Friday, October 29, 2021
యువతపై డ్రగ్స్ ప్రభావం.
Wednesday, October 27, 2021
మత్తకోకిల పద్యాలు
మహతీ సాహితీ కవి సంగమం.
తేది: 28-10-2021: బుధవారం
అంశము: ఐచ్ఛికము
మ.సా.క.సం.: 19
కవిత సంఖ్య :3.
ప్రక్రియ: పద్యము మత్తకోకిల.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ పాహిమం
క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ రక్షమాం ॥
క్రిష్ణ దేవకి నంద నందన క్రిష్ణ పాహి జనార్ధనా
క్రిష్ణ వేణుసు నాద నందిత క్రిష్ణ పార్ధసు సారధీ॥
దేవకీ వసు దేవ నందన దేవ, దానవ భంజనా
భావ భక్తసు దాస పోషక భాగ్య దాయక పావనా ॥
భుావరాభువ నైక పాలక భుారి కారు ణ్యాఘనా
పావ నాఘన శాప మొాచ పరేశ పంకజ లోచనా॥
బాల లీలల పల్లె గాచిన భాగ్య భక్త జనావనా
గ్వాల మురళీ లోల లోచన గర్వ, కాలుష వారణా
జాల గోకుల బాల బాంధవ జార చోర జనావనా
పాల కాపశు పాల కాప్రియ బాల నందసు నందనా ॥
మాల తీసుమ హార శోభిత మాత దేవకి నందనా
లీల నాటక సుాత్ర ధారివి లీల విశ్వస్వ రుాపనా
పాల చేలకు చేల నాపరి పాల మంజుల భుాషణా
కాల లీలవి నోద నాఖలు కాళ కాళియ మర్దనా॥
శీల సద్గుణ రాయ సుందర శిష్ట పాలక చిద్ఘనా
బాల లీలసు వేష మానుష బంధ పాపవి మొాచనా
కాల కారణ జన్మ ధారణ కావు మాఖగ వాహనా
నీల మేఘన శ్యామ సుందర నీళ -భుావర దేవనా ॥
చంద నాదిసు గంధ లేపిత చారు చంద్రసుహాసనా
వంద నీయసు సేవ్య సుందర పాద,పంకజ లోచనా
గంధ మాలసు భుాషితా నర కాంత కారక ధీవరా
సుందరా సుకుమారమేయ వసుంధరోద్ధర దేవరా ॥
శ్యామ సుందర భాగ్యదాయక సాయిసద్గుణ నాయకా
భామ సత్యహృధామ శ్రీపతి ,భార దుర్నరకాంతకా
కోమలాంగ సువేదవందిత కోటి సుార్యప్రకాశకా
సోమ-సుార్యసు లోచనా హరి శోభనా సుఖ కారకా॥
దేవ పార్ధస ఖాపరాత్పర దేవ విశ్వస్వ రుాపకా
కావరావయ కంజ లోచన కామితార్ధప్రదాయకా
సేవ జేతును వేద మూరుతి శంఖ-చక్ర-గదాధరా
జీవ కోటి జనాది రక్షక జీవనోత్తర కారకా ॥
జీవ కోటికి రక్షణీయగ జన్మ మెత్తిన మాధనా
పావనానఘ పద్మలోచన పాహి భాగ్యవిధాయకా ॥
ధావరా గిరిధారి నా మురళీధరా మన మొాహనా
రావ బ్రోవగ క్రిష్ణ ,పాండవ రక్షకా శుభకామనా ॥
గురువుల సమీక్ష
9️⃣✅ *భావమెంతయొ సుందరంబది పాడిచూడగ యద్భుతమ్!*
చాలా బాగా పద్యాలను కూర్చారు... ధన్యవాదాలు మరియు అభినందనలు...👌👌👏👏💐💐🙏🙏
9️⃣
నావైన గౌరవ ధన్యవాదాలు :
ఎట్టకేలకు ధన్యనైతిని ఏమిభాగ్యము గుర్వరా
చట్ట రీతిని చాల జెప్పిరి చాక చక్యము తోనయా
దిట్ట మాత్రలు గట్టి ప్రాసలు తట్ట గల్గుటె మీ"దయా
పట్టజాలను సంత సంబును పాద అంజలి మీకయా॥
గురువుల ఆశీస్సులు .👇.
