Sunday, November 23, 2025

మనోజ్ తెలుసుకొనుము మంచి మాట.. తపస్వీ మనోహరం లింక్

[23/11, 7:56 am] బుజ్జి...✍️ స్వప్న: https://thapasvimanoharam.com/varapathrika-23-11-2025/
[23/11, 7:56 am] బుజ్జి...✍️ స్వప్న: *23-11-2025 తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు వారపత్రిక వెబ్సైట్ లింక్ [23/11, 7:56 am] బుజ్జి...✍️ స్వప్న:

 https://thapasvimanoharam.com/varapathrika-23-11-2025/
[23/11, 7:56 am] బుజ్జి...✍️ స్వప్న: *23-11-2025 తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు వారపత్రిక వెబ్సైట్ లింక్ ✍️**

Wednesday, October 15, 2025

చిత్రకవిత -123* పద్యాలు.

06/10/2025.
మహతీ సాహితీ కవి సంగమం.
సోమవారం 06_10-2025..
*చిత్రకవిత -123*
అంశము : చిత్రకవిత .
ప్రక్రియ : ఆటవెలది.
రచన : శ్రీమతి పుల్లభట్ల జగదీశ్వరీమూర్తి.

 

తల్లి గర్భ మందు తల దాచుకున్నట్టి
పాప డెంత గుణుడు పావనుండు.
బయలు పడిన యంత బట్టు మాయకు లొంగి 
కన్నవారి నెట్టు కరకు డగును. !!

తండ్రి సంపదంత తన కోసమేయంచు 
దలచి తగుల బెట్టు దనుజ గుణుడు.
కన్న వారి రోసి కన్నీరు తెప్పించు
పుత్రు లేల నయ్య , పుడమి బరువు !!



మహతీ సాహితీ కవిసంగమం.
*ప్రతిరోజూ కవితా పండుగే*
అంశం:చిత్రకవిత
కవితాసంఖ్య: 1
31/ 03/ 2025 .  ( సోమవారం)
శీర్షిక: కళ్యాణ రాముడు.
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి .
కళ్యాణ్ :  మహారాష్ట్ర . 43.
ప్రక్రియ: వచన కవిత. 
------------------

నింగి నిండా భానుడి ప్రతాపం,
నేలంతా సీతారాముల కళ్యాణ మేళం..
వేద మంత్రాల ధ్వనులతో నిండిన ఆకాశం,
దేవతలు చల్లే పుష్పాలతో భువి నిండిన సుగంధం !!
 
సీతా , రాముల నుదుట మెరిసే బాసికం .
అగ్ని సాక్షిగా ఏకమైన వారికి తోడైన తారాబలం.
భక్తుల హృదయాలలో వెలిగించిన ఆనంద దీపం.
సూర్యుని వేడిమి కూడా కరిగి ,
 చల్లని అనుభూతిగా  మారిన  క్షణం.!!,

 కళ్యాణ ఘట్టంలో నిండిన మన  దివ్య సంస్కృతి.
చరిత కెక్కిన సీతారాముల ఘనమైన దివ్య కీర్తి .
మంగళ వాయిద్యాల మధ్య  నాదలోలుల ఆనంద గీతి.
మన సభ్యత , సంస్కరాలకు పట్టిన నిండైన ఆరతి.!!.

సీతారాముల కళ్యాణ గాధ, సుగంధ పరిమళ పూదోట.
కుటుంబ విలువలు పెంచే బంధాలకు బాట.
తల్లి,తండ్రుల మాటలకు విలువిచ్చిన పుత్రుని కధ.
రామరాజ్యాన్ని భువిలో నిలిపిన వేద-వేద్యుడతడట.!!

అన్నదమ్ముల ఆదర్శానికి ప్రతీక అన్నది నిజం.
ఆలు,మగల అన్యోన్యానికి ఆతడే నిదర్శనం.
గుణగణాలకు తగిన అందమైన రూపం. 
ఆతని తలపే భక్తుల మదిలో ఆనంద దీపం. !!
-----------------------------------
ఈ కవిత నా స్వీయ  రచన.

శీర్షిక :చిరునవ్వు: ఒక నిశ్శబ్ద గీతిక ‌.

10.10.2025(శుక్రవారం)
మహతీ సాహితీ కవిసంగమం .
ప్రతిరోజూ కవితా పండగే .

అంశం: ఐచ్ఛికం 

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి.(38).
శీర్షిక :చిరునవ్వు:   ఒక నిశ్శబ్ద గీతిక ‌.
కవితా సంఖ్య 02.


చిరునవ్వు, పెదాలపై విరిసే ఓ నిశ్శబ్ద గీతం 
మనసులోని వేదనను మరపించే అద్భుత దీపం.
అధరాల  విరుపులో దాగిన అలౌకిక ఆనందం.
మనిషిని మనీషిగా మార్చే మహిమాన్విత మంత్రం.!!

.మంచు తెరల మాటున మెరిసే తొలి సూర్య కిరణం.
చీకటిని చీల్చుకొని వెలుగు నింపే ఉషోదయం .
చల్లని గాలులకు కదిలే  లేలేత వసంతం పరిమళం.
అందరికీ ఆనందాన్ని పంచే  సుధా మాధుర్యం .!!

కోమలంగా విచ్చుకునే పూల సముదాయం .
మనసును ఆకర్షించే  సుమ సుగంధం .
ఆనందాన్ని ఇనుమడింప జేసే అక్షయ పాత్రౌషధం.
జీవితానందాన్ని పంచే  బంధానుబంధాల యానం.!!

ఎండిన నేలలో కురిసే తొలి చినుకు తడి .
నిర్మలమైన సెలయేటి గలగలల స్వచ్ఛత  సడి .
వేల రాసుల విలువైన సిరి వన్నెల దడి.
మనిషి మోములో చెరగని  కళల సందడి .!!

అహాన్ని  చల్లార్చే  చల్లని చంద్ర కిరణ సొన,
కలహాలు లేని లోకానికి కట్టిన ప్రేమ వంతెన .
మనిషి మనిషికి మధ్య బంధాన్ని బలపరిచే జాణ.
శత్రువుని కూడా మిత్రునిగా చేసే  మంత్ర ఘన !!

నవ్వులో ఆనందం అనుభవించు.
స్నేహపూరితమైన నవ్వుతో గెలుపు బాటలో పయనించు.


ఈ కవిత నా స్వీయ రచన.

సొన' :  వర్షం లేదా చినుకులు .
సోన : బంగారం', లేదా 'వేకువ',

పంచాక్షరీ పంచపది ..

పంచాక్షరీ పంచపది ..

పంచాక్షరీ పంచపది .
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి.
అంశం : ఆహారం అమృతం.
శీర్షిక : విలువలు.

మట్టే జీవితం.
అందరి కోసం.
రైతన్న కష్టం. 
నిజమౌ నేస్తం.
అన్నదాతతడే ఈశ్వరీ.!!

ఆహారం అది 
జీవ పునాది.
రుచి గలది.
అమృత మది.
జీవనాధారమీశ్వరీ !!

బలమైనది
పొట్ట నింపేది.
శక్తినిచ్చేది
వెల లేనిది.
చైతన్య ఖని ఈశ్వరీ.!!

రుచి గలది. 
మేలు చేసేది.
జీర్ణం అయ్యేది. 
ఆరోగ్యమది.
సాత్వికాహారమీశ్వరీ!!

మేని ఇంధనం.
 రోగ బంధనం.
ప్రకృతి వరం
మనిషి బలం.
ఆహారం ఘనం ఈశ్వరీ !!

పదార్థం గను.
మితంగా తిను.
వాస్తవం మను.
మాటను విను.
ఆరోగ్య మదే ఈశ్వరీ.!!

అమిత సాదం.. 
అతి దుర్భరం.
పొట్ట ఉబ్బరం. 
అజీర్తి రోగం.
అనారోగ్యమే ఈశ్వరీ. !!

పిజ్జా బర్గర్లు 
రోగ గ్రస్తాలు
సమోసా ,బ్రెడ్లు
పొట్టలో పోట్లు 
రుచి ఇక్కట్లు ఈశ్వరీ.!!

ఆకలి  కాటు 
చేస్తుంది చేటు
అజీర్తి చోటు
ఆరోగ్యం లోటు.
నిల్వదు నోటు ఈశ్వరీ !!

హోటల్ తిండి.
పురుగు లండి.
సుచి లేదండి.
కల్తీ సుమండి.
నిల్వుండే తిండి ఈశ్వరీ !!

దోమల మండీ.
రోడ్లపై తిండి. 
తిన వద్దండి.
మాట వినండి. 
 పోదాం పదండి ఈశ్వరీ.!!

లేమిలో జనం.
ఆహార లోపం.
పిడికెడన్నం.
అదే అమృతం
పారవేయకు మీశ్వరీ. !!


--------------------

పంచాక్షరీ పంచపది .

09/10/2025.

పంచాక్షరి పంచపది .
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి.
అంశం : బాలిక. 
శీర్షిక : అవతార మూర్తి.



పసిపిల్లలు 
మన వరాలు
ఆడపిల్లలు
దేవీ రూపాలు 
శక్తి తేజాలు ఈశ్వరీ !!

ప్రసి తనము.
నిష్కపటము.
నిర్మలత్వము.
నిత్య సత్యము.
 రూపంఇదే నిజము ఈశ్వరీ !!

అక్క, చెల్లిగా
 అమ్మ , అలిగా
పాలించేదిగా 
 లాలించేదిగా 
ఆడ పిల్లేగా ఈశ్వరీ !!

పుట్టింటి దీపం.
ఎరుగదు కోపం.
ప్రేమ స్వరూపం.
త్యాగమనంతం.
స్త్రీ జన్మమోఘం ఈశ్వరీ !!

మెట్టింటి కీర్తి. 
మగని స్ఫూర్తి. 
ఆశయ  పూర్తి 
 ఆదర్శ మూర్తి
నేటి బాలేగా ఈశ్వరీ !!

ఈ పంచపదులు నా స్వీయ రచనలు.

పోటీలో ఎంపికైన కవుల జాబితా:

మహతీ సాహితీ కవిసంగమం 
దీపావళి కవితా సంకలనం 
(14-10-2025)

ఎంపికైన కవుల జాబితా:
శ్రీ/శ్రీమతి 
1.తెలికిచెర్ల రాజకృష్ణ కామేశ్వరరావు 
2.కాటేగారు పాండురంగ విఠల్ 
3.యలమర్తి మంజుల
4.మండికారి బాలాజీ 
5.ఎం వి చంద్రశేఖర రావు
6.ఉమాశేషారావు వైద్య
7.రాధా సురేష్ యర్జల్
8.డా. భరద్వాజ రావినూతల
9.తాతపూడి సోమశేఖర శర్మ
10.పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
11.అద్దంకి లక్ష్మి
12.మల్లారెడ్డి రామకృష్ణ
13.జెవి కుమార్ చేపూరి
14.ముత్యం వెంకటేశ్వరరావు



అడ్మిన్ బృందం 
〰️〰️〰️〰️〰️〰️〰️
శీర్షిక: శాంతి దీపాల తోరణం. 
రచన, శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి 
కళ్యాణ్ : మహారాష్ట్ర.


ప్రమిదల్లో వెలిగే దీపాలు అశాంతి నిండిన
మానవ హృదయాలలో  ఆకాంక్షలు పండించిన 
ఆశా నిలయాలు.

దీపాలు  ఆత్మశుద్ధికి  సమాజ శుద్ధికి సంకేతమై
దురాలోచనలను కాల్చి  మానవత్వాన్ని పెంచి
కొత్త ఆరంభాలకు  ఆత్మీయ  బంధాలకు 
మేలైన బాటను చూపించే  వెలుగు తోరణాలు.

దీపావళి ,
దుష్టశక్తిపై ధర్మం సాధించిన విజయం.
రావణ సంహారానంతరం , శ్రీరాముడు
 సీతతో అయోధ్యకు చేరిన దినం
వామనుడి మూడు అడుగులతో
అసుర బాధ అంతమైన క్షణం
బలిచక్రవర్తి దాన గుణానికి పాతాళంలో 
పట్టాభిషేకం , వంటి  ఉత్సవ కలయికల తోరణం.
రాజ్యమంతా వెలిగిన  స్వాగతాల సంబరం.

వేగవంతమైన కాలంలో అంతర్గత యుద్ధాలకు -
ద్వేషం, స్వార్థమనే నరకాసురులు దాగిఉన్న కారణాలు.
ద్వేషాన్ని ప్రేమతో, నిరాశను ఆశతో పారద్రోలు.

పల్లెలు, పట్టణాలలో లోపించిన  పచ్చదనాన్ని 
కాలుష్యం  నిండిన ప్రకృతిని  కాపాడ ప్రయత్నించు.
టపాసుల శబ్దం తగ్గించి శాంతి నినాదాలు వినిపించు.
ఆడంబరం తగ్గించి, అన్యోన్యత పెంచు.!
విజయ స్ఫూర్తితో అడుగేస్తే వెలుగులు నింపే
శక్తి మన చేతుల్లోనే ఉందని నిరూపించు.




హామీ:
"శాంతి దీపాల తోరణం"  కవిత నా స్వీయ రచన.


Sunday, October 12, 2025

meesho

601365  meesho verification code.

1 నుండి 30 వరకు పుార్తి పాశురములు తెలుగులో...ప్రక్రియ :"ఆటవెలది"లో..

1 నుండి 30 వరకు పుార్తి పాశురములు తెలుగులో...ప్రక్రియ :"ఆటవెలది"లో..

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .

1. పాశురము.

** **********
చెలియలార రారె చేయంగ వ్రతమును
 మేలుకొల్పు లిడుచు మేలు  పుాజ 
రమణులార పాడి  రమ్యమౌ గీతములు
విధిగ పాడి నుతుల విభుని కొలువ ॥

శేషశయను డతడశేష మహిమ లేలు
సిరికి పతి యతడు  శ్రీకరుండు
వైభవమ్ము లేలు వైకుంఠ నాధుండు
రక్ష మనకు  నిడెడు  రంగ విభుడు ॥

సర్గ ద్వారములవె  సరి తెరచి యుండు
మార్గశీర్ష  మందు  మహిమ యదియె
దుర్గమౌ  నఘములు దుారమౌ దురితాలు
దీర్ఘ యశము లిచ్చు దివ్య వ్రతము ॥

2.వ పాశురము.
***************
పాల సంద్ర మునదె ఫణిశేష తల్పాన
 పద్మ నాభు డతడె పవ్వళించె
మేలుకొల్పు లిడుచు మేటి కీర్తుల వేడి
శ్రీశు పదము లిడక   శరణ మనరె ॥

కురుల పుాలిడ కండి కులుకు బోణులాల
పరుల బాధ బెట్టు పలుకు లొద్దు
సత్య భాషణమ్ము  సరిదాన ధర్మమ్ము
నిత్య వ్రతము జేయ నియమ మండి ॥

గురులు జ్ఞాన ధనుల గుాడి సేవలుజేసి
 ఐకమత్య మెరిగి  హరిని గొలచి
 దీక్ష  తోడ వ్రతము  దివ్యమ్ము గనుజేయ 
 మార్గ శీర్ష మిదియె మంచి దండీ ॥
 
3.వ పాశురము.
**************
మూడు లోక ములను ముప్పాద ములగొల్చి
బలిమి బలిని అణచు బాలు డతడు
విష్ణుర రుాపు డతడు వినరారె సఖులార
వటువు వామ నుండు వాని కొలువు ॥

కోడి కుాసెను చెలి  కొలువంగ రంగనీ
తెమిలి తాన మాడ తెరలి రండే
నెలకు ముాడు సార్లు  నేల వర్షము లుండు 
పసిడి పంటల సిరి, పాడి  నిండు ॥

నిత్య ముగను భువిని  నీరముల్ కురియగా
జారు  గిరుల ఝరులె  జలజలయని 
నదిని  మీన ములవె నడుమనా ట్యములేలు
నదుల కలువ లెన్నొ నతిగ విరియు ॥

4.పాశురము.

