Saturday, November 2, 2024

శీర్షిక: అవతార పురుషుడు శ్రీహరి. (మత్స్యావతారం).

మహతీ సాహితీ కవి సంగమం.

02/11/2024.

అంశం : మత్స్యావతారం

కవిత సంఖ్య  :  4.

శీర్షిక: అవతార పురుషుడు శ్రీహరి.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .(43)

వారం : శనివారం.

ప్రక్రియ : ఆటవెలది పద్యం.

-------------------------------------

వేగ జనియె హరియె వేదాలు రక్షింప.

వేల రూప ఘనుడు వేద నుతుడు

శకులి రూప మెత్తి  శంఖచక్ర ధరుడు 

చంపె  దనుజు నతడు చకిత రీతి.!!


---------------------------


పుల్లాభట్ల జగదీశ్వరి గారూ... 

వేగ జనెను హరియె వేదాలు రక్షింప 

అంటే బాగుంటుంది 

శకులి పదప్రయోగం ప్రశంసనీయం

విగత జీవుడైన వేదాల చోరుండు 

వేద విదుని ధాటి వెలుగు జిమ్మ !!


అన్నట్లు ఉంది మీ పద్యం సలక్షణంగా.

-------------------------------




Wednesday, October 30, 2024

శీర్షిక : సంగం : సంగమేశ్వర దేవాలయం .

శ్రీ శ్రీ కవన వేదిక వారి కవితా సంకలనం కోసం 
-----------------------------------------
 శ్రీ శ్రీ కవన వేదిక వారి "హరోం హర సంగాము సంగమేశ్వర"
కవితా సంకలనం కొరకై వ్రాసినది .

శీర్షిక : సంగం : సంగమేశ్వర దేవాలయం .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  :  మహారాష్ట్ర .

 ఏడు నదులు  కలిసే ఏకైక ప్రదేశం 
 పవిత్ర పుణ్య క్షేత్రం సంగమేశ్వరం.
 బలరాముడు ప్రతిష్టించిన లింగం.॥
 
నాగావళి- సువర్ణముఖి -వేదావతి  
ఒకేచోట సంగమించిన పవిత్ర స్థలంలో.
ద్వాపర యుగంలో కరువు, నష్టం. .
కళింగ దేశంలో నానా కష్టాలతో  జనం॥
 
చలించిన బలరాముని ప్రయత్నం 
నాగలితో భుామిని దున్నిన ఫలితం
గంగా ప్రవాహంతో  దేశం సుభిక్షం.॥

నాగలితో భుామిని దున్నిన ఫలితంగా
నాగావళి పేరుతో పవిత్ర నదీ ప్రవాహం .॥

నాగావళి , మరో ఉప నదితో కలసిన
ప్రదేశంలో ప్రతిష్టంచిన అద్భుత లింగం.
పవిత్ర పుణ్యక్షేత్రంగా ,"సంగం" .గ్రామం.
సంగమేశ్వరుని పేరుతో పవిత్ర శైవ క్షేత్రం॥

స్థల పురాణం ప్రకారం ,వినిపించే కథనం.
తండ్రి జమదగ్నిమహర్షి ఆజ్ఞ మేరకు 
తన తల్లి రేణుకాదేవిని  బలరాముడు
సంహరించి, పాప పరిహారార్ధం పవిత్ర
సంగమ స్థానంలో  చేసిన శివలింగ ప్రతిష్టాపనం॥

సంగమేశ్వరుని దర్శనం సర్వపాపహరణం.
ప్రతీ వత్సరం  బ్రహ్మోత్సవాల సంబరం , 
 శ్రీ కామాక్షిదేవీ సమేత సంగమేశ్వరస్వామి
 రోజుకొక వాహనంపై భక్తులకు దర్శనం .॥
  
 మహా శివరాత్రి పర్వదినంలో
బలరాముడు ప్రతిష్టించిన మహిమాన్విత
ఐదు పవిత్ర శివ లింగాల దర్శనం  
 పుణ్యప్రదం,సమస్త పాప ప్రక్షాళనం  .॥

మహాకురుక్షేత్ర యుద్ధానంతరం బలరాముడు  ప్రతిష్టించిన  పంచలింగ ఆలయాల్లో
 ముాడవదైన సంగమేశ్వరలింగం .
 భక్తుల కొంగుబంగారమైన పవిత్ర క్షేత్రం .॥
 

హామీ :
నా ఈ వచన కవిత ఏమాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.


*********************************

Sunday, October 20, 2024

శీర్షిక : నాలో నేనెక్కడ...?

బ్రతుకు చిత్రం.


శీర్షిక : నాలో నేనెక్కడ...?


రచన - శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కల్యాణ్ .మహారాష్ట్ర 


చెప్పాలని ఎన్నున్నా చెప్పలేకపోతున్నా

అడగాలని ఎంతున్నా అడగలేకపోతున్నా 

రాయాలని అనుకున్నది రాయలేకపోతున్న 

పాడాలని అనుకున్నది పాడలేకపోతున్నా !!


ఎరిగినట్టి సత్యాలను ఎదలోననే దాచి పెట్టి

మనసు చెప్పు మాటలనే మదిలోనే అణచిపెట్టి

కపటమైన నవ్వు వెనక వికటరూపు దాచిపెట్టి 

నిజాలకే నివురు పెట్టి ముఖానికో రంగు కొట్టి !!


కల్లలనే ఎల్లలుగా చేసుకునీ బ్రతికేస్తూ 

ఎదుటి మనిషి పదవులకే దాసోహం అంటున్నా

కుక్క కన్న హీనంగా కూటికొరకు బ్రతికేస్తే

సిగ్గులేని మనిషి బ్రతుకు బ్రతికి ఏమి లాభమన్న !!


వాదన ప్రతి వాదనతో బమ్మి,తిమ్మి చేస్తున్నా

అసలు నిజం తెలియకున్న అల్లరెంతో చేస్తున్నా

మార్పు రాని వ్యవస్థలో మార్చుతున్న చరితలెన్నో 

అక్షరాల కూర్పులలో అబద్ధాల రాతలెన్నో !!


ఫలము లేని వాదనలను పట్టు పడక చేస్తున్నా 

ప్రస్తుతమౌ పరిస్థితిని  పెడదారిని పెడుతున్నా

ముందడుగును వేయలేక సందు దారులను వెదకుచు

ముసుగు తీసి చూపలేక ముడుచుకునే పోతున్నా !!

----------------------------------------


Wednesday, October 16, 2024

చందస్సు, పద్యము ,నియమాలు, ప్రాస భేధాలు.

*ఒక పద్యం లోని ప్రతి పాదం లోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. మొదటి పాదంలో రెండవ అక్షరం ఏ విధంగా ఉంటుందో తక్కిన పాదాలన్నింటిలో రెండవ అక్షరం ఆ విధంగానే ఉండాలి. దీనినే ప్రాస మైత్రి అంటారు.*

*నియమాలు:-*

*1. ప్రథమ పాదమందు ద్వితీయాక్షరము ఏ హల్లుండునో తక్కిన పాదములలో ఆ హల్లే ఉండవలయును.*

*2. ప్రాసాక్షరము ద్విత్వమైన, అన్ని పాదములందునూ అదే అక్షరము ద్విత్వముగను, సంయుక్తమైన అన్ని పాదములందునూ అదే హల్లు సముదాయము సంయుక్తముగను ఉండవలెను.*

*3. ప్రాస పూర్వాక్షరము గురువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము గురువుగనూ, ప్రాస పూర్వాక్షరము లఘువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము లఘువుగను ఉండవలెను.*

*4. ప్రాస పూర్వాక్షరము పూర్ణబిందువుతో కూడిన, అన్ని పాదములందునూ పూర్వాక్షరము పూర్ణబిందువుతో ఉండవలెను.*


*5. ద-ధ, ధ-థ, ఱ-ర, న-ణ, ల-ళ లకు ప్రాస కుదురును.*

*తెలుగు పద్యరీతులలో వృత్తాలలో ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం, తరలము, మత్తకోకిల వంటి రీతులలో ప్రాస నియమము పాటించవలెను.*

*జాతులలో కందము, తరువోజ పద్యాలలో ప్రాస నియమము ఉంది. ద్విపదలో ప్రాసనియమము ఉన్ననూ, ఈ నియమాన్ని పాటించని ద్విపదని మంజరీ ద్విపద అంటారు.*

*ఆటవెలది, తేటగీతి, సీసము (పద్యం) వంటి ఉపజాతి పద్యాలలో ప్రాస నియమము లేదు. కానీ వీటిలో, ప్రాసయతి చెల్లును.*

ప్రాసభేదాలు

*ప్రాస భేదాలు 17 రకాలుగా ఉన్నాయని అప్పకవి చెప్పడం జరిగింది.*

1.  అర్థబిందు సమప్రాసం
2. పూర్ణబిందు సమప్రాసం
3. ఖండాఖండ ప్రాసం
4. సంయుతాక్షర ప్రాసం
5. సంయుతాసంయుత ప్రాసం
6. రేఫయుత ప్రాసం
7. లఘుద్విత్వ ప్రాసం
8. వికల్ప ప్రాసం
9. ఉభయ ప్రాసం
10. అనునాసిక ప్రాసం
11. ప్రాసమైత్రి ప్రాసం
12. ప్రాసవైరం
13. స్వవర్గజ ప్రాసం
14. ఋప్రాసం
15. లఘుయకార ప్రాసం
16. అభేద ప్రాసం
17. సంధిగత ప్రాసం

*రాబోయే రోజుల్లో ఇవన్నీ అధ్యయనం చేద్దాం*


*వేణుగోపాలుడు*
🥰❤️🥰❤️🥰

Tuesday, October 15, 2024

అంశం : ఏ.పీ.జె. అబ్దుల్ కలాం..

/10/2024.

వారం : మంగళవారం

మహతీ సాహతీ కవి సంగమం.

అంశం : ఏ.పీ.జె.  అబ్దుల్ కలాం.

ప్రక్రియ :గేయం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

కల్యాణ్. మహారాష్ట్ర .

మ.స.క.సం.: 43


పల్లవి : 

మంచి మనిషిగా ఎదగాలంటే 

విద్యాబుద్ధులు నేర్వాలిరా 

సాధువర్తనము, సకలజనహితమే 

మనసులు గెలిచే సాధన రా !!


అనుపల్లవి:

యెంచి సాధనతో సాధించేటి

 విజయ గాధలు ఎన్నో రా 

అబ్దుల్ కలాము జీవిత చరితే ,

 సాక్ష్యమొకటిగా తెలియుము రా!!


1.చరణం:

ఆర్థిక బాధల నొడ్డి, యాతడు, 

చదువుల సంద్రము దాటెనురా

శాస్త్రవేత్తగా "క్షిపణుల" కనుగొని 

సాధ్యమసాధ్యము చేసెనురా

"భారతదేశపు రాష్ట్రపతిగ "పదవందిన 

మానవ మాన్యుడురా

"మిస్సైల్ మేన్ "గా పేరొందిన ఘన

 చరితకు అతడే  సాక్ష్యమురా !!


.2.చరణం:

చదువును మెచ్చిన పిల్లల స్నేహమే

" కలాము "మెచ్చిన బాటదిరా

మంచి మాటలను ప్రసంగించుటే 

"కలామ్" కు నచ్చిన మాటదిరా

"భారతరత్నగ " కీర్తికెక్కిన 

బాధ్యత నిండిన బంధుడు రా 

"ప్రతిష్టాత్మకా పురస్కారముల"

 చేపట్టిన ఘన గౌరవుండురా!!


3.చరణం:

చిరస్థాయిగా చరితను నిండిన,

 మానవ జన్మమే  ధన్యము

"అబ్దుల్ కలాము" నాదర్శముగా

 నెంచు చదువులే సార్థకము

"అబ్దుల్ కలాము" పురస్కారముల

"నందుకొనుటె, గర్వ కారణము

ఇటువంటి చరితలే దేశ  మకుటమున

 "కలికి తురాయి" సమానము !!


ముగింపు

చరితలందు ఘన చరితలు ఎన్నో

 చదువు  నిండు,సంస్కారాలెన్నో

విద్వత్ నిండిన విద్యలు నేర్పిన, 

‌విషయ సంపదల వేడుకలెన్నో..!!


----------------------

Sunday, October 13, 2024

శీర్షిక :బ్రతుకు తక్కెడ.

14/10/2024.



మహతీ సాహితీ కవిసంగమం.

అంశం : చిత్ర కవిత.

శీర్షిక :బ్రతుకు తక్కెడ.


రచన:  శ్రీమతి:  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.

 కళ్యాణ్ మహారాష్ట్ర


బేలన్స్ కాని బతుకు తక్కెడ లో జరిగే

 వింత పరిణామాలను ప్రశ్నించలేక ,

, అధికారిక ఆక్రమణలకు తలవాల్చిన

నా కళ్ళు, బ్రతుకు భయంతో, బావురుమంటూ,

 కన్నీటి గుటకలు మింగుతున్నాయి!!


ఓటు కోసం నోటుతో చేసే దురాగతాలకు,

మనసు నింగిలో ముసురుకున్న ఆశలు,

వాడి అన్యాయాల వేడి తాకిడికి "భగ్గు" మంటున్నాయి.

సంయమనం కోల్పోయిన సామాన్యుడి  అసమర్థతలా.....!!


పెరుగుతున్న కామానికి పెట్టుబడి పెడుతున్న

 రాజకీయపు,విషపు జ్వాలల వేడి తాకిడికి

మల్లె తీగల చాటు దాగిన లేత మొగ్గలు,

 వాడి వడలిపోతున్నాయి, వనితల జీవితాల్లా....!!


అధికార బలం,చేసే ఆగని దురాగతాలకు

వీధిని పడిన విశ్వ కార్మికులు, ముందుకు

 అడుగేయలేని అసమర్థత తో,మారని 

బతుకులకు మసిపూసుకుంటున్నారు.!!


ధర్మ రక్షణ పేరుతో దారుణాలు చేస్తూ,

జాతి మతాల జాలంతో , ప్రజల మనసుకు 

 గాలం వేస్తున్న. ఘనాపాటీలు

తడంటని చేతులతో తల రాతలు రాస్తున్నారు.!!


బ్రతుకు భయంతో బాంచనంటున్న

 బడుగు బతుకులు , బలిపశువుల్లా

ఐదు కిలోల గ్రాసానికి ఆవురావురు మంటూ,

 "నోటు"కు "ఓటు"నమ్ముకుంటున్నారు

గొర్రెల మందలా..!!


-----------


Saturday, October 12, 2024

శీర్షిక: *సిద్ధి దాత్రీ!నమోస్తుతే*కవి: *పొర్ల వేణుగోపాలరావు* ప్రక్రియ: *పద్యము(తరళము)*

*మహతీ సాహితీ కవిసంగమం*
*ప్రతిరోజూ కవితా పండుగే*
అంశం:  *సిద్ధి దాత్రి!* 
కవితాసంఖ్య: *09*
తేది: *11-10-2024-శుక్రవారం*
శీర్షిక:   *సిద్ధి దాత్రీ!నమోస్తుతే*
కవి:  *పొర్ల వేణుగోపాలరావు*  
ప్రక్రియ: *పద్యము(తరళము)*
**************************
*(1)*

*నవవిధంబుల రూపు దాల్చిన నైపుణీ! యిదె స్వాగతం!*
*నవ దినంబులు బూజలందిన నవ్య రూపిణి! వందనం!*
*నవశకంబును పాదుగొల్పగ నైతికోన్నతి నీయవే!*
*యువతరంబున భక్తి వాంఛను యుక్తిగా కలిగించుమా!*

*(2)*

*రణములందున రాక్షసాంతకి! రక్షసేయుము విశ్వమున్!*
*మణుల ద్వీపము నీ ప్రపంచము! మంత్రరూపిణి! మాతరో!*
*అణిమ యాదిగ యష్టసిద్ధుల నన్ని యిచ్చెడు తల్లివే!*
*గణము లన్నియు గొల్చు దేవివి! కావు మమ్ము పరాత్పరా!*

 *(3)*

*భవుని దేహము నందుభాగము బంచుకొంటివి భార్యవై!*
*నవమి యందున సిద్ధి దాత్రిగ నాకు బుద్ధినొసంగుమా!* 
*భువనమంతయు నీకటాక్షము! పూజలందుము!దాత్రివై!*
*కవనమందున స్తోత్రమున్ గని కన్నబిడ్డను బ్రోవుమా!*

*(4)*

*అఘటనా ఘటనాదిశక్తివి! యాదరించవె భక్తులన్!*
*విఘటనంబగు పాపమంతయు వీక్షణంబులు సోకగన్!*
*లఘిమయాదిగ యష్టసిద్ధుల లబ్ధి గూర్చెడు మాతరో!*
*అఘములన్నియు నంతరించును నమ్మవై కరుణించుమా!*

*(5)*

*పిలచి నంతనె బల్కు తల్లివి! బిడ్డలందరి క్షేమముల్*
*తలచుకొందువు మాతగా మము దారితప్పక జూచుచున్!*
*కొలిచినంతనె కోర్కెదీర్తువు!కొంగుబంగరు రాణివే!*
*మలచవే మము మంచిగా! మది మందిరంపు ప్రతిష్టితా!*
**************************
హామీ పత్రం: *స్వీయ రచన*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

*వేణుగోపాలుడు*

Thursday, October 10, 2024

శీర్షిక: *కాళరాత్రీ దేవీ!నమోస్తుతే*కవి: *పొర్ల వేణుగోపాలరావు*

*మహతీ సాహితీ కవిసంగమం*
*ప్రతిరోజూ కవితా పండుగే*
అంశం:  *కాళరాత్రీ దేవి!* 
కవితాసంఖ్య: *07*
తేది: *09-10-2024-బుధవారం*
శీర్షిక:   *కాళరాత్రీ దేవీ!నమోస్తుతే*
కవి:  *పొర్ల వేణుగోపాలరావు*  
ప్రక్రియ: *పద్యము(తరళము)*
**************************