[10/27, 19:23] p3: మహతీ సాహితీ కవి సంగమం.
తేది: 28-10-2021: బుధవారం
అంశము: ఐచ్ఛికము
ప్రక్రియ: పద్యము మత్తకోకిల.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
మ.సా.క.సం.: 19
కవిత సంఖ్య :3.
క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ పాహిమం
క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ క్రిష్ణ కేశవ రక్షమాం ॥
క్రిష్ణ దేవకి నంద నందన క్రిష్ణ పాహి జనార్ధనా
క్రిష్ణ వేణుసు నాద నందిత క్రిష్ణ పార్ధసు సారధీ॥
దేవకీ వసు దేవ నందన దేవ, దానవ భంజనా
భావ భక్తసు దాస పోషక భాగ్య దాయక పావనా ॥
భుావరాభువ నైక పాలక భుారి కారు ణ్యాఘనా
పావ నాఘన శాప మొాచ పరేశ పంకజ లోచనా॥
బాల లీలల పల్లె గాచిన భాగ్య భక్త జనావనా
గ్వాల మురళీ లోల లోచన గర్వ, కాలుష వారణా
జాల గోకుల బాల బాంధవ జార చోర జనావనా
పాల కాపశు పాల కాప్రియ బాల నందసు నందనా ॥
మాల తీసుమ హార శోభిత మాత దేవకి నందనా
లీల నాటక సుాత్ర ధారివి లీల విశ్వస్వ రుాపనా
పాల చేలకు చేల నాపరి పాల మంజుల భుాషణా
కాల లీలవి నోద నాఖలు కాళ కాళియ మర్దనా॥
శీల సద్గుణ రాయ సుందర శిష్ట పాలక చిద్ఘనా
బాల లీలసు వేష మానుష బంధ పాపవి మొాచనా
కాల కారణ జన్మ ధారణ కావు మాఖగ వాహనా
నీల మేఘన శ్యామ సుందర నీళ -భుావర దేవనా ॥
చంద నాదిసు గంధ లేపిత చారు చంద్రసుహాసనా
వంద నీయసు సేవ్య సుందర పాద,పంకజ లోచనా
గంధ మాలసు భుాషితా నర కాంత కారక ధీవరా
సుందరా సుకుమారమేయ వసుంధరోద్ధర దేవరా ॥
శ్యామ సుందర భాగ్యదాయక సాయిసద్గుణ నాయకా
భామ సత్యహృధామ శ్రీపతి ,భార దుర్నరకాంతకా
కోమలాంగ సువేదవందిత కోటి సుార్యప్రకాశకా
సోమ-సుార్యసు లోచనా హరి శోభనా సుఖ కారకా॥
దేవ పార్ధస ఖాపరాత్పర దేవ విశ్వస్వ రుాపకా
కావరావయ కంజ లోచన కామితార్ధప్రదాయకా
సేవ జేతును వేద మూరుతి శంఖ-చక్ర-గదాధరా
జీవ కోటి జనాది రక్షక జీవనోత్తర కారకా ॥
జీవ కోటికి రక్షణీయగ జన్మ మెత్తిన మాధనా
పావనానఘ పద్మలోచన పాహి భాగ్యవిధాయకా ॥
ధావరా గిరిధారి నా మురళీధరా మన మొాహనా
రావ బ్రోవగ క్రిష్ణ ,పాండవ రక్షకా శుభకామనా ॥
*********** ************ **********
*భావమెంతయొ సుందరంబది పాడిచూడగ యద్భుతమ్!*
చాలా బాగా పద్యాలను కూర్చారు... ధన్యవాదాలు మరియు అభినందనలు...👌👌👏👏💐💐🙏🙏
ఎట్టకేలకు ధన్యనైతిని ఏమిభాగ్యము గుర్వరా
చట్ట రీతిని చాల జెప్పిరి చాక చక్యము తోనయా
దిట్ట మాత్రలు గట్టి ప్రాసలు తట్ట గల్గుటె మీ"దయా
పట్టజాలను సంత సంబును పాద అంజలి మీకయా॥
😅👍🙏🙏🙏
*చూడచక్కని పద్యసాధన సొంతమే జగదీశ్వరీ...*
*నేడు చక్కని మత్తకోకిల నిచ్చినారు సహోదరీ!*🙏🙏🙏
దత్తపది : శివ -హర- భవ- శర్వ.
