Wednesday, April 29, 2020

అమ్మా....నాన్నా....?

పోటీలచిచ్చులో అమ్మానాన్నల్నేయకు
..................

కన్నవాళ్ళనే
విడిగా చూస్తూ
అమ్మానాన్నల్ని
విడదీస్తూ

అమ్మ గొప్పా?
నాన్నగొప్పా ?
ఎవరుగొప్పంటూ
లెక్కలుకడుతూ

ఓ అమ్మ కొడుకైననాన్నేఎందుకో
తడబడుతూ వెనకబడ్డాడు
అంగట్లో షరాబులా కనబడ్డాడు

కనబడకున్నా కడుపు
నిలబడిందనగానే
బిడ్డనుకాచుకోవటానకి
నోరుకట్టేసుకున్న అమ్మ
నాన్నకన్నాముందే రుచులు మరచింది మనకోసం!

చూలువార్త తో ఇంటాబయటా నాన్నకు ప్రశంసలు
అమ్మకు అన్నింటా ఆంక్షలు

తొమ్మిదినెలలు అమ్మకడుపే
నా ఉయ్యాల
దెబ్బలుతిట్లుఅగచాట్లుంటే
అమ్మకే తెలియాల!!
నాన్న పడ్డాడా  అమ్మవెనకాల?

ఆడో? మగో? అమ్మకు బిడ్డే కావాల!
ఆ వివరాలు మాత్రం ఇతరులకు కావాల!
వెనకబడ్డాడేమో నాన్న ప్రశ్నల వెనకాల?
కడుపులోఉన్న నా కోసం
ఆస్పత్రి క్యూలో కష్టాల్లో..
ఎన్నిసార్లున్నాడో వెనుక కనబడ్డాడో నాన్ననే అడగాల?

టీకాళ్ళూ సూదులు ఎన్నేసుకుందో అమ్మ నాకోసం
కనీసం వెనుకనిలబడ్డాడేమో నాన్ననే అడగాల!

నిండుతున్న నెలలతో
బరువులూనొప్పులు  పెరుగుతూంటే 
పండుతున్నాయి కలలంటూ
మురిసిపోతూన్న అమ్మ
వెనకాల ఎన్నిగంటలు నిలబడ్డాడో నాన్ననే అడగాల!

కాన్పునొప్పులు యమగండాలై
అమ్మఊపిరిని చుట్టేసినప్పుడు
సానుభూతితో వెనకనిలబడ్డాడో?
వారసుడిరాకకై ఆరాటపడ్డాడో?
సత్యసాక్షిగా నాన్న ఆత్మనడగాల!

మలమోమూత్రమో
మరేదైనా కుడిఎడమలుచూసుకోకుండా
చేతులుచాచి నన్ను శుభ్రంగా ఉంచేస్తున్నప్రతిసారీ
వెనకాలనిలబడ్డాడేమో ?నాన్ననే  అడగాల!

నా కంటికి తానే  రెప్పై 
నా ప్రాణమే తనకు ప్రాణమై
నా వెంటే తోడైనీడై
నన్ను నడిపించుకున్న అమ్మకుతోడై.....
ఏమాత్రం వెనుకనిలబడ్డాడో నాన్ననే అడగాల!

ఉదయం మాకోసం డబ్బుకై బయటపడి
సాయంత్రం అలసటతో ఇంట్లో అడుగిడి కష్టపడే నాన్న గొప్పా?

పగలూరాత్రీ నాపై ప్రేమతో అలసటనువిసుగును ఆనందంగా మార్చుకుంటూ ముద్దుమనసుతోనన్నుమోసేఅమ్మ గొప్పా?

అంటూ అనుమానాలా?

అమ్మముందు! నాన్న వెనకాల!
అంటూ ప్రశ్న లెందుకు పుట్టాల?

అమ్నైనా నాన్నైనా
అమ్మకే పుట్టాల!

అమ్మకు పుట్టిన ఏ బిడ్డయినా
అమ్మనే ముందుచూడాల!

అమ్మకు నాన్నకు మధ్యపోటీలా?
నాన్నను గెలిపించేదీ అమ్మే ఎల్లవేళలా!!



గాదిరాజు మధుసూదన రాజు

Saturday, April 25, 2020

దేముడా...నీ ఉనికెక్కడ..?నవ తెలుగు తేజం కు పంపినది.

ఆగని కన్నీరు ఏరులై పొంగుతోంది.
ఐన వారి జ్ఞాపకాలు అంతరంగాన్ని
 కలవరం పెడుతున్నాయి.
 చాలీ చాలని బ్రతుకు బాటలో
 తనతో పాటు మరో నాలుగు 
 ప్రాణాలు నలిగిపోతున్నాయి.
 రెక్కాడితే గానీ డొక్కాడని జీవితం.
 మట్టి బతుకుల గతుకుల బాటలో.
 ముసలి తలిదండ్రుల బరువు-బాధ్యత -
 భార్య, ముగ్గురు పిల్లల బంధంతో బరువెక్కింది.
 పుాట గడిచే దారి కానరాని, 
  బతుకు బండి ప్రయాణం - 
 పల్లె  దాటి పట్టణం దారి పట్టింది .
 రోజు కుాలీ రాట్నం లో ఒరుసుకుపోతోంది.
 రెక్కలు ముక్కలుగా చేసి కుాడబెట్టిన డబ్బు
 భార్య పిల్లలు , కన్నవారి కడుపులకు
 గుప్పెడు మెతుకుల వరమైంది.,
 నిశ్చింత తో నిండిన సంత్రుప్తి..
 తన కాయ కష్టపు అలసటని
 చమట రుాపంతో చల్లపరుస్తోంది.
 ఇంతలోనే ఊహించని దుమారం.
 కోరలు లేని కరోనా కణం.....
 ఊరుార్ల ఉసురు పోసుకుంటుా 
 ప్రపంచమంతా అల్లుకుపోతోంది.
 లాక్ డౌన్ కట్టడి ,కష్ట జీవుల బతుకుల్లో
 గాడాంధకారాన్ని నింపుతోంది.
చేతిలో పని లేక, ఇంటికి పంపేందుకు రుాకల్లేక ,
చచ్చేందుకు దారిలేక , ప్రాణఁం కొట్టుకుపోతోంది.
రోజులు వారాలయ్యేయి. వారాలు నెల లయ్యేయి.
పరుగులు పెట్టే జనం ఇళ్ళ ల్లో బందీలయ్యేరు.
జన సంచారం లేని  నిర్మానుష్యపు రోడ్లు..
ముాత పడిన షాపులు..స్కుాళ్ళు..ఆఫీసులు
పుార్తి వ్యవసాయం స్థంభించిపోయింది.
దుార దర్సన్ లో వార్తలు సమ్మెట పోట్లయ్యేయి.
కొన్ని వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యేరు.
అన్నమొా రామచంద్రా అంటుా అలమటించే వారు,
రోజు కుాలీల ఆక్రోశాలతో ,  అవని అట్టుడికిపోతోంది.
మొబైల్ సందేశం తో తన వెన్నెముక కుాలింది.
ఊరిలో ముసలి తలిదండ్రులని 
క్వారంటైన్ లో పెట్టారట.
పొరుగుారి నాయుడుగారింట్లో 
పాచి పనికి  పోతున్న రంగి ,
నలుగురు కామాంధుల క్రౌర్యానికి 
బలిపశువై బతుకు  చాలించిందట. 
నన్ను  పిలుచుకు వస్తాన ని 
కాలి  నడకన బయలుదేరిన
పెద్ద కుాతురు కనకం , నడవలేక
నడి మధ్యలో , చతికిల పడిందట.
ప్రాణం ఉందో..పోయిందో..తెలీదంట.
పట్టెడన్నం కోసం పెద్దోడు 
చంటాడి నొదిలి రోడ్లంట పడ్దాడంట.
ఏడకి పోయాడో...ఎక్కడున్నాడో..?
పాలకోసం ఏడ్చి..ఏడ్చి...
చంటాడు సొమ్మసిల్లి పోయేడట.?
కుటుంబం మొత్తం ఛిన్నా- భిన్నమైన విషయం
తన మనసు పొరల్లో దావానలమై రాజుకుంటోంది.
ఎవరి మీదో తెలీని కోపం..కసి
కాలసర్పమై తననే కాటువేసేందుకు 
పడగ విప్పి నాట్యం చేస్తోంది.
కనికరం లేని కరోనా కంటకంగా తయారైంది.
కనబడని , వినబడని విధ్వంశమై
విలయ తాండవం చేస్తోంది..
వేల కొలదీ ప్రాణాలను బలితీసుకుంటున్నాది.
గొప్ప -బీద తేడా లేదు.
ముసలీ -ముతకా జాలి లేదు.
పిల్లా -పాపా...ముద్దుా లేదు.
పట్నం- పల్లె...హద్దు లేదు.
ప్రతీ చోటా మ్రుత్యువు కోత..
ఇంటింటా కరోనా భయం తో జీవితం రోత...
ఈ కన్నీటి ఆక్రోశాలకి  అంతం లేదా..
ఈ మహమ్మారి కి మందులేదా...
ఈ కట్టడికి,  విడుపు లేదా..
ఓ..భగవంతుడా..నీ ఉనికెక్కడ..?
-----------------
రచన, శ్రీమతి..
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్..( మహరాష్ట్ర ).
---------------








 

Friday, April 24, 2020

Thursday, April 23, 2020

పుస్తక దినోత్సవం.

ఈ రోజు అంతర్జాతీయ పుస్తక దినోత్సవం. ఆంగ్ల 
 రచయిత,ప్రప్రంచవిఖ్యాత  నాటక రచయిత విలియం షేక్‌స్పియర్   జన్మదినమూ,వర్థంతి కూడా,ఏప్రిల్ 23. యునెస్కో ఈ సందర్భన్ని పురస్కరించుకుని 23 ఏప్రిల్ ను అంతర్జాతీయ పుస్తక దినోత్సవం గాప్రకటచింది.1995 నుండి ప్రతి సంవత్సరం  పుస్తక దినోత్సవం జరుపుతున్నాము. పుస్తకాలు ప్రియ నేస్తాలు కదా. అందరికీ ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు.🌹😊

అదీ సంగతి.

Hariprasad.:
*వేదగణితం - ఒక కథ*

చదరంగం ప్రియుడయిన ఒక రాజు వద్దకు ఒక వేద పండితుడు వచ్చాడు.ఆ పండితుడు అతన్ని ఒక ఘన పనస చదివి ఆశీర్వదించాడు.

అప్పుడు ఆ రాజుగారు *ఏమయ్యా! పండితా! ఈ వేదపనసలు ఎవరైనా* *నేర్చుకుని చదవ వచ్చు! చదరంగం ఆడడానికి సహజమైన తెలివి కావాలి. నాతో కేవలం ఒక 20 ఎత్తులు పూర్తయ్యే వరకు ఆడి నిలువు! అప్పుడు నువ్వడిగిన కోరికను నెరవేర్చుతాను.*అన్నాడు.

అప్పుడు ఆ పండితుడు *రాజా! నాకు చదరంగం వస్తుందని కాదు గానీ, మిమ్ములను సంతోష పరచడానికి ఆడతాను* అంటూ రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు పూర్తయ్యే వరకు నిలిచాడు.

రాజు గారూ ఆటను చివరి వరకూ కొనసాగిద్దాం! అన్నాడు. కానీ ఆ పండితుడు *రాజా! ఆట ను ఇక్కడితో ఆపడం నాకు క్షేమమూ - గౌరవం కూడా! రాజు గారితో 20 ఎత్తుల వరకు ఆడగలి గాను అని గొప్పగా చెప్పుకోవచ్చు!* అంటూ సున్నితంగాతిరస్కరించాడు.

*సరే! పండితా! నీ తెలివి ని గుర్తించాను. మాట ఇచ్చినట్లుగా నీ కోరిక నేరవేర్చుతాను.చెప్పు!* అన్నాడు రాజుగారు.

*మహారాజా! చదరంగం లో 64 గడులు ఉంటాయి కదా! ఒక గడిలో ఒక* *గింజ - రెండవ గడికి అంతకు రెట్టింపు రెండు* *గింజలు - మూడవ గడికి మళ్లి రెట్టింపు 4 గింజలు -* *నాలుగవ గడికి మళ్లి* *రెట్టింపు 8 గింజలు -*
*.... ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు! అదే మహాప్రసాదం.* అంటూ ఆ పండితుడు వెళ్లిపోయాడు.

రాజు సరే! అని ఆ పని మంత్రికిపురమాయించాడు.

ఆ పండితుని వెంటమంత్రి గారు కూడా వెళ్లి తన ఆస్థాన గణికులతో ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు.

తిరిగి వచ్చిన మంత్రితో రాజుగారు *పండితుడడి గాడు కదా.. మొదటి* *గడిలో ఒక ధాన్యపు గింజ.. రెండవ గడిలో దానికి రెట్టింపు రెండు..* *మూడవగడిలో దానికి రెట్టింపు నాలుగు, తర్వాత 8 గింజలు, ఐదవ గడిలో 16 గింజలు.. అయితే ఏముంది.. చదరంగంలో ఉన్నదంతా 64 గళ్లేగా.. ఇచ్చుకోవలసిందేమో గడికీ గడికీ రెట్టింపు..* *వెఱ్ఱి పండితుడు.. గింజ లకు గింజలు రెట్టింపు చేసుకుపోయినా ఎన్ని వస్తాయి..? ఏదేనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సింది..*

*అలా తీసెయ్యకండి మహారాజా!.. ఆ పండితు డేమీ వెర్రిబాగులవాడు కాదు..*

*ఎందుచేత..?* అన్నాడు రాజుగారు.

*లెక్క కట్టి చూసుకుంటే.. ఆ పండితుడడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేరు కనుక..!!!*

*ఎందుకు..?* ఆశ్చర్య పోతూ అడిగాడు మహారాజు

ఎన్ని ధాన్యపు గింజలో మన గణికులు గంటల కొద్ది లెక్కించి చెప్పిన సంఖ్యను ఆ పండితుడు వేదగణితం ద్వారా క్షణం లో చెప్పేసాడు మహారాజా! అంతే కాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆశువుగా ఒక చంపక మాల పద్యం కూడా చెప్పాడు.

*అలాగా.. ఏమిటా పద్యం..?*

*ఇదుగో.. వినండి మహారాజా !*

శర శశి షట్క చంద్ర శర
సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ ధర గగనాబ్ధి వేద గిరి
తర్క పయోనిధి పద్మజాస్య కుంజర తుహినాంశు సంఖ్యకు
నిజంబగు తచ్చతురంగ గేహ విస్తర మగు రెట్టికగు
సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

పద్యం విన్న మహారాజు *దీన్లో తేలిన లెక్కెక్క డుంది..?అంతా బాణా లూ, చంద్రులూ, ఆకాశం, అంబుధి,కొండలుతప్ప..*

*అదే మహారాజా! మన దేశ పండితుల మేధ.. సంక్షిప్తంగా అల్పాక్షరము లతో అనల్పార్థ సాధకం గా ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది..*

‘సరే… సరే.. విప్పి చెప్పు..’

*ఈ పద్యంలో లెక్క చిక్కు విడిపోవాలంటే మన పూర్వుల సంఖ్యా గణన పద్ధతి తెలియాలి.. వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతి శక్తులను సంకేతా లుగా ఏర్పాటు చేసుకున్నారు.

ఈ పద్యంలో

*శర, సాయక,* -  అనే పదాలకు అర్థం బాణాలు అని.( మన్మథుని పంచ సాయకములు) ఇక్కడ ఆ రెండు పదాలు 5 సంఖ్యను సూచిస్తాయి.

*గగన, వియత్ - 0*
(ఆకాశం గగనం శూన్యం)

*శశి, చంద్ర, తుహినాంశు -1*(చంద్రుడొకడే భూమి కి )
*షట్కము - 6*
*రంధ్ర - 9*
(నవరంధ్రాలు)
*నగ, గిరి, భూధర - 7*
*అగ్ని - 3*
(మూడగ్నులు; గార్హపత్యాగ్ని,దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని)
*అబ్ధి, పయోనిధి - 4*
*వేద -4*
(చతుర్వేదములు)
*తర్క - 6*
(షట్ తర్కప్రమాణాలు, ‘ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి, అనుపలబ్ధి’)
*పద్మజాస్య - 4*
(పద్మజుడు బ్రహ్మ, చతుర్ముఖుడు)
*కుంజర - 8*
(అష్ట దిగ్గజములు)

ఇవీ ఇందులోని అంకెల సంకేతాలు.. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే..’
శర శశి షట్క చంద్ర శర
5     1     6         1    5
సాయక రంధ్ర వియత్
5            9       0
నగాగ్ని భూ
    7       3
ధర గగనాబ్ధి వేద గిరి
  7     0  4      4    7
తర్క పయోనిధి
6         4
పద్మజాస్య కుం
    4     
జర తుహినాంశు
8         1
సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి
స్తర మగు రెట్టికగు   సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్

*అంకెలులెక్కించెటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం .. "అంకానాం వామతో గతిః"* - కుడి నుంచి ఎడమకు చేర్చి చదువు కోవాలి..

