Friday, December 30, 2022

బాబు రెండవ మనవడి జననం .మైసుార్ DRM Hospital లో...

30/12/2022.
పల్లవి రెండవ పుత్రుని జననం.
జననం...11గంటల..22నిముషాలు.

రాహుకాలం:ఉ10.30 - 12.00.
సూర్యరాశి:ధనుస్సు.
చంద్రరాశి:మీనం.


 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం.
దక్షిణాయణం -      =      ( హేమంతఋతువు.
పుష్య మాసం -        =          ( శుక్ల పక్షం).
తిథి:అష్టమి   .                   (రా11.58 వరకు).
వారం:శుక్రవారం.                   (భృగువాసరే)
నక్షత్రం:ఉత్తరాభాద్ర.               (సా5.07 వరకు).

Wednesday, November 30, 2022

బాల సాహిత్యము

*మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
తేదీ: *26-11-2022-శనివారం*
అంశము: *బాలసాహిత్యం(ల గుణింతం)*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *లెక్క విప్పవమ్మ చక్కనమ్మ!*
ప్రక్రియ: *పద్యము*
*********************

*(1)*
*లయను కలిగి యుండు! లాలిత్యమే నిండు!*
*లిప్తలోన నిదుర! లీనమగును!*
*లాలి లాలి యనగ రాత్రిని మరిపించు!*
*లెక్క విప్పవమ్మ! చక్కనమ్మ!*

*(2)*
*లవకుశులకు తండ్రి! లంకేశునకువైరి!*
*లక్ష్మణునికి యన్న! లక్షణముగ!*
*లక్ష్మియయ్యె సీత! రాజిల్లె నతనితో!*
*లెక్కవిప్పవమ్మ! చక్కనమ్మ!*

*(3)*

*లిప్తపాటులోన రెక్కలే లేకుండ*
*లేచి జారుకొనును! లెస్సగాను!*
*లుప్తమైనవేళ రోదించ రాదయా!*
*లెక్క విప్పవమ్మ! చక్కనమ్మ!*

*(4)*

*లలితపదములుండు! లావణ్యమొలికించు!*
*లిపిని నేర్చినంత లిఖితమౌను!*
*లెస్స భాషలందు! లేతసొగసులతో!*
*లెక్క విప్పవమ్మ! చక్కనమ్మ!*

*(5)*
*లోకమంత మెచ్చు! రూపాయి వృథకాదు!*
*లోనయున్న తెలివి రూపమిదియె!*
*లక్షలెన్నియున్న రసనచే కలుగురా!*
*లెక్క విప్పవమ్మ! చక్కనమ్మ!*
*********************
హామీపత్రము: *స్వీయరచన*

*జవాబులు*
*1. లాలిపాట/జోలపాట*
*2. శ్రీరాముడు*
*3. కాలము/సమయం*
*4. మాతృభాష*
*5. లౌక్యం*


*పొడుపుకథలు/పజిల్స్ కు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు*

*మీ*
*వేణుగోపాలుడు*
🙏🌹🙏🌹🙏

తెలుగు పదాలు , అర్ధాలు

***** *** ** * ** ** 

{మునపు = కోరిక
గాధి సుతుడు = విశ్వామిత్రుడు 
త్రిశంకు సుతుడు = సత్య హరిశ్చంద్రుడు 
అంబ = సతీ దేవి, శిఖండిగా మారిన స్త్రీ 
అయ్య = తండ్రి (దక్షుడు) 
పూజ్యుడు, పెద్దవాడు (భీష్ముడు) 
మనసు = కోరిక, మానసం
మను =జీవించు} 

🙏🙏🙏🙏🙏🙏
*

Tuesday, November 8, 2022

మనిషి-మానవత్వము

శ్రీశ్రీ కళావేదికలో
అంశం : మనిషి- మానవత్వం .
శీర్షిక : మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర .

మనిషి జన్మ మెత్తు  మదిని మర్మము లేక
కల్మషమ్ము లిడని కాంతి మనసు
పెరిగి నపుడు బుద్ధి పెడదోవ నదెబట్టు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

చదువు లెన్ని యున్న  చరియించు నీతీరు
నీదు బాట నెంచు  నీడ వలెను
వ్యసన పరుల తోడ వ్యవహరించుట చేటు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

మానవత్వ మదియె మనిషి భుాషణ మౌను.
పరుల బాధ నెరిగి పలుకు మెపుడు
 నీవు జేయు కర్మ నీవెంటె వచ్చురా 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

తల్లిదండ్రు లిలను  తలచు వేల్పులు నమ్ము
తీర్చు ఋణము నీవు  తీరు గాను
 జగతి నీదు భవిత   జన్మదా తల భిక్ష 
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

ఆతివ అబల యనెడు ఆలోచనసలొద్దు 
అబల కాదు యామె  ఆది శక్తి
అడుగు లోన యడుగు ఆమెతో డుగనేయు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

మహిని  పొందు ఘనత మందిలో నొకడిగ
సభ్య తెరిగి మసలు  సజ్జనునిగ
మంచి పేరు పొందు మనిషివిలువె మెండు
మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥
-----

భగణం UII


07/11/2022.

శ్రీశ్రీ కళావేదికలో
అంశం : మనిషి- మానవత్వం .
శీర్షిక : మనుజ తెలుసు కొనుము మంచి మాట.॥

ప్రక్రియ : శీస పద్యము.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .

మానవత్వము లేని మనిషి జన్మమదేల 
మాయ మర్మములున్న  మాయ కపటి 
ముార్ఖత్వ మదెనిండి ముార్ఖుడై చరియించు
మహిబుద్ధి హీనుడౌ మనుజు  డతడు ॥

సాటివారికెపుడు సాయమ్ము జేయడు
స్వార్ధ బుద్ధదె నిండు  వ్యర్ధ జీవి.
సర్వావగుణముల సరినేర్చు రసికుండు
నమ్మకెపుడు వాడె  నర పిశాచి ॥

మానవ త్వముగల్గి  మమతనిం డెడుమాట
మహిని మనెడు నడతె  మనిషి కీర్తి.
పరుల కష్టము దీర్చ పలుచింత నలుజేయు
సజ్జనుండె భువిని సాధు వర్తి ॥

మనదైన సంస్కృతి  మన సాంప్రదాయాలు
గౌరవించెడు వాడె ఘనుడు ఇలను 
స్త్రీల సమ్మానించు శీల సద్గుణుడేగ
మహిని ఉన్నతుండు మనిషి వాడు .॥

ప్రక్రియ : ఆటవెలది.

చదువు లెన్ని యున్న  చరియించు నీతీరు
నీదు బాట నెంచు  నీడ వలెను
వ్యసనపరుల తోడ వ్యవహరించుట చేటు
మనుజ తెలుసుకొనుము మంచి మాట.॥

మహిని  పొందు ఘనత మందిలో నొకడిగ
సభ్యతెరిగి మసలు  సజ్జనునిగ
మంచి పేరు పొందు మనిషి విలువె మెండు
మనుజ తెలుసుకొనుము మంచి మాట.॥

హామీ : ఈ పద్యములు ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచనలు.

అంశం : స్కౌట్స్ అండ్ గైడ్స్.

అంశం : స్కౌట్స్ అండ్ గైడ్స్.
శీర్షిక : ఆపద్బాంధవులు .

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. : మహారాష్ట్ర

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది 
భారతదేశ జాతీయ స్కౌటింగ్ ,
మరియు గైడింగ్ అసోసియేషన్..॥

బాల బాలికలలో దేశభక్తి, క్రమశిక్షణను 
పెంపొందించి వారిని సమాజ సేవకులుగా 
తీర్చిదిద్దడానికి ప్రారంభించిన ఉద్యమం .॥

బాలుర బృందాలను "స్కౌట్స్", 
బాలికల బృందాలను "గైడ్స్" అని అంటారు॥

1986 లో  ఐక్యరాజ్యసమితి  
 అంతర్జాతీయ శాంతి సంవత్సరానికి 
 భారత్ స్కౌట్స్ మరియు గైడ్స్‌ను 
  గౌరవ "శాంతి సందేశకులు"గా ఎంపిక చేసింది॥

స్కౌటింగ్ యొక్క లక్ష్యం, 
స్కౌట్ వాగ్దానం మరియు చట్టంపై 
ఆధారపడిన విలువ వ్యవస్థ ద్వారా ...
యువకుల విద్యకు తోడ్పడడం, ॥

వ్యక్తులు వ్యక్తులుగా స్వీయ-సంతృప్తులై 
 సమాజంలో నిర్మాణాత్మక పాత్రను
 పోషించే మెరుగైన ప్రపంచాన్ని 
నిర్మించడంలో సహాయపడటం. ॥

సేవా పద్ధతులను అనుసరించి శిక్షణలో 
వీరికి ఈతకొట్టడం, వంతెనలు, రోడ్ల నిర్మాణం, 
ప్రథమ చికిత్స పద్ధతులను నేర్పుతారు.॥

 ఒక నాయకుడి ఆధీనంలో పనిచేసే వీరు
సైనికుల వలె ప్రత్యేక దుస్తులలో ఉండి ,
కేవలం ఒక కర్రను మాత్రమే ధరించీ
మెడలో ఒక స్కార్ఫ్ తోఈ ఉద్యమంలో 
 చేరి దళాలుగా ఏర్పడతారు. ॥
    
 "సదా సమాజసేవలో ఉంటాం" అనే నినాదం
 నిండిన  పతాకం తో స్వచ్ఛందంగా
  ఈ ఉద్యమంలో చేరిన బాల భటులంతా
 సత్యం పలకడం, కష్టాలలో ఉన్నవారిని 
 ఆదుకోవడం, రోగగ్రస్తులకు సేవచేయడం,
  పోలీసు వ్యవస్థకు అత్యవసర సమయాల్లో సాయపడటం ద్వారా సమాజసేవ చేస్తారు.

Monday, November 7, 2022

ఇష్టపదిలో భగవద్వీత.

ఇష్టపది భగవ
--ీ------------.
సర్వ దేవతా ప్రార్ధన.
1.గణపతి వందనం.
------------------------
1.
అంబ ఈశుని పుత్ర            ఆది పుాజ్యుడవయ్య
అహరహము నిను గొల్తు    నార్తిబాపగదయ్య ॥
2.
ఆది -అంత్యము లేని          ఆది గురుడవు నీవు
అర్చించు నీశ్వరికి              ఆపదలు బాపయా ॥ 
3.
ముజ్జగమ్ముల ఒజ్జ          ముద్దు గణపతి రాయ.
విఘ్నముల బాపేటి        విఘ్నేశ్వరుడవయ్య॥
4.
ఇష్టపదులను రాయు       ఇచ్ఛ దీర్చగ రార
ఈప్సితములీడేర్చి         ఈశ్వరిని బ్రోవరా ॥
5.
.ఎలుక వాహన మెక్కి  ఎలమి భుామిని చుట్టి
ఏలిక  పుాజ్యవై         ఏలితివి ఈ జగమును.
6.
అమ్మ చేతి  బొమ్మవు ఆగమ నుత వంద్
గురు వందనం.
.---------------------
1.
శ్రితజనుల బ్రోవగా         
శిరిడీ పురమునందు
శ్రీశ నీ వాసమే                
శ్రీ నిలయమై ఒప్ప-॥
2.
సర్వ మత సమ్మతిని     
సరళముగ జెప్పేవు
సకల తీర్ధములన్ని          
నీదరినె జుాపేవు..॥
3.
ఖండయొాగివి నీవు       
ఖలు సంతరణ జేయు
కరుణా సముద్రుడవు    
కమలనయన సునేత్ర॥
4.
కలత లన్నియు బాపి      
కావుమయ్యా మమ్ము   
శ్రీ షిరిడి శ్రీ వాస              
శ్రీ పదాంబుజయుగళ ॥
5.
వందనము శ్రీసాయి        
వందనము గురుదేవ
వందనము చేకొనగ         
వేగ రావగదయ్య ॥
6.
వేడుచుంటిని నిన్ను        
వేల కీర్తుల తోడ
వరద హస్తముతోడ        
వరలు సాయిాశ్వరా ॥
7.
నింబ వృక్షము నీడ       
నిత్య తపమును జేసి
సర్వ జన సమ్మొాద      
సామరస్యపు భావ-॥
8.
మలరు సాయిాశ్వరా    
మా నమము నీకయా
ఇల గాచు ఇలవేల్ప      
ఈశ్వరిని  బ్రోవరా..॥

3.సరస్వతీవందనం.
------------------------
13.
విద్యలకు కొలువైన      విలువ పలుకుల తల్లి
విజయ పథములేలు    విశ్వ జన శ్రీ వల్లి   ॥
14.
విద్య- బుద్ధుల నెల్ల      విశ్వ  జనుకల నొసగు
తల్లి శారద నీవె            తరుణి బ్రాహ్మ్మీ శివే ॥
15
నా పుాజలను కొమ్మ       నగుమొాము పుారెమ్మ 
వివరములు నాకొసగి    విజయ పథ ములనిమ్మ
16
నాదు జిహ్వను నిలచి     నను బ్రోవు మాయమ్మ
నలువ కొమ్మా నిత్య       నీరాజనము గొమ్మ ॥..
4.అంబికా వందనం.
------------------------
17.
గణ నాధ షణ్ముఖా         ఘన పుతృలకు తల్లి
గణనలే  లేనట్టి                గుణ కల్పవల్లివీ
18.
గౌరవర్ణముతోడ             గౌరివై భాసిల్లు

ఘన సింహ వాహినీ        గావు ఈశ్వరి నిలను ॥
19.
దుష్టులను , దైత్యులను    దునుమాడి గాచేవు
దశరుాపములతోడ         ధరణిలో వెలసేవు.
20.
దివ్య  శక్తుల నేలు           దీనార్తులను బ్రోవు          
ఈశ్వరీ నుత పాద          ఈశు రాణివి నీవు. ॥
21.
హిమగిరిసు పుత్రికవు           హిమగిరి పురీశ్వరివి
హరుని పట్టపురాణి             హరి భగిని పార్వతివి
22.
హంస వాహిని సఖివి            హరునర్ధరుాపిణివి
అంబ, జగదీశ్వరిని                అహరహము కావవే॥
--------------------------------------------------------------------
                  శ్రీమద్భగవద్గీత -ఆరంభము.
                     (   పంచమ వేదము.).
---------------------------------------------------------------

