్షరాలు..
Wednesday, March 6, 2024
మధురగతి రగడ
06/03/2024.
మహతీ సాహితీ కవి సంగమం.
ప్రతిరోజు కవితా పండుగే...
అంశం : మధురగతి రగడ.
శీర్షిక : శ్రీపతి కొలువుము.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
కళ్యాణ్ : మహారాష్ట్ర.
శ్రీపతి కొలువుము సిరులను పొందగ
లక్ష్మిని హృదినిడు లక్షణు డతడెగ !!
పదములు బట్టిన పాపము తొలగును
నామము తలచుచు నమ్మిన చాలును.!!
కలిమల హరుడై గాచును మనలను.
వేంకట రమణుగ వెలసిన ప్రభువును.!!
అన్నియు తానై అంతయు తానుగ
జగముల నేలెడు జగపతి యతడెగ !!
మాతృ భాషా పరిరక్షణ
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
శీర్షిక : మన మాతృ భాషను మనం కాపాడుకుందాం.
దేశంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి
ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష.
ఏ ప్రాంతంవారికి ఆ ప్రాంతంలో
మాట్లాడే భాష వారికి మాతృ భాష .!!
ఎవరి భాష వారికి గొప్ప.
వ్యక్తి జీవన పరమార్ధిక విషయాలు
మాతృభాషలో అర్ధం అయినట్టుగా
మరొక భాష ద్వారా అర్ధం కావు.!!
అటువంటి మాత్రం భాషకు
ఆయువు పట్టు వంటిది సాహిత్యం.
అటువంటి సాహిత్యానికి నిధి పుస్తకం.
పుస్తకాలకు నిలయం గ్రంధాలయం!!
పుస్తక పఠనం తెలియజేసేది మన సంస్కృతి ,
సంప్రదాయాలను తెలియజేసేది మన చరిత్ర.
"దేశభాషలందు తెలుగు లెస్స "అని నానుడి.
వ్యాకరణం ఛందస్సులతో నిండిన నుడి. !!
విషయ విజ్ఙానాన్ని పెంచే చదువు "నిధి"
జ్ఞాన ,వివేకాలను పెంచే ఆదర్శాల "పెన్నిధి ".
పురాణేతిహాసాలలో నిండిన సాహిత్య "సడి"
జీవితాలకు మనుగడ నేర్పించే "నడవడి" !!
జీవితానికి సారమిచ్చే సాహిత్యాన్ని కాపాడుకుందాం.
పుస్తక పఠనంతో మన జ్ఞానాన్ని పెంచుకుందాం..
మన భాషను మనం గౌరవించుకుందాం.