వేగ వచ్చె తానె వెతలు దీర్చ
మెరయు మేని పోలు  మెరపులే  మెరయంగ
వర్ష ధారలు కురిసె వరుస భువిని ॥

 నాద శంఖ మొాలె   నానింగి గర్జించె
 రామ శరము వోలె  రాలె చినుకు
 నమ్మి రండె చెలులు నది స్నానముల నాడ
 రంగ పుాజలవియె  రక్ష  సుండీ ॥
 
 5.పాశురము.
 ************
 మధు రపురి నేలు  మధుర మంగళ ముార్తి.
ఆ యశోద సుతుడు అతడు సుండి 
 నల్లనైన వాడు నరునిరుా పములోన
అవని నేలు ఘనుడు ఆది విష్ణు  ॥
 
వేద వంద్యు డతని వేడుకొ నగరారె 
పట్టు వస్త్రము లిడి  పలుక మనుచు
పాద పుాజ లిడరె పరమేశు డతడేగ
పాపములను దృంచు  పతియు నతడె ॥ 

6.పాశురము
*************
గరుడవాహనుడదె  ఘన ఆలయమ్మున
సుర శంఖ నాద  సుఖము లేలె
పుాత  నసురి జంపి పుణ్య భుామిని గాచు
మొాక్ష మిచ్చు విభుడు మొాహ నుండు ॥

యొాగనిద్ర నేలు యొాగిహృన్నిలయుడు
దాస పోషకుండు దాన వారి.
మేలుకొల్పు లిడగ మేల్గాంచు వరదుండు
యశము లిచ్చి బ్రోచు హరి ఘనుండు ॥

పద్మనాభు డతడు పరమేశ్వరుడు హరి 
శంఖ చక్ర ములిడు శాంత ముార్తి
పరమ పావనుండు   పరనిచ్చి పాలించు 
పట్టి పదము లతని పాహి యనరె ॥

7.పాశురము.ఆమ ధుర రవము
************
 
పక్షి రవములు వినవె పాడెనాలాపనలు
మేలుకొల్పు లవియె మెరుపు బోడి
వెన్న పాల దొంగ వేంచేయు వేళాయె
కేశి నిదుని మేటి  కేశవుండు  ॥

విద్య లెరిగు మీరు విజ్ఞతలే  ఎరుగరా
వంద్యమాను కొలువ వడిగ రాగ
తాత్సారమ్ము మీకు తగదుత గదులేమ్మ
తడయుటలవె మాని తరలి రమ్మా॥


8.వ కీర్తన .
*********

ఉదయ భాను డదిగొ ఉదయించె నభమున
పొన్న పుాల వన్నె పోలు కాంతి
మేలుకొని పశువులు  మేతకై పరుగిడె
మేలి మువ్వల సడితొ మేచ కాంగి ॥

చక్కనైన చెలియ  చన్నీటి స్నానాలు
చేసి హరిని కొలువ చేర రావె
కీర్తి నేలు వాడు, కీర్తింప పరనిచ్చి
 సేవ జేయ మురిసి  సేద దీర్చు  ॥
 
9.వ పాశురము.
*************
రత్నాలు పొదిగేటి రమణీయ మేడలో
దీప కాంతి  కురిసె దివ్య  ప్రభలు
సాంబ్రాణి పొగనిండి  సార గంధము జిమ్మ
 మత్తు విడచి తరుణి మమ్ము  జేరు ॥
 
 ఏలికైన వాని ఎలుగెత్తి పిలచేము
 ఏల వినవు నీవు ఏమి నటన..
 నిదుర మాని నీవు  నిత్య పుాజలు జెేయ
 సఖుల గుాడి  రమ్మ  సార సాక్షి ॥
 
 అత్త కుాతురివిగ అందాల నాచెలీ
 చిత్తచోరుని గన చిరున గవున
 పరమపదమునేలు పన్నగ శయనుని
 పాద సేవ జేయ పదవె కదలి ॥
 
10.వ పాశురము .
****************
ఇంత విన్న కుాడ ఇంతి పలుకవేమి
 నోము నోచితివిగ నోర్మి నీవు
 కుంభకర్ణుని వలె  కులుకు నిద్రది ఏల
 కలికి  కనులు తెరువు కంబు కంఠి ॥
 
 ఇచ్ఛ తులసి మాల  నింపుగా ధరియించి
 సొంపు నేలె నిలను శోభ నుండు
 పుణ్యపురుషు డతడు  పురుషార్ధముల నిచ్చు
 శంఖ చక్ర ధరుని శరణు కోరు ॥ 
 
బంధు జనుల గుాడి భవుని కొలువంగ
 పోవు చుంటి మనుచు, పోరి పిలువ
 వాలు కనుల దోయి వంపు నడుము దాన
 కోమ లాంగి రావె కొలువ హరిని ॥
 
 11.వ పాశురము.
 ***************
 నంద నందను నదె నావేద వంద్యుని
 కనగ రావే మమ్మ కలికి కొమ్మ 
 గొల్ల పట్టివి గదా గోవిందు కొలువగా
 నెమలి నడక దాన నెలత  రమ్మ ॥

పుణ్యవతిగ నీకు పురము నదెపేరు.
 అలసితిమిగ పిలచి  ఆట కాదు...
పెక్కు రీతులేలు పెద్దింటి పడతివీ
పరమ పావనునదె పాడి వేడ ॥

 తిరునామ మహిమ తిరువైభ వముపాడి
 శ్రీశు కృష్ణు కొలిచి శ్రీలు బడయ
 నమ్మి కొలువరాగ నటన నిద్దురలేల..?
 పరము లిచ్చు వాని పదము కొలువ ॥
 
12వ పాశురము
*************
లేగ దుాడలవియె లేచి పొదుగుచేర
పొదుగు నిండు ప్రేమ పొంగి పొరలె
పాడి ఏరులాయె పాల నిండెను పల్లె
వాదు లాట లేల వనజ నేత్రి॥

రావణాంతకుండు రామచందృని వేడు
నామ జపము కన్న నమ్మి కేది..
మత్తు నిదుర మాని  మావెంట రావమ్మ.  
మాధ వునదె  వేడి మరలి పొమ్మ ॥

రారె సఖియ లార రంగనీ కొలువంగ
పరమపురుషుడతడు పావనుండు
మార్గశీర్ష మందు మంచి తానము లాడి
ముదము భక్తి  కొలువ  ముక్తి నిచ్చు ॥

13. వపాశురము.
****************
పక్షి రుాపి బకుని పట్టి ఛెండాడేను
రావణాసురు నదె రణము నందు
జగము లేలు పతిని జగదభి రాముని
కీర్తనల కొలువగ  కినుక వలదు ॥

శుభము పలుక మనకు  శుకృుడే  ఉదయించె
పక్షి కుాత  లిడుచు  పలికె పాట
ఆభయ హస్తుని గన  ఆలసింపక రమ్మ 
సమయము మరువకుమ సుంద రాంగీ ॥

తేనె తాగి మత్తు  తేలు తుమ్మెద వంటి
కన్నులున్న కలికి  కనులు తెరువు
చాలు సాకు లిడుట చాలించు విరతిని
తాన మాడ మత్తు తరలి పోవు ॥

14. వపాశురము.
**************
మమ్ము లేపెదనని మాటిచ్చి మరచేవు.
నమ్మమమ్మ  నిన్ను నళిన నేత్రి.
సీమ నేలు సిరివి  సిగ్గులే దటెనీకు 
శమము దీరి  రావె  సమయ మునకు ॥

మునులు వేద విదులు ముందుగా నెతెమిలి
దేవళముల జేరె దేవు దరికి .
 ధవళ దంత ద్యుతుల ధరణీధవుని
కన్ను లార కనగ   కదలి రావె ॥

15. వ పాశురము.

 మునుపు తెలియ లేదు ముద్దు మాటలు నీవి
  ఓర్మి వేచితి మిక  నోప లేము .
  కమ్ము నిద్దుర వీడి  కదలిరా కలకంఠి.
  గోష్టి కలియ రావె గోప కాంత ॥
  
  గోపకాంతలార గోవిందు కలియంగ
  తెల్లవారమున్నె  తెమిలి వత్తు.
  విదిత మాయె తప్పు విసుగింక మానరో
  జాప్య మింక లేదు  జాణ లార ॥ 
  
  దుష్ట  అసురు కంసు దునిమినట్టి ఘనుడు
  నంద గోప ప్రియుడు  నంద సుతుడు
   గొల్ల భామల సరి కొల్లలాడెడు వాని
   మాయ జేయు వాని మదిని కొలతు  ॥
  *********************************
16. వ పాశురము.
**************
రేడు వనుచు మురిసె  రేపల్లె కన్నెలుా
పరనిత్తు వనుచు పరవసించి
తెమిలి వచ్చి నారు తెరుమయ్య తలుపులు
నీదు వాకిట నదె నిలచి నారు ॥

  విస్మయంపు పనుల విజ్ఞతెరుగు వాని .
  మేల్కొలుపగ వస్థి మేము నుతుల
 వన్నెకాని లేపి వలపు మాటలు జెప్పి
 తలుపు తెరువ మనవె తరుణి నీళ ॥
 
 నీలవర్ణముగల నీలకాయుడ వీవు
 హేమ మందిరమున హేల చాలు
 లీల చుాప  రావ లీలామానుష వేష
 నిత్యపుాజ లందు నీరజాక్ష ॥
 
17.వ పాశురము.
***************
అక్కసమున పిలచి అన్న పానము లిచ్చు
చక్కనైన సామి చంద్రముఖుడు
మలయు నుతుల పాడ ముందుగా వచ్చేము
నిర్గమించు రంగ నిర్మలాంగ ॥

అతులితబలముగల అన్నవు  బలరామ
పట్టు పుట్ట మిడెద  పలుక రావ 
మహితు డౌఅనుజుని  మన్నించి గొనిరావె
మాదు కోర్కె మరచె మాధ వుండు ॥

విష్ణు నీ మహిమలు  వివరింప లేనయా
పసరె నీదు ఖ్యాతి పదుమ నాభ .
చెలియ లార రండె చేరి కొలువగను
రంగనాధు డతడె రమణు లార ॥

18.వ పాశురము.
****************
విరతి నేలు వాని  విడుమ సాగర పుత్రి
 అలవటమ్ము నొదలి ఆదుకోమ్మ 
వేద విదుని హరిని వేడుకొనెదమమ్మ 
వేగ తెరువు తలుపు వేద గాత్రి ॥

పరమ పావను పద పంకజముల వీడి
తడయుటిక వలదని తరచి జెప్పి
 నగవు మొాము తోడ  నాధుని పంపమ్మ
 కురుల కమలికవుగ కలుకు కొమ్మ ॥
 
కోడి కుాసె నదివొ కోయిలమ్మలు కుాసె
మల్లె జాజులు విడె   మధుర ముగను
లలిత కోమల కలికి  లలిత రాగపు కంఠి
కలల రేని లేపి  కదలి రమ్మ ॥  

19. వ పాశురము
****************
మణి రత్నములవె మంచిగా పొదిగున్న
పంచ గుణపు మేటి పరుపు పైన
నీళ వక్షమునదె నిదురించు మాసామి
తలిరు బోడిని విడి తరలి రావ ॥

విమలయశుని వీడి విరతి చాలించవే
నాధు విడువ నిదుర నటన లేల..?
మరుగు సదనము విడి మాటాడ నీయవే ॥
 వరుస వెన్నునెడల వలపు చాలు ॥
 
20. వ పాశురము.
***************
  భక్తి తోడ కొలువ భయము బాపెడు దేవ
  శక్యమౌన నీదు శక్తి తెలియ
  అక్కసమ్ము తోడ ఆదుకో మమ్మీవు
   నీళను విడుమింక నీరజాక్ష ॥
   
   ఎర్రనీ పెదవుల  ఏపు గుబ్బల దాన
   సన్ననీ కటిగల సతివి నీళ
   నీదు నాధు విడము  నీరాడ నళినాక్షీ
   అలరు సింగారముల -కద్ద మిడుము ॥

ముాడు లోకములకు ముాలమైన విభుని
కోటి దేవతలదె కొలచు వాని 
కోరి నట్టి కోర్కె కొలువంగ తీరును
మార్గ శీర్ష మాస మహిమ ఘనము  ॥

*******************************
   21.వ.పాశురము.
   ****************

గోవులనదె కాయు గోపాల బాలుడా
నంద గోప బాల నటన చాలు
శీల సద్గుణ ధన శ్రీకృష్ణ  లేవయ్య
జాల మేలనయ్య  జాగుసేయ ॥

ఆశ్రయించి నాము ఆదుకొనగ రావె
విరతి చాలు చాలు విశ్వ వంద్య 
నీదు వాకిట నదె నిలచి యుంటిమి సామి.
మంగళములు పాడ మాధవ ఘన  ॥

చెలుల తోడ్కొనుచును తెమిలి వచ్చేమయ్య
తొలి పొద్దు పొడిచె తొందరించు.
మార్గశీర్ష వ్రతము మనసుతో జేయంగ
మేలుకొలుపు లిడుచు మేలు రీతి ॥

22. వ పాశురము.
****************
రణము నందు వీర  రాజాధి రాజులుా
పణము నొడ్డి పోరి  రణము నోడి
దర్పమునదె వీడి దాసులై నినుజేరు-
నట్టి నిన్ను మేము  నమ్మి నాము ॥

నామ కీర్తి పలుక  నాధు మా తరమా 
డెప్పరములు అవియె జెప్ప మాకు
భక్తి తోడ నిన్ను భజన చేయగ వచ్చి
నిన్ను జుాడ నిచట నిలచి నాము ॥

సుార్య చంద్రులంటి శుభనయనునకునుా
శంఖ చక్ర ముగల శక్తిధరుకు
 పుష్పహారము లేయ   పులకరించును మేని 
పావ నుండతండు పాప హారి  ॥

23.వ పాశురము.
****************
వర్ష ఋతువు నందు వర్షించు మేఘాల
సవ్వడులకు లేచి సందడించి
భీకరాకృతినిడి భీషణ ఘర్జన జేయు
కదన సింగమొాలె కదలి రమ్ము ॥

నిర్గమించుమయ్య నీల మేఘశ్యామ
పాదుకొన్న వేల్ప పరమపురుష.
మందిరమ్ము వీడి మమ్ము  బ్రోవగదయ్య
శ్రీశ రంగ నాధ  సిరిపురీశ ॥

విరియు తామరవలె  విచ్చు కనుల తోడ
నిచ్ఛమమ్ము గావు నీరజాక్ష..
విజయపీఠ మెక్కి విను విన్నపాలనుా
సామిసన్ను తింప సమ్మ తీయ ॥

24.వ పాశురము.
***************
 ముాడడుగుల తోడ ముల్లోకముల గొల్చ
 మలయు పాదములకు మంగళమ్ము .
మహి నసురుల గుాల్చి మడియించు శక్తికీ
మంగళమ్ము లివియె మాధవునకు ॥

పుాతనాదు లగుాల్చి పురము గాచిన వాని
గో గొపాలు నేలు గొల్ల వాని
గోటి తోడను గిరి గోవర్ధనము నెత్తు    
 గోపికృష్ణు నెపుడు   గొల్తు మేము ॥

వేదవిదుని  చేతి వేలాయుధమునకు
మహిత సద్గుణ శీలు  మాధవునకు.
పరను యిచ్చు వాని పరమాత్మ కృష్ణకుా ..
జగద ధీశు నకును జయము జయము ॥

25. వ పాశురము.
***************
దేవకీ సుపుత్ర దేవ దేవుడవీవు
 రెప్పపాటు  నదిని రేయి దాటి
 నందు నింట జేరి నమ్మువారిని గాచి
 కంసు జంపి నట్టి  ఘనుడవీవు ॥
 
సిరుల లక్ష్మిని హృది స్థిరముగా నిలిపేవు
వరము గాను కలిమి ధరను పంచి
పుణ్యపురుష మాకు పురుషార్ధముల నిచ్చి
అండ నుండ  మాకు ఆప దేల ॥

వరలు భక్తి తోడ వచ్చి కీర్తులుపాడు
నామ జపమె మాకు రామ రక్ష .
వంద్య మమ్ము గావ వదలు విరతి నింక
మహితమాయె మీదు మహిమ,యశము ॥

26 .వ కీర్తన.
************
పుార్వికులదె నోచు పుాతమైన వ్రతము
మాస మార్గశిరపు మహిమ నెంచి
సఖులు తతిగ గుాడి సంకల్ప సిధ్ధితో
తానమాడి వచ్చె తమను కొలువ ॥

పాంచజన్య మట్టి  పాలసంద్రముపైన
పవ్వళించు సామి పలుకవయ్య ॥
వలయు సాధనలిడి  వర్ణింప నినుజేరి
శంఖనాదములిడె శాస్త్ర ముగను ॥

మేటి దివ్వెల గొని మేలుకట్ల నమర్చి
మంగళములు పాడె  మహితముగను
తప్పు లెరుగమయ్య తల్లితండ్రివి నీవె
మన్ని కమము గనుమ మార జనక ॥

27. వ పాశురము.
****************

కల్యాణగుణ రామ కామితార్ధ సుధామ
పుణ్య లీలలు విని  పులకరించి
పట్టు వస్త్రములిడ పరమాత్మ వచ్చేము
కట్టు కొనుము శ్రీశ కరుణ నేల ॥

గోఘృత పరిమళపు  గొప్ప క్షీరాన్నముా
పసిడి గిన్నె లోన పంచి నాము
విమల యశుని హరిని విధిగచే కొనిరమ్మ
తడయుటలిక మాని తరలు నీళ ॥

28 .వ పాశురము.
*************:**:
గోవు లెనుము లేలు గొల్లవారము మేము.
మడువుటలు తెలియని మందమతులము
అలరు జ్ఞాన మునిడ  అవతరించినదేవ 
పుణ్య ఫలము మాదు పుణ్య ముార్తీ ॥

 లోక నాధుడవుగ లోపముల సవరించ
 మాలొ నొకడివిగను మసలి నావు ॥
 మా సఖుడవు నీవు మిమ్ము నమ్మితిమయ్య
 ఆగ్రహింపకయ్య ఆది దేవ ॥
 
 సఖుడ వీవ నెంచి సరి మాటలవి మీర.
 మన్ననలిడుమయ్య మాదు సఖుడ ॥
 తప్పు లెరుగమయ్య తరలిరా క్రిష్ణయ్య
 నీదు లీల చాలు నిదుర లెమ్ము ॥
  
  29.వ పాశురము.
  ***************
అరుణ కాంతి విరియ అతులితోత్సాహాన
నీదు సేవ జేయ నిలచి నాము.
పరము ఫలము లనెడు పరమార్ధ మెరుగము
అంతరంగ సేవ కనుమ తీయు ॥
 
 పట్టెడన్నము తిని పశువుల మేపేటి 
 గొల్ల వంశ మందు గొంటి జన్మ
 జన్మ జన్మ బంధు జనులముా మేమంత
 నిన్ను వీడ లేము నిజము క్రిష్ణ  ॥

 నీదు మందిరమున  నీ సేవ జేయంగ
 మాస మార్గశిరము మేలు యనుచు
 చలిని స్నానములిడి  చక్క దీక్షను పుాని
 నిన్ను కొలువ వస్థి నిదుర విడుమ ॥
 
30.వ పాశురము.
***************
నిదురలింక చాలు నీలమేఘశ్యామ
మధుర మంగళ రవమదియె వినుమ
మేలుకొలుపులు విని మేలుకోవేమయ్య 
శ్రీశ తలుపు తెరువు శ్రిీనివాస॥

పాల సంద్రపు సిరి పడతిలక్ష్మిని బట్టి
వేల నామములతొ  వెలయు సామి
గో గొపాలు రెల్ల కోరు గోకుల బాల
నీదు లీల జుాపు నీల వర్ణ ॥

విష్ణుచిత్తు పుత్రి విమల యశసుగాత్రి
పరమ భక్తి పాడె పాశురములు.
సార్ధకమ్ము లాయె సారమౌ కీర్తులుా
అట్టి భాగ్యమిమ్మ  ఆర్క తేజ ॥
****************************
జయము నీయుమయ్య జగదీశ్వరికినీవు
పాడె భక్తి తోడ పాశురములు
తెలుగులోని రాయ తెనిగించె చుాడయా
తప్పులెంచకయ్య తలచి భక్తి ॥

మంచి చెడుల జ్ఞానమన్నదే లేదయా
వేద పుాజ లేవి వెరసి రావు.
కోర్కె నీదు భక్తి కోరెనీశ్వరిలను 
ఈప్సితమ్ము లిడుచు ఇమ్మ ముక్తి.