*(1)*

*ధరణి నేలెడు లోకమాతవు!దైత్యహారిణి! కాళికా!*
*ఖరము నెక్కిన కాళరాత్రివి!ఖడ్గధారిణి!వందనం!*
*పరమ పావని!భీషణా!ప్రతిబంధ నాశని!చీకటీ!*
*వరము లీయవె!శత్రునాశని!ఫాల నేత్రి!దిగంబరా!*

*(2)*

*అగజ దేహము నుండి వచ్చిన యాగ్రహంబుల జ్వాలవే!*
*భగభగా దహియించి బూదిగ వైరులన్ కడ తేర్చుమా!*
*అగణితా!కరుణాంబు రాశి!సహస్ర చక్ర నివాసినీ!*
*ప్రగతి కారిణి! సిద్ధి దాయిని!రౌద్రి!నీకిదె వందనం!*

*(3)*

*శుభములిచ్చెడు లోకమాతవు! క్షుద్రశక్తుల నాశనీ!*
*అభయమీయవె! దుష్ట హారిణి! యగ్రపూజలనందుచున్!*
*విభవమందిన యుగ్రరూపిణి!భీకరోగ్ర త్రయంబికా!*
*రభస జేయవె రౌద్ర రూపి!కరాళనృత్యము జేయుచున్!*
**************************
హామీ పత్రం: *స్వీయ రచన*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

*వేణుగోపాలుడు*

Tuesday, October 8, 2024

వరలక్ష్మి యనమండ్ర* అంశం: *కాత్యాయనీ దేవి!*

*మహతీ సాహితీ కవిసంగమం*
*ప్రతిరోజూ కవితా పండుగే*
అంశం:  *కాత్యాయనీ దేవి!* 
కవితాసంఖ్య: *06*
తేది: *08-10-2024-మంగళవారం*
శీర్షిక:   *కాత్యాయనీ!వందనమ్!*
కవి:  *వరలక్ష్మి యనమండ్ర*  
కవి సంఖ్య *(02)*
ప్రక్రియ: *పద్యము(తరళము)*
**************************
*01*
*నవదినంబుల లోన గొల్చెడు నవ్యమౌ యవతారిణీ!*
*యవని లోపల ఖ్యాతిజెందిన యద్భుతంబగు మాతవే!*
*భవము నంతయు దీసివేసెడు పార్వతీ! కరుణించవే!*
*భువనముల్ పరిశుద్ధిజేయగ పోరుసల్పెడు రౌద్రమా!*

*02*
*అమరులందరి యాగ్రహంబుల నంతగల్పగ వస్తివే!*
*అమరకోశము నందు జెప్పిన యాదిశక్తి స్వరూపమే!*
*అమరమే కద నీదు గాథలు! నద్భుతంపు పురాణముల్!*
*సమరమందున నీదు శౌర్యము శ్లాఘనీయము! శాంకరీ!*

*03*
*మహిషు సంహరణంబుజేయగ మాత దుర్గకు సాయమై*
*విహితరీతిన చేయి కల్పిన వీరశక్తికి వందనం!*
*సహితవై మహిషాసురున్ భళి!సంహరించిరి యిద్దరున్*
*మహిమ జూపెడు సింహవాహిని!మమ్ము గాంచుము శీఘ్రమే!*

*04*
*ఎరుపు వర్ణము నీకు నిష్టము !నెర్ర బారిన కన్నులన్!*
*ఎరుపు వస్త్రము లన్ని దెత్తును!నీశ్వరీ! ధరియించుమా!*
*ఎరుపు పుష్పము లన్ని గోసెద!నింట బైటను బూజకై!*
*మెరుపులన్ గురిపించుమా! మము మేలుగొల్పవె! భార్గవీ!*

*05*
*అసురులందరు ముగ్ధులయ్యిరి యందమున్ వరియించగా*
*అసురరాణ్మహి షాసురుండట హద్దు మీరెను పొందుకై*
*యసురు కావరమంత దీయగ యస్త్రముల్ ఝళిపించుచున్*
*నుసురు దీస్తివి కాళివై!త్రిగుణోద్భవీ! యిదె వందనం!*
**************************
హామీ పత్రం: *స్వీయ రచన*

అంశం: *కాత్యాయనీ దేవి!* కవి: *పొర్ల వేణుగోపాలరావు*

*మహతీ సాహితీ కవిసంగమం*
*ప్రతిరోజూ కవితా పండుగే*
అంశం:  *కాత్యాయనీ దేవి!* 
కవితాసంఖ్య: *06*
తేది: *08-10-2024-మంగళవారం*
శీర్షిక:   *కాత్యాయనీ!నమోస్తుతే*
కవి:  *పొర్ల వేణుగోపాలరావు*  
కవి సంఖ్య *(07)*
ప్రక్రియ: *పద్యము(తరళము)*
**************************
*(1)*

*సురుల క్రోధము నుండి బుట్టిన చూడచక్కని భామినీ!*
*వరలితీవు జగాన కాత్యుని వద్ద పుత్రిక రూపమున్*
*వరద ముద్రను భక్తులందరు ప్రాభవంబుగ గాంచిరే!*
*కరుణ జూపవె సింహవాహిని!ఖడ్గ ధారిణి! వందనం!*

 *(2)*

*మునివరుండట నిన్ను బెంచెను ముద్దులొల్కెడి బాలగా!*
*దినదినంబుల నీదు రూపము దీపమయ్యె నరణ్యమున్!*
*వనమునందున సాహసంబులు భక్తులందరు జూచిరే!*
*జనపదంబులు నిన్ను గొల్చెను చక్రనేత్రిణి!భద్రుకా!*

*(3)*

*యజురు వేదపు తైత్తిరీయము లందు జెప్పిన మాతవే!*
*కుజుడు నీ గ్రహ కుండలిన్ భళి!కొల్వుదీరె ఘనంబుగన్!*
*ద్విజులు గొల్తురు నిన్ను దండిగ దేవళంబుల పూజలన్!*
*విజయమీయవె తల్లి!వైభవి!వేల ప్రార్ధనలందుకో!*

*(4)*

*త్రినయనీ! నిను బూజ సేయగ తీరు కష్టములన్నియున్!*
*వనవిహారిణి! భక్తులందరి వాంఛితార్థము దీర్చవే!*
*మనసులో నిను గొల్తు శ్రద్దగ! మాతరో దీవించవే!*
*కనకదుర్గకు మిత్రురాలివి! గాంచవే మము తల్లిరో!*

*(5)*

*ఎడమ చేతిన కత్తి బట్టిన యీశ్వరీ యిదె స్వాగతం!*
*మడమ త్రిప్పని శక్తి నీయవె! మాతృకా యిదె వందనం!*
*కుడి యెడమ్ములు నీదు లీలలు!కోటి జన్మల కర్మముల్!*
*విడువనే పదమొన్నడున్! కనిపించవే! భవ నాశమౌ!*
**************************
హామీ పత్రం: *స్వీయ రచన*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

*వేణుగోపాలుడు*

ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో,"బతుకమ్మ" కవితోత్సవం..శీర్షిక : కొండంత అండ.

08/10/2024.

(కవి పీఠం)


ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో,

"బతుకమ్మ" కవితోత్సవం..

శీర్షిక : కొండంత అండ. 

రచన :  శ్రీమతి జగదీశ్వరీ మూర్తి .

కళ్యాణ్ , మహారాష్ట్ర.

ప్రక్రియ :  పాట. 

---------------


వేములవాడలోన ఉయ్యాలో 

రాజరాజేశ్వరాలయము ఉయ్యాలో 

భక్తి గొల్చె రాజులంత ఉయ్యాలో 

తల్లి నెరనమ్మి వేడిరంట ఉయ్యాలో!!


చోళ రాజనందనుడు ఉయ్యాలో 

రాజరాజ చోళుడంట ఉయ్యాలో 

పోరు జేసి గెలిచెనంట ఉయ్యాలో- వేముల

వాడ ఓడిపోయెనంటనుయ్యాలో!!


గెలిచినంతనే  గూల్చిరి ఉయ్యాలో

రాజరాజేశ్వరీ గుడిని ఉయ్యాలో 

గుడిలోన శివుని లింగముయ్యాలో

తంజావూరు తరలించిరి ఉయ్యాలో!!


లింగమునకు గుడి కట్టిరి ఉయ్యాలో 

లింగ ప్రతిష్టను చేసిరచట ఉయ్యాలో

"బృహదీశ్వర" ఆలయమదె  ఉయ్యాలో 

ముక్తి నిచ్చు  ధామమదే ఉయ్యాలో !!


వేములా వాడలోన ఉయ్యాలో 

"భీమేశ్వరా"లయమ్ము ఉయ్యాలో

శివుడు లేని గుడిగ మారెనుయ్యాలో

"బృహదమ్మ" ఒంటరాయెనుయ్యాలో !!


ఊరు వాడ తరలివచ్చిరుయ్యాలో

"తల్లి" గానరాక తల్లడిల్లి రుయ్యాలో

తలపులోన" తల్లి" దలచి ఉయ్యాలో

"పూల గౌరమ్మ"ను జేసి గొలచిరుయ్యాలో!!


ఏటేటా తెలంగాణనుయ్యాలో 

పూల బతుకమ్మకు సంబరాలు ఉయ్యాలో 

ఆట,పాట,లాడి ,పాడి ,ఉయ్యాలో 

"అమ్మ" గొల్చు తీరు అద్భుతమే ఉయ్యాలో !!


కష్టాలు కడతేరగనుయ్యాలో

గొల్చి ,సంబరాలు జేతురంత ఉయ్యాలో 

బంగారు బతుకమ్మకు ఉయ్యాలో 

బోనాల భోగమిత్తురుయ్యాలో.!!


కోర్కెలన్ని దీర్చు తల్లి ఉయ్యాలో 

మనకు కొండంత అండగాదె ఉయ్యాలో..

మనకు కొండంత అండగాదె ఉయ్యాలో..

మనకు కొండంత అండగాదె ఉయ్యాలో..!!

------------------------------

ఈ పాట నా స్వీయ రచన. 








శీర్షిక: *స్కందమాతా!నమోస్తుతే*కవి: *పొర్ల వేణుగోపాలరావు*

*మహతీ సాహితీ కవిసంగమం*
*ప్రతిరోజూ కవితా పండుగే*
అంశం:  *స్కందమాత!* 
కవితాసంఖ్య: *05*
తేది: *07-10-2024-సోమవారం*
శీర్షిక:   *స్కందమాతా!నమోస్తుతే*
కవి:  *పొర్ల వేణుగోపాలరావు*  
కవి సంఖ్య *(07)*
ప్రక్రియ: *పద్యము(తరళము)*
**************************
*(1)*

*శివుని లీలలు జూడరే!తను జేయు మాయలు, చిత్రముల్!*
*అవనియంత ప్రశాంతమొందుట కద్భుతంబులు జూపునే!*
*వివరమంతయు బోధపర్చును విన్న స్కంద పురాణమే!*
*నవతరంబులు నేర్చుకొందురు నవ్యమౌ దసరాలలోన్!*

 *(2)*

*శివుని ధాతువు క్రింద జారుచు జేరె నీటన యారుగా*
*భవుని తేజమునంత పట్టిరి పద్మమందున కృత్తికల్!*
*సవివరంబుగ బెంపుజేయగ సంభవించిరి బాలకుల్!*
*అవిరళంబగు బ్రేమజూపుచు నాదరించిరి కృత్తికల్!*

 *(3)*

*జరుగు కార్యము నంత గాంచెను సంతసంబుగ పార్వతే!*
*కరము జాచుచు గుర్రలన్ గని "స్కంద!"రమ్మని బిల్చెనే!* 
*తరలిరార్గురు బాలలే తమ దన్వులొక్కటి నవ్వగా!*
*విరుల వానలు!పూల జల్లులు!వేల కాంతులు జిందగన్!*

*(4)*

*హరుని పుత్రుడు స్కందుడై తన యమ్మ కౌగిట జేరగా*
*పురములన్నియు సంతసించెను!భూమి భారము తీరునే!*
*హరిహరాదులు, బ్రహ్మ, యింద్రులు హ్లాదమందిరి; షణ్ముఖున్*
*శిరములంటి "తథాస్తు"దీవెన జేయ పొంగెను మాతయే!*

*(5)*

*శరణు వేడిన స్కంద మాతను శక్తినిచ్చును నమ్మరో!*
*కరుణ జూపును కన్నతల్లియె కామితార్థము లిచ్చునే!*
*స్మరణ జేయుము తల్లి నామము స్వర్గమందును సత్యమే!*
*చిరు పదంబుల నాదు పద్యము జెప్పు భావము గాంచరే!*
**************************
హామీ పత్రం: *స్వీయ రచన*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

*వేణుగోపాలుడు*

Sunday, October 6, 2024

చంద్రఘంటా!నమోస్తుతే*కవి: *పొర్ల వేణుగోపాలరావు* ‌‌

*మహతీ సాహితీ కవిసంగమం*
*ప్రతిరోజూ కవితా పండుగే*
అంశం:  *చంద్రఘంట!* 
కవితాసంఖ్య: *03*
తేది: *05-10-2024-శనివారం*
శీర్షిక:  *చంద్రఘంటా!నమోస్తుతే*
కవి:  *పొర్ల వేణుగోపాలరావు*    ‌‌కవి సంఖ్య *(07)*
ప్రక్రియ: *పద్యము(తరళము)*
*****************************
*01*
 *జగతి నంతయు గాంచు దేవత చంద్రఘంటకు స్వాగతం!*
*మొగములో చిరునవ్వులొల్కెడి మోహనాంగికి వందనం!*
*నిగమముల్ నియమాలు నిష్ఠల నీరజాక్షిని గాంచరే!*
*సగము దేహమునిచ్చె ధూర్జటి శాంకరీ కరుణించవే!*

*02*
 *ఎరుపు వర్ణము నీకు నిష్టము నెల్లెడల్ శుభమొందగన్!*
*యెరుపు వస్త్రము నీకు దెచ్చితి నీవిధంబున గట్టగా!*
*మెరుపు కాంతుల మించు శోభల మేనిఛాయల దేవివే!*
*కరుణ జూపుము తల్లి పార్వతి! కాంక్షలన్నియు దీర్చగన్!*

*03*
 *భవుని పొందగ ధ్యానమందున బాధలన్ని భరించగా!*
*శివుడు మెచ్చుక పెండ్లియాడగ శీఘ్రమే యరుదెంచెనే!*
*భవుని వేషము గాంచి మేనక భ్రాంతితో నిల తూలెగా!*
*భువన మోహిని చంద్రఘంటగ బూని పల్కెను స్వప్నమున్!*

*04*
 *హరుని రూపము మారిపోయెను హాయిగొల్పుచు నున్నదే*
*వరునిగా తన వేషభూషలు వన్నె లొల్కుచు నచ్చెలే!*
*సురలు సైతము మెచ్చగా నవ శోభలయ్యె వివాహమే!*
*వరములిచ్చిరి జంటగా శివపార్వతుల్ బహు వేడ్కతో!*
*****************************
హామీ పత్రం: *స్వీయ రచన*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

*వేణుగోపాలుడు*

చంద్రఘంటా! వందనం!*కవి: *వరలక్ష్మి యనమండ్ర* )*ప్రక్రియ: *పద్యము(తరళము

*మహతీ సాహితీ కవిసంగమం*
*ప్రతిరోజూ కవితా పండుగే*
అంశం:  *చంద్రఘంటా!* 
కవితాసంఖ్య: *03*
తేది: *05-10-2024-శనివారం*
శీర్షిక:  *చంద్రఘంటా! వందనం!*
కవి:  *వరలక్ష్మి యనమండ్ర*    ‌‌కవి సంఖ్య *(02)*
ప్రక్రియ: *పద్యము(తరళము)*
*****************************
*01*
సకల లోకములందుగొల్చెడు చంద్రఘంటా వందనం!
చికురముల్ భ్రమరంబులయ్యెను శ్రీకళా శుభ స్వాగతం 
వికలమయ్యెను సృష్టియంతయు వేడుచుంటిమి భక్తితో 
ముకుళితంబయె నాదు దేహము మ్రొక్కుచుంటిని పార్వతీ!

*02*
పదపదంబుల నీశు దల్చుచు భక్తితో తపియించగన్ 
ముదమునొందిన నీలకంఠుడు ముగ్ధుడయ్యెను శాంభవీ 
వదనమంత ప్రకాశమై, హిమవంతు, మేనక మెచ్చిరే 
కదము ద్రొక్కెను సంతసంబులు కాంతపార్వతి మోమునన్!