అలా చేస్తే చివరగా తేలిన సంఖ్య.
*1,84,46,74,40,73,70,95,51,615*

*ఒకకోటి 84లక్షల 46 వేల 74కోట్ల 40 లక్షల73 వేల 70కోట్ల 95 లక్షల 51వేల 615*

ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం.ఇక ఇంతోటి ధాన్యాన్ని నిలవచేయాలి అంటే,
*ఒక ఘనమీటరు విస్తృతి గల గాదెలో దాదాపు* *ఒకటిన్నర కోటి గింజ

లు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే,*
*4మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు* *దాదాపుగా 12,000 ఘనకిలోమీటర్లు విస్తీర్ణం కావాలి..*

*పేర్చుకుంటూ వెళితే  300,000,000-ముప్పై కోట్ల కిలోమీటర్లు..* అంటే *భూమికి సూర్యునికి ఉన్నదూరానికి రెట్టింపు.*

పోనీ *లెక్కపెట్టడానికి ఎంత సమయం* *పడుతుందో అంటే*
*సెకనుకు ఒక్కగింజగా లెక్కించితే అన్నీ లెక్కించటానికయ్యేవి  58,495 కోట్ల సం.।।లు...*

అదీ సంగతి…

వేదపండితులతో వేళా కోళం తగదు మహారాజా!… *నిజానికి అతడు చదివిన ఘనపనస* *కూడా లెక్కలకు,ధారణ శక్తికి సంబంధించినదే!* *ఎంతో ధారణ శక్తి - పాండిత్యం - సాధన ఉంటేకానీ ఘణాపాటి కాలేరు.* అతడు ప్రేమగా ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించ పరిచారు. ఇప్పుడు ఏం చేయడం? మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది.

అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకుల నుండి ఎవ్వరు కూడా ఇప్పటి వరకు మాట తప్పలేదు.

ఏం చేసి ఈ దోషం నుండి తప్పించుకోవలో ఆ పండితున్నేఅడుగుదాము.అని ఆ పండితున్ని పిలిపించిక్షమించమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏంచేయాలో చెప్పుమన్నాడు.

ఆ పండితుడు *రాజా! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టలేము.ధాన్యంబదులు గా అవును ఇవ్వండి చాలు!* అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు.

Monday, April 20, 2020

writer..Sunitha

గది లోపలి దుఃఖం
       ............
నా గది గుమ్మం లోపల
నేను గౌరవం గా నిలబడతాను
ఊహకూ జీవితానికీ మధ్య దూరాన్ని..
నాకు పూసగుచ్చినట్టు 
బోధించిందా గది
నన్నాగదిలో ఒంటరిని చేసి
అతడు వెళ్లిపోయాక..
నా చుట్టూ ఉన్న రాతిగోడలు
పొగడ పువ్వుల్లా నన్ను స్పర్శించాయి
నేలంతా పరుచుకున్న నైరాశ్యం
ముగింపు' కు కొత్త అర్థాన్ని
వెతికి పెట్టింది
అందరూ వున్న బతుకు లో
ఎవరూ లేని గుండె
ఏకాంతంతో సంఘర్షిస్తుంది
ఎక్కడో జారిపోయిన
గుప్పెడు పరిమళాలు
గది బయట గాలిలో ప్రవహిస్తున్నాయి
వేకువ గుచ్చిన ఓ మంచుపూల గుఛ్చం..
లే ఎండలో నిలబడి
సన్నగా ఏడుస్తోంది
నా గది లోపలంతా నిశ్శబ్దంగా వుంది
నేను గోడకు చెవి ఆన్చి
ఇంకా వినబడుతున్న దుఃఖపు వూసులను..
పెదాలు బిగించి వింటున్నాను
          ...........

సునీత గంగవరపు -
            ***

థామస్ ఏండర్సన్

[3/21/2019, 18:45] Rajshekhar Murthy: థామస్ ఎ. ఆండర్సన్ ఇద్దరు జీవితాలను గడిపిన వ్యక్తి. రోజుకు అతను సగటు కంప్యూటర్ ప్రోగ్రామర్ మరియు రాత్రి నియో అని పిలువబడే హ్యాకర్. నియో ఎల్లప్పుడూ తన రియాలిటీను ప్రశ్నించాడు, కానీ నిజం అతని ఊహ మించినది. నియో తనను తాను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నప్పుడు మార్ఫియస్ చేత సంప్రదించినప్పుడు, ఒక పురాణ కంప్యూటర్ హ్యాకర్ ప్రభుత్వం తీవ్రవాదిగా బ్రాండ్ చేశాడు. మాఫియాస్ నిజ ప్రపంచానికి నియోను ఉత్సాహపరుస్తుంది, మానవుని యొక్క శరీర వేడి మరియు విద్యుచ్ఛేద శక్తి యొక్క జీవనం మరియు మ్యాట్రిక్స్ అని పిలిచే ఒక కృత్రిమ రియాలిటీలో వారి మనసులను బంధించే యంత్రాల రేసు ద్వారా చాలా వరకూ మానవత్వంను బంధించారు. యంత్రాలు వ్యతిరేకంగా ఒక తిరుగుబాటుదారుగా, నియో మ్యాట్రిక్స్ తిరిగి మరియు ఏజెంట్లు ఎదుర్కొంటారు: నియో మరియు మొత్తం మానవ తిరుగుబాటు snuffing అంకితం సూపర్ శక్తివంతమైన కంప్యూటర్ కార్యక్రమాలు.
-
[3/21/2019, 18:47] Rajshekhar Murthy: కంప్యూటర్ ప్రోగ్రామర్ థామస్ ఆండర్సన్, హ్యాకర్ "నియో" గా డబుల్ జీవితాన్ని గడుపుతూ, ప్రపంచానికి ఏదో తప్పు అనిపిస్తుంది మరియు గుప్తమైన పదబంధం "ది మ్యాట్రిక్స్" తో పునరావృతమయ్యే ఆన్ లైన్ ఎన్కౌంటర్ల ద్వారా ఆశ్చర్యపోతాడు. త్రిమూర్తిగా పిలువబడే ఒక మహిళ అతనిని సంప్రదించి, మార్ఫియస్ అనే మనిషి దాని అర్ధం వివరించగలడు; అయినప్పటికీ, ఏజెంట్ స్మిత్ నేతృత్వంలోని ఎజెంట్, నియోను పట్టుకొని, "తీవ్రవాది" మార్ఫియస్ను పట్టుకోవటానికి అతనిని బెదిరించటానికి ప్రయత్నిస్తాడు. నిరుత్సాహపరుడైన, నియో తరువాత మార్పిక్స్ను కలుసుకుంటాడు, అతనికి ఒక ఎర్ర పిల్ మధ్య ఒక ఎంపికను అందిస్తుంది, అది అతనిని మ్యాట్రిక్స్ గురించి నిజం అని చూపిస్తుంది, మరియు ఒక నీలం పిల్ అతని పూర్వ జీవితంలోకి తిరిగి వస్తుంది. ఎరుపు మాత్రను మింగివేసిన తరువాత, తన రియాలిటీ విచ్ఛిన్నమవుతుంది మరియు నియో ఒక విస్తృతమైన విద్యుత్ వ్యవస్థకు తీగలతో కనెక్ట్ అయ్యే లెక్కలేనన్ని ఇతరులలో ఒక ద్రవ నిండిన పాడ్లో, నగ్నంగా, బలహీనమైన మరియు జుట్టు లేని, మేల్కొలుపుతుంది. అతను రక్షించబడ్డాడు మరియు మార్ఫియస్ నీటిపైనా, నెబుచాడ్నెజ్జార్లో ప్రయాణించాడు.

నియోను పునరుద్ధరించినట్లు, మార్ఫియస్ సత్యం వివరిస్తాడు: 21 వ శతాబ్దంలో, తెలివైన యంత్రాలు (రోబోట్లు) వారి మానవ సృష్టికర్తలకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రారంభించింది. మానవులు సౌరశక్తికి యంత్రాల ప్రవేశాన్ని నిరోధించినప్పుడు, మానవులు 'బయోఎలెక్ట్రిక్ శక్తిని పెంపొందించడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నారు. 20 వ శతాబ్దం చివరలో ఉన్న మ్యాట్రిక్స్ ప్రపంచం యొక్క భాగస్వామ్య అనుకరణగా చెప్పవచ్చు, ఇక్కడ వారి మృతదేహాలు ప్యాడ్స్లో ఉండగా, పండించిన మానవుల మనస్సులను శాంతింపజేస్తారు. అన్ని మానవులు వాస్తవమైన ప్రపంచంలో చివరి శరణు అయిన సీయోనులో నివసిస్తారు. మార్ఫియస్ మరియు అతని సిబ్బంది మాడ్రిక్స్లో "బానిస" బానిసలుగా ఉన్న మానవులకు హాక్ చేసే వారిని తిరుగుబాటుదారులు మరియు వారిని నియమించుకుంటారు. అనుకరణల వాస్తవికత గురించి వారి అవగాహన, వాటి భౌతిక నియమాలను పెంచి, వాటిని మానవాతీత సామర్ధ్యాలను కల్పించడానికి వీలు కల్పిస్తుంది. [మరింత వివరణాత్మక వివరణ] మాట్రిక్స్ లోపల మరణం భౌతిక శరీరాన్ని చంపిస్తుందని మరియు ఎజెంట్ శక్తివంతమైన బెదిరింపులు వ్యవస్థ. వర్చ్యువల్ పోరాట శిక్షణ సమయంలో నియో యొక్క పరాక్రమం, నియో "ది వన్" అని పిలవబడే మార్ఫియస్ నమ్మకానికి ఆధారపడింది, ప్రత్యేకంగా శక్తివంతమైన మానవుని మానవులకు విముక్తి కల్పించి, యుద్ధాన్ని ముగించాడు.

సమూహం ఒరాకిల్ను సందర్శించడానికి మాట్రిక్స్లోకి ప్రవేశిస్తుంది, ఇది ఒకరి పుట్టుకను ఊహించిన ఒక సర్వజ్ఞుడు. ఆమె నియో ఒక కాదు మరియు అతను మార్ఫియస్ జీవితం మరియు అతని స్వంత మధ్య ఎంచుకోండి ఉంటుంది నియో హెచ్చరిస్తుంది. వారు మాట్రిక్స్ ను వదిలి వెళ్ళేముందు, ఆ బృందం సైప్రస్ చేత హెచ్చరించబడిన ఏజెంట్స్ మరియు వ్యూహాత్మక పోలీసులచే మెరుపుదాడికి గురవుతుంది, మాట్రిక్స్లో తిరిగి సౌకర్యవంతమైన జీవితం కోసం స్మిత్కు మార్ఫియస్ను మోసగించిన ఒక అసంతృప్త సిబ్బంది సభ్యుడు సైఫర్. మార్ఫియస్ తనని తాను నియోను స్వాధీనం చేసుకునేందుకు అనుమతిస్తుంది మరియు మిగిలిన సిబ్బంది తప్పించుకుంటారు. సైప్రెర్ మాట్రిక్స్ను విడిచిపెట్టి, పలువురు సిబ్బంది సభ్యులను హతమార్చడం వలన వారు వాస్తవిక ప్రపంచంలో రక్షణ పొందుతారు. అతను నియో మరియు ట్రినిటీ, ట్యాంక్, అతను చనిపోయిన కోసం వదిలి ఒక సిబ్బంది, డిస్కనెక్ట్ సిద్ధమవుతుండగా, అతనికి చంపేస్తాడు.

మాట్రిక్స్లో, ఏజెంట్లు తన యాక్సెస్ సంకేతాలను జియాన్లోని మెయిన్ఫ్రేమ్ కంప్యూటర్కు తెలుసుకునేందుకు మార్ఫియస్ను ప్రశ్నించారు. ట్యాంక్ దీనిని నివారించడానికి మార్ఫియస్ను చంపిస్తుందని ప్రతిపాదించింది, కానీ నియో, అతను ఒక వ్యక్తి కాదని నమ్మాడు, మార్ఫియస్ను కాపాడటానికి అవసరమైతే తాను త్యాగం చేస్తాడు; తను ఆమెను వెంబడించాడని ట్రినిటీ నొక్కి చెబుతుంది. మార్ఫియస్ను కాపాడుతున్నప్పుడు, నియో తన సామర్ధ్యాలపై విశ్వాసం పొందుతాడు, ఏజెంట్లకు పోల్చగల ఫీజులను ప్రదర్శిస్తాడు. మార్ఫియస్ మరియు త్రిమూర్తి మాట్రిక్స్ నుండి నిష్క్రమించారు, కాని స్మిత్ అతను బయలుదేరడానికి ముందు నియోను చంపుతాడు మరియు చంపుతాడు. నిజ ప్రపంచంలో, సెంటినల్స్ అని పిలువబడే యంత్రాలు నేబుచాడ్నెజ్జార్ దాడి చేస్తాయి. తను తాను ప్రేమిస్తున్నందున నియోకు త్రిత్వము గుసగుసలాడుతున్నాడని మరియు ఒరాకిల్ తనకు ఒకరితో ప్రేమలో పడతాయని చెప్పాడు. ఆమె నియోను ముద్దు పెట్టుకుంటుంది మరియు అతను మ్యాట్రిక్స్ను గ్రహించి మరియు నియంత్రించడానికి అధికారంతో పునరుద్ధరించాడు. అతను అప్రయత్నంగా స్మిత్ను ఓడించి, ఓడ యొక్క విద్యుదయస్కాంత పల్స్ ఆయుధాన్ని దాడిచేసే సెంటినల్స్ను నిలిపివేసినందున మాత్రికను వదిలి వెళతాడు.

తర్వాత, నియో మాట్రిక్స్ లోపల ఒక టెలిఫోన్ కాల్ చేస్తాడు, వారి ఖైదీలను "ఏదైనా సాధ్యమయ్యే ఒక ప్రపంచాన్ని" చూపించే యంత్రాలు వాగ్దానం చేస్తాడు. అతను ఆగిపోతాడు మరియు ఆకాశంలో ఎగురుతాడు.

Sunday, April 19, 2020

My album link.

[4/18, 17:30] Rajshekhar Murthy: https://open.spotify.com/album/6cmIoo322ugu7z3C2S8RZ

[4/18, 17:31] Rajshekhar Murthy: on Saavn https://www.jiosaavn.com/album/govinda-govinda/-vxwFaSItLw_

కిరణ్కుమారిగారి గురించి..( పెయింటర్ ).