1.అర్జున విషాద యొాగము.
--------*-------:-----------------------
1.
ధర్మ క్షేత్రమునందు           ధర్మ రక్షణ జేయ ,
పార్ధ సారధి వైన               పరమేశుడవునీవు.
2.
స్వఫలా పేక్ష కై               స్వజన సంహారమ్ము         
జేయనని పార్ధుడదె        ధ్యేయమును విడనాడ ॥
3.
వేద సారము మెండు       వేల సుాక్తుల నిండు
శ్రావ్య భగవద్గీత              కావ్య ఘనుడవునీవు
4.
శ్రీ కృష్ణ రుాపాన                శ్రితునర్జునకు  నీవు
ఘనయొాగ ములనెంచి    గీత బోధించేవు. ॥
5.
నిఖిల లోకోధ్భవుడ         నిత్య పరమానంద
నిల కర్మ ఫలములకు       నీదె బాధ్యతటంచు
6.
నిస్సహాయత తోడ         నిలిచి శస్త్రము విడిన
పార్ధునకు పర తత్వ         ఫలము నెరిగించేవు.॥
7.
కులధర్మ ములు వీడు      కుటిల మాయలనేలు
కులహీనులౌ, ఖలుల       కుాల్చ తప్పదు పార్ధ  .
8
యనుచు పలికెను విభుడు-యదునందనందనుడు.
ఈశ్వరీ హృత్సదను    డిలను శ్రీ కృష్ణుడుా . ॥
9
పార్ధునకు బోధించు   పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము     పంచమపు వేదమ్ము ॥
10.
ఇల వ్రాలు ఈశ్వరీ     ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార       శ్రీ కృష్ణ బ్రోవగా ॥     

2. సాంఖ్య యొాగము.
--------------------------------
11.
పోరి గురులను జంపి  -      పోరు ననుజుల గుాల్చి
పొందురాజ్యములేల ?       పొలయు  సుఖ మేలా..?
12.
రక్త సిక్తము లైన                  రాజ్య సంపద లేల..?
రధము తిప్పుము కృష్ణ       రణము వీడెదనయ్య    ॥
13.
అని పల్కునర్జనుని             అజ్ఞానమును బాప
ఆది దేవుడు పల్కె              అనునయము తోడ ॥
14.
పుట్టి -గిట్టుటె రీతి              పుడమి యందనుచునుా
శాశ్వతము ఆత్మనుచు      శంకలనుబాపేను.॥
15.
శోత్రుడవు నీవనుచు          శోకింప తగదనుచు   
సాంఖ్య యొాగపు నామ     శాస్త్ర మును తెలిపేను ॥
16.
సరి దుఃఖ -సుఖములను    సమముగా చుాచేటి
స్థిర తత్త్వజ్ఞానియె              స్థితప్రజ్ఞుడగుననియె॥
17.
కర్తవ్య కర్మలను                 కడ దాక పాటించి
సమబుద్ధియుక్తుడవై          సమరమును సలుపమనె॥
18.
పార్ధునకు బోధించు          పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము            పంచమపు వేదమ్ము ॥
19
ఇల వ్రాలు ఈశ్వరీ           ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార           శ్రీ కృష్ణ బ్రోవగా ॥     
--------------------------------------------------------------
3. కర్మ యొాగము.
-------------------------
20.
యొాగముల పాటించి       యొాగ కర్మల నేలు
యొాగ నిష్టాపరులు          యొాగులిల పార్ధా॥
21.
ఇంద్రియపు లోలుడై          ఇలను చింతల పొందు
మానసిక ముాఢుడే           మాన మిధ్యాచరుడు   ॥
22.
పరమాత్మ ప్రాప్తి  నదె         ఫలముగా నొందేటి
నిష్ట పుార్ణుడె యొాగి          నిత్య సంతుష్టుడు. ॥ 
23.
ఆశక్తిరహితుడవై                ఆచరింపగ  కర్మ-
పరమ శ్రేష్టుడ వగుచు         పరము నొందెదవు.॥    
24.
పరధర్మ గుణములను       పాటించుటలు కన్న
స్వీయ ధర్మము లిలను      స్వీకరించుటె మిన్న.॥
25.
కామ క్రోధము లిలను         కడు పాప ప్రేరణలు  
బుద్ధి తోడ విడుమా           బద్ధుడవై మెలగుమా॥
26.
జ్ఞానమ్మె శాస్త్రమని            జ్ఞానివై మెలగుమని
కర్మ ఆచరణ లిల               ఘన లోక హితములని
27.
కర్మలకు బాధ్యుడవు-          కర్త నీవని తెలిపి
జగతి కర్మల సలిపి              జయమొంద మంటివి ॥   
28.
పార్ధునకు బోధించు            పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము              పంచమపు వేదమ్ము ॥
29.
ఇల వ్రాలు ఈశ్వరీ              ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార              శ్రీ కృష్ణ బ్రోవగా ॥     
--------------------------------------------------------------
----------------------------------------------------------------
4.జ్ఞాన , కర్మ సన్యాస యొాగము.
---------------------------------------------
30.
ధ్యాన యొాగము లనెడు   జ్ఞాన, కర్మల ఫలము
ఒక్కటిగ చుాడుమా           ఒనరు భావముతోడ.॥
31.
ఏ కాంక్షయుా లేని             ఏ ద్వేషములు లేని
కర్మ సన్యాసమ్మె                కాంచ ఫల రుాపమ్ము.॥
32.
నిష్కామ కర్మములు         నిర్భావ చిత్తులై-
సల్పు సజ్జను లిలను         శాంతి పొందెదరు.॥
33.
సర్వత్ర సమభావ             సత్య సాధకు లిలను
బ్రహ్మ వేత్తలు బ్రహ్మ         నిర్వాణ పాత్రులు॥
34.
ప్రకృతి కర్మల నేలు           పెక్కు జన్మలు నీవి 
ప్రబలు భవ బంధముల    పట్టి జిక్కితి వీవు॥
35.
పెక్కు జన్మలు నావి         పెక్కు అవతారములు-.
పేర్మి నెత్తితి నేను            పెకిలింప పాపములు.  ॥
36.
నాల్గు వేదములైన           నాల్గు వర్ణములైన
నడిపించు వాడనుా         నట సుాత్రధారుడను ॥
37.
అజ్ఞాన  మును వీడి         అలరు జ్ఞానము తోడ
కర్తవ్య నిష్టలే                  కడు శ్రేష్టమని యెంచు.॥
38.
కర్మ తత్వమునెరిగి       కర్మ యొాగము తోడ
యుద్ధ సంశిద్దవౌ   --       ఉత్తమంబెరిగి  ॥
39.
పార్ధునకు బోధించు   పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము     పంచమపు వేదమ్ము ॥
40.
ఇల వ్రాలు ఈశ్వరీ     ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార       శ్రీ కృష్ణ బ్రోవగా ॥     
--------------------------------------------------------
5.కర్మ సన్యాస యొాగం.
----------------------------------
41.
కర్మ , సన్యా సములు    కనిన రెండును వేరు
కాని రెండిటి  ఫలము    కల్యాణ దాయకమె॥
42.
అవనిని  ద్వేషములను      అధిగమించిన వాని
సాధనల సమకుారు          సార బ్రహ్మపు పథము॥
43.
అతఃకరణ  సుద్ధి                ఆనందయొాగమై
పరమాత్మ తత్త్వ మును     పలుకు జ్ఞానులగుదురు.॥
44.
బాహ్య విషయములంచు    భవభోగవిషయముల
చింతన ను చేయకయె        చింతా ముక్తుడగును.॥ 
45.
ఆత్మ స్థిత ధ్యానులు,        అనాశక్త విషయులు
అక్షయానందములను        అనుభవించెదరిలను॥
46.
ఏక భావ స్థితులును           ఏ మొాహమ్ములకును
వివశులేటికి కాక                విజయ సాధకులౌను ॥
47.
చిత్త వృత్తుల జయము    చిరముగా సాధించి
పరమ శాంతి నొందియు   పరము నొందెదరుగద ॥
48.
తామరాకు పై నదె         తళుకు బిందువు వోలె
స్వజన చింతన వీడు     స్వ భయంబు వీడుమని  ॥
49.
పార్ధునకు బోధించు   పరమేశు పలుకులివి
ఫల గీత సారమ్ము     పంచమపు వేదమ్ము॥
50.
ఇల వ్రాలు ఈశ్వరీ     ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార       శ్రీ కృష్ణ బ్రోవగను ॥      -------------------------------------------------------------
6.ఆత్మ సంయమ యొాగము.
-----------------------------------------
51.
సంకల్ప త్యాగముల       సహనశీలత నొదులు  
సాధు చిత్తుడె యగును   సన్యాస యొాగిగను॥
52.
సంసార   సంద్రాన        సాధు చింతన లేని
మనిషి తనకే తాను     మది మిత్ర శతృడును.॥
53.
శీతోష్ణ, సుఖ -దుఃఖ        శీల,మానావముల
నిశ్ఛలపు స్థితి నేలు       నిత్య లగ్నుడె యొాగి॥
54.
చిత్తేంద్రియమ్ములను    చిద్బ్రహ్మ ధ్యానమున
లగ్నమై యుంచవలె      లక్ష్యసాధకుడిలను ॥
55.
అనంత చైతన్య స్థిత ----   ఆత్మ రుాపమునదె
సకల ప్రాణులయందు    సమానమని యెంచును॥
56.
సర్వ భుాతములందు   సమ దృష్టి కల్గుటను    
పరమ శ్రేష్ఠులు వారు     పరమాత్మ రుాపములు॥
57.
పర స్వర్గ సుఖములను    పుణ్య పురుషులుపొంది 
మరల జన్మింతురుా           మహి పవితృలుగాను॥
58.
విరాగులకు జన్మ            విధిగ ప్రాప్తంబౌను
ధర దుర్లభమ్మైన           ధన్య యొాగిగ జనును॥ 
59
అట్టి యొాగము తోడ   ఆత్మ యొాగిగ మనుచు
  శ్రేయ, శ్రద్ధను కొమ్ము       శ్రేష్ట కార్యము జేయ ॥
60.
అని పలికె  శ్రీకృష్ణు       డవని అంతర్యామి
ఫల గీత సారమ్ము       పంచమపు వేదమ్ము ॥

ఇల వ్రాలు ఈశ్వరీ     ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార       శ్రీ కృష్ణ బ్రోవగా ॥ 
------------------------------------------------------------
7. జ్ఞాన విజ్ఞాన యొాగము.
--------------------------------------
61.
తత్త్వ జ్ఞానపు  మహిమ     తనిగ తెలిపెద పార్ధ            
తద్ద్యాన్న మగ్నవై               తథ్యముగ వినుమా॥
62.
యొాగమాయను  కమ్ము     యొాని జన్ములకెల్ల
తనిగ నీశుని తెలియ         తరముకాదిలలోన   ॥
63.
రాగద్వేషము వలన           రగులు సుఖ- దుఃఖములు
మొాహమును విడలేరు      మొాహ బుద్ధి హీనులు .॥
64.
ప్రకృతి పరా, చేతన----       ప్రకృతి జడపరాదులు,   
పుట్టుకలు, ప్రళయముల      పుార్ణ రుాపిని నేనె  ॥
65.
వేద రుాప ఓంకార             వేల గుణ తేజమును 
త్రిగుణాత్మ భావముల      త్రిగుణతీతుడ నేను ॥
66.
గత, వర్తమానాల              గుణ, మొాహ ముక్తులదె
నన్ను శరణని నమ్మి            నను చేరెదరు తుదకు ॥
67.
అని పలికె కృష్ణుడు         అవని అంతర్యామి
ఫల గీత సారమదె           పంచమపు వేదమ్ము ॥

ఇల వ్రాలు ఈశ్వరీ     ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార       శ్రీ కృష్ణ బ్రోవగా ॥ 
------------------------------------------------------------
8. శక్షర  బ్రహ్మ  యొాగము.
---------------------------------------
68.
కన బ్రహ్మ మన నేమి?           కర్మ మనగా నేమి?
తెలియ జెప్పెద వినుమ       .తెలుసుకొనుమొా పార్ధ॥
69.
సర్వ శ్రేష్టుడు బ్రహ్మ             సృష్టి కర్మ లె కర్మ
అభ్యుదయొాత్పత్తిని         అలరు కర్మలు ఇలను॥
   70.
అఖిల చరాచరములు          అవ్యక్త ప్రకటములు
సుాక్ష్మదేహోత్పన్న                సుాన్య లీనములు॥
71.
అధి భుాత, అధి దైవ             అధి యజ్ఞ ,జీవాత్మ-
సృష్ట్యాది  సారముల             సృజనాత్మకుడ నేను॥
72.
చివరి ఘడియల లోన           చెదరు మానసు లిలను
ఏ స్మరణ చేయునో                ఆ జన్మ పొందెదరు   ॥
73.
బ్రహ్మ పథమును ప్రాప్తి           బ్రహ్మ యొాగులకునుా
స కామ కర్మయొాగి                సర్గ లోక వాసిగ..॥
74.
దేవయాన మార్గుల             దేహమేలును పరము
పితృయాన దేహులకు        పిదప జనన భ్రమణము ॥
75.
అని తెలియుమర్జునా      .అక్షరుడ ను నమ్ముమ
ఫల పుణ్యము పొందుమ  పరమపదము నొందుమ॥
76.
అని పలికె  కృష్ణుడు       డవని అంతర్యామి
సార భగవద్గీత             సరి పంచమ వేదము ॥

ఇల వ్రాలు ఈశ్వరీ     ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార       శ్రీ కృష్ణ  బ్రోవరా ॥ 
------------------------------------------------------------
9.రాజ విద్యా, రాజ గుహ్య యొాగము.
----------------------------------------------------
77.
తలమానికమ్మైన              తత్వముత్తమొాత్తము.
సమస్త గోప్య విషయ        సత్ శిరో భుాషణము.॥
78.
జగతి భుాత నిలయము      జలపుార్ణ మీ జగతి
నా సంకల్పములివి             నాలో నిండున్నవి.॥
79.
కల్పాది సృజనుడను            కల్పాంతకుడనేను
కర్మానుసారముా                  కలిగింతు జన్మలను.॥
80.
అద్యక్షుడ  సృష్టికి             ఆశక్తి రహితుడను
లోక కల్యాణార్ధ-               లోకావతారుడను ॥
81.
క్రతు,యజ్ఞ , స్వధ నేను      క్రతు వేద సారమును
హోమ క్రియ మంత్రాగ్ని      ఓషధీ, ఘృతాగ్నిను ॥
82.
సత్తును, అసత్తును  నే       సర్వ మృత్యు కారకను.
అప్రాప్త  యొాగముల          ఆరక్షక క్షేమమును ॥
83.
నిష్కామ భక్తితో             నిత్యమునర్చించుము
ప్రీతి పత్ర ,ఫల,ముకే       ప్రియమొందు వాడను ॥
84.
క్షణ భంగుర జీవములు   క్షణమౌ సుఖ,హితములు
శరణము కోరినవారు      సవ్యులు నను చేరెదరు॥
85.
అని పలికె కృష్ణుడు        అవనినంతర్యామి
సార భగవద్గీత             సరి పంచమ వేదము ॥