*03*
తొలుత ధూర్జటి నిన్ను జూడగ తొందరించె గణంబులన్ 
కొలుచు భూతపిశాచముల్ గని కూలిపోయెను మేనకే 
పలికె పార్వతి చంద్రఘంటయి వస్త్రభూషణ శోభలన్ 
తళుకులొల్కెను సుందరేశుడు , తారలే దిగివచ్చెనే

*04*
రథమునెక్కె వివాహమై; శివరాణిగా యరుదెంచెనే
పథపథమ్మున దేవతల్ గని పారవశ్యము నొందిరే 
వ్యథలుబాపగ చంద్రఘంటగ పార్వతీ యవతారమే 
కథలుగావివి వాస్తవంబులు కామితార్ధము లొందగన్

*05*
గదనుబట్టిన సింహవాహిని ఖడ్గధారిణి శాంకరీ 
కదనమందున దైత్యహారిణి ఘంట నాద వినోదినీ 
సదనమందున కొల్వు సేయవె చండికా యవతారీణీ 
సదయవై మముగాచు తల్లివి చంద్రఘంటవు నీవెగా!
*****************************
హామీ పత్రం: స్వీయ రచన

Friday, October 4, 2024

శైలపుత్రి.అవతారం. శీర్షిక: *పాలయమామ్ శైలజా!*కవి: *పొర్ల వేణుగోపాలరావు*

*మహతీ సాహితీ కవిసంగమం*
*ప్రతిరోజూ కవితా పండుగే*
అంశం:  *శైలపుత్రి* 
కవితాసంఖ్య: *01*
తేది: *03-10-2024- గురువారం*
శీర్షిక: *పాలయమామ్ శైలజా!*
కవి: *పొర్ల వేణుగోపాలరావు*    ‌‌కవి సంఖ్య *(07)*
ప్రక్రియ: *పద్యము(తరళము)*
**************************

*(1)*

*హిమసుమంబులు పైన జారగ హేమకాంతులు చిందుచున్*
*ద్రుమము లన్నియు నీకు స్వాగత తోరణంబులె నయ్యెనే!*
*కమల నాభుని సోదరీ!కనకాంబరంబులు దెస్తినే!*
 *సమరమందున పాపకర్ముల సంహరించుము శైలజా!*

*(2)*

*నవనవోత్పల మాలలల్లితి నాదు పూజలు పండగా*
*నవదినంబులు బూజజేసెద నాదు భాగ్యము నిండగా!*
*కవనమందున నాదు పద్యపు గానమౌను ప్రసాదమే!*
*శివుని పట్టపు రాణివై విలసిల్లుమా! నువు శైలజా!*

*(3)*

*జగములేలెడు ఫాలలోచను సాధ్వివైతివి నీవెగా!*
*సగము దేహము నీకొసంగెను శంకరుండు! శుభాంగినీ!*
*నగవు మోమున నాట్యమాడెడు నాగరాజ ప్రియంవదా!*
*బిగువు తగ్గక దీవెనీయవె! బింకమేలనె శైలజా!*
*****************************
హామీ పత్రం: *స్వీయ రచన*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

*వేణుగోపాలుడు*
🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰

!శీర్షిక: *బ్రహ్మచారిణీ!జయహో*కవి: *పొర్ల వేణుగోపాలరావు*

*మహతీ సాహితీ కవిసంగమం*
*ప్రతిరోజూ కవితా పండుగే*
అంశం:  *బ్రహ్మచారిణి* 
కవితాసంఖ్య: *02*
తేది: *04-10-2024-శుక్రవారం*
శీర్షిక:  *బ్రహ్మచారిణీ!జయహో*
కవి:  *పొర్ల వేణుగోపాలరావు*    ‌‌కవి సంఖ్య *(02)*
ప్రక్రియ: *పద్యము(తరళము)*
*****************************
*(1)*

*రజత వర్ణపు శైలమందున రాణిగా విలసిల్లగా*
*నిజమనంబున నీదు భర్తగ నీలకంఠుడు వచ్చెనే*
*అజుని భర్తగ పొందగోరుచు నాచరించి తపంబులన్*
*విజయమందిన బ్రహ్మచారిణి వేల మ్రొక్కులు నీకివే!*

*(2)*

*గజగజా వణికెన్ జగంబులు  గాఢమైన తపంబుకున్*
*గజములన్నియు ఘీంకరించుచు కట్టుతప్పుచు బోయెనే*
*రజని వేళను నీతపంబులు లక్ష్యపెట్టక సాగెనే*
*విజయమే వరియించె పార్వతి వీక్షణంబుల నీయవే!*

*(3)*

*దసర పండుగ వచ్చెముంగిట దండిగా నవరాత్రులే!*
*అసురులందరు హంతమందిరి హాయిగల్గె జగంబులన్!* 
*మిసిమి వన్నెల దేవికిత్తుము మేలి భక్ష్యములన్నియున్!* 
*కొసరి కోరిన కోర్కెదీర్చవె కోమలీ నిను గొల్చెదన్!*
**************************
హామీ పత్రం: *స్వీయ రచన*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

*వేణుగోపాలుడు*
🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰
[17/10/2023, 10:00 pm] JAGADISWARI SREERAMAMURTH: https://www.youtube.com/watch?v=Jj3dkt2Hlpk&list=OLAK5uy_kVfO52Db3SXlJ4tX113TyDyKRjXQGFBZA
[17/10/2023, 10:03 pm] JAGADISWARI SREERAMAMURTH: Nenu rasi స్వరపరచిన Sapta Tala Keerthanalu. పాడినవారు శ్రీ. నిహాల్ గారు.

నిహాల్ గారి పాడిన సప్త తాళాల లింక్

[17/10/2023, 10:00 pm] JAGADISWARI SREERAMAMURTH: https://www.youtube.com/watch?v=Jj3dkt2Hlpk&list=OLAK5uy_kVfO52Db3SXlJ4tX113TyDyKRjXQGFBZA

[17/10/2023, 10:03 pm] JAGADISWARI SREERAMAMURTH: Nenu rasi స్వరపరచిన Sapta Tala Keerthanalu link.. పాడినవారు శ్రీ. నిహాల్ గారు.

మనసుకు మించిన హితుడెనడే...కీర్తన

రాగం..బేహాగ్
రచన:రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


పల్లవి:
------
మనసుకు మించిన హితుడెనడే
మనిషికి ఇలలో మన్నిక నేర్పే...

అనుపల్లవి:
--------
కన కన గుణములు కొల్లలు కొల్లలు
ఘనమౌ  నడనడి తీరుల ఎల్లలు
కపటపు మాటల. కల్లగు బాటల
వికటపు తీరుల విధులను దెలిపే!!

చరణం:
------
అద్ధపు చందము అగపరచునది
ఆడెడు మాటల కర్థమునిడునది
తప్పొప్పుల సరి వివరములిడునది
తానుగ మనిషిని మార్చే మందది!!

చరణం:
------
నియమపు.పూజలు నిత్యము చేయుచు
చయమున భక్తి, భావము చాటుచు
దుర్గుణ చింతన వీడని వానికి
సద్గుణ  మార్గపు మహిమలు దెలిపే !!

Wednesday, September 25, 2024

శీర్షిక : ఆలోచనల్లో మార్పు రావాలి.

అంశం : ప్లాష్టిక్ భుాతం.

శీర్షిక : ఆలోచనల్లో మార్పు రావాలి.

రచన శ్రీమతి , 
పుల్లాభట్ల  జగదీశ్వరీముార్తి.
కల్యాణ్..మహరాష్ట్ర .
8097622021.


మేధస్సు నిండిన మనిషి  మెదడు--
ఎన్నో ప్రయొాగాలు దాధించిన  విజయం.
నేటి మన దేశాభివృద్ధిలో నిండిన కొత్తదనం.
సకల సౌఖ్యాలుా నిండిన మానవ జీవితం॥

సౌఖ్యానికి అలవడిన మానవుడు
నిత్య జీవన సౌకర్యాలకు దాసుడు
అందమైన రంగులలో ప్లాష్టక్  వస్తువులు
ఎన్నో రకాలుగా చేయబడ్డ ప్లాష్టిక్ తయారీలు.॥

ఆధునికతకు మొాగ్గు చుాపే దిశలో
వాడిన పిదప పారవేయబడ్డ  సామగ్రిగా-
 ప్లాస్టిక్  కవర్లు , చంచాలు ,సంచుల వాడకాలు
 జీవితంలో ముఖ్య భాగమైన విషవలయాలు॥
 
 సుచి శుభ్రతలు మరచిన మానవుడు.
 ప్లాష్టిక్ బేగ్ లలో నింపుతున్న చెత్తా చెదారాలు.
 భుామి పొరల్లో,నీటి కాల్వలలో ప్లాష్టిక్ సంచులు,
 నీటి నిల్వల లో పెరుగుతున్న క్రిమి కీటకాలు॥
 
 మట్టి పొరల్లో  మరణం లేని ప్లాష్టిక్ భుాతాలు
పచ్చదనానికి నెలవైన  పాడి పంటలకు శాపాలు.
కుళ్ళిన వ్యర్ధాలపై పురుగుల మందు ప్రయొాగాలు
రోగాలు నిండిన సారహీన ఆహారపు లోపాలు  ॥

పచ్చగడ్డి కరువైన పశువుల కాలే కడుపుకు సారం
కుళ్ళిన వ్యర్ధాలు నిండిన ప్లాష్టక్ సంచులే ఆహారం.
ఫలితం , స్వశ్ఛత కోల్పోయిన గోవుపాల దుర్గంధం
పిల్లలకు అడ్డమైన రీతిలో పాల తయారీల విషాహారం॥

పారవేయబడుతున్న  ప్లాష్టిక్ సంచుల గుట్టలు
పారుతున్న నీటికి అడ్డుపడుతున్న కాలుష్య చుట్టలు
మురుగుతున్న నీటిలో పెరుగుతున్న దోమలు.
డెంగ్యుా మలేరియాల వంటి విషజ్వరాల చావులు॥ 

తాను కుార్చున్న కొమ్మను తానే నరుక్కున్న వైనం
పర్యావరణ కలుష్యానికి మనిషి అలోచనా విధానం
ప్రబలుతున్న అనారోగ్య సమస్యలకు తానే కారణం
ప్లాష్టిక్ వాడకాల వల్ల విస్తృత మౌతున్న ప్రమాదం॥

నిస్వార్ధపుటాలోచనలే ప్రగతి పథానికి అరోగ్య సోపానాలు॥


హామీ:
నేను రాసిన ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని నా స్వీయ రచన.

కర్మ గీతం ( జీవన వేదం )..

కర్మ గీతం ( జీవన వేదం )..

రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ మహారాష్ట్ర .

రాగం :  శుభపంతువరాళి. ( ముల్తానా)

పల్లవి: 
ఏనాటి కర్మల ఫలమొా గానీ
ఈ నాటి నా గతి ఈ విధి సామీ ॥

అనుపల్లవి:
నానాటి బ్రతుకులు నాటకమే సుమ్మి
సుఖ దుఃఖ బంధాల అనుభవముల చెలిమీ ॥

1. చరణం 
కపటపు మాటలు కల్మష చేతలు
మాయా జగతిని  మారని బాటలు
వికట విచారపు విస్తృత  కోటలు
ప్రకటము కాలేని  ఆత్మకు సంకెళ్ళు॥

2 . చరణం 
విడలేని బంధాలు వీడని కోర్కెలు
విధిరాత లీలల విషయాల వలలు
ఆతా నాత్మ విచారపు మాటలు
ఆశ నిరాశల అనుభవ పాఠాలు ॥

3.. చరణం 
కదలదు కాయము వీడదు ప్రాణము
చేరదు విడివడి ముక్తి సోపానము
తట్టదు మదిలో నీనామ స్మరణము 
కట్టడి బంధాల బరువులె శాపము ॥

4. చరణం 
స్వార్ధ చింతనలు  అర్ధ లోభములు
ఆత్మను వీడని అసలు స్వరుాపాలు ॥
చదివిన చదువులు చేసిన జపములు
ఫలముల నీయని నిష్ఫల జన్మలు.॥

5. చరణం 
కానని ధర్మము  చేయని న్యాయము 
మాటల తుాట్లతో చేసిన గాయము
స్వార్ధ చింతనల పొందిన సుఖము
వ్యధల భరితమౌ అవసానకాలము॥

శీర్షిక : జనన మరణ యానం.(జీవితం).

శీర్షిక : జనన మరణ యానం.(జీవితం).

రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర

పల్లవి:
*******
జన్మించుటెప్పుడో మరణించు టెప్పుడో
తెలియని విధిరాతిదనీ  తెలిసేది ఎన్నడో..

అనుపల్లవి:
*********
ఈ పుడమిలో జన్మ   ప్రేమ నిండు సారమా
సుఖ దుఖః నావలో నడిసంద్ర ప్రయాణమా ॥

1.చరణం.
*********
జీవితం తిరుగాడు వలయం  
నీ.. నా.. కధల రుాపం
మనసే జ్ఞాన దీపం  
నింపావహంకార తిమిరం 
ఒడుదుడుకుల బాటలో సాగించీ గమనం 
ఆశయాలె బాటలో కోల్పోయిన తరుణం 
పోయినదంతా వెనుకకు రాదుా
మిగిలినదాంతో తృప్తిరాదుా ॥

2.చరణం.
*********
ఎంతెత్తు కెదిగినా   నడిచేది నేలపై...
కన్నవారు లేనిదే కానరావు భువిపై
నా అన్నవారుండరు, నీతోడై పాడెపై
నడిమంత్రపు సిరిరాదు,నిను గుాడి చితిపై
చావు పుటకలకు మధ్యన, క్షణమైన జీవితం
తెలుసుకొనీ మసలుకో అదె జీవిత సత్యం ॥

3.చరణం.
*********
స్వార్ధమెంచి  దుారమవకు  అందరికీ మిత్రమా
బ్రతుకు దశల మార్పు తోడు, మనిషికి మనిషేసుమా.
 ప్రాణమెగిరిపోయినా  కదలదు నీకాయము
 ఓనలుగురి సాయమే   కాటిజేర్చు సాధనము.
 ఐదడుగుల మట్టి గొయ్యి నీ జీవిత కాల ధనము
 తుదికి మట్టిలోనె  కలియుటే బ్రతుకు రహస్యము ॥
 
*******************************

Wednesday, May 22, 2024

అంశం **లెక్కలు.

[21/05, 6:34 pm] +91 96406 22018: *మహతీ సాహితీ కవిసంగమం*
*ప్రతిరోజూ కవితా పండుగే*
*తేదీ: 21-05-2024- మంగళవారం*
*ఈవారం కవితాసంఖ్య: 2*
అంశము: *లెక్కలు*
శీర్షిక: *నేర్చుకుందాం పాటతో*
ప్రక్రియ: *గేయం*
పేరు: *వరలక్ష్మి యనమండ్ర(మసాకసం: 2)*
*********************
పిల్లల్లారా రారండీ
పిలుస్తున్నాను రారండీ
లెక్కలంటే భయం వద్దు 
నేర్పుతాను భయపడొద్దు 

అందరు కలిసిన కూడిక 
నిను వేరుచేస్తే తీసివేత 
అనందం చేసుకో గుణకారం 
బాధల నిశ్శేషం భాగహారం 

కూడిక ఎప్పుడు మేలురా
విడిపోతే నువు ఒంటరివేరా 
సంతోషం కావాలి గుణకారం 
కష్టనష్టాలు చెయ్యి భాగాహారం

పాలు నీళ్ళు లీటర్లమ్మా 
చెక్కెర లాంటివి కిలోలమ్మా
లీటరుకి మూలం మిల్లీలీటరు 
కిలోకి మూలము మిల్లీ గ్రాము 

అందరు కలిసి ఇటురండీ 
చేతులుకలిపీ పట్టుకోండి 
గుండ్రంగా మీరు నిలవండి 
గుండ్రం అంటే వృత్తమేనండీ

అమలా విమలా రారండీ 
అష్టాచెమ్మా గీయండమ్మా 
ఆటను అందరు చూడండమ్మ 
చతురస్రమంటే ఇదేగదమ్మా

పులీ మేక ఆట త్రిభుజమేగా బేటా 
అమ్మ చేతి గాజు కంకణమేగ రాజు 
గుడిలో గంట శంకువు 
పొగ గొట్టం అది స్థూపము 

సమయము చెప్తాం గంటలలో 
గంటకు మూలము సెకనులుగా 
60 సెకనులు ఒక నిముషం 
60 నిముషాలు ఒక గంట

పిల్లల్లారా రారండీ 
పిలుస్తున్నాను రారండీ 
లెక్కలంటే భయం వద్దు 
నేర్పుతాను భయపడొద్దు
*********************
*స్వీయ రచన*
[21/05, 7:29 pm] Porla Venu Gopala Rao: *మహతీ సాహితీ కవిసంగమం*
*ప్రతిరోజూ కవితల పండుగే!*
తేదీ: *21-05-2024- మంగళవారం*
*ఈవారం కవితాసంఖ్య:1*
అంశము: *లెక్కలు*
శీర్షిక: *విద్యాకాశంలో చుక్కలు*
ప్రక్రియ: *గేయము*
పేరు: *పొర్ల వేణుగోపాల రావు(మసాకసం:7)*
*********************

*లెక్కలు.. లెక్కలు.. లెక్కలు*
*చదువుల గగనపు చుక్కలు*
*తెలివిని పెంచే మొక్కలు*
*భవితను చూపే దిక్కులు!*
*//లెక్కలు లెక్కలు లెక్కలు//*

*చరణం:-1)*

*అంకెల సైన్యం చూడరా!*
*సంఖ్యల మేడలు ఎక్కరా!*
*లెక్కలు వస్తే సర్వం నీదే!*
*లెక్కించగవస్తే చుక్కలు నీవే!*
*కూడిక అనగా సంకలనం!*
*తీయుట అనగా వ్యవకలనం!*
*గుణకారం అంటే హెచ్చవేత!*
*భాగహారం అంటే పంచివేత!*
*//లెక్కలు.. లెక్కలు.. లెక్కలు//*