*ప్రపంచ కళా దినోత్సవ శుభాకాంక్షలు*....
*ఆమె చిత్రాలు మనతో మాట్లాడుతాయి*#
*నాకు* చిత్రకళ మీద అంత మక్కువ లేదు... దాని గురించి పెద్దగా తెలియదు.... అయినా ఆమె పెయింట్ చేసిన  ' భవాని నగర్ ' చిత్రాలంటే ఎందుకో మక్కువ... నేను ' భవాని నగర్' లో పుట్టి పెరగడం కారణం కావచ్చు... ఆ చిత్రాలు చూసినప్పుడల్లా నేను చుట్టేసిన ' భవాని నగర్' అంతా గుర్తుకు వస్తుంది... జిగిబిగి కరెంటు తీగలు, పాత జ్ఞాపకాలు చుట్టుముట్టేస్తాయి.... అందుకే ఆమె చిత్రాలు మనతో మాట్లాడుతాయనిపిస్తుంది. చిత్ర కళాకారులు ఎంతో మంది తిరుపతి లో ఉన్నా ఆమెకుండే ప్రత్యేకత వేరు.... ఆమె *కిరణ్ కుమారి గారు* .... పాతికేళ్లుగా నాకు తెలుసు సబ్ ఎడిటర్ గా ప్రారంభమైన ఆమె కెరీర్ .... తరువాతి కాలంలో అనేక రంగాలలో తన ప్రతిభను చాటుకున్నారు.... తనకు ఎంతో మక్కువ అయిన చిత్రకళను ఘనంగా తీర్చిదిద్దుకున్నారు.... గత 20 ఏళ్లుగా తన కుంచెను ఆపకుండా పదునెక్కిస్తున్న కిరణ్ కుమారి గారి గురించి మనం తెలుసుకుందాం...
తిరుపతికి చెందిన కిరణ్ కుమారి గారు కమ్యూనికేషన్ మరియు జర్నలిజంలో పిజి చేశారు  గత 20  సంవత్సరాలలో ఉదయం దినపత్రిక, జాతీయ, రాష్ట్ర స్థాయి ఎన్జీవోలు, చిత్తూరు వెలుగు ప్రాజెక్ట్ లో వివిధ సందర్భాల్లో పనిచేశారు.  వెలుగు ప్రాజెక్ట్ లో పనిచేస్తుండగా స్వయం సహాయక సంఘాల్లోని 'చదువురాని పేద మహిళలు' 200 మందికి శిక్షణనిచ్చి విలేకర్లు గా తయారు చేశారు వీరితో 'నవోదయం' అనే పత్రికను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు...2001 లో ప్రారంభించబడిన 'నవోదయం' పత్రిక 'అప్రతిహతంగా' 20 ఏళ్లుగా నడుస్తోంది... ఆ పత్రిక నేటికీ నడుస్తుండటం విశేషం...
కిరణ్ కుమారి గారు... మీ గురించి ఏమైనా చెప్పండని అడిగితే.... ఎందుకు సార్....నా కంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు... చెప్పుకునే అంత గొప్ప దానిని కాదు... నా చిత్రాలు పోస్ట్ చేయండి అని 'నమ్రత'గా అంటారు... స్వతహాగానే కిరణ్ గారు 'మితభాషి',  పొదుపుగా మాట్లాడుతుంటారు...  ఆమె గురించి తెలిసిన వాళ్ళు ఆమె మిత భాషే కానీ... ఆమె సృష్టించిన చిత్రాలు గంటల తరబడి మనుషులతో మాట్లాడుతుంటాయి అంటారు ... ఆమె చిత్రకళలో జీవం ఉట్టిపడుతుంది కొన్ని సందర్భాల్లో ఇది నిజమా?... పెయింటింగా? అన్న అనుమానం  కలుగుతుంది.... అంతటి సమర్థత కిరణ్ గారి సొంతం... కళాకారిణిగా జాతీయ, రాష్ట్ర స్థాయి ఎన్జీవోలకు, కొన్ని ప్రభుత్వ సంస్థలకు, మహిళా యూనివర్సిటీ వారికి వందకు పైగా పోస్టర్లు తయారు చేసి ఇచ్చారు... మహిళలు, దళితులు, రైతాంగ సమస్యలపై ఈ పోస్టర్లు ఉన్నాయి....
సామాజిక సమస్యలపై వేసిన ఈ పోస్టర్స్ ను అనేక శిక్షణా కార్యక్రమాల్లో ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు... ఆ లింకు మీ కోసం...
https://kiranin.blogspot.com

ప్రస్తుతం స్టిల్ పెయింటింగ్స్ మీద  దృష్టి పెట్టిన కిరణ్ కుమారి గారు ... వేసిన చిత్రాలతో ....అమెరికా దేశంతో పాటు మన దేశంలోని ఢిల్లీ, బెంగుళూరు, కొచ్చిన్, చెన్నై, హైదరాబాదు , చండీఘర్ లాంటి నగరాల్లో ప్రదర్శనలు జరిగాయి... తిరుపతి బాలమందిరంలో ప్రతి ఆదివారం పిల్లలకు కథలు చెబుతూ బొమ్మలు నేర్పించే మన కిరణ్ గారు... తిరుపతిలోని పాత భవనాలు, రోడ్లు, సందులు, కరెంటు వైర్లు పై చాలా బొమ్మలు వేశారు.... ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా మన కిరణ్ కుమారి గారికి... మనమంతా శుభాకాంక్షలు తెలియజేద్దాం... కిరణ్ కుమారి గారు వేసిన బొమ్మలు చూడాలంటే  ఈ లింక్ పై క్లిక్ చేయాలి....
http://bkiranarts.com

*కందారపు మురళి*
*ప్రధాన కార్యదర్శి*
*సిఐటియు*
*తిరుపతి*

Wednesday, April 15, 2020

Drawing pencils for pencil Drawing.

Akos Artist : Pencil sketching.
Graphite pencils Faber castell- B ,3B,4B ,6B,8B
Faber castell mechanical pencils 0.3mm,/ 2B,B,HB.
 Rotting,Tikky Special Mechanical Pencil 0.5mm/ 2 B, B
Staedtler  Kneadabt Eraser,Rotting Tikky Eraser.
Fabriano 200GSM Paper,Size 210 into 289millimeters.
Blending Stups Paper tissues.

కవిత

శీర్షిక:
శ్రీ గిడుగు రామమూర్తి
-------------------------

"సస్యశ్యామల దేశం మన ఈ భారతదేశంలో"  శ్రీకాకుళం ఉత్తరాన గల పర్వతాలపేట గ్రామంలో "వీర్రాజు వెంకమ్మ" దంపతుల ముద్దుబిడ్డగా జనియించిన మహనీయుడు మన శ్రీ "గిడుగు వేంకట రామమూర్తి పంతులు"

కార్యశూరుడై  కలం పట్టి, తెలుగు ప్రజల కోసం భాషోద్యమాకారునిగా ధ్వజమెత్తి సమాజానికి యెనలేని సేవలు చేసి ,
తెలుగు వ్యవహారిక భాషకు
పితామహుడై,  
తెలుగు వచనాన్ని ప్రజల వాడుక
భాషలోకి తెచ్చి, 
నిత్య వ్యవహార భాషలో  ఉన్న
అందాన్నీ, వీలునూ గొప్పగా తెలియ పరచిన బహుముఖ ప్రజ్ఞాశాలి  మన శ్రీ "గిడుగు రామమూర్తి పంతులు"

గిరిజనుల అందుబాటుకు సవర భాషను రూపొందించి
సవర భాషలో వ్యాకరణాన్ని, సవర ఇంగ్లీష్ కోశాన్ని నిర్మించి
"ముండా ఉప కుటుంబ భాషను" 
శాస్త్రీయంగా పరిశీలించిన మొట్టమొదటి స్థానంలో నిలిచిన  ఘనుడు మన శ్రీ "గిడుగు రామమూర్తి  పంతులు"

విస్తృతమైన తెలుగు భాషా రచనలతో  అవగాహన పెంచి  ఆధునిక ఆంధ్ర భాషా సంస్కరణకై తోటి సహోధ్యాయులు "గురజాడ, జే ఏ యేట్స్, శ్రీనివాస్ అయ్యంగార్" వీరి సమిష్టి ఆలోచనా సహకారంతో  తెలుగుభాషా ఉద్యమోద్యుతి స్ఫూర్తిని పట్టుదలతో సాధించి వ్యవహారిక భాషా ఉద్యమాన్ని ఆరంభించి వ్యవహారిక భాషలో మార్చిన ఘనత సాధించాడు మన శ్రీ "గిడుగు రామమూర్తి పంతులు"
 
భారతీయుల పుణ్యము పండగా విద్యా ప్రాముఖ్యతకై కృషి నొనరించి, తెలుగు పత్రిక రచించి, రావ్ బహదూర్ వంటి
గొప్ప బిరుదులను పొందిన చిర స్మరణీయుడు మన శ్రీ "గిడుగు రామమూర్తి పంతులు"

ఆదర్శ దృక్పథం గల కార్యదక్షుడిగా  దేశాభివృద్ధి కై శ్రమించి, గ్రంథ కావ్యాల భాష  గ్రాంథిక  ప్రాసని  పాఠ్యాంశంగా నిత్య వాడుక భాషగా మార్చి, తెలుగు భాష పురోగమనానికి  మార్గాన్ని చూపి, విద్యాభివృద్ధి అభ్యున్నతికై  వినూత్న విద్యా కమలంగా వికసించి, ఆంధ్రులకు ఆరాధ్యుడై శిఖరాగ్ర మెక్కాడు  మన  శ్రీ "గిడుగు రామమూర్తి  పంతులు"

తెలుగు జాతి గర్వపడేలా తన దేశభక్తిని చాటి, అభ్యుదయాన్ని ప్రసాదించి తెలుగు కీర్తిని నలుమూలలా పతాకంలా ఎగురవేసి  ప్రజల గుండెల్లో చిరస్థాయిగా  నిలిచిన జాతి రత్నం మన శ్రీ "గిడుగు వెంకట రామమూర్తి పంతులు" వారిని స్మరించుకుందాం!
అడుగు జాడల్లో నడుద్దాం!
దీక్షతో ముందుకు సాగుదాం!!
*-----------------------------------*

లక్ష్మీ వేణుగోపాల్
పుణె (మహారాష్ట్ర)
7709227773

పద్యం యతి పదాలు.

4/3, 17:13] Nemani prasadgaru మాహరాష్ట్ర .
.తొలి ప్రయత్నం కాబట్టి ఛందస్సులో తప్పులు కలవు. ప్రతీ పాదానికీ గణము యతి సరిగా ఉన్నవా లేదా సరి చూడండి.  మీకే తెలుస్తుంది  ఎక్కడ మార్చాలో.

గణము= భరనభభరవ
యతిస్థానం= 10
ప్రాసనియమం, అక్షరాలు= 20
కాకువు= జిహ్వ.
గణాలు అన్ని పాదాల లో చూడండి. 
యతి మైత్రి కి హల్లు తో బాటు అచ్చు కూడ సరిపోవాలి. 

గొ ____  గు గూ గొ గో   
కుకూకొకో  ఖుఖూఖొఖో ఘుఘూఘొఘో  

ఇవేవైనా చెల్లును.
అదే విధంగా 
మొకి , పుపూపొపో ఫుఫూఫొఫో
బుబూబొబో  భుభూభొభో
ము మో చెల్లుతాయి

పద్యాల ఛందస్సు గురించి.

[4/14, 18:36] iswarimurthy: నమస్కారమండి. ఎలా ఉన్నారు...?
చిన్న సందేహం. పద్యం రాసినపుడు చివరలో అప్పుడప్పుడు ఒక  గురువు మిగిలిపోతే పనికి వస్తుందా. (ముాడు గుర్తులు ఒక గణం కదా....అలా కాకుండా ఒక్కటే  గుర్తుతో ఉంటే.....)

[4/15, 10:10] Tyagarajugaru ponangi: అన్ని గణాలూ సరిపోవాలి.
ఒకవేళ గణాలు సరిపోక పోయినా, ఆ రచనలో మంచి భావం, శబ్దసౌందర్యం ఉంటే, దాన్ని అలాగే ఉంచేసి, పద్యం అనకుండా కవిత అనవచ్చు్
[4/15, 11:01] iswarimurthy: గణాల లో lu  ,  ul , u ...ఇలా కొన్ని ఉన్నాయికదా ..అవి ఏ పద్య పాదాలకు సరిపోతాయి. మనం  శ్లోకాలు చదువుతాం కదా....అవి ఏ గణాల నుపయొాగించి రాస్తారు. వాటి పద్ధతి వేరేగా ఉందా....ప్లీజ్ శ్రమ అనుకోకుండా  చెప్పరుా..

[4/15, 11:34] Tyagarajugaru ponangi: 1U ని లగము లేదా వగణము అంటారు. ఉదాహరణకు ఇది ఉత్పలమాలలో చివరన వస్తుంది.

UI ని గలము లేదా హగణము అంటారు. ఇది సూరఱయ గణాలలో ఒకటి. ఇది ఆటవెలది, తేటగీతి, సీస &ద్విపద లో వస్తుంది.

UU ని గగము అంటారు. ఇది కందపద్యంలో వస్తుంది.

శ్లోకాలకు వృత్త ఛందస్సులు ఎక్కువగా ఉంటాయి.
వృత్త ఛందస్సు కానిది ఒక ఛందస్సు అనుష్టుప్. ఇది భగవద్గీత లో ఎక్కువగా కనిపిస్తుంది. 


Kindi vatiki saraina Telugu cinema perlu raayandi 👍👍

1) కన్య తల్లి =
2) బంగారు పువ్వు =
3) కష్టాల్లో రక్షించేవాడు =
4) ఇవాళ  repeat అవ్వదు =
5) Again పార్వతి =
6) విష్ణువు ఇంట్లో కెరటం =
7) కుక్క దీవి. =
8) శివుని నగ =
9) ఈశ్వర డబ్బు =
10) పాదం అంతం  =
11) మూడో ఎక్కం చదువుతున్న రవి =
12) బొంగరం వీరుడు =

Try cheyyandi poyedumndi ...☺️
Genius brains only 🤪



1 missamma
2 swarna kamalam
3 aapadbhandhavudu
4 Malli Malli idi Rani Roju
5 malliswari
6 ala vaikunta puram
7 bhairava dweepam
8  Sankara bharanam
9 sivamani
10 legend
11 aadithya 369
12 top hero

Tuesday, April 14, 2020

చెప్పండి చుాద్దాం.

[4/14, 13:39] +91 99632 95997: *❇పురాణ క్విజ్  - 2



1. మహాభారత గ్రంథం యొక్క పూర్వ నామమేమిటి?
2.మహాభారత గ్రంథ రచయిత వ్యాసుని అసలు నామమేమిటి?
3. దేవకీ వసుదేవులకు కృష్ణుడు ఎన్నవ సంతానం?
4.కృష్ణుడు ఎవరి ఇంట పెరిగాడు.
5.బకాసురుణ్ణి సంహరించినది ఎవరు?
6.కంసుని సైన్యాధ్యక్షుడెవరు?
7.పాండు రాజు భార్యల పేర్లేమిటి?
8.కర్ణుడిని పెంచుకున్న దంపతులెవరు?
9.నరకాసురుని రాజ్యం పేరేమి?
10.నరకాసురుని చెరలో బందీలెందరు?
11.రుక్మిణి తండ్రి పేరేమి?
12.శ్యమంతకమణిని అపహరించాడని శ్రీకృష్ణునిపై నింద మోపినవాని పేరేమి?
13.సత్యభామ ఎవరి కుమార్తె?
14.మహాభారత సంగ్రామం ఎక్కడ జరిగింది?
15.అభిమన్యుడు ఛేదించిన వ్యూహం పేరేమి?
16.దృతరాష్టృని తల్లి పేరేమి?
17.పాండురాజు తల్లి పేరేమి?
18. ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడు ఛేదించిన యంత్రం పేరు?
19. భీష్మునిపై కోపంతో శిఖండిగా మారినది ఎవరు?
20. మహాభారత సంగ్రామం చివరిలో కర్ణుడి రథానికి సారధ్యం వహించినదెవరు?  👍 ??  👍
[4/14, 14:41] +91 88863 21221: 
1.జయము
2.కృష్ణద్వైపాయనుడు
3ఎనిమిదవ
4.నందుని ఇంట
5.భీముడు
7.కుంతి, మాద్రి
8.రాధ, అతిరథుడు
9. ప్రాగ్జ్యోతిషము
10. పదహారువేలు
11.భీష్మకుడు
12.సత్రాజిత్తు
13.సత్రాజిత్తు
14.కురుక్షేత్రం
15.పద్మవ్యూహం
16.అంబిక
17.అంబాలిక
18.మత్స్యయంత్రం
19.అంబ
20. శల్యుడు


1.పంచమవేదం
2.కృష్ణద్వైపాయనుడు
3.అష్టమ
4.నందుని ఇంట
7.కుంతి,మాద్రి
8.రాధ,
10.ప్రతిష్ఠానపురం
4.కురుక్షేత్రం
15.పద్శవ్యూహం
16.అంబిక
17.అంబాలిక
18.మత్సయంత్రం
19.అంబ
20.శల్యుడు

చెప్పండి చుాద్దాం.