*****************************

     =====ఓం..తత్సత్ ...========

     ఓం...శాంతి......శాంతి.......శాంతిః.
****************************

Tuesday, October 7, 2025

అంశము : చిత్రకవిత .

[06/10, 10:51 am] JAGADISWARI SREERAMAMURTH: 06/10/2025.
మహతీ సాహితీ కవి సంగమం.
సోమవారం 06_10-2025..
*చిత్రకవిత -123*
అంశము : చిత్రకవిత .
ప్రక్రియ : ఆటవెలది.
రచన : శ్రీమతి పుల్లభట్ల జగదీశ్వరీమూర్తి.

 

తల్లి గర్భ మందు తల దాచుకున్నట్టి
పాప డెంత గుణుడు పావనుండు.
బయలు పడిన యంత బట్టు మాయకు లొంగి 
కన్నవారి నెట్టు కరకు డగును. !!

తండ్రి సంపదంత తన కోసమేయంచు 
దలచి తగుల బెట్టు దనుజ గుణుడు.
కన్న వారి రోసి కన్నీరు తెప్పించు
పుత్రు లేల నయ్య , పుడమి బరువు !!
[06/10, 6:43 pm] +91 94411 20047: తల్లి గర్భంలోన తలదాచుకున్న పాపడు పావనుడు అని, బయటపడి నాయకులు కరకుగా మారతాడని *పుల్లభట్ల జగదీశ్వరి మూర్తి* గారు చక్కగా తెలిపారు. తండ్రి సంపదంత తన కోసమేనని కొడుకులు ఖర్చు పెడతారని కన్నవారికి కన్నీరు తెప్పించే పిల్లలు పుడమికి బరువని వారు తమ పద్యాలలో తెలిపారు.👌

శీర్షిక: కళ్యాణ రాముడు.

[31/03, 5:50 pm] JAGADISWARI SREERAMAMURTH: మహతీ సాహితీ కవిసంగమం.
*ప్రతిరోజూ కవితా పండుగే*
అంశం:చిత్రకవిత
కవితాసంఖ్య: 1
31/ 03/ 2025 .  ( సోమవారం)
శీర్షిక: కళ్యాణ రాముడు.
శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి .
కళ్యాణ్ :  మహారాష్ట్ర . 43.
ప్రక్రియ: వచన కవిత. 
------------------

నింగి నిండా భానుడి ప్రతాపం,
నేలంతా సీతారాముల కళ్యాణ మేళం..
వేద మంత్రాల ధ్వనులతో నిండిన ఆకాశం,
దేవతలు చల్లే పుష్పాలతో భువి నిండిన సుగంధం !!
 
సీతా , రాముల నుదుట మెరిసే బాసికం .
అగ్ని సాక్షిగా ఏకమైన వారికి తోడైన తారాబలం.
భక్తుల హృదయాలలో వెలిగించిన ఆనంద దీపం.
సూర్యుని వేడిమి కూడా కరిగి ,
 చల్లని అనుభూతిగా  మారిన  క్షణం.!!,

 కళ్యాణ ఘట్టంలో నిండిన మన  దివ్య సంస్కృతి.
చరిత కెక్కిన సీతారాముల ఘనమైన దివ్య కీర్తి .
మంగళ వాయిద్యాల మధ్య  నాదలోలుల ఆనంద గీతి.
మన సభ్యత , సంస్కరాలకు పట్టిన నిండైన ఆరతి.!!.

సీతారాముల కళ్యాణ గాధ, సుగంధ పరిమళ పూదోట.
కుటుంబ విలువలు పెంచే బంధాలకు బాట.
తల్లి,తండ్రుల మాటలకు విలువిచ్చిన పుత్రుని కధ.
రామరాజ్యాన్ని భువిలో నిలిపిన వేద-వేద్యుడతడట.!!

అన్నదమ్ముల ఆదర్శానికి ప్రతీక అన్నది నిజం.
ఆలు,మగల అన్యోన్యానికి ఆతడే నిదర్శనం.
గుణగణాలకు తగిన అందమైన రూపం. 
ఆతని తలపే భక్తుల మదిలో ఆనంద దీపం. !!
-----------------------------------
ఈ కవిత నా స్వీయ  రచన.
[31/03, 9:48 pm] +91 96406 22018: 2️⃣2️⃣✅ శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు కళ్యాణ రాముడు శీర్షికతో నేటి చిత్రానికి మీరు రాసిన కవిత చాలా బాగుంది. నింగి నిండా భానుడి ప్రతాపం నేరంతా సీతారాముల కళ్యాణ మేడం చక్కని ప్రారంభం. సీతారాముల కళ్యాణ ఘట్టం శ్రీరాముని గుణగణాలు ఎదురుగా ఉండి చెప్తున్నట్టుగా వివరించారు ధన్యవాదములు మరియు అభినందనలు.👏👏👏💐💐💐🙏🙏🙏

Sunday, October 5, 2025

ప్రక్రియ: గజల్ (తిస్రగతి)*************************

*మహతీ సాహితీ కవిసంగమం*
*ప్రతిరోజూ కవితా పండుగే*
 
అంశం: ఐచ్ఛికం 
కవితాసంఖ్య: 6
తేది: 4-10-25, శనివారం 
శీర్షిక: "మహాకవి శ్రీ శ్రీ"
కవి:   డాక్టర్ కురవి వేంకట కృష్ణ శాస్త్రి, ‌‌కవి సంఖ్య (14)
ప్రక్రియ: గజల్ (తిస్రగతి)
*************************

ఖడ్గసృష్టి చేసినట్టి కమనీయపు కవి శ్రీశ్రీ,
రైతులకై వ్రాసినట్టి రమణీయపు కవి శ్రీశ్రీ!

చంధ మనెడి బంధనములు తెంచినట్టి ఘను డాతడు, 
పీడితులకు ఆసరైన అనులాపపు కవి శ్రీ శ్రీ!

కార్మికులకు ఊత మిచ్చి కావ్యములను రాసె గాదె,
బడుగు వర్గ జనుల కెల్ల అనురాగపు కవి శ్రీ శ్రీ!

చలనచిత్ర గేయాలను చక్కగాను జను లందరు మెచ్చు విధము రాసినట్టి అపురూపపు కవి శ్రీ శ్రీ!

చరమరాత్రి కథసంపుటి సృష్టించిన లేఖకుండు, 
 *కృష్ణశాస్త్రి* తలచినట్టి కమనీయపు కవి శ్రీ శ్రీ!!
*************************
ఇది నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను.



మహతీసాహితీ కవిసంగమం
ప్రతిరోజూ కవితా పండుగే
అంశము.ఐచ్ఛికం
కవిత సంఖ్య.5
తేది.4.10.2025.శనివారం
శీర్షిక.మనిషి బ్రతుకులో
ఎలగందుల లింబాద్రి
నిజామాబాదు(47)
ప్రక్రియ. గజల్

తలచింది జరిగినపుడు
భగవంతుడు యెందులకు
తోచినది కోరుకున్న
తీరునులే లోకమందు

ఎవరికెవరు ఈజగాన
యేమిటి యీ నాటకము
ఆడించెడు వాడెవడో
తెలియదులే లోకమందు

మంచిచేయు వానికెపుడు
వచ్చుచుండు కష్టాలు
ఎదిరించి పోరాడిన
గెలుచునులే లోకమమందు

 సత్యమైన మాట యెపుడు
నిప్పులాంటిదని తెలియుము
యేనాడో ఒకనాడు
తేలునులే లోకమందు 

నీఛమైన పనులుజేయ
పైకి తెచ్చు భగవంతుడు
ఎదిగి యెదిగి ఒకనాడు
కూలునులే లోకమందు.

ఈ గజల్స్ నేను స్వయంగా వ్రాసినానని హామీ ఇస్తున్నాను.
మహతీసాహితీ కవిసంగమం
ప్రతిరోజూ కవితా పండుగే
అంశము.ఐచ్ఛికం
కవిత సంఖ్య.5
తేది.4.10.2025.శనివారం
శీర్షిక.మనిషి బ్రతుకులో
ఎలగందుల లింబాద్రి
నిజామాబాదు(47)
ప్రక్రియ. గజల్

తలచింది జరిగినపుడు
భగవంతుడు యెందులకు
తోచినది కోరుకున్న
తీరునులే లోకమందు

ఎవరికెవరు ఈజగాన
యేమిటి యీ నాటకము
ఆడించెడు వాడెవడో
తెలియదులే లోకమందు

మంచిచేయు వానికెపుడు
వచ్చుచుండు కష్టాలు
ఎదిరించి పోరాడిన
గెలుచునులే లోకమమందు

 సత్యమైన మాట యెపుడు
నిప్పులాంటిదని తెలియుము
యేనాడో ఒకనాడు
తేలునులే లోకమందు 

నీఛమైన పనులుజేయ
పైకి తెచ్చు భగవంతుడు
ఎదిగి యెదిగి ఒకనాడు
కూలునులే లోకమందు.

ఈ గజల్స్ నేను స్వయంగా వ్రాసినానని హామీ ఇస్తున్నాను.

మహతీసాహితీ కవిసంగమం
ప్రతిరోజూ కవితా పండుగే
అంశము.ఐచ్ఛికం
కవిత సంఖ్య.5
తేది.4.10.2025.శనివారం
శీర్షిక.మనిషి బ్రతుకులో
ఎలగందుల లింబాద్రి
నిజామాబాదు(47)
ప్రక్రియ. గజల్

తలచింది జరిగినపుడు
భగవంతుడు యెందులకు
తోచినది కోరుకున్న
తీరునులే లోకమందు

ఎవరికెవరు ఈజగాన
యేమిటి యీ నాటకము
ఆడించెడు వాడెవడో
తెలియదులే లోకమందు

మంచిచేయు వానికెపుడు
వచ్చుచుండు కష్టాలు
ఎదిరించి పోరాడిన
గెలుచునులే లోకమమందు

 సత్యమైన మాట యెపుడు
నిప్పులాంటిదని తెలియుము
యేనాడో ఒకనాడు
తేలునులే లోకమందు 

నీఛమైన పనులుజేయ
పైకి తెచ్చు భగవంతుడు
ఎదిగి యెదిగి ఒకనాడు
కూలునులే లోకమందు.

ఈ గజల్స్ నేను స్వయంగా వ్రాసినానని హామీ ఇస్తున్నాను.

యలగందుల లింబాద్రి గారు 

తలచినదే నీచమైన ఇక్కడ మహాప్రాణం బదులు అల్ప ప్రాణం వేయండి ఒకచోట లోకమమందు అని ఒక మ కారం అదనంగా పడింది 
మొత్తానికి గజల్ జిగేల్ మంది
జలపాతం లా దూకింది


Friday, October 3, 2025

మనోహరి అంతర్జాల మహిళా మాసపత్రిక వెబ్సైట్ లింక్✍️*

https://thapasvimanoharam.com/manohari-september-2025/

*సెప్టెంబర్- 2025 మనోహరి అంతర్జాల మహిళా మాసపత్రిక వెబ్సైట్ లింక్✍️*

Friday, September 12, 2025

ఛందస్సులోని 10 రకాలైన దోషాలు

ఛందస్సులోని 10 రకాలైన దోషాలు


1. ఛందో భంగము (గణ భంగము):  
గురువు బదులు లఘువు వేసినా, లఘువు బదులు గురువు వేసినా ఈ రకమైన దోషం వస్తుంది.

2. యతి భంగము
యతి స్థలమునందు యత్యక్షరం లేకపొయినా, మైత్రి లేకున్నా యతి స్థలం మారినా యతి, మైత్రి గల అక్షరాలు గమనించక పొయినా.. అది యతిభంగమనబడును. 

3. విసంధి
సంధి చేయవలసిన చోట సంధి చేయకపోతే అది విసంధి దోషమని అంటారు.

4. పునరుక్తము
ఒక శబ్దాన్ని మరల మరల ప్రయోగించడం, ఒకే అర్ధం వచ్చేట్టు ప్రయోగించడం.

ఉదా:  హిమాద్రి పర్వతము పైన అంటే... హిమాద్రిలో పర్వతం ఉంది మళ్ళీ పర్వతం అని వాడకూడదు.  

అలా అని శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ అంటే అది పునరుక్తి దోషం కానేరదు ఎందుకంటే..అటువంటి నాలుకే నాలుక అని అర్థం వచ్చేట్టు చెప్పడం దోషం కాదు.

5. సంశయము
పద్య పాదాలలో అర్ధం సరిగ్గా చెప్పలేకపొయినా, అర్ధంలో సంశయమున్నా సంశయ దోషము అంటారు.

6. అపక్రమము
వరుస తప్పడమే అపక్రమము.
ఉదా:  బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు.. అంటూ.. లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి, పార్వతీ దేవి అనరాదు...సరస్వతీ దేవి, లక్ష్మీ దేవి, పార్వతీదేవి అని అనాలి.

7. వ్యర్ధము
అనుగుణముగా లేని కూడని మాటలు వాడిన.. "వ్యర్ధము" అనే దోషము కలుగుతుంది.

8. అపార్థము
సరి అయిన అర్ధము లేకుండా ప్రాస కోసమో, యతి కోసమో సూన్య పదాలు వాడితే అపార్థ దోషమంటారు. 

9. అపశబ్దము
వ్యాకరణంతో సంభందము లేకుండా కుసంధి, దుస్సంధి వైరి సమాసాలు ఆగతికములగు సంస్కృత శబ్ద ప్రయోగాలు మొదలగు అపశబ్దములు కావ్యములందు ఉపయోగించరాదు.

10. విరోధము 
ఉచితము కాని పద్ధతిలో ప్రకృతికి విరుద్ధంగా వర్ణించరాదు. 
ఉదా:  హైదరాబాదు నగరంలో సముద్ర తీరాన విహరిస్తున్నారు అని అనరాదు.

ఇవి కాక...

నిషిద్ధ గణము: 
పద్యములలో ఉదాహరణకు కంద పద్యంలో జగణం బేసి గణముగా వాడరాదు. 

పదచ్చేద భంగము
ద్విపద, మంజరీ ద్విపదలలో పద పదములకు తెగ వలెను. అట్లు తెగని యడల పదచ్చేద భంగము వస్తుంది.

Monday, September 8, 2025

లింక్..

https://thapasvimanoharam.com/weekly-magazines/varapatrika-07-09-2025/
తపస్వే మనోహరంలో "నాన్నమ్మ" కధ  "లింక్".

Thursday, August 28, 2025

గణేశ స్తుతి.

 మహతీ సాహితీ కవి సంగమం.
27/08/2025.( బుధవారం).
అంశం : గణేశ స్తుతి.
కవితా సంఖ్య : 1.
మ.స.క.స.38.
ప్రక్రియ :  ద్వీపద. 
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.

శీర్షిక : ఆది పూజ్యుడు.

ఎలుకనెక్కిన ఘన ఏలుమా  వరమ
పలుకు తేనెలు నిండు పచ్చన్ని ఫలమ!!

అమ్మ పార్వతి చేతి అందాల  బొమ్మ
ఇమ్మ మా కిల భక్తి ఇభరాజ వదన.!!

గణపతివిగ నీవు గగనాల నేలు
ఘనపతి వగునీవు గురుడవై కావు
అధిపతి  వరమిమ్మ ఆదిగా తలతు
నిధిపతి వగునిన్ను నిరతమ్ము  గొలతు!!



[28/08, 8:14 am] +91 83412 49673: పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు 
ద్విరదముఖుని ద్వైమాతురుని వర్ణించిన తీరు హృదయ రంజితంగా ఉంది

Monday, May 26, 2025

కలం.. చిత్ర కవిత.

26/05/2025.( సోమవారం) 
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం :  చిత్ర కవిత..(106).
శీర్షిక : : విప్లవ జ్వాల.
ప్రక్రియ :  వచన కవిత.
కవిత సంఖ్య : 1 
రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ :  మహారాష్ట్ర. (38.).


కలము, ఓ నిశ్శబ్ద  కళాకారిణి,
అక్షర సమూహాలతో భావాలకు ప్రాణం పోస్తుంది.
సిరా చుక్కలు, రంగులద్దిన స్వప్నాలై,
కాగితంపై కవితాక్షరాలై చిందులు వేస్తాయి !!

కలం , అక్షరాలనల్లే ఓ అద్భుత సృష్టి!
ఊహల రెక్కలకు బలం చేకూర్చి,
పద బంధాలతో కొత్త లోకాలను సృష్టిస్తుంది, 
కాలంతో పాటు నడిచే సత్య ప్రభోధిని !!

కలం , అక్షర స్వరాలను పలికిస్తూ, 
మౌన గీతాలు పాడుతుంది.
సూక్ష్మమైన ఆలోచనలకు ఆకృతినిస్తుంది.
పదునైన కొనతో, పదాలు చెక్కుతుంది.!!

కలము, చేతిలో ఒదిగిన ఒక నిప్పుకణం,
అక్షర జ్వాలలతో అన్యాయాన్ని దహిస్తుంది.
నిశ్శబ్దంగా రగిలి,  నిజాలను ప్రజ్వలించి,
లోకంలో మార్పుకు నాంది పలుకుతుంది.!!

