Wednesday, June 30, 2021
దోబుాచులాడబోకు
కవికులం యుా ట్యుాబ్ ఛానల్
Monday, June 28, 2021
ఈరోజు జీకే ప్రశ్నలు
కుళ్ళిన సమాజం..అనాధ
అంశం : అనాధ.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
శీర్షిక .
కుళ్ళిన సమాజం.
--------------------------
మానవత్వం లోపించిన మనుషుల మతిలేని
చర్యలకు బలయ్యే మాంస పిండాలు.॥
చింకి చీరల ముాటల్లో చెత్త కుప్పల్లోకి చేరిన పసి ప్రాణాల కన్నీటి బాధా పుారిత అనాధ గాధలు ॥
కొవ్వెక్కిన కామానికి ,కోర్కె తీరిన మానానికి
బరువైన, భావి భారతి ఒడి జారిన ఆశా దీపాలు..
అందరుా ఉన్నా ఎవరుా లేని అనాధలు.॥
రాక్షసత్వం నిండిన రౌడీల పేటలో
అంగాంగ శోషణ శాపాలకు గురై , అడుక్కు తినే
ఆహారానికి కుాడా హక్కు లేని అభాగ్యులు అనాధలు॥
అభం శుభం ఎరుగని పసి కందులని కుాడా
చుాడక , అంగడిలో ఆటబొమ్మలుగా వెలకట్టబడి రాక్షసత్వపు రాసలీలలకు అరాచకంగా వ్యభిచార గృహాలకు చేర్చబడిన వేట బొమ్మలు అనాధలు॥
పట్టెడన్నం కోసం పుట్టెడు బాధల గాయాలని
కన్నీటి కావిళ్ళతో కడిగి తిరిగి లేస్తున్న
బతికున్న జీవశ్శవాలు అనాధలు.॥
బాలల దినోత్సవ అదర్శ భాషణల బరువుకు,
రాజకీయ రంగుల హంగులకు రాసి పోగులై,
అతఃపాతాలకానికి అణిచివేయబడ్ద
అసహాయ తోలుబొమ్మలు అనాధలు.॥
హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని
నా స్వీయ రచన.
దేశ భక్తి గీతం.
ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము
ఏ పూర్వపుణ్యమో, ఏ యోగ బలమో జనియించినవాడ నీ స్వర్గఖండమున ఏ మంచి పూవులన్ ప్రేమించినావో నినుమోసె ఈ తల్లి కనక గర్భమున
లేదురా ఇటువంటి భూదేవి యెందు లేదురా మనవంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురుల్ సోకునందాక ఓడల ఝండాలు ఆడునందాక
అందాక గల ఈ అనంత భూతల్లిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరా నీ తెలుగు బాలగీతములు పాడరా నీ వీర భావ గీతములు
తమ తపస్సుల్ ఋషుల్ ధారవోయంగా శౌర్య హారము రాజ చంద్రులర్పింప రాగ దుగ్ధము భక్త రక్తముల్ పిదుక భావ సూత్రము కవి ప్రభువు లల్లంగా
దిక్కులకెగదన్ను తేజములు వెలుగ జగముల నూగించు మగతనంబెగయ రాళ్ళు తేనియలూరు రాగాలు సాగ సౌన్దర్య మెగబోయు సాహిత్య మలర
వేలగిండీ దివ్య విశ్వము పుత్రా అవమానమేలరా అనుమానమేల భారత పుత్రుండనచు భక్తితో బలుక
Sunday, June 27, 2021
అనుక్షణం భయం భయం
Friday, June 25, 2021
సున్నితం.
Wednesday, June 23, 2021
అంశం :పి.వి.నరసింహారావు శత జయంతోత్సవం.
Tuesday, June 22, 2021
గజల్ ప్రక్రియ నియమాలు.; వివరణ
Sunday, June 20, 2021
దత్తపది
మహిళా సాధికారత కు మార్పు రావాలి.
శ్రీ కళా వేదికలో..
అంశం : మహిళా సాధికారత.
రచన: శ్రీమతి :
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : మార్పు రావాలి.
"యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః"
అంటుా వేద ఘోషలు చేస్తుానే..
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా ఆంటుా..స్త్రీ లను వంటింటి,
పడకింటి పనులకు పరిమితం చేసీసేరు
మారుతున్న కాలంతో పాటు అన్ని రంగాల లోనుా దుాసుకుపోతుా కొన్ని అడుగులు ముందుకేసిన
స్త్రీ లబ్రతుకు సమాజంలో చితికిపోతోంది.
లైంగిక దాడులు..గృహ నిర్బంధాలు , పైశాచిక ప్రణాళికల వేధింపులతో స్త్రీ ల బ్రతుకులు ఛిద్రమై దుర్భరమౌతున్నాయి.ఈ స్థితి దాటి
సమాజం స్త్రీ లను గౌరవించే స్థితికి రావాలి అంటే.మహిళా సంక్షేమ పథకాలు అమలులోకి రావాలి.విద్య , ఉద్యోగ ,వ్యాపార రంగాల లో
స్త్రీ లకు ఉన్నత స్థానం కల్పించాలి.
రాజకీయ, సామాజిక ,ఆర్ధిక ,పరంగా
స్త్రీలను బలోపేతం చేసి , స్వయం
నిర్ణయాత్మక శక్తిని , స్వశక్తి పై ఆత్మవిశ్వాసాన్ని,
పెంపొందించే విధంగా వారిని ప్రోత్సహించాలి.
మార్పుకనుగుణమైన సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలి.ఏ రోజైతే స్త్రీ పురుషునితో
సమాన విజేతగా గుర్తింపబడుతుందో ఆరోజే
మన, సమ -సమాజ స్థాపనకు నిజమైన
అర్ధం వినిపిస్తుంది , కనిపిస్తుంది కుాడా..
హామీ:
ఈ నా వచన కవిత ఏ మాధ్యము నందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
Sunday, June 13, 2021
అంశం: మనలో మనోబలం....కరోన తిరోగమనం.🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
Friday, June 11, 2021
* హైకూల నియమాలు *
Thursday, June 10, 2021
కొత్త పద్య ప్రక్రియ : పద్య చంద్రిక
జాతకాలు
అంశం : జాతకాలు.
రచన:శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక-
పవిత్ర గ్రంధం.
(వచన కవిత).
జ్యోతిషశాస్త్రం అనేది ఋషులు మనకందించిన పురాతనమైన పవిత్ర వేద గ్రధం.
శాస్త్రసమ్మతమైన ఈ గ్రంధం కాలానికి అనుగుణంగా గ్రహాల స్థితిగతులు మన జన్మ రాశిపై ఏ విధంగా అనుకుాల, ప్రతికుాల పరిస్థితులకు .. దోహదమౌతాయొా తెలియొరచే దివ్య శాస్త్రం
ఈ జ్యోతిషశాస్త్రం చెప్పేవారు గాయత్రీమాత ఉపాసకులై ఉండి, నిత్యానుష్టాన నియమాలతో
తమ కులదేవతార్చనను యధావిధిగా నిర్వర్తిస్తుా
దైవబలాన్ని పొందిన వారై తేజోవంతులై
ముఖం చుాడగానే వారి భవిష్యత్తు చెప్పగలిగే
సామర్ధ్యం కలిగి ఉంటారు.
.సమాజానికి ఉపయొాగకరమైన సమాచారాన్ని అందించి శుభాశుభ విశ్లేషణ చేసేదే జ్యోతిషం .
జ్యోతిషం చెప్పేవారిని దైవజ్ఞులంటారు.
నిష్ట నియమాలతో , నిస్వార్ధంగా జనహితానికై
ఉపయొాగ పడే ఈ విద్య ఈ నాడు వ్యాపారమైంది.
నిష్టానియమాలు, సమయపాలన , అర్హత లేని
చాలామంది , ప్రజల బలహీనతలను ఆధారంగా తీసుకొని ఈ జ్యోతిషశాస్త్రం ఉపయొాగాన్ని
దుర్వినియొాగం చేస్తున్నారు.