*చరణం:-2)*

*లవహారాలను కలిగిన భిన్నం!*
*క.సా.గు.రాకుంటే చిన్నాభిన్నం!*
*బీజగణితమున ప్రతిదొక సూత్రం!*
*అనువర్తనకై ఎందుకు ఆత్రం!*
*త్రికోణమితి నిష్పత్తులు ఆరు!*
*గుర్తులేకుంటే గుండెలు జారు!*
*బ్రహ్మగుప్తుడు, రామానుజుడు*
*చంద్రశేఖరుడు, శకుంతలాదేవి!*
*అందరూ ఉన్న దేశం.మనది!*
*సున్నా నిచ్చిన దేశం మనది!*
*//లెక్కలు.. లెక్కలు.. లెక్కలు //*

*చరణం:-3)*

*తార్కిక శక్తిని పెంచును గణితం!*
*లావాదేవీలు గ్రహించును గణితం!*
*కంప్యూటర్లకు ఎంతో ఇష్టం!*
*లాజిక్ మిస్సైతే ఎంతో కష్టం!*
*ఆర్యభట్టు, వరాహమిహిరుడు*
*బౌధాయనుడు, భాస్కరాచార్యుడు*
*ప్లేటో, ఫెర్మా, ఎరటోస్తనీసు!*
*పాస్కల్,న్యూటన్, ఆర్కిమెడీసు!*
*అందరూ మెచ్చినదీ ఈ గణితం!*
*ఎప్పటికీ దీనిమహిమ అగణితం!*
*//లెక్కలు లెక్కలు లెక్కలు//*
*********************
హామీపత్రము: *స్వీయరచన*

Saturday, May 18, 2024

యనమండ్ర లక్ష్మి గారి పొడుపు కథలు

*మహతీ సాహితీ కవిసంగమం*
*ప్రతిరోజూ కవితల పండుగే!*
*తేదీ: 17-05-2024-శుక్రవారం*
*ఈవారం కవితాసంఖ్య: 4*
అంశము: *ఐచ్ఛికం*
శీర్షిక: *పొడుపు విప్ఫవమ్మ!*
ప్రక్రియ: *పద్యం (ఆటవెలది)*
పేరు: *శ్రీమతి వరలక్ష్మి యనమండ్ర (మసాకసం:2)*
**********************
*01*
*రుచిన చేదునుండు! రూపము గరగర!*
*దేహమునకు మేలు! తీపి తగ్గు!*
*పులుసు బెట్టి తినగ పురుగులన్నియు బోవు!*
*కూర పేరు జెప్పు కూర్మితోడ!*

*02*
*సారమున్నకాయ! చాల నున్నగయుండు!*
*పైన పచ్చగుండు!లోన తెలుపు!*
*నీరమున్నకాయ! నిండుముక్కల పుల్సు*
*పొడుపు విప్పవమ్మ!బుట్టబొమ్మ!*

*03*
*వీరమున్న కాయ!బీరాలు పలికేను!*
*పైన పొట్టు లోన బలము గలదు*
*పప్పు, కూర,పులుసు, పచ్చడి లో సాటి!*
*పొడుపు విప్పవమ్మ!బుట్టబొమ్మ!*

*04*
*పుడమిలోని దుంప!పూర్తి ఎ విటమిను!*
*కంటిచూపు బెంచు!కాంతి నిచ్చు!*
*కరుణగలిగినట్టి యరుణవర్ణపు దుంప!*
*పొడుపు విప్పవమ్మ!బుట్టబొమ్మ!*

*05*
*పుడమి క్రింద పెరుగు!పొరలు పొరలునుండు!*
*చీరపైనచీర చిట్టి వనిత*
*నీవు కోసినంత నీలాలు కారేను!*
*పొడుపు విప్పవమ్మ!బుట్టబొమ్మ!*
**********************
*స్వీయ రచన*

*(గతవారం జవాబులు: వంకాయ, పచ్చిమిరపకాయ, టమాటా, బెండకాయ, దొండకాయ)*

Sunday, May 12, 2024

ఆమని కాంతులు

శీర్షిక :  ఆమని కాంతులు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .

---------------------

గేయం.

------

యుగయుగాలుగా జగాన ఆమని 

 వెన్నెల కాంతులు తెచ్చెనులే

ఉగాది పర్వము ఆంధృల మదిలో

పునాది వేసిన పండగలే...!!2!!

ఆ.....ఆ....ఆ.......ఆ.....


చరణం: 

------

అందముగా ఆనందముగా చిరు 

చిగురుల కొమ్మల ఊయలలూ

బంధములే అనుబంధములౌ, అర

విరిసిన మల్లె సుగంధములు.,

చిగురులు తొడిగిన కొమ్మల నడుమ 

 కోయిల పాడే గీతికలు

సమతా మమతల శాంతి సౌఖ్యముల

సాగే జీవన రాగములూ...అవి

నాల్గు వేదముల సారములు !!

ఆ.....ఆ....ఆ.......ఆ.....

చరణం: 

------

ఆరు రుచులతో నిండిన సాదము

ఆరోగ్యమునకు సూత్రముగా...

ఆరు ఋతువులా ఆగమనమదే..

ప్రకృతి పడతికి  చెలియలుగా..

సస్యశ్యామల ప్రగతి పథమదే

దేశ సంపదకు మూలముగా 

అందము నిండిన అనందములే

దివిలో వెలిగిన దివ్వెలుగా..శుభ-

శాంతి సౌఖ్యముల దూతలుగా...

ఆ.....ఆ....ఆ.......ఆ.....!!

----------------------

ఈ గేయము నా స్వీయ రచన.

-------------------------







Friday, April 26, 2024

ఆమని కాంతులు

శీర్షిక :  ఆమని కాంతులు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .

---------------------

గేయం.

------

యుగయుగాలుగా జగాన ఆమని 

 వెన్నెల కాంతులు తెచ్చెనులే

ఉగాది పర్వము ఆంధృల మదిలో

పునాది వేసిన పండగలే...!!2!!

ఆ.....ఆ....ఆ.......ఆ.....


చరణం: 

------

అందముగా ఆనందముగా చిరు 

చిగురుల కొమ్మల ఊయలలూ

బంధములే అనుబంధములౌ, అర

విరిసిన మల్లె సుగంధములు.,

చిగురులు తొడిగిన కొమ్మల నడుమ 

 కోయిల పాడే గీతికలు

సమతా మమతల శాంతి సౌఖ్యముల

సాగే జీవన రాగములూ...అవి

నాల్గు వేదముల సారములు !!

ఆ.....ఆ....ఆ.......ఆ.....

చరణం: 

------

ఆరు రుచులతో నిండిన సాదము

ఆరోగ్యమునకు సూత్రముగా...

ఆరు ఋతువులా ఆగమనమదే..

ప్రకృతి పడతికి  చెలియలుగా..

సస్యశ్యామల ప్రగతి పథమదే

దేశ సంపదకు మూలముగా 

అందము నిండిన అనందములే

దివిలో వెలిగిన దివ్వెలుగా..శుభ-

శాంతి సౌఖ్యముల దూతలుగా...

ఆ.....ఆ....ఆ.......ఆ.....!!

----------------------

ఈ గేయము నా స్వీయ రచన.

-------------------------







Wednesday, April 3, 2024

ఎనిమిది రకాల వివాహాలు!*

*ఎనిమిది రకాల వివాహాలు!* 

*వివాహం ఎన్ని రకాలు అని ఠక్కున అడిగితే జవాబు చెప్పడం కష్టం. ఒకో ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉండే వేర్వేరు ప్రజల ఆచారాలను బట్టి వివాహం జరిగే తీరు విభిన్నంగా ఉండవచ్చు. కానీ ఏ వివాహమైనా హైందవ స్మృతులలో పేర్కొన్న ఎనిమిది రకాల వివాహాలలో ఒక రీతిని తలపించక మానదు. ఇంతకీ మన స్మృతులలో పేర్కొన్న వివాహాలు ఇవీ...*

1) *బ్రహ్మం:-*  
*అర్హుడైన వరుడిని ఎంపిక చేసుకుని, తన కుమార్తెని వివాహమాడవలసిందిగా అతడిని కోరి, శాస్త్రబద్ధంగా వివాహం చేయడం బ్రహ్మవివాహం.*

2) *దైవం:-* 
*యజ్ఞయాగాదులు చేసే సమయంలో, ఆ క్రతువుని నిర్వహిస్తున్న రుత్విజునికి తన కన్యను ఇచ్చి వివాహం చేయడం దైవవివాహం.*

3) *అర్షం:-* 
*ఒకప్పుడు సంపద అంటే గోసంపదే! అలాంటి రెండు గోవులను స్వీకరించి కూతురిని ఇచ్చి వివాహం చేయడం అర్షవివాహం.*

4) *ప్రాజాపత్యం:-*  
*ఇకనుంచి గృహస్థాశ్రమంలో ఉంటూ తనకు అందించిన కన్యను కంటికిరెప్పలా చూసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తూ వివాహం చేసుకోవడం ప్రాజాపత్య వివాహం.*

5) *అసురం:-* 
*కన్యను ఇచ్చి వివాహం చేసేందుకు వీలైనంత కన్యాశుల్కాన్ని దండుకున్న తర్వాతే కూతురిని ఇచ్చి వివాహం చేయడం అసుర వివాహం.*

6) *గాంధర్వం:-* 
*పెద్దల ప్రమేయం లేకుండా వధూవరులిద్దరూ పరస్పర అంగీకారంతో వివాహం చేసుకుంటే అది గాంధర్వ వివాహం.*

7) *రాక్షసం:-*  
*తన కన్నుపడిన స్త్రీని... ఆమె ఇష్టం కానీ, ఆమె బంధువుల అభీష్టం కానీ లేకుండా బలవంతంగా ఎత్తుకువెళ్లి వివాహం చేసుకోవడం రాక్షస వివాహం.*

8) *పైశాచికం:-* 
*నిద్రిస్తున్న స్త్రీ శీలాన్ని అపహరించి ఆపై ఆమెను మనువాడటం పైశాచిక వివాహం అవుతుంది.*
🌷🌷🌷 🙏🙇🏻🙏 🌷🌷🌷

Tuesday, April 2, 2024

రుబాయీలు గురించి కొన్ని నియమాలు🍁

🍁రుబాయీలు గురించి కొన్ని నియమాలు🍁

రుబాయీ నాలుగు పంక్తులు గల కవిత. ఇది మాత్రా ఛందస్సుతో కూడిన ప్రక్రియ. ఇందులో ప్రతి పాదం ఒక సంపూర్ణ వాక్యం.   1,2,4 పాదాల చివరి పదాన్ని "రదీఫ్" అంటారు. రదీఫ్ కంటే ముందు ఉండే పదాన్ని "కాఫీయా" అంటారు. రధీఫ్ అంటే అదే పదం అని అర్థం చేసుకోవాలి. మొదటి పాదంలో ఏ పదం రధీఫ్ గా ఉంటే రెండవ, నాల్గవ పాదాలలో అదే పదం రదీఫ్ గా రావాలి.  కాఫీయా అంటే అంత్యప్రాస లాంటిది. కానీ తెలుగులో లాగా పూర్తి అంత్యప్రాస మాత్రం కాదు. మొదటి పాదంలోని కాఫీయా ఆకారాంతమయితే రెండవ నాల్గవ పాదాలలోని కాఫీయా ఆకారాంతమే కావాలి. ఇకారాంతమయితే తర్వాతి పాదాలలో ఇకారాంతమే కావాలి. ఉకారాంతమైతే ఉకారాంతమే కావాలి. హల్లుల ప్రాధాన్యత కాదు. 

మూడవ పాదానికి రదీఫ్ కాఫియాలు ఉండనవసరం లేదు.  అన్ని పాదాలకు సమమైన మాత్రలు ఉండాలి. ఏదో ఒక గతి(లయ)లో కొనసాగడం అభిలశనీయం. ప్రతి పాదానికి ఒక స్వతంత్ర అస్తిత్వం ఉంటూ నాలుగు పాదాలకు కలిపి ఒక అస్తిత్వం ఉండాలి. మూడవ పాదంలో ఒక శ్వాస తీసుకొని నాల్గవ పాదంలో మెరుపును సాధించడం అభిలశనీయం. 

"రుబాయీలు" పుట్టు పూర్వోత్తరాలు లేకుండా కేవలం నియమాలను మాత్రం తెలియజేశాను.

ఈ రుబాయీలు అనే ఈ ప్రక్రియ  "పర్షియన్" సాహిత్య ప్రక్రియ, "రుబాయీ" అనేది అరబిక్ పదం.

- సేకరణ ......"శ్రీ ఏనుగు నరసింహా రెడ్డి" గారి "తెలంగాణ రుబాయీలు" నుండి.

ఇప్పుడు మీకు కొందరు కవులు వ్రాసిన రుబాయీలను ఉదాహరణకు ఇస్తున్నాను.

⚜️⚜️
చిత్రశాల చూశారా చిందులేయు మనసు
మధుశాల చూశారా మత్తెక్కును మనసు
భావి పౌరులకు జ్ఞానామృతాన్ని పోసేటి
పాఠశాల చూశారా పారిపోవు మనసు!!
   
   - డా.తిరుమల శ్రీనివాసాచార్యులు

⚜️⚜️
వాకపల్లి ఘోరానికి సిగ్గే లేదు
దుర్మార్గుల నేరానికి ఎగ్గే లేదు
జాతికింత అవమానం జరుగుతు ఉన్నా
జనంలో రగులుతున్న అగ్గే లేదు!!

   - శ్రీ ఎండ్లూరి సుధాకర్

⚜️⚜️
కనిపించే గాయమైతె తడమకనే తెలిసేది!
లోలోపలి వేదన ఒక తలగడకే తెలిసేది!
అవ్యక్తపు ఆర్తులన్ని కడదాకా అనాథలే!
సాంధ్యఘోష అంతా ఒక పడమరకే తెలిసేది!

  - శ్రీ పెన్నా శివరామ కృష్ణ

ఇందులో "తెలిసేది" రధీఫ్. తడమకనే , తలగడకే, పడమరకే ఇవన్నీ కాఫియాలు.

⚜️⚜️
గాయపడిన గుండెలేగ చిత్రంగా పగులుతాయి
మది గదిలో నిప్పు కుండ మోస్తూనే రగులుతాయి 
ఎదన రగులు మంటలతో వెలుగు పూలు పూయిస్తూ
నలుగురికీ నవ్వు పంచి ఒంటరిగా మిగులుతాయి
-తమశ్వి 


పైన ఉన్న "రుబాయీలు" లో అందరూ ఒకే ఛందస్సు పాటించినా...ఒక్కో రచయిత కు ఒక్కో శైలి కనిపిస్తుంది.....

(మాత్రలు : 
ఒక క్షణంలో పలికే అక్షరం ఒక మాత్ర
రెండు క్షణాలలో పలికే అక్షరాలు రెండు మాత్రలు

లఘువు - ఒక మాత్ర
గురువు - రెండు మాత్రలు

గురువులు :- దీర్ఘమైన అచ్చులు , దీర్ఘమైన హల్లులు
ఉదా: ఆ , ఈ.....
         కా , గా......
సంయుక్తాక్షరాలకు, ద్విత్వానికీ , సున్నాకి ,విసర్గకు, నకారానికి ముందున్న అక్షరాలు....ఇవన్నీ గురువులు

లఘువులు : దీర్ఘము లేని అచ్చులు , దీర్ఘము లేని హల్లులు 
ఉదా: అ , ఇ......
          క , గ......

ఇంకా అర్ధంకాకుంటే వ్యాకరణం పుస్తకం చూడండి. లేదా గూగుల్ లో వెతకండి.)

Monday, April 1, 2024

అక్షర శ్రీకారం. వచన కవిత.

[01/04, 1:46 pm]
 JAGADISWARI SREERAMAMURTH:
 మహతీ సాహితీ కవిసంగమం-
ప్రతిరోజూ కవితా పండుగే.

తేది :   01 /04/2024.
వారం పేరు:  సోమవారం.
అంశం: చిత్ర కవిత.
కవితాసంఖ్య : 1
శీర్షిక :  అక్షర  "శ్రీకారం".
కవి సంఖ్య : 43.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .
---------------------
ప్రక్రియ:  వచన కవిత.
------------------

మారుతున్న వ్యవస్థలో  మానవత్వం 
నలిగి నశించిపోతోంది.
రాజకీయ చదరంగంలో,  రక్కసుల అవినీతి నిండిన
 రణనీతికి చిక్కిన ప్రజా పావులు, వివసత్వంతో ,
 విధిలేక తోలుబొమ్మలాటలాడుతున్నాయి.
కటకటాల వెనకాతల చేర్చబడుతున్న " న్యాయం",
చేయని నేర  ఆరోపణలకు చేతులు విరిగిన  ,
ఆవేశంతో చెమట్ల కారుస్తోంది.
బెదిరింపుల భయంతో, న్యాయ స్థానాలలో ఇచ్చే
నీరస తీర్పులకు , ధర్మం సంకెళ్ల బరువుతో-
అడుగులు వేయలేక , సతమతమవుతోంది.
రంగుల పులుముకున్న మేకవన్నె పులులు చేస్తున్న
మూకుమ్మడి దాడులకు బడుగు ప్రజానీకం,
బ్రతుకు భయంతో ," బాంచన్ "అంటున్నాయి.
ప్రైవేటీకరణల తో ప్రజాసంపత్తి 
పరదేశీయుల పరమౌతోంది.
అమ్ముడుపోతున్న వ్యవస్థలో విద్యా విధానం
పెట్టుబడి కేంద్రాలకు పెన్నిధి అవుతోంది.
దారి తప్పబడిన ధర్మం, , రాజకీయ రణనీతిజ్ఞుల
మధ్య చిక్కి,సామూహిక చిత్రవధలననుభవిస్తోంది.
అటు చదువు లేక ,ఇటు ఉద్యోగాలు రాక,
యువత మాదకద్రవ్యాలకు బానిసౌతోంది.
తను కన్న బిడ్డలలో ఐదుగురు మాత్రమే పాండవులు ,
మిగిలిన వారంతా కౌరవులే ఉండడం చూసి, 
ఏమీ చేయలేని భరతమాత ,పగిలిన గుండెతో
పట్టరాని, బాధని భరించలేక  భోరున విలపిస్తోంది.
తల్లి భారతి ఆక్రోశానికి ఆవేదన పడిన
చదువుల తల్లి, తన వంతుగా ,
మారిపోతున్న దేశ పరిస్థితులతో 
భవిత కానరాని బాలలను , విద్యా
వివేకాలతో తీర్చిదిద్ది, దౌర్భాగ్యంతో నిండిన
దేశ భవిష్యత్తును ఉజ్వలంగా  తీర్చిదిద్దేందుకు,
" సమతా, మమత-శాంతి , ధర్మాలను " 
నిలిపే పోరాటకులుగా.  తీర్చిదిద్దాలన్న -
ఆకాంక్షతో , అక్షర "శ్రీకారం " చుడుతోంది.