ఇందులో ఉన్నది కేవలం సిరా చుక్కే కాదు,
అణగారిన గొంతుల నుండి పెల్లుబికిన ఆగ్రహం.
అక్షరం, అక్షరంతో  కలిసి అణ్వాస్త్రమై,
నిరంకుశత్వపు కోటలను కూల్చివేస్తుంది.!!

కలం, కధాక్షరాల పోరాట భేరి,
ప్రజల ఆవేశానికి, అస్త్ర మౌతుంది.
ప్రతి పదం ఒక పిడికిలై,
అణచివేతలపై తిరుగుబాటు చేస్తుంది, !!

కలం, కాగితంపై  కదలే జ్ఞానాక్షర ధనం.
సంకెళ్ళను తెంచుకునే సంకల్ప బలం.
రాతిలో నిండిన భక్తి , రాతలో దాగిన శక్తి , 
సమ సమాజ స్థాపనకు వేసే పునాది .!!

కలం, ప్రజల భావ బీజాల చైతన్య శక్తి.
ప్రతీ రంగుకు ప్రాణం పోసే కవితా స్ఫూర్తి.
ప్రతీ భావానికి చిత్రం గీస్తుంది.
కావ్య ,కధా, కళలకు కన్నతల్లి అవుతుంది!!

 కలం, నిరాశను ఆశగా మారుస్తుంది
 అంధకారాన్ని కాంతిగా మారుస్తుంది.
నిజాల వేటతో చరిత్ర సృష్టిస్తుంది.
అదే కలం కదిలితే, చరిత్రే మారుతుంది.!!

---------------------------
ఈ కవిత నా స్వీయ రచన.

Sunday, May 25, 2025

శీర్షిక : : విప్లవ జ్వాల. ( కలం).

26/05/2025.( సోమవారం) 

మహతీ సాహితీ కవి సంగమం.

అంశం :  చిత్ర కవిత..(1).

శీర్షిక : : విప్లవ జ్వాల.

ప్రక్రియ :  వచన కవిత.


రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర. (38.).



కలము, ఓ నిశ్శబ్ద  కళాకారిణి,

అక్షరాల రంగులతో భావాలకు ప్రాణం పోస్తుంది.

సిరా చుక్కలు, రంగులద్దిన స్వప్నాలై,

కాగితంపై భావాక్షరాలై చిందులు వేస్తాయి !!


ఊహల రెక్కలకు బలం చేకూర్చి,

తన రచనలతో కొత్త లోకాలను సృష్టిస్తుంది, 

కలం , కవితలల్లే ఓ అద్భుత సృష్టి!

కాలంతో పాటు నడిచే సత్య ప్రభోధిని !!


కలం , పదాల స్వరాలను పలికిస్తూ, 

మౌన గీతాలు పాడుతుంది.

సూక్ష్మమైన ఆలోచనలకు ఆకృతినిస్తుంది.

పదునైన కొనతో, పదాలు చెక్కుతుంది.!!


కలము, చేతిలో ఒదిగిన ఒక నిప్పుకణం,

అక్షర జ్వాలలతో అన్యాయాన్ని దహిస్తుంది.

నిశ్శబ్దంగా రగిలి, ప్రజ్వలించి,

లోకంలో మార్పుకు నాంది పలుకుతుంది.!!


ఇందులో ఉన్నది కేవలం సిరా చుక్కే కాదు,

అణగారిన గొంతుల నుండి పెల్లుబికిన ఆగ్రహం.

అక్షరం అక్షరంతో  కలిసి అణ్వాస్త్రమై,

నిరంకుశత్వపు కోటలను కూల్చివేస్తుంది.!!


కలము, ఇది అక్షర పోరాట భేరి,

ప్రజల ఆవేశానికి, అస్త్ర మౌతుంది.

ప్రతి పదం ఒక పిడికిలై,

అణచివేతలపై తిరుగుబాటు చేస్తుంది, !!


కలం, కేవలం కాగితంపై గీతలే కాదు,

సంకెళ్ళను తెంచుకునే సంకల్ప బలం.

రాతిలో నిండిన భక్తి , రాతలో దాగిన శక్తి , 

నూతన సమాజ స్థాపనకు పునాది వేస్తుంది.!!


కలం, ప్రజల భావ బీజాలకు చైతన్య శక్తి.

ప్రతీ రంగుకు ప్రాణం పోస్తుంది.

ప్రతీ భావానికి చిత్రం గీస్తుంది.

కలం కదిలితే, చరిత్రే మారుతుంది.!!


---------------------------

ఈ కవిత నా స్వీయ రచన.

శీర్షిక : శ్రీరామ నామ మహిమ.

శీర్షిక : శ్రీరామ నామ మహిమ.

(గేయ కవిత).

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ : మహారాష్ట్ర. 43.


---------------------------


అనంతమైనది రామ నామము 

 శక్తి నిండిన నామము

 జగతికిది ఆధార భూతము.

జయము మంగళ నామము !!


పలికినంతనే పులకరింతల

మనసు నిండిన నామము

తొలగు కర్మల మలిన మంతయు

ధర్మ పథమిడు నామము !!


ధర్మ రూపుడ యోధ్యరాముడు,

నీతి , నియమము కద్దము 

ఆతని నామము నమృత ధారలు

త్రాగు వారికి మోక్షము !!.


ఎన్ని యుగములు గడచినా ఘన

మహిమ తరగని  నామము.

భక్తి వేడిన ముక్తి నొసగును.

కరుణ నిండిన నామము!!


 మార్గ దర్శన మిడును నిత్యము.

నామ జపమొక ఒక యజ్ఞము

 కథలు వినుటయె పరమ మోదము

జన్మ జన్మల భాగ్యము.!!


----------------------

ఈ గేయ కవిత నా స్వీయ రచన.




అంశం : డా బి.ఆర్.అంబేద్కర్.

డా బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతి* సందర్బంగా కవిత.

 అంశం : డా బి.ఆర్.అంబేద్కర్.

శీర్షిక : నిత్య చైతన్య స్ఫూర్తి .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .

--------------------------


నలుపు తెరల వెనుక దాగి, 

నలిగిన గుండె చప్పుడు విన్నావా?

భీముని పిలుపులో, అణగారిన

 ఆత్మల ఆక్రందన విన్నావా?


పుట్టిన నేలపైనే పరాయివాడై,

 నీరు సైతం నిరాకరించబడిన ,

ఒక బలహీనని భవిత కథ విన్నావా? 


నీడ లేని బాల్యం, నిప్పుల కొలిమి వంటిది,

అంటరానితనపు ముల్లు గుచ్చినా, ఆత్మ నిబ్బరం చెదరనిది.!!

జ్ఞానపు జ్యోతిని వెలిగించి, చీకటిని 

పారద్రోలాలనే తపన నిండిన ఘనతతనిది.!!


బడి గడప తొక్కనివ్వకపోయినా, పట్టుదల వీడని దీక్షా దక్షుడు,

పుస్తకాలే ప్రాణమిత్రులు  కాగా ,అక్షరాలనే ఆయుధంగా, చేసుకున్నాడు.!!


కోట్లాది గొంతుల సింహ గర్జనై ,హక్కుల కోసం 

ఉప్పెనలా  ఉద్యమించాడు,

  రాజ్యాంగ నిర్మాతగా  శిఖరంలా నిలచి ,

ధృవతారలా జాతికి దిక్సూచి అయ్యాడు,!!


కులమతాల కట్టుబాట్లను తెంచి

 పౌర హక్కులను కవచంలా కాపాడాడు, 

రాజ్యాంగపు చుక్కానియై, 

నవభారతానికి దిశానిర్దేశం చేసాడు.

సమానత్వం, సౌభ్రాతృత్వం నినదించి,

 జాతిని వెలుగుబాట పట్టించాడు..

భారతీయ సమాజానికి   భాస్కరుడిలా,

 వెలుగునిచ్చే మార్గదర్శకుడయ్యాడు .!!


అతని ఆశయాలే మనకు స్ఫూర్తి, 

ఆతని అడుగుజాడలే మనకు గమ్యం,

ఆతని పోరాటమజరామరం,

అణగారిన వర్గాలకు ఆయన,  నిత్య చైతన్య స్ఫూర్తి .

భారత జాతి గుండెల్లో కొలువై ఉన్న 

"డాక్టర్ అంబేద్కర్ " అమర  ఘన కీర్తి.,


శీర్షిక : సాంప్రదాయ పండుగలు.

అంశం:  జాతర : గేయం.

శీర్షిక : సాంప్రదాయ పండుగలు.

రచన ,శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్ .మహారాష్ట్ర .



---------------------


గిరగిర తిరిగే రంగుల రాట్నాలు

సందడి నిండిన జాతర  హోరులు

పెద్దల మదిలో భక్తి  భావాలు

చిన్నారి  పాపలు చిందేటి నవ్వులు !!


అంగడి నిండిన బొమ్మల కొలువులు

గాజుల గలగల నిండిన భామలు

పట్టు పావడల రేపరెపల కళలు

కన్నెల పదముల మ్రోగేటి మువ్వలు!!


చల్లని పానీయాలు పంచేటి దాతలు

అరిసెలు, బూరెలు అమ్మేటి బామ్మలు

బజ్జీల ఘుమఘమ నిండిన వీధులు

నోరులు ఊరించు తీయని అమ్మకాలు !!


కోలాటకాటలు , చప్పుళ్ళు, తాళాలు

ఇంపైన భజనలు ,. భక్తి పాటలు 

నాగస్వరాల నాడే పాములు

భక్తిశ్రద్ధలతో   కొలువుల పూజలు !!


గుడిలో దేవుని దర్శన భాగ్యం

నమ్మిన జేజికి బోనాల భోగం.

మ్రొక్కులు, ముడుపుల జన సందోహం.!

తీర్థ ప్రసాదాలనందే యోగం.!!


పల్లెలు నిండిన ,సరి సాంప్రదాయాలు. 

జనాల మోమున వెలిగే కాంతులు.

జాతర నిండిన ఆనంద దీపాలు

కొలువూరు దీరిన దేవ- దేవుళ్లు !!


జాతర, సందళ్లు  జయమైన కోర్కెలు

గుండెలు నిండిన  అతి మధుర స్మృతులు

దేవుని మహిమల  కీర్తులే పాటలు

ఏటేటి జాతర కెదురెదురు చూపులు !!

----------------------------


ఈ గేయం నా స్వీయ రచన.

శీర్షిక : వీడని లక్ష్యం.

15/05/2025.

శీర్షిక :  వీడని లక్ష్యం. 

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి.

కళ్యాణ్ : మహారాష్ట్ర.



హిమగిరుల శిఖరం నీ ధీరత్వానికి నిదర్శనం

ఆకాశమంత  విశాలమైనది నీ గుండె లయ తత్వం

 నీ మేని పులకరింతల మలుపు భూమి తల్లి  పిలుపు

నీ అడుగుల చప్పుడు శత్రువు గుండెల్లో ఉరుముల తలపు.


ఎండ నిప్పుల జ్వాలైనా నీ సంకల్పం చెదరనిది,

కురిసే వాన ప్రళయమైనా నీ ధైర్యం తరగనిది..

మంచు దుప్పటి ముసుగేసినా నీ కాంతి దాగని నిధి

నీ కనురెప్పల సారధి .సరిహద్దును కాచే పెన్నిధి.


 కొండంత బరువును మోసేది ,నీ భుజ బలం

నీ  చూపుల తూణీరం లక్ష్యాన్ని ఛేదించే వరం.

పట్టిన తుపాకీ బలం నీ  విశ్వాసానికి ప్రతిరూపం, 

తుపాకీ గుళ్ళ శబ్దం శత్రువు గుండెకు పిడుగుపాటు భయం.


నేల  నీ రక్తంతో ఎరుపెక్కినా, 

భరతమాత రక్షణకై నీవు నిలబడే ఉంటావు.

ఎప్పటికీ వదలని గమ్యం, భారతమాత కీర్తి పతాకం 

చివరి శ్వాస వదిలే వరకు ముందడుగే నీ లక్ష్యం.




15/05/2025.

మనోహరీ మహిళా పత్రిక కొరకు,

అంశం : ఐచ్ఛికం.

శీర్షిక: భరత వీరుడు.

ప్రక్రియ : వచన కవిత.

రచన : శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహరాష్ట్ర.



హిమగిరుల శిఖరాల వెన్నంటి నిలిచి,

దేశపు కీర్తి పతాకాన్ని భుజాన మోసేవు.

మాతృభూమి పిలుపు నీ గుండె చప్పుడుగా,

ప్రతి అడుగులో ధైర్యం నింపుకు నడిచేవు, 


ఎండైనా, వానైనా, మంచు కురిసినా ,చలికి వణకినా,

సరిహద్దు కాపలా నీ కర్తవ్యంగా నిలిచేవు.

చావు బతుకుల సంఘర్షణకు లోనవక

నీ గుండె లయల శ్వాసలో తెగువ నింపావు.


దేశమే నీ ఇల్లు, ప్రజలే నీ బంధువులుగా.

బలిదానమే బాధ్యతగా చేబట్టేవు.

అన్న పానాలకు లోటైనా, ఐనవారికి దూరమైనా 

కన్నీటి ప్రేమను కర్తవ్య బాధ్యతగా ఔపోసన పట్టావు.


తుపాకీ నీ ఆయుధంగా, ధైర్యమే నీ బలంగా,

న్యాయం కోసం పోరాటం  సాగించేవు

శత్రువు కంట పడితే సింహంలా గర్జించి,

భారతమాత రక్షణే నీ లక్ష్యమని నిరూపించేవు.


గాయాలైనా లెక్కచేయవు, ప్రాణాలైనా అర్పిస్తావు,

దేశం కోసం చేసే  నీ త్యాగం అనంతం.

నీ త్యాగానికి వెలకట్టలేము. 

మీ బలిదానానికి రుణం తీర్చుకోలేము..


ఓ భారతీయ సైనికుడా, నీ ధైర్యానికి  అభినందనం.

ఎనలేని నీ త్యాగానికి  నిత్య నీరాజనాలతో వందనం.


హామీ :

ఈ కవిత నా సీయ రచన





శీర్షిక :- బంధాను బంధాలు.

16/05/2025.

మహతీ సాహితీ కవి సంగమం

అంశం , ఐచ్ఛికం 

శీర్షిక  :- బంధాను బంధాలు.

రచన : శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహరాష్ట్ర. (43).

కవిత సంఖ్య = 1.



ఒక్కరు తోడుంటే ,

ఒంటరివైన వేదన దూరమౌతుంది

మనసు పడే బాధను , 

మనసునన్న స్నేహం మరిపిస్తుంది

ప్రేమను పంచే హృదయముంటే, 

బంధం ఎంతో మధురమోతుంది !!


నమ్మకమనే పునాది ఉంటే, 

అనుబంధం శాశ్వతమౌతుంది.

కష్టంలో చేయూత నిచ్చే బంధం 

బంధుత్వాన్ని బలపరుస్తుంది !!


సంతోషం పాలు పంచుకోవాలంటే , 

స్నేహితులు తోడవ్వాలి.

అపార్థాల మేఘాలు కమ్మిన చోట

" క్షమ" అనే వెలుగు నింపాలి.


తెగిన బంధం తిరిగి కలవాలంటే, 

వీడని ప్రయత్నం చేయాలి .

గుండెకు గుండె తోడై నిలిస్తే, 

జీవితమే  స్వర్గమౌతుంది !!


మాటలు లేని మూగ  సంభాషణ, 

ప్రేమ బంధాలకు  మౌన సంకేతమవుతుంది

కాలం గడిచే కొద్దీ బంధాలు బలపడాలంటే 

ప్రేమానురాగాలు నిండే హృదయముండాలి !!


మానవత్వం మంట కలిసిపోకుండా ఉండాలంటే

మాటల్లో మంచితనం , చేతల్లో చేరువతనం ఉండాలి.

మానవ బంధాలెంతో గొప్పగా ఎదగాలంటే, 

మనిషికి మనిషి మీద నమ్మకం ఉండాలి.!!


మనుషిలా బతుకుతూనే మనీషి గా ఎదగాలి.

ఎదగాలంటే  ఒదగాలి.

ఒదిగి ఉండాలంటే  మానవ సంబంధాలకు 

నిజమైన అర్థం తెలుసుకోవాలి !!


-----------------------------

ఈ కవిత నా స్వీయ రచన.




శీర్షిక : శాంతి స్వప్నం -

శీర్షిక : శాంతి స్వప్నం - 


రచన : శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహరాష్ట్ర. 




తెల్ల కాగితంపై నల్లని సిరాతో సంతకం,

యుద్ధపు గాయాలపై  పూసే శాంతి లేపనం!

హస్తాలు కలిసినట్టు పైకి నటించే యత్నం.

మనసుల్లో  నిండే భగభగలు దాచే ప్రయత్నం.!!


గుండెల నిండా ద్వేషం దాచిన ఘనం .

పెదవులపై చిరునవ్వులు పూయించే వనం.

"సీజ్ ఫైర్" కేవలం ఒక ఓదార్పు  తాయిలం .

ఎన్నికల ముందు ఓట్ల వేటకు పనికొచ్చే సాధనం..!!


అంతర్జాతీయ ఒత్తిడి నిండిన ఫలితాల కలకలం,

సరిహద్దుల్లో నిరీక్షించే సైనికుల సహనానికి బలం.

భయంతో కొట్టుకుపోయే  తల్లుల గుండెల్లో ప్రభంజనం. 

కన్నీటి  జ్వాలలు ఎగదోసే  శోకాలకు ఇంధనం.!!


"సీజ్ ఫైర్"  నిజమైన శాంతి నీయని మాయా జాలం.

మళ్ళీ మొదలయ్యే యుద్ధానికి నాంది పలికే  నాటకం.

నాయకుల మనసుల్లో ఏముందో, తెలుసుకోలేరు జనం.