ప్రక్రియ : మత్త కోకిల.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
1.
శ్రీశ సుందర మంది రా(హర) శిష్ట పాలక శంకరా
పాశధారి పరేశ పన్నగ భుాష పాహి త్రిలోచనా
నాశ పాప భవార్ణవా భవతార ణాభయ హారణా
ఆశ పాశ వినాశ ఈశ్వర హార సుందర భుాషణా ॥
2.
వారణా భయ హారణా(భవ )పాహి పాహిస దాశివా
కారణాసుఖ కారణా (హర) కాల కల్మష మొాచనా
దుార దుష్ట జనావనా దురితాది దుర్మద నాశనా
హార శోభిత (శర్వ)సుందర హాఁవిషాద్గళ ధారణా॥
పద్య ప్రక్రియ : ఆటవెలది.
1.
చిత్త శుద్ధి తోడ చింతింతు నో(శివా)
భక్తి తోడ గొల్తు (భవు)డె వేల్పు.
ముక్తి నిచ్చు (హరు)ని ముదమార భజియింతు
శక్తి ధరుని (శర్వు) శరణటంచు ॥
2.
(హరు)డె అంత మాది, హరియించు నఘములు
(శివు)డె పాశ ధరుడు శివుడె ధవుడు
(భవు)ని భాగ్య మీయ భావింతు నిలలోన
(శర్వు) శరణమందు సర్వ మతడె ॥
😅👍🙏🙏🙏
Monday, October 25, 2021
ఉత్తరం
దత్తపది.
నలము IIII నగము IIIU
సలము IIUI భగణము UII
రగణము UIU తగణము UUI
ర ల ళ
మహతీ సాహితీ కవి సంగమం
అంశం : దత్త పది శంఖము, చక్రము, గద, ఖడ్గము )
తే : 23- 10- 2021
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
ఊరు: కల్యాణ్. మహారాష్ట్ర .
అంశం : దత్త పది శంఖము, చక్రము, గద, ఖడ్గము )
మసా కసం : 19
ప్రక్రియ : ఆటవెలది.
1.
( ఖడ్గధారి వీవు ఖలునాశ జగదీశ
(గద)తొ గుాల్చసురుల గదిమి గొట్టు
(శంఖ )(చక్ర)ముగల శస్త్రధారివి గావ
పార్ధ సార ధీశ పలుక వయ్య. ॥
తేటగీతి:
కనగ జగమంత కన్నులే (ఖడ్గ) ధారి
వేల చేతుల (గద)లున్న వేద ముార్తి.
శంఖ) నాదమిడి దృంచు (చక్ర) ధారి
విశ్వ మంతయు నిండిన విశ్వ రుాప॥
శంఖ చక్ర ములతొ శరణన్న వారిగను
శ్రీశ ఖడ్గ ధారి శరణు శరణు
ఘన వేద రక్ష ఖలునాశ శుభేచ్చా
పాహి గదా ధారి పరమ పురుష ॥
మున్ను గీత తత్త్వ మును బోధ నదెజేయ
సార మహిమ దెలిసె సవ్య సాచి
శంఖ చక్ర ములతొ సఖునిబ్రో చినసామి
గదా ఖడ్గ ధారి గావు మమ్ము ॥
చిత్ర కవిత.
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
ప్రతిరోజు కవితాపండుగే
పర్యవేక్షణ: *శ్రీ డా॥అడిగొప్పుల సదయ్య గారు
నిర్వహణ: *శ్రీ దాసరి చంద్రమౌళి గారు
సమీక్షణ: *శ్రీ టిఆర్ కె కామేశ్వరరావు గారు
తేది: *18-10-2021: సోమవారం*
అంశము: *చిత్రకవిత*
ప్రక్రియ: ఐచ్ఛికం.