ఇల వ్రాలు ఈశ్వరీ     ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార       శ్రీ కృష్ణ నను బ్రోవ ॥ 
------------------------------------------------------------
10. విభుాతియొాగము.
---------------------------------
86.
జన్మరహితుడననియు        జ్ఞాని ఎరుగును నన్ను
వివిధ భావపు గతులు       విధి, నాచే కలుగును ॥
87.
స్వయంభుావ మనువులు  స్వయమునాదు భక్తులు
సమస్త ప్రాణి కోటుల           సంకల్పుడ నేనెగ ॥
88.
నాయందు మనసుంచి         నాయందే రమించు
నిత్య ధ్యానులకు నే            నిచ్చు ధనము జ్ఞానము ॥
89.
పరబ్రహ్మవు నీవెగా              పరమాత్మవు నీవుగ
నీ తత్త్వము నెరుగను          నీ విభుాతి తెలుపుము॥
90.
అను పార్ధుని గని హరి       అనునయమున పలికెను
సమస్త ప్రాణ సృష్టి కి           సకల లయము తాననె  ॥             
91.
ప్రాణ చైతన్యమును               ప్రాణ శక్తిని నేను
ఓంకార శబ్దమయ                ఓజ తేజము నేను॥
92.
ఆది మధ్యాంతముల           ఆది పురుషుడ నేనె
విశ్వతోముఖుడ  నుా           విరాట్పురుషుడనే ॥
93.
యొాగ శక్తి  అంశను            యొాగ కారకుడేను.
తేజ సంభవుడను               తేజైశ్వర్యుడను॥
94.         
అని పలికె  శ్రీకృషు-        అవనినంతర్యామి
సార భగవద్గీత             సరి పంచమ వేదము ॥

ఇల వ్రాలు ఈశ్వరీ     ఈప్సితములీడేర్చ
శ్రీయుతుడవై రార       శ్రీ కృష్ణ  బ్రోవగను ॥ 
----------------------------------------------------------
11.విశ్వరుాపసందర్శనయొాగం.
--------------------------------------------
95.
తొలగె సంశయమ్ములు       తొలగె  నజ్ఞాననమదె
నాజన్మ ధన్యముగ             నను నడుపుమ కృిష్ణా   ॥ 
96.
షడ్గుణైశ్వర్యాల                 సంపన్న  మైయున్న   
నిజ దర్శనమిమ్మా              నిఖిల లోకాత్మా   ॥  
97.
ప్రాకృతపు దృష్టి నను        పార్ధ  చుాడగలేవు
దివ్య దృషిని ఇత్తు             దివ్య దర్శనము గన ॥
98.
అని దివ్య రుాపమును     ఆది దేవుడు చుాపె
అనంత భ్రహ్మాండము        అందు నిండి యుండెను॥
99.
పెక్కు ముఖముల వాని   పెక్కు కర, అస్త్రములు, 
జగతి నిండుదరములు     జల ప్రళయ భీకరము॥
100.
వేల సుార్య కాంతిని          వెలుగు విరాట్ రుాపము
గాంచి ధన్యుడు నరుడు    ఘనమునంజలులిడెను॥
101.
దుర్నిరీక్ష్యమైన                దివ్యరుాపుని గాంచి -
కమ్ము భయముతోడను   కడు ప్రసన్ను కమ్మనె॥
102.
సౌమ్యముార్తిగ యైన       స్వామి రుాపమునుగని
సవ్యసాచి  హరిగని         సంతసించి నమమిడె॥
103.
అట్టి భాగ్యముపొంద        అహరహము ధ్యాన్నింతు
అనుచు శరణము వేడె       అవనిలోనీశ్వరి  ॥
------------------------------------------------------------------
12. భక్తి యొాగము.
------------------------------
104.
అనన్య భక్తి సేవ                అత్యంత భక్తి సేవ
ఏది శ్రేష్టమైన దొ                ఎంచి చెప్పుము కృష్ణ ॥
105.
సగుణ రుాప ధ్యానులు   సర్వ యొాగ శ్రేష్టులు
సమ సమాన దృష్టులు     సత్య  సిద్ధ యొాగులు ॥
106.
అవ్యక్త పరబ్రహ్మ             ఆశక్తచిత్తులు
పరగుటకు సాధనలు     పరమ కష్టతరములు ॥
107.
మత్పరాయణ భక్తులు      అనన్య భక్తి కాములు
నన్ను నమ్ము వారి నే         నట్లె ఉద్ధరింతును  ॥
108.
అభ్యాస యొాగమదె       అత్యంత సులభము
మత్ప్రాప్తికై చేయు          మదె సాధన పార్ధా ॥
109.
కర్మ ఫల త్యాగములె         కన మిక్కిలి శ్రేష్టము
ఫల త్యాగము చేయుట     పరమ శాంతి యొాగము॥
110.
ఏ ద్వేషములు లేని              ఏ స్వార్ధములు లేని
మనోబుద్ధి అర్పణుడు        మత్ ప్రీతి పాతృడుగ.॥
111.
అని పలికెను శ్రీహరి           అర్జునోద్ధారకుడు
ఇల ఈశ్వరీ నుతుడు         ఈప్సిత వర ధాముడు ॥
--------------------------------------------------------------  
13. క్షేత్ర  క్షేత్రజ్ఞవిభాగ యొాగము.
---------------------------------------------
112.
జీవులు  ఎన్నున్నను        జీవాత్మను నేనే॥---
క్షేత్ర త్రిగుణ తత్త్వము      క్షేత్రజ్ఞుడను నేనే.
113.
బ్రహ్మసుాత్ర పదములు        బహు ఇంద్రియ దశలును-       ధృతి వికార మయమును    ధృఢ క్షేత్ర స్వరుాపము  ॥
114.
జన్మ జరా దుఃఖము           జన్మ రాగమొాహము
విని యుంటివి అవె గద      వివిధ దేహ దశలిల  ॥
115.
ఇంద్రియ వైరాగ్యము          ఇల మమతల త్యాగము
మన భావ సు చిత్తుడు       మన వికార ముక్తుడు ॥
116.
నిత్యనన్య  భక్తుడు             నిత్య సుస్థిర చిత్తుడు
సుతత్త్వ జ్ఞానార్హుడు           సత్+అసత్,కతీతుడు॥
117.
ఇహ,పర నిరాశక్త                 ఇంద్రియ వైరాగ్యుడు         
బహు విధ స్వరుాపుడును    బాహ్యాంతరశుద్ధుడు.           
118
పరమాణు స్వరుాపుడు       పలు విధ గోచరుడుా
పరంజ్యోతి రుాపుడు          పరమాత్మయౌనతడు ॥.
119
జ్ఞాన బోధ జేయుచు           జ్ఞేయము నెరిగించిన
ఈశ్వరీ నుతుడతడు          శ్రీశుడు   శ్రీ కృష్ణుడు ॥
-------------------------------------------------------------------
14. గుణత్రయవిభాగయొాగము.
---------------------------------------------
120.
ముహి ప్రకృతి స్థానము      మద్బ్రహ్మ స్వరుాపము
జడ సంయమ యొాగము  జగ దుత్పత్తి స్థలము .
121.
విశ్వ ప్రకృతి తల్లిగ        విత్తు తండ్రి  నేనుగ
త్రిగుణ క్షేత్ర మునందు   తిరుగు  జీవాత్మగను॥
122.
సత్త్వ గుణము సుఖమగు  సర్గ లోక ప్రాప్తము
రజో గుణమశాంతిని        రగుల జేయు స్వార్ధము॥
123.
తమగుణమజ్జానము    తథ్యమతి ప్రమాదము.
శ్రేష్టమైన కర్మలనే             శ్రేష్ఠుడాచరించును.॥
124.
ఇచ్ఛా ద్వేషములకు-      ఇల అతీతుడు, వాడు
.అపరబ్రహ్మ  ప్రాప్తికి         అట్టి వాడు అర్హుడు॥
125.
అని పలికెను కృష్ణుడు    అఖండ ఆనందుడు .
ఈశ్వరీ హృన్నిలయ       ఇహ, పర అవతారుడు॥
----------------------------------------------------------------
15. పురుషోత్తమప్రాప్తియొాగము.
---------------------------------------------
126.
శాఖోపశాఖలౌ                 సంసార వృక్షము కు-
ముాలమాదిపురుషుడు  ముజ్జగములకీశుడు॥
127.
తిర్యగ్యోనులజను          త్రిగుణ దేవ, మనుజులు
తగు విస్తార కర్మల         తరు శాఖలు, చిగుళ్లు ॥   
128.
నశ్వర శాఖల తరు          నాశమె  వైరాగ్యము
అట్టి వైరాగ్యుడు            అందు పరమపదమును॥            
129.
అవ్యయపరమాత్ముడు  అతడె వేదవిదితుడు.
క్షర-అక్షర పురుషుడు     క్షాత్రజ్ఞుడు సర్వుడు॥
130.
గోప్యమ్మౌ విషయము      గోవిందుడు తెలిపెను.
ఈశ్వరిల తరించెను         శ్రీశుని ప్రార్ధించెను ॥
---------------------------------------------------------------
16.దైవాసురసంపద్విభాగయొాగము.
------------------------------------------------------
131.
యొాగ స్థిత జ్ఞానియె           యొాగ్య శ్రేష్ట తేజుడు
దురిత గుణ పాపుల-          దుష్టుల దరి చేరడు .॥
132.
అలోలుప్త్వములును        అచాపలత్త్వములు,
అద్రోహము, కపటము     అనునవి  త్యజించుమా॥
133.
ప్రవృత్తి, నివృత్తి                ప్రవర్తనలసురులకు
అపకారులు, కృుారులు     అవని మంద బుద్ధులు ॥
134.
కామ ,క్రోధ, లోభకు            కలుగు నరక ప్రాప్తము
అనర్ధములను విడుము     అవని శ్రేష్టవై మను ॥
135.
అని పలికె, కృష్ణుడు        అవనినంతర్యామి
సార  గీతామృతమె        సరి పంచమ వేదము ॥
---------------------------------------------------------
17. శ్రధ్ధాత్రయవిభాగయొాగము.
----------------------------------------------
136.
విరుద్ధ కర్మ చేయరు      వివేకము గలవారు
స్వభావజమౌ శ్రద్ధ        సంస్కారోత్పన్నము.॥
137.
ఆరోగ్య  పానములు     ఆయు వృద్ధి కరములు
సార భోజనాదులు       సాత్వికులకు ఇష్టము .॥
138   .
ఆసురస్వభావులు         ఆత్మ క్లేశమిడుదురు.
కృత్యాసుర సేవల          కృశింపజేయువారు.॥
139.
రాజసు లేలు ఋచులు   రోగోత్పన్నములుా
అపవిత్ర పక్వములె          అవె తామసులిష్టము ॥
140.
శాస్త్ర విహిత కర్మలు         శ్రద్ధ రహిత యజ్ఞము.
గురు, బ్రాహ్మ్మణ సేవలు      దేహ సౌచ తపములు॥
141.
అనిశ్ఛిత  కార్యముల----- అధృవమని అందురు.
శ్రేష్టాలోచనముల  -         చేయు పనులు శుభములు.॥
142.
వేద మంత్ర విధములు      శ్రేష్ట సన్మార్గములు ॥
ఓం -తత్ -సత్ నామను    ఓజ రుాప బ్రహ్మను.
143.
సార  గీతామృతమె         సరి పంచమ వేదము ॥
అదె పలికెను కృష్ణుడు      అవనిని గుణ ధాముడు ॥
------------------------------------------------------------
18. మొాక్ష సన్యాసయొాగము.
------------------------------------------
144.
కామ్య కర్మల త్యాగి       కన సన్యాసుండని
తప చర్య కర్మలవి        త్యజ్యములు  కావనిరి-॥
145.
శాస్త్ర విహిత కర్మలు         సత్కర్తవ్యములు
నిరాశక్త  ఫల కర్మలు         నిజ త్యాగపు గుణములు॥    
146.
శుభ కర్మాచరులిల           శుద్ధ బుద్ధి మంతులు
అకృత బుద్ధిపరులు        అపవితృలు అగుదురు.॥
147.
శుద్ధ తత్త్వ గుణుడు       శుఖ సంశయ రహితుడు.
కర్మ ఫల త్యాగుడుా          కన సత్య సుపుార్ణుడు ॥
148.
ప్రారబ్ద హింసలందు        ప్రబలు  పాపమంటదు.
స్వార్ధ రహిత దండన      స్వ అపరాధము కాదు॥
149.
కర్మాచరుడు కర్త..            కర్మాచరణ  కర్మ.
నశ్వరము శరీరము        నడుమాత్మయే స్థిరము॥
150.
ఈ విధి శాస్త్రము గని    ఈశ్వరభావమెరిగి
జ్ఞాన పరా నిష్టతో          జ్ఞానుడవై మెలగుము॥
151.
పరమాత్ముడు చెప్పిన      పలు శ్రేష్ట యొాగములు
పలువిధ గుణ కర్మలు      పలు తత్త్వ,శాస్త్రములు॥
152
సవ్యమెరిగి పార్ధుదు   సంశయముల వీడెను
సన్ముకుళిత హస్తుడై       సమర సిద్ధుదాయెను॥
153.
ఇయ్యది భగవంతుని     ఇహ అమృత భోధకము
ఈశ్వరి రచనామృత-        మిల సార్ధక యొాగము॥
------------------------------------------------------------------
                     ఓం  శ్రీ కృష్ణార్పణమస్తు.
                               ఓం తత్సత్.
                          శాంతి శాంతి శాంతిః.
                          --------------------------
-రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
----------------------









      










     

Sunday, October 30, 2022

పంచ చామరం పద్యాలు సరిచేయాలి

స్వరుాప దివ్య దంతి వక్త్ర స్వయంప్ర కాశకాత్మనే

 
IU  IU  IU  IU     IU  IU  IU  IU 



అగమ్య గోచరాంత కాయ కాళ కాల భీషణం 
ఆశపాశ నాశకం 
సుగంధ పుష్ప సేవితాయ సుసిద్ధచారణేనఘం
జగరుకారమంత్ర రుాపనేక దైత్య భంజనం ॥
అమేయ శక్త్యమొాఘతే నమామితం వినాయకం .