రక్తపు మరకల పూత , బాంబులు చేసే మోత 

వారికి, వినబడవు , కనబడవు అన్నది నిజం,,!!


 నాటకంలో తెర వెనుక నుండి, పన్నిన కుట్రల వేటలు

రాజకీయ రంగంలో శాంతి భాష్యాలు పలికే  పాత్రలకు బాటలు.

బాధితుల ఆర్తనాదాలు వినిపించనంత వరకు,

కేవలం తాత్కాలిక ఉపశమనం ఇచ్చేవి మాత్రమే

ఈ "సీజ్ ఫైర్" మాటలు. .!!


నిజమైన "శాంతి" రావాలంటే మనసులు కలవాలి,

రాజకీయ రచ్ఛలు తగ్గి, సామూహిక చర్చలు పెరగాలి.

కులమతాల జాడ్యాలు వదలాలి .మానవత్వం గెలవాలి .

చేయీ చేయీ కలవాలి , అడుగులో అడుగేసి నడవాలి.!!

--------------------------------------------

శీర్షిక : అసమానతల జీవిత పోరాటం.

శీర్షిక : అసమానతల జీవిత పోరాటం.

రచన : శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహరాష్ట్ర.




మనిషి ఎదురుగ, నిలిచిన కష్టాల కొండ,

గుండె నిండా ధైర్యం ఒక్కటే అతనికి అండ.

నేలపై తడబడి  కాలు జారినా, నిరంతరం

 నిలబడాలన్న తపన అతని అజెండా !!


సవాళ్ళ సుడిలో చిక్కుకున్నా గాని,

ఆశల దీపం మాత్రం ఆరని జ్వాల.

రేపటి వెలుగు కోసం చేసే నిరీక్షణలో

ప్రతి అడుగులోనూ ఒక పోరాట లీల !!


ఒంటరి పోరాటంలో కనబడని సమస్యలు. 

కన్నీటి చుక్కలే వాటికి దారి చూపే గువ్వలు.

పట్టుదల అనే బలమైన ఊతంతో,

జీవితపు నదిలో ఎదురీతల  కలకలలు .!!


ఓటమి అంచున నిలిచినా కానీ,

మళ్ళీ లేచే శక్తి అతని సొంతం.

కాలం చేసే గాయాలకు మందుగా,

నిబ్బరం నింపుకున్న ధీరత్వపు పంతం.!!


అసమానతల నీడలు కమ్మినా, అతనిలో

ఆత్మ విశ్వాసం వెలిగే కాంతి పుంజం.

ఈ పోరాటం ఒక అందమైన తలపైతే

మనిషిలోని ధైర్యానికి ఇది నిదర్శనం.!!


ప్రతి కష్టం ఒక మలుపు తిరిగే కథ,

ప్రతి పోరాటం ఒక కొత్త ఉదయమేకదా.

అసమానతల మధ్య సాగే ఈ ప్రయాణం,

మనిషిని బలవంతుడిని చేసే మహా యజ్ఞం.!!


------------------------------------

అంశం : అణుబాంబు: ఒక సామాజిక ఆర్తనాదాం.

అంశం : అణుబాంబు: 

శీర్షిక : ఒక సామాజిక ఆర్తనాదాం.


రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర. (38).

వచన కవిత : సంఖ్య.. 3 



ఎదలో రగిలే అగ్ని కీల,

మానవత్వపు గుండెకోతల జ్వాల.

అణుబాంబు, పేరులోనే ఒక శూన్యం,

భవిష్యత్తుకిది భయంకర సంకేతం.!!.


క్షణంలో  కాలాన్ని కరిగించి

వేల ప్రాణాల భస్మరాశిని పెంచి

భూమి గుండె బీటల్లో మిగిల్చి

మానవ బంధాల్లో చీలికలు నింపేది.!!


పట్టపగలే  చీకటి కమ్మినా,

ఆకాశం  ఎర్రగా మారినా

నిశ్శబ్దం నిక్కి నిక్కి దాగినా

వినిపిస్తున్న ఒక విషాద గీతం !!


పిల్లల నవ్వులు ఆవిరై,

తల్లుల కన్నీరు బూడిదై

ఆశలు సన్నగిల్లిన ఆక్రోశాలతో,

ఒక తరం అంతమైపోతోంది.!!


శక్తి పేరిట విధ్వంసపు ముళ్ళు

జ్ఞానం పేరిట అజ్ఞానపు రాళ్లు

అభివృద్ధి పేరిట వినాశనపు వేళ్లు,

 సృష్టికలో పాకుతున్న శాంతి లేని బీజాలు.!!


అణుబాంబు సృష్టించిన నరకం.

తరతరాలకీ మానని గాయాల కూపం.

గుండెల్లో రగిలే దుఃఖం,

ఆరని మంటల్లో చితులు నిండిన శాపం !!


శాంతిని కోరే హృదయాల వేదన

యుద్ధం వద్దు అన్న  ఆక్రోశాల ప్రార్థన

అణు విస్ఫోటనం ఆపాలన్న తపన

ఆర్తి నిండిన గొంతుల్లో ఉద్వేగపు నిరీక్షణ !!

అణుబాంబు కేవలం ఒక ఆయుధం కాదు,

మానవ సమాజానికి ఓ కనువిప్పు,

ఎవరి స్వార్థం కోసమూ దాగని నిజం,

శాంతి స్థాపనకై పోరాడాలి ఈ సమాజం.!!


అందరూ ఒక్కటై నిలబడి యోచించి

అహింసా మార్గాన్ని అనుసరించి,

అణుయుద్ధ భయాన్ని తొలగిద్దాం,

శాంతియుత ప్రపంచాన్ని నిర్మిద్దాం.!!


భవిష్యత్ తరాలకు బతుకు బాట వేద్దాం.

మన వారసత్వాలకు మానవత్వం నేర్పిద్దాం.

విశ్వ కళ్యాణం కోసం  విధ్వంసాల నాపేద్దాం

 అందరం ఒక్కటై ఆనంద గీతం పాడేద్దాం. !!. 

---------------------------------


ఈ కవిత,  నా స్వీయ రచన.





శీర్షిక : వెలుగు పూల తోట.(పాజిటివ్ థింకింగ్ .)

శీర్షిక  : వెలుగు పూల తోట.(పాజిటివ్ థింకింగ్ .)

రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర. 



మనసు వాకిట మెరిసే వెన్నెల కిరణం,

ప్రతి అణువులోనూ ఆశల నవగానం.

నైరాశ్యపు చీకటి కమ్మిన వేళలో,

అంతరంగంలో మెరిసే వెలుగు పూదోట.!!

(పాజిటివ్ థింకింగ్ .)


ఉదయ, సంధ్యా కిరణంలా,

ప్రతి ఆలోచనా నవజీవనం.

గతపు గాయాలెన్ని ఉన్నా,

రేపటి "పై చిరునవ్వుల "సంతకం.!!

(పాజిటివ్ థింకింగ్ .)


సంద్ర గర్భాన దాగిన ముత్యంలా,

సవాళ్ళ లోతుల చిరు నవ్వులు.

ఎగిసే కెరటాల కల్లోలంలో,

స్థైర్యపు తీరం చేర్చే నావ !!

(పాజిటివ్ థింకింగ్ .)



పూచే గులాబీ సువాసనలా,

ప్రతి శ్వాసలోనూ ప్రశాంతత.

ముళ్ళబాటలో నడుస్తున్నా,

మధురానుభూతిని పంచే వరం !!

(పాజిటివ్ థింకింగ్ .)


జీవితం ఒక అద్భుత చిత్రం.

ప్రతి అడుగూ ఒక నృత్యం,

సానుకూల దృక్పథంతో చూడు,

ప్రతి క్షణం ఒక మధుర గీతం.!!

-----------------------

ఈ కవిత నా స్వీయ రచన

శీర్షిక : ఆంతరంగిక ఘోష. (.అసలైన కవి)

శీర్షిక  : ఆంతరంగిక ఘోష. (.అసలైన కవి)

రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర. ( 38).


--------------------


అక్షరాల వేదికపై, ఆలోచనల స్ఫూర్తితో,

సత్య దీపాలు వెలిగించేవాడే కవి.

లోకానికి అద్దం పట్టే, నిజాలను

 నిర్భయంగా చాటి చెప్పేవాడే కవి.!!


కాగిత రణరంగంపై, కలాన్ని ఖడ్గంగా మార్చి,

అన్యాయంపై పోరాడే  అక్షర వీరుడే కవి.

కష్టాల కడలిలో, కన్నీటి అలలపై,

ఆశల తీరం చూపే నావికుడు కవి.!!


భయమన్నది లేక, పక్షపాతమన్నది ఎరుగక,

పలుకుబడికి తలొగ్గని ప్రవక్తే కవి.

మానవత్వం మంటగలిసినప్పుడు,

మనసున్న మనిషిలా మేల్కొనేవాడే కవి.!!


అంధకారం ఆవరించిన వేళ,

వెలుగు కిరణం చూపించే ధైర్యమే కవి.

నిజాన్ని నిగ్గదీసి, నిర్భయంగా నిలదీసి,

నిత్య సత్యాన్ని నిలబెట్టేవాడే కవి.!!


అక్షరాల ఆయుధాన్ని  ఝళిపిస్తూ

విభేధాలను సృష్టించే వారిని ప్రశ్నిస్తూ

మానవత్వానికి  మన్నననిస్తూ

మనుగడని ప్రశ్నించేవాడే కవి. !!.


నోళ్ళు మూగబోయిన చోట,

వారధిగా నిలిచే వాగ్ధాటి కవి.

అణగారిన గొంతులకి స్వరమై,

 పోరాడే అక్షర నినాదమే కవి.!!


భయం తెలియని

 భావనా సాగరం కవిత్వం,

పలుకుబడికి తలవంచని 

ప్రళయ ఘోష కవిత్వం.!!


నివురు గప్పిన నిజాలకు ,

అతని కవిత్వం ఒక కరదీపిక,

అది సమాజానికి  అవ్వాలి

దారి చూపే సరికొత్త మార్గదర్శిక.!!

-----------------------




Wednesday, May 21, 2025

శీర్షిక : ముల్లోక సంచారుడు.

19/05/2025.

(సోమవారం)

మహతీ సాహితీ కవి సంగమం

అంశం :  (చిత్ర కవిత. 105.)

వచన కవిత .

శీర్షిక : ముల్లోక సంచారుడు.


రచన , శ్రీమతి , పుల్లభట్ల జగదీశ్వరీమూర్తి . 

కళ్యాణ్ :  మహారాష్ట్ర.



ముల్లోక సంచారి ముని నారదుండు,

మదిని నిరంతర నారాయణ ధ్యానముండు.

లోక కళ్యాణమే అతని నిత్య జీవితము,

అందరిలో వెలుగు నింపు దివ్య తేజము.!!


ముల్లోకముల దారి ముని దివ్య తేజము,

పరికించ లోకముల పయనించు నిత్యము.

కలహ ప్రియుడంచు లోకులు వచియించిన

అంతరంగమున లోక  విలువలవనంతము !!


కయ్యాలు రేపేట్టు కనిపించు క్షణములో,

లోతైన అర్థమే   దాగియుండు నందులో

ఘర్షణలు  ఎన్నైన  శాంతి నిడు భువిలో

లోక కల్యాణమే,  లక్ష్య మాతని మదిలో.!!


అపార్థపు నీడలు కమ్మేటి మనసులకు,

కొత్త  ప్రణాళికల కోరు శాంతిని గూర్చు.

 మహతి మీటుచు నతడు మంచి చేసెడు వాడు

సందేహ చీకట్లు తొలగించు వాడు !!


కలహప్రియుడను పేర కలిగించు న్యాయము !!

నారదుని  చర్యలో నుండు పరమార్థము,

ముల్లోకముల మేలు కోరు మునిశ్రేష్ఠులు.

కేలుమోడ్చీ జేతు నే కోటి వందనములు


Tuesday, May 20, 2025

' పెళ్లి " గేయం.

20/05/2025.


తపస్వీ మనోహరం "e" book పత్రిక కొరకు ,

అంశం : పంచమ వేదం.

శీర్షిక : అమృత నాదం.

రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర.




అనాదిగా ప్రవహించే సనాతన ధర్మం,

వేదాల దివ్యనాదం, ఋషుల తపో ఫలం.

శ్రుతులు, స్మృతులు, ఇతిహాసాల మౌన గంభీరత,

మానవాళికి మోక్ష మార్గం చూపిన దివ్య తేజం.!!


ధర్మం, అర్థం, కామం, మోక్షం - నాలుగు తీరాల నది,

వేద నాదం ప్రతి తీరాన అమృత బిందువై ఒదిగింది.

 కాల గమనంలో మరుగున పడిన సత్యం .

పునరుద్ధరించగ వచ్చింది "పంచమ వేదం "!!


వ్యాసుని లేఖినిలో మహా భారతం పురుడు పోసుకోగా,

"భగవద్గీత సారం" విశ్వానికి వెలుగు పంచింది.

రామాయణ,భారత, భాగవతాది, పురాణాల పవిత్ర గానం,

"పంచమ వేదమై", లోకానికి నవ చైతన్యం తెచ్చింది.!!


పంచము వేదం , కేవలం శ్లోకాల సంపుటి కాదు,

ప్రతి హృదయంలో జ్వలించే జ్ఞాన దీపం.

కుల, మత, వర్గ భేదాలు లేని విశ్వ ప్రేమ స్వరూపం.

మానవత్వమే మహోన్నతమని చాటే శాంతి సందేశం.!!


భక్తి, జ్ఞానం, కర్మల - త్రివేణి సంగమం .

పురనేతిహాసాలిడు ఆత్మ సాక్షాత్కారాలకు గమ్యం.

ప్రతి జీవిలోనూ దైవత్వాన్ని దర్శించే దివ్య దృష్టి,

పంచమ వేదం నేర్పే నిత్య జీవన సత్యం.!!


అందుకే ఈ ధర్మం సనాతనం, సజీవం,

యుగయుగాలకూ మార్గదర్శనం.

అంధకారాన్ని చీల్చే జ్ఞాన భాస్కరం,

మానవాళికి నిత్య వసంతం, "పంచమ వేదం".!!



పంచమ వేదం

20/05/2025.


తపస్వీ మనోహరం "e" book పత్రిక కొరకు ,

అంశం : పంచమ వేదం.

శీర్షిక : అమృత నాదం.

రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర.




అనాదిగా ప్రవహించే సనాతన ధర్మం,

వేదాల దివ్యనాదం, ఋషుల తపో ఫలం.

శ్రుతులు, స్మృతులు, ఇతిహాసాల మౌన గంభీరత,

మానవాళికి మోక్ష మార్గం చూపిన దివ్య తేజం.!!


ధర్మం, అర్థం, కామం, మోక్షం - నాలుగు తీరాల నది,

వేద నాదం ప్రతి తీరాన అమృత బిందువై ఒదిగింది.

 కాల గమనంలో మరుగున పడిన సత్యం .

పునరుద్ధరించగ వచ్చింది "పంచమ వేదం "!!


వ్యాసుని లేఖినిలో మహా భారతం పురుడు పోసుకోగా,

"భగవద్గీత సారం" విశ్వానికి వెలుగు పంచింది.

రామాయణ,భారత, భాగవతాది, పురాణాల పవిత్ర గానం,

"పంచమ వేదమై", లోకానికి నవ చైతన్యం తెచ్చింది.!!


పంచము వేదం , కేవలం శ్లోకాల సంపుటి కాదు,

ప్రతి హృదయంలో జ్వలించే జ్ఞాన దీపం.

కుల, మత, వర్గ భేదాలు లేని విశ్వ ప్రేమ స్వరూపం.

మానవత్వమే మహోన్నతమని చాటే శాంతి సందేశం.!!


భక్తి, జ్ఞానం, కర్మల - త్రివేణి సంగమం .

పురనేతిహాసాలిడు ఆత్మ సాక్షాత్కారాలకు గమ్యం.

ప్రతి జీవిలోనూ దైవత్వాన్ని దర్శించే దివ్య దృష్టి,

పంచమ వేదం నేర్పే నిత్య జీవన సత్యం.!!


అందుకే ఈ ధర్మం సనాతనం, సజీవం,

యుగయుగాలకూ మార్గదర్శనం.

అంధకారాన్ని చీల్చే జ్ఞాన భాస్కరం,

మానవాళికి నిత్య వసంతం, "పంచమ వేదం".!!



Saturday, May 17, 2025

ప్రముఖ కళాకారిణి ( శాంత కుమారి) గురించి.

నేడు ప్రముఖ కళాకారిణి ( శాంత కుమారి). పాత సినిమాల హీరోయిన్... అసలు పేరు.
*వెల్లాల సుబ్బమ్మ* జయంతి 

ప్రఖ్యాత దర్శకుడు పి.పుల్లయ్య సతీమణి అయిన శాంతకుమారి 1936లో 'శశిరేఖాపరిణయం' సినిమాతో నటజీవితం ప్రారంభించి వందకు పైగా సినిమాల్లో నటిం చారు. 'కృష్ణప్రేమ, మాయాలోకం, ధర్మదేవత, తల్లా?పెళ్లామా?, 'అర్ధాంగి, జయభేరి, రాముడుభీముడు, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం, ప్రేమనగర్‌' తదితర చిత్రాల్లోని పాత్రల పోషణ ద్వారా నటిగా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. శాంతకుమారి పి.పుల్లయ్య దంపతులకు రాధ, పద్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

శాంతకుమారి అసలు పేరు : వెల్లాల సుబ్బమ్మ.
స్క్రీన్ నేమ్ : శాంతకుమారి - దర్శక-నిర్మాత పి.వి.దాసు గారు సుబ్బమ్మ కొంచెం 
పాతగా ఉందని పేరునుశాంతకుమారిగా మార్చారు.
పుట్టిన ఊరు : కడప జిల్లా ప్రొద్దుటూరు
పుట్టిన తేది : మే- 17, 1920 సంవత్సరంలో,
మరణించిన తేది : జనవరి -17 - 2006,
తండ్రీ పేరు : వెల్లాల శ్రీనివాసరావు గారికి జన్మించారు.
భర్త పేరు : ఫి.పుల్లయ్య - సినిమా దర్శక నిర్మాత ,
పిల్లలు : రాధ, పద్మ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

శ్రీనివాసరావు గారికి కళలు అంటే ఎంతో ఇష్టం. అందుకనే కూతురైన సుబ్బమ్మను మద్ర్రాసులో ఉన్న ప్రొ.పి.సాంబమూర్తి గారి వద్దకు కర్ణాటక సంగీతం మరియు వయొలిన్ నేర్చుకోవటానికి దరఖాస్తు చేయించారు. డి.కె.పట్టమాళ్ సుబ్బమ్మ యొక్క సహాధ్యాయిని. పదమూడేళ్ళ వయసులోనే సుబ్బమ్మ కర్ణాటక సంగీతంలోఉత్తీర్ణురాలయ్యిందిపదహైదేళ్ళ వయసులో వయొలిన్ లో ఉత్తీర్ణురాలైంది. తరువాత గురువుగారితో కలసి దక్షిణబారతదేశం అంతా ఎన్నో కచేరీలు చేసింది. పదహారేళ్ళ వయసులోనే విద్యోదయా స్కూలులో పిల్లలకు సంగీతంనేర్పించేది.