హామీ :
ఈ కవిత ఏ మాధ్యము నందునూ ప్రచురితము కాని, 
 నా స్వీయ రచన

-----------------------------
[01/04, 9:57 pm] 
Porla Venu Gopala Rao: 
1️⃣2️⃣✅పుల్లాభట్ల వారు..
 మసాకసం..4️⃣3️⃣
*శ్రీకారం* శీర్షికతో మీకవిత విభిన్నంగా సాగింది.. 
నేటి భారతదేశ యవనికపై..సాగుతున్న తోలుబొమ్మలాటను చూడలేక.. 
భరతమాత కు సాయంగా 
భారతి అడుగిడిన వైనం బాగా చెప్పారు.. 
ధన్యవాదాలు మరియు అభినందనలు👏👏💐💐🙏🙏

Sunday, March 31, 2024

చాటువులు

శనివారం నాటి అంశానికి సగుణంగా సరసంగా చాటువులను అందించిన సహృదయ కవి పండిత శ్రేష్టులకు హృదయపూర్వక నమస్కారములు హాస్యస్పూరకమైన చక్కటి ప్రాసంగికమైన పద్యాలను సమూహానికి సమర్పణ చేసిన మిత్ర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు

1డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
 2పురం మంగ గారు
3 డాక్టర్ వేదాల గాయత్రి గారు
4 బాచిరాజు సత్యనారాయణ రావు గారు
5 చయనం మహాలక్ష్మి గారు
6 పేరి భార్గవి గారు
7 ఎలగందుల లింబాద్రి గారు
8 కందూరి చంద్ర ప్రకాష్ గుప్తా గారు
9 పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు
10 మండలోజు వెంకటరమణాచారి గారు
11 గడ్డం కృష్ణారెడ్డి గారు
12 నా రోజు వెంకటరమణ గారు
13 దేవనపల్లి ఓగన్న గారు
14 వీటీఆర్ మోహన రావు గారు
15 అద్దంకి లక్ష్మీ గారు
16 పోగుల భాగ్యలక్ష్మి గారు
17 కొమరగిరి గీతా శైలజ గారు
18  యనమండ్ర వరలక్ష్మి గారు


ఇట్లు డాక్టర్ అడిగొప్పుల సదయ్య గారు మరియు
మహతి సాహితి కవి సంగమ కార్యవర్గం పర్యవేక్షణ మండలి

Tuesday, March 26, 2024

శివ శక్తి స్తోత్రం

శివ -శక్తి -స్తోత్రం.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి.

కామ దహన శివ దురిత హరణ
భవ కాల హరణ  హర సదా శివ.
గంగ జటాధర గౌరీ మనోహర.
అంగభూతి ధర  హర హరోం హారః !!

కామ దహన శివ నామ ప్రళయకర
నాట్య భయంకర ప్రభు అభయంకర.
నాద వినోద సు నాదానందిత
వందిత సురగణ రంజిత మునిగణ !!

చంద్ర చూడ ఘన మంద హాస ,గళ
ముండ మాల ధర , మంగళాననా
బంధ మోచకర వందనాది , సుర,
భంజనా ద్యసుర వంద్యముని జన !!

సర్వేశ్వర శర్వ  సర్వాత్మకా
శర్వరీ తేజ  ఓంకార నాదాత్మకా !!
సర్ప భూషాంగనా , కంఠ విష ధారణ
దండ దుష్టాది, కందర్ప దర్పాది భంగా !!

పర్వతేందు ప్రియా సర్వ భూత క్రియా
నిర్వికల్ప ప్రభావా నిత్యగంగా ప్రవాహా
భవా భూతనాధా భవానార్థ కాయా !!
త్రిలోకాది ఈశా త్రినేత్ర ప్రకాశా!!

లోకోద్బవా దురిత సంహారకారి.
పురారీ , దక్షాధ్వర ధ్వంశకారీ
భస్మానులిప్తంగ భవాన్మోదకారి
ప్రభూ చంద్రధారి  ప్రపంచాధికారి!!

సర్వ మంగళ మధుర స్వరూపిణి
మాత మా దుర్గ మాంగళ్య కారిణి
సప్త వర్ణ మయ మాలా భూషణి
వర్ణ  భేదినీ వర్ణ మోదినీ!!

చందన కుంకుమ గంధ మాలినీ.
ఆర్తత్రాణ పరాయణీ  ఘనీ
అఖిల నాథు ప్రియ అర్థ శరీరిణి.
ఆపదోద్దారి ణాశ్రితపోషిణి!!

మంగళ కారిణి అమంగళ తోషిని
మాత మా దుర్గ మధుర సుభాషిణి.
ఆనంద రూపి, శివార్థ శరీరిణి.
పాహి పాహి జయ పర్వత వర్ధిని!!
---------------------------

నటీ--నటులు

మహతీ సాహితీ కవిసంగమం

ప్రతిరోజూ కవితా పండుగే


తేది:26-03-2024.

 ( మంగళవారం)

అంశం: నటీ-నటులు .(గేయం).

( కవితాసంఖ్య -02).

శీర్షిక: జీవితమే ఒక నాటక రంగం.

కవి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.

కళ్యాణ్ : మహారాష్ట్ర.

 (కవిసంఖ్య -43)


గేయం.

------


పల్లవి:

-------

జీవితం ఒక నాటకం ...

వేరు వేరు పాత్రలతో తెరపడని నాటకం!!


అను పల్లవి.

------------

వేషాలతో మోసాలను చేసే ఒక నాటకం 

ఇంట బయట ఆడేది అగుపడనీ నాటకం.!!


1.చరణం.

--------

రాజకీయ రంగులతో ఆడే దొక నాటకం.

రాక్షసత్వమును దాచిన చిరునవ్వొక నాటకం.

దొమ్ము లేనన్నొ చేసినట్టి దొరతనమొక నాటకం.

కట్టినట్టి కాషాయపు రంగే ఒక నాటకం !!


2.చరణం.

--------

స్నేహమనే మాటతో ఆడేదొక నాటకం.

భార్యా-భర్తల మధ్యన జరిగేదొక నాటకం.

బంధువు రాబందువై  ఆడేదొక నాటకం.

ప్రేమ అన్న పేరుతో, ఆడేదొక నాటకం !!


3.చరణం.

--------

ముఖం మీద ముసుగు వేసి 

ఆడేదొక నాటకం.

నోటి తోడ పొగడి , నొసట

వెక్కిరింత నాటకం.!!

నాటకాల జగతిలో 

నమ్మేదీ ఎవరినీ.. 

దిగజారే ప్రగతి నింక

సరిచేసే దెవరనీ....!!

సరిచేసే దెవరనీ....!!

సరిచేసే దెవరనీ....!!



హామీ పత్రం:

పై గేయం నా స్వీయరచన,దేనికీ అనువాదం కానీ,అనుకరణ కానీ కాదని హామీ ఇస్తున్నాను.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

జీవితమే ఒక నాటక రంగం

మహతీ సాహితీ కవిసంగమం

ప్రతిరోజూ కవితా పండుగే


తేది:26-03-2024.

 ( మంగళవారం)

అంశం: నటీ-నటులు .

( కవితాసంఖ్య -02).

శీర్షిక: జీవితమే ఒక నాటక రంగం.

కవి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.

 (కవిసంఖ్య -43)


కవిత:

---------


ఒక కళాకారుడిగా జీవితాన్ని 

కొనసాగిస్తున్న వారికి 

ఒక పాత్రలో ఇమిడిపోయి నటించడం అన్నది

నిజమైన పాత్రధారిగా ఒక సవాలే..

తమ "నిజ జీవితంలో" దుఃఖం ఉన్నప్పుడు

తెరపై "సంతోష పాత్ర " పోషించాలి.

తనకు ఎనలేని ఆనందంగా ఉన్నప్పుడు.

తెరపై "దుఃఖంగా ఉన్న పాత్ర "పోషించాలి.

తమ ఇంట్లో మరణానికి సంబంధించిన 

సంఘటన జరిగినప్పుడు కూడా

వస్తున్న. ఏడుపు ఆపుకుంటూ

నవ్వు తెప్పించే "కామెడీ పాత్ర" పోషించాలి.

ఐతే , ఈ నాటక రంగానికి

 కొన్ని గంటల్లో తెరపడుతుంది.

కానీ...

జీవితమే ఒక నాటక రంగం అన్నారు పెద్దలు.

అరువది నాలుగు  కళలున్న మనదేశంలో

మనిషి ఆడుతున్న నాటకాలకు తిరుగులేదు.

మనిషి జీవితంలో, కొన్ని సంఘ మర్యాదల కోసం 

మంచితనం అనే ముసుగు వేసుకొని

మసలడం ఒక  పెద్ద నాటకం !!

సామాన్యుడితో సహా ,రాజకీయ 

నాయకుల వరకు ఆడుతున్న ఈ నాటకంలో..

పట్టుబడని పాత్రలు ఎన్నో ,

పగిలిపోయిన గుండెలెన్నో....

కాల రాయబడుతున్న కథలెన్నో....

మానభంగాలకు గురైన ఆక్రోశాలెన్నో..

నలిగి నశించిపోయిన పసి ప్రణాలెన్నో..

అలసినా, ఆడుతున్నన్న తోలుబొమ్మలెన్నో...

తెరపడని ఈ నాటక రంగంలో,

అన్నీ తెలిసి కూడా అడ్డుపడలేని 

అసమర్థతలెన్నో....

ఈ "జీవితం" అనే నాటకానికి  

తెర పడేది ఎన్నడో...!!

హామీ పత్రం:

పై కవిత నా స్వీయరచన,దేనికీ అనువాదం కానీ,అనుకరణ కానీ కాదని హామీ ఇస్తున్నాను.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


కవి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.


ఏడు రంగుల సమ్మేళనం 

స్వచ్చమైన తెల్లదనం .

శాంతికి నిదర్శనం.!!


ఆరు రుచుల సమతుల్య ఆహారం.

ఆరోగ్యానికి ఔషధం

ఆరోగ్మమే మహాభాగ్యం.!!


ప్రకృతి వలయం.

పంచభూతాలకు నిలయం.

జన జీవిత గతికి ఆధారం.!!


పుడమి నిండిన తరు వనం.

రంగులు నిండిన పూలతో ఘనం.

పరిమళాలు నిండిన మలయ మారుతం.!!


సూర్య చంద్రుల గమనం.

పగలు రాత్రులు, మధ్య  జనం.

ఉచ్ఛ్వాశ నిశ్వాసాల తోరణం!!


తరువులు విడచిన గాలి.

జనులందరి ఊపిరి.

వర్ణ బేధాలు చూపని సిరి!!


ప్రకృతితో నిండిన భూ ప్రపంచం.

ప్రపంచం నిండిన జన సందోహం.

వివిధ వర్ణాల, వర్గాల , రంగుల సంగమం. !!


బండరాయితో మలచబడిన భగవంతుడు

ప్రపంచ సృష్టి, స్థితి , లయల కారకుడు.

జాతి భేదాలు లేని జన్మల నియామకుడు!!


రసమయ ప్రపంచం లో రంగుల కలయికల దీపావళి

మైలపడిన మనసులను శుద్ధి చేసే రస కేళీ

సమత, మమత, సమైక్యతల రంగోలీ 

జాతి భేధాలను రూపుమాపే ఆనంద హోళీ !!


హామీ పత్రం:

పై కవిత నా స్వీయరచన,దేనికీ అనువాదం కానీ,అనుకరణ కానీ కాదని హామీ ఇస్తున్నాను.

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

Monday, March 25, 2024

.మార్పు రావాలి.

11.మార్పు రావాలి.

మనకు జ్ఞానం వచ్చింది దగ్గర నుండి,
మనం కొత్త సంవత్సరంలోనన్నా బాగుంటామేమో అన్న ఆశతో,
ముందున్న సంవత్సరానికి స్వస్తి చెప్పి,
కొత్తసంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాం
కానీ మనం ఎప్పుడు ఆలోచించలేదు
సంవత్సరం మారినంత మాత్రాన
" జీవితాలు మారుతాయా "అని
ముందు మనలో మార్పు రావాలి
జాతిమతాలకు తావివ్వకుండా ,
అందరూ ఒక్కటై స్నేహభావంతో మసలాలి
తల్లిదండ్రులను,స్త్రీలను గౌరవించాలి.
అవసరార్థులకు చేయూత నంది ఇవ్వాలి
మాటల్లో మంచితనం,చేతల్లో నిస్వార్థత ఉండాలి.
పిల్లలకు జీవితంపై సరైన అవగాహన పెంచాలి
ఇలా కొన్ని మార్పులు మనలో వస్తే 
ప్రతి సంవత్సరం శుభ సంవత్సరమే...
రాబోయే సంవత్సరంలో ఎన్నికలు జరుగనున్నాయి
తెలివైన ఆలోచనతో సరైన నిర్ణయం తీసుకుందాం..
" క్రోధి" నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ..
"మనమూ బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి" అన్న ఆలోచనతో అడుగు ముందుకేద్దాం.

పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
కల్యాణ్

Sunday, March 24, 2024

వెంకటేశ్వర సుప్రభాతం రచయిత

వేంకటేశసుప్రభాతం 1420 మరియు 1432 CE మధ్య కాలంలో ప్రతివాదిభయంకరం శ్రీ అన్నన్ (దీనిని హస్తిగిరినాథర్ అన్నా, మరియు PB అన్నన్ అని కూడా అంటారు) చే రచించబడింది . [4] [7] [8] [9] కవి స్వామి మనవాళ మాముని శిష్యుడు , ఇతను స్వయంగా రామానుజుల శిష్యుడు . [9]

వేంకటేశ సుప్రభాతం నాలుగు విభాగాలను కలిగి ఉంటుంది: సుప్రభాతం, శ్రీ వేంకటేశ స్తోత్రం, ప్రపత్తి మరియు మంగళశాసనం. [10] [11]

హోళీ గురించి

*_నేటి విశేషం_*

*కామదహనం - ఫాల్గుణ శుద్ధ చతుర్దశి*

సతీదేవి దక్ష యాగములో దేహత్యాగం చేసిన తరువాత శివుడు రుద్రుడై వీరభద్రుణ్ణి , భద్రకాళిని సృష్టించి యాగాన్ని ధ్వంసం చేసి దక్షుడి అహంకారాన్ని , గర్వాన్ని అణిచాడు.

ఒకనాడు తారకాసురుడు అనే రాక్షసుడు ఘోరతపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. 
అయితే అప్పటికే సతీదేవి దక్ష యాగములో దేహత్యాగం చేసినదనీ శివుడు భార్యాహీనుడైనాడని తెలిసి తనకు శివపుత్రుని చేత మరణం కావాలని కోరతాడు తారకాసురుడు.

భార్యావియోగంలో శివుడు మరల వేరొకరిని వివాహమాడడని  తానిక అమరుడినని భావించిన తారకుడు విజృంభించి ముల్లోకాలను జయించి దేవతలు , జనులు , ఋషులను బాధించసాగాడు.

పర్వతరాజు హిమవంతుడు , మేనాదేవి దంపతులు సంతానానికై అమ్మవారి కోసం తపస్సు చేస్తారు. 
వారి తపానికి మెచ్చిన జగన్మాత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా *" నీవే మాకు పుత్రికగా రావాలి! "* అని కోరతారు. 
సరెనన్న జగజ్జనని ఆ తరువాత పార్వతీదేవిగా హిమవంతుడికి జన్మిస్తుంది.

శివుడు భార్యావియోగంతో రుద్రుడైనా మరల శాంతించి తపస్సులోకి వెళ్ళిపోతాడు.
హిమవంతుని పుత్రికయైన హైమావతి చిన్ననాటి నుండే అపరశివభక్తి కలదై ఆయననే మనస్సునందు నిలుపుకొని రోజూ శివపూజ చేసేది.
హిమాలయాలలో తపములోనున్న శివుడిని పూజించడానికి రోజూ వెళ్ళేది, కానీ తపములోనున్న శివుడు ఒక్కసారైనా పార్వతీదేవిని చూడడు.