సుసప్త తాళ వాద్య ఢంక  సుస్వరాది మొాదితం 
పురాది భుాషితం సునాట్య పాద పంకజం 
భయాష్ట కష్ట నాశకం దయావిశిష్ట సేవితం  
నవగ్రహాధిదేవ వంద్య పంచ భుాత పాలకం ॥

భజేహ మీశ నందనం భజేసు భక్త చందనం 
అజేయ కాబ్జ నేత్ర , కుబ్జ కాయ నాగ్ర పుాజితం
 భుజే భుజంగ పాశ చాప భుాషణాస్త్ర శోభితం
భజే గణేశ వక్రతుండ  భవ్య దివ్య విగ్రహం ॥


I U I    U I U   I U I          U I U   I U I U 
సకుబ్జ రుాప లంబకుక్షి సార నేక దంతనే
దయా గుణాబ్ది శీల దివ్య మంత్ర గం గజాననే ॥

హరప్రియాయచింత్యకాయ  అంబికేయ వందనం.
సు భక్త పోషకాభయా  సుమాంజలీం గణాధిపం ॥

సుదివ్య పింగ ళాక్షనే సువిశ్వ ధర్మ పాలనే
నమొాస్తు సర్వ శక్త్యపార నేభుజంగ భుాషణే 
సుమొాదకప్రియే ఘనే సుముాషికాసువాహనే
  ప్రణామ్య హం గజాననే ప్రథమ్య వక్రతుండనే ॥

ప్రథమ్య గౌరి నందనం  ప్రదీప్త నేక దంతనే
 ప్రభంజకం  గజానం  ప్రవీణ భక్త వత్సలం
 సపంచమంపరాత్పరేశ సర్వ విఘ్న నాశినే
 సుష ష్టమం గణాధిపాయ స్తుాయ మాన మంగళం॥
 
 సుసప్త తాళ వాద్య ఢంక సుాత్ర గీత మొాదకం
భయాష్ట కష్ట నాశకం దయాసుశిష్ట సేవితం  
నవగ్రహాధిదేవ వంద్య నటా నటేశ పాదజం
సుభక్త పోషకాభయాయ సుజన్మజన్మ కారకం  ॥
 
సుఫాలచంద్ర శోభితం సుబాలకం సురేశ్వరం
అవిఘ్న కార్య కారకం అజేయ సిద్ధి దాయకం
సయేక దంత నంత కా సమే నమొాద కప్రియం 
సుపుత్ర గౌరి శంకరం సువక్త్ర దంతి శోభితం॥


సరస్వతీ స్తుతి.
---------------

నమొాస్తు వాణి కోమలే నమొాస్తు సర్వ మంగళే
నమొాస్తు బ్రహ్మ నాయికే నమొాస్తు హంస వాహికే
అమొాఘ  మంత్ర పీఠికే   అచింత్య వాద్య మొాదితే
తమొాగుణాది భంజనే తపఃఫలాది కారణే

సుసత్యలోక వాసినే సమస్త దుఃఖ వారిణే  ॥ 

విలోల లోల లోచనే  విశుద్ధ జ్ఞాన  దాయినే
ఫలోదరేణ పావనే పరేసు వంద్యపాదనే

విలాస దివ్య గాత్రనే విశుద్ధ గీత మొాదినే 
విశేష గీత సంగీత  జ్ఞానవేద సారనే

నమామి వాగ్వి లాశినీ  నమొాస్తు భ్రహ్మ ణీఘనీ
నమొాస్తు విద్య దాయినీ నమొాస్తు గీత మొాదినీ
నమొాస్తు సుస్వరాకృతే నమొాస్తు స్వప్రకాశికే
నమొాస్తు వీణ వాదకే నమొాస్తు వాణి పావకే॥

విచిత్ర వీణ వాదినే విధిప్రియే శుభాన నే
సుచిత్ర హంవాహినే సునేత్ర పర్ణ భుాషణే
మహా సువిద్య గాన వాద్య మాల సుాత్ర ధారిణే
అకా రుకార గద్య పద్య   అక్షర స్వరుాపిణే.
సు శబ్ద వాక్తరంగ  శాస్త్రమంత్ర మాన్య రుాపిణే 
నమొా సమస్త వాగ్మయేన నంత విశ్వ వ్యాపినే ॥

గురు స్తుతి :
----------
అనేక శాస్త్ర మంత్ర సార వేద విద్య పాననం
ధరేణ దివ్య దేవతా స్వరుాప గర్వ కారణం.
సబ్రహ్మ విష్ణు ఈశ రుాప ధర్మ మార్గ కామనే
సదా స్మరామి గుర్వరం నమామి పాద పంకజం ॥

జయంతనంత జ్ఞాన పాన బ్రహ్మ పుత్ర పాహిమాం
దయాబ్ది సార తత్పరం గుణాబ్ది జ్ఞాన బోధనం
అనంతవాగ్విచక్షణాయ నంత సత్య మానసం 
సురాసురేశు గుర్వరం   నమామి పాద పంకజం ॥

సురాసురేంద్రవంద్య మాన సుాక్ష్మ సాదు దృక్పథం 
బృహస్పతాది దేవ వంద్య వాగ్విచక్ష సుందరం
సుసర్వవేదనన్త విద్య విద్వరాయ తేనమొా
సుబ్రహ్మ పుత్ర  పుాజ్యనే బృహద్రథాయ వందనం  ॥

గణావిశిష్ట శోభితం   గురుావరాయ మంగళం 

***************

పాదపంకజం  వరబ్జనేత్ర కుబ్జ రుాప సజ్జనా 


సహిష్ణు జిష్ణవే శివం  బహిర్దశాది రుాపకం
భయానకం ధరంప్రభుం ధరిద్ర నాశకం శుభం ॥
********
రిద్ధి సిద్ధి బుద్ధ మంత యొాగ యొాగ కర్మణే  
అపఆర్వజన్మ పాప నాశ పితృ దోష వారిణే
ధనాది  మాన్త ధాన్య ప్రాప్త  సకల ముక్తి సాధనే
వేద సంస్ృతి ఫేస్ బుక్ లో గణపతి గురించి...మ


సమర్ధ దివ్య సిద్ధ హస్త సాధు సజ్జనావనే 
సప్త కోటి బీజ మంత్ర గుప్త యొాగి పుాజనే
సువాంచ కల్ప సార వృక్ష రాజ  మంత్ర సారనే

 అరుాపకాయనాదిపుాజ్య వారధీశ వందనం 
 సుధర్మ కర్మ సంస్థాపనాది కార్య కారణం
అనిర్వికారపార సర్వ కాల కాలతే నమొా
గణప్తి బీజ అక్షరే గుణేశ జ్ఞాన సర్వనే.॥

ధర్మ గ్లాని సంభవాది దుష్ట శిక్షణ స్వయం 

అనాది నాధపా రబ్రగ్మ కర్మ నెరదమా 

సువాంఛ కల్ప కాతరుావరే సు కాంచనావనే
ప్రధామ దైవ మే గుణే సుధామనోజ్ఞ కామనేల


జంగమేశ్వర స్తోత్రం.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర 
పద్యము : మత్త కోకిల 


జంగమేశసు  భస్మ భుాషణ  
జన్మ మారణ  కారకా
అంగ మార్ధగనంబ నేలిన  
ఆది భిక్షుడ వీవయా
లింగ కారుడ  శృంగ పుత్రిసు 
శీల పార్వతి నాధుడా 
సంగమేశ్వర  గంగ ధారుడ  
సాధు సన్నుత కావరా ॥

లింగరుాపసు భక్త పోషక 
లీల కార్య విశేషకా ॥
జంగమార్చిత భస్మ భుాషణ 
జ్ఞాన ధార త్రినేత్రకా॥
అంగరంగసు వైభవార్చిత--
ర్ధాంగి పార్వతి నాయకా॥
సంగమేశ్వర వాస సంగమ
కార్య ముక్తి ప్రదాయకా ॥

జంగమేశ్వర  భిక్షు డైతివె 
జాగమేలిన లింగమా ॥
గంగ నెత్తిన దాల్చినా శివ
గావు శక్తిసు  భాంగమా ॥
అంగ మార్ధగ  నంబ కిచ్చిన 
శృంగ తేజసు లింగమా ॥
గంగ ముాడగు సంగమంబున
మొాఘ మొాక్షసు ధామమా॥




పద్య ప్రక్రియ :  మత్త కోకిల.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
జిల్లా  : కల్యాణ్ : మహారాష్ట్ర 

అంబ ఈశ్వరి ఆది శక్తివి అందు కోనుతి  శాంకరీ
శుంభ దైత్యుని భంజనీ ప్రియ శంభు మొాదిని పార్వతీ
శంభు రాణివి ,సార పుాజలు సాధ్వి జేతు సుమంగళీ
గుంభ నమ్ములు నీదు మాయలు గుమ్మ  శ్రీ"గిరిజా"త్మనే॥ ॥ 

బిందు రుాపిణి "శైలజా"ఘని బంధ మొాచని పావనీ
ఇందు లోచని ఇందిరా సఖి  ఈశ్వరాఖిల మొాదినీ
గంధ లేపని  పాప నాశినిగంధ హార సుభుాషిణీ ॥
మంద గామిని దుర్గ హారిణి మంత్రమాతృక మొాదినీ॥

భామ సుందర భుాషితాంగిని  "హేమజా"మర నాయికా॥
కామరుాపిణి కాంత కౌళిని కాల రుాపిణి  కాళికా
శ్యామ సుందరి సార సుస్వర స్వాదు మంజుల గాయికా 
కోమ "లాగజ" గామి నీసతి పార్వతీ పర దేవతా ॥ 

కోమలాంగి దశావతారిణి  కోటి సుార్య ప్రకాశినీ
భామ దుర్గతి నాశినీ నమొ పార్వతీ పరమేశ్వరీ ॥
కామకార్య విలోలినీ శివ కామినీ వర దాయినీ
ధామ శ్రీపుర వాశినీ భవతారిణీ సింహ వాహినీ॥


****************************************


శ్రీల నిచ్చెడు  వేల్పు తల్లివి   శ్రీనికేతని  మానినీ
వేల పుాలను జుట్టు వేడుక   వెల్గు సుందర హాసినీ
జేల జేతుము మేలు జాతర  వేళ వేద్యము నీకిడీ
శీల బంగరు బాట చుాపెడు బాల రాజ రజేశ్వరీ ॥
శ్రీగజ గామినీ ॥

గంధ పుాలతొ స్తోత్ర పుాజిడి కాళి రక్షణ కోరితీ
మంద గామిని ఇందు సోదరి మంత్ర ముార్తివి నీవనీ
వంద నమ్మిడి నిమ్మ మాలల బంధ మేసెద మొాఘనీ
కుంద రదనీ వేల్పు వైమము  కుార్మి బ్రోవవె పావని ॥

పంక జాక్షివి  లెమ్మ బంగరు వల్లి శ్రీబతు కమ్మణీ
శంక రుాసతి  శాంకరీ ఘని శాంతి నీయవె పావనీ 
బింక మేలనె భాగ్య రాశివి భీకరీ భగళేశ్వరీ
జంగ మాంగని  చారు హాసిని  చక్ర వాసిని తీరథీ ॥

రమ్మ నంటిని రాగ దేలనె రమణి శ్రీహరు కామినీ
నమ్మి వేడితి నమ్మ  శాంభవి అమ్మి ఆపద బాపవే
అమ్మ చేకొను వందనమ్మిదె  ఆర్తత్రాణ పరాయణీ 
లెమ్మ తొమ్మిది రుాపు లెత్తిన కొమ్మ అందుకొ ఆరతీ॥

ప్రక్రియ : మత్త కోకిల పద్యసుమాలు.

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .



1.
భాగ్యరాసివి కోమలీజయ భామ దివ్య  ప్రకాశినీ
యొాగ్యదాయినమొాఘ మంత్రసుయొాగినీ హితకారిణీ
ఋగ్య జుర్విధ సామ గానస్వ రుాపి సుందర గాయకీ
అర్ఘ్య పాద్యసు పుాజితే పర మార్ధ మొాక్షకరీశ్వరీ॥
2.
వ్యాఘ్ర వాహిని ధుామ్ర లోచనవ్యాజ కరుణా లోలినీ
శీఘ్రమేవ ప్రసీద పార్వతి  శీతలాంబసువాసినీ ॥
ఉగ్ర రుాపిణి ఇక్షు దండకరీ  ఉమాభవ తారిణీ
అగ్ర గామిని ఆది భిక్షుని అర్ధ భాగిని అమ్మణీ ॥  
3.
వేదవందిత పుార్ణ జ్ఞాన సువేత్తి వేదపరాయణీ
కాదిహాదిసు మంత్రమానిని కాలరుారిణి చిద్ఘనీ
సాదిశక్తి సుధామినీఘన శాలినీ హరు కామినీ 
మొాది నీఘన సార సుందర మొాఘ మంజుల భాషిణీ
4.
గంధమాలిన మేయశక్తిసు గాత్రి సుార్య ప్రకాశినీ
బంధమొాచని ఘొార నాసిన పారశక్తి స్వరుాపిణీ మందహాసిని ఇందులోచని మాతహంససువాహినీ ॥
వందనమ్మిదె బిందుమాలిని  వారి జాక్షికరాస్త్రిణీ॥
5.
దివ్యజ్ఞాన ఖనీ సుహాసిని దీన దైన్యసు పోషిణీ
భవ్య సుందరి తారకాసుర భంజితాఖిలపాలినీ
నవ్య రుాపిణి నాట్యమంజుల నాదబిందుకళాత్మనే
కావ్య రుాపిణి గాన మొాదిని కామ కోటి విలాసినీ॥
6.
నిత్య నిర్మల చక్ర స్వామిని  నిర్మలాశ్రిత పోషిణీ
సత్య వాదిని గుప్త యొాగిని సజ్జనాహిత కారిణీ 
అత్య నంతసు తీర్థ వైభవ అగ్ని తేజ ప్రకాశినీ
ప్రత్య భిన్న పరాయణీ వర ప్రకృతీపర మేశ్వరీ ॥




*********

॥ఓం శ్రీం హ్రీం క్లీమ్ క్లౌమ్ గం గణపతయే
వరవరద సర్వ జనంమే వశమానయస్వాహా.. ॥
సభిన్న మంత్ర గాయత్రి బీజ మంత్ర  పుాజితే
సపంచకాదశే ఘమొాఘ బీజ మంత్ర స్తుాయతే
సపీతవర్ణ క్షేత్ర పాల వందనం గణాధిపే   ॥
 క్ష మస్వ రుాప కుబ్జకా క్షరాక్షరాత్మకం భజే 

Tuesday, October 25, 2022

శీర్షిక :" పిల్లి." హాస్య కధ

23/10/2022

గోదావరి రచయితల సంఘం
మరియు
నేను సైతం Tv ఛానల్ వారు నిర్వహిస్తున్న.

దీపావళి హాస్య కథల పోటీ కొరకు..


శీర్షిక  :  ఆరు నెలల తర్వాత ....

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .

రఘు కళ్ళార్పకుండా ఆ అమ్మాయిని చుాస్తున్నాడు
అబ్బ !  ఎంతందంగా ఉందీ...
పేరు మాధవి కదుా....
పేరుకుాడా చాలా బాగుంది...
మనసులోనే తలుచుకుంటుా ఆనందపడిపోతున్నాడు 
 రఘు.
 పిల్లలిద్దరుా ఒకరినొకరు ఇష్టపడ్డారు..
 మరి మనం మిగిలిన విషయాలు మాట్లాడుకుందామా..  అంటుా  రఘు వాళ్ళనాన్నగారు అనడంతో వారంతా  ఆ మిగిలిన విషయాలు మాట్లాడుకోవడంలో బిజీ ఐపోయారు .
 మాధవి రఘులకు ఏంచెయ్యాలో తెలియడం లేదు .
 అలాగని మౌనంగా కుార్చోలేకపోతున్నారు.
 ఇంతలో వెనకాతలనుండి" మియాఁవ్ " అన్న అరుపు వినిపించింది. రఘు అటువైపు చుాసేడు. నాలుగు పిల్లిపిల్ల లు ఒక దానివెనక ఒకటిగా నిల్చొనున్నాయి.
  వెంటనే మాధవి చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతుా...
  "అవి మా పియ్యిపియ్య "...లే .
  అవి న్నొదిలి అస్సలు ఉండలేవు. 
  నేనుా..అంతే..అంటుా...వాటి వైపు పరిగెత్తింది.
  రఘుకి ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు..
  మాధవి ఏమంది...ఎవర్ని వదిలి ఉండలేదు.
  తనకైతే" పిల్లి పిల్లలు "తప్ప మరేమీ కనపడేలేదే...
  తనేంటందబ్బా....
  అనుకునే లోపలే మాధవి 
  రఘతో ఇదుగో ఇదేనా ఫేవరెట్ "పియ్యి."
  ఇవన్నీ దాని "పియ్య యే."..అంటుా ఆనందంగా  
  చెపుతోంది.
  రఘు చాలాసేపు ఆలోచించగా..మాధవి  " పిల్లి పిల్ల "లకు బదులుగా "పియ్యి పియ్యలు "
  అంటున్నాదని.
  మరుక్షణం అతనికి నవ్వాగలేదు.
  అతను అలా నవ్వుతుాంటే మాధవికి ఏం అర్ధంకాలేదు. 
  ఎందుకండీ నవ్వుతున్నారు అంటుా బుంగముాతి పెట్టి అడిగింది. 
  రఘు తనను తాను కంట్రోల్ చేసుకుంటుా మాధవి తొందరలో  ఏమందో చెప్పేడు నవ్వుతుా..
  మాధవి ముఖం చిన్నబోయింది . కొంత సేపటికి తమాయించుకొని...నేను తిందరలో అలా అనలేదండీ
  మీరు విన్నదే కరక్ట్ ..నాకు అలానే 
  చిన్నప్పటునుండి అలవాటైపోయింది. పెద్దైనా  పిల్లి అన్న ఆ ఒక్క మాట మాత్రం  అలానే వస్తుంది అంటుా తలొంచుకుంది. అసమె కళ్ళ ల్లో వచ్చిన కన్నిుటి పొరను చుాసిన రఘు చలించిపోయాడు.
  వెంటనే ఆమెను ఊరడిస్తుా అయ్యొా అలాగెలా అలవాటైందండీ ..
ఇంత చక్కగా మాట్లాడుతుా  ఆ ఒక్కటీ..మాత్రం...ఎలా...
అంటుాండగానే మాధవి చిన్నగా నవ్వుతుా..
ఇలా చెప్ప సాగింది.
అప్పడు నాకు పదిహేనేళ్ళనుకుంటాను .
మా పెద్దమ్మకి  కొడుకు అంటే నాకు తమ్ముడన్నమాట..
వాడు చాలా అందంగా చురుగ్గా ఉండేవాడు.
అదే ఊరిలో మాపెద్దమ్మ కుాడా ఉండడం ..నా టెన్త్ క్లాస్ ఐపోయి నేను ఖాళీగా ఉండడంతో  వాడు పుట్టిన దగ్గరి నుండి వాడిని ఆడిస్తుా   మా పెద్దమ్మ దగ్గరే రోజంతా ఉండేదాన్ని. 
అలా వాడు కుాడా  నా దగ్గరే బాగా ఉంటుా..నేను క్షణం కనబడకపోతే  ఏడుపు ఆపేవాడుకాదు.
అలా నా చేతుల్లో పెరిగిన వాడు  వచ్చీరాని చిన్న చిన్న మాటలాడుతుాంటే వాడితో నేను కుాడా అలాగే
మాట్లాడుతుా ఆనందపడేదాన్ని .
వాడికి ముాడేళ్ళ వయసులో అనుకుంటాను..మా వీధిలో  ఉన్న పిల్లి వాళ్ళింట్లో ఆరు పిల్లల్ని  పెట్టింది.
దాంతో వాడికి నాకుా కుాడా ఆ పిల్లి పిల్లలతో 
రోజంతా ఆడుకోవడంతో అవే మా ప్రపంచం ఐపోయాయి.

వాడు ముద్దు ముద్దుగా అక్కా "పియ్యి పియ్యయు
చుాపీ "  (పిల్లి పిల్లలు)...అంటుాంటే  నేనుా వాడినే ఇమిటేట్ చేస్తుా రాను రాను అదే మాటకు అలవాటు పడిపోయేను.
వాడికి చాలా సార్లు నేర్పడానికి ప్రయత్నించేనుకుాడా.
కాని అన్ని మాటలుా వచ్చినా , వాడు పిల్లి పిల్లలు అన్న మాట మాత్రం అనలేకపోయేవాడు.
వాడికి ఆరు ఏడేళ్ళు వచ్చేదాక వాడలాగే అనేవాడు.
దాంతో నాకు పిల్లి పిల్లలకు బదులు వాడన్నట్టే " పియ్యి పియ్యయు " అని 
అనడం అలవాటై..పిల్లులంటే కుాడా ఇష్టం ఎక్కువై
వాటిని పెంచుతుా...ఆడుతుా ఇదిగో ఈ రోజు మీముందు బయట పడిపోయాను. 
ఏమిటో పిల్లిని చుాడగానే అది " పిల్లి "  అని తెలిసి ..
అనగలిగి కుాడా ఆసమయానికి "పియ్యి" అని నాకు తెలీకుండానే వచ్చేస్తుంది.. అంటుా బాధగా తలొంచుకుంది.

రఘుకి ఒక పక్క నవ్వువస్తున్నా మరో పక్క మాధవికున్న ఈ ఆలవాటువల్ల  తను తన స్నేహితుల లో నవ్వులపాలౌతానేమొా నన్న భయం కుాడా పట్టుకుంది. ఐతే ఈ విషయాన్ని పట్టుకొని  తను మాధవిని కుాడా వదులుకోలేడు....ఆలోచిస్తుా
అతను ఆ తరువాత అన్య మనస్కంగానే 
సమయంగడిపేడు. 
************
పెద్దల నిర్ణయం ప్రకారం మాఘమాసంలో తమ వివాహానికి అంగీకారం కుదిరింది.
రఘుకి ఇంటికెళ్ళిన తర్వాత కుాడా ఈ విషయం 
సమస్యగానే అనిపించింది. మర్నాడు తన బాల్య స్నేహితుడైన రవికి తన బాధ చెప్పుకున్నాడు.
రవి భార్యా పిల్లలతో బెంగుళుారులో ఉంటున్నా 
నెలకొకసారైనా తన తల్లిదండ్రులని చుాడడానికని 
హైదరాబాదు వస్తుానే ఉంటాడు.
ఆరోజు రఘు చెప్పిన మాటకు రవి చిన్న సలహా చెప్పేడు.
మాధవికి ఆ మాట అలవాటుగా వచ్చింది కనుక 
తమ పెళ్లైనంతవరకు తను మాధవికి" పిల్లి పిల్లలు "
అన్న పదం  స్పష్టంగా  అన్నంత వరకు ట్యుాషన్ తీసుకోవాలన్నది రఘు చెప్పిన మాట.

ఇదేదో బాగానే ఉందనిపించింది రఘకి.
ఈ మిషతో తను మాధవిని  రోజుా కలవవచ్చన్న 
ఆనందంతో రవి మాట వినడానికి రఘు రెడీ అయ్యేడు.
********
సమయం గడుస్తున్నాది .మాఘమాసం వచ్చేసింది .
వివాహ ముహుార్తం కుాడా దగ్గరపడింది.
ఇప్పుడు మాధవి స్పష్టంగా మాట తొందరలో కుాడా "పిల్లి" అన్న పదాన్ని చక్కగా  అంటున్నాది . ఇద్దరుా హమ్మయ్య అనుకున్నారు.

పెళ్ళికి తన స్నేహితులందర్నీ పిలిచాడు రఘు.
మాధవి అందం చుాసి చాలామంది అసుాయపడడం గమనించి గర్వంగా నవ్వుకున్నాడు రఘు.
భోజనాలు చాలా గ్రేండ్ గా అమర్చేరు మాధవి
పేరెంట్స్.
అందరుా భోజన సదుపాయాల్ని ఱుచులనీ 
పొగుడుాతుా తింటున్నారు.
ఇంతలో  ఎవరి పిల్లాడో... కెవ్వుమన్నాడు.
రఘ అటు వైపుగా చుాసి ముసిముసిగా నవ్వుకున్నాడు. అక్కడ తమ పెంపుడు పిల్లి , పిల్లలతో
కలిసి కింద పడిన తినుబండారాలను తింటుా  
అందరనీ రాసుకు తిరుగుతున్నాది.
దాంతో చిన్న పిల్లలు  భయంగా అరుస్తున్నారు. అదీ సంగతి.

వెంటనే రఘు తన స్నేహితులతో నవ్వుతుా..
"అది మా పియ్యిపియ్యయేరా".. ఏమీ చెయ్యవు..
అంటుా అటుగా వెళ్ళేడు.

స్నేహితులు వారితో పాటు మాధవి కుాడా ఒక్క క్షణం తెల్లబోయి వెను వెంటనే పకపకా నవ్వసాగేరు.

 మాధవి  నవ్వుతుా రవి వేపు చుాసింది.విషయం తెలిసిన  రవి నవ్వుతుా  "కొన్ని నెలల సహవాస ఫలితం మరి వారు వీరౌతారుగా"...అంటుా మాధవి నవ్వుకు జత కలిపేడు .
 తనను చుాసి ఎందుకంతలా నవ్వుతున్నారో... అర్ధం కాని రఘు మాత్రం .బిక్కముఖం వేసుకొని తను కట్టుకున్న  పంచవేపు చుాసుకుంటుా సవరించుకుంటున్నాడు. అదిగానీ ఊడిపోయిందా..అందికే అందరుా నవ్వుతున్నారేమొా అనుకుంటుా.....


సమాప్తం.




  
  
 

Tuesday, October 18, 2022

వేంకటేశ్వర అక్షర లక్షల సంకలనం లో

అయ్యా ! 
ఈ - సంకలనం 
వచన కవిత్వం లో 
108 సరస్వతి పుత్రులతో 
సరస్వతి స్వరూప కవయిత్రులతో 
సంకలనం తీసుకు రావాలన్నది 
ఈ ప్రయత్నం 

వచన కవిత్వం - ఈ - సంకలనం 

పద్యాలు 
పాటలు 
రాసేవారు 

 వాట్సాప్ నంబర్కు మాత్రమే పెట్టండి 
పద్య విభాగం 108 
పాటలను 108 
అనుబంధ సంకలనంలుగా చేద్దాం 

అంతా అమ్మ దయ 
అమ్మ మీతో ఏది పలికిస్తున్నదో ఆలాగునే చేద్దాం 
శుభం 
Chebiyyam srinivasarao 
7674055482

Tuesday, October 11, 2022

ప్రయాణం.

శీర్షిక  : ప్రయాణం .
పద్యం : ఆటవెలది.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

నాల్గు దశల పోరు నడిసంద్ర మునహోరు
నచ్చి నట్టి బాట నడచి రాదు.
జనన మరణ కాల జరుగుబా టులజోరు
పాత్ర లెన్నొ జుట్టు పయన మందు.॥

కష్ట నష్ట ములను కావిళ్ళ లోమొాసి
 బాట ముళ్ళ నడకె బ్రతుకు తెరువు.
 క్షణిక సుఖము కొరకు క్షణము క్షణము పోరు 
నిత్య పయన మిదియె  నింద లేల   ॥

జీవి పయన మిదియె జీవిత చక్రంబు
తిరుగు చుండు నెపుడు తిరుగు లేదు
బురద లోన పుట్టు బుజ్జి కమలమొాలె
బ్రతుక సంత సముతొ, భవిత వెలుగు ॥

జీవితం. కవిత.

శీర్షిక : అనుభవాల బాటలో....

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .



పుాలున్న చోట ముళ్ళుకుాడా ఉంటాయి.
సంతోషం వెనకాతలే దుఃఖం కుాడా ఉంటుంది.
కష్టాల కడలిలో పయనించే ఒడిదుడుకుల నావ
చుక్కాని ఆసరాతో తీరం చేరుకుంటుంది.॥

ఆడుగడుగున పోరాటానికి ఆత్మస్థైర్యం తోడుగా
నీలో నిండే అసంతృప్తికి  ధైర్యమే నీ తోడుగా..
అచంచలమైన ఆత్మవిశ్వాసం  నీవెంటే నీడగా
కదలిపో !ముందుకు కారడవైనా। భయమెందుకు ?॥

అసంతృప్తి ఎడారిలో ఆగని నడకే
చేరుస్తుంది  నిన్ను  నీ గమ్యానికి.
ఎండమావి తళుకులే నీ గెలుపుకు అందమైన ఆరంభమై  గెలిపిస్తాయి నీ ఆశయాలని   ॥

మబ్బులు నిండిన ఆకాశంలో 
కొన్ని కోట్ల నక్షత్రాలు మిణుకు మంటాయి.
నిరాశ నిండిన జీవితంలో తోడైన బంధాలు
 ముళ్ళ బ్రతుకు బాట చివర పుాలై వికసిస్తాయి ॥

వికసించిన పుాలపరిమళం గాలిలో కలిసి
సుదుార తీరాలకు గంధమై  వ్యాపిస్తుంది.
అనుభవాల అలలలో తడిసిన వారిని
జీవితాశయం తోడై ముందుకు నడిపిస్తుంది ॥
-------------



అమ్మొారి బోనాలు.

శీర్షిక : అమ్మొారి బోనాలు. 
ప్రక్రియ : ఇష్టపది .

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .



అమ్మలగన్నమ్మలు ఆది పరాశక్తులు
ఆట పాటకు మురియు అందరి కొలువమ్మలు ॥
గ్రామాలను గాచే గ్రామ దెేవతలుగా
 ఊరి పొలిమేరలో ఉండేటి దేవతలు  ॥
 
 తర తరాల పుాజలు తల్లికిడు బోనాలు
 ఊరంత పరవళ్ళు ఉత్సవపు సందళ్ళు ॥
 అష్టోత్తర పుాజలు అమ్మకిడు హారతులు
 నీరజా నేత్రికీ నిత్యకల్యాణాలు .॥

వేప కొమ్మల నీడ  వెలసింది  దుర్గమ్మ 
వేల పేరులతోటి  వేంచేసె దుర్గమ్మ.॥
పేరు పేరున భయము పెకిలించు మాయమ్మ 
మహిమలున్నది తల్లి మా యింటి వేల్పమ్మ ॥

పసుపు ముద్దగ తల్లి పంచె మంగళములను
కరుణ నిండిన కనుల గాచేను పల్లెలను
వత్సరముకొకసారి వచ్చేటి మాయమ్మ
వందనము లిడి కొలువ వచ్చేము మేమమ్మ ॥

మా కష్ట నష్టాల  మము గాచినావమ్మ
మాపిల్ల పాపలకు మంచి చేయగ కొమ్మ
బోనాల నెత్తేము భోగ భాగ్యాలమ్మ 
ఆరగించవెతల్లి  అమ్మ మాంకాళమ్మ ॥

అందాల తల్లికీ  ఆట పాటలతోడ 
ఆనంద పరచంగ ఆజ్ఞ కోరితిమమ్మ
రంగు రంగుల పుాల రాసి రాట్నాలమ్మ
వేడ్క  విందులు గొనుమ వేగ వల్లుారమ్మ

పసుపు కుంకుమలద్ది  పారాణి నదె దిద్ది
పచ్చ చీరను జుట్టి  పులకరించితిమమ్మ
 మా పాపముల గావు మా మజ్జి గౌరమ్మ
 మంగళమ్ములనిడవె  మాత మహలక్ష్మమ్మ  ॥

సుార్య చంద్రుని కళల సుక్క ఇరుకళలమ్మ
మావుారి దేవతగ మసలు మావుళ్ళమ్మ
తలచు కోర్కెల దీర్చు తల్లీ తలుపులమ్మ 
పసుపు గౌరిగ మమ్ము  పాలించరావమ్మ ॥

అర్ధనారీశ్వరీ అమ్మ అంకాళమ్మా
మా సీమ గాచేవు  మంచిగ శీతలమ్మ
సమ్మక్క సారక్క శక్తి  నాంచారమ్మ 
పాడి పంటలు గాచు  బంగారు బతుకమ్మ॥

 ఎల్లమ్మ పోలమ్మ  ఏలు నుాకాలమ్మ
మంచి ముత్యాలమ్మ మాతల్లి మరిడమ్మ
మాత అంకాళమ్మ మా పైడి తల్లమ్మ
మాత ఈశ్వరి కరుణ మా పైన చుాపమ్మ ॥


**************************************
హామీ : 
పై ఇష్టపదులు నా స్వీయ రచనలు.
*****************************

Sunday, October 9, 2022

అత్తయ్యగారు.

పవిత్ర పర్వమైన  "శ్రీరామ నవమి" రోజున శివైక్యం చెందిన ధన్యులు మా అత్తగారైన ఈశ్వరమ్మగారు.


ఆశ్వ యుజ శుద్ధ పాడ్యమి....
మా అత్తయ్య ఈశ్వరమ్మగారి "జయంతి"
సందర్భంగా రాసిన కవిత.


రచన :   వారి  పెద్ద కోడలు ,
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.

పుాచిన ప్రతీ పుావు పరిమళించదు.
పరిమళించిన పుాలన్నీ పుాజకు నోచుకోవు.
అలాగే పుట్టిన ప్రతీ  జన్మ సార్ధకమవదు.
మరణించిన ప్రతీ జీవికి అమరత్వం లభించదు ॥

బ్రతుకంతా ఆనందం. ఆనంద చింతనలో, ఆధ్యాత్మికం.
ఆధ్యాత్మికతలో ఆలాపనం అదే స్వర, రాగ, లయలకు నిలయమైన సంగీతం .. ఆమె దినచర్యకు ప్రారంభం , సంగీత సాహిత్యాల సమ్మేళనం .॥

హరికథా శిరోమణిగా  అందెవేసిన ఘనం ॥
సంగీతంతో పాటు భక్తి నిండిన సాహిత్యం .
అవే అమె రచనలకు ముాలం .
అదే ఆమె జీవిత పరమార్ధం .॥

నిత్య పుాజగా పద్య, గద్య , రచనల సమాహారం .
భజనకీర్తనలతో భగవంతునికారాధనల వేద్యం.
గురుమాతగా కీర్తికెక్కిన వైభవం.
పాదపుాజలు ,పురస్కారాలతో బిరుదు సన్మానం ॥

పెద్దకోడలిగా నాకు దొరికిన గౌరవ‌ ఫలం .
మరుదులు, ఆడబిడ్డల ప్రేమానురాగం.
అమ్మ తరువాత అమ్మగా నా కందిన వరం .
నా తల్లిదండ్రుల అనందానికైన కారణం ॥

వేల పుస్తకాల గ్రంధాలయం మా గృహం.
అత్తయ్యగారు ఆలపించిన గీతాలతో పావనం.
108 సార్లు గావించిన రామాయణ గ్రంధ పఠనం.
అన్నదానాది  శాంతి హోమాలతో  దారపోసిన 
పుాజా ఫలం, మా దంపతులు చేసుకున్న
జన్మ జన్మల పుణ్య ఫలం ॥॥

దశరా పండగ మొదటి రోజు ప్రాశస్త్యం  "
 అత్తయ్యగారి జన్మదినానికి" నిదర్శనం .॥
 అత్తయ్యగారి జయంతోత్సవం ..
మము వీడని  మధురమైన జ్ఞాపకం.॥

తొమ్మండుగురు పిల్లలకు తల్లిగా 
పంచిన ప్రేమకు  95 వత్సరాల వసంతం.
శ్రీ రామనవమి రోజు మా అందరినీ వదలిన బంధం  
శివైక్యం చెందిన అత్తయ్యగారికి  పాదాభివందనం ॥

ఆమె పాటలకు, రచనలకు ఊపిరిపోసిన సంతానం.
ప్రతీ రోజుా సంగీత - సాహిత్య చర్చలతో మా కుటుంబం॥
ఎప్పటికీ  తరగని ప్రేమామృతాల ఉమ్మడి కుటుంబం.
అత్తయ్యగారి ఆశీర్వాదమే నేడు మా అందరి బలం .॥








బాల సాహిత్యం ...గాంధీతాత

బాల సాహిత్యంలో  ..
అంశం : గాంధీ తాత .

శీర్షిక : గాంధీ తాతాకు వందనము.
ప్రక్రియ : గేయ కవిత.

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.


చిట్టి పొట్టి చిన్నారి పిల్లలము
గాంధీ తాతాకు వందనము.॥
స్వ భారత మాతకు బిడ్డలము.
భవిత చరిత నిలబెట్టెదము ॥చిట్టి ॥

అక్టోబరు నెల రెండవ తేదీన..
పోరుబందరులొ పుట్టెేడు .
సీమ చదువుకై వెళ్ళేడు..
బారిష్టరుయై వచ్చేడు॥ చిట్టి ॥

కరంచందు మరి పుత్లీబాయిల
పుణ్య ఫలము మన గాంధిజీ ॥
కస్తుారీబా  సహచరిణినిగ...
నలుగురు పిల్లల తండ్రోయి ॥చిట్టి॥

ఆంగ్లేయుల పరిపాలనలో
అవమానితుడై నిలిచేడు
జాతి బేధములు వలదు వలదని 
నాయకుడై పోరాడేడు ॥ చిట్టి ॥

అస్పృశ్యత, కులవివక్షతలు మరి
మతవిద్వేషాల మార్పులకుా
సత్య- అహింసా-శాంతి బాటలో-
సత్యాగ్రహములు సలిపాడు ॥చిట్టి ॥

హిందుా , ముస్లిమ్, సిక్కు, ఇసాయిలు
భాయుా భాయని  అన్నాడు .
జాతి భేదములు చుాపించొద్దని
సమైక్యతకు విలువిచ్చాడు ॥  చిట్టి ॥

దేశ విభజనను వ్యతిరేకించీ
 తీవ్రగతిని పోరాడేడు.
ఆమరణపు దిశ నిరాహారుడై 
దీక్షను ప్రారంభించేడు ॥ చిట్టి ॥

కొల్లాయి కట్టుకట్టి 
వెదురు కర్ర చేత బట్టి
నుాలు వడకు నట్టి మేటి
"జాతిపిత"యె గాంధీజీ ॥

మొాహన్ దాస్ కరంచంద్ ఘన
స్వాతంత్ర్యముకై పోరిడి
శాంతి బాటలో ఉద్యమించతడు
కీర్తిని ,చరితలో నిలచాడు॥ చిట్టి ॥

స్వాతంత్ర్యము మన కిచ్చాడు
తుాటాలకు బలియయ్యాడు.
"సత్యమేవ జయ జయతే" యనుచుా
తన ప్రాణాలను వదిలాడు.॥ చిట్టి ॥

సత్యశోధనకు అంకితమౌ మన 
బాపుాజీకీ జై కొడదాం .
మువ్వన్నెల ఘన పతాక కీర్తిని
ఐక్యమత్యముతొ నిలబెడదాం ॥ చిట్టి ॥



Saturday, October 8, 2022

పొర్ల వేణుగోపాల్ గారి రచన (బాల సాహిత్యం ).

*మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
తేదీ: *08-10-2022-శనివారం*
అంశము: *బాలసాహిత్యం(న గుణింతం)*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *నింగికి నిచ్చెన వేస్తాం!*
ప్రక్రియ: *బాలగేయం*
*********************
*నవతరానికి వారసులం!*
*నవోదయానికి భాస్కరులం!*
*నవయువ శక్తిని చూపిస్తాం!*
*నవలోకమునే సృష్టిస్తాం!*

*నాకమునంటే నవ ఋషులం!*
*నాగరికతకే ప్రతినిధులం!*
*నాన్నకు అమ్మకు ముద్దొస్తాం!*
*నాలుగు దిక్కులు చుట్టేస్తాం!*

*నింగికి నిచ్చెన వేసేస్తాం!*
*నిలబడి జగతిని శాసిస్తాం!*
*నిప్పురవ్వలను కురిపిస్తాం!*
*నిగ్రహమెంతో చూపిస్తాం!*

*నీతి, నిజాయితీలను గెలిపిస్తాం!*
*నీటివనరులను రక్షిస్తాం!*
*నీ-నా భేదం తుడిచేస్తాం!*
*నీపై ప్రేమను కురిపిస్తాం!*

*నురగల తరగల కెరటాలం!*
*నున్నని బుగ్గల పసివాళ్ళం!*
*నువ్వు- నేనులను కలిపేస్తాం*
*నుదుటి రాతలను మార్చేస్తాం!*

*నూతన శకమును సృష్టిస్తాం!*
*నూరిన కత్తులు విరిచేస్తాం!*
*నూర్చెడి రైతును రక్షిస్తాం!*
*నూటికి నూరు సాధిస్తాం!*

*నృప పదవులనధిరోహిస్తాం!*
*నృశంసలను పరిహరియిస్తాం!*
*నృత్యగానములు నేరుస్తాం!*
*నెమళ్ళ వలెనే నర్తిస్తాం!*

*నెమ్మదిగా అడుగులు వేస్తాం*
*నెలవంకను భూమికి తెస్తాం!*
*నేర్పిన గురువులనర్చిస్తాం!*
*నెత్తిన పెట్టుకు పూజిస్తాం!*

*నేడీ లోకం మా సొంతం!*
*నేర్చిన జ్ఞానము హిమవంతం!*
*నేర్చుకోవల్సినది అనంతం!*
*నేర్చుట కొఱకే మాపంతం!*

*నైతిక విలువలు మా సొంతం!*
*నేర్చిన విద్యలు ఫలవంతం!*
*నై.. నై.. అంటే బ్రతుకంతం!*
*సై.. సై.. అంటే సుఖవంతం!*

*నొసటి రాతలను నమ్మద్దు!*
*నోటికి చూపర ఓహద్దు!*
*నౌకకు లంగరు కదముద్దు!*
*నవ్వుతూ బ్రతుకును సరిదిద్దు!*

*నందనవనమే జీవితం!*
*నందుని ఇల్లు బృందావనం!*
*నందనందనులమే మనం!*
*నలుగురితో ఉంటే పావనం!*
*********************
హామీపత్రము: *స్వీయరచన*

భగత్ సింగ్ దేశభక్తి.

అంశం : భగత్ సింగ్ దేశ భక్తి.
రచన : శ్రీమతి పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .

మొలకలు వేసే వయస్సులో 
తుపాకులను మొలకెత్తించాలన్న వ్యక్తిత్వం.
భగత్ సింగ్ లో దేశభక్తి బీజం ॥
విప్లవాత్మక ఉద్యమకారుడు భగత్ సింగ్ .
భారతదేశంలో ఆరంభ మార్కిస్టు.
బ్రిటీషు పాలనకు వ్యతిరేకి.
"విప్లవం వర్ధిల్లాలి" అన్ననినాదం.
ప్రజలలో రగిల్చిన చైతన్యం .
భగత్సింగ్  పోరాటానికి బలం .
స్వాతంత్ర్య సమర యోధునిగా
ఖైదీల హక్కులకై  ఆరాటం. 
భారత ఉద్యమకారునిగా పోరాటం.
సైమన్ కమిషన్‌కు వ్యతిరేకిగా
జీవితకాల దేశ బహిష్కరణ. 
నినాదాలమధ్య  ఉరితీయబడ్డ భగత్ సింగ్‌






మణిపుాసలు

సృష్టి కర్త : వడిచెర్ల సత్యం.

శీర్షిక  : ఆమె

రచన : శ్రీమతి పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .

1.
పుట్టింటి దీపాలు.
అత్తింటికి వెలుగులు.
ఆ యింటి వంశముకు.
జన్మనిచ్చు అమ్మలు ॥
2.
సృష్టి కి ప్రతి సృష్టిని
చేసేది ఆడదని
తెలిసి గౌరవించరు
అవని యామె అబలని ॥
3.
అక్కగా చెల్లిగా
అమ్మగా అలిగా
అన్ని రుాపాలలో
నలరించు నామెగా॥
4.
చదువులో వాణిగా
సిరినిచ్చు లక్ష్మి గా
వేల్పు స్త్రీ రుాపమై
భువి నవతరించెగా ॥
5.
స్త్రీ లేని జన్మేది  ?
పుట్టి గిట్టుటేది..?
ఇలనమ్మ లేనిదే
సృష్టికి తావేదీ .?॥
6.
ఆలిగా  అర్హతలు
అందరికీ సేవలు
ఊడిగపు చాకిరీ
కోడలిగా  బాధ్యతలు ॥
7.
విలువ లేని మనిషిగ
ఆడ దన్న అలుసుగ
వెకిలి చుాపుల వేడ్క.
నంగట్లో బొమ్మగ ॥
8.
శీలముకు విలువిడరు
బ్రతుకుటకు దారిడరు
ఆట బొమ్మగ జేసి
కాముకులు చెలగెదరు ॥
8.
ముందడుగు వేయనీ
చదువులే చదవనీ
సమాన భావముతో
గౌరవించు  ఆమెని ॥
9
పురుషాధిక్యతనీ
పుడమి సమసిపొినీ
అడుగులో అడుగేసి
అతివలను నడువనీ ॥


Friday, September 23, 2022

వ్యాసం

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
*తేదీ*:  *23/09/22 – శుక్రవారం* 
*అంశం*:  *ఐచ్చికం*  
*ప్రక్రియ*: *వ్యాసం* 
*శీర్షిక*:  *ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేధస్సు)*
*కవి/రచయిత*: *యేచన్ చంద్ర శేఖర్*
*ఊరు*:  *హైదరాబాద్*
*ధృవీకరణ*: *అంతర్జాలం మరియు సామాజిక మాధ్యమాలలో వివిధ రూపాలలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రచించిన నా స్వీయ రచన అని ధృవీకరిస్తున్నాను*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేధస్సు)*


ఈ సృష్టిలోని సకల ప్రాణకోటిలో తెలివితేటలు కలిగి స్వతహాగా ఆలోచించడమే కాక తన ఆలోచనలను ఇతరులకు తెలియచేసి వారి ద్వారా పనులు చేయించుకోగలిగిన సామర్థ్యం కలిగిన ప్రాణి కేవలం ఒక్క మానవుడే. కొన్ని జంతువులకు తెలివితేటలు మరియు ఆలోచనా శక్తి ఉన్నప్పటికీ అది వాటి వరకు పరిమితం తప్ప తమ ఆలోచనలను ఇతర జంతువులతో పంచుకుని వాటి ద్వారా పనులు చేయించుకోలేవన్న విషయం మనందరికీ తెలుసు. అయితే మానవుడు తనకన్నా ఎంతో శక్తివంతమైన, భారీ క్రూర మృగాలను సైతం తన తెలివితేటలు మరియు ఆలోచనాశాక్తితో లొంగదీసుకుని, తన చెప్పుచేతల్లో పెట్టుకుని వాటికి శిక్షణ ఇచ్చి పని కూడా చేయించుకోగలుగుతున్నాడు. తనదైన తెలివితేటలతో శాస్త్రసాంకేతికంగా ఎంతో పురోగతి సాధిస్తూ ఎన్నెన్నో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాడు. కొన్ని దశాబ్దాల క్రితమే మానవ మేధస్సుతో ఆవిష్కృతమైన కంప్యూటర్ ఇంతింతై వటుడింతై అన్నట్లు మానవ జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయింది. ఇది అది అని తేడా లేకుండా నేడు కంప్యూటర్ లేని రంగాన్ని మనం ఊహించలేము. కొన్ని ప్రమాదకరమైన, క్లిష్టమైన పనులను చేయడం కోసం ఇప్పటికే రోబోట్ లకు పురుడు పోసిన మానవుడు మరొక అడుగు ముందుకు వేసి విప్లవాత్మక “ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్” (కృత్రిమ మేధస్సు) కు నాంది పలికాడు. డేటా సైన్స్ లో భాగమైన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కంప్యూటర్ లలో ముందస్తుగా నిక్షిప్తం చేయబడిన సమాచారం మేరకు నిర్దుష్టమైన ప్రామాణికతలను పాటిస్తూ పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని అప్పగించిన కార్యాన్ని పూర్తి చేయగలగడానికి మార్గం సుగమమయ్యింది.   

*ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వాడకం ఎప్పుడు మొదలైంది:*
1991 లో మొట్టమొదటి సారి అమెరికా సైన్యం “డైనమిక్ అనాలిసిస్ అండ్ రీప్లానింగ్ టూల్” (DART), అనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రోగ్రాం ను సైనికులు, సరుకు తరలింపు మరియు ఇతర రవాణా సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించింది. స్వయంసంచాలిత ప్రాణాంతక వ్యవస్థలలో భాగాలైన “స్లాటర్ బోట్స్” లేదా “కిల్లర్ బోట్స్” మానవ ప్రమేయం లేకుండా శత్రువులను గుర్తించి మట్టుబెట్టగలవు. కృత్రిమ మేధస్సు సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ ఆయుధాలు ప్రతికూల వాతావరణంలో ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా సైనికులు ఏక కాలంలో బహుళ కార్యాలను నిర్వహించగలిగే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.  ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, భౌగోళిక విశ్లేషణతో కలిసి సంయుక్తంగా పనిచేస్తూ వివిధ  ఆయుధాలతో అనుసంధానించబడిన రాడార్లు మరియు ఇతర ఉనికిని కనిపెట్టే వ్యవస్థల ఆధారంగా చట్టవ్యతిరేక, అనుమానాస్పద కార్యకలాపాలను పసిగట్టి సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సైనిక దళాలు అధునూతన సాంకేతిక పరిజ్ఞానం సముపార్జనలో భాగంగా అభిజ్ఞాత్మక రాడార్, 5జి సెల్యులార్ నెట్ వర్క్, మైక్రోచిప్స్, సెమికండక్టర్స్ మరియు అనలిటిక్ ఇంజిన్స్ లాంటి వాటి కోసం పెట్టుబడులు పెడుతున్నాయి. అంతేకాక ప్రస్తుతం అందుబాటులో ఉన్న లేసర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత మెరుగుపరచడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.  
            
*భారత సైన్యంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్:*
చైనా మరియు పాకిస్తాన్ లతో సరిహద్దులను పంచుకునే మన దేశానికి సర్వత్రా ప్రమాదం పొంచి ఉండడంతో దుర్భేద్యమైన నైసర్గిక స్వరూపం గల ప్రాంతాలను ప్రతికూల వాతావరణ పరిస్థితులలో సైతం కంటికి రెప్పలా కాపాడే బాధ్యతను భారత సైన్యం నిర్వహిస్తుందన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా అత్యంత సునిశితమైన సామర్థ్యంతో పనిచేసే ఎన్నో ఉపకరణాలను వినియోగించి తమ సైనికులు ప్రమాదాల బారిన పడే సందర్భాలను గణనీయంగా తగ్గించగల్గిన అతి కొద్ది దేశాలలో భారత్ ఒకటి. ఊహించని అనూహ్యమైన ప్రతికూల పరిస్థితులలో కూడా సైనికుల సామర్థ్యాన్ని పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దోహదమవుతుంది. ఇది సెన్సార్ల సామర్థ్యం మెరుగుపర్చడంతో పాటు సైనికులకు యుద్ధక్షేత్రంలో రోబోట్ల ద్వారా సేవలందిస్తుంది. చీకటిలో మరియు దట్టమైన ప్రాంతాలలో సాధారణ కంటిచూపుకు కనిపించని ప్రదేశాలలో దాక్కొని ఉన్న శత్రువులను సైతం పసిగట్టడంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపకరిస్తుంది.  ప్రపంచంలో  ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పేటెంట్ హక్కులు కలిగిన పది దేశాలలో భారత్ ఎనిమిదవ స్థానంలో ఉంది. చైనా, అమెరికా, జపాన్ లు మొదటి మూడు స్థానాలను ఆక్రమించగా రష్యా మరియు ఫ్రాన్స్ దేశాలు భారత్ తరువాత స్థానంలో ఉండడం గమనార్హం. సాధారణంగా అత్యధిక భాగం రోబోట్లను పేలుడు పదార్థాల ఉనికిని పసిగట్టడం, వాటిని నిర్వీర్యం చేయడం, నిఘా, తదితర అవసరాల కోసం ఉపయోగిస్తుంటారు. అయితే ఆయుధాలను ఉపయోగించే రోబోట్లు మాత్రం టెలిస్కోపిక్ విధానం ద్వారా పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటాయి తప్ప వాటంతట అవి శత్రువుల ప్రాణాలను హరించ లేవు. రోబోటిక్స్ మరియు సైనిక సాంకేతిక పరిజ్ఞానం పరుగులో ముందంజలో ఉన్న చైనా తాను హెవీ డ్యూటీ రోబోట్ ను రూపొందించినట్లు ప్రకటించింది. దేశ భద్రత దృష్ట్యా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలన్న విషయాన్ని అధ్యయనం చేయడానికి ప్రధానమంత్రి మరియు రక్షణ మంత్రి చొరవతో 2018 లో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ సిఫార్సుల మేరకు కనీసం 75 ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత సేవలను భారత సైన్యం వినియోగించుకుంటోంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ టాస్క్ ఫోర్స్ సిఫారసు మేరకు ఫిబ్రవరి 2019 లో  “డిఫెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కౌన్సిల్” (DAIC) మరియు “డిఫెన్స్   ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రాజెక్ట్ ఏజెన్సీ (DAIPA) లు ఏర్పాటయ్యాయి. ఈ రెండు సంస్థలు భారత సైన్యంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానం అమలుకు అనుసరించాల్సిన విధానపరమైన మార్పుల గురించి అవసరమైన మార్గదర్శనం అందిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన అమెరికా సైన్యం ఆగష్టు 2018 లో టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో  ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానం అమలు కోసం ప్రత్యేకంగా “US ఆర్మీ ఫ్యూచర్స్ కమాండ్” (AFC) ను ఏర్పాటు చేసింది. జూలై 2018 ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రణాళిక ను ప్రకటించిన చైనా, 2030 నాటికి ఈ విభాగంలో ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. పాకిస్తాన్ ఆగష్టు 2020 లో రావల్పిండి లోని చక్లాలా లో “సెంటర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ కంప్యూటింగ్” ప్రారంభించగా, ఆ దేశం మిత్ర దేశమైన టర్కీ “టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్” ను 2018 లో ప్రారంభించింది. 

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానం అమలు ద్వారా భారత సైన్యం ఎలా బలేపెతమవుతోందో రక్షణ శాఖ అధికారులు “ది సండే గార్డియన్” మ్యాగజైన్ తో పంచుకున్నప్పటికీ  భద్రతాపరమైన కారణాల దృష్ట్యా కొంత సంక్లిష్టమైన సమాచారాన్ని మాత్రం గోప్యంగా ఉంచడం జరిగింది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే వివిధ ఉపకరణాలను రహస్య మానవ కార్యకలాపాలు, అనుమానాస్పద వాహనాల కదలికలు (పుల్వామా ఉగ్రవాద దాడి లాంటి ఘటనల నిరోధానికి), పాకిస్తాన్ తీవ్రవాదులు తమ దాడుల ప్రణాలికల గురించి ప్రాంతీయ యాసతో ఉర్దూ, పంజాబీ మరియు ఇతర స్థానిక భాషలలో జరిపే సంభాషణల సారాన్ని విశ్లేషించడానికి అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. గత నాలుగేళ్ళలో రక్షణ ప్రభుత్వరంగ సంస్థల ప్రగతిని పరిగణన లోకి తీసుకున్న భారత రక్షణ మంత్రిత్వ శాఖ మున్ముందు ఈ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఉపకరణాల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచేందుకు మరియు అవసరాలకు అనుగుణంగా సేవలందించేలా సరిపడినన్ని నిధులు కేటాయించి ప్రపంచంలో ఐదవ స్థానానికి చేరాలన్న లక్ష్యం తో ముందుకు సాగుతోంది.      

ఈ సాంకేతిక పరిజ్ఞానంతో భారత సైన్యం ఉపయోగిస్తున్న వివిధ ఉపకరణాలలో క్రింది వాటిని ప్రముఖంగా  పేర్కొనవచ్చు: 

1. స్టార్మ్ డ్రోన్
2. డ్రోన్ ఫీడ్ అనాలిసిస్ 
3. సీకర్ మానిటరింగ్ అండ్ అనాలిసిస్ సిస్టం 
4. మాండరిన్ ట్రాన్స్లేటర్స్
5. “ప్రాజెక్ట్ ప్రిస్మ్ 
6. “ప్రాజెక్ట్ వి-లాగర్” వెహికల్ ట్రాకింగ్ సిస్టం
7. సర్వత్రా పహచాన్ 
8. సైలెంట్ సెంట్రీ
9. ఏఐ బేస్డ్ ఇంటర్ సెప్ట్ మేనేజ్మెంట్ సిస్టం 
10. చౌకాస్ 
11. ఏఐ కేపబిలిటి in స్వార్మ్ డ్రోన్స్ 
12. సాపర్ స్కౌట్, మైన్ డిటెక్షన్ UGV 
13. ఏఐ బేస్డ్ శాటిలైట్ ఇమేజరీ అనాలిసిస్ 

ఏదేమైనప్పటికీ మానవ మేధస్సు ఆవిష్కరించే ఏ అధునాతన  సాంకేతిక పరిజ్ఞానమైనా లోక కల్యాణానికి, మానవ జాతి పురోగమనానికి, పర్యావరణ పరిరక్షణకు, జీవ వైవిధ్యానికి  దోహద పడేలా  ఉండాలి తప్ప తిరోగమనానికి లేదా విధ్వంసానికి హేతువు కాకూడదు. ఏమంటారు !

అంశం : దైవం.పొర్ల వేన గోపాలరావు. Good.

*మహతీ సాహితీ కవిసంగమం, కరీంనగరం*
తేదీ: *22-09-2022-గురువారం*
అంశము: *దైవం*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *సహస్ర శీర్షం దేవం...*
ప్రక్రియ: *ఇష్టపది*
*********************
*(1)*
*ఆది మధ్యాంతముల*
*నసలె యెఱుఁగని వాడు!*
*అఖిలలోకంబులకు*
*నాధార భూతుండు!*
*సృష్టి,స్థితి,లయలందు*
*దృష్టి నిలిపినవాడు*
*చతుర్దశ భువనముల*
*చలనకారకుడతడు!*
*అన్ని శక్తుల మించు*
*నాది మౌలిక శక్తి!*
*భూ,నభోంతరాళపు*
*పురుడుబోసినవాడు!*
*చతురంగ బలుడతడు*
*చదరంగమున రేడు!*
*ఇదియె దైవపు హేల!*
*ఇల వేణుగోపాల!!*

*(2)*
*మట్టిబొమ్మలజేసి*
*మాయలో ముంచునట!*
*మరల మహిమలు జూపి*
*పరలోకమిచ్చునట!*
*నవరంధ్రముల తిత్తి*
*నవరసంబుల నింపి*
*నటనాలయంబులో*
*నాటకము నడిపించు!*
*దుష్టులను పరిమార్చు*
*శిష్టులను రక్షించు!*
*వేవేల నామాలు!*
*వేవేల రూపాలు!*
*వేదవేదాంగాలు*
*వేలుపన్నది యతడె!*
*ఇదియె దైవపు లీల!*
*యిల వేణుగోపాల!!*
*********************
హామీపత్రము.. *స్వీయరచన*

Wednesday, September 21, 2022

బాల సాహిత్యం

అంశం: బాలసాహిత్యం
( త గుణింతముతో)
శీర్షిక: బ్రతుక నేర్వాలి కన్నా .
శీర్షిక  : గేయ కవిత.
రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.