[4/14, 13:38] +91 99632 95997: *కింది పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు చెప్పగలరు.*
1.పిపీలికము
2. మశికము
3. మార్జాలము
4. శునకము
5. వృషభము
6. మహిషము
7. శార్దూలము
8.మత్తేభము
9.మకరము
10.మర్కటము
11. వాయసము
12. మూషికము
13.జంబుకము
14. వృకము
15.తురగము
16. గార్ధభము
17. వరాహము
18.పన్నగము
19. కుక్కుటము
20. బకము
21. ఉష్ట్రము
22. శుకము
23. పికము
24.శలభము
25. కీటకము
26. మత్స్యము
27. హరిణము
28. మత్కుణము
29. మయూరము
30.కూర్మము
31. మకుటము
32. మకరందము
33. వానరము
34. వావురము
35. ఉరగము
[4/14, 14:11] +91 90520 66188: 1.చీమ
2.దోమ3.పిల్లి4.కుక్క5.ఎద్దు6.దున్నపోతు7.సింహం8.ఏనుగు9.ముసలి10.కోతి11.కాకి12.ఎలుక13.నక్క14.తోడేలు15.గుర్రము16.గాడిద17.పంది18.పాము19.కోడి20.కొంగ21.ఒంటె22.చిలుక23.కోయిల24.దీప పురుగు 25.పురుగు26.చేప27.జింక  28.నల్లి29.నెమలి30.తాబేలు 
31.కిరీటము32.తేనె33.కోతి34.పావురాయి35.పాము.

చెప్పండి చుాద్దాం.

[4/14, 11:23] +91 97012 75514: తెలుగు పాటలు చెప్పండి  ( పల్లవి లో ప్రతి మాట  మొదటి అక్షరం)
(తె  తె   నె   నీ  రూ   తె - తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజు నీ  రూపు తెలిసిందిలే)

1-జ  లా  లో   గ  గ  పా
2-ఏం  శ్రీ  ఒ  చి  మా
3- క  ఈ  ప్రే  లే  రా  హృ
4- రా  తా  ప  నా  మ  లో  క  క మ
5- లే  ని  లే  మ  లో  ద  పు  ప్ర
6- ప్రే  యా  బృం  నం  వ  యే
7- రా  రా నా రా  ను  పై అ  దో
8- లా  లా  లా  లో   ఓ  జ  ఊ  తూ
9- బృం  అం   గో  అం  వా
10- కా  క  చూ  పో  మ  పో
11- బ  ఏం  దే  గు  లో  వుం
12- పం  ది  వ  ప్రా  వె  ర  ఎ
13- నా  పా  నీ  నో  ప  శి
14-  దొ  ఇ  సే  నీ  ప  రా  చే
15- బ  బ  బ  బ  ని  చూ  జా  చు
16- స  వి  వ   చె    నా  క
17- సుం  నీ  ది  స్వ  ఎ  వె  లే  
18 - రా  చి  ప్రే  మో  రా
19-  సి  పు  సి  పు  చి  చి
20-  రా  చం  మా  విం  గా  వి 
21- సి  చూ  మా  నీ  సి  చూ మా 
22- జా  రా  జా  జో  పా  ఇ
23- చెం  రం  చీ  క  చి 
24- చ  చ  అ  గి  గి  గి
25-  తో  నా   రా  తొం  చూ  నా
[4/14, 13:34] +91 99632 95997: 1) జలకాలాటలలో గలగల పాటలలో 
2) ఏమండోయ్ శ్రీవారూ ఒక చిన్నమాట 
3)కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమా 
4) 
5) లేచింది నిద్ర లేచింది మహిళాలోకం 
6)ప్రేమయాత్రలకు బృందావనము 
7)
8) లాహిరి లాహిరి లాహిరిలో 
9)బృందావనమది అందరిదీ 
10)
11)
12)
13) నాపాట నీ నోట పలకాల శిలకా
14)దొరకునా ఇటువంటి సేవా 
15)బన్నీ బన్నీ బన్నీ బన్నీ 
16)సఖియ వివరించవె వగలెరిగిన 
17)సుందరి నీవంటి దివ్య స్వరూపమ్ము
18) రామ్మా చిలకమ్మ ప్రేమ మొలకమ్మ
19) 
20) రావోయి చందమామ మా వింతగాథ వినుమా 
21)సినిమా చూపిస్తా మావ నీకు సినిమా చూపిస్తా మావ
22) జాము రాతిరి జాబిలమ్మ
23) చెంగావి రంగుచీర 
24) చలి చలి .. అబ్బా గిలిగిలి గిలి 
25) తోటలో నారాజు

Sunday, April 12, 2020

సినిమా పొడుపు కధలు..

[4/10, 16:25] +91 94411 18102: 1. ఓరోరి రాజా! విరాధి వీరా! నీతోనె నేను ఉండి పోనా! ఎందాక నువ్వు వెళ్లాలి అంటే అందాక నేను కూడా రానా! హాయైన హంస నావ లోనా!!!!!! 
2. పచ్చని చెట్టు ఒకటీ, వెచ్చని చిలకలు రెండూ, పాటలు పాడి జోకొట్టాలి జోజోజో! 
3. గువ్వ, గోరింకతో ఆడిందిలే బొమ్మ లాట.
4. గున్నమామిడి కొమ్మమీద గూళ్ళురెండున్నాయి. 
6.గోదారి గట్టుంది, గట్టుమీద చెట్టుంది,... 
7.కుక్క కావాలి, కుక్క కావాలి
8. అలిగిన వేళనె చూడాలి, గోకుల కృష్ణుని అందాలు. 
10. చిలకమ్మ పెండ్లికి
[4/10, 16:25] +91 99639 17464: 25 చెంగు చెంగునా గగంతులువే24 . ఉరకలు వేయాలి గిత్తలు23 కోడి ఒక కోనలో పుంజు ఒక కోనల_లో  21. కాకులు దూరని కారటవి (అంతులేని కథ) ,
[4/10, 17:05] +91 94411 18102: నమస్తే మేడం! మొదటి పాట బాహుబలి 2 సినిమా లోనిది. 7వ పాట చిత్రం సినిమా లోది.
[4/10, 18:23] +91 76800 10007: 1)హంస 2)పచ్చని చిలుకలు3)గువ్వ గోరింకతో 4)చిలుకాకోయిల5)మైనా6)జమున7)- 8) పిల్లి 9)-10)కోయిలమ్మపెళ్ళికి11)-12)ఓ రామచిలుకా13)పావురము14)చిగురాకులలో చిలుకమ్మా15) నెమలికి16)హంసనడక17)హైవేల హైలెస్సా హంసకదా నా పడవ18) గోరవంక కెందుకోకొండంత 19)-20-

కరోనా

[4/12, 14:58] +91 85550 55454: 👍🙏💐👌👏
[4/12, 15:26] +91 76800 10007: కరోనా పై యుద్దంలో భారత్ ను అగ్రభాగాన నిలబెట్టిన ముగ్గురమ్మలకు పాధాభి వందనాలు🙏🙏

అగ్రదేశాల వెన్ను విరిచిన కరోనా భారతదేశంలో తలవంచడానికి ముగ్గురు మహిళా అధికారులు కీలకమైన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గత రెండు నెలల నుండి ఆఫీసు లోనే నివాసముంటూ, కుటుంబాలను కూడా కలవలేకపోయిన
ఈ ముగ్గురు భారత జాతికే కాకుండా ప్రపంచానికే ఆదర్శమయ్యారు. 

వీరే...... 
🌸 *ప్రీతి సుడాన్*

🌸 *డాక్టర్‌ నివేదిత గుప్త,* 

🌸 *సైంటిస్ట్ రేణు స్వరూప్.*

🌸 *ప్రీతి సుడాన్* -
హెల్త్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఈ IAS ఆఫీసర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పీజీ చేసి వరల్డ్ బాంక్ లో కూడా పని చేశారు. ఇప్పుడు కరోనా యుద్ధంలో నరేంద్ర మోడీ గారితో ప్రత్యక్షంగా పని చేస్తూ మన్ననలు పొందుతున్నారు. చైనా లోని వూహాన్ నుండి 645 మంది భారతీయుల ను స్వదేశానికి తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు. 

🌸 *డాక్టర్ నివేదిత గుప్త* - 
స్వయంగా MBBS అయిన ఈమె మాలిక్యులర్ మెడిసిన్ లో పీహెచ్‌డీ చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో డెంగ్యూ, చికెన్ గున్యా, సార్స్, నిఫా వైరస్ లను ఎదుర్కోవడంలో ఈమె కృషి ప్రపంచ దేశాలు ప్రశంసించాయి. ఇప్పుడు కరోనా యుద్ధంలో పరీక్షా పద్ధతులు, గైడ్ లైన్స్ రూపొందించడమే కాకుండా దేశ వ్యాప్తంగా 182 లేబరేటరీలను కొద్ది రోజుల వ్యవధిలో నిర్మించారు. వీటికి అవసరమైన పరికరాలు, ముడి పదార్ధాలు, టెక్నీషియన్ల శిక్షణ మొదలైన వాటిని స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రపందేశాలను సమన్వయం చేస్తున్నారు. 

🌸 *డాక్టర్ రేణు స్వరూప్* - జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ లో పీహెచ్‌డీ చేసిన ఈ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త నరేంద్ర మోడీ గారి శాస్త్ర సలహాదారుల కమిటీలో సేవలందిస్తున్నారు. కరోనా పై యుద్ధంలో దేశవ్యాప్త పరిశోధనా సంస్థలు, పరిశ్రమలను సమన్వయం చేస్తూ మందులను, వాక్సిన్ ను తయారుచేయడంలో తలమునకలై ఉన్నారు. ఈమె 2001, 2007, 2015 లో రూపొందించిన బయో టెక్నాలజీ విజన్ డాక్యుమెంట్లు ఎన్నో ప్రశంసలు పొందాయి.

వీరే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు చెందిన మరో ఇద్దరు అధికారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిలో మొదటి వారు 

🌸 *లవ్ అగర్వాల్*. ఐఐటి ఢిల్లీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఐఏఎస్ సాధించిన ఈ 48 ఏళ్ల యోగా నిపుణుడు విశాఖ జిల్లా కలెక్టర్ గా, ఆంధ్రప్రదేశ్ హెల్త్ కమీషనర్ గా పనిచేశారు. ఇప్పుడు ఢిల్లీలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ప్రతి రోజు ప్రెస్ బ్రీఫింగ్ చేస్తున్నారు. అనేక వినూత్న ప్రయోగాలతో ప్రపంచదేశాలకు ఆదర్శమవుతున్నారు. మొబైల్ ఫోన్ల కరోనా కాలర్ ట్యూన్, కంటైన్మెంట్ స్ట్రాటజీ, సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్, క్లస్టర్ ఔట్ బ్రేక్ స్ట్రాటజీలు ఈయన రూపొందించినవే. 

మరో వ్యక్తి 
🌸 *డాక్టర్ జితేంద్ శర్మ.*
సత్య సాయి బాబాకు అత్యంత విశ్వాసపాత్రుడు, పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ గా పని చేసిన ఈయన AP YCP రాజకీయ కక్షలకు బలైన సంగతి తెలిసిందే. విషయం ఢిల్లీ వరకు వెళ్ళగా ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా కలుగజేసుకుని ఈయనను మళ్ళీ ఏపీ మెడ్ టెక్ ఎం.డీ గా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ టెక్నాలజీ అధిపతిగా నియమించారు. ఈయన పని ప్రారంభించిన కొద్ది రోజులలోనే దేశంలోనే మొట్టమొదటి గా రాపిడ్ టస్ట్ కిట్స్ ను తయారు చేయిస్తున్నారు. ఇవి కేవలం యాభై నిముషాలలో కరోనాను నిర్ధారిస్తాయి. ప్రస్తుతం రోజుకు రెండు వేల కిట్లు తయారవుతుండగా వచ్చే వారానికి ఇది ఇరవై ఐదు వేలకు చేరుతుందని అంచనా. మార్చి 31నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కేవలం 148 వెంటిలేటర్లు ఉండగా, జితేంద్ర శర్మ గారి నేతృత్వంలో నెలకు మూడు వేల వెంటిలేటర్లు తయారుచేయడానికి కృషి జరుగుతోంది. దీనితో ఆసియా మొత్తానికి ఈయన కృషి ఫలితాలు అందనున్నాయి.

లాక్ డౌన్ మరో మూడు వారాలు పొడిగిస్తారని, జూన్ చివరి నాటికి మొత్తం బాధితుల సంఖ్య లక్షా ఎనభై వేలకు చేరుతుందని, మొత్తం మరణాల సంఖ్య మూడువేల లోపే ఉంటుందని, కరోనాపై భారత్ పూర్తిగా పట్టు సాధించినట్లేనని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

చతుర్విధ కంద పద్యము.

[4/12, 12:22] Tyagarajugaru ponangi: చతుర్విధ కందము:

అరవింద నయన కవిజన
వరదా యినతేజ భక్త వత్సల వినుమా
సురవినుత రామ విక్రమ
చరితా వననిధిని బోలు సజ్జన ఘనమా
[4/12, 12:29] Tyagarajugaru ponangi: చతుర్విధ కందము:

అరవింద నయన కవిజన
వరదా యినతేజ భక్త వత్సల వినుమా
సురవినుత రామ విక్రమ
చరితా వననిధిని బోలు సజ్జన ఘనమా
[4/12, 12:42] Tyagarajugaru ponangi: చతుర్విధ కందపద్యమంటే:

ముందు పైకి కనిపించేది ఒక విధమైన పద్యము.

రెండవ పాదంలోని మొదటి గణము వదిలేసి , తక్కినదంతా చదివితే అది రెండవ రకపు కందము. ఇల్లా:

యినతేజ భక్త వత్సల 
వినుమా సురవినుత రామ విక్రమ చరితా 
వననిధిని బోలు సజ్జన
ఘనమా యరవింద నయన కవిజన వరదా

'సురవినిత' నుంచి చదివితే మూడవ విధము.

'వననిధి' నుంచి చదివితే, నాల్గవ కందము.

'కవిజన వరదా' అంటే, వానరులకు వరాలిచ్చిన వాడా అని ఉద్దేశింప బడింది

🙏🙏

Saturday, April 11, 2020

మత్తకోకిల పద్యం.రచన .జగదీశ్వరీముార్తి.

ర        స         జ         జ         భ        ర   ( గణాలు ).
ulu     llu       lul        lul      ull       ulu
4 పాదాలు.  18: అక్షరాలు.. 11వ  అక్షరం యతి రావాలి. ప్రాస నియమం లేదు.
పద్యం:
---------
శ్రీరమా వర సుందరేశ, యశా, ముని మానస హంస-
శరణాగతవత్సలాశ్రిత , సన్నుతాంఘ్రియుగళా।
వరదాభయ హస్తాడ్యా, సుర వంద్యమాన, సు చరితా,
ధర పంకజ లోచనా, బుధ పాలక, శ్రీ హరీ నమొా ॥

ఆటవెలది:  4: పాదాలు
3: సుార్య గణాలు 2:  ఇంద్ర గణాలు. (1,3 పాదాల లో)
5:  సుార్యగణాలు రావాలి.   (2 , 4  పాదాల లో .)
పద్యం:
----------
పెట్టు చేతు లెత్తి  భక్తివం దనములు
జట్టు వారి బెట్టు జానె  డెడము .
ముట్టు చావు సౌచ ములనెల్ల పాటించు
కట్టు బాట్ల నీవు కార్య మెరిగి॥


Wednesday, April 8, 2020

అంజయ్య గౌడౌ గారి పద్యాలు.