*యాలలు:*
*అంబికాదేవి యంతాలో హరుని సాన్నిధ్యముకే తెంచి*
*సంబరమున ప్రాణేశునిజూచి యో మౌనులారా !*
*చాల భక్తి గలిగి మ్రొక్కేనూ*
*దినదినా మీరితి గౌరి దేవి పూజజేసి పోంగ ఘనుడు*
*శంబుడి సుమంతైననూ ఓ మౌనులారా !*
*కానడు బ్రహ్మానందమువలనా*

ఈలోగా తారకాసురుడు పెట్టే బాధలను భరించలేని దేవతలు , నారదుడు ఇంద్రుడి వద్దకు వెళతారు. అప్పుడు అందరూ కలిసి పార్వతీశివుల కళ్యాణం అయితే తప్ప వారికి పుత్రుడుదయించి తారకాసురుడిని చంపగలడని తొందరగా శివపార్వతుల కళ్యాణం కోసం ప్రయత్నం చేయమని అభ్యర్థిస్తారు. నారదుని సలహా మేరకు వెంటనే ఇంద్రుడు మన్మథుడిని పిలిచి శివుడి తపస్సు భంగపరిచి పార్వతీదేవిని శివునకు దగ్గర చేయమని వారి కళ్యాణానికి  బాటలు వేయమని ఆదేశిస్తాడు. శివుడి కోపాన్ని ఎరిగిన కామదేవుడు మొదట ఈ పనికి భయపడినా ఇంద్రుడి ఆజ్ఞవలన చేసేది లేక సరేనంటాడు.

*గద్యం:*
*అమరాధిపునిజేరి యానారదుండి*
*విమలుడీవిధమెల్ల వినిపించగాను*
*మంచిదని పృత్రారి మన్మథున్జూచి*
*యెంచి సహాయము లిడి బ్రతిమాలి*
*కాలకంఠునిజేరి కాచుకోనియుండి*
*బాలపార్వతి మీద భ్రమనొందజేయు*
*మనుచు సురపతి పయన మంపేటివేళ*
*కనుగొని కాముని కాంత యిట్లనియె.*

తన మిత్రుడైన వసంతుడితో సహా బయలుదేడానికి సిద్ధపడతాడు. ఇదివరకే శివుడి కోపం గురించి తెలిసిన మన్మథుడి భార్య రతీదేవి మన్మథుని కార్యాన్ని ఆపడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ ఎంత చెప్పినా మన్మథుడు వినిపించుకోడు.

*మ. రతియిటెంతయు జెప్పినన్ వినక* *మూర్ఖంబొంది యామన్మధుం*
*డతిగర్వించి వసంత మధవునిలో నావేళతా* *వేళ్ళుచున్*
*శితికంఠున్ని* *పుడేమహామహిమచే స్త్రీలోలునింజేసి యా*
*వ్రతనేమంబున భంగపుత్తునని యా ప్రాంతంబునం జేరినన్*

వసంతుడితో సహా ఆ శివుడు తపస్సు చేసే ప్రాంతానికి చేరిన మన్మథుడు శివుడిపై పుష్పబాణాలు వేస్తాడు. ఆ బాణాలవలన శివుడు చలించి అప్పుడే పూజార్థమై వచ్చిన పార్వతీదేవిని చూసి మోహిస్తాడు. కానీ వెంటనే తేరుకుని తన తపస్సు భంగపరచినది ఎవరు అని కృద్ధుడై అన్ని దిక్కులా పరికించిచూడగా ఓ మూలన భయపడుతూ కనబడతాడు మన్మథుడు. వెంటనే రుద్రుడై మూడోకన్నును తెరిచి కామదేవుడైన మన్మథుడిని భస్మం చేస్తాడు.

*ద్వి. విరహకంటకుడట్లు వేగానజూచి*
*హరమూర్తినిటలాక్ష మదిదెర్వగాను*
*ప్రళయానలముబట్టి పారేటివేళ*
*బలువైనకాముండు భస్మమైపోయె*
*పసలేకరతిదేవి పడిమూర్చబోయె*
*కుసుమ శరుడు భీతి గొని పారిపాయె*

*ఆ కాముడు భస్మమైన రోజు ఫాల్గుణ శుద్ధ చతుర్దశి అని అంటారు.* ఆ రోజు ప్రజలు కామదహనంగా జరుపుకుంటారు. తెల్లవారి హోళిపండుగగా , కాముని పున్నమిగా జరుపుకుంటారు. మరల దేవతలందరూ శివుణ్ణి ప్రార్థించగా తిరిగి మన్మథుడిని అనంగుడిగా మారుస్తాడు శివుడు. అప్పుడు అందరూ వసంతోత్సవం జరుపుకున్నారని అదే హోళి అని అంటారు...

               *_🥀శుభమస్తు🥀_*
 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

కాల దేవి ఆలయం.

కాలదేవి.....
ప్రపంచమంతటా ఏ ఆలయం ఐనా పగటి పూట తెరిచి రాత్రి పూట మూసివేయబడుతుంది. కానీ.. రాత్రంతా తెరిచి వుంచే ఆలయం ఒకటి ఉంది. అదే కాలదేవి ఆలయం.  మానవులు అనుభవిస్తున్న చెడు సమయాన్ని మంచి సమయంగా మార్చాగలిగే కాలదేవి దేవతను ప్రార్థిస్తే చింతలు పరిష్కారమవుతాయని, ఇబ్బందులు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. అందుకే ఈ దేవతను సమయ దేవత అని కూడా అంటారు.  కాలదేవి దేవత విగ్రహంలో 12 రాశిచక్ర, 27 నక్షత్రాలు మరియు నవ గ్రహాలు ఉన్నాయి. ఈ కళాదేవి అమ్మన్ను సమయ చక్రం నడిపే అమ్మవారిగా కొలుస్తారు. ఈ దేవత యొక్క దర్శనం మీకు లభిస్తే, చెడు కాలాలు మంచి కాలంగా మారుతాయి అని ప్రతీతి. 
ఇది సమయం మారుతున్న ఆలయం కనుక దీనిని "టెంపుల్ ఆఫ్ టైమ్" అని పిలుస్తారు.  
కాల దేవత ముందు 11 సెకన్ల పాటు నిలబడి ప్రార్థించడంతో మానవుల యొక్క చెడు కాలాలు పోయి మంచి సమయాలు ఆశన్నమవుతాయన్నది ఆ దేవత ఆశీర్వాదం లబించిన భక్తుల మాట. 
ఈ ఆలయం రాత్రంతా దర్శనం కోసం తెరిచి ఉంటుంది. అమావాస్య రోజున యజ్ఞంతో , పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి.   
తమిళనాడు,మదురై జిల్లా లోని" డి.కల్లుపట్టి" పక్కన గోపాలపురం దగ్గర సిలార్పట్టి అనే గ్రామంలో కాలదేవి ఆలయం ఉంది...  🌹🌹🌹🌹

Thursday, March 21, 2024

యుగాది కవితలు



02/03/2022.

వాల్మీకి పోతన వేమన (వా.సో.పో.వే)సాహిత్య వేదిక* ఆధ్వర్యంలో 

అంశం : యుగములకు ఆది యుగాది.

శీర్షిక : చిగురుంచిన ఆశలు.

రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

కల్యాణ్: మహారాష్ట్ర .


ఎటుచుాసినా సహజమైన నుాతనత్వం.

వసంత ఋతువు ఆగమనంతో వచ్చే ఆది పర్వం .

చిరుగాలి వీచికలతో నవ యుగాది ప్రారంభం .

బంతీ చామంతుల మధుర వీచికల సుమ గంధం  ॥

చిగురులు తొడిగిన ఆకుల గలగలలలు.

మామిడి పుాతల చిరు గంధపు ఘుమ ఘుమలు.

కోయిల రాగాల కొత్త వసంతాల మయుారి నాట్యాలు

నవ యుగాదికి పలుకుతున్న నవ్య స్వాగతాలు॥

గుమ్మాలకు పచ్చని తోరణాల శుభ సంకేతాలు

ఇంటింటా పసుపు కుంకుమలద్దిన గుమ్మాలు

యుగాది లక్ష్మికి పలికే ఉత్సాహపు స్వాగతాలు.

శుభ మంగళాలు పలుకు వేద పండితుల సామ గానాలు॥

కొత్త కోర్కెలతో చిగురించిన కొగ్రొత్త ఆశలు

నలిగిన మనసుల్లో నమ్మిక నిండిన ప్రశాంతతలు.

 షడృచుల సమ్మేళనాలతో ఆరోగ్యామృత పక్వాలు.

 కొత్త దనపు రాకతో పాతను మరచిన అత్మ విశ్వాసాలు॥

 పంచాంగ శ్రవణంతో చీకటి బ్రతుకుల్లో చిగురించిన ఆశలు.

"శుభకృత్" ఆగమనానికి ప్రకృతి పాడే ఆనంద గీతాలు

మంగళ గీతాల మధుర భావనలతో "శుభారంభ-

 యుగాది" కి జనులు పలికిన సుస్వాగతాలు ॥

---------------------- 

5/03/2023.

2023 -శోభకృత్  యుగాది సందర్భంగా..

ISBN కవి పత్రిక కొరకు (,క్రమ సంఖ్యవ..46)

( పంపడమైనది).

అంశం : ఉగాది.

శీర్షిక  : నవ యుగాదికి స్వాగతం .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

 కల్యాణ్. మహారాష్ట్ర .


 ప్రకృతి పడతిని వరుస శోభలతో నలంకరించిన

 వసంత కన్యక,రాబోయే "శోభకృత్" యుగాది

నెచ్చెలిని ఆహ్వానించడానికై  ఆత్రుత నిండిన

 ఆనందంతో "స్వాగత" యత్నాలు చేస్తోంది.॥

 

 చిగురుటాకుల లేత పచ్చని తోరణాలకు -

రంగు పుాల సుగంధాలనద్దింది-

కిచ- కిచ లాడే చిలుక చెలులను పిలచి

కిలకిలారవాలతో ఆనంద స్వాగతం పలకమంది.॥

 

 పుడమి నుదుట, పచ్చ బొట్టై నిలిచిన 

తరు వనంలో,  చిరు గడ్డి తివాచీ పరిచింది.

కళ -కళల విరిసిన కలువ  కన్నెలను  

 కాలి బాటలో నిలిపి,అలసి వచ్చిన నెచ్చెలికి

 చల్లని తేట నీటితో దాహం తీర్చమంది ॥

  

 కమ్మని మావి చిగురుతో తమ కంఠాలకు

 మెరుగుపెట్టుకుంటున్న వసంత కోయిలలను, 

 స్వాగత గీతాలాలపించమంది.॥

  

 వసంత శోభలకు పరవసించి పురివిప్పిన 

 నెమలి కన్నెలను ఆనంద నాట్యాలాడమంది .

 విశాల తరు శాఖల చల్లటి నీడలో , 

 మట్టి సుగంధాల మేలు పల్లకి నిలిపింది॥

 

ప్రకృతి సిద్ధమైన ఘుమ ఘుమలతో నిండిన 

ఆరు ఋచుల అరుదైన వంటకాల 

విందు- వినోదాలనమర్చింది .

 

 అంతలోనే ఆనందంగా ఆడుగిడిన 

అందాల "శోభకృత్ కన్య", పుడమి చెలుల

 ఆప్యాయత నిండిన హ్వానాలకు ఆశ్ఛర్యపడి

 ఆప్యాయతతో ,తన వంతుగా ఈ వత్సరమంతా 

  అందరికీ అనేక సుఖ భోగాలను పంచి ఇస్తానని

 పలుకుతుా, ఆమని నెచ్చెలిని ఆనందంగా 

 ఆలింగనం  చేసుకుంది .

 హామీ :

 ఈ కవిత నా స్వీయ రచన.

*****************************

***************************

అంశం : యుగాది 

శీర్షిక  :   ఉదయరాగ శోభలతో ఉరికివచ్చె నుగాది. ॥


రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

 కల్యాణ్. మహారాష్ట్ర


లేత పచ్చ శోభలతో చిగురించిన తరు శాఖలు

 మలయనమారుత వీచికలతో ఆడే సరాగాలు.

 పుాబాలలు రంగులీను పావడాల సవరింపుతో

 సీతాకోక చిలుకలతో  దోబుాచులాడు కళలు ॥

 

 నవ వసంత శోభలతో ప్రకృతి పడతి అందముగా

 యినుమడించె  కోయిలలిడు రాగములవె విందుగా  .

 ఆకు పచ్చ తివాచీలు ఆడుగడుగున అందముగా

 పరచుకొన్న భావననిడె పచ్చగడ్డి  నిండుగా ॥

 

కోత కొచ్చె వరి ధాన్యము  అన్నదాత సిరులుగా

ఆనందపు భావనలే తడి కన్నుల మెరుపుగా

భాగ్యరాసి సిరుల పంట   నిండె  నింటి కొలువుగా 

పంట నమ్మ  పడతి లక్ష్మి కదలి వచ్చె కానుకగా ॥


"శోభకృత్ "నామముతో వచ్చె చెలియ వేడుకగా

ఆనందపు ఆతిథిగా  అడుగిడె కళ నిండగా

వత్సరాల వేదనలే  తొలగించెడు భాగ్యముగా

ఆరు ఋచుల ఓషధులను అందించెను వరముగా॥


పడతులింటి ఆవరణ నలంకరణలు జేయగా 

ఇంటింటా పండగ మురిపాలె ముచ్చటేలెగా 

 నవశోభలు  సంతరించె నవ కోర్కెలు దీర్చగా..

 ఉదయరాగ శోభలవే ఉరికివచ్చె వేడుకగా ।॥

-----------------

19/03/2023.

ఉస్మానియా తెలుగు రచయితల సంఘం వారి  జాతీయస్థాయి  "ఉగాది" కవితా పోటీల  కొరకు ,

 అంశం : "శోభాకృత్" నామ సంవత్సరాది.

శీర్షిక : నవ వసంత హేల ఈ యుగాది .

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్:  మహారాష్ట్ర .


కవిత .

-----తొలిపొద్దు పొడుపులో

 మెరిసే ఆనందాల వెలుగులు.

 నవ వసంతాగమనానికి ,శుభ-

స్వాగతాలు పలికే కోయిల గీతాలు ॥

 

 పచ్చదనం నిండిన తోటల్లో

 పరువాల సందళ్ళతో విరిసిన

  పుాబాలల కళ -కళలు నిండిన  

  మలయమారుత సుగంధ వీచికలు ॥

  

మురిసే తరులు సందడితో వినిపించే 

పచ్చని ఆకుల నవ్వుల గలగలలు.

చిగురులు తొడిగిన కొమ్మల నడుమ

కిచ- కిచ రవాల  ఆనంద గీతికలు ॥


 రంగవల్లులు  నిండిన ముంగిళ్ళలో

పడతులు ధరించే  పట్టు పావడాలలో-

 దాగిన పసుపు పాదాల పద-మంజీరాలు 

 చేసే , చిరు మువ్వల సవ్వడులు ॥

 

ఇంటింటా పండగొచ్చిన సంబరాలు 

అన్నదాతలింట హాయి నిండిన-

పంట కోతల బరువు దిగబడుల-

బ్రతుకు ఆనందాల సిరుల వైభవాలు ॥


పిల్లగాలి వీచిలో నేతి సువాసనలు- 

పిండివంటల ,నోరుారించే తీపి ఋచులు.

భగవదార్చనల  మేలు వేద పుాజలు .

విందు వేద్యార్పణల,భక్తి నిండు ఘంటారవాలు॥


ఆరు ఋచుల అద్భుత కలయికల- 

ఓషధీ తత్వాలు నిండిన మధుర భక్ష్యాలు , 

ఆమ్లం, లవణం, కటు , తీక్తం, వగరు

కలగలసిన రసామృత పానీయ సేవనాలు॥

 

వెరసి " శోభకృత్" వత్సరాగమన -

 సందళ్ళతో పిల్లా పెద్దలు, బంధు- మిత్రాది 

కలయికల స్నేహ పుారిత ఆలింగనాలతో 

"నవ యుగాది" కిడు ఆనంద స్వాగతాలు ॥


హామీ:

ఈ కవిత నా స్వీయ రచన.

-----------------------

05/03/2023.


2023 -శోభకృత్  యుగాది సందర్భంగా..

ISBN కవి పత్రిక కొరకు ,


అంశం : ఉగాది.


శీర్షిక  : నవ యుగాదికి స్వాగతం .


రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

 కల్యాణ్. మహారాష్ట్ర .


 రాబోయే "శోభకృత్" యుగాది నెచ్చెలిని

  ఆహ్వానించడానికి,  ప్రకృతి పడతి

సంతోషంగా స్వాగత యత్నాలు చేస్తోంది.॥

 పచ్చని ఆకుల తోరణాలకు పుాల గంధాలనద్ది-

చిలుక చెలులను -కిలకిలారవాలతో

 ఆనంద స్వాగతం పలకమంది.॥

 పుడమి నుదుట, పచ్చ బొట్టై నిలిచిన 

తరు వనంలో,  చిరు గడ్డి తివాచీ పరిచింది.

కళ కళల విరిసిన కలువ  కన్నెలను  

 కాలి బాటలో నిలిపి,అలసి వచ్చిన నెచ్చెలికి

 చల్లని మలయమారుత వింజామరం  వీచమంది ॥

  కమ్మని మావి చిగురుతో తమ కంఠాలకు

 మెరుగుపెట్టుకుంటున్న వసంత కోయిలలను, 

 స్వాగత గీతాలాలపించమంది.॥

 పక్షుల కిల కిలా రవాలు నిండిన 

 విశాల తరు శాఖల చల్లటి నీడలో , 

 మట్టి సుగంధాల మేలు పల్లకి నిలిపింది॥

 అంతలోనే ఆనందంగా ఆడుగిడిన 

అందాల "శోభకృత్ కన్య", పుడమి చెలుల

 ఆప్యాయత నిండిన హ్వానాలకు ఆశ్ఛర్యపడి

 ఆప్యాయతరతో ,తన వంతుగా ఈ వత్సరమంతా 

  అందరికీ అనేక సుఖ భోగాలను పంచి ఇస్తానని

 పలికుతుా ఆమని నెచ్చెలిని ఆనందంగా 

 ఆలింగనం  చేసుకుంది .

