Saturday, July 31, 2021
సున్నితం ప్రక్రియ కవితలు
సున్నితం విజేతలు
Thursday, July 29, 2021
శ్రీ శ్రీ కళావేదికలో రాసిన కొన్ని కవితలు
Wednesday, July 28, 2021
చెట్టు తల్లి
సి.నా.రె..సాహితీ ప్రస్థానం
18/07/2021.
శీర్షిక : సి.నా.రె.సాహితీ ప్రస్థానం .
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర
8097622021.
"నేను పుట్టక ముందే
నెత్తి మీద నీలి తెర
కాళ్ళ కింద ధూళి పొర" అంటుా
కలాన్ని ఝళిపించి కవిగా
గణుతికెక్కిన సి. నా. రె .॥
బాల్యం నుంచే సాహిత్య
కళలకు ఆకర్షితులైన సి.నా.రే
తన సాహితీ ప్రస్థానం లో
ఆధునిక "విశ్వంభర" వచన
కావ్య రచనకు ప్రతిష్ఠాత్మకమైన
జ్ఞానపీఠ పురస్కారాన్ని గ్రహించేరు.॥
"బురద నవ్వింది కమలాలుగా
పువ్వు నవ్వింది భ్రమరాలుగా"
అంటుా మానవ వికాశ చైతన్యాన్ని
"వేయి తోటలను నరికిన చేయి
పూయిస్తుందా ఒక్క పువ్వును"
అంటుా మానవ ప్రస్థానంలో, మజిలీల
కాలస్వరుాపాన్ని తన రచనల లో
సాక్షాత్కరింపజేసిన గొప్పకవి సి నా.రె ॥
"గులేబకావళి కథ "చిత్రం తో
ప్రారంభమైన సీనీ ప్రస్థానం..
పలు సాహిత్య రచనల కవన
విహారాల వెనుతిరిగి చుాడని వైభవం ॥
విద్యాత్మకంగా,పాలనా పరంగా
ఎన్నో పదవులు నిర్వహించి .
సాహిత్య సౌరభాలనందించి
సి.నా.రె.గా పిలవబడుతున్న
సంగిరెడ్డి నారాయణరెడ్డిగారు
మన దేశ ఘన గౌరవం ॥
శీర్షిక : అక్షరనిధి. పుస్తకం.
ష్ట్రీట్ పోలీస్
అద్భుత మైన గానం ,గాత్రం, రచననారాయణామృతంలా భక్తిరసంలో ఓలలాడించే సూపర్🌺👍👌🙏👏👏🙏🙏👌👍🌺👍👌🙏👏
Tuesday, July 27, 2021
గజల్స్.....
గజల్
విరులు విరిసె తరువునైనా చేతులు మోడ్చేదెవరు కాలమా
ప్రేమ నీరంపోసి నను నిజంగా కాచేదెవరు కాలమా
నభం నీడ నలువుగా
నర్తించే రంగు ఈకల నమ్మిలా
పుడమి మీద పూల పల్లవినౌ నను చూచేదెవరు కాలమా
భరణి అసువులు కుసు మింపచేసె పలాశినై పలుకరించినా
మీ భవితవ్యమైన నాకై చూపు చాచేదెవరు కాలమా
మనసేలేని మండుటెం డలలో మాడి మసియై పోతున్నా
నా ఆవేదన ఆవౌ వరకు నను దాచేదెవరు కాలమా
పులుగులు పువ్వుల
నవ్వల పర్వమవాలనె
కోరిక మల్లీ!
తుంపి అది నా సహన సౌహృదాన్ని తూచేదెవరు కాలమా
రాజావాసిరెడ్డిమల్లీశ్వరి
శీర్షిక : నా ప్రేమ..
ప్రక్రియ : గజల్
శీర్షిక : నా ప్రేమ. (సవరించి రాసినది).