శ్రీ హనుమస్తుతి హనమజ్జయంతి సందర్భంగా
ధ్రువకోకిల

హనుమ మారుతి యాంజనే యుడ ,యార్త రక్షణ ధీనిధీ
దనుజ భంజన వానరోత్తమ దక్ష రక్ష కపీశ మా
మనమునన్ స్మరియింతు మె ప్పుడు మాననీయ సుధీమణీ
వనచరా యినమిత్ర సుందర పావనీ మము గావరా
 మత్తేభము

హనుమా వీరకిశోరమా బుధ నుతా యానందసందాయకా
నిను,మా మానసమందునన్ ద లతుమో నిత్యంబు నేమారకా
ఘనదోర్దండ పరాక్రమా కపివ రా కారుణ్యమున్ జూపు స
ద్గుణుడా మారుతి రామచంద్ర హితుడా ధూమ్రాక్షనిర్మూలనా
 ఉ...
వందనమాంజనేయ గుణవర్ధన భీకర దానవాంతకా
మందరధీర భక్తజన మందిర మందువసించరమ్మికన్
సుందరవాలగాత్ర నిను స్తోత్రము జేతుము వానరేశ్వరా
నందిత వాయుపుత్రుడ గుణా వన మారుతి నీకు మ్రొక్కెదన్

 పంచచామరం

నమోస్తుతే మహానుభావ నన్నుబ్రోవవేలరా
ప్రమోదరూప ఆంజనేయపంచ వక్త్రదేవరా
యమేయధైర్య దానవాంతకా కపీశ దేవ నీ
సమానమేరి లోకమందు శంకరాత్మజా సుధీ
హిమాలయాదిధైర్యరత్న హేమకుండలాధరా
నమామి రామభక్తుడా ఘనా ఘనా విజైభవా


 మత్తకోకిల
ఆంజనేయ మహానుభావద యార్థ మందిరమారుతీ
కంజనేత్రిని జానకమ్మను గాంచి వచ్చిన పావనీ
యంజలింతుము నీకుభక్తిగ యంజనీసుత బ్రోవుమా
రంజిలన్ రఘురామ భక్తుడ రాక్షసాంతక ధీవరా

అంజయ్యగౌడ్

కవిత

"కరోనా రెండో ముఖం" 

(స్పెయిన్కు చెందిన వివియన్ ఆంగ్ల కవిత కు తెలుగు) 

అనువాదం: ఆకుల మల్లేశ్వరరావు 

భూమాత గొణిగింది ,నీవు వినిపించుకోలేదు/ ధరిత్రి నోరు విప్పి చెప్పింది, నీలో ఉలుకూ పలుకూ లేదు /నేల పెద్ద గొంతుతో అరిచింది, పెడచెవిని పెట్టావు/ అందువల్లే నేను పుట్టాను/
 
నేను శిక్షించడానికే పుట్టలేదు/ 
నేను మేలుకొల్పడానికే వచ్చాను/ 

అవని తల్లి సహాయం కోసం ఎలుగెత్తింది/
 జల ప్రళయం అయినా ,నీవు సరకుచేయలేదు/ కార్చిచ్చులు పెచ్చరిల్లాయి/ నీవు పెడమొహం చూపావు/ పెను తుఫాను గాలులు. నీవు పెదవి విప్పలేదు/ భయంకర సుడిగాలులు,అయినా నీలో చలనం లేదు/ ఇప్పటికీ నీవు బధిరుడు గానే ఉన్నావు/
భూ ఖండాలలో జలచరాలు/ కాలుష్య కోరల్లో చిక్కి మృత్యువు పాలయ్యాయి/ హిమ నదాలు కరిగి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి/ భయంకర కరువు రక్కసి కోరలు చాచింది /అయినా నీవు స్థాణువే అయ్యావు /

పుడమి తల్లి ఎంత చేదు విషాన్ని మింగుతోందో,తెలిసీ నీవు స్పందించలేదు /నీ ఆగని యుద్ధాలు, అంతులేని వ్యామోహం/నీ పోకడ,పంథాను మార్చుకో లేదు /
భరింపలేని విద్వేషాలు ఒకప్రక్క/ ప్రతిరోజు లెక్కకు మించిన చావులు చంపుకోవడాలు/ 

నీకు ఐఫోన్ ఎలా సంపాదించాలన్న రంధి తప్ప/ నేలమ్మ ఏం చెప్పాలనుకుంటుందో, పట్టింపు లేదు /
అందుకే ఇప్పటి నా రాక.

 ఈ ప్రపంచంలోని అన్ని దారులను అటకాయించాను. అంతిమంగా నీకు వినక తప్పలేదు/ నీ ఇంటిలోనే నిన్ను శరణార్ధుని చేశాను /భౌతిక విషయ వాంఛల వెంపర్లాటను అడ్డుకున్నాను./

ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలమటిస్తున్న నేలమ్మ లాంటిదే/ ఇప్పుడు నీలో ఊపిరిని దక్కించుకోవడం ఎలా? అన్న తపన /
ఎలా ఉందీ అనుభవం ?/

నీ ఒంట్లో జ్వరం,దావానలంలా మండుతోందా ?/నీ శ్వాస కోశ ఇబ్బందులు- మరి నేల తల్లి/ ఊపిరి తిత్తుల్లో ఎంత విషవాయువులు,గుప్పించావోతెలుసొచ్చిందా ?/నీ వంట్లో రోజురోజుకీ నిస్సత్తువ./ భూసారం కోల్పోతున్న భూమాత నీరసించి పోవడం కనిపించిందా?/

 నేను నీ సౌఖ్యాలను లాక్కున్నాను /నీ బలాదూర్లకు అడ్డుకట్ట పెట్టాను/ పుడమి తల్లి పడుతున్న పురిటినొప్పులు/ నీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నాను /
భూగోళాన్ని స్థంభీభూతం చేశాను /

మరి ఇప్పుడో...

 చైనాలో వాయు ప్రమాణాలు మెరుగు పడ్డాయి /నీలాకాశం మళ్లీ స్వచ్చంగా కనిపిస్తోంది/ ఫ్యాక్టరీ గొట్టాలు విషం చిమ్మడం ఆపు చేశాయి /వెనిస్ లో నీటి రహదారులను కాలుష్యం చేస్తున్న/గండోలా పడవలు తిరగడం ఆగింది/ 

ఇప్పుడు నీవు చేస్తున్న తప్పులు తెలుసొచ్చాయా?/ స్థిమితంగా కూర్చుని పరిశీలన చేసుకుంటున్నావా ?/

మళ్లీ చెబుతున్నా, నేను /నిన్ను శిక్షించడానికి రాలేదు /నిన్ను మేల్కొలపడానికీ, నీ పెనునిద్దుర వదిలించడానికే/ వచ్చాను .వచ్చిన పని పూర్తి కాగానే నిష్క్రమిస్తాను/
 
ఈ గుణపాఠాన్ని మాత్రం మర్చిపోకు/
 నేలతల్లి ఘోష విను /
నీ అంతరాత్మ చెప్పేది విను/ 
భూగోళాన్ని కాలుష్యం చేయడాన్ని ఆపు /మీలో మీరు కొట్లాడుకోవడం నిలుపండి/ భౌతిక సుఖాల గురించే, ఆలోచించడాన్ని వదులుకోండి/ నీ పొరుగువారిని ప్రేమించడం మొదలు పెట్టు/ నీ జన్మ భూమిని, సకల జీవ జాలాన్ని/ ప్రేమించడం, గౌరవించడం,బ్రతకనివ్వడం/ నేర్చుకో. ప్రకృతిలో సృష్టి లో/ విశ్వాత్మలో నమ్మకం పెట్టు/ 

మాట తప్పావో, ఈసారి/ పరిణామం ఇంకా భయంకరం/ 

కరోనా చేవ్రాలు
79818 72655.

పొడుపు కధలు

[4/6, 08:52] +91 99632 95997: కరోనా కాలక్షేపం -౩ 


1. ఆ కుందేలును కొడి పిల్ల కటుక్కున మింగెన్ 

2. మగవాళ్ల  కిచ్చే బిరుదొకటికి కండక్టర్ చేసిచ్చేది కలిపితే మన ఊరి పెద్ద మనిషవుతాడు 

3. ఒక వ్యక్తి 16000 మెట్లెక్కి 
 పైకి వెళ్తే అతనికి ఏమొస్తుంది 

4. ఘనా ఘనా  మాను కింద 
ఘన పోతులుండంగ 
దాని పొట్ట చించంగా 
ఊరూ నాడంతా 
ముక్కులదిరి పొయ్యెట్టు 
పులి గబ్బు కొట్టంగ 

5. ఉన్నది  తింటాడు 
తన్నినా మరిచి పోతాడు 
ప్రాణం ఇస్తాడు 
వెంబడే ఉంటాడు 

6. నోటి నుండి దారం తీస్తాడు 
మంత్ర గాడు కాదు 
కొమ్మ రెమ్మలకు దూకు తాడు 
కోతి కాదు 
వల వేసి చూస్తుంటాడు 
వేట గాడు కాదు 

7. పొద్దుటూరి  చెట్లలో 
పొదిలింది  బెళవాయి 
చూచే వాళ్లే కాని 
పట్టే వారేరి 

8.  కుట్టేమో మిషను కుట్టు దాని బతుకు కుక్క బతుకు 

9. కదిరి గాని కట్ట కింద 
కాపు కాసింది పంట  
కంకి మూరెడు 
పులిమితే దోసెడు 
ఊదితే ఉత్తెడు 

10. తెల్లని దారిలో 
నల్లని మొనగాడు 
నడుస్తూ ఉంటాడు 
నవ్వ మని అంటాడు 
నాట్యం చేస్తుంటాడు
[4/6, 09:52] +91 99632 95997: 1. కుందేలును కాదు . ఆకు+ తేలు = ఆకు తేలు 
2. సర్పంచ్ 
3. ఆయాసం 
4. మొగలి పువ్వు
5. కుక్క 
6. సాలె పురుగు 
7. సూర్యుడు 
8. విస్తరాకు 
9. జనుము 
10. పేను

పొడుపు కధలు

[4/6, 11:11] +91 99632 95997: కరినా కాలక్షేపం :4

1. ఆవగింజ కన్నా బలహీనత గల తండ్రికి భూగోళంలో చెప్పుకోవలసినంత భూపుత్రుడవుతాడు. ఆ మహా భూ పుత్రుడెవరు? 

2. చీనా వాడు నీటిలోముఇగితే చాలు చూద్దామన్నా చూపరులకు కనిపించడు .ఎవరు? 

3. ప్రాణిలో ఒక ప్రాణికి చూడ చక్కనిపుష్పము. ఆ పువ్వుకు పండ్లు కాయవు ఆ ప్రాణికి కర్రే బీజము . ఆ కర్రేది? 

4. నీలి మేఘమట్లా కొడవలి తీసుకొని పాల మీగడట్లా గడ్డి కోసి గాట్లో ఏసినా మేయని గాడిదను నేను .నేనెవర్ని? 

5. చేతులుంటాయి కాని మనిషిని కాను  
         పీక నొక్కారంటే పరుగు పెడతాను 
         ఉక్క పోసిందంటె నా పక్క చూస్తారు 
         చలి వేసిందంటే నాకు దూరమవుతారు. నా      పేరేమి ?  

6. ఆలిని పొగొట్టుకున్న  వాడి ఆలిని వెదక బోయిన వాడి అమ్మెవరు? నాన్నెవరు ?

7. ఒక పడవలో ఇద్దరు మనుషులు రెండు కాయలు మాత్రం పడతాయి . కానీ వాళ్ల దగ్గర మూడు కాయలున్నాయి. అవతలి ఒడ్డుకు చేరాలి. ఎలా? 

8. మనుషులు నా మీద కూచుంటే చాలు . నేను వయ్యారంగా ఊగుతాను . ఎవరైనా నా పైన ఎక్కొచ్చు కాని వాహనాన్ని కాను.  నన్ను కదిలించడానికి వాళ్లు కాళ్లు జాడిస్తారు . నేను సేవకుణ్ణి కాను వాళ్లు యజమానులూ కారు. నేనెవర్ని? 

9. మేము గూళ్లలో ఉంటాము చిలకలం కాము . మా చుట్టూ సెక్యూరిటీ వాళ్ల కాపలా ఉంటుంది . రాజకీయ  నాయకులం కాము. మేము కన్నోళ్లనందరినీ ఫోటోలు తీస్తాము కెమరాలం కాము . గూడు వదిలి రాము తప్పించుకొని పోము . కాపలా వాళ్లతో కలసి మెలసి ఉంటాము. కన్నోళ్లనందరినీ  గుర్తుంచు కుంటాము. మేమెవరు? 

10. పచ్చని పేరుతో పిలుస్తారు ఆకును మాత్రం  కాను . నేను లేకుంటే కొందరికి తీరని  వెలితిగా ఉంటుంది. అది చూసుకొని కులుకుతూబెళుకుతూ ఉంటాను . దగ్గరికి పిలిస్తే చాలు ఘుమ ఘుమ లాడుతూ వస్తాను . నేనెవర్ని?
[4/7, 08:35] +91 99632 95997: 1. మర్రి చెట్టు ( విత్తనం ఆవగింజ కన్నా చిన్నది) 
2. చీనాచక్కెర
3. చెరకు 
4. పులి 
5. ఫ్యాన్ 
6. అంజనాదేవి, వాయుదేవుడు 
7. ఒక కాయను ఎగరేసుకుంటూ వెళ్లాలి 
8. ఊయల 
9. కను గుడ్లు
10. పచ్చ కర్పూరం

పొడుపు కధలు

[4/7, 17:08] +91 99632 95997: 1. పొడుగాటి తాడును మీయబ్బ మడతెయ్య లేడు మాయబ్బ మడతెయ్య లేడు 

2. గుడి నిండానీళ్లు పోసి గుడికి తాళం వేసి లంక తగల బెడితే లంజ మొత్తుకుంది 

3. వీధులు  వీధులు పన్నెండు  వీధులు 
పన్నెండు వీధులకు ఇద్దరు వేశ్యలు 
ఇద్దరు వేశ్యలకు గిద్దెడు ఆముదం 

4. ఆకాశం లోని అంకి రెడ్డి 
కిందికి దూకే కాశి రెడ్డి 
కాసుకున్నోళ్లు కోసుకున్నోళ్లు 
ముడ్డిని పిసికి మూతి నాకేరు 

5. గుంపులో గూనెద్దు ఎగర్లాడే 

6. బట్టలన్ని ఇప్పుతుంది 
బాయిలో దూకుతుంది 

7. తన మొగుణ్ణి కాదని  పరాయిదాని మొగుణ్ణి పక్కలో  ఏసుకుంటే 
ఇంటి మొగుడు సంతోషం పట్ట లేక ఎగిరెగిరి గంతులేసె 

8. తొడిమ లేని పండు తుపుక్కున  కింద పడె 

9. మోకాటి లోతు నీటిలో మొండోడు పొర్లాడినాడు 

10. నేను సగం సచ్చినానురా ముండా కొడకా - నువ్వొచ్చినావంటే పూర్తిగా చస్తావురా లండీ కొడకా . అందుకే రావొద్దురా సన్నాసీ
[4/8, 11:03] +91 99632 95997: 1. దారి, బాట , రోడ్డు
2. కుక్కర్ 
 3ఎద్దుల బండి , చక్రాలు , కందెన 
4. మామిడి పండు , తాటి పండు 
5. పేలాలు 
6. అరటి పండు 
7. మగ బిడ్డను కన్న బాలింత  రాలు 
8. కోడి గుడ్డు,విభూది పండు 
9. మజ్జిగ చిలకడం 
10. ఎర చేపతో అన్న మాటలు

పొడుపు కధలు.

[4/6, 08:52] +91 99632 95997: కరోనా కాలక్షేపం -౩ 


1. ఆ కుందేలును కొడి పిల్ల కటుక్కున మింగెన్ 

2. మగవాళ్ల  కిచ్చే బిరుదొకటికి కండక్టర్ చేసిచ్చేది కలిపితే మన ఊరి పెద్ద మనిషవుతాడు 

3. ఒక వ్యక్తి 16000 మెట్లెక్కి 
 పైకి వెళ్తే అతనికి ఏమొస్తుంది 

4. ఘనా ఘనా  మాను కింద 
ఘన పోతులుండంగ 
దాని పొట్ట చించంగా 
ఊరూ నాడంతా 
ముక్కులదిరి పొయ్యెట్టు 
పులి గబ్బు కొట్టంగ 

5. ఉన్నది  తింటాడు 
తన్నినా మరిచి పోతాడు 
ప్రాణం ఇస్తాడు 
వెంబడే ఉంటాడు 

6. నోటి నుండి దారం తీస్తాడు 
మంత్ర గాడు కాదు 
కొమ్మ రెమ్మలకు దూకు తాడు 
కోతి కాదు 
వల వేసి చూస్తుంటాడు 
వేట గాడు కాదు 

7. పొద్దుటూరి  చెట్లలో 
పొదిలింది  బెళవాయి 
చూచే వాళ్లే కాని 
పట్టే వారేరి 

8.  కుట్టేమో మిషను కుట్టు దాని బతుకు కుక్క బతుకు 

9. కదిరి గాని కట్ట కింద 
కాపు కాసింది పంట  
కంకి మూరెడు 
పులిమితే దోసెడు 
ఊదితే ఉత్తెడు 

10. తెల్లని దారిలో 
నల్లని మొనగాడు 
నడుస్తూ ఉంటాడు 
నవ్వ మని అంటాడు 
నాట్యం చేస్తుంటాడు
[4/6, 09:52] +91 99632 95997: 1. కుందేలును కాదు . ఆకు+ తేలు = ఆకు తేలు 
2. సర్పంచ్ 
3. ఆయాసం 
4. మొగలి పువ్వు
5. కుక్క 
6. సాలె పురుగు 
7. సూర్యుడు 
8. విస్తరాకు 
9. జనుము 
10. పేను

Monday, April 6, 2020

లాక్ ఔట్.