  హామీ :

 ఈ కవిత నా స్వీయ రచన.

*****************************

13/04/2021.

"ఉస్మానియా కవుల వేదిక "మరియు 

"భేరి సాహితీ వేదిక" సంయుక్త ఆధ్వర్యంలో 

*ఉగాది కవి సమ్మేళనం* కోసం కవిత.

అంశం. ఉగాది పండుగ గొప్పతనం .

శీర్షిక ; ఓషధీ రస గుళిక.(వచన కవిత).


 "ఉగ" అంటే నక్షత్ర గమనం లేదా జన్మ -

 వీటికి ఆది ఉగాది. యుగం అంటే 

 రెండు కలిసినది-ఉత్తరాయణ, దక్షిణాయనాలు.

షడ్రుచులు అంటే తీపి, పులుపు, ఉప్పు, 

కారం, చేదు, వగరు,. ఇవన్నీ కలిపి చేసిన

 " ఉగాది పచ్చడి "ఎన్నో రోగాలను అరికట్టే 

 "దివ్యౌషధ తత్త్వాలను" కలిగి ఉంటుంది.

 పంచభక్ష్యములు అంటే భక్ష్యం, 

 భోజ్యం, లేహ్యం, చోష్యం, పానీయాలు.

ఇవి మన ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని, 

 వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి 

 ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక 

 ఆచారాలకు, సముచిత ఆహారానికి 

 గల సంబంధాన్ని చాటిచెప్పే రస గుళికలు.

 మానవ  జీవితాలు,అన్ని భావాల మిశ్రమంగా 

  ఉండాలని ఆకాంక్షిస్తుా జరుపుకొనే

  పండగ ఈ "యుగాది" .

 నిరోగ మయ జీవితానందాలను పంచే

  "యుగాది పండగ" , మన సాంప్రదాయ 

  సార జీవామృతమై, మనలను నడిపిస్తోంది

  అనడంలో సందేహం లేదు.

  ------------------------------------------------

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్ : మహారాష్ట్ర .

8097622021.

----------------

యుగానికి ఆది నుండీ ,

యుగాది కన్య ఆగమనాన్ని-

ఆహ్వానిస్తున్న ఆమని చెలుల,

అంతరంగంలో 

అలజడి మొదలైంది ॥


ప్రతీ సంవత్సరం ప్రక్రుతి మాత

ఒడిలో సేదదీరడానికి ,  తమతో

కలిసి -మెలిసి అడడానికి ,

అందమైన ఆశల పల్లకి నెక్కి

ఆత్రంగా వచ్చే తమ

యుగాది  నెచ్చెలిని , 

పచ్చని ఆకుల తోరణాలతో,-

నిండిన ,పుడమి వనంలోకి,


పైరు పచ్చని తివాచీపై-

పరచిన  సుమధుర 

సౌరభాల  నిడు

రంగుపుాల,ఆసన మిడి , 

రాచ మర్యాదల తో,

రంజింపజేసి....


గిరుల -ఝరుల నుండి 

జాలువారే-  నిశ్ఛల- నిర్మల 

నదీ - నదముల నుండి

పారే చన్నీటి చిలకరింపుల, 

తేనీటి, దాహమిడి ,

తేట తెలుగు పాటలతో..

చిరు నవ్వుల పుాతలతో..

సిరి మువ్వల, సందడు లిడు 

వింజామర వీచికలతో

సేద దీర్చి, ....


సుక పిక రవాల సుందర -

కోలాహల, సందడులతో,

కోయిల పాడిన వసంత -

గీతికల,  వందన సత్కారాలతో.

మురిసే మయుారి-

మురిపాల నాట్యాలతో,

వేప ,మామిడి పుాతల 

మత్తు పరిమళాల

అత్తరు సౌరభాలతో,

వన- కన్యల వలపు

పలకరింపుల-

మంగళ గీతాల

మేళ తాళాల తో,

షడ్రుచి పాకాల -

సార విందులతో,

సంత్రుప్తి పరచి,

సాదర ఆహ్వానం -

పలికే ..రోజులు,

ఏ ఏటి కాఏడు -

తరిగి పోతున్నాయి.॥


మనిషి మనుగడకై

పాటుపడే తమ జీవితం,

మనిషి  స్వార్ధానికి-

బలై పోతున్నాది.॥

జన జీవనం పెరిగింది.

కొండలు చరియలు విరిగేయి.

వనాలు తరిగేయి.॥

కాలుష్యంతో నీలాకాశం

నల్లబడింది. పచ్చని

తరువులు కుాలేయి.

గుాడులేక ,పక్షులు

విల విల లాడుతున్నాయి.॥

నీరు లేని మట్టి

నిస్సారమై ..బీడుబారి

బావురుమంటున్నాది.॥

రైతుల ఆత్మహత్యలతో

పచ్చని  పంట పొలాలు- 

దిక్కులేని  దిబ్బలుగా 

మారిపోయాయి.॥

పరిమళించే పుాల అందాలు

పైశాచిక కబంధ హస్తసల లో

నలిగి నలిగి..అమ్మకాల

బేరాలకు , అహుతైపోతున్నాయి.॥

కాలుష్య వాతావరణం 

పెరిగి...,

వనాల వైభవం తరిగి...,

వసంత చెలులు,

విల విల లాడుతున్నాయి.॥

పచ్చని తరువులు లేని,

అందవిహీనమైన -

బీడు భుామిపై-తమ 

యుగాది నెచ్చెలి

నాహ్వానించి ,

మొాడు బారిన కొమ్మలతో 

మొండి ఆసనమేసి ,

ఎండిన నదులలో -

పారని జలాల పాకుడు

నీటిని..దాహమిడి,

కెమికల్  పుాసిన-

విషపు ఫలాల విందును,

ఎలా అందించాలి.. ?॥

తరిగిన మానవత్వపు 

మమకారాల్లో..

విరిగిన మనసుల 

ఆక్రోశాల ఆశ్రమాల లో

ఎలా సేదదీర్చాలి..?॥

వావి -వరసలు లేని-

పాప క్రుత్యాల,  పైశాచిక

విలయ తాండవ నాట్యాన్ని

అమె ఎదురుగా...

ఎలా ప్రదర్శించాలి..?॥

పసిపాపల పై జరిగే-

అత్యాచారపు ఆగడాల

ద్రుశ్యాలని  ....

అమె కంట పడడకుండా

ఎక్కడ దాచి పెట్టాలి..?॥

అడుగంటిన  మంచితనం,

ఆత్మీయత లేని మమకారం

అమ్మతనం , ఆడతనం 

మరచిన , సంస్కారహీనపు

సమాజంలోకి..తమ ప్రియ 

నెచ్చెలిని  ఎలా ....

ఆహ్వానించాలి..?॥


ఎలా..?.ఎలా.?.ఎలా..?


ఇలా  ఎవరి ఆలోచనల్లో 

వారుండగానే..ఆడుతుా- 

పాడుతుా  అడుగిడింది 

యుగాది నెచ్చెలి,

ఉరుకులతో  పరుగులతో...॥

మన భారతీయ  సంస్క్రుతి-

సాంప్రదాయాల్ని..మళ్ళీ 

మనకు తెలియచేసేందుకు.

మన పండగల ప్రసస్త్యాన్ని-

వివరించి , మన సంప్రదాయ

సంపదను పెంపొందించేదుకు.॥

ఆరు ఋతువుల

అద్భుత ఉపయొాగాల్ని,

ఆరు ఋచుల ఓషధి లో

దాగి ఉన్న ఆరోగ్య  

సుాత్రాలను  వివరించేందుకు,

అద్బుత సందేశాల 

మేలు పలుకులతో,

ప్రక్రుతిమాత ఆడ పడుచు

వత్సరానికోసారి..వయ్యారంగా

మనకోసం వస్తోంది.॥

ఏదేశమేగినా , ఎందుకాలిడినా

మరువకుమీ ..పుడమితల్లి

మట్టి సార మహిమలనీ..

మరువకుమీ సద్ధర్మపు

సంప్రదాయ నిరతినీ..

చెరపకుమీ ప్రక్రుతి వన

సంపదలిడు సుధలనీ..

చేయకుమీ పతనము లిడు,

కాలుష్యపు కర్మలనీ...


అని పాడుకుంటుా....

అదిగో... "వికారి "

నామ విశ్వ కాంత...

వచ్చింది --వచ్చింది,

నవరసాల సొగసులతో...

పరవశాల పొంగులతో..

-------------------------

రచన , శ్రీమతి ,

పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్.

వెన్నెల సాహిత్య అకాడమికి, ఉగాది శుభాకాంక్షలు ".


వెన్నెలలు కురిపించు ,చల్లని మాటల

 కీర్తి నిండిన కవన,కన్నెలు, వసంత గీతికల

 ,సిరి సిరి మువ్వల సడులతో,

కల- కలారవాలు నిండిన, 

ఆమని సొగసుల అందమై,


సార,సుమ సౌరభాల,సుందర వనకన్యల 

చెలిమితో,హితవైన సాహిత్య శోభలు రాజిల్లు సందడులతో-నిత్య నుాతన ,సాహిత్య , కథన, కళారతులైన,.....

అగ్రేశ్వరులౌ, కవి సార్వభౌముల, భావ పరంపరల-

కాసార ,కవితా ప్రవాహములో,జలకమాడి 

వాడ-వాడలా, ప్రసరించే ప్రశంశాపుారిత

 పద జాల సమాగమ.మిత్ర  బృంద , పరివార, 

 పరీజన హితులతో కలిసి,.

 కిట -కిటలాడే ,శ్రోతలతో నిండిన, వినోద రస భరితమైన ,ఉల్లాసోజ్వల పుార్ణచంద్ర 

 శీతల కిరణ  కవన కీర్తి , గాన,జ్ఞాన

 రస,గద్య ,పద్య ,సార, సుగంధ వీచికయై-,

 దిన-దిన ప్రవర్ధమానమౌ రీతుల నలుదెసలా

 వ్యాపించి , గౌరవ శిఖరాగ్రాలుచేరాలని, --

శుభ్ర వస్త్ర,వఝ్ర, కిరీటాది ,దివ్యాభరణ ద్యుతుల-

భాసిల్లు ,కవన కాంతల' మేలిమి బంగరు పసిమి- 

కాంతుల, కీర్తి కిరణాల తో కలసి ,వాణీ విలసిత,సా-

క్షర,సుమగంధమిళితమై,నలుదిక్కులాగుభాళించు,పలు ,ఆనంద శోభలతో,మంగళ ప్రద రవములతో,నిండు


   "ఉద్ధండ చంద్ర శేఖర వెన్నెల కవన కాంతి వేదిక  "

   నిత్య నుాతన గతుల, దిన దిన ప్రవర్ధమానమై -                                                       --                  వర్ధిల్లాలని ఆశీర్వదిస్తుా.....

                         "శార్వరీ వత్సర  "                       "            .          " శుభాకాంక్షలు".  

                తెలుప, వేంచేయుచున్న కీర్తి-

                      కాంతలకు "స్వాగతం ",  

                        "  సు స్వాగతం."

                     ----------------------------


రచన , శ్రీమతి ,

పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్ ( మహరాష్ట్ర .).

-------------------------------     

కవిత లోని మొదటి అక్షరాలు చదివితే వచ్చే వాక్యం.

"వెన్నెల సాహిత్య అకాడమికి, ఉగాది శుభాకాంక్షలు ".

--------------------


    02/03/2021


శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ శ్రీ కత్తిమండ ప్రతాప్ గారి సారధ్యం లో శుభకృత నామ సంవత్సర ఉగాది సందర్భంగా

  "ఉగాది కవితల పోటీ..

 ‌రచన: శ్రీమతి:పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

  కల్యాణ్ : మహారాష్ట్ర .

  8097622021.

అంశం : యుగాది ఆనందమా! నీ వెక్కడ?

  శీర్షిక : మారని కాలం లో  మారుతున్న  మనిషి.

  -------------

 కాల చక్రం తన మానాన తాను తిరుగుతునే ఉంది.

ప్రభవ, విభవాది  అరువది సంవత్సరాల కాలం

ప్రతీ వత్సరానికి ఒక ప్రత్యేకతతో వస్తుానే ఉంది.॥


మహిలో మనుషులు మాత్రం నాటి నుంచి నేటి వరకు

కాలాన్ని సవాలు చేస్తుా ప్రకృతితో పరాచికలాడుతుా

క్షణానికో మనస్తత్వంతో మారణహోమం చేస్తుానే ఉన్నారు. ॥


కాలం ...అలాగే ఉంది . రాత్రుల చీకట్లను దాటి 

వెలుగు వెన్నెలలు పంచుతుానే ఉంది.

ఆరు ఋతువులకు ఆహ్వానం పలుకుతుా

ప్రకృతి నియమాలను  నిలుపుతునే ఉంది ॥


కాలం మారిందంటుా తానే మారుతుాన్న మనషి

సభ్యత, సంస్కారాలతో పాటు మానవత్వాన్ని 

కుాడా కోల్పోతుా స్వార్ధ పరుడై మసలసాగేడు.

"తన" పర" లతో పాటు వావి వరుసలు మరచేడు.॥


రాక్షసత్వంతో పెట్రేగిన  కామొాద్రేకాలతో

కన్ను మిన్ను కానని కఠినాత్ముడయ్యేడు.

వక్రీకరించిన మనిషి బుద్ధి వరుస దురాగతాలతో

 భ్రష్టు పట్టి రాక్షసత్వం తో రంకెలు వేస్తోంది॥


ఆడతనంలో ఆమ్మను చుాడవలసిన వాడు

అమ్మతనంలో ఆడతనానికి అంగలారుస్తున్నాడు.

వింత పోకడలు పెరుగుతున్న  సమాజంలో.

న్యాయంకుాడా నోట్ల మత్తుకు లొంగిపోయింది ॥


 విధి రాతను  తప్పించలేని కాలం, కకలావికలమై

కరువు కాటకాలకు నెలవై క్రమశిక్షణ కోల్పోయింది 

ఐనా ఇప్పటకీ మనిషి కాలాన్ని దుాషిస్తుా 

తనను  తాను సమర్ధించుకుంటుానే ఉన్నాడు..॥

-------------------

.11/04/2021

గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదికవారి

ఉగాది కవితల పోటీ కొరకు...

అంశం : భవిష్యత్ ఇలా....

శీర్షిక : భయంలేని భవిష్యత్తు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్ : మహారాష్ట్ర .

8097622021.

--------------------

2020  లో కరోనా రేపిన కలకలం.

లాక్ డౌన్ గృహ నిర్బంధాలు

భయాందోళనలతో హోరెత్తించింది

2021 లో  రుపు మార్చుకు వచ్చిన

కరీనా ముందున్నంత ఉధృతంగానే

ఉన్నా , రోగ లక్షణ , నివారణ పథకాలు

తెలుసుకున్న జనం , అప్రమత్తమై

సామాజిక దుారం పాటిస్తుా , మాస్క్ లు

 వాడుతుా జాగర్తలు పాటిస్తున్నారు. 

పరిసరాల పరిసుభ్రత తోపచ్చని మొక్కలు 

నాటి  "పర్యావరణ రక్షణ" చేస్తున్నారు.

"కరీోనా" ను తరిమికొట్టే "వాక్సీన్స్" తీసుకుంటుా

ఆహార నియమ నిబంధనలు పాటిస్తున్నారు.

ఇదంతా చుాస్తున్న "ప్లవ "నామ ఉగాది కన్య

మనుషుల్లో వచ్చిన మార్పుకు మురిసిపోతుా

"భయం లేని భవిష్యత్ ప్రణాళికల "

బాధ్యత తో "స్వశ్ఛ భారతిని"  తీర్చిదిద్దే 

నవ వసంతపు" నీటి సమృద్ధి వనరులతో "

"నవ యుగాది "ఆరంభపు  ప్రభలతో

నవ్వులు పండించడానికి ఆనందంతో వస్తోంది.

మనం కుాడా "షడృచుల "అమృత 

కలశంతో  ,ఆమె ఆగమనానికి 

"ఆనంద స్వాగతం " చెపుదాం పదండి.

----------------------------------------

హామీ : నా ఈ రచన  ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.

-------------------

content@teluguone.com 

(అక్షరయాన్ లో)కు పంపినది.


రచన:శ్రీమతి: పుల్లాభట్ల -

జగదీశ్వరీముార్తి.

కల్యాణ్: మహారాష్ట్ర .

శీర్షిక : మరో కోణం లో,

మన ఉగాది.


ఉరుకుల పరుగుల జీవితంలో

వత్సరానికొకసారి వచ్చే యుగాది కన్య

తరతరాల మన సాంప్రదాయ సారాన్ని,

పండగల పేరుతో  మనం చేసే పారిశుభ్రతల ప్రాశస్త్యాన్ని ,గమనించేందుకు 

ఆనందామృతాన్ని పంచే వసంత బాలగా 

వచ్చి, మనందరి మన్ననలను 

ఆదరంగా అందుకొని ఆనందపడేది.॥

మారుతున్న మనస్తత్వాలకు 

మైల పడిన కాలం, మారణహోమాల్లో

దగ్ధమై , మరో చరిత్రను సృష్టించింది.

అంతరాలను మరచిన మనుషుల స్వార్ధపు-

వికటాట్టహాసాలకు ,నిర్వీర్యమైన మానవత్వానికి 

అబలలు  కార్చే కన్నీటి శాపం కరోనాగై కాటేస్తుంటే, 

విప్లవ భావాల వింతప్రపంచపు వరుస కాష్టాల్లో  

రోజుకో రుాపు ధరించి విహరిస్తుా  రోగాలపాలు చేస్తున్న-వింత కణానికి విరుగుడుగా 

ఈ సారి మరో కోణంలో మన ముందుకు 

మళ్ళీ వస్తోంది ,యుగాది కన్య.॥

మరో చరిత రాసేందుకు.  