సుబ్బమ్మ కచేరి చూసిన దర్శక-నిర్మాత పి.వి.దాసు మాయాబజార్ (1936) లేదా శశిరేఖ పరిణయం సినిమాలో శశిరేఖపాత్రను ఇచ్చారు. కానీ సుబ్బమ్మ సినిమాలలో నటించటానికి ఆమె బామ్మ నిరాకరించడంతో, పి.వి.దాసు మరియు అతని మేకప్ మనిషైన మంగయ్య వప్పించడానికి ఎంతో ప్రయత్నించారు. సుబ్బమ్మను శశిరేఖ వేషంలో చూసిన ఆమె బామ్మ చివరకు ఆమె సినిమాలో నటించడానికి ఒప్పుకొంది. దాసుగారు సుబ్బమ్మ కొంచెం పాతగా ఉందని పేరును శాంతకుమారిగా మార్చారు. శాంతకుమారిగా మారిన నట-గాయక సంచలనం తరువాత సినిమా సారంగధర (1937). ఇందులో ఆమె చిత్రాంగి అనే దుష్టపాత్రను ఎంతో ఉత్సాహభరితంగా నటించింది. ఈ చిత్ర దర్శకుడైన పి.పుల్లయ్యగారిని ఇష్టపడి పెళ్ళిచేసుకొంది. పెళ్ళిచేసుకొన్న తరువాతకూడ ఆమె నట జీవితం సాఫీగా సాగిపోయింది.శాంత కుమారి సినిమా జీవితం మొదట్లో అన్నీ పురాణాలు ఇతివృత్తంగా ఉన్న సినిమాలలోనే నటించారు. యశోదగా కూడా నటించిన ఈమె కృష్ణుని ముద్దుచేస్తూ "చిరు చిరు నగవులు చిందే తండ్రి" అనే మధురమైన పాటను అద్భుతంగా పాడారు. శాంతకుమారికి మెదటి సాంఘిక చిత్రం ధర్మపత్ని. అందులో అక్కినేని నాగేశ్వరరావు విధ్యార్థిగా నటించారు. అక్కినేనికి శాంతకుమారికీ మధ్య ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉండేది. అక్కినేనిని ఆమె అప్యాయంగా చిన్న తమ్ముడిని పిలచినట్లు అబ్బి అనే వారు. మాయలోకం సినిమాలో అక్కినేనికి ప్రక్క కథానాయికగా నటించిన శాంతకుమారి, జయభేరి సినిమాలో వదినగా నటించారు, అర్థాంగి సినిమాలోనైతే సవతి తల్లిగా నటించారు. ఎన్.టీ.ఆర్ కు కూడా తల్లా పెళ్ళామా సినిమాలో బామ్మగా నటించారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రతారలైన ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, తమిళ సినీ ప్రముఖులు శివాజీ గణేశన్‌, జెమినీ గణేశన్‌ తదితరులకు చాలా చిత్రాల్లో శాంతకుమారి తల్లిగా నటించారు.పద్మశ్రీ పిక్చర్స్‌, రాగిణి పిక్చర్స్‌ పేరుతో సొంతంగా ఇరవైకి పైగా సినిమాలను నిర్మించారు. తాను హీరోయిన్గాప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలనే మళ్లీ తీసినపుడు తల్లి పాత్రల్లో నటించిన అరుదైన రికార్డు శాంతకుమారిసొంతం.

దయగన రావేల....కీర్తన

భోగి రాగం.( ఎవరి బోధన)
దయగన రావేల.

------------------------
దయగన రావేల దశరథే. ( రామ)
;నినువిన దిక్కెవరు. బ్రోవగరావే !!

చయములౌ నీ నామ మహిమలె, ప్రాపు.
జయములు నీ పాద సేవలు మాకు!!

భయములు బాపే వరదుడవీవే
అనయము నీ స్మరణే అభయము గాదే
ఈ గతి ననువీడ . నీకిది మేలా
నా గతి గని బ్రోవ సరగున రావేల !!

 పంతమదేలా
సారసదళనయన సద్గుణ గాత్ర ( నామా)
ముని జన సేవిత ఘన కపి మిత్ర..(ఘన బల భీమా)
భవబంధముల బాపు భాగ్య విధాత
భారమా ననుబ్రోవ భక్తార్తి నాశ !!
----------------------------

Tuesday, May 6, 2025

అంజయ్య గౌడ్

సంబోధన (ప్రథమా విభక్తి)
ఉ..
దండము వాయుపుత్ర!రిపు దండన భక్త విధేయ ధీమణీ!
కొండలరాయ దైత్యహర !కుండల భూషణ!వానరేశ్వరా! చండ పరాక్రమా!విబుధ సన్నుత!
యక్షయ దానవాంతకా!
భండన భీమ!సర్వజన  బాంధవ! బ్రోవగరావెమారుతీ!

    కళిక (వృషభ గతి)
పవన తనయా పాపహరణా!భవ వినాశక భక్త పాలన!
దివిజ వందిత కోటి భాస్కర దివ్య శోభిత గాన మోహన!
కనక రత్న కిరీట ధారణ కాంతి మంతుడ పరమ పావన!
వినుత సద్గుణ వేదవేద్యా! వీరవర్యా విమల శోభన!
భావి బ్రహ్మవు వీరహనుమా!
భయ నివారణ పాప సంహర!
కావరా కరుణాంతరంగా!గందమాదన గిరి విహారా!
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ!దోష రహితా యాంజనేయా!
యష్ట సిద్ధుల కాది దేవుడ!
యభయమిడి కాపాడ రావయ!

 ఉత్కళిక ( హరిణగతి)

దివ్యగాత్రా! దీన పోషా!
భవ్య చరితా!వరకపీశా!
యంజనీసుత! యద్రి ధీరా!
యంజలించెద భక్తి మీరా!
రామదాసా రణవిశారద!
భీమ సోదర విశ్వ వరదా!
సూర్య మిత్రా! సూక్ష్మ రూపా 
కార్య సాధన!ఘన ప్రతాపా!

 సార్వ విభక్తికము
శా..
నీవే తోడు, గదయ్య నాకు నెదలో,నిన్ నమ్మితిన్ భక్తిచే!
రావే నీకయి,వేచి చూచెద నయా! రారమ్మి యో పావనీ!
నీవల్లన్ సుఖశాంతులబ్బు భువికిన్ నీయందు నాధ్యానమున్ 
దేవా!మారుతి యాంజనేయ!
హనుమా!తేజోమయా బ్రోవరా!!

 అంకితాంకము 
ఉ..
ఛందపు బంధనంబులను సంధుల సంగతులన్ గణించకే
యందముగా నుదాహరణ మన్ గృతి నొక్కటి వ్రాసి నీ పదం
బందున నుంచి మ్రొక్కితిని నంకిత మీయగ నెంచి యంజనీ 
నందన! "బండకాడి"యను నామక వంశ్యపు "అంజయాఖ్యుడన్"

అంజయ్య గౌడ్ గారి రచన.

సంబోధన (ప్రథమా విభక్తి)
ఉ..
దండము వాయుపుత్ర!రిపు దండన భక్త విధేయ ధీమణీ!
కొండలరాయ దైత్యహర !కుండల భూషణ!వానరేశ్వరా! చండ పరాక్రమా!విబుధ సన్నుత!
యక్షయ దానవాంతకా!
భండన భీమ!సర్వజన  బాంధవ! బ్రోవగరావెమారుతీ!

    కళిక (వృషభ గతి)
పవన తనయా పాపహరణా!భవ వినాశక భక్త పాలన!
దివిజ వందిత కోటి భాస్కర దివ్య శోభిత గాన మోహన!
కనక రత్న కిరీట ధారణ కాంతి మంతుడ పరమ పావన!
వినుత సద్గుణ వేదవేద్యా! వీరవర్యా విమల శోభన!
భావి బ్రహ్మవు వీరహనుమా!
భయ నివారణ పాప సంహర!
కావరా కరుణాంతరంగా!గందమాదన గిరి విహారా!
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ!దోష రహితా యాంజనేయా!
యష్ట సిద్ధుల కాది దేవుడ!
యభయమిడి కాపాడ రావయ!

 ఉత్కళిక ( హరిణగతి)

దివ్యగాత్రా! దీన పోషా!
భవ్య చరితా!వరకపీశా!
యంజనీసుత! యద్రి ధీరా!
యంజలించెద భక్తి మీరా!
రామదాసా రణవిశారద!
భీమ సోదర విశ్వ వరదా!
సూర్య మిత్రా! సూక్ష్మ రూపా 
కార్య సాధన!ఘన ప్రతాపా!

 సార్వ విభక్తికము
శా..
నీవే తోడు, గదయ్య నాకు నెదలో,నిన్ నమ్మితిన్ భక్తిచే!
రావే నీకయి,వేచి చూచెద నయా! రారమ్మి యో పావనీ!
నీవల్లన్ సుఖశాంతులబ్బు భువికిన్ నీయందు నాధ్యానమున్ 
దేవా!మారుతి యాంజనేయ!
హనుమా!తేజోమయా బ్రోవరా!!

 అంకితాంకము 
ఉ..
ఛందపు బంధనంబులను సంధుల సంగతులన్ గణించకే
యందముగా నుదాహరణ మన్ గృతి నొక్కటి వ్రాసి నీ పదం
బందున నుంచి మ్రొక్కితిని నంకిత మీయగ నెంచి యంజనీ 
నందన! "బండకాడి"యను నామక వంశ్యపు "అంజయాఖ్యుడన్"

Tuesday, April 15, 2025

అంశం: జాతర : గేయం.

15/04/2025.
మహతీ సాహితీ కవి సంగమం -
ప్రతిరోజు కవితా పండగే...

అంశం:  జాతర : గేయం.
శీర్షిక : సాంప్రదాయ పండుగలు.
రచన ,శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .(43).
కవిత సంఖ్య..1.

---------------------

గిరగిర తిరిగే రంగుల రాట్నాలు
సందడి నిండిన జాతర  హోరులు
పెద్దల మదిలో భక్తి  భావాలు
చిన్నారి  పాపలు చిందేటి నవ్వులు !!

అంగడి నిండిన బొమ్మల కొలువులు
గాజుల గలగల నిండిన భామలు
పట్టు పావడల రేపరెపల కళలు
కన్నెల పదముల మ్రోగేటి మువ్వలు!!

చల్లని పానీయాలు పంచేటి దాతలు
అరిసెలు, బూరెలు అమ్మేటి బామ్మలు
బజ్జీల ఘుమఘమ నిండిన వీధులు
నోరులు ఊరించు తీయని అమ్మకాలు !!

కోలాటకాటలు , చప్పుళ్ళు, తాళాలు
ఇంపైన భజనలు ,. భక్తి పాటలు 
నాగస్వరాల నాడే పాములు
భక్తిశ్రద్ధలతో   కొలువుల పూజలు !!

గుడిలో దేవుని దర్శన భాగ్యం
నమ్మిన జేజికి బోనాల భోగం.
మ్రొక్కులు, ముడుపుల జన సందోహం.!
తీర్థ ప్రసాదాలనందే యోగం.!!

పల్లెలు నిండిన ,సరి సాంప్రదాయాలు. 
జనాల మోమున వెలిగే కాంతులు.
జాతర నిండిన ఆనంద దీపాలు
కొలువూరు దీరిన దేవ- దేవుళ్లు !!

జాతర, సందళ్లు  జయమైన కోర్కెలు
గుండెలు నిండిన  అతి మధుర స్మృతులు
దేవుని మహిమల  కీర్తులే పాటలు
ఏటేటి జాతర కెదురెదురు చూపులు !!
----------------------------

ఈ గేయం నా స్వీయ రచన.

Monday, April 14, 2025

తత్త్వ బోధ కీర్తన (..సేకరణ.).

తత్త్వ బోధ కీర్తన .

శివ శివా శివ శివా శివ శివ శివ యనరా
హర హారా హర హారా హర హారహర యనరా

శివ శివ యని అనగా శమియించును పాపములు 
హరి నామము  తలచినంత  అందునులే అభయములు ॥

ముాడు లోకాలవే  ముక్కంటిలో లయము
లోకుల కర్మల ఫలముకు కర్త ఆ శ్రీహరీ 
ఆ సుాత్ర ధారులా తోలు బొమ్మ లాటలో 
బొమ్మలముా మనముా ఆడేము మనుముా ॥

సృష్టి కర్త బ్రహ్మకుాడ మార్చలేని రాతలు- వి
ధాత రాయు రాతలే విశ్వమందు చరితలు..
బుద్ధి జ్ఞాన కర్మలుా ఘనమౌ యొాగంబులు- ఆ
 తత్త్వ  మెరిగి మసలుటలే జన్మ మొాక్ష ఫలములు ॥

తత్త్వ మెరుగు బుద్ధి జీవి తనకు తానె మిత్రుడు
 జ్ఞాని గాని నరుడు తనకు తానె శతృవు.
 పాప కర్మునాత్మ తిరిగి జన్మనొందు తథ్యము
 పుణ్యాత్ముల ఆత్మ జేరు తుదికి వైకుంఠము ॥
 
 తెలిసీ తెలిక జేసిన పాపము శిక్షార్హము.
ధర్మ బాట నడవు మదే ముక్తికి సోపానము .
జీవులంత ఒక్కటన్న భావమదే సత్యము
జీవాత్మయె పరమాత్మగ తలచ నదే తత్త్వము ॥

శివ శివ శివ శివ శివ శివ శివ శివ యనరాదా 
ఆ శివ తత్త్వ ము నెరిగీ ఇలలో మనరాదా..
హర హర హర హర హర హర హర హరాయనీ అనరా
ఆది నారాయణుని ఆత్మ నందె  తలవరా ॥

Wednesday, April 9, 2025

శీర్షిక : నా దేశం ..

09/04/2025.


శీర్షిక : నా దేశం .

రచన :  శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహరాష్ట్ర .




భారతీయ కావ్యమా , భాషా సౌందర్యమా

భరత  దేశ కావ్యమా దివ్యమైన తేజమా !!


కోటి ద్యుతుల కలయికలా, కొల్లలైన. జాతులు

కట్టు బొట్టు తీరులు కనగ వలయు భాషలు

ధర్మ , కర్మ బాటలు సాంప్రదాయ కోటలు

గుండె  లయల పాటకు, పల్లవైన చరితలు !!


గర్వించే హిమాలయాల మెరయు  మేటి శిఖరాలు ,

 గంగా యమునా, సరస్వతీ , పవిత్రత, సింధు ఘోషలు

పచ్చని చేలిడు నవ్వులు, బంగారు పంటల మెరుపులు

ఎడారి శ్శబ్ద గానాలు ,  గుబురు నిండు యడవులు !!


నెమలి చేయు నాట్యాలు, కోయిలమ్మ పాటలు , 

ప్రకృతి ఒడిని  సౌందర్యం, ప్రతి దృశ్యమొక కావ్యం.

వేద జ్ఞాన వెలుగులు, ఉపనిషత్తు  బోధలు

శాంతి  నిండు వచనాలు,  అహింస  శాంతి మార్గాలు !!


 శిల్ప కళల శోభలు  యనంత వేల నిధులు

సంగీత నాట్య స్వర జతులు, సాహితీ సుగంధాలు 

 వీర సుతుల త్యాగాలు, స్వాతంత్ర్య భరత గాథలు

భిన్నత్వంలో ఏకత్వం , నీ సహనానికి సాక్ష్యాలు !!


ప్రతి శ్వాసలో సంస్కృతి.  మట్టి రేణువున ప్రగతి

తరతరాల వారసత్వమేలు  తరగని విఖ్యాతి

మా తల్లివి నీవు, మా నేలవు  నీవు, 

మా భవితవు నీవే మా జీవము నీవే ...!!


నీ చల్లని చూపులే,  ధైర్య మిడెడు ప్రతి గెలుపు

నీ చల్లని ఒడిలో సమత మమతలే నిలుపు

  నేడు మరచిపో నీయకు  నిన్నటి  నీ వైభవం , 

నీ కీర్తిని నిలుపుటకై. అహర్నిశలాత్మార్పణం!!

------------------------------------






Tuesday, April 1, 2025

శీర్షిక: కళ్యాణ రాముడు.

మహతీ సాహితీ కవిసంగమం.

*ప్రతిరోజూ కవితా పండుగే*

అంశం:చిత్రకవిత

కవితాసంఖ్య: 1

31/ 03/ 2025 .  ( సోమవారం)

శీర్షిక: కళ్యాణ రాముడు.

శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర . 43.

ప్రక్రియ: వచన కవిత. 