క్రమ సంఖ్య : 37.
కవిత సంఖ్య : 1.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర.
పద్య ప్రక్రియ : ఆటవెలది.
అంశం :మనిషి -మేధస్సు .
శీర్షిక : ఓ మనిషీ , మేలుకో...
మేధ నిండు మనిషి మెట్టు మెట్టుగజేరె
చంద్ర మండ లమ్ము జక్క గాను
తెలివి మీరు పనుల దెలియలే దతనికి
బతుకు దుర్భ రమ్ము భార మగుత ॥
ఏమి ఫలము వచ్చె అంతరిక్షము జుట్ట
సెట్టు లైట్లు పెరిగె గుట్టు లుడిగె
అంతర్జాల మహిమ అన్ని వెల్లడులాయె
బుద్ధి తరిగె మనిషి శుద్ధి మరచె ॥
అడవి రాజ్య మాయె అశ్లీలతే పెరిగె
కామ వాంఛ పెరిగె కలత పెరిగె
చంద మామ కధల జగతి నీతులు మారె
చెడుపు జేరె నిలను చెదిరె బ్రతుకు ॥
విజ్ఞానమును పెంచి విశ్వమంతయు జుట్టి
వివిధ రీతు లతడు విర్ర వీగె
చెట్లు గొట్టి యతడు చేయగా శోధనా
ప్రాణ వాయు లేక ప్రజలు జచ్చె ॥
పెరిగె కాలు షమ్ము తరిగె భుాసారమ్ము
యంత్ర హోరు పెరిగె యవని లోన
పనులు మానె జనులు పరికించ నీరింకె
పంట పొలము లెండి పతన మాయె ॥
కోటి విద్య లేల కోరుబ్ర తుకులేని
ఉద్ధ రింప వయ్య నుర్వి నీవు
భువిని మట్టు పెట్టి భువనమ్ము లేలేవు.
ధరణి నుద్ధ రించు ధర్మ మదియె ॥
జ్ఞాన మార్గ మదియె జనహిత మౌమాట
కష్ట నష్ట ములవె కరుగ జేయ
విద్య విత్తు వేసి విజ్ఞాన మును పెంచు
విజయ బాట లేలి వినుతి కెక్క ॥
ప్రస్తుత పరిస్థితుల బట్టి
రాసిన ఈ పద్యాలు నా ద్వీయ రచనలు.
అమ్మకానికి అమ్మ
మహతీ సాహితీ కవి సంగమం
అంశం: ఐచ్ఛికం.
తేది: 01-10-2021
మసాక.సం: 19
కవిత సంఖ్య 4.
కవి పేరు: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
ఊరు: కల్యాణ్. మహారాష్ట్ర .
శీర్షిక: అమ్మకానికి అమ్మ.
ప్రక్రియ: వచన కవిత .
కౌరవ రాజ్యంలో కార్చిచ్చు.
కనీ వినీ ఎరుగని వింతలుా
విడ్డుారాలు.॥
అమ్మతనం లో ఆడతనం
చుాసిన ఊర నక్కలు.
బోసినవ్వుల పాపలను కుాడా
విడిచిపెట్టని కామాంధులు.॥
కుటిల కృార చేష్టలతో
కులహీనులౌతున్న నేటి యువత.
ప్రశ్న వేస్తే పెట్రేగుతున్న ఘనత ॥
నాల్కనే కత్తి వేట్లతో
కుంటిదౌతున్న పెత్తనం.
పనికిరసని చెత్తగా
పారవేయబడుతున్న వ్రద్ధాప్యం ॥
ఆత్మహత్యల ఊబిలో అన్నదాతలు.
నీతి నియమాలు మరచిన ప్రజలు.॥
అవక తవకల ఆగ్రహాలకు
ఆహుతౌతున్న అమాయకులు.॥
మార్పు మార్పంటుా నరమృగాలుగా
మారుతున్న మనుషులు .॥
మారిన మనస్తత్వాలు చేస్తున్న
మారణహోమాలు.॥
మాడి మసౌతున్న నీ, నా బంధాలు.