ఎదలోన మెదిలేను భావాల అలజడీ
ఎందెందు దాగె నీ అందాలు నాచెలీ
ఊహలే ఉయ్యాలలుాగేను మదిలోన
బ్రతుకంత నీ తలపు బంధాలు నాచెలీ
నీ పలుకు లేతీపి తేనీటి జల్లులై
కురిసేను నీప్రేమ గంధాలు నాచెలీ
నీమొాము లోనిండెనాచంద్ర కళలవే
ఆకళలె కలలందచందాలు నాచెలీ
కదిలేటి ముంగురులె మేఘ సందేశమై
కవ్వించ ననుచేరు కందాలు నాచెలి
కనులలో కదలేటి నీమౌన బాసలే
నీప్రేమ పంచేతరంగాలు నాచెలీ
నీ ప్రేమ తెలిసేను నిన్నునే వలచేను
నా వలపు వర్ణనలభంగాలు నాచెలీ
సఖినీదు ఈశ్వరీ సరదాగ వినిపించె
వయ్యారి నీసొగసు విందులుా నాచెలీ
అందాలె నాబ్రతుకు బంధమై పోయెలే
నాతోడు వైవేయు సంకెళ్ళు నాచెలీ
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర
8097622021.
మొదటిసారి రాసినది.👇
ఎదలోన మెదిలేను భావాల అలజడీ
ఎందెందు దాగె నీ అందాలె నాచెలీ
ఊహలో ఉయ్యాలలుాగేను నామదే
బ్రతుకంత నీతలపు బంధాలె నాచెలీ
నీపలుకు లేతీపి తేనీటి జల్లులై
కురిసేను నీప్రేమ విందులే నాచెలీ
నీమొాము లోనిండెనాచంద్ర కళలవే
ఆకళలె కలలందు కందాలె నాచెలీ
కదిలేటి ముంగురులె మేఘసందేశమై
ననుచేరి కవ్వించు అందాలె నాచెలీ
కనులలో కదలేటి నీమౌన బాసలే
మనసులో మాటగా చేరెలే నాచెలీ
నీ ప్రేమ తెలిసేను నిన్నునే వలచేను
నీ వలపు పిలుపునాకండాయె నాచెలీ
సఖినీదు ఈశ్వరీ సరదాగ వినిపించె
నీహొయలు నీసొగసు అందాలె నాచెలీ
అందాలె నాబ్రతుకు బంధమై పోయెలే
నాతోడు నీడగా ఉండాలె నాచెలీ
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర
8097622021.
హామీ:
ఈ నా గజల్ ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన .
--------------------------------
శీర్షిక : మౌన ప్రేమ
నా మనసు పాడేను ఓమౌన గీతమే
ఆగీతి నీదిగా పలికెలే ప్రేమగా
ధారలై కురిసేను నా ప్రేమ చినుకుగా
విరహమే వేదనై మురిసెలే ప్రేమగా ॥
మనసదే కోరినది చెలినీదు చెలిమినే
చెలిచుాపు భావమై పిలిచెలే ప్రేమగా
పదములే పాటగా పాడెలే జంటగా
హృదినిండు శ్వాసలే కలిసెలే ప్రేమగా
మనసంత నిండెనీ రుాపమే అలలుగా
పదములే కవితలై కురిసెలే ప్రేమగా
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర
8097622021.
హామీ:
ఈ నా గజల్ ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన .
********
ప్రక్రియ : గజల్ ..
శీర్షిక : అలనాటి జ్ఞాపకాలు .
అలనాటి రోజులని తలచేవు ఏలనీ
మారింది నీవనీ తెలుసుకోవేలనీ..
ఆగాలి ఆనీరు ఆపుడమి ప్రకృతీ
ఆనాటి వేననీ తలుచుకోవేలనీ ॥
బంధాలె బరువాయె ఈనాటి మనిషికీ
విడరాని బంధాల కలుపుకోవేలనీ ॥
ఆ అమ్మ ఆ అక్క ఆచెల్లి ఆచెలీ
ఆప్రేమ నీదిగా మసలుకోవేమనీ ॥
స్వార్ధమే జీవముా ధనమాయె ముాలముా
నిస్వార్ధ బాటలో నడుచుకోవేలనీ ॥
కరువాయె ధర్మముా బరువాయె బంధముా
అవినితి బాటనే వదుకోవేలనీ ॥
తరిగేను విలువలుా తొలగేను వలువలుా
మనదైన సంస్కృతిని మరచేవు ఏలనీ ॥
మేధావి తానని మారినది మనిషనీ
తెలిసినీ తలపులను మార్చుకోవేలనీ ॥
ఆనాటి కాలమే ఈనాడు ఉండగా
కాలాన్ని తిరగేసి వగచినావేలనీ॥
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర
8097622021.