-------------------------------------------------------
నిలువు దోపిడీ
ప్రక్రియ సున్నితం.
Tuesday, June 8, 2021
ఏరువాక పుార్ణిమ.
Monday, June 7, 2021
గంగమ్మ
10..05. 2021
మహతీ సాహితీ కవి సంగమం కరీంనగర్
ప్రతి రోజు కవితా పండుగే
పర్యవేక్షణ: డా॥.శ్రీ .అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ: .దాసరి చంద్రమౌళి గారు
సమీక్షణ: శ్రీ .టి.ఆర్.కె.కామేశ్వరరావు .గారు.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
శీర్షిక : అన్నీ తెలిసిన వాడు.
ప్రక్రియ : వచన కవిత.
పితృదేవతల ఉత్తమ గతి ప్రాప్తి కొరకు
భగీరధుడు చేసిన తపో ఫలము చేత
ఉరుకులు పరుగులతో ఉధృత తరంగిణియై
ఉరికి వస్తున్న గంగమ్మను శివుడు తన
జటా జుాటంలో బంధించి , లోకంలో
జీవ, జంతుల రక్షణార్ధఁం చిన్న ధారగా
భుామిపైకి ప్రవహింపజేసేడు. పవిత్ర గంగ
మానవుల పాప ప్రక్షాళన చేస్తుా ,సమృద్ధిగా
నదీ -నదాల లో నిండి , జన జీవితాలను
ఉద్దరించి పాప ప్రక్షాళన గావించింది.
అటువంటి గంగమ్మ విలువ గుర్తించని
జనులు పవిత్ర గంగను కలుషితం చేస్తుా..
కాలుష్యం నిండిన పర్యావరణానికి
పునాదులేసారు.స్వార్ధ పుారిత మానవులకు
అహర్నశలుా అమృతాన్ని పంచే గంగమ్మ
అవమానితయై ఆవేశంతో ఉరిమి ఉరికింది...
ఊరుా-వాడా ముంచెత్తింది.
ఆగడాలకు' ఆవిరై ఇగిరి పోయింది
శాంతముార్తయైన గంగ కలుషితాల కంపుకు కనుమరుగై పోగా పీల్చ ప్రాణవాయువు ,
తాగ మంచినీరు కరువైన జనులు
విష కణాల బారిన పడి వింత రోగంతో
విధివంచితులై ఊపిరాడక
ఊర్ధ్వగతులకు చేరుకుంటున్నారు.
పర్యావరణ కాలుష్యానికి పొగబారి
నల్లబడిన మేఘాలచాటునుండి తొంగి
చుాస్తున్న పుార్ణ చందృడు..
మందులేని మహమ్మారి కంట పడకుాడదని
ముఖం చాటేశాడు. అన్నీ తెలిసిన ఆది దేవుడు
శిలరుాప లింగాకారుడై కనులు ముాసుకొని
యొాగ-నిద్రలోకి జారిపోయాడు.
.
హామీ; ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితం కాని , నా స్వీయ రచన..
.
నాన్న నా కనురెప్ప
నవరత్నాలు
దోబుాచులాడబోకు
Sunday, June 6, 2021
నిండా మునిగిన జనాలు
ప్రక్రియ :నవరత్నాలు , నియమ నిబంధనలు
Saturday, June 5, 2021
తురగవల్గన రగడ నియమాలు
ప్రక్రియ: *తురగవల్గన రగడ*
లఘువు+ గురువు కాకుండా గురువు+లఘువు (సూర్య గణాలు న,హ మాత్రమె) తీసుకోండీ...🙏🏻🌺🙏🏻
రచన: శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తi
కల్యాణ్ : మహారాష్ట్ర
8097622021.
క్రమ సంఖ్య : 3.
శీర్షిక : మినీ సుందరాకాండ .
రామ బంటు లంక జనెను
రామ కార్య మిదని మనెను.