నిర్మానుష్యమైన నగర నిశ్శబ్దం లో
కీచురాయి  సడి కుాడా  వినపడడం లేదు.
కిలకిలా రవాలు చేసే పక్షులు
బిక్కు బిక్కు మంటున్నాయి నిర్మానుష్య-
నగర నడిరోడ్లను చుాసి,ఏం జరిగిందో తెలీక॥.
పగలనకా, రాత్రనకా కాలుష్యాల
పొగతో నల్ల బడుతుాన్న ఆకాశం
వాహనాల విసుర్లు , పొగలు కక్కే
బజర్లుా  కానరాక,వినబడక 
నిర్మానుష్యమైన  రోడ్లను-
‍ చుాచి నివ్వెరపోయింది.॥
వెన్నెల వీధుల్లో విహరించే
ప్రేమికుల జంటలు కానరాని 
జాబిల్లి ముఖం చిన్నబోయింది.॥
కరోనా కాటుకు కాష్టాల్లో కాలుతున్న
శరీరాలను చుాసి ప్రజలు మరింత
నిర్బంధాల కటు చర్యలు 
తీసుకుంటున్నారు .
ముాసిన తలుపుల వెనుక
ముసలీ ముతక , పిల్లా జల్లా ల
ముఖాల్లో,ఎన్నాళ్ళిలా,?
అన్న నైరాస్యం-
నల్లత్రాచులా భయపెడుతోంది.
కుాడు గుడ్డా కరువై
రోడ్డల  పాలైన బతుకులు
కడుపు కింత కుాడు దొరకక
ఆకలి చావులు చస్తున్నాయి॥
కాయ కష్టం చేసుకొనే 
బడుగు బతుకులు  
రోజు కుాలి లేక అన్నం కోసం
ఆవురావురుమంటున్నారు.
బీద బిక్కిలు  ముాసిన 
దుకాణాల ముందు 
ముాల్గుతుా కుార్చున్నారు ,
తెల్ల కార్డు మీద దొరికే బియ్యం కోసం.
ఐన వారికి దుారంగా 
ఆకలి బతుకులు భారంగా 
ఈడుస్తుా బ్రతికే చిరు జీత గాళ్ళు
అద్ధె కొంపలకి బాడుగ కట్ట లేక
అన్నం తినని నీరసాన్ని
నియంత్రించుకోలేకా..నానా 
అవస్థలుా పడుతున్నారు.
కన్ను పొడుచుకున్నా 
కానరాని ఆశాదీపపు వెలుగు కోసం
ఆశగా చుాస్థుాన్న ప్రజలు.
కలత నింపిన "కరోనా" మహమ్మారి
ఏ ముాలనుండి తమని అక్రమిస్తుందో
అన్న భయంతో జనం "ముక్కు-
ముాసుకు మరీ కుార్చున్నారు ,
 ఇళ్ళ లో తలుపులు బిగించీ మరీ.
 అక్కడక్కడా అవసరాలకు సగం
 తెరచిన దుకాణాలు అరముాసిన 
 తలుపులతో బెదురు చుాపులు 
 చుాస్తుా వెల వెల బోతున్నాయి . ॥
ఖాఖీ కాపలాదారులు కనపడ్డవారిని
కనపడిన చోటే  కుళ్ళపొడుస్తున్నారు.
రవాణాలుా, రాకపోకలుా స్థంభింపోయాయి.
గుడి -గోపురాలు ముాత పడ్డాయి.
గ్రాసం లెేని పసువులు, గుాడు లేని -
బతుకులుా ,కుక్క చావు ఛస్తున్నాయి.
టివిల్లో వినిపించేమాట..."
మరి కొంచం రోజులు "లాక్ ఔట్",
లో ఉండమని...సద్దుకోవాలని...
మొబైల్ తీస్తే చదివే విషయాలు ,
కధ, కవిత , అన్నీ "లాక్ ఔట్" గురించే.


 






భయం భయం.

ఎటు చుాసినా చెత్త,
ఎక్కడ చుాసినా చెదారం.
కుళ్ళు కాలువలు, డ్రైనేజ్ లు
పెంట కుప్పలు , బురద  గుంటలు
వాటి మధ్య మధ్య జనాల నివాసం.
పెరుగుతున్న జనాలతోపాటు
కొండలౌతున్న పెంట కుప్పలు.
జనం జనం , చెత్త-చెదారం...
ఎన్నాళ్ళీ  అసహ్యపు పోకడ.
కలుష్యపు  కంపు నిండిన
కుప్పల్లో ఏదో రోజు
 జరుగుతుంది విచిత్ర  విధ్వంసపు 
విష పుారిత" కణం" జననం
"కరోనా" పేరుతో కంటికి 
కనిపించని వేగంతో విస్తరించి
 మరీ చేస్తుందది మారణహోమం.
అందులో మాడి మసయ్యేది
తేడా తెలియని "నీ "  "నా"  జనం.
అ నుసి కలిసేది కుాడా గంగమ్మలో నే 
అని తెలుసుకో లేని మనం.
స్వార్ధపుారిత ఆలోచనల  
పాప ప్రక్షాళన ను.పారే నీటిలోనే
చేస్తాం  నిరంతరం.మనం 
మనం ..జనం...జనం.
కడుగు, కడుగు, కడుగు
కనీసం  శరీరపు మురికైనా 
వదులుతుంది. కానీ నీరు 
పారేటట్టు చుాసుకో లేకపోతే 
నిలిచిపోయిన నీటిలో
మరో కార్చిచ్చు కణం ఉద్భవిస్తుంది.
అదే నా భయం భయం భయం.
--------------------
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  (మహరాష్ట్ర ).
      

విజయం మనదే.

ఈ నాడు మనని నిర్బంధనాల పాలుచేసిన
"కరోనా" కణపు, విషపు దాడిని ఎదుర్కోవడనికి 
శాంతి, సంయమనాలని పాటించడమే మన కర్తవ్యం.॥
లాకౌట్ నిబంధనల నియమాలను పాటిస్తుా ,
నిర్మానుష్య నగరం వీధుల్లో నిస్తేజమౌతున్న-
మహమ్మారి పతనానికి  యుధ్ధ వలయాన్ని సిధ్ధం చేద్దాం.॥
ఎందరినో కాటేసి ,ఎన్నో జీవితాలను నిర్వీర్యం చేసిన-
"కరోనా "రక్కసిని పారదోలేందుకు ,నిరసనల నినాదాల,
చప్పట్ల శరాల తో తుాట్లు పొడుస్తుా , చీకటిలో  వెలిగించే ,సాముాహిక  చిరుదివ్వెల కిరణాగ్నిశిఖల్లో
దగ్ధం చేద్దాం.॥
సముద్రంలో, బడబాలనంలా విజ్రుంభిస్తున్న
ఆ చీకటి రక్కసి, నిర్ఘాంతపోయేలా అందరి మాటా
ఒక్కటై అడుగేద్దాం.॥
కోట్ల కొలది , వెల్లువలా పొంగుతున్న  ప్రజా శక్తి,
మమేకమై , దేశం లోకి చొరపడ్డ  "పరదేశపు పాప పంకిలాన్ని" ,దేశ బహిష్కరణ  చేద్దాం.॥
ఎన్ని అవాంతరాలొచ్చినా, మనమంతా "ఒకే మాట-
ఒకే బాట" గా సాగాలి.॥
మన ఆత్మ విశ్వాసమే మన ఆయుధం.॥
మన సంఘటిత  సహన శక్తే , మనకు సహకార వైద్యం.॥
మనం పాటించే గ్రుహ నిర్దంధమే ,
మనం మరొకరికి చేసే మహోపకారం.॥
సాంప్రదాయ పధ్ధతుల ఆచార-వ్యవహారాల-
ఆచరణా విధానమే, మన ఆరోగ్య జీవనానికి
అసలై ఔషధం.॥
భగవంతుని శ్రుష్టిలో, అతి తెలివైన జీవి మనిషి.॥
ఏ పరికరాల అవసరంలేని అవయవాస్త్రాలతో ,
ఆత్మస్థైర్యం నిండిన  గుండె నిబ్బరంతో,
కష్ట- నష్టాలను అధిగమించే బుద్ధి-బలంతో..,
అంతరిక్షానికి నిచ్చెనలు వేయగల విలక్షణ-విజ్ఞానంతో
శ్రుష్టికి ప్రతి-శ్రుష్టి చేయగల, మేధా-సామర్ధ్యంతో,
ఎన్నో విజయ పతాకాలను ఎగరవేసిన
మహా మనీషి మనిషి.॥
ఎన్నో కఠినమైన అవరోధాల నొడ్డి,
" కరోనా" వంటి -ఎన్నో ఋగ్మతలను , అవలీలగా గట్టెక్కించగలిగే  ."వైద్య విధాన పరిశోధనాశాస్త్రం" లో ప్రజ్ఞ "కలిగిన ప్రధాన  శాస్త్రవేత్త మనిషి. ॥
ఎన్నో భీబత్సవాలను ఎదుర్కొంటుా, వాటికి
ఎదురొడ్డి ,పోరాడగలిగిన సామర్ధత గల, విశ్వ వీర యొాధుడు మనిషి.॥
జీవితానుభవాల తుఫానుకు వచ్చిన ఒరవడిలో,
విపత్కర పరిస్థితులలో ఎదురైన, కష్ట- నష్టాల చిక్కుముడులను ,.అదరక- బెదరక  నేర్పుతో -విడదీసుకొని ముందడుగు వేసే ...సమర్ధత గల
సాహస ధీరుడు మనిషి.॥

అటువంటి మహత్తరమైన మనిషి జన్మ పొందిన మనం,  ఈ నాటి "కరోనా "ధాటికి తట్టుకో లేమా...?
పెనుగాలి వీచినపుడు  వంగి ఉన్న మహావ్రుక్షమే
ఉధ్రుతం తగ్గగానే తలెత్తుకు నిలబడగలుగుతుంది.॥
కష్టం వచ్చినపుడు మనిషి సంయమనాన్ని పాటించినపుడే  కష్టాల్ని అధిగమించగలడు.॥
ఆ కష్టం  కుటుంబ పరమైనదైనా , సామాజిక పరమైనదైనా , కరోనా వంటి విషపు కణాల
విలయ తాండవానిదైనా...॥
అందికే నిరాశ పడకుండా , మనోధైర్య - సాహసాలతో ,శాంతియుత పోరాటాన్ని -కొనసాగించండి॥
                           చివరకు
                     "విజయం మనదే".
                     ------------------------


రచన, శ్రీమతి..
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్.  (మహరాష్ట్ర ).
8097622021.
iswarimurthy@gmail.com.
-------------------------------------------

వింత "కరోనా".

ఓ వింత రోగ మైన ఓ కరోనా...
ఈ వింత వ్యాధి కంతమెపుడు కరోనా..
నీ పేరు లోనె ఉన్నదిలే రోనా ....
పాప మేమి చేసినాము కరోనా..॥

 పరదేశపు పాపమా... మాదేశపు శాపమా
చీడపట్టినట్టి  అంటు రోగమా,  పిశాచమా...॥
 
 మనిషి దగ్గరౌతే తగులు "కరోనా"
ఓ మనిషి దగ్గి , తుమ్మ నంటు "కరోనా"
మాస్కు లేని మాట చోట వ్యాప్తి చెందు "కరోనా"
దీని తస్సాదియ్యా మందు లేని  
మాయలాడి ఘరానా....కరోనా....
ఓ............॥
నీ రాకతోనె  ఇళ్ళ తలుపు లేసి నాము  బెదురుగా
నీ రాక మాకు శాపమయ్యె ,  కంట నీరెగా
దారులన్ని ముాతబడెను నీదు కాన్కగా
మా బతుకులె బరువాయె గదా నీవు సోకగా..॥

చప్పట్ల మంత్ర మేసి నాము  నిన్ను తరమగా
మా యింటి దీపాలార్పి నాము పారద్రోలగా
సిగ్గు యెగ్గు లేదు నీకు మమ్ము  చేరగా
నీ పాలినబడి బతుకులె బలి చేసినాముగా ॥

మంది, గుంపు, మరణాలె. పసందు  నీకుగా
అర్పించినాము అతిధి వైన నీకు విందుగా...
ఆ మరణాలకు జ్యోతులు .వెలిగించినాము నివాళిగా  
ఛీత్కారపు నిరసనలను తెలిపినాము నీకెగా
ఓ......॥
---------------
రచన  శ్రీమతి  
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.  మహరాష్ట్ర 
-----------*--------------

జయం మనదే...(పాట)

జయం మనది"..పాట.
------------------------------
పల్లవి:
జయం మనది జయం మనది
కలతపడకు సోదరా ...
కట్టడి చే" కరోనా" ను  ఖండిద్దాం సోదరా॥

అనుపల్లవి:
పరదేశపు పాప కణం ," కరోనా "పిశాచినీ
తరిమికొట్ట మనమంతా పాటిద్దాం సుభ్రతని॥
                 ॥జయం మనది, జయం మనదీ....॥

చరణం 1.:
నియముల పాటించి, మనము పద్ధతెరిగి మసలుదాం....
మన సంస్క్రుతి- సాంప్రదాయ, విలువలనే  పెంచుదాం-
చప్పట్ల సడుల "కరోనా" ను కలవర పెడదాం......
కోట్ల -జ్యోతులెలిగించీ సమైక్యతనె చాటుదాం.॥
                                                 ॥జయం మనది॥

చరణం 2:
సామాజిక దుార నియమ నిబంధనలు పాటిద్దాం
""స్వశ్వశ్ఛమైన భరతావని" మనదేనని చాటుదాం.
మన "మొాదీ "గౌరవాన్ని  కలసి-మెలసి నిలుపుదాం
ఐక్యమత్య బలముతో  "కరోన" నంతమొందిద్దాం.॥
                                              ॥ జయం మనది॥
చరణం 3.:
"మందు లేని మహమ్మరిని " మట్టుపెట్టి చుాపుదాం-
మనిషి ,కానరాని మంత్ర మేసి రోడ్ల  తిప్పుదాం.-
మన వారిని కుాల్చినట్టి "కరోనా"ను కాల్చుదాం.
కసిగ తర్పణాలు విడిచి శాంతి గీతి పాడుదాం.॥
                                              ॥ జయం మనది ॥.
-----------------------

రచన , శ్రీమతి ...
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ (మహరాష్ట్ర ).
8097622021.
---------------------

శీర్షిక .
"లాకౌట్ "
ఒక-
నిర్విరామ "శస్త్రం".
-----------------------
కాల సర్పమై" కరోన " కాటేసెను క్షణ- క్షణం.
వేల జనుల ప్రాణాలె హరించి నట్టి దీ కణం.॥

కంటనీరు కట్టని జను లార్తి దీర్చ అందరం.
కలిసి జేయు యుద్ధములో, "లాకౌట్" ఒక అస్త్రము॥
"కరోన "రక్కసిని తరిమే నిర్విరామ శస్త్రము॥

బలిదానపు  సాహసం సఫాయి కర్మ చారులదే
కోవిడ్ రక్కసి నణచే  సేవా నిరతి  వైద్యులదే
రక్షకభటు లాచరించు విధులు  విశ్వ శాంతికి లే
కరోన వ్యాధి కెదురొడ్డి పోరాడు ,జయం మనదే॥

పరిధులనే దాటి నీవు పెంచకు మరణాలనుా,
కుండె కోత , కడుపు కోత నిండెడు శాపాలనుా,
కట్టుబాట్ల సంయమమును విడకు సంఘ హితునిగా
బాధ్యతగా వ్యవహరించు భరత దేశ పౌరునిగా॥

బలిదానపు  సాహసం సఫాయి కర్మ చారులదే
"కోవిడ్ "రక్కసి నణచే  సేవా నిరతి  వైద్యులదే
రక్షకభటు లాచరించు విధులు  విశ్వ శాంతికి లే
"కరోన "వ్యాధి కెదురొడ్డి పోరాడ జయం మనదేలే॥
---------------------------------
రచన ,శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ (మహరాష్ట్ర).
8097622021.
---------------------

కవిత కాని కధ

"శీర్షిక ..
కవిత కాని కధ.
"థేంక్యుా కరోనా.."
---------------------
"అమ్మాయ్ స్నానం చేసి 
వంట చేయమ్మా...
ఆ దేముడికి కాస్తా 
దీపం పెట్టి ధుాపం వేసి
కొంచం నైవేద్యం పెట్టు.
ఇంటికి చాలా మంచిది."
"నానీని  బయటి నుండి రాగానే
కాళ్లుా చేతులుా సుభ్రంగా 
కడుక్కో మనమ్మా।
చీడ- పీడా కదుా..
ఏం తొక్కి వచ్చేడో ఏమొా.."
"బట్టలు మార్చుకొచ్చేక
అన్నం పెట్టమ్మా..
అవతల దుమ్ము ధుాళి లో
ఆడి ఆడి వచ్చేడు.
క్రిములన్నీ వాడి బట్టల పైనే
ఉంటాయి .అనారోగ్యం కదా.
ఇదుగో అమ్మాయ్..."