------------------


నింగి నిండా భానుడి ప్రతాపం,

నేలంతా సీతారాముల కళ్యాణ మేళం..

వేద మంత్రాల ధ్వనులతో నిండిన ఆకాశం,

దేవతలు చల్లే పుష్పాలతో భువి నిండిన సుగంధం !!

 

సీతా , రాముల నుదుట మెరిసే బాసికం .

అగ్ని సాక్షిగా ఏకమైన వారికి తోడైన తారాబలం.

భక్తుల హృదయాలలో వెలిగించిన ఆనంద దీపం.

సూర్యుని వేడిమి కూడా కరిగి ,

 చల్లని అనుభూతిగా  మారిన  క్షణం.!!,


 కళ్యాణ ఘట్టంలో నిండిన మన  దివ్య సంస్కృతి.

చరిత కెక్కిన సీతారాముల ఘనమైన దివ్య కీర్తి .

మంగళ వాయిద్యాల మధ్య  నాదలోలుల ఆనంద గీతి.

మన సభ్యత , సంస్కరాలకు పట్టిన నిండైన ఆరతి.!!.


సీతారాముల కళ్యాణ గాధ, సుగంధ పరిమళ పూదోట.

కుటుంబ విలువలు పెంచే బంధాలకు బాట.

తల్లి,తండ్రుల మాటలకు విలువిచ్చిన పుత్రుని కధ.

రామరాజ్యాన్ని భువిలో నిలిపిన వేద-వేద్యుడతడట.!!


అన్నదమ్ముల ఆదర్శానికి ప్రతీక అన్నది నిజం.

ఆలు,మగల అన్యోన్యానికి ఆతడే నిదర్శనం.

గుణగణాలకు తగిన అందమైన రూపం. 

ఆతని తలపే భక్తుల మదిలో ఆనంద దీపం. !!

-----------------------------------

ఈ కవిత నా స్వీయ  రచన.






Wednesday, March 26, 2025

అంశం : *కోతి* (గేయం)

*మహతీ సాహితీ కవిసంగమం*

*ప్రతిరోజూ పండుగే*

తేదీ : *11-03-2025. (మంగళవారం).

అంశం : *కోతి* (గేయం)

శీర్షిక : మానవ జాతికి తరాల తాతిది. 

రచన : శ్రీమతి, పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్  : మహారాష్ట్ర .




 అందని కొమ్మల నూగిసలాడుచు

ఆటల ,వేటల  నలరెడు కోతిది

 చిలిపి చేతలతో చిందులు వేస్తూ 

చెడుగుడులాడే చలాకి కోతిది  !!


 కొమ్మల నెగురుచు , రెమ్మల తుంపుచు

ప్రకృతి అందము నాస్వాదించుచు

నల్లని కళ్ళతో, నటు నిటు చూచుచు 

 కిచకిచ నవ్వుల చెలగెడు కోతిది ,!!


తోకను ఊపుచు,  తోటి చెలులతో

పండ్లను కొరికి ,   పట్టి విసరుచూ

పరాచకాలతో పరుగులు పెడుతూ 

అల్లరి చేసే చిల్లర కోతిది !!


తెలివికి పెద్దది , చేతల దొడ్డది

పెంకితనానికి  పెడసరి బిడ్డది

 ఆటల పాటల ఆనందిస్తూ 

అలసట నెరుగని అల్లరి కోతిది !!


మనిషిని పోలిన మనసున్న జాతిది.

కిచ కిచ అరుపుల కిలాడి కోతది.

బుద్ధి బలానికి పెట్టని కోటది .

మానవ జాతికి మునుపటి తాతిది. !!


దేవుని రాముని కొలచిన కోతది. 

సంద్రము దాటిన సాహస కోతిది

సీతమ్మ జాడను తెలిపిన కోతిది.

లంకను గాల్చిన లడాయి కోతిది !!


వారధి కట్టిన వానర జాతిది. 

రావణు చావుకు కారణమైనది

సీతారాముల కలయిక సాక్షిది. 

నమ్మిక భక్తిని చాటిన కోతిది. !!


-------------------------

ఈ గేయం నా స్వీయ రచన.




Saturday, March 22, 2025

అంశం : అనువాద కవిత్వము..అనువాదం కబీర్ దాసు దోహ..

మహతీ సాహితీ కవిసంగమం.

*ప్రతిరోజూ కవితా పండుగే*

 

అంశం: ఐచ్ఛికం 

కవితాసంఖ్య: 1.

తేది: 22-3-25  శనివారం .

అంశం :  అనువాద కవిత్వము.

అనువాదం కబీర్ దాసు దోహ..


అనువాదము : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

 కల్యాణ్. మహారాష్ట్ర .(43.).


కబీర్ దాసు గురించి..


15వ శతాబ్దానికి చెందిన భారతీయ ఆధ్యాత్మిక కవి, తాత్వికుడు, మరియు సంఘ సంస్కర్త. ఐన

  కబీర్ దాస్ 1440 సంవత్సరంలో వారణాసి లో జన్మించారు.

  ఆయన ముస్లిం ."నేత కార్మికుల"  కుటుంబంలో పెరిగారు.

  ఆధ్యాత్మిక గురువు , "రామానందుని" శిష్యునిగా ప్రసిద్ధి చెందిన కబీర్ దాసు , హిందూ, ముస్లిం మతాలలోని మంచి అంశాలను స్వీకరించి ఒక నూతన ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించారు.

  కబీర్ దాస్ రచనలు "బీజక్" అనే గ్రంథంలో సంకలనం చేయబడ్డాయి.

రెండు పంక్తులలో రాయబడ్డ  ఆయన," దోహాలు" మరియు "పదాలు " వంటివి   చాలా ప్రాచుర్యం పొందాయి.

  తాత్విక దృక్పథం గల "కబీర్ దాస్" మత సామరస్యాన్ని బోధిస్తూ

 దేవుడు ఒక్కడేనని, మతాలన్నీ భిన్నమైన మార్గాలని విశ్వసిస్తూ, దేవుడు మనలోనే ఉన్నాడని, ఆయన్ని వెతకడానికి గుడులు, మసీదులు తిరగవలసిన అవసరం లేదని బోధించారు.ఆయన కుల వ్యవస్థను, మతపరమైన ఆచారాలను తీవ్రంగా విమర్శించారు.

 ఆయన రచనలు భారతీయ సాహిత్యంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడతాయి.

 

కబీర్ దాస్.దోహా :

   "బురా జో దేఖన్ మైం చలా, బురా నా మిలియా కోయ్,

  జో దిల్ ఖోజా ఆపనా, ముఝసే బురా నా కోయ్."

 అనువాదం:

  "చెడు చూడటానికి నేను వెళ్లాను, చెడ్డవాడు ఎవరూ కనిపించలేదు .

  నా మనస్సును నేను వెతుక్కుంటే, నాకంటే చెడ్డవాడు ఎవరూ నాకు కనిపించ లేదు.

 భావం:

  ఈ దోహాలో కబీర్ దాస్ స్వీయ పరిశీలనా ప్రాముఖ్యతను వివరించారు. "ఇతరులలోని చెడును వెతకడం కంటే, మనలోని లోపాలను సరిదిద్దుకోవడం ముఖ్యం "

అన్న భావాన్ని ఈ పద్యంలో ఆయన వ్యక్తపరిచారు .

-----------------------------------------


Saturday, March 8, 2025

పట్టుదలతో చదివి జడ్జి అయిన గిరిజన బాలిక

*_🙏జడ్జ్ శ్రీపతి మేడంకు శుభాకాంక్షలు🙏_*
***************************
*టీనేజ్ అమ్మాయికి నల్లకోటు వేసినట్టు ఉన్న ఈ అమాయకపు అమ్మాయిని తదేకంగా మళ్ళీ మళ్ళీ చూడండి. ఈమె పేరు శ్రీపతి... చెన్నై నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నామలై దగ్గర జువ్వాది పర్వతశ్రేణుల మధ్య ఉన్న గిరిజన గూడెం వాళ్ళది. తండ్రి కాళిదాస్, తల్లి మల్లిక. కొండప్రాంతంలో పోడు వ్యవసాయం చేసేవాళ్ళు... శ్రీపతి కి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు.*

   *పిల్లల చదువుకోసం ఆ కుటుంబం దగ్గరలోని 'అత్నావర్' అనే పల్లెకు వలస వచ్చింది. ఇక్కడా ప్రధానంగా పోడు వ్యవసాయమే... అయినా పిల్లలు చదువుకోడానికి మంచి స్కూల్ ఉందని సంతోషించారు. కాళిదాస్ టూరిస్ట్ ప్రదేశాల్లో హౌజ్ కీపింగ్ లాంటి పనులకు కుదురుకున్నాడు.*

*వాళ్ళది 'మలయలి' అనే అత్యంత వెనుకబడిన గిరిజన తెగ... ఆ తెగలో అమ్మాయిలను చదివించడం, బయటకు పంపడం పట్ల అనేక ఆంక్షలు ఉంటాయి. కాళిదాస్, మల్లిక దంపతులు వీటిని ఏమీ పట్టించుకోలేదు. శ్రీపతి చదువులో మెరుగుగా రాణిస్తూ.. అందరికంటే ముందు ఉండడం, ఉన్నత చదువులు చదువుతాను అని పట్టుబట్టడంతో ఆమెను తిరువణ్ణామలైలో "లా" కోర్సు చదివించారు.*

*బంధువుల ఒత్తిడి కారణంగా శ్రీపతికి వెంకట్రామన్ అనే యువకుడితో వివాహం జరిపించారు. పెళ్ళైనా శ్రీపతి చదువు మాత్రం ఆపలేదు. _"Dr. అంబేడ్కర్ లా విశ్వవిద్యాలయం"_ లో పీజీ చేసింది. వెంటనే జూనియర్ సివిల్ జడ్జ్ పరీక్షకు అప్లై చేసింది. అయితే పరీక్షకు అప్లై చేసేనాటికే తాను గర్భవతిని అని తెలిసింది. సరిగ్గా పరీక్ష తన డెలివరీ ఒకేసారి అయ్యేలాగా ఉందని ఆందోళన చెందింది. అయితే తల్లిదండ్రులు, తన ఫేవరెట్ టీచర్ మహాలక్ష్మి , భర్త వెంకట్రామన్ ధైర్యం చెప్పారు. చదువుకోవడం పట్ల దృష్టి పెట్టు అంతా మంచే జరుగుతుందని సర్ది చెప్పారు.*

*శ్రీపతి తదేక దీక్షతో పరీక్షలకోసం పట్టుదలగా చదివింది. తల్లి మల్లిక అనుక్షణం శ్రీపతి ని  కనిపెట్టుకుని ఉంది. పరీక్ష రాయాల్సిన డేట్ వచ్చేసింది. డెలివరీకి వెళ్ళేముందు కూడా పుస్తకాలు చదవడం వదలలేదు శ్రీపతి.*

   *నవంబర్  27 న శ్రీపతి చక్కటి పాపకు జన్మనిచ్చింది. నవంబర్ 29 న పరీక్ష. రెండ్రోజుల బాలింత. పరీక్ష రాయల్సిన చోటు.. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నైలో... అయినాసరే పరీక్ష రాస్తానని పట్టుబట్టింది. డాక్టర్లు వారించినా వినలేదు. తన శ్రమ వృధా కాకూడదని వేడుకుంది. తల్లిదండ్రులు భర్త సహకారంతో పసిగుడ్డుతో ప్రయాణం చేసి పరీక్ష వ్రాసింది. సెలెక్ట్ అయ్యింది. TNPSCలో ఇంటర్వ్యూ కు అటెండ్ అయ్యింది. మొన్ననే... ఫిబ్రవరి 15, 2024 నాడు జూనియర్ సివిల్ జడ్జ్ గా, _"మొట్టమొదటి గిరిజన మహిళగా"_ అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంది...*

      *అకుంఠిత దీక్షతో, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా తట్టుకొని చదివి , విజయాన్ని అందుకున్న _"ఈ బంగారు తల్లి శ్రీపతి విజయగాథ"_ ఆమెలాంటి వందల మందికి ఆదర్శం కావాలి.*

*మరో సారి  జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీపతి మేడం కు శుభాకాంక్షలు... తెలుపుదాం🌹🌹👏👏👏*
-----------------------ఈమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోండి.. మరింత మందికి షేర్ చేయండి:
వెలిశెట్టి నారాయణరావు, 
విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు, 
ఆత్మకూరు పట్టణం, 
నెల్లూరు జిల్లా

Thursday, February 27, 2025

శీర్షిక : సాఫ్ట్ వేర్ జీవితం :

శీర్షిక : సాఫ్ట్ వేర్   జీవితం :

రచన :  శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.


జీవితమొక కోడ్, ప్రతి ఉదయం కొత్త లైన్,

సుఖదుఃఖాల బగ్స్ సరిచేస్తూ,

 సాగాలి మన ప్రయాణం.

జ్ఞాపకాల డేటాబేస్, అనుభవాల అల్గోరిథమ్,

ప్రేమ, స్నేహాలు వైరస్ లేని యాంటీవైరస్ సిస్టమ్స్.

పుట్టుక ఒక ఇన్స్టాలేషన్, బాల్యంలో అప్డేట్స్,

యువ్వనం ఒక డిజైన్, వృద్ధాప్యం డీబగ్స్.

ఆశలన్నీ ఫీచర్స్, కలలన్నీ అప్లికేషన్స్,

విజయం ఒక లాగిన్, ఓటమి లాగౌట్.

సాఫ్ట్‌వేర్  లాగే జీవితంలో.  ఎన్నో వెర్షన్స్,

మార్పులే అప్ గ్రేడ్స్, అనుభవాలే ప్యాచ్‌లు.

నిరాశ ఒక ఎర్రర్, ఆశ ఒక రీస్టార్ట్,

ప్రతి క్షణం ఒక ప్రోగ్రామ్,

 నడుపుతూ సాగాలి మన హార్ట్.

కోపం ఒక పాస్‌వర్డ్,

 ప్రేమ ఒక యూజర్ నేమ్,

నమ్మకం ఒక ఫైర్‌వాల్, 

ద్రోహం ఒక హ్యాకింగ్ గేమ్.

జీవితమనే సాఫ్ట్‌వేర్, ఎప్పటికీ 

అప్‌డేట్ అవుతూనే ఉంటుంది,

ప్రతి మనిషి తన జీవితాన్ని 

తానే రాసుకోగలిగే ఒక 

సాఫ్ట్ వేర్ డవలపర్. !!

------------------------------

శీర్షిక: అందమైన అనుభవం.

27/2/2025.



మహతీ సాహితీ కవి సంగమం ,

మరియు ఆర్ట్ పౌండేషన్ వారు -

సంయుక్తంగా నిర్వహించే సంకలనం కొరకు ,


అంశం : ఐచ్ఛికం.

శీర్షిక: అందమైన అనుభవం.

------------------------


తూర్పు దిక్కున ఎర్రని కిరణాలు,

మెల్లగా చీకటిని తరిమికొడుతూ,

కొండలు నిండిన బంగారు కాంతి భరణాలు

ప్రకృతి మాతకు స్వాగతం పలుకుతూ.

పక్షులు చేసే రెక్కల చప్పుడు కళలు

గుండె లయలను పూరించే నిండు  నినాదాలు

పురి విప్పిన నెమలి భంగిమలు

నాట్య వినోదపు  నయనానందాలు

చెట్ల ఆకుల నుండి , జారే మంచు బిందువులు.

మనసు కలతలను  మరపించే మధువులు

పచ్చని చెట్ల  కదలికల నీడలో...

గాలి అల్లరి కి రాలే పండుటాకుల గలగలలు

సీతాకోక చిలుకలు ఎగిరే దారుల్లో,

ఇంద్రధనస్సుల  రంగుల తళుకులు

విరిసిన పువ్వుల వెచ్చని పుప్పడిలో

ఎగిరే మధుపాల సవ్వడి కులుకులు

మధురమైన గాలి వీచిలో 

విరిసిన పూవుల గంధపు  మలుపులు.

పక్షుల కిలకిలారావాల లో

స రి గ మ సందడుల  సరాగాలాపనలు

తడి మట్టి ఒడిలో పరిచిన  పచ్చతివాచీలు

మనసును మరిపించే ప్రకృతి ఆహ్వానాలు.

నల్లని ఆకాశంలో వెలిగే నక్షత్రాలు,


రాత్రి నిశ్శబ్దంలో , మధురానుభూతుల

చెలి వలపుల తీయని తలపులు .

ప్రతి ఉదయం ఒక కొత్త ఆరంభం,

ప్రతి క్షణం ఒక అందమైన అనుభవం.!!


------------------------------


హామీ  :

ఇది నా  స్వీయ కవిత.

గతం లో ఎక్కడా ప్రచురించబడలేదు


రచన: శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.

కళ్యాణ్ : మహారాష్ట్ర

ఫోన్ నెంబర్ : 8096722021.

-----------------------------

మహిమాన్విత రమణీయ క్షేత్రం వేములవాడ

మహిమాన్విత రమణీయ క్షేత్రం వేములవాడ

~~~~~~~~~~~~~~~~
డా. బండారి సుజాత
   ~~~~~~~~~~~      

భారతదేశంలో సుప్రసిద్ధమైన శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లంగములు ,అష్టాదశ శక్తిపీఠములు , పృథ్వి , జల , వాయు ,ఆకాశ, తేజ లింగంలో ముఖ్యమైనవి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ స్థానం శ్రీశైల మహా క్షేత్రంది .ఇది కృష్ణానది దక్షిణ తటాకమునందున్నది. త్రిలింగక్షేత్రముగా పేరుగాంచిన కాళేశ్వరము, శ్రీశైలము , ద్రాక్షారామం తో పాటు అమరావతి,క్షీరారామం వంటి పంచారామములు ,మహానంది కాళహస్తి ,త్రికూటాద్రి ,కొలనుపాక, పానగల్లు ,ఉమామహేశ్వరం, ఆలంపురం ,సిద్ధవటము, పుష్పగిరి ,ఏలేశ్వరం, లేపాక్షి,
ముఖ లింగముల వంటి వందల కొద్ది శివ క్షేత్రములు అతి పవిత్రమైనవి ,ప్రాచీనమైనవి.