జాతి మత భేదాల భేరీ నినాదాలు.॥
రక్తపు దారుల్లో మొాగుతున్న
మరణమృదంగాలు.॥
కళ్ళుముాసుకున్న కేంద్ర పాలనలో
పెట్రేగుతున్న రౌడీ నాయకుల ఆగడాలు॥ .
అసంతృప్తి నిండిన జనాల్లో
కోలుకో లేని అర్ధాంతర చావులు ॥
శాంతి నిండిన ఉద్యమ
దారుల దాడుల్లో ఆహుతౌతున్న
అమాయక జనాలు॥
భరత మాత ఒడి నిండిన
బంజరు భుామిలో కన్నీటి సేద్యం ॥
న్యాయ ధర్మాలు అంతరించిన
దేశంలో,ఆత్మబలం లోపించిన చోద్యం ॥
పరదేశం పట్టుకు పాకులాడుతున్న
పాపుల్లారా.. రండి రండి
పనికిమాలిన మా దేశ మాత ప్రగతి
వేలం వేయబడుతోంది. రండి రండి
అవకాశాలన్నీ మీకే...
మా నోరు పక్షవాతంతో
పక్కదార్లు పట్టి పడిపోయింది.
మాట్లాడేవాడులేడు..రండి రండి.
మా అమ్మ అమ్మకానికుంది.
Sunday, October 24, 2021
గజల్ వివరణ
SN సాహిత్యం కొరకు దీపావళి కథ
SN సాహిత్య విభాగం...కొరకు
అంశం..దీపావళి.
రచన:శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
శీర్షిక : నరకాసుర వధ కథ.
వరాహావతారుడై వరలు మహా విష్ణువుకు-
భుాదేవికిని సుతుడు ముార్ఖ నరకాసురుడు ॥
అసుర లక్షణములుగల అహంకారుడీతడు
చక్కన్ని పాలకుడు జనకరాజు శిష్యుడు॥
కడు భక్త చిత్తుడు కామాఖ్య భక్తుడు.
బాణసుర చెలిమి తో బహు ధుార్తుడైనాడు॥
దేహబలము పొందిన దేవ్యోపాసకుడితడు
రాక్షసాది గుణములచే రాజిల్లు బలుడు ॥
దేవతలెల్లరను పట్టీ బాధించెను ధుార్తుడు
వరగర్వ బలముచే హింసించెను నరకుడు॥
ఇంద్రపదవి నాశించి ఇంద్రుని ఓడొంచెను
స్వర్గమునే దోచెను స్వర్గ ధామ మేలెను ॥
దేవతలే మొరలిడగా క్రిష్ణుడవతరించెను
సత్య భామ సహితుడై సమరము సాగించెను॥
పోరున శ్రీకృష్ణుడు అలసి సొలసి తుాలెను
సాహసియౌ సత్యభామ సమరము సాగించెను ॥
భుాదేవీ శాపమే భువికి శుభమదాయెను
మృత్యు శాపగ్రస్తుడైన నరకసురుడు కుాలెను ॥
నరకచతుర్దశినాటి నరకాసుని వధ కధ
సత్యభామ కృష్ణుల అవతారపు ఘనత.
సురులు దీపవళులు పేర్చి శుభ గీతులు పాడిరి
దీపాల పండగదే భువిని జనులు చేసిరి ॥
హామీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితము కాని నా స్వీయ రచన.
Saturday, October 23, 2021
దీపావళి
Friday, October 15, 2021
మహతీ సాహితీ కవి సంగమంలో కొన్ని కవితలు.
ఆధ్యాత్మికత
నవదుర్గా రుాపం
Thursday, October 14, 2021
గజల్
Wednesday, October 13, 2021
మమతల మంటలు
సరస్వతీ స్తుతి
Monday, October 11, 2021
కుల రక్కసి
అంశం:" కుల రక్కసి"
శీర్షిక : భ్రష్టుపట్టిన సమాజం.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
8097622021
నేటి సమాజంలో కుల వివక్షతల
వివాదాలతో రాజ్యాంగం రణరంగమౌతోంది
కుల రక్కసి చేస్తున్న స్వైరవిహారం
మానవత్వాన్ని కుాకటి వేళ్ళతో కుాల్చేసింది.॥
కులమత వివక్షతల వేడి నిండిన బాటలో
మనిషి స్వార్ధ పుారిత వ్యుాహ రచనలతో
మంది ముార్ఖత్వాన్ని మహోన్నతంగా వాడుకుంటున్నాడు.