హామీ:
ఈ నా "గజల్ " ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన .
కలాం సుాక్తులు
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశసం : అబ్దుల్ కలామ్.
శీర్షిక : కలాం చెప్పిన సుాక్తులు.
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
50
అబ్దుల్ కలాం ఆశయ సాధకుడు
భారతీయ అంతరిక్ష పరిశోధకుడు
సాంకేతిక అభివృద్ధిలో కృషీల్యుడు
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
51.
ఆదర్శాల బాటలో ఆటుపోట్లు
అనుభవం నేర్పిన పాఠాలు.
అబ్దుల్ కలాం నేర్చిన సుాక్తులు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
52
.ప్రశ్నంచే విద్యార్ధి గుణనిధి
ఆలోచనలతో కలుగు ఆశయసిద్ధి
అపజయాలే విజయానికి స్ఫుర్తి
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
53.
ఉత్తేజపరచు ఆలోచనల ఆకాంక్షలు--
అపజయాలు విజయానికి సోపానాలు
మీతలరాతకు మీరే సృష్టికర్తలు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
54.
ఆలోచనలను పనిగా మలచుకో
ప్రతిభతో సమస్యలను ఎదుర్కో
మరణంతో చరిత్ర సృష్టించుకో
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
55.
పద్మభుాషణ్ పద్మవిభుాషణ్ భారతరత్న
డాక్టరేట్ లు సాధించిన అవార్డులు..
అబ్దుల్-కలాంకు గౌరవ నివాళులు ॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
Monday, July 26, 2021
సున్నితం ప్రక్రియ లో రాసిన 8 అంశాలు
Sunday, July 25, 2021
తెలుగు భాష
G..K..
Saturday, July 24, 2021
సున్నితం. అంశం : అబ్దుల్ కలాం సేవా నిరతి.
24/07/2021
ప్రక్రియ :సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశం : అబ్దుల్ కలాంగారి సేవా నిరతి.
శీర్షిక : భావి తరాలకు స్ఫుార్తి.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
భారతీయ అంతరిక్ష పరిశోధకుడు.
భారతదేశ అభివృద్ధి ప్రణాళికలతో
రాష్ట్రపతిగా పేరొందిన ఘనుడు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
చట్టాలపై కలాం నిర్ణయం
ఉమ్మడి పౌరస్మ్రుతికై పోరాటం
"భారతరత్న " పురస్కార సమ్మానం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
శాంకేతిక పరిజ్ఞాన దృష్టి
శాస్త్రీయ సలహాదారుగా కృషి
"పద్మభుాషణ్" గా బిరుదొందిన కీర్తి
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
ప్రాజెక్టుల అభివృద్ధికి శ్రీకారం
స్వదేసీ ఉపగ్రహ ప్రయొాగం.
రోహిణి 1 చరిత్రలో ఘనవిజయం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
కంప్యూటర్ తయారీతో గ్రామీణారోగ్యవృద్ధి
గుండె వైద్యసనికి "ష్టంట్ "
అంతరిక్ష ప్రాజెక్టుల్లో నాయకత్వం
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
యువ పునరుజ్జీవనోద్యమ దినోత్సవం"
అబ్దుల్ కలామ్ జన్మదినోత్సవం.
స్వాతంత్ర్య దినోత్సవ బహుమానం
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
హామీ:
ఈ నా సున్నితములు ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచనలు.
CPK వారి కవితా సంకలన కవితలు( A.రాజ్యలక్ష్మిగారు).
ముక్తపదగ్రస్తాలంకారం
Friday, July 23, 2021
ఆణిముత్యాలు.
గజల్
GK
Wednesday, July 21, 2021
సాహిత్యం: సుజ్ఞాన వేదిక.
[7/20, 16:31] నెల్లుట్ల సునీత ( ప్రక్రియ సున్నితం. ): CPK సంస్థ వారు కవితా సంకలనం తేవడానికి ప్రయత్నిస్తున్నారు. కవితల సెక్షను బాధ్యత నాకు ఇచ్చారు. ఆసక్తి గల కవి మిత్రులు తమ చక్కటి కవితలను పంపి ఈ సంకలన ప్రచురణకు సాయపడగలరని అభ్యర్ధన.