తెలంగాణలో ఆలయం లేని గ్రామం కనిపించదు. ప్రతి గ్రామం లో శివాలయము, ఆంజనేయ స్వామి ఆలయములుండును.

 వేములవాడ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలానికి చెందినది .2016 అక్టోబర్ 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణములలో ఈ నగరం కరీంనగర్ జిల్లా నుండి వేరు చేయబడినది.

తెలంగాణలో వేములవాడ గొప్ప శైవ క్షేత్రం .కాలేశ్వరం ద్రాక్షారామము, శ్రీశైలం ,శివ క్షేత్రాలతో త్రిలింగదేశంగా పేరుగాంచింది .

వేములవాడ తెలంగాణలో గల కోటిలింగాల దక్షిణ భారతదేశంలో రెండువేలఐదువందల సంవత్సరాలకు పూర్వమే తొలి రాజధాని నగరంగా వెలుగొందింది. అలాగే దక్కన్ లోని ఉత్తర తెలంగాణలో పదమూడువందల  సంవత్సరాలకు పూర్వమే గొప్ప రాజధానిగా వెలుగొందిన పట్టణం వేములవాడ.


కరీంనగర్ కుపడమర
35 కిలోమీటర్ల దూరంలో మూల వాగు ఒడ్డున వెలసిన గ్రామం వేములవాడ .ఈ మూల వాగు మానేరు నదిలో కలుస్తుంది.


క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలోని అశ్మక రాజుల ఏలుబడిలో ఉన్నదని, శాతవాహనుల తర్వాత  విష్ణుకుండినులు ,బాదామిచాళుక్యులు ఏలువడిలో ఉన్నదని చరిత్ర ద్వారా తెలియుచున్నది.


క్రీస్తు శకం 750 - 973 వరకు వేములవాడ చాళుక్యులు మొదట బోధన్ నుతర్వాత వేములవాడను రాజధానిగా చేసుకుని క్రీస్తు శకం 750 నుండి రాష్ట్ర కూటులకు సమకాలీనులైన వారి సామంతులుగా పరిపాలించారు .కళ్యాణి చాళుక్యుల రాజ్య స్థాపనతో వీరి రాజ్యమంతమొందెను.

వేములవాడ చాళుక్యులు 225 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా రాజ్యమేలిరి. ఆనాడు వేములవాడను లేంబులవాడ అనేవారు. కాలక్రమేనా వేములవాడగా మారినది.

పురాణాలలోవేములవాడ క్షేత్ర మహత్యం
~~~~~~~~~~~~~~~~

నారద మహర్షి కైలాసమునకు చేరి పరమశివుని దర్శించి మానవులను పాపకర్మల నుండి రక్షించమని కోరెను. నారదని విన్నపంతో పరమశివుడు కాశీని వీడి వేములవాడలో స్థిరపడెను. అందువలన ఈ క్షేత్రం రాజరాజేశ్వర క్షేత్రం ప్రసిద్ధి పొందిందని కథనం.

ఇంద్రుడు వృతాసురుని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య పాప నివారణకు అనేక క్షేత్రములు దర్శించిన ఫలము నందలేదు. బృహస్పతి తో ఏ క్షేత్రం దర్శించిన పాప ప్రక్షాళన అవునని అడగగా రాజ రాజేశ్వర క్షేత్రము దర్శించమనెను .అచట ధర్మగుండం లో స్నానమాడి దైవాన్ని కొలిచిన ఇంద్రుడు పవిత్రుడైనాడని ప్రతీతి.

దక్ష ప్రజాపతి గంథమాధన పర్వతమున యాగమునర్చు సమయాన హవిస్సులు భాస్కరుడపహరించగ బాహువులు కోల్పోయెను. విప్రుల సూచనలతో పాపప్రక్షాళనకై వేములవాడలోని ధర్మ గుండ మన స్నానమాచరించి రాజరాజేశు నర్చించి స్వర్ణభాహములు పొందెను అందువలన ఈ ప్రదేశమును  భాస్కర క్షేత్రం అనబడినది.

మహిషాసురుని అంతమొందించుటకు రాజేశ్వరుడు సమస్త దేవతల అంశములను  తన తేజస్సును ఏకం చేసి స్త్రీని రూపొందించెను.ఆమెకు దివ్యాస్త్రములు ప్రసాదించి రాక్షస సంహారమొనర్చుటకాదేశించెను. మహిషాసురున్ని సంహరించిన మాత మహిషాసురమర్థినిగా పూజింపబడినది. ఇక్కడ మహిషాసురమర్తిని ఆలయము కలదు.

సతీ దేవి మరణము విన్న శివుడు రుద్రుడై  దక్షునియాగము ధ్వంసం చేయుటకు వీరభద్రుని పంపెను. వీరభద్రుడు యాగమును ధ్వంసం చేసెను. తప్పును తెలుసుకున్న దక్షుడు శివుని శరణువేడును అతనికి శివుడు అభయం ఇచ్చెను. వీరభద్రుని  విగ్రహము ఇచ్చట ఉన్నది.ఈ ప్రాంతమును దక్షవాటిక అని కూడా స్థలానికి పేరు కలదు.

త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు,ద్వాపర యుగమున పాండవులు రాజరాజేశ్వరుని పూజించరని తెలియుచున్నది .ద్వాపర యుగానంతరమున 'కలి యుగ' ప్రారంభమున దుష్టశక్తుల విజృంభనము జరిగినది .అంతట రాజేశ్వర స్వామి ధర్మగుండంలో నివసించెను.రాజరాజ నరేంద్రుడు పొరపాటున ఒక బ్రాహ్మణ బాలుని మృగం అనుకొని బాణంతో కొట్టగా అతడు మరణించెను .పాప ప్రక్షాళన అనేక తీర్థములను సందర్శించినా మనస్తాపము చల్లారలేదు. వేములవాడలోని ధర్మకొండము నందలి ఉదకం ముమ్మారు సేవించగా, అంత శివుడు ఆరాజునకు కలలో కనపడి ధర్మగుండంలో ఉన్న తనను ఆలయము నిర్మించి  ప్రతిష్టించమనెను. రాజరాజే నరేంద్రుడు శివుని ఆలయము నిర్మించి ప్రతిష్టించెను.

ఈగాథలన్నియు జనస్థితిలోనున్న కథలుగా పేర్కొనబడుచున్నవి.

వేములవాడ చాళుక్యుల కాలం న  వేములవాడ వారి రాజధానిగా విలసిల్లినది. ఇచట రాజేశ్వర, నగరేశ్వర ఆలయంలో రెండవ అరికేసరి వేయించిన శాసనములందున్నవి. కావున ఈ పట్టణము ప్రాచీన కాలంలో అయిన వేములవాడ చాళుక్యుల కాలంలో మహోన్నత స్థితిలో ఉన్నదని తెలియజేయుచున్నది.

చాళుక్య అనంతరం1159  నుండి 1323 వరకు కాకతీయుల పరిపాలనలో ఉన్నది.

కాకతీయుల పతనానంతరం 1336 నుండి 1368 వరకు ముసునూరి నాయకుల ఏలుబడిలో ఉన్నది.

రేచర్ల పద్మనాయకుల ఏలుబడిలో 1368 నుండి 1470 వరకు
బహమనీ సుల్తానుల ఏలుబడిలో 1470 నుండి 1512 వరకు
కుతుబ్షాహీల ఏలుబడిలో 1512 నుండి 1687 వరకు

మొగలుల ఏలుబడిలో 1687 నుండి 1724 వరకు

అసఫ్జాహీల ఏలువడిలో 1724 నుండి 1948 వరకు

1948లో నిజాం పాలన అంతరించిన తర్వాత 1950లో వేములవాడ జాగీర్ పాలన రద్దయింది. 1952లో సాధారణ ఎన్నికలు జరిగి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎన్నికై 1956లో సమైక్యాంధ్రప్రదేశ్ ఏర్పడునంతవరకు పాలించారు .వారి కాలంలో 1952 లోనే కలెక్టర్ చైర్మన్ అయిదుగురు అనధికారలు సభ్యులుగా వేములవాడ దేవస్థానపు ట్రస్టు బోర్డు ఏర్పడినది 1967 వరకు కొనసాగింది .ఆ తర్వాత అనధికారులతోకూడిన ట్రస్ బోర్డు నేటి వరకు అమలులో ఉన్నది. ఇవి దేవాలయ అభివృద్ధికి వివిధ అభివృద్ధి పనులకు తోడ్పడుచున్నది.


రాజరాజేశ్వరాలయం
~~~~~~~~~~

వేములవాడలో ప్రధాన దేవాలయము రాజరాజేశ్వరాలయం ఈ ఆలయ గోడలపై పౌరాణిక గాథలు, నీతి కథలు చిత్రింపబడినవి. ఆలయ ముఖ్య ద్వారములు రెండు వైపులా మాతృదేవతలగణ విగ్రహములు, ద్వారము మధ్య భాగమున గజలక్ష్మి విగ్రహము చెక్కబడి ఉన్నది .స్వామి వారి ఆలయానికి వామ భాగమున లక్ష్మీ గణపతి విగ్రహం అతిమనోహరంగా ఉన్నది.భక్తులు ముందు గణపతిని దర్శించుకుని దర్శించుకొని రాజేశుని దర్శించూదరు.

శ్రీ రాజరాజేశ్వరీ దేవి
~~~~~~~~~~~

రాజరాజేశ్వరాలయము కుడివైపు రాజరాజేశ్వరి దేవి ఆలయం ఉన్నది.ఇందు గణపతి, రాజేశ్వర విగ్రహంలు ఉన్నవి.ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలుచేయదురు. నిత్య కుంకుమార్చనలు నిర్వహిస్తారు. పర్వదినాన సమస్త పూజలు నిర్వహించబడును.


రాజేశ్వరాలయమునకు వెళ్ళుదారిలో ఎడమవైపు కాశీ విశ్వేశ్వర ఆలయం ఉన్నది.ఈ మండపంలో లేత గులాబి రంగులోనున్న శివలింగము చూపరులను ఆకర్షించును. ఈ మండపంలో ఆంజనేయుడు, గంగాదేవి విగ్రహములు ఉన్నవి. ఈ మండపంలోని శివలింగమును కాశీ విశ్వేశ్వర లింగముగా కనబడుచున్నది ఈ శివలింగం వల్లనే వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినది.


నాగ శిల్పములు
~~~~~~~~~~

 రాజరాజేశ్వరి స్వామి ఆలయ ప్రాకారానికి ఉత్తరాన ధర్మ కుండం ప్రక్కన అనేక నాగ ప్రతిమలు ప్రతిష్టించబడి ఉన్నవి నాగుల చవితి, నాగుల పంచమిలలో భక్తులు ఈ నాగదేవతలను అర్చించుదురు.

మహిషాసుర మర్దిని
~~~~~~~~~~~

వేములవాడ లోనున్న ధర్మశాలకు చేరువలో మహిషాసుర మర్దిని విగ్రహం ఉన్నది .ఇచట శివలింగము, గణపతి ప్రతిష్టించబడినది స్వామివారి సేవకు తేబడు కోడలు ఈ సత్రశాల పరిసరాలలో నిలుపుదురు.

అనంత పద్మనాభ స్వామి ఆలయం
~~~~~~~~~~~~~~~
ఈ ఆలయ ద్వారమున నటరాజ స్వామి విగ్రహం ఉన్నది. వేణుగోపాల స్వామి విగ్రహం ఉన్నది .ఇవి రాజరాజేశ్వరాయ పశ్చిమాన ఉన్నవి.శివ కేశవుల ఉత్సవములు వేములవాడలో నిర్వహించబడుట వలన ఇది హరి హర క్షేత్రం గా ప్రసిద్ధిగాంచినది.

కోదండ రామాలయం
~~~~~~~~~~~~

పద్మనాభ స్వామి ఆలయం సమీపముననే కోదండరాముల ఆలయం ఉన్నది.ఈ ఆలయంలో శ్రీరామ ,లక్ష్మణ భరత ,శత్రుఘ్నలవిగ్రహములు సీతాదేవి విగ్రహములు ఉన్నవి. ఈ ఆలయమునకు అభిముఖంగా ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది.

ఉమామహేశ్వరాలయం
~~~~~~~~~~~~~~

వేములవాడ లోనున్న సోమేశ్వర లింగం వేలుపలి భాగమున ఉమా ,నంది హనుమాన్, నాగదేవతల విగ్రహములున్నవి. ఈ ఆలయము ఉమామహేశ్వరాలయముగా పిలవబడుచున్నది.

బాలా త్రిపుర సుందరి దేవి
~~~~~<~~~~~~~~~

రాజరాజేశ్వరాలయమునకు పడమరన నాగిరెడ్డి మంటపంలో బాలా త్రిపుర సుందరి ఆలయం ఉన్నది.ఇచ్చట భక్తులు కుంకుమార్చనతో పూజింతురు.

బాల రాజేశ్వరాలయం
~~~~~~~~~~~~

ధర్మ కుండం నుండి రాజేశ్వర లింగమును వెలికి తీసి యుంచి ఆలయమున ప్రతిష్టించవలసిన రాజరాజే నరేంద్ర కన్నా ముందుగా నవనాథుడు ప్రతిష్టించెను. నరేంద్రుడు బాధపడగా రాజ రాజేశ్వరుడు అతని స్వప్నములో కనిపించి బాల రాజేశ్వరని ప్రతిష్టింపుమనెను. ముందుగా నీవు ప్రతిష్టించిన లింగమునకు పూజలు జరుగునని తెలిపెను.రాజు సంతోషించెను. ఇప్పుడు కూడా ముందు బాలరాజేశ్వరుడే పూజలందుకుంటాడు.

విఠలేశ్వరాలయం
~~~~~~~~~~

విఠలేశ్వరాలయంలో విఠలేశ్వరుడు ,రుక్మిణి భాయి విగ్రహములు బహు సుందరంగా ఉండును. ఒక గదిలో వీరభద్రుని విగ్రహం కూడా ఉన్నది.

ద్వాదశ లింగములు కోటి లింగములుగా పిలవబడుచున్నవి. ఆలయమునకు పశ్చిమమున నైరుతి వాయువ్య దిశలయందు మూడు శివ పంచాయతనములు ఉన్నవి. మూలలందున్న మంటపాలలో ఇవి ప్రతిష్టింపబడినవి. ఇచట శివలింగము, అమ్మవారు ఆంజనేయస్వామి నంది విగ్రహములు ఉన్నవి .దక్షిణ దిశలో ఉన్న మంటపములో 8 పంచాయతనములన్నవి. భక్తులందరూ రాజరాజేశ్వరుని కొలిచిన తర్వాత ప్రాకారంలో నున్న ఈ ఆలయాలను భక్తితో దర్శించెదరు.

వేములవాడ క్షేత్రంలో శివకేశవుల ఉత్సవములు నిర్వహించట వలన ఇది హరిహర క్షేత్రం గా ప్రసిద్ధిగాంచినది.శైవంతో పాటు జైనానికి కేంద్రమైనది .ఆనాడు వినోదానికై కోడిపందెంలో ఎడ్లబండి పోటీలు నిర్వహించబడే చదరంగము పొంజితము అష్టా చెమ్మ సంగీతము మొదలైన ఆటలు పాటలు ఉండేవి.

భక్తులు తమకు పండిన పంటలో ప్రథమ భాగము దైవానికి ఈ నాటికి సమర్పిస్తున్నారు .ధాన్యముపండ్లు ఫలాలే కాక ఆవులు కోడెలు మేకలు మొదలగు జంతువులను దైవానికి వదిలిపెడతారు.
 కొందరు భక్తులు ప్రథమ సంతానమైన పుత్రికలను స్వామినిలుగా చ శివసత్తులుగా దైవానికి సమర్పించేవారు ఇప్పటికీ ఇక్కడ శివసత్తులు ఉన్నారు.

నేటికీ ఇక్కడ శివసత్తులు దేవుని పేరుతో ఎక్కువగా ఉంటారు. వేములవాడ క్షేత్రమందు మహాశివరాత్రి ఉత్సవములు ఘనంగా జరుగుతాయి .పర్వదినాలన్ని శోభాయ మానంగా జరుపబడతాయి.నిత్యము భక్తుల ఆధ్యాత్మిక చింతనతో అలరారుతోంది వేములవాడ. ప్రతి సంవత్సరం త్యాగరాజ ఉత్సవాలు నిర్వహించబడతాయి. సంగీత విద్వాంసులు, వైణికులు వయోలిన్ మొదలకు సంగీత వాద్యముల వారిని ఇక్కడ సన్మానిస్తున్నారు. ప్రతిరోజు జాతరను తలపించే భక్తులతో నిత్య నీరాజనులతో భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా వెలిసిల్లుతోంది వేములవాడ క్షేత్రం.

జిల్లాగా మారిన వేములవాడలో  సౌకర్యాలు ఇంకా ఇంకా మెరుగుపడాలని, ఉద్యోగులు ఉద్యోగాన్ని ఉద్యోగంగా భావించక మనస్ఫూర్తిగా పనిచేస్తూ ప్రజలకు తోడ్పడాలని ,ప్రజలు పరిశుభ్రతను పాటిస్తూ ఇతరులను ఇబ్బంది కలిగించకుండా దైవానుగ్రహానికి పాత్రులు కావాలని ,ఆ దేవదేవుని ఆశీర్వాదం అందరిపై ప్రసరించాలని వేడుకుందాం.


సర్వేజనా సుఖినోభవంతు


డా. బండారి సుజాత
హనుమకొండ
చరవాణి: 9959771228

హామీ పత్రం: పై వ్యాసం నా స్వీయరచనని హామీ ఇస్తున్నాను