ఫలితం..
అక్షర జ్ఞానం లేనివారి అనాలోచిత పాలనలో
అసందర్భ రాజకీయాలకు ఆహుతౌతున్న జనం.
గద్దె కెక్కిన నిరక్షరాస్యుల పాలనలో పెరుగుతున్న రౌడీయిజానికి భ్రష్టుపడుతున్న యువత భవిత॥
అధికార బలానికి తలవంచిన న్యాయ వ్యవస్థల్లో
తీర్పులోపాల చక్రాల కింద నలిగిపోతున్న న్యాయం
అక్షరాస్యత, ఆకలి నిండిన ఆక్రోశాలతో
ఆత్మ గౌరవాన్ని అమ్ముకు బతకుతున్న వైనం.॥
రిజర్వేషన్ల పేర్లతో అర్హత లేనివాడందుకుంటున్న
సౌకర్యాలకు పడిపోయిన అక్షరం కన్య,
మారుతున్న జనాల మధ్య చావలేక బతుకుతుా
బుాతు నిండిన భావ జాలంతో భాషకు
వలువలు విప్పుతుా విహరిస్తున్న దౌర్జన్యం.
వెనుకబడ్డ వారిని ముందుకు తెచ్చే యత్నంలో
సభ్య సమాజానికి శిలువ వేస్తున్న అవివేకం.
ఆగని కులాంతర వివాహాలకు రాజుకుంటున్న జాతి
వైరాలకు ఆహుతౌతున్న అమాయక యువత॥
అణగారిన సమాజంలో అసభ్య పదజాలాల
ఆవిష్కరణకు అర్ఘ్యం పోస్తుా ఆడతనాన్ని
అపహాస్యం చేస్తుా ఆడుకుంటున్న క్రౌర్యం ॥
మార్పురాని సమాజాన్ని మార్చే ప్రయత్నంలో
అసువులు బాసిన ఉద్యమవీరుల బీటలుబారిన
సమాధి చిహ్నాలు మరచిపోయిన మానవత్వాన్ని
గుర్తు చేస్తుా కుల రహిత సమానత్వ విలువల్ని
తెలియపరచలేక మౌనంగా కన్నీరు కారుస్తున్నాయి ॥
మత్తకోకిల పద్యాలు , లో దుర్గమ్మ స్తుతి.
బుద్ధుడు.
శీర్షిక బోనాల భోగాల బతుకమ్మ గౌరి.
మహతీ సాహితీ కవి సంగమం లో
*బతుకమ్మ ఈ-కవితాసంకలనం*కొరకు
శీర్షిక బోనాల భోగాల బతుకమ్మ గౌరి.
మా ఇంటి మహలక్ష్మికి తోడైనా సఖియ
బంగారు బతుకమ్మ సుమగంధ నిలయ
అర్తులను గాచేటి కరుణాల వలయ.
సిరిమల్లె మాయమ్మ హిమవంతు తనయ
తెలంగాణ సంస్కృతికి గురుతైన తల్లి
రంగుపుాల వలువలిడిన నిండుపసుపు గౌరి
తొమ్మిదైన రుాపాల దుర్గా కాత్యాయని
బోనాల భోగాల నారగించు పావని
అట-పాటల వెల్గునాతల్లి ముఖము
అర్తజనుల నేలేటి అభయమిచ్చెడి కరము
అశ్వీయుజ మాసమున తల్లికీయ స్వాగతము
పసుపు కుంకాలమల్లి ఫలమిచ్చు దైవము ॥
కష్టాలను కడతేర్చగ కాళివై రావమ్మ
నిమ్మపండ్ల హారాల నిండైన కొమ్మా
నిలువెత్తు నీరాజనమందుకోవమ్మా
మహిగాచే మంగళివి మమ్మేలుమమ్మా
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ మహారాష్ట్ర .
8097622021