రాజ్యలక్ష్మి. ఎ
9487486985
గమనిక
మహిళా కవిమిత్రులకు మాత్రమే కవితలు పంపే అవకాశం.
[7/20, 16:51] నెల్లుట్ల సునీత ( ప్రక్రియ సున్నితం. ): ఇరవై లైన్లు .అంశం మీ ఇష్టం.22.07 లోపల పంపండి.
20/07/2021.
CPK సంస్థ వారి కవితా సంకలనం కోసం ,
అంశం : ఐచ్ఛికం.
శీర్షిక : "సాహిత్యం" సుజ్ఞాన వేదిక ..
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
సాహిత్య వనంలో కవన విహారం .
ఆకర్షణలు నిండు అక్షరాల మధనం.
అర్ధవంతమైన పదాల ఛంధోబద్ధ గమనం.
నవరస గుభాళింపుల నవ్య నందనవనం ॥
నందనవనంలో దివ్య కళా ఖండాలు.
పుటలు నిండు కావ్యాల గ్రంధాలయాలు.
అణువణువు ఆశయాలకు స్ఫుార్తినిచ్చే ధనాలు .
సభ్య ,సమాజ,సాస్కృుతిక, సమానతల కథనాలు ॥
బానిసత్వ పోరాటాల ఉద్యమ చరితలు..
అన్నదాతల ఆకలి చావుల జీవిత సత్యాలు.
ఉద్యమ కారుల దేశ భక్తి నిండు ఆరాటాలు.
భరతమాత రక్షణకై, త్యాగధనుల పోరాటాలు॥
మనవత్వం నిండు మంచి చెడుల మార్గదర్శకాలు
పలు సంస్కృతుల ధర్మ, కర్మా చరణల విలువలు.
సద్ధర్మ- సాంప్రదాయాల సాముాహిక పర్వాలు .
సమత- మమత సమైక్యతల మానవ బంధాలు॥
కలం పట్టిన కవన శ్రామికుల కర్షక ఫలాలు.
పుస్తక పుటల నిండు సత్యాల సజీవ చరితలు.
జ్ఞాన జ్యోతులు నిండు తెలుగు వెలుగులందాలు
సాహిత్య సౌరభాల సుమ సుందర మణి హారాలు॥
సభ్య సమాజ మెళకువల సరళ సాహితీ వేట.
తెలుగు నా జీవిత సోపానాలకు వెలుగు బాట॥
హామీ:
ఈ నా కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని నా స్వీయ రచన.
నాకు నచ్చిన నీతులు
Tuesday, July 20, 2021
వాగ్దేవీ కళాపీఠం లో కవితలు
GK.
Monday, July 19, 2021
కొత్త పద్య ప్రక్రియ.
Saturday, July 17, 2021
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నా పేరు నమొాదు
Sunday, July 11, 2021
వ్యాస పుార్ణిమ, గురుపుార్ణిమ.
మధురగతి రగడలు నియమాలు.
పర్యవేక్షణ: *డా.శ్రీ.అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ కుందారపు గురుమూర్తి గారు*
సమీక్షణ: *శ్రీ డా.అడిగొప్పుల సదయ్య గారు*
తేది: *10-07-2021: శనివారం*
అంశము: *ఐచ్ఛికము*
ప్రక్రియ: పద్యము *మధురగతి రగడ*
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
క్రమ సంఖ్య : 37.
1.
ధ్యానము చేయుము ధరపర మాత్ముని
మననము జేయుము మానస మందున ॥
2.
ధర్మము నెరపుము ధనమదె సత్యము
కర్మలె శుభములు, కరగ పాపము ॥
3.
మల్లెలు ముదముగ మాలగ నల్లితి
కొల్లలు సుమములు కొలువంగ హరిని ॥
4.
కరుణను బ్రోవగ కమలాక్ష వేడితి
వరదుడ రారా వనజభ వాహరి ॥
5.
కంటిని నీరుాపు కనులార రామా
వింటిని గుణముల విమలసు చరితా॥
6.
విశ్వము నేలిన విభుడవు నీవని
విశ్వా సముతోడ విభునిను వేడితి॥