రమణి సీత నచట జుాచి
రగిలి లంక గాల్చి తనెను ॥
అభయ మిచ్చె సీత కతడు
అభము శుభము నెరుగ డతడు
అభద్రతను విడిన సీత
హనుమ భక్తి మెచ్చెను కడు ॥
రామ గురుతు సీత కిచ్చె
రమణి చుాడమణిని దెచ్చె ॥
రావణాసురునదె గుాల్చి
రాము డంత కపిని మెచ్చె॥
రామ సీత కడకు కలిసె
రామ రాజ్య మిలను వెలసె
రామ సీత కల్యాణమదె
రమ్య ముగను జగతి నిలిచె ॥
రామ నవమి పుణ్య దినము
రాక్షస సంహరణ ఘనము
రమణి సీత సంత సించె
రాముని పుాజింప మనము ॥
Thursday, June 3, 2021
నవ్వు నవ్వించు
ఆకుపచ్చి బహుమతి
మనుమసిద్ధి కవన వేదిక
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
పర్యావరణ దినోత్సవం సందర్భంగా
అంశం:- ఆకుపచ్చని సిరి
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
8097622021.
కవితా శీర్షిక: పచ్చ చీర బహుమానం.
పెరుగుతున్న కాలుష్యానికి
దుర్భరమౌతున్న జీవితాలు॥
అడ్డదిడ్డపు అనారోగ్యాలకు
తోడు కరోనా రేపిన కలకలాలు.॥
ఆక్సిజన్ కొరతతో అర్ధాంతర చావులు ,
తరుగుతున్న ఆరోగ్యంతో మందులేని
మహమ్మారికి లొంగుతున్న జనాలు.॥
కాలుష్యపు కంపుకు రోగ గ్రస్థయై
అతిదీనావస్తలో ఆచ్ఛాదన లేని
శరీరాన్ని కప్పుకొనేందుకు చేతులు
అడ్డుపెట్టుకొని ముడుచుకుపోతున్న
తక్లి భారతికి ,ఆకుపచ్చని అంబరాన్ని
బహుమతిగా ఇచ్చేందుకు,పచ్చని
మొక్కలను నాటుతుా, పర్యావరణ
రక్షణకు పుానుకొన్న భారత భావి తరాలు॥
పిల్లల లో వచ్చిన మార్పు గమనించిన
అమ్మ ముఖంలో చిరునవ్వు జల్లులు
అఖిల జనావళిలో ఆనంద పరవళ్ళు ॥
దత్తపది
వాగ్దేవి కళాపీఠం కవన వేదిక
విజయవాడ.
01/06/21
దత్తపది :
అంశం : చదువు . సంధ్య. వధువు. మధువు
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
1.ప్రక్రియ : ఆటవెలది.
(చదువు) కున్న నేమి చవకబా రినబాట
(సంధ్య) సమయ మందు సఖుల జేరి
(వధువు) ఏడ్చు చుండ వదలి మత్తును
కోరి
(మధువు) గ్రోలు నీవు మనిషి వేన ॥
2. ప్రక్రియ : ఆటవెలది.
(చదువు) కున్న వాడు చవటగా వర్తించి
(సంధ్య )దాటి నంత సఖుల జేరి
(వధువు) నగల నమ్మి వరుసబా ధలబెట్టు
(మధువు) మరుగ నేల మత్తు విడుమ ॥
(చదువు) కున్న నేమి చవట వౌచు
(సంద్య) రేయి పవలు సఖుల జేరి
(వధువు) నేడి పించి (మధువు)మత్తునదేలు
పుట్టు కేమి టికిని పుడమి నీదు ॥
*వాగ్దేవి కళాపీఠం - విజయవాడ కవన వేదిక*
తేది: *02-06-2021*
*దత్తపది.*
*కడప - బాసర - కొండపల్లి - యాదగిరి*
----------------------------------------
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
ప్రక్రియ : తేటగీతి
(కడప) లోనున్న వేంకన్న కరుణ ముార్తి
వాణి వెలసిన (బాసర) వరము మనకు
(కొండ పల్లి) బొ మ్మదికొల్చు కొలువులమ్మ
(యాద గిరి) స్వామి నరసింహు డవని ఘనుడు ॥
----------------------------------------