మాస్క్ ధరించిన -మొాముతో , 

సానిటైజర్ల  బహుమతులతో...

మానవత్వపు "వాక్సిన్" ని మందుగా

మనకు ఎక్కించ్చేందుకు. పరిశుభ్రత నిండిన

పాఠ్య పుస్తకాలతో , ప్లవ నామ ధారిణిగా....॥

--------------------------------------------------

ఇష్టపది సదయ్యగారి ఉగాదిసంకలనం కోసం.


శీర్షిక.

చిరు నవ్వుల ఉగాది కన్య .

రచన:శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్: మహారాష్ట్ర .


వెన్నెలలు కురిపించు ,చల్లని 

మాటల  కవన,కన్నెలు, వసంత 

గీతికల స్వర రాగ లయల

 సిరి సిరి మువ్వల సడులతో,

 కలకలా రవాలు నిండిన, 

ఆమని సొగసుల అందమై,

సార,సుమ సౌరభాల,సుందర

 వనకన్యల చెలిమితో,హితవైన 

పద శోభలు రాజిల్లు సందడులతో

నిత్య నుాతన ,సాహిత్య , కవన, 

కళా విలాస కాంతిరతులైన,.....

అగ్రేశ్వరులౌ, కవి సార్వభౌముల, 

భావపరంపరల-కాసార ,

కవితా ప్రవాహములో,జలకమాడి ,

వాడ-వాడలా, ప్రసరించే ప్రశంశా

పుారిత వచన , సమాగమ.

మిత్ర బృంద, పరివార, పరీజన 

హితులతో కలిసి,.కిటకిటలాడే ,

శ్రోతలతో నిండిన, వినోద రస భరితమైన ,

ఇష్టపద సంపదల సాహిత్య వనాశక్తులై

 గాన,జ్ఞాన ,రస,గద్య ,ఛందోబద్ధ

పద్య రస సార సుగంధవీచికలు-

దశ దిశల వ్యాపించి పరిమళిస్తుా

,దినదిన ప్రవర్ధమానమౌ రీతుల గౌరవ శిఖరాగ్రాలుచేరాలని, శుభ్రవస్త్ర,వఝ్ర, కిరీటాది ,దివ్యాభరణ ద్యుతుల-

భాసిల్లు , విజయ కాంతల' 

మేలిమి బంగరు పసిమి- కాంతుల, 

కీర్తి కిరణాల తో కలసి ,వాణీ విలసిత,

సాక్షర, కావ్య రసామృత మిళితమై,

 గుభాళించు,సుమ సౌరభాల శోభలతో,

 మంగళ ప్రద రవముల వసంత 

 కోయిలల,నిండు రాగాల నిత్య నుాతన 

 గతుల,దిన దిన ప్రవర్ధమానమై -

 నిత్య నుాతన శోభాలంకృతయైన 

"ప్లవ నామ యుగాది" కాంత

సామాజిక దుార నియమాలను పాటిస్తుా..

మాస్క్ ధరించిన మేలి ముసుగుతో

 మొాహినీ రుాపధారిణియై 

 నిరోగ ఓషధీ తత్వపు 

 మహిమ నిండిన" వాక్సిన్" అనే 

 మధురామృత భాండముతో

 చిరునవ్వులు నింపడానికి మన 

 ముందుకు వస్తోంది .ఆనందంతో 

 స్వాగతం పలుకుదాం రండి. 

-------------------------+

మనుమసిద్ధి కవన వేదిక

15 /03/2021


రచన:శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్: మహారాష్ట్ర .

శీర్షిక : నవ యుగాది.

ప్రక్రియ : వచన కవిత.


కరోనాతో  భారమైన బ్రతుకు చిత్రం.

కాలకుాట విషనాగులైన ,కర్తవ్య పాలకులు ,

మారుతున్న మనస్తత్వాల మారణ హోమం.

స్వార్ధ పుారితమైన ఆలోచనలతో మనిషి-

తప్పు దారి పడుతున్న సమయంలో

సాంప్రదాయాల విలువలు నిండిన కలశంతో

ఆరు రుచుల ఆరోగ్యానికి , ఏడవ

రుచిగా మానవత్వమనే అమృతాన్ని కలిపి

చిరునవ్వులు వెదజల్లెేందుకు వస్తోంది

 నవోదయ కాంతికిరణమై నవ యుగాది .॥

 ----------------------------------------------------

హామీ :

"నవ యుగాది" శీర్షిక గల ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన

-------------------

షీ టీమ్స్. కోసం ఉగాది కవిత.

--------------------------

(మొదటి అక్షరాలు నిలువుగా చదవితే

వచ్చే భావాక్షర సంపద.).

అక్షరయాన్ మహిళా సాహిత్య -,

సేవానిరతికి  ఉగాది శుభాకాంక్షలు .


అబలల ఆత్మబలానికి ఆలంబన నిచ్చేఆప్త తేజమై,

క్షణం కుాడా, విశ్రాంతి నెరుగని అవిరామ క్రుషీ తో-

రక్షణ,శిక్షణల నీడనిచ్చే,మమతల మహా వ్రుక్షమై-

యావత్ మహిళాసమస్యల సమాధాన-సమాహారమై,

నమ్మకమైన నియమాల, నిశ్ఛయ సంకల్ప సారమై,

మమతా,మానవతాధ్రుక్పథ ,సేవాభావ, సహయొాగ-

హిత, కార్య -కలాపాది,  సమ్మిళిత.కవన క-

ళా,సాహిత్య,సమావేశాది కార్యకలాపోత్సుకతాతుర-

సార ,సమన్వయ,సాహస,శ్రామికమహిళాబ్రుంద-

హిత ,సన్నిహిత,-పరిజనాది  స్వాతంత్ర్య  ,ని

త్య,జీవన పోరాటాది, కార్య-కలాపాది ,సహిత-

సేవా సంకల్ప, ప్రయత్నాపుారిత,కార్యాక్షర యాన-

వాక్ సుధారసాధ్భుత,ప్రేరణాపుారిత కవనకాంతలకు-.

నిత్య కల్యాణ,సామాలోచనా పుారిత సాహిత్య -

రసమయ వాజ్మధుర గీత, సంగీత,రస పానామ్రుతులై.

తిరోధాన, సంఘటిత, తీక్ష్ణ ,పోరాట పటిమొాద్యమాది

కిరణ కవన వేదికానంద, మహిళా,స్రవంతి చెలిమికై  .

ఉద్యమోత్సాహిత,సాహస మహిళా తతీ యుత  ,    

గాన, కవితా సమారంభ రసోల్లాస సమాగమ-

దిగ్విజయ ప్రాప్త,అభయ హస్త, కీర్తి కిరీట ద్యుతులతో-

                                విచ్చేసిన

 శుభ "శార్వరీ" తేజ , శక్తిమయ పుారిత ,నవ వర్ష-సు

భాసిత పరంపరాది, భారతీ సాంప్రదాయ, శోభిత

కాంతామణి మండల, కవన  కోమల, సుందర సారా--

క్షర కవితా ఝరీ ప్రవాహిత కీర్తి కమల కాంతలకు, ప

లు ప్రశంసల ,తెలుగు నవ వర్ష , "శార్వరీ" నామానంద-  

       శుభాకాంక్షలతో ,స్వాగతం, సు స్వాగతం.

-------------------------------------------------------

రచన, శ్రీమతి ,

పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్. (మహరాష్ట్ర ).

----------------------------------+

నవ తెలుగు తేజం " మాస పత్రికా

                      సభ్యులకు నుాతన-

                             " శార్వరీ"

              నామ సంవత్సర శుభాకాంక్షలు..


శీర్షిక: శార్వరీ తేజం.


నవ వర్ష శుభాకాంక్షలేలే  శుభ సమయంలో..

వర్ధమాన కవి సముాహపు విందు , వినోదాలతో..,

తెలుగు  వేదిక, శోభాయమానమైన...ప-

లు సాహిత్య సంపదల , సమావేశపు సందడులతో,

గుభాళించే పరిమళాల సుమ  సమాహారమై,

తెేట- తెలుగు,వెలుగులతో,అజరామర.కీర్తి రా-

జంబై, వేల సత్కారాల, సమాగమ సమగ్ర తేజమై.

సార కవితా రసాల, మ్రుదు మధుర సుధలతో,

హితవైన పద సముాహపు, చమత్కారకేరింతలతో,ని-

త్య నుాతన సమతా-పుారిత సమన్వయ కళావేదికగా ,

వేవేల ప్రశంసాపుారిత,  వచన, కవనాల సారమై,

దిన -దిన ప్రవర్ధమానమై,  మేటి, రచనా దురంధరాది కవి సముాహ,  సాహిత్య సుమ సుగంధ వీచికయై ,

కుల, మత , తారతమ్యాధిగమనార్జిత, కీర్తి కిరీటమై ,

ఉన్నతోన్నత పద- కుార్పుల , మణిమాలాభుాషితయై

గారపట్టిన సమాజపు కుళ్ళుని, కుాకటి వేళ్ళతో సహా

దిగ్విజయంగా దిగలాగగల , దిట్టమైన కలం హలంతో.

శుద్ధ తర, కవితాస్త్ర సమ్మేళనాది  విజయాలతో -

భాసిల్లుతుా, కళలు నిండిన రమణీయ కావ్య కళా...

కాంతయై, గద్య -పద్య సంగీతాది సకల కళా., సా

క్షరానంద, హిత  కార్య- కలాపాల మిళిత తేజమై- ప

లు వేల జే -జేల కవితా రస శోభలతో ,భాసిల్లు -

           "

              -------------------------------------------

రచన , శ్రీమతి ,

పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్. ( మహరాష్ట్ర ).

-----------------------------------


పద్మగారుా..!

మొదటి అక్షరాలను ,  నిలువుగా చదివితే వచ్చే వాక్యం...👇

"నవ తెలుగు తేజం " సాహిత్య వేదికకు-

             "ఉగాది" శుభాకంక్షలు.    

             ( అనేది గమనించగలరు.).

--------------------

30/03/2022.

 *సాహితీ బృందావన విహార వేదిక అనుబంధ సంస్థ ఉమెన్స్ రైటర్స్ నేషనల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించు శ్రీ శుభకృత్ నామ తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకల కవితా తోరణం SBVV ఉగాది  జాతీయ పురస్కారాలు 2022 కోసం రాసిన కవిత.


 రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .

 క్యాణ్:మహారాష్ట్ర .

 శీర్షిక : కవితాక్షర సత్కారం .


గుండెల పల్లకిలో  దాగిన భావాక్షర కన్యలు

గుస గుసలాడుతుా గుప్పెట్లో కొచ్చి తొంగి చుాసేయి.

 బాధలు నిండిన జనసందోహాల 

 కన్నీటి కథనాలకు  కరగి కుంగిపోయాయి ॥

 

 ఏటేటా వచ్చే యుగాది కన్యల వరుస 

 ఆగమనాలతో  ఆగని అరాచకాలకు ,

 అక్షర తుాణీరాలతో కవనోద్యమాలు చేసి

 కవితా వ్యుాహాల కట్టడితో  కాపు కాసాయి॥

 

ఐనా ఆగని అరాచకాలపై  "సున్నిత" మైన

పదజాల పంక్తులతో భావ ప్రహారం చేసాయి.

అక్షర తుాణీర ప్రభావానికి అణగారిన శార్వరీ,

ప్లవ,నామ కన్యలు పరువు పలాయనం చేసాయి॥


అన్నీ గమనిస్తున్న అక్షర కన్యలు ఆనందంతో

కవన వనంలో కావ్య సమారోహాన్ని జరిపి

 "శుభకృత్ -వత్సర కన్యకు శుభ సందేశాన్నంపి

ఆనంద స్వాగతాలతో అవనికి ఆహ్వానించాయి.॥


ఆనంద పల్లకిలో శుభ శోభాలంకృతయై వచ్చిన

"శుభకృత్" నామ నెచ్చెలికి ఆరు ఋచుల అమృతాలు నిండినఆరోగ్య పక్వాలతో స్వాగతాలు పలికిన జనులకు అభయహస్తాన్నిడిన శుభకృత్

చెలిని చుాసిన కవన కన్నియలు ఆనంద కవితా

 సుమాక్షర మాలలతో  ఆమెను సత్కరించేయి. ॥

 హామీ :

ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన.


***************************************


ప్రతీ వత్సరం  మారుతున్న గ్రహ నక్షత్రాల  

గమనాలకు అనుగుణంగా మారుతున్న కాలంలో

మంచి-చెడులతో నిండిన సుఖ- దుఃఖాలు

మనిషి జీవితంలో తెస్తున్న మరపురాని మార్పులు॥


ఏ ఏటి కాయేడు అడుగిడదామన్న ఆశల సోపానం

అడుగు దుారంలోనే  అందీ అందనంత ఎత్తుకు 

ఎదిగిపోతుాండడంతో నీరస పడుతున్న  జనంలో  

నిండిన  నిరాశ -నిస్పృహల నిట్టుార్పుల గాడ్పులు॥


కణ బాధల కన్నీటి కథనాలు ,

నోటు బందీలతో అస్తవ్యస్తమైన  జన జీవితాలు .

కామ వికారాలకు కాలిన కడుపు కోతల కన్నీళ్ళు 

కటిక దరిద్రంతో బతుకు భారమైన బడుగు జీవితాలు॥


గడచిన నాలుగు వత్సరాలలో కాలం తెచ్చిన

ఖర్మానికి తెరవేస్తుా ఆశలు తీర్చే ఆనంద పల్లకిలో,

నవ యుగాది శుభారంభానికి శుభ సుాచకంగా

 కోర్కెల వసంతాలు కొంగులో  నింపుకొని,

ఆనంద వసంతాల  అమృతాన్ని పంచేందుకు-

 మరో ఆశాకిరణమై మనమధ్యకు  వస్తున్న 

 "శుభకృత్ యుగాది" కన్యకు  మనమంతా కలసి మంగళ గీతాలతో పలుకుదాం ఆనంద స్వాగతం ॥


భకృత్ యుగాది శభాలకు సంకేతం 

---------------------------

11/04/2021

గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదికవారి

ఉగాది కవితల పోటీ కొరకు...


అంశం : భవిష్యత్ ఇలా....


శీర్షిక : భయంలేని భవిష్యత్తు.


రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్ : మహారాష్ట్ర .

8097622021.


2020  లో కరోనా రేపిన కలకలం.

లాక్ డౌన్ గృహ నిర్బంధాలు

భయాందోళనలతో హోరెత్తించింది

2021 లో  రుపు మార్చుకు వచ్చిన

కరీనా ముందున్నంత ఉధృతంగానే

ఉన్నా , రోగ లక్షణ , నివారణ పథకాలు

తెలుసుకున్న జనం , అప్రమత్తమై

సామాజిక దుారం పాటిస్తుా , మాస్క్ లు

 వాడుతుా జాగర్తలు పాటిస్తున్నారు. 

పరిసరాల పరిసుభ్రత తోపచ్చని మొక్కలు 

నాటి  "పర్యావరణ రక్షణ" చేస్తున్నారు.

"కరీోనా" ను తరిమికొట్టే "వాక్సీన్స్" తీసుకుంటుా

ఆహార నియమ నిబంధనలు పాటిస్తున్నారు.

ఇదంతా చుాస్తున్న "ప్లవ "నామ ఉగాది కన్య

మనుషుల్లో వచ్చిన మార్పుకు మురిసిపోతుా

"భయం లేని భవిష్యత్ ప్రణాళికల "

బాధ్యత తో "స్వశ్ఛ భారతిని"  తీర్చిదిద్దే 

నవ వసంతపు" నీటి సమృద్ధి వనరులతో "

"నవ యుగాది "ఆరంభపు  ప్రభలతో

నవ్వులు పండించడానికి ఆనందంతో వస్తోంది.

మనం కుాడా "షడృచుల "అమృత 

కలశంతో  ,ఆమె ఆగమనానికి 

"ఆనంద స్వాగతం " చెపుదాం పదండి.

----------------------------------------

హామీ : నా ఈ రచన  ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.

------------------------

11.మార్పు రావాలి.


మనకు జ్ఞానం వచ్చింది దగ్గర నుండి,

మనం కొత్త సంవత్సరంలోనన్నా బాగుంటామేమో అన్న ఆశతో,

ముందున్న సంవత్సరానికి స్వస్తి చెప్పి,

కొత్తసంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాం

కానీ మనం ఎప్పుడు ఆలోచించలేదు

సంవత్సరం మారినంత మాత్రాన

" జీవితాలు మారుతాయా "అని

ముందు మనలో మార్పు రావాలి

జాతిమతాలకు తావివ్వకుండా ,

అందరూ ఒక్కటై స్నేహభావంతో మసలాలి

తల్లిదండ్రులను,స్త్రీలను గౌరవించాలి.

అవసరార్థులకు చేయూత నంది ఇవ్వాలి

మాటల్లో మంచితనం,చేతల్లో నిస్వార్థత ఉండాలి.

పిల్లలకు జీవితంపై సరైన అవగాహన పెంచాలి

ఇలా కొన్ని మార్పులు మనలో వస్తే 

ప్రతి సంవత్సరం శుభ సంవత్సరమే...

రాబోయే సంవత్సరంలో ఎన్నికలు జరుగనున్నాయి

తెలివైన ఆలోచనతో సరైన నిర్ణయం తీసుకుందాం..

" క్రోధి" నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ..

"మనమూ బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి" అన్న ఆలోచనతో అడుగు ముందుకేద్దాం.


పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి

కల్యాణ్