ఆబ్భ బ్బ బ్బ బ్బ..
రోజుా ఇదే గోల మీతో...
భరించలేక పోతున్నాను.
మడి ,తడి ,పొడి..అంటుా..
వెధవ చాదస్తం..వెధవ 
చాదస్తమా అని...
అరుపు, విసుగు, నిర్లక్ష్యం 
గోల,  గోల ,గోల....

అటుా ఇటుా అసహనంగా
కదులుతుా గబుక్కున 
లేచేడు నానీ...నిద్ర నుండి.
చుట్టుా చుాసేడు...
అవతలి నుంచి "అమ్మ" 
అరుస్తున్నాది.
"నానీ ।..లేచి సబ్బుతో
సుభ్రంగా చేతులు కడుక్కురా.
ఆ పక్క మీది బట్టలు విప్పి
ఉతికిన బట్ట లేసుకురా..
టిఫిన్ తిందుాగాని.."
"బయటకు వెళ్ళకు.
ఎవరొచ్చినా  దుారంగా 
నిల్చొనే మాట్లాడు.
కలగా పులగం అయ్యి 
కాకెంగిళ్ళు అంటుా తినకు..".
"రేయ్.నానీ....నానీ....
నానీ..వింటున్నావా...?"
పొద్దుటి నుంచి అలా 
అరుస్తునెే ఉంది "శాంతి."

నానీ.ఆలోచిస్తుా మౌనంగా
అమ్మ చెప్పినవన్నీ చేస్తున్నాడు.
ఎప్పుడుా లేనిది,ఈమధ్య
అమ్మ కుాడా చాలా సుభ్రతలు
పాటిస్తున్నాది. "కరోనా" భయంతో...
రోజుా టి.వి ల్లో సుభ్రతల మీద
ఎంతమంది మాట్లాడుతున్నారో
"కరోనా"..వైరస్ ప్రమాదమైనదట.
సుభ్రత లేకపోతే మనని ఆక్రమిస్తుందట...
చంపేస్తుందట..మహమ్మారట..."

ఇవే మాటలు నానమ్మ చెప్పేది.
కానీ అమ్మ వినేది కాదు. సరికదా,
రోజుా కసురుకుంటుా...
ఛాదస్తం భరించలేనంటుా
 విసుక్కుంటుా..
 విరుచుకు పడుతుా...
నానమ్మని వ్రుద్ధాశ్రమంలో
వదిలే దాకా నాన్న ని పోరింది.

పాపం..నానమ్మ...చెప్పినట్టు
చాలా మంది చెప్పినట్టున్నారు
ఆశ్రమంలో ఎంత మంది నానమ్మలో...
ఆలోచిస్తుా...
నానీ అమ్మ చెప్పినవన్నీ చేసేడు.
రెడీ అయ్యి , బయటకు వచ్చేడు.
అమ్మ నాన్నకు టిఫిన్ పెడుతున్నాది.
నాన్న దగ్గరగా వెళ్లేడు..
నాన్న...బయటకు వెళ్ళాలి..అన్నాడు.
ఎక్కడికిరా..? అన్నాడు నాన్న..
"అమ్మను ఆశ్రమంలో వదిలి వద్దాం.
అమ్మ కుాడా నానమ్మ లాగే 
రోజుా అరుస్తున్నాది.
సుభ్రత, మడి, దుారం...అంటుా..
నాకు విసుగొస్తున్నాది...
అమ్మ ఇక్కడొద్దు..."

నానీ మాటలు విన్న శాంతి
కళ్ళ ల్లో గిర్రున తిరిగిన కన్నీళ్లు.
చటుక్కున లోపలికెళ్ళిపోయింది.
తలవంచుకున్నాడు నాన్న.

ఐదు నిముషాల్లో తయారై 
వచ్చిన శాంతి "పదండి ---
అత్తయ్యను ఇంటికి తీసుకువద్దాం "
అంది.
నాన్న కళ్ళల్లో ఆశ్చర్యం ..
అమ్మ ముఖంలో పశ్ఛాత్తాపం..
నానీ కళ్ళల్లో ఆనందం..
ముగ్గురి మనసుల్లోనుా
ఒకటే మాట..థేంక్ యుా---
       "  కరోనా."
       ----------------
రచన , శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
8097622021.
----------------------

తొలివలపు ( కవిత).

తొలి వలపు .
___________

చిరు నవ్వుల వన్నెల సిరి సీతను చూచీ
సిరి వెన్నెల సిగ్గు పడెను కాంతులు బాసి॥
తరగని వన్నెలు కోమలి ముఖమున గాంచీ
నెలరాజే నీరసపడే కళలను బాసి !॥
చారెడు కాటుక కన్నుల సొగసులు చూసి
ముకుళించెను కలువ భామ ,మూతిని ముడిచి॥
విలుబోలిన కనుబొమ్మల విరుపును చూచి - 
శరము----
కనుపాపల చిక్కు పడెను వింటిని బాసి !॥
ఎరుపెక్కిన పెదవులు రస మధురిమ లిడగ - 
-ముద్ద----
మందారములూసులాపే మనసు మూగగ॥ - 
కలికి
పలువరుసల మెరపులు చిరు కాంతులీనగా- 
దాగె
ముత్యపు సరులన్ని సాగరాన చాటుగ !॥
వాలు జడల కురుల సఖులు నాట్యము లిడగ - తాచు
పాములు కుబుసములు విప్పే జతను చేరగ - ॥
చెదరు
ముంగురులే భ్రమరములని భ్రమసి ప్రేమగ-॥
 కమల
ముఖ కన్నియ కళలు విడెను మధువు పంచగ !॥
బంగరు వన్నెల కోమలి సొగసులు చూచి
పచ్చాని చేమంతి ఒదిగే రేకులు ముడిచి - 
ఇంతి
కుచ కుంభములంటు జారు పైటను చూచి
సిగ్గు పడెను శిఖరములే బిగువులు బాసి ॥!
పొలది మేని కులుకులు పలు కళల తేలగ - 
మింట
హరివిల్లులె హొయలు వీడె గుండె బరువుగ॥
ఊయలలా ఊగు నడుము జిలుగులు చూచి - 
దాగి
సంభ్రమాన చూచె లతలు గుసగుసలాపి !॥
మల్లెలు, జాజులు మేలిమి ముసుగులు వేసే -
 ముద్దు
ముచ్చటలిడు మృదు పదముల జాడలు చూచి - ॥కలికి
నడకల నిడు నవ రసముల భంగిమ చూచి - 
నెమలి
కన్నియలె నివ్వెరపడే నాట్యము మరచి !॥
అంతలో ........
అందానికి బంధము పడె ,అడుగు తడబడె -॥
 అదురు-
బెదురు కనుల చూడ్కుల అలివేణి నిలబడె- ॥
చెదరు-
సౌందర్యపు రాశి కనులు సిగ్గు లోలికెగా -
 నవ-
మన్మధ సుందరుని రామ చంద్రుని  గాంచిీ !॥
తోలి వలపుల చూపుల తూపులను నిలుపగ - 
పూల-
శరములు విడే మన్మదుడదే మంచి క్షణముగ -॥
 సీతా -
రాముల కళ్యాణ మిలను కనులు పండగ - 
ప్రక్రుతి-
పడతి సఖులు సహజ రీతి కళలు నిండేగ !!
-----------------------------------------------------
రచన - 
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్.

Saturday, April 4, 2020

సహస్ర వాణి రేడియొా లింక్ ( మేక రవీంద్ర).

మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శార్వరీ నామ ఉగాది శుభాకాంక్షలు.

అతి త్వరలో కరోనా బాధనుండి ప్రపంచానికి విముక్తి కలగించాలని కాలపురుషుడైన విష్ణు భగవానున్ని ప్రార్థిద్దాం.

*ఒక శుభవార్త* నేడు *సహస్రవాణి రేడియో* ప్రసారం ఇంటర్నెట్ ద్వారా ప్రారంభమౌతుంది. ఈ రేడియోలో తెలుగు సాహిత్యానికి, సాహితీ కారులకు, గాయకులకు పెద్ద పీట వేయబడుతుంది. మనందరం ఈ *సహస్రవాణి రేడియో* కార్యక్రమాలు తెలుగు ప్రజలందరికీ చేరేలా ప్రయత్నం చేద్ధాం.

మరి కొద్ది సేపట్లో అంటే 7.30 కు ప్రసారం ప్రారంభమౌతుంది. లింక్ పంపుతాను. క్లక్ చేసి గూగుల్ బ్రౌజర్ లో తెరిచి వినగలరు.

ధన్యవాదాలు

మేక రవీంద్ర
తెలుగు కవితా / సాహిత్య వైభవం
హైదరాబాద్
25-3-2020

Wednesday, April 1, 2020

MAIL ID OF AKSHRAYAN.TO SEND POEMS on "Karona".

ఇంకా ఎవరైనా పంపాలనుకుంటే నా మెయిల్ అడ్రెస్ suryaprakashrao2014@gmail.com కి ఈ రాత్రిలోగా పంపండి.

గెలుపెవరిది..?

శీర్షిక .
గెలుపెవరిది..?
---------------------------
విలయ తాండవం చేస్తుా
విజ్రృంభిస్తున్న ఒక పరదేశపు పాప పంకిలం ,
ప్రజల ఉసురు పోసుకుంటోంది.
దాని విసురుకు ప్రపంచమే గడ గడ లాడుతోంది.
ఒక నిశ్శబ్దం,వెలుగులో కుాడా, చీకటి రాజ్య మేలుతోంది.
యావత్ ప్రపంచం యుగాల నాటి అలవాట్లను  ఆత్మరక్షణ  కై  ఆదరించి అనుక్షణం  ఆచరిస్తోంది
ఐనా సరే....
సైనికులు లేని యుద్ధం ప్రకటించి,
కదం తొక్కుతోంది కాలుష్య మేలే
కర్కస  కణం" కరోనా "॥
ముాగ జీవుల మ్రుత కణాల నుండి
పుట్టి, మానవ మారణ హోమం చేస్తున్న
"మహమ్మారి"  ఈ "కరోనా".
గజి బిజి జీవితాల గందరగోళంలో
"కరోనా" కాటుకు ఖననమౌతున్న జనం.
"పొల్యుాషన్" పొడిదగ్గుల వేడి చల్లారక ముందే,
"సొల్యూషన్" లేని మాయ రోగంతో ---
ప్రాణం కోల్పోతున్నారు జనం  .॥
మందు లేని మహమ్మారిని మట్టు పెట్టేందుకు
నానా తంటాలుా పడుతున్నారు
ప్రజా ప్రతినిధులు , ఆరోగ్య రక్షకులుా.
పర్యవసానం...
ప్రపంచ వ్యాప్తంగా "లాకౌట్ " లాస్యం చేసింది.
నష్టాలుా, కష్టాలు భరిస్తుా నగరాలు నీరసపడ్డాయి.
అస్ప్రుస్య  "అరిష్టాన్ని "ఆపడానికై 
ప్రజలందరుా కంకణం కట్టుకున్నారు.
"కరోనా కర్కసి " పై ముాకుమ్మడిగా
నగరాలు" నిర్మానుష్య "దాడి చేసేయి.
.ఇళ్ళ తలుపులు ముాత పడ్డాయి.
బళ్ళుా, బడులుా బందయ్యేయి.
వాహనాల రాకపోకలు రద్దయ్యాయి.
విదేసీ యానాలు వెల వెల పోయాయి.
మత కలహాలు ముసుగేసుకున్నాయి.
మార్కెట్ అమ్మకాలు ముాల పడ్డాయి.
ఎగుమతి- దిగుమతులు ఉస్సురంటున్నాయి.
మానభంగాలు మడి కట్టుకున్నాయి.॥
రెక్కాడితేగానీ డొక్కాడని వారి జీవితాల
కన్నీరు ,కార్చిచ్చై "కరోనా" పై శాపనార్ధాల
సుడి మంటల నెగదోస్తోంది.
ఆకలి చావులకు అన్నార్తులు ఆహుతౌతున్నారు .
నగర వీధుల్లో నైరాశ్యం రాజ్యమేలుతోంది.
నిర్మానుష్యం స్మశానవాటికను గుర్తు చేస్తోంది.
ఐనా సరే..."లాకౌట్" కు స్వస్థి చెప్పలేదు జనం.
ఈ సమస్య కొంత తగ్గించడాని కై
పరిష్కార మార్గాలని  చుాపేందుకు...
ఒక "యుగం" తిరిగి పురుడు పోసుకుంది.
పాశ్చాత్య పోకడల జీవన గమనంలోకి ,
తిరిగి మన "సంస్కృతి" బీజం, వసంతపు
చిగురులు తొడుగుతుా చిరునవ్వుతో మొలకెత్తింది..
సుభ్రతల సుగంధాన్ని పైరుగాలుల తో కలిపి ,
వెంట తోడ్కొని అడుగిడిన పచ్చదనపు
పడతి , ప్రజల స్వశ్ఛమైన మనసుల్లో
చోటు చేసుకొని చిందులేసింది.,
మురిసిన ప్రజలు  ముచ్చటతో ,
"సుచి- సుభ్రతల" వేదిక వేసి ,మన "సంస్కృతి- --సాంప్రదాయాల" పసిడి కొమ్మకు
తిరిగి "పద్ధతి"గా పట్టం కట్టేరు.
" స్వశ్ఛమైన" భరతావని బాట లో ,
నిలవలేని ఋగ్మతలు నిస్సారంగా వెనుతిరిగేయి.
మారుతున్న మనుషుల మనసుల పై
దాడి చేయలేని  "మహమ్మారి -కరోనా " -
"మంతనాలు" కుంటు పడ్డాయి.
"కర్కసి కరోనా"ను తరిమి కొట్టేదాకా-
మన "లాకౌట్ యజ్ఞం" ఇలాగే కొనసాగిద్దాం.
మరికొన్ని రోజులు ఓపికగా ఎదురు చుాద్దాం.., 
మన సాంప్రదాయాల హోమగుండంలో పడి
"కరోనా" కాలుష్యం కాలి బుాడిదౌతుందన్న
నమ్మకంతో , సుచి- సుభ్రతల నాట్లకు నీరు పోద్దాం.
   లోపంలేని మన ప్రయత్నం.. ఫలిస్తుందా..?
చుాద్దాం. కాలమిచ్చే తీర్పు లో  కడకు విజయం
      మనదో..కాల సర్పం .కరోనాదో....?
   ఈ ప్రశ్నకు జవాబు కాలమే చెప్పాలి మరి.

------------------------------------------------------------

రచన, శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021..

ఈ కవిత నా స్వీయ రచనేనని ,
దేనికీ అనువాదం కాదని ,
ఇందు ముాలముగా తెలియజేయడమైనది.
---------------------------------------------------------
  




విముక్తి.

జీవితం పరిసమాప్తమైన వెంటనే  జీవుడు-
మరొక జన్మకై ,మాత్రుగర్భం లోకి చేరేందుకు నెట్టబడ్డాడు.
చిన్న కణ రుాపంలో, మల -ముాత్రాదుల మధ్య
కొట్టుమిట్టాడుతుా..బయటకు దారి  కానరాని ,
చీకటి నిండిన మురికి నీటిలో  తేలుతుా "పున్నామ- 
నరక" బాధను అనుభ విస్తున్న భావన తో ,తలవంచి
నా మునుపటి జన్మ , పాప క్రుత్యాలు
తలచుకొంటుా, కర్మ ఫలాన్ని అనుభవించడానికి,
ఊపిరాడని, ఇరుకు జీవితానికి అలవాటు 
పడడానికి రాజీ పడ్డాను .