తొలి వందన మిడు తొలి వేల్పులకు
తొలి వేల్పులు మన తల్లిదండ్రులు .॥
తొలి వందన మిడు గురువు పెద్దలకు
తేడా జుాపని జ్ఞాన  దాతలకు ॥

తొలి జేసిన మన పుణ్య ఫలమిదే
తల్లి గర్భమున మానవ జన్మే ॥
తలచ చక్కన్ని తనువు ధనమిది
తలచు కార్యయములు జేయు పెన్నిధి॥

తొలి కోడి కుాతకు చలి యనుచు జోగక
తోడుతు నిద్దుర  లేవాలి ॥
తల్లిదండ్రుల మాఁట మన్నించి
తీరుగ స్కుాలుకు వెళ్ళాలి ॥

తెలుగు భాష మన మాతృభాష గద
తెలుగక్షరాలు నేర్వాలి.॥
తేట తెల్లని లేత మనసుతో
తెలివితొ చదువులు చదవాలి ॥

తండ్రి పేరు నిలబెట్టాలి.
తగిన ఘన కీర్తి పొందాలి ॥
తక్కు వెక్కువల బేధము నెంచక
తీరుగ చెలిమితో మెలగాలి ॥

తాయిలాలు తినుబండారాలను
తోడుగ కలసి భుజించాలి.॥
తీయని నీతిడు కధలను జెప్పే
తాత బామ్మలను ప్రేమించాలి ॥

తోడ పుట్టిన  అక్కాచెల్లెలకు
తోడుా నీడగ నిలవాలి ॥
తెంపరి తనమును విడనాడాలి
తప్పులు చేయక యుండాలి ॥

తారతమ్యములు విడనాడాలి.
తారల వలె తళుకీనాలి ॥
తేట ప్రకృతికి పచ్చదనమునిడు
తరువు చెరువులను కాపాడాలి॥

తావీయకు నువు తగాదాలకు
తంటాలన్నవి తగవుర మనకు ॥ 
తీయని మాటలు తేనెల ఊటలు
తరతరాలకవి తరగని  నిధులు ॥

పాడి పంటలతొ కళ కళ లాడే
తల్లి భారతికి ప్రణమిల్లాలి ॥
తిరుగు లేనిదౌ మాటుండాలి
తీర్పు నేర్పులతొ జీవించాలి ॥









Tuesday, September 20, 2022

రుబాయిలు.

20/09/2022
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : రుబాయిలు.

శీర్షిక : కరుణించు క్రిష్ణయ్యా..🙏

రచన :శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.



నువువేణువు నుాదినంత వివసులమై నిలచితిమే
నీ రుాపము చుాడనంత  ఆర్తులమై పిలచితిమే
నీకోసమె మాబ్రతుకని నీవెరుగవ శ్రీకృష్ణా !
నీపాదము మొాపినంత  దాసులమై కొలచితిమే ॥

వెన్న దింగిలించినా వెక్కిరించలేదయా
రేపల్లె జనులంతా ధిక్కరించలేదయా
నీ బాల లీలలకై నిలచి వేచినారుగా
కారణజన్ముడవీవు కరుణించ రావయా ॥

నీ వేణు గానముల నాదమై పాడనా
నీ కాలి అందియల  మువ్వనై ఆడనా
నీరాక కోసమై స్వైరిణై వేచితిని
నీకరుణామృతముల బంధమై వేడనా ॥

********************************

Sunday, September 11, 2022

ఆవు

03/09/2022
మహతీ సాహితీ కవి సంగమం 
అంశం : ఆవు.
శీర్షిక : గోవు మనకు వేల్పండి-
 గోమాతకు మ్రొక్కండి.

రచన :
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర

అందమైన పిల్లలుా అల్లరేల బాలలుా
అమ్మ మాట విన రండి ఆవుపాలు తాగండీ
అమ్మ పాలు తాగినారు అందంగా ఎదిగినారు.
అమ్మ పాల వంటి మేటి గోవు విలువ తెలుసుకోండి ॥

పాల సంద్రమున పుట్టిన పసిడి లక్ష్మి రుాపిదండి
 ముక్కోటి దేవతలకు నెలవైనది గోవుసుండి.
 మీగడంత తోడిడగా వచ్చు పెరుగు చిలకండీ 
ముద్దు కృష్ణ మెచ్చు వెన్నముద్ద లెంతొ రుచి కదండి॥
 
 పాల తోడు పెరుగది చలవచేయు సారమండి.
 పాయసాల రుచులు ఆవు పాలతోనె మెరుగండి .
తీయనైన పాల వేల పాకములిడు దినుసులండి .
 తీపి పాకముల కమ్మని నేతి ఋచులు తినరండి ॥
 
 మేలు పోషకాల ఫలము ఆరోగ్యము నిడు గుణము
ఆవు పేడ ఎరువు ధనము  మేలు వంట కింధనము
తగ్గునుాబకాయము ఎముకలకిడు కడు బలము .
రోగ ముక్తి కౌషధమ్ము  కలిమి పంచు మేటి వరము ॥

ఆవు అమ్మ వంటిది బేధమెంచబోదది .
ఎవరికైన ఆకలన్న గోవుపాలె పెన్నిధి.
పచ్చగడ్డి తినెడు పాడి యావు భువిని వేల్పది 
పంచ గవ్యములిడు మాతకు చేతులెత్తి మ్రొక్కండి ॥

--------------------------------------


హామీ : ఈ కవిత నా స్వీయ రచన.

గురువు.

[5/9 18:48] p3 503501: 05/09/2023

మహతీ సాహితీ కవి సంగమం 
అంశం :  చిత్ర కవిత .
శీర్షిక : అక్షర బ్రహ్మ (  గురువు .)
ప్రక్రియ : చన కవిత .

రచన :
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర

ప్రక్రియ : ఇష్టపది 

సద్గుణ శీలులైన సాధు వర్తులు గురులు
సత్య భాషణమిడు సార జ్ఞానపు నిధులు ॥
సంస్కారము సంస్కృతి  సరి నేర్పు బోధకులు 
సంస్కరించగ  మనల సరి మార్గదర్శకులు ॥

గురుది దేముని చుాపు గురు త్రిముార్తుల రుాపు
సరి సమానపు దృష్టి  సద్భావనల కుార్పు
గణనీయమౌ ఘనసు బోధ జేసెడు నేర్పు ॥
గురుతు విద్యల జ్ఞాన గుాఢ మర్మము దెల్పు॥

గర్వ మన్నది లేని  ఘన సార సౌమ్యుడుా॥
బుద్ధి బలమును పెంచు సుద్ధ తత్త్వపు ముార్తి
 ఓ న మః దిద్దించి   నోర్మి విద్యల నేర్పు
సిద్ధ చారణుడతడు  శ్రీ వాణి  పుత్రుడు॥

 భువిని కల్పము యతడు భుారి విద్యలు నేర్పు
 భవిత వెలుగుకు బాట  భాగ్యాక్షరపు కొలువు 
 చరిత లెల్లను దెలిపి చరితార్ధులుగ జేసి
 మనల దీర్చి దిద్దు మహి బ్రహ్మ రుాపతడు ॥  
 
 విద్యార్ధులను దీర్చి  విజయపథమున నడుపు
 విజయ సారధి యైన విష్ణు రుాపము యతడు
విద్య నేర్పిన  గురుని  విలువ తెలియు మన్న
గురువు నేర్పిన విద్యె గురుతు నీ ఉనికన్న ॥

  గురువు సర్వేపల్లి  గురుతు జన్మ దినాన 
  ఉపాధ్యాయోత్సవ  ఉత్సవమె కడు మేటి 
  విద్యార్ధులందరును విశ్వగురులను దలచి 
  పుాజ్య గురులను కొలిచి పుాజించు శుభదినము ॥
  
హామీ : ఈ కవిత నా స్వీయ రచన .
[5/9 20:34] +91 94418 71767: 3️⃣7️⃣
విద్యార్ధులను దీర్చి  విజయపథమున నడుపు
 విజయ సారధి యైన విష్ణు రుాపము యతడు
విద్య నేర్పిన  గురుని  విలువ తెలియు మన్న
గురువు నేర్పిన విద్యె గురుతు నీ ఉనికన్న ॥

  తమరి ఇష్టపదులు అద్భుతం మేడం🙏🙏🙏

పల్లె.

[7/9 18:33] p3 503501: 07/09/2022.
మహతీ సాహితీ కవి సంగమం .
అంశం : పల్లె.
శీర్షిక : పాడి పంటకు కొలువు పల్లెటుార్లు.

పద్య ప్రక్రియ : ఆటవెలది.

రచన :
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర



పచ్చనైన చేల  పలకరింపుల తోడ
పుాలజల్లు కురియు పుడమి నీడ
నిండు చెరువు నీట నిత్య తామరలున్న 
పరవసించు  ప్రకృతి  పల్లె మాది. ॥

సుప్రభాతము లిడు సుకపికా రవములుా 
రంగు పుాల వనపు రాసి తరులు 
సమత మమతల నిడు సమదృష్టి గలవారు
పంచు నిండు ప్రేమ పల్లె టుార్లు ॥

పలకరింపుల కడు  పలుప్రేమ బంధాలు
కలసి జేయు పనుల కళలు మెండు 
సభ్యతెరిగినట్టి సంస్కారములు నిండు.
దాన గుణములున్న దాతలుండు ॥
 
రచ్చబండ తీర్పు రక్షించు న్యాయాలు
రాజు-పేద యనెడు  రణము లేదు.
మేలు పండగలకు  మెప్పించు భాగ్యాలు.
వరుస మాన్య ధనపు వసుధ మాది  ॥ 

పాడి పంటలుగల పసిడి బంగరు భుామి.
గ్రామ దేవత మము  గాచు సుమ్మి.
భోగ భాగ్యములిడు బోనాల భోగాల
సందడించు పల్లె  సఖ్యముగను  ॥

వెన్న మీగడలతొ వెరసి వంటలు వేలు
పలుకు తేనె లొలుకు పల్లె లందు ॥
స్వాగతమ్ము మీకు  స్వాదు విందులకండి
పల్లె రుచుల తీరు పలుక రండి  ॥

***************************** ⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

*మహతీ సాహితీ కవిసంగమం -కరీంనగరం*

*నేటి ఉత్తమ పద్య కవులు:(07-09-2022)*

శ్రీ/శ్రీమతి 

1.డా.వేదాల గాయత్రీదేవి
2.గుడిపూడి రాధికారాణి
3.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
4.డా.బల్లూరి ఉమాదేవి
5.పోగుల భాగ్యలక్ష్మి
6.ఎలగందుల లింబాద్రి
7.ఎం వి ఉమాదేవి

*నిర్వాహక/సమీక్షక బృందము*
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️

Wednesday, September 7, 2022

మీ పదాలు నా పంచపది విజేతగా..

[9/7, 19:03] jagadiswari: 07-09-2022 
మీ పదాలు నా పంచపది లో
కోగంటి శాంతిశ్రీ గారిచ్చిన పదాలు.
పదాలు: కాంత  కనకము వ్యామోహము వ్యసనము శాపము.

రచన :
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.

ఎంతవారలైనా కాంత దాసులే కదా !
కనకాభరణములు అతివలకలంకరణలు కదా!
వ్యామొాహము వ్యాకులతను పెంచు కదా !
వ్యామొాహము వ్యసనమై పతనమౌదురు కదా !
ఆశ ఉన్న మనిషికి బరతుకే ఒక శాపమీశ్వరీ ॥

నేనిచ్చే పదాలు :
శ్యామలము, నిర్మలము,అనురాగము ,అభిమానము
త్యాగము.
[9/7, 20:29] Vittal Kategar పంచపదిమాలిక: *సప్త వర్ణాల సింగిడి*
*మీ పదాలు నా పంచపది*-157
తేది:07.09.2022
*విజేతలు:*
*1.కవి కిరీటి:* పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు
*2.కవి మణి:* :* శ్రీ సుధ కొలచన గారు
*3.కవి వజ్ర*:జోషి పద్మావతి గారు
*4.కవి రత్న*: శ్రీదేవిప్రభాకర్ తంత్రవహి గారు
*5.కవి తేజ:*. SK అమీనా కలందర్ గారు
*నిర్వహణ:కాటేగారు పాండురంగ విఠల్*
పంచపది రూపకర్త;హైదరాబాద్
*సహ నిర్వహణ:MV ధర్మారావు*

Tuesday, September 6, 2022

రుబాయిలు.

06/09/2022.

మహతీ సాహితీ కవి సంగమం

అంశం : రుబాయిలు .
ప్రక్రియ :  ఐచ్ఛికం .

రచన :
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర



మనసుకు నచ్చని మాటలు వినుటది కష్టము
మనసుకు నచ్చిన పాటలు  వినుటది ఇష్టము
పలువురు మెచ్చే నడతలు కీర్తికి బాటలు
మనుజులు మెచ్చని పనులవి చేయుట నష్టము ॥

జీ ఎస్ టీ వల్లమనకు లాభములవి ఉన్నాయా
ప్రైవేటీ  కరణవల్ల  కష్టాలవి  పోతాయా
అట్టికేంద్ర నిర్ణయాలు అందరికీ సమ్మతమా  
నిర్ణయాల బాటలోన ఉన్నవుాడ్చి పోయేయా ॥

బడుగువారి భాధలకిడు అర్ధాలవను వినగరావు
జాతిమతపు జడ్యాలకు యుద్ధాలను మనగరావు.
నీస్వార్దం మనుషులతో ఆటలాడు కుంటున్నది.
చితికిపోవు జీవితాల చింతలనువు  కనగరావు .

Saturday, September 3, 2022

సప్త తాళ కీర్తన . ధ్యాన కీర్తన .

శీర్షిక  : దేవీ కీర్తన. 
(ధ్యాన కీర్తన. )
--------------------
పుార్వికల్యాణి రాగం.  ఆదితాళం.
----------------------------
రచన :
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర

పల్లవి .
---------
హిమశైల సుతే ..పాహీ లలితే
పాలయమాం , శరణాగత వత్సలే...॥హిమ ॥

అనుపల్లవి.
----------
కామకోటి పీఠ వాసినీ.....॥ కామ...
శంకరాభరణ వేణీ....॥ ॥  హిమ ॥
1.చరణం.
---------------
సుమశరేక్షు కోదండ పాణీ - 
రమణి మణీ రస రాగ రంజనీ..
కోమలతర శుభ సుందర వదనీ
శ్యామల వర్ణ అపర్ణ భవానీ ॥ హిమ॥
2.చరణం.
---------
రాకా శశిముఖి , రాజీవ లోచని ,
శాకంబరి శ్రీ సింహ వాహినీ...
ముాకదైత్య దమనీ.....మాహేశ్వరీ..
ఏకానేకాక్షర మంత్ర స్వరుాపిణీ..॥.హిమ॥
3. చరణం.
---------
షట్చక్రోపరిస్థిత కమలాసని..
షడ్గుణ నిపుణ సంపుార్ణాభరణీ..
మాయా కల్పిత విషయ ధురీణే....
త్రిజగద్వందిత త్రిగుణ స్వరుాపిణీ...॥ హిమ॥

------------------------------------