ఇంతలో ఎవరో నన్ను  అక్కున చేర్చుకొని ..
అప్యాయత తో అలరించిన భావన. దుర్గంధపు 
ఊబి నుంచి నన్ను లాగి , నా చుట్టుా ఒక రక్షణ కవచం  చుట్టి , ఆ పొరలో నన్ను చేర్చి ఊరడించిన భావన.
ఆ దేవత ఎవరో..శతకోటి వందనాలు ఆమెకు.॥

నా పాప కర్మ కొంచ తగ్గినట్టుండే  ఆనందం, 
అనుభవించేంతలోనే "క్షుద్బాధా పీడితుడి నయ్యేను.
కళ్ళు విప్పలేని నా బలహీనత తో చుట్టుా తిరుగితుా
కదల లేని ఇరుకు పొరలో ఈదుతుా, తేలుతుా..
దుర్వాసనా భరితమైన ఉమ్మి నీటిని గుటకలు వేస్తున్న
నన్ను ,ఎవరో ఆప్యాయంగా తడుముతున్న భావన.॥

నా శరీరం పెరుగుదల కోసం, తాను తిన్న అహారపు
సారాన్ని ,నా నాభినుండి ,పంపేందుకు , బలమైన
తన ఆహారపు నాళాన్ని, నా నాభిలోనికి చొప్పించి, ఆకలి తీర్చే జీవామ్రుతాన్ని ,అడగకుండానే-
 నాకు అందిస్తున్న భావన..
ఆ దేవత ఎవరో..శతకోటి వందనాలు ఆమెకు.॥

ఎదుగుతున్న నా భారానికి సాగుతున్న కవచపు..పొర.
పెరుగుతున్న బరువుకు,నాఉనికి నాకే భారమైన చెర .
పెరిగే మెదడును తాకుతున్న బాహ్య తరంగాల సవ్వడి
చిరునవ్వుల గలగలల , ప్రేమ పుారిత స్పర్శాభావం.
నాలో ఏదో పులకరింత.నా నాడుల ప్రేరేపించే 
నిత్య  నిస్వార్ధ నియంత.
ఆ దేవత ఎవరో..శతకోటి వందనాలు ఆమెకు.॥

శబ్ధగ్రహణ శక్తి పుంజుకుంటోంది. సప్త స్వర పేటికా-
తరంగాల ఓంకార ధ్వని ,నాలో నాదానికి ప్రేరణౌతోంది.
ఆశ్చర్యానందాల తో ద్వనిని ఆస్వాదిస్తున్నాను.
శబ్దాన్ని గ్రహిస్తున్న నా వీనులకు, వినిపిస్తున్న
కమ్మని పిలుపు."కన్నా, నా బుజ్జీ, నా తండ్రీ.".అంటుా నాకై ,వినిపించే నవ చైతన్యపు అనురాగ సంబోధన.
నాతో బంధాన్ని పెనవేసుకుంటున్న..
ఆ దేవత ఎవరో..శతకోటి వందనాలు ఆమెకు.॥

 రోజుకో పలకరింత , నాలో రేగే పుకరింత .
 ఆమెను ఎలాగన్నా చుాడాలన్న కోరికల కలవరింత
 నేను శతవిధాలుగా బయటకు రావాలన్న ప్రయత్నంతో
 నేను చేసే భీభత్సవానికి బాధనిండిన బేలతనపు -
 ఆక్రదన .చిన్ని కాళ్ళతో చిందులు వేసే సమయంలో...
 చిరు నిట్టుార్పుల బాధాతరంగపు ప్రకంపనలు..
 నేను చేసే అల్లరిని అత్యంత సహనంతో భరిస్తుాన్న..
 ఆ దేవత ఎవరో..  ఆమెకు శతకోటి వందనాలు.॥

ఆ ప్రేమామ్రృత ముార్తిని చుాడాలన్న తపన..
ఆమె తన కోసం పడే వేదనను మించినదై..
గాడాంధకారపు చీకటి నిండిన ఇరుకు బస నుంచి ,
వెలుగుల వెలికి రావాలన్న పట్టుదల ,పంతానికి-
పగిలిన  పొర,  చీకటి నుండి  కలిగించిన విముక్తి.॥

ఒక్కసారిగా చెర విడిన చైతన్యంలో నిండిన ఆనందం.
పేగులు పెళ్ళగించుకొని , కాళ్ళతో తన్నుతుా, 
ఉదరాన్ని చీల్చుకొని,  బయటకు రావాకన్న నా ప్రయత్నానికి,  బాధను ఉగ్గపట్టి, తన విడుదలకై  సహకరంచిన..
 ఆ దేవత ఎవరో..  ఆమెకు శతకోటి వందనాలు.॥
 
భుామి మీద పడకుండానే, సుతి మెత్తని చేతులతో
సున్నితంగా తనను అక్కున చేర్చుకొని, ఆనందాశ్రువులతో తన రాకను ఆహ్వానించి,
ఆర్తితో తన ఒడిని చేర్చుకొని, ఒద్దికగా ఒడిసి పట్టిన
 ఆ దేవత ఎవరో..  ఆమెకు శతకోటి వందనాలు.॥
 
ఎక్కడి నుంచి ఎక్కడకు వచ్చి పడ్డానో తెలియని-
అయొామయ స్థితిలో,అసహాయం నిండినభయంతో
ఏకధాటిగా  ఉవాఁ..ఉవఁ...అంటుా ఏడుస్తున్న నన్ను
చుాసి, "ఎందుకు కన్నాఏడుపు".ఆకలేస్తోందా.అంటుా
అడగకనే తన రక్తస్రవాలను క్షీర రసామ్రుతంగా మార్చి, తనకు స్తన్యమిచ్చి,  ఆకలి తీర్చిన ,ఆ అమ్రుతమయ.
  దేవత ఎవరో..  ఆమెకు శతకోటి వందనాలు.॥
  
తనపై కురిసే ముసి ముసి నవ్వుల ముద్దుల ముాటలు.
గోల-గోలగా, మమతల జల్లుల మనసైన  చేతలు.
లీలగా వినిపించే తన వీనులకు ,అర్ధమయ్యే  మాటలు.
ఎవరో అంటున్నారు."అమ్మ దగ్గరబజ్జున్నావా."అంటుా.

ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాను.దేవత పేరు విన్నాను.
నవమాసాలుా నన్ను మొాసి, నాతో పాటుగా నరక-
యాతనలు అనుభవిస్తుా, పున్నామ నరక గుహ్యంలో
తనకు రక్షణ నిచ్చి, ఆకలి తీర్చన ఆ పుణ్యముార్తి...
పేరు...అ,ఊ, మ, అవుమ...అ...ఉమ్ ..మ....
..అమ్మ ..అమ్మా...అమ్మా...అంటుా వల్లించేను.

ఒక్కసారిగా నా కళ్ళు క్రుతజ్ఞత తో వర్షించేయి.
ఆర్ద్రత నిండిన గొంతు తో ఆర్తిగా పిలిచేను...
(అమ్మా)...  ఉవాఁ ఉవాఁ.... అంటుా..
నా బాధ అర్ధం కాని "అమ్మ" నన్ను  ఆర్తిగా 
అక్కున చేర్చుకుంది. ఏడుస్తున్నాననుకొని ....॥
తన వెచ్చటి పరిష్వంగంలో  ఇముడ్చుకొని, 
నా చుట్టూ  పెనవేసిన చేతులతో, నన్ను  పరి-
రక్షిస్తున్న ఆ ప్రేమైక శక్తి స్వరుాపిణి "అమ్మ" కు,
ఆ జన్నాంతర ఋణగ్రస్తనై , ఉంటానన్న సంకల్ప నిర్ణయం తో , ఆమె ఒడిలో , వెచ్చగా ఒదిగి ,
నిశ్చీతగా నిద్రపోయేను.
---------------------------------------------------

అమ్రుతానందమయులైన "అమ్మ "లకు ప్రేమతో...

రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.. (మహరాష్ట్ర .)
--------------------------------



 

 


విముక్తి.

జీవితం పరిసమాప్తమైన వెంటనే  జీవుడు-
మరొక జన్మకై ,మాత్రుగర్భం లోకి చేరేందుకు నెట్టబడ్డాడుొ
చిన్న కణ రుాపంలో, మల -ముాత్రాదుల మధ్య
కొట్టుమిట్టాడుతుా..బయటకు దారి  కానరాని ,
చీకటి నిండిన మురికి నీటిలో  తేలుతుా "పున్నామ- 
నరక" బాధను అనుభ విస్తున్న భావన తో ,తలవంచి
నా మునుపటి జన్మ , పాప క్రుత్యాలు
తలచుకొంటుా, కర్మ ఫలాన్ని అనుభవించడానికి,
ఊపిరాడని, ఇరుకు జీవితానికి అలవాటు 
పడడానికి రాజీ పడ్డాను .

ఇంతలో ఎవరో నన్ను  అక్కున చేర్చుకొని ..
అప్యాయత తో అలరించిన భావన. దుర్గంధపు 
ఊబి నుంచి నన్ను లాగి , నా చుట్టుా ఒక రక్షణ కవచం  చుట్టి , ఆ పొరలో నన్ను చేర్చి ఊరడించిన భావన.
ఆ దేవత ఎవరో..శతకోటి వందనాలు ఆమెకు.॥

నా పాప కర్మ కొంచ తగ్గినట్టుండే  ఆనందం, 
అనుభవించేంతలోనే "క్షుద్బాధా పీడితుడి నయ్యేను.
కళ్ళు విప్పలేని నా బలహీనత తో చుట్టుా తిరుగితుా
కదల లేని ఇరుకు పొరలో ఈదుతుా, తేలుతుా..
దుర్వాసనా భరితమైన ఉమ్మి నీటిని గుటకలు వేస్తున్న
నన్ను ,ఎవరో ఆప్యాయంగా తడుముతున్న భావన.॥

నా శరీరం పెరుగుదల కోసం, తాను తిన్న అహారపు
సారాన్ని ,నా నాభినుండి ,పంపేందుకు , బలమైన
తన ఆహారపు నాళాన్ని, నా నాభిలోనికి చొప్పించి, ఆకలి తీర్చే జీవామ్రుతాన్ని ,అడగకుండానే-
 నాకు అందిస్తున్న భావన..
ఆ దేవత ఎవరో..శతకోటి వందనాలు ఆమెకు.॥

ఎదుగుతున్న నా భారానికి సాగుతున్న కవచపు..పొర.
పెరుగుతున్న బరువుకు,నాఉనికి నాకే భారమైన చెర .
పెరిగే మెదడును తాకుతున్న బాహ్య తరంగాల సవ్వడి
చిరునవ్వుల గలగలల , ప్రేమ పుారిత స్పర్శాభావం.
నాలో ఏదో పులకరింత.నా నాడుల ప్రేరేపించే 
నిత్య  నిస్వార్ధ నియంత.
ఆ దేవత ఎవరో..శతకోటి వందనాలు ఆమెకు.॥

శబ్ధగ్రహణ శక్తి పుంజుకుంటోంది. సప్త స్వర పేటికా-
తరంగాల ఓంకార ధ్వని ,నాలో నాదానికి ప్రేరణౌతోంది.
ఆశ్చర్యానందాల తో ద్వనిని ఆస్వాదిస్తున్నాను.
శబ్దాన్ని గ్రహిస్తున్న నా వీనులకు, వినిపిస్తున్న
కమ్మని పిలుపు."కన్నా, నా బుజ్జీ, నా తండ్రీ.".అంటుా నాకై ,వినిపించే నవ చైతన్యపు అనురాగ సంబోధన.
నాతో బంధాన్ని పెనవేసుకుంటున్న..
ఆ దేవత ఎవరో..శతకోటి వందనాలు ఆమెకు.॥

 రోజుకో పలకరింత , నాలో రేగే పుకరింత .
 ఆమెను ఎలాగన్నా చుాడాలన్న కోరికల కలవరింత
 నేను శతవిధాలుగా బయటకు రావాలన్న ప్రయత్నంతో
 నేను చేసే భీభత్సవానికి బాధనిండిన బేలతనపు -
 ఆక్రదన .చిన్ని కాళ్ళతో చిందులు వేసే సమయంలో...
 చిరు నిట్టుార్పుల బాధాతరంగపు ప్రకంపనలు..
 నేను చేసే అల్లరిని అత్యంత సహనంతో భరిస్తుాన్న..
 ఆ దేవత ఎవరో..  ఆమెకు శతకోటి వందనాలు.॥

ఆ ప్రేమామ్రృత ముార్తిని చుాడాలన్న తపన..
ఆమె తన కోసం పడే వేదనను మించినదై..
గాడాంధకారపు చీకటి నిండిన ఇరుకు బస నుంచి ,
వెలుగుల వెలికి రావాలన్న పట్టుదల ,పంతానికి-
పగిలిన  పొర,  చీకటి నుండి  కలిగించిన విముక్తి.॥

ఒక్కసారిగా చెర విడిన చైతన్యంలో నిండిన ఆనందం.
పేగులు పెళ్ళగించుకొని , కాళ్ళతో తన్నుతుా, 
ఉదరాన్ని చీల్చుకొని,  బయటకు రావాకన్న నా ప్రయత్నానికి,  బాధను ఉగ్గపట్టి, తన విడుదలకై  సహకరంచిన..
 ఆ దేవత ఎవరో..  ఆమెకు శతకోటి వందనాలు.॥
 
భుామి మీద పడకుండానే, సుతి మెత్తని చేతులతో
సున్నితంగా తనను అక్కున చేర్చుకొని, ఆనందాశ్రువులతో తన రాకను ఆహ్వానించి,
ఆర్తితో తన ఒడిని చేర్చుకొని, ఒద్దికగా ఒడిసి పట్టిన
 ఆ దేవత ఎవరో..  ఆమెకు శతకోటి వందనాలు.॥
 
ఎక్కడి నుంచి ఎక్కడకు వచ్చి పడ్డానో తెలియని-
అయొామయ స్థితిలో,అసహాయం నిండినభయంతో
ఏకధాటిగా  ఉవాఁ..ఉవఁ...అంటుా ఏడుస్తున్న నన్ను
చుాసి, "ఎందుకు కన్నాఏడుపు".ఆకలేస్తోందా.అంటుా
అడగకనే తన రక్తస్రవాలను క్షీర రసామ్రుతంగా మార్చి, తనకు స్తన్యమిచ్చి,  ఆకలి తీర్చిన ,ఆ అమ్రుతమయ.
  దేవత ఎవరో..  ఆమెకు శతకోటి వందనాలు.॥
  
తనపై కురిసే ముసి ముసి నవ్వుల ముద్దుల ముాటలు.
గోల-గోలగా, మమతల జల్లుల మనసైన  చేతలు.
లీలగా వినిపించే తన వీనులకు ,అర్ధమయ్యే  మాటలు.
ఎవరో అంటున్నారు."అమ్మ దగ్గరబజ్జున్నావా."అంటుా.

ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాను.దేవత పేరు విన్నాను.
నవమాసాలుా నన్ను మొాసి, నాతో పాటుగా నరక-
యాతనలు అనుభవిస్తుా, పున్నామ నరక గుహ్యంలో
తనకు రక్షణ నిచ్చి, ఆకలి తీర్చన ఆ పుణ్యముార్తి...
పేరు...అ,ఊ, మ, అవుమ...అ...ఉమ్ ..మ....
..అమ్మ ..అమ్మా...అమ్మా...అంటుా వల్లించేను.

ఒక్కసారిగా నా కళ్ళు క్రుతజ్ఞత తో వర్షించేయి.
ఆర్ద్రత నిండిన గొంతు తో ఆర్తిగా పిలిచేను...
(అమ్మా)...  ఉవాఁ ఉవాఁ.... అంటుా..
నా బాధ అర్ధం కాని "అమ్మ" నన్ను  ఆర్తిగా 
అక్కున చేర్చుకుంది. ఏడుస్తున్నాననుకొని ....॥
తన వెచ్చటి పరిష్వంగంలో  ఇముడ్చుకొని, 
నా చుట్టూ  పెనవేసిన చేతులతో, నన్ను  పరి-
రక్షిస్తున్న ఆ ప్రేమైక శక్తి స్వరుాపిణి "అమ్మ" కు,
ఆ జన్నాంతర ఋణగ్రస్తనై , ఉంటానన్న సంకల్ప నిర్ణయం తో , ఆమె ఒడిలో , వెచ్చగా ఒదిగి ,
నిశ్చీతగా నిద్రపోయేను.
---------------------------------------------------

అమ్రుతానందమయులైన "అమ్మ "లకు ప్రేమతో...

రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.. (మహరాష్ట్ర .)
--------------------------------